Varahamahapuranam-1    Chapters   

ద్వ్యశీతితమోధ్యాయః - ఎనుబది రెండవ అధ్యాయము

రుద్ర ఉవాచ - రుద్రుడిట్లనెను.

అథ నదీనా మవతారం శృణుత. ఆకాశసముద్రోయః

కీర్త్యతే సామాఖ్య స్తస్మాదాకాశగామినీ నదీ ప్రవృత్తా. సా

చానవరత మిన్ద్రగజేన క్షోభ్యతే. సా చ చతురశీతి

సహస్రోచ్ఛ్రాయా. సా మేరోః సుదర్శనం కరోతి. సా చ

మేరుకూట తటాన్తేభ్యః ప్రస్ఖలితా చతుర్థా సంజాతా.

పుష్టిం చ యోజన సహస్రం నిరాలంబా పతమానా

ప్రదక్షిణ మనుసరన్తీ చతుర్ధా జగామ. సీతా చాలకనందా

చక్షుర్భద్రా చేతి నామభిః. వ.1

ఇటు పై నదుల అవతారమును గూర్చి వినుడు. ఆకాశ సముద్రమని ప్రసిద్ధికెక్కిన సామమను పేరుగల దానినుండి ఆకాశమున ప్రవహించు నదియొకటి బయలుదేరెను. ఇంద్రుని యెనుగు దానిని కుదిలించి వేయుచుండును. అది ఎనుబదినాలుగు యోజనముల వెడల్పు కలది. అది మేరువును చక్కని దర్శనీయ స్థలము కావించునది. అదియు మేరుశిఖరపు ఒడ్డులనుండి జారినదై నాలుగుపాయలుగా అయినది. అరువది యోజనముల మేర ఆధారములేక పడుచు ప్రదక్షిణముగా తిరుగుచు నాలుగు పాయలై ప్రవహించినది. సీత, అలకనంద, చక్షువు, భద్ర అని ఆపాయల పేర్లు.

యథోద్దేశం సా చానేకశత సహస్ర పర్వతానాం

దారయన్తీ గాంగతీతి గంగేత్యుచ్యతే. వ.2

ఆయాస్థలములలో ప్రవహించుచు కొన్ని వందల పర్వతములను చీల్చుకొని భూమికి చేరుట చేత దానికి గంగ అనుపేరు కలిగినది. (గాంభూమిని, గతా - పొందినది - గంగా)

అథ గంధమాదన పార్శ్వే7మరగండికా వర్ణ్యతే.

ఏకత్రింశ ద్యోజనసహస్రాణి ఆయామః చతుః శత

విస్తీర్ణమ్‌. తత్ర కేతుమాలాః సర్వేజనపదాః. కృష్ణవర్ణాః

పురుషా మహాబలినః. ఉత్పలవర్ణాః స్త్రియః శుభదర్శనాః.

తత్ర చ మహావృక్షాః పనసాః సన్తి. తత్రేశ్వర బ్రహ్మపుత్ర

స్తిష్ఠతి. తత్రోదపానాచ్చ జరారోగ వివర్జితా

వర్షాయుతాయుషశ్చ నరాః. వ.3

ఇక గంధమాదనము ప్రక్కగానున్న అమరగండికను గూర్చి తెలిపెదను. అది ముప్పది యొక్కవేల యోజనముల పొడవు, నాలుగు వందల యోజనముల వెడల్పు కలిగియుండెను. అచటిజనపదములు కేతుమాల అనుపేరు కలవి. నలుపు వన్నెయు మహాబలము కల పురుషు లును, కలువలవంటివన్నెగల చూడముచ్చటగా నున్న స్త్రీలును అందుందురు. అచట పనసచెట్లు పెద్దగా పెరిగి యుండును. అందలినీరు త్రావుటవలన ముసలితనము, రోగము లేనివారై వేయి యేండ్ల ఆయువు కలవారై జనులుందురు.

మాల్యవతః పూర్వపార్శ్వే పూర్వగణ్డిగా ఏకశృంగా

ద్యోజన సహస్రాణి మానతస్తత్ర చ భద్రాశ్వానామ

జనపదాః భద్రసాలవనం చ తత్ర వ్యవస్థితమ్‌.

కాలామ్రవృక్షాః పురుషాః శ్వేతాః పద్మవర్ణినః స్త్రియః

కుముదవర్ణా దశ సహస్రాణి తేషామాయుః. తత్ర చ

పఞ్చ కులపర్వతాః. తద్యథాశైలవర్గః మాలాఖ్యః కోరజశ్చ

త్రిపర్ణః నీలశ్చేతి. తద్వినిరవ్గతాః, తదంభః స్థితానాం

దేశానాం తాన్యేవనామాని. తే చ దేశా ఏతా నదీః పిబన్తి.

మాల్యవంతముతూర్పుతటమున పూర్వగండిక అను నదికలదు. ఒకకొండకొమ్మునుండి ప్రవహించునది. వేల యోజనములకొలత కలది. అందు భద్రాశ్వములను జనపదములు, భద్రసాల మను వనము ఉన్నవి. నల్లని మామిడిచెట్లు, తెల్లని పద్మమువంటి వన్నె గల పురుషులు, ఎర్రతామరల వన్నెకల స్త్రీలు ఉందురు. వారి ఆయువు పదివేలవత్సరములు. అందు అయిదు కులపర్వతములు-శైలవర్ణము, మూలము, కోరజము, త్రిపర్ణము, నీలము - అనుపేర్లుకలవి కలవు. వానినుండి నదులు వెలువడినవి. వాని నీరు గల దేశములకు అవియేపేర్లు. ఆదేశవాసులు ఆ నదులనీరు త్రావుచుందురు.

తద్యథా సీతా సువాహినీ హంసవతీ కాసా మహాచక్రా

చంద్రవతీ కావేరీ సురసా శాఖావతీ ఇంద్రవతీ అంగారవాహినీ

హరితోయా సోమావర్తా శతహ్రదా వనమాలా వసుమతీ హంసా

సుపర్ణా పంచగంగా ధనుష్మతీ మణివప్రా సుబ్రహ్మభాగా

విలాసినీ కృష్ణతోయా పుణ్యోదా నాగవతీ శివా శేవాలినీ

మణితటా, క్షీరోదా, వరుణావతీ, విష్ణుపదీ, మహానదీ, హిరణ్య

స్కంధవాహా, సురావతీ, కామోదా, పతాకాశ్చేత్యేతా

మహానద్యః. ఏతాశ్చ గంగాసమాః కీర్తితాః ఆ జన్మాంతం

పాపం వినాశయన్తి, క్షుద్రనద్యశ్చ కోటిశః. తాశ్చనదీ ర్యేపిబన్తి

తే దశవర్ష సహస్రాయుషః. రుద్రోమాభక్తా ఇతి. వ.5

ఆ నదులు - సీత, సువాహిని, హంసవతి, కాస, మమాచక్ర, చంద్రవతి, కావేరి, సురస, శాఖావతి, ఇంద్రవతి, అంగార వాహిని, హరితోయ, సోమావర్త, శతహ్రద, వనమాల, వసుమతి, హంస, సుపర్ణ, పంచగంగ, ధనుష్మతి, మణివప్ర, సుబ్రహ్మభాగ, విలాసిని, కృష్ణతోయ, పుణ్యోద, నాగవతి, శివ, శేవాలిని, మణితట, క్షీరోద, వరుణావతి, విష్ణుపది, మహానది, హిరణ్యస్కంధవాహ, సురావతి, కామోద, పతాక - అనునవి. ఇవియన్నియు గంగకెన యైనవి. బ్రదుకున్నంతవరకు పాపములను పోకార్చునవి. చిన్న వగులు మరియు కోట్లకొలది కలవు. ఈ నదుల నీరు త్రావు వారు పదివేల సంవత్సరముల ఆయువు కలవారు. రుద్రునియందు, ఉమాదేవి యందు భక్తికలవారు.

ఇతి శ్రీవరాహపురాణ భగవచ్ఛాస్త్రే ద్వ్యశీతితమో7ధ్యాయః

ఇది శ్రీవరాహ పురాణమను భగవచ్ఛాస్త్రమున ఎనుబది రెండవ అధ్యాయము

Varahamahapuranam-1    Chapters