Brahmapuranamu    Chapters   

అధపంచ పంచాశత్తమో7ధ్యాయః

మార్కండేయాఖ్యానమ్‌

బ్రహ్మోవాచ

స నిష్క్రమ్యోదరాత్తస్య బాలస్య మునిసత్తమాః | పున శ్చైకార్ణవాముర్వీమపశ్యజ్జనవర్జితామ్‌ || 1

పూర్వదృష్టం చ తం దేవం దదర్శ శిశురూపిణమ్‌ | శాఖాయాం వటవృక్షస్య పర్యంకోపరిసంస్థితమ్‌ || 2

శ్రీవత్సవక్షసం దేవం పీతవస్త్రం చతుర్భుజమ్‌ | జగదాదాయ తిష్ఠంతం పద్మపత్రాయతేక్షణమ్‌ || 3

సో7పి తం మునిమాయాంతం ప్లవమానమచేతనమ్‌ | దృష్ట్వాముఖా ద్వినిష్క్రాంతం ప్రోవాచ ప్రహసన్నివ || 4

శ్రీ భగవానువాచ

కచ్చిత్త్వయోషితం వత్స విశ్రాంతం చ మమోదరే | భ్రమమాణశ్చ కిం తత్ర ఆశ్చర్యం దృష్టవానసి || 5

భక్తో7సి మే మునిశ్రేష్ఠ శ్రాంతో7సిచ మమా77శ్రితః | తేన త్వాముపకారాయ సంభాషే పశ్య మామిహ || 6

బ్రహ్మ యిట్లనియె.

మార్కండేయుడు ఆ పాపని కడుపునందుండి వెడలి వెలుపల నొక్కటే సముద్రమయిన భూమిని నిర్జనమయిన దానిని దర్శించెను. మున్ను చూచిన యా బాలుని కూడ మర్రికొమ్మపై వటపత్ర పర్యంకమున నున్న శిశువును గాంచెను. శ్రీవత్స చిహ్నమురమున దీపింప పీతాంబరము ధరించి యా పద్మపత్రలోచనుడు జగత్తును జేకొనియున్నట్లు దర్శించెను. ఆ బాలుడు కూడ తన ముఖమునుండి వెడలి యా మహార్ణవమున దేలి చేష్టలు దక్కియున్న నా మునిని జూచి ''వత్సా! నాకడుపునందు బ్రవేశించి విశ్రమించితివా? అందిటునటు పరిభ్రమించి యేమి వింత జూచితివి? ఓ మునిశ్రేష్ఠ! నాకు భక్తుడవు. నాయండ చేరితివి. అలసితివి. కావున నీకుపకారము చేయ సంభాషించుచున్నాను. నావంక జూడుమని యల్లన నవ్వుచు భగవంతుడనియె.

బ్రహ్మోవాచ

శ్రుత్వా స వచనం తస్య సంప్రహృష్టతనూరుహః | దదర్శ తం సుదుష్ప్రేక్షం రత్నైర్దివ్యైరలంకృతమ్‌ || 7

ప్రసన్ననిర్మలా దృష్టిర్ముహూర్తాత్తస్య భో ద్విజాః | ప్రసాదాత్తస్య దేవస్యప్రాదుర్భూతా పునర్నవా || 8

రక్తాంగుళితలౌపాదౌ తతస్తస్య సురార్చితౌ | ప్రణమ్య శిరసా విప్రా హర్ష గద్గదయా గిరా || 9

కృతాంజలిస్తదా హృష్టో విస్మితశ్చ పునః పునః | దృష్ట్వా తం పరమాత్మానం సంస్తోతు ముపచక్రమే || 10

ఆమాట విని యుప్పొంగి యొడలు గగుర్పొడవ నీ కన్నుల గనరాని దివ్య రత్నాలంకృతుడయిన యమ్మేటి వేల్పుని మార్కండేయుడు దర్శించెను. అంత నాముని తదనుగ్రహమున మిగుల నిర్మలమై ప్రసన్నమై మరల క్రొత్త సొగసు నొంది యావిర్భవించెను. ఎఱ్ఱని వ్రేళ్ళు గల యామేటివేల్పు అడుగుల తలవాంచి వ్రాలి సువంద్యములయిన యా పాదద్వందమునకు బ్రణమిల్లి హర్ష గద్గదములయిన మాటలతో కృతాంజలియై యానంద భరితుడై యచ్చెరువొందుచు మరిమరి జూచి యా పరమాత్మను స్తుతించుట కారంభించెను.

మార్కేండయ ఉవాచ

దేవ దేవ జగన్నాథ మాయాబాలవపుర్థర | త్రాహిమాం చారుపద్మాక్ష దుఃఖితం శరణాగతమ్‌|| 11

సంతోప్తో7స్మి సుర శ్రేష్ఠ సంవర్తాఖ్యేన వహ్నినా | అంగార వర్షభీతం చ త్రాహిమాం పురుషోత్తమ || 12

శోషితశ్చ ప్రచండేన వాయునా జ్వలతామునా | విహ్వలో7హం తథా శ్రాంతస్త్రాహి మాం పురుసక్షత్తమ || 13

తాపితశ్చ తవామాత్యైః ప్రలయావర్తకాదిభిః | న శాంతిమధిగచ్ఛామి త్రాహిమాం పురుషోత్తమ || 14

తుషితశ్చ క్షుధా77విష్ణో దుంఖితశ్చ జగత్పతే | త్రాతారం నాత్ర పశ్యామి త్రాహిమాం పురుషోత్తమ || 15

అస్మిన్నేకార్ణ వే ఘోరే వినష్టే సచరాచరే | నచాంతమధిగచ్ఛామి త్రాహిమాం పురుషోత్తమ || 16

తవోదరే చ దేవేశ మయా దృష్టో చరాచరహ్‌ | విస్మితో 7హం విషణ్ణశ్చ త్రాహిమాం పురుషోత్తమ || 17

సంసారే7స్మిన్నిరాలంటే ప్రసీద పురుషోత్తమ | ప్రసీద విబుధ శ్రేష్ఠ ప్రీద విబుధప్రియ|| 18

ప్రసీద విబుధాంనాథ ప్రసీదవిబుధాలయ | ప్రసీద సర్వలోకేశ జగత్కారణ కారణ || 19

ప్రసీద సర్వకృద్దేవ ప్రసీద మమభూధర | ప్రసీద సలిలావాన ప్రసీద మధుసూదన || 20

ప్రసీద కమలాకాంత ప్రసీద త్రిదశేశ్వర | ప్రసీద కంసకేశిఘ్న ప్రసీదారిష్టనాశన || 21

ప్రసీద కృష్ణ దైత్యఘ్న ప్రసీదదనుజాంతక | ప్రసీద మథురావాస ప్రసీదయదునందన|| 22

ప్రసీద శక్రావరజ ప్రసీదవరదావ్యయ | త్వం మహీత్వం జలం దేవ | త్వమగ్నిస్త్వం సమీరణః 23

త్వం నభస్తవ్వం మనశ్చైవ త్వమహంకార ఏవ చ | త్వం బుద్దిః ప్రకృతశ్చైవ స్తత్వాద్యాస్త్వం జగత్పతే || 24

పురుషస్త్వం జగద్వ్యాపీ పురుషాదపి చోత్తమః | త్వమింద్రయాణి సర్వాణి శబ్దాద్యా విషయాః ప్రభో || 25

త్వం దిక్పాలాశ్చ ధర్మాశ్చ వేదా యజ్ఞాః సదక్షిణాః | త్వమింద్రస్త్వం శివో దేవ స్త్వం హవిస్త్వం హుతాశనః || 26

త్వం యమఃః పితృరాట్దేవ ః త్వం రక్షాధిపతిః స్వయమ్‌ | వరుణ స్త్వమపాం నాథః త్వం వాయుస్త్వం ధనేశ్వర|| 27

త్వమీశాన స్త్వ మనంత స్త్వం గణశశ్చ షణ్ముఖంః వసవస్త్వం తథా రుద్రాస్త్వమాదిత్యాశ్చ ఖేచరాః || 28

దానవాస్త్వం తథా యక్షాస్త్వం దైత్యా ః సమరుద్గణాః | సిద్ధాధాశ్చాస్సరసో నాగా గంధర్వాస్త్వం సచారణాః || 29

పితరో వాలఖిల్యాశ్చ ప్రజానానం పతయో7చ్యుత | మునయ స్త్వమృషిగణా స్త్వమశ్వినౌ నిశాచరాః || 30

ఆన్యాశ్చ జాతయ స్త్వంహి యత్కించిజ్జీవ సంజ్ఞితమ్‌ | కించాత్ర భహునో క్తేన బ్రహ్మాది స్తంబగోచరమ్‌|| 31

భూతం భవ్యం భవిష్యం చ త్వం జగత్సచరాచరమ్‌ | య తే%్‌తేరూపం పరం దేవ కూటస్తమచలంధ్రువమ్‌ || 32

బ్రహ్మాద్యాస్తన్న జానంతి కథమన్యే7లప్పమేధసః | దేవ శుద్ధస్వభావో 7సి నిత్యస్త్వం ప్రకృతేః పరః || 33

అవ్యక్తః శాశ్వతో 7నంతః సర్వవ్యాపీ మహేశ్వర ః | త్వమాకాశః పరః శాంతో అజస్త్వం విభురవ్యయః ||34

మార్కండేయ కృతస్తవము.

దేవదేవ! మాయాబాలమూర్తిధర! పద్మాక్ష! దుఃఖితుడనై శరణొందిన నన్ను రక్షింపుము. ప్రళయకాలాగ్నికి నుడికిపోయితిని నిప్పుల వర్షమునకు జడిసిపోతిని. ప్రళయ ప్రచండ వాయువునకు నారిపోతిని. అలసి విహ్వలుడ నయి ప్రథయాపర్తమునకు నదిరిపోయి శాంతగనజాలకున్నాను. ఆకలి దప్పులకు వశుడనైలని. పురుషోత్తమా ! నేనొక రక్షనిందు గననైతిన. రక్షింపుము. ఈ ఏకార్ణవ వ్రళయమందు చరాచరము సురిగిపోయిన యీ ఘోరదశ యందు - నంతుదరి గనలేకున్నాను. దేవేశ! నీ యుదనగోళమున చరాచర ప్రపంచమును గంటిని. ఆశ్చర్య విషాదములందుచున్నాను. దిక్కలేని యీసంసారమున - పరమేశ ! ప్రసన్నుడవు కమ్ము. ఓ వేల్పుమేటి! ప్రసాద ముం జూపుము. దేవనాధ! అనుగ్రహింపుమను గ్రహింపుము. జగత్కారణులకు కారణుడవు. నీవ పంచభూతములు. అహంకారము నీవు. మహత్తత్వము బుద్ధినీవు. ప్రకృతివి. సత్వాది గుణత్రయము నీవు. నీవ దిక్పాలురవు. అష్టవసువులు నీవు. ఏకాదశరుద్రులు, ద్వాధశాదిత్యులు, గంధర్వులు, దేవదానవులు, మరుత్తులు, పితృదేవతలు, వాలఖిల్యాదులు, ప్రజావతులు, సప్తఋషులు, అశ్వినులు, మఱి మనసుకు మాటకునందని యశేషజీవ సంతతి బ్రహ్మాదిస్తంబ పర్యంత బూత భవ్య భవిష్యజ్ఞాలము నీ రూపము. అంతకును మీదనున్న కూటస్థుడవు నీవు. బ్రహ్మాదులు నిన్నెరుగరు. అల్పమేధసులు నీజాడ నెట్లరుగుదురు. నీవ నిత్య శుద్ద బుద్ధ ముక్తస్వభావుడవు. ప్రకృతి కవ్వల వాడవు. అవ్యక్తుదవు. అనంతుడవు. అంతట నున్నవాడవు. ఆకాశమువలె శాంతుడవు.

ఏవం త్వాం నిర్గుణం స్తోతుం కః శక్నోతి నిరంజనమ్‌ | స్తతో7సి యన్మయా దేవ వికలేనాల్పచేతసా||

తత్సర్వం దేవదేవేశ క్షంతుమర్హసి చావ్యయ|| 35

ఇతి శ్రీ మహాపురాణస్త్ర ఆది బ్రాహ్మేస్వయంభు ఋషిసంవాదే భగవత్త్సవనిరూపణం

నామ పంచపంచాశత్తమో7ధ్యాయః

ఇట్లు నిర్గుణుడు, నిరంజనుడు అయిన నిన్ను యెవ్వరు. స్తుతింపగలరు. మనసు చెదిరిన నల్పమతినయిన నేను నిన్ను స్తతించితిని . ఇదెల్ల క్షమింప నర్హుడవు. ఓ అప్యయ ! దేవదేవేశ ! వందనము.

ఇదిబ్రహ్మపురాణ మార్కండేయఖ్యానమను ఏబదిఐదవ అధ్యాయము.

Brahmapuranamu    Chapters