Brahmapuranamu    Chapters   

శ్రీమాత్రే నమః

శ్రీ మహాగణాధిపతయే నమః

శ్రీ గురుభ్యో నమః

శ్రీ సరస్వత్యై నమః

బ్రహ్మపురాణమ్‌

ప్రథమో ధ్యాయః

నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమమ్‌

దేవీం సరస్వతీం చైవ తతో జయ ముదీరయేత్‌

యస్మా త్సర్వ మిదం ప్రపంచరచితం మాయాజగ జ్జాయతే |

యస్మిం స్తిష్ఠతి యాతి చాంతనమయే కల్పానుకల్పే పునః |

యం ధ్యాత్వా మునయః ప్రపంచరహితం విందంతి మోక్షం ధ్రువం

తం వందే పురుషోత్తమాఖ్య మమలం నిత్యం విభుం నిశ్చలమ్‌ || 1

యం ధ్యాయంతి బుధాః సమాధిసమయే శుద్ధం వియత్సన్నిభమ్‌ |

నిత్యానందమయం ప్రసన్న మమలం సర్వేశ్వరం నిర్గుణమ్‌ |

వ్యక్తా వ్యక్తపరం ప్రపంచరహితం ధ్యానైకగమ్యం విభుం

తం సంసారవినాశ##హేతు మజరం వందే హరిం ముక్తిదమ్‌ || 2

ఎవనివలన నీ కనిపించెడి పంచభూతపంచీకృతము మాయాకల్పితమునైన జగమెల్ల పుట్టుచున్నదో యెవ్వనియందునికిని (స్థితిని) పొందుచున్నదో ఎవ్వనియందు చిట్టచివఱ కల్పమునందు అనుకల్పమునను లీనమగుచున్నదో యెవ్వని ధ్యానించి మునులు దృశ్యాత్మక ప్రపంచమునకు నతీతమైన, శాశ్వతమైన, మోక్షమును బొందుదురో యట్టి నిత్యమైన నిశ్చలమైన స్వయంప్రకాశ##మైన పురుషోత్తముడని పిలువబడు స్వచ్ఛమైన తత్వమును పరమాత్మను నమస్కరించుచున్నాను.

ఎవనిని శుద్ధుని (గుణరహితుని) యాకాశమువలె సర్వవ్యాపకుని సమాధిసమయమందు జ్ఞానులు ధ్యానింతురో యట్టి నిత్యానందస్వరూపుని ప్రసన్నుని, నిర్మలుని నిర్గుణుని సర్వేశ్వరుని వ్యక్తావ్యక్తస్థితికి నతీతమైన వానిని ప్రపంచశూన్యుని (ద్రష్టయైన వానిని) ధ్యానమాత్ర గమ్యమైన ప్రకాశరూపుని, జనన మరణాత్మకసంసార వినాశ హేతువైనవాని నజరుని మోక్షమనుగ్రహించువానిని (ముకుందుని) హరిని ధ్యానింతును. (1-2)

నైమిశారణ్య వర్ణనమ్‌.

సుపుణ్య నైమిశారణ్య పవిత్రే సుమనోహరే | నానామునిజనాకీర్ణే నానాపుష్పోపశోభితే 3

సరళైః కర్ణికారైశ్చపనసై ర్ధవఖాదిరైః | ఆమ్ర జంబూ కపిత్థైశ్చ న్యగ్రోధై ర్థేవదారుభిః 4

అశ్వత్థైః పారాజాతైశ్చ చందనాగరుపాటలైః | వకులై స్సప్తవర్ణైశ్చ పున్నాగై ర్నాగకేసరైః 5

శాలై స్తాలై స్తమాలై శ్చ నారికేళై స్తథార్జునైః | అన్యైశ్చ బహుభి ర్వృక్షైః చంపకాద్యైశ్చ శోభితే 6

నానాపక్షిగణాకీర్ణే నానామృగగణౖర్యుతే | నానాజలాశ##యైః పుణ్యౖః దీర్ఘికాద్యై రలంకృతే 7

బ్రాహ్మణౖః క్షత్రియైర్వైశ్యైః శూద్రై శ్చాన్యైశ్చ జాతిభిః | వానప్రస్థైర్గృహస్థై శ్చ యతిభి ర్బ్రహ్మచారిభిః 8

సంపన్నైర్గోకులై శ్చైవ సర్వత్ర సమలంకృతే| యవ గోధూమ చణకైః మాషముద్గతిలేక్షుభిః 9

చీనకాద్యైస్తథామేధ్యైస్ససై#్యశ్చాన్యైశ్చ శోభితే| తత్రదీప్తే హుతావహే హూయమానే మహామఖే 10

యజతాంనైమిశేయానాం సత్రే ద్వాదశవార్షికే | అజగ్ముస్తత్ర మునయ స్తథాస్యేపి ద్విజాతయః 11

తా నాగతాన్‌ ద్విజాం స్తేతు పూజాం చక్రు ర్యథోచితాం | తేషు తత్రోపవిష్టేషు ఋత్విగ్భి స్సహితేషుచ 12

తత్రాజగామ సూతస్తు మతిమాన్‌ లోమహర్షణః ! తం దృష్ట్వా తే మునివరాః పూజాం చక్రు ర్ముదాన్వితాః 13

సో పి తాన్‌ ప్రతిపూజ్యైవ సంవివేశ వరాసనే| కథాం చక్రు స్తథాన్యోన్యం సూతేన సహితా ద్విజాః14

అది మిక్కిలి పుణ్యవంతమైన నైమిశారణ్యము. పవిత్రభూమి. పరమసుందరము. మునిజనసమ్మర్దము. పలురకముల పువ్వులతో శోభించుచున్నది. సరళ=తెల్లతెగడ, కొండగోగు, పనస, ధవ=ఉమ్మెత్త, చండ్ర, మామిడి, నేరేడు, వెలగ మఱ్ఱి, దేవదారు,

రావి, పారిజాత, చందన, అగరు, పాటల (కలిగొట్టు) వకుల (పొగడ) సప్తవర్ణ (ఏడాకుల

అరటి), పున్నాగ సుర పొన్న నాగకేసర=నాగకింజల్కము శాల=బొద్దుగ తాల (తాడి) తమాల (చీకటిమ్రాను) నారికేళాది అర్జున (జువ్వి) మహావృక్షములతో, చంపకాది (సంపెంగ) లతలతో శోభితము, వినిధపక్షిమృగకుల సంకులము, నానావిధ పుణ్యసరస్సులు దిగుడుబావులతో శోభిల్లుచున్నది. బ్రాహ్మణాది చతుర్వర్ణములవారు, బ్రహ్మచర్యాది నాల్గాశ్రమములవారు స్వధర్మానుష్ఠానునిరతులై యందు వసింతురు. సర్వసంపన్నమైన గోసంపదతో నది రాణించును. యవ గోధుమ చణక (సెనగలు) మాష (మినుము) ముద్గ= (పెసర) తిల=(నువ్వు) ఇక్షు=చెఱకు మెదలగు సస్యములతో నిండినది.

అందగ్నిహోత్రుడు ఆజ్యాదిహవిర్హోమములచే నుద్దీపింప నైమిశారణ్యవాసులగు మునులారంభించిన ద్వాదశవార్షికసత్రయాగమునకు మునులు మఱి ద్విజు లెందఱో యేతెంచిరి. వారివారికి యజమానులు యథోచితపూజలాచరించిరి. ఋత్విక్కులతో వారు యజ్ఞసదస్సునందాసీనులై యుండ బుద్ధిమంతుడు లోమహర్షణుడను సూతు డరుదెంచెను. మునివరు లాయనం గని ముదముతో పూజించిరి. ఆయనయు వారికి బ్రతిపూజచేసి వా రిడినయాసన మలంకరించెను. ఋషు లన్యోన్య ప్రసంగములు కావించిరి. (3-14)

కథాంతే వ్యాసశిష్యంతే పప్రచ్ఛు స్సంశయం ముదా | ఋత్విగ్భిస్సహితా స్సర్వేసదసై#్య స్సహ దీక్షితాః 15

పురాణాగమశాస్త్రాణి నేతిహాసాని సత్తమ | జానాసి దేవదైత్యానాం చరితం జన్మ కర్మచ 16

నతే స్త్యవిదితం కించి ద్వేదే శాస్త్రేచ భారతే | పురాణ మోక్ష శాస్త్రేచ సర్వజ్ఞో సి మహామతే 17

యథా పూర్వ మిదం సర్వ ముత్పన్నం సచరాచరం | ససురాసురగంధర్వం సయక్షోరగరాక్షసమ్‌ || 18

శ్రోతు మిచ్ఛామహే సూత బ్రూహి సర్వం యథాజగత్‌ | బభూవ భూయశ్చ యథామహాభాగ భవిష్యతి || 19

యతశ్చైవ జగత్సూతం యతశ్చైవ చరాచరం| లీన మాసీ త్తథా యత్ర లయ మేష్యతి యత్రచ || 20

ఋత్విక్కులతో సదస్సులతో గోష్ఠి అయిన తరువాత యజ్ఞదీక్షితు లాయన నిట్లు ప్రశ్నించిరి. సాధూత్తమ వేదశాస్త్రపురాణములందు భారతేతిహాసమందు మోక్షశాస్త్రమగు భాగవతమునందును నీవు సర్వము తెలిసినవాడవు. దేవతల యొక్కయు దైత్యుల యొక్కయు జన్మకర్మ వృత్తాంతములు నీకు తెలియనిలేవు. సురాసుర యక్ష గంధర్వ పన్నగ రాక్షస వర్గముతోడి యీ సృష్టి యెట్లు జరిగినది? ఎట్లు పెరిగినది ఎట్లంతమయినది వినదలంతు మానతిమ్ము. (15-20)

లోమహర్షణ ఉవాచ:-

అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే! సదైకరూపరూపాయ విష్ణవే సర్వజిష్ణవే|| 21

నమో హిరణ్యగర్భాయ హరయే శంకరాయచ! వాసుదేవాయ తారాయ సర్గ స్థిత్యంత కర్మణ|| 22

ఏకానేకస్వరూపాయ స్థూలసూక్ష్మాత్మనే నమః | అవ్యక్తవ్యక్తభూతాయ విష్ణవే ముక్తిహేతవే|| 23

సర్గ స్థితి వినాశాయ జగతో యోజరామరః | మూలభూతో నమస్తసై#్మ విష్ణవే పరమాత్మనే|| 24

లోమహర్షణుడిట్లనియె---

అవికారుడు=షడ్భావవికారములు 1.ఉనికి, 2. పుట్టుట. పెరుగుట, 4. తఱుగుట, 5. పరిణమించుట (మార్పుచెందుట) 6. నశించుట అను నాఱు వికృతులు లేనివాడు, శుద్ధుడు (ఎట్టి గుణసంగము లేనివాడు) నిత్యుడు నిత్యసత్తాస్వరూపుడు విష్ణువు (సర్వ వ్యాపకుడు) సర్వము జయించువాడు హిరణ్యగర్భుడు సృష్టికర్త హరి శంకరుడు. వాసుదేవుడు సర్వదేవతలకు (జ్యోతిస్వరూపులకు) నివాసమైనవాడు తరింపజేయువాడు సృష్టిస్థితిలయములనుజేయువాడు ఏకరూపము నానారూపము తానేయైనవాడు స్థూలము=సాకారసగుణరూపము. సూక్ష్మము=అంతర్యామి జ్ఞానరూపమునైనవాడు. ఆవిధముగ వ్యక్తము అవ్యక్తమునైనవాడు ముక్తికి కారణమైనవాడు, జగన్నిర్మాణపరిపాలనలయములు చేయువాడు, అజరుడు ముదిమిలేనివాడు, అమరుడు, మరణములేనివాడు, సర్వమూలము (బీజము) నైనవాడు నైన యా పరమాత్మకు నమస్కారము. నమస్కరించుట యనగా ప్రహ్వీభావము విధేయుడననుట అభేదాను సంధానముకూడ. (21-24)

వ్యాస స్తుతి

ఆధారభూతం విశ్వస్యా ప్యణీయాంస మణీయసాం| ప్రణమ్య సర్వభూతస్థ మచ్యుతం పురుషోత్తమమ్‌|| 25

జ్ఞానస్వరూప మత్యంతం నిర్మలం పరమార్థతః | తమేవార్థ స్వరూపేణ భ్రాంతిదర్శనతః స్థితమ్‌|| 26

విష్ణుం గ్రసిష్ణుం విశ్వస్య స్థితౌ సర్గే తథా ప్రభుమ్‌| సర్వజ్ఞం జగతామీశ మజ మక్షయ మవ్యయమ్‌|| 27

ఆద్యం సుసూక్ష్మం విశ్వేశ్వం బ్రహ్మాదీ న్ర్పణిపత్యచ | ఇతిహాసపురాణజ్ఞం వేదవేదాంగపారగమ్‌ || 28

సర్వశాస్త్రార్థత త్త్వజ్ఞం పరాశర సుతం ప్రభుమ్‌ | గురుం ప్రణమ్య వక్ష్యామి పురాణంవేదసమ్మితమ్‌ || 29

ప్రపంచమున కాధారమైన వాడు అణువుకంటె నణువైన వాడు సర్వభూతములందుండు వాడు అచ్యుతుడు, జ్ఞానమూర్తి మిక్కిలి స్వచ్ఛమైనవాడు పరమార్థముగ నిర్మలుడు (గుణసంగములేనివాడు) భ్రాంతిదృష్టికి జగముగ (వస్తువుగ) దోచువాడు సర్వవ్యాపకుడు సర్వము కబళించువాడు సృష్టిస్థితులజేయు స్వతంత్రుడు సర్వజ్ఞుడు జగదీశ్వరుడు పుట్టుట హానివృద్ధులు లేనివాడు ఆద్యుడు మిక్కిలి సూక్ష్మమయినవాడు నగు విశ్వేశుని బ్రహ్మాదులకు నమస్కరించి ఇతిహాస పురాణవేత్త వేదవేదాంగ పారగుడు సర్వశాస్త్రతాత్పర్యరహస్యమెఱిగినవాడు పరాశరకుమారుడు నగువ్యాసభగవానుని నా గురుని మ్రొక్కి వేదతాత్పర్యమయిన పురాణమును జెప్పుచున్నాను. (25-29)

శా|| సాంగో పాంగ సమగ్ర వేదవిదునిన్‌ శాస్త్రార్థ తత్వైక వే

త్తం గంభీర పురాణభారత మహార్థజ్ఞానసంపన్ను న

న్నుం గారామున నేలినట్టి గురునెంతున్‌ వ్యాసుc బారాశరున్‌

రంగత్సర్వపురాణపుణ్యవచనప్రారంభసంరంభినై ||

తే.గీ.|| అణువుకంటెను నణువు మహత్తుకంటె

మఱి మహత్తౌచు విశ్వసంభరణదక్షుc

డైన పురుషోత్తముని నెందు నంతువడని

వాని భగవంతు పరమాత్మ భక్తిc గొలుతు ||

సీ|| బుద్ధికి సాక్షియై పోల్పరాకయు మనోవ్యాప్తికిన్‌, ధ్యానాన నందువాని

శుద్ధ బుద్ధ ముక్తి సూక్ష్మాత్ముcడై సర్వభూతమ్ములందును బొలుచువాని

పుట్టింపc బెంపంగ గిట్టింప హేతువ ట్లుండి హేతువుకాక యుండువాని

అచ్చమౌ తెల్వియై యానందమై భ్రాంతిదృష్టికి జగముగాc దెలియువాని

పుట్టుటయు గిట్టుటయులేక పొలుచువాని

యునికిలేములు లేనట్టి యునికి వాని

పూర్ణు విశ్వాత్ము విష్ణువున్‌ మ్రొక్కి బ్రహ్మ

మొదలుగాcగల వేల్పుల నిదె వచింతు

కథయామి యథాపూర్వం దక్షాద్యైర్మువిసత్తమైః | పృష్టః ప్రోవాచ భగవా నబ్జయోనిః పితామహః || 30

శృణుధ్వం సంప్రవక్ష్యామి కథాం పాపప్రణాశినీమ్‌|కథ్యమానాం మయా చిత్రాం బహ్వర్థాం శ్రుతివిస్తరామ్‌|| 31

యస్త్విమాం ధారయేన్నిత్యం శృణుయాద్వా ప్యభీక్షణశః | స్వవంశధారణంకృత్వా స్వర్గలోకే మహీయతే|| 32

మును దక్షాది మునులడుగగ బ్రహ్మ పలికిన కథ పాపహర మిదే చెప్పెద వినుడు. ఇది యర్థగంభీరము బహుచిత్రము వేదార్థ విస్తరము. దీని నెపుడు ధారణజేయువాడును, వినునతడును స్వవంశోద్ధరణ మొనరించి స్వర్గమందాదరింపబడును. (30-32)

ఆది సర్గవర్ణనమ్‌

అవ్యక్తంకారణంయత్తన్నిత్యం సదసదాత్మకమ్‌| ప్రధానం పురుష స్తస్మాన్నిర్మమే విశ్వ మీశ్వరః || 33

తం బుధ్యధ్వం మునిశ్రేష్ఠా బ్రహ్మాణ మమితౌజసం| స్రష్టారం సర్వభూతానాం నారాయణ పరాయణమ్‌|| 34

అహంకారస్తు మహత స్తస్మా ద్భూతాని జిజ్ఞరే| భూతభేదాశ్చ భూతేభ్య ఇతి సర్గ స్సనాతనః || 35

విస్తారావయవంచైవ యథాప్రజ్ఞం యథా శ్రుతి| కీర్త్యమానం శృణుధ్వం వః సర్వేషాం కీర్తివర్ధనమ్‌|| 36

కీర్తితం స్థిరకీర్తీనాం సర్వేషాం పుణ్యవర్ధనమ్‌|. తతః స్వయంభూర్భగవాన్సిసృక్షు ర్వివిధాః ప్రజాః || 37

తెలియరానిది యవ్యక్తము సర్వకారణము నిత్యము నున్నదియు లేనిదియునైనది ప్రధాన మొకటి గలదు. దానినుండి విశ్వమును సృజించెను. అదియెతత్త్వము బ్రహ్మ. సర్వభూతస్రష్ట, ఆతడు నారాయణపరాయణుడు. అదిమ మహత్తత్వము (బుద్ధి) అందుండి యహంకారము అందుండి భూతములు (5) జనించెను. వాని స్థితిభేదమును బట్టి వివిధ భూతకోటి పుట్టినది. ఇదియ సనాతనమగు ధర్మము సర్గము (సృష్టి) మీకీర్తి నినుమడింపజేయునది ఇవె యీ సృష్టి విలాసము. నా విన్నంత శ్రుతులవలన నా తెలిసినంత సవిస్తరముగ విన్నవింతు వినుండు. ఇది కీర్తిశాలుర కెల్లరకు పుణ్యముc బెంచును. (33-37)

అప ఏవ ససర్జా`ò`òదౌ తాసు వీర్య మవాసృజత్‌ | ఆపో నారా ఇతి ప్రోక్తా ఆపోవై నరసూనవః || 38

అయనం తస్య తాః పూర్వం తేన నారాయణః స్మృతః | హిరణ్యవర్ణ మభవ త్తదండ ముదకేశయమ్‌ || 39

తత్ర జజ్ఞే స్వయంబ్రహ్మా స్వయం భూరితి నః శ్రుతమ్‌ | హిరణ్యగర్భో భగవా నుషిత్వా పరివత్సరమ్‌|| 40

ఆ మీద స్వయంభువు (బ్రహ్మ) తొలుత అప్పులను సృజించెను. అప్పులు అనగా ప్రకాశోదకము. అందు తన వీర్యమును వదలెను. వీర్యమనగా సృష్టి సంకల్పము. ''సఐక్షత బహుస్యాం ప్రజాయేయేతి'' అనగా తానే బహురూపములుగా పుట్టవలెనని చూచెను. అని ఈ సంకల్పమునే వేదము తెల్పినది.

అప్పులకు నారములనిపేరు. అవి నరులసృష్టికి మూలములు. అవి మొదటి గమ్యస్థానము లయినందున ఆయన నారాయణుడను పేరొందెను. ఆయన వదలిన వీర్యము బంగారు గ్రుడ్డయి అప్పుల యందు (ఉదకములందు) తేలినది. ఆ ఆండమునందు బ్రహ్మ తానే స్వయంభువు అనుపేర జనించెను. అందుచే నాయనకు ''హిరణ్యగర్భుడనుపేరు వచ్చెను. (38-40)

తదండ మకరో ద్ద్వైధం దివం భువ మథాపి చ | తయో శ్శకలయోర్మధ్య ఆకాశ మకరో త్ప్రభుః || 41

అప్సు పారాప్లవాం పృథ్వీం దిశశ్చ దశధా దధే | తత్ర కాలం మనోవాచం కామం క్రోధ మథోరతిం || 42

ససర్జ సృష్టిం తద్రూపం స్రష్టు మిచ్ఛన్‌ ప్రజాపతీన్‌ | మరీచి మత్ర్యంగిరసౌపులస్త్యం పులహంక్రతుం|| 43

వసిష్ఠం చ మహాతేజాః సోసృజ త్సప్త మానసాన్‌ | సప్తబ్రహ్మాణ ఇత్యేతే పురాణ నిశ్చయం గతాః || 44

నారాయణాత్మకానాంతు సప్తానాం బ్రహ్మజన్మనామ్‌ | తతోసృజత్పురాబ్రహ్మా రుద్రం రోషాత్మసంభవమ్‌|| 45

సనత్కుమారం చ విభుం పూర్వేషామపిపూర్వజం| సప్తస్వేతా అజాయంత ప్రజా రుద్రాశ్చ భోద్విజాః || 46

స్కన్ద స్సనత్కుమారశ్చ తేజ స్సంక్షిప్య తిష్ఠతః | తేషాం సప్తమహావంశా దివ్యా దేవగణాన్వితాః || 47

క్రియావంతః ప్రజావంతో మహర్షిభి రలంకృతాః | విద్యుతోశని మేఘాంశ్చ రోహితేంద్రధనూంషిచ 48

వయాంసిచ ససర్జాదౌ వర్జన్యంచ ససర్జ హ | ఋచో యజూంషి సామాని నిర్మమే యజ్ఞసిద్ధయే 49

సాధ్యా నజనయ ద్దేవా నిత్యేవ మనుసంజగుః | ఉచ్చావచాని భూతాని గాత్రేభ్య స్తస్య జజ్ఞిరే 50

ఆపవస్య ప్రజాసర్గం సృజతో హి ప్రజాపతేః | సృజ్యమానా ప్రజా నైవ వివర్థంతే యదా తదా 51

ద్విధాకృత్వాత్మనో దేహ మర్ధేన పురుషో భవత్‌ | అర్ధేన నారీ తస్యాంతు సో సృజ త్పురుషం విరాట్‌ 52

దివంచ పృథివీంచైవ మహిమ్నా వ్యాప్య తిష్ఠతి | విరాజ మసృజ ద్విష్ణు స్సోసృజ త్పురుషం విరాట్‌ 53

పురుషం తం మనుం విద్యా త్తస్య మన్వంతరంస్మృతం | ద్వితీయం మానససై#్యత న్మనో రంతర ముచ్యతే 54

స వైరాజః ప్రజాసర్గం ససర్జ పురుషః ప్రభుః | నారాయణ విసర్గస్య ప్రజా స్తస్యా ప్యయోనిజాః 55

ఆయుష్మాన్‌ కీర్తిమాన్‌ పుణ్యప్రజావాంశ్చభ##వేన్నరః | ఆదిసర్గంవిదిత్వేమం యథేష్టాం చాప్నుయాద్గతిమ్‌ 56

ఇతి బ్రహ్మపురాణ ఆదిసర్గవర్ణనంనామ ప్రథమోధ్యాయః

ఆ హిరణ్యగర్భుడు ఒక పరివత్సరమట్లే యుండి యబ్రూపమైన తత్వమును దివము. భువమనుపేర రెండుగా నొనరించెను. ఆ రెండుశకలములనడిమి యవకాశమును నాకాశముగ గావించె. అప్పులందు మునిగిన భూమిని దేల్చి దిక్కులను బదింటిని గల్పించెను. అందే కాలము మనస్సు వాక్కు కామము క్రోధము రతియనువానిని సృజించెను. ఆ రూపమున సృష్టిని గావింపనెంచి మరీచి అత్రి అంగిరస్సు పులస్త్యుడు పులహుడు క్రతువు, వసిష్ఠుడు నను వారిని మనస్సుచేత సృజించెను. వీరు సప్తబ్రహ్మలను పేర ప్రసిద్ధి చెందిరి. ఈ సప్త బ్రహ్మమానసపుత్రులకంటె ముందే బ్రహ్మ తన రోషమునుండి రుద్రుని సృజించెను. పూర్వులకెల్ల బూర్వుడయిన సనత్కుమారుని గూడ సృజించెను. మును చెప్పిన సప్తబ్రహ్మల నుండి ప్రజలు రుద్రులు జనించిరి. స్కందుడు సనత్కుమారుడును దమ తేజస్సును దమలో గుప్తపఱచుకొని యుండిరి. అనగా వారు సృష్టి కున్ముఖులు కారైరి. సప్తబ్రహ్మల వంశములు దేవతలు దేవగణములతో గూడినవి. వారందరు క్రియావంతులు నగు గృహస్థులైరి. మహర్షులపరంపర యిదియే, బ్రహ్మ మెఱుపులను పిడుగులను మేఘములను లోహితములను ఇంద్రధనుస్సును పక్షులు మొదలగువానిని సృజించెను. యజ్ఞార్ధము ఋగ్యజుస్సామవేదములను జనింపజేసెను. సాధ్యులను గనెను. ఆయనమేనినుండి యుచ్చావచములగు భూతములెన్నో పొడమెను.

అట్లుగావించు తనసృష్టి వృద్ధిబొందకుండుటగాంచి తనశరీరమునే రెండు గావించి సగభాగమును పురుషుడు సగభాగమున స్త్రీయు నయ్యెను. ఆ స్త్రీయందాతడు వివిధప్రజలను గనెను. అతడు భూర్భువ ర్లోకములను వ్యాపించి విష్ణువని పేరందెను. ఆయన విరాట్పురుషుని సృజించెను. అతడు మనువును సృజించెను. అతడు మనువును సృజించెను. ఆయన తరమే మన్వంతరము. బ్రహ్మమానస సృష్టిలో నిది రెండవది. ఆ మనువు ప్రజాసర్గ మొనరించెను. నారాయణుని విసర్గ మిది. ఈ సృష్టిలోని సంతానముకూడ నయోనిజమె బ్రహ్మపురాణమందాది సర్గమను దీనిని దెలిసిన యతడు ఆయుష్మంతుడు కీర్తిమంతుడు నగును. సంపూర్ణ ప్రజ్ఞావంతుడై యభీష్టగతి నొందును. (41-56)

ఇది బ్రహ్మ పురాణమున ప్రథమాధ్యాయము

Brahmapuranamu    Chapters