Brahmapuranamu    Chapters   

అథ చతుష్షష్ఠితమోధ్యాయః

మహాజ్యైష్ఠీప్రశంస

బ్రహ్మోవాచ

యదాభ##వేన్మహాజ్యైష్ఠీ రాశినక్షత్రయోగతః | ప్రయత్నేన తదా మర్త్యై ర్గంతవ్యం పురుషోత్తమమ్‌ || 1

కృష్ణందృష్ట్వా మహాజ్యైష్ఠ్యాం రామంభద్రాం చ భోద్విజాః | నరో ద్వాదశయాత్రాయాః ఫలం ప్రాప్నోతిచాధికమ్‌ 2

ప్రయాగే చ కురుక్షేత్రే నైమిశే పుష్కరే గయే | గంగాద్వారే కుశావర్తే గంగాసాగరసంగమే || 3

కోకాముఖే శూకరే చ మథురాయాం మరుస్థలే | శాలగ్రామే వాయుతీర్థే మందరే సింధుసాగరే || 4

పిండారకే చిత్రకూటే ప్రభాసే కనఖలే ద్విజాః | శంఖోద్ధారే ద్వారకాయాం తథా బదరికాశ్రమే || 5

లోహకుండే చాశ్వతీర్థే సర్వపాపప్రమోచనే | కామాలయే కోటితీర్థే తథా చామరకంటకే || 6

లోహార్గళే జంబుమార్గే సోమతీర్థే పృథూదకే | ఉత్పలావర్తకే చైవ పృథుతుంగే సకుబ్జకే || 7

ఏకామ్రకే చ కేదారే కాశ్యాం చ విరజే ద్విజాః | కాలాంజరే చ గోకర్ణే శ్రీశైలే గంధమాదనే || 8

మహేంద్రే మలయేవింధ్యే పారియాత్రే హిమాలయే | సహ్యేచ శుక్తిమంతేచ గోమంతే చార్బుదే తథా|| 9

గంగాయాం సర్వతీర్థేషు యామునేషుచ భో ద్విజాః సారస్వతీషు గోమత్యాం బ్రహ్మపుత్రేషు సప్తసు || 10

గోదావరీ భీమరథీ తుంగభద్రా చ నర్మదా | తాపీ పయోష్ణీ కావేరీ శిప్రాచర్మణ్వతీ ద్విజాః || 11

వితస్తా చంద్రభాగా చ శతద్రుర్బాహుదా తథా | ఋషికుల్యా కుమారీ చ విపాశా చ దృషద్వతీ || 12

సరయూ ర్నాకగంగాచ గండకీచ మహానదీ | కౌశికీ కరతోయా చ త్రిస్రోతా మధువాహినీ || 13

మహానదీ వైతరిణీ యాశ్చాన్యా నానుకీర్తితాః | ఆథవా కిం బహూక్తేన భాషితేన ద్విజోత్తమాః || 14

పృథివ్యాం సర్వతీర్థేషు సర్వేష్వాయతనేషు చ | సాగరేషు చ శైలేషు నదీషు చ సరస్సు చ || 15

యత్ఫలం స్నానదానేన రాహుగ్రస్తే దివాకరే | తత్ఫలం కృష్ణమాలోక్య మాహాజ్యైష్ఠ్యాం లభేన్నరః|| 16

తస్మాత్సర్వప్రయత్నేన గంతవ్యం పురుషోత్తమే | మహాజ్యైష్ఠ్యాం మునిశ్రేష్ఠా సర్వకామఫలేప్సుభిః|| 17

దృష్ట్వా రామం మహాజ్యేష్ఠం కృష్ణం సుభద్రయా సహ | విష్ణులోకం నరోయాతి సముద్ధృత్య సమంకులమ్‌ || 18

భుక్త్వా తత్ర వరాన్భోగా న్యావదాభూతసంప్లవమ్‌ | పుణ్యక్షయాదిహా77గత్య చతుర్వేదీ ద్విజోభ##వేత్‌ || 19

స్వధర్మనిరతః శాంతః కృష్ణభక్తో జితేంద్రియః | వైష్ణవం యోగమాస్థాయ తతో మోక్షమవాప్నుయాత్‌ || 20

ఇతి శ్రీమహాపురాణ ఆదిబ్రాహ్మే స్వయంభ్వృషిసంవాదే మహాజ్యైష్ఠీప్రశంసావర్ణనంనామ చతుష్షష్టితమో7ధ్యాయః

బ్రహ్మ యిట్లనియె

మహాజ్యేష్ఠిపర్వమునందు పురుషోత్తమక్షేత్రము సేవింపదగినది. శ్రీకృష్ణుని బలరాముని సుభద్రను ఆనాడు దర్శించుటవలన ప్రయాగమొదలైనపుణ్యక్షేత్రములను సేవించిన పుణ్యము ద్వాదశ క్షేత్ర యాత్రా ఫలము లభించును. గోదావరి మొదలైన పుణ్యనదులు సేవించిన ఫలము కూడ సిద్ధించును. భూమియందు గల సర్వ దేవాలయములను, నదీ సాగర పర్వత తీర్థములను సేవించి స్నానదానాదులు చేసిన పుణ్యము కృష్ణదర్శనము చేత లభించును. అంతేగాక విష్ణులోకము కూడ లభించి అచ్చట పుణ్యానుభవ మయిన తరువాత కర్మభూమియందు జనించి చతుర్వేదాధ్యనము జేసి వేదోక్తాచార ధర్మ నిరతుడై కృష్ణభక్తుడై విష్ణుభక్తి యోగమునంది మానవుడు మోక్షము పొందును.

ఇది బ్రహ్మపురాణమందు మహాజ్యైష్ఠీప్రశంసనను ఆఱువది నాలగవ అధ్యాయము.

Brahmapuranamu    Chapters