Varahamahapuranam-1    Chapters   

షడ్వింశత్యధిక శతతమోధ్యాయః - నూటయిరువది ఆరవ అధ్యాయము

సూత ఉవాచ - సూతు డిట్లు చెప్పెను.

ఏవం ధర్మాం స్తతః శ్రుత్వా బహుమోక్షార్థకారణాన్‌,

ప్రత్యువాచ తతో భూమి ర్లోకనాథం జనార్దనమ్‌. 1

పెక్కు మోక్షధర్మ సాధకములగు ధర్మములను విని భూదేవి లోకనాథుడగు జనార్దనునితో ఇట్లు పలికెను.

అహో ప్రభావో ధర్మస్య కథ్యమానోతి పుష్కలమ్‌,

అహం భారభరాక్రాన్తా లగు ర్జాతాస్మి మాధవ. 2

అహో! నీవు చెప్పుచున్న ధర్మప్రభావ మెంత గొప్పది. నేనెంతో బరువు పైబడిన దాననయ్యును అదివిని తేలికగా అయి పోయితిని.

విమోహా చ విశుద్ధా చ శృణ్వమానా త్విమాన్‌ ప్రభో,

ధర్మా లోకేషుః విఖ్యాతా ముఖాత్‌ తవ వినిఃసృతాః. 3

లోకమున ప్రశస్తి కెక్కిన ఈధర్మము లన్నింటిని నీ ముఖమునుండి వెలువడుచుండగా వినుచున్న నేను మోహము లేనిదానను, పరిశుద్దురాలను అయితిని.

పునః పృచ్ఛామి తే దేవ సంశయం తు విదాంవర,

ఏవం ధర్మవిధానేన దీక్షా లభ్యన్తి పుష్కలాః. 4

ఎఱుకగలవారిలో శ్రేష్ఠుడవగు నిన్ను మరియొక సంశయమును గూర్చి అడుగుదును. ఇట్టి ధర్మ విధానము చేత నరులు పొందెడు నిండైన దీక్షలను పొందుదురు.

ఏవ మేవ పరం గుహ్యం పరం కౌతుహలం చమే,

ధర్మసంరక్షణార్థాయ తద్భవాన్‌ వక్తు మర్హసి. 5

ఇట్లే, నాకు మిక్కివేడుకగా నున్నది. ధర్మమును పరిరక్షించు నిమిత్తము రహస్యమును గూర్చి నిన్నడుగుదును. నీవు దానిని చెప్పవలయును.

తతో మహీవచః శ్రుత్వా మేఘదుందుభి నిఃస్వనమ్‌,

వారాహరూపీ భగవాన్‌ ప్రత్యువాచ వసుంధరామ్‌. 6

మేఘము వంటి దుందుభినాదము వంటి గంభీరమగు భూదేవి పలుకు విని వరాహ రూపుడగు భగవానుడు భూదేవికిట్లు బదులు పలికెను.

శ్రీ వరాహ ఉవాచ- శ్రీవరాహదేవు డిట్లు పలికెను.

శృణు తత్త్వేన మే దేవి మమ ధర్మం సనాతనమ్‌,

మమ దేవా నజానన్తి యే చ యోగవ్రతే స్థితాః. 7

దేవీ! నా సనాతమగడు ధర్మమును గూర్చి మూలముట్టుగా వినుము, యోగవ్రతమున నిష్ఠగా నుండు దేవతలు సైతము దీని నెరుగ జాలరు.

మమ ధర్మం వరారోహే మమాఙ్గవిధినిః సృతమ్‌,

అహ మేకో విజానామి మద్భక్తాశ్చైవ యే జనాః. 8

సుందరీ! నాదేహమునుండి వెలువడిన నాధర్మమును నేనొక్కడనే చక్కగా ఎరుగుదును. నాభక్తులగు జనులు కూడ ఎరుగుదురు.

యచ్చ పృచ్ఛసి మే భ##ద్రే దీక్షా భగవతే కథామ్‌,

తచ్ఛ్రుణుష్వ వరారోహే కర్మ సంసార మోక్షణమ్‌. 9

సంసారమునుండి విముక్తిని కలిగించు కర్మమునకు సంబంధించిన దీక్షను, కథను నీకు చెప్పెదను. దానిని ఆలకింపుము.

దీక్షాం న లభ##తే కశ్చిద్‌ పునః సంసారమోక్షణమ్‌,

మయోక్తాం లభ##తే కశ్చిద్‌ దీక్షాం చైవ సుఖావహమ్‌. 10

సంసారమునుండి విముక్తి కలిగించు దీక్షను ఒక్కడును పొందజాలడు. సుఖమును చేకూర్చు దీక్షను, నేను చెప్పుదానిని ఎవ్వడును సులభముగా పొందజాలడు.

చాతుర్వర్ణ్యస్య వక్ష్యామి దీక్షా మేవ యశస్విని,

తరన్తి మనుజా యేన గర్భసంసార సాగరాత్‌. 11

ఓ కీర్తిశాలినీ! నాలుగు వర్ణముల వారికి సంబంధించిన దీక్షను తెలిపెదను. దీనివలన వారు జన్మమెనెడు సంసార సముద్రమును దాటుదురు.

మహాసాంతదపనం కృత్వా తస్తకృచ్ఛ్రం చ సుందరి,

అభిగచ్ఛేద్‌ గురుం దేవి శాధి శిష్యోస్మ్యహం తవ,

తదా వృతోర్ఘభుఞ్జనః పశ్చాద్‌ ద్రవ్యాణి చా హరేత్‌. 12

సుందరీ! నరుడు మొదట 'మహా సాంతపనము' 'తప్తకృచ్ఛ్రము' అను వ్రతములను ఆచరించి 'నేను తమ శిష్యుడను, నన్ను శాసింపు'డని పలుకుచు గురువు కడ కరుగ వలయును. పిదప అతడు గ్రహింపగా యోగ్యమైన పదార్థములను భుజించుచు గురువు చెప్పిన ద్రవ్యములను తీసికొని రావలయును.

లాజాన్‌ మధుకుశాంశ్చైవ ఘృతం చామృతసమ్మితమ్‌,

ధూపగంధాం శ్చ మాల్యాంశ్చ పాలాశం దణ్డయష్టికమ్‌. 13

చర్మ కృష్ణాజినం చైవ ఘటం చైవ కమన్డులుమ్‌,

వాసాంసి పాదుకాం శ్చైవ శుక్ల యజ్ఞోపవీతకమ్‌. 14

యన్త్రికా మర్ఘ పాత్రం చ చరుస్థాలీం చ దర్వికామ్‌,

తిలాన్‌ వ్రీహియనవాం శ్చైవ వివిధాంశ్చ ఫలోదకాన్‌. 15

పేలాలు, తేనె, దర్భలు, అమృతము వంటి నెయ్యి, ధూపము, గంధము, మాల్యములు, మోదుగ కర్ర, నలలేడి చర్మము, కుండ, కమండలువు, వస్త్రములు, పాదుకలు, తెల్లని జన్నిదము, చిన్నకత్తి, పూజాపాత్రము, చరువు వండుటకు పాత్ర, గరిటె, నూవులు, బియ్యము, పెక్కు విధములగు పండ్లు, నీరు - వీనిని తెచ్చుకొన వలయును.

భక్ష్యభోజ్యాన్నపానం చ కర్మణ్యవ చ సంచయాన్‌,

దీక్షితా యద్‌ విభుఞ్జన్తి మను కర్మపరాయణాః. 16

నా కర్మము నందు మిక్కిలి శ్రద్ధగల దీక్షితులు తినుకు యోగ్యములైన భక్ష్యములు, పానీయములు తెచ్చుకొనవలయును.

యాని కాని చ బీజాని రత్నాని వివిధాని చ,

కనకాదీని సుశ్రోణి తాని శీఘ్ర ముపాహరేత్‌. 17

లభించిన విత్తనములు, పెక్కువిధములగు రత్నములు, బంగారము మున్నగు వానిన త్వరగా తీసికొనరావలయును.

పాయసం చ గుడ ంచైవ సుకర్మపరినిష్ఠితః,

కర్మణ్యమృతకల్పాని తత ఏవ ముపాహరన్‌. 18

పాయసము, బెల్లము మొదలగు అమృతము వంటి వస్తువులను కర్మమునందు మిక్కిలి శ్రద్ధ కలవాడై కొనిరావలయును.

ఏ తాన్యేవోపహారాణి కర్మణ్యా చ యశస్విని,

పూర్ణనేత్రాన్‌ విశాలాక్షి తతశ్చితాని కారయేత్‌. 19

ఇంకను ఈ కర్మమునందు చక్కగా వినియోగించుటకు వీలైన పదార్థములను కూర్చుకొన వలయును.

సౌవర్ణం రజతం చైవ తామ్ర మృణ్మయకాని చ,

తాని సంహరయేత్‌ తత్ర గురుమూలే న సంశయః. 20

బంగారు, వెండి, రాగి, మట్టి పాత్రలను కూర్చుకొని వాని నన్నింటిని గురువు పాదముల కడ నిలుపవలయును.

స్నాత్వా మంగళసంయుక్తో దీక్షాకామశ్చ బ్రాహ్మణః,

గురో శ్చరణౌ సంగృహ్య బ్రూహి కిం కరవాణి తే. 21

స్నానము చేసి, మంగళ వస్తువులతో కూడిన, దీక్షను కోరెడి బ్రాహ్మణుడు గురువు పాదములను చక్కగా పట్టుకొని నేను చేయవలసినదేమి? అని యడుగవలయును.

తతోగురుణాను జ్ఞాతో వేదింకుర్యాచ్చతుష్కలామ్‌,

బ్రాహ్మణో దీక్షమానస్తు చతురస్రాం తు షోడశ. 22

పిదప గురువు అనుమతి పొంది ఒక్కొక్క వైపు పదునారు మూరలుగల చదరపు అరుగును దీక్షాకాముడైన బ్రాహ్మణుడు నిర్మించుకొనవలయును.

మమ సంస్థాపయేత్‌ తత్ర యచ్చతుర్థోన విద్యతే,

కర్మణా విధిదృష్టేన మమ తత్రైవ చార్చయేత్‌. 23

ఆ వేదిక యందు నా ప్రతిమను నిలుపవయును. శాస్త్రము చెప్పిన కర్మాచరణముతో నన్నర్చింప వలయును.

తత్రార్చనవిధిం కృత్వా గురుధర్మవినిశ్చయాత్‌,

యాని కాని చ ద్రవ్యాని వేదిమధ్య ముపాహరేత్‌. 24

గురువు చెప్పిన ధర్మనిర్ణయమును బట్టి నా అర్చన కావించి, తెచ్చుకొన్న వస్తువుల నన్నింటిని వేదికి నడుమ నుంచ వలయును.

చతురః కలశాన్‌ దద్యా చ్చతుః పారేశ్వషు సుందరి,

వారిపూర్ణాన్‌ ద్విజాన్‌ శుద్దాన్‌ సహకార విభూషితాన్‌. 25

ఆ వేదిక నాలుగు ప్రక్కలను నాలుగు కలశములను, నీటితో నింపిన వానిని మామిడి మండలతో ఒప్పారుచున్న వానిని శుద్ధములైన వానిని నిలుపవలయును.

సర్వతః శుకల్ససూత్రేణ వేష్టయేత తథానఘే,

పూర్ణపాత్రాణి చత్వారి చతుః పార్శ్వేతు స్థాపయేత్‌. 26

పుణ్యాత్ములారా! ఆ కలశములకు అన్నివైపుల తెల్లని దారములను చుట్టవలయును. అట్టి పూర్ణపాత్రములను నాలుగు వైపుల నిలుప వలయును.

ఏవం మన్త్రం తతం కృత్వా దద్యాద్‌ దీక్షా ప్రయోజకఃః,

సా చ మాత్రా యథాన్యాయం యేన వా తుష్యతే గురుః. 27

అటుపై మంత్రమును పఠించి దీక్షను సఫలము చేయు దక్షిణను సముచితముగా గురువు తుష్టి నందునంతగా ఒసగ వలయును.

యథాన్యాయేన సంగృహ్య గురుకర్మవినిశ్చితః,

ప్రపద్య శపథం విష్ణోః దీక్షానాం పరికాంక్షిణః. 28

అట్లు గురువునుండి మంత్రమును చక్కగా గ్రహించి దీక్షను కైకొను కోరిక కలవాడు విష్ణువుపై ప్రమాణమును చేయవలయును.

ఉపస్పృశ్య యథాన్యాయం భూత్వా పూర్వముఖం తతః,

సర్వేసాం శ్రావయేత్‌ శిష్యాన్‌ దీక్షణార్థం న సంశయః. 29

అంత గురువు తూర్పునకు మొగము పెట్టి నీటితో తగు విధముగా నోటిని శుభ్రపరచుకొని దీక్షా నియమములను శిష్యులందరకు వినిపింపవలయును.

యైస్తు భాగవతం దృష్ట్వా భూత్వా భాగవతః శుచిః,

అభ్యుత్థానం న కుర్వీత అహో తేనాపి హింసితః. 30

భగవద్భక్తుని గాంచి, తాను భాగవతుడై శుచియై తన్నాతడు హింసించినను. అతనిపైకి విరుచుకొని పడరాదు.

న్యాం పితా దత్వా చ ప్రయచ్ఛతి తాం పునః,

అష్టౌ పితృగణా స్తేన హింసితా నాత్ర సంశయః. 31

తండ్రి తన బిడ్డను ఒకనికి భార్యగా నిచ్చి మరల ఆమె నతని కడకు పంపినచో ఆతని యెనిమిది తరముల పితృగణములు హింస నొందెదరు. ఇందు సంశయములేదు.

భార్యాం ప్రియసఖీం యస్తు సాధ్వీం హిసంతి నిర్ఘృణః,

న తేషాం పునరావృత్తి ర్హింసితా చ వసుంధరా. 32

తనకు మిక్కిలి ప్రియమైన సఖి, మంచి నడవడి కలదియు నగు భార్యను దయలేనివాడై హింసించువానికి పుట్టగతులుండవు. అది భూదేవిని హింసించునట్టి నీచమగు కార్యము.

బ్రహ్మఘ్నశ్చ కృతఘ్నశ్చ గోఘ్నశ్చ పాపదుష్కృతమ్‌,

ఏతాన్‌ శిష్యాన్‌ వివర్జేత ఉక్తా యే చాన్యపాతకాః. 33

బ్రాహ్మణుని, మేలుచేసినవానిని, ఆవును చంపినవారును, ఇంకను అట్టి పాపములను చేయువారును అగు శిష్యులను వదలి వేయవలయును.

శాలపాత్రే నభోక్తవ్యం నఛేత్తవ్యం కదాచన,

అశ్వత్థో వటవృక్షశ్చ నచ్ఛేత్తవ్యః కదాచన. 34

మద్దిచెట్ల ఆకునందు భుజింపరాదు. దానిని నరికి వేయరాదు. రావి చెట్టును, మఱ్ఱిచెట్టును ఎన్నటికిని నరికి వేయరాదు.

నచ్ఛేత్తవ్యో బిల్వృక్షో దుమ్బరశ్చ కదాన,

కర్మణ్యా శ్చైవ యే వృక్షా నచ్ఛేత్తవ్యా మనీషిభిః. 35

మారేడు, మేడిచెట్టులను, ఎన్నటికిని కొట్టి వేయరాదు. అట్లే యజ్ఞకర్మములకు పనికి వచ్చు వృక్షములను బుద్ధిమంతులు నరుకరాదు.

యదిచ్ఛేత్‌ పరమాం సిద్ధిం మోక్షధర్మం సనాతనమ్‌,

భక్ష్యాభక్ష్యం చ తేశిష్య వేదితవ్యం తదన్తరే. 36

నాయనా! శిష్యా! నీవు పరమసిద్ధిని, సనాతనమగు మోక్ష ధర్మమును కోరుదు వేని తినదగినదేదో, తినరాని దేదియో చక్కగా తెలిసి కొనవలయును.

కరీరస్య వధం శస్తం ఫలా న్యౌదుంబరస్య చ,

సద్యో భక్ష్యా భ##వేత్‌ తేన అభక్షాః పూతివాసకాః. 37

ముండ్ల చెట్లను కూల్చివేయుట మంచిది. మేడిపండ్లను కూడ రాల్చి వేయవలయును. ఏలయన వానిని అప్పటికప్పుడు తినకున్నచో అవి చెడుకంపు కలవియై తినరాని పదార్థములగును.

భుక్త్వా మాంసం వరాహస్య మత్స్యస్య సకలేరితః,

అభక్ష్యా బ్రాహ్మణౖర్హ్యేతే దీక్షితై రిహ న సంశయః. 38

పందిమాంసమును చేపలను దీక్షితుడగు బ్రాహ్మణుడు ఎన్నటికిని తినరాదు.

పరివారం నకుర్వీత న హింసాం వా కదాచన,

పైశున్యం చ నకర్తవ్యం వ్యసనస్థేన వా క్వచిత్‌. 39

ఇతరులను నిందింపరాదు. హింసిపరాదు. ఎంతటి కష్టము నందున్నను ఎన్నటికిని కొండెములు చెప్పరాదు.

అతిథిం చాగతం దృష్ట్వా దూరాధ్వానగతం తథా,

సంవిభాగస్తు కర్తవ్యో యేన కేన చ పుత్రక. 40

నాయనా! ఎంతో దూరమునుండి వచ్చిన అతిథిని చూచి ఎంతో కొంత అతనికి అన్నము మొదలగు దానిని సమర్పింప వలయును.

గురుపత్నీ రాజపత్నీ బ్రాహ్మణీ వా కదాచన,

మనసా పి నగన్తవ్యా ఏవం విష్ణుః ప్రభాషతే. 41

గురుపత్నిని, రాజపత్నిని, బ్రహ్మజ్ఞాన సంపన్నుని పత్నిని ఎన్నటికిని మనస్సుతో కూడ పొందరాదు. ఇట్లని విష్ణువు వక్కాణించెను.

కనకాదీని రత్నాని ¸°వనస్థాం చ యోషితమ్‌,

తత్ర చిత్తం నకర్తవ్య మేవం విష్ణుః ప్రభాసతే. 42

బంగారు వస్తువులు, రత్నములు, వయసున నున్న స్త్రీ అనువాని యందు మనసు ఉంచరాదు. ఇట్లని విష్ణువు గట్టిగా చెప్పుచున్నాడు.

దృష్ట్వా పరస్య భాగ్యాని ఆత్మానం వ్యసనం తథా,

తత్ర మన్యు ర్న కర్తవ్య ఏష ధర్మః సనాతనః. 43

ఇతరుల సంపదలను, తన ఆపదలను తలచి శోకింపరాదు. ఇది సనాతనమగు ధర్మము.

ఏవం తతః శ్రావయిత్వా దీక్షాకామాన్‌ వసుంధరే,

ఛత్రం చోపానహం చైవ మనసా చోపకల్పయేత్‌,

ద్వౌద్వౌ దుంబరపత్రాణి వేదీమధ్యే తు స్థాపయేత్‌.

క్షురం చైవ వరారోహే జలపూర్ణం చ భాజనమ్‌,

మమ చాహ్వానయేద్‌ భూమి మన్త్రేణ విధినా ర్చయేత్‌. 44

వసుంధరా! గురువు దీక్షను కోరువారి కిట్లు ధర్మములను వినిపించి దైవమునకు గొడుగు, పాదుకలను మనః పూర్వకముగా సమర్పింప వలయును. రెండు రెండు మేడిఆకులను వేదినడుమ నిలుప వలయును. చురకత్తిని, నీటితో నిండిన పాత్రను ఉంచవలయును. విధి పూర్వకముగా నన్నచటికి ఆహ్వానింప వలయును. శాస్త్రయుక్తముగా అర్పింప వలయును.

ఓం మన్త్రః - మంత్రము.

సప్తద్వీపం చ సప్తపర్వ తాశ్చ సప్తసాగరా దశస్వర్గ సహస్రాశ్చ

సమస్తాశ్చ నమోస్తుతే సరస్తే హృదయే వసతి. యశ్చైతద్‌

వర్షతి యశ్చ పున రుత్తమతి.

స్వామీ! ఏడు ద్వీపములు, ఏడు పర్వతములు, ఏడు సముద్రములు, పదివేల స్వర్గములు సమస్తమును నీహృదయమున నున్నవి. నీకు నమస్కారము. నీవే వీనినన్నింటిని వెలువరింతువు. మరల లోనికి గ్రహింతువు.

ఓం భగవన్‌, వాసుదేవ మయైతత్‌ స్మర యదుక్తం

వరాహ రూప సృష్టేన పృథివ్యా యాంతు మంత్రాను

స్మరణం చ యదాజ్ఞాపయామాస భగవా నస్మాక మజ్ఞాత

మను చిన్తయిత్వా భగవ న్నాగచ్ఛ దీక్షాకామ విప్ర

తస్త్వత్పద ముదీక్షతి.

ఓమ్‌, ఓ వాసుదేవ భగవానుడా! నేను పలికిన దానిని స్మరింపుము. నీవు వరాహరూపుడవై భూమి నుద్ధరించినపుడు పలికిన మంత్రములను కూడ స్మరింపుము. నీవు మా ఆజ్ఞానమును తలపోసి మాకడకు దయ చేయుము. దీక్షను కోరుచున్న విప్రుడు నీ ప్రసాదమును ప్రతీక్షించుచున్నాడు.

ఏతన్మంత్ర ముదాహరిత్వా శిరోభి ర్జానుభి ర్భూమిం

గత్వ భవితవ్యమ్‌. ఓమ్‌ స్వాగతం స్వాగతవానితి.

ఈ మంత్రమును పఠించి తలతో మోకాళ్ళతో నేలను స్పృశించి ఉండవలయును. ''స్వాగతము. నీవు విచ్చేసితివి'' అని పలుక వలయును.

తత ఏతేన మన్త్రేణ ఆనయిత్వా వసుంధరే,

అర్ఘ్యం పాద్యం చ దాతవ్య మన్త్రేణ విధినిశ్చయాత్‌. 46

పిదప, ఓ వసుంధరా! ఈ మంత్రముతో విధి పూర్వకముగా అర్ఘ్యమును, పాద్యమును సమర్పింప వలయును.

అకృతఘ్నే దేవా నసురా కృతఘ్న రుద్రేణ బ్రాహ్మణాయ

లబ్ధ మర్థ మిమం భగవతేస్తు.

చేసిన మేలు మరువని దేవతల విషయమున రక్కసులు కృతఘ్నులైరి. బ్రాహ్మణుడు రుద్రుని వలన పొందిన ఈ ధనము భగవంతుని కొరకు అగుగాక !

దత్తం ప్రతిగృహ్ణీష్వ చ లోకనాథ.

లోకనాథ! నేనొసగిన దానిన దయతో గైకొనుము.

ఏవం భూమి తతో దత్వా అర్ఘ్యం పాద్యం చ కర్మణః,

క్షురం గృహ్వా యథాన్యాయ మిదం మన్త్ర ముదీరయేత్‌. 47

భూదేవీ! ఇట్లు అర్ఘ్యమును, పాద్యమును ఒసగి క్రమము ననుసరించి చురకత్తినికైకొని ఈ మంత్రమును పలుక వలయును.

ఓం మన్త్రః - మత్రము.

ఏవం తే వరుణః పాతు శ్యి క్లేదయతః శిరః,

జలేన విష్ణుయుక్తేన దీక్షాం సంసారమోక్షణమ్‌,

ఏతస్య కలశం దద్యాత్‌ కర్మకారస్య సుందరి. 48

శిష్యా! విష్ణువు అనుగ్రహించిన నీటితో తడుపుచున్న నీ శిరస్సును వరుణుడు రక్షించును గాక! ఈ దీక్ష సంసారమును పోకార్చునది. ఇట్లు పలుకుచు కలశమును దీక్ష పొందువానికి (స్నానము కొరకు) ఈయవలయును.

నిష్కలం తు శిరః కృత్వా శోణితేన వివర్జితమ్‌,

పునః స్నానం తతః కృత్వా శీఘ్రమేవ న సంశయః. 49

ఏతస్య వివిధం కృత్వా దీక్షాకామస్య సుందరి,

దత్వా సంసారమోక్షాయ సర్వకామవినిశ్చితః,

జానుభ్యా మవనిం గత్వా ఇమం మన్త్ర ముదాహరేత్‌. 50

పిదప శిరస్సును వెంట్రుకలు లేకుండ చేసి రక్తము లేనిదిగా నొనర్చి మరల వెంటనే స్నానము చేయింపవలయును. ఇట్లు దీక్షను పొందగోరువానికి ఆయా పనులన్నియు కావించి సంపూర్ణమగు నిశ్చయముతో సంసారమును విడుదల గావించు దీక్షను ఒసగ వలయును. మోకాళ్ళను భూమి కానిని ఈ మంత్రమును పలుక వలయును.

ఓం మన్త్రః! - మంత్రము.

వందామి భో భాగవతాంశ్చ సర్వాన్‌

సుదీక్షితా యే గురవశ్చ పూర్వే,

విష్ణుప్రసాదేవ చ లబ్ధదీక్షా

మమ ప్రసీదంతు నమామి సర్వాన్‌. 51

ఇంతకు ముందే మంచిదీక్ష పొందినవారై గురువులై యున్న భాగవతులందరకు మ్రొక్కుదును. విష్ణువు దయతో దీక్షను పొందిన వారందరు నాయందు ప్రసన్ను లగుదురుగాక! వారందరికి నమస్కరింతును.

నమిత్వా భగవాన్‌ భక్త్యా ప్రజ్వాల్య చ హుతాశనమ్‌,

ఘృతేన మధుమిశ్రేణ లాజాకృష్ణతలేన చ. 52

సప్తవారాం స్తతో దత్వా వింశ##త్యైవ ప్రమోదనమ్‌,

జానుభ్యా మవనిం గత్వా ఏవం మంత్ర ముదాహరేత్‌. 53

ఇట్లు గురువు శిష్యునిచేత నమస్కారము చేయించి అగ్నిహోత్రుని ప్రజ్వలింపచేసి తేనె కలిపిన నేతితో, పలాలతో నల్లని నువ్వులతో ఏడు మార్లుగానీ యిరువది పర్యాయములు గాని హోమము చేయవలయును. మరల మోకాళ్ళు నేల కానించి ఈ మంత్రమును పలుక వలయును.

ఓం మన్త్రః - మంత్రము.

అశ్వినౌ దిశః సోమసూర్యౌ సాక్షిపాత్రం వయమ్‌,

ప్రసన్నాః శృణ్వన్తు మే సత్యవాక్యం వదామి. 54

అశ్విదేవతలు, దిక్కులు, చంద్రుడు, సూర్యుడు ఈ మాకార్యమునకు సాక్షులగుదరు గాక! ప్రసన్నులై నేను పలికెడు సత్యమగు వాక్యమును వినుడు.

సత్యేన ధార్యతే భూమిః సత్యేన తిష్ఠతే భూమిః,

సత్యేన గచ్చతే సూర్యో భూమిః సత్యేన వర్ధతే. 55

సత్యమే ఈభూమిని పట్టి నిలుపుచున్నది. సత్యము చేతనే భూమి నిలిచియున్నది. సత్యము చేతనే సూర్యుడు కదులు చున్నాడు. సత్యము చేత భూమి వృద్ధి పొందుచున్నది.

ఏవం సత్యం తపః కృత్వా బ్రాహ్మణో వీక్షనం పునః,

గురుం ప్రసాదయేత్‌ తత్ర మన్త్రేన విధినా చ యత్‌. 56

ఇట్లు సత్యము మీద ఒట్టు వైచి దీక్ష గొనెడు బ్రాహ్మణుడు గురువునుచూచి ప్రసన్నుని చేయవలయును.

త్రయః ప్రదక్షిణం కృత్వా దేవం భాగవతం గురుమ్‌,

గురవే చరణౌ గృహ్య ఇమం మన్త్ర ముదాహరేత్‌. 57

భగవద్భక్తుడగు గురువునకు మూడు మారులు ప్రదక్షిణము గావించి ఆతని చరణములను పట్టుకొని ఈ మంత్రమును పలుక వలయును.

ఓం మన్త్రః - మంత్రము.

గురుదేవ ప్రసాదేన లబ్ధా దీక్షా యదృచ్ఛయా,

యత్తే వాపకృతం కిఞ్చిద్‌ గురుర్మర్షయతాం మమ. 58

గురుదేవుని దయవలన నేను దీక్షను పొందితిని. ఓ గురుదేవా! నీకు నేనేదేని అపకారమును చేసియున్నచో దానిని తమరు క్షమింపవలయును.

ఏవం ప్రసాదయిత్వా తు శిష్యోమన్త్రేణ సుందరి,

వేదిమధ్యే స్థాపయిత్వా భూత్వా పూర్వాముఖం తతః. 59

శిష్య మేవతతో దృష్ట్వా గృహ్య చైవ కమణ్డులుమ్‌,

శుక్ల యజ్ఞోపవీతం చ ఇమం మన్త్రముదాహరేత్‌. 60

ఇట్లు గురువును ప్రసన్నుని చేసికొని శిష్యుడు మంత్రములను పలుకుచు తూర్పుముఖముగా వేదిక మీద గురువును కూర్చుండ పెట్టవలయును.

అంతగురువు శిష్యునే చూచుచు కమండలువును, తెల్లని జన్నిదమును పట్టుకొని ఈ మంత్రమును పలుక వలయును.

ఒం మన్త్రః - మంత్రము.

ఓం విష్ణు ప్రసాదేన గతో సి సిద్దిం

ప్రాప్తా చ దీక్షా కమండలుం చ,

గృహీత్వా తు కరాభ్యాం యుక్తో సి

కర్మణః క్రియాయాం చైవ. 61

విష్ణువు దయవలన నీవు సిద్దిని పొందితివి. నీకు దీక్షయు, కమండలువును లభించినవి. దీనిని రెండు చేతులతో పట్టుకొని నీవు ఇటుపై దీక్షా కార్యమునకు యోగ్యుడవయితివి.

ముఖపట్టం తతః కృత్వా దీక్షితో గురుణో తథా,

సర్వప్రదక్షిణం కృత్వా ఇమం మన్త్ర ముదాహరేత్‌. 62

ఇట్లు గురువు చేత దీక్షపొంది ముఖమునకు గుడ్డ కట్టుకొని సర్వప్రదక్షిణము చేయుచు ఈ మంత్రమును పలుక వలయును.

అంధో భూత్వా యద్యహం భ్రమ్యతే త్ర

లబబ్దో గురు ర్విష్ణు దీక్షా చ లబ్దా,

తవ ప్రసాదా చ్చ గురో యథావత్‌

ఏతేన మన్త్రేణ ముఖపట్టం కారయేత్‌.

నేను గ్రుడ్డినై యిచట తిరుగుచున్నాను. నాకు గురువును, దీక్షను లభించెను. గురుదేవా! ఇదియంతయు నీ దయ వలననే కలిగినది - అని యీ మంత్రమును చెప్పుచు ముఖమునకు గుడ్డ కట్టుకొనవలయును.

శౌచ మేకేన వై కుద్యాద్‌ దేవాన్‌ దేయంతు వాససమ్‌,

ఏవం వై విష్ణు మాదత్తే గృహ్ణ వత్స కమణ్ణలుమ్‌. 63

అప్పుడు గురువిట్లు పలుకును : ఒక కడవ నీటితో స్నానము చేయుము. దేవతలకు వస్త్రము నొసగుము. ఇట్లు దీక్షితుడు విష్ణువుని గ్రభించును. నాయానా! కమండలువును కైకొనుము.

ఇమం లోకేషు విక్యాతం శోధనం సర్వకర్మవసు,

గృహ్ణవస్వ గన్దపత్రాని సర్వగన్దం సఖోచితమ్‌,

సర్వం వౌష్ణవకం శుద్దం సర్వసంసార మోక్షణమ్‌. 64

ఈ కమండలువు లోకముల యందు ప్రసిద్ధమైనది. అన్ని పనుల యందుకలిగించునది. సుఖమును కలిగించు సువాసన గల ఆకులను కూడ గ్రహింపుము. ఇది శుద్ధమైనది. నిలువెల్ల విష్ణువే అయినది. సమస్తమగు సంసారలంపటమునుండి విముక్తి కలిగించునది.

గృహ్ణ వై మధుపర్కం చ ప్రాప్య కాయ విశోధనమ్‌,

ఉభౌ తు చరణౌ గృహ్య ఉపాధ్యాయో కల్పయేత్‌. 65

శిరసా చాంజలిం కృత్వామనశ్చైవ సుసంయతమ్‌,

అర్ఘ్యం గృహ్య యథాన్యాయ మిమం మన్త్రముదారయేత్‌. 66

శరీరశుద్ది అయిన పిదప మధుపర్కమును పుచ్చకొనుము. అని యిట్లు గురువు చెప్పగా శిష్యుడు గురువు రెండు పాదములను పట్టుకొని తలతో ప్రణమిల్లి మనసును కుదుటపరచుకొని అర్యమును చేత బట్టుకొని యీ మంత్రమును పలుకవలయును.

శృష్వ మే భాగవతాః సర్వా గురుశ్చ మే కర్మదీక్షాం చకార,

అహం శిష్యో దాసభూతస్తవైవ దేవసమో గురుశ్చ మే తథోపపన్నమ్‌. 67

భాగవతులందరు దయ చేసి వినుడు. గురువు నాకు కర్మ దీక్ష నాచరించెను. స్వామి! నేను తమకే శిష్యుడను, దాసుడను. నాకు దేవునకు సాటియగు గురువు లభించెను.

షాగమే సర్వవర్ణేషు దీక్షా భూమి జానతః,

త్రమాణాం మన్త్రవర్ణానాం దీక్షా త్వన్యా విధీయతే. 68

వర్ణములన్నింటిలో మొదటి వారగు బ్రాహ్మణులకు సంబంధించిన దీక్ష యిట్టిది. భూదేవీ! తక్కిన మూడు వర్ణముల వారికి మరియొక విధమగు దీక్ష విధింపబడినది.

య ఏతేన విధానేన దీక్షయేత వసుంధరే,

ఉభయోః ప్రాప్నుయాత్‌ సిద్ది మాచార్యః శిష్య ఏవచ. 69

వసుంధరా! ఈ విధానముతో దీక్షఒసగినచో ఆచార్యుడును, శిష్యుడును ఇరువురును సిద్దిని పొందుదురు.

ఇతి శ్రీ వరాహపురాణ భగవచ్ఛాస్త్రే షడ్విశత్యధిక శతతమోధ్యాయః.

ఇది శ్రీ వరాహ పురాణమను భగవచ్ఛాస్త్రమును నూ ట ఆరవ అధ్యాయము.

Varahamahapuranam-1    Chapters