Varahamahapuranam-1    Chapters   

త్రయోవింశత్యధిక శతతమోధ్యాయః - నూట ఇరువది మూడవ అధ్యాయము

శ్రీ వరాహ ఉవాచ - శ్రీవరాహదేవుడిట్లు పలికెను.

ఫాల్గునస్య తు మాసస్య శుక్ల పక్షస్య ద్వాదశీమ్‌,

గృహ్య వాసంతికాన్‌ పుష్పాన్‌ సుగంధాన్‌ యే క్రమాగతాః. 1

శ్వేత పాండురకం చైవ సుగంధం శోభనం బహు

విధినా మన్త్రయుక్తేన సుప్రీతే నాన్తరాత్మనా. 2

ఫాల్గునమాసపు శుక్లపక్ష ద్వాదశినాడు మంచి పరిమళముగల అడవి మొల్లలను, తెలుపుమించిన పసిమివన్నెగల వానిని గ్రహించి మిక్కిలి ప్రీతినొందిన అంతరాత్మతో మంత్రపూర్వకమైన విధానముతో భాగవతుడు శుచియై కర్మములన్నింటిని చక్కగా ఎరిగి పూజింపవలయును.

తదాహ రేత కర్మాణి విధిదృష్టేన కర్మణా,

విధినా మంత్ర పూతేన కుర్యాచ్ఛాంతమనోమలః.,

నమో నారాయణ త్యుక్త్వా ఇమంమన్త్రముదీరయేత్‌. 4

శాస్త్ర విధానము ననుసరించిన కర్మముతో పూజాకార్యములు చేయవలయును. కార్యము మంత్రములతో పవిత్రము కావలయును. భక్తుడు శాంతము నిర్మలము అగు మనస్సు కలవాడు కావలయును ''ఓంనమోనారాయణాయ'' అని పలుకుచు ఈ మంత్రమును ఉచ్చరింపవలయును.

ఓం నమో వాసుదేవేశ శంఖచక్ర ధరాచ్యుత,

నమోస్తు తే లోకనాథ ప్రవీరాయ నమోస్తుతే. 5

వాసుదేవా! ఈశ! శంఖచక్రధరా! అచ్యుతా! లోకనాథ! మహావీరుడవగు నీకు నమస్సు, నీకు నమస్సు.

సంపుష్పితస్యేహ వసంతకాలే,

వనస్పతే ర్గంధరసప్రయుక్తాః.

పశ్యేదిమాన్‌ పుష్పితపాదపేన్ద్రాన్‌,

వసంతకాలే సముపాగతే చ. 6

వసంతకాలమున వనస్సతులు చక్కగా పూచినవి. చక్కని గంధరసముతో కూడియున్నవి. వసంతకాలము వచ్చినది. ఈ పూచిన గొప్పచెట్లను చూడుము.

యశ్చైతేన విధానేన కుర్యా న్మాసే తు ఫాల్గునే,

న స గచ్ఛతి సంసారం మమ లోకాయ గచ్ఛతి. 7

ఈ విధముగా ఫాల్గునమాసమున అర్చనచేయువాడు సంసారమును పొందడు. నాలోకమున కరుగును.

యచ్చ పృచ్ఛసి సుశ్రోణి మాసే వైశాఖ ఉత్తమే,

శుక్లపక్షే తు ద్వాదశ్యాం యత్ఫలం తచ్ఛ్రుణుష్వ మే. 8

సుశ్రోణి! వైశాఖము శుక్లపక్షద్వాదశినాటి అర్చనఫలమును గూర్చి నన్నడిగితివి. దానిని వినుము.

పుష్పితేషు చ శాలేషు తథాన్యేషు ద్రుమేషు చ

గృహీత్వా శాలపుష్పాణి మమ కర్మణి సంస్థితాః. 9

చక్కగా పూచిన మద్ది మొదలగు చెట్ల పూవులను గ్రహించి నాపూజకు సిద్ధము కావలయును.

కృత్వా తు మమ కర్మాణి శుభాని తరుణాని చ,

పూజ్య భాగవతాన్‌ సర్వాన్‌ స్థాపయిత్వా తతోగ్రతః. 10

ఋషిస్తువన్తి మన్త్రేణ వేదోక్తేన చ మాధవి,

గంధర్వప్సరశ్చైవ గీతనృత్యైః సవాదితైః. 11

కాలమునకు తగిన శుభకర్మలన్నింటి నాచరించి భగవద్భక్తులనందరిని ముందుచుకొని వేదము చెప్పిన విధానముగా మంత్రములను చదువుచు గంధర్వుల అప్సరసల నాట్యములతో ఆటలతో పాటలతో వాద్యములతో పూజలు సలుపవలయును.

స్తువన్తి దేవలోకాశ్చ పురాణం పురుషోత్తమమ్‌,

సిద్ధవిద్యాధరా యక్షాః పిశాచోరగరాక్షసాః,

స్తువన్తి దేవభూతానాం సర్వలోకస్య చేశ్వరమ్‌. 12

అప్పుడు దేవలోకమువారు పురాణపురుషోత్తముని స్తుతింతురు. సిద్ధులు, విద్యాధరులు, యక్షులు, పిశాచులు, నాగులు, రాక్షసులు సర్వలోకాధిపతి యగు పురుషోత్తముని స్తోత్రములు చేయుచుందురు.

ఆదిత్యా పసవో రుద్రా అశ్వినౌ సమరుద్గణాః,

స్తువన్తి దేవదేవేశం యుగానాం సంక్షయేక్షయమ్‌. 13

ఆదిత్యులు, వసువులు, రుద్రులు, అశ్విదేవతలు, మరుత్తులు వీరందరు, దేవదేవేశుడు, యుగముల నాశనమునందును చెడనివాడు అగు దేవుని స్తుతింతురు.

తతో వాయుశ్చ విశ్వేచ అశ్వినౌ చ సమన్వితాః,

స్తువన్తి కేశవం దేవమాదికాలమయం ప్రభుమ్‌. 14

అంత వాయువు, విశ్వేదేవతలు, అశ్వులు అందరు గుమికూడి ఆదికాలమయుడు, ప్రభువునగు కేశవుని కీర్తింతురు.

తతో బ్రహ్మా చ సోమశ్చ శక్రశ్చాగ్ని సమన్వితః,

స్తువన్తి నాధం భూతానాం సర్వలోకమహేశ్వరమ్‌. 15

బ్రహ్మ, చంద్రుడు, ఇంద్రుడు, అగ్నియు సర్వభూతములకు నాథుడును, సర్వలోకములకు ప్రభువును అగు విష్ణువును అగు విష్ణువును స్తుతింతురు.

నారదః పర్వతశ్చైవ అసితో దేవల స్తథా,

పులహశ్చ పులస్త్యశ్చ భృగు శ్చాంగిర ఏవ చ. 16

ఏతే చాన్యే చ బహవో మిత్రావసు పరావసూ,

స్తువన్తి నాథం భూతానాం యోగినాం యోగముత్తమమ్‌. 17

నారదుడు, పర్వతుడు, అసితుడైన దేవలుడు, పులహుడు, పులస్త్యుడు, భృగువు, అంగిరసుడు, ఇంకను పెక్కండ్రు మహర్షులు, మిత్రావసు పరావసువులును భూతనాథుడు, యోగినాథుడు, ఉత్తమయోగస్వరూపుడునగు నారాయణుని స్తుతింతురు.

శ్రుత్వా తు ప్రతినిర్ఘోషం దేవానాం తు మహౌజసమ్‌,

తతో నారాయణో దేవః ప్రత్యువాచ వసుంధరామ్‌. 18

మిక్కిలి శక్తిగల ఆ దేవతల నాదములను విని నారాయణ దేవుడు వసుంధరతో ఇట్లు పలికెను.

కిమయం శ్రూయతే శబ్ధో బ్రహ్మఘోషేణ చోదితః,

దేవానాం చ మహాభాగే మహాశబ్దోత్ర శ్రూయతే. 19

ఇదియేమి శబ్దము వినవచ్చుచున్నది? వేదఘెషముతో మొదలైనది. దేవతల మహాశబ్దము ఇందు వినవచ్చుచున్నది.

తతః కమలపత్రాక్షీ సర్వరూపగుణాన్వితా,

వారాహరూపిణం దేవం ప్రత్యువాచ వసుంధరా. 20

అంత తామరరేకులవంటి కన్నులుకలదియు, అన్నిరూపములతో, గుణములతో కూడినదియునగు భూదేవి ఆవరాహరూపదేవునితో ఇట్లు పలికెను.

దేవాః కాంక్షన్తి తే దేవ వారాహీరూప సంస్థితమ్‌,

త్వన్నియోగనియుక్తాస్య తదర్థం లోకభావనా. 21

దేవా! నీవు వరాహరూపమునే తాల్చా ఉండవలయుననియు, వారందరు నీ ఆజ్ఞకు లోబడి లోకభావనను చేయవలయుననియు దేవతలు కోరుచున్నారు.

తతో నారాయణో దేవః పృథివీం ప్రత్యువాచ హ,

అహం జానామి తాన్‌ దేవి మార్గమాణాన్‌ పథిస్థితాన్‌. 22

అంత నారాయణదేవుడు భూమితో ఇట్లనెను. దేవీ! వారు నన్ను వెదకుచు మార్గమున నున్నారని నేనెరుగుదును.

దివ్యం వర్షసహస్రం వై ధారితాసి వసుంధరే,

మయా లీలాయమానేన ఏకదంష్ట్రాక్రమేణ చ. 23

వసుంధరా! నేను నిన్ను దివ్యమైన వేయి వత్సరములు లీలగా నా ఒకకోరతో పట్టి నిలిపివతిని.

ఇహాగచ్ఛన్తి భద్రంతే ద్రష్టుకామా దివౌకసః,

ఆదిత్యా వసవో రుద్రాః స్కన్దేంద్రసపితామహాః 24

నన్నుచూచుటకై దేవలోకవాసులందరు- అదిత్యుడు, వసువులు, రుద్రులు, కుమారస్వామి, ఇంద్రుడు, బ్రహ్మమొదలగు వారు ఇచటకి వచ్చుచున్నారు.

ఏవం తస్య వచః శ్రుత్వా మాధవస్య వసుంధరా,

శిరసా చాంజలిం కృత్వా తతస్తచ్చరణౌ పతత్‌. 25

ఇట్లా మాధవుని మాట విని భూదేవి దోసిలిని నుదుటపై జోడించి ఆతని పాదములపై పడెను.

వారాహం పురుషం దేవం విజ్ఞాప్యతి వసుంధరా,

ఉద్ధృతాస్మి త్వయా దేవ రసాతలగతా హ్యహమ్‌,

శరణం త్వా మనాథా వై త్వద్భక్తస్య గతిః ప్రభుః 26

భూదేవి వరాహరూపుడగు దేవున కిట్లు విన్నవించుకొనెను. దేవా! రసాతలమునకు క్రుంగిన నన్ను నీవు పైకెత్తి నిలిపితివి. దిక్కులేని దానను నాకు రక్షకుడవైతివి. నీ భక్తునకు నీవే గతివి. ప్రభువవు.

కిం కర్మ కర్మణా కేన కింవా జన్మపరాయణమ్‌,

కథం వా తుష్యసే దేవ పూజ్యః కేనాసి కర్మణా

తదహం కారయిష్యామి కర్మ స్వర్గసుఖావహమ్‌. 27

నాకేది కర్తవ్యము? ఏ పనితో నిన్నర్చింతును. నాజన్మమునకు పరమగతియేమి? ఏవిధముగా పూజించినచో నీవు తుష్టినందెదవు? స్వర్గసుఖమునకు తావలమైన ఆపనిని నేను ఆచరింతును.

న చ మే స్తి వ్యథా కాచిత్‌ తవ కర్మ విధానతః,

న గ్లాని ర్న జరా కాచి న్న జన్మమరణ తథా. 28

నీ పూజావిధానము చేసెడునాకు బాధలేదు. అలసటలేదు. ముసలితనములేదు. పుట్టుటయు గిట్టుటయును లేవు.

సర్వే సురాసురా లోకా రుద్రేంద్ర సపితామహాః

కోష్ఠే నివాసం కుర్వన్తి తవైకస్య యశోధరాః. 29

దేవతలు, రాక్షసులు, సర్వజనులు, రుద్రుడు, ఇంద్రుడు, బ్రహ్మ అను కీర్తిధారులందరు నీకడుపున ఒకమూల నివసింతురు.

కాని కర్మాణి కుర్వన్తి యై స్త్వాం పశ్యన్తి మాధవ

కిమాహారాః కిమాచారా స్త్వాం పశ్యన్తీహ మాధవ. 30

మాధవా! నిన్ను చూచుటకై వేరేకృత్యములుచేయుదురు? ఏ ఆహారములు తిందురు? ఏ ఆచారములు పాటింతురు?

బ్రాహ్మణస్య చ కింకర్మ క్షత్రియస్య చ కింభ##వేత్‌,

వైశ్యః కిం కురుతే కర్మ శూద్రః కిం కర్మ కారయేత్‌. 31

బ్రాహ్మణుని కర్మమెద్ది? క్షత్రియుని కేదియగును? వైశ్యుడేమి చేయును? శూద్రుని కర్మమెట్టిది?

యోగో వై ప్రాప్యతే కేన తపో వా కేన నిశ్చితమ్‌,

కించాత్ర ఫల మాప్నోతి తవ కర్మపరాయణః. 32

ఎవడు యోగమును పొందును? ఎవడు తపమును ఎన్నుకొని చేయును? నీకర్మమున మిక్కిలి శ్రద్ధకలవాడే ఫలమును పొందును?

కించ దుఃఖనివాసం వా భోజనం పానకం తథా

కించ కర్మ ప్రయోక్తవ్యం తవ భ##క్తేషు మాధవ. 33

నీభావము దుఃఖమునకు నెలవగును? భోజనమెట్టిది? త్రాగునదేమి? నీభక్తులు చేయవలసిన క్రియ ఎట్టిది?

ప్రాపణం కీదృశం చాపి దిశాసు విదిశాసు చ

కథం యోనిం నగచ్ఛేత వియోనిం చ న గచ్ఛతి. 34

దిక్కులందు మూలలందు ఎట్టి నివేదనలు సలుపవలయును? గర్భవాసమును, జంతుజన్మాదులను పొందకుండుటెట్లు?

తిర్యగ్యోనిం నగచ్ఛేత కర్మణా కేన కేశవ

తన్మమాచక్ష్వ సకలం యేన మే సుసుఖం భ##వేత్‌. 35

ఏ కర్మమొనరించి నరుడు పశుజన్మము పొందకుండును? కేశవా! నాకు మిక్కిలి సుఖము కలుగునట్లు ఈ సకలము తెలియజెప్పుము.

జరా వా కేన గచ్ఛేత జన్మ కేన చ గచ్ఛతి,

గర్భవాసం న గచ్ఛేత కర్మణా కేన వాచ్యుత. 36

ఏ పనిచేత ముసలితనమును పొందును? దేనిచేత జన్మమును పొందును? గర్భవాసమును పొందకుండుటకేమి చేయవలయును?

సంసారం చ న గచ్ఛేత కస్య చైవ ప్రభావతః,

ఇత్యుక్తో భగవాం స్తత్ర ప్రత్యువాచ వసుంధరామ్‌. 37

దేవి ప్రభావము చేత నరుడు సంసారమున పడకుండును? అని వసుంధర ఇట్లడుగగా భగవాను డిట్లు బదలు పలికెను.

శృణ్వన్తు మేభాగవతా యేచ మోక్షే వ్యవస్థితాః,

తాన్మన్త్రాన్‌ కీర్తయిష్యామి యై స్తోషం యామి నిత్యశః, 38

మోక్షమార్గమున స్థిరముగా నిలిచియున్న భాగవతులారా! నేను దేనివలన మిక్కిలి సంతోషమును ఎల్లవేళల పొందుదునో ఆమంత్రములను కీర్తింతును. వినుడు.

మన్త్రః - మంత్రము.

మాసేషు సర్వేషు చ ముఖ్యభూత

స్త్వం మాధవో మాధవ మాస ఏవ

పశ్యేద్‌ దేవం తం తు వసంతకాలే

ఉపాగతం గంధరసప్రయుక్త్యా.

నిత్యం చ యజ్ఞేషు తథేజ్యతే యో

నారాయణః సప్తలోకేషు వీరః. 39

మాధవా! నీవు మాసములన్నింటను ముఖ్యమైన వైశాఖమాసమవు, మంచిపరిమళముతో, చక్కనిరసములతో వసంతకాలమున నీవు దేవుని దర్శించుచు వచ్చితివి. ఎల్లప్పుడు యజ్ఞములందు అర్చింపబడెడు ఈ నారాయణుడు ఏడులోకములందు వీరుడు.

ఏవం గ్రీష్మే విధించైవ కుర్యాత్‌ సర్వం విధానతః,

ఇమ ముచ్చారయే న్మన్త్రం సర్వభాగవతప్రియమ్‌. 40

ఇట్లే గ్రీష్మమునందు సర్వమును విధిపూర్వకముగా చేయవలయును. భాగవతులందరికి ప్రియమగు ఈ మంత్రమును పఠింపవలయును.

మంత్రః-మంత్రము.

మాసేషు సర్వేష్వసి ముఖ్యభూతో

మాసో భవాన్‌ గ్రీష్మ ఏకః ప్రసన్నః,

పశ్యేద్భవాన్‌ వర్తతి గ్రీష్మకాలే

ఉపాగతం గన్ధరస ప్రయుక్త్యా

నిత్యం చయజ్ఞేషు తథేజ్యమానో

నారాయనః సర్వలోకేషు వీరః. 41

మాసములన్నింటిలో ప్రధానమగు గ్రీష్మమా! నీవు ప్రసన్నముగా వచ్చితివి. గంధరసములతో కూడి నీవు ఏతెంచితివి. నిత్యము యజ్ఞములందు పూజలుకొనెడు శ్రీనారాయణుడు సర్వలోకములందును వీరుడు.

ఏతేనైవ విధానేన గ్రీష్మే చై వార్చనం కురు

న జన్మ మరణం తస్య మమ లోకే గతిర్భవేత్‌. 42

ఇదే విధముగా గ్రీష్మమునందును ఆర్చనము చేయవలయును. అట్టివానికి జననమరణములుండవు. నా లోకమునకు గతి కలుగును.

యావన్తః పుష్పితాః శాలాః పృథ్వ్యాం యావత్సుగన్ధకాః,

అర్చితః సభ##వేత్‌ సర్వైః కృతో యేన హ్యయం విధిః. 43

ఈ విధముగా నన్నర్చించువాడు భూమిలో చక్కని పరిమళముగల శాలవృక్షముల పూవులన్నింటితో పూజించిన వాడగును.

ఏవం మాధవమాసే తు మమ కర్మ చ కారయేత్‌,

నిష్కలా భవతే బుద్ధిః సంసారే చ నజాయతే. 44

ఇట్లు వైశాఖమాసమున నా పూజ నాచరించు వానికి బుద్ధి నిర్మలయగును. ఆతడు మరల సంసారమున పుట్టడు.

అన్యచ్చ తేప్రవక్ష్యామి కర్మ సంసారమోక్షణమ్‌,

కదంబకుటజాశ్చైవ శల్ల కార్జునకా స్తథా,

ఏభి రేవార్చనం కుర్యాద్‌ విధిదృష్టేన కర్మణా. 45

నీకు మరియొక విషయముకూడ చెప్పెదను. అది సంసారమునుండి విడుదల కలిగించును. కడిమి, కొండ గోగు శల్లకము, అర్జునకము అనుపూవులతో విధి ననుసరించి అర్చనము గావింపవయును.

తతః సంస్థాపనం కుర్యా న్మమ మన్త్రపరాయణః,

నమో నారాయణాయేతి ఇమం మన్త్ర ముదాహరేత్‌. 46

పిదప నామంత్రములందు శ్రద్ధ కలవాడై నన్ను ప్రతిష్ఠాపనము చేయవలయును. 'ఓంనమోనారాయణాయ' అనుచు ఈ మంత్రమును పలుకవలయును.

మంత్రః-మంత్రము.

పశ్యన్తి మేధ్యా అపి మేఘవర్ణం

త్వా మాగతాః పూజ్యమానం మహిమ్నా,

నిద్రాం భవాన్‌ గృహ్ణతు లోకనాథ

వర్షస్త్విమం పశ్యతు మేఘబృన్దమ్‌. 47

పవిత్ర హృదయములు గలవారు మేఘమువన్నెకల పూజ్యుడవగు నిన్ను మహిమతో చూచుచున్నారు. లోకనాథా! వర్షాకాలము వచ్చినది. మేఘములబృందములను చూడుము. నిద్రను పొందుము.

ఆషాఢమాసే ద్వాదశ్యాం సర్వశాన్తికరం శుభమ్‌,

య ఏతేన విధానేన మమ కర్మతు కారయేత్‌.

స మర్త్యో న ప్రణశ్యేత సంసారేస్మిన్‌ యుగేయుగే 48

ఆషాడమాస ద్వాదశియందు సర్వశాంతికరమగు ఈ శుభకర్మమును శాస్త్రముననుసరించి చేయవలయును. అట్లాచరించువాడు ఎన్నటికిని ఏయుగమునందును నశింపడు.

ఏతత్‌ తే కథితం దేవి ఋతూనాం కర్మ చోత్తమమ్‌,

తరన్తి యేన సంసారం నరాః కర్మ పరాయణాః. 49

దేవీ! కర్మశ్రద్ధ కల నరులు దేనిచేత సంసారమును తరింతురో అట్టి ఋతువులందుచేయదగిన ఉత్తమకర్మమును నీకు చెప్పితిని.

ఏతద్‌ గుహ్యం మహాభాగే దేవాః కేచి న్నజానతే

ముక్త్వా నారాయణం దేవం వారాహం రూపమాస్థితమ్‌. 50

పుణ్యాత్మురాలా! ఈ పరమరహస్యమును నీకు చెప్పితిని. వరాహరూపమును, తాల్చిన నారాయణదేవుడు కాక దేవతలును దీనినెరుగరు.

నాదీక్షితాయ దాతవ్యం మూర్ఖాయ పిశునాయచ

కుశిష్యాయ న దాతవ్యం యే చ శాస్త్రార్థదూషకాః. 51

యజ్ఞదీక్షలేనివానికి, మూర్ఖునకు, తంపులమారి వానికి నీచశిష్యునకు, శాస్త్రవిషయములను నిందించువారికి దీని నొసగరాదు.

న పఠేద్‌ గోఘ్నమధ్యే వై న పఠే చ్ఛఠమధ్యగః

ధనధర్మక్షయ స్తేషాం పఠనా దాశు జాయతే. 52

కసాయివారినడుమను, మూర్ఖుల దగ్గరను దీనిని చదువ రాదు. అట్లు చదువుటవలన వారికి ధర్మము, ధనము వెంటనే నశించును.

ఏతేన కర్మణా భ##ద్రే యత్త్వయా పరిపృచ్ఛితమ్‌,

కార్త్న్సేన కథితం హ్యేతత్‌ కిమన్యత్‌ పరిపృచ్ఛసి. 53

దేవీ! నీవడిగిన దానిని మొత్తముగా చెప్పితిని. ఇంక నీవు దేని నడుగుదువు?

ఇతి శ్రీ వరాహపురాణ భగవచ్ఛాస్త్రే త్రయోవింశత్యధిక శతతమోధ్యాయః.

ఇది శ్రీవారహపురాణమను భగవచ్ఛాస్త్రమున నూటయిరువది మూడవ అధ్యాయము.

Varahamahapuranam-1    Chapters