Varahamahapuranam-1    Chapters   

చతుఃపఞ్చాశోధ్యాయః - ఏబది నాలుగవ అధ్యాయము

భద్రాశ్వ ఉవాచ- భద్రాశ్యుడిట్లు పలికెను.

విజ్ఞానోత్పత్తికామస్య క ఆరాధ్యో భ##వేద్ద్విజ,

కధం చారాధ్యతే సౌ హి ఏతదాఖ్యాహి మే ద్విజ. 1

బ్రాహ్మణోత్తమా! విజ్ఞానము ఉత్పత్తిని కోరువానికి ఆరాధ్యుడెవరు? (ఎవనినారాధింపవలయును) ఆతని నారాధించు విధమెట్టిది? దీనిని నాకు ఉపదేశింపుము.

అగస్త్య ఉవాచ- అగస్త్యుడిట్లు చెప్పెను.

విష్ణురేవ సదారాధ్యః సర్వదేవై రపిప్రభుః,

తస్యోపాయం ప్రవక్ష్యామి యేనాసౌ వరదోభ##వేత్‌. 2

సర్వదేవతలకును, సర్వకాలములయందు ఆరాధింపదగినవాడు ప్రభువగు విష్ణువే. అతడు వరదుడగుటకు ఉపాయమును చెప్పెదను.

రహస్యం సర్వదేవానాం మునీనాం మనుజాంస్తథా,

నారాయణః పరో దేవ స్తం ప్రణమ్య స సీదతి. 3

సర్వదేవతలకు, మునులకు, నరులకు పరదైవము నారాయణుడే. ఇది రహస్యము. అతనికి ప్రణమిల్లినవాడు ఎన్నటికిని చెడడు.

శ్రూయతే చ పురా రాజన్‌ నారదేన మహాత్మనా,

కథితం తుష్టిదం విష్ణో ర్వ్రత మప్సరసాం తథా. 4

ఇది వినవచ్చుచున్నది. పూర్వము మహాత్ముడగు నారదుడు తుష్టినిచ్చెడు విష్ణువ్రతమును అప్సరసలకు చెప్పెనట.

నారదస్తు పురాకత్పే గతవాన్‌ మానసం సరః,

స్నానార్థం తత్ర చాపశ్యత్‌ సర్వ మప్సరసాం గణమ్‌. 5

పూర్వకల్పమున ఒకప్పుడు నారదుడు స్నానము కొరకు మానస సరస్సున కరిగెను. అందు అప్సరసల గణమును చూచెను.

తాస్తం దృష్ట్వా విలాసిన్యో జటాముకుట ధారిణమ్‌,

అస్థిచర్మావశేషం తు ఛత్రదండ కపాలినమ్‌. 6

దేవాసురమనుష్యాణాం దిదృక్షుం కలహప్రియమ్‌,

బ్రహ్మయుక్తం తపోయుక్తం పప్రచ్ఛు స్తావరాంగనాః. 7

ఆవరాంగనలు విలాసినులు అప్సరసలు జడలేకిరీటముగా గలవాడు, ఎముకలు తోలు మాత్రమే మిగిలినవాడు, గొడుగు, దండము, పుఱ్ఱ అనువానిని తాల్చిన వాడు, దేవతలను రక్కసులను, నరులను చూడగోరువాడు, కలహప్రియుడు, వేదనాదము కలవాడు, తపస్సుతో కూడినవాడునగు నాతనిని చూచి ఇట్లు అడిగిరి.

అస్సరస ఊచుః- అప్సరస లిట్లనిరి.

భగవన్‌ బ్రహ్మతనయ భర్తృకామా వయం ద్విజ,

నారాయణశ్చ భర్తా నో యథాస్యాత్‌ తత్ప్రచక్ష్వ నః. 8

పూజ్యుడా! బ్రహ్మకుమారా! మేము భర్తను కోరుచున్నవారము. మాకు నారాయణుడు భర్త యెట్లగునో దానిని ఉపదేశింపుము.

నారద ఉవాచ:- నారదు డిట్లనెను.

ప్రణామ పూర్వకః ప్రశ్వః సర్వత్ర విహితః శుభః,

సచమే న కృతో గర్వాద్‌ యుష్మాభిర్యౌవనస్మయాత్‌. 9

ప్రశ్నము ఎప్పుడును ప్రణామ పూర్వకముగా నుండవలయును. అదియే శుభము నొసగును. మీరు వయసు పొగరున నన్ను ఆవిధముగా అడుగరైతిరి.

తథా7పి దేవదేవస్య విష్ణో ర్యన్నమ కీర్తితమ్‌,

భవతీభి స్తథా భర్తా భవత్వితి హరిః కృతః,

తన్నామోచ్చారణా దేవ కృతం సర్వం న సంశయః, 10

అయినను మీపు దేవదేవుడగు విష్ణువు నామమును కొనియాడితిరి. మాకు హరి మగడెట్లగు నంటిరి. అతని నామమును పలుకుట చేతనే సర్వము సిద్దించినది. సంశయము లేదు.

ఇదానీం కథయా మ్యాశు వ్రతం యేన హరిః స్వయమ్‌,

వరదత్వ మావాప్నోతి భర్తృత్వం చ నియచ్ఛతి. 11

హరి స్వయముగా వరదుడగు వ్రతమును, భర్తయగుటను ప్రసాదించుదానిని చెప్పెదను వినుడు.

నారద ఉవాచ -నారదు డిట్లు చెప్పెను.

వసన్తే శుక్లపక్షస్య ద్వాదశీ యా భ##వేచ్చుభా,

తస్యా ముపోష్య విధివ న్నిశాయాం హరి మర్చయేత్‌. 12

వసంతర్తువున చైత్రమాసమున శుక్లపక్షమున వచ్చు ద్వాదశి నాడు ఉపవాసముండి విధిపూర్వకముగా రాత్రి యందు హరి నర్చింపవలయును.

పర్యజ్కా స్తరణం కృత్వా నానాచిత్ర సమున్వితమ్‌,

తత్ర లక్ష్మ్యా యుతం రౌప్యం హరిం కృత్వా నివేశ##యేత్‌.13

తెల్లని వప్త్రము కప్పిన పాన్పును, పెక్కు చిత్రములు కలదానిని ఏర్పరచి అందు లక్ష్మితో కూడిన హరిని వెండితో చేసి నిలుప వలయును.

తస్యోపరి తతఃపుషై#్పః మండపం కారయేద్‌ బుధః,

నృత్యవాదిత్రగేయైశ్చ జాగరం తత్ర కారయేత్‌. 14

అ పాన్సు మీదుగా పూవులతో చక్కని మండపమును ఏర్పరుపవలయును. నృత్యములు, వాద్యములు, పాటలు మున్నగు వానితో అందు జాగరము చేయవలయును.

మనోభవాయేతి శిర అనంగాయేతి వై కటిమ్‌,

కామాయ బాహమూలే తు సుశాస్త్రాయేతి చోదరమ్‌. 15

మన్మథాయేతి పాదౌతు హరయేతి చ సర్వతః,

పుషై#్పః సంపూజ్య దేవేశం మల్లికాజాతిభి స్తథా. 16

'ఓం నమో మనోభవాయ' అని శిరస్సున, 'నమః అనంగాయ' అని నడుమును, 'నమఃకామాయ' అని భుజములను, 'నమః సుశాస్త్రాయ' అని ఉదరమును, 'నమోమన్మథాయ' అని పాదములను, 'నమో హరయే' అని సర్వాంగములను, మల్లెలు, జాజులు మొదలగు పూవులతో చక్కగా పూజింపవలయును.

పశ్చా చ్చతుర ఆదాయ ఇక్షుదణ్డాన్‌ సుశోభవాన్‌,

చతు ర్దిక్షు న్యసేత్‌ తస్య దేవస్య ప్రణతో నృప. 17

పిదప చక్కని నాలుగు చెరకు గడలను దేవునకు నాలగు దిక్కులందను నిలపవలయును.

ఏవం కృత్వా ప్రభాతేతు ప్రదద్యాద్‌ బ్రాహ్మణాయ వై,

వేదవేదాంగయుక్తాయ సంపూర్ణాంగాయ ధీమతే. 18

ఇట్లొనర్చిమరునాడు తెల్లవారిన తరువాత, వేదములందును, వేదాంగములందను పండితుడును, బుద్ధిమంతుడును, ఏ అంగవైకల్యములేనివాడును అగు బ్రాహ్మణునకు దాన మీయవలయును.

బ్రాహ్మణాంశ్చ తథా పూజ్య వ్రత మేతత్‌ సమాపయేత్‌,

ఏవం కృతే తథా విష్ణు ర్భర్తా వో భవితా ధ్రువమ్‌. 19

అట్లే బ్రాహ్మణులను పూజించి ఈ వ్రతమును సమాపనము చేయవలయును. ఇట్లు చేసినచో మీకు తప్పక విష్ణువు భర్తయగను.

అకృత్వా మత్ప్రణాయం తు పృష్టో గర్వేణ శోభనాః,

అవమానస్య తస్యాయం విపాకో వో భవిష్యతి. 20

సుందరులారా! మీరు నాకు మ్రొక్కు నిడక గర్వముతో అడిగితిరి. ఈ అవమానమునకు ఫలము మీకు తప్పక కలుగును.

ఏతస్మి న్నేవ సరసి అష్టావక్రో మహామునిః,

తస్యోపహాసం కృత్వా తు శాపం లప్స్యథ శోభనాః. 21

సుందరులారా! ఈ సరస్సునందే అష్టావక్రుడను మహాముని కలడు. అతనిని వెక్కిరించి మీరాతని శాపము పొందెదరు.

వ్రతేనానేన దేవేశం పతిం లబ్ధ్వా భిమానతః

అవమానే7 పహరణం గోపాలై ర్వో భవిష్యతి,

పురా హర్తా చ కన్యానాం దేవో భర్తా భవిష్యతి. 22

ఈ వ్రతముచేత దేవదేవుని పతిగా పొందుదురు. కాని ఈ అవమానము వలన గోపాలురచేత మీ అపహరణము కలుగును. పూర్వము కన్యలను హరించిన ఆదేవుడు మీకు భర్త కాగలడు.

అగస్త్య ఉవాచ-అగస్త్యు డిట్లు చెప్పెను

ఏవ ముక్త్వా స దేవర్షిః ప్రయ¸° నారదః క్షణాత్‌,

తా అప్యేతద్‌ వ్రతం చక్రు స్తుష్టశ్చాసాం స్వయంహరిః 23

ఇట్లు పలికి ఆదేవర్షి నారదుడు క్షణములో అటనుండి వెడలిపోయెను. వారును ఆవ్రతము నాచరించిరి. హరి స్వయముగా వారి యెడల తుష్టుడాయెను.

ఇతి శ్రీవరాహపురాణ భగవచ్ఛాస్త్రే చతుః పఞ్చాశోధ్యాయః

ఇది శ్రీవరాహపురాణమను భగవచ్ఛాస్త్రమున ఏబదినాలుగవ అధ్యాయము.

Varahamahapuranam-1    Chapters