Brahmapuranamu    Chapters   

అథపంచదశాధికద్విశతతమో7ధ్యాయః

దక్షిణమార్గవర్ణనమ్‌

మునయఊచుః

కథం దక్షిణమార్గేణ విశంతి పాపినః పురమ్‌ | శ్రోతుమిచ్ఛామ తద్రృహి విస్తరేణ తపోధన || 1

వ్యాసఉవాచ

సుఘోరం తన్మహోఘోరం ద్వారం వక్ష్యామి భీషణమ్‌ | నానాశ్వాపదసంకీర్ణం శివాశత నినాదితమ్‌ || 2

ఫేత్కారరవసంయుక్త మగమ్యం లోమహర్షణమ్‌ | భూతప్రేతపిశాచైశ్చ వృతం చాన్యైశ్చ రాక్షసైః || 3

ఏవం దృష్ట్వా సదూరాంతే ద్వారం దుష్కృతకారిణః | మోహం గచ్ఛంతి సహసా త్రాసాద్దిప్రలపంతిచ || 4

తతస్తాన్‌శృంఖలైః పాశైః ర్బద్ధ్వా కర్షంతి నిర్భయాః | తాడయంతిచ దండైశ్చ భర్త్సయంతి పునః పునః || 5

లబ్దసంజ్ఞా స్తత స్తే వై రుధిరేణ పరిప్లుతాః | ప్రజంతి దక్షిణం ద్వారం ప్రస్ఖలంతః పదేపదే || 6

తీవ్రకంటకయు క్తేన శర్కరానిచితేనచ | క్షురధారానిభై స్తీక్షెణౖః పాషాణౖర్నిచితేనచ || 7

క్వచింత్పంకేన నిచితా నిరుత్తారైశ్చ ఖాతకైః | లోహసూచీర్నిభైర్దంతైః సంచిన్నేన క్వచిత్క్వచిత్‌ || 8

తటప్రపాతవిషమైః పర్వతైర్వృక్షసంకులైః | ప్రతప్తాంగారయుక్తేన యాంతి మార్గేణ దుఃఖతాః || 9

క్వచిద్విషమగర్తాభిః క్వచిల్లోష్టైః సుపిచ్ఛలైః | సుతప్తవాలుకాభిశ్చ తథా తీక్షెణౖశ్చ శంకుభిః || 10

అయఃశృంగాటకైస్తపై#్తః క్వచిద్దావాగ్నినా యుతమ్‌ | క్వచిత్తప్తశిలాభిశ్చ క్వచిద్వ్యాప్తం హిమేన చ || 11

క్వచిద్వాలుకయా వ్యాప్త మాకంఠాంతః ప్రవేశయా | క్వచిద్దుష్టాంబునా వ్యాప్తం క్వచిత్కర్షాగ్నినా పునః || 12

క్వచిత్సింహైర్వృకైర్వ్యాఘ్రై ర్దంశకీటైశ్చ వారుణౖః | క్వచిన్మహాజలౌకాభిః క్వచిదజగరైః పునః || 13

మక్షికాభిశ్చ రౌన్రాభిః క్వచిత్సర్పైర్విషోల్బణౖః | క్వచిద్దుష్టగజైశ్చైవ బలోన్మత్తైః ప్రమాథిభిః || 14

పంథానముల్లిఖద్భిశ్చ తీక్షణశృంగైర్మహావృషైః | మహాశృంగైంశ్చ మహిషై రుష్ట్రైర్మత్తైశ్చ ఖాదనైః || 15

ఢాకినీభిశ్చ రౌద్రాభిర్వికరాలైశ్చ రాక్షసైః | వ్యాధిభిశ్చ మహారౌద్రైః పీడ్యమానా వ్రజంతితే || 16

మహాధూళివిమిశ్రేణ మహాచండేన వాయునా | మహాపాషాణవర్షేణ హన్యమానా నిరాశ్రయాః || 17

క్వచిద్విద్యున్నిపాతేన దీర్యమాణా వ్రజంతితే | మహతాబాణవర్షేణ భిద్యమానాశ్చ సర్వశః || 18

పతద్భిర్వజ్రనిర్ఘాతై రుల్కాపాతైః సుదారుణౖః | ప్రదీప్తాంగారవర్షేణ దహ్యమానా విశంతి చ || 19

మహతా పాంశువర్షేణ పూర్వమాణా రుదంతి చ | మేఘారవైః సుఘోరైశ్చ విత్రాస్యంతే మహుర్ముహుః || 20

నిఃశేషాః శరవర్షేణ చూర్ణ్యమానాశ్చ సర్వతః | మాహాక్షారాంబుధారాభిః సిచ్యమానా వ్రజంతి చ || 21

మహాశీతేన మరుతా రూక్షేణపరుషేణ చ | సమంతాద్దీర్యమాణాశ్చ శుష్యంతే సంకుచంతి చ || 22

ఇత్థం మార్గేణ పురుషాః పాథేయరహితేన చ | నిరాలంబేన దుర్గేణ నిర్జలేన సమంతతః || 23

అతిశ్రమేణ మహతా నిర్గతేనా7శ్రమాయవై | నీయంతే దేహినః సర్వే యే మూఢాః పాపకర్మిణః || 24

యమదూతైర్మహాఘోరై స్తదాజ్ఞాకారిభిర్బలాత్‌ | ఏకాకినః పరాధీనా మిత్రబందువవర్జితాః || 25

శోచంతః స్వానికర్మాణి రుదంతి చ ముహుర్ముహుః | ప్రేతీభూతానిషిద్ధాస్తే శుష్కకంఠౌష్ఠతాలుకాః || 26

కృశాంగాః భీతభీతాశ్చ దహ్యమానాః క్షుధాగ్నినా | బద్ధాః శృంఖలయా కేచి త్కేచిదుత్తానపాదయోః || 27

ఆకృష్యంతే శుష్యమాణా యమదూతై ర్బలోత్కటైః | నరా అధోముఖాశ్చాన్యే కృషమాణాః సుదుఃఖితాః || 28

ఆన్నపానీయరహితా యాచమానాః పునః పునః | దేహి దేహీతి భాషంతః సాశ్రుగద్గదయా గిరా || 29

కృతాంజలిపుటా దీనాః క్షుత్తృష్ణాపరిపీడితాః | భక్ష్యానుచ్చావచాన్దృష్ట్వా భోజ్యాన్పేయాంశ్చ పుష్కలాన్‌ || 30

సుగంధద్రవ్యసంయుక్తా న్యాచమానాః పునః పునః | దధిక్షీరఘృతోన్మిశ్రం దృష్ట్వా శాల్యోదనం తథా || 31

పానాని చ సుగంధీవి శీతలాన్యుదకాని చ | తాన్యాచమానాంస్తే యామ్యా భర్త్సయంతి స్తసుదారుణాః ||

వచోభిః వరుషైర్భీమాః క్రోధరక్తాంత లోచనాః || 32

దక్షిణమార్గ వర్ణనము

మునులు తపోథనా! పాపులు దక్షిణ మార్గముననెట్లు వోదురో సవిస్తరముగ నానతిమ్మన వ్యాసులిట్లనియె. ఆ మార్గము ఘోరాతిఘోరము. ఆద్వారము ఘూతుకమృగ సంకులము. భయంకరము. నక్కలయరపులతో బ్రతిథ్వనించును. అగమ్యము. భూతప్రేత పిశాచ రాక్షసంకీర్ణము. తలచికొన్నతనువు గగుర్పాటు చెందును. పాపులాద్వారముం దూరాననే కని బెదరి ప్రేలాపన సేయుచు మూర్చపడుదురు. అటుపై యమభటులు వారింగొట్టుచు సంకెళ్లం బాశములం గట్టి యీడ్చుచు దండములం బెదరింతురు. ఆజీవులు తెలివొంది రక్తమునందడిసి యడుగడుగునం దడవడుచు దక్షిణ ద్వారముంజొత్తురు. ఆదారి ముండ్లతో గులకరాళ్లతో కత్తులతో బాషాణములతో నొక్కెడబురదతో దాటరాని గోతులతో నినుప సూదులట్టి దంతములతో దుర్గమమయి యుండును. అందు జీవులు దుఃఖించుచు ఒడ్డులం గూల్చు కొండలు చెట్లతో నిప్పులతో గూడిన దారింబోదురు. కొన్నియెదల నొరకములు కొన్నియెడల మట్టిపెళ్లలు కణకణలాడు నిసుక పదునైన శంకువులు సలసలకాగు నేలతోడి నలుదారులు కలిసిన బాటలు కాలిన షాషాణములు కొన్నియెడల మంచుతో పీకదాక దిగిపోవు నిసుక మేటలతో ముఱుగు నీటితో గనగదే మండు నిప్పులతో గూడియుండును. సింహములు తోడేళ్ళు ఈగలు దోమలు దారుణములయిన పురుగులు నొక్కెడ పెద్దపెద్ద జలగలు మీద కొండచిలువలు కందురీగలు విషముగ్రక్కు పాములు దుష్టగ్గములు పదునైన కొమ్ములతో దారినేలరాయు నెడ్లతో దున్నలతో నొంటెలతో గూడి యుండును. రౌద్రములయిన ఢాకినిశాకిన్యాది పిశాచములు రాక్షసులు వ్యాధులు పీడింప నాదారింబీడితులై పోవుదురు. మహాధూళిగ్రమ్మ మహాప్రచండ వాయువులువీవ మహాపాషాణములు వరిక్షంచుచుండ యమభటులు బాదుచుండ నిలువ నీడగానక నొక్కెడ పిడుగుపాటున నొడలు పగుల బాణవరక్షమున బ్రద్దలుకాగా దారుణముగ గొఱవులు పడుచుండ పైని నిప్పులు గురియుచుండ నాదారిం జనుదురు. పెనుధూళి కురియుచుండ నందు బ్రుంగి యేడ్తురు. మేఘముల యురుముల కడలిపోవుదురు. బాణ వర్షములచే జూర్ణమై పోయెదరు. పెద్ద యుప్పునీటి దారలం దడియుచు పుండు వంటి చలిగాలికి బిగియుచు పగులుచు నొగులుచు నాదారి నాకలివడి తినుటకేమియు లేక గుములుచు నిరాలంబము నిర్జలమునైన యా దుర్గమయమమార్గమునంబడి అతిశ్రమ గుడుచుచు దేహులు మూఢులు పాపాత్ము లావెంటం జనియెదరు. యమునాజ్ఞంగొని దూతలతిఘోరరూపు లీడ్వ నొంటరిగ పరాధీనులై బంధుమిత్రాదులు లేక తాము మున్ను జేసిన పాపములకు మఱిమఱి యేడ్చుచు నడుమనడుమ యమభటులు యమభటులు నోరెత్తవలదని కొట్టుచుండ నోరు నాలుక యెండ ప్రేతలై నొగులుదురు. బక్కచిక్కిన మేనులతో జడిసిజడిసి పోవుచు నాకలి చిచ్చునకు దహింపబడుచు సంకెళ్ళం బంధితులై కొందరు తలక్రిందుగా పాదములు మీదుగా గైకొని దూతలచే యీడ్వబడుదురు. కొందరు మొగము క్రిందుగా నీడ్వబది యేడ్తురు. అన్నము నీరు లేక మఱిమఱి దేహిదేహి అని అడుగుకొనుచు కంట నీర్వెట్టుచు గద్గదికతో జేతులు మొగిచి దీనులై ఆకలిదప్పులం గుమిలి మంచి భక్ష్యములు పేయములు భోజ్యములు గమగమ వాసనలు జిమ్ముచుండ జూచుచు మఱిమఱి ప్రాధేయపడి యడిగికొమచు పెరుగు పాలు నెయ్యియుం గలిపిన యన్నముం జూచి సుగంధభరిత పానీయములం జల్లని నీరుంగని యమదూతలం బిక్కమొగము వెట్టి యాచించికొనుచుందురు. వారింగని యమదూతలు భయంకరులు క్రోధమున గనుకెలకు లెఱ్ఱవడ బెదరించుచు నిట్లందురు.

యామ్యా ఊచుః

న భవద్భిర్హుతం కాలేన దత్తం బ్రాహ్మణషు చ | ప్రసభం దీయమానాం చ వారితం చ ద్విజాతిషు || 33

తస్య పాపస్య చ ఫలం భవతాం సముపాగతమ్‌ | నాగ్నౌదగ్ధం జలే నష్టం న హృతం నృవతస్కరైః || 34

తేతో వా సాంప్రతం విప్రే యన్నదత్తం పురా7ధమాః | యైర్దత్తాని తు దానాని సాధుభిః సాత్త్వికాని తు || 35

కషామేతే ప్రదృశ్యంతే కల్పితా హ్యన్నపర్వతాః | భక్ష్యభోజ్యాశ్చ పేయాశ్చ లేహ్యాశ్చోష్యాశ్చ సంవృతాః || 36

నయూయమభిలప్స్యథ్వే న దత్తం చ కథంచన | యైస్తు దత్తం హుతంచేష్టం బ్రాహ్మణాశ్చైవ పూజితాః || 37

తేషామన్నం సమానీయ ఇహ నిక్షిప్యతే సదా | పరస్వం కథమస్మాభిర్దాతుం శ##క్యేత నారకాః || 38

సకాలమున మీరు హోమము సేయలేదు. విప్రులకేమియు నీయలేదు. ఎవరేని యిచ్చుచున్న దానికడ్డు తగిలితిరి. దానివలని పాపమిది యనుభవింపవలసినది. అగ్నిచే గాలలేదు. నీటిపాల్గాలేదు. రాజులు దొంగలు నపహరింపలేదు. మున్ను మీరుసేయని దానమిప్పుడు బ్రాహ్మణముఖమున నీయబడుచున్నది. సాత్త్విక దానముసేసిన సాధువుల కివిగో అన్నపర్వతము లెదురగుచున్నవి. భక్ష్య భోజ్య లేహ్య పేయాదిరూపమగు నాహార సమృద్ధి యిది మీకుగాదు. మీరు విప్రముఖము నెన్నడు నింతయన్నము పెట్టియుండలేదు. బ్రాహ్మణులం బూజింపనైనలేదు. ఆవిధముగజేసిన పుణ్యాత్ములదీ యన్నసమృద్ధి. వారిది గొనివచ్చి మేము మీకెట్లు పెట్టగలము?

వ్యాస ఉవాచ

కింకరాణాం వచః శ్రుత్వా నిఃస్పృహాః క్షుత్తృషార్దితాః | తతస్తే దారుణౖశ్చాసై#్త్రః పీడ్యంతే యమకింకరైః || 39

ముద్గరైర్లోహదండైశ్చ శక్తితోమరపట్టిశైః | పరిమైర్భింది పాలైశ్చ గదావరశుభిః శ##రైః || 40

పృష్ఠతో హన్యమానాశ్చ యమదూతైః సునిర్దయైః | ఆగ్రతః సింహవ్యాఘ్రాద్యై ర్భక్యంతే పాపకారిణః || 41

న ప్రవేష్టుం న నిర్గంతుం లభంతే దుఃఖితా భృశమ్‌ | స్వకర్మోపహతాః పాపాః క్రందమానాః సుదారుణాః || 42

తత్ర సంపీడ్య సుభృశం ప్రవేశం యమకింకరైః | నీయంతే పాపిన స్తత్ర యత్ర తిష్ఠేత్స్వయం యమః || 43

ధర్మాత్మా ధర్మకృద్దేవః సర్వసంయమనో యమః | ఏవం పథా7తికష్టేన ప్రాప్తాః ప్రేతపురం నరాః || 44

ప్రజ్ఞాపితాస్తదా దూతై ర్వివేశ్యంతే యమాగ్రతః | తతస్తే పాపకర్మాణస్తం పశ్యంతి భయానకమ్‌ || 45

పాపాపవిద్ధనయనా విపరీతాత్మబుద్ధయః | దంష్ట్రా కరాళవదనం భ్రుకుటీకుటిలేక్షణమ్‌ || 46

ఊర్ధ్వకేశం మహాశ్మశ్రుం ప్రస్ఫురదధరోత్తరమ్‌ | అష్టాదశ భుజంక్రుద్ధం నీలాంజనచయోపమ్‌|| 47

సర్వాయుధోద్యతకరం తవ్రదండేన సంయుతమ్‌ | మహామహిషమారూఢం దీప్తాగ్నిసమలోచనమ్‌ || 48

రక్తమాల్యాంబరధరం మహామేఘమివోచ్ఛ్రితమ్‌ | ప్రళయాంబుదనిర్ఘోషం పిబన్నివ మహోదధిమ్‌ || 49

గ్రసంతమివ త్రైలోత్య ముద్గిరంత మివానలమ్‌ | మృత్యుం చ తత్సమీవస్థం కాలానలసమవ్రభమ్‌ || 50

ప్రళయానలసంకాశం కృతాంతం చ భయానకమ్‌ | మారీచోగ్రా మహామారీ కాళరాత్రీ చ దారుణాః || 51

వివిధావ్యాధయః కష్టా నానారూపా భయావహాః | శక్తిశూలాంకుశధరాః పాశచక్రాసిధారిణః || 52

వజ్రదండధరా రౌద్రాః క్షురతూణధనుర్ధరాః | ఆసంఖ్యాతా మహావీర్యాః క్రూరాశ్చాంజనసప్రభాః || 53

సర్వాయుధోద్యతకరా యమదూతా భయనకాః | అనేక పరివారేణ మహాఘోరేణ సంవృతమ్‌ || 54

యమం పశ్యంతి పాపిష్ఠా శ్చిత్రగుప్తం విభీషణమ్‌ | నిర్భర్త్సయతి చా7త్యర్థం యమస్తాన్పాపకారిణః || 55

చిత్రిగుప్తస్తు భగవా న్థర్మవాక్యైః ప్రభోధయన్‌ || 56

యమకింకరుల మాబవిని దిగులువడి యాకలికి గుమిలి యాజీవులు దారుణ శస్త్రపీడితులయిరి. ఇనుపగుదియలు ఇనుపదుడ్లు శక్తితోమరపట్టి నపరిషుబిందిపాలగదాపరశు బాణాదులచే వీపునం బాదుచు పరమ నిర్దయులు కింకరుల వేధింప నరిగియరిగి సింహహ్యఘ్రాదులచే పాపులు భక్షింపబడుదురు. అట్లు మిగుల పీడించి కింకరులు పాపులను యమ ప్రభువు నెదుటకుం గొంపోదురు. అయన ధర్మాత్ముడు ధర్మకర్త సర్వప్రాణి నియామకుడునైన యముడు ఇట్లతి కష్టమైన దారింజని ప్రేతపురముం జేరిన నరులను ప్రభువు నెదురబెట్టి యమదూతలు వారువారు సేసిన కర్మముల నివేదింప ప్రాణులాయన నతిభయంకరుని జూచెదరు. పాపముచే గనులు మూతవడి బుద్ధులుచెడి ప్రాణికోరలతో భయంకరమయి కనుబొమలు ముడివడి మిడిగ్రుడ్ల జడుపుకూర్చు మొగము నిక్కినజుట్టు పెద్దగడ్డముతో బెదవు లదర బదునెన్మిదిచేతులతో కాటుకవలె నల్లని మేనితో సర్వాయుధములంగరములంబూని పెద్దదున్నపోతునెక్కి పెద్దమబ్బువలె నిప్పులట్లు మండుకండ్లు రక్తమాల్యములుపూని ప్రళయమేఘమట్లురుముచు సముద్రునాపోశనపట్టు నాయాన్నట్లు ముల్లోకములను మ్రింగునాయన్నట్లు నిప్పులు గ్రక్కుచున్నట్లు దగ్గరగానిల్చి కాలాగ్ని ప్రభతో నున్న మృత్యువుంగని మహా మారి కాలరాత్రియు వివిధవ్యాధులు కష్టాలు నానారూపాలు శక్తి శూలాస్త్రపాశచక్రాంకుశ ఖడ్గాదులు దాల్చి వజ్రదండములంగొని చురకత్తెలు అమ్ములపొదలు విండ్లును నసంఖ్యాకముంబూని మహావీర్యులు క్రూరులు కాటుకవలె నల్లని మేనికాంతిగలవారు సర్వాయుధ హస్తులయి యమదూతలతిభయానకులై ఘోరముగ పరివారమై గొలువ గొలువైన యముని చిత్రగుప్తునిం బాపాత్ములు దర్శింతురు. యముడుగ్రుడై వారి సురిమి యురిమి చూచును. అపుడు చిత్రగుప్త భగవానుడు ధర్మపచనములచే బ్రబోధించుచు నిట్లనును.

చిత్రగుప్త ఉవాచ

భో భో దుష్కృతకర్మాణః పరద్రవ్యాపహారిణః గ్రర్వితా రూపవీర్యేణ పరదారాభిమర్శకాః || 57

యత్స్వయం క్రియతే కర్మ తత్ప్వయం భుజ్యతే పునః | తత్కిమాత్మోపఘాతార్థం భవద్భిర్దుష్కృతం కృతమ్‌ ||

ఇచానీం కింను శోచధ్వం పీడ్యమానాః స్వకర్మభిః | భుంజధ్వం స్వాని దుఃఖాని నహి దోషో7స్తి కస్యచిత్‌ || 59

య ఏతే పృథివీపాలాః సంప్రాప్తా మత్సమీపతః | స్వకీయైః కర్మభిర్ఘోరై దుష్ప్రజ్ఞాబలగర్వితాః || 60

భోభో నృపా దురాచరాః ప్రజావిధ్వంసకారిణః | అల్పకాలస్య రాజ్యస్య కృతే కిం దుష్కృతం కృతమ్‌ || 61

రాజ్యలోభేన మోహేన బలాదన్యాయతః ప్రజాః | యద్దండితాః ఫలంతస్య భుంజధ్వ మధునా నృపాః || 62

కుతో రాజ్యం కళత్రం చ యదర్థమశుభం కృతమ్‌ | తత్సర్వం సంపరిత్యజ్య యూయ మేకాకినః స్థితాః || 63

పశ్యామో న బలం సర్వం యేన విధ్వంసితాః ప్రజాః | యమదూతైః పాట్యమానా అధునా కీదృశం ఫలమ్‌ || 64

వ్యాస ఉవాచ

ఏవం బహువిధైర్వాక్యై రుపాలబ్ధా యమేన తే | శోచంతః స్వానికర్మాణి తూష్ణీం తిష్ఠంతి పార్థివాః || 65

ఇతి కర్మ సమాదిశ్య నృణాం వై ధర్మరాట్స్వయమ్‌ | తత్పాతకవిశుద్ధ్వర్థ మిదం వచనమబ్రవీత్‌ || 66

ఓపాపకర్ములారా! పరద్రవ్యాపహారులారా! రూపముచే బలముచే బొగరెక్కి పరదారాభిమర్శనము సేసిన ఫలమది యనుభవింపవలయును. దుఃఖముకుడువకతప్పదు. ఈ తప్పెవనిదికాదు. ఈరాజులు నాకడకు వచ్చినవారు తెలివిచెడి బలగర్వితులై చేసిన తమ కర్మము ననుభవించుచున్నారు. ఓ రాజులారా! ప్రజానాశనమొనరించితిరి. అల్పరాజ్యసుఖమునకై ఘోరములు సేసినారు. మీరు రాజ్యలోభముతో మోహముతో బలత్కారముగ ప్రజలదండించినారు. దానిఫలమిపుడనుభవింపుడు. రాజ్యమేది ఇక్కడ భార్య యెక్కడ? ఇవుడేకాకియై చేసిన యశుభమసుభవింప వలసినదే ఏబలముకొని ప్రజల భాదింతురో యాబలమిపుడేమాత్రమీలోకమునగనబడదు. యమకింకరుల వలని బాధలకు గురియైతిరి పాపము. అనియిట్లు పలుతీరుల దెప్పిపొడుచుచు నొవ్వనాడుచు యముడుత్కటకోపియై పడదిట్ట నేడ్చుచు చేసినపాపములకు పశ్చాత్తాపించుచు ప్రాణులు నోరెత్తక నిల్తురు. ధర్మరాజిట్లు చిత్రగుప్తుని వారివారికర్మల లెక్కలు సెప్పుమని విని యాపాపవిశుద్ధికి విధింపనగు దండనములం గూర్చి దండధరు డిట్లాదేశమిచ్చును.

యమ ఉవాచ

భో భోశ్చండ మహాచండ గృహీత్వా నృపతీనిమాన్‌ | విశోధయధ్వం పాపేభ్యః క్రమేణ నరకాగ్నిఘ || 67

వ్యాస ఉవాచ

తతః శీఘ్రం సముత్ధాయ నృపాన్పంగృహ్య పాదయోః | భ్రామయిత్వా తు వేగేన క్షిప్త్వాచోర్ధ్వం ప్రగృహ్యచ ||

తత్తత్పాప ప్రమాణన యమదూతాః శిలాతలే | ఆస్ఫోటయంతితరసా వజ్రేణవ మహాద్రుమమ్‌ || 69

తతస్తురక్తం స్రోతోభిః స్రవతే ర్జరీకృతః | నిస్సంజ్ఞః స తదా దేహీ నిశ్చేష్టశ్చ ప్రజాయతే || 70

తతః స వాయునా స్పృష్టః శ##నై రుజ్జీవతే పునః | తతః పాపవిశుద్ధ్యర్థం క్షిపంతి నరకార్ణవే || 71

అన్యాంశ్చ తే తదాదూతాః పాపకర్మరతాన్నరాన్‌ | నివేదయంతి విప్రేంద్రా యమాయ భృశదుఃఖితాన్‌ || 72

యమదూతా ఊచుః

ఏషలుబ్ధో దురాచారో మహాపాతకసంయుతః | ఉపపాతక కర్తా చ సదా హింసారతో7శుచిః || 74

అగమ్యగామీ దుష్టాత్మా పరద్రవ్యాపహారకః | కన్యాక్రయీ కూటసాక్షి కృతఘ్నె మిత్రవంచకః || 75

అనేన మదమత్తేన సదాధర్మో వినిందితః | పాపమాచరితం కర్మ మర్త్యలోకే దురాత్మనా|| 76

ఇదానీమస్య దేవేశ నిగ్రహానుగ్రహౌ వద | ప్రభురస్య క్రియాయోగే వయం వా వరిపంథినః || 77

వ్యాస ఉవాచ

ఇతివిజ్ఞాప్య దేవేశం న్యస్యాగ్రే పాపకారిణమ్‌ | నరకాణాం సహస్రేషు లక్షకోటి శ##తేషు చ || 78

కింకరాస్తే తతో యాంతి గ్రహీతు మపరాన్నరాన్‌ | ప్రతిపన్నే కృతే దోషే యమోవై పాపకారిణామ్‌|| 79

సమాదిశతి తాన్ఘోరా న్నిగ్రహాయ స్వకింకరాన్‌ | యథా యస్య వినిర్దిష్టో వశిష్ఠాద్యైర్వినిగ్రహః || 80

పాపస్య సంక్షయం క్రుద్ధాః కుర్వంతి యమకింకరాః | అంకుశైర్ముద్గరైద్దండై క్రకచైః శక్తితోమరైః || 81

ఖడ్గశూలనిపాతైశ్చ భిద్యంతే పావకారిణః | నరకాణాం సహస్రేషు లక్షకోటిశ##తేషు చ || 82

స్వకర్మోపార్జితైర్దోషైః పీడ్యంతే యమ కంకిరైః | శృణుధ్వం నరకాణాం చ స్వరూపం చ భయంకరమ్‌ || 83

ఓరిచండ ! మహాచండ ! ఈ నరపతులం గొంపోయి నరకాగ్నులందు బడనేసి పాపములనుండి విశుద్ధుల జేయుడన వెనువెంటలేచి యమభటులు నృపులకాండ్లు పట్టుకొని యెత్తి విసరిపారవేసి పాపపరమాణముంబట్టి బండపై నడిచి పిడుగుచే మహాతరువునట్లు గొట్టిరి. అంతట రక్తము ప్రవాహమెత్తినట్లు ముక్కున నోట జాల్కొనం దెలివితప్పి యాదేహి పడిపోవును. అటుపైదానిపై వాయువు వీవ తెలివిగొనినంత వారిని పాపవిశుద్ధికి నరకసాగరమున విసరుదురు. ఆదూతలు మహాదుఃఖములం గుములు మఱియుంగల జీవులను యమునికి నివేదింతురు. ఇడుగో వీనిని మహాపాపిని మూర్ఛబడనేసి కొనివచ్చితిమి. ధర్మవిముఖుడు నిత్యపాపరతుడు. ఇడుగో వీడు పరమలుబ్ధుడు. మహాపాతకోప పాతకములెన్నో సేసినాడు హింసాపరుడు అనాచారుడు. కూడరానిదిం గూడినవాడు పరద్రవ్యాపహారి. కన్యావిక్రయి కూటసాక్షి కృతఘ్నుడు మిత్రద్రోహి. మరియు వీడు ధర్మనింద సేసినాడు. పాపములు సేసినాడు. దురాత్ముడు వీనిని శిక్షించుటో రక్షించుటో ప్రభువు వీవు సెలవిమ్ము. నీచెప్పినదములు సేయుటలో మేము సర్వదా విధేయులము అని యిట్లు విన్నవించి ధర్మప్రభువు నెదుటనిలిపి వేలకొలది లక్షకోటినరకములం బడవైతురు. ఆపైమఱి కొందఱిం బట్ట బోదురు. చేసినతప్పు నిర్ధారణసేసినమీద తనకింకరులకానయిచ్చి వశిష్ఠాదిమహార్షులేయే నేరముల కేయేదండనము విధించిరో యాయారీతి దండింపజేయును. యమకింకరులు క్రోధమూని అంకుశముద్గరదండాదులు ఱంపములు శక్తి తోమరములు కత్తులు శూలములుంగొని అడచి కొట్టికోసి యేసిగ్రుచ్చి నరకి చీల్చి పాపశోధనము సేయుదురు.

నామాని చ ప్రమాణం చ యేన యాంతి నరాశ్చ తాన్‌ | మహావాచీతి విఖ్యాతం నరకం శోణితప్లుతమ్‌ || 84

వజ్రకంటక సంమిశ్రం యోజనాయుతవిస్తృతమ్‌ | తత్ర సంపీడ్యతే మ్నో భిద్యతే వజ్రకంటకైః || 85

వర్షలక్షం మహాఘోరం గోఘాతీ నరకే నరః | యోజనానాం శతం లక్షం కుంభీపాకం సుదారుణమ్‌ || 86

తామ్రకుంభవతీ దీప్తా వాలుకాంగార సంవృతా | బ్రహ్మహా భూమిహర్తా చ నిక్షేప స్యాపహారకః || 87

దహ్యంతే తత్ర సంక్షిప్తా యావదాభూత సంప్లవమ్‌ | రౌరవో వజ్రనారాచైః ప్రజ్వలద్భిః సమావృతః || 88

యోజనానాం సహస్రాణి షష్టిరాయామ విస్తరైః | భిద్యంతే తత్ర నారాచైః సజ్వాలై ర్నరకే నరాః || 89

ఇక్షువత్తత్ర పీడ్యంతే యే నరాః కూటసాక్షిణః | అయోమయం ప్రజ్వలితం మంజూషం నరకం స్మృతమ్‌ || 90

నిక్షిప్తాస్తత్ర దహ్యంతే వంథిగ్రాహ కృతశ్చ యే | అప్రతిష్ఠేతి నరకం పూయమూత్రపురీషకమ్‌ || 91

అధోముఖః పతేత్తత్ర బ్రాహ్మణస్యోప పీడకః | లాక్షాప్రజ్వలితం ఘోరం నరకం తు విలేపకమ్‌ || 92

నిమగ్నాస్తత్ర దహ్యంతే మద్యపానే ద్విజోత్తమాః | మహాప్రభేతి నరకం దీప్తశూల మహోచ్ఛ్రయమ్‌ || 93

తత్రశూలేన భిద్యంతే పతిభార్యోపభేదినః | నరకం చ మహాఘోరం జయంతీ చా77యసీ శిలా || 94

తయా చా77క్రమ్యతే పాపః పరదారోపసేవకః | నరకం శాల్మలాఖ్యం తు ప్రదీప్త దృఢకంటకమ్‌ || 95

తయా(దా)లింగతి దుఃఖార్తా నారీ బహునరంగమా | యే వదంతి సదా7సత్యం పరమర్మావ కర్తనమ్‌ || 96

జిహ్వాచోచ్ఛ్రియ (చ్ఛిద్య)తే తేషాం సదసై#్యర్యమ కింకరైః | యేతు రాగైః కటాక్షైశ్చ వీక్షంతేపరయోషితమ్‌ ||

తేషాం చక్షూంషి నారాచై ర్విధ్యంతే యమ కింకరైః | మాతరం యే7పి గచ్ఛంతి భగీనీం దుహితరంస్నుషామ్‌||

స్త్రీబాలవృద్ధ హంతారో యావదింద్రా శ్చతుర్దశ | జ్వాలామాలాకులం రౌద్రం మహారౌరవసంజ్ఞితమ్‌ || 99

నరకం యోజనానాం చ సహస్రాణి చతుర్దశ | పురం క్షేత్రం గృహం గ్రామం యోదీపయంతి చ వహ్నినా|| 100

సతత్ర దహ్యతే మూఢో యావత్కల్పస్థితిర్నరః | తామిస్రమితి విఖ్యాతం లక్షయోజన విస్తృతమ్‌ || 101

విపతద్భిః సదా రౌద్రః ఖడ్గపట్టిశ ముద్గరైః | తత్ర చౌరాః నరా

క్షిప్తా స్తాడ్యంతే యమకింకరైః || 102

శూలశక్తిగదాఖడ్గైర్యావత్కల్ప శతత్రయమ్‌| తామిస్రాద్ద్విగుణం ప్రోక్తం మహాతామిస్రసంజ్ఞితమ్‌ || 103

జలౌకాసర్ప సంపూర్ణ నిరాలోకం సుదుఃఖదమ్‌ | మాతృహా పితృహా చైవ మిత్ర విస్రంభ ఘాతకః || 104

తిష్ఠంతి తక్ష్యమాణాశ్చ యావత్తిష్ఠతి మేదినీ | అసిపత్రవనం నామ నరకం భూరిదుఃఖదమ్‌ || 105

యోజనాయుత విస్తారం జ్వలత్ఖడ్గైః సమాకులమ్‌ | పాతితస్తత్ర తైః ఖఢ్గైః శతధా తు సమాహతః || 106

మిత్రఘ్నః కృత్యతే తావ ద్యావదాభూత సంప్లవమ్‌ | కరంభవాలుకా నామ నరకం యోజనాయుతమ్‌ || 107

కుపాకారం వృతం దీపై#్త ర్వాలుకాంగార కంటకైః | దహ్యతే భిద్యతే వర్షలక్షాయుతశతత్రయమ్‌ || 108

యేన దగ్ధో జనో నిత్యం మిథ్యోపాయైః సుదారుణౖః | కాకోలం నామ నరకం కృమిపూయపరిప్లుతమ్‌ || 109

క్షిప్యతే తత్ర దుష్టాత్మా ఏకాకీ మిష్టభుఙ్నరః | కుడ్మలం నామ నరకం పూర్ణం విణ్మూత్రశోనితైః || 110

పంచయజ్ఞ క్రియాహీనాః క్షిప్యంతే తత్ర వై నరాః | సుదుర్గంధం మహాభీమం మాంసశోణితసంకులమ్‌ || 111

అభక్ష్యాన్నే రతాస్తేత్ర నిపతంతి నరాధమాః | క్రిమికీట సమాకీర్ణం శవపూర్ణం మహావటమ్‌ || 112

అధోముఖః పతేత్తత్ర కన్యావిక్రయకృ న్నరః | నామ్నా వై తిలపాకేతి నరకం దారుణం స్మృతమ్‌ || 113

తిలవత్తత్ర పీడ్యంతే పరపీడారతాశ్చ యే | నరకం తైలపాకేతి జ్వలత్తైలమహీప్లవమ్‌ || 114

పచ్యతే తత్ర మిత్రఘ్నో హంతా చ శరణాగతమ్‌ | నామ్నా వజ్రకపాటేతి వజ్రశృంఖలయా7న్వితమ్‌ || 115

పీడ్యంతే నిర్దయం తత్ర యైః కృతః క్షీరవిక్రయః | నిరూచ్ఛ్వాస ఇతి ప్రోక్తం తమోంధం వాతవర్జితమ్‌ || 116

నిశ్చేష్టం క్షిప్యతే తత్ర విప్రదాన నిరోధకృత్‌ | అంగారోపచయం నామ దీప్తాంగారసముజ్జ్వలమ్‌ || 117

దహ్యతే తత్ర యేనోక్తం దానం విప్రాయ నార్పితమ్‌ | మహాపాయీతి నరకం లక్షయోజన మాయతమ్‌ || 118

పాత్యంతే7ధోముఖాస్తత్ర యే జల్పంతి సదానృతమ్‌ | మహాజ్వాలేతి నరకం జ్వాలా భాస్వరభీషణమ్‌ || 119

దహ్యతే తత్ర సుచిరం యః పాపే బుద్ధి కృన్నరః | నరకం క్రకచాఖ్యాతం పీడ్యంతే తత్ర వై నరాః || 120

క్రకచైర్వజ్రధారోగ్రై రగమ్యాగమనే రతాః | నరకం గుడపాకేతి జ్వలద్గుడహ్రదైర్వృతమ్‌ || 121

నిక్షిప్తో దహ్యతే తస్మి స్వర్ణసంకర కృన్నరః | క్షురధారేతి నరకం తీక్షణక్షురసమావృతమ్‌ || 122

ఛిద్యంతే తత్ర కల్పాంతం విప్రభూమి హరా నరాః | నరకం చాంబరీషాఖ్యం ప్రళయానలదీపితమ్‌ || 123

కల్పోటిశతం తత్ర దహ్యతే స్వర్ణహారకః | నామ్నా వ్రకుఠారేతి నరకం వజ్రసంకులమ్‌ || 124

ఛిద్యంతే తత్ర ఛేత్తారో ద్రుమాణాం పాపకారిణః | నరకం పరితాపాఖ్యం ప్రళయానలదీపితమ్‌ || 125

గరదో మధుహర్తా చ పచ్యతే తత్ర పాపకృత్‌ | నరకం కాలసూత్రం చ వజ్ర సూత్రవినిర్మితమ్‌ || 126

భ్రమంత స్తత్ర చ్ఛిద్యంతే పరసస్యోపలుంఠకాః | నరకంకశ్మలం నామ శ్లేష్మశింఘాణకావృతమ్‌ || 127

తత్ర సంక్షిప్యతే కల్పం సదామాంసరుచిర్నరః | నరకం చోగ్రగంధేతి లాలామూత్రపురీషవత్‌ || 128

క్షిప్యంతే తత్ర నరకే పితృపిండా ప్రయచ్ఛకాః | నరకం దుర్ధరం నామ జలౌకావృశ్చికాకులమ్‌ || 129

ఉత్కోచభక్షక స్తత్ర తిష్ఠతే వర్షకాయుతమ్‌ | యచ్చ వజ్రమహాపీడా నరకం వజ్రనిర్మితమ్‌ || 130

తత్ర ప్రక్షిప్య దహ్యంతే పీడ్యంతే యమ కింకరైః | ధనం ధాన్యం హిరణ్యం వా పరకీయం హరంతి యే || 131

యమదూతైశ్చ చౌరాస్తే ఛిద్యంతే లవశః క్షురైః | యే హత్వా ప్రాణినం మూఢాః ఖాదంతే కాకగృధ్రవత్‌ || 132

భోజ్యంతే చ స్వమాంసంతే కల్పాంతం యమకింకరైః | ఆసనం శయనం వస్త్రం పరకీయం హరంతి యే || 133

యమదూతైశ్చతే మూఢా భిద్యంతే శక్తితోమరైః | ఫలం పత్రం నృణాం వా7పి హృతం యైస్తుకుబుద్ధిభి || 134

యమదూతైశ్చతే క్రుద్ధైర్దహ్యంతే తృణవహ్నిభిః | పరద్రవ్యే కళ##త్రే చ యః సదా దుష్టధీ ర్నరః || 135

యమదూతైర్జ్వలత్తస్య హృది శూలం నిఖన్యతే | కర్మణా మనసా వాచా యే ధర్మవిముఖా నరాః || 136

యమలోకేతు తే ఘోరా లభంతే పరియాతనాః | ఏవం శతసహస్రాణి లక్షకోటిశతాని చ || 137

నరకాణి నరై స్తత్ర భుజ్యంతే పాపకారిభిః | ఇహ కృత్వా స్వల్పమపి నరః కర్మాశుభాత్మకమ్‌ || 138

ప్రాప్నోతి నరకే ఘోరే యమలోకేషు యాతనామ్‌ | న శృణ్వంతి నరా మూఢా ధర్మోక్తం సాధు భాషితమ్‌ || 139

దృష్టం కేనేతి ప్రత్యక్షం ప్రత్యుక్యైవం వదంతి తే | దివా రాత్రౌ ప్రయత్నేన పాపం కుర్వంతి యే నరాః || 140

నా7చరింతి హి తే ధర్మం ప్రమాదేనాపి మోహితాః | ఇహైవ ఫలభోక్తారః పరత్ర విముఖాశ్చ యే || 141

తే పతంతి సుఘోరేషు నరకేషు నరాధమాః | దారుణ నరకే వాసః స్వర్గవాసః సుఖప్రదః ||

నరైః సంప్రాప్యతే తత్ర కర్మకృత్వా శుభాశుభమ్‌ || 142

ఇతి శ్రీమహాపురాణ ఆదిబ్రాహ్మే వ్యాసర్షిసంవాదే నరక గతపృథగ్యాతన కీర్తనంనామ పంచదాశాధికద్విశతతమో7ధ్యాయః

నరకముల భయానక స్వరూపము వాని ప్రమాణములు వినుండు. మహావీచి అను నరకము రక్తపూర్ణము. వజ్రకంటకమిశ్రము. పదివేలయోజనముల విరివిగలది పాపినందుముంచి వజ్రకంటకములం గ్రుచ్చిచీల్తురు. లక్షయేండ్లక్కడ గోహత్యచేసినవాడు గూలియుండును. కుంభీపాకము మహాదారుణనరకము. నూరులక్షల యోజనములుండును. కాలుచున్న రాగిబిందెలతో నది మిడమిడకాలు నిసుక నిప్పులతో గూడి యుండును. బ్రహ్మఘ్నుడు భూమిహర్తధననిక్షేపములను(నిధులను) హరించినవాడచట గూలును. భూతప్రలయముదాక జీవులందు కాల్పబడుదురు. అటుపై రౌరవము జ్వలించు వజ్రబాణములతో నిండియుండును. అరువదియోజనముల పొడవు వెడల్పుగల్గి యుండును. జ్వాలలుగ్రమ్ము నానరకమున బాణములచే పాపులుజీల్పబడుదురు. అయోమయ నరకము మంజూషాకారము (బొనువంటిది) దానిలో బావుల బడనేసి చెఱకునాడించినట్లాండింతురు. అదియును జ్వలించుచుండును.

ఆప్రతిష్ఠమను నరకము మలమూత్ర పురీషమయము. పాపియందధోముఖుడైకూలును.బ్రాహ్మణులనుబీడించినవాడు బ్రాహ్మణద్రవ్యమపహరించినవాడు దానం గూలును విలేపకమను నరకము సలసలకాగు లక్కతో నుండును. మద్య పానరతులందు మున్గుదురు. మహాప్రభమను నరకము కాలిన శూలములతో నిండియుండును. ఆలుమగలకు తగవుపెట్టిన వారాశూలములచే బొడువబడుదురు. జయంతియను ఘోరనరకము ఉక్కు పరచిన రాతినేల. పరభార్యా సంగిదానంబడి యుడికిపోవును. (94)

శాల్మలమనునరకము నిప్పులముళ్ళతో నిండినది. బహుజన వ్యభిచారిణియైన స్త్రీ దానిం గౌగలించుకొనును. ఎవ్వరితరుల యాయువుపట్టులకుందగులు నసత్యములు పల్కుదురో వాండ్ర నాలుకను లాగి ఱంపములంగోయుదురు. ఎవ్వరు సరాగములగుచూపులం బరాంగనం జూతురో వాండ్రకన్నులం బాణములం గ్రుచ్చి పగిలింతురు. తల్లిని సోదరిని గోడలిని గూతురుం బొందిన వాండ్రను స్త్రీ బాలవృద్ధ హంతకులను పదునల్వురింద్రుల కాలము జ్వాలామాలాకాకులమైన రౌద్రమగు మహారౌరవమనునరకమునం గూల్తురు. అది యిరువదినాల్గు యోజనముల విరివియైనది. ఎవ్వడు పురగ్రామక్షేత్ర గృహాదులకు నిప్పు వెట్టునో ఆ మూఢుడు కల్పాంతముదాక పై నరకమున గాల్పబడును. తామిస్రమను నరకము లక్ష యోజనములు. కత్తులు పట్టిసములు ముద్గరములు పరచినది. అందు దొంగలను విసరివైతురు. యమకింకరులు శూలశక్తి గదాఖడ్గాదులచే కల్పశతమచట పాపుల నడంతురు. తామిస్రముకంటె రెట్టింపు విశాలము మహాతామిస్రము. అందు జలగలు పాములు నుండును. కారుచీకటి పరమదుఃఖదము. మాతృపితృహంతకులు మిత్రవిశ్వాసఘాతకులు నందు బాడితెలం జెక్కబడుచుందురు. భూమియున్నంతదాక యది యనుభవింతురు. అసిపత్రవనము (కత్తులబోను) మహాదుఃఖదము. కాలుచున్నకత్తులతో నిండినది. ఒక్క యోజనము విరివిగలది. అందు మిత్రఘ్నుడు భూతప్రలయముదాక కత్తులచే నూరుప్రక్కలు గావింపబడును. కరంభవాలుకమను నరక మొక్కయోజనము. కూపాకారము మిడమిడ గాలు నిప్పులతో ముండ్లతో నిసుకతోనిండినది. అందు ఒక లక్షా పదివేల మూడువందలేండ్లు జనులను మాయోపాయములచే దారుణముగ మ్రగ్గుదురు. దహించిన వాండ్రందు దహింపబడుదురు. కాకోలమనునరకము కృమిమయము మలమయమును. మృష్టాన్నముం దా నొక్కడ దిన్నవాడు దానం గూలును. మలమూత్ర శోణిత మయముకుడ్మలమనునది. పంచ యజ్ఞములుమానినవాండ్రందు బడుదురు. మాంసము రక్తముతో నది పాడుకంపు గొట్టుచుండును. భయంకరము. అభక్ష్యాన్నభక్షకులందు గూలుదురు. క్రిమికీటకమయముశవసంపూర్ణము మహావటమనునరకము. కన్యావిక్రయముసేసినవాడక్కడ తలక్రిందుగా నాపెద్దమఱిచెట్టునుండి క్రిందపడును. తిలపాకమనునరకము దారుణము. పరులను బీడింపగోరిన వాండ్రు అందు గానుగయందు నువ్వులట్లాడింపబడుదురు. అందు నలనల క్రాగు నూనెలో నుడికిపోదురు. మిత్రఘ్నుడు శరణాగత హంతకుడు వజ్రకపాటమను నరకమున వజ్రమయములయిన గొలుసులం బంధింపబడును. పాలమ్మువాడు నిర్దయముగ నిరుచ్ఛ్వాసమగు గాఢాంధకారబంధురము గాలియాడని నరకమునం బీడింపబడును. బ్రాహ్మణునికి చేయుదానమున కడ్డుపడినవాడు చేష్టలు దక్కి యందు గుములును. గనగన మండు నిప్పుల నరకమది. అంగారోవచయము. విప్రునికి దానము సేసి చేయలేదన్నవాడు దాన బడును. మహాపాయి యనునరకము లక్ష యోజనములు. అనృతము లాడినవాడు అందధోముఖముగా బడవేయ బడుదురు. మహాజ్వాలమను నరకము పెనుమంటలతో భయంకరము. పాపులందు దహింపబడుదురు. క్రకచమను నరకమున వజ్రమువంటి పదునైన ఱంపములచే నగమ్యామగమనమును జేసిన పాపులు గోయబడుదురు. గుడపాకమను నరకము క్రాగుచున్న బెల్లపు పాకము మడుగు. అందు వర్ణసాంకర్యము సేసినవాడు పడవేయబడును. క్షురధారమను నరకము పదునైన కత్తుల నరకము బ్రాహ్మణభూమి కాజేసినవా డందు కల్పాంతముదాక కోతలంబడును. అంబరీషమను నరకము ప్రలయ కాలాగ్ని దీపితము నూరుకల్పకోటులందు స్వర్ణస్తేయి (బంగారపుదొంగ) గూలును. వజ్రకుఠారనరకము కేవల వజ్రమయము. చెట్లను నరకినవాం డ్రట బడుదురు. పరితాపము ప్రలయాగ్నిమయము. విషము పెట్టినవాడు మధుహర్త (మధువు=తేనె) దానంబడును. కాలసూత్రము వజ్రసూత్రమయము. ఇతరులపంటలను హరించిన వాండ్రందు బడుదురు. కశ్మలమను నరకము చీమిడి శ్లేష్మముతో నిండినది. ఒక కల్ప మక్కడ నిరంతర మాంసాభిరుచి గలవాడు గూలును. ఉగ్రగంధమను నరకము లాలా (చొంగ) మూత్రపురీషమయము. పితరులకు పిండప్రదానము చేయని వాండ్రందు బడవేయబడుదురు. జలగలు తేళ్ళతోనుండెడి దుర్భర నరకము పదివేలేండ్లందు తిండిపోతుగూలును. వజ్రమయము వజ్రమహానీడమను నరకమున ధనధాన్యహిరణ్యములును హరించినవాండ్రు కుములుదురు. యమకింకరులు లేశ##లేశముగా దొంగలనట చెక్కుదురు. కాకిని గ్రద్దనట్లు ప్రాణుల నరకితినువాండ్రను యమకింకరులు కల్పాంతముదాక వాండ్ర మాంసమును వాండ్రచేతనే దినిపింతురు. బరుల శయనాసన వస్త్రాదులం గాజేసినవాండ్రను శక్తితోమరాదులచే యమభటులు ఖండింతురు. పండ్లు ఆకులు హరించిన కుబుద్ధులు గడ్డినిప్పునం గాల్పబడుదురు. కాలభటులు పరదారథనాదులయెడ బుద్ధిగలవానిగుండెలలో గాలిన యినుప శూలముం గ్రుచ్చుదురు. మనోవాక్కాయకర్మలందు ధర్మవిముఖులయిన పాపులు యమలోకమున బలుఘోరమలయిన యాతనలందు వేలు లక్షలు కోట్ల సంవత్సరములు దుఃఖములు గుడువ వలసియుండును.

ఇది శ్రీబ్రహ్మపురాణమునందు దక్షిణమార్గ వర్ణనమను రెండువందల పదిహేనవ అధ్యాయము.

Brahmapuranamu    Chapters