Sri Sivamahapuranamu-I    Chapters   

అథ చతుస్త్రింశోధ్యాయః

దుశ్శకునములు

బ్రహ్మోవాచ |

ఏవం ప్రచలితే చాస్మిన్‌ వీరభ##ద్రే గణాన్వితే | దుష్టచిహ్నాని దక్షేణ దృష్టాని విబుధైరపి || 1

ఉత్పాతా వివిధాశ్చాసన్‌ వీరభ##ద్రే గణాన్వితే | త్రివిధా అపి దేవర్షే యజ్ఞవిధ్వంస సూచకాః || 2

దక్షవామాక్షి బాహూరువిస్పంద స్సమజాయత | నానాకష్ట ప్రదస్తాత సర్వదా శుభసూచకః || 3

భూకంపస్సమభూత్తత్ర దక్ష యాగస్థలే తదా | దక్షోపశ్యచ్చ మధ్యాహ్నే నక్షత్రాణ్యద్భుతాని చ || 4

బ్రహ్మ ఇట్లు పలికెను -

వీరభద్రుడు ఈ తీరున గణములతో గూడి పయనించుచుండగా, అచట దక్షునకు మరియు దేవతలకు చెడు శకునములు కానవచ్చునవి (1). ఓ దేవర్షీ! వీరభద్రుడు గణములతో గూడి ముందునకు కదలుచుండగా యజ్ఞవినాశమును సూచించే, మూడు విధముల (ఆధ్యాత్మిక, ఆధి భౌతిక, ఆధిదైవిక) ఉత్పాతములు అనేక భంగుల కానవచ్చినవి (2). దక్షుని ఎడమ కన్ను, చేయి, తొడ అదరినవి. వత్సా! ఇది అశుభమును సూచించే శకునము. ఈ శకునము కలిగినచో, అనేక కష్టములు కలుగును (3). దక్షుని యజ్ఞము జరిగే ఆ స్థలములో ఆ సమయమునందు భూమి కంపించెను. మరియు మధ్యాహ్నము నక్షత్రములు కనబడుట అనే అద్భుతమును దక్షుడు చూచెను (4).

దిశశ్చాసన్‌ సమలినాః కుర్బురోభూద్దివాకరః | పరివేష సహస్రేణ సంక్రాంతశ్చ భయంకరః || 5

నక్షత్రాణి పతంతి స్మ విద్యుదగ్ని ప్రభాణి చ | నక్షత్రాణా మభూద్వక్రా గతిశ్చాధోముఖీ తదా || 6

గృధ్రా దక్షశిరస్స్పృష్ట్వా సముద్భూతాస్సహస్రశః | ఆసీద్గృధ్ర పక్షచ్ఛాయై స్సచ్ఛా¸° యాగమండపః || 7

వవాశిరే యాగభూమౌ క్రోష్టారో పోత్రకాస్తదా | ఉల్కావృష్టిరభూత్తత్ర శ్వేతవృశ్చిక సంభవా || 8

దిక్కులన్నియూ ధూళితో మలినములయ్యెను. సూర్యుడు వివిధములగు రంగులలో కన్పట్టెను. సూర్యుని చుట్టూ, అసంఖ్యాకములగు మండలములు ఏర్పడి భీతిని గొల్పెను (5). మెరుపు వలె మండుచున్న నక్షత్రములు నేల గూలెను. ఆ సమయములో నక్షత్రములు క్రిందివైపునకు వంకర టింకర మార్గములో పయనించెను (6). వేలాది గద్దలు దక్షుని శిరస్సును స్పృశించెను. గద్దల రెక్కల నీడలతో యాగమండపము కప్పివేయబడెను. (7). యాగ స్థలమునందు నక్కలు ఊలలు పెట్టెను. అడవి పందులు వికృత ధ్వనులు చేసెను. అచట ఉల్కలు వర్షించెను. తెల్లని తేళ్లు పుట్టెను (8).

ఖరా వాతా వపుస్తత్ర పాంశువృష్టి సమన్వితాః | శలభాశ్చ సముద్భూతా వివర్తానిల కంపితాః || 9

తీవ్రైశ్చ పవనై రూర్ధ్వం స దక్షా ధ్వర మండపః | దేవాన్వితేన దక్షేణ యః కృతో నూతనోద్భుతః || 10

వేముర్ద క్షాదయస్సర్వే తదా శోణితమద్భుతమ్‌ | వేముశ్చ మాంస ఖండాని సశల్యాని ముహూర్ముహుః || 11

సకంపాశ్చ బభూవుస్తే దీపా వాతహతా ఇవ | దుఃఖితాశ్చాభవన్‌ సర్వే శస్త్ర ధారాహతా ఇవ|| 12

భయంకరములగు గాలులు ధూళిని వర్షించుచూ వీచెను. సుడిగాలులచే సర్వము కంపించెను. మిడతలు పుట్టుకువచ్చెను. (9). తీవ్రమైన గాలులు దక్షయజ్ఞ మండపమును పైకి లేవగొట్టెను. అద్భుతమైన ఆ నూతన మండపమును దక్షుడు దేవతలతో కలిసి నిర్మించెను (10). ఆ సమయములో దక్షుడు మొదలగు వారందరు రక్తమును, మాంసపు ముక్కలను, ఎముకలను అనేక పర్యాయములు వమనము చేసిరి. ఆ దృశ్యము బీభత్సముగ నుండెను (11). వారు గాలిలోని దీపమువలె వణుక జొచ్చిరి. పదునైన శస్త్రములచే కొట్టబడిన వారువలె, వారందరు దుఃఖింపజొచ్చిరి (12).

తదా నినాద జాతాని బాష్ప వర్షాణి తత్‌ క్షణ | ప్రాతస్తుషారవర్షీణి పద్మానీవ వనాంతరే ||13

దక్షా ద్యక్షీణి జాతాని హ్యకస్మా ద్విశదాన్యపి | నిశాయాం కమలాశ్చైవ కుముదానీవ సంగవే || 14

అసృగ్వర్షం దేవశ్చ తిమిరేణావృతా దిశః | దిగ్దాహోభూద్విశేషేణ త్రాసయన్‌ సకలాన్‌ జనాన్‌ || 15

ఏవం విధాన్యరిష్టాని దదృశుర్విబుధాదయః | భయమాపేదిరేత్యంతం మునే విష్ణ్వా దికాస్తదా || %ొ16

అపుడు వారు బిగ్గరగా రోదించుట చే కన్నీరు ప్రవాహమే, వారి కన్నులు వనమధ్యములో సరస్సుయందు మంచు బిందువులను వర్షించు పద్మములవలె నుండెను (13). దక్షుడు మొదలగు వారి నేత్రములు అంతవరకు స్వచ్ఛముగనే యున్ననూ అకస్మాత్తుగా, రాత్రియందు పద్మములవలె, పగలు కలువల వలె శోభను గోల్పోయినవి (14). పరమేశ్వరుడు రక్తవర్షమును కురిపించెను. దిక్కులు చీకట్లతో నిండినవి. దిక్కులన్నియు వేడితో నిండి పోవుటచే జనులందరు భయమును పొందిరి (15). ఓ మహర్షీ! ఆ సమయములో విష్ణువు మొదలగు దేవతలు ఇట్టి అరిష్టములను చూచి, మిక్కిలి భయమును పొందిరి (16).

భువి తే మూర్ఛితాః పేతు ర్హా హతాస్స్మ ఇతీరయన్‌ | తరవస్తీర సంజాతా నదీవేగహతా ఇవ || 17

పతిత్వా తేస్థితా భూమౌ క్రూరాస్సర్పా హతా ఇవ| కందుకా ఇవ తే భూయః పతితాః పునరుత్థితాః || 18

తతస్తే తాపసంతప్తా రురుదుః కురరీ ఇవ | రోదన ధ్వని సంక్రాంతో రుక్తి ప్రత్యుక్తికా ఇవ || 19

సవైకుంఠాస్త తస్సర్వే తదా కుంఠితశక్తయః | స్వస్వోప కంఠ మా కంఠం లులుఠుః కమఠా ఇవ || 20

నదీ వేగమునకు తీరమునందలి చెట్లు కూలిన విధముగా వారు, 'అయ్యో!చచ్చితిమి' అని పలుకుచూ మూర్ఛితులై నేల గూలిరి (17). వారు నేలపైబడి సంహరింపబడిన క్రూర సర్పములవలె కదలిక లేకుండ నుండిరి. మరికొందరు క్రిందబడి బంతులవలె పైకి ఎగిరిరి (18). అపుడు వారు వేడిని తాళ##లేక రోదిస్తూ పరస్పరము మాటలాడుకొనిరి. ఆమాటలు రోదన ధ్వనిలో కలిసిపోయెను. వారు జల పక్షుల వలె రోదించిరి (19). విష్ణువుతో సహా ఆ దేవతలందరు తమ శక్తులను కోల్పోయి, తాబేళ్లవలె ముడుచుకొని కూర్చుని దుఃఖించిరి (20).

ఏతస్మిన్నంతరే తత్ర సంజాతా చాశరీరవాక్‌ | శ్రావయత్యఖిలాన్దేవాన్‌ దక్షం చైవ విశేషతః || 21

ఇంతలో అచట ఆకాశవాణి దేవతలందరిని, ప్రత్యేకించి దక్షుని ఉద్దేశించి ఇట్లు పలికెను (21).

ఆకాశవాణ్యువాచ |

ధిక్‌ జన్మ తవ దక్షాద్య మహామూఢోసి పాపధీః | భవిష్యతి మహద్దుఃఖ మనివార్యం హరోద్భవమ్‌ || 22

హాహాపి నోత్ర యే మూఢాస్తవ దేవాదయస్థ్సితాః | తేషామపి మహాదుఃఖం భవిష్యతి న సంశయః || 23

ఆకాశవాణి పలికెను -

ఓరీ దక్షా! నీ జన్మ నింద్యము. నీవు ఈనాడు మహామూర్ఖుడవు, పాప బుద్ధివి అయినావు. నీకు శంకరుని నుండి మహాదుఃఖము సంప్రాప్తము కాగలదు. దానిని ఎవ్వరైననూ నివారింపజాలరు (22). అయ్యో! ఇచట దేవతలు మొదలగు వారు ముర్ఖత్వముచే ఉపస్థితులై యున్నారు. వారికి కూడ మహాదుఃఖము కలుగ బోవుచున్నది. దీనిలో సంశయము లేదు (23).

బ్రహ్మోవాచ |

తచ్ఛ్రుత్వాకాశవచనం దష్ట్వారిష్టాని తాని చ | దక్షః ప్రా పద్భయం చాతి పరే దేవాదయోపి హ || 24

వేపమానస్తదా దక్షో వికలశ్చాతి చేతసి | అగచ్ఛ చ్ఛరణం విష్ణో స్స్వప్రభోరిందిరాపతేః || 25

సు ప్రణమ్య భయావిష్ట స్సంస్తూయ చ విచేతనః | అవోచద్దేవ దేవం తం విష్ణుం స్వజన వత్సలమ్‌ || 26

ఇతి శ్రీ శివ మహాపురాణ ద్వితీయాయాం రుద్ర సంహితాయాం ద్వితీయే సతీఖండే దుశ్శకునదర్శనం నామ చతుస్త్రింశః అధ్యాయః (34)

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఆ ఆకాశవాణి విని, ఆ చెడు శకునములను చూచి, దక్షుడు చాల భయపడెను. దేవతలు మొదలగు ఇతరులు కూడ భయపడిరి (24). మనస్సులో మహాక్షోభను పొందియున్న దక్షుడు వణకుచున్న వాడై తన ప్రభువు, లక్ష్మీ పతి అగు విష్ణువును శరణు పొందెను (25). మూర్ఖుడగు దక్షుడు భయభీతుడై, దేవదేవుడు, భక్తులను రక్షించువాడునగు ఆ విష్ణువునకు సాష్టాంగపడి, స్తుతించి ఇట్లనెను (26).

శ్రీ శివ మహాపురాణములో రెండవదియగు రుద్ర సంహితయందు రెండవదియగు సతీఖండములో దుశ్శకున దర్శనమనే ముప్పది నాల్గవ అధ్యాయము ముగిసినది (34).

Sri Sivamahapuranamu-I    Chapters