Brahmapuranamu    Chapters   

అధ పంచ దశో7ధ్యాయః

వృష్ణి వంశ వర్ణనమ్‌

లోమహర్షణ ఉవాచ -

క్రోష్టో రథాభవ త్పుత్రో వృజనీవా న్మహాయశాః | వార్జినీవత మిచ్ఛంతి స్వాహిం స్వాహాకృతాంవరమ్‌ || 1

స్యాహిపుత్రో7భవద్రాజా ఉషద్గు ర్వదతాం వరః | మహాక్ర తుభి రీజే యో వివిథై ర్భూరి దక్షిణౖః || 2

తతః ప్రసూతిమిచ్చన్‌ వై ఉషద్గుః సో7 గ్ర్యమాత్మజమ్‌ | జజ్ఞే చిత్రరథస్తస్య పుత్రః కర్మభి రన్వితః || 3

ఆసీ చ్ఛైత్రరథి ర్వీరో యజ్వా విపులదక్షిణః శశబిందుః పరం వృత్తం రాజర్షీణా మనుష్ఠితః || 4

పృథుశ్రవాః పృధుయశా రాజా77సీ చ్ఛాశబిందవః | శంసంతి చ పురాణజ్ఞాః పార్ధశ్రవస మంతరమ్‌ || 5

సూనూతుడిట్లనియె -

క్రోష్టునికి వృజినీవంతుడుపుట్టెను. వానికి స్వాహి. యజ్ఞకర్తలలో శ్రేష్ఠుడ. స్వాహి కుమారుడు ఉషద్గువు. అతడు సంతతి కొఱకు భూరిదక్షిణములైన యజ్ఞములు సేసి చిత్రరథుడనుకుమారునిం బడసెను. అతడు మంచికర్మిష్ఠి. వాని కుమారుడు శశబిందువు యజ్వ. విపులదక్షిణుడు. రాజర్షులవర్తనము ననుష్ఠించినవాడు. శశిబిందుని నందనుడు పృధుశ్రవుడు యశస్వి రాజయ్యెను. పురాణవిదు లాతని కుమారుని అంతరుడని చెప్పుదురు.

అంతరస్య సుయజ్ఞస్తు సుయజ్ఞతనయో7భవత్‌ ఉషతో యజ్ఞమకరోత్‌స్వధర్మేచ కృతాదరః || 6

సినేయు రభవ త్పుత్రః ఉషతః శత్రుతాపనః | మరుత స్తస్య తనయో రాజర్షి రభవ న్నృపః || 7

మరుతో7లభత జ్యేష్ఠం సుతం కంబలబర్హిషమ్‌ | చచార విపులం ధర్మ మమర్షాత్ర్పత్యభాగపి || 8

స సత్ర్పసూతిమిచ్చన్‌ వైసుతం కంబలబర్హిషః | బభూవ రుక్మకవచః శతప్రసవతః సుతః || 9

నిహత్య రుక్మకవచః శతం కవచినాం రణ | ధన్వినాం నిశితైర్బాణౖరవాప ప శ్రియ ముత్తమామ్‌ || 10

జజ్ఞే చ రుక్మకవచా త్పరజిత్పర వీరహా| జజ్ఞిరే పంచపుత్రాస్తు మహావీర్యాపఠాజితాః || 11

రుక్మేషుః పృధురుక్మశ్చ జ్యామఘః పాలితో హరిః | పాలితంచ హరిం చైవ విదేహేభ్యః పితా దదౌ || 12

రుక్మేషు రభవ ద్రాజాపృధురుక్మస్య సంశ్రయాత్‌ | తాభ్యాం ప్రవ్రాజతో రాజా జ్యామఘో వసదాశ్రమే || 13

ప్రశాంతశ్చ తదా రాజా బ్రాహ్మణౖ శ్చావబోధితః | జగామ ధనురాదాయ దేశమస్యం ధ్వజీ రథీ || 14

నర్మదాకూలమేకాకి మేకలాంమృత్తి కావతీమ్‌ | ఋక్షవంతం గిరిం జిత్వాశుక్తి మత్యామువాస సః || 15

జ్యామఘస్యా భవద్భార్యా శైబ్యా బలవతీసతీ | అపుత్రో7పి స రాజా వై నాన్యాం భార్యామవిందత || 16

ఈతనికి నుయజ్ఞుడుదయించెను. వానికి ఉషతుడు గల్గె. అతడు స్వధర్మాదరుడు. వానికి కొడుకు శినేయుడు. శత్రు తావనుడతడు. వానితనూజుడు మరుతుడు. అతడు రాజర్షి. వాని జ్యేష్టసుతుడు కంబలబర్హిషుడు. అతడు ప్రేత్యభాక్కయ్యు మరణోన్ముఖుడైc గూడ ఉత్తమ సంతతిగల కుమారుడుc గావలెనని గొప్పధర్మానుష్ఠానమును కోపముతో గావించెను. నూర్గురు పుట్టిన తరువాత నతనికి యుత్తముడగు కుమారుడొక్కడుదయించెను. అతడు రుక్మకవచుడు. అతడు కవచధారులైన నూర్గరుత్తమ ధానుష్కులను రణమునందు వాడియైన బాణములతో చంపి అత్యుత్తమ శ్రీ లాభమందెను. వానికి శత్రు సంహారకుడగు పరాజిత్తు వానికి రుక్మేషువుపృధురుక్ముడు జ్యామఘుడు పాలితుడు హరియను మహావీరులపరాజితులు సుతు లైదుగురుదయించిరి. తండ్రి పాలితుని హరిని విదేహ రాజులకిచ్చెను. ఫృథురుక్ముని యాశ్రయమున రుక్మేషుడు రాజయ్యె. వారిద్దరిచే నంపబడిన జ్యామఘుడు. అశ్రమమందుండెను, అతడుబ్రాహ్మణులచే లెన్సగ బోధింపcబడి ఏకాకియై ధనుస్సుపట్టి ధ్వజము రథముంగొని మరియొక దేశమునకు ఏగెను. నర్మదాతీరమున నొంటరిగా తిరుగుచు మేకల మృత్తికావతి ఋక్షవంతమను గిరిని గెలిచి శుక్తిమతీ నగరమునందు వసించెను వాని భార్య శైబ్య. బలశాలిని, పతివ్రత, సంతానము లేకున్నను నాతడు మఱియెక భార్యను జేసికొనలేదు.

తస్యా77సీద్విజయో యుద్ధే తత్ర కన్యా మవాపసః | భార్యా మువాచ సంత్రస్తః ఘ్నషేతి స జనేశ్వరః || 17

ఏతచ్ఛృత్వా7 బ్రవీద్దేవీ కస్య దేవ! స్ను షేతివై ఆబ్ర వీత్తదుపశ్రుత్య జ్యామఘో రాజసత్తమః || 18

అతని కొకానొక యద్ధమందు జయము, గల్గెను. అందొక కన్యం గానుకగ బడసెను. ఆమెం గొని భార్యదరికేగి భయముతో కోడలిదిగోయని చూపెను. ఆమె యవరి కోడలు ? యనిప్రశ్నించెన, దానిని విని జ్యామఘుడిట్లనెను.

రాజోవాచ

యస్తేజనిష్యతే పుత్రస్తస్య భార్యోపపాదితా 19

రాజిట్లనియె -

నీకు పుట్టబోవు కుమారుని కిది భార్యయనెను.

లోమహర్షణ ఉవాచ -

ఉగ్రేణ తపసా తస్యాః కన్యాయాః సా వ్యజాయత | పుత్రం విదర్భం సుభగా శైబ్యా పరిణతా సతీ || 20

రాజపుత్ర్యాం తు విద్వాంసౌ స్నుషాయాం క్రథ కైశికౌ | పశ్చా ద్విదర్భో7జనయ చ్ఛూరౌ రణవిశారదౌ || 21

భీమో విదర్భస్య సుతః కుంతి స్తస్యా77త్మజోభవత్‌ | కుంతేర్ధృష్టః సుతో జజ్ఞేరణధృష్ణః ప్రతాపవాన్‌ || 22

ధృష్టస్య జజ్ఞిరే శూరాస్త్రయః పరమధార్మికాః | అవంతశ్చ దశార్హశ్చ బలీ విషహరళ్చ సః || 23

దశార్హస్య సుతో వ్యోమా. వోమ్నో జీమూత ఉచ్యతే | జీమూతపుత్రో వికృతి స్తస్య భీమరథః స్మృతః || 24

ఆథ భీమరథస్యా77సీత్రుత్రో నవరథస్తధా | తస్య చా77సీద్దశరథః శకుని స్తస్య చా77త్మజః || 25

తస్మాత్కరంభః కారంభిర్దేవరాతో7భవన్నృపః| దేవక్షత్రో7భవత్తస్య వృధ్ధక్షత్రో మహాయశాః || 26

దేవగర్భనమో జజ్ఞే దేవక్షత్రస్య నందనః | మధూనాం వంశకృద్రాజా మధు ర్మధురవాగపి || 27

మథోర్టజ్ఞే7థ వైదర్భ్యాం పురుద్వా న్పురుషోత్తమః | ఐక్ష్వాకీ చాభవద్భార్యా మధోస్తస్యాం వ్యజాయత || 28

సత్వా న్సర్వగుణోపేతః సాత్వతాం కీర్తివర్ధనః | ఇమాం విసృష్టిం విజ్ఞాయ జ్యామఘస్య మహాత్మనః

యుజ్యతే పరమప్రీత్యా ప్రజావాంశ్చ భ##వేత్సదా || 29

మఱియు సూతుడిట్లనియె

ఆకన్య ఉగ్రమైన తపస్సు చేసెను. ఆతపఃఫలముగా శైబ్య వృద్ధయై విదర్భుడనుకుమారుం గనెను, విదర్భుడా రాజపుత్రికయందు క్రధకైశికులను శూరులు విద్వాంసులు నగు నిద్దరు కుమారులుం గాంచెను, వారు రణ విశారదులు. విదర్భునికుమారుడు భీముడు, వాని తనయుడు కుంతి. వాని కొడుకు దృష్టుడు, అతడు రణధృష్టుడు, ప్రతాపశాలి, వాని కొడుకులు ముగ్గురు. శూరులు, పరమధార్మికులు, అవంతుడు- దశార్హుడు - విషహరుడు దశార్హ సుతుడు వ్యోముడు, వాని కొడుకు జీమూతుడు, వాని తనయుడు వికృతి వానివాడు భీమరథుడు . నవరథుడు నవరథుని పుత్రుడు దళరథుడు, వాని కుమారుడు శకుని. శకునిసుతుడు కరంభుడు, కరంభుని తనయుడు దేవరాతుడు, వాని పుత్రుడు దేవక్షత్రుడు. వాని సుతుడు వృద్ధక్షత్రుడు. వృద్ధక్షత్రనందనుడు, దేవపుత్రనముడు మధువుల వంశమునకు కర్త మధురవక్తయగు మధువనువాడు, మధువునకు వైదర్భియందు పురుషోత్తముడగుపురుద్వంతుడను వాడుదయించెను. మధునికైక్ష్వాకి (ఇక్ష్వాకు వంశజాత) యను భార్యయందు సర్వగుణొపేతుడు సాత్వతకీర్తిపర్ధసుడగు సత్త్వంతుడు అను వాడు పుట్టెను. అతడు సాత్త్వతులనుపేరు తెచ్చినవాడు. మహాత్ముడగు జ్యామఘుని విసృష్టిని విన్నవాడెప్పుడు పరమ ప్రీతినందును ప్రజావంతుడునగును.

లోమహర్షణ ఉవాచ

సత్త్వతః నత్త్వనంపన్నాన్కౌశల్యా సుషువే సుతాన్‌ | భాగినం భజమానం చ దివ్యం దేవవృధం నృపమ్‌ || 30

అంధకం చ మహాబాహూం వృష్టించ యదునందనమ్‌ | తేషాం విసర్గా శ్చత్వారో విన్తరే ణహ కీర్తితాః || 31

భజమానన్య సృంజ¸°్య బాహ్యకా7థోపబాహ్యకా | అస్తాం భార్యే తయో స్తస్మా జ్జజ్ఞిరే బహవః సుతాః || 32

క్రిమిశ్చ క్రమణశ్చైవ ధృష్టః శూరః పురంజయః | ఏతే బాహ్యకసృంజయ్యాం భజమానా ద్విజజ్ఞిరే || 33

అయుతాజిత్సహస్రాజి చ్ఛతాజిత్త్వథ దాసకః ఉపబాహ్యకసృంజయ్యాం భజమానా ద్విజజ్ఞిరే || 34

నూతుడనియె-

సత్త్వcతుని వలన కౌసల్యయను నామె బలశాలురగు భాగి, భజమానుడు, దివ్యుడు దేవావృథుడు, అంథకుడు యదునందనుడగు వృష్టి అనువారలగనెను. వారి విశేషసృష్టుల నాల్గింటిని విస్తరించి వర్ణించితిమి. భజమానునికి సృంజయకుమారైలు బాహ్యక ఉపబాహ్యక అను భార్యలుండిరి. వారికిcబెక్కురు పుత్రులుకల్గిరి. క్రిమి, క్రమణుడు, ధృష్టుడు, శూరుడు, పురంజయుడు, వీరు బాహ్యకసృంజయియందు భజమానునకు జన్మించిరి. అయుతాజిత్తు, సహస్రజిత్తు, శతాజిత్తు దాసకుడు అనువారు ఉపబాహ్యక సృంజయియందు గల్గినవారు.

యజ్వా దేవావృథో రాజా చచార విపులం తపః | పుత్రః సర్వగుణోటేతో మమ స్యాదితి నిశ్చితః || 35

సంయుజ్యమాన స్తపసా పర్ణాశాయా జలం స్పృశన్‌ | సదోప స్పృశత స్తస్య చకార ప్రియ మాపగా || 36

చింతయాభివరీతా సా న జగామైవ నిశ్చయమ్‌ | కల్యాణత్వా న్నరపతే స్తస్య సా నిమ్నగోత్తమా || 37

నాధ్యగచ్ఛత్తు తాం నారీం యస్యా మేవంవిధః సుతః | భ##వే త్తస్మా త్స్వయం గత్వా భవా మ్యస్య సహానుగా || 38

అథ భూత్వా కుమారీ సా బిభ్రతో పరమం వపుః | వరయామాస నృపతిం తా మియేష చ స ప్రభుః || 39

దేవవృథుడు యజ్వ, తపస్వి. నాకుగుణశాలి కుమారుడుగావలెనని తపోనిష్ఠcగొని పర్ణాశానదీజలమాచమించి, తపమాచరించుచుండెను. ఆనదికి సదా తనయందు స్నానముచేయునాతనిపై ప్రేమకలిగెను. కాని యేలాటిప్రియ మాచరించుటయను నాలోచనలో నొకనిశ్చయమునకురాజాలదయ్యెను. ఈరాజు కల్యాణగుణుడు. ఈతని కీడైన కల్యాణి యెవ్వతె? ఇతడు కోరిన గుణశాలి కుమారు డుదయింపవతెనన్న నేలాటి యుత్తమ కన్యయితనికి పత్ని కావలెను? అని యేమేమో తనలో దాను గుణించుకొని తుదకు నేనే యేగి యీతనికింతి నగదునని పరమసుందరరూపము ధరించి యానృపతిని వరించెను. ఆమె నాప్రభు విచ్చగించెను.

తస్యా మాధత్త గర్భం స తేజస్విన ముదారధీః | ఆథ సా దశ##మే మాసి సుషువే సరితాం వరా || 40

పుత్రం సర్వగుణోపేతం బభ్రుం దేవావృధం ద్విజాః | అత్ర వంశే పురాణజ్ఞా గాయంతీతి పరిశ్రుతమ్‌ || 41

గుణా న్దేవావృధస్యాపి కీర్తయంతో మహాత్మనః | యథై వాగ్రే తథా దూరా త్పశ్యామ స్తావ దంతికాత్‌ || 42

బభ్రుః శ్రేష్ఠో మునుష్యాణాం దేవై ర్దేవావృధః సమః | షష్టిశ్చ షట్చ పురుషాః సహస్రాణి చ స ప్త చ || 43

ఏతే7 మృతత్వం ప్రాప్తా వైబభ్రో ర్దేవావృధా దపి | యజ్వా దానపతి ర్దీమా న్బ్రహ్మణ్యః సుదృఢాయుధః || 44

తస్యాన్వవాయః సుమహా న్బోజా యే సార్తికావతాః | అంధకా త్కాశ్యదుహితా చతురో7 లభతా7త్మజాన్‌ || 45

కుకురం భజమానం చ ససకం బలబర్హిషమ్‌ | కుకురస్య సుతో వృష్టి ర్వృష్టేస్తు తనయ స్తథా ః 46

కపోతరోమా తస్యాథ తివిరిస్తసయో7 భవత్‌ | జజ్ఞె పునర్వసు సస్మా దభిజిచ్ఛ పునర్వసోః || 47

తధా వై పుత్రమిథునం బభూవాభిజితః కిల | ఆహుకః శ్రాహుకశ్చైవ ఖ్యాతౌ ఖ్యాతిమతాం వరౌ || 48

ఇమాం చోదాహరంత్యత్ర గాథాం ప్రతీత మహూకమ్‌ | శ్వేతేన పరివారేణ కిశోర ప్రతిమో మహాన్‌ || 49

ఉదారమతియగు నానృపతి యాసతియందు తేజస్వియైన గర్భముంచెను. పదియవనెలలో నామె సర్వకల్యాణగుణనిధియగు బభ్రుదేవావృథుడను కుమారుని గాంచెను. ఈతడు యేడువేల యరువది యాఱుగురు పురుషుల సమృతత్వమొందించెను. యజ్వ, దానవతి, ధీమంతుడు, బ్రహ్మణ్యుడు, దృఢాయుధుడు నైన యీ బభ్రుని (దేవావృధుని) వంశమున భోజులు సార్తికావతులని బ్రసిద్ధులైరి. కాశ్యపదుహిత అంధకుని వలని నల్వురం గనెను కుకురుడు భజమానుడు సనకుడు బలబర్హిషుడు అనువారు వారు. కుకురుని తనయుడు వృష్టి. వానికొడుకు కపోతరోముడు. వానివాడు తివిరి. కానిసుతుడు పుశర్వసువు వానికి అభిజిత్తు వానికి పుత్ర ద్వంద్వము ఆహుకుడు, శ్రాహుకుఢను బేర ప్రసిద్దిచెందిన వారు ఆహుకుని గూర్చి పూర్వులు ఈ క్రింది గాధనుదహరింతురు.

ఆశీతివర్మణా యుక్త ఆహుకః ప్రధమం వ్రజేత్‌ | నాపుత్రవా న్నాశతదో నాసహస్రశతాయుషః || 50

నాశుద్ధకర్మా నాయజ్వా యో భోజ మభితో వ్రజేత్‌ | పూర్వస్యాం దిశి నాగానాం భోజస్య ప్రయయుః కిల || 51

సోమా త్సంగానుకర్షాణాం ధ్వజినాం సవరూధినాం | రథానాం మేఘఘోషాణాం సహస్రాణి దశైవ తు || 52

రౌప్యకాంచనకక్షాణాం సహస్రా ణ్యతివింశతిః | తావత్యేవ సహస్రాణి ఉత్తరస్యాం తథా దిశి || 53

ఆభూమిపాలా భోజాస్తు సంతి జ్యాకింకిణీకినః | ఆహుః కించాప్యవంతిభ్యః స్వసారం దదు రంధకాః || 54

శ్వేతపరివారముతో గూడి (తెల్లవాళ్ళతో) పశివానివలె ఆహుకు డెనుబదికవచముల దాల్చి మొదట నేగును. పుత్రసంతానము లేనివాడు, నూరువేలేండ్లాయుర్థాయము లేనివాడు ఆపవిత్రకర్ముడు. యజ్వ కానివాడు, భోజరాజు వెంటనుండరాదు. భోజునికి యేనుగులు పదివేలు ధ్వజములు కవచము ధరించినవారు పదివేల మంది. మేఘ ఘోషములు గల

రధములు పదివేలు, బంగారు వెండి యెనుబోతులు ఇరువదియొక్క తూర్పు దిక్కున నేగ్‌డివి. ఉత్తరమున నటులనే నేగెడివి. భోజవంశీయ రాజులందరు వింటినారియే చిరుగంటగ మ్రోగించినట్టి వారు. మహా యోదులన్నమాట. మరియు అంధక వంశీయులు తమ తోబుట్టువును అవంతీయల కిత్తురు అని గాధ.

ఆహుకస్య తు కాశ్యాయాం ద్వౌ పుత్రౌ సంభభూవతుః | దేవకశ్చోగ్రశేనశ్చ దేవగర్భసమావుభౌ || 55

దేవక స్యాభవన్సుత్రా శ్చత్వార స్త్రిదశోపమాః | దేవవా నుపదేవశ్చ సందేవో దేవరక్షితః || 56

కుమార్యః స ప్త చాస్యాథ వసుదేవాయ తా దదౌ | దేవకీ శాంతిదేవా చ సుదేవా దేవరక్షితా || 57

వృకదే వ్యుపదేవీ చ సునామ్నీ చైవ సప్తమీ | నవోగ్రసేనస్య సుతా స్తేషాం కంసస్తు పూర్వజః || 58

న్యగ్రోధశ్చ సునామా చ తథా కంకః సుభూషణః | రాష్ట్రసాలో7 థ సుతను రనావృష్టిస్తు పుష్టిమాన్‌ || 59

తేషాం స్వసారః పంచా 77 సన్‌ కంసా కంసవతీ తథా | సుతనూ రాష్ట్రపాలీ చ కంకా చైవ వరాంగనా || 60

ఉగ్రసేనః సహా పత్యో వ్యాఖ్యాతః కుకురోబ్భవః | కుకురాణా మిమం వంశం ధారయన్నమితౌజసామ్‌ || 61

ఆత్మనో విపులం వంశం ప్రజావా నాప్నుయా న్నరః || 62

ఇతి శ్రీ మహాపురాణ ఆదిబ్రాహ్మే వృష్ణివంశనిరూపణం నామ పంచదోశో7ధ్యాయః

ఆహుకునికి కాశ్యపియనునామె యందు దేవకుమారులుబోలు దేవకుడు, ఉగ్రసేనుడడనువారిద్దరు గుమారులు గల్గిరి. దేవకుని కుమారులు నల్గురు. దేవవంతుడు, ఉపదేవుడు, సందేవుడు, దేవరక్షితుడు, అనువారు. కుమార్తెలేడుగురు. అతడు వారిని వసుదేవునికిచ్చి పెండ్లిసేసెను. వారు దేవకి, శాంతిదేవ, సుదేవ దేవరక్షిత, వృకదేవి, ఉపదేవి, సునామిన్ని, యనువారు. ఉగ్రిసేనుని కొడుకులు తొమండ్రు కంసుడు, న్యగ్రోధుడు, సునాముడు, కంకుడు, సుభూషణుండు, రాష్ట్రపాలుడు, సుతునువు, అనావృష్టి, పుష్టిమంతుడు, అనువారు. వారి చెల్లెం డ్రయిదుగురు. కంస, కంసవతీ, సుతనువు, రాష్ట్రపాలి, కంకయునువారు. కుకురవంశీయుడైన ఉగ్రసేనుడు సంతతితోగూడ వర్ణింపబడెను. మిక్కిలి తేజశ్శాలురైన కుకురుల వశమునువిని ధారణసేయుట వలన వంశాభివృద్ధినంది సుఖించును.

ఇది శ్రీబ్రహ్మపురాణమందు వృష్ణివంశనిరూపణమనెడి పదునైదవ యధ్యాయము.

Brahmapuranamu    Chapters