Varahamahapuranam-1    Chapters   

ఏకాదశాధిక శతతమోధ్యాయః - నూటపదునొకండవ అధ్యాయము

హోతా ఉవాచ - హోత చెప్పెను.

అతః పరం మహారాజోభయముఖ్యాః సమాసతః,

విధానం యద్‌ వరాహేణ ధరణ్యాః కథితం పురా,

తదహం సంప్రవక్ష్యామి తవ పుణ్యఫలం చ యత్‌. 1

మహారాజా! ఇటుపై వరాహదేవుడు భూదేవికి మునుపు చెప్పిన ఉభయముఖ్యములగు ధర్మములను చెప్పెదను. అది నీపుణ్యఫలమును అగును. (ఉభయములు - పరము, ఇహము.)

ధరణ్యువాచ - ధరణి పలికెను.

యా త్వయా కపిలా నామ పూర్వముత్పాదితా ప్రభో,

హోమధేనుః సదా పుణ్యా సా జ్ఞేయా కతిలక్షణా. 2

ప్రభూ! నీవు మునుపు కపిలను సృజించితివి. ఆహోమధేనువు ఎల్లవేళల పుణ్యఅయినదిగా తెలియదగినది. దానికెన్ని లక్షణములు?

కియత్యః కపిలాః ప్రోక్తాః స్వయమేవ స్వయంభువా,

ప్రసూయమానా దానేన కింపుణ్యా స్యాచ్చ మాధవ,

ఏత దిచ్ఛామ్యహం శ్రోతుం విస్తరేణ జగద్గురో! 3

ఓ జగద్గురూ! మాధవా! స్వయంభువు స్వయముగా ఎన్నివిధములగు కపిలగోవులను వక్కాణించెను? ఈనుచున్న కపిలను దానము చేయుటవలన కలుగు పుణ్యమెట్టిది? దీనిని సవిస్తరముగా వినగోరుచున్నాను.

శ్రీవరాహ ఉవాచ - శ్రీవరాహదేవు డిట్లు పలికెను.

శృణుష్వ భ##ద్రే తత్త్వేన పవిత్రం పాపనాశనమ్‌,

యచ్ఛ్రుత్వా సర్వపాపేభ్యో ముచ్యతే నాత్ర సంశయః. 4

భద్రురాలా! తత్త్వపూర్వకముగా చెప్పెదను. వినుము. ఇది పవిత్రమైనది. పాపములను నశింపజేయునది. దీనిని విని సర్వపాపములనుండియు మానవుడు ముక్తుడగును. సంశయము లేదు.

కపిలా అగ్నిహోత్రార్థే యజ్ఞార్థే చ వరాననే,

ఉద్ధృత్య సర్వతేజాంసి బ్రహ్మణా నిర్మితా పురా. 5

వరాననా! అగ్నిహోత్రముకొరకును, యుజ్ఞముకొరకును సర్వతేజస్సులను పైకితెచ్చి బ్రహ్మను మునుపు కపిలను సృజించెను.

పవిత్రాణాం పవిత్రంచ మంగలానాం చ మంగలమ్‌,

పుణ్యానాం పరమం పుణ్యం కపిలా చ వసుంధరే! 6

వసుంధరా! కపిల పవిత్రములలో పవిత్రము. మంగళము లలో మంగళము. పుణ్యములలో పుణ్యము.

తపసాం తప ఏనాగ్రం వ్రతానా ముత్తమం వ్రతమ్‌,

దానానా ముత్తమం దానం నిధీనాం హ్యేత దక్షయమ్‌. 7

తపస్సులలో మిన్నయగు తపస్సు, వ్రతములలో ఉత్తమ మగువ్రతము. దానములలో ఉత్తమమగు దానము. నిధులలో ఇది తరుగుపోనిది.

పృథివ్యాం యాని తీర్థాని గుహ్యా న్యాయతనాని చ,

పవిత్రాణి చ పుణ్యాని సర్వలోకేషు సుందరి. 8

భూమియందుగల సర్వతీర్థములతో, అందరకు తెలియరాకుండు పవిత్ర స్థలములతో, సర్వపవిత్రములతో, సర్వలోకముల పుణ్యములతో ఇది సాటి యగును.

హోతవ్యా న్యగ్నిభోత్రాణి సాయంప్రాత ర్ద్విజాతిభిః,

కపిలాయ ఘృతేనేహ దధ్నా క్షీరేణ వా పునః. 9

బ్రాహ్మణులు సాయంకాలములలో ప్రాతఃకాలములలో చేయు అగ్నిహోత్రములను కపిలగోవు నేతితో గాని పెరుగుతోగాని పాలతోగాని అర్చింపవలయును.

జుహ్వతే హ్యగ్నిహోత్రాణి మన్త్రైశ్చ వివిధైః సదా,

పూజయ న్నతిథీంశ్చైవ పరాం భక్తి ముపాగతాః,

తే యా న్త్యాదిత్యవర్ణైశ్చ విమానై ర్ద్విజసత్తమాః. 10

పెక్కువిధములగు మంత్రములతో ఎల్లవేళల అగ్నిహోత్రము లను పూజించువారును, మిక్కిలి భక్తితో అతిథులను అర్చించు వారును అగు ఉత్తమ బ్రాహ్మణులు సూర్యునివంటి వన్నెకల విమానములతో విహరింతురు.

సూర్యమండలమధ్యేన బ్రహ్మణా నిర్మితా పురా,

కపిలా యా పింగలాక్షీ సర్వసౌఖ్యప్రదాయినీ,

సిద్ధిబుద్ధిప్రదా ధేనుః కపిలానన్తరూపిణీ. 11

మునుపు బ్రహ్మ సూర్యమండలమునడుమ, గోరోచనము రంగు కన్నులుగలదియు, సర్వసౌఖ్యములను ప్రసాదించునదియు, సిద్ధిబుద్ధుల ననుగ్రహించునదియు, అనంతరూపములు గలది యునునగు కపిలధేనువును నిర్మించెను.

ఏకాదశీ సమాఖ్యాతాః కపిలాస్తే వరాననే,

సర్వహ్యేతా మహాభాగా స్తారయన్తి నసంశయః,

సంగమేషు ప్రశస్తాశ్చ సర్వపాపప్రనాశినీః. 12

వరాననా! ఈకపిలలు పదునొకండు విధములు. ఇవి యన్నియు గొప్పమహిమకలవి. తరింపజేయునవి. సంశయము లేదు. నదీసంగమములలో దానములకు ప్రశస్తములయినవి. పాపముల నన్నింటిని పోకార్చునవి.

అగ్నిపుచ్ఛా అగ్నిముఖా అగ్నిలోమానలప్రభా,

తధాగ్నేయీ సదా దేవీ సువర్ణాఖ్యా ప్రవర్తతే. 13

అగ్నిపుచ్ఛ (అగ్నివంటితోక కలది.) అగ్నిముఖ (అగ్నివంటి ముఖము కలది.) అగ్నిలోను (అగ్నివంటి వెంట్రుకలు కలది), అనలప్రభ (అగ్నివంటి కాంతి గలది) ఆగ్నేయి (అగ్నిలక్షణములు కలది) సువర్ణాఖ్య (బంగారువంటి వన్నెకలది.) అని కపిలలో పెక్కువిధములైనవి కలవు.

గృహీత్వా కపిలాం శూద్రః కామతః సదృశీం పిబేత్‌,

అతీతః సద్విజాతీనాం చండాలసదృశోహి సః. 14

కపిలను కైకొని ఇష్టమువచ్చినట్లు పాలుపిండుకొని త్రావు శూద్రుడు ద్విజులందరకు పనికిరానివాడు. అతడు చండాల సదృశుడు.

తస్మాన్నప్రతిగృహ్ణీయా చ్ఛూద్రాద్విప్రః ప్రతిగ్రహమ్‌,

దూరతః పరిహర్తవ్యాః శ్వానస్తు క్షమినాం వరే. 15

కావున శూద్రునినుండి విప్రుడు కపిలగోవులను దానము పుచ్చుకొనరాదు. వానిని కుక్కలనువలె దూరముగా తొలగించ వలయును.

సర్వకాలేహి సర్వేవై వర్జితాః పితృదైవతైః,

అసంభాష్యాప్రతిగ్రాహ్యాః శూద్రాస్తే పాపకర్మిణః. 16

ఆ విధముగా కపిలలను పీకుకొని బ్రదుకు పాపకర్ములగు శూద్రులను పర్వసమయములలో విడిచిపెట్టవలయును. వారితో మాటాడరాదు. వారినుండి దానములు కొనరాదు.

పిబన్తి యావత్‌ కపిలాం తావత్తేషాం పితామహః,

భూమేర్మలం సమశ్నన్తి జాయన్తే విడ్భుజ శ్చిరమ్‌. 17

కపిలాక్షీరమును ఎంతకాలము త్రావుదురో అంతకాలము వారి తాతలు పురుగులై మట్టిమలమును తినుచుందురు.

తాసాం క్షీరం ఘృతం వాపి నవనీత మథాపి వా,

ఉపజీవన్తి యేశూద్రా స్తేషాం గతిమతః శృణు. 18

కపిలగోవుల పాలు, నెయ్యి, వెన్న అనువానితో జీవనము పుచ్చువారి గతియెట్టిదో వినుము.

కపిలోపజీవినః శూద్రాః క్రూరా గచ్ఛన్తి రౌరవమ్‌,

రౌరవేషు చ పచ్యన్తే వర్షకోటిశతం ధరే. 19

కపిలగోవులపై ఆధారపడి బ్రదుకు వారు క్రూరులై రౌరవ నరకమున కరుగుదురు. అందు నూరుకోట్ల ఏండ్లు పాతకమను భవింతురు.

తతో విముక్తాః కాలేన శ్వానయోనిం ప్రజన్తి తే,

శ్వాసయోన్యా విముక్తాస్తు విష్ఠాయాం జాయతే కృమిః. 20

కొంతకాలమునకు దానినుండి విముక్తులై కుక్కకడుపున కరుగుదురు. అటుపై బురదలో పురుగై పుట్టుదురు.

విష్ఠాస్థానేషు పాపిష్ఠో దుర్గన్ధిషుచ నిత్యశః,

భూయో భూయో జాయమానాః సద్యోనాశంవ్రజన్తి తే 21

మలస్థానములలో పరమదుర్వాసనగలచోట పాపిష్ఠులు పుట్టుచుందురు. నాశము పొందుచుందురు.

బ్రాహ్మణ శ్చైవ యోవిద్వాన్‌ కుర్యాత్‌ తేషాం ప్రతిగ్రహమ్‌,

తతః ప్రభృత్యమేధ్యాన్తః పితర స్తస్య శేరతే. 22

విద్వాంసుడగు బ్రాహ్మణు డిట్టివారినుండి దానము పుచ్చుకొన్నచో అదిమొదలు మలముతుదిగాగల నరకములలో వాని పితరులు పడియుందురు.

న తం వివ్రం సుసంభాషే న్న చైవైకాసనం విశేత్‌,

స నిత్యం వర్జనీయో హి దూరాత్‌ తుబ్రాహ్మణోధ్వరే. 23

అట్టి విప్రునితో ఎవ్వడు పలుకరాదు. ఒక ఆసనముపై కూర్చుండరాదు. వాడు యజ్ఞమున దూరముగా విడువదగినవాడు.

యత్నేన సహసంభాషేత్‌ తథా చైకాసనం వ్రజేత్‌,

ప్రాజాపత్యం చరేత్‌ కృత్స్నం తేన శుద్ధ్యతి సద్విజః. 24

ఒకవేళ మాటాడినచో, ఒకఆసనమున కూర్చున్నచో ప్రయత్నముతో ప్రాజాపత్యమను ప్రాయశ్చిత్తమును చేసికొనవల యును. అప్పుడాద్విజుడు శుద్ధుడగును.

ఏకస్య గోప్రదానస్య సహస్రాంశేన పూర్యతే,

కిమన్యై ర్బహుభి ర్దానైః కోటిసంఖ్యాతవిస్తరైః. 25

ఒక కపిలను దానము చేయుట వేయిరెట్టఫలితమును నింపును. కోట్లకొలదిగా విస్తరించిన అనేకదానముల సంగతిచెప్పనేల?

శ్రోత్రియాయ దరిద్రాయ సువృత్తాయాహితాగ్నయే,

ఆసన్నప్రసనాం ధేనుం దానార్థీ ప్రతిపాలయేత్‌,

కపిలార్ధప్రసూతా వై దాతవ్యా చ ద్విజాతయే. 26

వేదము చక్కగా చదువుకొన్నవాడు, దరిద్రుడు, మంచినడవడికలవాడు, అగ్నిహోత్రములను నిత్యము అర్చించువాడు అగు బ్రాహ్మణునకు ఈనమోసిన కపిలధేనువుని రక్షించి, ఈనుచుండగా దానమీవలయును.

జాయమానస్య వత్సస్య ముఖం యోన్యాం ప్రదృశ్యతే,

తావత్‌ సా పృధివీ జ్ఞేయా యావద్‌ గర్భం నముఞ్చతి. 27

బిడ్డ పుట్టుచుండగా ముఖము యోనియందు కన్పడుచుండగా ఇంకను గర్భమును పూర్తిగా వదలకముందు, అట్టి ఆవును పృథివిగా తెలియదగును.

ధేన్వా యావన్తి రోమాణి నవత్సాయా వసుంధరే,

తస్యాశ్చ పాంశవో యావద్‌ గర్భోదక పరిప్లుతాః. 28

తాపత్యో వర్షకోట్యస్తు బ్రహ్మవాదిభి రర్చితాః,

బ్రహ్మలోకే నివసన్తి యేచ వై కపిలాప్రదాః. 29

కపిలగోవును దానమొసగువారు, దూడతో పాటు ఆ ఆవునకు ఎన్నిరోమములు కలవో, ఆ గర్భపునీటి కంటుకొని ఎన్నిధూళి కణములు కలవో అన్ని కోట్ల వర్షములు బ్రహ్మవేత్తలు కొలుచు చుండగా బ్రహ్మలోకమున నివసింతురు.

సువర్నశృఙ్గీం యః కృత్వా రౌప్యయుక్తఖురాం తథా,

బ్రాహ్మణస్య కరే దత్వా సువర్ణం రౌప్య మేవచ. 30

కపిలాయా స్తదా పుచ్ఛం బ్రాహ్మణస్య కరే న్యసేత్‌,

ఉదకం చ కరే దత్వా వాచయేచ్ఛుద్ధయా గిరా. 31

స సముద్రవనా తేన సశైలవనకాననా,

రత్నపూర్ణా భ##వేద్దత్తా పృథివీ నాత్ర సంశయా. 32

బంగారు కొమ్ములు, వెండిగిట్టలు గల కపిలధేనువును సువర్ణముగాని వెండిని గాని దక్షిణగా ఇచ్చి తోకదగ్గర నీటిని వదలి దానము చేయుచున్నానని పలుకవలయును. అట్టివాడు సముద్రముతో వనములతో కొండలతో అడవులతో కూడినదియు, రత్నములతో నిండినదియు అగు భూమిని దానము చేసినవాడగును. ఇందు సంశయము లేదు.

పృథివీదానతుల్యేన దానేనైతేన వై నరః,

నన్దితో యాతి పితృభి ర్విష్ణ్వాఖ్యం పరమం పదమ్‌. 33

భూదానముతో సమానమగు ఈదానముతో నరుడు ఆనందమొంది తనపితృదేవతలతోపాటు విష్ణువు అనుపేరుగల పరమపదమున కరుగును.

బ్రహ్మస్వహారిణో గోఘ్నె భ్రూణహా పాకభేదకః,

మహాపాతక యుక్తోపి వఞ్చకో బ్రహ్మదూషకః. 34

నిన్దకో బ్రాహ్మణానాంచ తథా ధర్మోపదూషకః,

ఏతైః పాతక యుక్తోపి గవాం దానేన శుద్ధ్యతి. 35

బ్రాహ్మణుని సొమ్ము దొంగిలించినవాడు, గోవును చంపిన వాడు, భ్రూణహత్య చేసినవాడు (భ్రూణము= గర్భములోని శిశువు) కొంపలు తగులబెట్టినవాడు, మహాపాతకములు చేసినవాడు, వంచకుడు, బ్రహ్మజ్ఞానులను నిందించువాడు, ధర్మమును దూషించు వాడు - ఇట్టివారందరు కపిలగోవు దానముచేత శుద్ధిపొందుదురు.

యశ్చోభయముఖీం దద్యాత్‌ ప్రభూత కనకాన్వితామ్‌,

తద్‌ దినం పాయసాహారం పయసా వాతివాహయేత్‌. 36

'ఉభయముఖి' అని ప్రసిద్ధిగల కపిలను గొప్ప ధనముతో కూడినదానిని దానమొసగువాడు ఆదినమున పాయసముగాని పాలుగాని ఆహారముగా కొని ఉండవలయును. (ఉభయముఖి - ఈనుచున్న ఆవు)

సువర్ణస్య సహస్రేణ తదర్ధేనాపి భామిని,

తస్యాప్యర్దశ##తేనాథ పఞ్చాశచ్చ తతోర్ధకమ్‌,

యథాశక్త్యా ప్రదాతవ్యా విత్తశాఠ్యం వివర్జయేత్‌. 37

వేయి కాసులుగాని, అందుసగముగాని, దానిలో సగముగాని, నూరుగాని, ఏబదిగాని, దానిలో సగముగాని దక్షిణగా ఒసగవలయును. విత్తము విషయమున వంచన పనికిరాదు.

ఇమాం గృహ్ణోభయముఖీం భయత్రాతా మమాశుచ,

దదే వంశవివృద్ధ్యర్థం సదా స్వస్తికరీ భవ. 38

ఈ కపిలధేనువును గ్రహింపుము. నన్ను భయమునుండి కాపాడుము. వంశము వృద్ధిపొందుటకై ఈదానము చేయుచున్నాను. నాకు శుభమును కల్పింపుము - అనిదాత పలుకవలయును

ప్రతిగృహ్ణామి త్వాం ధేనో కుటుంబార్థే విశేషతః,

స్వస్తిర్భవతు మే నిత్యం రుద్రాఙ్గే తే నమో నమః. 39

ధేనూ! కుటుంబము కొరకు ప్రత్యేకించి నిన్ను గ్రహించు చున్నాను. రుద్రాంగా! నీకు స్వస్తియగు గాక! నమస్కారము! (రుద్రాంగ - రుద్రుని అంగము అయినది.)

ఓం ద్యౌ స్త్వా దదత్వితిపున ర్మన్త్రేణ ప్రతిగృహ్ణాతి,

కో దదాదితి మన్త్రేణ ప్రతిగృహ్య వసుంధరే,

విసృజ్య బ్రాహ్మణం దేవి తాం ధేనుం తద్గృహం నయేత్‌. 40

''ఓంద్యౌస్త్వా దదతు'' మొదలగు మంత్రములను, 'కోదదాద్‌' మొదలగు మంత్రములను పఠించి గ్రహించువాడు దానమును కైకొనవలయును. తరువాత దాత ఆ బ్రాహ్మణుని ఇంటికి పంపి ఆవును ఆతనియింటికి చేర్పవలయును.

ఏవంప్రసూయమానాం యో గాం దదాతి వసుంధరే,

పృథివీ తేన దత్తా స్యాత్‌ సప్తద్వీపా న సంశయః. 41

ఇట్లు ఈనుచున్న ఆవును ఇచ్చువాడు, ఏడుద్వీపములతో కూడిన భూమినంతటిని ఇచ్చినవాడగును. సంశయము లేదు.

చరన్తి తం చంద్రసమానవక్త్రాః

ప్రతప్త జాంబూనద తుల్య వర్ణాః,

మహాసితత్వా స్తనువృత్తమధ్యాః

సేవన్త్యజస్రం కులితా హి దేవాః. 42

చంద్రునితో సమానమగు ముఖము కలవారు, బాగుగా కరగిన బంగారువంటి వన్నెకలవారును, గొప్పఖడ్గములవంటి వాడియగు తత్వము కలవారును, సన్ననిగుండ్రని నడుములు గల వారును, నిత్యజాగరూకత కలవారును అగు దేవులు అతనిని ఎల్లవేళల సేవించుచు తిరుగుచుందురు.

ప్రాత రుత్థాయ యోభక్తః కల్పం ధేన్వా ముదాయుతమ్‌,

జితేన్ద్రియః శుచిర్భూత్వా పఠేద్‌ భక్త్యా సమాహితః. 43

త్రిః సదావర్తనం కృత్వా పాపం వర్షకృతం చ యత్‌,

నశ్యతే తత్షణాదేవ వాయునా పాంసనో యథా. 44

ఉదయమున లేచి భక్తుడు ఈ ధేనుకల్పమును ఇంద్రియ నిగ్రహము కలవాడై పవిత్రుడై చదివినచో, మూడుమారులు గోవునకు ప్రదక్షిణము చేసినచో సంవత్సరము కాలము అతడు చేసిన పాపము ఆక్షణములో, గాలికి దుమ్ము కొట్టుకొని పోయినట్లు, నశించును.

శ్రాద్ధకాలే పఠేద్యస్తు ఇదం పావన ముత్తమమ్‌,

తస్యాన్నం సంస్కృతం తద్ధి పితరోశ్నన్తి ధీమతః. 45

పవిత్రము, ఉత్తమము అగు ధేనుకల్పమును శ్రాద్ధకాలమున పఠించినచో చక్కగా సంస్కారము పొందిన ఆ అన్నమును పితృదేవతలు ప్రీతితో భుజింతురు.

అమయాం వాథ యః కశ్చిద్‌ ద్విజానా మగ్రతః పఠేత్‌,

పితర స్తస్య తృప్యన్తి వర్షాణాం శతమేవ తు. 46

అమావాస్యనాడు బ్రాహ్మణుల ముందు దీనిని పఠించినచో ఆతని పితృదేవతలు నూరేండ్లు తృప్తిపడుదురు.

యశ్చైత చ్ఛ్రుణుయా న్నిత్యం తద్గతేనాన్తరాత్మనా,

సంవత్సర కృతం పాపం తత్షణాదేవ నశ్యతి. 47

దీనిని శ్రద్ధతో నిత్యము వినువానికిని ఏడాదిచేసిన పాపము ఆక్షణమున నశించును.

హోతా ఉవాచ - హోత చెప్పెను.

ఇదం రహస్యం రాజేన్ద్ర వరాహేణ పురాతనమ్‌,

ధరణ్యౖ కథితం రాజన్‌ ధేనుమాహాత్మ్య ముత్తమమ్‌,

మయా తే కథితం సర్వం సర్వపాపప్రణాశనమ్‌. 48

రాజా! శ్రీవరాహదేవుడు భూదేవికి చెప్పిన రహస్యము, పురాతనము అయిన ఈ ధేనుమాహాత్మ్యమును, నేను నీకు సర్వమును సర్వపాపములను పోగొట్టుదానిని చెప్పితిని.

ద్వాదశ్యాం మాఘమాసస్య శుక్లాయాం తిలధేనుదః,

సర్వకామసమృద్ధార్థో వైష్ణవం పదమాప్నుయాత్‌. 49

మాఘమాసము శుక్లపక్ష ద్వాదశియందు తిలధేనువు నిచ్చువాడు నిండిన కోరికలన్నింటితో సమృద్ధమైన విష్ణుపదమును పొందును.

ద్వాదశ్యాం శ్రావణ మాసి శుక్లాయాం రాజసత్తమ,

ప్రత్యక్షధేను ర్దాతవ్యా సహిరణ్యా నృపోత్తమ. 50

శ్రావణమాసమున శుక్లపక్షద్వాదశితిథి యందు సువర్ణముతో పాటు నిజమైన గోవును దానమీవలయును.

సర్వదా సర్వధేనూనాం ప్రదానం రాజసత్తమ,

సర్వపాపప్రశమనం భుక్తిముక్తిప్రదాయకమ్‌. 51

ఎప్పుడైనను అన్నివిధములైన గోవులను దానము చేయుట సర్వపాపములను అణచునట్టిది. భుక్తిని ముక్తిని ప్రసాదించునట్టిది.

ఏతత్‌ తే సర్వమాఖ్యాతం సమాసాద్‌ బహువిస్తరమ్‌,

అపారఫలముద్దిష్టం బ్రహ్మణా లోకకర్తృణా. 52

ఈ సర్వము బహు విస్తరముగా ఒక్కరూపమున నీకు చెప్పితిని. లోకకర్తయగు బ్రహ్మ దీనికి అపారమైన ఫలమును నిర్ణయించెను.

అథవా పీడ్యసేత్యంతం క్షుధయా పార్థివోత్తమ,

తదానీం కార్తికే దేయం వర్తతేద్య నరాధిప. 53

రాజా! నీవు ఆకలితో మిక్కిలిగా పీడనొందుచున్నావు. ఇప్పుడు కార్తికము నడచుచున్నది. కావున ఇప్పుడు నీవు దానము చేయుము.

బ్రహ్మాండం సర్వసంపన్నం భూతరత్నౌషధై ర్యుతమ్‌,

దేవదానవ యక్షైశ్చ యుక్త మేతత్‌ సదా విభో.

54

ఈ బ్రహ్మండము భూతములతో రత్నములతో, ఓషధులతో, దేవదానవయక్షులతో కూడి ఎల్లవేళల సర్వసంపదలు కలిగియున్నది.

ఏతద్ధేమమయం కృత్వా సర్వబీజసమన్వితమ్‌,

సరత్నం పురుషః కృత్వా కార్తిక్యాం ద్వాదశీదినే. 55

అథవా పఞ్చదశ్యాం వా కార్తిరసై#్యవ నాన్యతః,

పురోహితాయ గురవే దాపయేద్‌ భక్తిమాన్నరః. 56

దీనిని సువర్ణమయముగా, అన్నిబీజములతో కూడినదిగా చేసి రత్నములతోపాటు కార్తిక ద్వాదశినాడు, లేదా పూర్ణిమనాడు భక్తితో గురువైన పురోహితునకు సమర్పింపవలయును.

బ్రహ్మాండోదరవర్తీని యాని భూతాని పార్థివ,

తాని దత్తాని తేన స్యుః సమాసాత్‌ కథితమ తవ. 57

అట్లు చేసినవాడు బ్రహ్మాండము కడుపులో నున్న భూతములన్నింటిని దానము చేసినవాడగును, సంగ్రహముగా చెప్పితిని.

యో యజ్ఞై ర్యజతే రాజన్‌ సహస్రవరదక్షిణౖః,

సైకోద్ధేశం యజేత్‌ తస్య బ్రహ్మాండస్య విశేషతః. 58

వేలకొలది మేలైన దక్షిణలతో యజ్ఞములు చేయువాడును బ్రహ్మాండములో ఒక భాగమును మాత్రమే ఇచ్చినవాడగును.

యఃపునః సకలం చేదం బ్రహ్మాణ్డం యజతే నరః,

తేన యష్టం హుతం దత్తం పఠితం కీర్తితం భ##వేత్‌. 59

ఇక ఈ సమస్తమైన బ్రహ్మాండమును అర్చించునరుడు యజించుట, హోమము, దానము, అధ్యయనము, కీర్తనము చేసినవాడేయగును.

ఏవం శ్రుత్వా తతో రాజా హేమకుంభంతు కల్పయేత్‌,

బ్రహ్మాండ మృషయే ప్రాదాత్‌ సవిధానం చ తత్షణాత్‌. 60

ఇది విని రాజు హేమకుంభమును బ్రహ్మాండముగా కల్పించి విధి పూర్వకముగా దానిని ఋషి కర్పించెను.

సర్వకామైః సుసంభూతో య¸°స్వర్గం నరాధిపః,

తస్మాత్‌ త్వమపి రాజేన్ధ్ర తద్‌ దత్త్వా తు సుఖీ భవ. 61

నిండిన సర్వమైన కోరికలు కలవాడై ఆ రాజు స్వర్గమున కరిగెను. కావున ఓ రాజేన్ద్రా! నీవును అది యిచ్చి సుఖముకలవాడ వగుము.

ఏవముక్తో వసిష్ఠేన సోప్యేవ మకరో న్నృపః,

జగామ పరమాం సిద్ధిం యత్ర గత్వా న శోచతి. 62

వసిష్ఠు డిట్లు పలుకగా ఆరాజు అట్లే కావించెను. దుఃఖములేని పరమసిద్ధ పదమునకు ఏగెను.

శ్రీవరాహ ఉవాచ - శ్రీవరాహదేవు డిట్లు పలికెను.

ఇయం తే సంహితా దేవి కథితా సర్వకామికా,

వరాహాఖ్యా వరారోహే సర్వపాతకనాశినీ. 63

ఓ వరారోహా! అన్నికోరికలను తీర్చు ఈ వరాహసంహిత అనుపేరుగలదానిని నీకు చెప్పితిని. ఇది సర్వపాతకములను నాశనము చేయునది.

సర్వజ్ఞా దుత్ధితా చేయం తతోబ్రహ్మాబుబోధ హ,

బ్రహ్మాపి స్వసుతే ప్రాదాత్‌ పులస్త్యాయ మహాత్మనే,

పులస్త్యోపి ప్రదద్యాద్‌ వైభార్గవాయ మహాత్మనే. 64

ఇది మొదట సర్వజ్ఞుడగు పరమేశ్వరుని నుండి బయలు దేరినది. అతనివలన బ్రహ్మతెలిసికొనెను. అతడు తన కుమారుడు మహాత్ముడునగు పులస్త్యున కొసగెను. పులస్త్యుడు మహాత్ముడగు భార్గవునకు ఇచ్చెను.

అసావపి స్వశిష్యాయ ప్రాదాదుగ్రాయ ధారిణ,

ఉగ్రోపి మునయే ప్రాదా దేషోపి పరికీర్తితః. 65

అతడును తనశిష్యుడగు ఉగ్రున కొసగెను. అతడు ముని కిచ్చెను. ఈ పరంపర ఇట్లుగా చెప్పబడినది.

సంబంధః పూర్వకల్పోక్తో ద్వితీయం శృణు సాంప్రతమ్‌,

సర్వజ్ఞా ల్లబ్ధవానస్మి త్వం చ మత్తో ధరాధరే. 66

ఇది పూర్వకల్పమున చెప్పబడిన సంబంధము. ఇప్పుడు రెండవ సంబంధమును వినుము. నేను సర్వజ్ఞుని వలన పొందితిని. నానుండి నీవు గ్రహించితివి.

త్వత్తశ్చ తపసా యుక్తా వేత్స్యన్తే కపిలాదయః,

క్రమేణ యావద్‌ వ్యాసేన జ్ఞాత మేతద్‌ భవిష్యతి. 67

నీనుండియు తపస్సుతో కూడిన కపిలుడు మున్నగువారు తెలిసికొందురు. క్రమముగా వ్యాసునివలన ఇది లోకమునకు తెలియ గలదు.

తస్యాపిశిష్యో భవితా నామ్నావై రోమహర్షణః,

అసౌ శునకపుత్రస్య కథయిష్యతి నాన్యథా. 68

రోమహర్షణుడనువాడు అతనికి శిష్యుడగును. అతడు దీనిని యథాతథముగా శౌనకునకు చెప్పెను.

అష్టాదశ పురాణాని వేద ద్వైపాయనో గురుః,

బ్రాహ్మం పాద్మం వైష్ణవం చ శైవం భాగవతం తథా. 69

తథాన్యం నారదీయం చ మార్కణ్డయం చ సప్తమమ్‌,

ఆగ్నేయ మష్టమం ప్రోక్తం భవిష్యం నవమం తథా. 70

దశమం బ్రహ్మవైవర్తం లైజ్గమేకాదశం స్మృతమ్‌,

వారాహం ద్వాదశం ప్రోక్తం స్కాందం చాపి త్రయోదశమ్‌. 71

చతుర్దశం వామనం చ కౌర్మం పంచదశం స్మృతమ్‌,

మాత్స్యంచ గారుడం చైవ బ్రహ్మాండం చ తతఃపరమ్‌. 72

ద్వైపాయనుడను గురువు పదునెనిమిదిపురానము లెరిగిన వాడు. బ్రాహ్మము, పాద్మము, వైష్ణవము, శైవము, భాగవతము, నారదీయము, మార్కండేయము, అగ్నేయము, భవిష్యము, బ్రహ్మవైవర్తనము, లైంగము, వారాహము, స్కాందము, వామనము, కౌర్మము, మాత్స్యము, గారుడము, బ్రహ్మాండము అనునవి అష్టాదశపురాణములు.

శ్రీవరాహ ఉవాచ - శ్రీవరాహదేవుడిట్లు చెప్పెను.

య ఏతత్‌ పారయేద్‌ భక్త్యా కా ర్తిక్యాం ద్వాదశీదినే,

తస్య నూనం భ##వేత్‌ పుత్రో అపుత్రస్యాపి ధారిణి. 73

భూదేవీ! కార్తిక ద్వాదశినాడు భక్తితో దీనిని నిర్వహించువాడు అపుత్రుడైనను తప్పక పుత్రుని పొందును.

యస్యేదం తిష్ఠతే గేహే లిఖితం పూజితం సదా,

తస్య నారాయణో దేవః స్వయం తిష్ఠతి ధారిణి. 74

భూదేవీ! ఎవనియింట ఈ సంహిత వ్రాయబడునో పూజింపబడునో ఆయింట నారాయణదేవుడు స్వయముగా నిలిచియుండును.

యశ్చైత చ్ఛ్రుణుయాద్‌ భక్త్యా నైరన్తర్యేణ మానవః,

శ్రుత్వాతు పూజయే చ్ఛాస్త్రం తథావిష్ణుం సనాతనమ్‌. 75

ఈ శాస్త్రమును వదలక భక్తితో చదువువాడు, విని పూజించు వాడును సనాతనుడగు విష్ణువును పూజించువాడగును.

గన్ధైఃపుషై#్ప స్తథా వసై#్త్ర ర్బ్రాహ్మణానాం చ తర్పణౖః,

యథాశక్త్యా నృపోగ్రామైః పూజయేద్‌ వాచకం ధరే. 76

ధరాదేవీ! గంధములతో, పూవులతో, వస్త్రములతో, బ్రాహ్మణసంతర్పణలతో శక్తిననుసరించి గ్రామములతో రాజు వాచకుని పూజింపవలయును.

శ్రుత్వా తు పూజయేద్‌ యస్తు శాస్త్రం వారాహసంజ్ఞితమ్‌,

సర్వపాపవినిర్ముక్తో విష్ణుసాయుజ్య మాప్రజేత్‌. 77

ఈ వరాహమను పేరుగల శాస్త్రమును చదివి పూజించు మానవుడు పాపములన్నింటినుండి పూర్తిగా విముక్తిపొంది విష్ణు సాయుజ్యమును పొందును.

ఇతి శ్రీవరాహపురాణ భగవచ్ఛాస్త్రే ఏకాదశాధికశతతమోధ్యాయః

ఇది శ్రీవరాహపురాణమను భగవచ్ఛాస్త్రమున నూటపదునొకండవ అధ్యాయము

Varahamahapuranam-1    Chapters