Brahmapuranamu    Chapters   

అథ షష్ఠితమో ధ్యాయః

సముద్రస్నానవిధివర్ణనమ్‌.

బ్రహ్మోవాచ -

శ్వేత మాధవ మాలోక్య సమీపే మత్స్యమాధవమ్‌| ఏకార్ణవజలే పూర్వం రోహితం రూపమాస్థితమ్‌|| 1

వేదానాం హరణార్థాయ రసాతలతే స్థితమ్‌| చింతయిత్వా క్షితిం సమ్యక్తస్మిస్థ్సానే ప్రతిష్ఠితమ్‌|| 2

ఆధ్యావతరణం రూపం మాధవం మత్స్యరూపిణమ్‌| ప్రణమ్య ప్రణతో భూత్వా సర్వదుఃఖాద్విముచ్యతే|| 3

ప్రయాతి పరమం స్థానం యత్ర దేవో హరిః స్వయమ్‌| కాలే పునరిహా77యాతో రాజా స్యాత్పృథివీతలే|| 4

వత్సమాధవ మాసాద్య దురాధర్షో భ##వేన్నరః| దాతా భోక్తా భ##వేద్యజ్వా వైష్ణవః సత్యసంగరః|| 5

యోగం ప్రాప్య హరేః పశ్చాత్తతో మోక్షమవాప్నుయాత్‌| మత్స్యమాధవ మాహాత్మ్యం మయా సంపరికీర్తితమ్‌||

యం దృష్ట్యా మునిశార్దూలాః సర్వాన్కామానవాప్నుయాత్‌||

మునయ ఊచుః -

భగవన్శ్రోతుమిచ్ఛామో మార్జనం వరుణాలయే| క్రియతే స్నానదానాది తస్యాశేషఫలం వద 7

శ్వేత మాధవునిదర్శించి ప్రళయమందేకార్ణవమైన తఱి మత్స్యావతారమెత్తిన మాధవుని దర్శింపవలెను. వేదములను హరించిన హిరణ్యాక్షుని సంహరించి వేదరక్షణము చేసిన మొదటి యవతారమెత్తిన విష్ణువును నమస్కరించి నరుడు దుఃఖ విముక్తుడగును. విష్ణులోకమును బడయును. మరల నీ పుడమికి వచ్చి వత్సమాధవ స్వామినిచట దర్శించి దాతయు, ఐశ్వర్య భోక్తము. యజ్ఞకర్తయు, విష్ణుభక్తుడును సత్యవ్రతుడునై హరి సన్నిధానమొంది మోక్షము పడయును. సర్వకామ ప్రదమయిన మత్స్య మాధవ మాహాత్మ్యమును వర్ణించితిని. అనవిని మునులు స్వామి! సముద్ర జలమార్జనము స్నానము దానము చేయుట యందువలన గల్గునశేషఫలము చెప్పుమని యడుగ బ్రహ్మ యిట్లనియె.

బ్రహ్మోవాచ-

శృణుధ్వం మునిశార్దూలా మార్జనస్య యథా విధి| భక్త్యా తు తన్మనా భూత్వా సంప్రాప్య పుణ్యముత్తమమ్‌|| 8

మార్కండేయహ్రదే స్నానం పూర్వకాలే ప్రశస్యతే| చతర్దుశ్యాం విశేషేణ సర్వపాప ప్రణాశనమ్‌|| 9

తద్వత్స్నానం సముద్రస్య సర్వకాలం ప్రశస్యతే| పౌర్ణమాస్యాం విశేషేణ హయమేధ ఫలం లభేత్‌|| 10

మార్కండేంయ వటం కృష్ణం రౌహిణయం మహోదధిమ్‌| తదా గచ్ఛేద్విశేషేణ తీర్థరాజం పరం శుభమ్‌|| 11

పూర్ణిమా జ్యేష్ఠమాసస్య జ్యేష్ఠా ఋక్షం యదా భ##వేత్‌| తదా గచ్ఛేద్విశేషేణ తీర్థరాజం పరం శుభమ్‌|| 12

కాయవాఙ్మానసైః శుద్ధస్తద్భావో నాన్యమానసః| సర్వద్వంద్వ వినిర్ముక్తో వీతరాగో విమత్సరః|| 13

కల్ప వృక్షవటం రమ్యం తత్ర స్నాత్వా జనార్దనమ్‌| ప్రదక్షిణం ప్రకుర్వీత త్రివారం సుసమాహితః|| 14

యం దృష్ట్వాముచ్యతే పాపాత్సప్తజన్మ సముద్భవాత్‌| పుణ్యం చా77ప్నోతి విపులంగతిమిష్టాంచభోద్విజాః|| 15

తస్య నామాని వక్ష్యామి ప్రమాణం చ యుగేయుగే| యథాసంఖ్యం చ భో విప్రాః కృతాదిషు యథాక్రమమ్‌|| 16

వటం వటేశ్వరం కృష్ణం పురాణపురుషం ద్విజాః| వటసై#్యతాని నామాని కీర్తితాని కృతాదిషు|| 17

యోజనం పాదహీనం చ యోజనార్ధం తదర్ధకమ్‌| ప్రమాణం కల్పవృక్షస్య కృతాదౌ పరికీర్తితమ్‌|| 18

యథోక్తేన తు మంత్రేణ నమస్కృత్వా తు తం వటమ్‌| దక్షిణాభిముభో గచ్ఛేద్ధన్వంతర శతత్రయమ్‌|| 19

యత్రాసౌ దృశ్యతే విష్ణుః స్వర్గద్వారం మనోరమమ్‌| సాగరాంభః సమాకృష్టం కాష్ఠం సర్వగుణాన్వితమ్‌|| 20

ప్రణిపత్య తతస్తం భో పరిపూజ్య తతః పునః| ముచ్యతే సర్వరోగాద్యైస్తథా పాపైర్గ్రహాదిభిః|| 21

ఉగ్రసేనం పురా దృష్ట్వా స్వర్గద్వారేణ సాగరమ్‌| గత్వా77చమ్య శుచిస్తత్ర థ్యాత్వా నారాయణం పరమ్‌|| 22

న్య సేదష్టాక్షరం మంత్రం పశ్చాద్ధస్త తరీరయోః| ఓం నమో నారాయణాయేతి యం వదంతి మనీషిణః|| 23

కిం కార్యం బహుభిర్మంత్రైర్మనో విభ్రమకారకైః| ఓం నమో నారాయణాయేతి మంత్రః సర్వార్ధ సాధకః|| 24

ఆపో నరస్య సూనుత్వాన్నారా ఇతీహ కీర్తితాః| విష్ణోస్తా స్త్వయనం పూర్వం తేన నారాయణః స్మృతః|| 25

నారాయణపరా వేదా నారాయణపరా ద్విజాః| నారాయణపరా యజ్ఞా నారాయణపరాః క్రియాః|| 26

నారాయణపరా పృథ్వీ నారాయణపరం జలమ్‌| నారాయణపరో వహ్నిః నారాయణపరం నభః|| 27

నారాయణపరో వాయుర్నారాయణపరం మనః| అహంకారశ్చ బుద్ధిశ్చ ఉభే నారాయణాత్మకే|| 28

భూతం భవ్యం భవిష్యం చ యత్కించిజ్జీవసంజ్ఞితమ్‌| స్థూలం సూక్ష్మం పరం చైవ సర్వం నారాయణాత్మకమ్‌|| 29

శబ్దాద్యా విషయాః సర్వే శ్రోత్రాదీనీంద్రియాణి చ| ప్రకృతిః పురుషశ్చైవ సర్వే నారాయణాత్మకాః|| 30

జలేస్థతే చ పాతాళే స్వర్గలోకే7ంబరే నగే| అవష్టభ్య ఇదం సర్వమాస్తే నారాయణః ప్రభుః|| 31

కిం చాత్ర బహునోక్తేన జగదేతచ్చరాచరమ్‌| బ్రహ్మాదిస్తంబపర్యంతం సర్వం నారాయణాత్మకమ్‌|| 32

నారాయణాత్పరం కించిన్నేహ పశ్యామి భో ద్విజాః| తేన వ్యాప్తమిదం సర్వం దృశ్యా దృశ్యం చరాచరమ్‌|| 33

అపో హ్యాయతనం విష్ణుః స చ ఏవాంభసాం పతిః| తస్మాదప్సు స్మరేన్నిత్యం నారాయణ మఘాపహమ్‌|| 34

స్నానకాలే విశేషేణ చోపస్థాయ జలే శుచిః| స్మరేన్నారాయణం ధ్యాయేద్ధస్తే కాయే ద విన్యసేత్‌|| 35

ఓంకారంచనకారంచఅంగుష్ఠేహస్తయోర్నసేత్‌| శేషైర్హ(షాన్హ)స్తతలం(లే)యావత్తర్జన్యాదిషువిన్యసేత్‌|| 36

ఓం కారం వామపాదే తు నకారం దక్షిణ న్యసేత్‌ మోకారం వామకట్యాం తు నాకారం దక్షిణ న్యసేత్‌|| 37

రాకారం నాభిదేశే తు యకారం వామబాహుకే| ణాకారం దక్షిణ న్యస్య యకారం మూర్ధ్ని విన్యసేత్‌|| 38

అధశ్చోర్ధ్వం చ హృదయే పార్మ్వతః పృష్ఠతో7గ్రతః| ధ్యాత్యా నారాయణం పశ్చా దారభేత్కవచం బుధః|| 39

పూర్వే మాం పాతు గోవిందో దక్షిణ మధుసూదనః| పశ్చిమే శ్రీధరో దేవః కేశవస్తు తథోత్తరే|| 40

పాతు విష్ణుస్తథా77గ్నేయే నైరృతే మాధవో7వ్యయః| వాయవ్యే తు హృపీకేశ స్తథేశానే చ వామనః|| 41

భూతలే పాతు వారాహ స్తథోర్థ్వం చ త్రివిక్రమః| కృత్వైవం కవచం పశ్చా దాత్మానం చింతయేత్తతః|| 42

అహం నారాయణో దేవః శంఖ చక్ర గదా ధరః| ఏవం ధ్యాత్వా తదా77త్మాన మిమం మంత్రముదీరయేత్‌|| 43

మునులార! వినుండు. భక్తి మనసునందుంచిన సముద్రజల మార్జనము మార్కండేయ హ్రదమందు ప్రాతః స్నానము ఉత్తమపుణ్యఫలమిచ్చును. చతుర్దశియందు పూర్ణిమకు స్నానముజేసిన యశ్వమేథ ఫలమందును.

మార్కండేయహ్రదము, కృష్ణవటము బలరాముడు మహోదధి యింద్రద్యుమ్నసరస్సునను వీనికిపంచతీర్థములని పేరు. జ్యేష్ఠ పూర్ణిమ జ్యేష్ఠా నక్షత్రము కలసి వచ్చిన పుణ్యకాలమున ఈ తీర్థసేవనము పరమశుభమని చెప్పబడినది. త్రికరణములచేతను శుద్ధుడయి రాగద్వేషాదులను ద్వంద్వములను బాసికల్పవృక్షమును బోలిన మర్రిచెట్టునకు స్నాన పూర్వకముగ ప్రదక్షిణము జేసి విష్ణువునకు కూడ ముమ్మార్లు వలగొనినవాడు సప్తజన్మ పాపములనుండి ముక్తుడయి కోరిన సద్గతి బడయును. ఆ వటవృక్షమునకు వటేశ్వరుడు కృష్ణుడు, పురాణపురుషుడు అను పేరులు మూడు కృతాది యుగములందు గీర్తింపబడినది. కృతయుగమునందు నీ వృక్షప్రమాణము ఒక యోజనము. త్రేతాయుగమునందు నాల్గవవంతు తగ్గినది. ద్వాపరమందు సగము యోజనము. కలిలో దానిలో సగము వైశాల్యమని చెప్పబడెను. ఎడమ పాదమున ప్రణవమును దక్షిణపాదమున నకారము వామ కటియందు మోకారము కుడివైపున నాకారము నాభియందు రాకారము యెడమ భుజమున ''య'' కారమును కుడిభుజమున ణాకారము శిరస్సున ''య''కారమును న్యాసము చేయవలెను. క్రిందను మీదను హృదయమందును ఇరుప్రక్కలను పుష్ఠభాగమునను నారాయణుని ధ్యానించి నారాయణ కవచపారాయణము ప్రారంభించవలెను. గోవిందాది నామములతో తూర్పు మొదలుగ నలుదిక్కులయందును విష్ణువు, మొదలుగాగల నామములతో నాగ్నేయాది విదిక్కులయందు (మూలలందు)ను విష్ణువు రక్షించుగాకయని పలుకవలెను. వరాహమూర్తి భూతలమునందును త్రివిక్రముడు మీదను రక్షించుగాకయని పలికి నారాయణుడను నేనెయని యాత్మానుసంధానము చేయవలెను. (అద్వైతమును) అభేదమును సాధింవవలెను.

త్వమగ్నిర్ద్విపదాం నాథ రేతోధాః కామదీపనః| ప్రధానః సర్వభూతానాం జీవానాం ప్రభురవ్యయః|| 44

అమృతస్యారణిస్త్వం హి దేవయోని రపాంపతే| వృజినం హర మే సర్వం తీర్థరాజ నమో7స్తుతే|| 45

ఏవముచ్చార్య విధివత్తతః స్నానం సమాచరేత్‌| అన్యథా భో ద్విజశ్రేష్ఠాః స్నానం తత్ర న శస్యతే|| 46

కృత్వా తు వైదికైర్మంత్రై రభిషేకం చ మార్జనమ్‌| అంతర్జలే జపేత్పశ్చా త్త్రిరావృత్త్యా7ఘ మర్షణమ్‌|| 47

హయమేథో యథా విప్రాః సర్వపాప హరః క్రతుః| తథా7ఘమర్షణం చాత్ర సూక్తం సర్వాఘనాశనమ్‌|| 48

ఉత్తీర్య వాససీ ధౌతే నిర్మలే పరిధాయ వై | ప్రాణానాయమ్య చా77చమ్య సంధ్యాం చోపాస్య భాస్కరమ్‌|| 49

ఉపతిష్ఠేత్తతశ్చోర్ధ్వం క్షీప్త్వా పుష్పజలాంజలిమ్‌| ఉపస్థాయోర్థ్వబాహుశ్చ తల్లింగైర్భాస్కరం తతః|| 50

గాయత్రీం పావనీం దేవీం జపేదష్టోత్తరం శతమ్‌| అన్యాంశ్చ సౌరమంత్రాంశ్చ జప్త్వా తిష్ఠన్సమాహితః|| 51

కృత్వా ప్రదక్షిణం సూర్యం నమస్కృత్యోపవిశ్య చ| స్వాధ్యాయం ప్రాఙ్ముఖః కృత్వా తర్పయే ద్దైవతాన్యృషీన్‌|| 52

మనుష్యాంశ్చ పితౄంశ్చాన్యా న్నామగోత్రేణ మంత్రవిత్‌ | తోయేన తిలమిశ్రేణ విధివత్సునమాహితః || 53

తర్పణం దేవతానాం చ పూర్వం కృత్వా సమాహితః| అధికారీ భ##వేత్పశ్చా త్పితౄణాం తర్పణ ద్విజః|| 54

శ్రాద్ధే హవనకాలే చ పాణినైకేన నిర్వపేత్‌| తర్పణ తూభయం కుర్యా దేష ఏవ విధిః సదా|| 55

అటుపై నీక్రింది మంత్రమును జపింపవలెను. ఆమంతరభావమిది. మనుజులలో నగ్నిని నీవు. అనగా వైశ్వా నరాగ్నియను జఠరాగ్ని నీవె. కామోద్దీపనము చేయు వీర్యాధానము చేయువాడవు నీవె. సర్వభూతములకు ప్రధాన భూతము నీవు. సర్వజీవులకు ప్రభువవు. అమృతములకు సరణివి. అనగా జన్మస్థానము. దేవతలకు మూలపురుషుడవు. నా పాపము హరింపుము. ఓ తీర్థరాజమా! నీకు నమస్కారము. ఆపైన స్నానము చేయవలెను. స్నానమవసరమూ లేదు. ఆతీర్థ జలములందు వైదిక మంత్రములతో నభిషేకము చేసి మార్జనము చేసుకొన్నను చాలు. మోకాళ్ళు నీళ్ళలో నిలిచి యఘమర్షణ ఋక్కులను మూడావృత్తులు జపించుచు స్నానము చేసిన నశ్వమేధయాగఫలము వచ్చును.

గట్టునకు వచ్చి మడి బట్టలను ధరించి ప్రాణాయామాచరణములను జేసి సంధ్యనుపాసించి సూర్యోపస్థనము జెప్పి పూలతో జలాంజలి యిచ్చి బాహువులు మీదికెత్తి సూర్యు నుద్దేశించి నూటయెనిమిది మార్లు జపించవనెను. నిలువబడి ఇంకను గల సౌరమంత్రములను జపించవలెను. సూర్యునుద్దేశించి ప్రదక్షిణము జేసి నమస్కరించి తూర్పుముఖమై బ్రహ్మయజ్ఞము దేవర్షి పితృతర్పణములను గోత్రములతో పితృదేవతలకును తర్పణము చేయవలెను. దేవతా తర్పణమయిన తరువాతనే పితృతర్పణమున కధికారి యగును. శ్రాద్ధకాలమందు హోమకాలమందు నొంటిచేతితో జేయవచ్చును. తర్పణము రెండుచేతులతో జేయవలెను.

అన్వారబ్ధేన సవ్యేన పాణినా దక్షిణన తు| తృప్యతామితి సించేత్తు నామగ్రోత్రేణ వాగ్యతః|| 56

కాయస్థై ర్యస్తిలైర్మోహాతి త్కరో పితృతర్పణమ్‌| రుధిరం తద్భవేత్తోయం ప్రదాతా కిల్బిషీ భ##వేత్‌|| 57

భూమ్యాం యద్దీయతేతోయం దాతా చైవ జలే స్థితః| వృథా తన్ముని శార్దూలా నోపతిష్ఠతి కస్యచిత్‌|| 58

స్థలే స్థిత్వా జలే యస్తు ప్రయచ్ఛేదుదకం నరః| పితౄణాం నోపతిష్ఠేత సలిలం తన్నిరర్థకమ్‌|| 59

ఉదకే నోదకం కుర్యా త్పితృభ్యశ్చ కదాచన| ఉత్తీర్య తు శుచౌ దేశే కుర్యాదుదకతర్పణమ్‌|| 60

నోదకేఘ న పాత్రేఘ న క్రుద్ధో నైకపాణినా| నోపతిష్ఠతి తత్తోయం యద్భూమ్యాం న ప్రదీయతే|| 61

పితౄణామక్షయం స్థానం మహీ దత్తా మయా ద్విజాః| తస్మాత్తత్రైవ దాతవ్యం పితౄణాం ప్రీతిమిచ్ఛతా|| 62

భూమిపృష్ఠే సముత్పన్నా భూమ్యాం చైవ చ సంస్థితా భూమ్యాం చైవ లయం యాతా భూమౌదద్యాత్తతోజలమ్‌|| 63

ఆ స్తీర్య చ కుశాన్సాగ్రాం స్తానావాహ్య స్వమంత్రతః| ప్రాచీనాగ్రేషు వైదేవా న్యామ్యాగ్రేషు తథా పితౄన్‌|| 64

ఇతి శ్రీమహాపురాణ ఆదిబ్రాహ్మే స్వయంభు-ఋషిసంవాదే

సముద్రస్నాన విధి నిరూపణం నామ షష్టితమో7ధ్యాయ.

తర్పణము చేయువాడు నీటిలో నిలబడి యొడ్డున తర్పణము చేసిన యెడలను, వొడ్డున కూర్చుండి నీటిలో తర్పణము చేసినను అది ఆయా దేవతలకు జెందదు. వృథాయగును. పితృతర్పణము నీటిలో జేయరాదు. కుపితుడై చేయరాదు. ఒంటిచేతితో చేయరాదు. గట్టుమీదికి వచ్చి శుచియైన చోట పితృతర్పణము చేయవలెను. ఉదకమందు పాత్రలయందు జేయరాదు. అట్లు చేసిన నది పితృదేవతలకు నందదు. భూమియందు జేసిన పితృతర్పణము అక్షయము అందుకొరకె నేను భూమినిచ్చితిని. జలము భూమిలో పుట్టినది. భూమియందు బారుచున్నది. భూమియందే లయమగుచున్నది. కావున పితృతర్పణమునకు భూమి ప్రధాన స్థానము. అగ్రములతో నున్న దర్భలను తూర్పు అగ్రములుగ పఱచి దేవతలకును, దక్షిణాగ్రములుగ పఱచి పితృదేవతలకును తర్పణము జేయవలెను.

ఇది బ్రహ్మపురాణమున సముద్రస్నానవిధినిరూపణమను నఱువదవ అధ్యాయము.

Brahmapuranamu    Chapters