Sri Sivamahapuranamu-II    Chapters   

అథ సప్తదశో%ధ్యాయః

గణశుడు మరల జీవించుట

నారద ఉవాచ |

బ్రహ్మన్‌ వద మహాప్రాజ్ఞ తద్వృత్తాంతే%ఖిలే శ్రుతే | కిమకార్షీన్మహా దేవీ శ్రోతుమిచ్ఛామి తత్త్వతః ||1

నారదుడిట్లు పలికెను -

ఓ బ్రహ్మా! నీవు మహాజ్ఞానివి. చెప్పుము. ఇంతవరకు వృత్తాంతము నంతనూ వింటిని. ఆ మహాదేవి ఏమి చేసినది? ఈ వృత్తాంతమును యథా తథముగా వినగోరు చున్నాను (1).

బ్రహ్మోవాచ |

శ్రూయతాం మునిశార్దూల కథయామ్యద్య తద్‌ ధ్రువమ్‌ | చరితం జగదంబాయా యజ్జాతం తదనంతరమ్‌ || 2

మృదంగాన్‌ పటహాంశ్చైవ గణాశ్చావాదయంస్తథా | మహోత్సవం తదా చక్రుర్హతే తస్మిన్‌ గణాధిపే || 3

శివో%పి తచ్ఛిరశ్ఛిత్వా యావద్దుఃఖముపాదదే | తావచ్చ గిరిజా దేవీ చుక్రోధాతి మునీశ్వర || 4

కిం కరోమి క్వ గచ్ఛామి హా హా దుఃఖముపాగతమ్‌ | కథం దుఃఖం వినశ్యేతాస్యా%తి దుఃఖం మమాధునా || 5

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఓ మహర్షీ! వినుము. జగదంబ యొక్క చరితమును, తరువాత జరిగిన వృత్తాంతమును నీకు నిశ్చితముగా చెప్పెదను (2). ఆ గణశుడు సంహరింపబడగానే, గణములు మద్దెళ్లను, పటహములను మ్రోగించి గొప్ప ఉత్పవమును చేసిరి (3). శివుడు గణశుని శిరస్సును ఛేదించి దుఃఖమును పొందెను. ఓ మహర్షీ! పార్వతీ దేవి ఆ వార్తను విని మిక్కిలి కోపించెను (4). నేనేమి చేయెదెను? ఎచటకు వెళ్లెదను? అయ్యో! ఆపద వచ్చినది. ఇపుడు నా ఈ మహాదుఃఖము తొలగిపోవు ఉపాయమేది గలదు? (5)

మత్సుతో నాశితశ్చాద్య దేవైస్సర్వైర్గణౖస్తథా | సర్వాంస్తాన్నాశయిష్యామి ప్రలయం వా కరోమ్యహమ్‌ || 6

ఇత్యేవం దుఃఖితా సా చ శక్తీశ్శతసహస్రశః | నిర్మమే తత్‌క్షణం క్రుద్ధా సర్వలోకమహేశ్వరీ || 7

నిర్మితాస్తా నమస్కృత్య గదంబాం శివాం తదా | జాజ్వల్యమానా హ్యవదన్‌ మాతరాదిశ్యతామితి || 8

తచ్ఛ్రుత్వా శంభుశక్తి స్సా ప్రకృతిః క్రోధతత్పరా | ప్రత్యువాచ తు తాస్సర్వా మహామయాయా మునీశ్వర || 9

దేవతలు, గణములు అందరు కూడి నా కుమారుని ఈనాడు నాశనము చేసినారు. నేను వారినందరినీ నశింపజేసెదను. లేదా ప్రలయమును కలిగించెను (6). ఇట్లు దుఃఖించినదై సర్వలోకములకు అధీశ్వరియగు ఆమె కోపించి వెనువెంటనే లక్షల సంఖ్యలో శక్తులను నిర్మించెను (7). అట్లు నిర్మించ బడిన ఆ శక్తులు అగ్నిశిఖలవలె మండిపడుతూ జగన్మాత యగు ఆ పార్వతికి నమస్కరించి, 'తల్లీ! ఆదేశించుము' అని పలికెను (8). ఓ మహర్షీ! శంభుని శక్తి, ప్రకృతి, మహామాయ అగు ఆమె ఆ మాటను విని మిక్కిలి కోపించి వారందరితో ఇట్లు బదులిడెను (9).

దేవ్యువాచ |

హే శక్తయో%ధునా దేవ్యో యుష్మాభిర్మన్ని దేశతః | ప్రలయశ్చాత్ర కర్తవ్యో నాత్ర కార్యా విచారణా || 10

దేవాంశ్చైవ ఋషీంశ్చైవ యక్షరాక్షసకాంస్తథా | అస్మదీయాన్‌ పరాంశ్చైవ సఖ్యో భక్షత వై హఠాత్‌ || 11

దేవి ఇట్లు పలికెను -

ఓ శక్తులారా! దేవీమూర్తులారా! నా ఆదేశముచే మీరిపుడు ఇచట ప్రలయమును చేయుడు. ఈ విషయములో ఏమియూ సందేహించకుడు (10). సఖులారా! దేవతలను, ఋషులను, యక్షులను, రాక్షసులను, మనవారిని, ఇతరులను కూడా తొందరగా భక్షించుడు (11).

బ్రహ్మోవాచ |

తదాజ్ఞప్తాశ్చ తాస్సర్వా శ్శక్తయః క్రోధతత్పరాః | దేవాదీనాం చ సర్వేషాం సంహారం కర్తుముద్యతాః || 12

యథా చ తృణసంహారమనలః కురుతే తథా| ఏవం తాశ్శక్త యస్సర్వా స్సంహారం కర్తుముద్యతాః || 13

గణపో వాథ విష్ణుర్వా బ్రహ్మా వా శంకరస్త థా | ఇంద్రో వా యక్షరాజో వా స్కందో వా సూర్య ఏవ వా || 14

సర్వేషాం చైవ సంహారం కుర్వంతి స్మ నిరంతరమ్‌ | యత్ర యత్ర తు దృశ్యేత తత్ర తత్రాపి శక్తయః || 15

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఆమెచే ఇట్లు ఆజ్ఞాపించబడిన ఆ శక్తులందరు మిక్కిలి క్రోధముతో నిండియున్నవై దేవతలు మొదలగు వారినందరినీ సంహరించుటకు ఉద్యుక్తలయ్యెను (12). అగ్ని గడ్డిన కాల్చిన విధముగా ఆ శక్తులందరూ వారిని సంహరించుట ఆరంభించెను (13). గణనాయకుడు గాని, విష్ణువు గాని, బ్రహ్మ గాని, శంకరుడుగాని, ఇంద్రుడు గాని, కుబేరుడు గాని, స్కందుడు గాని, సూర్యుడే అయినా (14), వారు అందరినీ భేదము లేకుండగా సంహరించుచుండిరి. ఎక్కడ చూచిననూ ఆ శక్తులే కానవచ్చెను (15).

కరాలీ కుబ్జకా ఖంజా లంబశీర్షా హ్యనేకశః | హస్తే ధృత్వా తు దేవాంశ్చ ముఖే చైవాక్షిపంస్తదా || 16

తం సంహారం తదా దృష్ట్వా హరో బ్రహ్మా తథా హరిః | ఇంద్రాదయో %ఖిలా దేవా గణాశ్చ ఋషయస్తథా || 17

కిం కిరిష్యతి సా దేవీ సంహారం వాప్యకాలతః | ఇతి సంశయమాపన్నా జీవనాశా హతా%భవత్‌ || 18

సర్వే చ మిలితాశ్చేమే కిం కర్తవ్యం విచింత్యతామ్‌ | ఏవం విచారయంతస్తే తూర్ణ మూచుః పరస్పరమ్‌ || 19

భయంకరాకారయ కల్గిన వారు, పొట్టివారు, కుంటివారు, వ్రేలాడు తలలు గలవారు అగు శక్తి మూర్తులు అనేకులగు దేవతలను చేతితో పట్టి నోటిలో వేసుకొని నమిలి వేసిరి (16). శివుడు, బ్రహ్మ, విష్ణువు, ఇంద్రాది సమస్త దేవతలు, గణములు, మరియు ఋషులు అపుడా సంహరమును గాంచి (17), 'ఆ దేవి ఏమి చేయునో! అకాలమునందీ సంహారమును చేయుచున్నది' అను సంశయమును పొందిరి. వారికి తాము బ్రదికియుందు మనే ఆశ లేకుండెను (18). మనమందరము కలిసి ఏమి చేయవలెనో ఆలోచించవలెను. ఇట్లు వారు తల పోసి ఒకరితో నొకరు ఇట్లు మాటలాడు కొనిరి (19).

యదా చ గిరిజా దేవీ ప్రసన్నా హి భ##వేదిహ | తదా చైవ భ##వేత్‌ స్వాస్థ్యం నాన్యథా కోటియత్నతః || 20

శివో%పి దుఃఖమాపన్నో లౌకికీం గతి మాశ్రితః | మోహయన్‌ సకలాంస్తత్ర నానాలీలా విశారదః || 21

సర్వేషాం చైవ దేవానాం కటిర్భగ్నా యదా తదా | శివా క్రోధమయీ సాక్షాద్గంతుం న పుర ఉత్సహేత్‌ || 22

స్వీయో వా పరకీయో వా దేవో వా దానవో%పి వా | గణో వాపి చ దిక్‌ పాలో యక్షో వా కిన్నరో మునిః || 23

విష్ణుర్వాపి తథా బ్రహ్మా శంకరశ్చ తథా ప్రభుః | న కశ్చిద్గిరిజాగ్రే చ స్థాతుం శక్తో%భవన్మునే || 24

ఇపుడు గిరిజా దేవి ప్రసన్నురాలైనచో మనకు స్వస్థత చేకూరును. లేనిచో కోటి ప్రయత్నములను చేసిననూ ప్రయోజనము లేదు (20). శివుడు కూడా లోకపు పోకడను అనుసరించి దుఃఖితుడాయెను. అనేక లీలలను నెరపుటలో పండితుడగు శివుడు ఆ సమయములో అందరినీ మోహింపజేసెను (21). దేవతలందరి నడుము విరిగెను. క్రోధముతో మండిపడుతున్న పార్వతి యెదుట నిలబడుటకు వారెవ్వరూ సాహసించలేదు (22). ఓ మునీ! తనవాడు గాని, పరాయి వాడు గాని, దేవత గాని, రాక్షసుడు గాని, గణములు గాని, దిక్‌ పాలకుడు గాని, యక్షుడు గాని, కిన్నరుడు గాని, మహర్షి గాని, (23), విష్ణువు గాని, బ్రహ్మ గాని, శంకర ప్రభుడు గాని ఒక్కడైననూ గిరిజా దేవి యెదుట పిలబడుటకు సమర్ధుడు కాలేకపోయెను (24).

జా జ్వల్యమానం తత్తేజస్సర్వతో దాహి తే %ఖిలాః | దృష్ట్వా భీతతరా ఆసన్‌ సర్వే దూరతరం స్థితాః || 25

ఏతస్మిన్నంతరే తత్ర నారదో దివ్యదర్శనః | ఆగతస్త్వం మునే దేవగణానాం సుఖహేతవే || 26

బ్రహ్మాణం మాం భవం విష్ణుం శంకరం చ ప్రణమ్య| సమాగత్య మిలిత్వోచే విచార్య కార్యమేవ వా || 27

సర్వే సంమంత్రయాం చక్రుస్త్వయా దేవా మహాత్మనా | దుఃఖ శాంతిః కథం స్యాద్వై సమూచుస్తత ఏవ తే || 28

మండిపడుతూ సర్వమును కాల్చివేసే ఆ తేజస్సును చూచి వారందరు మిక్కిలి భీతిల్లి బహుదూరములో నిలబడిరి (25). ఓ నారదమునీ! ఇంతలో దివ్యమగు దర్శనము గల నీవు దేవతలకు, గణములకు సుఖమును కలిగించుట కొరకై అచటకు వచ్చితివి (26). బ్రహ్మనగు నాకు, శివునకు, విష్ణువునకు ప్రణమిల్లి దగ్గరకు వచ్చి నీవు అందరినీ కలిసి కర్తవ్యమును గూర్చి విచారించితివి(27). దేవతలందరు మహాత్ముడవగు నిన్ను సంప్రదించిరి. వారు నిన్ను ' ఈదుఃఖము శాంతిచు విధమెయ్యది?' అని ఏకకంఠముతో ప్రశ్నంచిరి(28).

యావచ్చ గిరిజా దేవీ కృపాం నైవ కరిష్యతి | తావన్నైవ సుఖం స్యాద్వై నాత్ర కార్యా విచారణా || 29

ఋషయో హి త్వదాద్యాశ్చ గతాస్తే వై శివాంతికమ్‌ | సర్వే ప్రసాదయామాసుః క్రోధశాంత్యై తదా శివామ్‌ || 30

పునః పునః ప్రణఱముశ్చ స్తుత్వా ప్తోత్రైరనేకశః | సర్వే ప్రసాదయన్‌ ప్రీత్యా ప్రోచుర్దేవగణాజ్ఞయా|| 31

ఎంతవరకు గిరిజాదేవి దయను చూపదో,అంతవరకు సుఖము కలిగే ప్రశక్తియే లేదు. ఈ విషయములో చర్చించదగినది లేదు (29). ఋషులు నిన్ను ముందిడు కొని పార్వతి వద్దకు వెళ్లిరి. అపుడు వారందరు ఆమె యొక్క క్రోధమును శాంతింపజేసి ప్రసన్నురాలిని చేయుటకు యత్నించిరి(30). వారు దేవతల మరియు గణముల ఆజ్ఞచే ఆమెకు అనేక పర్యాయములు ప్రణమిల్లి అనేక స్తోత్రములతో స్తుతించి ప్రీతితో ప్రసన్నురాలిని చేసి ఇట్లు పలికిరి(31).

సురర్షయ ఊచుః |

జగదాంబ నమస్తుభ్యం శివాయై తే నమో%స్తు తే | చండికాయై నమస్తుభ్యం కల్యాణ్యౖ తే నమో%స్తు తే || 32

ఆదిశక్తి స్త్వమేవాంబ సర్వసృష్టకరీ సదా| త్వమేవ పాలినీ శక్తి స్త్వమేవ ప్రలయంకరీ || 33

ప్రసన్నా భవ దేవేశి శాంతిం కురు నమో%స్తు తే | సర్వం హి వికలం దేవి త్రిజగత్తవ కోపతః || 34

దేవర్షలు ఇట్లు పలికిరి-

జగన్మాతా! నీకు నమస్కరము. శివసత్నివగు నీకు వందనములు.చండికవగు నీకు నమస్కారము. మంగళమునిచ్చు నీకు నమస్కారము (32). అమ్మా! ఆది శక్తివి నీవే. సదా సర్వసృష్ఠిని చేయునది నీవే. జగత్తును పాలించు శక్తిని నీవే. ప్రలయమును చేయుదానవు నీవే (33). ఓ దేవదేవీ! ప్రసన్నురాలవు కమ్ము. శాంతినా పొందుము. నీకు నమస్కారమగు గాక! దేవి! నీవు కోపించుటచే ముల్లోకములలో సర్వము అల్లకల్లోలమాయెను (34).

బ్రహ్మోవాచ |

ఏవం స్తుతా పరా దేవీ ఋషిభిశ్చ త్వదాదిభిః | క్రుద్ధదృష్ట్వా తదా తంశ్చ కించిన్నో వాచ సా శివా || 35

తదా చ ఋషయస్సర్వే నత్వా తచ్చరణాంబుజమ్‌ | పునరూచుశ్శవాంభక్త్యా కృతాంజలిపుటాశ్శనైః || 36

బ్రహ్మ ఇట్లు పలికెను -

క్షమ్యతాం దేవి సంహారో జాయతే%ధునా | తవ స్వామీ స్థితశ్చాత్ర పశ్య పశ్య తమంబికే ||37

వయం కే చ ఇమే దేవా విష్ణబ్రహ్మాదయస్తథా | ప్రజాశ్చ భవదీయాశ్చ కృతతాంజలి పుటాస్థ్సితాః ||38

క్షంతవ్యశ్చాపరాధో వై సర్వేషాం పరమేశ్వరి| సర్వే హి వికలాశ్చాద్య శాంతిం తేషాం శివే కురు|| 39

ఋషులిట్లు పలికిరి -

ఓ దేవీ! ఇపుడు సంహారము కొనసాగుచున్నది. నీ భర్త ఇచట ఉన్నాడు. అమ్మా! ఆయనను చూడుము. చూడుము(37). మేము, విష్ణువు, బ్రహ్మ మొదలగు ఈ దేవతలు ఎంతటి వారము? మేము నీ సంతానమే. నీ యెదుట చేతులు జోడించి నిలబడినాము (38). ఓ పరమేశ్వరీ! శివపత్నీ! అందరి అపరాధమును క్షమించుము. ఈ నాడందరు దుఃఖితులై ఉన్నారు. వారికి శాంతిని కలిగించుయము (39).

బ్రహ్మోవాచ|

ఇగ్యుక్త్వా ఋషయస్సర్వే సుదీనతరమాకులాః | సంతర్థిరే చండికాగ్రే కృతాంజలి పుటాస్తదా|| 40

ఏవం శ్రుత్వా వచస్తేషాం ప్రసన్నా చండికాభవత్‌ | ప్రత్యువాచ ఋషీంస్తాన్వై కరుణావిష్టమానసా || 41

బ్రహ్మ ఇట్లు పలికెను -

అపుడు ఋషులందరు మిక్కిలి దీనముగా దుఃఖముతో నిట్లు పలికి చేతులు జోడించి చండిక యెదుట నిలబడిరి (40).వారి ఈ మాటలను విని ప్రసన్నురాలై కరుణతో నిండిన హృదయము గల చండిక ఋషులకు ఇట్లు బదులిడెను (41).

దేవ్యువాచ |

మత్పుత్రో యది జీవేత తదా సంహరణం న హి | యథా హి భవతాం మధ్యే పూజ్యో%యం చ భవిష్యతి || 42

సర్వాధ్యక్షో భ##వేదద్య యూయం కురుత తద్యది| తదా శాంతిర్భవేల్లోకే నాన్యథా సుఖమాప్స్యథ || 43

దేవి ఇట్లు పలికెను -

నా కుమారుడు జీవించినచో ఈ సంహారము ఆగిపోవును. నా కుమారుడు మీ అందరి మధ్యలో పూజ్యుడు కాగలడు (42). మీరు అట్లు చేసినచో ఆతడు సర్వమునకు అధ్యక్షుడు కాగలడు. అపుడు లోకమునందు శాంతి కలుగును. అట్లు గానిచో, మీకు సుఖము ఉండబోదు(43).

బ్రహ్మోవాచ|

ఇత్యుక్తాస్తే తదా సర్వే ఋషయో యుష్మ దాదయః | తేభ్యో దేవేభ్య ఆగత్య సర్వం వృత్తం న్యవేదయన్‌ || 44

తే చ సర్వే తథా శ్రుత్వా శంకరాయ న్యవేదయన్‌ | న త్వా ప్రాంజలయో దీనాశ్శక్రప్రభృతయస్సురాః || 45

ప్రోవాచేతి సురాన్‌ శ్రుత్వా శివశ్చాపి తథా పునః | కర్తవ్యం చ తథా సర్వలోకస్వాస్థ్వం భ##వేదిహ || 46

ఉత్తరస్యాం పునర్యాత ప్రథమం యో మిలేదిహ | తచ్ఛిరశ్చ సమాహృత్య యోజనీయం కలేబరే || 47

బ్రహ్మ ఇట్లు పలికెను -

దేవి ఇట్లు పలుకగా, నీవు మరియు ఇతర ఋషులు అందరు అపుడు ఆ దేవతలవద్దకు వచ్చి వృత్తాంతము నంతయు నివేదించిరి (44). ఇంద్రుడు మొదలగు దేవతలు ఆ వృత్తాంతమును విని దీనులై శంకరునకు నమస్కరించి చేతులు జోడించి విన్నవించుకొనిరి (45). దేవతల విన్నపమును విని శివుడు మరల వారితో నిట్లనెను : అటులనే చేయుడు. లోకములన్నియు అపుడు స్వస్థతను పొందగలవు(46). ఉత్తరదిక్కున వెళ్లుడు. ముందుగా ఏ ప్రాణి కనబడునో దాని శిరస్సును తీసుకొని వచ్చి ఈ దేహము నందు సంధానము చేయుడు (47).

బ్రహ్మోవాచ |

తతసై#్తస్తత్కృతం సర్వం శివాజ్ఞా ప్రతిపాలకైః | కలేవరం సమానీయ ప్రక్షాల్య విధివచ్చ తత్‌ || 48

పూజయిత్వా పునస్తే వై గతాశ్చోద ఙ్ముఖాస్తదా | ప్రథమం మిలితస్తత్ర హస్తీ చాప్యేక దంతకః || 49

తచ్ఛిరశ్చ తదా నీత్వా తత్ర తే% యోజయన్‌ ధువమ్‌ | సంయోజ్య దేవతాస్సర్వాశ్శివం విష్ణుం విధిం తదా || 50

ప్రణమ్య వచనం ప్రోచుర్భవదుక్తం కృతం చ నః | అనంతరం చ తత్కార్యం భవతాద్భవ శేషితమ్‌ || 51

బ్రహ్మ ఇట్లు పలికెను -

శివుని ఆజ్ఞను పాలించు ఆ దేవతలు సర్వమును అటులనే చేసిరి. దేహమును తీసుకు వచ్చి దానిని యథావిధిగా కడిగిరి (48). వారు శివుని మరల పూజించి ఉత్తరదిక్కుగా వెళ్లిరి. అపుడు మున్ముందుగా వారికి ఒక దంతము గల ఏనుగు కనబడెను (49). అపుడు వారు దాని శిరస్సును దెచ్చి ఆ దేహమునందు జోడించిరి. తరువాత దేవతలందురు బ్రహ్మ విష్ణుమహేశ్వరులకు (50) నమస్కరించి ఇట్లు పలికిరి : మీరు చెప్పినట్లు చేసితిమి. ఓ శివా! మిగిలిన కార్యమును మీరు పూర్తి చేయుడు (51).

తతస్తే తు విరేజుశ్చ పార్షదాశ్చ సురాస్సుఖమ్‌ | అథ తద్వచనం శ్రుత్వా శివోక్తం పర్యపాలయన్‌ || 52

ఊచుస్తే చ తదా తత్ర బ్రహ్మ విష్ణు సురాస్తథా | ప్రణమ్యేశం శివం దేవం స్వప్రభుం గుణవర్జితమ్‌ || 53

యస్మాత్త్వత్తేజసస్సర్వే వయం జాతా మహాత్మనః | త్వత్తేజస్తత్సమాయాతు వేద మంత్రాభియోగత || 54

ఇత్యేవమభి మంత్రేణ మంత్రితం జలముత్తమమ్‌ | స్మృత్వా శివం సమేతాస్తే చిక్షిపుస్తత్క లేవరే || 55

అట్లు చెప్పి గణములు మరియు దేవతలు సుఖమును పొంది ప్రకాశించిరి. వారు శివుని మాటను విని దానిని పాటించిరి (52). అపుడు బ్రహ్మ విష్ణువు మరియు దేవతలు తమ ప్రభువు, నిర్గుణుడు, పాలకుడు అగు శివదేవునకు నమస్కరించి ఇట్లు పలికిరి (53). మహాత్ముడవగు నీ యొక్క తేజస్సు నుండియే మేమందరము జన్మించితిమి. వేదమంత్రముల ప్రభావముచే నీ ఆ తేజస్సు ఇచటకు వచ్చుగాక! (54). ఇట్లు పలికి వారు ఉత్తమమగు జలమును మంత్రములతో అభిమంత్రించి శివుని స్మరించి, వారందురు కలిసి ఆ జలమును ఆ దేహముపై చల్లిరి (55).

తజ్జలల్పర్శ మాత్రేణ చిద్యుతో జీవితో ద్రుతమ్‌ | తదోత్తస్థౌ సుప్త ఇవ స బాలశ్చ శివేచ్ఛయా || 56

సుభగస్సుందరతరో గజవక్త్ర స్సురక్తకః | ప్రసన్నవదనశ్చాతి సుప్రభో లలితాకృతిః || 57

తం దృష్ట్వా జీవితం బాలం శివాపుత్రం మునీశ్వర | సర్వే ముముదిరే తత్ర సర్వం దుఃఖం క్షయం గత్‌ || 58

దేవ్యై సందర్శయామాసుస్సర్వే హర్ష సమన్వితాః | జీవితం తనయం దృష్ట్వా దేవీ హృష్ట తరా%భవత్‌ || 59

ఇతి శ్రీ శివమహాపురాణ రుద్రసంహితాయాం కుమారఖండే గణశ జీవన వర్ణనం నామ సప్త దశో%ధ్యాయః (17).

అపుడా బాలకుడు శివుని సంకల్పముచే ఆ జలము తగిలిన వెంటనే చైతన్యమును పొంది జీవించి నిద్రలేచిన వానివలె లేచి నిలబడెను (56). భాగ్యవంతుడు, మిక్కిలి అందగాడు, ఏనుగు మోమువాడు, ఎర్రని దేహచ్ఛాయ గలవాడు, ప్రసన్నమగు ముఖము గలవాడు, గొప్ప కాంతి గలవాడు, సుందరాకారుడు (57) అగు జీవించిన ఆ పార్వతీతనయుడగు బాలకుని చూచి వారందరు ఆనందించిరి. ఓ మహర్షీ! వారి దుఃఖమంతా నాశమును పొందెను (58). వారందరు జీవించిన ఆ పార్వతీ తనయుని పార్వతీ దేవికి హర్షోల్లాసముతో చూపించిరి. ఆ దేవి జీవించిన పుత్రుని చూచి అతిశయించిన ఆనందరమును పొందెను (59).

శ్రీ శివమహాపురాణములో రుద్ర సంహిత యందలి కుమార ఖండలో గణశుడు మరల జీవించుట అనే పదిహేడవ అధ్యాయము ముగిసినది (17).

Sri Sivamahapuranamu-II    Chapters