Brahmapuranamu    Chapters   

అథద్విచత్వారింశదధిక ద్విశతతమోధ్యాయః

వసిష్ఠ కరాలజనకసంవాదవర్ణనమ్‌

వసిష్ఠ ఉవాచ

ఏవ మప్రతిబుద్ధత్వాదబుద్ధ మనువర్తతే | దేహా ద్దేహసహస్రాణి తథా చ న స భిద్యతే ||1

తిర్యగ్యోని సహస్రేషు కదాచి ద్దేవతా స్వపి | ఉత్పద్యతి తపోయోగాద్గుణౖః సహ గుణక్షయాత్‌ || 2

మనుష్యత్వాద్దివం యాతి దేవో మానుష్య మేతి చ | మానుష్యా న్నిరయస్థానమాలయం ప్రతిపద్యతే || 3

కోశకారో యథా೭೭త్మానం కీటః సమభిరుంధతి | సూత్రతంతుగుణౖ ర్నిత్యం తథాయ మగుణో గుణౖః || 4

ద్వంద్వ మేతి చ నిర్ద్వంద్వస్తాసు తా స్విహ యోనిషు | శీర్షరోగేక్షిరోగే చ దంతశూలే గలగ్రహే || 5

జలోదరేతిసారే చ గండమాలా విచర్చికే | శ్విత్రకుష్ఠేగ్నిదగ్ధే చ సిధ్మాపస్మారయో రపి|| 6

యాని చాన్యాని ద్వంద్వాని ప్రాకృతాని శరీరిణామ్‌ | ఉత్పద్యంతే విచిత్రాణి తా న్యేవా ೭೭త్మాభిమన్యతే || 7

వసిష్ఠజనక సంవాదము

వసిష్ఠుడు జనకునితో నిట్లు పలికెను : ఈ చెప్పిన విధముగా ఆ అక్షరతత్త్వము జ్ఞాన్వరూపుడయియు అప్రతి బుద్ద - అజ్ఞాన సహిత - రూపుడై అప్రతిబుద్దులగు మనవంటివారి ననువర్తించుచున్నది. దేహమునుండి మఱియొక దేహములో ప్రవేశించుచు వేలకొలది జన్మలను పొందుచున్నది. వేలకొలది తిర్యగ్యోనులందును దేవతలయందును తపోవంతుడై మహాసద్గుణయుక్తుడుగా గుణక్షయముచే మనుష్యుడుగా జన్మించి పుణ్యవశమున స్వర్గమునకు పోవును. మనుష్య లోకమునకు వచ్చును. పాపముచే నరకమునకును పోవును. పట్టుపురుగు తన దేహమునుండి తీసిన దారముతో తన్నే చుట్టుకొన్నట్లు తననుండి నిష్పన్నములైన త్రిగుణములతో తన్నే బంధించుకొని ఆ అక్షరుడు తాను స్వభావముచే ద్వంద్వాతీతుడై యుండియు సుఖదుఃఖ రూపములగు ద్వంద్వములకు లోబడి శిరోరోగము నేత్రరోగము దంతశూల గల గ్రహము జలోదరము అతిసారము గండమాల విచ్చర్చిక బొల్లి కుష్ఠము అగ్నిదాహము అపస్మారము మొదలగు బాధలను పొందుచు దేహము నేనే అనియు దేహము నాదే అనియు మాయావశమున కలిగిన అభిమానముచే ఆ బాధలును కనకే అని అభిమానమును పొందుచున్నాడు.

అభిమా నాతిమానానాం తథైవ సుకృతాన్యపి | ఏకవాసా శ్చతుర్వాసాః శాయీ నిత్య మధ స్తథా || 8

మండూకశాయీ చ తథా వీరాసన గత స్తథా | వీరమాసన మాకాశే తథా శయన మేవ చ || 9

ఇష్టకాప్రస్తరే చైవ చక్రకప్రప్తరే తథా | భస్మప్రస్తరశాయీ చ భూమిశ య్యాసులేపనః || 10

వీరస్థా నాంబుపాకే చ శయవం ఫలకేషు చ | వివిధాసు చ శయ్యాను ఫలగృ హ్యాన్వితాసు చ || 11

ఉద్యానే ఖలలగ్నే తు క్షౌమకృష్ణాజినాన్వితః | మణివాల పరీధానో వ్యాఘ్రచర్మపరిచ్ఛదః || 12

సింహచర్మ పరీధానః పట్టవాసా స్తథైవ చ | ఫలకం (?) పరిధానశ్చ తథా కటకవస్త్రధృక్‌ || 13

కటైక వసన శ్చైవ చీరవాసా స్తథైవ చ | వస్త్రాణి చాన్యాని బహూన్యభిమత్య చ బుద్దిమాన్‌ || 14

భోజనాని విచిత్రాణి రత్నాని వివిధాని చ | ఏకరాత్రాంతరాశిత్వమైకకాలిక భోజనమ్‌ || 15

చతుర్థయామ కాలం చ షష్ఠకాలిక మేవ చ | షడ్రాత్ర భోజనశ్చైవ తథా చాష్టాహభోజనః || 16

మాసోపవాసీ మూలాశీ ఫలాహార స్తథైవ చ | వాయుభక్షశ్చ పిణ్యాకదధిగోమయ భోజనః || 17

గోమూత్ర భోజనశ్చైవ కాశపుష్పాశన స్తథా | శైవాల భోజనశ్చైవ తథా చాన్యేన వర్తయన్‌ || 18

వర్తయన్‌ శీర్ణపర్ణై శ్చ ప్రకీర్ణభోజనః | వివిధాన చ కృచ్ర్ఛాణి సేవతే సిద్దికాంక్షయా || 19

చాంద్రాయణాని విధివ ల్లింగాని వివిధాని చ | చాతురాశ్రమ్యయుక్తాని ధర్మాధర్మాశ్రయా ణ్యపి || 20

ఉపాశ్రయా నప్యపరాన్పాఖండాన్వివిధా నపి | వివిక్తా శ్చ శిలాఛాయా స్తథా ప్రస్రవణాని చ || 21

పులినాని వివిక్తాని వివిధాని వనాని చ | కాననేషు వివిక్తాశ్చ శై లానాం మహతీర్గుహాః || 22

నియమా న్వివిధాం శ్చిపి వివిధాని తపాంసి చ | యజ్ఞాంశ్చ వివిధాకారాన్విద్యాశ్చ వివిధా స్తథా || 23

వణి క్పథం ద్విజక్షత్రవై శ్యశూద్రాం స్తథైవ చ | దానం చ వివిధాకారం దీనాంధ కృపణాదిషు || 24

అభిమన్యేక సంధాతుం తథైవ వివిధాన్గుణాన్‌ | సత్త్వం రస్తమశ్చైవ ధర్మార్థౌ కామ ఏవ చ || 25

ప్రకృత్యా೭೭త్మాన మేవా೭೭త్మా ఏవం ప్రవిభజత్యుత | స్వాహాకారవషట్కారౌ స్వధాకారనమస్క్రియే || 26

యజనాధ్యయనే దానం తథైవాహుః ప్రతిగ్రహమ్‌ | యాజనాధ్యాపనే చైవ తథాన్యదపి కించన ||27

జన్మమృత్యువిధానేన తథా విశసనేన చ | శుభాశుభమయం సర్వమేత దాహుః సనాతనమ్‌ || 28

అభిమానముచే కలుగు ఈ ద్వంద్వజనిత దుఃఖములతో పాటుగ ఆ దేహత్మా భిమానవశముననే అహంకార మమకార వశముననే అతడు కొన్ని సుకృతములను కూడ ఆచరించుచున్నాడు. అవి ఇట్లు ఉండును. ఒకే వస్త్రము ధరించుట నాలుగు వస్త్రముల ధరించుట నేలపైపరుండుట కప్పవలె వరుండుట వీరాననములో కూర్చుండుట వీరాసనముతోను ఆకాశమునందును శయనించుట ఇటుకల కుప్పపై బూడిదరాశిపై భూమిపై పండుకొనుట వీరస్థానమున జలముతో తడిసిన చోట కొయ్య -రాతి పలకలపై పరుండుట కాయలతో పండ్లతో పశువులతో పక్షులతో నిండినచోట ఉద్యానములో కళ్లములో పండుకొనుట పూసలతో వెంట్రుకలతో చేసిన వస్త్రములు వ్యాఘ్ర చర్మము సింహదర్మము చెట్లబెరడు పట్టములు నారతో పురికొసతో నేసిన పట్టాలు మొదలగునవి. చాపలు - చాపలవంటి ఇతరవస్తువులు నార వస్త్రములు మొదలైనవి తన అభిరుచిననుసరించి ధరించుట ఒక రాత్రి వదలి మఱియొక రాత్రియు దినమున కొకేమారును నాలుగు భోజనకాలముల కొకమారు ఎనిమిది భోజనకాములకు ఒకసారి ఎనిమిది నాళ్ళకు ఒకసారి ఆరునాళ్లకు ఒకసారి భోజనము చేయుట మాసోపవాసము చేయుట మూలములు పండ్లు తినియుండుట వాయువును నూనె పిండివంటలను పెరుగును గోధుమలతో యవలతో చేసిన వంటలను గోమూత్రమును ఱల్లుపూవులను నాచును ఎండుటాకులను వివిధములగు పండ్లను భుజించి జీవనము గడపుట కృచ్ఛమ్రులు చాంద్రాయణములు మొదలగు కఠిన వ్రతములు ఆచరించుట వివిధ వేషములు చిహ్నములు అవి నాలుగు ఆశ్రమములలో వేటికి సంబందించినవైనను ధర్మాధర్మములలో దేనికి చెందినవైనను వాటికి సన్నిహితమైన ఇతర లక్షణములను వేద విరుద్థములైన వానిని ధరించుట వివిక్తమగు శిలల నీడలను సెలయేళ్లను ఇసుక తిన్నెలను అడవులను పర్వతగుహలను వివిధ నియమములను తవస్సులకు యజ్ఞ ములను వివిధ యజ్ఞములను ఆశ్రయించుట బ్రాహ్మణ క్షత్రియ వైశ్యశూద్రజాతి ధర్మము లలో తోచిన వాటిని ఆవలంబించుట దీనులు అంధులు మొదలగువారికి వివిధ దానములు చేయుట వివిధ గుణములను స్వభావములను అలవాటును పాటించుట ధర్మార్థ కామము లతో తనకు అభిమతమగు పురుషార్థమునందు ప్రవృత్తుడగుట ఇవన్నియు దేహాత్మా భిమానము అహంకార మమకారము. అనెడి వానివలన మాయా వశమున కలుగు ప్రవృ త్తులే. స్వాహాస్వధావషట్‌ నమస్కారములు యజనయాజ నాధ్య యనాధ్యాపనదాన ప్రతి గ్రహములు జన్మ జరామృత్యువులు హింస శుభాశుభ కర్మల న్నియు ఈ అభిమానవశ మున కలుగునవే. ఇట్లు ఆ అక్షరతత్త్వమేక్షరరూపమున తన్ను తాను వివిధరూపము లలో విభజించుకొనుచు వ్యక్తమూర్తరూపమున కనబడు చున్నది.

ప్రకృతిః కురుతే దేవీ భయం ప్రలయ మేవ చ | దివసాంతే గుణా నేతానతీత్యై కోవతిష్ఠతే || 29

రశ్మిజాల మి వా೭೭దిత్యస్తత్కాలం సంనియచ్ఛతి | ఏవ మే వైష తత్సర్వం క్రీడార్థ మభిమన్యతే || 30

ఆత్మరూపగుణా నేతాన్వివిధా న్హృదయప్రియాన్‌ | ఏవ మేతాం ప్రకుర్వాణః సర్గప్రలయధర్మిణీమ్‌ || 31

క్రియాం క్రియాపథే రక్తస్త్రగుణ స్త్రిగుణాధిపః | క్రియాక్రియాపథో పేత స్తథా త దితి మన్యతే || 32

ప్రకృత్యా సర్వ మే వేదం జగదంధీకృతం విభో | రజసా తమసా చైవ వ్యాప్తం సర్వ మనేకధా || 33

ఏవం ద్వంద్వా న్యతీతాని మమ వర్తంతి నిత్యశః | మత్త ఏతాని జాయంతే ప్రలయే యాంతి మా మపి || 34

నిస్తర్తవ్యా ణ్య థైతాని సర్వా ణీతి నరాధిప ః మన్యతే పక్షబుద్దిత్వాత్తథైవ సుకృతా న్యపి || 35

భోక్తావ్యాని మమైతాని దేవలోక గతేన వై | ఇ హైవ చైనం భోక్ష్యామి శుభాశుభఫలోదయమ్‌ || 36

సుఖ మేవం తు కర్తవ్యం సకృత్కృత్వా సుఖం మమ | యాం దేవ తు మే సౌఖ్యం

జాత్యాం జాత్యాం భవిష్యతి || 37

భవిష్యతి న మే దుఃఖం కృతే నేహాప్యనంతకమ్‌ | సుఖదుఃఖం హి మానుష్యం నిరయే చాపి మజ్జనమ్‌ || 38

నిరయాచ్చాపి మానుష్యం కాలే నై ష్యా మ్యహం పునః | మనుష్యత్వా చ్చ దేవత్వం దేవత్వా త్పౌరుషం పునః 39

మనుష్యత్వా చ్చ నిరయం పర్యాయే ణోపగచ్ఛతి | ఏష ఏవం ద్విజాతీనామాత్మా వై త్రిగుణౖ ర్వృతః || 40

తేన దేవమనుష్యేషు నిరయం చోపపద్యతే | మమత్వే నా೭೭వృతో నిత్యం త్రైవ పరివర్తతే || 41

పూజ్యురాలగు ప్రకృతిదేవియే భయమును ప్రళయమును కూడ కలిగించును. బ్రహ్మయొక్క పగలు - అనగా సృష్టికాలము అయిన తర్వాత శ్రీ మహావిష్ణువు ప్రళయ మును జరిపి ఈ త్రిగుణములకును వాటివలన కలుగు సమస్త లక్షణములకును అతీతుడై ఏకైక తత్త్వమగు తాను మాత్రమే ఉండును. సృష్టి జరుగక నిలిచిపోయిన రాత్రి - ప్రళయ కాలమున సూర్యుడు తన కిరణములను వలె కొంతకాలము పాటుఆయా గుణధర్మము లను తన లోపల ఆయన నిగ్రహించియుంచును. ఇది యంతయు ఆయన ఇట్లు లీలా - క్రీడా -ర్థమై చేయుచు తన హృదయమునకు ప్రియములైన ఈతన రూప గుణములను తనవి అను అభిమానముతో - మమకారముతో - చూచును. ఆయన త్రిగుణాత్మకుడు- త్రిగుణముల కధిపతి. క్రియాప్రవృత్తి మార్గమునందు ఆసక్తి కలవాడు. క్రియా ప్రవృత్తులతోను యజ్ఞాది క్రియలతోను సంతతమును కూడియుండువాడు. అందుచే ఈ సృష్టి ప్రళయ రూపమగు ప్రవృత్తియందు ముందునకు సాగుచు ఇది నాదియను మమకారమును లీలార్థమై మాత్రమే - వహించును. వాస్తవమున ఆ మహానుభావునకు అహంకార మమకార ములు ఏవియు లేవు. ఈ జగమంతయు ప్రకృతి ధర్మముచే కన్నుగానక రజస్తమో గుణధర్మములచే అనేకవిధములుగా వ్యాప్తమై యున్నది. ఈ ద్వంద్వములు సుఖ దుఃఖ - శీతోష్ణాదులు. నాచే అతీతములై నానుండి యుత్పన్న ములగుచు నాయందే లయము నొందుచున్నవి. అని ఆయన ఎరుగును. అవి తనచే లెస్సగ సృజింపబడినవే యైనను తాను సామాన్య జీవుడై యున్నపుడు మాయావశమున ఏమియు ఎరుగక పోవుటచే అయ్యో! ఇవి యన్నియు నేను తరించవలెను. దేవలోక మున నేను ఈ ఫలములనుభవింపవలెను. ఈ లోకములో నున్నపుడు కర్మవశమున కలుగు శుభాశుభ ఫలము లనుభవింపవలసియున్నది. ఈ విధమగు కర్మములాచరించి సుఖములను సంపాదింపవలెను. ప్రతిజన్మమునందును నాకు సుఖమే కలుగుటకు యత్నించవలెను. ఇహమున నాకు అనంతమగు దుఃఖములు నరకమున యాతనలు ఉండరాదు. ఒకవేళ నరకమునకు పోయినచో మరల మనుష్యజన్మమును తరువాత దేవత్వమును పొందుదడును. అని యిట్లు బ్రహ్మణాది జన్మములు పొందిన ఈ మానవులు ఆయా గుణములతో ఆవరింపబడి భానచేయుచు అందుకు తగినట్లు కర్మము లాచరించుచు నరకమునో మున్యష్యత్వ దేవత్వములనో పొందుచు కేవలము మమకారవశమున ఈ జననమరణరూప సంసారగతిలో తిరుగుచుందురు.

సర్గకోటిసహస్రాణి మరణా న్తాసు మూర్తిషు | య ఏవం కురుతే కర్మ శుభాశుభఫలాత్మకమ్‌ || 42

స ఏవ ఫల మాప్నోతి త్రిషు లోకేషు మూర్తిమాన్‌ | ప్రకృతిః కురుతే కర్మ శుభాశుభఫలాత్మకమ్‌ || 43

ప్రకృతి శ్చ తథా೭೭ప్నోతి త్రిషు లోకేషు కామగా | తిర్యగ్యోని మనుష్యత్వే దేవలోకే తథైవచ || 44

త్రీణి స్థానాని చైతాని జానీయా త్ర్పాకృతాని హ | ఆలింగ ప్రకృతిత్వాచ్చ లింగై ర ప్యనుమీయతే || 45

తథైవ పౌరుషం లింగమనుమానాధ్ధి మన్యతే | స లింగాంతర మాసాద్య ప్రాకృతం లింగ మప్రణమ్‌ || 46

వ్రణద్వారా ణ్యధిష్ఠాయ కర్మణ్యాత్మని మన్యతే | శ్రోత్రాదీని తు సర్వాణి పంచ కర్మేంద్రియా ణ్యథ || 47

రాగాదీని ప్రవర్తంతే గుణ ష్విహ గుణౖః సహ | అహ మేతాని వై కుర్వన్మ మైతా నీంద్రియాణి హ || 48

నిరింద్రియో హి మన్యేత వ్రణవా నస్మి నిర్ర్వణః | ఆలింగో లింగమాత్మాన మకాలం కాలమాత్మనః || 49

అసత్త్వం సత్త్వ మాత్మానమమృతం మృత మాత్మనః | అమృత్యుం మృత్యు మాత్మానమచరం చరమాత్మనః || 50

అక్షేత్రం క్షేత్ర మాత్మానమసంగం సంగమాత్మనః | ఆతత్త్వం తత్త్వమాత్మానమభవం భవమాత్మవః || 51

అక్షరం క్షర మాత్మానమబుద్ధత్వా ద్ధి మన్యతే | ఏవ మప్రతిబుద్ధత్వాదబుద్ధ జనసేవనాత్‌ || 52

సర్గకోటి సహస్రాణి పతనాంతాని గచ్ఛతి | జన్మాంతరసహస్రాణి మరణాంతాని గచ్ఛతి ||53

తిర్యగ్యోని మనుష్యత్వే దేవలోకే తథైవ చ | చంద్రమా ఇవ కోశానాం పునస్తత్ర సహస్రశః || 54

నీయతే ప్రతిబుద్ధత్వాదేవ మేవ కుబుద్ధిమాన్‌ | కలా పంచదశీ యోనిస్త ద్ధామ ఇతి పఠ్యతే || 55

నిత్యమేవ విజానీహి సోమం వై షోడశాంశ##కైః | కలయా జాయతేజస్రం పునః పున రబుద్ధిమాన్‌ || 56

ధీమాంశ్చాయం న భవతి నృప ఏవం హి జాయతే | షోడశీ తు కలా సూక్ష్మా స సోమ ఉపధార్యతామ్‌ || 57

స తూప యుజ్యతే దేవైర్దేవా నపి యునక్తి నః | మమత్వం క్షపయిత్వా తు జాయతే నృపసత్తమ || 58

ప్రకృతే స్త్రిగుణాయా స్తు స ఏవ త్రిగుణో భ##వేత్‌ ||

ఇతి శ్రీమహాపురాణ ఆదిబ్రాహ్మే వసిష్ఠ కరాలజనకసంవాదవర్ణనం నామ ద్విచత్వారింశదధిక ద్విశతతమోధ్యాయః.

ఈ విధముగా జీవుడు శుభాశుభ ఫలాత్మకమగు కర్మల నాచరించుచు జనన మరణముల నడుమ అనేక రూపములలో సంచరించుచున్నాడు. కాని ఈ జీవుల ప్రవృత్తులలోను తిర్యగ్యోని మనుష్యత్వ దేవత్వ ప్రాప్తులలోను ప్రకృతియే హేతువు. అది స్వతంత్రమైనది. జీవుడు ప్రకృతికి అతీతమైన తత్త్వమునందు వ్రణము లేదు. కర్మఫల సంగము లేదు. వ్రణద్వారములనదగిన జ్ఞాన కర్మేంద్రియములు త్రిగుణజన్యములైన రాగద్వేషాదులు తోడుకాగానే యీ జీవుడు - అహంకార మమకారములు కలిగి తనకు ఇంద్రియములు వ్రణములు చిహ్నములు కాలము సత్తా మరణములు సంచరణము క్షేత్రము సంగము - తత్త్వము - సంసారము నాశములేకున్నను ఆజ్ఞానవశమున తనకివి యన్నియు ఉన్నవని భావించుచు పెద్దలను సేవించి వివేకమును సంపాదించక దేవత్వము మొదలు నరకపాతమువరకు గర్భప్రకాశము మొదలు మరణమువరకు వివిధ స్థితులకు కారణములగు వేలకొలది సృష్టులలో సంచరించుచు సంసరించు చున్నాడు. చంద్రునకు పదునారు కలలున్నవని శాస్త్రము చెప్పుచున్నది. వానిలో పదునైదింటిని మాత్రము దేవతలనుభవింతురు. పదునారవ కలమాత్రము దేవతల అనుభవమునకు అందక నిలిచి యుండుచు తానేదేవతలను అనుభవించుచు మరల మరల చంద్రుడు వృద్ధిక్షయములు పొందుటకు మూలమగు చున్నది. అట్లే శుద్ధమగు ఆత్మ తత్త్వముకూడ అజ్ఞానవశమున ప్రకృతికి లోబడి ఆయాజన్మ పరంపరలలో వృద్ధిక్షయములను పొందుచుండియు శుద్ధతత్త్వమునకు ఏమియు అంటక నిలుచును కావున ఆతాత్త్విక స్థితిని వృద్ధజనసేవసముచే వివేకముపొందియు యోగాది సాధనచేసియు భగవదనుగ్రహము పొందినప్పుడు గ్రహంచి ముక్తుడగుచున్నాడు.

ఇది శ్రీమహాపురాణమున ఆదిబ్రాహ్మమున వసిష్ఠజనకసంవాదమున క్షరాక్షరతత్త్వనిరూపమను రెండువందల నలువదిరెండవ అధ్యాయము.

Brahmapuranamu    Chapters