Brahmapuranamu    Chapters   

అథ నవనవత్యధికశతతమో7ధ్యాయః

రుక్మిణీకల్యాణమ్‌ శంబరాసురవధ

వ్యాస ఉవాచ

భీష్మకః కుండినేరాజా విదర్భవిషయే7భవత్‌ | రుక్మిణీ తస్యదుహితా రుక్మీచైవ సుతోద్విజాః || 1

రుక్మిణీం చకమేకృష్ణః సాచతం చారుహాసినీ | న దదౌ యాచతే చైనాం రుక్మీ ద్వేషేణ చక్రిణ || 2

దదౌ స శిశుపాలాయ జరాసంధప్రచోదితః | భీష్మకో రుక్మిణాసార్థం రుక్మిణీ మురువిక్రమః || 3

వివాహార్థం తతః సర్వే జరాసంధముఖానృపాః | భీష్మకస్య పురంజగ్ముః శిశుపాలశ్చ కుండినమ్‌ || 4

కృష్ణో7పి బలభద్రాద్యై ర్యదుభిః పరివారితః | ప్రయ¸° కుండినం ద్రష్టుం వివాహం చైద్యభూపతేః || 5

శ్వోభావిని వివాహేతు తాం కన్యాం హృతవాన్హరిః | విపక్షభావమాసాద్య రామాద్వేష్వేవ బంధుషు || 6

తతశ్చ పౌండ్రకః శ్రీమా న్దంతవక్త్రో విదూరథః | శిశుపాలో జరాసంధః శాల్వాదాశ్చ మహీభృతః || 7

కుపితాస్తే హరిం హంతుం చక్రురుద్యోగముత్తమమ్‌ | నిర్జితాశ్చ సమాగమ్య రామాద్యైర్యదుపుంగవైః || 8

కుండినం న ప్రవేక్ష్యామి అహత్వా యేధి కేశవమ్‌ | కృత్వా ప్రతిజ్ఞాం రుక్మీ చ హంతుం కృష్ణమభిద్రుతః || 9

హత్వా బలంస నాగాశ్వ పత్తిస్యందన సంకులమ్‌ | నిర్జితః పాతితశ్చోర్వ్యాం లీలయైవ స చక్రిణా || 10

నిర్జిత్య రుక్మిణం సమ్య గుపయేమే స రుక్మిణీమ్‌ | రాక్షసేన విధానేన సంప్రాప్తో మధుసూదనః || 11

తస్యాం జజ్ఞే చ ప్రద్యుమ్నో మదనాంశః సవీర్యవాన్‌ | జహార శంబరోయం వై యో జఘాన చ శంబరమ్‌ || 12

ఇతి శ్రీబ్రహ్మపురాణ ఆదిబ్రాహ్మే శ్రీకృష్ణచరితే రుక్మిణీకల్యాణవర్ణనమ్‌ - శంబరాసురవధఃనామ నవనవత్యధికశతతమో7ధ్యాయః

రుక్మిణీ కళ్యాణము

వ్యాసులిట్లనియె.

భీష్మకుడు విదర్భ దేశాధిపతి కుండిననగరము రాజధానిగ రాజ్యపరిపాలన చేసెను. అతని కుమార్తె రుక్మిణి. కుమారుడు రుక్మియనువాడు. రుక్మిణిని కృష్ణుడును కృష్ణుని రుక్మిణియు నొండరులు వరించుకొనిరి. కాని రుక్మిద్వేషముగొని చక్రాయుధున కతడీయ డయ్యెను. జరాసంధుని ప్రేరణచే శిశుపాలునకు వాగ్ధానము చేసెను. భీష్మకుడును రుక్మితో నట్లేయనెను. అవ్వల జరాసంధాదులు కళ్యాణార్ధము భీష్మనగరమునకు వచ్చిరి. శిశుపాలుడును వచ్చెను.కృష్ణుడు బలభద్రుడు మొదలగు యాదవులుతోగూడి యవ్వివాహము జూచుటకని వచ్చెను. రేపు వివాహము కానున్న సమయమున హరి యాకన్యం గొంపోయెను. దానికి బలరామాది బంధువులయెడ శతృత్వముగొని శ్రీమంతుడగు పౌండ్రకుడు దంతవక్తృడు విదూరథుడు శిశుపాలుడు జరాసంధుడు శాల్వాదిరాజులు కోపించి హరిని జంపుటకు తీవ్రమైన యత్నముసేసిర. అట్లెత్తివచ్చిన యాబలగము రామాదులచే నొడిపోయిరి. రుక్మిరణమున కేశవుంగూల్పక పురమునం బ్రవేశింపనని ప్రతిజ్ఞచేసి కృష్ణునింజంపదూకెను. చక్రాయుధుడు వానిచతురంగ సైన్యమును లీలగకూల్చి రుక్మిని బడగొట్టెను. వాడోడి పోయెను. అట్లు రుక్మిం గెలిచి శ్రీకృష్ణుడు శ్రీరుక్మిణీదేవిని రాక్షస వివాహ విధానమున పరిణయమాడెను. కృష్ణునకామెయందు మన్మథాంశమున ప్రద్యుమ్నుడు జన్మించెను. శంబరుడాతనిని దొంగిలించుకొని పోయెను. అతడా శంబరుని సంహరించెను.

ఇది శ్రీబ్రహ్మపురాణమున రుక్మిణీకళ్యాణ వర్ణనము శంబరాసురవధ అను నూటతొంబదిదిమ్మిదవ యధ్యాయము

Brahmapuranamu    Chapters