Brahmapuranamu    Chapters   

అథ వింశత్య ధికద్వి శతతమో7ధ్యాయః

శ్రాద్ధవిధివర్ణనమ్‌

మునయ ఊచుః

భూయః ప్రభూహి భగవన్‌ శ్రాద్దకల్పం సువిస్తరాత్‌| కథం క్వ చ కదా కేషు కై స్తద్రూఫి తపోధన || 1

వ్యాస ఉవాచ

శృణధ్వం మునిశార్దూలాః శ్రాద్ధకల్పం సునిస్తరాత్‌ | యాథాయత్ర యదా యేషు యైర్దవ్యై స్తద్వదామ్యహమ్‌ || 2

బ్రాహ్మణౖః | క్షత్రియై ర్వైశ్యః శ్రాద్దం స్వవరణోదితమ్‌ | కులధర్మమను తిష్ఠద్భి ర్దాతవ్యం మంత్రపూర్వకమ్‌ || 3

స్త్రీభి ర్వర్ణావరై ః శైద్రై ర్విప్రాణామనుశాసనాత్‌ | అమంత్రకం విధిపూర్వం వహ్నియాగ వివర్జితమ్‌ || 4

పుష్కరాధిషు తీర్థేషు పుణ్యష్వాయతనేషు చ | శిఖరేషుగిరీంద్రాణాం పుణ్యదేశేషు భోదిజాః || 5

సరిత్సు పుణ్యతోయాసు నదేషు చ వరస్సు చ | సంగమేష సదీనాం చ సముద్రేషు సప్తసు || 6

స్వనులి స్తేషు గేహేషు న్వేష్వనుజ్ఞాపితేషు చ | దివ్యసాదప మూలేషు యజ్ఞియేషు హ్రదేషు చ || 7

శ్రాద్దమేతేషు దాతవ్యం వర్జ్యమేతేషు చోచ్యతే | కిరాతేషుకలింగేషు కొంకణషు కృమిష్వపి || 8

దశార్దేషు కుమార్యేషు తంగణషు క్రథేష్యపి | సింధోరు త్తరకూలేషు నర్మదాయాశ్చ దక్షిణ || 9

పూర్వేషు కరతోయాయా న దేయం శ్రాద్ద ముచ్చతే | శ్రాద్ధం దేయముశంతీయ మాసి మాస్యుడుపక్షయే || 10

పౌర్ణమాసేషు శ్రాద్ధంచ కర్తవ్య మృక్షగోచరే | నిత్య శ్రాద్దమదైవం చ మనుషై#్య ః సహగీయతే || 11

నైమిత్తికం సురై సార్థం నిత్యం నైమిత్తికం తథా | కామ్యాన్యన్యాని శ్రాద్ధాని ప్రతిసంవత్సరం ద్విఐః || 12

వృద్ధిశ్రాద్ధం చ కర్తవ్యం జాతకర్మాది కేషుచ | తత్ర యుగ్మాస్ద్విజానాహు ర్మంత్రపూర్వం తు వై ద్విజాః || 13

శ్రాద్ద విధివర్ణనము

మునులు శ్రాద్ధకల్పము నెరవేరికెప్పుడానతిచ్చిరో సవిస్తరముగ తెల్పుడన వ్యాసభగవానుడిట్లనియె. బ్రాహ్మణ క్షత్రియవైశ్యకులములవారు తమతమకు చెప్పబడిన విధానామున మంత్రపూర్వకముగా శ్రాద్దము సమష్టింప వలెను. స్త్రీలు మరిశూద్రాదులు బ్రాహ్మణులు చెప్పినట్లు అగ్నిహోత్రము లేకుండా అమంత్రకము శ్రాద్దము పెట్ట వలెను. పితృదేవతల నుద్దేశించి శ్రాద్దము పెట్టవలసిను ప్రదేశములు పుష్కరాది తీర్థములు పుణ్యక్షేత్రములు పర్యత శిఖరములు పవిత్రనదులు నదములు సరస్సులు నదీసంగమములు సముద్ర తీరములు ఇవి ముఖ్యములు. గోమయ ముతోనలికిన స్వగృహమునందు దివ్యవృక్షమూలములందు యజ్ఞార్హములైన మడుగులయందు శ్రాద్దము పెట్టుట ప్రశస్తము. కిరాతదేశములందు కళింగము కొంకణము కృమి దశార్ణివము కుమార్య దేశములందు తంగణమునుదేశమునందు క్రథమనుదేశమనుందు సముద్రము యొక్క ఉత్తరతీరమునందు (సింధునది ఉత్తరతీరమునందు) నర్మదానీదీ దక్షిణతీరములందు కరతోయ అనునదికి తూర్పు ప్రదేశమునందును శ్రాద్దము పెట్టరాదు. ఇదే విధముగా నిత్యశ్రాద్ధవిధానము కూడా చెప్పబడినది. ప్రతి సంవత్సరము నైమిత్తికము కామ్యము అనుశ్రాద్దములు నిత్య శ్రాద్దముతో పాటు నిర్వర్తింపవలెను. జాతకర్మాదులయందు వృద్ధి శ్రాద్దము పెట్టవలెను. మంత్రపూర్వకముగా శ్రాద్దము పెట్టవలసినవారు ద్విజులు మాత్రమే( బ్రాహ్మణ క్షత్రియ వైశ్యలు మాత్రమే)

కన్యాం గతే సవితరి దినాని దశపంచ చ | పూర్వేణౖ వే హ విధినా శ్రాద్ధం తత్రవిధియతే || 14

ప్రతిపద్దనలాభాయి ద్వితీయా ద్విపదప్రదా | పుత్రార్థినీ తృతీయాతు చతుర్ధీ శ్రతునాశినీ || 15

శ్రియం ప్రాప్నోతి పంచమ్యాం షష్ఠ్యాం పూజ్యో భ##వేన్నర ః |

గణాధిపత్యం సప్తమ్యా మష్టమ్యాం బుద్దిముత్తమామ్‌ || 16

స్త్రీయో నవమ్యాం ప్రాప్నోతి దశమ్యాం పూర్ణకామతామ్‌ |

వేదాం స్తథా77ప్నుయాత్సర్వా నేకాదశ్యాం క్రియాపరః || 17

ద్వాదస్వాం జయలాభం చ ప్రాప్నోతి పితృపూజకః |

ప్రజావృద్ధిం పశుం మేధాం స్వాతంత్ర్యం పుష్టిముత్తమామ్‌ || 18

ధీర్గయురథ వైశ్వర్యం కుర్వాణస్తు త్రయోదశీమ్‌| అవాప్నోతి స సందేహంః శ్రాద్దం శ్రద్దాసమవ్విత || 19

యథా సంభవినా7న్నేన శ్రాద్దం శ్రద్దాసమన్వితః | యువానః పితరో యస్య మృతాః శ##స్త్రేణ వామతాః || 20

తేవకార్యం చతుర్ధశ్యాం తేషాం తృప్తిమభీప్సతా | శ్రాద్దం కుర్వన్నమావస్యాం యత్నేన పురుషం శుచిః || 21

సర్వాన్కామా పవాప్నోతి స్వర్గం చానంత మశ్నతే | అతఃపరం మునిశ్రేష్టాః శృణుధ్వం వదతో మమ|| 22

సూర్యుడు కన్యారాశిలో నున్నపుడు పదునైనదురోజులు శ్రాద్ధము పెట్టుటకు ఉత్తమములని చెప్పబడినది.

శ్రాద్ధము పాఢ్యమినాడు పెట్టినధనాలభము. విదియ పశుసంపదనిచ్చును. తదితయ పుత్రప్రదము. చదుర్ది శత్రునాశనకము. పంచమి ఐశ్వర్యప్రదము, షష్టిలోక పూజ్యునిం జేయును. సప్తమి గణాధిపత్యమును కూర్చును. అష్టమి జ్ఞానప్రదము, నవమి స్త్రీలాభము కలిగించును. దశమి సర్వాభిష్టములను జేకూర్చును. ఏకాదశి సర్వేవేద సంపన్నుని చేయును. ద్వాదశి జయకరము. త్రయోదశి సంతానాభివృద్ధి పశుసంపద మేధ స్వాతంత్ర్యము నుంచి పుష్టని దీర్ఘయార్థయమునైశ్వరముమను జేకూర్చును. ఇందు సందేహములేదు. చతుర్ధశినాడులభించినంత అన్నముతో శ్రద్దతో శ్రాద్దము పెట్టనియెల ఆయుధాముల దెబ్బతిని చనిపోయినవారు యువకులుగ చనిపోయినవారు సంతృప్తి నొందుదురు. అమావాస్యనాడు శ్రార్ధమపెట్టిన యితడు సర్వకామములను బడసి స్వర్గము బడయును.

పితౄణాం ప్రీతయే యత్ర యద్దేయం ప్రీతికారిణా | మాసం తృప్తిః పతౄణాంతు హవిష్యాన్నేన జాతయే || 23

మాసద్వయం మత్స్యమాంసై స్తృప్తిం యాంతి పితామహాః|త్రీన్మాసాన్హారిణం మాంసం విజ్ఞేయం పితృతృప్తయే ||

పుష్ణాతి చతురో మాసం శశస్య పిశతౄం పితౄన్‌ | శాకునం పంచవై మాసా న్షణ్మాసాన్‌శూకరామిషమ్‌ || 25

ఛాగలం సప్తవై మాసా నైణయం చాష్టమాసకాన్‌ | కరోతి తృప్తిం నవవై రురుమాంసం న సంశయః 26

గవ్యం మాంసం పితృతృప్తిం కరోతి దశమాసికీమ్‌ | తథై కాదశమాసాంస్తు ఔరభ్రం పితృతృప్తిదమ్‌ || 27

సంవత్సరం తథా గవ్యం పయః పాయసమేవ చ | వాధ్రీనమా (ర్థీణసా)మిషం లోహం కాలశాకం తథా మధు ||

రోహితామిష్మన్నం చ దత్తాన్యాత్మకులోద్భవైశః | అనంతంవై ప్రయచ్ఛంతి తృప్తియోగం సుతాం స్థథా || 29

పితృదేవతలు సంప్రీతులగుటకు శ్రాద్దములందు వినియోగింపవలసిని ద్రవ్యములను గురించి చెప్పెద వినుండి. హవిష్యాన్నముతో పితృశ్రాద్ధము పెట్టినయెడల పితృదేవలకు నెలరోజులు తృప్తి కలుగును. మత్య్సమాంసముచేత పితృదేవలతు రెండు మాసములు తృప్తులగుదురు. లేడిమాంసము మూడునెలలు పితృదేవతలకు తృప్తికలిగించును. శశమాసంము (కుందేలు) నాలుగుమాసములు తృప్తిని కలిగించును. పక్షి మాంసము ఏడునెలలు తృప్తినిచ్చును. శూకమాంసము(పందిమాంసము) ఆరుమసాములు తృప్తినిచ్చను. మేక మాంసము ఏడు నెలలతు తృప్తినిచ్చును. ఐణయము (లేడిది) ఎనిమిదిమాసములును, రురు (దుప్చి) మాంసము తొమ్మిదినెలలు తృప్లినికూరు%్‌చను. గోమాంసము పితృదేవలకు దశమాసతృప్తి నొసంగును. ఔరభ్రము (పొట్టేలుమాసంము) పదకొండుమాసములు తృప్తినిచ్చను. ఆవుపాలు గాని పాయనము గాని సంవత్సర తృప్తికలిగించును. గండక పక్షిమాసంము నేత్తురన్నము కరివేపకూర తేనే ఎఱ్ఱమేక మాంసము అన్నము తన వంశీయులచే పెట్టబడినవి అనంతతృప్తినిపుత్రులను కలుగజేయును.

పితౄణాం నాత్రసందేహో గయాశ్రాద్ధం చ భోద్విజాః | యోదదాతి గుడోన్మిశ్రాం స్తిలాన్వా శ్రాద్ధకర్మణి || 30

మధువా మధుమిశ్రంవా అక్షయం సర్వమేవతత్‌ | అపి వః స కులే భూయా ద్యోనో దద్వాజ్జలాంజలిమ్‌ || 31

పాయసం మధుసంయుక్తం వర్షాసు చ మఘాసు చ | ఏష్టవ్యా బహవః పుత్ర యద్యేకోపి గయాంవ్రజేత్‌ || 32

గౌరీం వా ప్యుద్వహేత్కన్యాం నీలం వా వృషముత్సృజేత్‌ | కృత్తికాసు పితౄనర్చ్య స్వర్గమాప్నోతి మానవః ||

అపత్యకామో రోహిణ్యాం సౌమ్యే తేజస్వితాం లభేత్‌ | శౌర్య మార్ద్రాసు చా೭೭ప్నోతి క్షత్రాణి చ పునర్వసౌ ||

పుష్యతు ధనమక్షయ్య మాశ్లేషే చా೭೭యురుత్తమమ్‌ | మఘాసు చ ప్రజాం పుష్టిం సౌభాగ్యం ఫాల్గుణీషు చ||

ప్రధానశీలో భపతి స్యాపత్యశ్చోత్తరాసు చ | ప్రయాతి శ్రేష్ఠతాం శాస్త్రే హస్తే శ్రాద్ధప్రదో నరః 36

రూపం తేజశ్చిత్రాసు తథా೭೭పత్యమావావవ్నుయాత్‌ | వాణిజ్య లాభదా స్వాతీ విశాఖా పుత్రకామదా 37

కుర్వంతాం చానురాధాసు తా దద్యుశ్చక్రవర్తితామ్‌ | అధిపత్యం చ జ్యేష్ఠాను మూలే చారోగ్యము త్తమమ్‌|| 38

ఆషాఢాను యశఃప్రాప్తి రుత్తరాసు విశోకతా | శ్రవణన శుభాంల్లోకా ధనంమహత్‌ || 39

పేదవిత్త్వమభిజితి భిషక్సిద్ధిం చ వారుణ | అజావికం ప్రౌష్ఠపద్యాం విందే ద్గావస్త (శ్చత) ధోత్తరే || 40

రేవతీషు తథాకుప్య మశ్వినీషు తురంగమాన్‌ | శ్రాద్ధం కుర్వం స్తథాప్నోతి భరణీష్వాయురు త్తమమ్‌ || 41

ఏవం ఫలమవా೭೭ప్నోతి ఋక్షేష్వేతుషు తత్త్వవిత్‌ | తస్మాత్కామ్నాని శ్రాద్ధాని దేయాని విధివద్దిజాః|| 42

గయాశ్రాద్ధము అనంఫలదము, బెల్లముతో కలిపి నువ్వులను శ్రాద్ధమందుయోగించిన విశేషఫలమొసగును. తేనెకాని తేనెతో కూడిన పదార్ధముగాని పితృదేవతలకు నొసంగిని అక్షయఫల మొసంగును. మాకులమందు పుట్టినవాడు మాకు జలాంజలు లౌనగి (పితృతర్పణములుచేసి) వర్షఋతువునందు మాఘఫాల్గుణములందు తేనెతోకూడిన పాయసమును మాకు నివేదించునాయని పితృదేవలతువ్విళ్ళూరుచుందురు. బహువుపుత్రసంతానము మాకు కావలయునని కోరుట అందరిలో నేయొక్కడేని గయకు వెళ్ళునేమోయని? గౌరీ (కన్యావివాహముచేయునా? దశ వర్ష) నీలవృషభోత్సర్జనము చేయునా? అని పితృదేవతలుబలాడుపడుదరు. కృత్తికానక్షత్రమందు శ్రాద్ధముపెట్టిన స్వర్గమునందును. రోహిణీణక్షత్రమందుపితృశ్రాద్ధము సంతానప్రదము, సౌమ్యదేవతా (మృగశిర) నక్షత్రమందు పెట్టిన శ్రాద్ధము మంచి తేజశ్శాలింజేయును. ఆర్ధ్రానక్షత్ర శ్రాద్ధము శౌర్యవంతుని చేయును. పునర్వసునక్షత్రము క్షేత్రసందర్శనభాగ్యము నొసంగును. పుష్యమి అక్షయదన మొసగును. ఆశ్లేషపూర్ణాయుర్దాయ మిచ్చును. మఘనంతానమును పుష్టిని గూర్చును. పూర్వఫల్గుణీ నక్షత్రములు సౌభాగ్యప్రదములు, ఉత్తరఫల్గునియందు పెట్టినశ్రాద్ధముత సంతానమొసగును. హస్తానక్షత్రమందు శ్రాద్ధము పెట్టి నతడు శాస్త్రసారంతుడగును. చిత్రానక్షత్రము తేజస్సేను సతానమును నొసంగును. స్వాతి వ్యాపారమందులాభము గూర్చును. విశాఖ పుత్ర ప్రదము. అనూరాధనక్షత్రమందు పితృశ్రాద్ధమొనరించిన చక్రవర్తిత్వము నొసంగును. జ్యోష్ఠ ఆధిపత్యమొసంగును. మూలానక్షత్ర మారోగ్యప్రతము, పూర్వాషాడయశస్కరము., ఉత్తరాషాఢ శోక ముహరించును. శ్రవణము శుభలోకప్రదము ధనిష్ఠ ధనసమృద్ధిదము. అభిజిత్తు వేదవేత్తను గావిచును. వారుణము (శతభిషము) వైద్దయసిద్ధినిచ్చను. పూర్వాభాద్ర అజావికమును ఉత్తరాభాద్ర గోసంపదనొసంగును. రేవతి రజత సమృద్ధిదము. అశ్విని అశ్వసంపత్తిగూర్చును, భరణీనక్షత్రశ్రాద్ధము దీర్ఘాయుర్భాగ్యమిచ్చును. కావున కామ్యములయిన శ్రాద్ధముల చేగూడ పితృదేవతాసంప్రీతి గావింపవలయును.

కన్యారవి (మహాలయ) ప్రశంస

కన్యారాశిగతే నూర్యే ఫలమత్యంత మిచ్ఛతా | యన్యాన్కామానభిద్యయ న్కన్యారాశి గతే రవౌ || 43

పౌర్ణమాస్యాం తు కర్తవ్యం వారాహవచనం యథా | దివ్య భౌమాంతరిక్షాణి స్థావరాణి చరాణి చ || 44

శ్రాద్ధం కుర్వంతి మానుజా స్తాంస్తాన్కామాల్లభంతి తే | నాందీముఖానాం కర్తవ్యం కన్యారాశిగతే రవౌ || 45

పిండమిచ్ఛంతి పితరః కన్యారాశఙగతే రవౌ | కన్యాం గతేసవితతరి యాన్యహానితు షోడశ || 46

క్రతుభిస్తాని తుల్యాని దేవోనారాయణోబ్రవీత్‌ | రాజసూయాశ్వమేధాభ్యాం య ఇచ్ఛేద్దుర్లభం ఫలమ్‌ || 47

అప్యంబుశాకమూలాద్యైః పితౄణ్కన్యాగతేర్చయేత్‌ | ఉత్తరాహస్త నక్షత్ర గతే తీక్షాంశుమాలిని || 48

యోర్చయేత్స్వ పితౄన్ఛక్త్యా తస్య వాసస్త్రివిష్టపే | హస్తర్జగే దినకరే పితృరాజానుశాసనాత్‌ || 49

తావత్పితృపురీ శూన్యా యవద్ద్వృశ్చికదర్శనమ్‌ | వృశ్చికే సమతిక్రాంతే పితరో దైవతైః సహ || 50

నిశ్వస్వ ప్రతిగచ్ఛంతి శాపం దత్వా సుదుస్సహమ్‌ | అష్టకాసు చకర్తవ్యం శ్రాద్ధం మన్వంతరాసు వై| 51

అన్వష్టకాసు క్రమశో మాతృపూర్వం తదిష్యతే | గ్రహణ చ వ్యతీపాతే రవిచంద్రసమాగమే || 52

జన్మర్జే గ్రహపీడాయాం శ్రాద్ధం పార్వణముచ్చతే | ఆయనద్వితయే శ్రాద్ధం విషువద్వియతే తధా|| 53

సంక్రాంతిషు చకర్తవ్యం శ్రాద్ధం నిధివదుత్తమమ్‌ | ఏషు కార్యం ద్విజాః శ్రాద్ధం పిండనిర్వాపణావృతే || 54

వైశాఖస్య తృతీయాయాం నవమ్యాం కార్తికస్య చ | శ్రాద్ధం కార్యంతు శుక్లాయాం సంక్రాంతి విధినానరైః || 55

త్రయోదశ్యాం భాద్రపదే మాఘే చంద్రక్షయేహని | శ్రాద్ధం కార్యంపాయసేన దక్షినాయనవచ్చ తత్‌ || 56

యదా చ శ్రోత్రియోభ్యేతి గేహం వేదవిదగ్నిమాన్‌ | తేనై కేన చ కర్తవ్యం శ్రాద్ధం విధివదు త్తమమ్‌ || 57

శ్రాద్ధీయద్రవ్యసంప్రాప్తి ర్యదా స్సాత్సాదుసంమతా | పార్వణన విధానేన శ్రాద్ధం కార్యం తదా ద్విజః || 58

సూర్యడు కన్యారాశియందున్నపుడు శ్రాద్ధముపెట్టిన నేయేకోరికలు కోరునోయవన్నియు నెరవేరును. వారాహపురాణమునందు జెప్పబడినట్లు పౌరమాసియందు పితృశ్రాద్ధముపెట్టినయెడల దివ్యభౌమ అంతరిక్షములకు స్థావర జంగమములకును సంబంధించిన సర్వకామములను బొందుదురు. సూర్యడు కన్యారాశియందున్నపుడు పితృదేవతలు పిండముంగోరుదురు. రవికన్యారాశియందున్న పదునాఱురోలజులందు పితరలకు పిండ ప్రదానము సేయుట సర్వక్రతువులు సేయుటయేయని నారాయణుడు పలికెను. రాజసూయాశ్వమేధముల ఫలమును సూర్యుడు కన్యారాశిగతుడైనప్పుడు నీళ్ళు ఆకుకూరలు దుంలపు మాత్రముతో పెట్టిన శ్రాధ్దమువలననందును. ఉత్తర-హస్తనక్షత్రములందుసూర్యుడు కన్యారాశిగతుడై నప్పుడు భక్తితో పితృదేవతార్చనము సేసిన స్వర్గము సిద్ధించును. రవిహస్తయందు ప్రవేశించివృశ్చకారాశి ప్రవేశము చేయుదాక పితృపురి శూన్యమయియుండును. వృశ్చికమునుగూడ రవిదాటిపోయినతఱి పితృదేవతలు దేవతలతో గూడ నిట్టూర్పుపుచ్చి తనకులమువారికి శాపమిచ్చి తిరిగిపోవుదురు. అష్టకలందు మన్వంతరములందుగ్రహణమందు వ్యతీపాతమందు రవి చంద్రసమాగమమందు (అమావాస్యనాడు) జన్మనక్షత్రమందు గ్రహబాధలు గల్గినపుడు పెట్టుశ్రాద్ధము పార్వణశ్రాద్ధ మనంబడును. రెండుఆయనములందు రెండువిషవత్తుఅందు సంక్రాంతులందును యథావిధిగ శ్రాద్ధముపెట్టవలెను. వీనిలో పిండ ప్రదాన నిర్వాపణములవసరముగావు. వైశాఖశుక్లతదియయందు కార్తిక నవమియందును సంక్రాంతి శ్రాద్ధవిధానమున పితరులనర్చింపవలెను. భాద్రపదశుక్లత్రయోదశియందు మఘయందు చంద్రక్షయపర్వమందు పాయసముతో శ్రాద్ధము పెట్టవలెను.. ఆది దక్షిణాయన శ్రాద్ధతుల్యము, వెదవేత్తశ్రోత్రియుడు నిత్యాగ్నిహోత్రియు నైనబ్రాహ్హణు డింటిక రుచెంచెనేని ఆ యొక్కనితోనే యథావిధిగ శ్రాద్ధము పెట్టవచ్చును. శాస్త్రీయమైన శ్రాద్ధీయద్రవ్యసంపద సమకూరినపుడు పార్వణవిధనమున పితృశ్రాద్ధమున సేయవలెను. ప్రతి సంవత్సరం కార్యం మాతాపిత్రో ర్మృతేహని | పితృవ్యస్యాప్యపుత్రస్య భ్రాతుర్జ్యేష్ఠస్య చైవహి || 59

పార్వణం దేవపూర్వం స్యా దేకోద్దిష్టం సురైర్వినా | ద్వౌ దైవే పితృకార్యే త్రీనేకైక ముభయత్రవా || 60

మాతామహాన మప్యేవం సర్వమూహేన కీర్తితమ్‌ | ప్రేతీభూతస్య సతతం భువి పిండం జలం తథా || 61

సతిలం సకుశం దద్యా ద్బహిర్జల సమీపతః | తృతీయేహ్ని చ కర్తవ్యం ప్రేతాస్థిచయనం ద్విజైః || 62

దశాహే బ్రాహ్మణః శుద్దో మేకోద్దిష్టం ప్రచక్షతే | ద్వాదశేహని మాసే చ త్రిపక్షేచ తతః పరమ్‌ || 64

మాసిమాసి చ కర్తవ్యం యావత్సంవత్సరం ద్విజాః | తతః పరతరం కార్యం సపిండీకరణ క్రమాత్‌ || 65

ఆమూర్తా మూర్తిమంతశ్చ పితరో ద్వివిధాః స్మృతాః నాందీ ముఖా స్త్వమూర్తాఃస్యుర్మూర్తిమంతోథ పార్వణాః ||

ఏకోద్ధిష్ఠాశినః ప్రేతాః పితౄణాం నిర్ణయంస్త్రీదా||

తల్లిదండ్రులకు సంతానములేని పినతండ్రులకు పెద్దఅన్నకు ప్రతిసంవత్సరము విశ్వేదేవతలో కూడ పితృదేవతలకు తద్దినము పెట్టవలెను. విశ్వేదేవులు లేకేండ ఏకోదిష్టశ్రాద్ధము నందు దేవ పితృస్థానములందిద్దరు బ్రాహ్మణులను అర్చింపవలెను. ఇట్లే మతా మహాదులకును రుపవలెను. ప్రేతీభూతడైన జీవునకు భూమిపై పిండమును జల మును తిలలతో కుశలతో జలసమీపమందు పెట్టవలెను. బ్రాహ్మణులు పదునొకండవ దినమునను క్షత్రియులు పదుమూడవ దినమునను వైశ్యులు పరునారవదినమునను శూద్రుడు ముప్పది ఒకటవ దినమునను శుద్ధలగుదురు. అనగా ఆశౌచమును విడుచును. నూతకము తుదను గృహమందు పండ్రెండవ దినమందును మానంమదును త్రిపక్ష మందును ఏకోద్ధిష్టశ్రాద్ధము పెట్టవలెను. సంవత్సరము తుదదాక ప్రతినెల మాసికము పెట్టవలెను. ఆపైన సపిండీకరణము పార్వణ విధానమున జరుపవలెను. అప్పటినుండి చనిపోయిన జీవుడు ప్రేతత్వమును విడిచి పితృదేవతాత్వమును పొందును. పితృదేవతలు ఆమూర్తులు మూర్తిమంతులు నని రెండువిధములుగా నుందురు. నాందీముఖులు అమూర్తులు, పార్వణులు మూర్తిమంతులు.

మునయ ఊచుః

కథం సపండీకరణం కర్తవ్యం ద్విజస్తతమ | ప్రేతీభూతస్య విధివ ద్భ్రూహి నో వదతాం వర || 68

వ్యాస ఉవాచ

సపిండీకరణం విప్రాః పశృణుధ్వం వదతో మమ | తచ్ఛాపి దేవరహిత మేకార్ఘ్యైక పవిత్రకమ్‌ || 69

నై వాగ్నౌకరణం తత్ర తచ్చా೭೭వాహనవర్జితమ్‌ | అపసవ్యం చ తత్రాపి భోజయేదయుజోద్విజాన్‌ || 70

విశేషస్తత్ర చాన్యోస్తి ప్రతిమాన క్రియాదికాః| తం కథ్యమానమేకాగ్రాః శృణుధ్వం మేద్విజోత్తామః || 71

తిలగంధోకై ర్యుక్తం తత్ర పాత్రచతుష్టయం | కుర్యాత్పితౄణాం త్రితయ మేకం ప్రేతస్య చ ద్విజాః || 72

పాత్రత్రయే ప్రేతపాత్రా దర్ఘ్యం చైవ ప్రసేచయత్‌ | యే సమానా ఇతి జప న్పూర్వవచ్ఛేష మాచరేత్‌ || 73

స్త్రీణామప్యేవ మేవ స్యా దేకోద్దిష్ట ముదాహృతమ్‌ | సంపిడీకరణం తాసాం పుత్రాభావే న విద్యతే || 75

పుత్రాభావే సపిండాస్తు తదభావే సహోదరాః | కుర్యురేతం విధిం సమ్య క్పుత్రస్య సుతః సుతాః || 76

కుర్యా న్మాతామహానాం తు పుత్రికా తనయ స్తథా | ద్వ్యాముష్యాయణ సంజ్ఞాస్తు మాతామహ పితామహాన్‌ || 77

పూజయేయు ర్యథాన్యాయం శ్రాద్దైర్నైమిత్తికైరపి | సర్వాభావే స్త్రీయః కుర్యుః స్వబర్తౄణామమంత్రకమ్‌ || 78

తదభావే చ నృపతిః కాయే త్త్వకుటుంబినామ్‌ | తజ్జాతీయైర్నరైః సమ్య గ్వాహాద్యాః సకలాః క్రియాః || 79

సర్వేషామేవ వర్ణానాం బాంధవో నృపతి ర్యతః | ఏతా వః కథితా విప్రా నిత్యానై నిత్యానైమిత్తికా ప్తథా || 80

మునులు సపిండీకరణ విధానము నానతిమ్మని యడుగ వ్యాసుండింట్లనియె.

సపిండీకరణము నందు విశ్వేదేవతలు ఆహ్వానింపబడరు. అందొకటే అర్ఘ్యమీయవలెను. అగ్నౌకరణముండదు. ఆవాహనముకూడ నుండదు. బ్రాహ్మణులు బేసి సంఖ్యలో నర్చింపబడుదురు. అ సపిండీకరణ విధనమున మరోక విశేషము తెలిపెదను. తిలగంధొదకములచే కూడిన నాల్గు పాత్రములుపయోగింపబడును. వానిలో పితరులకు మూడు ప్రేతకు నొకటి. ప్రేత పాత్రమందలి యర్ఘ్యముచేత మిగిలిన మూడు పాత్రములను ''యేనమానాః'' అను మంత్రము జపించుచు ఉదకము చల్లవలెను. స్త్రీలకు గూడ ఈ ఏకోదిష్ట విధానమున జరుపవలెను. సంతానము లేని స్త్రీలకు సపిండీకరణము పెట్టనవసరము లేదు. స్త్రీలకు సంతానము లేనివారికి ఏకోద్దిష్ట విధానమున ప్రతిసంవత్సరము నిది విహితము. కొడుకులు లేని స్త్రీలకు జ్ఞాతులు కూడ లేనపుడు. సోదరులు శ్రాద్ధము పెట్టవలెను. మాతామహులకు దౌహిత్రుడు (కూతురి కొడుకు ద్వ్యాముష్యాయణులను పేర పిలువబడు మనుష్యులుమాతామహవర్గమును యథావిధిగ పూజింపవలెను. వారికి నిత్య శ్రాద్ధమేకాక నైమిత్తిక శ్రాద్ధములు కూడ దౌహిత్రుడు పెట్టవలెను. సర్వాభావమందు అనగా తద్దినము పెట్టువాడు లేనపుడు స్త్రీలు స్వయముగా మంత్రరహితముగా శ్రాద్దము పెట్టవలెను. ఏ దిక్కును లేని జీవులకు రాజు ఆయాజాతి పురుషులచే శవవాహనము దగ్గర నుండి జరిపింపవలెను. సర్వ వర్ణములకు రాజు బంధువు.

వక్ష్యేశ్రాద్ధాశ్రయయామాన్యాం నిత్యనైమిత్తికాం క్రియామ్‌ |

ధర్మస్తత్ర నిమిత్తం తు విద్యాదిందుక్షయాన్వితమ్‌ || 81

నిత్యస్తు నియతః కాల స్తప్మిన్కుర్యా ద్యథోదితమ్‌ | సపిండీకరణాదూర్ధ్వం పితుర్యః ప్రపితామహః || 82

సతు లేపభుజం యాతి ప్రలుప్తః పితృపిండతః | తేషాం హి యశతుర్థ్యో7న్యః స తు లేపభుజో భ##వేత్‌ || 83

సోపి సంబంధతో హీన ముపయోగం ప్రపద్యతే| పితా పితామహశ్చైవ తథైవ ప్రపితామహః || 84

పిండవంబంధినో హ్యేతే విజ్ఞేయాం పురుషాస్త్రయః | లేపసంబంధిన శ్చాన్యే పితామహ పితామహాత్‌ || 85

ప్రభృత్యుక్తాస్త్రయ స్తేషాం యజమాన్చ సప్తమః | ఇత్యేష మునిభిః ప్రోక్తః సంబంధః సా ప్తపౌరుషః || 86

యజమానత్ర్పభృత్యూర్ధ్వ మనులేప భుజస్తథా | తతోన్యే పూర్వజాః సర్వే యే చాన్యే నరకౌకసః || 87

యేపి తిర్యక్త్వమాపన్నా యే చ భూతాది సంస్థితాః | తాన్పర్వాన్యజమానో వై శ్రాద్ధం కుర్వన్యథా విధి || 88

ససమాప్యతయతే విప్రా యేన యేన వదామి తత్‌ | అన్న ప్రకిరణం యత్తు మనుషై#్యః క్రియతేభువి || 89

తేన తృప్తిముపాయాంతి యే పిశాచత్వా మాగతాః | యదంబు స్నానవస్త్రోత్థం భూమౌ పతతి భో ద్విజాః || 90

తేన యే తరుణాం ప్రాప్తా స్తేషాం తృప్తిః ప్రజాయతే | యాస్తు గంధాంబుకణికాః పతంతి ధరణీతలే || 91

తాభారాప్యాయనం తేషాం యే తిర్యక్త్వం కులే గతాః | యే చాదంతాః కులే బాలాః క్రియాయోగాద్బహిష్కృతాః ||

విపన్నాస్త్వనధీకారాః సంమార్జిత జలశినః | భుక్త్వా చా೭೭ చామతాం యచ్చ యజ్జలం చాంఘ్రిశౌచకమ్‌ || 94

బ్రాహ్మణానాం తథైవాన్య త్తేన తృప్తిం ప్రయాంతి వైఏవం యో యజమానస్య యశ్చ తేషాం ద్విజన్మనామ్‌ ||

కశ్చిజ్జలాన్నవిక్షేపః శుచి రుచ్ఛిష్ట ఏవ వా | తేనాన్నేన కులే తత్ర యే చ యోన్యంతరం గతాః || 96

నిత్యనైమిత్తిక శ్రాద్ధవిధానము చెప్పద వినుడు. నిత్యశ్రాద్ధము సపిండీకరణానంతరము జరుపనవలెను. అందు తండ్రికి పెట్టిన పిండమునుండి లేపము ప్రపతితామహుడు పొందును. వానకి పైన నాల్గవవాడును లేపభుజుండగును. అతడును తండ్రి తాత ముత్తాత అను నీ ముగ్గురు పురుషులు పిండభక్కులు. మిగిలన పై మూడు తరములవా పిండ లేప సంబంధులు. ఇట్లు పితృపితామహ ప్రపితామహులు వారికి వెనుకటి మూడుతరములవాడారు యజమానుడు కలసి మొత్తము వీరేడుగురు. వీరి అన్యోన్య సంబంధము సావ్తపౌరుషము. యజమానికి పైవారిలో లనులేపభుక్కుల వానికంటె ముందు ఆ కుటుంబమున బుట్టినవరును నరమున కేగినవారు పశుక్ష్యాది జన్మలెత్తినవారు భూతాదులందు వ్యాపించి యున్నవారు ఇందరను యమాని శ్రాద్ధము పెట్టి సంతృప్తిపరచును. ఆసంతృప్తి పరుచుటలో అన్న ప్రకిరణము అన్నపు మెతుకులను చిమ్ముట అనుక్రియ చేయబడును దానివలన పిశాచాది జన్మలందినవారు తృప్తి పొందుదురు. స్నానము చేసి వస్త్రమును పిడిచిన నీటిచే వృక్షజన్మ పొందినవారు తృప్తి బడయుదురు. భూమి మీద పడిన గంధోదక బిందువలతచేత ఆ కులములో దేవత్వము పొందినవారికి ఆప్యాయనము కలుగును. పిండము లుద్దరించిన తరువాత చల్లిన నీటిచినుకులచే పశుపక్ష్యాది జన్మలెత్తిన వారకి తృప్తికలుగును. దంతములు కూడ రాని బారురకర్మబహిష్కృతులైనవారు అనధికారులుగ మరణించినవారు పితృస్థానమందు సమ్మార్జనము చేసిన ఉదకము చేతను బ్రామ్‌మణ పాదప్రక్షాళనముచేసి ఉదకముబొందియు తృప్తినొందుదురు. ఈ విధముగ యజమాని నిర్వర్తించిన శ్రాద్ధము నందు చిందిన నీరు చిమ్మిన అన్నవిక్షపము అది శుచియైనను కాకున్నను దానిని పొంది ఆ కులమువారు ప్రస్తుతము అన్య యోనులందు బుట్టినవారు ఆప్యాయనము బడయుదురు.

ప్రయాంత్యాప్యాయనం విప్రాః సమ్యక్శ్రాద్ధ క్రియావతామ్‌ | ఆన్యాయో పార్జితై రర్థైర్యచ్ఛ్రాద్ధం క్రియతే నరైః ||

తృప్యతే తే న చాండాల పుల్క సాద్యాసు యోనిషు | ఏవ మాప్యాయనం విప్రా బహూనామేవ బాంధవైః || 98

శ్రాద్ధం కుర్వద్భిరత్రాంతబు విక్షేపైః సంప్రజాయతే |తస్మాచ్ఛ్రాద్ధం నరో భక్త్యా శాకేనాపి యథావిధి || 99

కుర్వీత కుర్వతః శ్రాద్ధం కులే కశ్చిన్న సీదతి | శ్రాద్ధం దేయం తు విప్రేఘ సంయతేష్వగ్నిహోత్రిషు || 100

అవదాతేషు విద్వత్సు శ్రోత్రియేషు విశేషతః | త్రిణాచికేతస్త్రీమధు సువర్ణః షడంగవిత్‌ || 101

మాతాపితృ పరశ్చైవ స్వస్రీయః సామవేదవిత్‌ | ఋత్విక్పు రోహితాచార్య మూపాధ్యాయం చ భోజయేత్‌ || 102

మాతులః శ్వశురః శ్యాలః సండంధీ ద్రోణపాఠకంః | మండల బ్రాహ్మణో యస్తు పురాణార్థ విశారదః || 103

అకల్పః కల్పసంతుష్టః ప్రతిగ్రహ నివర్జితః | ఏతే శ్రాద్దే నియోక్తవ్యా బ్రాహ్మణాః పంక్తిపావనాః || 104

నిమంత్రయేత పూర్వేద్యుః పూర్వోక్తాన్ద్విజ సత్తమాన్‌ | దైవే నియోగే పిత్య్రేచ తా స్తథైవోప కల్పయేత్‌ ||

తైశ్చ సంయమిభిర్బావ్యం యస్తు శ్రాద్ధం కరిష్యతి | శ్రాద్ధం దత్త్వా చ భుక్త్వా చ మైధునం యోధిగచ్ఛతి ||

పితరస్తస్య వై మాసంతస్మిన్రేతసి శేరతే| గత్వా చ యోషితం శ్రాద్ధే యో భుం క్తే యస్తుగ చ్ఛతి || 107

రేతోమూత్రకృతాహారా స్తం మాసం పితరస్తయోం | తస్మాత్తు ప్రథమం కార్యం ప్రాజ్ఞనోప నిమంత్రణమ్‌ || 108

అప్రాప్తౌ తద్దినే వాపి వర్జ్యా యోషిత్ర్ప సంగినః | భిక్షార్థ మాగతాంశ్చపి కాలేన సంయతా న్యతీన్‌ || 109

యాజయేత్ప్రణి పాతాద్యైః ప్రసాద్యయతమానసః | యోగినశ్చ తదా శ్రాద్దే భోజనీయా విపశ్చితా || 110

యోగధారా హి పితర స్తస్మాత్తాన్పూ జయేత్సదా | బ్రాణ్మణానాం సహస్రాణి ఏకో యోగీ భ##వేద్యది || 111

యజమానం చ భోక్తౄంశ్చ నౌరివాంభసి తారయేత్‌ | పితృగాథ తథైవావాత్ర గీయతే బ్రహ్మవాదిభిః || 112

విధానముననుసరించి శ్రాద్ధము చేసినవారి పితరులు ఆప్యాయనమును తృప్తిని పొందుదురు.

అన్యాయార్జిత విత్తములచే పెట్టిన శ్రాద్దము చండాల పుల్కసాది జాతులందు పుట్టిన వారికి తృప్తికూర్చును. కనుక మానవుడు తుదకాకుకూరతోనైన భక్తితో శ్రాద్దము పెట్టిన యెడలవానికులమందొక్కడునుదుఃఖపడడు. ఆచారవంతులను నిత్యాగ్నిహోత్రులను జ్ఞానులను నిత్యశుచులను విశేసించి శ్రోత్రియులను భోక్తలను నిమంత్రించి శ్రాద్ధము పెట్టుట ప్రశస్తమైన విషయము. త్రిణాచికేతుడు-త్రిమధువు-త్రిసువర్ణుడు (నాచికేతాగ్ని విద్యను త్రిమధువిద్యను త్రిసుపర్ణవిద్యను ఈ మూటిని అధ్యయనము చేసి వాని అర్థముకు ఎరిగి ఆ అగ్నిచయనమును అనుష్ఠించినవారు) వేదాంగముల నారింటిని అధ్యయనము చేసినవారు మాతృపితృ భక్తులు మేనల్లుడు సామవేదము నెరిగిన వారు యజ్ఞమున జరుగు అన్ని క్రియాక లాపములలోను యజ్ఞమును జరుపు జరిపించు అందరలోను మంచి చెడ్డలను పరిశీలించి చెప్పగల మహాపండితుడు ఇట్టి వారిని భోక్తగా తీసికొనవలెను. మేనమామ తనభార్యకు తండ్రి తన భార్యకు సోదరుడు వియ్యంకుడు - ద్రోణపాఠకుడు - నాలుగు వందల గ్రామమలుల మొత్తములో ముఖ్యవేద పండితుడు - మండల బ్రాహ్మణుడు-ఒక మండల ప్రదేశము మొత్తములో ప్రధాన వేదపండితుడు - పురాణములలోని తత్త్వ విషయముల నెరిగినవాడు కూడని దానము గ్రహించనివాడు అకల్పుడు - దుస్సంకల్పములు లేనివాడు-కల్సంతుష్టుడు-తనసత్సంకల్పము నెరవేరగనే సంతృప్తి నొందువాడు - ఇట్టి వారిని శ్రాద్ధమునందు భోక్తలుగ పెట్టవలెను. పంక్తిపావనులైన తాము ఏ పంక్తిలో కూర్చుండి భుజించెదరో ఆ పంక్తిలో భుజించిన వారందరను తమ శక్తిచే పవిత్రులను చేయగలవారు - అట్టి బ్రాహ్మణులను గూడ శ్రాద్ధమున భోజనమునకు పిలువవలెను. శ్రాద్ధమునకు ముందటి నాడే వీనిని పిలిచికొని వచ్చి విశ్వేదేవ పితృస్థానములందు కూర్చండ బెట్టి ఆర్చింపవలెను. శ్రాద్దము చేయు యజమానుడు కూడ వారితో పాటు మౌనాదినియములను బూన వలయును.

శ్రాద్ధభోజనము చేసినవాడు మైథునము సలిపిన యెడల వాని పితరులు ఆరేతస్సునందొక్కనెల పడి యుందురు. స్త్రీనిపొంది శ్రాద్ధమునందు బ్రాహ్మణుడుగ కూర్చండి భోజనము చేసిన వానిపితృదేవతలు రేతోమాత్రము లాహారముగొని నెలరోజులు కుములుదదురు. కావున చక్కగ తెలిసి ఉత్తముడైన బ్రాహ్మనులను నిమంత్రణము సేయవలయును. ఇది ప్రథమ కర్తవ్యము, తద్ధినమునాడు స్త్రీమైథునము సేసినవారి నేమాత్రము నిమంత్రిపంరాదు. ఉత్తమ బ్రాహ్మణుడు అభింపనపుడు భిక్ష కొరకు వచ్చిన వారిని సరిగా అనమయమున నింటికి వచ్చినయతులను యోగులను సాష్టాంగముగ మ్రొక్కి బ్రతిమాలి శ్రాద్ధమందు భోజనము పెట్టవలెను. పితృదేవతలు యోగముమీద నాధారపడిన వారడు కావున వారి ప్రీతికి పూజింపవలసిన వారు యోగుల వేయిమంది బ్రాహ్మణులలలో నొక్క యోగిసమానుడు, ఆతడు వీటిలో నౌక యట్లు యజమానిని భోక్తలను (పితృదేవలను) తరింపచేయగలడు. ఈవిషయములో బ్రహ్మవాదులు గానముసేసిన పితృగాథల తాత్పర్యము ఇది.

యా గీతా పితృభిః పూర్వ మైలస్యా೭೭సీన్మహాపతేః | కదా నః సంతతావగ్ర్యః కప్య చిద్భవితా సుతః || 113

యో యోగిభుక్త శేషాన్నో భువి పిండాన్ప్ర దాస్యతి | గయాయామథవా పిండం ఖడ్గమాంసం తథా హవిః || 114

కాలశాకం తిలాజ్యం చ తృప్తయే కృసరం చ నః | వైశ్యదేవం చ సౌమ్యంచ ఖడ్గమాంసం పరం హావిః || 115

విషాణర్జం శిరస ఆ పాదాదాశిషామహే | దద్యచ్ఛ్రాద్ధం త్రయోదశ్యాం మఘాసు చ యథావిధి || 116

మధు సర్పిః సమాయుక్తం పాయసం దక్షిణాయనే | తస్మాత్సం పూజయేద్భక్త్యా స్వపితౄన్విధివన్నరః || 117

కామానభీప్సన్సకలా న్పాపాదాత్మ విమోచనమ్‌ | వసూన్రద్రాం స్తథా೭೭దిత్యా న్నక్షత్రగ్రహతారకాః || 118

ప్రీణయంతి మనుష్యాణాం పితరం శ్రాద్ధతర్పితాః | అయుః ప్రజాం ధనం విద్యాం స్వర్గం మోక్షం సుఖానిచ || 119

ప్రయచ్ఛంతి తథా రాజ్యం పితరః శ్రాద్దతర్పితాః | తథాపరాహ్ణః పూర్వాహ్ణా త్పితౄణా మతిరిచ్యతే || 120

సంపూజ్య స్వాగతే నైతా న్సదనేభ్యాగతాన్ద్విజాన్‌ | పవిత్రపాణిరాచాంతా నాసనేషూపవేశ##యేత్‌ || 121

శ్రాద్ధం కృత్వా విధానేన సంభోజ్య చ ద్విజోత్తమాన్‌ | విసర్జయేత్రియాణ్యుక్త్వా ప్రణిపత్య చ భ క్తితః || 122

ఆద్వార మనుగచ్ఛేచ్చ ఆగచ్ఛేదను మోదితః | తతో నిత్యక్రియాం కుర్యా ద్భోజయేచ్చ తథాతిథీన్‌ 123

నిత్యక్రియాం పితౄణాం చ కేచిదిచ్ఛంతి సత్తమాః | న పితౄణాం తథైవాన్యే శేషం పూర్వవదాచరేత్‌ || 124

పృథక్త్వేన వదంత్యన్యే కేచిత్పూర్వం చ పూర్వవత్‌ | తత స్తదన్నం భుంజీత సహ భృత్యాదిభిర్నరః || 125

ఏవం కుర్వీత ధర్మజ్ఞః శ్రాద్ధం పిత్ర్యం సమాహితః | యథాచ విప్రముఖ్యానాం పరితోషోభిజాయతే || 126

పితృగాథలు

ఐలుడను రాజు నుద్దేశించి పితృదేవతలిట్లు గానము సేసిరి. మాసంతతిలో పరమశ్రేష్ఠుడు ఒక్క కుమారుడు కల్గునా? యోగుల భుక్తశేషాన్నము భూమిపై మాకు పిండములు పెట్టునా ? లేదా గయయందు పిండదానము చేయునా? ఖడ్గ మృగమాంసము హవిస్సు - పులుపుకారము చురుకు వస్తువులు లేని సాత్వికమైన ఆహారము - బలుసు కూర తిలలు ఆజ్యము కృనరము (పులగము) మాకు పెట్టునా? కొమ్ములు మాత్రము విడిచి, పాదము మొదలు శిరసుదాక గలఖడ్గమృగముల మాంసము త్రయోదశినాడు ముఖా నక్షత్రమందు తేనెనెయ్యితో కలిపిన పాయసముతో దక్షిణాయనము నందు మాకు నివేదించునా? అని యుబలాట పడుచుందురు. కావున భక్తితో పితృ దేవతలనర్చించి సర్వాభీష్టములను బడయవలయును ఆ పితృప్రీతి వలన వుసుపులురుద్రులు ఆదిత్యలునక్షత్ర దేవతలు గ్రహములు తారాగ్రహములు పితృశ్రాద్ధము వలన తృప్తులై ఆయువును సంతానమును ధనమును విద్యను స్వర్గమును మోక్షమును పితృదేవతలోసంగుదురు. అపరాహ్ణకాలము నుండి పితృకాలము. అపుడు స్వాగతము చెప్పి పవిత్రపాణియై ఆచమించి అభ్యాగతుడైన ద్విజులను ఆసములందుపవిష్టులను జేయవలెను. శ్రాద్ధము పూర్తిచేసి ఉత్తమ ద్విజులకు భోజనము పెట్టి ప్రియసంభాషణముల చేత ప్రణమిల్లి భక్తితో ద్వారము దాక అనుగమించి విసర్జించి వారి అనుమోదము పొందివచ్చి నిత్యక్రియా కలాపము పూర్తిచేసికొని అతిథులకు భోజనము పెట్టవలెను. పితృదేవతలకు సంబంధించిన తర్పణాది నిత్యక్రియలు అపుడే చేయవలయునని కొందరందురు. కాదని కొందరందురు. అవి వేరుగా చేయవలెను. కొందరు ముందే చేయవలెనని చెప్పుదురు. అటుపై యాజమానుడు శ్రాద్ధాన్నమును తమవారితో పరివారముతో భుజింప వలెను. ఇట్లు ధర్మజ్ఞుడైన బ్రాహ్మణుడు బ్రాహ్మణులందురు సంతోషించునట్లు శ్రద్ధతో శ్రాద్ధము నిర్వహింపవలెను.

ఇదానీం సంప్రవక్ష్యామి వర్జనీయాన్ద్విజాధమాన్‌ | మిత్రధ్రుక్కునఖీ క్లీబః క్షయీ శుక్లీ వణిక్పథః || 127

శ్యావదంతోథ ఖల్వాటః కాణోంధోబధిరో జడః | మూకః పంగుః కుణిః షంఢో దుశ్చర్మా వ్యంగకేకరౌ || 128

కుష్ఠీ రక్తేక్షణః కుబ్జో వామనో వికటోలసః | మిత్రశత్రుర్దుష్కులీనః పుశుపాలో నిరాకృతః || 129

పరివిత్తః పరివేత్తా పరివేదినికా సుతః | వృషలీపతి స్తత్సుతశ్చ న భ##వేచ్ఛ్రాద్ధభుగ్ధ్విజః || 130

వృషలీపుత్రసంస్కర్తా అనూఢోదిదిషూపతిః | భృతకాధ్యాపకో యస్తు భృతకాధ్యాపితశ్చ యః || 131

సూతకాన్నోపజీవీ చ మృగయుః సోమవిక్రయీ| అభిశ స్త స్తథా స్తేనః పతితో వార్ధుషిః శఠః || 132

పిశునో వేదసంత్యాగీ దానాగ్నిత్యాగనిష్ఠురః | రాజ్ఞఃపురోహితో భృత్యో విద్యాహీనోథ మత్సరీ || 133

వృద్ధద్విడ్డర్ధరః క్రూరోమూఢో దేవలక స్తథా | నక్షత్ర సూచకశ్చైవ పర్వకారశ్చ గర్హితః || 134

ఆయాజ్యయాజకః షంఢో గర్హితాయే చ యేధమాః | న తే శ్రాద్ధే నియో క్తవ్యా దృష్ట్వామీ పంక్తిదూషకాః ||

ఆసతాం ప్రగ్రహో యత్ర సతాం చై వావమాననా | దండో దేవకృత స్తత్ర సద్యః పతతి దారుణః || 136

హిత్వా೭೭గమం సువిహితం బాలిశం యస్తు భోజయేత్‌ | ఆదిధర్మం సముత్సృజ్య దాతా తత్ర వినశ్యతి || 137

యస్త్వాశ్రితం ద్విజం త్యక్త్వా అన్యమానీయభోజయేత్‌ | తన్నిః శ్వాసాగ్ని నిర్దగ్ధ స్తత్ర దాతా వినశ్యతి || 138

వస్త్రాభావే క్రియా నాస్తి యజ్ఞావేదా స్తపాంసి చ | తస్మాద్వాసాంసి దేయాని శ్రాద్ధకాలే విశేషతః || 139

కౌశేయం క్షామ కార్పాసం దుకూలమహతం తథా |శ్రాద్ధే త్వేతాని యో దద్యా త్కామానాప్నోతి చోత్తమాన్‌ || 140

శ్రాద్దవర్జ్యములు

శ్రాద్దమునందు భోక్తులుగా పెట్టతగని అదమ బ్రాహ్మణులను పేర్కొందును వినుడు. మిత్రద్రోహి పుప్పి గోళ్ళవాడు నపుంసకుడు క్షయవ్యాధి బొల్లికలవారు వాణిజ్యము చేయువాడు గార పండ్లవాడు బట్టతలవాడు మెల్లకంటివాడు గ్రుడ్డివాడు చెవిటివాడు మందబుద్ధి మూగవాడు కుంటివాడు పీలచేయిగాని వంకరచేయిగాని కలవాడు పౌరుషశక్తి లేనివాడు చర్మవ్యాధి కలవాడు అవయవములు తొలగింపబడినవాడు ఓరవంకర చూపుగలవాడు కుష్ఠ వ్యాధితుడు ఎఱ్ఱని కండ్లవాడు మరుగుజ్జు పొట్టివాడు వికటమైన ఆకారముగలవాడు చురుకుదనములేనివాడు మిత్రుని శత్రునిగా భావిచువాడు. నీచవంశమున బుట్టినవాడు పశుపాలనచే జీవించువాడు. వెలివేయబడినవాడు పరివిత్తి (తమ్మునికి వివాహమైన తర్వాత తాను పెండ్లి చేసికొన్నవాడు) పరివేత్త (అన్నకంటె ముందుతాను పెండ్లాడిన తమ్ముడు) పరివేదిని కాసుతుడు(అన్న కంటె ముందు పెండ్లాడిన వాని భార్యకడుపున పుట్టిన కొడుకు) శూద్ర స్త్రీని పెండ్లాడిన బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు శూద్ర స్త్రీని పెండ్లాడిన పుట్టిన కొడుకు ఇట్టి వారిని శ్రాద్థమున భోక్తలుగా తీసికొన కూడదు. ఇట్టి శూద్ర స్త్రీకి ఉపనయనాది సంస్కారములు జరిపించిన బ్రాహ్మణుడు పెండ్లాడనివాడు దిధుషూవతి (భర్త మరణించిన తరువాత మరల పెండ్లాడిన స్త్రీ యొక్క భర్త) జీతము తీసికొని వేదాధ్యయనము చేయించువాడు జీతమిచ్చి వేదము నేర్చకొనువాడు సూతాకాన్నముచే జీవించువాడు వేటాడువాడు సోమరసమును సోమలతను అమ్మువాడు అభిశస్తుడు (వేదాధ్యయనము చేసిన క్షత్రియునిగాని వధచేసినపాపి) దొంగ భ్రష్టుడు వడ్డీ వ్యాపారముచే జీనించువాడు మోసము చేసి జీవించువాడు కొండెములు చెప్పువాడు వేదాధ్యయనము దానము అగ్నిహోత్రము చేయక విడిచి కాఠిన్యము వహించినవాడు రాజపురోహితుడు రాజసేవకుడు విద్యావిహీనుడు ఇతరులమేలు ఓర్చనివాడు పెద్దలను ద్వేషించువాడు భరింపరాని దుష్టుడు రుక్రూడు మూఢుడు గుడిపూజారి నక్షత్ర సూచకుడు (జాతక ఫలములు చెప్పి జీవించువాడు) పర్వకారుడు (రాతిపని చేయువాడు) లోకనింద పొందువాడు యాగము చేయింపకూడని వారిచే యాగము చేయించినవాడు ఇట్టి వారిని శ్రాద్ధమున భోక్తలుగ గ్రహింపకూడదు.

అపాత్రదానము పట్టువాడు సత్పరుషుల నవమానించువాడు. వారికి దైవము అప్పటికప్పుడు దారుణమైన దండనము విధించును. వీరు బహునిషిద్దులు. ఆగమవిహితుని విడిచి నీచునికి భోజనము పెట్టిన యజయాని ధర్మమూలమనకే దూరుడై నశించును. తనతో తననాశ్రయించి యుండు బ్రాహ్మణుని విడిచి యింకొకనిని గొనివచ్చి భోజనము పెట్టినచో ఆ ఆశ్రయించుకొనిన బ్రాహ్మణుని నిట్టూర్పు నిప్పుచే దగ్ధుడై దాన నశించును. వస్త్రములేని క్రియ లేనేలేదు. యజ్ఞములు లేవు. వేదములు లేవు. తపస్సులు లేవు. కావున శ్రాద్ధకాలమందు పితృదేవతలకు వస్త్రములు తప్పక ఇచ్చి తీరవలెను. పట్టుపంచె పొత్తుపంచె నూలువస్త్రము క్రొత్త దుకూలము శ్రాద్ధము నందిచ్చినవాడు పరమోత్తమాభిలాషలను బడయును.

యథా గోషు ప్రభూతాసు వత్సో విందతి మాతరమ్‌ | తథాన్నం తత్ర విప్రాణాం జంతుర్య త్రావతిష్ఠతే || 141

నామ గోత్రం చ మంత్రాశ్చ దత్తమన్నం నయంతితే | అపి యే నిధనం ప్రాప్తా స్తృప్తిస్తానుపతిష్ఠతే || 142

ఆవులమందలో దూడ ఎట్లు తమ తల్లి పొదుగునకే చేరునో శ్రాద్దమునందు విప్రులకు పెట్టిన అన్నము ఆ జీవుని అట్టే పొందును. నామము గోత్రము మంత్రము అనునవి ఈ యన్నమును ఆయాస్థానముల కందించును. ఆ కులమునందలి అందరకును తృప్తి కలుగును.

దేవతాభ్యః పితృభ్యశ్చ మహాయోగిభ్య ఏవ చ | నమః స్వధాయై స్వాహాయై నిత్యమేవ భవంత్వితి || 143

అధ్యావసానే శ్రాద్ధస్య త్రిరావృత్త్వా జపేత్తదా | పిండనర్వహణ వాపి జపేదేవం సమాహితః 144

క్షిప్రమాయాంతి పితరో రాక్షసాః ప్రద్రవంతి చ | ప్రీయంతే త్రిషు లోకేషు మంత్రోయం తారయత్యుత || 145

దేవతలకు పితరులకు మహాయోగులకు నమస్కారము. స్వధాదేవికి స్వాహాదేవికి నమస్కారము. వీరందరు నిత్యము నాయందుందురు. అను నీ మంత్రమును శ్రాద్ధము ముందు అవసానము నందు ముమ్మారులు జపింపవలెను. పిండ నిర్వహణ సమయమందుకూడ నిట్లు జపింపవలెను. ఈ మంత్రమువలన పితృదేవతలు పరుగుపరుగున వత్తురు. రాక్షసులు పారిపోవుదురు. ముల్లోకములు తృప్తిచెందును. ఇది తరింపజేయును.

క్షౌమసూత్రం నవం దద్యా చ్ఛాణం కార్పాసికం తథా | పత్రోర్ణం పట్టసూత్రం చ కౌశేయం చ వివర్జయేత్‌ || 146

వర్జయేచ్చాదశం ప్రాజ్ఞో యద్యప్యవ్యాహతం భ##వేత్‌ | న ప్రీణయంత్యథైతాని దాతుశ్చప్యనయో భ##వేత్‌ || 147

న నివేద్యో భ##వేతత్పిండం పితౄణాం యస్తు జీవితి | ఇష్టేనాన్నేన భ##క్ష్యేణ భోజయేత్తం యథావిధి || 148

పిండమగ్నౌ సదా దద్యా ద్భోగార్థీ సతతం నరః | పత్న్యై దద్యా త్ప్రజార్థీ చ మధ్యమం మంత్రపూర్వకమ్‌ || 149

ఉత్తమాం ద్యుతిమన్విచ్ఛ న్పిండం గోషుప్రయచ్ఛతి | ప్రజ్ఞాం చైవ యశః కీర్తి మప్సు చైవ నివేదయేత్‌ || 150

ప్రార్థయన్దీర్ఘమాయుశ్చ వాయసేభ్యః ప్రయచ్చతి | కుమారశాలామన్విచ్ఛ న్కుక్కు టేభ్యః ప్రయచ్ఛతి || 151

ఏకే విప్రాః పునః ప్రాహుః పిండోద్ధరణమగ్రతంః | అనుజ్ఞాతస్తు విపై#్రసై#్తః కామముద్ధ్రియతామితి|| 152

తస్మాచ్ర్ఛాద్ధం తథాకార్యం యథోక్తమృషిభిః పురా | అన్యథా తు భ##వేద్దోషః పితౄణాం నోపతిష్ఠతి || 153

యవై ర్ర్వీహితిలై ర్మాషై ర్గోధూమైశ్చణకై స్తథా | సంతర్పయే త్పితౄన్ముద్గైః శ్యామాకైః సర్షపద్రవైః 154

నీవారైర్హస్తిశ్యామాకైః ప్రియంగుభి స్తథార్చయేత్‌ |

ప్రాసతికాం సతూలికాం ద ద్యాచ్రాద్ధే విచక్షణః || 155

ఆమ్రమామ్రాతకం బిల్వం దాడిమం బీజపూరకమ్‌ | ప్రాచీనామలకం క్షీరం నారికేళం పరూషకమ్‌ || 156

నారంగం చ సఖర్జూరం ద్రాక్షానీలక పిత్థకమ్‌ | పటోలం చ ప్రియాలం చ కర్కంధూబదరాణి చ ||| 157

వికంకతం వత్సకం చ కర్కారూ ర్వారకానపి | ఏతాని ఫలజాతాని శ్రాద్ధే దేయాని యత్నతః || 158

గుడశర్కరమత్య్సండీ దేయం ఫాణితమూర్మురమ్‌ | గవ్యం పయో దధి ఘృతం తైలం చ తిలసంభవమ్‌ || 159

సైంధవం సాగరోత్థం చ లవణం సారసం తథా | నివేదయేచ్ఛుచీన్గంధాం శ్చందనాగురుకుంకుమాన్‌ || 160

కాలశాకం తండులీయం వాస్తుకం మూలకం తథా| శాకమారణ్యకం చాపి దద్యాత్పుష్పాణ్యమూనిచ || 161

జాతిచంపకలోధ్రాశ్చ మల్లికాబాణబర్బరీ | వృంతాశోకాటరూశంచ తులసీ తిలకం తథా || 162

పావంతీః శతపత్రాం చ గంధశేపాలికామపి | కుబ్జకం తగరం చైవ మృగమారణ్య కేతకీమ్‌ || 163

యూధికామతిముక్తం చ శ్రాద్ధయోగ్యాని భోద్విజాః | కమలం కుముదం పద్మం పుండరీకం చ యత్నతః || 164

ఇందీవరం కోకనదం కల్హారం చ నియోజయేత్‌ | కుష్ఠం మాంసీ బాలకంచ కుక్కటీ జతిపత్రకమ్‌ || 165

నలికోశీరముస్తం చ గ్రంధీపర్ణీ చ సుంధరీ | పునరప్యేవ మాదీని గంధయోగ్యాని చక్షతే || 166

గుగ్గులం చందనం చైవ శ్రీవాసమగురం తథా | ధూపాని పితృయోగ్యాని ఋషిగుగ్గులుమేవచ || 167

రాజమాషాంశ్చ చణకా న్మసూరాన్కోరదూషకాన్‌ | విప్రుషాన్మర్కటాంశ్చైవ కోద్రవాంశ్చైవ వర్జయేత్‌ || 168

మాహిషం చామరం మార్గ మావికైకశఫోద్భవమ్‌ | సై#్తణవమౌష్ట్ర మావికం చ దధిక్షీరం ఘృతం త్యజేత్‌ || 169

తాలం వరుణకాకోలౌ బహుపత్రార్జునీఫలమ్‌ | జంబీరం రక్తబిల్వంచ శాలస్యాపి ఫలం త్యజేత్‌ || 171

కాలేయకం తూగ్రగంధం తురుష్కం చాపి వర్జయేత్‌ | పాలకం చ కుమారీం చ కిరాతం పిండమూలకమ్‌ || 172

గృంజనం చుక్రికాం చుక్రం వరుమాం చనపత్రికామ్‌ | జీవం చ శతపుష్పాంచ నాలికాం గంధుశూకరమ్‌ || 173

హలభృత్యం సర్షపం చ పలాండుం లశునం త్యజేత్‌ | మానకందం విషకందం వజ్రకందం గరస్థికమ్‌ || 174

పురుషాల్యం సపిండాలుం శ్రాద్ధకర్మణి వర్జయేత్‌ | అలాబుం తి క్తపర్ణాంచ కూష్మాండం కటుకత్రయమ్‌ || 175

వార్తాకం శివజాతం చ లోమశాని వటాని చ | కాలీయం రక్తవాణాం చ బలాకాం లకుచం తథా || 176

శ్రాద్ధకర్మణి వర్జ్యాని విభీతక ఫలం తథా | ఆరనాలంచ శుక్తంచ శీర్ణం పర్యుషితం తథా || 177

నోగ్రగంధం చ దాతవ్యం కోవిదారకశిగ్రుకౌ | అత్యవ్లుం విచ్ఛిలం సూక్ష్మం యాత యామంచ సత్తమాః || 178

నచ దేయం గతరసం మద్యగంధం చ యాద్భవేత్‌ | హింగూగ్రగంధం ఫణిశం భూనింబం నింబరాజకే || 179

కుస్తుంబురుం కలింగోత్థం వర్జయెదవ్లువేతసమ్‌ | దాడిమం మాగధీం చైవ నాగరార్ద్రకతి త్తిడీః || 180

అమ్రాతకం జీవకం చ తుంబురుం చ నియోజయేత్‌ | పాయసం శాల్మలీముద్రా న్మోదకా దీంశ్చ భక్తితః || 181

పానకం చ రసాలం చ గోక్షీరం చ నివేదయేత్‌ | యాని చాభ్యవహార్యాణి స్వాదుప్నిగ్ధాని భోద్విజాః || 182

ఈషదవ్లుకటూన్యేవ దేయాని శ్రాద్ధకర్మణి | అత్యవ్లుం చాతిలవణ మతిరిక్త కటూని చ || 183

ఆసురాణీహ భోజ్యాని తాన్యతో దూరత స్త్యజేత్‌ | మృష్టస్నిగ్ధాని యాని స్యు రీషత్కట్వవ్లుకాని చ || 184

స్వాదూని దేవభోజ్యాని తాని శ్రాద్ధే నియోజయేత్‌ | ఛాగమాంసం వార్తికంచ తైత్తిరం శశకామిషమ్‌ || 185

శివాలావకరాజీవమాంసం శ్రాద్ధే నియోజయేత్‌ | వాఘ్రీణసం రక్తశివం లోహం శల్కసమన్వితమ్‌ || 186

సింహతుండం చ ఖడ్గంచ శ్రాద్ధే యోజ్యం తథోచ్యతే | యదప్యుక్తం మి మనునా రోహితం ప్రతియోజయేత్‌ || 187

పిండములను అగ్నియందుంచిన భోగసమృద్ధి గలుగును. భార్యకు పెట్టిన సంతానము కలుగును. మధ్య పిండము మాత్రము ఇట్లు చేయవలెను. గోవులకు పెట్టినచో మంచి తేజస్సును బడయును. ఉదకములందు వేసిన ప్రజ్ఞ కీర్తి యశస్సు కలుగును. దీర్ఘాయుర్దాయము కోరువాడు కాకులకు పెట్టవలెను. కుమారశాలను కోరువాడు కోళ్లకు పెట్టవలెను. కొందఱు పండితులు ఆగ్రభాగమునుండి పిండములనెత్తవలెననిరి. బ్రాహ్మణానుజ్ఞ పొంది పిండోద్ధరణము చేయవలెను. ఇది యథావిధిగ ఋషులు చెప్పిన శ్రాద్ధవిధానము. ఇంకొకలాగు చేసిన దోషము కలుగుటయేగాక పితృదేవతలకు ముట్టదు. యవలు వ్రీహులు తిలలు గోధుమలు శనగలు పెసలు చామలు ఆవాలు నీవారములు హస్తిశ్యామాకములు ప్రియంగులు సతూలిక ప్రాసాతిక=అణువ్రీహి ఇవిశ్రాద్ధప్రశస్తములు. మామిడికాయ ఆమ్రాతకము భిల్వము దానిమ్మ బీజపూరము ప్రాచీనామలకము పాలు కొబ్బరి పరూషకము నారంగము (నారింజ) ఖర్జూరము ద్రాక్ష నల్లవెలగ పొట్ల ప్రియాలు= చారకర్కంధువు బదరము (రేగు) వితంకతము (కానరేగు)వత్సకము=కొడిసెచెట్టు కస్తాళువు వారకము వీని పండ్లను శ్రాద్ధమునందు పెట్టవలెను. ఆవుపాలు పెరుగు నెయ్యి నువ్వుల నూనె సైంధవ లవణము సముద్ర లవణము సారసము=సరోవరజలము వీనిని నివేదింపవలెను. చందనాగురుకుంకుమాది సుగంధములను కాలశాకము= కరివేము జాజి చంపకము లొద్దుగ మల్ల బాణ కుసుమము బర్బరి అశోకము వృంతాశోకము అటరూశము మామిడి తిలకము తామర గంధ సేఫాలిక కుబ్జకము తగరముఆరణ్య మృగమనునొక జాతిపువ్వుమొగలి యూధిక ఆలిముక్తము కమలము కుముదము పద్మము పుండరీకము ప్రయత్నపూర్వకముగ కొనివచ్చి పితరుల నర్చింపవలెను. నల్లగలువ ఎఱ్ఱగలువ కల్హావారము (ఎర్రతామర) కుష్టము మాంసి బాలకము కుక్కటి జాతివశ్రకము (జాపత్రి) నశిక ఉసీర ముస్తమలు గ్రంధివర్ణి మొదలైన పరిమళద్రవ్యములు పితృప్రీతికరములు. ఆగరుగుగ్గులు చందనము శ్రీవాసము మొదలగునవి పితృ యోగ్యములైన ధూపములు. ఋషి గుగ్గులము కూడ. రాజమాషములు (బొబ్బర్లు) శనగలు మసూరములు కోర దూషకములు విప్రషములు మర్కటములు కోద్రనములు అనునివి పితృతిధియందు నిషిద్ధములు. గేదెపాలు పెరుగు. తాటిపండు జంబీరము ఎర్రమారేడుపండు శాలఫలము నిషిద్దములు. చేప పంది తాబేలు ఆవు అనువాని మాంసములు మిక్కిలి వర్జ్యములు. పూతికము మృగనాభి గోరోచనం పద్మచందనము కాలేయకము ఉగ్రగంథము తురుష్కము పాలంకము వరుమచనుపత్రిక కుమారి కిరాతము పిండమూలికము గ్రుంజనము చుక్రికచుక్రము జీవశతపుష్ప నాలిక గంధశూకరము హలభృత్యము సర్షపము నీరుల్లి వెల్లుల్లి మానకందము విషకందము వజ్రకందము గదాస్థికము పురుషాల్వము పిండాలువు నిషిద్ధములు. ఆనప తిక్తపర్ణ గుమ్మడి(త్రికటుకము) కరకతిండి ఉసిరికను వార్తకము (వంకాయ) శివిజాతము. కాలీయము రక్తవాణ చిలికలకుచము విభీతకఫలము (తాండ్రము) ఆరనాలము. శుక్తము శీర్ణము పర్యుషితము ఉగ్రగంథము కోవిదారము (కాంచనవృక్షము) శిగ్రువు(ములగ)పనికిరావు.మిక్కిలిపులుపు పిచ్ఛిలము. సూక్ష్మము యాతయామము గతరనము మద్యగంధము ఇంగువచే నుగ్రగంధమైన పదార్థములుఫణిశము భూనింబము నింబము రాజికము కలింగదేశపుకుస్తుంబరువు(కొత్తిమిర)అవ్లుకేతనము(పుల్లప్రబ్బ)నిషిద్ధములు. దానిమ్మ మాగది నాగరము ఆర్ద్రక తిత్తిడి అమ్రాతకము జీవకము తుంబురువు అనునవి వినియోగింపవచ్చును. పాసము శాల్మలీముద్రములు (కజ్జికాయలు) మోచకాదులు పానకము తియ్యమామిడి పండ్లు ఆవుపాలు ప్రశస్తములు. రుచిగల్గి స్నిగ్ధములుకొలదిపులుపు కొలదికారము గల పదార్థములు ప్రశస్తములు. కాఱువులుపు కాఱు ఉప్పు మిక్కిలి చేదు కారము గల ఆసుహారములను దరికి చేరనీయరాదు. స్వాదువులై దైవభోజ్యములయిన వానినే యేర్పరుపవలెను. మేక కార్తిక పక్షి తిత్తిరి కుందేలు మున్నగువాని మాంసములు పెట్టవచ్చును. వాఘ్రాణసము రక్తశివము శల్కముతోగూడిన లోహము సింహతుండము ఖడ్గము ననునవి యోజ్యములు. రోహితమునుఉ (చేపను) హన్యకవ్యములందు పెట్టవచ్చునని మనువు చెప్పెను.

యోక్తవ్యం హవ్యకవ్యేషు తథా న విప్రయోజియేత్‌ | ఏవముక్తం మయా విప్రా వారాహేణావలోకితమ్‌ || 188

మయా నిషిద్ధం భుజానో రౌరవం నరకం వ్రజేత్‌ || ఏతాని చ నిషిద్ధాని వారాహేణ తపోధనాః || 189

అభక్ష్యాణి ద్విజాతీనాం నదేయాని పితృష్వపి | రోహితం శూకరం కూర్మం గోధామాంసం చ వర్జయేత్‌ || 190

చక్రవాకం చ మద్గుంచ శల్యహీనాంశ్చ మత్స్యకాన్‌ | కురరం చ నిరస్థించ వాసహాతం చ(?)కుక్కుటాన్‌ || 191

కలవింకమయూరాంశ్చ భారద్వాజాంజాంశ్చ శార్జకాన్‌ | నకులోలూకమార్జారాం ల్లోపానన్యాన్సుదుర్గహాన్‌ || 192

టిట్టిభాన్సార్థ జంబూకా న్వ్యాఘ్రఋక్షతరక్షుకాన్‌ |ఏతానన్యాంశ్చ సందుష్టా న్యో భక్షయతి దుర్మతిః || 193

స మహాపాపకారీ తు రౌరవం నరకం వ్రజేత్‌ | పిపృష్వేతాంస్తు యో దద్యా త్పాపాత్మా గర్హితామిషాన్‌ || 194

స స్వర్గస్థానపి పితౄ న్నరకే పాతయిష్యతి | కుసుంభశాకం జంబీరం సిగ్రుకం కోపిదారకమ్‌ || 195

పిణ్యాకం విప్రుషం చైవ మసూరం గృంజనం శణమ్‌ | కోద్రవం కోకిలాక్షం చ చక్రం కంబుక పద్మకమ్‌|| 196

చకోర శ్యేనమాంసం చ వర్తులాలాబుతాలినీమ్‌ | ఫలం తాలతరూణాం చ భుక్త్వా నరక మృచ్ఛతి || 197

దత్త్వా పితృషు తైః సార్ధం వ్రజేత్పూయవహం నరః | తస్మాత్సర్వ ప్రయత్నేన నా೭೭హరేత్తు విచక్షణః || 198

నిషిద్ధాని వరాహేణ స్వయం పిత్రర్ధమాదరాత్‌ | వరమేవా೭೭త్మ మాంసస్య భక్షణం మునయః కృతమ్‌ || 199

న త్వేవ హి నిషిద్ధానా మాదానం పుంభిరాదరాత్‌ | అజ్ఞానాద్వా ప్రమాదాద్వా సకృదేతాని చ ద్విజాః || 200

ఈ శ్రాద్ధకల్పము వారాహునిచేత తృష్టము దీతికి వారహశ్రాద్ధకల్పమను ప్రసిద్ధి కలదు. ఇందు నిషిద్ధపదార్ధములను శ్రాద్ధములందు బ్రాహ్మణులకు పెట్టరాదు. తినరాదు. రోహితము శూకరము తాబేలు ఉడుము మాంసముపనికిరాదు. చక్రవాకము మద్గువు=నీటికాకి ఎముకలులేని చేపలు ఎముక లేని కురరము = కురలపక్షి కలవింకము = ఊరపిచ్చుక నెమలి భారాద్వాజపక్షి శార్జకపక్షి ముంగిస గుడ్లగూబ తిత్తిరిపక్షి నక్క పెద్దపులి ఎలుగొడ్డు

తరక్షువు ఈ పదార్ధములు పెట్టిన రౌరవ నరకము వచ్చును. అదిగాక స్వర్గమునందున్న పితృదేవతలును కూడ నరకమున బడవేయుదురు. కుసుంభశాకము జంబీరము సిగ్రుకము కోవిదారము పిణ్యాకము(తెలకపిండి)విప్రుషము మసూరము. గుంజనము శణము కోద్రవము కోకిలాక్షము చక్రము కంబుకము పద్మకము చకోరము డేగ గుండ్రానపుకాయ తాళిని తాటుపండు నివి నరక ప్రదములు. వానిని పెట్టిన యజమాని పితృదేవతలతో బాటు పూయవహమను నరకమున బడును. వరాహశ్రాద్ధ కల్ప నిషిద్ధములైన యీ వస్తవులను పెట్టి తినుటకంటె ఆత్మమాంస భక్షణము సేయుట మేలు. పొరబాటుచే తెలియక యివి పెట్టినను తిన్నను ప్రయశ్చిత్తము చేసుకొనవలెను.

భక్షితాసి నిషిద్ధాని ప్రాయశ్చిత్తం తతశ్చరేత్‌ | ఫలమూలదధిక్షీర తక్రగోమూత్రయావకైః || 201

భోజ్యాన్న భోజ్యసంభు క్తే ప్రల్యేకం దినసప్తకమ్‌ | ఏవం నిషిద్ధాచరణ కృలే సకృదపి ద్విజైః || 202

శుద్ధిం నేవం శరీరం తు విష్ణుభ##క్తైర్విశేషతః | నిషిద్ధం వర్జయేద్ద్రవ్యం యథోక్తం చ ద్విజోత్తమాః || 203

సమాహృత్య తతః శ్రాద్ధం కర్తవ్యం నిజశక్తితః |

ఏవం విధానతః శ్రాద్ధం కృత్వా స్వవిభవోచితమ్‌ | ఆబ్రహ్మస్తంబ పర్యంతం జగత్ప్రీణాతి మానవః || 204

మునయ ఊచుః

పితా జీవతి యస్యాథ మృతౌ ద్వౌ పితరౌ పితుః | కధం శ్రాద్ధం హి కర్తవ్య మేతద్విస్తరశో వద || 205

వ్యాస ఉవాచ

యసై#్మ దద్యాత్పితా శ్రాద్దం తసై#్మ దద్యా త్సుతః స్వయమ్‌ | ఏవం న హీయలే ధర్మో లౌకికో వైదికస్తథా|| 206

మునయ ఊచు

మృతః పితా జీవతి చ యస్య బ్రహ్మన్పితామహః | స హి శ్రాద్ధం కథం కుర్యా దేతత్త్వం వక్తుమర్హసి || 207

వ్యాస ఉవాచ

పితుః పిండం ప్రదద్యాచ్చ భోజయేచ్చ పితామహమ్‌ | ప్రపితా మహస్య పిండంవై హ్యయం శాస్త్రేఘ నిర్ణయః ||

మృతేషుపిండం దాతవ్యం జీవంతం చాపి భోజయేత్‌ | సపిండీకరణం నాస్తి న చ పార్వణ మిష్యలే || 209

ఆజారమాచరేద్యస్తు పితృమేధాశ్రితం నరః | అయుషా ధన పుత్రైశ్చ వర్ధత్యాశు న సంశయః || 210

పితృమేధాధ్యాయ మిమం శ్రాద్ధకాలేషు యః పఠేత్‌ | తదన్న మస్య పితరోశ్నంతి చ త్రియుగం ద్విజాః || 211

ఏవం మయోక్తః పితృమేధకల్పః పాపాపహః పుణ్యవివర్ధనశ్చ |

శ్రోతవ్య ఏష ప్రయతైర్నరైశ్చ శ్రాద్ధేఘ చైవాప్యను కీర్తయేత || 212

ఇతి శ్రీ మహాపురాణ ఆదిబ్రాహ్మే వ్యాసర్షిసంవాదే శ్రాద్ధకల్ప నిరూపణం నామ వింశత్యధికద్విశతతమోధ్యాయః

ప్రాయశ్ఛిత్తములు

పళ్ళు దుంపలు పాలు పెరుగు మజ్జిగ గోమూత్రము గంజి ఏడురోజులు తీసుకొనినచో అభోజ్యాన్న భోజన దోషము పోవును. మరియొక విశేషము. విష్ణుభక్తుడు విధివిధానముగ నిట్లు శ్రాద్ధము పెట్టి ఆబ్రాహ్మస్తంబ పర్యంతమైన జగత్తును సంప్రీతి నందించును.

మునులు-తండ్రి బ్రతికియుండగ డండ్రియొక్క తలిదండ్రులు పోయినపుడు చేయవలసిన విధానమేమన తండ్రి బ్రతికియుండి ఎవనికి తద్దినము పెట్టునో కొడుకు దానిని స్వయముగ పెట్టవలెను. లౌకిక వైధిక ధర్మములు రెండును దీనివలన లోపింపవు. (తండ్రి తన తండ్రికి తద్దినము పెట్టుచుండ కొడుకు తాతకు తద్దినము పెట్టనక్కర లేదన్నమాట) తండ్రి పోయి పితామహుడు బ్రతికియున్నప్పుడు కొడుకు తండ్రికి పిండమువేసి పితామహునిచే భుజింపజేయవలెను. ప్రపితామహునినుద్ధేశించి పిండిమును వేయవలెను. ఇది శాస్త్రనిర్ణయము. పోయినవారికి పిండము పెట్టవలెను. ఉన్నవారికి అన్నము పెట్టవలెను. సపిండీకరణము పార్వణశ్రాద్ధము వీనియందు లేవు. పితృమేధ కల్పమనుసరించి ఆచారము పాటించినవాడు ధనధాన్య ఆయురారోగ్య పుత్రపౌత్రాదులతో వర్థిల్లును. ఈ పితృమేధాధ్యాయమును శ్రాద్ధకాలమందు పఠించినయెడల ఆ యజమాని ఇడిన అన్నమును పితృదేవతలు మూడుయుగము లనుభవింతురు. ఈపితృమేథకల్పము పాపహరము. పుణ్యవివర్థనము శ్రాద్ధములందు దీనిని కీర్తింపవలెను. శ్రద్ధతో వినవలెను.

ఇది బ్రాహ్మపురాణమందు శ్రాద్ధకల్పనిరూపణమందు రెండువందల ఇరువదియవ అధ్యాయము.

Brahmapuranamu    Chapters