Brahmapuranamu    Chapters   

అథపంచవింశత్యధికద్విశతతమో7ధ్యాయః

ఉమామహేశ్వర సంవాదే దేవలోకప్రాప్తి కారణకథనమ్‌

ఉమోవాచ

కిం శీలః కిం సమాచారః పురుషః కైశ్చ కర్మభిః ! స్వర్గ సమభిపద్యేత సంప్రదానేన కేన వా ||

ధర్మనిరూపణము

పార్వతి ఇట్లు పలికెను.

ఏశీలము ఏఆచరణము కలిగి ఏకర్మము లాచరించి ఏదానములు చేసి మానవుడు స్వర్గమును పొందును?

మహేశ్వర ఉవాచ

దాతా బ్రాహ్మణసత్కర్తా దీనా ర్తకృపణాదిషు | భక్షోభోజ్యాన్న పానానాం వాససాం చ మహామతిః || 2

ప్రతిశ్రయాన్సభాః కుర్యా త్ప్రపాః పుష్కరిణీ స్తథా | నిత్యకాదీని కర్మణి కరోతి ప్రయతః శుచిః 3

ఆసనం శయనం యానం గృహం రత్నం ధనం తథా | సస్యజాతాని సర్వాణి సక్షేత్రాణ్యథ యోషితః 4

సుప్రశాంతమనా నిత్యం యః ప్రయచ్ఛతి మానవః | ఏవంభూతో నరో దేవి దేవలోకే7భిజాయతే || 5

తత్రోష్య సుచిరం కాలం భుక్త్వా భోగాననుత్తమాన్‌ | సహాప్సరోభిర్ముదితో రమిత్వా నందనాదిషు || 6

తస్మాచ్ఛ్యుతో మహేశాని మానుషేషూపజాయతే | మహాభాగకులే దేవి ధనధాన్యసమాచితే || 7

తత్ర కామగుణౖః సర్వైః సముపేతే ముదా7న్వితః | మహాకార్యో మహాభాగో ధనీ భవతి మానవః || 8

ఏతే దేవి మహాభాగాః ప్రాణినో దానశాలినః | బ్రహ్మణా వైపురాప్రోక్తా సర్వస్య ప్రియదర్శనా ః || 9

అపరే మానవా దేవి ప్రదానకృపణా ద్విజాః | యే7న్నాని న ప్రయచ్ఛంతి విద్యమానే7ప్యబుద్ధయః 10

దీనాంధ కృపణాన్దృష్ట్వా భిక్షుకానాతిథీనపి | యాచ్యమానా నివర్తంతే జిహ్వాలోభ సమన్వితాః || 11

న ధనాని న వాసాంసి న భోగాన్న చ కాంచనమ్‌ | న గాశ్చ నాన్నవికృతిం ప్రయచ్ఛంతి కదాచన || 12

అప్రలుబ్ధాశ్చ యే లుబ్ధా నాస్తికా దానవర్జితాః || ఏవం భూతా నరాదేవి నిరయం యాంత్యబుద్ధయః 13

తేవై మనుష్యతాం యాంతి యదా కాలస్య పర్యయాత్‌ | ధనరిక్తేకులే జన్మ లభంతే స్వల్పబుద్ధయః 14

క్షుత్పిపాసా పరీతాశ్చ సర్వలోక బహిష్కృతాః | నిరాశాః సర్వభాగేభ్యో జీవంత్యధర్మజీవికాః || 15

అల్పభోగకులే జాతా అల్పభోగరతా నరాః | అనేన కర్మణా దేవి భవంత్యధనినో నరాః || 16

అపరే దంభినో నిత్యం మానినః పరతో రతాః | ఆసనార్హస్య యే పీఠం న యచ్ఛంత్యల్ప చేతసః || 17

మార్గార్హస్య చ యే మార్గం న ప్రయచ్ఛంత్యభిబుద్ధయః | ఆర్ఘార్హాన్న చ సంస్కారై రర్చయంతి యథావిధి|| 18

పాద్యమాచయమనీయం వా ప్రయచ్ఛంత్యభిడుద్ధయః | శుభం చాభిమతం ప్రేవ్ణూ గురుం నాభివదంతియే || 19

అభిమాన ప్రవృద్ధేన లోభేన సమమాస్థితాః | సంమాన్యాంశ్చావమన్యంతే వృద్ధాన్పరిభంతి చ || 20

ఏవం విధా నరా దేవి సర్వేనిరయగామినః | తే చేద్యది నరా స్తస్మా న్నిరయాదుత్తరంతి చ || 21

వర్ష పూగైస్తతో జన్మ లభంతే కుత్సితే కులే | శ్వపాకపుల్కసాదీనాం కుత్సితానా మచేతసామ్‌ || 22

కులేషు తే7భిజాయంతే గురువృద్ధోప తాపనః | న దంభీ న చ మానీ యో దేవతాతిధి పూజకః || 23

లోకపూజ్యో నమస్కర్తా ప్రసూతో మధురం వచః | సర్వకర్మ ప్రియకరః సర్వభూతప్రియః సదా|| 24

అద్వేషీ సుముఖః శ్లక్‌ష్ణః స్నిగ్ధవాణీప్రదః సదా | స్వాగతేనైవ సర్వేషాం భూతానామ విహింసక ః || 25

యథార్థం సత్క్రియాపూర్వ మర్చయన్నవతిష్ఠతే| మార్గార్హాయ దదన్మార్గం గురుమభ్యర్చయన్సదా || 26

అతిథిప్రగ్రహరత స్తథా7భ్యాగతపూజకః | ఏపంభూతో నరో దేవి స్వర్గ తిం ప్రతిపద్యతే || 27

తతో మానుష్యమాసాద్య విశిష్టకులజో భ##వేత్‌ | తత్రా7సౌ విపులై ర్భోగూః సర్వరత్నసమాయుతః || 28

యథార్హదాతా చార్హేషు ధర్మచర్యాపరో భ##వేత్‌ | సంమతః సర్వభూతానాం సర్వలోక నమస్కృతః || 29

స్వకర్మఫలమాప్నోతి స్వయమేవ నరః సదా| ఏషధర్మో మయా ప్రోక్తో విధాత్రా స్వయమీరితః || 30

యస్తు రౌద్ర సమాచారః సర్వ సత్త్వభయంకరః| హస్తాభ్యాం యది వా పద్భ్యాం రజ్జ్వా దండేన వా పునః || 31

లోష్టైః స్తంభై రుపాయైర్వా జంతూన్బాధేత శోభ##నే | హింసార్థం నిష్కృతిప్రజ్ఞః ప్రోద్వేజయతి చైవ హి || 32

ఉపక్రామతి జంతూంశ్చ ఉద్వేగజననః సదా| ఏవం శీలసమాచారో నిరయం ప్రతిపద్యతే || 33

స చేన్మనుష్యతాం గచ్ఛే ద్యది కాలస్య పర్యయాత్‌ | బహ్వాబాధాపరిక్లిష్టే కులే జయతి సో7ధమే|| 34

లోకద్విష్టొ7ధమః పుంసాం న్వయం కర్మకృతైః ఫలైః | ఏష దేవి మనుష్యేషు బోద్ధవ్యో జ్ఞాతిబంధుషు || 35

అపరః సర్వభూతాని దయావా సమపశ్యతి | మైత్రీ దృష్టిః పితృసమో నిర్వైరో నియతేంద్రియః || 36

నోద్వేజయతి భూతాని న చ హంతి దయాపరః | హస్తపాదైశ్చ నియతై ర్విశ్వాస్యః సర్వజంతుషు || 37

న రజ్జ్వా న చ దండేన న లోష్టెర్నా77యుధేన చ| ఉద్వేజయతి భూతాని శుభాకర్మా దయాపరః || 38

ఏవం శీలసమాచారః స్వర్గే సముపజాయతే | తత్రాసౌ భవనే దివ్యే ముదా వసతి దేవవత్‌ || 39

స చే త్స్వర్గక్షయాన్మర్త్యో మనుష్యే షూపజాయతే | అల్పాయాసో నిరాతంకః స జాతః సుఖమేధతే || 40

సుఖభాగీ నిరాయాసో నిరుద్వేగః సదా నరః | ఏష దేవి సతాం మార్గో బాధా యత్ర న విద్యతే || 41

మహేశ్వరుడు ఇట్లు పలికెను:

బ్రాహ్మణులను ఆదరించుచు దీనులు ఆర్తులు బీదలు అగువారికి భక్ష్యములు భోజ్యములు అన్నపానములు వస్త్రములు ఉదారబుద్ధితో దానము చేయవలెను. బాటసారులకు ఆశ్రయములను సభామండపములను కోనేరులను నిర్మించుచు నిత్యనైమిత్తిక కామ్యకర్మలను ప్రయతుడై శుచియై చేయుచు ఆసనములు శయనములు వాహనములు గృహములు రత్నము ధనము పొలములు పైరులు స్త్రీలు మొదలగునవి ప్రశాంతమనస్సుతో నిరతము దానముచేయు నతడు దేవలోకమునకు ఏగును. అచ్చట చాలకాలముండి శ్రేష్ఠములగు భోగముల అనుభవించి అప్సరసలతో కూడి నందనోద్యానము మొదలగుచోట సంతోషముతో గడిపి అక్కడినుండి క్రిందికి జారియు భూలోకమునందుధనధాన్యములతో నిండిన మహాభాగుల ఇంట జన్మించును. అచ్చట అన్ని కోరికల ననుభవించుచు సంతోషించుచు మహాభోగములను అనుభవించును. మహాకార్యములు చేయును. ధనవంతుడగును. అందరకు చూడముచ్చటయగు బ్రాహ్మణుడగును.

ఉండియు దానము చేయక అన్నముపెట్టక దీనులను అంధులను పేదలను భిక్షుకులను అతిథులను చూచియు వారు యాచించుచున్నను నాలుకకదలించి మాటనైన ఆడక ధనము సువర్ణము వస్త్రములు భోగములు గోవులు వివిధములగు అన్నములు దానము చేయక లోభులై నాస్తికులై అవివేకులై ఉండువారు నరకము పొందుదురు. ఇట్టివారు నరకయాతనలైన తరువాత మానవులుగా జన్మించినను ఆకలిదప్పులు భాధలుపడుచు జనులచే వెలివేయబడి ఏభోగములను అనుభవించు ఆశయులేక జీవనాధారములేక తక్కువభోగములతో బీదలై ఉందురు. కవటులై గర్వముకలిగి అల్పబుద్ధులై పీఠముతో గౌరవించదగిన వారిని అట్లుగౌరవించక త్రోవ ఈయవలసినవారికి త్రోవ ఈయవలసిన వారికి త్రోవ ఈయక పూజించదగినవారిని పాద్యము ఆచమనీయము మొదలగు వానితో పూజించక గురువులతో ప్రేమగా శుభము అభిమతము అగు మాటలాడక దురభిమానము లోభముకలవారై సంమానించదగిన పెద్దలను సంమానించకపోగా అవమానించువారు అందరును నరకమును పొందుదురు. ఎన్నోవేలఏండ్లు నరకమనుభవించి మరల మానవులై పుట్టినను శునకమాంసము వండితినువారి వంటి బుద్ధిహీనుల నింద్యుల ఇండ్లలో నింద్యులుగా పుట్టుదురు.

దంభము దురభిమానము లేక దేవతలను లతిథులను గౌరవించుచు జనులచే పూజింపబడుచు పెద్దలను నమస్కరించుచు తీయనిమాటలాడుచు సర్వకర్మలచే ఇతరులకు ప్రీతికలిగించుచు ఏప్రాణిని ద్వేషించక మంచి ముఖ లక్షణములు స్నేహభావముకలిగి ఎదుటివారికి స్వాగతము పలుకుచు యథార్థముగా సత్కారపూర్వకముగా త్రోవఈయ దగినవారికి త్రోవఇచ్చుచు గురువుల గౌరవించుచు అతిథులను అభ్యాగతులను పూజించు నరుడు స్వర్గము పొందును. తరువాత కూడ మానవలోకమున గొప్ప ఇంటపుట్టి సర్వరత్నములు-శ్రేష్ఠవస్తువులు'' లభించి సర్వభోగములను పొంది తగిన విధమున దానము చేయుచు ధర్మముల నాచరించుచు సర్వప్రాణుల సంమాసమును నమస్కారములను అందుకొను వాడగును. మొత్తముమీద మనుష్యుడు ఎప్పుడును తానుచేసిన కర్మమునకు అనుగుణమగు ఫలమును పొందును. అని నిర్ణయము. విధాత బ్రహ్మ స్వయముగానేచెప్పిన ఈ ధర్మమును నీకు చెప్పితిని. సర్వప్రాణులకు భయమును కలిగించు ప్రవర్తనము కలిగి హస్తములతోనో పాదములతోనో త్రాటితోనో కఱ్ఱతోనో గడ్డలతోనో స్తంభములవంటి ఇతరోపాయములతోనో ప్రతీకార బుద్ధితో ప్రాణులను బాధించుచు భయపెట్టుచు ఉండువాడు నరకమును పొందును ఎంతో కాలము తరువాత అతడు మనుష్యుడై పుట్టినను జనులకు ద్వేష్యుడై అధముడై జ్ఞాతులకు బంధువులకు ఇష్టుడు కాక యుండును.

సర్వభూతములను దయతో మైత్రితో చూచుచు వానికి తండ్రి వలె మెలగుచు వైరము చూపక ఇంద్రియముల జయించి హస్తపాదాదులతో ప్రాణుల హింసించక భయపెట్టక అన్ని ప్రాణులకు విశ్వసనీయుడై శుభకర్మలను ఆచరించు చుండువారు స్వర్గమును పొంది అచ్చట దేవతల వలెనే దివ్యమగు భవనమున సంతోషము నొందును. స్వర్గసుఖానుభవము ముగిసిన తరువాతను కూడ మానవుడుగా పుట్టి శ్రమలు భయములు లేక సుఖమును అనుభవించును.

ఉమోవాచ :

ఇమే మనుష్యా దృశ్యంతే ఊహాపోహ విశారదాః | జ్ఞాన విజ్ఞాన సంపన్నాః ప్రజ్ఞావంతో 7ర్థకోవిదాః || 42

దుష్ప్రజ్ఞా శ్చాపరే దేవ జ్ఞానవిజ్ఞాన వర్జితాః | కేన కర్మవిపాకేన ప్రజ్ఞావా న్పురుషో భ##వేత్‌ || 43

అల్పప్రజ్ఞో విరూపాక్ష కథం భవతి మానవః | ఏవం త్వం సంశయం ఛింధి సర్వధర్మభృతాం వర || 44

జాత్యంధా శ్చాపరే దేవ రోగార్తా శ్చాపరే తథా | నరాః క్లీబాశ్చ దృశ్యంతే కారణం బ్రూహి తత్రవై || 45

మానవులలో కొందఱు ఊహలు అపోహలు-విషయముల వింగడించుకొనుట-చేయుటలో నేర్పుకలిగి ఆధ్యాత్మిక విషయజ్ఞానము లౌకిక విషయములలో విజ్ఞానము కలిగి ప్రజ్ఞావంతులై అర్ధవిషయములలో నేర్పుకలిగి యున్నారు. మఱి కొందఱు ప్రజ్ఞారహితులై జ్ఞాన విజ్ఞానములు లేకయున్నారు. కొందఱు పుట్టు గ్రుడ్డివారు రోగార్తులు నపుంసకులు-అశక్తులు-అగుచున్నారు. ఏకర్మఫలముగా వీరు ఇట్లు వైవిధ్యము పొందుచున్నారో - సర్వధర్మముల నెఱింగిన వారిలో శ్రేష్ఠుడవగు ఓ విరూపాక్షా! నాకు తెలిపి నాసంశయము తీర్చుము.

మహేశ్వర ఉవాచ :

బ్రాహ్మణా న్వేదవిదుషః సిద్ధా న్ధర్మ విద స్తథా | పరిపృచ్ఛం త్యహరహః కుశలాకుశలం సదా || 46

వర్జయంతో7శుభం కర్మ సేవమానాః శుభం తథా | లభంతే స్వర్గతిం నిత్య మిహలోకే యథాసుఖమ్‌ || 47

స చేన్మనుష్యతాం యాతి మేధావీ తత్ర జాయతే | శ్రుతం యజ్ఞానుగం యస్య కల్యాణ ముపజాయతే || 48

పరదారేషు యే చాపి చక్షుర్ద్రష్టుం ప్రయుంజతే | తేనదుష్టస్వభావేన జాత్యంధా స్తే భవంతి హి || 49

మనసా7పి ప్రదుష్టేన నగ్నాం పశ్యంతి యే స్త్రియమ్‌ | రోగార్తా స్తే భవం తీహ నరా దుష్కృత కారిణః || 50

యే తు మూఢా దురాచారా వియోనౌ మైథునే రతాః | పురుషేషు సుదుష్ప్రజ్ఞాః క్లీ బత్వముపయాంతి తే || 51

పశూంశ్చ యే వై బధ్నంతి యే చైవ గురుతల్పగాః | ప్రకీర్ణమైథునా యే చ క్లీబా జాయంతి వై నరాః || 52

వేదార్థముల నెఱిగిన బ్రాహ్మణులను సిద్ధులను ధర్మముల నెఱిగిన వారిని అనుదినము మంచి చెడులను అడుగుచు అశుభకర్మముల విడిచి శుభకర్మలను ఆచరించువాడు ఇహలోకమున సుఖముల అనుభవించి పరమున స్వర్గమును పొందును. అతడు మరల మానవుడై పుట్టినను మేధావంతుడు యజ్ఞాది కర్మలయందాసక్తితో కూడిన శుభమగు శాస్త్ర సంస్కారము కలవాడగును. దుష్టస్వభావముతో పరదారలను చెడుచూపుచూచువాడు పుట్టిగ్రుడ్డి యగును. విపస్త్రయగు స్త్రీని అధిక దుష్టమగు మనస్సుతో చూచువాడు ఈ దుష్కృతమునకు ఫలముగా రోగములచే బాధనొందును. మూఢులై దురాచరణము కలిగి యోనికానిచేట్ల మైథునము చేయువారు ప్రజ్ఞారహితులు నపుంసకులు అగుదురు. మైథునమునకై పశువులనుబంధించు వారు గురుపత్నితో సంగమించువారు వివిధములుగ మైథునము చేయువారును నపుంసకులగుదురు.

ఉమోవాచ;

అవద్యం కిం తు వై కర్మ నిరవద్యం తథైవ చ | శ్రేయః కుర్వ న్నవాప్నోతి మానవో దేవసత్తమ || 53

ఓ దేవశ్రేష్ఠా! దోషముతో కూడిన ఏకర్మను విడిచి దోషరహితమగు ఏకర్మను ఆచరించి మానవుడు శ్రేయమును పొందును?

మహేశ్వర ఉవాచ;

శ్రేయాంసం మార్గ మన్విచ్ఛ న్సదాయః పృచ్ఛతి ద్విజాన్‌| ధర్మాన్వేషీ గుణాకాంక్షీ స స్వర్గం సముపాశ్నుతే || 54

యది మానుష్యతాం దేవి కదాచి త్సంనియచ్ఛతి | మేధావీ ధిరణా యుక్తః ప్రాజ్ఞ స్తత్రాపి జాయతే || 55

ఏష దేవి సతాం ధర్మో గంతవ్యో భూతికారకః | నృణాం హితార్థాయ సదా మయా చైవ ముదాహృతః || 56

శ్రేయస్సు కలిగించు మార్గమును ధర్మములను సద్గుణములను కోరుచు అవి ఎరిగిన బ్రాహ్మణులను అడిగి తెలిసి ఆచరించువాడు స్వర్గము నొందును. తరువాత మనుష్యుడై పుట్టినను ఇంద్రియనిగ్రహము మేధ ధారణాశక్తి కల ప్రాజ్ఞుడుగా జన్మించును. మానవుడు క్షేమము కలిగించు సన్మార్గము ఇది. మానవుల శ్రేయముకోరి నీకు తెలిసితిని.

ఉమోవాచ;

అపరే స్వల్పవిజ్ఞానా ధర్మవిద్వేషిణో నరాః | బ్రాహ్మణా న్వేదవిదుషో నేచ్ఛంతి పరిసర్పితుమ్‌ || 57

వ్రతవంతో నరాః కేచి చ్ఛ్రద్ధాదమపరాయణాః | అవ్రతా భ్రష్టనియమా స్తథా7న్యే రాక్షసోపమాః || 58

యజ్వానశ్చ తథైవాన్యే నిర్మోహాశ్చ తథా పరే | కేన కర్మవిపాకేర భవం తీహ వదస్వమే || 59

ఓ పరమేశ్వరా! కొందఱు అల్పవిజ్ఞానము ధర్మ ద్వేషము కలవారై వేదధర్మముల నెఱిగిన బ్రాహ్మణులను ధర్మము నడిగి తెలిసికొన గోరక ఉన్నారు. మంచినియమములను కర్మలను ఆచరించక నియమభ్రష్టులై రాక్షసులవలె ఉందురు. మఱి కొందఱు మంచి వ్రతముల నాచరించుచు శ్రధ్ధ ఇంద్రియ నిగ్రహము కలిగి యజ్ఞాదుల నాచరించుచు మూఢత్వము లేక యుందురు. ఏ కర్మములకు ఫలముగా ఇట్లగుదురో తెలుపుము.

మహేశ్వర ఉవాచ

ఆగమాలోకధర్మాణాం మర్యాదాః పూర్వనిర్మితాః | ప్రమాణ నానువర్తంతే దృశ్యంతేహ దృఢవ్రతాః || 60

అధర్మం ధర్మ మి త్యాహు ర్యే చ మోహవశం గతాః | అవ్రతా నష్టమర్యాదా స్తే నరా బ్రహ్మరాక్షసాః || 61

యే వై కాలకృతోద్యోగా త్సంభవం తీహ మానవాః | నిర్హోమా నిర్వషట్కారా స్తే భవంతి నరాధమాః || 62

ఏష దేవి మయా సర్వ సంశయచ్ఛేదనాయ తే | కుశలా కుశలో నౄణాం వ్యాఖ్యాతో ధర్మసాగరః || 63

ఇతి శ్రీమహాపురాణ ఆదిబ్రాహ్మే ఉమామహేశ్వర సంవాదే ధర్మనిరూపణంనామ పంచవింశత్యధిక ద్విశతతమో7ధ్యాయః.

పూర్వులు నిర్మించిన ధర్మశాస్త్రముల లోకధర్మముల వ్యవస్థలను శాస్త్రప్రమాణానుసారము ఆచరించువారుదృఢ వ్రతులై ఆయాశాస్త్రీయ కర్మలను గట్టిగా ఆచరించువారుగా నున్నారు. అజ్ఞాన వశమున అధర్మమును కూడ ధర్మము అని చెప్పుచు సద్ర్వతముల నాచరించక శాస్త్ర మర్యాదలను విడిచినవారు బ్రహ్మరాక్షసులగుదురు. కాలము ననుసరించి పనుల నాచరించుచు హోమము వషట్కారమువంటి వైదికకర్మానుష్ఠానమునకు దూరముగా నుండువారు నరాధము లగుదురు. ఓదేవీ! నీసర్వసంశయములను ఛేదించుటకుగాను మానవుల శ్రేయమునకు అశ్రేయమునకును హేతువగు ధర్మసముద్రమును ఈ విధముగా వివరించితిని.

ఇది శ్రీమహాపురాణమగు ఆదిబ్రాహ్మమున ఉమామహేశ్వర సంవాదమున ధర్మనిరూపణముఅను రెండువందలఇరువదియైదవ అధ్యాయము.

Brahmapuranamu    Chapters