Brahmapuranamu    Chapters   

అథ సప్తాధికద్విశతతమో7ధ్యాయః

పౌండ్రకవాసుదేవవర్ణనమ్‌

మునయ ఊచుః

చక్రే కర్మమహచ్ఛౌరి ర్బిభ్రద్యో మానుషీం తనుమ్‌ | జిగాయ శక్రం శర్వంచ సర్వదేవాంశ్చలీలయా || 1

యచ్చాన్యదకరోత్కర్మ దివ్యచేష్టావిఘాతకృత్‌ | కథ్యతాం తన్మునిశ్రేష్ఠ! పరం కౌతుహలం హి నః || 2

వ్యాస ఉవాచ

గదతోమే మునిశ్రేష్ఠాః శ్రూయతా మిద మాదరాత్‌ | నరావతారే కృష్ణేన దగ్ధా వారాణసీ యథా || 3

పౌండ్రకో వాసుదేవశ్చ వాసుదేవో7భవద్భువి | అవతీర్ణస్త్వ మిత్యుక్తో జనై రజ్ఞానమోహితైః || 4

స మేనే వాసుదేవో7హ మవతీర్ణో మహీతలే | నష్టస్మృతిస్తతః సర్వం విష్ణుచిహ్న మచీకరత్‌ || 5

దూతం చ ప్రేషయామాస స కృష్ణాయ ద్విజోత్తమాః ||

పౌండ్రకవాసుదేవవధ

మునులిట్లనిరి.

మానుషమూర్తియై శౌరి యింద్రుని శంకరుని సర్వదేవతలను లీలామాత్రముగ గెలిచి మహత్కార్యము నొనరించెను. దేవతలు తెలియక చేసిన చేతలకు విఘాతము సేసిన హరి యింకను జేసిన లీలలను దెలుపుము. మాకు విన వేడుక యగుచున్న దన వ్యాసులిట్లనిరి.

''మునివరులార! తెలుపుచున్నాను. ఆదరముతో వినుడు. కృష్ణుడు నరావతారమున వారణాసి నగరమును గాల్చివైచెను. పౌండ్రకవాసుదేవుడు వ్రజలుతనతో వాసుదేవుడొకడు భూలోకమున సంచరించుచున్నాడు. నిజముగ నవతరించిన వాడవు నీవె యని పలుకుచుండ వాడు వాసుదేవుడను నేనే. అవని నవతరించితిని ననుకొనెను. దాన స్మృతి దప్పి వాడు విష్ణుచిహ్నములైన శంఖచక్రగదాదులను నయోమయముగ జేయించుకొని పెట్టుకొని కృష్ణునకు దూతను గూడ బంపెను.

దూతఉవాచ

త్యక్త్వా చక్రాదికం చిహ్నం మదీయం నామచా777త్మనః | వాసుదేవాత్మకం మూఢ ముక్త్వా సర్వ మశేషతః|| 6

ఆత్మనో జీవితార్ధంచ తథా మే ప్రణతిం వ్రజ ||

వ్యాసఉవాచ

ఇత్యుక్తః సప్రహన్యైవ దూతం ప్రాహ జనార్దనః || 7

శ్రీభగవానువాచ

నిజచిహ్నమహం చక్రం సముత్ర్సక్ష్యే త్వయీతి వై | వాచ్యశ్చపౌండ్రకోగత్వా త్వయా దూత వచోమమ|| 8

జ్ఞాతస్త్వ ద్వాక్యసద్భావో యత్కార్యం తద్విధీయతామ్‌ | గృహీతచిహ్న ఏవాహ మాగమిష్యామి తే పురమ్‌|| 9

ఉత్ర్సక్ష్యామిచతే చక్రం నిజచిహ్న మసంశయమ్‌ | ఆజాక్షపూర్వం చ యదిద మాగచ్ఛేతి త్వ యోదితమ్‌|| 10

సంపాదయిష్యే శ్వ స్తుభ్యం తదప్యేషో7విలంబితమ్‌ | శరణం తే సమభ్యేత్య కర్తా7స్మి నృపతే తథా|| 11

యథాత్వత్తోభయం భూయోనైవ కించి ద్భవిష్యతి||

ఇత్యుక్తే7పగతే దూతే సంస్మృత్యాభ్యాగతం హరిః | గరుత్మంతం సమారుహ్య త్వరితం తత్పురం య¸°|| 12

ఆ పంపబడిన దూత వాని మాటలగ కృష్ణునికిట్లు చెప్పెను. ''ఓ మూఢ! చక్రాది చిహ్నములను నీ పెట్టుకున్న వాసుదేవడనెడి నా పేరును సర్వమును విడిచి నీవు జ్రతుకుక దలతువేని నాకు ప్రణతుడవగుము''. అననవ్విదూతతో భగవంతుడు ''నా చిహ్నమగు చక్రమును నీ యెడల విడిచెదను. అని యంటినని నా మాటగ నీవేగి పౌండ్రకునికి జెప్పుము. నీ మాటలోని మంచితనము నాకు దెలిసినది. చేయదగినదేదో చేయుము నేను నా చిహ్నములను దాల్చియే నీ పురమునకు వచ్చేదను. నా చిహ్నమయిన చక్రమును నీకొఱకు వదలెదను గూడ. సందేహము లేదు. ఆజ్ఞాపూర్వకముగ రమ్మని నీవన్న మాటను రేపే విలంబములేకుండ నీ కప్పగించెదను. నీ శరణము (దిక్కు)న కేతెంచి నీవలన మఱి యే కొంచెము భయము లేకుండ జేయవలసినపని చేసెదను.'' అని పరిహాసగర్భముగ తెలుపబడి దూత చనినంతటస్మరణ మాత్రమున వచ్చి వ్రాలిన గరుక్మంతు నెక్కి త్వరితముగ హరి తత్పురమున కేగెను.

తస్యాపి కేశవోద్యోగం శ్రుత్వా కాశిపతి స్తదా | సర్వసైన్యపరీవారః పార్షిణగ్రాహ ముపాయ¸° || 13

తతోబలేన మహతా కాశిరాజబలేన చ | పౌండ్రకో వాసుదేవో7సౌ కేశవాభిముఖం య¸° || 14

తం దదర్శ హరి ర్దూరా దుదారస్యందనే స్థితమ్‌ | చక్రశంఖగదాపాణిం పాణినా విధృతాంబుజమ్‌ || 15

స్రగ్ధరం ధృతశారఙ్గం చ సుపర్ణరచనాధ్వజమ్‌ | వక్షఃస్థలకృతం చాస్య శ్రీవత్సం దదృశే హరిః || 16

కిరీటకుండలధరం పీతవాసఃసమన్వితమ్‌ | దృష్ట్వా తం భావగంభీరం జహాస మధుసూదనః|| 17

కాశిరాజు హరిప్రయత్నమును విని యపుడు పౌండ్రకుని పక్షమున సర్వసైన్యపరివారముతో పార్ణిగ్రాహియై (మడమలం ద్రొక్కికొని) వచ్చెను. ఆంతట నీ పౌండ్రక వాసుదేవుడు పెనుబలముతో కాశిరాజుబలముతోడను గేశవున కెదురు నిలిచెను. హరి యున్నతరథమందున్న వానిని శంఖచక్ర గదాహస్తుడైన వానిని నొకహస్తమున పద్మముం బట్టిన వానిని వనమాలాధరుని శార్జమను విల్లు చేకొన్నవానిని బంగారపునగిషీ చెక్కినటెక్కముగల వానిని నురమున శ్రీవత్సచిహ్నమును దాల్చినవానిని (శ్రీవత్సాకారముగ పచ్చబొట్టు పొడిచికొన్నాడని యర్ధము) కిరీటకుండలధారిని పీతాంబరుని పౌండ్రకుని గని మధువైరి భావగంభీరముగ నవ్వెను.

యుయుధే చ బలేనాథ హస్త్యశ్వబలినా ద్విజాః | నిస్త్రింశ ర్టిగదాశూలశక్తికార్ముకశాలినా || 18

క్షణన శారఙ్గనిర్ముక్తైః శ##రైరగ్నివిదారుణౖః | గదాచక్రాతిపాతైశ్చ సూదయామాస తద్బలమ్‌ || 19

కాశిరాజబలం చైవ క్షయం నీత్వా జనార్థనః | ఉవాచ పౌండ్రకం మూఢ మాత్మచిహ్నోపలక్షణమ్‌ || 20

శ్రీభగవానువాచ

పౌండ్రకోక్తం త్వయాయత్తద్దూతవక్త్రేణమాంప్రతి | సముత్సృజేతి చిహ్నాని తత్తే సంసాదయామ్యహమ్‌|| 21

చక్రమేతత్సముత్సృష్టం గదేయం తే విసర్జితా | గరుత్మానేష నిర్దిష్టః సమారోహతు తే ధ్వజమ్‌ || 22

ఇత్యు చ్చార్య విముక్తేన చక్రేణాసౌ విదారితః | పాతితో గదయా భగ్నో గరుత్మాంశ్చ గరుత్మతా|| 23

తతో హాహాకృతే లోకే కాశీనామధిపస్తదా | యుయుధే వాసుదేవేన మిత్రస్యాపచితౌ స్థితః || 24

తతః శార్గవినిర్మిక్తైశ్చిత్వా తస్య శ##రైః శిరః | కాశిపుర్యాం స చిక్షేప కుర్వంల్లోకస్య విస్మయమ్‌ 25

హత్వాతు పౌండ్రకం శౌరిః కాశిరాజం చ సానుగమ్‌ | రేమే ద్వారవతీం ప్రాప్తో 7మరః స్వర్గగతో యథా || 26

చతురంగబలముతో గదాశూలశక్త్యాది సర్వాయుధములతో నెదిరించినవానితో గృష్ణుడు యుద్ధము జేసెను. శార్గ ధనుర్ముక్తములైన యగ్నిజ్వాలలచే ధారుణములైన గదాచక్రపాతములచే క్షణములో వాని సైన్యమును హతమొనర్చెను. కాశిరాజు సత్వమును గూడ క్షయింపజేసి తన చిహ్నములం దాల్చియున్న యమ్మూఢునితో భగవంతుడిట్లనియె.

పౌండ్రక! దూతముఖమున నీవు పంపిన కబురంతయు విన్నాను. నా చక్రాదిచిహ్నములను వదలుమనికదా నీ యాజ్ఞ. అది యట్లే నిర్వహించినాను. ఇదిగో చక్రము. గద యిదిగో వదలుచున్నాను. గరుత్మంతుడిడుగో. నీ ధ్వజమిందెక్కుగాక! అని పలికి పలికిన క్షణమున హరివదలిన చక్రముచే వాడు చీల్చబడెనుగదచేహతుడై పడెను. గరుత్మంతునిచే గరుత్మంతుడయ్యెను. అనగా రెక్కలు వచ్చినట్లై యాకశమున కెగిరిపోయెను నన్నమాట. అంతట లోకము హాహాకార మొనరించెను. మిత్రున కుపకారముగ కృతజ్ఞతగ కాశిరాజు వాసుదేవునితో దలపడెను. హరి శారఙ్గధనుర్ముక్తములైన యమ్ములచే వాని శిరమునరికి లోకమునకచ్ఛేరువు గల్గించుచు హరి కాశిపురికి విసరివెసెను. శౌరి పౌండ్రకుని గూల్చి పరివారముతో కాశిరాజుం జంపి ద్వారవతికి వచ్చి స్వర్గమున కేతెంచిన యమరుడట్లు విలసిల్లెను.

తచ్ఛిరః వతితం తత్ర దృష్ట్వా కాశిపతేః పురే | జనః కిమేతదిత్యాహ కేనేత్యంతవిస్మితః || 27

జ్ఞాత్వా తం వాసుదేవేన హతం తస్య సుతస్తతః | పురోహితేన సహిత స్తోషయామాస శంకరమ్‌ || 28

అవిముక్తే మహాక్షేత్రే తోషితస్తేన శంకరః | వరం వృణీష్వేతి తదా తం ప్రోవాచ నృపాత్మజమ్‌ | 29

స వవ్రే భగవ న్కృత్యా పితుర్హంతు ర్వధాయమే | సముత్తిష్ఠతు కృష్ణస్య త్వత్ప్రసాదా న్మహేశ్వర|| 30

వ్యాసఉవాచ

ఏవం భవిష్య తీత్యుక్తేదక్షిణాగ్నేరనంతరమ్‌ | మహాకృత్యా సముత్తస్థౌ తసై#్యవాగ్నినివేశనాత్‌ || 31

తతో జ్వాలాకరళాస్యా జ్వలత్కేశకలాపినీ | కృష్ణకృష్ణేతి కుపితా కృత్యా ద్వారవతీం య¸° || 32

తా మవేక్ష్య జనః సర్వో రౌద్రాం వికృతలోచనామ్‌ | య¸° శరణ్యం జగతాం శరణం మధుసూదనమ్‌ || 33

కాశిపతిరాజధానియందు బడిన వానితలంజూచి యిదేమి యెపనిచేతనైనది యని జనము విస్మయమందెను. వాసుదేవునిచే నాకాశిరాజు హతుడయ్యెనని యెరిగి వానికొడుకు పురోహితునితోనేగి విశ్వేశ్వరుని సంతోషపరచెను. (స్తుతించెను) శంకరుడు ఆవిముక్తమహాక్షేత్రమున వానిచే తోషితుడై యారాజుసుతుని వరము గోరుకొమ్మనియె. వాడు స్వామి! నాతండ్రిం గడతేర్చిన కృష్ణుని గడతేర్పుటకు మహేశ్వర! నీయనుగ్రహమున కృత్యయను దారుణశక్తి లేచుగాక యనెను. ఇట్లేయగునని యనినంత వాని యగ్నిహోత్రశాలయందలి దక్షిణాగ్నినుండి మహాకృత్యలేచెను. అగ్నిజ్వలా భయంకరమైన ముఖముమంటలెగయుచున్న కేశకలాపముతో కృష్ణా! కృష్ణా!యని కోపముతో నది ద్వారవతి వంక జనెను. ఆరౌద్రమూర్తిని వికృతమగుకన్నులదానిని ద్వారకావాసిజనమెల్ల జూచి జగములకెల్ల శరణమైన మధువైరిని శరణొందెను.

జనా ఊచుః

కాశిరాజసుతేనేయ మారాధ్య వృషభధ్వజమ్‌ | ఉత్పాదితా మహాకృత్యా వధాయ తవ చక్రిణః || 34

జహి కృత్యా మిమా ముగ్రాం వహ్ని జ్వాలాజటాకులామ్‌ ||

వ్యాసఉవాచ

చక్ర ముత్సృష్ట మక్షేషు క్రీడాసక్తేన లీలయా | తదగ్ని మాలాజటిలం జ్వాలోద్గారాతిభీషణమ్‌ || 35

కృత్యా మనుజగామ7శు విష్ణుచక్రం సుదర్శనమ్‌ | తతః సా చక్రవిధ్వస్తా కృత్యా మాహేశ్వరీ తదా || 36

జగామ వేగినీ వేగాత్తద ప్యనుజగామ తామ్‌ | కృత్వా వారాణసీ మేవ ప్రవివేశ త్వరాన్వితా || 37

విష్ణుచక్రప్రతిహతప్రభావా మునిసత్తమాః | తతః కాశిబలం భూరి ప్రమథానాం తథా బలమ్‌ || 38

సమస్తశస్త్రాస్త్రయుతం చక్రస్యాభిముఖం య¸° | శస్తాస్త్రమోక్షబహుళం దగ్ధ్వా తద్బల మోజసా || 39

కృత్వా7క్షేమా మశేషాం తాం పురీం వారాణసీం య¸° | ప్రభూతభృత్యపౌరాం తాం సాశ్వమాతంగమానవామ్‌ ||

అశేషదుర్గకోష్ఠాం తాం దిర్నిరీక్ష్యాం సురైరపి | జ్వాలాపరివృతాశేషగృహప్రాకారతోరణామ్‌ || 41

దదాహ తాం పురీం చక్రం సకలామేవ సత్వరమ్‌ | అక్షీణామర్షమత్యల్ప సాధ్యసాధనకారకమ్‌ || 42

తచ్చక్రం ప్రస్ఫుర ద్దీప్తి విష్ణో రభ్యాయ¸° కరమ్‌ || 43

ఇతి శ్రీ మహాపురాణ అదిబ్రహ్మే శ్రీకృష్ణచరితే పౌండ్రకవాసుదేవవధ కాశీదాహవర్ణనంనామ సప్తాధికద్విశతతమో7ధ్యాయః

కాశిరాజు వృషభధ్వజు నారాధించి యీమహాకృత్యను గృష్ణునిచంపుటకు బుట్టించెను. అగ్నిజ్వాలలతోడి జడలచే నాకులయైన యీయుగ్రశక్తిని సంహరింపుము. అను జనఘోష చదరంగమాడుచు విని యాటగ నగ్ని మాలాజటిలయై జ్వాలలం గ్రక్కుచునున్న యతిభీషణమైన యాకృత్యను విష్ణుచక్రము సుదర్శనము వెనుదరిమెను మహేశ్వరదేవతాకయగు యాకృత్య హరిచక్రవిధ్వన్తయై వేగమున బరువెత్తెను. దానిని చక్రము వెంబడించెను. అపుడా కృత్య విష్ణుచక్రముచే ప్రభావము గోల్పడి నది వారాణసిం బ్రవేశించెను.

అవ్వల కాశిరాజుసైన్యము అంతువడనిప్రమథగణసైన్యము సర్వశస్త్రాస్త్రములతో జక్రమున కెదురుసనెను. శస్త్రాస్త్రాఘాతబహుళ##మైన యాసైన్యమునెల్ల దహింపజేసి యశేషకాశీనగరమును నిండచతురంగ బలముతో రాజభృత్యులతో పౌరులతో దుర్గములతో కోష్ఠములతో గాల్చి గృహప్రాకారతోరణములందు మంటలు అలముకొన సత్వర మాచక్రము వారనాసిం గాల్చెను. అక్షీణమైనకసితో సాద్యసాధనకారకములు శేషింపమి నా సుదర్శనాయుధము దీప్తిమంతమై విష్ణుహస్తమున కేతెంచెను.

ఇది బ్రహ్మపురాణమున పౌండ్రకవధ కాశీదాహమను రెండువందలఏడవ అధ్యాయము.

Brahmapuranamu    Chapters