Varahamahapuranam-1    Chapters   

పంచాధికశతతమో ధ్యాయః - నూటఅయిదవ అధ్యాయము

హోతా ఉవాచ - హోత చెప్పెను.

దధిధేనో ర్మహారాజ విధానం శృణు సాంప్రతమ్‌.

రాజా! ఇప్పుడు దధిధేనువు విధానమును వినుము.

అనులిప్తే మహాభాగే గోమయేన నరాధిప.

గోచర్మమాత్రం తు పునః పుష్పప్రకరసంయుతమ్‌,

కుశై రాస్తీర్య వసుధాం కృష్ణాజినకుశోత్తరామ్‌. 2

ఆవుపేడతో అలికిన నేలపై గోచర్మమంత కొలతతో పూవులతో పాటుగా దర్భలు పరచి లేడిచర్మమును దర్భాసనమును ఉంచవలయును.

దధికుంభం సుసంస్థాప్య సప్తధాన్యస్య చోపరి,

చతుర్ధాంశేన వత్సంతు సౌవర్ణముఖ సంయుతమ్‌. 3

ఏడువిధములగు ధాన్యములపై పెరుగుకుండను చక్కగా నిలుపవలయును. నాలుగవ వంతుతో బంగారు మొగముగల దూడను చేయవలయును.

ఆచ్ఛాద్య వస్త్రయుగ్మేన పుష్పగన్దైస్తు పూజితామ్‌,

బ్రాహ్మణాయ కులీనాయ సాధువృత్తాయ ధీమతే,

క్షమాదమశమోపేతే తాదృశాయ ప్రదాపయేత్‌. 4

వస్త్రములజంటతో కప్పి పూవులతో గంధముతో పూజించి, మంచికులము, చక్కనినడవడి, బుద్ధి, ఓర్పు, అంతరింద్రియ బహిరింద్రియముల నిగ్రహము కల బ్రాహ్మణునకు దానమీ వలయును.

పుచ్ఛదేశోపవిష్టస్తు ముద్రికా కర్ణమాత్రకైః,

పాదుకోపానహౌ ఛత్రం దత్వా మన్త్ర మిమం పఠేత్‌,

దధిక్రామితి మన్త్రేణ దధిధేనుం ప్రదాపయేత్‌. 5

తోకదగ్గరగా కూర్చుండి ఉంగరమును కుండలములను పాదుకలను, గొడుగును సమర్పించి ''దధిక్రామ్‌'' మొదలగు మంత్రమును పఠించుచు దధిధేవును సమర్పింపవలయును.

ఏవం దధిమయీం ధేనుం దత్వా రాజర్షిసత్తమ,

ఏకాహారో దినం తిష్ఠేద్‌ దధ్నా చ నృపనందన. 6

ఇట్లు దధిధేనువును దానమొసగి ఒకపూట పెరుగు భోజనముతో గడుపవలయును.

యజమానో వసేద్‌ రాజంస్త్రిరాత్రంచ ద్విజోత్తమః,

దీయమానాం ప్రపశ్యన్తి తే యాన్తి పరమం పదమ్‌. 7

యజమానుడు ఒకదినమును, పుచ్చుకొన్న బ్రాహ్మణుడు మూడు రాత్రులవరకును ఇట్లు పెరుగు భోజనముతో గడుప వలయును. ఇచ్చుచుండగా చూచినవారును పరమపదమున కరుగుదురు.

దశపూర్వాన్‌ దశపరా నాత్మానం చైకవింశకమ్‌,

విష్ణులోకం మవాప్నోతి యావదాభూతసంప్లవమ్‌,

దాతా చ దాపకశ్చైవ తే యాన్తి పరమాం గతిమ్‌. 8

వెనుక పదితరములవారును, ముందు పదితరములవారును తనతోపాటు మొత్తమిరువది యొక్క తరములవారు ప్రళయకాల పర్యంతము విష్ణులోకమును పొందుదురు. దాతయు, ఇప్పించు వాడును పరమగతి కరుగుదురు.

యత్ర దధివహా సద్యో యత్ర పాయసకర్దమాః,

మునయో ఋషయః సిద్ధా స్తత్ర గచ్ఛన్తి ధేనుదాః. 9

పెరుగునదులు, పాయసపుపంకములు కలచోటికి, మునులు, ఋషులు, సిద్ధులు ఉండుతావున కీధేనుదానము చేసిన వారరుగుదురు.

య ఇదం శ్రావయేద్‌ భక్త్యా శృణుయాద్‌ వాపి మానవః,

సోశ్వమేధఫలం ప్రాప్య విష్ణులోకం స గచ్ఛతి. 10

దీనిని వినిపించువాడును, వినువాడును అశ్వమేధ యాగ ఫలమును పొంది విష్ణులోకమున కరుగును.

ఇతి శ్రీ వరాహ పురాణ భగవచ్ఛాస్త్రే పంచాధిక శతతమోధ్యాయః

ఇది శ్రీవరాహపురాణమను భగవచ్ఛాస్త్రమున నూట అయిదవ అధ్యాయము

Varahamahapuranam-1    Chapters