Varahamahapuranam-1    Chapters   

ద్శిచత్వారింశో7ధ్యాయః - నలుబది రెండవ అధ్యాయము

దుర్వాసా ఉవాచ - దుర్వాసుడిట్లు పలికెను.

తద్వత్‌ ఫాల్గునమాసే తు శుక్లపక్షే తు ద్వాదశీమ్‌,

ఉపోష్య ప్రోక్తవిధినా హరిమారాధయేత్‌ సుధీః.1

అట్లే బుద్ధిమంతుడు పాల్గునమాసము శుక్లపక్షము ద్వాదశినాడు చెప్పిన పద్ధతి ప్రకారము ఉపవాసముండి హరినారాధింప వలయును.

నరసింహాయ పాదౌ తు గోవిందా యేత త్యురూ తథా,

కటిం విశ్వభుజే పూజ్య అనిరుద్ధే త్యుర స్తథా. 2

కంఠంతు శితికంఠాయ పింగకేశాయ వైశిరః

అసురధ్వంసనా యేతి చక్రం తోయాత్మనే తథా,

శంఖ మిత్యేవ సంపూజ్య గంధపుష్పఫలై స్తథా. 3

''ఓం నరసింహాయ నమః'' అని పాదములను, ''గోవిందాయ నమః'' అని తొడలను, ''విశ్వభుజే నమః'' అని రొమ్మును, ''శితికంఠాయ నమః'' అని కంఠమును'', పింగకేశాయనమః అని శిరస్సును, ''అసుర ధ్వంసనాయ నమః'' అని చక్రమును, ''తోయాత్మనే నమః'' అని శంఖమును పూజించి గంధమును పుష్పములను ఫలములను సమర్పింప వలయును.

తదగ్రే ఘట మాదాయ సితవస్త్రయుగాన్వితమ్‌

తస్యోపరి నృసింహం తు సౌవర్ణం తామ్ర భాజనే,

సౌవర్ణం శక్తితః కృత్వా దారువంశమయే7 పి వా. 4

రత్న గర్భఘటే స్థాప్య తం సంపూజ్య చ మానవః,

ద్వాదశ్యాం వేదవిదుషే బ్రాహ్మణాయ నివేదయేత్‌. 5

స్వామియందు తెల్లని వస్త్రములు రెండు చుట్టిన ఘటము నుంచి దానిపై రాగి పాత్రలో బంగారు నృసింహ ప్రతిమను శక్తిని బట్టి ఉంచవలయును. లేనిచో కొయ్యబొమ్మనైనను ఉంచవచ్చును. రత్నములు లోపల గల ఘటమునందు స్వామి ప్రతిమనుంచి చక్కగా పూజింప వలయును, ద్వాదశినాడు వేదపండితుడగు బ్రాహ్మణునకు సమర్పింపవలయును.

ఏవం కృతే ఫలం ప్రాప్తం యత్‌ పురా పార్థివేన తు,

తస్యాహం సంప్రవక్ష్యామి వత్సనామ్నా మహామునే. 6

మునుపు వత్సుడను రాజు ఈ వ్రతము చేసి పొందిన ఫలమును గూర్చి చక్కగా తెలిపెదను.

ఆసీత్‌ కింపురుషే వర్షే రాజా పరమధార్మికః,

భారతేతి చ విఖ్యాత స్తస్య వత్స స్సుతో7 భవత్‌. 7

పూర్వము కింపురుష వర్షమున మిక్కిలి ధార్మికుడగు భారతుడను రాజుండెడి వాడు. అతనికి వత్సుడను కుమారుడు కలడు.

స శత్రుభి ర్జితః సంఖ్యే హృతకోశో ద్విపాదవాన్‌,

వనం ప్రాయాత్‌ సపత్నీకో వసిష్ఠ స్యాశ్రమే7వసత్‌. 8

అతడు యుద్ధమున శత్రువులకు ఓడి ధనమంతయు కోల్పోయి పాదచారియై పత్నీ సహితముగా వనమున కరిగెను. వసిష్టుని ఆశ్రమమున నివసించెను.

కాలేన గచ్ఛతా సో7థ వసిష్టేన మహర్షిణా,

కిం కార్యమితి సప్రోక్తో వస స్యస్మిన్‌ మహాశ్రమే. 9

కాలము గడుచుచుండగా వసిష్ఠమహర్షి - ఈ మహాశ్రమమున వసించుచున్నావు. పనియేమి? అని అడిగెను.

రాజోవాచ - రాజిట్లు పలికెను.

భగవన్‌ హృతకోశో7హం హృతరాజ్యో విశేషతః,

శత్రుభి ర్హతసంకల్పో భవన్తం శరణం గతః,

ఉపదేశప్రదానేన ప్రసాదం కర్తు మర్హసి. 10

పూజ్యుడా! నా కోశము పోయినది. నా రాజ్యము శత్రువల పాలైనది. పగవారు నా సంకల్పమును దెబ్బకొట్టిరి. నిన్ను శరణుచొచ్చితిని. నాకు ఉపదేశము ననుగ్రహింపుము.

ఏవముక్తో వసిష్ఠస్తు తస్యేమాం ద్వాదశీం మునే,

విధినా ప్రత్యువాచాథ సో7పి సర్వం తథా7కరోత్‌. 11

అతడిట్లు పలుకగా వసిష్ఠుడతనికి ఈ ద్వాదశీ వ్రతమును పదేశించెను. అతడును దానిని సర్వమును విధిపూర్వకముగా ఆచరించెను.

తస్య వ్రతాంతే భగవాన్‌ నారసింహ స్తుతోష హ,

చక్రం పాదాచ్చ శత్రూణాం విధ్వంసనకరం పరమ్‌. 12

ఆ వ్రతము ముగిసిన పిదప నరసింహ భగవానుడు సంతోషపడెను. శత్రువులను రూపుమాపెడి చక్రము నాతని కొసగెను.

తేనాస్త్రేణ స్వకం రాజ్యం జితవాన్‌ స నృపోత్తమః,

రాజ్యే స్థిత్వా7 శ్వమేధానాం సహస్ర మకరోద్‌ విభుః,

అన్తే చ విష్ణులోకాఖ్యం పదమాపచ స సత్తమ. 13

ఆ రాజవరుడు ఆ అస్త్రముతో తనదైన రాజ్యమును గెలుచుకొనెను. రాజ్యమున నిలువద్రొక్కుకొని వేయి అశ్వమేధ యాగములను గావించెను. తుదికి ఆ శ్రేష్ఠుడు విష్ణులోకమను ఉత్తమ పదము గాంచెను.

ఏషా ధన్యా పాపహరా ద్వాదశీ భవతో మునే,

కథితా యా ప్రయత్నేవ శ్రుత్వా కురు యథేప్సితమ్‌. 14

మునీ! ఇది చాల ధన్య. పాపములను హరించునది. ఇట్టి ద్వాదశిని గురించి నీకు ప్రయత్నపడి చెప్పితిని. నీ కోరికను బట్టి ఆచరింపుము.

ఇతి శ్రీవరాహ పురాణ భగవచ్చాస్త్రే ద్విచత్వారింశో7ధ్యాయః

ఇది శ్రీవరాహ పురాణమను భగవచ్ఛాస్త్రమున నలుబది రెండవ అధ్యాయము.

Varahamahapuranam-1    Chapters