Brahmapuranamu    Chapters   

అథఅష్టాదశాధికద్విశతతమో7ధ్యాయః

అన్నదానప్రశంసా

మునయఊచుః

అధర్మస్య గతిర్బ్రహ్మ న్కథితా నస్త్వయా7నఘ|ధర్మస్య చ గతిం శ్రోతు మిచ్ఛామో వదతాం వర || 1

కృత్వాపాపాని కార్మాణి కథం యార్తత్యశుభాం గతమ్‌|కర్మణాచ కృతేనేహ కేవయాంతి శుభాం గతిమ్‌ || 2

వ్యాసఉవాచ

కృత్వాపాపాని కర్మాణి త్వధర్మవశమాగతః|మనసా విపరీతేన నిరయం ప్రతిపద్యతే || 3

మోహాదధర్మయయః కృత్వా పునః సమనుతప్యతే | మనఃసమాధిసంయుక్తో నస నేవేత దుష్కృతమ్‌ || 4

యథా యథా మనస్తన్య దుష్కృతం కర్మగర్హతే | తథా తథా శరీరంతు తేనాధర్మేణ ముఛ్యతే || 5

యది విప్రాః కథ్యతే విప్రాణాం ధర్మవాదినామ్‌ | తతో7ధర్మకృతాతిక్షప్ర మపరాధా త్ప్రముచ్యతే || 6

యథా యథా నరఃసమ్య గధర్మమనుభాషతే | సమాహితేన మనసా విముంచతి తథాతథా || 7

భుజంగ ఇవనిర్మోకా న్పూర్వభుక్తా న్జహాతితాన్‌|దత్త్వా విప్రస్య దానాని వివిధాని సమాహితః || 8

మనఃసమాధిసంయుక్తః సుగతిం ప్రతిపద్యలే|దానాని తు ప్రవక్ష్యామి యాని దత్త్వా ద్విజోత్తమాః || 9

నరః కృత్వా7ప్యకర్మాణి నహి పాపేన యుజ్యతే | సర్వేషామేవ దానావా మన్నం శ్రేష్ఠముదాహృతమ్‌ || 10

సర్వమన్నం ప్రదాతవ్వ మృజునా ధర్మమిచ్ఛతా | ప్రాణా హ్యాన్నం మనుష్యోణాం తస్మాజ్జంతుః ప్రజాయతే || 11

అన్నదానప్రశంస

మునులిట్లనిరి. నీవు అధర్మమువలన గలుగు గతులనుగూర్చి తెల్పితివి. ధర్మగతులంగూర్చి వినగోరెదము. ఏ పనిచేసి యశుభగతినిపొందు దేనిచే శుభగతినందునో యానతిమ్మన వ్యాసుడిట్లనియె. పాపపుపనుల ధర్మపరుడై విపరీత మనస్సుతో జేసినవాడు నరక మందును పొరబడి యధర్మముసేసి పశ్చాత్తాపబడి మనస్సును కుదుట బెట్టుకొన్నవాడు పాపముననుభవింపడు. ఎంతెంతవరకు వాని మనస్సు దుష్కర్మమును గర్హించునో అంతంతవరకు వానియుపాధి (శరీరము) యాధర్మమునుండి నిడివడును. చేసిన తప్పును ధర్మవాదులగు విప్రులకు దెల్పినయెడల అధర్మమువలన జేసిన యపరాధమునుండి వేగముగ ముక్తుడగును. మానవుడు తానుజేసిన తప్పిదమును మనసు సమాధాన పరచుకొని నలుగురలో వెల్లడించు కొన్నకొలది యతుడు దానినుండి విడివడును. పాముకుబునమును విడిచినట్లు పూర్వమనుభవించిన పాప ఫలములనుండి విమోచనమందును. మనస్సమాధితో విప్రునికివివిధ దానములు సేసినయతడు సుగతినందును. మానవుడు పాపమాచరించియు తత్పల మనుభవింపకుండుటకు జేయవలసిన దానములను దెల్పెద వినుండు.

అన్నే ప్రతిష్టితా లోక్తా స్తస్మాదన్నం ప్రశస్యతే| అన్న మేవ ప్రశంసంతి దేవర్షిపితృమానవాః || 12

అన్నత్య హిప్రదాదేవ స్వర్గ మాప్నోతి మానవమానవః| యాల్లవభ్యం ద్విజాతిభో77న్నముత్తమమ్‌||

స్వాధ్యాయనము పేతేభ్యః ప్రహృష్టే నాంతరాత్మనా|యస్య త్వన్నముపాశ్వతి బ్రాహ్మణాశ్చ సకృద్దశ || 14

సృష్టేన మనసా దత్తం నసి తిర్యగ్గతిర్భవేత్‌| భ్రాహ్మణానాం పహస్రాణి దశా

77భోజ్య ద్విజోత్తమాః || 15

సరో7ధర్మాత్ర్పముచ్యేత పాపే ష్వభిరతః సదా||భై క్షేణాన్నం సమాహృత్యం విప్రో వేద పురస్కృతః|| 16

హ్వధ్యాయనిరతే విప్రేదత్త్వేహ సుఖమేధతే| అహింసన్భ్రాహ్మణస్వామి న్యాయేన పరిపాల్య చ|| 17

క్షత్రియ స్తరసా ప్రాప్త మన్నంయో వై ప్రయచ్ఛతి|ద్విజోభ్యో వేదముఖేభ్యః ప్రయతః సుసమాహితః || 18

తేనాపోహతి ధర్మాత్మా దుష్కృతం కర్మ భోద్వితాః| షడ్భాగపరిశుద్ధంచ కృషేర్భాగముపార్టితమ్‌ || 19

వైశ్యో దదద్ధ్విజాతిభ్యః పాపేభ్యః పరిముచ్చతే| అవాస్య ప్రాణసందేహం కార్కశ్యేన సమార్జితమ్‌ || 20

అన్నం దత్వా ద్విజాతిభ్యః శూద్రః పాపాత్ర్పముచ్యతే| ఔర సేన బలేనాన్న ముర్జయిత్వా విహింసకః || 21

యః ప్రయచ్ఛతి విప్రోభ్యో న స దుర్గాణి సేవతే| న్యాయేనావా ప్తమున్నంతు సరో హర్ష సమున్వితః || 22

ద్విజేభ్యో వేదవృధ్దేభ్యో దత్త్వాపాపాత్ర్పముచ్యతే| అన్న మూర్జస్కరం లోకే దల్త్వోర్జస్వీ భ##వేన్నరః || 23

సతాం పంథాన మావృత్య సర్వపాపైః ప్రముచ్యతే| దానివిద్భిః కృతః పంథా యేన యాంతి మనీషిణః || 24

తేష్వప్నన్నస్య దాతార స్తేభ్యో ధర్మః సనాతనః | సర్వావస్థం మనుష్యేణ న్యాయేనాన్న ముపార్జితమ్‌|| 25

కార్వాన్న్యాయగతం నిత్య మన్నంహి పరమ్యాతిః | అన్నన్య హి ప్రదానేన సరోయాతి పరాం గతిమ్‌ || 26

సర్వకామసమాయుక్త ః ప్రేత్య చాప్యశ్వుతే సుఖమ్‌| ఏవం పుణ్య సమాయు క్తో నరః పాపై ః ప్రముచ్యతే || 27

తస్మాదనం ప్రదాతవ్య మన్వాయ పరివర్జితమ్‌|యస్తు ప్రాణాహుతీపూర్వ మన్నం భుం క్తే గృహీసదా || 28

అబంధ్యం దివసం కుర్వా దన్నదానేవ మానవః| భోజయిత్వా శతం నిత్యం నరో వేదవిదాం వరమ్‌|| 29

న్యాయవిద్ధర్మవిదుషా మితిహాసవిదాం తథాఃనాయాతి నరకం ఘోరం సంసారం నచ సేవతే || 30

సర్వకామసమాయ క్తః ప్రేత్య చాప్యశ్ను తే సుఖమ్‌|ఏవం కర్మ సమాయు క్తో రమతే విగతజ్వర ః || 31

రూపవాన్కీర్తిమాం శై వ ధనవాంశ్చో పాయతే| ఎతధ్వః ఎతద్వః సర్వమాఖ్యాత మన్నదానఫలం మహత్‌||

మూల మేతత్తు ధర్మాణాం ప్రధానానాం చ భోద్విజాః || 32

ఇతి శ్రీమహాపురాణ అదిబ్రాహ్మే వ్యాసర్షి సంవాదే నంసారచక్రే అన్నదాన ప్రశంసావర్ణనం నామ

అష్టాదశాధిక ద్విశతతమో7ధ్యాయః

అన్నిదానములకంటే నన్నదానము మిన్న . ధర్మపేక్ష కవాలడు పక్రముగాని బుద్దితో సర్వాన్నదానము పేయనగును. మునుజులకు ప్రోణమున్నముగదా! అన్నమువలననే జీవుడు పుట్టును. లోకము అన్న మునందు బ్రతిష్టితములయి యున్నవి. (బ్రతుకలతయు నన్నముమీద నాధారపడి యున్నదన్నమాట!) అందువలన నన్నము ప్రశంసార్హమగును. దేవర్షి పితృ మానవులన్నమునే మెచ్చుకొందురు. అన్నదానముచే స్వర్గమందును. ఎంతలభించు నంతయున్నము ద్విజులకు బెట్టవలెను. నిండు మనసుతో వేదాధ్యయన సంపన్నులగు బ్రాహ్మణుల కనదానము నియవలెను. అక్కమారైన బది మంది బ్రాహ్మణు లెవ్వడు వెట్టిన యన్నమారగింతురో మారగింతురో మనస్పూర్తిగా నట్లేట్టినవాడు పశుపక్ష్యాది జన్మములెత్తడు. పదివేల మంది బ్రాహ్మణులకు అన్నసంతర్పము గావించినాతడు మున్నుపొపరహితుడై చేసిన యధర్మమునుండి విముక్తి నందును. వేదములుసదివి భిక్షాటనము నేసికొని తెచ్చిన యన్నమును వేదవేత్తయగు విప్రునికి బెట్టిన వాడిమలోకమున సుఖాభివృద్ధినందును. క్షత్రియుడు బ్రాహ్మణ ద్రవ్యమునకు హాని సేయక న్యాయ జరిపాలన సేయుచు సుసమాహితమున సుఖాభివృద్ధినందును. క్షత్రియుడు బ్రాహ్మణ ద్రవ్యమునకు హానిసేయక న్యాయ బరిపాలన సేయుచు సుసమాహితమనస్కుడై వేదవిదులయిన ద్విజులకు బలాత్కారముగ లభించిన యన్నమును దానము నేసినయెడల నీతడు ధర్మాత్ముడై రానముచే జేసిన దుష్కర్మనెడబావుకొనును. కృషి(వ్యవసాయము)సేసి వైశ్యుడార్జించుకొన్న ద్రవ్యమారవ వంతుగ బదిశుద్దమైనదానిని ద్విజులకు దానముసేసి పాపవిముక్తుడగును. శూద్రులు ద్విజాతులకు అన్నదానముసేసి పాపవిముక్తుడగును. ప్రాణములిక పోవునన్న సమయమున శూద్రుడు కర్కశుడై (కఠినుడై) సంపాదించిన అన్నమును కన్న కొడుకుచే గూడబెట్టించి యన్నము విప్రులకు బెట్టినవాడు దుర్గమును (కడువరాని కష్టముల) దాటును. న్యాయార్జితమైన యన్నమును ఆనందముతో వేదవృద్దులయిన విప్రులకు విందుసేసినవాడు పాపముంబాయును. అన్నము లోకమందు ఊర్జస్కరము. కావున దానిని బెట్టినవాడు ఊర్జస్వియగును. సత్పురుషులేగిన దారిగేగినవాడు సర్వ పాప విముక్తుడగును. దానధర్మమెఱింగిన వారేర్పరచిన దారిం బుద్ధిమంతులేగుదురు. అందులోగూడ అన్నదాతలుత్తములు. వారివలననే సనాతన ధర్మము నిలుచును.

అందువలన నన్నదానము న్యాయము దప్పకుండ జేయవలసినది. ఏ గృహస్థు ముందు ప్రాణాహుతులు సేసి యన్న మారగించునో ఎవ్వడన్నదానముచేరోజును (అవంభ్యమును=గొడ్డువూనిదానిగ) సార్థకమైనదానిం గావించునో నిత్యము వేదవిదులను ధర్మవేత్తలను ఇతిమాసపురాణ విదులను నూరుమందిని విందారగింపజేయునో యతడు ఘోరనరకముపాలుగాడు. సంసారమునంబడడు. చనిపోయిన నతడు సర్వకామ్య సాఫల్యమంది సుఖమందును. ఇట్లు సత్కర్మ నమన్వితుడై యేబాధలులేకుండా నానందపడును. చక్కనివాడు కీర్తిశాలి ధనవంతుడునై మరుజన్మమందును. మీకిట్లన్న దాన మహాఫలమంతయు చెలిపితిని. సర్వధర్మములకు దానములకును మూలమిదియే.

ఇది బ్రహ్మపురాణముమందు అన్నదాన ప్రశంసమను రెండువందల పదునెన్నిదవ యధ్యాయము.

Brahmapuranamu    Chapters