Brahmapuranamu    Chapters   

అథఅష్టపంచాశత్తమోధ్యాయః

నృసింహమాహాత్మ్యవర్ణనమ్‌

బ్రహ్మోవాచ

ఏవం దృష్ట్వా బలం కృష్ణం సుభద్రాం ప్రణిపత్య చ | ధర్మం చార్థం చ కామంచ మోక్షం చ లభ##తే ధ్రువమ్‌ || 1

నిష్క్రమ్య దేవతాగాఆర త్కృతకృత్యో భ##వేన్నరః | ప్రణమ్యాయతనం పశ్చా ద్ర్వజే త్తత్రసమాహితః ||2

ఇంద్రనీల మయో విష్ణు రత్ర೭೭ స్తే వాలుకావృతః | అంతర్థానగతం నత్వా తతో విష్ణుపురం వ్రజేత్‌|| 3

బ్రహ్మ యిట్లనియె!

ఇట్లు బలరాముని కృష్ణుని సుభద్రను జూచి మ్రొక్కి నయతడు ధర్మది పురుషార్థములను నాల్గింటిని బడయును. దేవాలయము వెడలి నమస్కరించి యిసుకలో దాగియున్న యింద్రనీలమణి స్వరూపుడగు విష్ణుని దర్శించిన భక్తుడు వైకుంఠమున కేగును.

సర్వదేవ మయో యోసౌ హతవా నసురోత్తమమ్‌ | స ఆ స్తే తత్ర భో విప్రాః సింహార్థ కృత నిగ్రహః 4

భక్త్యా దృష్ట్వా తు తం దేవం ప్రణమ్య నరకేసరిమ్‌ | ముచ్యతే పాతకైర్మర్త్యః సమసై#్త ర్నాత్ర సంశయః || 5

నరసింహస్య యే భక్తా భవంతి భువి మానవా! | నతేషాం దుష్కృతం కించిత్ఫలం స్యా ద్యద్యదీప్సితమ్‌ || 6

తస్మా త్సర్వప్రయత్నేన నరసింహం సమాశ్రయేత్‌ | ధర్మార్థ కామ మోక్షాణాం ఫలం యస్మాత్ర్పయచ్ఛతి|| 7

హిరణ్యకశిపుని సంహరించిన నరసింహమూర్తి సర్వదేవతామయము నిచట దర్శించిన నతడు సర్వపాప విముక్తుడగును. నరసింహభక్తుల కసాధ్యములేదు. సర్వాభీష్టములు లభించును. ఆయన సర్వపురుషార్థ ప్రదాత.

మునయః ఊచుః

మాహాత్మ్యం నారసింహస్య సుఖదం భువి దుర్లభం | యథా కథయసే దేవ తేన నో విస్మయో మమాన్‌ || 8

ప్రభావం తస్య దేవస్య విస్తరేణ జగత్పతే| శ్రోతు మిచ్ఛామహే బ్రూహి పరం కౌతూహలం హినః || 9

యథా ప్రసీదేద్దేవోసౌ నరసింహో మాహాబలః | భక్తానా ముపకారాయ బ్రూహి దేవ నమోస్తు తే || 10

ప్రసాదాన్నరసింహస్య యా భవంత్యత్ర సిద్ధయః | బ్రూహి తాః కురు చాస్మాకం ప్రసాదం ప్రపితామహ 11

నరసింహమూర్తి ప్రభావమును విపులముగా వినవలతును. ఆయన యెట్లు ప్రసన్నడగును. ఆయన వలన కలుగ సిద్దులేవి. దయచేసి తెల్పుము. ఆన బ్రహ్మ యిట్లనియె.

బ్రహ్మోవాచ

శృణుధ్వం తస్య భో విప్రాః ప్రభావం గదతో మమ | అజిత స్యాప్రమేయస్య భుక్తి ముక్తి ప్రదన్య చ || 12

కః శక్నోతి గుణా న్వక్తుం సమస్తాం స్తస్య భోద్విజా | సింహార్థ కృతదేహస్య ప్రవక్ష్యామి సమాసతః || 13

యాః కాశ్చి త్సిద్ధయ శ్చాత్ర శ్రూయంతే దేవ మానుషాః | ప్రసాదా త్తస్య తాః సర్వాః సిద్ద్యంతే నాత్ర సంశయః 14

స్వర్గే మర్త్యేచ పాతాళే దిక్షు తోయే పురే నగే | ప్రసాదా త్తస్య దేవస్య భవత్యవ్యాహతా గతిః || 15

అసాధ్యం తస్యదేవస్య నా స్త్యత్ర సచరాచరే|| నరసింహస్య భోవిప్రాః సదా భక్తానుకంపిన ః || 16

విధానం తస్య వక్ష్యామి భక్తనాముపకారకమ్‌ || యేన ప్రసీదే చ్చైవాసౌ సింహార్ధ కృత విగ్రహః || 17

శృణుధ్వం మునిశార్దూలాః కల్పరాజం సనాతనమ్‌ ! నరసింహస్య తత్త్వంచ యన్నజ్ఞాతం సురాసురై || 18

మునులారా! ఆయన యజయ్యుడు ''ఊహకందడు. భుక్తి ముక్తి ప్రదుడు. ఆయన గుణసంపద చెలుప వశము గాదు. ఆయన యనగ్రహముచే దైవ మానను సర్వసిద్ధలు లభించును. ఆయన దయచే స్వర్గ మర్త్య పాతాళాదులందు నప్రతిహాతమైన గమనమేర్పడును. చరాచరముల యందు నరసింహ భక్తున కసాధ్యము లేదు. నరసింహా స్వామి ప్రసన్నుడగుటకు సురాసురులకు గూడ తెలియని యాయన తత్వమును- ఉపాసనా కల్పమును చెప్పెదను. వినుండు.

శాక యావక మూలైస్తు ఫల పిణ్యాక సక్తుకై ః | పయోభ##క్షేణ విప్రేంద్రా వర్తయే త్సాధకోత్తమః || 19

కోశ కౌపీన వాసాశ్చ ధ్యానయుక్తో జితేంద్రియః | అరణ్య విజనే దేశే పర్వతే సింధు సంగమే || 20

ఊషరే సిద్ధ క్షేత్రేచ నరసింహా శ్రమే తథా | ప్రతిష్ఠాప్య స్వయం వాపి పూజాం కృత్వా విధానతః || 21

ద్వాదశ్యాం శుక్లపక్షస్య ఉషోష్య ముని పుంగవాః | జపేల్లక్షాణి విశన్మనసా సయంయతేంద్రియః || 22

ఉపపాతక యుక్తశ్చ మహాపాతక సంయుతః | ముక్తో భ##వేత్తో విప్రాః సాధకో నాత్ర సంశయః || 23

నృసింహోపాసకుడు ఆకులు-దుంపలు-యవల- పండ్లు-పేలపిండి-ఒలము మాత్రముతో వర్తించుచు పట్టుగోచి పెట్టుకొని యరణ్యమునందు నదీ సంగమమునందు-ఊషర క్షేత్రమునందు సిధ్ద క్షేత్రమునందు స్వామిని ప్రతిష్ఠించి జితేంద్రియుడై సమాధి నిష్ఠుడై కల్పవిధానముచే బూజింపవలెను. శుక్ల వక్ష ద్వాదశినాడుపవసించి నృసింహమంత్రము నిరువది లక్షలు జపించపవలెను. దానిచే మహాపాత కోవపాతకముల నుండి ముక్తుడగును.

కృత్వా ప్రదక్షిణం తత్ర నరసింహా ప్రపూజయేత్‌ | పుణ్య గంధాదిభిర్ధూపైః ప్రణమ్య శిరసా ప్రభుమ్‌ || 24

కర్పూర చందనాక్తాని జాతీ పుష్పాణి మస్తకే | ప్రదద్యా న్నరసింహస్య తతః సిద్దిః ప్రజాయతే || 25

భగవాన్సర్వ కార్యేషు న క్వ చిత్ర్పతిహన్యతే | తేజః సోఢుం నశక్తాః స్స్యుర్ర్బహ్మరుద్రా దయస్సురాః || 26

కింపున ర్దానవా లోకే సిద్ద గంధర్వ మానుసాః | విద్యధరా యక్షగణాః సకిన్నర మహోరగాః || 27

మంత్రం యా నాసుర్హానంతుం జపంత్యే కేన్య సాధకాః | తే సర్వే ప్రళయం యాంతి దృష్ట్వా ೭೭దిత్యాగ్ని వర్చసః ||

సకృజ్జప్తం తు కవచం రక్షే త్సర్వ ముపద్రవమ్‌ | ద్విర్జప్తం కవచం దివ్యం రక్షతే దేవదానవాత్‌ || 29

గంధర్వాః కిన్నరా యక్ష విద్యాధర మహోరగాః | భూతాః పిశాచా రక్షాంసి యే చాన్యే పరిపంధినః || 30

త్రిజప్తం కవచం దివ్య మభ్యేదం చ సురాసురై ః | ద్వాదశాభ్యంతరే చైవ యోజనానాం ద్విజోత్తమా ః || 31

స్వామికి ప్రదక్షిణమాచరించి షోడశోపచార పూజలనొనరించి నమస్కారము చేయవలెను. పచ్చ కర్పూరము నలదు నద్దిన పూవులను శిరసునందుంచిన సిద్దిని బడయగలరు. అన్ని పనులు అప్రతిహముగ సఫలమగును. బ్రాహ్మ రుద్రాదులేని యాయాన తేజస్సును నోర్వజాలరు. దానవ-సిద్ద-గంధర్వ-మానుషాదుల విషయము చెప్పనేల. ఆసురములైన మంత్రములు నాభిచారికములును నృసింహ మంత్రజపముచే బ్రళయము చెందును. నృసింహకవచము నొక్కసారి జపించిన సర్వోవద్రవములనుండి రక్షించును. రెండుసార్లు జపించిన దేవదానవ యక్ష భూత ప్రేత పిశాచాదుల బాధలు నశించును. మూడుసార్లు జపించిన పండ్రెండు యోజనముల మేరలో నురాసురలకు నభేద్యడగును.

రక్షతే భగవాన్దేవో నరసింహో మహాబలః | తతో గత్వా బిలద్వార ముపోష్య రజనీత్రయమ్‌ || 31

పలాశ కాష్ఠైః ప్రజ్వాల్య భగవంతమ్‌ హుతాశనమ్‌ | పలాశ సమిధస్తత్రజుహుయా త్రిమధు ప్లుతాః || 32

ద్వే శ##తే ద్విజ శార్దూలా వషట్కారేణ సాధకః | తతో వివరద్వారం తు ప్రకటం జాయతే క్షణాత్‌ || 33

తతో విశేత్తు ని శ్శంకం కవచ వివరం బుధః | గచ్ఛతః సంకటం తస్య తమో మోహశ్చ నశ్యతి || 34

రాజమార్గః సువి స్తీర్ణో దృశ్యతే భ్రమరాజితః నరసింహం స్మరం స్తత్ర పాతాళం విశ##తే ద్విజాః || 35

ఇట్లా భగవంతుని పూజించి యాసాధకుడు నృసింహబిలద్వారమునకేగి మూడు రాత్రులు మోదుగ సమిధలచే నగ్నిని జ్వలింప జేసి త్రిమధు రసపూతములైన మోదుగ సమిధలను హోమము చేయవలెను. రెండువందల హోమములను వషట్కారపూర్వకముగా జేయవలెను. అంతట నరసింహబిలద్వారము తెరుచుకొనును. నిశ్శంకముగా నృసింహకవచన్యాసము చేసికొని లోనికి ప్రవేశించిన సాధకునకు దమో మోహము కల్గును. వెంటనే సువిశాలమైన రాజమార్గము కనిపించును. ఆట తేనెతీటగల బాధ కనిపించదు. నృసింహుని స్మరించుచు నటనుండి సాధకుడు పాతాళము ప్రవేశించును.

గత్వా తత్ర జపే త్తత్వం నరసింహాఖ్య మవ్యయమ్‌ | తతః స్త్రీణాం సహస్రాణి వీణావాదన కర్మణామ్‌ || 36

నిర్గచ్ఛంతి పురో విప్రాః స్వాగతం తా వదంతి చ | ప్రవేశయంతి తా హస్తే గృహీత్వా సాధకేశ్వరమ్‌ || 37

తతో రసాయనం దివ్యం పాయయంతి ద్విజోత్తమాః | పీతమాత్రే దివ్యదేహో జాయతే సుమహాబలః || 38

క్రీడతే సహ కన్యాభి ర్యావదాభూత సంప్లవమ్‌ | భిన్నదేహో వాసుదేవే లీయతే నాత్ర సంశయః 39

ఆలోనికేగి నృసింహమంత్రజపము జేయగా వీణామేళనము జేయు వేలకొలది స్త్రీలెదురై స్వాగతమిచ్చి చేయి పట్టుకొని లోనికి బ్రవేశింప జేయుదురు. తరువాత నొక దివ్య రసాయనపాపముచే దివ్యశరీరరియు బలశాలియు నగును. భూతవ్రళయముదాక నా కన్యలతో గ్రీడించి శరీరము బాసి వాసుదేవునియందు లీనమగును.

యదా సరోచతే వాస స్తస్మాన్నిర్గచ్ఛతే పునః | పట్టం శూలం చ ఖడ్గం చ రోచనా చ మణిం తథా|| 40

రసం రసాయనం చైవ పొదుకాంజన మేవచ | కృష్ణాజినం మునిశ్ర్శేష్ఠా గుటికాం చ మనోహరామ్‌ || 41

కమండలుం చాక్షసూత్రం యష్టిం సంజీవనీం తథా | సిద్ధవిద్యాం చ శాస్త్రాణి గృహీత్వా సాధకేశ్వరః || 42

జ్వలద్వహ్ని స్ఫులింగోర్మి వేష్టితం త్రిశిఖంహృది | సకృన్న్యస్తం దహేత్సర్వం వృజినం జన్మకోటిజమ్‌ || 43

విషే న్యస్తం విషం హన్యా త్కుష్ఠం హన్యాత్తనౌ స్థితమ్‌ || స్వదేహే భ్రూణహత్యాది కృత్వా దివ్యేన శుధ్యతి || 44

మహాగ్రహ గృహేతేషు జ్వలమానం విచిన్తయేత్‌ | హృదంతే వైతతః శీఘ్రం నశ్యేయు ర్దారుణా గ్రహాః 45

బాలానాం కంఠకే బద్దం రక్షాభవతి నిత్యశః | గండపిండక లూతానాం నాశనం కురుతే ధ్రువమ్‌ || 46

వ్యాధిజాతే సమిద్భిశ్చ ఘృతక్షీరేణ హోమయేత్‌ | త్రిసంధ్యం మాపమేకం తు సర్వరోగా న్వినాశ##యేత్‌ || 47

అసాధ్యం తు న పశ్యామి త్రైలోక్యే సచరాచరే | యాం యాం కామయతే సిద్ధిం తాంతాంప్రాప్నోతి సధ్రువమ్‌ || 48

ఆ గుహయందు వలసింవ గోరనివాడటనుండి వెలికివచ్చి పట్టము శూలము ఖడ్గము రోచనము మణి రసము రసాయనము పాదుకాంజనము కృష్ణాజినము మనోహరమైన కమండలువు. అక్షమాల సంజీవని విద్యయును. శస్త్రములను జేకొని బ్వలించెడి విస్ఫులింగములచే నావరింపబడిన త్రిశిఖము నొక్కసారి హృదయమందు నానించినంతనే ననేక కోటిజన్మపాపము. దహింపబడును. ఆ త్రిశూలమును విషమునందుంచిన విషము విరిగిపోవును. శరీరమునకు దాకించిన కుష్ఠువ్యాధి పోవును. తన దేహమందు మోపిన బ్రూణహత్య మొదలైన పాపములు పోవును. తీవ్రమయిన హ్రబాధలు జ్వలించు నాత్రిశూలమును ధ్యనించినంతనే నశించును. బాలురకు కంఠమందుగట్టిన రక్ష యిచ్చును . అది గళరోగములను. గండపిండకలూతాదిరోగములను నశింపజేయును. ఆవునేతితో ఆవుపాలతో సమిధలతో నొకనెల మూడుసంధ్యలయందును. నామంత్రజపముచే హోమముచేసినయెడల నసాధ్యరోగములు కూడ నశించును. త్రిలోకములందేది కోరినను సిద్దించును. నృసింహుని పూజించినయెడల కోరిక కెల్ల సిద్దించును.

అష్టోత్తరశతం త్వేకే పూజాయిత్వా మృగాధిపతమ్‌ | మృత్తికాః సప్త వల్మీకే శ్మశానే చ చతుష్పథే || 49

రక్తచందన సంమిశ్రా గవాం క్షీరేణ లోడయేత్‌ | సింహస్య ప్రతిమాం కృత్వా ప్రమాణన షడంగుళమ్‌ || 50

లింపేత్తథా భూర్జపత్రే రోచనేన సమాలిఖేత్‌ | నరసింహస్య కంఠే తు బద్ధ్వా చైవ హి మంత్రవత్‌ || 51

జపేత్సంఖ్యా విహీనంతు పూజయిత్వా జలాశ##యే | యావత్సప్తాహమాత్రంతు జపేత్సంయమితేంద్రియః 52

జలాకీర్ణా ముహూర్తేన జాయతే సర్వమేదినీ | అథవా శుష్కవృక్షాగ్రే నరసింహంతు పూజయేత్‌ || 53

జప్త్వా చాష్టశతం తత్త్వం వర్షంతం వినివారయేత్‌ | తమేవం పింజకే బద్ధ్వా భ్రామయేత్సాధకోత్తమః 54

మహావాతో ముహూర్తేన ఆగచ్ఛన్నాత్ర సంశయః | పురశ్చ ధారయేత్‌క్షి ప్తం సప్తజప్తేన వారిణా|| 55

నరసింహుని యష్ణోత్తర శతనామములతో బూజించి పుట్టమన్ను స్మశానమందలి మట్టి రాజవీధిని నాలుగు దారులుకలియు చోటనుండియు నేడేసిమట్టియుండలు గ్రహించి రక్తచందనము కలిపి యావుపాలతో మెదిపి యారంగుళము నరసింహ ప్రతిమ తయారుజేసి భూర్జపత్రమునందు గోరోచనముతో మంత్రమును వ్రాసి నరసింహ స్వామికంఠమునందుగట్టి మంత్రమును లెక్కలేకుండగ మడుగులో నిలిచి యేడురోజులు పూజించి జపింవవలెను. అందువలన ముహూర్తమాత్రములో నెల్లభూమియు జలసమృద్ధమగును. ఎండినచెట్టుచివర నరసింహమూర్తిని పూజించి నూటయెనిమిది మార్లామంత్రము జపించినయెడల వర్షమాగిపోవును. అట్లే నరసింహస్వామిని పిండిముద్దలోనుంచి గిరగిర త్రిప్పినయెడల వెంటనే పెనుగాలి వీచును. తరువాత నేడుసార్లు జపించి మంత్రించిన జలముచే నావ్రతిమనభిషేకించి దానిని దాను ధరింపవలెను.

అథ తాం ప్రతిమాం ద్వారి నిఖనే ద్యస్య సాధకః | గోత్రోత్సాదో భ##వే త్తస్య ఉద్ధృతే చైవ శాంతిదః || 56

తస్మాత్తం మునిశార్దూలా భక్త్యా సంపూజయేత్సదా | మృగరాజం మహావీర్యం సర్వకామఫలప్రదమ్‌ || 57

విముక్తః సర్వపాపేభ్యో విష్ణులోకంస గచ్ఛతి | బ్రాహ్మణాః క్షత్రియా వైశ్యాః స్త్రియః శూద్రాస్త్య జాతయః || 58

సంపూజం తం సుర శ్రేష్ఠం భక్త్యా సింహవపుర్ధరమ్‌ | ముచ్యంతే త్వ శుభై ర్దుఃభై ర్జన్మకోటి సముద్భవైః || 59

సంపూజ్య తంసురశ్రేష్ఠం ప్రాప్నువంత్యభివాంచితమ్‌ | దేవత్వమమరేశత్వం గంధర్వత్వంచభోద్విజాః || 60

యక్షవిద్యాధరత్వం చ తథాన్యచ్ఛాభి వాంఛితమ్‌ | దృష్ట్యా స్తుత్వా నమస్కృత్వా సంపూజ్య నరకేసరీమ్‌ || 61

ప్రాప్నువంతి నరా రాజ్యం స్వర్గం మోక్షంచ దుర్లభమ్‌ | నరసింహం నరో దృష్టా లభేదభిమతమ్‌ ఫలమ్‌ || 62

నిర్ముక్తః సర్వపాపేభ్యో విష్ణులోకం సగచ్ఛతి | సకృద్దృష్ట్వా తు తం దేవం భక్త్యా సింహవపుర్ధరమ్‌ || 63

ముచ్యతే చాశుభై ర్దుఃభై ర్జన్మకోటి సముద్భవై ః | సంగ్రామే సంకటే దుర్గే చోరవ్యాఘ్రాది పీడితే || 64

స్మృత్వా తం పురుషః సర్వై రాజగ్రా మైర్విముచ్చతే | సూర్యోదయే యథా నాశంతమో భ్యేతి మహత్తరమ్‌ || 65

తథా సందర్శనే తస్య వినాశం యాంత్యుపద్రవాః ఘుటికాంజన పాతాళ పాదుకేచ రసాయనమ్‌ || 66

నరసింహే ప్రసన్నే తు ప్రాప్నోత్యన్యాంశ్చ వాంఛితాన్‌ | న్యా యోన్కామా నభిధ్యా యన్భజతే నరకేసరీమ్‌ || 67

దానిని యెవ్వని గృహద్వారమందు పాతిపెట్టునో వానివంశము నశించును. ఆ ప్రతిమను వెలికిదీయగా నా యుపద్రము శాంతించును. కావున సర్వాభీష్టముల నొసంగు నరసింహమూర్తిన భక్తితో బూజింపవలెను. దానిచే పాపముక్తుడై విష్ణులోకమందును. బ్రాహ్మణాది వర్ణములవారు ఆంత్యజులుకూడా నా స్వామిని పూజించి యమంగళములను తరింపగలరు. అంతియకాదు దేవత్వ దేవేంద్రత్వములు యక్షవిద్యాధరగంధర్వాది దేవవిశేష భావములను రాజ్య స్వర్గసుఖములను దుర్లభ##మైన మోక్షమును గూడ బొందగలరు. నృసింహదర్శన మొకసారి చేసినను పాప విముక్తినంది యభీష్టమునొదగలరు. యుద్దమందు. సంకటములందు దొంగలు కిరాతులు మొదలైనవాం పీడచే దుర్గమమమైన యదవియందు ప్రాణసందేహము కల్గినపుడు విషాగ్ని జలోపద్రవములనుండియు రాజులవలనసముద్రము వలన గ్రహముల వలన కలుగు పీడనుండి తరించును. నృసింహస్వామిని స్మరించినంతనే రాజోపద్రవములునుండి ముక్తుడగను. ఉదయమందు జీకటి విడిపోయినట్లు స్వామి దర్శనముచే సమస్త కష్టములు నశించును. ఘటిక కాటుక - పాదుక యను వానియందు రసాయన సిద్దిని పొందవచ్చును. ఎల్లకోరికలు ఫలించును.

తాంస్తా న్కామా నవాప్నోతి నరో నాస్త్యత్ర సంశయః | దృష్ట్వా తందేవదేశంభక్త్య పూజ్య ప్రణమ్యచ|| 68

దశానా మశ్వమేధానాం ఫలం దశగుణం లభేత్‌ | పాసైః సర్వైర్వినిర్ముక్తో గుణౖః సర్వైరలంకృతః|| 69

సర్వకామ సమృద్ధత్మా జరామరణవర్జితః | సౌవర్ణేన విమానేన కింకిణీజాలమాలినా ||70

సర్వకామ సమృద్దేన కామగేన సువర్చసా| తరుణాదిత్య వర్ణేన ముక్తాహారావలంబినా || 71

దివ్యస్త్రి శతయుక్తేన దివ్యగంధర్వ నాదినా | కులైకవింశముద్దృత్య దేవవన్ముదితః సుఖీ || 72

స్తూయమానో ప్సరోభిశ్చ విష్ణులోకం వ్రజేన్నరః | భుక్త్వాతత్ర వరాన్భోగాన్విష్ణులోకే ద్విజోత్తమాః || 73

గంధర్వైప్సరైర్యుక్తః కృత్వా రూపం చతుర్భజమ్‌ | మనోహ్లదకరం సౌఖ్యం యావదాభూతసంప్లవమ్‌ || 74

పుణ్యక్షయా దిహాయాతః ప్రవరే యోగినాం కులే | చతుర్వేదీ భ##వేద్విప్రో వేదవేదాంగ పారగః || 75

వైష్ణవం యోగమాస్థాయ తతో మోక్షమవాప్నుయాత్‌ || 76

ఇతి మహాపురాణ ఆదిబ్రాహ్మే నృసింమమాహాత్మ్యవర్ణననామ అష్టపంచాశత్తమో ధ్యాయః

స్వామిని పూజించి నమస్కరించి దర్శించి యశ్వమేధయాగముల ఫలమందును సద్గుణ సంపన్నడగునున. జరామరణములు లేనివాడయి, చిరుగంటలతో మెరయు మొరయు కామదమైన స్వర్గవిమానమెక్కి యుదయసూర్యుని వలె దివ్యవర్చస్సుతో ముత్యాలహారములు మెరయు దివ్య స్త్రీశతముతో గంధర్వగానరమ్యమైన విమానమెక్కి యిరువదియెక్క తరములవారి నుద్దరించుచు సాక్షాద్దేవతాస్వరూపముతో నమ్మోదముతో సుఖముతో అప్సరసలు స్తుతింప విష్ణులోకమునకేగును. అందనుపమ భోగముల ననుభవించి చతుర్భజముల దాల్చి మనోహరమైన రూపముతో భూతప్రళయము దాక నానంటించి యా పుణ్యము భుక్తమయిన తరువాత సుత్తమమయిన యోగుల కులమందు బుట్టి చతుర్వేద వేదాంగ పారగుడయి విష్ణుదేవతా భక్తియోగమునంది మోక్షమును బొందును.

ఇది బ్రహ్మపురాణమందు నృసింహనూహాత్మ్యవర్ణనమను ఏబది ఎనిమిదవ అధ్యాయము.

Brahmapuranamu    Chapters