Brahmapuranamu    Chapters   

పంచచత్వారింశో7ధ్యాయః

పురుషోత్తమక్షేత్రవర్ణనమ్‌

మునయు ఊచుః

తస్మిన్‌క్షేత్రవరే పుణ్య వైష్ణవే పురుషోత్తమే| కింతత్ర ప్రతిమా పూర్వం నస్థితా వైష్ణవీ ప్రభో || 1

యేనాసౌ నృపతిస్తత్ర గత్వా సబలవాహనః | స్థాపయామాస కృష్ణం చ రామం భద్రం శుభప్రదమ్‌ || 2

సంశయో నో మహానత్ర విస్మయశ్చ జగత్పతే| శ్రోతుమిచ్చామహే నర్వం బ్రూహి తత్కారణం చనః || 3

మును లిట్లనిరి.

పురుషోత్తమమను నా పుణ్య వైష్ణవ క్షేత్రము నారాజు ససైన్య పరివారముగ సేవించి యందు బలరామ కృష్ణులను ప్రతిష్టించి పూజించెనని విందు మా కథ నవిస్తరముగ నానతిమ్మన బ్రహ్మ వారల కిట్లనియె

బ్రహ్మోవాచ.

శృణుధ్వం పూర్వసంవృత్తాం కథాం పాపప్రణాశినీమ్‌ | ప్రవక్ష్యామి సమాసేన శ్రియా పృష్టః పురా హరిః 4

సుమేరోః కాంచనే శృంగే సర్వాశ్చర్య సమన్వితే | సిద్ద విద్యాధరైర్యక్షైః కిన్నరైరుపశోభితే || 5

దేవదానవ గంధర్వై ర్నాగైరప్పరసాం గణౖః| మునిభి ర్గుమ్యకై స్సిద్దైః సౌపర్ణైః సమరుద్గణౖః || 6

అన్యై ర్దేవాలయైః సాద్యైః కశ్యపాద్యైః ప్రజేశ్వరైః| వాలఖిల్యాదిభి శ్చైవ శోభితే సుమనోహరే || 7

కర్ణికారవనైర్దివ్యైః సర్వర్తు కుసుమోత్కరైః| జాతరూప ప్రతీకాశై ర్బూషితే సూర్య సన్నిభైః || 8

అన్యైశ్చ బహుభిర్వృక్షైః శాలతాలాదిభిర్వనైః| పున్నాగాశోక సరళన్యగ్రోధామ్రాత కార్జునైః || 9

పారిజాతామ్రఖదిర నీపబిల్వ కదంబకైః | ధవఖాదిర పాలాశ శీర్షామలక తిందుకైః || 10

నారంగ కోలవకుళ లోద్ర దాడిమదారుకైః | సర్జైశ్చ కర్ణైస్తగరైః శిశిభూర్జన నింబకైః || 11

అన్యైశ్చ కాంచనైశ్చైవ ఫలభారైశ్చ నామితైః| నానాకుసుమ గంధాడ్యై ర్బూషితే పుష్పపాదపైః || 12

మాలతీ యూధికా మల్లీ కుందబాణ కురుంటకైః| పాటలాగస్త్యకుటజ మందార కుసుమాదిభిః || 13

అన్యైశ్చ వివిధైః పుషై#్పర్శనసః ప్రీతిదాయకైః | నానావిహగ సంఘైశ్చ కూజద్భిర్మధుర స్వరైః || 14

పుంస్కోకిల రుతై ర్దివ్యై మత్తబర్హిణనాదితైః | ఏవం నానావిధై ర్వృక్షైః పుషై#్పర్నానా విధైస్తథా || 15

ఖగైర్నానా విధైశ్చైవ శోభితే సురసేవితే| తత్ర స్థితం జగన్నాథం జగత్ర్సష్ఠార మవ్యయమ్‌ || 16

సర్వలోక విధాతారం వాసుదేవాఖ్య మవ్యయమ్‌| ప్రణమ్య శిరసాదేవీ లోకానాం హితకామ్యయా |

పప్రచ్ఛేమం మహాప్రశ్నం పద్మజా తమనుత్తమమ్‌ || 17

బ్రహ్మ యిట్లనియె-

శ్రీదేవి యడుగగా మున్ను శ్రీహరి తెలిపిన పుణ్యకథను వినుండు. సుమేరు పర్వతము యొక్క సువర్ణశిఖరమునందు సిద్ధ విద్యాధర కిన్నరులు, సంచరించు చోట, వాలఖిల్యాది మహర్షులు విహరించు చక్కని ప్రదేశమందు నానా తరులతా కుసుమ ఫలభరితమైన చోట- కోకిలలు, చిలుకలు, నెమళ్లు మనోహరముగ కూయు తావున దేవతలు కొలువ గొలువున్న వాసుదేవుని జగన్నాధుని సమీపించి శిరసు వంచి నమస్కరించి శ్రీదేవి సర్వలోక హితముగోరి ఇట్లని ప్రశ్నించెను.

శ్రీరువాచ.

బ్రూహిత్వం సర్వలోకేశ సంశయం మే హృది స్థితమ్‌| మర్త్యలోకే మహాశ్చర్యే కర్మభూమౌ సుదుర్లభే || 18

లోభమోహ గ్రహగ్రస్తే కామక్రోధ మహార్ణవే| యేన ముచ్యేత దేవేశ | అస్మాత్సంసార సాగరాత్‌ || 19

అచక్ష్వ సర్వదేవేశ! ప్రణతాం యది మన్యసే| త్వదృతే నాస్తి లోకేస్మిన్వక్తా సంశయ నిర్ణయే || 20

సర్వేశ్వరా !

నా సంశయము వారింపుము. మర్త్యలోకమున మిక్కిలి యాశ్చర్యము గొలుపునది కర్మభూమి (భారత వర్షము) అచట జన్మ యంత నులభము గాదు. లోభమోహాదు లను మొసళ్లు సంచరించు కామక్రోధములను మహా సముద్రము నందు జనన మరణాదుల నుండి తరించుట కనువైన యుపాయము దెలుపుము. నీకన్న ఈ సంశయమును వారిపంగల వక్త లేడు. మాయెడల దయగొని తెలుపదలపుగలదేని యనుగ్రహింపుము.

బ్రహ్మ ఉవాచ.

శ్రుత్త్వైవం వచనం తస్యా దేవదేవో జనార్దనః| ప్రోవాచ పరయా ప్రీత్యా పరం సారామృతోపమ్‌ || 21

శ్రీభగవానువాచ.

సుఖోపాస్యః సుసాధ్యశ్చాభిరామశ్చ సుసత్ఫలః| అస్తే తీర్తవరే దేవి విఖ్యాతః పురుషోత్తమః || 22

నతేన సదృశః కశ్చిత్త్రిఘలోకేఘ విద్యతే| కీర్త నాద్యస్య దేవేశి ముచ్యతే సర్వపాతకైః || 23

నవిజ్ఞాతో7మరైః సర్వై ర్న దైత్యైర్న చదానవైః| మరిచ్యా ద్యై ర్మునివరై ర్గోపితం మే వరాననే || 24

తత్తేహం సంప్రవక్ష్యామి తీర్థ రాజం చ సాంప్రతమ్‌| భావేనై కేన సుశ్రోణి శ్రుణుష్వ వరవర్ణినీ || 25

అసీత్కల్పే సముత్పన్నే నష్ఠే స్థావర జంగమే | ప్రలీనా దేవగంధర్వ దైత్య విద్యాధరోరగాః || 26

తమోభూత మిదం సర్వం నప్రాజ్ఞాయత కించన | తస్మింజాగర్తి భూతాత్మా పరమాత్మా జగద్గురుః || 27

శ్రీమాన్‌ త్రిమూర్తి కృద్దేవో జగత్కర్తా మహేశ్వరః | వాసుదేవేతి విఖ్యాతో యోగాత్మా హరిరీశ్వరః || 28

సో7సృజద్యోగ నిద్రాంతే నాభ్యంభోరుహ మధ్యగమ్‌ |

పద్మకేసర సంకాశం బ్రహ్మాణం భూతమవ్యయమ్‌ || 29

తాదృగ్భూతస్తతో బ్రహ్మసర్వలోక మహేశ్వరః | పంచభూత సమాయుక్తం సృజతే చ శ##నైః శ##నైః || 30

మాత్రాయోనీని భూతాని స్థూలసూక్ష్మాణి యానిచ | చతుర్విధాని సర్వాణి స్థావరాణి చరాణి చ || 31

తతః ప్రజాపతి ర్బహ్మా చక్రే సర్వచరాచరమ్‌ | సంచింత్య మనసా77త్మానం ససర్జ వివిధాః ప్రజాః || 32

మరీద్యాదీ న్మునీ న్సర్వా న్దేవాసుర పితౄనపి | యక్ష విద్యాధరాం శ్చాన్యాన్‌గంగాధ్యాః సరితస్తథా || 33

నరవానర సింహాంశ్చ వివిధాంశ్చ విహంగమాన్‌ | జరాయూనండ జాన్దేవి స్వేదజోద్భేదజాం స్తథా || 34

బ్రహ్మక్షత్రం తథా వైశ్యం శూద్రంచైవ చతుష్టయమ్‌ |అంత్యజాతాంశ్చ వ్లుెచ్ఛాంశ్చ ససర్జ వివిధాన్పృథక్‌ || 35

యత్కంచిజ్ఞీవసంజ్ఞం తు తృణగుల్మపిపీలికమ్‌ | బ్రహ్మాభూత్వా జగత్సర్వం నిర్మమే స చరాచరమ్‌ || 36

దక్షిణాంగే తథా77త్మానం సంచింత్య పురుషం స్వయమ్‌ |

వామే చైవ తు నారీం స ద్వీథాభూతమకల్పయత్‌ || 37

తతః ప్రభృతి లోకే7స్మిన్ర్పజా మైథున సంభవాః | అథమోత్తమ మధ్యాశ్చ మమక్షేత్రాని యానిచ || 38

ఏవం సంచింత్య దేవో7సౌ పురా సలిలయోనిజః| జగామ ధ్యానమాస్థాయ వాసుదేవాత్మికాం తనుమ్‌ || 39

ధ్యాన మాత్రేణ దేవేన స్వయమేవ జనార్దనః | తస్మిణ నముత్పన్నః సహస్రాక్షః సహస్రపాత్‌ || 40

సహస్రశీర్షా పురుషః పుండరీక నిభేక్షణః| సలిలధ్వాంత మేఘాభః శ్రీమాన్‌ శ్రీవత్సలక్షణః || 41

అపశ్య త్సహసా తం తు బ్రహ్మా లోక పితామహః | అసనై రర్ఘ్యపాద్వైశ్చ అక్షతై రభినంద్య చ || 42

తుష్టావ పరమైః ప్తోత్రై ర్విరించిః సుసమా హితః |

తతో7హ ముక్త వాన్దేవం బ్రహ్మాణం కమలోద్భవమ్‌|| కారణం వద మాం తాత మమ ధ్యానస్య సాంప్రతమ్‌ || 43

బ్రహ్మ యిట్లనియె.

శ్రీదేవి పలుకులు విని దేవదేవుడు పరమప్రీతితో నమృతోపమానము సర్వవేద శాస్త్రసారమునైన విషయము నిట్లుపన సించెను.

సుఖముగను, ను భముగను, నుపాసించి సాధింపదగిన మహాఫలము నొసంగు దివ క్షేత్రమొకటి పురుషోత్తమమును పేర ప్రపిద్ధమై యున్నది. అది కీర్తన, స్మరణ వందనాదులచే సర్వ పాపముక్తినీయగలది. నురాసురులు మరీచ్యాది మునివరులు గూడ దాని నెఱుగురు. అట్టి తీర్థరాజమునుగూర్చి నీకు దెలుపుచున్నాను. సుందరీ! ఏకాగ్రచిత్తవైవినుము. కల్పాంత ప్రళయమందు, స్థావర జంగమాత్మకమైన జగమెల్ల లయమందెను. అంధకార బంధురమయ్యెను. ఆ పెంజీకటి కవ్వల నున్నవాడు మేలుకొన్నవాడు ఒక్కడే పరమాత్మ. ఆయనయే సర్వభూత స్వరూవుడు. త్రిమూర్తులకు కర్త. వాసుదేవడనువాడు. యోగీశ్వరుడు. అయన యోగనిద్రనుండి మేల్కొని తన నాభికమలమునుండి కమల దళకాంతి నంపన్నమగు బ్రహ్మయనెడి యొక మూర్తిని సృజించెను. ఆ బ్రహ్మ పంచభూత పంచీకృతముయిన ప్రపంచమును సృజించెను. శబ్ద, స్పర్శరూప, రస, గంధములనెడి పంచతన్మాత్రలకు కారణములైన ఆకాశము, వాయువు, తేజస్సు, ఉద ము, భూమి యనెడి స్థూల సూక్ష్మములైన పంచభూతములను నృజించెను. ఆ మీద నా ప్రజాపతి మనసు నాత్మవంకకు మరల్చి సంకల్పించి మరీచ్యాది మునులను సర్వదేవతలను పితృదేవతలను, యజ్ఞములను, విద్యాధరులను, గంగాది నదులను, సరవానర సింహ శార్దూలాది మృగములను, జరాయుజ - అండజ - శ్వేదజ - ఉద్భిజ్ఞములను నాలుగు విథములైన చరాచర భూతజాలమును నృజించెను. బ్రహ్మ క్షత్ర - వైశ్య - శూద్రులను నాలుగు వర్ణములను, అంత్యజులను, వ్లుెచ్చులను వేర్వేర సృజించెను. పిపీలికాది జీవకోటి యాయన సృజించినదే. ఆ సృష్ఠికర్త తన కుడిభాగమందు తననే పురుష రూపముగా భావించి యెడమ భాగమున స్త్రీని భావించి స్త్రీ - పుంస రూపమున ద్విధాభావము నంచెను. మానసిక సృష్టి యిట్లు జరిగిన తరువాత స్త్రీ పుంసాత్మక మిథునమునుండి సృష్టి యావిర్భవించెను. అటనుండియే మైధున సంభవమైన సృష్టి యారంభ##మైనది. ఉత్తమ, మధ్యమాధమ భేదమున తయారయిన యీ యుపాధులన్నియు నా యొక్క క్షేత్రములు. ఇట్లు చతుర్ముఖ బ్రహ్మ సృష్టి యొనరించి యించుక నాలోచించి ధ్యాన నిష్ఠుడై వాసుదేవ తత్త్వమందు వాసుదేవత్మకమైన మూర్తిని ధరించెను. ధ్యానమాత్రముచే నా జనార్ధనుడు తానే యా క్షణమున సహస్రాక్షుడు, సహస్రపాదుడు, సహస్రశీర్షుడు నైన పురుషుడై యావిర్భవించెను. తెల్లతామరపూల వంటి నేత్రముల నజల జలదచ్ఛాయమైన శరీరము, శ్రీవత్సచిహ్నము, మొదలైన లక్షణములతో నొక ప్రాకృత మంగళ స్వరూపమున సాక్షాత్కరించెను. లోకపితామహుడగు బ్రహ్మ హఠాత్తుగా నమ్మూర్తిని దర్శించి అసన అర్ఘ్య పాద్య సమర్పణము చేసి యక్షతల బూజించి యభివాదనము జేసి పరమ మంగళస్తుతులచే స్తుతించెను. విరించి మనస్సును ఒదిగించి చేసిన యా స్త్రోత్రమును విని తండ్రి యిపుడు నను ధ్యానించుటకు కారణమేమని ప్రశ్నించితిని.

బ్రహ్మోవాచ

జగద్దితాయ దేవేశ మర్త్యలోకైశ్చ దుర్ణభమ్‌ | స్వర్గద్వారస్య మార్గాణి యజ్ఞదాన వ్రతానిచ || 44

యోగః సత్యం తపః శ్రద్ధా తీర్థాని వివిథానిచ | విహాయ సర్వమేతేషాం సుఖం తత్సాధనం వద || 45

స్థానం జగత్పతే మహ్యా ముత్కృష్టం చ యదుచ్యతే |

సర్వేషాముత్తమం స్థానం బ్రూహి మే పురుషోత్తమ || 46

విధాతుః వచనం శ్రుత్వా తతో7హం ప్రోక్త వాన్ప్రియే |

శృణు బ్రహ్మస్ప్రవక్ష్యామి నిర్మలం భువి దుర్లభమ్‌ || 47

బ్రహ్మయిట్లనియె.

దేవేశ!స్వర్గద్వారమునకు దారులు, యజ్ఞదానవ్రతములు, యోగము, సత్యము, శ్రద్ధ వివిధ తీర్థములు తెలుపబడినవి. అయ్యనుష్ఠానము దుర్లభము. వానినన్నిటిని మించిన సులభసాధనము లోకహితము కొఱకు తెల్పుము. ఓ వాసుదేవ! పరమోత్తమమయిన పుణ్యస్థానము నానతిమ్ము. అన విధాత పలుకులు విని యాతనికిట్లు చెప్పితిని.

ఉత్తమం సర్వక్షేత్రాణాం ధన్యం సంసారతారణమ్‌|గో బ్రాహ్మణహితం పుణ్యం చాతుర్వర్ణ్యం సుభోదయమ్‌ || 48

భుక్తి ముక్తిప్రదం నౄణాం క్షేత్రం పరమదుర్లభమ్‌ | మహాపుణ్యంతు సర్వేషాం సిద్ధిదం వై పితామహ || 49

తస్మాదాసీ త్సముత్పన్నం తీర్థరాజం సనాతనమ్‌ | విఖ్యాతం పరమం క్షేత్రం చతుర్యుగ నిషేవితమ్‌ || 50

సర్వేషామేవ దేవానా మృషీణాం బ్రహ్మచారిణామ్‌ | దైత్య దానవ సిద్దానాం గంధ ర్వోరగ రక్షసామ్‌ || 51

నాగ విద్యా ధరాణాంచ స్థావరస్య చరస్య చ | ఉత్తమః పురుషో యస్మాత్త స్మాత్స పురుషోత్తమః || 52

దక్షిణస్యోదధేస్తీరే న్యగ్రోధో యత్ర తిష్ఠతి| దశయోజన విస్తీర్ణం క్షేత్రం పరమ దుర్లభమ్‌ || 53

యస్తు కల్పే సముత్పన్నే మహ దుల్కానిబర్హణ | వినాశం నైవమభ్యేతి స్వయం తత్రైవ మాస్థితః || 54

దృష్టిమాత్రే వటే తస్మిం శ్ఛాయామాక్రమ్య చాసకృత్‌ | బ్రహ్మహత్యా త్ర్సముచ్యేత పాపే ష్వన్యేషు కాకథా || 55

ప్రదక్షిణా కృతా యైస్తు వమస్కారశ్చ జంతుభిః | సర్వే విధూత పాప్మానస్తే గతాః కేశవాలయమ్‌ || 56

న్యగ్రోధస్యోత్తరే కించి ద్గక్షిణ కేశవస్యతు | ప్రాసాదస్తత్ర తిష్ఠేత్తు పదం ధర్మమయం హి తత్‌ || 57

ప్రతిమాం తత్ర వై దృష్ట్యా స్వయం దేవేన నిర్మితామ్‌ | అనాయాసేన వై యాంతి భువసం మే తతో నరాః || 58

గచ్ఛమానాంస్తు తాన్ర్పేక్ష్య ఏకదా ధర్మరాట్ప్రియే | మదంతిక మసు ప్రాప్య ప్రణమ్య శిరసా77బ్రవీత్‌ || 59

సంసారతారకము సర్వోత్తమ క్షేత్రము, చాతుర్వర్ణ సుఖసాధనము. భుక్తిముక్తిప్రదము, శీఘ్ర సిద్ధిదము, చతుర్యుగములందును సుస్థిరమై సేవింపదగినది. సర్వదేవ దానవ యోనులకును సునేవ్యమై యున్న తీర్థరాజము పురుషోత్తమునికి నావాసమైన ''పురుషోత్తమము'' అను క్షేత్రము గలదు. ఆది దక్షిణసముద్ర తీరముందున్నది. పది యోజనములు వైశాల్యము గలది. అటవొక మఱ్ఱివృక్షము గలదు. కల్పాంతమందు కాలాగ్ని విజృంభించినపుడు కూడ యది నశింపదు. నేను స్వయముగా నచటనే యున్నాను. ఆ వటవృక్షమును దర్శించి యా క్రిందినీడలో విశ్రమించిన వాడు బ్రహ్మహత్యా పాపమునుండి విడివడును. తక్కిన మహాపాపముమాట చెప్పనేల! దానికి ప్రదక్షిణ నమస్కారములు చేసినవారు విష్ణులో మున కేగుదురు. ఆ మర్రికించుక దక్షిణమున కేశవుని యాలయమున్నది. అది ధర్మమయము. భగవంతుడు తానే నిర్మించుకొన్న ప్రతిమ (విగ్రహం) గలదు. దానిని దర్శించినవారు అనాయాసముగ వైకుంఠము కేగుదురు. అట్లేగుచున్న జీవులను చూచి యమధర్మరాజు నాకడ కేతెంచి శిరసువంచి మ్రొక్కి యిట్లనియె.

యమ ఉవాచ

నమస్తే భగవన్దేవ లోకనాథ జగత్పతే | క్షీరోద వాసినం దేవం శేషభోగాను శాయినమ్‌ || 60

వరం వరేణ్యం వరదం కర్తారమకృతం ప్రభుమ్‌ | విశ్వేశ్వర మజం విష్ణుం సర్వజ్ఞమపరాజితమ్‌ || 61

నీలోత్పల దళ శ్యామం పుండరీక నిభేక్షణమ్‌ | సర్వజ్ఞం నిర్గుణం శాంతం జగద్ధాతార మవ్యయమ్‌ || 62

సర్వలోక విధాతారం సర్వలోక సుఖావహమ్‌ | పురాణం పురుషం వేద్యం వ్యక్తావ్యక్తం సనాతనమ్‌ || 63

పరావరాణాం స్రష్టారం లోకనాథం జగద్గురుమ్‌ | శ్రీవత్సోరస్క సంయుక్తం వనమాలా విభూషితమ్‌ || 64

పీతవస్త్రం చతుర్భాహుం శంఖచక్ర గదా ధరమ్‌ | హారకేయూర సంయుక్తం ముకుటాంగద ధారిణమ్‌ || 65

సర్వలక్షణ సంపూర్ణం సర్వేంద్రియ వివర్జితమ్‌ | కూటస్థమచలం సూక్ష్మం జ్యోతి రూపం సనాతనమ్‌ || 66

భావాభావ వినిర్ముక్తం వ్యాపినం ప్రకృతేః పరమ్‌ | నమస్యామి జగన్నాథ మీశ్వరం సుఖదమ్‌ ప్రభుమ్‌ || 67

ఇత్యేవం ధర్మరాజస్తుపురా న్యగ్రోధ సన్నిథౌ | స్తుత్వా నానావిధైః స్తోత్రైః ప్రణామ మకరోత్తదా || 68

తం దృష్ట్వాతు మహాభాగే ప్రణతం ప్రాంజలి స్థితమ్‌ | స్తోత్రస్య కారణం దేవి పృష్టవా నహమంతకమ్‌ || 69

వైవస్వత మహాబాహో సర్వదేవోత్తమో హ్యసి | కిమర్ధం స్తుతవాన్మామాం త్వం సంక్షేపాత్త ద్బ్రవీహిమే 70

ధర్మరాజ ఉవాచ

ఆస్మిన్నాయతనే పుణ విఖ్యాతే పురుషోత్తమే | ఇంద్రనీల మయీ శ్రేష్ఠా ప్రతిమా సార్వకామికీ || 71

తాం దృష్ట్వా పుండరీకాక్ష భావేనైకైన శ్రద్ధయా | శ్వేతాఖ్యం భవనం యాంతి నిష్కామాశ్చైవ మానవాః 72

ఆతః కర్తుం నశక్నోమి వ్యాపార మరిసూదన | ప్రసీద సుమహాదేవ సంహర ప్రతిమాం విభో || 73

శ్రుత్వా వైవస్వత సై#్య తద్వాక్యమేతదువాచ హ | యమ తాం గోపయిష్యామి సికతాభిః సమంతతః || 74

తతః సా ప్రతిమా దేవి వల్లిభిర్గోపితా మయా | యథా తత్ర నపశ్యంతి మనుజాః స్వర్గకాంక్షిణః || 75

ప్రచ్ఛాద్య వల్లికైర్దేవి జాతరూప పరిచ్ఛదైః | యమంప్రస్థాపయామాస స్వాం పురీం దక్షీణాం దిశమ్‌ || 76

యమధర్మరాజిట్లు స్తుతించె ;

జగన్నాధస్వామీ! నీకు నమస్కారము. శ్రీవత్స వక్షస్థల, పద్మమాలాభూషిత, పీతాంబరధారీ, శంఖచక్ర గదాధరా! హారకేయూర భూషితా! కిరీటాంగద ధారియునై సాక్షాత్కరించు జగద్గురువగు నీకు సగుణమూర్తికి వందనము. ప్రకృతికి నవ్వలనై సర్వేంద్రియ రహితుడై కేవలజ్ఞాన జ్యోతియై సర్వసాక్షియై నిర్విశేష సుఖానుభవము జ్ఞానము స్వరూపముగా గల్గియున్న కేపలాత్మను నిన్ను నమస్కరించుచున్నాను. అనవిని పరమాత్మ నన్ను నీవిపుడెందులకు స్తుతించితివో క్లుప్తముగా నానతిమ్ము అని పురుషోత్తముడనియె.

స్వామీ! పురుషోత్తమము'' అను నీ పుణ్యాలయమున ఇంద్రనీలమణిమయమైన యీ ప్రతిమ సర్వాభీష్టములను దీర్చునది. దానిని శ్రద్ధతో దర్శించి ఏకాగ్రచిత్తమున సేవించి మానవులు నిష్కాములై శ్వేతభవనమునకు వెళ్ళుదురు.

కావున పాపులన్నవారు లేరు. పాపులను దండించు నధికారము నాకున్నను దాని యవనరము లేనందున నా పదవికి గౌరవము పోయినది. కావున నీ ప్రతిమనుపహరింపుమనెను. అది విని యిసుకలో దాచెదనంటిని. అన్నట్లు నేను దాచితిని. బంగారుతీగల పొదరింట దాచి యముని దక్షిణదిశకు పంపితిని.

బ్రహ్మోఉవాచ

లుప్తాయాం ప్రతిమాయాం తు ఇంద్రనీలస్య భోద్విజాః | తస్మి క్షేత్రవరే పుణ్య విఖ్యాతే పురుషోత్తమే || 77

యో భూతస్తత్ర వృత్తాంతో దేవదేవో జదార్దనః | తం సర్వం కథయామాస స తసై#్యభగవాన్పురా || 78

ఇంద్రద్యుమ్నస్య గమనం క్షేత్రసందర్శనం తథా | క్షేత్రస్య వర్ణనం చైవ ప్రాసాదకరణం తథా || 79

హయమేధస్య యజనం స్వప్న దర్శనమేవచ | లవణస్యోదధే స్తీరే కాష్ఠస్య దర్శనం తథా || 80

దర్శనం వాసుదేవస్య శిల్పరాజస్య చద్విజాః | నిర్మాణం ప్రతిమాయాస్తు యథా వర్ణం విశేషతః || 81

స్ధాపనం చైవ సర్వేషాం ప్రాసాదే భువనోత్తమే | యాత్రాకాలేచ విప్రేంద్రాః కల్ప సంకీర్తనం తథా || 82

మార్కండేయస్య చరితం స్థాపనం శంకరస్యచ | పంచ తీర్థస్య మాహాత్మ్యం దర్శనం శూలపాణినః || 83

వటస్య దర్శనం చైవ వ్యుష్టిం తస్య చభోద్విజాః | దర్శనం బలదేవస్య కృష్ణస్య చ విశేషతః || 84

సుభద్రాయాశ్చ తత్రైవ మాహాత్మ్యం చైవ సర్వశః | దర్శనం నరసింహస్య వ్యుష్టి సంకీర్తనం తథా || 85

అనంత వాసు దేవస్య దర్శనం గుణకీర్తనమ్‌ | శ్వేత మాథవ మాహాత్మ్యం స్వర్గద్వారస్య దర్శనమ్‌ || 86

ఉదధే ర్దర్శనం చైవ స్నానం తర్పణ మేవచ|సముద్రస్నాన మాహాత్మ్య మింద్ర ద్యుమ్నస్య చద్విజాః || 87

పంచతీర్థ ఫలం చైవ మహాజ్యేష్ఠం తధైవచ | స్థానం కృష్ణస్య హలినః పర్వయాత్రాఫలం తథా || 88

వర్ణనం విష్ణులోకస్య క్షేత్రస్యచ పునః పునః | పూర్వం కథితవాన్సర్వం తసై#్య స పురుషోత్తమః || 89

ఇతి శ్రీబ్రహ్మపురాణ పూర్వవృత్తాను వర్ణనం నామ పంచచత్వారింశో7ధ్యాయః

బ్రహ్మయనియె.

ఇంద్రనీల ప్రతిమట్లు మరుగుపడిన మీదట జరిగిన కథను విష్ణువు లక్ష్మికి చెప్పెను.

ఆ చెప్పిన విషయ సంగ్రహము మూలము వలననే సు భముగ తెలియుచున్నది. కావున పునరుక్తిగా ననువాదము చేయబడలేదు.

ఇది బ్రహ్మపురాణమున నలుబది యైదవ యధ్యాయము.

Brahmapuranamu    Chapters