Varahamahapuranam-1    Chapters   

సప్తాశీతితమోధ్యాయః - ఎనుబది ఏడవ అధ్యాయము

రుద్ర ఉవాచ - రుద్రు డిట్లు చెప్పెను.

అథ క్రౌంచం భవతి చతుర్థం కుశద్వీపాద్‌ ద్విగుణ

మానతః. సముద్రః క్రౌంచేన ద్విగుణ నావృతః, తస్మింశ్చ

సపై#్తవ ప్రధానపర్వతాః, ప్రథమః క్రౌంచో విద్యుల్లతో

రైవతో మానసః సైవ పావకః. తథైవాంధకారః సైవా

చ్ఛోదకః. దేవావృత్తః స చ సురాపో భణ్యతే. తతో

దేవిష్ఠః స ఏవ కాఞ్చనశృంగో భవతి. దేవానందాత్పరో

గోవిందః ద్వివింద ఇతి. తతః పుణ్డరీకః సైవ తోషా

శయః. ఏతే సప్త రత్నమయాః పర్వతాః క్రౌంచద్వీపే

వ్యవస్థితాః. సర్వే చ పరస్పరేణోచ్ఛ్రయాః. 1

ఇక క్రౌంచద్వీపము నాల్గవది. కుశద్వీపము కంటె కొలతలో రెట్టింపుగా నుండును. అందును ఏడే ప్రధానములగు పర్వతములు. మొదటి క్రౌంచ పర్వతము విద్యుల్లతము. అదియే రైవతము. తరువాత మానసము. అదియే పావకము. అటుపై అంధకారము. దానినే ఉచ్ఛోదకమనియు అందురు. తరువాత దేవావృత్తము. దానికి సురాపమనియు పేరు. పిదప దేవిష్ఠము. అదియే కాంచన శృంగము. దేవానందమునకు ప్రక్క గోవిందము దానిని ద్వివిందమనియు నందురు. అటుపై పుండరీకము, అదియే తోషాశయము. ఈ యేడును రత్నమయములగు పర్వతములు క్రౌంచద్వీపమున నెలకొనియున్నవి. ఒకదానికంటె ఒకటి ఎత్తైనది.

తత్ర వర్షాణి తథా క్రౌంచస్య కుశలో దేశః సైవ

మాధవః స్మృతః వామనస్య మనో7నుగః సై వసంవర్తక

స్తతోష్ణవాన్‌ సోమప్రకాశః. తతః పావకః సైవ సుదర్శనః

తథా చాన్ధకారః సైవ సంమోహః తతో మునిదేశః సచ

ప్రకాశః. తతో దున్దుభిః. సైవానర్థ ఉచ్యతే. 2

అందు దేశములు. క్రౌంచమునకు దేశము కుశలము. దానినే మాధవ మందురు. వామనమునకు మనోనుగము. దానిని సంవర్తకమనియు అందురు. తరువాతిది ఉష్ణవంతము. అదియే సోమప్రకాశము. తరువాతనున్నది పావకము. అదియే సుదర్శనము. అటుపై అంధకారము. దానినే సంమోహమనియు అందురు. ఆ తరువాత మునిదేశము. అదియే ప్రకాశము. తరువాత దుందుభి. దానిని అనర్థమనియు అందురు.

తత్రాపి సపై#్తవ నద్యః

గౌరీ కుముద్వతీ చైవ సంధ్యా రాత్రి ర్మనోజవా,

ఖ్యాతిశ్చ పుణ్డరీకా చ గంగా సప్తవిధా స్మృతా. 3

అందును ఏడు నదులున్నవి. గౌరి, కుముద్వతి, సంధ్య, రాత్రి, మనోజవ, ఖ్యాతి, పుండరీక - అని ఆ ఏడు విధములైన గంగకు పేర్లు.

గౌరీ సైవ పుష్పవహా, కుముద్వతీ తామ్రవతీ రోధా

సంధ్యా సుఖావహాచ మనోజవా చ క్షిప్రోదా చ ఖ్యాతిః సైవ

గోబహులా పుండరీకా చిత్రవేగా శేషాః క్షుద్రనద్యః.

క్రౌంచద్వీపో ఘృతోదేనావృతః. ఘృతోదా శాల్మలేనేతి. 4

గౌరియేపుష్పవహ. కుముద్వతియే తామ్రవతి. సంధ్యయే రోధ. సుఖావహయే మనోజవ. ఖ్యాతియే క్షిప్రోద. పుండరీకయే గో బహుళ. రాత్రియే చిత్రవేగ. తక్కినవి చిన్న నదులు. క్రౌంచ ద్వీపమును నేతిసముద్రము చుట్టుకొని యున్నది. దానిని చుట్టుకొని శాల్మలద్వీపము కలదు.

ఇతి శ్రీవరాహపురాణ భగవచ్ఛాస్త్రే సప్తాశీతితమో7ధ్యాయః

ఇది శ్రీ వరాహపురాణమను భగవచ్ఛాస్త్రమున ఎనుబదిఏడవ అధ్యాయము.

Varahamahapuranam-1    Chapters