Brahmapuranamu    Chapters   

అథ షట్షష్టితమో7ధ్యాయః

గుడివాయాత్రామాహాత్మ్యమ్‌

బ్రహ్మోవాచ

గుడివా మండపం యాంతం యే పశ్యంతి రథే స్థితమ్‌ | కృష్ణం బలం సుభద్రాం చ తే యాంతి భవనం హరేః || 1

మునయ ఊచుః

కేన సా నిర్మితా యాత్రా దక్షిణస్యాం జగత్ఫతే | యాత్రాఫలం చ కిం తత్ర ప్రాప్యతే బ్రూహి మానవైః || 2

కిమర్థం సరస స్తిరే రాజ్ఞస్తస్య జగత్ఫతే పవిత్రే విజనే దేశే గత్వా తత్ర చ మండపే || 3

కృష్ణః సంకర్షణశ్చైవ సుభద్రా చ రథేన తే | స్వస్థాసం సంపరిత్యజ్య సప్తరాత్రం వసంతి వై || 4

బ్రహ్మోవాచ

ఇంద్రద్యుమ్నేన భో విప్రాః పురా వై ప్రార్థితో హరిః | సప్తాహం సరస స్తీరే మమ యాత్రా భవత్వితి || 5

గుడివా నామ దేవేశ భుక్తి ముక్తి ఫలప్రదా | తసై#్మ కిల వరం చాసౌ దదౌ స పురుషోత్తమః || 6

శ్రీభగవానువాచ

సప్తాహం సరస స్తీరే తవ రాజన్భవిష్యతి | గుడివా నామ యాత్రా మే సర్వకామ ఫలప్రదా || 7

యే మాం తత్రార్చయిష్యంతి శ్రద్ధయా మండపే స్థితమ్‌ | సంకర్షణం సుభద్రాం చ విధివ త్సుసమాహితాః || 8

బ్రాహ్మణాః క్షత్రియా వైశ్యాః స్త్రియః శూద్రాశ్చవై నృప | పుషై#్పర్గంధైస్తదా ధూపై ర్ధీపై ర్నై వేద్యకైర్వరైః || 9

ఉపహారైర్భహువిధైః ప్రణిపాతైః ప్రదక్షిణౖః జయ శ##బ్దైస్తథా స్తోత్రై ర్గీతై ర్వాద్యైర్మనోహరైః || 10

న తేషాం దుర్లభం కంచి త్ఫలం యస్య యదీప్సితమ్‌ | భవిష్యతి నృపశ్రేష్ఠ మత్ప్రసాదా దసంశయమ్‌ || 11

బ్రహ్మోవాచ

ఏవ ముక్త్వా తు తం దేవ స్తత్రైవాంతరధీయత | స తు రాజవరః శ్రీమా స్క్రత కృత్యో7భవవత్తదా || 12

తస్మాత్సర్వ ప్రయత్నేన గుడివాయాం ద్విజోత్తమాః | సర్వకామప్రదం దేవం పశ్యేత్తం పురుషోత్తమమ్‌ || 13

అపుత్రో లభ##తే పుత్రా న్నిర్ధనో లభ##తేధనమ్‌ | రోగాచ్చ ముచ్యతే రోగీ కన్యా ప్రాప్నోతి సత్పతిమ్‌ || 14

ఆయుః కీర్తిం యశో మేధాం బలం విద్యాం ధృతిం పశూన్‌ | నరః సంతతి మాప్నోతి రూప ¸°వన సంపదమ్‌ || 15

యాన్యా న్సమీహతే భోగా న్దృష్ట్వా తం పురుషోత్తమమ్‌ | నరో వా7ప్యథ్యవా నారీ తాంస్తాన్ప్రాప్నో త్య సంశయమ్‌ || 16

యాత్రాం కృత్వా గుడివాఖ్యాం విధివ త్సు సమాహితః | ఆషాఢస్య సితే పక్షే నరో యోషిదథాపి వా || 17

దృష్ట్వా కృష్ణం చ రామంచ సుభద్రాం చ ద్విజోత్తమాః | దశపంచాశ్వమేధానాం ఫలం ప్రాప్నోతి చాధికమ్‌ || 18

సప్తావ రాన్సప్త పరా న్వంశానుధృత్య చా77త్మనః | కామగేన విమానేన సర్వ రత్నై రలంకృతః || 19

గంధర్వైరప్సరోభిశ్చ సేవ్యమానో యథోత్తరైః | రూపవాన్సుభగః శూరో నరో విష్ణుపురం వ్రజేత్‌ || 20

తత్ర భుక్త్వా వరాన్భోగా న్యావదాభూతసంప్లవమ్‌ | సర్వకామ సమృద్ధాత్మా జరామరణ వర్జితః || 21

పుణ్యక్షయా దిహా77గత్య చతుర్వేదీ ద్విజోభ##వేత్‌ | వైష్ణవం యోగమాస్థాయ తతో మోక్షమవాప్నుయాత్‌ || 22

ఇతి శ్రీమహాపురాణ ఆదిబ్రాహ్మే స్వయంభు ఋషిసంవాదే గుడివాయాత్రా మాహాత్మ్య

నిరూపణం నామ షట్షష్టితమో7ధ్యాయః

బ్రహ్మయిట్లనియె.

సుభద్రా కృష్ణ బలరాములు గుడివా మండపమునకు రధయాత్ర చేయుదురు, ఆ యుత్సవము దర్శించిన వారు విష్ణులోక మందుదురు.

అన మునులడిగిరి. ''దక్షిణ దిక్కునందు ఆ యాత్రా విధానము నేర్పరిచిన వారెవరు? ఆ యాత్రా సందర్శన ఫలమేమి? ఇంద్ర ద్యుమ్నరాజ నిర్మితమగు నా సరస్సు యొక్క తీరమందు గల యా మండపమున తమ దేవాలయమును వదలి యాముగ్గురును ఏడు రాత్రులు నిర్జనమయిన యా పవిత్ర ప్రదేశమున యెందులకు వసింతురో తెల్పుడు'' అన బ్రహ్మయిట్లనియె.

ఇంద్రద్యుమ్నుడు ప్రార్ధింప శ్రీహరి గుడివా యాత్రజేసి యేడు రోజులచట నివసింతునని యిట్లు పరముచ్చెను. ఈ యాత్రదర్శనము సర్వకామ ఫలప్రదము. బ్రాహ్మణాది వర్ణముల వారు యథావిధిగ షోడశోపచార పూజలు గావించి గీతనృత్యాదులచే పరమాత్మను సేవించిన యడల వారికి సర్వాభీష్టములు సిద్ధించును. ఈ విషయము స్వయముగా తెల్పి యంతర్ధాన మయ్యెను. ఆ రాజ శ్రేష్టుడా యాత్రను నిర్వహించి భగవద్ధర్శనము చేసి కృతార్ధుడయ్యెను.

ఫలశ్రుతి (13 నుంచి 22 వరకు) మూలమునందు సులభముగ నర్థమగును.

ఇది బ్రహ్మపురాణమునందు గుడివాయాత్రా మాహాత్మ్యమను నఱువదియాఱవ అధ్యాయము.

Brahmapuranamu    Chapters