Brahmapuranamu    Chapters   

ఏకాశీత్యధికశతతమో7ధ్యాయః

హరేరంశావతారనిరూపణమ్‌

వ్యాసఉవాచ

శృణుధ్వం మునిశార్దూలాః! ప్రవక్ష్యామి సమాసతః | ఆవతారం హరేశ్చాత్ర భారావతరణచ్ఛయా || 1

యదా యదా త్వధర్మస్య వృద్ధిర్భవతి భో ద్విజాః | ధర్మశ్చ హ్రాసమభ్యేతి తదా దేవో జనార్దనః || 2

అవతారం కరోత్యత్ర ద్విధా కృత్వా77త్మన స్తనుమ్‌| సాధూనాం రక్షణార్థాయ ధర్మసంస్థాపనాయచ || 3

దుష్టానాం నిగ్రహార్థాయ అన్యేషాం చ సురద్విషామ్‌ | ప్రజానాం రక్షణార్థాయ జాయతే7సౌ యుగేయుగే || 4

పురా కిల మహీ విప్రాః! భూరిభారావపీడితా || జగామ ధరణీ మేరౌ సమాజే త్రిదివౌకసామ్‌ || 5

సబ్రహ్మకా న్సురా న్సర్వాన్‌ ప్రణిపత్యాథమేదినీ | కథయామాస తత్సర్వం ఖేదా త్కరుణభాషిణీ || 6

హరియంశావతారవర్ణనము

వ్యాసుడిట్లనియె.

భూభారము హరింప నీ భారతవర్షమందు హరి యవతరించిన వృత్తాంతము దెలిపెద. ఓ మునివరులార వినుండు. ధర్మహ్రాసము అధర్మాభివృద్ది యయినతఱి జనార్దనుడు తన మూర్తిని రెండువిధము లొనర్చికొని సాధురక్షణకు ధర్మస్థాపనకును దుష్టుల దేవద్వేషుల నిగ్రహమునకును యుగయుగమందు నుదయించును. మున్నీ భూమి బహుభార పీడితమై మేరువునందున్న దేవసమాజమున కేగి బ్రహ్మాది దేవతలకు మ్రొక్కి తన కష్టము నిట్లు మొఱవెట్టు కొనెను.

ధరణ్యువాచ

అగ్నిః సువర్ణస్యగురు ర్గవాం సూర్యో7పరో గురుః | మమాప్యఖిలలోకానాం వంద్యో నారాయణో గురుః | 7

తత్సాంప్రత మిమే దైత్యాః కాలనేమిపురోగమాః | మర్త్యలోకం సమాగమ్య బాధన్తే7హర్నిశం ప్రజాః || 8

కాలనేమి ర్హతో యో7సౌ నిష్ణునాప్రభవిష్ణునా | ఉగ్రసేనసుతఃకంసః సంభూతః సమహాసురః || 9

ఆరిష్టో ధేనుకః కేశీ ప్రలంబో నరక స్తథా | సుందో7సుర స్తథాత్యుగ్రో బాణశ్చాపిబలే స్సుతః || 10

తథా7న్యేచమహావీర్యా నృపాణాం భవనేషు యే | సముత్పన్నా దురాత్మాన స్తాన్నసంఖ్యాతు ముత్సహే || 11

అక్షౌహిణ్యోహి బహులా దివ్యమూర్తి ధృతాః సురాః| మహాబలానాం దృప్తానాం దై త్యేంద్రాణాం మమోపరి || 12

తద్భూరిభారపీడార్తా న శక్నోమ్యమరేశ్వరాః| బిభుర్తుమాత్మాన మహి మితివిజ్ఞాపయామివః || 13

క్రియతాం తన్మహాభాగామమ భారావతారణమ్‌ | యథారసాతలం నాహం గచ్ఛేయమితి విహ్వలా || 14

వ్యాసఉవాచ

ఇత్యాకర్ణ్య ధరావాక్య మశేషైస్త్రీదశైస్థితః | భవో భారావతారార్థం బ్రహ్మాప్రాహ చ చోదితః || 15

అగ్ని బంగారమునకు గురువు. గ్రహములకు సూర్యుడు గురువు. నాకును మఱి యెల్లలోకములకు వంద్యుడైన గురువు నారాయణుడు. ఇపుడు కాలనేమి మొదలుగా గల యీ దైత్యులు మర్త్యలోకమునకు వచ్చి రేయింబవళ్ళు ప్రజలను బాధించుచున్నారు. ప్రభువైన విష్ణువుచే కాలనేమి గూల్పబడెను. ఉగ్రసేనుని కొడుకు కసుండను మహాసురుడు పుట్టియున్నాడు. అరిష్టుడు ధేనుకుడు కేశిప్రలంబుడు నరకుడు సుందుడు మహోగ్రుడగుబాణుడు (బలికొడును) మఱి యెందరో రాజుల యిండ్ల బుట్టినారు. వారిని లెక్కపెట్ట నుత్సహించను. దివ్యమూర్తిధరులగు దేవతలు మదించియున్న దైత్యరాజులుంగలిసి యక్షౌహిణులనేకములు నామీద నున్నవి. ఆ బరువు సైపలేకున్నానని మీకు విన్నవించుకొను చున్నాను. నేను బాతాళమునకు గ్రుంగిపోకుండ యీ నా బరువును మీరు దింపవలయును. అని యవని మాట విని సురల ప్రేరణచే బ్రహ్మ భూభానహరణార్థమయి యిట్లు పలికెను.

బ్రహ్మోవాచ

యదాహ వసుథా సర్వం సత్యమే తద్దివౌకసః | అహం భవో భవన్తశ్చ సర్వం నారాయణాత్మకమ్‌ || 16

విభూతయస్తు యా స్తస్య తాసామేవ పరస్పరమ్‌ | అధిక్యం న్యూనతా బాధ్యబాధకత్వేన వర్తతే || 17

తదాగచ్ఛత గచ్ఛామః క్షీరాదబ్ధేస్తట ముత్తమమ్‌| తత్రారాధ్య హరిం తసై#్మ సర్వం విజ్ఞాపయామవై || 18

సర్వదైవ జగత్యర్థే స సర్వాత్మా జగన్మయః | స్వల్పాం శేనావతీర్యోర్వ్యాం ధర్మస్య కురుతే స్థితిమ్‌ || 19

వ్యాసఉవాచ

ఇత్యుక్త్వా ప్రయ¸° తత్ర సహ దేవైః పితామహః | సమాహిత మనా భూత్వా తుష్టావ గరుఢధ్వజమ్‌|| 20

ఓ వేల్పులార! భూదేవి యిపుడన్నదియెల్ల నిజము. నేను భవుడు (శివుడు) మీరు మఱి యంతయు నారాయణ స్వరూపము. ఇవన్నియు హరియొక్క విభూతులే. ఆ విభూతుల హెచ్చుదగ్గుల ననుసరించియే యొకరినొకరుబాధింపబడువారు ఒకరు బాధించువారుగ దోచుచుందురు. అందుచే మనమందరము పాలకడలి యొడ్డునకు వెళ్ళుదము. అచట హరిని యారాధించి యాయనకు విన్నవింతము. ఆ దేవుడు జగన్మయుడు భూమి యువకారమునకై సత్వ గుణాంశమున నవనిపై నవతరించి ధర్మస్థితిని గావించును. అని నలువ సురలతో నేగి మనసు నిలిపి గరుడధ్వజునిట్లు స్తుతించెను.

బ్రహ్మోవాచ

నమోనమస్తే7స్తు సహస్రమూర్తే సహస్రబాహో! బహువక్త్రపాద |

నమోనమస్తే జగతః ప్రవృత్తి వినాశ సంస్థానపరాప్రమేయ || 21

సూక్ష్మాతి సూక్ష్మం చ బృహత్ప్రమాణం గరీయసామప్యతి గౌరవాత్యన్‌ |

ప్రధాన బుద్ధీం ద్రియ వాక్ప్రధానమూలా పకాత్మన్భగవన్ప్రసీద || 22

ఏషా మహీ దేవ! మహీప్రసూతై ర్మహాసురైః పీడితశైలబంధా |

పరాయణం త్వాం జగతాముపైతి భారావతారార్థమపారపారమ్‌ || 23

ఏతే వయం వృత్రరిపు స్తథా7యం నాసత్యదస్రౌ వరుణ స్తథైషః |

ఇమేచ రుద్రా వసవః ససూర్యాః సమీరణాగ్ని ప్రముఖాస్తథా7న్యే || 24

సురాః సమస్తాః సురనాథ కార్యమేభిర్మయా యచ్చ తదీశ సర్వమ్‌ ||

ఆజ్ఞాపయా 77జ్ఞాం ప్రతిపాలయంత స్తవైవ తిష్టామ సదా7 స్తదోషాః 25

సహస్రమూర్తీ! సహస్రపాద సహస్రముఖ సృష్టి స్థితిలయకారణ అప్రమేయ నీకు నమస్కారము. సూక్ష్మాతి సూక్ష్మము. బృహత్ప్రమాణము గొప్పవానికెల్ల గొప్పది ప్రధానము బుద్ధి యింద్రియములు వాగ్రూపమయిన వేదములకు మూలము పరమునైన యో భగవంతుడా! ప్రసన్నుడవగుము. ఈ భూమి భూమిం బుట్టిన మహాసురులచే బీడనొందిన పర్వతబంధములు గలదై జగత్పరాయణమైన నిన్ను భారము దింపగోరి యరుదెంచెను. ఈ మేము ఇంద్రుడు అశ్వినీదేవులు. వరుణుడు ఇరుగోరుద్రులు వసువులు సూర్యులు వాయువు అగ్ని మొదలగు నెల్లర మరుదెంచితిమి. మా యొనరింపవలసినవని యానతిమ్ము. నీ చెప్పినది విధేయులమై యొనరింతుము. దోషములు వాసి నీ హద్దున నిలుతుము.

వ్యాసఉవాచ

ఏవం సంస్తూయమానస్తు భగవాన్పరమేశ్వరః| ఉజ్జహారా7త్మనః కేశౌ సితకృష్ణౌ ద్విజోత్తమాః || 26

ఉవాచ చ సురానేతౌ మత్కేశౌ వసుధాతలే | అవతీర్య భువో భారక్లేశహానిం కరిష్యతః || 27

సురాశ్చ సకలాః స్వాంశై రవతీర్య మహీతలే | కుర్వంతు యుద్ధమున్మత్తైః పూర్వోత్పన్నై ర్మహాసురైః || 28

తతఃక్షయ మశేషాసై దైతేయా ధరిణీ తలే | ప్రయాస్యంతి వ సందేహో నానాయుధ విచూర్ణితాః || 29

వసుదేవస్యయా పత్నీ దేవకీ దేవతోపమా | తస్య గర్భో7ష్టమో7యం తు మత్కేశో భవితాసురాః || 30

అవతీర్య చ తత్రాయం కంసం ఘాతాయితా భువి | కాలనేమి సముద్భూత మిత్యుక్త్వా7స్తర్దధే హరిః || 31

భగవంతుడిట్లు స్తుతింపబడి పరమేశ్వరుడు గావున వారి ననుగ్రహింప తన రెండు శిరోజములను తెలుపు నలుపు వానిని నూడబెరికి వారికి జూపి యీ కేశములు వసుధ యందవతరించి భూభార క్లేశమును హరింపగలవు. సురలెల్లరుం దమదమ యంశములచే నవనీతలమందవతరించి మదోన్మత్తులయి పుట్టియున్న మహా రాక్షసులతో యుద్ధము నొనరింతురుగాక! అందుచే నానాయుధ హతులై యశేష దైత్యకూటము నశించును. సందియము లేదు. వసుదేవుని ధర్మపత్ని దేవతాసమానురాలు దేవకి. ఆమె యెనిమిదవ గర్భము గనీ నాకేశమవతరించును. కంసాదులను సంహరించును అని హరి యంతర్థానమందెను.

అదృశ్యాయ తతస్తే7పి ప్రణిపత్య మహాత్మనే | మేరు పృష్ఠం సురాజగ్ము రవతేరుశ్చ భూతలే || 32

కంసాయ చాష్టమో గర్భో దేవక్యా ధరణీతలే భవిష్యతీ త్యాచచక్షే భగవాన్నారదోమునిః || 33

కంసోపి తదుపశ్రుత్య నారదా త్కుపిత స్తతః | దేవకీం వసుదేవంచ గృహేగుప్తావధారయత్‌ ||34

జాతం జాతంచ కంసాయ తేనైవోక్తం యథాపురా | తథైవ వసుదేవో7పి పుత్రమర్పితవాన్ద్విజాః || 35

హిరణ్యకశిపోః పుత్రాః షడ్గర్భాఇతి విశ్రుతాః | విష్ణుప్రయుక్తా తాన్నిద్రా క్రమాద్గర్భే న్యయోజయత్‌ || 36

యోగనిద్రా మహామయా వైష్ణవీ మోహితం యయా | అవిద్యయా జగత్సర్వం తామాహ భగవాన్హరిః || 37

అదృశ్యుడయిన యమ్మహాత్మునికి నమస్కరించి యా దేవతలును మేరుగిరినెత్తమునకేగి యటనుండి యవనికిం దిగిరి. నారద భగవానుడు కంసుని కడకేగి దేవకి యెనిమిదవ గర్భము (శిశువు) అవతరించునని తెల్పెను. కంసుడు విని కోపగించి దేవకీ వసుదేవులను కారాగారమున నుంచెను. తాను మున్నిచ్చిన మాట ననుసరించి వసుదేవుడు పుట్టినవానిం బుట్టినట్లు బిడ్డలంగొనిపోయి కంసుని కప్పగించెను.అట్లు జనించిన కొడుకు లార్వురు. తొలిజన్మమున హిరణ్యకశివుని పుత్రులట. విష్ణు ప్రేరణమునొంది నిద్రాదేవి (యోగనిద్ర) గర్భమునందు వారి నావేశించెను. ఆమె వైష్ణవియైన మాయ అవిద్యారూపమైన యా మాయచేతనే జగమెల్ల మోహితమగుచుండును. ఆమెంగని హరి యిట్లనియె.

విష్ణురువాచ

గచ్ఛనిద్రే మమాదేశాత్పాతాళతల సంశ్రయాన్‌| ఏకైకత్వేన షడ్గర్భాన్దేవకీ జఠరే నయ|| 38

హతేషుతేషు కంసేన శేషాఖ్యోం7శస్తతో7నఘః | అంశాంశేనోదరే తస్మాః సప్తమః సంభవిష్యతి || 39

గోకులే వసుదేనన్య భార్యా వై రోహిణీ స్థితా | తస్యాః ప్రసూతి సమయే గర్భోనేయ స్త్వయోదరమ్‌ || 40

సప్తమో భోజరాజస్య భయా ద్రోధోపరోధతః | దేవక్యాః పతితో గర్భ ఇతిలోకో వదిష్యతి || 41

గర్భ సంకర్షణాత్సో7థ లోకే సంకర్షణతి వై | సంజ్ఞామవాప్స్యతే వీరః శ్వేతాద్రి శిఖరోపమః || 42

తతో7హం సంభవిష్యామి దేవకీ జఠరే శుభే | గర్భే త్వయా యశోదాయా గంతవ్యమవిలంబితమ్‌ || 43

ప్రావృట్కాలే చ నభసి కృష్ణాష్టమ్యామహం నిశి | ఉత్పత్స్యామి నవమ్యాం చ ప్రసూతిం త్వమవాప్స్యసి | 44

యశోదాశయనే మాం తు దేవక్యాస్త్వామనిందితే | మచ్ఛక్తిప్రేరితమతి ర్వసుదేవో నయిష్యతి || 45

కంసశ్చ త్వాముపాదాయ దేవి శైలశిలాతలే | ప్రక్షిపత్యంతరిక్షే చ త్వం స్థౌనం సమవాప్స్యసి || 46

తతస్త్వాం శతథా శక్రః వ్రణమ్య మమగౌరవాత్‌ | ప్రణిపాతానతశిరా భగినీత్వే గ్రహీష్యతి || 47

తతః శుంభనిశుంభాదీన్హ త్వా దైత్యాన్సహస్రశః | స్థానైరనేకైః పృథివీమశేషాం మండయిష్యసి || 48

త్వంభూతిః సన్నతిః కీర్తిః కాంతిర్వై పృథావీధృతిః | లజ్జా పుష్టి రుషా యాచ కాచిదన్యా త్వమేవ సా || 49

యే త్వామార్యేతి దుర్గేతి వేదగర్భేం7బికేతిచ | భ##ద్రేతి భద్రకాళీతి క్షేమ్యా క్షేమంకరీతి చ || 50

ప్రాతశ్చై వాపరాహ్ణే చ స్తోష్యం త్యానమ్రమూర్తయః | తేషాం హివాంఛితం సర్వం మత్ర్పసాదాద్భవిష్యతి || 51

సురామాంసోపహారైస్తు భక్ష్యభోజ్యైచ్ఛపూజితా | నృణామశేషకామాంస్త్వం వ్రసన్నాయాన్‌ ప్రదాన్యసి || 52

తే సర్వే సర్వదా భద్రా మత్ర్పసాదాదసంశయమ్‌ | అసందిగ్ధం భవిష్యంతి గచ్ఛదేవి యథోదితమ్‌ || 53

ఇతి శ్రీబ్రహ్మపూరాణ హారేరంశావతార నిరూపణం నామ ఏకాశీత్యధికశతతమో7ధ్యాయః

ఓ నిద్రా ! నాయాజ్ఞచే నీవేగి పాతాళమందున్న వారి నొక్కక్కని గొని దేవకీ జఠరముం జేర్పుము. కంసునిచే వారు చంపబడగా శేషుని యంశమున బుణ్యమూర్తి యా దేవకి యేడవ గర్భమగును. గోకులమునందు వసుదేవుని భార్య రోహిణి గలదు. అమె ప్రసవ సమయమందు ఈ సప్తమ గర్భముంగొని యేగి యామె యుదరమందునుపుము. భోజరాజగు కంసుని వలని జడుపుచే బంధనముచే దేవకి గర్భము భంగమైనదని జనశ్రుతి పుట్టును. గర్భసంకర్షణముచే నాశిశువు ''సంకర్షణుడు'' అని పేరొందును. అవ్వల నేనా దేవకి శుభస్థానమైన గర్భమందుందును. నీవప్పుడు యశోద యుదరమునందు విలంబము లేకుండ నుండదగును. వర్షర్తువున శ్రావణ బహుశాష్టమి నాడర్థరాత్రి నేను బుట్టెదను. నాశక్తి ప్రేరణమందిన బుద్ధితో వసుదేవుడు దేవకి ప్రక్కలోనున్న నిన్నుయశోద ప్రక్కలోనికింజేర్చును. కంసుడు నిన్ను బట్టి ఒకకొండబండపైకి విసరికొట్టును. నీ వంతరిక్షమున కెగిరి నిలుతువు. అంతట నిన్నింద్రుడు నామీది గౌరవముచే పలుమారులు నమస్కరించి తలవంచి తన చెల్లెలుగా గారవించును. అటుపై నీవు శుంభనిశుంభాది దైత్యులను వేలకొలది సంహరించి పృథివియందు వేఱువేఱు స్థానములందు వేఱువేఱు రూపములచే నలరికరింతువు. నీవే భూతివి సన్నతివి కీర్తివి కాంతివి పృథివివి ధృతివి లజ్జ పుష్ఠి రుపా (రోషము) మఱియేమేమి శక్తులుగలవన్నియు నీవే. ఆర్య దుర్గ వేదగర్భఅంబిక భద్ర భద్రకాశి క్షేమ్య క్షేమంకరి యని ప్రాతఃకాలమునం దపరాహ్ణమున జనులు వినతులై నిన్ను బెక్కురీతుల స్తుతింతురు. వారి వాంఛితమెల్ల నా ప్రసాదమున సమకూరును కల్లు మాంసము భక్ష్య భోజ్యములు నివేదించి పూజించిన మానవుల యెల్ల కోరికల నెవ్వరికి నీవు ప్రసన్నవై యనుగ్రహింతువో వారందఱు నన్నివేళల నా యనుగ్రహమున భద్రమూర్తులగుదురు. సందేహములేదు. దేవి ! నే నుడివినట్లు చనుము.

ఇది బ్రహ్మపురాణమునందు హరియంశావతారవర్ణనమను నూట యెనుబదవ అధ్యాయము.

Brahmapuranamu    Chapters