Sri Naradapuranam-I    Chapters    Last Page

త్రిపంచాశత్తమోధ్యాయః = యాబదిమూడవ అధ్యాయము

నిరుక్తలక్షణనిరూపణమ్‌

సనందన ఉవాచ :-

నిరుక్తం తే ప్రవక్ష్యామి వేదశ్రోత్రాంగముత్తమమ్‌, తత్పంచవిధమాఖ్యాతం వైదికం ధాతురూపకమ్‌ 1

క్వచిద్వర్ణాగమస్తత్ర క్వచిద్వర్ణవిపర్యయః వికారః క్వాపి వర్ణానాం వర్ణనాశః క్వచిన్మతః. 2

తథా వికారనాశాభ్యాం వర్ణానాం యత్ర నారద, ధాతోర్యోగాతిశయీ చ సంయోగః పరికీర్తితః. 3

సిద్ధేద్వర్ణాగమాద్ధింసస్సింహో వర్ణవిపర్యయాత్‌, గూఢోత్మా వర్ణవికృతే వర్ణనాశాత్పృషోదరః. 4

భ్రమరాదిషు శ##బ్దేషు జ్ఞేయో యోగో హి పంచమః, బహులం ఛందసీత్యుక్తం అత్ర వాచ్యం పునర్వసూ. 5

నభస్వద్వృషణశ్చైవా పరసై#్మపది చాపి హి, పరం వ్యవహితాశ్చాపి గతిసంజ్ఞాస్తథాహి ఆ. 6

విభక్తీనాం విపర్యాసో యథా దధ్నా జుహోతి హి, అభ్యుత్సాదయామకేతుర్ధ్వనయీత్ప్రముఖాస్తథా. 7

నిష్టర్కాద్యాస్తథోక్తాశ్చ గృభ##యేత్యాదికస్తథా. 8

సుస్తిఙుపగ్రహలింగనరాణాం కాలహల్చస్వరకర్తృయదాం చ.

వ్యత్యయమిచ్ఛతి శాస్త్రకృదేషాం సోపి చ సిద్ధ్యతి బాహులకేన. 9

రాత్రీ బంచీ చ కద్రూశ్చారిష్ట్వో వాజసనేయినః, కర్ణేఖశ్చ యశో భాగ్య ఇత్యాద్యాశ్చతురక్షరమ్‌. 10

దేవాసోధో సర్వదేవ తాతిత్వావత ఇత్యపి, ఉభయావినమాద్యాశ్చ ప్రలయాద్యాశ్చ తృచం తథా. 11

అపస్పృధేధాం నో అవ్యాదయో అస్మన్ముఖాస్తథా, సగర్భో స్ధాపదీ ఋత్వ్యో రజిష్టం చ త్రిపంచకమ్‌. 12

హిరణ్యయేన నరం చ పరమే వ్యోమ ఇత్యపి, ఉర్వియా స్వప్రయా వారవధ్వా దదుహవైవధీ. 13

మజధ్వైనమేమసి చ స్నాత్వీగత్వా పచాస్థభీః, గోనాం చా పరిహవృత్తాశ్చా తురిగ్రసితాదికా. 14

పశ్యేదధద్వభూధాపి ప్రమిణాంతిత్యవీవృధత్‌, మిత్రాయుశ్చ దురశ్వావాహాత్వసుధితమిత్యపి. 15

దధర్త్యాద్యా స్వవద్భిశ్చ ససూవేతి చ ధిష్వ చ, ప్రపాయం చ హరివతే క్షణ్వతస్సుపధితరః. 16

దధీతరీ న న సతాద్యా అమ్నర్భు వరధో ఇతి, బ్రూహ్యాద్యాదేః పరస్యాప్యౌ శ్రావయేత్యాదికే ప్లుతః. 17

దాశ్వాంశ్చ స్వతవాన్యాపౌ త్రిభిష్ట్వం చ నృభిష్టుతః, అభీషుణ ఋతావాహం న్యషీదన్నృమణా అపి. 18

చతుర్విధాద్బాహులకాత్‌ ప్రవృత్తేరప్రవృత్తితః, విభాషయాన్యథా భావత్‌ సర్వం సిద్ధ్యేచ్చ వైదికమ్‌. 19

సనందన మహర్షి పలికెను :- వేదమునకు శ్రోత్రాంగరూపమైన నిరుక్తమును నీకు చెప్పెదను. ఈ నిరుక్తము అయిదు విధములు. వైదికము, ధాతురూపముగా నుండును. కొన్నిచోట్ల వర్ణాగమము, కొన్నిచోట్ల వర్ణవిపర్యయము, కొన్నిచోట్ల వర్ణవికారము, కొన్నిచోట్ల వర్ణనాశము, వర్ణవికారనాశములచే ధాతుయోగము వలన అతిశయమును పొందినచో సంయోగమనబడును. హస అను శబ్దమున అనుస్వారము ఆగమముగా వచ్చినచో హంసః అనురూపము సిద్ధించును. హింస అనువర్ణములు విపర్యయము నొందినచో సింహః ను రూపమును పొందును. గూఢ ఆత్మ అనుచోట ఆ అను వర్ణము ఓ రూపముగా మారినందున 'గూఢోత్మా' అను పదము సిద్ధించును. 'వృషసదృశః ఉదరః' అను వాక్యమున 'సదృశ' అనువర్ణములకు నాశ##మేర్పడుటచే 'పృషోదరః' అనురూపము సిద్ధించును. భ్రమరాది శబ్దములలో సంయోగమున్నదని తెలియవలయును. ఈ విధముగా నిరుక్తము అయిదు విధములు. వేదమున బాహులకమును విధించిరి. బాహులకము వలన పునర్వసు, నభస్వత్‌, వృషణ, అపరసై#్మపది, ఇత్యాదిరూపమలు సిద్ధించును. ధాతువునకు పరముగా వ్యవధానముగా ఉన్న అవ్యయాదులు గతిసంజ్ఞను పొందును. ఇచట హి, ఆ మొదలగునవి దృష్టాంతము, వైదికమున విభక్తి విపర్యాసము కూడా జరుగును. 'దధ్నా జుహాతి' అనునది ఉదాహరణము. అభ్యుత్సాదయామకేతు, ధ్వనయీత్‌ మొదలగునవి కూడా ఇటులనే తెలియవలయును. నిష్టర్కీ మొదలగునవి, గృభాయ మొదలగునవి, సుప్‌, తఙ్‌, ఉపగ్రహ, లింగ, నర, కాల, హల్‌, చ్‌, స్వర, కర్తృ, యజాదికమునకు కూడా శాస్త్రకారులు వ్యత్యయమునభిలషింతురు. ఈ వ్యత్యయము కూడా బాహులకముచే సిద్ధించును. రాత్రీ, చింబీ, కద్రూః, ఆవిష్ట్వో, వాజసనేయినః, కర్ణేభిః, యశోభాగ్యః, ఇత్యాది చతురక్షర పదములు, దేవాసః, సర్వదేవతాతి, త్వావత, అనునవి ; 'ఉభమావిరం' మొదలగునవి, ప్రలయాది శబ్దములు, స్తృచం అనునది అసస్పృధేధాంనో, అవ్యాదాయః, అస్మాన్ముఖాః, సగర్భ్యః, స్ధాపదా, ఋత్య్వోః, అజిష్ఠం, త్రిపంచకమ్‌, హిరణ్యయేవ, నరం, పరమే వ్యోమని, ఉర్వయా, స్వప్రయా, వారవధ్వా, దుదుహ, వైవధీ, యజధ్వం, నమేమసి, స్నాత్వీ, గత్వా, పచాస్ధఖీః, గోనాం, అపరిహవృత్తాః, ఆతురిః, గ్రసితా మొదలగునవి, పశ్యేత్‌, అధదు, అభూధ్‌, ప్రమిణాంతి, అవీవృధత్‌, మిత్రయుః, దురస్వా, హాత్వా, సుధితం అనునవి, దధర్తి మొదలగునవి, స్వవద్భిః, ససూవ, ధిష్య, ప్రపాయం, హరివతా, ఈక్షణ్వతః, సుపధితరః, రధీతరీ, నసత మొదలగునవి, అమ్నః, భువః రధః, బ్రూహి మొదలగువాటికి, శ్రావయ ఇత్యాదులలో ప్లుతమునుచ్చరించవలయును. దాస్వాన్‌, స్వతవాన్‌, యాపీ, త్రిభిష్ట్వం, నృభిష్టుతః, అభీషుణ, ఋతావహం, న్యషీదత్‌, నృమణా ఇత్యాది రూపములు బాహులకమువలన సిద్ధించును. బాహులకము నాలుగు విధములుగా నుండును. శాస్త్రము ప్రవర్తించుట, ప్రవర్తించకపోవుట విభాషగా ప్రవర్తించుట అనగా ఒకసారి వచ్చుట, ఒకసారి రాకపోవుట, అన్నథాభావము అని. ఇట్లు నాలుగు విధములగు బాహులకము వలన వైదికరూపములన్నియూ సిద్ధించును.

భూవాద్యా ధాతవో జ్ఞేయా పరసై#్మపదినస్స్మృతాం, ఏధాద్యా ఆత్మనే భాషా ఉదాత్తాః షట్త్రింశసంఖ్యాకాః 20

అదాదయోష్ట్రతింశచ్చ పరసై#్మపదినో మునే, శ్నోకృపూర్వా ద్విచత్వారింశదుక్తాశ్చ హాత్మనే పదే 21

ఉదాత్తేతస్తు పంచాశత్‌ పక్వాద్యాః పరికీర్తితాః వర్చాద్యా అనుదాత్తేత ఏకవింశతిరీరితాః. 22

గుపాదాయో ద్విచత్వారింశదుదాత్తేతస్సమీరితాః, ధిణ్యాదయ్యోనుదాత్తేతో దశప్రోక్తా హి శాబ్దికైః. 23

అణాదయోప్యుదాత్తేతస్సప్తవింశతిధాతవః, అమాదయస్సముద్దిష్టాశ్చతుస్త్రింశద్ధి శాబ్దకైః. 24

ద్విసప్తతి మీతా మవ్యముఖాశ్చోదాత్తబంధనాః, స్వరితేద్ధావుధాతుస్తు ఏక ఏవ ప్రకీర్తితః. 25

క్షుధాదయోనుదాత్తేతో ద్విషంచాశదుదాహృతాః, ఘుష్టిరాద్యా ఉదాత్తేతోష్టాశీతిధాతవో మతాః. 26

ద్యుతాద్యాఅనుదాత్తేత ద్వివింశతిరతోమతాః, షితస్త్రయోదశ ఘటాదిష్వనుదాత్తే ఈరితాః. 27

తతో జ్వలదుదాత్తేతో ద్విపంచాశన్మితాస్తథా, స్వరితేద్రాజృసంప్రోక్తస్తనహాభ్రాజృతస్త్రయః. 28

అనుదాత్తేత ఆఖ్యాతా భాద్యుదాత్తా ఇతః క్రమాత్‌, సహ్యానుదాత్తే దేవస్తు రమేక్యోప్యాత్మనేపదీ. 29

పదస్త్రయ ఉదాత్తేత కుచాద్వేదా ఉదాత్త ఇత్‌, స్వరితేతః పంచత్రింశద్ధిక్కాద్యాశ్చ తతం పరమ్‌. 30

స్వరితేచ్ఛిఞిభృఞాద్యాశ్చత్వారః స్వరితేత్తతః, ధేటః పరస్మేపదినః షట్చత్వారింశదీరితాః. 31

అష్టాదశస్మిఙాద్యాస్తు ఆత్మనేపదినో మతాః, తతస్త్రయోనుదాత్తేతః పూఙాద్యాః పరికీర్తితాః. 32

హృ పరసై#్మపదీ చాత్మనేభాషాస్తు గుపా త్రయః, రభద్యబ్ద్యనుదాత్తేతో ఞిక్ష్విదోదాత్త ఇన్మతః. 33

పరసై#్మపదినః పంచ దశస్కంభ్వాదయస్తథా, కితధాతురుదాత్తేచ్చ దానశానోభయాత్మకా. 34

స్వరితేతః పచాద్యంతాః పరమసై#్మపదినో మతాః, స్వరితేతస్త్రయశ్చేతా వదనచీపరిభాషిణౌ. 35

భ్వాద్యా ఏతే షడధికా సహస్రం ధాతవో మతాః, పరసై#్మ పదినః ప్రోక్తా వదస్చాపి హనోతి చ 36

స్వరితేతే ద్విషాద్యాస్తు చత్వారో ధాతవో మతాః, చక్షిఙేకస్సమాఖ్యాతో ధాతురత్రాత్మనేపదీ. 37

ఇరాదయోనుదాత్తేతో ధాతవస్తు త్రయోదశ, ఆత్మనే పదినౌ ప్రోక్తా షూఙ్‌ ద్వౌ శాబ్దకైర్మునే 38

పరసై#్మపదినః ప్రోక్తాః షుముఖాస్సప్త ధాతవః, స్వరితేదూర్ణుఞాఖ్యాతో ధాతురేకో మునీశ్వర 39

ఘముఖాస్త్రయ ఉద్దిష్టాః పరసై#్మపదినస్తథా, ష్టుఞేకస్తు సమాఖ్యాతస్స్మృతో నారద శాబ్దకైః. 40

అష్టాదశ రాప్రభృతయః పరసై#్మపదినస్స్మృతాః, ఇజ్‌ఙాత్మనేపదీ ప్రోక్తో ధాతుర్నారద కేవలః. 41

విదాదయస్తు చత్వారః పరసై#్మపదినో మతాః, ఞిష్వపశ##యే సముద్దిష్టః పరసై#్మపదికస్తథా. 42

పరసై#్మపదినశ్చైవ తే మయోక్తాస్స్యమాదయః, దీధీఙ్‌వేవీఙ్‌ స్మృతౌ ధాతూ ఆత్మనేపదినౌ మునే. 43

ప్రథాదయస్త్రయశ్చాపి ఉదాత్తేతః ప్రకీర్తితాః, చర్కరీతం చ హ్రుఙ్క్‌ ప్రోక్తోనుదాత్తేన్మునిసపత్తమ. 44

త్రిసప్తతిస్సమాఖ్యాతా ధాతవోదాదికే గణ, దాదయో ధాతవో వేదాః పరసై#్మపదినో మతాః. 45

స్వరితేద్వై భృఞాఖ్యాత ఉదాత్తేద్ధాక్ప్రకీర్తితః, మాఙ్‌హాఙ్‌ద్వావనుదాత్తేతౌ స్వరితేద్దానధాతుషు. 46

వాణితిరాద్యాస్త్రయశ్చాపి స్వరితేత ఉదాహృతాః, ఘముఖా ద్వాదశ తథా పరసై#్మపదినో మతాః. 47

ద్వావింశతిరిహోద్దిష్టా ధాతవో హ్వాదికే గణ, పరసై#్మపదినః ప్రోక్తా దివాద్యా పంచవిశతిః. 48

ఆత్మనేపదినౌ ధాతూ ఘాఙ్‌దూఙ్‌ ద్వావసి నారద !, ఓదితః పూఙ్ముఖాస్సప్త ఆత్మనేపదినో మతాః. 49

ఆత్మనేపదినో విప్ర దీఙ్మకాస్త్విహ కీర్తితాః, స్యతిప్రభృతయో వేద పరసై#్మపదినో మతాః. 50

జన్యాదయః పంచదశ ఆత్మనేపదినో మునే, మృషాద్యాస్స్వరితేతస్తు ధాతవః పంచకీర్తితాః. 51

ఏకాదశ పదాద్యాస్తు హ్యాత్మనే పదినో మతాః, రాధోఃకర్మక ఏవాత్ర వృద్ధేస్వాది చురాదికే 52

ఉదాత్తేతస్తుదాద్యాస్తు త్రయోదశస మీరితాః, పరసై#్మపదినోష్టాత్ర రధాద్యాః పరికీర్తితాః. 53

సమాద్యాశ్చాప్యుదాత్తేత షట్చత్వారింశదీరితాః, చత్వారింశచ్ఛతం చాపి, దివాదౌ ధాతవో మతాః. 54

స్వాదయస్స్వరితేత్తోక్తా ధాతవః పరికీర్తితాః, సప్తాఖ్యాతా దునోతిస్తు పరసై#్మపదినో మునే 55

అష్టిధావనుదాత్తేతౌ ధాతూ ద్వౌ పరికీర్తితౌ, పరసై#్మపదినస్త్వత్ర తికాద్యాస్తు చతుర్దశ 56

ద్వాత్త్రింశద్ధాతవః ప్రోక్తా విప్రేన్ద్ర స్వాదికే గణ, స్వరితేతష్షడాఖ్యాతాస్తుదాద్యా మునిసత్తమ. 57

ఋష్యదాత్తోజ్జుషీపూర్వా ఆత్మనేపదినోర్ణవాః, వ్రశ్చాదయ ఉదాత్తేతః ప్రోక్తాః పంచాధికం శతమ్‌. 58

గూర్యుదాత్తే దిహోద్దిష్టో ధాతురేకో మునీశ్వర, ణూముఖాశ్చైవ చత్వారః పరసై#్మపదినో మతాం. 59

కుఙాఖ్యాతోనుదాత్తేచ్చ కూటాద్యాః పూర్తిమాగతాః, పృఙ్‌ మృఙ్‌ చాత్మనే భాషౌ షట్పరసై#్మ పదేరితాః. 60

ఆత్మనే పదినౌ ధాతూ దృఙ్‌ ధృఙ్‌ ద్వౌ చాప్యుదాహృతౌ, ప్రచ్ఛాదిషోడశాఖ్యాతా పరసై#్మపదినో మునే. 61

స్వరితేతష్షట్‌ తతశ్చోక్తాస్తత్ర బలముఖా మునే, కుతీప్రభృతయశ్చాపి పరసై#్మ చ పదినస్త్రయః. 62

సప్తపంచాశదధికాస్తుదాదౌ ధాతవశ్శతమ్‌, స్వరితేతో రుధ్యోనందా పరసై#్మభాషిణః కృతీ. 63

ఞి ఇంధీత్వోనుదాత్తేతస్త్రయో ధాతవ ఈరితాః, ఉదాత్తేతష్షిషపిషరుధాద్యాః పంచవింశతిః. 64

స్వరితేతస్త్నోస్సప్త ధాతవః పరికీర్తితాః, మనువన్వాత్మనేభషౌ స్వరితేక్కృఞుదాహృతః. 65

తతో ద్వౌ కీర్తితౌ విప్ర ధాతవో దశ శాబ్దికైః, క్రాద్యాస్సప్తోభ##యే భాషాః సౌత్రాస్త్సంభ్వాదికాస్తథా. 66

పరసై#్మ పదినః ప్రోక్తాశ్చత్వారోపి మునీశ్వర, ద్వావింశతిరుదాత్తేతః రుధాద్యా ధాతవో మతాం. 67

వృఙాత్మనే పదీ ధాతుశ్శ్రంధాద్యాశ్చైకవింశతిః, పరసై#్మపదినశ్చాథ స్వరితేద్గ్రహ ఏవ చ 68

క్య్రౌదికేషు ద్విపంచాశద్ధాతవః కీర్తితా బుధైః, చురాద్యా ధాతవో ఞ్యంతా షట్త్రింశదధికం శతమ్‌. 69

చిత్యాద్యష్టాదశాఖ్యాతా ఆత్మనే పదినో మునే, చర్చాద్యా ఆధృషీయాస్తు ణ్యంతా వా పరికీర్తితాః. 70

అదంతా ధాతవశ్చైవ చత్వారింశత్తథాష్ట చ, పదాద్యాస్తు దశ ప్రోక్తా ధాతవో హ్యాత్మనే పదే. 71

సూత్రాద్యా అష్ట చాప్యత్ర ఞ్యన్తా ప్రోక్తా మనీషిభిః, ధాత్వర్థే ప్రాతిపదికాద్బహులం చేష్టవన్మతమ్‌. 72

భూ మొదలగు ధాతువులు పరసై#్మపదులు. ఏధమొదలగు ముప్పదియారు ధాతువులు ఆత్మనే పదులు. అత మొదలగు ధాతువులు ముప్పది యెనిమిది పరసై#్మపదులు. శ్నోకృ మొదలగు నలుబదిరెండు ధాతువులు ఆత్మనేపదులు. పక్వమొదలగు ధాతువులు యాబది ఉదాత్తవర్ణము ఇత్తుగా గలవి. అనగా పరసై#్మపదములు. వర్చమొదలగు ఇరువది యొకటి ధాతువులు అదుదాత్తము ఇత్తుగా గలవి. అనగా ఆత్మనే పదులు. గుపూ మొదలగు నలుబదిరెండు ధాతువులు ఉదాత్తము ఇత్తుగా కలవి కావున పరసై#్మపదులు. ధిణిమొదలగు పదిధాతువులు అనుదాత్తము ఇత్తుగా కలవి. అనగా ఆత్మనే పదములు. అణ మొదలగు ఇరువదియేడుధాతువులు ఉదాత్తము ఇత్తుగా గలవి కావున పరసై#్మపదములు. ఆమాదిధాతువులు ముప్పదినాలుగు ఆత్మదే పదములు. మన్యమొదలగు డెబ్బది రెండు ధాతువులు పరసై#్మపదములు. హావుధాతువు ఒక్కటే స్వరితము ఇత్తుగా గలది. అనగా ఉభయపది. క్షుధ్‌ మొదలగు యాబదిరెండు ధాతువులు అను దాత్తము ఇత్తుగా గలవి కావున ఆత్మనే పదములు. ఘష్‌మొదగు ఎనుబది ఎనిమిది ధాతువులు ఉదాత్తము ఇత్తుగా గలవి. అనగా పరసై#్మపదములు. ద్యుతాదులు ఇరువది రెండు ధాతువులు అనుదాత్తము ఇత్తుగా గలవి కావున ఆత్మనే పదుములు. ఘటాదులలోనున్న పదమూడు షిత్తులను ధాతువులు అనుదాత్తము ఇత్తుగా గలవి. కావున ఆత్మనే పదములు. జ్వలదాదులు యాబది రెండు ధాతువులు ఉదాత్తము ఇత్తుగా గలవి. అనగా పరసై#్మపదములు. రాజృధాతువులు అనుదాత్తము ఇత్తుగా కలవి. అనగా ఉభయ పది స్తనహిభ్రాజృ అను మూడు ధాతువులు అనుదాత్తము ఇత్తుగా కలవి. కావున ఆత్మనే పదములు. భాది ధాతువులు ఉదాత్తము ఇత్తుగా కలవి. అనగా పరసై#్మ పదములు. సహధాతులు ఒకటి అనుదాత్తము ఇత్తుగా కలది. అనగా ఆత్మనే పదము. రమ్‌ ధాతువు కూడా ఆత్మనే పదియే. సదమొదలగు మూడు ధాతువులు ఉదాత్తేత్తులు అనగా పరసై#్మపదములు. కుచమొదలగునవి కూడా ఉదాత్తము ఇత్తుగా కలవే. కావున పరసై#్మపదములు. హిక్కమొదలగు ముప్పదియైదు ధాతువులు స్వరితము ఇత్తుగా కలవి. అనగా ఉభయపదులు. శిఞ్‌, భృఞ్‌ మొదలగు నాలుగు ధాతువులు కూడా స్వరితము ఇత్తుగా కలవే. కావున ఉభయపదులు. ధేట్‌ మొదలగు నలుబది యారుధాతువులు పరసై#్మ పదులు. స్మిఙ్‌ మొదలగు పదునెమిది ధాతువులు ఆత్మనే పదములు. పూఙ్‌ మొదలగు మూడు ధాతువులు అనుదాత్తము ఇత్తుగా గలవి. అనగా ఆత్మనే పదములు. హృధాతువు పరసై#్సపది. గుపాదులు మూడు ధాతువులు ఆత్మనే పదులు. రబాదిధాతువులు రెండు అనుదాత్తేత్తులు. అనగా ఆత్మనే పదములు కలవి. ఞిక్ష్యిధాతువు ఉదాత్తము ఇత్తుగా కలది కావున పరసై#్మపది. స్కంబ్వాది పదిహేనుధాతువులు పరసై#్మ పదులు. కితధాతువు కూడా పరసై#్మపదియే. దాన శాన ధాతువులు స్వరితము ఇత్తుగా కలవి కావున ఉభయపదులు. ఇట్లు భ్వాదిగణమున ఒక వేయి ఆరు ధాతువులుండును. వద హన ధాతువులు కూడా పరసై#్మపదులు. ద్విషమొదలగు నాలుగు ధాతువులు స్వరితము ఇత్తుగా కలవి. అనగా ఉభయపదులు. చక్షిజ్‌ అను ఒక ధాతువు మాత్రము ఆత్మనేపది. ఇరాదులు పదమూడు ధాతువులు అనుదాత్తము ఇత్తుగా కలవి. అనగా ఆత్మనే పదులు. షూఙ్‌, శీఙ్‌ అను రెండు ధాతువులు ఆత్మనేపదులు. ఘ మొదలగునేడు ధాతువులు పరసై#్మదులు. ఊర్ణుఞ్‌ ధాతవొకటి మాత్రము స్వరితము ఇత్తుగా కలది కావున ఉభయపది. ఘు మొదలగు మూడు ధాతువులు పరసై#్మపదులు. ష్టు ఞ్‌ ధాతువొకటి రా మొదలగు పదునెనిమిది ధాతువులు పరసై#్మదులు. ఇఙ్‌ ధాతువు ఆత్మనేపది. విదాదీ ధాతువులు నాలుగు పరసై#్మదులు. ఇఘా మొదలగు ధాతువులు కూడా పరసై#్మపదికమే. స్యమాదులు కూడా పరసై#్మ పదులేనని నేను చెప్పియుంటిని. ది, ధీ, వే, వీ, ధాతువులు ఆత్మనే పదులు. ప్రధాదులు మూడు ధాతువులు ఉదాత్తము ఇత్తుగా కలవి. అనగా పరసై#్మపదములు. చర్కరీతం, హృఙ్‌ అనునవి అనుదాత్తము ఇత్తుగా కలవి. అనగా ఆత్మనేపదులు. అదాదిగణమున డెబ్బదిమూడు ధాతువులున్నవి. దా మొదలగు ధాతువులు పరసై#్మపది. భృఞ్‌ ధాతువు స్వరితము ఇత్తుగా కలది కావున ఉభయపది. హాక్‌ ధాతువు. ఉదాత్తేత్తు అనగా పరసై#్మపది. మాఙ్‌, హాఙ్‌, అను రెండు ధాతువులు అనుదాత్తము ఇత్తుగా కలవి కావున ఆత్మనే పదులు. దానధాతువులో స్వరితము ఇత్తుగా నుండును. అనగా ఉభయపది. వా, అణ మొదలగు మూడు ధాతువులు కూడా స్వరితేత్తులే. కావున ఉభయపదులు. ఘు మొదలగు పన్నెండు ధాతువులు పరసై#్మపదులు. హ్వాదిగణమున ఇరువది రెండు ధాతువులుండును. దివాదులగు ఇరువది అయిదు ధాతువులు పరసై#్మపదులు. షూఙ్‌, దూఙ్‌ అను రెండు ధాతువులు మాత్రము ఆత్మనే పదులు. ఓ కారము ఇత్తుగా గల పూఙ్‌ మొదలగు ఏడు ధాతువులు ఆత్మనేపదులు. దీఙ్‌ మొదలగు ధాతువులు కూడా ఆత్మనే పదులే. స్యతి మొదలగునవి పరసై#్మపదులు. జని మొదలగు పదిహెను ధాతువులు ఆత్మనేపదులు. దీఙ్‌ మొదలగు ధాతువులు కూడా ఆత్మనే పదులే. స్యతి మొదలగునవి పరసై#్మపదులు. జని మొదలగు పదిహెను ధాతువులు ఆత్మనేపదులు. మృషాదులగు అయిదు ధాతువులు స్వరితము ఇత్తుగా కలవి. అనగా ఉభయపదులు. పదాదులను పదునొకండు ధాతువులు ఆత్మనేపదులు. స్వాదులలో చురాదులో సకర్మకత్వమే యుండును. అది కూడా రాధు ధాతువు కర్మగా యుండును. తుదాదులు పదమూడు ధాతువులు ఉదాత్తము ఇత్తుగా గలవి. అనగా పరసై#్మపదులు. రధాదులు ఎనిమిది కూడా పరసై#్మపదులే. సమాది ధాతువులు నలుబది యారు కూడా ఉదాత్తము ఇత్తుగా గలవే. కావున పరసై#్మపదులే. దివాదులలో నూటనలబది ధాతువులున్నవి. స్వాదులు స్వరితము ఇత్తుగా గలవి. కావున ఉభయపదులు. దునోతి మొదలగు ఏడు ధాతువులు పరసై#్మపదులు. అష్టి, ధా ధాతువులు రెండు అనుదాత్తము ఇత్తుగా గలవి కావున ఆత్మనేపదులు. తికాది ధాతువులు పదునాలుగు పరసై#్మపదులు. స్వాదిగణములో ముప్పది రెండు ధాతువులున్నవి. తుదాదులు ఆరు ధాతువులు స్వరితము ఇత్తుగా కలవి కావున ఉభయపదులు. ఋషి ధాతువు పరసై#్మపది. జుషి మొదలగు నాలుగు ధాతువులు ఆత్మనేపదులు. వ్రశ్చ మొదలగు నూటా అయిదు ధాతువులు ఉదాత్తము ఇత్తుగా కలవి. కావున పరసై#్మపదులు ఒక్క గూరి ధాతువు మాత్రము ఉదాత్తము ఇత్తుగా కలది. కావున పరసై#్మపది. ణూ మొదలగు నాలుగు ధాతువులు కూడా పరసై#్మపదులే. కుఙ్‌ ధాతువు అనుదాత్తేత్తు కావున ఆత్మనేపదము. కుటాదులు పరసై#్మపదులు. పృఙ్‌, మృఙ్‌ ధాతువులు మాత్రము ఆత్మనేపదులు. మిగిలిన ఆరు ధాతువులు పరసై#్మపదులు. దృఙ్‌, ధృఙ్‌ అను రెండు ధాతువులు ఆత్మనే పదులు. ప్రచ్చాదులు పదునారు ధాతువులు పరసై#్మపదులు. మిల మొదలగు ధాతువులు నారు స్వరితము ఇత్తుగా గలవి. అనగా ఉభయపదులు. కుతీ మొదలగు మూడు ధాతువులు పరసై#్మపదులు. తుదాదులలో నూటా యాబది యేడు ధాతువులున్నవి. రుధ నంద ధాతువులు స్వరితము ఇత్తుగా గలవి. కావున ఉభయపదులు, కృ మొదలగు ధాతువులు పరసై#్మపదులు. ఞి ఇంధీ మొదలగు మూడు ధాతువులు అనుదాత్తము ఇత్తుగా కలవి కావున ఆత్మనేపదులు. శిష, పిష రుధాది ధాతువులు ఇరువది అయిదు ఉదాత్తము ఇత్తుగా గలవి కావున పరసై#్మపదులు. తను ధాతువు నుండి ఏడు ధాతువులు స్వరితము ఇత్తుగా గలవి. అనగా ఉభయపదులు, మను, వను ధాతువులు ఆత్మనేపదులు. కృఞ్‌ ధాతువు స్వరితేత్తు కావున ఉభయపది. తరువాత పన్నెండు ధాతువులను శాబ్దికులు చెప్పిరి. క్రీ మొదలగు ఏడు ధాతువులు ఉభయపదులు. సూత్రములో పఠించిన స్తంభ్వాదులు నాలుగు ధాతువులు పరసై#్మదులు. క్రుధాదులగు ఇరువది రెండు ధాతువులు ఉదాత్తము ఇత్తుగా గలవి. అనగా పరసై#్మపదులు. వృఙ్‌ ధాతువు ఆత్మనేపది. శ్రంధాదులగు ఇరువది యొక్క ధాతువులు పరసై#్మపదులు. గ్రహధాతువు స్వరితము ఇత్తుగా కలది యనగా ఉభయపది. క్ర్యాదులలో యాబది రెండు ధాతువులు పండితులచే చెప్పబడినవి. చురాది ధాతువులు నూట ముప్పది యారు. చితి మొదలగు పదునెనిమిది ధాతువులు ఆత్మనేపదులు. ఈ చురాదులు ణ్యంతములని చెప్పబడినవి. అదంతములగు ధాతువులు నలుబది యెనిమిది. పదాదులగు ధాతువులు పది ఆత్మనేపదులు. సూత్రాదులగు ఎనిమిది ధాతువులు కూడా ఞ్యంతములుగా చెప్పబడినవి. అనగా ఉభయపదులు. ప్రాతిపదికము కంటే పరముగా ధాత్వర్ధమున ఇష్టవదాదులు బహులముగా వచ్చునని సిద్ధాంతము.

తత్కరోతి తదాచష్టే హేతుమత్యపి ణిర్మతః, ధాత్వర్ధే కర్తృకరనాచ్చత్రాద్యాశ్యాపి ధాతవః. 73

అష్ట సంగ్రామ ఆఖ్యాతోనుదాత్తేచ్ఛాబ్దికైర్బుధైం, స్తోమాద్యాష్షోడశ తథా అదంతస్య నిదర్శనమ్‌. 74

తథా బాహులకాదన్యే సౌత్రలౌకికవైదికాః, సర్వే సర్వగణీయాశ్చ తథాన్యే కార్ధ వాచినః. 75

సనాద్యంతా ధాతవశ్చ తథా వై నామదాతవః, ఏవమానన్త్యముద్భావ్యం ధాతూనామిహ నాదర ! 76

సంక్షేపోయం సముద్దిష్టో విస్తరస్తత్ర తత్ర చ, ఊదౄదంతైర్యైతిరుక్షుశీఙ్‌స్నునుక్షుశ్విడీఙ్‌శ్రిఖః. 77

వృఙ్‌వృఞ్‌భ్యాం చ వినైకాచోజంతేషు నిహతాస్స్మృతాః, శుక్ల పచ్‌ముచ్‌ రిచ్‌ వచ్‌ విచ్‌ సిచ్‌ ప్రచ్ఛిత్యజ్‌ నిజిర్‌ భజిః. 78

భంజ్‌ భుజ్‌ భ్రస్జ్‌ మస్జి యజ్‌ యుజ్‌ రుజ్‌ రంజ విజిర్‌ స్వంజి సంజ్‌ సృజః,

అద్‌ క్షుద్‌ ఛిద్‌ ఖిద్‌ తుది నుదః పద్య విద్‌ విద్యతిర్వినద్‌. 79

శిద్‌ సదీ స్విద్యతి స్స్కందిర్‌ హదీ క్రుధ క్షుధి బుధ్యతీ, బంధిర్యుధి రుధీ రాధి వ్యధ్‌ శుధస్సాదిసిధ్యతీ. 80

మన్యహన్నాప్‌ క్షిప్‌ ఛుపి తప్‌ తిపస్తృప్యతి దృప్యతీ, లిబ్లుబ్వపూ శప్స్వపూ సృపి యభ రభ లభ గమ్నమ్యయో రభిః. 81

క్రుశిర్దంశి దిశీ దృశ్‌ మృశ్‌ రిశ్‌ రుశ్‌ లిశ్‌ విశ్‌ స్పృశృ కృషిః,

త్విష్‌ తుష్‌ దుష్‌ పుష్య పిష్‌ విష్‌ శిష్‌ శుష్‌ శ్లిష్యతయో ఘసిః 82

వసతిర్దహ దిహి దుహో నహ్‌ మిహ్‌ రుహ్‌ లిహ్‌ వహిస్తథా, అనుదాత్తా హలంతేషు ధాతవో ద్వ్యధికం శతమ్‌. 83

చాద్యా నిపాతా గవయః ప్రాద్యాదిణ్దశకాలజాః, శబ్దాః ప్రోక్తా హ్యవేకార్ధాస్సర్వలింగా అపి ద్విజ. 84

గణపాఠస్సూత్రపాఠో ధాతుపాఠస్తథైవ చ, పాఠోనునాసికానాం చ పరాయణమిహోద్యతే. 85

శబ్దాస్సిద్ధా వైదికాస్తు లౌకికాశ్చాపి నారద !, శబ్దపారాయణం తస్మాత్కారణం శబ్దసంగ్రహే. 86

లఘుమార్గేణ శబ్దానాం సాధూనాం సన్నిరూపణమ్‌, ప్రకృతిప్రత్యయాదేశలోపాగముముఖైః కృతమ్‌. 87

ఇత్ధమేతత్సమాఖ్యాతం నిరుక్తం కించిదేవ తే, కార్త్స్నన వక్తుమానంత్యాత్కోపి శక్తో న నారద ! 88

ఇతి శ్రీబృహన్నారదీయమహాపురాణ పూర్వభాగే బృహదుపాఖ్యానే

ద్వితీయపాదే నిరుక్తలక్షణనిరూపణం నామ

త్రిపంచాశత్తమోధ్యాయః

తత్‌ కరోతి (దానిని చేయుచున్నాడు) తత్‌ ఆచష్టే (అట్లు చెప్పుచున్నాడు, ఆచరించుచున్నాడు) అను అర్ధములో, హేతుమదర్ధములో ధాతువునకంటే పరముగా ణిచ్‌ ప్రత్యయము వచ్చును. కర్తృకర్మ వాచక శబ్దముల కంటే పరముగా ధాత్వర్ధమున ప్రత్యయములను చేర్చుకొన్నచో చిత్రమొదలగు శబ్దములు కూడా ధాతువులగును. సంగ్రామాది శబ్దములు ధాతువులుగా మారినపుడు సంగ్రామాదులు ఎనిమిది అనుదాత్తేత్తులగును. అనగా ఆత్మనే పదమువచ్చును. అని శబ్ద్రశాస్త్రవిదులు చెప్పిరి. స్తోమాది శబ్దములు పదునారు అదంత ధాతువులకు ఉదాహరములు. ఇట్లే బాహులకమును ఆశ్రయించుట వలన సూత్రములలో చెప్పబడినవి, లోకములో వ్యవహరించబడునవి, వేదములో ప్రయోగించబడినవి చాలా ధాతువులు సిద్ధించును. ఈ ధాతువులన్నియు అన్ని గణములలో నుండును. అనేకార్దములను చెప్పుచుండును. సనాద్యంత ధాతువులు, నామ ధాతువులు అని ఇట్లు ధాతువులు అనన్తములని తెలియవలయును. ఇచట సంక్షేపముగా చెప్పితిరి. ఆయా సందర్భములలో విస్తరముగా చెప్పియుండును. చూచి తెలియవలయును, ఊకారాంతములు, ఋకారాంతములు, యు రు, క్షు, శీఙ్‌, స్సు, ను, క్షు, శ్వి, ఈఙ్‌, శ్రి, వృఙ్‌, వృఞ్‌ అను ధాతువులు తప్ప మిగిలిన అజంతములగు ధాతువులలో ఒక అచ్చుగల ధాతువలు అనుదాత్తము ఇత్తుగా గల వగును. శుక్ల్‌, పచ్‌, ముచ్‌, రిచ్‌, వచ్‌, విచ్‌, సిచ్‌, ప్రచ్ఛి, త్యజ్‌, నిజిర్‌, భజ్‌, భంజ్‌, భుజ్‌, భస్జ్‌, మస్జ్‌, యజ్‌, యుజ్‌, రుజ్‌, రంజ్‌, విజిర్‌, స్వంజ్‌, సంజ్‌, సృజ్‌, అద్‌, క్షుద్‌, బిద్‌, ఛిద్‌, తుద, నుది, పద్య, ఖిద్‌, విద్య, వినద్‌, శద్‌, సద్‌, స్విద్య, స్కందిర్‌, హది, క్రుధ్‌, క్షుధి, బుద్య, బంధిర్‌, యుధి, రుధి, రాధి, వ్యధ్‌, శుధ్‌, సాధి, సిధ్య, మన్య, హన్‌, ఆప్‌, క్షిప్‌, ఛుపి, తప్‌, తిప, తృప్‌, దృప్‌, లిబ్‌, లుబ్‌, వప్‌, శప్‌, స్వపూ, సృపి, యభ, రభ, లభ, గమ్‌, నమ్‌, యమ్‌, రభి, క్రుశి, దంశి, దిశి, దృశ్‌, మృశ్‌, రిశ్‌, రుశ్‌, లిశ్‌, విశ్‌, స్పృశ్‌, కృష్‌, త్విష్‌, తుష్‌, దుష్‌, పుష్య, పిష్‌, విష్‌, శుష్‌, శ్లిష్య, ఘసి, వస, దహ, దిహి, దుహ్‌, నహ్‌, ముహ్‌, రుహ్‌, లిహ్‌, వహి అను నూటారెండు హలంతములగు ధాతువులు అనుదాత్తము ఇత్తుగా గలవి. చ మొదలగునవి, దేశములలో కాలములో ఏర్పడిన ప్ర మొదలగునవి నిపాతములనబడును. శబ్దములు అనేకార్ధములు కలవి మూడు లింగములు కలవిగా చెప్పబడినవి. గుణపాఠము, సూత్రపాఠము, ధాతు పాఠము, అనునాసిక పాఠము ఈ విషయమున ప్రమాణముగా చెప్పబడినది. శబ్దములు సిద్దములే, లౌకిక శబ్దములు వైదిక శబ్దములు కూడా సిద్ధములే. కావున శబ్దములను తెలియవలయునన్నచో శబ్దపారాయణము చేయవలయును. సులభము లఘువు అయిన మార్గములో శబ్దములకు సాధుత్వము తెలియుటకు ప్రకృతి, ప్రత్యయ, ఆదేశ, లోప, ఆగమములను తెలియవలయును. ఇట్లు నీకు నిరుక్తమును సంక్షేపముగా కొంచెమే చెప్పితిని. శబ్దములు అనంతములు కావున సంపూర్ణముగా ఎవ్వరూ చెప్పజాలరు.

ఇది శ్రీబృహన్నారదీయ పురాణమున పూర్వభాగమున

బృహదుపాఖ్యానమున ద్వితీయ పాదమున నిరుక్త లక్షణ నిరూపనమను

యాబది మూడవ అధ్యాయము సమాప్తము

Sri Naradapuranam-I    Chapters    Last Page