Brahmapuranamu    Chapters   

త్రిచత్వారింశోzధ్యాయః

అవంతీవర్ణనమ్‌ (అవంతి = ఉజ్జయిని)

బ్రహ్మోవాచ

పురాకృతయుగే విప్రా శ్శక్రతుల్య పరాక్రమః | బభూవ నృపతి శ్రీమా నింద్రద్యుమ్న ఇతి శ్రుతః|| 1

సత్యవాదీ శుచి ర్దక్ష స్సర్వశాస్త్రవిశారదః |రూపవా న్సుభగ శ్శూరో దాతా భోక్తా ప్రియంవదః|| 2

యష్టా సమస్త యజ్ఞానాం బ్రహ్మణ్య స్సత్యసంగరః | ధనుర్వేదేచ శాస్త్రేచ నిపుణఃకృతీ|| 3

వల్లభో నరనారీణాం పౌర్ణ్యమాస్యాం యథా శశీ| అదిత్య ఇవ దుష్ర్పేక్ష్యః శత్రుసంఘ భయంకరః|| 4

వైష్ణవ స్సత్త్వ సంపన్నో జితక్రోధో జితేంద్రియః |అధ్యేతా యోగసాంఖ్యానాం ముముక్షుర్ధర్మతత్పరః|| 5

ఏవం స పాలయ న్పృథ్వీం రాజా సర్వగుణాకరః | తస్య బుద్ధిః సముత్పన్నా హరేరారాధనం ప్రతిః|| 6

అవంతీవర్ణనము

బ్రహ్మ యిట్టనియె.

విప్రులారా! మున్ను గృతయుగమునందు'' ఇద్రద్యమ్నుడు'' అనురాజుండెను. అతడింద్రతుల్య పరాక్రముడు. సత్యవాది శుచి సమర్థుడు సర్వశాస్త్ర విశారదుడు. రూపవంతుడు నుభగుడు శూరుడు దాత భోక్త ప్రియభాషి. యజ్వ బ్రహ్మజ్ఞాని సత్యప్రతిజ్ఞుడు ధనుర్వేదమందు వేదమందు శాస్త్రమునందు నిపుణుడు స్త్రీపురుషులకు పున్నమచందురునట్లానందకరుడు. ప్రతాపమున సూర్యుడట్లు తేరిపారజూడనలవికానివాడు. శత్రుకూటమునకు భయంకరుడు విష్ణుభక్తుడు. సత్త్వశాలి. జతక్రోథుడు జితేంద్రియుడు. యోగశాస్త్ర సాంఖ్య (జ్ఞాన) శాస్త్రముల నధ్యయనము సేసినవాడు. మోక్షేచ్ఛగలవాడు. ధర్మనిష్ఠుడు. ఇట్లు సర్వలక్షణనిధియైన యారాజు భూమిని పాలించుచుండ నతనికి హరి నారాధింపవలెనను నిశ్చయము గల్గినది.

కథమారాధయిష్యామి దేవదేవం జనార్ధనమ్‌ | కస్మిన్‌ నేత్రే7థవా తీర్ధే నదీతీర్థే తథా77శ్రమే||7

ఏవం చింతాపరః సో7థ నిరీక్ష్యమనసా మహీమ్‌ |ఆలోక్య సర్వతేర్థాని క్షేత్రాణ్యథ పురాణ్యపి|| 8

తాని సర్వాణి సంత్యజ్య జగా మాయతనం పునః | విఖ్యాతం పరమం క్షేత్రం ముక్తిదమ్‌ పురుషోత్తమమ్‌|| 9

సగత్వా తత్ఞేత్రవరం సమృద్ధ బలవాహనః | ఆయజచ్చాశ్వమేధేన విధి వద్భూరిదక్షిణః|| 10

కారయిత్వా మహోత్సేధం ప్రాసాదం చైవ విశ్రుతమ్‌ | తత్ర సంకర్షణం కృష్ణం సుభద్రాం స్థాప్య వీర్యవాన్‌|| 11

పంచతీర్థం చ విధివత్కృత్వా తత్ర మహీపతిః | స్నానం దానం తపో హోమం దేవతాప్రేక్షణం తథా|| 12

భక్త్యా చారాధ్య విధివత్ర్పత్యహం పురుషోత్తమమ్‌ | ప్రసాదా ద్దేవ దేవస్య తతోమోక్ష మవాప్తవాన్‌|| 13

మార్కండేయం చకృష్ణం చ దృష్ట్వా రామం చ భోద్విజాః|

సాగరే చేంద్రద్యుమ్నాఖ్యే స్నాత్వా మోక్షం లభే ద్ధ్రువమ్‌|| 14

దేవేశ్వరుజనార్ధను నెట్లారాధింపగలను! ఏ క్షేత్రము తీర్థము నదీతీరము ఆశ్రమము నిందుల కనువయినది! అనితలచి పృథివినెల్ల మనసుచేపరికించి అన్ని తీర్థక్షేత్రపుర సముదాయమునెల్లవదలి పురుషోత్తమక్షేత్రమందాలయమున కేగెను. అతనిని బలము(సేన) వాహనములు వెంబడించినవి. అక్కడ భూరిదక్షిణలొసంగి యథావిదిగ అశ్వ మేధము సేసెను. స్వామికి మహోన్నత ప్రాసాదము గట్టించి అందు సంకర్షణుని (బలరాముని) కృష్ణుని సుభద్రను ప్రతిష్ఠించి పంచతీర్థములేర్పరచి స్నానదాన తపోహోమాదులాచరించి దేవతా దర్శనముచేసి భక్తితో ప్రతిదినము హరి నారాధించి యాస్వామి యనుగ్రహముచే మోక్షములబొందెను. మార్కండేయుని కృష్ణుని బలరామునిం దర్శించి యింద్రద్యుమ్న సాగరమున స్నానముసేసి మోక్షమును దప్పక మానవుడు పొందును.

మునయ ఊచుః

కస్మా త్స నృపతిః పూర్వ మింద్రద్యుమ్నో జగత్పతిః|

జగామ పరమం క్షేత్రం ముక్తిదమ్‌ పురుషోత్తమమ్‌|| 15

గత్వా తత్ర సురశ్రేష్ఠ కథం స నృపసత్తమః | వాజిమేధేన విధివదిష్టవా న్పురుషోత్తమమ్‌|| 16

కథంస సర్వఫలదే క్షేత్రే పరమ దుర్లభే|

ప్రాసాదం కారయామాస చేష్టం త్రైలోక్య విశ్రుతమ్‌|| 17

కథం స కృష్ణం రామం చ సుభద్రాంచ ప్రజాపతే |నిర్మలే రాజశార్దులః క్షేత్రం రక్షితవాన్‌ కథమ్‌|| 18

కథం తత్ర మహీపాలః ప్రాసాదే భువనోత్తమే|

స్థాపయామాస మతిమాన్‌ కృష్ణా దీం స్త్రిదశార్చితాన్‌|| 19

ఏతత్సర్వం సురశ్రేష్ట విస్తరేణ యథాతథమ్‌ |వక్తుమర్హ స్యశేషేణ చరితం తస్య ధీమతః|| 20

న తృప్తి మధిగచ్ఛామస్తవ వాక్యామృతేన వై |శ్రోతుమిచ్ఛామహే బ్రహ్మ స్పరం కౌతూహలం హినః|| 21

మునులడిగిరి.

ఇంద్రద్యుమ్నప్రభువు మున్నాముక్తిక్షేత్రమున కెందులకు వెళ్ళెను. వెళ్ళి యాస్వామిని అశ్వమేధముసేసి యెట్లారాధించెను? త్రిలోక ప్రఖ్యాతమైన యాలయమునక్కడ యెట్లునిర్మించెను? సుభద్రా బలరామకృష్ణుల మూర్తులనెట్లు నిర్మించెను? ఆ క్షేత్రరక్షణమెట్లు సేసెను? ఆలయమందు కృష్ణాదుల ప్రతిష్ఠ యెట్లుజరిగెను?ఇదంతయు జరిగినది జరిగినట్లు విపులముగ నానతిమ్ము నీవాగమృతమానినకొలది మాకింకను నది గ్రోలవలయునని పించుచున్నది. వినవలెనని మిక్కిలి కూతూహలమగుచున్నది.

బ్రహ్మోవాచ

సాధుసాధుద్విజశ్రేష్ఠా యత్పృచ్ఛధ్వం పురాతనమ్‌|

సర్వపాపహరంపుణ్యం భుక్తిముక్తి ప్రదమ్‌ శుభమ్‌|| 22

వక్ష్యామి తస్య చరితం యథావృత్తం కృతేయుగే|

శ్రుణుధ్వం మునిశార్దూలాః ప్రయతాః సంయతేద్రియాః|| 23

ఇట్లు మునులడుగ బ్రహ్మ బాగు బాగు! పురాతన కథ నడిగితిరి. ఇది సర్వపాపహరము. భుక్తి ముక్తిదము. శుభకరము. కృతయుగమందు జరిగినచరిత్ర యిదె చెప్పుచున్నాను. శ్రద్ధగా నింద్రియముల నదుపుననుంచి కొని వినుండు.

అవంతీ నామ నగరీ మాలవే భువి విశ్రుతా | బభూవ తస్య నృపతేః పృథివీకకుదోపమా|| 24

హృష్టపుష్ట జనాకీర్ణా దృఢప్రాకార తోరణా | దృఢ యన్త్రార్గల ద్వారా పరిఖాభి

రలంకృతా|| 25

నానావణిక్సమాకీర్ణా నానాభాండసువిక్రియా | రథ్యా77పణపతీ రమ్యా సువిభక్త

చతుష్పథా| 26

గృహ గోపురసంబాధా వీథీభిః సమలంకృతా | రాజహంస నిభైః శుభ్రై శ్చిత్రగ్రీవై ర్మనోహరైః|| 27

అనేక శతసాహసై#్రః ప్రాసాదైః సమలంకృతా | యజ్ఞోత్సవ ప్రముదితా గీతవాదిత్ర

నిస్వనా|| 28

నానావర్ణ పతాకాభి ర్ధ్వజైశ్చ సమలంకృతా | హస్త్యశ్వ రథసంకీర్ణా పదాతి గణ సంకులా|| 29

నానాయోథ సమాకీర్ణా నానాజన వరైర్యుతా|

బ్రాహ్మణౖః క్షత్రియైర్వైశ్యై శ్శూద్రైశ్చైవ ద్విజాతిభిః|| 30

మాలవదేశమునందు అవంతి యనునగరమున్నది. అది భూమండలమను ఋషభమునకు మూపురమాయన్నట్లు తలమనికమైయుండెను.

ఇట 25 శ్లోకమునుండి 64వ శ్లోకముదాక నగరవర్ణనము. క్రిందటి యధ్యాయము విరజక్షేత్రవర్ణన సందర్భమున నిట్లే వర్ణనమున్నది. కావుని నిక్కడ సది పునరుక్తముగ తాత్పర్యము వ్రాయలేదు.

సమృద్ధా సా మునిశ్రేష్ఠా విద్వద్భిః సమలంకృతా | న తత్రమలినాః సంతి న మూర్ఖా నాపి నిర్ధనాః || 31

న రోగిణో నహీనాంగా నద్యూత వ్యసనాన్వితాః| సదా హృష్టాః సుమనసో దృశ్యంతే పురుషాః స్త్రియః|| 32

క్రీడంతిస్మ దివారాత్రౌ హృష్టాస్తత్ర పృథక్పృథక్‌| సువేషాః పురుషాస్తత్ర దృశ్యంతే మృష్టకుండలా|| 33

సురూపాః సుగుణాశ్చైవ దివ్యాలంకార భూషితాః | కామదేవ ప్రతీకాశాః సర్వలక్షణ

లక్షితాః|| 34

సుకేశాః సుకపోలాశ్చ సుముఖాః శ్మశ్రుధారిణః | జ్ఞాతారః సర్వశాస్త్రాణాం భేత్తారః శత్రువాహినీమ్‌|| 35

దాతారః సర్వరత్నానాం భోక్తారః సర్వపంపదామ్‌| స్త్రియం స్తత్ర మునిశ్రేష్ఠా దృశ్యంతే సుమనోహరాః|| 36

హంసవారణగామిన్యః ప్రఫుల్లాంభోజ లోచనాః| సుమధ్యమాః సు జఘనాః పీనోన్నత పయోధరాః|| 37

సుకేశా శ్చారువదనాః సుకపోలాః స్థిరాలకాః| హావభావానత గ్రీవాః కర్ణాభరణ భూషితాః|| 38

బింబోష్ఠ్యా రంజితాముఖా స్తాంబూలేన విరాజితాః| సువర్ణాభరణోపేతాః సర్వాలంకార భూషితాః|| 39

శ్యామావదాతాః సుశ్రోణ్యః కాంచీనూపుర నాదితాః| దివ్యమాల్యాంబరధరా దివ్య గంధానులేపనాః|| 40

విదగ్ధాః సుభగాః కాంతా శ్చార్వంగ్యః ప్రియదర్శనాః| రూపలావణ్య సంయుక్తాః సర్వాః ప్రహసితానాః|| 41

క్రీడంత్యశ్చ మదోన్మత్తాః సభాసు చత్వరేషు చ|గీతవాద్య కథాలాపైః రయంత్యశ్చ తాః స్త్రియః|| 42

వారముఖ్యాశ్చ దృశ్యంతే నృత్యంగీత విశారదా| ప్రేక్షణాలాప కుశలాః సర్వయోషి ద్గుణాన్వితాః|| 43

అన్యాశ్చ తత్ర దృశ్యంతే గుణాచార్యాః కులస్త్రియః| పతివ్రతాశ్చ సుభగా గుణౖః సర్వైరలంకృతాః|| 44

వనైశ్చోపవనైః పుణ్యౖ రుద్యానైశ్చ మనోరమైః| దేవతాయతనై ర్దివ్యై

ర్నానాకుసుమవోభితైః|| 45

శాలైస్తాలై స్తమాలైశ్చ వకుళైర్నాగకేసరైః | పిప్పలైః కర్ణికారైశ్చ చందనాగరు చంపకైః|| 46

పున్నాళైగైర్నారికేళైశ్చ పనసై స్సరలద్రుమైః | నారంగైర్ల కుచైర్లోధ్రైః సప్తపర్ణై శ్శుభాంజనైః|| 47

చూతబిల్వ కదంబైశ్చ శింశుపై ర్ధవఖాదిరైః | పాటలాశోకతగరైః కరవీరైః సితేతరైః|| 48

పీతార్జునకభల్లాతైః సిద్దై రామ్రాతకైస్తథా | న్య గ్రోధాశ్వత్థకాశ్మర్యైఃపలాశై ర్దేవదారుభిః|| 49

మందారైః పారిజాతై శ్చ తింతిడీకవిభీతకైః | ప్రాచీన మాలకైః ప్లక్షై ర్జంబూ శిరీష పాదపైః || 50

కాలేయైః కాంచనారైశ్చ మధుజంబీర తిందుకైః | ఖర్జూరాగ స్త్యవకులై ః శాఖోటకహరీతకై|| 51

కంకోలై ర్ముచుకుందైశ్చ హింతాలై ర్భీజపూరకైః | కేతకీవనఖండై శ్చ అతిముక్తై

స్సకుబ్జకైః|| 52

మల్లికా కుంద బాణౖశ్చ కదలీ షండమండితైః| మాతులుంగైః పూగఫలై కరుణౖ

సింధువారకైః|| 53

బహువారైః కోవిదారై ర్బదరై స్సకరంజుకైః| అన్యైశ్చ వివిధైః పుష్పవృక్షై శ్చాన్యై ర్మనోహరైః|| 54

లతా గుల్మై ర్వితానైశ్చ ఉద్యానై ర్నందనోపమైః | సదా కుసుమగంధాఢ్యై స్సదా ఫలభరానతైః|| 55

నానాపక్షిరుతైః రమ్యైః ర్నానా మృగగణావృతైః| చకోరై శ్శతపత్రైశ్చ భృంగారైః ప్రియపుత్రకైః|| 56

కలవింకై ర్మయూరైశ్చ శుకైః కోకిలకై స్తథా| కపోతైః ఖంజరీటైశ్చ శ్యైనైః పారానతై స్తథా|| 57

ఖగైశ్చాన్యై ర్బహువిధై శ్శ్రోత్రరమ్యై ర్మనోరమైః | సరితః పుష్కరిణ్యశ్చ సరాంసి సుబహూని చ||58

అన్యైర్జలాశ##యైః పుణ్యౖ కుముదోత్పలమండితైః| పద్మై స్సితేతరై శ్శుభ్రై కహ్హారై శ్చ సుగంధిభిః|| 59

అన్యైర్భహువిధైః పుషై#్పర్జలజై స్సుమనోహరైః గంధామోదకరై ర్దివ్యై స్సర్వర్తు కుజుమోజ్వలైః|| 60

హంసకారండవాకీర్ణై శ్చక్రవాకోపశోభితైః|

సారసైశ్చ బలాకైశ్చ కూర్మైర్మత్త్స్యై స్సనక్రకైః|| 61

జలపాదైః కదంబైశ్చ ప్లవైశ్చ జలకుక్కుటైః| ఖగైర్జలచరైశ్చాన్యై ర్నానారవ విభూషితైః|| 62

నానావర్ణై స్సదా హృష్టేరంచితాని సమంతతః|

ఏవం నానావిధైః పుషై#్ప ర్వివిధైశ్చ జలాశ##యైః|| 63

వివిధైః పాదపైః పుణ్యౖ రుద్యానై ర్వివిధైస్తథా| జలస్థలచరైశ్చైవ విహగై శ్చార్వధిష్ఠితైః|| 64

దేవతాయతనై ర్దివ్యై శ్శోభితా సా మహాపురీ| తత్రా77స్తే భగవా న్దేన స్త్రిపురారి స్త్రిలోచనః|| 65

మహాకల ఇతి ఖ్యాత స్సర్వకామప్రద శ్శివః| శివకుండే నరః స్నాత్వా విధివత్పాపనాశ##నే|| 66

దేవాన్పితౄ నృషీంశ్చైవ సంతర్ప్య విధివ ద్భుధః| గత్వా శివాలయం పశ్చాత్కృత్వా తంత్రిః ప్రదక్షిణమ్‌|| 67

ప్రవిశ్య సంయతోభూత్వా ధౌతవాసా జితేంద్రియః| స్నానైః పుషై#్పస్తథా గంధై ర్థూపైర్దీపైశ్చ భక్తితః||68

నైవేద్యైరుపహారైశ్చ గీతవాద్యైః ప్రదక్షిణౖః| దండవత్ర్పణి పాతైశ్చ నృత్యై స్త్సోత్రైశ్చ శంకరమ్‌|| 69

సంపూజ్య విధివద్భక్త్యా మహాకాలం సకృచ్ఛివమ్‌| అశ్వమేధ సహస్రస్య ఫలం ప్రాప్నోతి మానవః|| 70

పాపై స్సర్వై ర్వినిర్ముక్తో విమానై స్సర్వకామికైః |ఆరుహ్య త్రిదివం యాతి యత్ర శంభోర్నికేతనమ్‌|| 71

దివ్యరూపధర శ్శ్రీమాన్దివ్యాలంకార భూషితః | భుంక్తే తత్ర వరాన్భోగాన్‌ యావదా భూత సంప్లవమ్‌|| 72

శివలోకే మునిశ్రేష్ఠా జరామరణ వర్జితః | పుణ్యక్షయాదిహా77యాతః ప్రవరే బ్రాహ్మణ

కులే|| 73

చతుర్వేదీ భ##వే ద్విప్ర స్సర్వ శాస్త్ర విశారదః| యోగం పాశుపతం ప్రాప్య తతోమోక్ష మవాప్నుయాత్‌|| 74

ఆస్తే తత్ర నదీ పుణ్యా శిప్రానామేతి విశ్రుతా| తస్యాం స్నాతస్తు విధివత్సంతర్ప్య పితృదేవతాః|| 75

సర్వపాప వినిర్ముక్తో విమానవర మాస్తితః | భుంక్తే బహువిధాన్భోగా స్వ్సర్గలోకే

నరోత్తమః|| 76

ఆస్తే తత్రైవ భగవా న్దేవదేవో జనార్దనః| గోవిందస్వామి నామా7సౌ భుక్తి ముక్తిప్రదో

హరిః|| 77

తం దృష్ట్వా ముక్తి మాప్నోతి త్రిసప్తకుల సంయుతః| విమానే నార్క వర్ణేన కింకిణీ జాలమాలినా||78

సర్వకామ సమృద్దేన కామగేనాస్థితేనచ| ఉపగీయమానో గంధర్వై ర్విష్ణులోకే మహీయతే|| 79

భుంక్తేచ వివిధాన్కామా న్నిరాతంకో గతజ్వరః| ఆభూతసంప్లవం యావత్సురూప స్సుభగ స్సుఖీ||80

కాలేనా77గత్య మతిమా ద్ర్బాహ్మణ స్స్యాస్మహితలే| ప్రవరే యోగినాం గేహే వేదశాస్త్రార్థ తత్త్వవిత్‌ ||81

వైష్ణవం యోగమాస్థాయ తతో మోక్షవాప్నుయాత్‌| విక్రమస్వామి నామానం విష్ణుం తత్రైవ భోద్విజాః|| 82

దృష్ట్వా నరో వానారీవా ఫలం పూర్వోదితం లభేత్‌| అన్యేపి తత్రతిష్ఠంతి దేవా శ్శక్ర పురోగమాః|| 83

మాతరశ్చ మునిశ్రేష్ఠా స్సర్వకామఫలప్రదాః| దృష్ట్వా తాన్విధివద్భక్త్యా సంపూజ్య ప్రణిపత్యచ||84

సర్వపాప వినిర్ముక్తో నరోయాతి త్రివిష్టపమ్‌| ఏవం సా నగరీ రమ్యా రాజసింహేన పాలితా|| 85

నిత్యోత్సవప్రముదితా యథేంద్రస్యామరావతీ| పురాష్ఠాదశ సంయుక్తా సువిస్తీర్ణ చతుష్పథా|| 86

దనుర్జ్యా ఘోష నినదా సిద్ద సంగమ భూషితా | విద్యావద్గుణ భూయిష్ఠా వేద నిర్ఘోషనాదితా|| 87

ఇతిహాస పురాణాని శాస్త్రాణి వివిధాని చ| కావ్యాలాప కథాశ్చైవ శ్రూయంతే7హర్నిశం ద్విజాః| 88

ఏవం మయా గుణాఢ్యా సో జ్జయినీ సముదాహృతా|

యస్యాం రాజా7భవత్పూర్వ మింద్రద్యుమ్నో మహామతిః|| 89

ఇతి శ్రీబ్రహ్మపురాణ అవంతికావర్ణనం నామ త్రిచత్వారింశో7ధ్యాయ

అక్కడి త్రిపురవైరి (శివుడు)'మహాకాలుడు' అనుపేర వెలసియున్నాడు. ఆయన సర్వాభీష్ట ప్రదాత. అటు పాపహరమైన శివకుండమున స్నానముసేసి దేవర్షిపితృతర్పణాదులుసేసి శివలాయముకేగి ప్రదక్షిణముసేసి ధ్యానావాహనాద్యుపచారముల స్వామి నర్చించిన నరుడు అశ్వమేధ యాగఫలమునందును. దివ్య విమానములో శివలోకమునకేగును. అట దివ్యరూపాంబరాభరణాదులతో గూడి మహాభోగములననుభవించి యిక్కడికివచ్చి బ్రాహ్మణుడై జనించి నాల్గు వేదములు సర్వశాస్త్రములు నేర్చి పాశుపత యోగములబొంది ముక్తినందును.

అక్కడ శిప్రాయనునదిగలదు. అట స్నానతర్పణాదులు సేసిన యతడు విమానమున స్వర్గమేగును. అక్కడనే విష్ణువు గోవిందస్వామి యనుపేరనున్నాడు. ఆయనను సేవించిన నిరువదియొక్కతరములు తరించును. ఈ మున్ను జెప్పిన ఫలములన్నియు నటగల్గును. తిరిగి యీలోకమునకువచ్చి వైష్ణవయోగమున ముక్తినందును. అక్కడనే విక్రమస్వామియను పేరనున్న విష్ణువు నారాధించిన మగవాడుగాని యాడుదిగాని మున్నుజెప్పిన ఫలమందుదురు. అక్కడ నింద్రాదిదేవతలు మాతృకలు గలరు. వారును కోరిన కోర్కులిత్తురు. వారిని సేవించిన స్వర్గములభించును. అవంతియను నా నగరమును రాజసింహుడను రాజుపాలించెను. అందులో పదునెన్మిదిపురములు (మహాపుర భాగములు) కలవు. అవి సువిస్తీర్ణ రాజమార్గములు. విద్మావంతులట నందఱును. వేదఘోషచే నది ప్రతిధ్వనించుచుండును. అట ఇతిహాస శాస్త్ర పురాణాదిప్రసంగములు నిత్యమువినబడును. దీనికి మునువు పరిపాలకుడు ఇంద్రద్యుమ్నుడు.

ఇది బ్రహ్మపురాణమున అవంతీవర్ణనము అను నలుబదిమూడవ యధ్యాయము

Brahmapuranamu    Chapters