Brahmapuranamu    Chapters   

అథ సప్తాశీత్యధిక శతతమో7ధ్యాయః

రామకృష్ణకృతబహువిధలీలావర్ణనమ్‌

వ్యాస ఉవాచ

తస్మి న్రాసభ##దైతేయే సానుజే వినిపాతితే | సర్వగోపాలగోపీనాం రమ్యం తాలవనం బభౌ ||1

తత స్తౌ జాతహర్షౌ తు వసుదేవసుతా వుభౌ | శుశుభాతే మహాత్మానౌ బాలశృంగా వి వర్షభౌ ||2

చారయంతౌ చ గా దూరే వ్యాహంతౌ చ నామభిః | నియోగపాశస్కంధౌ తౌ వనమాలావి భూషితౌ || 3

సువర్ణాంజనచూర్ణాభ్యాం తదా తౌ భూషితాంబరౌ | మహేంద్రాయుధ సంకాశౌ శ్యేతకృష్ణావి వాంబుదౌ || 4

చేరతు ర్లోకసిద్ధాభిః క్రీడాభి రితరేతరమ్‌ | సమస్త లోకనాథానాం నాథభూతౌ భువం గతౌ || 5

మనుష్యధర్మాభిరతౌ మానయంతౌ మనుష్యతామ్‌ | తజ్ఞాతాగుణయుక్తాభిః క్రీడాభి శ్చేరతు ర్వనమ్‌ || 6

తతస్త్వాందోలికాభిశ్చ నియుద్ధైశ్చ మహాబలౌ | వ్యాయామం చక్రతు స్తత్ర క్షేపణీయై స్తథా7శ్మభిః || 7

వ్యాసులిట్లనిరి. గర్దభాసురుడు తమ్ములతో హతుడైన దరువాత గోపీగోపాలబృందమునకు దాళవనము చక్కని విహారస్థావమయ్యెను. బలరాములు లేగొమ్ములుగలవృషభములట్లాగోప సమాజమున రాణించిరి. ఆలమందలను దూరదూరములకు దోలికొనిపోయి వానిని రకరక ములైన పేరులం బిలుచుచుండిరి. లేగల పలుపులను భుజములందువైచుకొని వనమాలలు దాల్చి సువర్ణాంజనచూర్ణములచేత మెకయువలువలందాల్చి యింద్రధనస్సులట్లు తెలుపు నలుపు మోఘములట్లు గనవచ్చుచు విచిత్రములైన జాతీయములయిన యాటలాడుచు విహరింపజొచ్చిరి. సర్వలోకనాథులు నందరకు దిక్కై యవనింజొచ్చి మనుష్యధర్మా భిరతులై మానవత్వమును సమ్మానించుచు మానవజాతికనుగుణమైన యాటలాడుచు నావనమున గ్రీడించిరి. మఱియు తూగుటుయ్యాలలూగుచు కుస్తీ మొదలైన జిన్నచిన్న యుద్దములందలపడుచు నుండీలబద్దలుగొని మీదికి రాళ్ళు విసరుట మొదలగు విచిత్ర వ్యాయామములను వినోదించుచుండిరి.

తల్లిప్సు రసుర స్తత్ర ఉభయోః రమమాణయోః | ఆజగామ ప్రలంబాఖ్యో గోపవేషతిరోహితః || 8

సౌ7వగాహత నిఃశంకం తేషాం మధ్య మమానుషః | మానుషం రూప మాస్థాయ ప్రలంబో దానవో త్తమః || 9

తయో శ్చిద్రాంతర ప్రేప్సు రతిశీఘ్ర మమన్యత | కృష్ణం తతో రౌహిణయం హంతుం చక్రే మనోరథమ్‌ || 10

హరిణా క్రీడనం నామ బాలక్రీడనకం తతః | ప్రక్రీడితా స్తుతే సర్వేద్వౌ ద్వౌ యుగపదుత్పతన్‌ || 11

శ్రీదామ్నాసహ గోవిందః ప్రలంబేన తథా బలః | గోపాలై రపరై శ్చాన్యే గోపాలాః సహ పుప్లువుః || 12

శ్రీదామానం తతః కృష్ణః ప్రలంబం రోహిణీ సుతః | జితవా స్కృష్ణపక్షీయై ర్గోపైరన్యైః పరాజితాః || 13

తే వాహయంత స్త్వన్యోన్యం భాండీరస్కంధ మోత్య వై | పున ర్నివృత్తా స్తే సర్వే యేయే తత్ర పరాజితాః || 14

సంకర్షణం తు స్కంధేన శీఘ్ర ముత్షిప్య దానవః | న తస్థౌ ప్రజగా మైవ స చంద్ర ఇవ వారిదః ||15

అశక్తో వహనే తస్య సంరంభా ద్దానవోత్తమః | వవృధే సుమహాకాయః ప్రావృషీవ బలాహకః || 16

సంకర్షణస్తుతం దృష్ట్వా దగ్ధశై లోపమాకృతిమ్‌ | స్రగ్దామలంబాభరణం ముకుటాటోపమస్తకమ్‌ || 17

రౌద్రం శకటచక్రాక్షం పాదన్యాసచలత్షితిమ్‌ |హ్రియమాణ స్తతః కృష్ఱ మిదం వచన మబ్రవీత్‌ ||18

కృష్ణ కృష్ణ హ్రియే తైష పర్వతోదగ్రమూర్తినా | కేనాపి పశ్య దైత్యేన గోపాలచ్ఛద్మరూపిణా || 19

య దత్ర సాంప్రతం కార్యం మయామధునిషూదన | తత్కథ్యతాం ప్రయా త్యేష దురా త్మాతిత్వరాన్వితః || 20

వ్యాస ఉవాచ

త మాహ రామం గోవిందః స్మితభి న్నౌష్ఠసంపుటః | మహాత్మా రౌహిణయస్య బలవీర్యప్రమాణవిత్‌ || 21

అంతట ప్రలంబాసురుడు గోపవేషమున మాటువడి యాగోపకులనడుమ బ్రవేశించెను. అవకాశము వెదకుచు నాబలరామకృష్ణులను నప్పట్టున సంహరింపదలచెను. ఒండొరులను భుజముల నెక్కించుకొని మోయుటయనునొక వింత యాటకుజొచ్చి బలరాములతో దలపడె ను. శ్రీదాముడనుగోపకునితో గృష్ణుడు ప్రలంబునితో బలరాముడు మఱి గోపకులతో గోపకులు నెగిరియెగిరి యయ్యాటలో వినోదింయిరి. కృష్ణుడు శ్రీదాముని బలరాముడు ప్రలంబుని నోడించిరి. కృష్ణునివైపు గొల్లలెదిరి గొల్లలను గెలిచిరి. ఓడినవా రోడనివారిని భాండీరస్కందముదాక మోసికొనిపోయితీసికొని రావలెనను బందెమువెట్టి యాడుకొనజొచ్చిరి. ఆదానవుడు తానే యోడినట్లునటించి మబ్బులోనున్నచంద్రునట్లు తాను బలరామునెత్తుకొని పోవుచు నాబరువు మోయలేనట్లు వర్షమేఘమట్టితనకాయమును బెంచెను. బలరాముడుకార్చిచ్చునగాలు పర్వతమట్లు పూలమాలలువ్రేల దలపైకిరీటముదాల్చి బండిచక్రములబట్టి మిడి గ్రుడ్లతో రౌద్రకారుడై పాదములతాకిడిచే భూమియదర దనను మోసికొనిపోవుచున్నవానినిగని కృష్ణా! పెద్దకొండవలెనై మాయాగోపాలరూపముతో రాక్షసుదే యొకడు నన్ను మోసికొని పోవుచున్నాడు. వీడు పరమ దుర్మార్గుడు. ఇప్పుడు నేనేమిచేయవలెనో దెలుపు మన గోవిందుడు చిరునవ్వునంబెదపులు తెరువ బడ బలరాముని బలపరాక్రమము లెరిగినవాడు కావున నిట్లనియె.

కృష్ణ ఉవాచ

కి మయం మానుషో భావో వ్యక్త మో వావలంబ్యతే | పర్వాత్మ న్సర్వగుహ్యానాం గుహ్యో దుహ్యాత్మనాత్వయా ||

స్మరాశేషజగదీశ కారణం కారణాగ్రజ | ఆత్మాన మేనం తద్వ చ్చ జగ త్యేకార్ణవే చయః ||23

భవా నహం చ విశ్వాత్మ న్నేత మేవ హి కారణమ్‌ | జగతో7స్య జగత్యర్థే భేదేనావాం వ్యవస్థితౌ ||24

త త్స్మర్యతామమేయాత్మంస్త్వయాత్మాజహిదానవమ్‌| మానుష్యమేవమాలంబ్యబంధూనాంక్రియతాంహితమ్‌ || 25

సర్వాత్మకుడు సర్వరహస్యములకు రహస్యమునైననీవు మానంరూపముధరించుట వినోదార్థము. ఒకానొక కారణముననాకు నన్నవై యశేషజగత్ర్పభువైన నీవు సర్వకారణమైన నీ స్వరూపమును దలచుకొనుము. జగమెల్లనేకార్ణవమైనపుడు నీవును నేనునుంగలిసి యేకైకపరబ్రహ్మమగుటయు, నీజగము నిలుపుటకు వేరగుటకు వేరగుటయు సత్యము. కావున తన్నుదానెరిగి యీ దానవుని సంహరింపుము. మానుషభావమిట్లుపూని మనవారికీ బంధువులకు హితవుజేయుము.

వ్యాస ఉవాచ

ఇతిసంస్మారితో విప్రాః కృష్ణేన సుమహాత్మనా| విహస్య పీడయామాస ప్రలంబం బలవా న్బలః || 26

ముష్ఠినా చాహన న్మూర్థ్ని కోపసంరక్తలోచనః | తేన చాస్య ప్రహారేణ బహిర్యాతే విలోచనే ||27

స నిష్కాసితమస్తిష్కో ముఖాచ్ఛోణిత ముద్వమన్‌ | నిపపాత మహీపృష్ఘే దైత్యవర్యో మమారచ || 28

ప్రలంబం నిహతం దృష్ఠ్వా బలేనాద్బుతకర్మణా | ప్రహృష్టా స్తుఫ్టుువుర్గోపాః సాదు సాధ్వితిచాబ్రువన్‌ ||29

సంస్తూయమానో రామస్తు గోపైర్దైత్యే నిపాతితే | ప్రలందే సహవృష్ణేన పునర్గోకుల మాయ¸° ||30

ఇట్లు కృష్ణభగవానునిచే జ్ఞప్తిచేయబడి హలి యల్లననవ్వి ప్రలంబుని బట్టియెత్తి కోపముచే కన్నులెర్రబడ బిడికివానినడినెత్తిపై గ్రుద్దెను. ఆదెబ్బతో వాడు కనుగ్రుడ్లు వెలికిజన తలపగిలి నోట రక్తము గ్రక్కికొని భూమిపైబడి మృతినొందెను. అద్భుతమైన బలముచే బలుడట్లు ప్రలంబుని గూల్ప గోపకులు బాగుబాగని యానంద భరితులై రామునిస్తుతించిరి. అవ్వల గోపకులతో కృష్ణునితో బలరాముడు గోకులమున కేతెంచెను.

తయోర్విహరతో రేవం రామకేశవయో ర్ర్వజే | ప్రావృడ్వ్యతీతా వికసత్సరోజా చాభవ చ్ఛరత్‌ || 31

విమలాంబరనక్షత్రే కాలే చాభ్యాగతే వ్రజమ్‌ | దదర్శేంద్రోత్సవారంభప్రవృత్తా న్వ్రజవాసినః ||32

కృష్ణ స్తా నుత్సుకా న్దృష్ట్వా గోపా నుత్సవలాలసాన్‌ | కౌతూహలా దిదంవాక్యం ప్రాహ వృద్ధా న్మహామతిః || 33

కో7యం శక్రమహో నామ యేనవో హర్షఆగతః | ప్రాహతం నందగోపశ్చ పృచ్ఛంత మతిసాదరమ్‌ || 34

రామకేశవులట్లు విహరించుచుండగ వర్షఋతువుగడచి తామరపూలె వికసింప శరద్దృ తువు వచ్చెను. ఆకాశము స్వచ్ఛమై నక్షత్రములు కాంతులంజిమ్మ జక్కని యాసమయ మందు వ్రేవల్లెజనము ఇంద్రోత్సవారంభముసేయ గుతూహలపడుటచూచి కృష్ణుడు పెద్దవాండ్రతో ముచ్చటగ ఈయింద్రోత్సవ మనగానేమి? దీనికి మీరింత యానందపడుటకు గారణమేమి యని యడుగ నందుడతనరితో నిట్లనియె.

మేఘనాం పయపా మీశో దేవరాజః శతక్రతుః | యేన సంచోదితా మేఘా వర్షం త్యంబు మయం రసమ్‌ || 35

తద్వృష్టిజనితం సవ్యం వయ మన్యేచ దేహినః | వర్తయామోపభుంజీనా స్తర్పయామశ్చ దేవతాః || 36

క్షీరవత్య ఇమాగావో వత్సవత్యశ్చ నిర్వృతాః | తేన సంవర్థితై స్ససై#్యః పుష్టా స్తుష్టా భవంతివై || 37

నాసస్యా నాతృణాభూమి ర్న బుభుక్షార్దితో జనః | దృశ్యతే యత్ర దృశ్చంతే వృష్టిమంతో బలాహకాః || 38

భౌమ మేతత్స యోగోభిర్థత్తే సూర్యస్యవారిదః | పర్ణన్యః సర్వలోకస్య భవాయ భువి వర్షితి ||39

తస్శాత్ప్రావృషి రాజానః శక్రం సర్వే ముదాన్వితాః | మషేసురేశ మర్ఘంతి వయ మనే చ దేహినః ||40

వ్యానఉవాచ

నందగోపస్య వచనం శ్రుత్వేత్థం శక్రపూజనే | కోపాయ త్రిదశేంద్రస్య ప్రాహ దామోదర స్తదా ||41

మేఘములకును జలములకును దేవేంద్రుడధిపతి. అతనిప్రేరణముచే జలరూపమున సర్వప్రాణధారకమయిన రసము నవి వర్షించును. ఆవర్షముచే బండినపంటను మరము మఱి యితర ప్రాణులు. దిని బ్రతుకుదుము. దేవతలను దానిచే దృప్తిపరుతుము. ఆవులు పాలి చ్చును. లేగతలతో నవి వానవలన గల్గిన సస్యము సంతృప్తివడును. సస్యసమృద్ధి పచ్చిక (మేత) సమృద్ధి మేఘనిమిత్తమే. సకాలమున వర్షించుమేఘములు గలచోట నాకలి కలమ టించుజనముండదు. సూర్యకిరణములచేత మేఘమీభూమియందలి యదకమును జేకొని ధరించును. సర్వలోక జీవనమునకు భూమిపైనది వర్షించును.అందువలన వర్షఋతువునందెల్ల రాజులు సంతోషముతో నీయుత్పవమునందు దేవేంద్రునిగొలుతురు. మనము మఱి యెల్లజజీవులు నమర పతిని గొలుచుటయు నందులకే. అని తెలుప నందుని మాటవిని యింద్రుని బూజించు విషయమేన కృష్ణుడు దేవేంద్రునకుగోపము గలుగ నిట్లనియె.

నవయం కృషికర్తారో వాణిజ్యాజీవినో న చ | గావో7స్మ ద్దైవతం తాత వయం వనచరా యతః || 42

ఆన్వీక్షకీ త్రయీ వార్తా దండనీతిస్తథా7పరా | విద్యాచతుష్టయం త్వేత ద్వార్తామత్ర శృణుష్వమే || 43

కృషిర్వణిజ్యా తద్వచ్చ తృతీయం పశుపాలనమ్‌|విద్యాహ్యేతా మహాభాగా వార్తా వృత్తిత్రయాశ్రితా|| 44

కర్షకాణాం కృషిర్వృత్తిః పణ్యంత త్పణ్వజీవినామ్‌ | అస్మాకం గాః పరావృత్తి ర్వార్తా భేదై రియం త్రిభిః || 45

విద్యయా యో యయా యుక్తస్తస్య సా దైవతం మహత్‌ | నైవ పూజ్యా7ర్చనీయా చ సైవ తస్యోపకారికా|| 46

యో యస్యాః ఫలమశ్నన్వై పూజయత్యపరాం నరః | ఇహచ ప్రేత్య చై వాసౌ తాత నాప్నోతి శోభనమ్‌ || 47

పూజ్యంతాం ప్రధితాః సీమాః సీమాంతం చ పునర్వనమ్‌ | వనాంతా గిరయః సర్వే సా చాస్మాకం పరాగతిః || 48

గిరియజ్ఞ స్త్వయం తస్మా ద్గోయజ్ఞశ్చ ప్రవర్త్యతామ్‌ | కి మస్మాకం మహేంద్రేణ గావః శైలాశ్చ దేవతాః || 49

మంత్రయజ్ఞపరా విప్రాః సీరయజ్ఞాశ్చ కర్షకాః | గిరిగోయజ్ఞశీలాశ్చ వయ మద్రివనాశ్రయాః || 50

తస్మాద్గోవర్థనః శైలో భవద్భిర్వివిధార్హణౖః | ఆర్చ్యతాం పూజ్యతాం మేధ్యం పశుం హత్వా విధానతః || 51

సర్వఘోషస్య సందోహా గృహ్యంతాం మా విచార్యతామ్‌ | భోజ్యంతాం తేన వైవిప్రా స్తథాన్యేచాపి వాంఛకాః ||

త మర్చత కృతేహోమే భోజితేషు ద్విజాతిషు | శరత్పుష్పకృతాపీడాః పరిగచ్ఛంతు గోగణాః || 53

ఏతన్మమ మతం గోపాః సంప్రీత్యా క్రియతే యది | తతః కృత్వా భ##వే త్ర్పీతిర్గవా మద్రే స్తథా మమ|| 54

వ్యాసఉవాచ

ఇతి తస్య వచః శ్రుత్వా సందాద్యాస్తే వ్రజౌకసః | ప్రీత్యుత్భుల్లముఖా విప్రాః సాధుసా ధ్విత్యథాబ్రువన్‌|| 55

శోభనం తే మతంవత్స తదేతద్భవతోదితమ్‌ | తత్కరిష్యా మ్యహంసర్వం గిరియజ్ఞః ప్రవర్త్యతామ్‌ || 56

తథా చ కృతవంత స్తే గిరియజ్ఞం వ్రజౌకసః | దధిపాయసమాంసాద్యై ర్దదుః శైలబలిం తతః || 57

ద్విజాంశ్చ భోజయామాసుః శతశో7థసహస్రశః | గావః శైలం తతశ్చక్రు రర్చితంత ప్రదక్షిణమ్‌ ||58

వృషభాశ్చాభినర్దంతః సతోయా జలదా ఇవ | గిరిమూర్దని గోవిందః శైలో7హ మితి మూర్తిమాన్‌ || 59

బుభుజే7న్నం బహువిధం గోపవర్యాహృతం ద్విజాః | కృష్ణ స్తేనై వరూపేణ గోపైః సహగిరేః శిరః || 60

అధిరుహ్యార్చయామాస ద్వితీయామాత్మనస్తనుమ్‌ | అంతర్ధానం కృతేతస్మిన్గోపా లబ్ధ్వా తతోవరాన్‌||

కృత్వా గిరిమహం గోష్ఠం నిజ మభ్యాయయుః పునః ||61

ఇతి శ్రీమహాపురాణ ఆదిబ్రాహ్మేశ్రీకృష్ణబాలచరితే గోవర్థనగిరియజ్ఞప్రవర్తనం నామ సప్తాశీత్యధికశతతమో7ధ్యాయః

మనము కర్షకులము గాము. వర్తకమును జేసిజీవించువారముకాము. గోవులే మనకు దైవము. వనమునందు సంచరించుము. ఆన్వీక్షకి త్రయీ వార్తా (వర్తకము) దండనీతి అని విద్య నాల్గువిధములు. వీనిలో వార్తయనగ వ్యవసాయము వాణిజ్యము పశుపాలనము ననుపేర మూడు వృత్తులు చెప్పబడినవి.

కర్షకులకుగృషి పణ్యజీవులకు(వర్తకులకు)వర్తకము వృత్తులు మనకన్ననో గోపాలనము ముఖ్యవృత్తి. ఈవిధముగ వార్తయనునది మూడే తెఱంగుల చెప్పయడినద ఎవ్వడే విద్యనునేర్చునో యదేవానికి పరమదైవము. అదే పూజింనదగినది ఆరాధింపదగినదియు అదేవాని కుపకారముకూడ. ఒకదాని ఫలమునుభవించుచు వేరొకవిద్యను బూజించువాడు ఇహపరములందు శుభమందడు. ప్రసిద్ధమైన మనహద్దులను (ఆవులదొడ్లను) బూజింతము. వానికన్నిటికి హద్దుగానున్న వనమును బూజింతము. వనములకు బరమావధులైన కొండలు మనకు పరమదైవములు. కావున గిరియజ్ఞము (కొండదేవతలపూజ) గోయజ్ఞము(గోపూజ) మనము కావింతము. ఇంద్రునితో మనకేమిపని? గోవులు కొండలు మనకు దేవతలు. విప్రులు మంత్రయజ్ఞపరులు. మంత్రానుష్ఠానమే వారికి యజ్ఞము. కర్షకులకు యజ్ఞము నాగలి. కొండలందును అడవులందు నుంవడు మనకు గొండలను గోవులను గొలుచుటేయజ్ఞము (పూజ). కావున తామందరు రకరకములైన పూజాద్రవ్యములచే బశువునుబలియిచ్చి యథావిధిగ గోవర్ధనగిరినర్చింపుడు. వ్రేపల్లెలోనున్న సర్వసంభారములను జేకొనుడు ఆలోచింపవలదు. ఆసామాగ్రిచే విప్రేలకు మఱి యన్నార్దులకు సంతర్పణము జేయుదుముగాక! ఆఅర్చింప బడిన కొండనుద్ధేశించి హోమములు సేసి ద్విజులకుసంతర్పణము సేసిన తరువాత శరద్దృతువునందలి పూలను శిరములదాల్చి మనయావులమంద లె వ్రేపల్లెకు మరలునుగాక! ఇది నామతము. దీనిని బ్రీతతితో జేసినయెడలడోవులకు బ్రీతి గల్గును. గోవర్ధన గిరికిని నాకునుకూడ సంతోషమగును. అని తెలుప గృష్ణుని పలుకులువిని నందాదులందరు సంతోషముచే మోములు విప్పార బాగుబాగని వత్సా!నీయభిప్రాయము పరమశోభనము. నీచెప్పిన మాట నేమనుసరింతుము ఈ గిరియజ్ఞము సాగింపబడుగాక! యని ప్రజవాసులెల్లరు పెరుగు పాయసము మాంసములతో గొండకు బలియిచ్చిరి. నూర్లు వేలుగ విప్రులకు విందులు సేసిరి. అట్లు కొలువబడినయాగిరికి గోవులు ప్రదక్షిణముసేసినవి. నజలజలదములట్లు వృషభములు రంకెలు వేయుచు గిరిప్రదక్షిణము సేసెను. గోవిందుడు కొండనెత్తమున గూర్చుండి నేనే మూర్తిధరించిన కొండదేవతనని యా గోపశ్రేష్టులు గొనివచ్చి నివేదించిన పలుతెరంగులైన యన్నముల నారంగించెను. మఱియునదేరూపమున కృష్ణుడు గిరి శిఖరమున కెక్కి యది తన రెండవ మూర్తిగ బూజించెను. తరువాత నతడంతర్థానము కాగ యతనివనల గోపకులు వరములం బొంది యిట్లు గోవర్ధనోత్సవము సేసి తమతమ గోష్ఠములకు(గోశాలలకు) తరలి వచ్చిరి.

ఇతి శ్రీబ్రహ్మపురాణమున శ్రీకృష్ణబాలచరితమున గోవర్ధనగిరి యజ్ఞప్రవర్తరమను నూటయెనుబదియేడవ యధ్యాయము.

Brahmapuranamu    Chapters