Brahmapuranamu    Chapters   

అథ చతుస్త్రింశదధికశతతమో7ధ్యాయః

ఆత్యంతికలయనిరూపణమ్‌

వ్యాస ఉవాచ

ఆధ్యాత్మికాది భో విప్రా జ్ఞాత్వా తాపత్రయం బుధః | ఉత్పన్నజ్ఞనవైరాగ్యః ప్రాప్నోత్యాత్యంతికం లయమ్‌ || 1

ఆధ్యాత్మికోపి ద్వివిధః శారీరో మానస స్తథా | శారీరో బహుభిర్భేదైర్భిద్యతే శ్రూయతాం చ సః || 2

శిరోరోగ ప్రతిశ్యాయ జ్వర శూలభగందరైః | గుల్మార్శః శ్వయథుశ్వాసచ్ఛర్ద్యాదిభిరనేకధా || 3

తథాక్షిరోగాతీసార కుష్ఠాంగామయసంజ్ఞకైః | భిద్యతే దేహజ స్తాపో మానసం శ్రోతుమర్హథ || 4

కామక్రోధ భయద్వేషలోభయోహవిషాదజః | శోకాసూయావమానేర్ష్యా మాత్సర్యాభిభవస్తథా || 5

మానసోపి ద్విజశ్రేష్ఠా స్తాపో భవతి నై కధా | ఇత్యేవమాదిభిర్భేదైస్తాపో హ్యాధ్యాత్మికః స్మృతః || 6

మృగపక్షి మనుష్యాద్యైః పిశాచోరగరాక్షసైః | నరీసృపాద్యైశ్చ నృణాం జన్యతే చా೭೭ధిభౌతికః || 7

తోష్ణవాతవర్షాంబు వైద్యుతాది సముద్భవః | తాపో ద్విజపరశ్రేష్ఠాః కథ్యతే చా೭೭ధిదైవికః || 8

గర్భజన్మ జరాజ్ఞాన మృత్యునారకజం తథా | దుఃఖం సమస్రశో భేదైర్బిద్యతే మునసత్తమాః || 9

సుకుమారతను ర్గర్భే జంతు ర్బహుమలావృతే | ఉల్బ సంవేష్టితో భగ్నపృష్ఠగ్రీవాస్థిసంహతిః || 10

అత్యవ్లు కటు తీక్షోష్ణ లవణౖర్మాతృ భోజనైః | అతితాపిభి రత్యర్థం బాధ్యమానోతివేదనః || 11

ప్రసారణాకుంచనాదై నాంగా నాం ప్రభురాత్మనః | శకృన్మూత్రమహావంకశాయీ పర్వత్ర పీడితః || 12

నిరుచ్ఛ్వాసః సచైతస్యః స్మరన్జన్మశతాన్యథ | ఆస్తే గర్భేతిదుఃఖేన నిజకర్మనిబంధనః || 13

జాయమానః పురీపాసృజ్మూత్ర శుక్రావిలాసనః | ప్రాజాపత్యేన వాతేన పీడ్యమానాస్థి బంధనః || 14

అధోముఖసై#్తః క్రియతే ప్రబలైః సూతిమారుతైః | క్లెశైర్నిప్ర్కాంతి మాప్నోతి జఠరాన్మాతురాతురః || 15

మూర్ఛామవాప్య మహతీం సంస్పృష్టో బాహ్యవాయునా | విజ్ఞానభ్రంశ మాప్నోతి జాతస్తు మునిసత్తమాః || 16

కంటకైరివ తున్నాంగః కక్రచైరివ దారితః పూతి వ్రణాన్నిపతితో ధరణ్యాం క్రిమికో యథా ll 17

కండుయనే7పి చాశక్తః పరివర్తే7ప్యనీశ్వరః l స్తన్యపానాదికాహార మవాప్నోతి పరేచ్ఛయా ll 18

అశుచిస్రస్తరే సుప్తః కీటదంశాదిభిస్తథా l భక్ష్యమాణో7పి నై వైషాం సమర్థో వినివారణ ll 19

జన్మదుఃఖాన్యనేకాని జన్మనో7నంతరాణిచ l బాలభావే యదాప్నోతి అధిభూతాదికాని చ ll 20

అజ్ఞానతమసా ఛన్నో మూఢాంతః కరణో నరః l న జానాతి కుతః కో7హం కుత్ర గంతా కిమాత్మకః ll 21

కేన బంధేన బద్ధో7హం కారణం కిమకారణమ్‌ l కిం కార్యం కిమకార్యం వా కిం వాచ్యం కిం న చోచ్యతే ll 22

కో ధర్మఃకశ్చవా7ధర్మః కస్మిన్వర్తేత వై కధమ్‌ l కిం కర్తవ్యమక ర్తవ్యం కిం వా కిం గుణదోషవత్‌ ll 23

ఏవం పశుసమైర్మూఢైరజ్ఞాన ప్రభవం మహత్‌ l అవాప్యతే నరైర్దుఃఖం శిశ్నోదరపరాయణౖః ll 24

అజ్ఞానం తామసోభావః కార్యారంభ ప్రవృత్తయః l అజ్ఞానినాం ప్రవర్తంతే కర్మలోపస్తతో ద్విజాః ll 25

ఆత్యన్తికలయ నిరూపణము

ఓ విప్రులారా! వివేకియగు జీవుడు ఆధ్యాత్మికములు - ఆధిభౌతికము - ఆధి దైవికములు అను మూడు విధములగు తాపమువలని దుఃఖమును దోషమును గుర్తెరిగి వైరాగ్యముతో జ్ఞానము సంపాదించుటచే ఆత్యంతి కలయమును - మోక్షమును పొందును. వీనిలో ఆధ్యాత్మిక తాపము దైహికము మానసికము అని రెండు విధములు. శిరోరోగము- ప్రతిశ్యాయము - జ్వరము -శూలవ్యాధి -భగందరము - గుల్మము-ఆర్శస్సు -శ్వయథువు - శ్వాసవ్యాధి - ఛర్ది -అక్షిరోగములు- అతి సారము - కుష్ఠము - అవయవముల రోగములు - ఈ మొదలుగ దైహిక తాపము బహువిధములు. కామము - క్రోధము - భయము - ద్వేషము -లోభము - మోహము - విషాదము - శోకము - అసూయ - అవమానము - ఈర్ష్య - మత్సరము - తిరస్కారము మొదలుగ మానసతాపము అనేక విధములు ఈ రెండును కలిసి అధ్యాత్మిక తాపమనబడును. ఆత్మ అనగా ఇచట దేహమని యర్థము. పాంచభౌతిక దేహముతో సంబంధించినవి ఆధ్యాత్మికములు. పైవాని వివరము ఆయుర్వేదాది శాస్త్రములనుండి తెలియదగినవి.

మృగములు - పక్షులు - మనుష్యులు - పిశాచములు - సర్పములు - రాక్షసులు - ప్రాకెడి ప్రాణులు మొదలగు వానిచే మానవునికి కలుగు తాపములు అధిభౌతికములు - భూతముల - ప్రాణుల - వలన కలుగునవి.

చలి - ఉష్ణము - గాలి - వర్షము - నీరు మెఱవులు వానివలన కలుగు తాపము అధిదైవికము.

గర్భము - జన్మము - ముసలితనము - అజ్ఞానము - మృత్యువు నరకము - మొదలగు వానివలన కలుగు దుఃఖములు వేలకొలది విధములు. ఎట్లనగా - సుకుమార శరీరము కల జీవుడు తల్లి గర్భములో అనేక మలినములు క్రమ్మియున్న గర్భములో మావిలో చుట్టబడి వెన్ను వీపు మెడ ఎముకలు వంగి దాల పుల్లనివి - కారపువి - చురుకైనవి - చాలవెచ్చనివి - ఉప్పనివి అగు ఆహారములు తల్లి తినగా అవి కలిగించు తాపమువలన చాల బాధ పడుచుండును. అవయవములు స్వేచ్ఛగా చాచలేక ముడువలేక మలమూత్రముల రొంపిలో పండుకొనుచు ఊపిరాడక చైతన్యమున్నందున గడచిన వందలకొలది జన్మములను జ్ఞాపకము చేసికొనుచు తన పూర్వకర్మలకు బద్ధుడై దుఃఖములనుభవించుచుండును. ఇది గర్భదుఃఖము. ప్రసవకాలపు గాలులచే తలక్రిందులుగా త్రిప్పబడి మలము రక్తము మూత్రము శుక్రశోణితములు మొదలగువానిచే నోరంతయు మలినముకాగా ప్రాజావత్యము అను ప్రసవద్వారపు గాలిచే ఎముకలసంధులు బాధపడుచుండ తల్లి గర్భమునుండి ఎన్నో క్లేశములతో వెలుపలికి వచ్చును. ముళ్లు గ్రుచ్చుకొనినట్లు రంపముతో కోసినట్లు అవయవములు బాధపడుచుండ క్రుళ్ళిన పుండులోనుండి బయటపడిన క్రిమివలె బయటపడి గోకికొనుటకును అటు ఇటు దొరలుటకును శక్తిలేక ఇతురుల ఇచ్ఛకు లోబడి పాలు మొదలగు ఆహారము గ్రహించును. మలినమగు ప్రక్కలపై పరుండియు పురుగులు దోమలు కుట్టచున్నను తినుచున్నను వాటిని తినుచున్నను వాటిని తోలుకొననైన లేకుండును. ఇటువంటి జన్మదుఃఖములను జన్మకు అనంతరము పొందు ఆధ్యాత్మికాది దుఃఖములను అంతులేనివి.

నరుడు అజ్ఞానాంధకారముతో కప్పబడి మనస్సు మూఢమై నేను ఎక్కడినుండి వచ్చితిని?? ఎవడను? ఎట్టివాడను? ఎక్కడికి పోవలెను? నన్ను ఏ బంధము బంధించినది? ఇది సకారణమా? అకారణమా? చేయదగినదేది! తగనిదేది? పలుకదగినదేది? తగనిదేది? ధర్మమేది? అధర్మమేది? గుణము ఏది? దోషమేది ? అని యెరుగక పశువులవలె ఆహార మైథునములు కయి మాత్రము ప్రాకులాడుట అజ్ఞానమువలన కలుగు దుఃఖము. అజ్ఞానము తమోగుణ ధర్మము. దానివలన నరులు చేయవలసిన కర్మలను చేయక చేయరానివానిని చేయుచుందురు.

నరకం కర్మణాం లోపాత్ఫలమాహుర్మహర్షయః | తస్మాదజ్ఞానినాం దుఃఖమిహ చాముత్ర చోత్తమమ్‌ || 26

జరాజర్జర దేహశ్చ శిథిలావయవః పుమాన్‌ | విచలచ్ఛీర్ణదశనో వలిస్నాయుశిరావృతః || 27

దూరప్రనష్టనయనో వ్యోమాంతర్గతతారకః | నాసావివరనిర్యాత రోమపుంజశ్చలద్వపుః || 28

ప్రకీటభూత సర్వాస్థిర్నత పృష్ఠాస్థిసంహతిః | ఉత్సన్నజఠరాగ్నిత్వా దల్పాహారోల్పచేష్టితః || 29

కృచ్ర్ఛ చంక్రమణోత్థానశయనాసన చేష్టితః| మందీభవచ్చ్రోత్రనేత్ర గలల్లాలా విలాసనః || 30

ఆనాయత్తైః సమసై#్తశ్చ కరణౖ ర్మర ణోన్ముఖః | తత్‌క్షణప్యనుభూతానా మస్మర్తాఖిలవస్తునామ్‌ || 31

సకృదుచ్చారితే వాక్యే సముద్భూత మహాశ్రమః | శ్వాసకాసామయాయాస సముద్భూత ప్రజాగరః || 32

అన్యేనోత్థాప్యతేన్యేన తథా సంవేశ్యతే జరీ | భృత్యాత్మ పుత్ర దారాణా మవమాన పరాకృతః || 33

ప్రక్షీణాఖిలశౌచశ్చ విహారాహార సంస్పృహః | హాస్యః పరిజనస్యాపి నిర్వణ్ణాశేష బాంధవః || 34

అనుభూతమివాన్యస్మి న్జన్మన్యాత్మ విచేష్టితమ్‌ | సంస్మరన్యౌవనే దీర్ఘ నిఃశ్వసిత్యతితాపితః || 35

ఏవమాదీని దుఃఖాని జరాయామనుభూయ చ | మరణ యాని దుఃఖాని ప్రాప్నోతి శృణు తాన్యపి || 36

శ్లథగ్రీవాంఘ్రి హస్తోథ ప్రాప్తో వేపథున నరః | ముహుర్‌గ్లాని పరశ్చాసౌ ముహుర్జాన బలాన్వితః || 37

హిరణ్యధాన్యతనయ భార్యా భృత్యగృహాదిషు | ఏతే కథం భవిష్యంతీ త్యతీవమ మతాకులః || 38

మర్మవిధ్బి ర్మహారోగైః | క్రకచైరివ దారుణౖః | శ##రైరివాంతకస్యోగ్రై శ్చిద్యమానాస్థి బంధనః || 39

పరివర్తమానతారాక్షి హస్తపాదం ముహుః క్షిపన్‌ | సంశుష్యమాణ తాల్వోష్ఠ కంఠో ఘరఘరాయతే || 40

నిరుద్ధకకంఠ దేశోపి ఉదానశ్వాస పీడితః | తాపేన మహతా వ్యాప్త స్తృషా వ్యాప్తస్తథా క్షుధా || 41

క్లేశాదుత్ర్కాంతి మాప్నోతి యామ్యకింకర పీడితః | తతశ్చ యాతనాదేహం క్లేశేన ప్రతిపద్యలే || 42

ఏతాన్యన్యాని చోగ్రాణి దుఃఖాని మరణ నృణామ్‌ | శృణుధ్వం నరకే యాని ప్రాప్యంతే పురుషైర్మృత్తైః || 43

యామ్య కింకరపాశాదిగ్రహణం దండతాడనమ్‌| యమస్య దర్శనం చోగ్రముగ్ర మార్గ విలోకనమ్‌ || 44

కరంభవాలుకా వహ్నియంత్ర శస్త్రాదిభీషణ | ప్రత్యేకం యాతనా యాశ్చ యాతనాది ద్విజోత్తమాః || 45

క్రకచైః పీడ్యమానానాం మూషాయాం చాపిధ్మాప్యతామ్‌ | కుఠారైః పాట్యమానాచాం భూమౌనాపి నిఖన్యతామ్‌ || 46

శూలేష్వారోప్య మాణానాం వ్యాఘ్రవక్త్రే ప్రవేశ్యతామ్‌ | గృధ్రైః సంభక్ష్యమాణానాం ద్వీపిభిశ్చోపభుజ్యతామ్‌ || 47

క్వథ్యతాం తైలమధ్యే చ క్లిద్యతాం క్షారకర్దమే | ఉచ్చాన్నిపాత్యమానానాం క్షిప్యతాం క్షేపయంత్రకైః || 48

నరకే యాని దుఃఖాని పాపహేతూద్భవాని వై | ప్రాప్యంతే నారకైర్వి ప్రాస్తేషాం సంఖ్యా న విద్యతే || 49

న కేవలం ద్విజశ్రేష్టా నరకే దుఃఖపద్దతిః | స్వర్గేపి పాతభీతస్య క్షయిష్ణో ర్నాస్తి నిర్వృతి || 50

కర్మల లోపమువలన మానవులకు నరకయాతనలు కలుగును. ఈ విధముగ అజ్ఞానులకు ఇహలోకమునను పరలోకమునను దుఃఖములే.

ముసలితనమున దేహమును దేహావయవములును శిథిలములై దంతములు కదలుచు ఊడుచు చర్మము ముడతలుపడి నాడులు నరములు తేలుచు దూరపుచూపు కనబడక కంటిపాపలు ఆకాశములోనికి పెట్టి చూచుచు నాసికారంధ్రముల నుండి వెంట్రుకలు వెలికివచ్చుచుండ శరీరము వణకుచుండ ఎముకలు బయటపడి వెన్ను వంగి ఆకలి నశించి ఎక్కువ తినలేక తిన్నది జీర్ణముకాక పనులు చేయుటకు శక్తిలేక ఎంతో శ్రమతో నడచుట లేచుట కూర్చుండుట పనులు చేయుట కలిగి చెవులు సరిగా వినబడక కన్నులు సరిగా కనబడక నోట చొల్లు కారుచు ఇంద్రియశక్తి తగ్గి చావుకు సిద్ధమై ఎప్పటికప్పుడే విషయములు మరచుచు ఒక్కమాట పలుకుటకు చాల శ్రమపడుచు దగ్గుతో ఆయాసముతో నిద్రపట్టక లేచుటకు పండుకొనుటకు కూడ ఇతరులపై ఆధారపడుచు సేవకులు భార్య పుత్రులు కూడ అలక్ష్యము చేయుచుండగా శౌచము చేసికొనుట కూడ శక్తి లేక ఏమో తినవలెనని తిరుగవలెనని కోరికలు మాత్రమధికమై పరిజనులు కూడ ఎగతాళి చేయుచుండ చుట్టములు విసుగుకొనుచుండ తాను తన ¸°వనములో శక్తి యున్నప్పుడు చేసిన పనులను ఏదో పూర్వజన్మములో చేసిన పనులనువలె జ్ఞాపకము చేసికొనుచు ఇట్టి అనేక భాదలనుభవించును.

మరణకాలమున కాళ్లు చేతులు మెడ శిథిలమగును. అంతలోనే శ్రమ అంతలోనే తెలివి - బలము కలుగుచుండును. తన భార్య సంతానము ధనము ఇల్లు సేవకులు తన తరువాత ఏమగునో అని చింత - ఱంపములతో కోయుచున్నట్లు మర్మస్థానములలో రోగబాధ - అస్థిసంధులలో యమబాణములు గ్రుచ్చుకొన్నట్లు బాధ - మెలికలు తిరిగిపోవుచున్న కనుగ్రుడ్లు - కాళ్లు చేతులు కలిగి తన్నుకొనుట - పెదవులు దౌడలు కంఠము ఎండిపోవుచు గురగురలాడుచు కంఠమునుండి శ్వాస ఆడక బాధ - అకలిదప్పులచే బాధ - పడుచు యమభటులచే బాధనొందుచు ఎంతో క్లేశముతో ప్రాణములు బయటికి పోవుచుండును. తరువాత యాతనా దేహములో ప్రవేశించును.

నరకములో యమకింకరులు పాశములతో కట్టుట- కర్రలతో కొట్టుట - యమదర్శనము-భయంకరమగు మార్గములు చూచుట మండుచున్న ఇసుక - అగ్నియంత్రములు శస్త్రములు మొదలగువానితో భయంకర బాధలు ఱంపములతో కోయుట మూసలలోవేసి క్రాచుట గొడ్డళ్లతో పగులకొట్టుట భూమిలో పాతిపెట్టుట శూలములపై గ్రుచ్చుట పులినోటిలో వేయుట గ్రద్దలచే తినిపించుట నూనెలో ఉడికించుట కారపు అడుసులో నానవేయుట ఎత్తునుండి పడవేయుట. ఒడిసెలలతో కొట్టుట మొదలైన యాతనలు జీవులు తాము చేసిన పాపానుసారము అనుభవింతురు.

ఇంతేకాదు. స్వర్గమునకు వెళ్లినవారికి కూడ ఆ పుణ్యము పూర్తికాగానే క్రిందికి పడిపోవలెనను భయము వెంటాడును. కనుక అచ్చటను సుఖము లేదు.

పునశ్చ గర్భో భవతి జాయతే చ పునర్నరః | గర్భే విలీయతే భూయో జాయమానోస్తమేతి చ || 51

జాతమాత్రశ్చ మ్రియతే బాలభావే చ ¸°వనే | యద్యత్ర్పీతికరం పుంసాం వస్తు విప్రాః ప్రజాయతే || 52

తదేవ దుఃఖవృక్షస్య బీజత్వ ముపగచ్ఛతి | కళత్రపుత్ర మిత్రాది గృహక్షేత్రధనాదికైః || 53

క్రియతే న తథా భూరి సుఖం పుంసాం యథాసుఖమ్‌ | ఇతి సంసారదుఃఖార్కతాపతాపిత చేతసామ్‌ || 54

విముక్తిపాదపచ్ఛాయమృతే కుత్ర మఖం నృణామ్‌ | తదస్య త్రివిధస్యాపి దుఃఖజాతస్య పండితైః || 55

గర్భజన్మ జరాద్యేషు స్థానేషు ప్రభవిష్యతః | నిరస్తాతి శయాహ్లాదం సుఖభావైక లక్షణమ్‌ || 56

భేషజం భగవత్ర్పాప్తిరేకా చా೭೭త్యంతికీ మతా | తస్మాత్తత్ర్పాప్తయే యత్నః కర్తవ్యః పండితైర్నరైః || 57

తత్ర్పాప్తి హేతుర్ఞానం చ కర్మ చోక్తం ద్విజోత్తమాః | ఆగమోత్థం వివేకాచ్చ ద్విధా జ్ఞానం తథోచ్యతే || 58

శబ్దబ్రహ్మా೭೭గమ మయం పరంబ్రహ్మ వివేకజమ్‌ | అంధం తమ ఇవాజ్ఞానం దీపవచ్చేంద్రియోద్భవమ్‌ || 59

యథా సూర్యస్తథా జ్ఞానం యద్వై విప్రా వివేకజమ్‌ | మనురప్యాహ వేదార్థం స్మృత్వా యన్మునిస్తతమాః || 60

తదేత చ్ఛ్రూయతా మత్ర సంబంధే గదతో మమ | ద్వే బ్రహ్మణీ వేదితవ్యే శబ్దబ్రహ్మ పరం చయత్‌ || 61

శబ్దబ్రహ్మణి విష్ణాతః పరం బ్రహ్మధిగచ్ఛతి ద్వే విద్యే వై వేదితవ్యే ఇతి చా೭೭థర్వణీ శ్రుతిః || 62

పరయా హ్యక్షరప్రాప్తి రృగ్వేదాదిమయాపరా | యత్తదవ్యక్త మజర మచింత్య మజ మవ్యయమ్‌ || 63

అనిర్దేశ్యమరూపం చ పాణిపాదాత్య సంయుతమ్‌ | విత్తం సర్వగతం నిత్యం భూతయోని మకారణమ్‌ || 64

వ్యాప్యం వ్యాప్తం యతః సర్వం తద్వై పశ్యంతి సూరయః | తద్ర్బహ్మ పరమం ధామ తద్ధ్యేయం మోక్షకాంక్షిభిః || 65

శ్రుతివాక్యోదితం సూక్ష్మం తద్విష్ణోః పరమం పదమ్‌ | ఉత్పత్తిం ప్రలయం చైవ భూతానామాగతిం గతిమ్‌ || 66

వేత్తి విద్యామవిద్యాం చ స వాచ్యో భగవానితి | జ్ఞానశక్తి బలై శ్వర్యవీర్యతేజాంస్య శేషతః || 67

భగవచ్ఛబ్దవాచ్యాని వినా హేయైర్గుణాదిభిః | సర్వాణి తత్ర భూతాని వసంతి పరమాత్మని || 68

భూతేషు చ స సర్వాత్మా వాసుదేవస్తతః స్మృతః | ఉవాచేదం మహర్షిభ్యః పురా పృష్టః ప్రజాపతిః || 69

నామవ్యాఖ్యా మనంతస్య వాసుదేవస్య తత్త్వతః | భూతేషు వసతే యోతర్వసంత్యత్ర చ తానియత్‌ ||

ధాతా విదాతా జగతాం వాసుదేవస్తతః ప్రభుః || 70

ససర్వభూత ప్రకృతిర్గుణాంశ్చ దోషాంశ్చ సర్వా న గుణో హ్యతీతః ||

అతీత సర్వవరణోఖిలాత్మా తేనా೭೭వృతం యధ్బువనాంతరాళమ్‌ || 71

సమస్త కల్యాణ గుణాత్మకో హి స్వశక్తిలేశాదృత భూతసర్గః |

ఇచ్ఛాగృహీతాభిమతోరుదేహః స్వవీర్యశక్త్యాది గుణౖ కరాశిః | 72

తేజో బలైశ్యర్య మహావరోధః స్వవీర్యశక్త్యాది గుణౖ కరాశిః |

పరః పరాణాం సకలా న యత్ర క్లేశాదయః సంతి పరాపరేశే || 73

స ఈశ్వరో వ్యష్టిసమిష్టిరూపోవ్యక్తస్వరూపః ప్రకటస్వరూపః |

సర్వేశ్వరః సర్వదృక్సర్వవేత్తా సమస్తశక్తిః పరమేశ్వరాఖ్యః || 74

సంజ్ఞాయతే యేన తదస్తదోషం శుద్ధం పరం నిర్మలమేకరూపమ్‌ ||

సందృశ్యతే వాప్యథ గమ్యతే వా తజ్ఞానమజ్ఞానమతోన్యదుక్తమ్‌ || 75

ఇతి శ్రీ మహాపురాణ అదిబ్రాహ్మే వ్యాసర్షిసంవాదే అత్యంతికలయనిరూపణం నామ చతుస్త్రింశదధిక ద్విశతతమోధ్యాయః ||

పిమ్మట మరల గర్భప్రవేశము పుట్టుట కడుపులోగాని పుట్టుచుకాని పుట్టిన తరువాత ఏదో సమయమున బాల్యముననో ¸°వనముననో మరణించుట ఇట్టి జన్మమరణ పరంపర సాగును. ఈ సంసారములో ఏది సుఖమునకు కారణమో ఆదే దుఃఖమునకు కారణము. కనుక దార పుత్త్రథనాదులయందు మక్కువ పెంచుకొనక ఈ తెలిపిన తాపత్రయములలోని దోషములను గుర్తించి ముక్తికొరకై యత్నించుట ఒక్కటియే ఈ బాధను తొలగించుటకు ఔషధము. కనుక వివేకులు అందుకే యత్నింపవలెను. కర్మాచరణము జ్ఞానము ఈరెండును ముక్తికి సాధనములే. ఆగమములో చెప్పిన శబ్దబ్రహ్మోపాసనము వివేకమువలన కలిగెడి బ్రహ్మతత్త్వజ్ఞానము అని జ్ఞానము కూడ రెండు విధములు. శబ్దబ్రహ్మతత్త్వమున కృతార్థుడైనచో పరబ్రహ్మత్వము ప్రాప్తించును. పరా-అపరా అను రెండు విద్యలు ఎఱుగవలసియున్నది అని అథర్వణవేదీయమగు మండకోపనిషత్తు చెప్పుచున్నది. వానిలో ఋగ్వేదాది వేదప్రోక్తమగు కర్మానుష్టానము అపరావిద్యా. అక్షరతత్త్వమగు పరబ్రహ్మమును అందించునది పరావిద్యా. పరబ్రహ్మతత్త్వము అవ్యక్తము అజరము అచింత్యము అవ్యయము అనిర్దేశ్యము అరూపము అపాణిపాదము సర్వగతము సత్యము భూతయోనివ్యాప్యము వ్యాప్తము. ఈతత్త్వమును సూరులు మాత్రమే ఎల్లప్పుడును దర్శింపగలరు. ఆతత్త్వమే విష్ణుభగవానుడు. భూతములయొక్క ఉత్పత్తిని నాశనమును వాటిరాకడను పోకడను విద్యను అవిద్యను ఎఱిగిన మహానుభావుడు భగవానుడనబడును. హేయములగు దుర్గుణములుకాని దోషములుకాని ఏవియులేక జ్ఞానశక్తి బలైశ్వర్యవీర్య తేజస్సులను ఆఱుశక్తులు కలవాడే భగవానుడనుబడును. ఆపరమాత్ముని యందు సమస్త భూతములను - అతడుసమస్త భూతములయందును ఆవసించును. అతడు సర్వాత్మకుడు అందుచేతనే ఈ పరతత్త్వమునకు వాసుదేవడనిపేరు. పూర్వము మహర్షులు చేసిన ప్రశ్నమునకు సమాధానముగా ప్రజాపతియే ఈవాసుదేవ పదమునకు అర్థమును ఇట్లు వ్యాఖ్యానించి తెలిపెను. అందుచేతనే జగములను నిర్మించువాడు. వాటిస్థితి వ్యవస్థ చేయువాడుకూడ ప్రభువగు వాసుదేవుడే. అతడు సర్వభూతములకును ప్రకృతి - మూలతత్త్వమును సమస్తదోములకును గుణములకును అతీతుడు. సర్వావరణములకును అతీతుడు. అఖిలాత్ముడు. ఈభువనాంతరాళమంతయు అయనచేతనే అవరింపబడియున్నది. అతడు సమస్తకళ్యాణ గుణాత్మకుడు స్వశక్తిలేక మాత్రము చేతనే సమస్తభూతసృష్టిని చేయువాడు. తన ఇచ్చచేత తన కిష్టములగు గొప్పరూపమల ధరించి సమస్తలోకములకు హితమును సాధించును. తేజోబలైశ్వర్యవీర్య శక్తిజ్ఞానములకు రాశి. పరమైనవాటికంటె వరుడు. ఈ వరావరునియందు ఎట్టిక్లేశములునులేవు. అతడు ఈశ్వరుడు వ్యష్టిసమష్టి రూపుడు, వ్యక్తరూపుడు, అవ్యక్తరూపుడు, సర్వేశ్వరుడు. సర్వద్రష్ట సర్వశక్తియగు పరమేశ్వరుడు. సమస్తదోషరహితమును శుద్ధమును వరమును నిర్మలమును ఏకరూపమునునగు ఆమహాతత్త్వమును ఏదితెలుపగలదో చూపగలదో లభింపజేయగలదో అదిమాత్రమే జ్ఞానమనబడును. మిగిలినదంతయు అజ్ఞానము. (ఈ అధ్యాయములో అఱువది ఒకటి నుండి డెబ్బదియైదువరకు శ్లోకములలో చెప్పబడిన విషయము తాత్త్వికముగనుక దానినిటవివరింప సాధ్యముకాదు. తత్త్వమునెఱిగిన పెద్దలవలనను వేదాన్తశాస్త్రాధ్యయనముచేతను తెలిసికొని తరింపదగినది.)

ఇది శ్రీ మహాపురాణమున ఆది బ్రాహ్మమున వ్యాసఋషి సంవాదమున ఆత్యన్తికలయ నిరూపణమను రెండువందల ముప్పదినాలుగవ అధ్యాయము.

Brahmapuranamu    Chapters