Varahamahapuranam-1    Chapters   

ఏకవింశత్యధికశతతమోధ్యాయః - నూటయిరువదియొకటవ అధ్యాయము

శ్రీవరాహ ఉవాచ - శ్రీవరాహ దేవుడిట్లు చెప్పెను.

గుహ్యానాం పరమం గుహ్యం తచ్ఛ్రుణుష్వ వసుంధరే,

తిర్యగ్యోనిగతాశ్చాపి యేన ముచ్యన్తి కిల్బిషాత్‌. 1

వసుంధరా! పశుపక్ష్యాది జన్మములందినవారు కూడ పాపమునుండి విడివడు మిక్కిలి రహస్యమును వినుము.

అష్టమ్యాం చ చతుర్దశ్యాం ద్వాదశ్యాంచవిధుక్షయే,

సంక్రాన్తే గ్రహకాలేచ మైధునం యో నగచ్ఛతి. 2

అష్టమి, చతుర్దశి, అమావాస్య తిథుల యందును, సంక్రాంతి, గ్రహణకాలములందును మిధున కర్మమును చేయని వాడును....

భుక్త్వా పరస్య చాన్నాని యశ్చైవ న వికుత్సతి,

బాలే వయసి వర్తేత మమ నిత్య మనువ్రతః. 3

ఇతరుని అన్నములు తిని పెట్టనవారిని రోతపడనివాడు పిన్నవయసునందును నాయందు చెదరని వ్రతము కలవాడు....

యేన కేనాపి సంతుష్టః పితా మాతా చ పూజయేత్‌,

ప్రాప్తం భుఞ్జీత నిత్యం చ స్వయం న పరివేషకః. 4

ఏ కొంచెము లభించినను తృప్తి నందువాడు, తల్లిదండ్రులను పూజించువాడు, లభించినదానిని తాను మాత్రమే తినక ఇతరులకును పంచి అనుభవించువాడు....

అలుబ్ధః సర్వకార్యేషు స్వతంత్రో నిత్యసంయతః,

వికర్మ నాభికుర్వీత కౌమారవ్రత సంస్థితః. 5

అన్నిపనులయందును లోభితనము లేనివాడు, స్వతంత్రడు, తన్నుదాను అదుపున నుంచుకొనువాడు, పాడుపనులు చేయనివాడు, కుమారవ్రతమునందు (బ్రహ్మచర్యమునందు) స్థిరముగా నిలిచియుండువాడు....

సర్వభూతదయో నిత్యం సంవిభాగీ గుణాన్వితః,

దాతా భోక్తా చ సచవై సత్యేన చ సమన్వితః,

మతిమాన్‌ నైవ తప్యేత పరార్థేషు కదాచన. 6

ఎల్లప్పుడు సర్వభూతములయందును దయగలవాడు, వివేకము కలవాడు, సత్యము తప్పనివాడు, బుద్ధిమంతుడు, ఇతరుల సొమ్ములకొఱకు ఎన్నడును ఆశపడి తాపము పొందనివాడు...

ఈదృశీం బుద్ధి మాదాయ మమ కర్మాణి కుర్వతి,

తిర్యగ్యోనిం నగచ్ఛేత మమ లోకాయ గచ్ఛతి. 7

ఇట్టి బుద్ధినలవరచుకొని నాపూజాక్రియలను ఆచరించువాడు పశువులపుట్టుక పొందడు నాలోకమున కరుగును.

ఇమం గుహ్యం వరారోహే దేవైరపి దురాసదమ్‌,

తచ్ఛ్రుణో హ్యనవద్యాంగి కథ్యమానం మాయనఘే. 8

దేవతలకును సాధింపరాని ఈ రహస్యమును, నేను చెప్పుచున్నాను, సుందరీ! శ్రద్ధగా వినుము.

యే న హింసన్తి భూతాని స్వేదజోద్భిజ్జమండజాన్‌,

జరాయుజానాం శుద్ధాత్మా సర్వభూతదయాపరః,

యస్తు కోకాముఖే దేవి ధ్రువం ప్రాణాన్‌ పరిత్యజేత్‌. 9

స్వేదజములు (చెమటవలన పుట్టునవి) ఉద్భిజ్జములు, (విత్తనమును చీల్చుకొని పుట్టునవి) అండజములు (గ్రుడ్డునుండి పుట్టునవి) జరాయుజములు (రక్తశుక్లములకలయిక వలన పుట్టునవి) అను నాలుగు విధములైన ప్రాణులలో వేనిని హింసింపనివారు, శుద్ధమైన బుద్దిగలవారు, అన్ని ప్రాణులయందును జాలినిండుగా గలవారు, కోకాముఖక్షేత్రమున తుదిశ్వాస విడుచువారును....

మనసాపి న శక్నోతి మమ సల్లయతాం వ్రజేత్‌,

ఇతరులకు మనస్సుతోకూడ సాధ్యముకాని నాలో లీనమగుటను పొందుదురు.

తతో విష్ణువచః శ్రుత్వా సా మహీ సంశితవ్రతా,

వరాహరూపిణం దేవం ప్రత్యువాచ వసుంధరా. 10

అంత విష్ణునిపలుకు విని అతివిశుద్ధమైన వ్రతములుగల భూదేవి వరాహరూపుడగు ఆ విష్ణుదేవునితో మరల ఇట్లు పలికెను.

ధరణ్యువాచ - ధరణి పలికెను.

అహం శిష్యా చ దాసీ చ భక్తా చ త్వయి మాధవ,

ఏవం మే పరమం గుహ్యం మద్భక్త్యా వక్తు మర్హసి. 11

మాధవా! నేను నీకు శిష్యను, దాసిని, నీయందు భక్తురాలను. ఇట్టి పరమరహస్యములను నీవు నాకు చెప్పవలయును.

చక్రం వారాణసీం చైవ అట్టహాసం చ నైమిశమ్‌,

భద్రకర్ణహ్రదం చైవ కోకాం వై కిం ప్రశంనసి. 12

నీవు చక్రతీర్థమును, వారణాసిని, అట్టహాసమును, నైమిశమును, భద్రకర్ణమను మడుగును, కోకాముఖ తీర్థమును ఏల ప్రశంసింతువు?

సుగంధం చ ద్విరండం వై ముకుటం మణ్డలేశ్వరమ్‌,

కేదారం చ తతో ముక్త్వా కోకాం వై కిం ప్రశంససి. 13

సుగంధము, ద్విరండము, ముకుటము, మండలేశ్వరము కేదారము అను పుణ్య భూములను వదలి కోకాముఖము నేల కొనియాడుదువు?

దేవదారువనం ముక్త్వా తథా జాగేశ్వరం విభుమ్‌,

దుర్గం మహాలయం ముక్త్వా కోకాంవై కిం ప్రశంససి. 14

దేవదారువనము, జాగేశ్వరము, మహాలయదుర్గము అనుపుణ్యస్థలములను కాక కోకాముఖము నేల పెద్దగా చెప్పెదవు?

గోకర్ణం చ తతో గుహ్యం శుద్ధం జాలేశ్వరం తథా,

ఏకలిఙ్గం తతో ముక్త్వా కోకాం వై కిం ప్రశంససి. 15

గోకర్ణము, శుద్ధమగు జాలేశ్వరము, ఏకలింగము అనువానినిన వదలి కోకాముఖము నేల గొప్పగా చెప్పెదవు?

ఏవం పృష్ట స్తయా భక్త్యా మాధవశ్చాధ మాధవీమ్‌,

వరాహరూపీ భగవాన్‌ ప్రత్యువాచ వసుంధరామ్‌. 16

భక్తితో ఆమాధవి యిట్లడుగగా మాధవుడు వరాహరూపియగు భగవంతుడు వసుంధర కిట్లు బదులు చెప్పెను.

శ్రీ వరాహ ఉవాచ - శ్రీవరాహుడిట్లు పలికెను.

ఏవ మేతన్‌ మహాభాగే యన్మాం త్వం చారు భాషసే,

కథయిష్యామి తే గుహ్యం కోకా యేన విశిష్యతే. 17

పుణ్యాత్మురాలా! నీవు నన్ను అడిగినది మనోజ్ఞమైన విషయము. కోక ఏల అన్నింటికంటె మిన్న అయినదో ఆ రహస్యమును వివరించెదను.

ఏతే రుద్రాశ్రితాః క్షేత్రా యే త్వయా పరికీర్తితాః,

ఏతే పాశుపతాః శ్రేష్ఠా కోకా భాగవతస్య చ 18

నీవు ప్రశంసించిన క్షేత్రములన్నియు రుద్రునకు నిలయములగు పాశుపతక్షేత్రములు. శ్రేష్ఠములైనవి. కాని కోక భగవద్భక్తునకు సంబంధించినది.

అన్యచ్చ తే ప్రవక్ష్యామి మహాఖ్యానం వరాననే,

వృత్తం కోకాముఖే చైవ మమ క్షేత్రేషు సుందరి. 19

ఓవరాననా! సుందరీ! నీకు నాక్షేత్రములలో కోకాముఖమున జరిగిన ఒక గొప్ప వృత్తాంతమును వివరించెదను.

లుబ్ధో హ్యామిష మాహారం చరన్తం కోకమండలే,

అల్పోదకేషు తిష్ఠన్తం తతో మధ్యేన మత్స్యకమ్‌,

స తేనాపి ప్రబుద్ధేన విద్ధో మత్స్యః కదాచన. 20

ఒకప్పుడు ఒకబోయవాడు కోక మండలమున మాంసరూపమగు ఆహరమునకై తిరుగుచు కొంచెము పాటి నీరుగల మడువు నందు నడుమనున్న చేపను మెలకువతో కొట్టెను.

మత్స్యోధ బలవాం స్తత్ర లుబ్ధకస్యతు పాణితః,

దూరే చైవోద్ధృత స్తేన సతు మత్స్యో దిగంబరే. 21

బలముగల ఆ చేప బోయచేతినుండి తప్పించుకొని దూరమునకు దూకి పడెను.

శ్యేనో మన్త్రయతే హన్తుం నిఃశ్వసన్‌ ఖచర స్తథా,

సోపతత్‌ మమ క్షేత్రేషు కోకాయాంతు వసుంధరే,

శకస్య పుత్రో జాయేత రూపవాన్‌ బలవాన్‌ శుచిః. 22

ఒక డేగ ఊర్పులు పుచ్చుచు ఆకసమున తిరుగుచు ఆ చేపను చంప నుంకించెను. అప్పుడది నాక్షేత్రమగుకోకాముఖమున వ్రాలెను. అంతనది రూపము, బలము, పరిశుద్ధతకలదియై శకుడనువాని పుత్రుడై పుట్టెను.

అథ తస్య తు కాలేన కోకే కశ్చిత్‌ ప్రవర్తతే,

గృహ్య తన్మాంసభాగాని మృగవ్యాధః సమాగతః. 23

అంత కొంతకాలమునకు మృగముల వేటకాడొకడు కోకమున తిరుగుచు ఆమాంసభాగములను తీసికొని అచటకు వచ్చెను.

అథ చామిషలుబ్ధా వై చిహ్లీ వ్యచర దంబరే,

తస్మిన్‌ దేశే సమాగమ్య మాంసం హరితు మిచ్ఛతి. 24

అంత మాంసమును హరించుకోరిక గల ఆడుపిట్ట ఆకసమున నెగురుచు ఆతావునకు వచ్చి మాంసము నెత్తుకొని పోవుటకై చూచుచుండెను.

మృగవ్యాధేన సా చిహ్లీ మాంసగృధ్రాతి లాలసా,

ఏకేనైవతు బాణన సావై నిపతితా సహ. 25

ఆబోయవాడు మాంసము నెగురుగొట్టికొని పోవు ఆ పిట్టను ఒక్క బాణముతో నేలగూల్చెను.

ఆకాశాత్‌ పతితా భ##ద్రే కోకాయాం మమ మండలే,

జాతా చంద్రపురే శ్రేష్ఠా రాజపుత్రీ యశస్వినీ. 26

ఆకాశమునుండి నేలగూలిన ఆ పిట్ట నాక్షేత్రమగు కోకయందు పడి చంద్రపురమున చక్కని పేరు ప్రతిష్ఠలుగల రాజపుత్రియై పుట్టెను.

సా తు వివర్ధతే కన్యా చతుఃషష్టి కలాన్వితా,

రూప ¸°వనసంపన్నా పురుషం సా జుగప్సతి. 27

ఆమె చక్కగా పెరిగెను. అరువదినాలుగు కళలలో ఆరితేరెను. రూపము, ¸°వనము నిండుగా పొందెను. కాని మగవానిని చీదరించుకొనుచుండెను.

రూపవాన్‌ గుణవాన్‌ శూరో యుద్ధకార్యార్థనిష్ఠితః,

సౌమ్యశ్చ పురుషశ్చైవ సచ నేతి జుగుప్సతి. 28

రూపవంతుడు, గుణవంతుడు, శూరుడు, యుద్ధ తంత్రములలో నిలుకడకలవాడు, సౌమ్యుడు అయినను పురుషుని ఆమె కాదని ఏవగించుచుండెను.

అధ కేనచిత్కాలేన శకయానన్ద పూరకే,

సంబంధం జాయతే తేషాం మమేచ్ఛాయై వరాననే. 29

అంతకొంతకాలమునకు నాకోరికమేరకు, ఆనందపురమున శకునితో వారికి సంబంధము సాగెను.

ప్రాప్తేతు తావిహాన్యోన్యముభ యోశ్చైవ సుందరి,

యథాన్యాయం సవిప్రోక్తం విధిదృష్టేన కర్మణా. 30

అట్లు సంబంధము కలుగగా విధి విధానముననుసరించి వివాహము జరిగెను...

స చ తయా సమం నిత్యం సాచ తేన సమం శుభమ్‌,

అన్యోన్యాభిరమం శ్చైవ ముహూర్తే పి నముచ్యతే. 31

ఆతడామెతో, ఆమె అతనితో ఒక్కముహూర్తమైనను వేరుపడక పరస్పరానురాగముతో విహరించిరి.

ఏవం సుబహుధా కాలే గచ్ఛతే చ అనిన్దితే,

సా సత్ర్పేవ్ణూ చ సంయుక్తా సౌహృదేన చ నాయికా. 32

ఇట్లు వారికి ఏదోషములేకుండ పెద్ద కాలముగడచెను. నాయిక అతని యందు ప్రేమతో, స్నేహముతో కూడి యుండెను.

ఏవం చైవ సతౌతౌతు విశేషేణ సుసౌహృదమ్‌,

బహుచైవ గతః కాలః సమభోగేషు సక్తవాన్‌. 33

ఇట్లు వారిరువురు మిక్కిలి స్నేహముతో నుండగా సమభోగములతో కూడిన పెద్దకాలము గడచెను.

రాజపుత్రస్తతో ప్యత్ర శకానాం నన్దివర్ధనః,

తస్యజాయేత మధ్యాహ్నే శిరోరు గతి భీషణా. 34

శకులకానందము పెంపొందించు ఆరాజపుత్రునకు ఒకనాటి మధ్యాహ్నమున మిక్కిలి భయంకరమగు తలనొప్పి పుట్టెను.

యే కేచిద్‌ భిషజ స్తత్ర గదేషు కుశలాః శుభే,

తే తస్య సర్వ మాచష్టే న చ తిష్ఠతి వేదనా. 35

ఔషధములయందు మిక్కిలి నేర్పుగల వైద్యులందరు అతనికి అన్నిచికిత్సలు కావించిరి కాని వేదన తగ్గదాయెను.

ఏవం వై బహవః కాలాః సంజాతస్య తు గచ్ఛతి,

న సంబుధ్యతి చాత్మానం విష్ణుమాయా ప్రమోహితః. 36

ఇట్లు పెక్కు కాలములు గడచినవి. కాని అతడు విష్ణుమాయ చేత మోహితుడై తన్ను దానెరుగ కుండెను.

పూర్ణే హి సమయే యత్తు ఉభయోశ్చ తదన్తరమ్‌,

తస్య కాలః సంవృతస్య యోసౌ పూర్వప్రతిస్తవః. 37

చివరకు వారిరువురకు సమయము నిండెను. పూర్వజన్మజ్ఞానము కలుగు సమయ మాసన్నమాయ్యెను.

అధ కాలాన్తరే తేషాం వృత్తం కౌతూహలం విభో,

అన్యోన్య ప్రీతియుక్తే తు న విముచ్యేత వై తథా. 38

అట్లు కాలముగడువగా ఒకరియెడనకరికి మిక్కిలి ప్రేమగలవారిరువురు ఎడబాయక, జరిగినదేమో తెలియగోరిరి.

తం సర్వమనవద్యాజ్గీ భర్తు రేవం ప్రభాషతి,

కి మిదం తవ భద్రంతే వేదనా జాయతే శిరే.

ఏతదాచక్ష్వ తత్వేన యద్యహం చ తవ ప్రియా. 39

అప్పుడా పరమసుందరి నీకుతలయందు ఈ వేదన ఏలకలిగినది? నీకు నేను ప్రియనైనచో దీనినున్నదున్నట్లు నాకు చెప్పుమని భర్తనడిగెను.

బహవో భిషజశ్చైవ నానాశాస్త్ర విశారదాః,

కుర్వన్తి తవకర్మాణి శిరే తిష్ఠతి వేదనా. 40

పెక్కె శాస్త్రములలో ఆరితేరిన వైద్యులు పెక్కండ్రు నీకు చికిత్సలు చేయుచున్నారు. కాని తలయందు వేదన అట్లే యున్నది అనియు నడిగెను.

ఏవం స ప్రియయా ప్రోక్త స్తాం ప్రియాం పునరబ్రవీత్‌,

ఇతః కిం విస్మృతం భ##ద్రే సర్వవ్యాధి సమన్వితమ్‌,

లభ##తే జాతమాత్రేన దుఃఖేన చ సుఖేన చ. 41

ఇట్లు ప్రియురాలు పలుకగా ఆతడామెతో ఇట్లనెను. భద్రా! నీవు మరచితివేల? పుట్టుక మాత్రమున జీవి సర్వరోగములతో కూడి దుఃఖమనో సుఖమనో పొందుచుండును.

ఏవం జాతం వరారోహే మానుషత్వంచ సంహృతమ్‌,

సంసారసాగరారూఢం నాతిపృచ్ఛితు మర్హసి. 42

ఇట్లు జన్మమేర్పడినది. మనుష్యత్వము కూడ కలిగినది. సంసారమను సముద్రమున దిగబడితిమి. ఇంక ఎక్కువగా అడుగవలసిన పనిలేదు.

ఏవం సా తేన ప్రోక్తా తు శ్రోతుకామా వరాననా,

పక్షమాసగతే కాలే హ్యేతౌ తౌ శయనే గతౌ. 43

జాతకౌతూహలా క్షేత్రే పున రేవాన్వ పృచ్ఛత,

కథయస్వ తమేవార్థం యన్మయా పూర్వపృచ్ఛితమ్‌,

న హి త్వం భాషసే మాం చ ప్రియం జనమృతాకులమ్‌. 44

ఆతడామెతో ఇట్లు పలుకగా ఆమెకు మరియు వినవలయునను కుతూహలము కలిగినది. పక్షములు, నెలలుగా కాలము గడువగా వారిరువురు ఒకనాడు ఒకశయ్యపై నుండగా ఆమెకు మరల వేడుక పుట్టి మెల్లగా అడిగెను. నేను మునుపు అడిగిన విషయమునే చెప్పుము. నేను నీకు ప్రియమైనదానను కలతపడియుంటిని. నీవు నాకు దానిని చెప్పుకున్నావు.

గోప్యం వా కిఞ్చ దస్తీహ కిం గోపయసి మే పురః,

అవశ్యం చైవ వక్తవ్యం యద్యహం తవ వల్లభా. 45

ఇందు దాచదగినది ఏమైన కలదా? నాముందు దాచెదనేల? నేను నీకు ప్రియురాలనైనచో తప్పక చెప్పవలయును.

ఇతి నిర్బంధతః పృష్టః స శకాధిపతి ర్నృపః,

తాం ప్రియాం ప్రణయాత్‌ ప్రాహ బహుమానపురఃసరమ్‌,

ముచ్యతాం మానుషో భావ స్తాం జాతిం స్మర జన్మని. 46

అనిఒత్తిడిచేసి అడుగగా ఆ శకదేశపు రాజు ప్రణయముతో మన్ననతో ప్రియురాలి కిట్లు పలికెను. నీవు మానుషభావమును వదలుము. నీపూర్వపు జాతిని గుర్తు తెచ్చుకొనుము.

అథ కౌతూహలం భ##ద్రే మాతరం పితరం మమ,

మమ మాతా వరారోహే యేనాహం ధారితా వయమ్‌. 47

గత్వా కోకాముఖం హ్యేవం దేవానామపి దుర్లభమ్‌,

తంతు తే కథయిష్యామి సర్వవృత్త మనిన్దితే,

తతశ్చ మేనవద్యాంగి భర్తార మభిభాషత. 48

కాంతా! నీకు కోరికయున్నచో నాతల్లిదండ్రుల అనుమతికొనుము. ముఖ్యముగా నన్ను పెంచి పెద్దచేసిన తల్లికి చెప్పుము. దేవతలకును లభింపని కోకాముఖమున కరిగి అచట నీకు సర్వవృత్తాంతమును చెప్పుదును. అనగా ఓ భూదేవీ! ఆమె భర్త మాట కట్లే యని బదులు చెప్పెను.

ఉభౌ తౌ చరణౌ గృహ్య శ్వశ్రూం శ్వశుర మబ్రవీత్‌,

గన్తు మిచ్ఛామహే తత్ర పుణ్యం కోకాముఖం మహత్‌. 49

ఆమె అత్తమామల చరణములు పట్టుకొని పుణ్యమైనది, గొప్పదియగు కోకాముఖమున కరుగ గోరుచున్నాము.

కార్యగౌరవభావేన ననిషేధ్యౌ కథంచన,

అద్య యావత్‌ కిమపి వాం యాచితం నమయా క్వచిత్‌. 50

పని దొడ్డది యగుటచేత మమ్ము మీరు వలదనరాదు. ఇంతవరకు ఎన్నడును మిమ్ము నేనేమియు అడుగలేదు.

పురస్తాద్‌ యువయో స్తన్మే యాచితం దాతు మర్హతః,

శిరో వేదనయా యుక్తః సదా తవ సుతోహ్యయమ్‌. 51

మీముందు నిలిచి నేనడిగిన ఈ యొక్క కోరికను మీరు తీర్పవలయును. ఈ మీకుమారుడు ఎల్లకాలము తలనొప్పితో బాధపడుచున్నాడు.

మధ్యాహ్నే మృతకల్పో వై జాయతే హ్యచికిత్సకమ్‌,

సుఖాని సర్వవిషయాన్‌ విసృజ్య పరిపీడితః. 52

చికిత్సలేని బాధతో మధ్యాహ్నకాలమునందు మరణించినట్లే యగుచున్నాడు. సుఖములను, సర్వవిషయములను వదలి పరమవేదన పడుచున్నాడు.

కోకాముఖం వినా కష్టం ననివృత్తం భవిష్యతి,

కదా చిన్నోక్తపూర్వం తే రహస్యం పరమం శుభమ్‌. 53

కోకాముఖమున కరుగక కష్టము మరలదు. మీకింతకు పూర్వమీ పరమరహస్యమును నేను చెప్పలేదు.

త్వరితం గన్తు మిచ్ఛామి విష్ణోస్తు పరమం పదమ్‌,

దమ్పతీ త్విహ గచ్ఛామి స్థానం పరమ ముత్తమమ్‌. 54

ఆ విష్ణుని పరమ పదమునకు, పరమోత్తమస్థానమునకు మాదంపతులము త్వరగా పోగోరుచున్నాము.

తతో వధూవచః శ్రుత్వా శకాదిపృథివీపతిః,

కరేణ స్వయ మాదాయ వధూం పుత్ర మువాచ హ. 55

అంత కోడలిమాట విని శకాధిపతి చేతితో కోడలిని. కొడుకును స్పృశించి యిట్లు పలికెను.

కిమిదం చిన్తితం వత్స కోకాముఖ్యాశ్రమంప్రతి,

హస్త్యశ్వరథయానాని స్త్రియ శ్చాప్సరసోపమాః. 56

సర్వమేతత్తు సప్తాంగం కోశకోష్ఠాది సంయుంతమ్‌,

సరత్ననిచయం రాజ్యం సర్వం త్వయి నివర్తితమ్‌. 57

నాన్నా! ఇదిఏమి? కోకాముఖాశ్రమమును గూర్చి తలపోసితివేమి? ఏనుగులు, గుఱ్ఱములు, రథములు, ఇతర వాహనములు, అప్సరసలవంటి స్త్రీలు, ఏడు అంగములుగలిగి, కోశము మున్నగుదానిలో కూడినది, రత్నములప్రోవులు కలదియునగు రాజ్యమంతయు నీయందు నెలకొని యున్నది.

మిత్రా వరాసనం చైవ గృహ్ణ పుత్ర మమోత్తరమ్‌,

త్వయి ప్రతిష్ఠితాః ప్రాణాః సంతానం చ తదుత్తమమ్‌. 58

నా శ్రేష్ఠమగు సింహాసనమును, మిత్రులను నాసర్వమును గ్రహింపుము. నా ప్రాణములు నీయందు నెలకొనియున్నవి. నీవు నా ఉత్తమసంతానమవు.

తతః పితుర్వచః శ్రుత్వా పుత్రో రాజ్ఞో యశస్విని,

పితరం చరణౌ గృహ్య ప్రత్యువాచ పునస్తతః. 59

అంత తండ్రిమాట విని ఆ కుమారుడు, తండ్రి పాదములు పట్టుకొని యిట్లు బదులు పలికెను.

అలంరాజ్యేన కోశేన వాహనేన బలేన చ,

గంతు మిచ్ఛామి తత్రాహం శీఘ్రం కోకాముఖం మహత్‌. 60

తండ్రీ! నాకు రాజ్యము, కోశము, వాహనము, బలము వలదు. వెనువెంటనే నేను కోకాముఖమున కరుగగోరుచున్నాడను.

శిరోవేదనయా యుక్తో యది జీవామ్యహం పితః,

తదా రాజ్యం బలం కోశో మమై వేత న్న సంశయః,

తత్రైవ గమన్మహ్యం వేదనానాశ మేష్యతి. 61

తలనొప్పితోనున్న నేను బ్రదుకుదునేని, తండ్రీ! అప్పుడు రాజ్యము, సేన, ధనాగారము అన్నియు నావే. సంశయము లేదు. అచటకుద పోయిననే నాతలనోప్పి నాశనమగును.

తథా వై ధార్యమాణోసౌ తిష్ఠతే సర్వకర్మవిత్‌,

పిత్రా తతో నుజ్ఞాతో వై గచ్ఛ పుత్ర నమోస్తు తే. 62

అట్లు పలికి సర్వకార్యము లెరిగిన ఆ కుమారుడు తండ్రి పాదములు పట్టి నిలిచియుండెను. అంత తండ్రి అతనితో పుత్రా! అరుగుము. నీకు మేలగుగాక అని అనుమతించెను.

వణిజః పౌరవాశ్చైవ వైశ్యాశ్చైవ వరాంగనాః,

అగమన్‌ రాజపుత్రం యః కోకాముఖపథం స్థితాః 63

వర్తకులు, పురజనులు, వైశ్యులు, ఉత్తమస్త్రీలును కోకాముఖమార్గమున నిలిచిన రాజకుమారుని కడ కరుదెంచిరి.

అథ దీర్ఘేణ కాలేన ప్రాప్తా కోకాముఖాంతికమ్‌,

యత్త్వయా పృచ్ఛితం పూర్వం రహస్యం కథయేన్మమ. 64

అంత పెద్ద కాలమునకు వారందరు కోకాముఖముకడకు వచ్చిరి. అంత ఆయింతి భర్తను నేనడిగిన రహస్యమును చెప్పుమని కోరెను.

ఏవ మేవ ప్రియాప్రోక్తో రాజపుత్రో యశస్విని,

ప్రహస్య ప్రియ మాలిఙ్గ్య ప్రత్యువాచ ప్రియాం తథా. 65

ఇట్లు ప్రియురాలు పలుకగా ఆరాజపుత్రుడు నవ్వి ప్రియురాలిని కౌగిలించుకొని ఆమెతో ఇట్లనెను.

సుఖం స్వప వరారోహే ఇహైకాం రజనీం ప్రియే,

కాలం తే కథయిష్యామి యచ్చ స్యాత్‌ తే మనీషితమ్‌. 66

వరారోహా! ఒకరాత్రి యిచట సుఖముగా నిద్రింపుము. నీవుకోరినదానిని రేపు నీకు చెప్పెదను.

తతః ప్రభాతే శర్వర్యాం స్నాతౌ క్షేమవిభూషితౌ,

ప్రణమ్య శిరసా విష్ణుం గృహ్య తతః ప్రియామ్‌. 67

తతః పూర్వోత్తరే పార్శ్వే నిత్యం యా హృది తిష్ఠతి,

పశ్చాత్‌ పూర్వేణ పార్శ్వేణ భూమిం తత్ర నిఖానయేత్‌. 68

అంత తెల్లవారినంతనే వారిరువురు స్నానము చేసి పట్టువస్త్రములు తాల్చి తలతో విష్ణువునకు మ్రొక్కిరి. అంత ఆ రాజకుమారుడు ప్రియురాలిని చేతితో పట్టుకొని ఈశాన్యదిక్కుగా కొనిపోయి అటనుండి తూర్పునకు నడిపించి తనహృదయమున చక్కగా గుర్తున్న ఒకతావుకడ భూమిని త్రవ్వెను.

అస్థీని తత్ర దృశ్యన్తే అవశేషాని యే క్వచిత్‌,

ఏతాని మమ చాస్థీని పూర్వకాని వరాననే. 69

అందొకచోట మిగిలియున్న ఎముకలు కానవచ్చెను. వరాననా! ఇవి నా పూర్వజన్మము అస్థికలు అని చెప్పెను.

అహం మత్స్యో హి కోకే తు విచరామి జలేషు వై,

వ్యాధేన నిగృహీతోస్మి బడిశేన జలేచరః,

తద్ధస్తా న్నిర్గత స్తత్ర బలేన పతితో భువి. 70

నేనొక చేపను కోకము నీళ్లయందు తిరుగుచుండెడివాడను. నన్నొక బోయవాడు గాలమువైచి పట్టుకొనెను. నేను వానిచేతినుండి తప్పించుకొని యీనేలపై పడితిని.

శ్యేనే నామిషలుబ్దేన నఖై ర్వద్ధోస్మి సుందరి,

స నిరస్థితమం కర్తుం శ్యేనేనాహిషలోలుపి,

ఆకాశాత్‌ పతితో స్మాహ మిదం వా పశ్య సుందరి. 71

మాంసమున ఆసగొన్న ఒకడేగ గోళ్లతో చీల్చినది నా ఎముకలు లేకుండ చేయగోరినది... అప్పుడు నేనాకాశమునుండి వ్రాలితిని. ఇదిగోచూడు...

తేన తస్య ప్రహారేణ జాతా శిరసి వేదనా,

అహమేవ విజానామి న కశ్చాన్యో విజానతి. 72

దాని ఆదెబ్బకు నాకు తలపోటు కలిగినది. ఇది నేను మాత్రమే ఎరుగుదును. మరియెవ్వడును ఎరుగడు.

ఏతత్‌ తే కథితం భ##ద్రే యత్త్వయా పూర్వపృచ్ఛితమ్‌,

గచ్ఛ సుందరి భద్రం తే యత్ర తే వర్తతే మనః. 73

నీవు నన్ను మున్నడిగిదానిని చెప్పితిని. సుందరీ! నీకు మేలగుగాక! నీకు బుద్ధి పుట్టినచోటికరుగుము.

తతస్తస్యానవద్యాంగీ రక్తపద్మశుభాననా,

కరుణం స్వరమాదాయ భర్తారం పునరబ్రవీత్‌. 74

అంత ఎఱ్ఱని పద్మమువంటి మంచిమొగము గల ఆ నిర్మలాంగి జాలిగొలుపు కంఠస్వరముతో భర్త కిట్లనెను.

ఇత్యర్థంచ మయాభద్ర పరం గుహ్యం మహోత్తమమ్‌,

నత్వయా కథితం హీదం కర్మమోహాత్మ కారణమ్‌. 75

భద్రా! నీవు మిక్కిలి రహస్యమగు ఉత్తమవిషయమును నాకు చెప్పితివి. కాని ఈ కర్మమోహమునకు కారణమైన దానిని నేను నీకు చెప్పలేదు.

అహం చ యాదృశీ భద్ర పురా ఆసీద్‌వ్యవస్థితా,

క్షుత్పిపాసా పరిశ్రాన్తా నైనం ప్రాప్తా స్మి మాధవమ్‌,

వృక్షోపరిసమాసీనా భక్ష్యం చైవ విచిన్వతీ. 76

నేనెట్టిదాననో, మునుపు ఏవిధముగా నుంటినో చెప్పెదను. వినుము. ఆకలిదప్పులతో అలసతనొంది నేఎన్నడు మాధవుని కడకు రాలేదు. చెట్టుపై కూర్చుండి తిండిని వెదకుచు నుంటిని.

అథ కశ్చి న్మృగవ్యాధో హత్వా వనచరాన్‌ బహూన్‌,

సంగృహ్య మాంసభారాణి ఇదం పార్శ్వం ప్రచక్రమే. 77

అంతనొకబోయవాడు అడవిమృగములను పెక్కింటిని చంపి మాంసపు మోపులను కూడబెట్టుకొని ఈ ప్రక్కల తిరుగుచుండెను.

స్దాపయిత్వా మాంసభారాన్‌ క్వచిత్‌ కాష్ఠం సమాహరేత్‌,

అహం చరామి చాకాశే మార్గ మాదాయ చామిషమ్‌,

క్షుత్పిపాసా పరిశ్రాన్తా కించిన్‌ మాంసాని ఛిన్దతీ. 78

అతడు మాంసపు మోపులను ఒకచోటనుంచి కట్టెలను తెచ్చుచుండెను. నేనంత ఒక మృగమాంసమును చిక్కించుకొని ఆకాశమున తిరుగుచుంటిని. ఆకలిదప్పులకు అలసినదానవై మరియు మాంసములను చీల్చుచుంటిని.

తత ఆధార్య కాష్ఠాని ప్రజ్వాల్య చ హుతాశనమ్‌,

పచత స్తత్ర మాంసాని క్షుత్పిపాసా పిరిష్కృతమ్‌. 79

అంత ఆ బోయ కట్టెలు పేర్చి అగ్నిని దరికొల్పెను. ఆకలిదప్పులను తీర్చుకొనుటకై ఆ మాంసములను వండుచుండెను.

తతో వృక్షం సమాసాద్య పశ్యతీ మాంసగృద్ధితా,

పతితాస్మి తత స్తత్ర యత్రాసౌ పచ్యతే మిషమ్‌. 80

అంత నేనొక చెట్టెక్కి మాంసమునందు ఆశతో చూచుచు ఆతడు మాంసమును వండుచున్నచోట పడితిని.

అప్రమానం మయా మాంసో విద్ధో వజ్రమయై ర్నఖైః,

న చ శక్తాస్మి సంహర్తుం మాంసభారప్రపీడితా. 81

మోయలేని బరువు గల మాంసమును నేను వజ్రమయములగు గోళ్ళతో చీల్చుచుంటిని. ఆబరువుతో పీడనొంది నేను బయటపడుటకు చాలకుంటిని.

నదూరం గమితా తత్ర చాల్పస్థానే వ్యవస్థితా,

భక్షయిత్వా తతో మాంసం ప్రహృష్టే నాంతరాత్మనా. 82

ఎక్కువదూరము పోజాలక కొంచెము దగ్గరగా నిలిచియుంటిని. పొంగిపోయెడు మస్సుతో ఆ మాంసమును తినుచు నిలిచితిని.

ఏవంతు భక్షయన్తీం మాం మాంసభక్ష పరాజితామ్‌,

లక్ష్మితాస్మి చవ్యాధేన క్రుద్ధే నామిషకాంక్షి ణా. 83

మాంసపుతిండితో ఒడలెరుగని నన్నాతడు చూచెను. క్రుద్ధుడై మాంసమును మరల పొందగోరి నన్నావ్యాధుడు పరికించెను.

తతః సధను రుదమ్య బాణం గృహ్య మమాంతికమ్‌,

పాతితాస్మి తతస్తేన ఖాదన్తీ మాంసపిణ్డకమ్‌. 84

అంత ఆతడు విల్లెత్తి బాణమును నాపై వైచెను. మాంసము ముక్కతినుచున్న నేను వానిచేత నేలగూలితిని.

తతోహం భ్రమమాణా వై నిశ్చేష్టా గతమానసా

పతితాస్మి అహంభద్ర కాలతంత్రే దురాసదే. 85

అంతనేను గిలగిలగొట్టుకొనుచు చేష్టలుడిగి, బుద్ధి తప్పి దాటశక్యముకాని కాలతంత్రమున పడితిని.

అస్య క్షేత్రప్రభావేన అకామాపి నృపాత్మజా,

జాతాస్మి త్వత్ర్పియా చాపి న్మరన్తీ పూర్వజన్మ తత్‌. 86

ఈ క్షేత్రము మహిమ వలన నేను కోరుకొనక పోయినను రాజపుత్రివై పుట్టి నీకు ప్రియ నైతిని. పూర్వజ్మమునుకూడ స్మరించుచుంటిని.

అస్థీని పశ్య మే తాని తతః శేషాణి యే చ మే,

జీర్ణాని దీర్ఘకాలేన యే కేచిత్‌ పరినిష్ఠితా. 87

ఇవిగో మిగిలిన నా ఎముకలను చూడుము. పెద్దకాలమునకు జీర్ణించియు కొన్ని మిగిలియున్నవి.

ఏవంతు దర్శయిత్వా వై భర్తారం పున రబ్రవీత్‌,

ఆనీతో సి మయాభద్ర స్థానం కోకాముఖం ప్రతి. 88

ఇట్లు భర్తకు వానిని చూపి అతనితో మరల నిట్లనెను. పుణ్యాత్ముడా! నన్ను కోకాముఖముకు తోడితెచ్చతివి.

యస్య క్షేత్ర ప్రభావేన తిర్యగ్యోనిగతా వయమ్‌,

జాతా వై మానుషీం సంజ్ఞా ముత్తమేషు కులేషుచ. 89

ఈ క్షేత్రము ప్రభావము వల పశుపక్షిజన్మములు గలమనము మనుష్యజాతియందు, ఉత్తమకులములయందు పుట్టితిమి.

యం యం వక్ష్యసి కల్యాణం విష్ణుప్రోక్తం యశోధన,

తానహం కారయిష్యామి విష్ణులోకే సుఖావహే. 90

ఓయి యశోధనా! విష్ణువు చెప్పిన శుభ##మైనదానిని నీవు దేనిని నాకుపదేశింతువో అదియెల్ల ను సుఖమునకు తావలమగు ఈ విష్ణు స్థానమున ఆచరింతును.

తత స్తస్యా వచః శ్రుత్వా ఆగతోయం పురాగతిమ్‌,

విస్మయం పరమం గత్వా సాధు సాధ్వితి సోబ్రవీత్‌. 91

అంత ఆమె మాటను విని పూర్వవృత్తమును స్మరించి ఆతడు మిక్కిలి ఆశ్చర్యము పొంది 'బాగుబాగు' అనిపలికెను.

శ్రుత్వా వై క్షేత్ర కర్మాణి స తస్యా వచనం మహత్‌,

తేపి కుర్వన్తి కర్మాణి యస్య యస్యావరోచతే. 92

క్షేత్రమునందలి విధులను విని, ఆమెపలికిన గోప్పమాటు ఆలకించి వారితో వచ్చి వారును వారివారికి రుచించిన విధానములను ఆచరించిరి.

కేచి చ్చాంద్రాయణం కుర్యుః కేచిచ్చజలజాసనమ్‌,

యే చ విష్ణుమాయాః కర్మా స్తాన్‌ సదైవ సమాచరేత్‌. 93

కొందరు చాంద్రాయణ వ్రతమును ఆచరించిరి. కొందరు పద్వాసనము వేసికొని ధ్యానము చేసిరి. అట్లు విష్ణుమయములగు కర్మములను వారు నిరంతరము చక్కగా పాటించిరి.

బహుధాన్యవరం రత్నం దంపత్యోథ యశస్విని,

తేపి కుర్వన్తి కర్మాణి సమం భక్త్యా వ్యవస్థితాః. 94

గొప్పధాన్య సంపదయు, ధనసంపదయు కల వారయ్యు ఆ దంపతులు చెదరని మహాభక్తి కలవారై పెక్కు వ్రతములను ఆచరించిరి.

తేపి దీర్ఘేణ కాలేన అటమానాత్మనిః కృతిమ్‌,

కుర్వన్తో ధర్మకర్మాణి భావ్యం పంచత్వమాగతాః. 95

అట్లు వారందరు పెద్ద కాలము తమ పాపములను తొలగించుకొనువారై ధర్మకార్యములను చేయుచు చనిపోయిరి.

తతః క్షేత్ర ప్రభావేణ మమ కర్మప్రభావతః

మమ చైవ ప్రసాదేన శ్వేతద్వీపముపాగతాః 96

అంత క్షేత్ర మహిమచేతను, ఆపూజలప్రభావము వలనను వారు శ్వేతద్వీపమున కరిగిరి.

ఏవం సరాజపుత్రో వై సర్వభూతగుణాన్వితః,

ముక్త్వా తు మానుషం భావ మూర్ధ్వ శాఖో పతిష్ఠతి. 97

ఇట్లా రాజపుత్రుడు సర్వభూతముల గుణములతో కూడినవాడై మనుష్యభావమును వదలి పైమెట్టునందు స్థిరముగా నిలిచెను.

యోసౌ పరిజనస్తస్య మమ కర్మవ్యవస్థితః,

మానుషం భావ ముత్సృజ్య మమ లోక ముపాగతః,

సర్వశో ద్యుతిమాం స్తత్ర ఆత్మనా ఆత్మదర్శనాత్‌. 98

నా వ్రతములయందు నిష్ఠగల ఆతని పరిజనము కూడ మనుష్య భావమును వదలి చక్కని తేజస్సు కలదియై ఆత్మతో ఆత్మదర్శనము చేసికొన్న కారణముగా నాలోకమునకు చేరెను.

యాశ్చ తత్ర స్త్రియః కాశ్చిత్‌ సర్వాశ్చోత్పల గన్ధినీః,

మాయాయా మతిమాన్‌ ముక్తః సర్వే చైవ శ్రియావృతాః 99

అచటనున్న స్త్రీలందరు కలువలసువాసనలు కలవారై మాయను వదలి కాంతులు క్రమ్ముకొన్నవారైరి.

ఏవం మత్స్య శ్చ చిల్లీచ సకామా యే సమాగతాః,

ప్రసాదాన్మమ సుశ్రోణి శ్వేతద్వీప ముపాగతాః. 100

ఇట్లు చేపయు, చిల్లియు సాధారణమగు కోరికలు కలిగినవయ్యు ఆక్షేత్రముకు వచ్చి నా అనుగ్రహమువలన శ్వేతద్వీపమునకు చేరుకొనెను.

ఏష ధర్మశ్చ కీర్తిశ్చ శకానాం చ మహద్యశః,

కర్మణాం కర్మ చ శ్రేష్ఠం తపసాం చ మహత్తపః. 101

ఇది ధర్మము, ఇదికీర్తి. ఇది శకుల గొప్ప యశస్సు, కర్మములలో శ్రేష్ఠమగు కర్మము తపస్సులలో గొప్పదియగు తపస్సు.

ఆఖ్యానాం పరమాఖ్యానం ద్యుతీనాం చ మహద్ధ్యుతిః,

ధర్మాణాం చ పరోధర్మ స్తవార్థం కీర్తితో మయా. 102

కథలలో ఉత్తమకథ, వెలుగులలో గొప్ప వెలుగు. ధర్మములలో పరమధర్మము. వసుంధరా! దీనిని నీకై వర్ణించితిని.

క్రోధనాయ న తం దద్యా న్మార్ఖాయ పిశునాయ చ,

అభక్తాయ న తం దద్యా దశ్రద్ధాయ శఠాయచ. 103

కోపిష్ఠి, మూర్ఖుడు, పిసినిగొట్టు, భక్తిలేనివాడు, శ్రద్ధలేనివాడు, మొండివాడు - అనువీరికి దీనిని ఒసగరాదు.

దీక్షితాయ చ దాతవ్య ముపపన్నాయ నిత్యశః,

పండితాయ చ దాతవ్యం యశ్చ శాస్త్ర విశారదః. 104

దీక్షితునకు, నాయందు ప్రపన్నభావము కలవానికి, జ్ఞానము కలవానికి, శాస్త్రములలో నిండైన ప్రజ్ఞకలవానికి దీనినొసగవలయును.

ఏత స్మరణకాలేపి ధారయేద్‌ యః సమాహితః,

సోపి ముచ్యేత పూతాత్మా గర్భయోనిభవాద్‌ భయాత్‌.

ఏతత్‌ తే కథితం భ##ద్రే మహాఖ్యానం మహౌజసమ్‌. 105

మరణకాలమందు చెదరని హృదయముతో దీనిని పట్టుకొనువాడు పవిత్రమగు ఆత్మ కలవాడై గర్భవాసపు భయమునుండి విడుదల పొందును. సుందరీ! గొప్పశక్తిగల ఈ మహాఖ్యానమును నీకు వివరించితిని.

య ఏతేన విధానేన గత్వా కోకాముఖం మహత్‌,

తే పి యాన్తి పరాం సిద్ధిం చిల్లీ మత్స్యౌ యథా పురా. 106

ఈ విధముగా ప్రతిష్ఠగల కోకాముఖమున కరిగిన వారు చిల్లియు, చేపయు మున్ను సిద్ధిపొందినవిధముగా పరమసిద్ధిని పొందుదురు.

ఇతి శ్రీవరాహ పురాణ భగవచ్ఛాస్త్రే ఏకవింశత్యధికశతతమోధ్యాయః

ఇది శ్రీవరాహపురాణమను భగవచ్ఛాస్త్రమున నూటయిరువది యొకటవ అధ్యాయము.

Varahamahapuranam-1    Chapters