Sri Naradapuranam-I    Chapters    Last Page

ద్విపంచాశత్తమోధ్యాయః = యాబదిరెండవ అధ్యాయము

నందన ఉవాచ ః-

అథ వ్యాకరణం వక్ష్యే సంక్షేపాత్తవ నారత !, సిద్ధరూపప్రబంధేన ముఖం వేదస్య సాంప్రతమ్‌. 1

సుప్తిఙన్తం పదం విప్ర సుపాం సప్త విభక్తయః, స్వౌజసః ప్రథమాః ప్రోక్తా సా ప్రాతిపదికాత్మితా. 2

సంబొధనే చ లింగాదావుక్తే కర్మణి కర్తరి, అర్థవత్ప్రాతిపదికం ధాతుప్రత్యయవర్జితమ్‌. 3

అమౌశసౌ ద్వితీయా స్యాత్తత్కర్మ క్రియతే చ యత్‌, ద్వితీయా కర్వణి ప్రోక్తాంతరాంతరేణ స యుతే. 4

టా భ్యాం భిస్‌ తృతీయా స్యాత్కరణ కర్తరీరితా, యేన క్రియతే తత్కరణం సః కర్తా స్యాత్కరోతి యః 5

జే భ్యాం భ్యసశ్చతుర్ధీ స్యాత్సంప్రదానే చ కారకే, యసై#్మ దిత్సా ధారయేద్వై రోచతే సంప్రదానకమ్‌. 6

పంచమీ స్యాజ్జసి భ్యాం భ్యో హ్యపాదానే చ కారకే, యతోపైతి సమాదత్తే ఆపదత్తే చ యం యతః. 7

ఙ సోసామశ్చ షష్ఠీ స్యాత్స్వామిసంబంధముఖ్యకే, జ్యోస్సుపం స్సప్తమీ తు స్యాత్సాచాధికరణ భ##వేత్‌. 8

ఆధారే చాపి విప్రేన్ద్ర రక్షార్ధానాం ప్రయోగతః, ఈప్సితం చానీప్సితం యత్తదపాదనకం స్మృతమ్‌. 9

పంచమీ పర్యపాజ్యోగే ఇతరర్తేన్యదిఙ్ముఖ్‌, ఏతైర్యోగే ద్వితీయా స్యాత్కర్మప్రవచనీయకే. 10

లక్షణత్ధంభూతోభిరభాగే చానుపరిప్రతి, అంతరేషు సహార్ధే చ హీనే హ్యుపశ్చ కథ్యతే. 11

ద్వితీయా చ చతుర్ధీ స్యాచ్చేష్టాయాం గతికర్మణి, అప్రాణిషు విభక్తీ ద్వే మన్యకర్మణ్యనాదరే. 12

సమస్స్వస్తి స్వధా స్వాహాలం వషడ్యోగ ఈరితా, చతుర్ధీ చైవ తాదర్ధ్యే తుమర్ధాద్భావవాచినః. 13

తృతీయా సహయోగే స్యాత్కుత్సితేంగే విశేషణ, కాలే భావే సప్తమీ స్యాదేతైర్యోగే చ షష్ఠ్యపి. 14

స్వామిస్వరాధిపతిభిః సాభిదాయాదసూతకైః, నిర్ధారణ ద్వే విభక్తీ షష్ఠీ హేతుప్రయోగకే. 15

స్మృతర్ధకర్మణి తథా కరోతేః ప్రతయత్నకే, హింసార్ధానాం ప్రయోగే చ కృతి కర్మణి కర్తరి. 16

న కర్తృకర్మణోష్షష్ఠీ నిష్ఠాదిప్రతిపాదికా, ఏతా వై ద్వివిధా జ్ఞేయా సుబాదిషు విభక్తిషు. 17

భూవాదిషు తిఙన్తేషు లకారా దశ వై స్మృతాః, తప్తసంతతీ ప్రథమో మధ్యమస్సిష్ధస్థోత్తమః. 18

మిబ్వస్మసః పరసై#్మ తు పాదానాం చాత్మనే పదమ్‌, త ఆతేంతే ప్రథమో మధ్యస్సే ఆదే ధ్వేథాధోత్తమః. 19

ఏవం హే మహ ఆదేశా జ్ఞేయా హ్యన్యే లిజాదిషు, నామ్ని ప్రయుజ్యమానే తు ప్రథమః పురుషో భ##వేత్‌. 20

మధ్మో యుష్మది ప్రోక్త ఉత్తమః పురుషొస్మది,

భూవాద్యాధాతవః ప్రోక్తా సనాద్యన్తాస్తథా తతః. 21

లడీరతో వర్తమానే భూతేనద్యతనే తథా, మాస్మయోగే చ లఙ్‌ వాచ్యో లోడాశిషి చ ధాతుతః. 22

విధ్యాదౌ స్యాదాశిషి చ లఙితో ద్వివిధో మునే, లిడతీతే పరోక్షే స్యాత్‌ శ్వస్తనే లుడ్భవిష్యతి. 23

స్యాదనద్యతనే లృట్చ భవిష్యతి తు ధాతుతః, భూతే లుఙ్‌ తిప్‌ స్యసౌ చ క్రియాయాం లృఙ్‌ ప్రకీర్తితః. 24

సిద్ధోదాహరణం విధ్ధ సంహితాదిపురస్సరమ్‌, దండాగ్రం చ దధీదం చ మధూదకం పిత్రర్షభః. 25

హోతౄకారాస్తథా సేయం లాంగలీషా మనీషయా, గంగోదకం తపల్కార ఋణార్ణం చ మునీశ్వర. 26

శీతార్తాశ్చ మునిశ్రేష్ఠ సేన్ద్రస్సౌకార ఇత్యపి, వధ్యాసనం పిత్రర్ధో నాయకో లవణస్తథా. 27

త ఆద్యా విష్ణవే హ్యత్ర తస్మా అర్ఘో గురా అఘః,

హరేవ విష్ణోవేత్యేషా దసో మా దప్యమా అఘాః. 28

శౌరీ ఏతా విష్ణూ ఇమౌ దుర్గే అమూనో అర్జునః, ఆ ఏవం చ ప్రకృత్యైతే తిష్ఠంతి మునిసత్తమ. 29

షడత్ర షణ్మాతరశ్చ వాక్ఛూరో వాగ్ఘరిస్తథా, హరిశ్శేతే విభుశ్చిన్త్యస్తచ్ఛేషో యచ్ఛరస్తథా. 30

ప్రశ్నస్త్వథ హరిష్షష్ఠః కృష్ణష్టీకత ఇత్యపి, భవాన్‌ షష్ఠశ్చ షట్సన్న షట్‌తే తల్లేప ఏవ చ. 31

చక్రిం చ్ఛిన్ధి భవాఞ్చౌరిర్భవాన్‌ శౌరిరిత్యపి, సమ్యఙ్‌ఙనన్తోంగచ్ఛాయా కృష్ణం వన్దే మునీశ్వర. 32

తేజాంసి మంస్యతే గంగా హరిశ్ఛేత్తామరశ్వివః, రామకామ్యః కృపపూజ్యో హరిః పూజ్యోర్చ ఏవ హి. 33

రామో దృష్టోబలా అత్ర సుప్తా ఇష్టో ఇమా యతః, విష్ణుర్నమ్యో రవిరయం గీఫలం ప్రాతరచ్యుతః. 34

భ##క్తైర్వంద్యోంతరాత్మా భో భో ఏష హరిస్తథా, ఏష శార్ఞీ సైష రామస్సంహితైవం ప్రకీర్తితా. 35

రామేణాభిహితం కరోమి సతతం రామం భ##జే సాదరమ్‌, రామేణాపహృతం సమస్తదురితం రామాయ తుభ్యం నమః,

రామాన్ముక్తిరభీప్సితా మమ సదా రామస్య దాసోస్మ్యహమ్‌, రామే రంజత మే మనస్సవిశదం హే రామ తుభ్యం నమః. 36

సర్వ ఇత్యాదికా గోపా స్సఖా చైవ పతిర్హరిః.

సుశ్రీర్భానుస్స్వయంభూశ్చ కర్తారౌ గౌస్తు నౌరితి, అనడ్వాన్‌ గోధుగ్లిట్చ ద్వేత్రయశ్చత్వార ఏవ చ. 38

రాజా పంథాస్తథా దండీ బ్రహ్మహా పంచ చాష్ట చ, అష్టౌ అయం మునే సమ్రాట్‌ సవిభ్రద్విట్‌ వపుర్మనః. 39

ప్రత్యజ్‌ పుమాన్‌ మహాన్‌ ధామాన్విద్వాన్షట్‌ పిపఠీశ్చతోః, ఉశనాసావిమే పుంసి స్యురక్తలవిరామకాః. 40

రాధా సర్వాగతిర్గోపీ స్త్రీశ్రీర్ధేనుర్వధూస్స్వసా. గౌర్నౌరుపానదూద్యౌర్గోః క్షుత్కమత్సంవిత్తు వా క్వచిత్‌. 41

రుగ్విడుద్భాః స్త్రీయాఃస్తపః కులం సోమపకుక్షి చ, గ్రామణ్యంబ ఖలప్యేవం కర్తృచాతిరివా తను. 42

స్వనడుచ్చ విమలద్యు వాశ్చాత్వారీదమేవ చ, ఏతద్బృహ్మశ్చ దండీ అన్నత్‌క్కించిత్త్యదాదిచ. 43

ఏతద్వే చిద్గవాక్‌ గవాఙ్‌ గోఅక్‌ గోఙ్‌ గోక్‌ గోఙ్‌, తిర్యగ్య కృచ్ఛకృచ్చైవ దదత్భవత్పచత్తుదత్‌. 44

దీవ్యద్ధనుశ్చపి పఠీః పయోదస్స పుమాంసి చ, గుణద్రవ్యక్రియా యోగాం స్త్రిలింగాశ్చ కతి బ్రువే. 45

శుక్తః కీలాలపశ్చైవ శుచిశ్చ గ్రామణీస్సుధీః, పటుస్స్వయంభూః కర్తా చ మాతా చైవ పితాచనా. 46

సత్యాసాగ్యుస్తథా పుంసో మతభ్రమరదీర్ఘపాత్‌, ధనాకృసోమౌ చాగర్హస్తావిర్గ్రధాస్వర్ణన్బహూ. 47

రిమపవ్విషాద్వందజాతానాహో తథాక్రమాత్‌, సర్వవిశ్వోభ##యే చోభౌ అన్యాంతరేతరాణి చ. 48

ఉత్తరశ్చోత్తమో నేమస్త్వసమోథ సమా ఇషః, పూర్వోత్తరోత్తరాశ్చైవ దక్షిణశ్చోత్తరాధరౌ. 49

అపరశ్చతురోప్యేతత్‌ యావత్తత్కిమసౌ ద్వయమ్‌, యుష్మదస్మచ ప్రథమచరమోల్పస్తథార్ధకః. 50

నోరః కతిపయే ద్వే చ త్రయో శుద్ధాదయస్తథా, స్వే కాబువిరోదపిరవిపర్యయశ్చావ్యయా స్తథా. 51

సనందన మహర్షి పలికెను :- ఓ నారదా! ఇపుడు నీకు సంక్షేపముగా వ్యాకరణమును చెప్పెదను. ఈ వ్యాకరణము సిద్ధరూపప్రబంధముగా వేదమునకు ముఖముగా నిర్ణయచించబడినది. సుబన్తము తిఙన్తము పదమనబడును. సుపులలో ఏడు విభక్తులున్నవి. సు, ఔ, జస్‌ అనునవి ప్రథమావిభక్తి ప్రత్యయములు. ఈ ప్రత్యయములకు ముందున్న ప్రకృతి ప్రాతిపదికమనబడును. ఎదుటివారిర ఉద్దేశించి మాట్లాడదలచినపుడు చేయు సంబోధనలో, స్త్రీ పుం నపుంసక లింగములలో కర్మకర్త చెప్పబడినపుడు ధాతువు ప్రత్యయము కాక అర్ధవంతమగు శబ్దస్వరూపము ప్రాతిపదికమనబడును. అమ్‌, ఔట్‌, శస్‌ అనునవి ద్వితీయా విభక్తి ప్రత్యయములు. చేయబడుదానిని కర్మయందురు. కర్మ విషయమున ద్వితీయావిభక్తిని చెప్పుకొనవలయును. అంతరా, అంతరేణ అను శబ్బములు ప్రక్కనున్నప్పుడు కూడా ద్వితీయావిభక్తిని చెప్పుకొనవలయును. టా, భ్యాం, భిస్‌ అనునవి తృతీయా విభక్తి ప్రత్యయములు. కరణార్ధమున కర్త్రర్ధమున తృతీయా విభక్తిని చెప్పుకొనవలయును. దేనిచే చేయబడునో అది కరణమనబడును. చేయునది కర్తయగును. ఙే, భ్యాం, భ్యస్‌ అనునవి చతుర్థీ విభక్తీ ప్రత్యయములు. సంప్రదానకారకమున చతుర్థీ విభక్తిని చెప్పుకొనవలయును. ఎవరి విషయమున దానము చేయవలయునను కోరిన కలుగునో వాడు, ఎవరి విషయమున, లేదా ఏ వస్తువు విషయమున రుచియుండునో వాడు అది సంప్రదానమనబడును. ఙసి, భ్యాం, భ్యస్‌ అనునవి పంచమీ విభక్తి ప్రత్యయములు. అపాదాన కారక వివక్షలో పంచమీ విభక్తిని చెప్పుకొనవలయును. దేనినుండి విడివడునో, దేని నుండి స్వీకరించునో, దేని నుండి తొలగిపోవునో అది అపాదానమనబడును. ఙస్‌, ఓస్‌, ఆమ్‌ అనునవి షష్ఠీ విభక్తి ప్రత్యయములు. స్వస్వామి భావసంబంధమున షష్ఠీ విభక్తిని చెప్పుకొనవలయును. ఙి, ఓస్‌, సుప్‌ అనునవి సప్తమీ విభక్తి ప్రత్యయములు.

అధికరణ కారకమున సప్తమీ విభక్తిని చెప్పుకొనవలయును. ఆధారమును అధికరణమందురు. రక్షార్ధ ప్రయోగములలో ఈప్సితమున, అనీప్సితమున (ఇష్టాఇష్టములలో) నుండు దానిని కూడా అపాదానమందురు. పరి, అప, ఆఙ్‌ అను ఉపసర్గలతో సంబంధమున్నపుడు పంచమీ విభక్తి వచ్చును. ఇతర ఋత, అన్య, దిఙ్ముఖ శబ్దములతో కర్మప్రవచనీయకములచే యోగమున్నపుడు ద్వితీయా విభక్తి వచ్చును. లక్షణ ఇత్థంభూతార్ధములలో అభి అను ఉపసర్గను చెప్పవలయును. విభాగము లేనపుడు అను, పరి, ప్రతి అను నుపసర్గలను చెప్పవలయును. అంతరార్ధమున, సహార్ధమున, హీనార్ధమున ఉప అను ఉపసర్గను చెప్పవలయును. చేష్టార్ధములో గతి కర్మలో ద్వితీయా చతుర్థీ విభక్తులను చెప్పవలయును. ప్రాణి భిన్న వాచకములలో రెండు విభక్తులుండును. మన్యధాతువునకు కర్వవిషయమున, అనాదరార్ధమున కూడా ఈ రెండు విభక్తులను చెప్పవలయును. నమః, స్వస్తి, స్వాహా, స్వధా, అలం, వషట్‌ అను పదములతో సంబంధమున్నప్పుడు తాదర్ధ్యమున, భావవాచకమగు తుమున్నర్ధమున కూడా చతుర్ధీవిభక్తిని ప్రయోగించవలయును. సహ అను పదముతో యోగమున్నపుడు కుత్సితాంగ విశేషణమున తృతీయా విభక్తిని ప్రయోగించవలయును. కాలార్ధమున భావార్ధమున, సప్తమీ విభక్తిన ప్రయోగించవలయును. కాల భావవాచకములతో సంబంధమున్నపుడు షస్ఠీ విభక్తిని కూడా ప్రయోగించవచ్చును. స్వామి, ఈశ్వర, అధిపతి, సాక్షి దాయాద సూతక శబ్దార్ధముల విషయమున, శబ్దముల విషమున నిర్ధారణార్ధమున సప్తమీ షష్టీ విభక్తులను ప్రయోగించవచ్చును. హేతు శబ్దవిషయమున షష్ఠీ విభక్తిన ప్రయోగించవలయును. స్మృత్యర్ధ కర్మలో, కరోతి ధాతువునకు యత్నార్ధమును చెప్పునపుడు, హింసార్దక శబ్దములను ప్రయోగించినపుడు, కృతి కర్మలో, కృతికర్తలో పైన చెప్పిన రెండు విభక్తులను ప్రయోగించవలయును. నిష్ఠాదులన తెలియచేయు షష్ఠీ విభక్తి కర్తృకర్మల విషయమున ప్రయోగించరాదు. ఇట్లు సుబాది విభక్తులలో ఇవి రెండు విధములుగా నుండును. భూ, వా మొదలగు తఙన్తములందు పది లకారములుండును. తప్‌, తస్‌, అంతి అనునవి ప్రధమ పురుష ప్రత్యయములు, సిప్‌, థస్‌, థ అనునవి మధ్యమ పురుష ప్రత్యయములు. మిప్‌, వస్‌, మస్‌ అనునవి ఉత్తమ పురుష ప్రత్యయములు. ఈ తొమ్మిది ప్రత్యయములు పరసై#్మపదమున చెప్పబడినవి. ఇక ఆత్మనే పదమున త, ఆతే, అంతే అనునవి ప్రధమ పురుష ప్రత్యయములు. సే, ఆధే, ద్వే అనునవి మధ్యమ పురుష ప్రత్యయములు. ఏ, వహే, మహే అనునవి ఉత్తమ పురుష ప్రత్యయములు. ఈ పద్ధెనిమిది లకారములకు ఆదేశములుగా వచ్చును. నామవాచక శబ్బమును ప్రయోగించునపుడు ప్రధమ పురుషను చెప్పవలయును. యుష్మచ్ఛబ్బ ప్రయోగసమయమున మధ్యమ పురుషను. అస్మచ్ఛబ్బప్రయోగమున ఉత్తమ పురుషను చెప్పవలయును. భూ, వా మొదలు వాటిని ధాతువులందురు. తరువాత సనాది ప్రత్యయాంతములుండును. వర్తమాన కాలమున లట్‌ అను లకారమును చెప్పవలయును.

అనద్యతన భూతకాలమున, మా, స్మ అనువాటితో యోగమున్నపుడు ధాతువునకంటే పరముగా లఙ్‌ లకారమును చెప్పవలయును. ఆశీర్వాదార్ధములో ధాతువున కంటే పరముగా లోట్‌ లకారమును చెప్పుకొనవలయును. విధ్యాద్యర్ధములలో ఆశీర్వాదార్ధములో లిఙ్‌ లకారముండును. అనద్యతన భూతమున పరోక్షార్ధమున లిట్‌ లకారమును చెప్పుకొనవలయును. అద్యతన భవిష్యత్కాలమున లుట్‌ లకారముండును. అనద్యతన భవిష్యత్కాలమున లృట్‌ లకారముండును. భూతకాలమున లఙ్‌ లకారముండును. క్రియార్ధమున లృఙ్‌ లకారముండును. అన్నిసంధులు వచ్చి పరిపూర్ణ రూపము ఏర్పడిన దానిని సిద్ధోదాహరణముగా తెలియుము. దండాగ్రం, దధీదం, మధూదకం, హోతౄకారః అనునవి సవర్ణదీర్ఘసంధికి సద్ధోదాహరణములు. పిత్రర్షభః, సేయం, గంగోదకం, తవల్కారః అనునవి గుణసంధికి ఉదాహరణములు. ఇట్లే ఆయా సంధులేర్పడిన సిద్ధోదహరణములను కొన్నింటిని చూపెదను. ఋణార్ణం, శీతార్తః, సేన్ద్రః, సౌకారః, వధ్వాసనం, పిత్రర్థః, నాయకః, లవణనం, త ఆద్యా, విష్ణవే, తస్మా అర్ఘః, గురా అఘః, హరేవ, విష్ణోవ, శౌరీ ఏతౌ, విష్ణూ ఇమౌ, దుర్గే అమూ నో అర్జునః, అను నాలుగు రూపములు ఆ ఏవం అనునది కూడా ఏ సంధీరాక ప్రకృతి భావములో నుండునని తెలియము. షడత్ర, షణ్మాతరః, వాక్ఛూరః, వాగ్ఘరిః, హరిశ్శేతే, విభుశ్చిన్త్యః, తచ్ఛేషః, యచ్ఛరః, ప్రశ్నః, హరిష్షష్ఠః, కృష్ణష్టీకతే, భావాన్‌ షష్ఠః, షట్సన్తః షట్‌తే, తల్లేపః చక్రింశ్ఛిన్ధి, భవాఞ్ఛౌరిః, భవాన్‌ శౌరిః, సమ్యఙ్‌ ఙనక్తః, అంగచ్ఛాయా, కృష్ణం వన్దే, తేజాంసి, మంస్యతే, హరిశ్ఛేత్తా, అమర శ్శివః రామ కామ్యః, కృష్ణ పూజ్యః, హరిః పూజ్యః, రామో దృష్టః, అబలా అత్ర, సుప్తా ఇష్టా, విష్ణుర్నమ్యః, ర విరయం, గీగఫలం, ప్రాతరచ్చుతః, భ##క్తైర్వంధ్యః వంద్యోంతరాత్మా, భో భో ఏషః, ఏష హరిః, ఏష శార్జీ, సైష రామః, ఈ రూపములందున్న సంధులను సంహితాయందురు. ఇపుడు విభక్తి ప్రయోగములకు ఉదాహరణములను చూపుచున్నారు. రామేణాభిహితం కరోమి (తృతీయా) రామం భ##జే (ద్వితీయా) రామేణా పహృతం (తృతీయా, సంహిత) రామాయ తుభ్యం నమః (చతుర్ధీ) రామే రంజతే (సప్తమీ) రామాన్ముక్తిః (పంచమీ) రామస్య దాసోస్మి (షష్ఠీ విభక్తి) హేరామ (సంబోధన) ఇక ఇపుడు సంధిలేని కేవల శబ్దములను కొన్నింటిని చెప్పుచున్నాను. సర్వాది శబ్దములు, గోషా, సఖా, పతి, హరి, సుశ్రా, భానుః, స్వయంభూః, కర్తా, రౌ గౌః, అనడ్వాన్‌, గోధుక్‌, లిట్‌, ద్వే, త్రయః, చత్వారః, రాజా, పంథాః, దండీ, బ్రహ్మహా, పంచ అష్ట, అష్టౌ, అయం, సమ్రాట్‌, చిభృత్‌, ద్విటా, వపుః, మనః, ప్రత్యఙ్‌, పుమాన్‌, మహాన్‌, ధామాన్‌, విద్వాన్‌, షట్‌, పిపఠీః, దోః, ఉశనా, అసౌ ఈ శబ్దములు పుంలింగములో ఉండును. రాధా, సర్వా, గతిః, గోపీ, స్త్రీ, శ్రీః, ధేనుః, వధూః, స్వసా, గౌః నౌః, ఉపానత్‌, ద్యౌః, గోః, క్షుత్‌, కకుత్‌, సంవిత్‌, రుక్‌, విట్‌, భాః అనునవి స్త్రీలింగ శబ్దములు తపః, కులం, సోమపం, అక్షి, గ్రామణీ, ఖలపు, కర్తృ, తను, స్వనడుత్‌, విమలం, ద్యు, వాః, చత్వారి, ఇదం, ఏతత్‌, బ్రహ్మ, దండి, అన్యత్‌, కించిత్‌, త్యదాది శబ్దములు ఏతత్‌, ద్వే, చిత్‌, గవాక్‌, గవాఙ్‌, గో అక్‌, గోఙ్‌, గోక్‌, తిర్యక్‌, యకృత్‌, శకృత్‌, దదత్‌, భవత్‌, పచత్‌, తుదత్‌, దీవ్యత్‌, ధనుః అనునవి నపుంసకలింగరూపములు. పిపఠీః పయోదః అనునవి పుంలింగములో కూడా ఉండును. గుణద్రవ్యక్రియా యోగముచే శబ్దములు మూడులింగములలో నుండునని కొందరందురు. శుక్ల కీలాలప, శుచి, గ్రామణీ, సుధీ, పటు, స్వయం, భూ, కర్తా, మాతా,చ పితా, నా, సత్య ఈ శబ్దములు పుంలింగమున నుండును. మత, భ్రమర, దీర్ఘపాత్‌, ఘన, సోమ, గర్హ, అవి, గ్రంధ,స్వర్ణ, బహు, శబ్దములు రెండు లింగములలో నుండును. సర్వ, విశ్వ, ఉభయ, ఉభ,అన్య, అంతర, ఇతర, ఉత్తర, ఉత్తమ, నేమ, సర్వార్ధకమ సమ శబ్దము, ఇష, పూర్వ, ఉత్తర, దక్షిణ, ఉత్తర, అధర, అపర, చతుర, ఏతత్‌, యావత్‌, తత్‌, కిం, అసౌ, ద్వి, యుష్మత్‌, అస్మత్‌, ప్రథమ, చరమ, అల్ప, నోర, కతిపయ, ద్వి, త్రి, శుద్ధాది శబ్దములు, మూడు లింగములలో నుండును. స్వ, ఇక, ఆభు, రోధ,పరి, విపర్యయ శబ్దములు అవ్యయములు

తద్ధితాశ్చాప్యపత్యార్ధే పొండవాశ్శ్రైధరస్తథా. 52

గార్గ్యో నాడాయనాత్రేయా గాంగేయః పైతృష్వస్రీయ, దేవతార్ధే చేదమర్ధే హ్యేంద్రం బ్రాహ్మో హవిర్బలీ. 53

క్రియాయుజోః కర్మకర్త్రోః ధౌరేయః కౌంకుమం తథా, భవాద్యద్యర్ధే తు కానీనః క్షత్త్రియో వైదికస్స్వకః. 54

స్వార్థే చౌరస్తు తుల్యార్ధే చంద్రవన్ముశమీక్షతే, బ్రాహ్మణత్వం బ్రాహ్మణతా భావే బ్రాహ్మణ్యమేవ చ. 55

గోమాన్ధనీ చ ధనవాన్‌ అస్త్యర్ధే ప్రమితౌ కియాన్‌, జాతార్ధే తుందిలశ్శ్రధాలురౌన్నత్యే తు దంతురః. 56

ప్రగ్వీ తపస్వీ మేధావీ మాయావ్యస్త్యర్ధ ఏవ చ, వాచాలశ్చైవ వాచాటో బహుకుత్సితభాషిణి. 57

ఈషదపరిసమాప్తే కల్పబ్దేశీయ ఏవ చ, కవికల్పః కవిదేవ్యః ప్రకారవచనే తథా. 58

పటుజాతీయః కుత్సాయాం వైద్యపాశః ప్రశంసనే, వైద్యరూపో భూతపూర్వే మతో దృష్టచరో మునే. 59

ప్రాచుర్యాదిష్వన్నమయో మృణ్మయస్త్రీమయస్తథా, జాతార్ధే లజ్జితోత్యర్ధే శ్రేయాన్శ్రేష్ఠశ్చ నారద. 60

కృష్ణతరశ్శుక్లసమ కిమ ఆఖ్యానతోవ్యయాన్‌, కితరాం చైవాతితరాం అభిహ్యుచ్చైస్తరామపి. 61

పరిమాణ జానుదఘ్నం జానుద్వయసమిత్యపి, జానుమాత్రం చ నిర్ధారే బహూనాం చ ద్వయోః క్రమాత్‌. 62

కతమః కతరస్సంఖ్యే య విశేషావధారణ, ద్వితీయశ్చ తృతీయశ్చ చతుర్థః షష్ఠపంచమౌ. 63

ఏకాదశః కతిపయః కతిధః కతి నారద !, వింశశ్చ వింశతితమః తథా శతతమాదయః. 64

ద్వేధా ద్వైధా ద్విధా సంఖ్యా ప్రకారేథ మునీశ్వర !, క్రియావృత్తా పంచకృత్వో ద్విస్త్రిర్బహుశ ఇత్యపి. 65

ద్వితయం త్రితయం చాపి సంఖ్యాయాం హి ద్వయం త్రయమ్‌, కుటీరశ్చ శమీరశ్చ శుండారోల్పార్ధకే మతః. 66

సై#్త్రణః పౌంస్నస్తుండిభశ్చ వృందారకకృషీవలౌ, మలినో వికటో గోమీ భౌరికీవిధముత్కటమ్‌. 67

అవటీటోననాటే నిబడం చేక్షుశాఖినమ్‌, నిబిరీ సమేషు కరీ విత్తో విద్యాచ్చణస్తథా. 68

విద్యాచంచుర్బహుతిధం పర్వతశ్శృంగిణస్తథా, స్వామీ విషమరూప్యం చోపత్యకాధిత్యకా తథా. 69

చిల్లిశ్చ చిపిటం చిక్వం వాతూలః కుతపస్తథా, వల్లశ్చ హి మేలుశ్చ కహోదశ్చపడస్తతః. 70

ఉర్ణాయుశ్చ మరూతశ్చైకాకీ చర్మణ్వతీ తథా, జ్యోత్స్నా తమిస్రా ష్టీవశ్చ కక్షీవద్యర్మణ్వతీ. 71

ఆసందీవచ్చ చక్రీవత్తూష్ణీకాం జల్పతక్యపి, కుంభశ్చ కంయుః కంబశ్చ కేతిః కంతుః శంవస్తథా. 72

శంతశ్వంతి శంయశతౌ శంయోహ్వంయుశ్చ శంభువత్‌. 73

భవతి బభూవ భవితా భవిష్యతి భవత్వభవద్భవేచ్చాపి, భూయాదభూదభవిష్కయల్లాదావేతాని రూపాణి. 74

అత్తి జఘాసాత్తాత్స్యత్యంత్త్వదదద్యాద్ద్విరఘసదత్స్యత్‌, జహోతి జుహావ జుహవాంచకార హోతా హోష్యతి జుహోతు. 75

అజుహోజ్ఞుహుయాద్ధూయాదహౌషీదహోష్యద్దీవ్యతి, దిదేవ దేవాతా దేవష్యతి చ అదీవ్యద్దీవ్యాద్వై. 76

అదేవీదదేవీష్యత్సునోతి సుషావ సోతా సోష్యతి వై, సునోత్వసునోత్సునుయాత్సూయాదాసావీదసోష్యత్తుదతి చ. 77

తుతోద తోత్తా తోత్స్యతి తుదత్వతుదత్తుదేత్తుద్యాద్ధి, అతౌత్సీదతోత్స్యదితి చ రుణద్ధి రురోధ రోద్ధా రోత్స్యతి వై. 78

రుణద్ధు అనుణద్రుధ్యాదరౌత్సీదరోత్స్యచ్చ, తనోతి తతాన తనితా తనిష్యతి తనోత్వతనోత్తనుయాద్ధి. 79

అతనోచ్చాతానీదతనిష్యత్క్రీణాతి చిక్రాయ క్రేతా క్రేష్యతి క్రేణాత్వితి చ,

అక్రీణాత్క్రీయాత్క్రీయాదక్రైషీదక్రేష్యచ్చోరయతి చోరయామాస చోరయితా చోరయిష్యతి చోరయతు. 80

అచోరయచ్చోరయేచ్చోర్యాదచూచురదచోరిష్యదిత్యేవం దశ వై గణాః, ప్రయోజకే భావయతి సనీచ్ఛాయాం బుభూషతి,

క్రియాసమభిహారే తు పండితో భోభూయతే మునే. 81

తథా యఙ్లుకి బోభవీతి చ పఠ్యతే, పత్రీయతీత్యాత్మనీచ్ఛాయాం తథాచారేపి నారద. 82

అనుదాత్తఞితో ధాతోః క్రియావినమయే తథా, నివిశాదేస్తథా విప్ర విజానీహ్యాత్మనే పదమ్‌. 83

పరసై#్మ పదమాఖ్యాతం శేషాత్కర్తరి శాబ్దికైః, ఞిత్స్వరితేతవ్చ ఉభే యక్చ స్యాద్భావకర్మణోః. 84

సౌకర్యాతిశయం చైవ యదా ద్యోతయితుం మునే, వివక్ష్యతే న వ్యాపారో లక్ష్యే కర్తుస్తథా పరే. 85

లభంతే కర్తృతాం పశ్య పచ్యతే హ్యోదనస్స్వయమ్‌, సాధు వాసిశ్ఛి నత్త్యేవం స్ధాలీ పచతి వై మునే. 86

ధాతోస్సకర్మకాద్భానే కర్మణ్యపి లప్రత్యయాః, తసై#్మ వా కర్మకాద్విప్రభావే కర్తరి కీర్తితః. 87

ఫలవ్యాపారయోరేకనిష్ఠతాయామకర్మకః, ధాతుస్తయోర్ధర్మిభేదే సకర్మక ఉదాహృతః. 88

గౌణ కర్మణి ద్రుహ్యాదేః ప్రధానే నీహృకృష్యహామ్‌. బుద్ధిభక్షార్ధయోశ్శబ్దకర్మకాణాం నిజేచ్ఛయా. 89

ప్రయోజ్యకర్మణ్యన్యేషాం ణ్యంతానాం లాదయో మతాః, ఫలవ్యాపారయోర్ధాతుశ్రయే తు తిఙస్స్మృతాః. 90

ఫలే ప్రధానం వ్యాపారస్తిఙర్ధస్తు విశేషణమ్‌, ఏధితవ్యమేధనీయమితి కృత్యే నిదర్శనమ్‌. 91

భావే కర్మణి కృత్యాః స్యుః కృతః కర్తరి కీర్తితాః, కర్తా కారక ఇత్యాద్యా భూతే భూతాదకీర్తితమ్‌. 92

గమ్యాది గమ్యే నిర్దిష్టే శేషమద్యతనే మతమ్‌, అధిస్త్రీత్యవయీభావే యథాశక్తి చ కీర్తితమ్‌. 93

రామశ్రితస్తత్పురుషే ధాన్యార్ధో యూపదారు చ, వ్యాఘ్రభీ రాజపురుషోక్షశౌండో ద్విగురుచ్యతే. 94

పంచగవం దశగ్రామీ త్రిఫలీతి తు రూఢితః, నీలోత్పలం మహాషష్ఠీ తుల్యార్ధే కర్మధారయః. 95

అబ్రాహ్మణో నఞి ప్రోక్తః కుంభకారాదికః కృతా, అన్యార్ధే తు బహువ్రీహౌ గ్రామః ప్రాప్తోదకో ద్విజః 96

పంచగూ రూపవద్భార్యో మధ్యహ్నస్ససుతాదికః, సముచ్చయే గురుం వేశం భజస్యాన్వాచయే త్వట. 97

భిక్షామానయ గాం చాపి వాక్యమేవాపనయోర్భవేత్‌, ఇతరేతరయోగే తు రామకృష్ణా సమహృతౌ. 98

రామకృష్ణం ద్విజ ద్వే ద్వే బ్రహ్మచైకముపాస్యతే. 99

ఇతి శ్రీబృహన్నారదీయమహాపురాణ పూర్వభాగే

బృహదుపాఖ్యానే ద్వితీయపాదే

వ్యాకరణనిరూపణం నామ

ద్విపంచాశత్తమోధ్యాయంః

అపత్యార్ధమున తద్ధితప్రత్యయములు అణాదులొచ్చినపుడు, పాండవాః, శ్రైధరః గార్గ్యః, నాడాయనః, ఆత్రేయః, గాంగేయః, పైతృష్వస్రీయః, అనురూములు ఏర్పడును. దేవత అనునర్ధమున, ఇదమను అర్ధమున ఐన్ద్రం (హవిః) బ్రాహ్మం (హవిః) అను రూపము లేర్పడును. కర్మకర్తలను క్రియా యోగార్ధమున ధౌరేయః, కౌంకుమం అనురూపములేర్పడును. 'భవ' (పుట్టుట) మొదలగు అర్ధములలో కానీనః (కన్యకు పుట్టినవాడు) క్షత్రియః, వైదికః స్వకః అనురూపములు ఏర్పడును. స్వార్ధమున చౌరః అని, తుల్యార్ధమున చంద్రవత్‌ ముఖమ్‌ అని రూపమేర్పడును. భావార్ధమున బ్రాహ్మణత్వం, బ్రాహ్మణతా, బ్రాహ్మణ్యం అను రూపము లేర్పడును. అస్తి అను నర్ధమున గోమాన్‌ ధనీ ధనవాన్‌ అనురూపములు సిద్ధించును. ప్రమిత్యర్ధమున (కొలత) కియాన్‌ అని ఏర్పడును. జాతార్ధమున తుందిలః, శ్రద్ధాలుః అని, ఔన్నత్యార్ధమున (ఎత్తు) దంతురః అని ఏర్పడును. అస్త్వర్ధమున ణినిప్త్రయము రాగా స్రగ్వీ, తపస్వీ, మేధావీ, మాయావీ ఇత్యాది రూపములు సిద్ధించును. బహుభాషణము కుత్సిత భాషణము అను నర్ధమున వాచాలః, వాచాటః అనురూపము లేర్పడును.

అసమాప్త్యర్ధమును, ఈషత్‌ అర్ధమున కల్పప్‌ దేశీయ ప్రత్యయములోచ్చును. కవికల్పః, కవిదేశ్యః అనురూపములు, ప్రకారము అను అర్ధమున పటుజాతీయః అని, నిందార్ధమున వైద్యపాశః అని , ప్రశంసార్ధమున వైద్యరూపః అని, భూతపూర్వార్ధమున దృష్టచరః అని సిద్ధించును. ప్రాచుర్యాద్యర్ధములలో అన్నమయః, మృణ్మయః స్త్రీమయః అనురూపము లేర్పడును. జాతార్ధమున లజ్జితః అని, అత్యర్ధమున శ్రేయాన్‌, శ్రేష్ఠః అను రూపములు సిద్దించును. కృష్ణతరః, శుక్లతమః కిమ అనునవేర్పడును. కింతరాం, అతితరాం, అభి, హి, ఉచ్చైస్తరాం అనునవి అవ్యయమలు. పరిమాణార్ధమున జానుదఘ్నం, జానుద్యయసం అని రూపము లేర్పడును. నిర్ధారణార్ధమున జానుమాత్రం అనురూపమునేర్పడును. చాలామందిలో, ఇద్దరిలో ఒకనిని చెప్పునపుడు వరుసగా కతమః, కతరః అనురూపములుండును. లెక్కపెట్టదగిన వస్తువును చెప్పునపుడు ద్వితీయః తృతీయః చతుర్ధః, పంచమః, షష్ఠః ఏకాదశః, కతిపయః, కతిధఃచ కతి అనురూపము లేర్పడును. ఇట్లే వింశః, వింతితమః, శతతమః మొదలగు రూపములుండును. సంఖ్యాప్రకారమును చెప్పునపుడు ద్విధా, ద్వేధా, ద్వైధా అనురూపములుండును. ఒకే పనిని ఎక్కువ మార్లు చేయునపుడు, పంచకృత్వం, ద్విః, త్రిః, బహుశః, ద్వితయం, త్రితయం అనురూపము లేర్పడును. సంఖ్యార్ధమున ద్వయం ద్వయం, త్రయం అనురూపములు సిద్ధించును. అల్పార్ధమున కటీరః (చిన్న ఇల్లు, గుడిసె) శమీరః, శుండారః అనురూపములు సిద్ధించును. అట్లే సై#్త్రణం సౌంస్నః, తుండిభః, వృందారకః, కృషీవలః, మలినః, వికలః, గోమీ, భౌరీకీ అనురూపములు సిద్ధించును. అవటిటః, అవనాటః అనునవి నిబిడార్ధములో నుండును. లిబిరీ, సమేషుకరీ అనురూపములు సిద్ధించును. విత్తః, చణః, అనురూపములు సామర్ధ్యార్ధమున నుండును. బహుతిధం, చంచుః అనునవి సద్ధించును. శృంగిణః, పర్వతః అనురూపములు పర్వతార్ధమున నుండును. పర్వత శిఖరములను చెప్పుటలో ఉపత్యకా, అధిక్యకా అనురూపములేర్పడును. చిల్లః, చిపిటం, చిక్వం, కాతూలః, కుతపః, వల్లః, హిమోలు, కహోడః, ఉపడః, ఊర్ణాయుః, మరూతః, ఏకాకీ, చర్మణ్వతీ జ్యోత్న్సా, తమిస్రా, కక్షీవత్‌, యర్మణ్వతీ, ఆసందీవత్‌, చక్రీవత్‌, తూష్ణీకా, జల్పతకీ ఇవయన్నియు విశేషరూపములు. ఇట్లే, కంభః, కంయుః, కంబః, కంతుః, కంతః కంపః శంవః, శంతః, శంతిః, శంయః, శంతిః, శంయః, శంతః అను రూపముమలు విశేషార్ధములలో నుండును. హ్మయు శబ్దము శంభు శబ్దమువలె చెప్పవలయును. ఇక ధాతు రూపములను చెప్పుచున్నారు.

మొదట భ్వాదిగణమున భూ సత్తాయాం అను ధాతువునకు పది లకారములలో భవతి, బభూవ, భవతా, భవిష్యతి, భవతు, అభవత్‌ భవత్‌, భూయాత్‌, అభూత్‌, అభవత్‌ అభవిష్యత్‌ అనురూపములు సిద్ధించును. ఇట్లే భ్వాదిగణములలోని ఇతర ధాతురూపములను ఊహించుకొనవలయును. అదాది గణమున అద భక్షణ అను ధాతువునకు పది లకారములలో అత్తి, జఘాస, అత్తా, అత్స్యతి, అత్తు, ఆదత్‌, అద్యాత్‌, అఘసత్‌, ఆత్స్యత్‌ అనురూపములేర్పడును. జుహోత్యాదిగణమున జుహోతి, జుహావ జుహవాంచకార, హోతా, హోష్యతి, జుహోతు, అజుహోత్‌, జుహుయాత్‌, హుయాత్‌, అహౌషీత్‌, అహోష్యత్‌ అను రూపములు సిద్ధించును. దినాది గణమున దీవ్యతి, దిదేవ, దేవితా, దేవష్యతి, అదీవ్యత్‌, దీవ్యేత్‌, దీవ్యాత్‌, అదేవీత్‌, అదేవిష్యత్‌ అనురూపములేర్పడును. స్వాదిగణమున సునోతి, సుషావ, సోతా, సోష్యతి, సునోతు, అసునోత్‌, సునుయాత్‌, సూయాత్‌, అసావీత్‌, అసోష్యత్‌ అను రూపములు ఏర్పడును. తుదాదిగణమున తుదతి, తుతోద, తోత్తా, తోత్స్యతి, తుదతు, అతుదత్‌, తుదేత్‌, తుద్యాత్‌, అతౌత్సీత్‌, అతోత్స్యత్‌ అను రూపములు ఏర్పడును. రుధాది గణమున రుణద్ధి, రరోద, రోద్ధా, రోత్స్యతి, రుణద్ధు, అరుణత్‌, రుధ్యాత్‌, అరౌత్సీత్‌, అరోత్స్యత్‌ అను రూపములేర్పడును. తనాది గణమున తనోది, తతాన, తనితా, తనిష్యతి, తనోతు, అతనోత్‌, తనుయాత్‌, అతనీత్‌, అతానీత్‌, అతనిష్యత్‌ అనురూపములు సిద్ధించును. క్య్రాది గణమున క్రీణాతి, చిక్రాయ, క్రేతా, క్రేష్యతి, క్రీణాతు, అక్రీణాత్‌, క్రీణీయాత్‌, క్రియాత్‌, అక్రైషీత్‌, అక్రేష్యత్‌ అనురూపమలు సిద్ధించును. చురాది గణమున చోరయతి, చోరయామాస, చోరయితా, చోరయిష్యతి, చోరయతు, అచోరయత్‌, చోరయేత్‌, చోర్యాత్‌, అచూచురత్‌, అచోరిష్యత్‌ అనురూపములు సిద్ధించును. ఇవి పదిగణములలోని మొదటి ధాతువులోని ప్రధమ పురుష ఏకవచనములోని రూపములు. ద్వివచనాది రూపములు ఇతర ధాతు రూపములు వ్యాకరణ శాస్త్ర గ్రంధములలో చూడవలయును.

ప్రయోజనార్ధమున ధాతువున కంటే పరముగా ణిచ్‌ ప్రత్యయమువచ్చినచో భూధాతువులో లట్‌ రూపము భావయతి అని యగును. ఇచ్ఛార్ధమున సన్‌ ప్రత్యయము వచ్చినపుడు బుభూషతి అనియగును. క్రియాసమభిహారార్ధమున యఙ్‌ ప్రత్యయమువచ్చినపుడు బోభూయతే అని యగును. యఙ్‌లుక్‌ ప్రకరణమున బోభవీతి అనియగును. తనలో ఇచ్ఛ అని అర్ధమున (''పుత్రం ఆత్మన ఇచ్ఛతి'') (పుత్ర ఇవ ఆచరతి) ఆచారార్ధమున పుత్రీయతి (క్యచ్‌ ప్రత్యయాన్తము) అను రూపమేర్పడును. అనుదాత్తము ఇత్తుగాగల ధాతువునకంటే పరముగా ఙిత్తునకంటే పరముగా, క్రియా వినిమయాద్యర్ధమున, నివిశాదులకు ఆత్మనే పదమొచ్చును. ఇతర ధాతువులకంటే పరముగా కర్త్రర్ధమున పరసై#్మపదమొచ్చును. ఞకారము ఇత్తుగా కల ధాతువున కంటే పరముగా, స్వరితము ఇత్తుగా గల ధాతువున కంటే పరముగా పరసై#్మపదము, ఆత్మనే పదము రెండు వచ్చును. భావ కర్మరూపార్ధమున యక్‌ ప్రత్యయమొచ్చును. సౌకర్యాతిశయమును తెతియచేయుటకు కర్తృవ్యాపారమును చెప్పదలచినపుడు కర్మయే కర్తయగును. అపుడు ''పచ్యతే ఓదన స్స్వయమ్‌'' (అన్నము స్వయముగా ఉడుకుచున్నది) అసిశ్ఛినత్తి (కత్తియే ఛేదించుచున్నది) స్థాలీ పచతి (స్ధాలియే వండుచున్నది) ఇత్యాది ప్రయోగములుండును. సకర్మకమైన ధాతువునకంటే పరముగా భావార్థములో కర్మార్థములో కూడా లకారములు వచ్చును. అకర్మకమైన ధాతువునకంటే పరముగా భావార్ధమున కర్త్రర్ధమున లకారములొచ్చును. ఫలము వ్యాపారము ఒకేదానిలోఉన్నపుడు ధాతువు అకర్మకమగును. ఆ ఫలవ్యాపారములకు ధర్మిభేదమున్నపుడు సకర్మకధాతువగును. కర్మగౌణమైనపుడు, ద్రుహ్యాది ధాతువులు, ప్రధానమైనపుడు నీ హృ కృ మొదలగు ధాతువలు బుద్ధి భక్షణార్ధములలో, శబ్దకర్మక ధాతువులు వివక్షననుసరించి సకర్మకములు అకర్మకములుగా మారును. ప్రయోజ్యకర్మవిషయమున ఇతర ణ్యంతములకు పరముగా లకారాదులు రావచ్చును. ధాతువు ఫలవ్యాపారార్ధములను చెప్పును. తిఙ్‌ ఫలాశ్రయమగు కర్మను, వ్యాపారాశ్రయమగు కర్తను చెప్పును. ఫల వ్యాపారములో వ్యాపారము ప్రధానము. తిఙర్ధము విశేషణమగును. కృత్యప్రత్యయములొచ్చినపుడు ఏధితవ్యం, ఏధనీయం అనురూపములేర్పడును. కృత్యప్రత్యయములు భావార్ధమున కర్మార్ధమున వచ్చును. కృత్ప్రత్యయములు కర్త్రర్ధమున వచ్చును. కర్తా కారక అనునవి దృష్టాంతములు. భూతకాలమున భూత పదము వాడబడును. గమ్యాదులలో గమ్యాదులే నిర్దేశించబడును. మిగిలినదంతయూ అద్యతనమగును. అధిస్త్రీ యథాశక్తి మొదలగు రూపములు అవ్యయీభావసమాసములో నుండును. తత్పురుష సమాసమున రామాశ్రితః, ధాన్యార్ధః, యూపదారు, వ్యాఘ్రభీః, రాజపురుషః, అక్షశౌండః అనురూపములుండును.

పంచగవం, దశగ్రామీ, త్రిఫలా అనునవి ద్విగుసమాసమున నుండును. తుల్యార్ధమును చెప్పు కర్మధారయసమాసమున నీలోత్పలం మొదలగు రూపములుండును. ''అబ్రాహ్మణః'' అనునది నఞ్‌తత్పురుష సమాసము. కుంభకారః మొదలగు రూపములుండును. సమాసములో ఉన్న పదార్ధములు కాక అన్నపదార్ధప్రధానమగు బహువ్రీహిసమాసమున ''ప్రాప్తోదకో గ్రామః'' పంచగుః, రూపవద్భార్యః, ససుతః మొదలగు రూపములేర్పడును. సముచ్చయార్ధమున గురుం చ ఈశం చ భజ అను ప్రయోగము, అన్వాచయార్ధమున ''భిక్షామట, గాం చానయ'' అను ప్రయోగములుండును. ఇతరేతరయోగ ద్వంద్వసమాసమున రామకృష్ణా ఇత్యాది ప్రయోగములుండును. రామకృష్ణులు అనగా ఇద్దరు, బ్రహ్మ అనగా ఏకరూపముగా ఉపాసించబడుదురు.

ఇది శ్రీబృహన్నారదీయ మహాపురాణమున పూర్వభాగమున

బృహదుపాఖ్యానమున ద్వితీయపాదమున వ్యాకరణ నిరూపణమను

యాబదిరెండవ అధ్యాయము సమాప్తము.

Sri Naradapuranam-I    Chapters    Last Page