Brahmapuranamu    Chapters   

అథచతుర్న వత్యధికశతతమో7ధ్యాయః

దేవకీవాసుదేవాభ్యాంసకృష్ణసంవాదః

వ్యాస ఉవాచ

తౌ సముత్పన్నవిజ్ఞానౌ భగవత్కర్మదర్శనాత్‌ | దేవకీవసుదేవౌ స్వాందృష్ట్వా మాయాం పునర్హరిః || 1

మోహాయ యదుచక్రస్య వితతాన స వైష్ణవీమ్‌ | ఉవాచ చాంబ భోస్తాత చిరాదుత్కంఠితేనతు || 2

భవంతౌ కంసభీతేన దృష్టౌ సంకర్షణన చ | కుర్వతాం యాతి యః కాలో మాతాప్రిత్రో రపూజనమ్‌ |3

సవృథా క్లేశకారీ వై సాధునా ముపజాయతే | గురుదేవ ద్విజాతీనాం మాతాపిత్రోశ్చ పూజనమ్‌ || 4

కుర్వతః సఫలం జన్మ దేహిన స్తాత జాయతే | తత్షంతవ్య మిదం సర్వమతిక్రమకృతం పితః || కంసవీర్యప్రతాపాభ్యామావయోః పరవశ్యయోః || 5

వ్యాస ఉవాచ

ఇత్యుక్త్వా7థ ప్రణమ్యోభౌ యదువృధ్ధా ననుక్రమాత్‌ | పాదానతిభిః సస్నేహం చక్రతుః పూర్ణమానసమ్‌ || 6

వ్యాసుడిట్లనియె. భగవద్విలాస దర్శనము వలన విజ్ఞాన ముదయించిన దేవకీవసుదేవులం జూచి హరి యాదవ సంఘము మోహములో బడుటకుదనవైష్ణవమాయను విస్తరింపజేసెను. అమ్మా!ఓయయ్యా! ఎన్నాళ్ల నుండియొ మిమ్మెప్పుడు చూచెదనా యని త్వరపడుచు కంసునికి జడిసియున్నబలరాముడునేటికి మిమ్ముజూచినాడు. తల్లిదండ్రులు బూజింపకయే జరిగినకాలమదివ్యర్ధము. ఉత్తములకది బాధాకరమునగును. గురువుల దేవతల విప్రులను దలిదండ్రులు పూజించువారి జన్మము సార్థకము. ఇందనుకయిది తప్పిచేసినతప్పిదము తండ్రీ!క్షమింపుము. కంసుని బలపరాక్రమములకు జడిసి పరవశులమైయున్నందున నట్లుజరిగినది. అని పలికి ప్రీతితోను యదువృద్ధుల బాదములవ్రాలి యిద్దరును వసుదేవుని మనసునిండువరచిరి.

కంసనత్న్యస్తతః కంసం పరివార్యహతం భువి | విలేపుర్మాతరశ్చాస్య శోకదుఃఖపనరిప్లుతాః || 7

బహుప్రకార మస్వస్థాః పశ్చాత్తాపాతురా హరిః | తాః సమాశ్వాసయామాస స్వయ మత్రావిలేక్షణః || 8

ఉగ్రసేనం తతో బంధాన్ముమోచ మధుసూదనః | అభ్యషించ త్తథైవైనం నిజరాజ్యే హతాత్మజమ్‌ || 9

రాజ్యే7భిషిక్తః కృష్ణేన యదుసింహః సుతస్యసః | చకార ప్రేతకార్యాణి యే చాన్యే తత్ర ఘాతికాః || 10

కృతౌర్థ్యదైహికం చైనం సింహాసనగతం హరిః | ఉవాచా77జ్ఞాపయవిభో యత్కార్య మవిశంకయా ||11

యయాతిశాపాద్వంశో7యమరాజ్యార్హోపి సాంప్రతమ్‌ | మయిభృత్యే స్థితే దేవానాజ్ఞాపయతు కిం నృపైః || 12

ఇత్యుక్త్వా చోగ్రసేనం తు వాయుం ప్రతిజగాదహ | నృవాచా చైవ భగవాన్కేశవః కార్యమానుషః || 13

శ్రీకృష్ణ ఉవాచ

గచ్ఛేంద్రం బ్రూహి వాయో త్వమలం గర్వేణ వాసన | దీయతాముగ్రసేనాయ సుధర్మా భవతా సభా || 14

కృష్ణో బ్రవీతి రాజార్హ మేతద్రత్న మనుత్తమమ్‌ | సుధర్మాభ్యా సభా యుక్త మస్యాం యధుభిరాసితుమ్‌ || 15

వ్యాస ఉవాచ

ఇత్యుక్తః పవనోగత్వా సర్వమాహ శచీపతిమ్‌ | దదౌసో7పి సుధర్మాఖ్యాం సభాం వాయోః పురందరః || 16

వాయునా చా77హృతాం దివ్యాం తే సభాం యదుపుంగవాః | బుభుజుః సర్వరత్నాఢ్యాం గోవింద భుజసంశ్రయాః ||

అంతట గంసుని భార్యలు వాని తల్లులు పుడమింబడియున్న కంసునిం జుట్టును జేరి దుఃఖశోకముల మునింగి (దుఃఖము=కష్టము శోకము=ఆప్తబంధు మరణాదులచే మనస్సునకు గలుగుబాధ) పెక్కురీతులకలతవడి పశ్చాత్తాపమునెడ నాత్రముగొని పెక్కురీతుల నేడ్చిరి. హరితానుం గన్నుల నీరువెట్టికొని వారలనోదార్చెను. అవ్వల నుగ్రసేనుని బంధమునుండి విడిపించెను. మఱియు నాతనిని కొడుకుం గోల్పడినవానిని రాజ్యమునం దభిషిక్తుం జేసెను. రాజ్యాభిషిక్తుడై యాతడు తన కొడుకునకు మఱియపుడు చచ్చిన వారికిని బ్రేతకృత్యములు గావించెను. అట్లొనర్చి సింహాసనమెక్కిన యాతనితో కృష్ణుడు శంకింపక యిపుడు యేమిచేయవలయునో యానతిమ్ము. యయాతి శాపముచే నీ యదువంశము రాజ్యానర్హమేయైనను ఇప్పుడు నేను భృత్యుడనై యున్నాను గావున నీవు దేవతలనేని శాసింపుము. నరపాలుర లెక్కేమి అని కార్య నిమిత్తమున మానుషాకారముల ధరించిన భగవంతుడు మానవ భాషణముల నుగ్రసేనునిం గూర్చిపలికి వాయువుంబిలిచి యిట్లనియె. నీవేగి ఇంద్రునితోనిట్లనుము. ఇంద్ర! గర్వమువలదు. నీసుధర్మసభ నుగ్రసేనునికి సమర్పింపుము కృష్ణుడు చెప్పుచున్నాడు. అత్యుత్తమము రాజులకర్హము. ఈసుధర్మసభారత్నము (సర్వసభాశ్రేష్టము) ఇందు యదువులెక్కట యుక్తము. అనిపలుక పవనుండేగి శచీపతికదియెల్ల విన్నవించెను. ఆతడును సుధర్మసభను వాయువునకొసంగెను. వాయువు గొనివచ్చిన యాదివ్యసభను సర్వరత్నాఢ్యమును (సర్వవస్తువులలో నత్యుత్తమ శ్రేష్ఠవస్తువులు గలదానిని) గోవిందుని బుజముల నీడనుండి యదుశ్రేష్ఠు లనుభవించిరి.

విదితాఖిల విజ్ఞానౌ సర్వజ్ఞాన మయావపి | శిష్యాచార్యక్రమం వీరౌ ఖ్యాపయంతౌ యదూ త్తమౌ || 18

తతః సాందీపనిం కాశ్యమవంతిపురవాసినమ్‌ | అస్త్రార్థం జగ్ముతుర్వీరౌ బలదేవ జనార్దనౌ || 19

తస్య శిష్యత్వమభ్యేత్య గురువృత్తి పరౌ హితౌ | దర్శయాం చక్రతుర్వీరావాచార మఖలేజనే || 20

సరహస్యం ధనుర్వేదం ససంగ్రహమధీయతామ్‌ | అహోరాత్రైశ్చతుః షష్ట్యా తదద్భుత మభూద్ద్విజాః || 21

సాందీపని రసంభావ్యంతయోః కర్మాతిమానుషమ్‌ | విచింత్య తౌ తదా మేనేప్రాప్తౌ చంద్ర దివాకరౌ || 22

అస్త్రగ్రామ మశేషం చ ప్రోక్త మాత్రమవాప్య తౌ | ఊచతు ర్ర్వియతాం యా తే దాతవ్యా గురుదక్షిణా || 23

సోప్యతీంద్రియ మాలోక్యతయోః కర్మమహహామతిః | ఆయాచత మృతం పుత్రం ప్రభాసే లవణార్ణవే || 24

సర్వ విజ్ఞానము లెఱింగినవారు కేవల జ్ఞానస్వరూపులయ్యు నవ్వీరులు రామకృష్ణులు శిష్యాచార మిట్లుండవలెనని లోకమునకు వెల్లడించువారై కాశీక్షేత్రమునంబుట్టి అవంతీపురమునందు (ఉజ్జయినిలో) వసించుచున్న సాందీపని సన్నిధి కస్త్ర విద్యార్థము వారరిగిరి. ఆయనకు శిష్యులై గురుశుశ్రూష చేయుచు నెల్లజనమునకు సదాచారము గురుశిష్య భావమిట్లుండవలెనని చేసిచూపించిరి. ధనుర్వేదము సరహస్యముగ ససంగ్రహముగ నరువదినాల్గు దినములలో నాయనితో సధ్యయనము సేసిరి. అది వింతలకెల్ల వింతయయ్యెను. సాందీవనియు నెన్నడు నూహింప వలనుగానిది అమానుషమునైన యా యధ్యయనముతీరుగని యాలోచించి చంద్రసూర్యు లిటువచ్చినారని వారింభావించెను. ఆ యిద్దరు జెప్పినమాత్రన (ఉపదేశమాత్రమున) అస్త్రగ్రామమెల్ల పొంది తమకు గురుదక్షిణ మేమీయనగునోయడుగుడనిరి. ఆయన మతిమంతుడు గావున వారిపనిని నతీంద్రియ జ్ఞానమున గని(కేవలతపోదృష్టింజూచి) లవణసముద్రమున ప్రభాసతీర్థమందు మున్ను గతించిన పుత్రుని యాచించెను.

గృహీతాస్త్రౌ తతస్తౌతు గత్వా తం లవణోదధిమ్‌ | ఊచతుశ్చ గురోః పుత్రో దీయతామితి సాగరమ్‌ || 25

కృతాంజలిపుట శ్చాబ్ధి స్తావథ ద్విజసత్తమాః | ఉవాచ న మయా పుత్రోహృతః సాందీపనేరితి || 26

దైత్యః పంచజనో నామ శంఖరూపః స బాలకమ్‌ | జగ్రాహ సో7 స్తి సలిలే మమైవాసురసూదన || 27

ఇత్యుక్తో7ంతర్జలం గత్వా హత్వా పంచజనంతథా | కృష్ణోజగ్రాహ తస్యాస్థిప్రభవం శంఖముత్తమమ్‌ || 28

యస్యనాదేన దైత్యానాం బలహానిః ప్రజాయతే | దేవానాం వర్థతే తేజో యాత్యధర్మశ్చ సంక్షయమ్‌ || 29

తం పాంజజన్య మాపూర్య గత్వా యమపురీం హరిః | బలదేవశ్చ బలవాన్‌ జిత్వా వైవస్వతం యమమ్‌ || 30

తం బాలం యాతనాసంస్థం యథాపూర్వశరీరిణమ్‌ | పిత్త్రే ప్రదత్తవాన్‌ కృష్ణో బలశ్చ బలినాం వరః || 31

మథురాం చ పునః ప్రాప్తావుగ్రసేనేన పాలితామ్‌ | ప్రహృష్ట పురుష స్త్రీకా వుభౌ రామజనార్దనౌ || 32

ఇతి శ్రీ బ్రహ్మపురాణ దేవకీవసుదేవాభ్యాం సహ కృష్ణసంవాదోనామ చతుర్నవత్యధికశతతమో7ధ్యాయః

వారిద్దరు నస్త్రములంజేకొని సముద్రముందరిసి సాగరునితో గురుపుత్రునిమ్మని పల్కిరి. వార్ధియుం జేతులు మొగిచి నేను సాందీపని పుత్రుని హరింపలేదనియు పంచజనుడను దైత్యుడు శంఖము రూపముననుండువాడాబాలునింగొనిపోయె. వాడు నానీటిలోనె యున్నాడనియె. అదివిని కృష్ణుడు నీళ్లలోనికింజొచ్చి పంచజనుంబంచత్వ మందించి వానియెమ్శులం బొడమిన యుత్తమమైన శంఖముంజేకొనియె దానినాదముచే దైత్యులకు బలముపోవును దేవతలకు తేజస్సువృద్ధిపొందును. అధర్మము క్షయించును. అట్టి పాంచజన్యమునెత్తి హరి యొత్తి యమపురికేగి బలభద్రుడును యమునింగెల్చి యమయాతననున్న యాబాలునింగొని మునుపటివోలె మానవ శరీరముననున్నవానిం దండ్రికి బలరామకృష్ణులొసంగిరి.

అటనుండి యుగ్రసేన పరిపాలనలోనున్న మధురకేతెంచిరి. మధురాపురవాసులు స్త్రీపురుషులు వారి యాగ మనమున కమితానంద భరితులైరి.

ఇది బ్రహ్మపురాణమున దేవకీవసుదేవులతో కృష్ణుడు సంభాషించు గురుదక్షిణా సమర్పణము అను నూటతొంభైనాల్గవ యధ్యాయము.

Brahmapuranamu    Chapters