Brahmapuranamu    Chapters   

త్రయస్త్రింశో7ధ్యాయః

మార్తండ మాహాత్మ్యమ్‌

మునయఃఊచుః

భూయోపి కథయాస్మాకం కథాం సూర్య సమాశ్రితామ్‌| న తృప్తి మధిగచ్ఛామః శ్రుణ్వంత స్తాం కథాం శుభామ్‌ || 1

యో7యం దీప్తో మహాతేజా వహ్నిరాశి సమవ్రభః | ఏత ద్వేదితు మిచ్ఛామః ప్రభావో7స్య కుతః ప్రభో || 2

మునులనిరి. పితామహ! సూర్యకథ నెంతవిన్నను తృప్తిలేదు. అగ్నిరాశివలె వెలుంగు నీ మూర్తికిప్రభావమెందుండి యయ్యెనో తెలియనెంతుము. ఇంకను నాశుభచరిత్ర మాకానతిమ్ము.

బ్రహ్మోవాచ

తమోభూతేషు లోకేషు నష్టే స్థావరజంగమే | ప్రకృతే ర్గుణహేతుస్తు పూర్వం బుద్ధి రజాయత || 3

అహంకారస్తతో జాతో మహాభూత ప్రవర్తకః | వాయ్వగ్ని రావః ఖం భూమి స్తత స్త్యండ మజాయత || 4

తస్మిన్నండే త్విమేలోకాః సప్త చైవ ప్రతిష్ఠతాః | పృథివీ సప్తభి ర్ద్వీపైః సముద్రైశ్చైవ సప్తభిః || 5

తత్రైవావస్థితో హ్యాసీదహం విష్ణు ర్మహేశ్వరః | విమూఢా స్తామసాః సర్వే ప్రధ్యాయంతి తమీశ్వరమ్‌ || 6

తతోవై సుమహాతేజాః ప్రాదుర్భూత స్తమోనుదః | ధ్యానయోగేన చాస్మాభి ర్విజ్ఞాతం సవితా తదా || 7

జ్ఞాత్వాచ పరమాత్మానం సర్వ ఏవ పృధక్‌ పృథక్‌ | దివ్యాభిః స్తుతిభిర్దేవః న్తుతో77స్మాభి స్తదేశ్వరః || 8

అదిదేవో7సి దేవానా మైశ్వర్యాచ్చ త్వమీశ్వరః | ఆదికర్తాసి భూతానాం దేవదేవో దివాకరః || 9

జీవనః సర్వభూతానాం దేవగంధర్వ రక్షసామ్‌ | మునికిన్నర సిద్ధానాం తథై వోరగపక్షిణామ్‌ || 10

త్వం బ్రహ్మ త్వం మహాదేవ స్త్వం విష్ణుస్త్వం ప్రజాపతిః|వాయురింద్రశ్చ సోమశ్చ వివస్వాన్‌ వరుణకస్తథా|| 11

త్వం కాలః సృష్టికర్తా చ హర్తా భర్తా తథా ప్రభుః | సరితః సాగరాః శైలా విద్యుదింద్ర ధనూంషిచ || 12

ప్రళయః ప్రభవశ్చైవ వ్యక్తావ్యక్తః సనాతనః | ఈశ్వరా త్పరతో విద్యా7విద్యాయాః పరతః శివః || 13

శివాత్పరతరో దేవ స్త్వమేవ పరమేశ్వరః | సర్వతః పాణిపాదాంతః సర్వత్తో7 క్షి శిరోముఖః || 14

సహస్రాంశుః సహస్రాస్యః సహస్ర చరణక్షణః | భూతాది ర్భూర్భువః స్వశ్చ మహః సత్యం తపో జనః || 15

ప్రదీప్తం దీపనం దివ్యం సర్వలోకప్రకాశకమ్‌ | దుర్నిరీక్షం సురేంద్రాణాం యద్రూపం తస్య తే నమః || 16

సురసిద్ధగణౖర్జుష్టం భృగ్వత్రిపులహాదిభిః | స్తుతం వరమ మవ్యక్తం యద్రూపం తస్య తే నమః || 17

వేద్యం వేదవిదం నిత్యం సర్వజ్ఞాన సమన్వితమ్‌ | సర్వదేవాదిదేవస్య యద్రూపం తస్య తే నమః || 18

విశ్వకృ ద్విశ్వభూతం చ వైశ్వానరసురార్చితమ్‌ | విశ్వస్థిత మచింత్యం చ యద్రూపం తస్య తే నమః || 19

వరం యజ్ఞాత్‌ పరం వేదాత్‌ పరం లోకాత్‌ పరం దివః | పరమాత్మే త్యభిఖ్యాతం యద్రూపం తస్య తే నమః|| 20

అవిజ్ఞేయ మనాలక్ష్య మధ్యానగత మవ్యయమ్‌ | అనాదినిధనం చైవ యద్రూపం తస్య తే నమః || 21

నమోనమః కారణకారణాయ నమోనమః పాపవిమోచనాయ | నమో నమస్తే దితిజార్దనాయ, నమోనయో రోగ విమోచనాయ|| 22

నమోనమః సర్వవరప్రదాయ, నమోనమః సర్వసుఖ ప్రదాయ| నమోనమః సర్వధనప్రదాయ, నమానమః సర్వ మతిప్రదాయ || 23

స్తుతః సభగవానేవం తైజసం రూపమాస్థితః | ఉవాచ వాచా కల్యాణ్యా కో వరో వః ప్రదీయతాం 24

బ్రహ్మయిట్లనియె! లోకములు తమఃప్రాయములు కాగా చరాచరసృష్టి నష్టప్రాయము కాగా ప్రకృతియొక్క గుణవికారమునకు గారణమై బుద్ధి జనించెను. అందుండి యహంకారము, దాన మహాభూతములు నవ్వల నొకయండము జనించెను. ఈ లోకములెల్ల దానియందున్నవి. అందు నేను, విష్ణువు, శివుడునుండి తామస వృత్తులమై యీశ్వరునిధ్యానించితిమి అపుడు విజ్ఞాన స్వరూపుడు ధ్యానయోగమందు మాకు సూర్యరూపుడై గోచరించెను. విశ్వరూపునిగ మే మాయనను స్తుతించితిమి.

''ఆదిదేవో7సిదేవానాం నీవుదేవతలకెల్ల మొదటి దేవతవు'' ఇత్యాదిగ మూలశ్లోకములు పారాయణార్హములు వీని భావము సుగమము.

దేవాఊచుః

తవా7తి తైజసం రూపం న కశ్చిత్‌సోఢు ముత్సహేత్‌ |సహనీయం త ద్భవతు హితాయ జగతః ప్రభో || 25

ఏవ మస్త్వితి సో7ప్యుక్తో భగవా నాదికృత్‌ ప్రభుః | లోకానాం కార్య సిద్ధ్యర్థం ఘర్మవర్షహిమప్రదః || 26

తతః సాంఖ్యాశ్చ యోగాశ్చ యేచాన్యే మోక్షకాంక్షిణః | ధ్యాయంతి ధ్యాయినో దేవం హృదయస్థం దివాకరం|| 27

సర్వలక్షణహీనో7పి యుక్తో వా సర్వపాతకైః | సర్వంచ తరతే పాపం దేవ మర్కం సమాశ్రితః || 28

అగ్నిహోత్రం చ వేదాశ్చ యజ్ఞాశ్చ బహుదక్షిణాః | భానోర్భక్తినమస్కారకలాం నార్హంతి షోడశీమ్‌ || 29

తీర్థానాం పరమం తీర్థం మంగళానాంచ మంగళమ్‌ | పవిత్రంచ పవిత్రాణాం ప్రపద్యంతే దివాకరమ్‌ || 30

శక్రాద్యైః సంస్తుతం దేవం యే నమస్యంతి భాస్కరమ్‌| సర్వకిల్బిషనిర్ముక్తాః సూర్యలోకం వ్రజంతి తే || 31

దేవతలు పలికిరి-

జగత్‌ప్రభూ! నీ తేజోరూపము నెవ్వడును సహింపనేరడు. కావున లోకహితముకొఱ కది ప్రశాంతమగుగాక! అనినంతట సూర్యభగవానుడు ఘర్మమును వర్షమును జలువను గూడ నీయగలవాడు కావున జగత్కార్య సిద్ధి కట్లేయగుగాక యనెను. సాంఖ్యులు, యోగులు ముముక్షువులు భాస్కరుని హృదయమందు చైతన్యరూపముననున్నవాని గని ధ్యానింతురు. బహుదక్షిణములైన క్రతువులు వానికినాధారమైన వేదములు సూర్యనమస్కారముయొక్క కలామాత్రమునకేని (లేనమాత్రమునకేని) సరిగావు, అది తీర్థములకెల్ల తీర్థము. మంగళములకెల్ల మంగళము. పవిత్రములకెల్ల పవిత్రమునైన దివాకరమూర్తి నందరు శరణందుదురు. సూర్యనమస్కారము సర్వ పాపహరము.

మునయః ఊచుః

చిరాత్ప్రభృతి నో బ్రహ్మన్‌ శ్రోతు మిచ్ఛా ప్రవర్తతే|నామ్నా మష్టశతం బ్రూహి యత్త్వ యోక్తం పురా రవేః || 32

''ప్రజాపతీ! చాల కాలమునుండి మాకు సూర్యుని యష్టోత్తరశతనామములను వినవలెనని కోరిక యున్నది. కాన దయచేసి తెలుపుమని'' మునులడిగిరి.

బ్రహ్మోవాచ

అష్టోత్తరశతం నామ్నాం శృణుధ్వం గదతో మమ|భాస్కరస్య పరం గుహ్యం స్వర్గమోక్షప్రదం ద్విజాః || 33

బ్రాహ్మణులారా! మిక్కిలి రహస్యమును స్వర్గమోక్షముల నిచ్చునదియు నగు సూర్యుని అష్టోత్తరశతనామములను చెప్పుచున్నాను. వినుడు-

ఓం సూర్యో 7ర్యమా భగ స్త్వష్టా పూషా7 ర్కః సవితా రవిః|గభస్తిమా నజః కాలో మృత్యు ర్ధాతా ప్రభాకరః 34

పృధివ్యాపశ్చ తేజశ్చ ఖం వాయుశ్చ పరాయణం | సోమో బృహస్పతిః శుక్రో బుధో 7 గారక ఏవచ || 35

ఇంద్రో వివస్వాన్‌ దీప్తాంశుః శుచిః శౌరిః శ##నైశ్చరః|బ్రహ్మా విష్ణుశ్చ రుద్రశ్చ స్కందో వైశ్రవణో యమః ||

వైద్యుతో జాఠర శ్చాగ్ని రైంధన స్తేజసాం పతిః | ధర్మధ్వజో వేదకర్తా వేదాంగో వేదవాహనః || 37

కృతం త్రేతా ద్వాపరశ్చ కలిః సర్వామరాశ్రయః | కలా కాష్ఠా ముహూర్తాశ్చ క్షపా యామా స్తథా క్షణాః || 38

సంవత్సరకరో 7శ్వత్థః కాలచక్రో విభావసుః | పురుషః శాశ్వతో యోగీ వ్యక్తావ్యక్తః సనాతనః || 39

కాలాధ్యక్షః ప్రజాధ్యక్షో విశ్వకర్మా తమోనుదః | వరుణః సాగరో 7ంశశ్చ జీమూతో జీవనో 7రిహా || 40

భూతాశ్రయో భూతపతిః సర్వలోకనమస్కృతః | స్రష్టా సంవర్తకో వహ్నిః సర్వస్యా77ది రలోలుపః || 41

అనంతః కపిలో భానుః కామదః సర్వతోముఖః | జయో విశాలో వరదః సర్వభూతనిషేవితః || 42

మనః సుపర్ణో భూతాదిః శీఘ్రగః ప్రాణధారణః | ధన్వంతరి ర్థూమకేతు రాదిదేవో 7దితేఃసుతః || 43

ద్వాదశాత్మా రవి ర్దక్షః పితా మాతా పితామహః | స్వర్గద్వారం ప్రజాద్వారం మోక్షద్వారం త్రివిష్టపమ్‌ || 44

దేహకర్తా ప్రశాంతాత్మా విశ్వాత్మా విశ్వతోముఖః | చరాచరాత్మా సూక్ష్మాత్మా మైత్రేయః కరుణాన్వితః || 45

ఏతద్వై కీర్తనీయస్య సూర్యస్యామితతేజసః|నామ్నా మష్టశతం రమ్యం మయా ప్రోక్తం ద్విజోత్తమాః || 46

సురగణపితృయక్షసేవితః | హ్యసుర నిశాకరసిద్ధవందితం | వరకనకహుతాశనప్రభం ప్రణిపతితో7స్మి హితాయ భాస్కరమ్‌ || 47

సూర్యోదయే యః సుసమాహితః పఠేత్‌ స పుత్రదారాన్‌ ధనరత్న సంచయమ్‌

లభేత జాతిస్మరతాం నరః సతు స్శృతించ మేధాంచ స విందతే పరామ్‌ || 48

ఇమం స్తవం దేవవరస్య యో నరః ప్రకీర్తయే చ్ఛుద్ధమనాః సమాహితః

విముచ్యతే శోకదవాగ్ని సాగరాత్‌ లభేత కామా న్మనసా యథేప్సితాన్‌ || 49

ఇతి శ్రీబ్రహ్మపురాణ బ్రహ్మఋషిసంవాదేసూర్యష్టోత్తరశతంనామత్రయస్త్రింశో7ధ్యాయః

గొప్ప తేజశ్శాలియగు శ్రీ సూర్యుని అష్టోత్తరశతనామములు చెప్పబడెను. సురాసురసిద్ధపితృ యక్షగణ సేవితుడును, సువర్ణము అగ్నియొక్క కాంతివంటి కాంతిగలవాడును నగు భాస్కరుని నా శ్రేయస్సుకొరకు నమస్కరింతును. సూర్యోదయకాలమున ఈ అష్టోత్తర శతనామ స్తోత్రమును సావధాన చిత్తుడై చదివినవాడు యోగ్యమైన భార్యను పుత్రులను ధనరత్నసముదాయమును, పూర్వజన్మస్మృతిని, జ్ఞాపకశక్తిని, గొప్ప ధారణాశక్తిని పొందగలడు. సంసార దావాగ్ని సాగరమునుండి విముక్తి నందును. మనోరథముల నెల్ల పొందును.

ఇది బ్రహ్మపురాణమునందు సూర్యాష్టోత్తరశతనామస్తోత్రమను ముప్పది మూడవ అధ్యాయము.

Brahmapuranamu    Chapters