Sri Naradapuranam-I    Chapters    Last Page

సప్తచత్వారింశత్తమోధ్యాయః = నలుబది యేడవ అధ్యాయము

సనదన ఉవాచ :-

ఏతదధ్యాత్మమానాఢ్యం వచః కేశిధ్వజస్య సః, ఖాండిక్యోమృతమచ్ఛ్రుత్వా పునరాహ తమీరయన్‌. 1

సనందన మహర్షి పలికెను :- కేశిధ్వుడు చెప్పిన అధ్యాత్మజ్ఞానమును అమృతమునాస్వాదించునట్లు ఖాండిక్యుడు విని కేశిధ్వడుని పొగడుచు మరల ఇట్లు పలికెను.

ఖాండిక్య ఉవాచ :-

తద్బ్రూహి త్వం మహాభాగ ! యోగం యోగవిదుత్తమ ! విజ్ఞాతయోగశాస్త్రార్ధస్త్వమస్యాం నిమిసంతతౌ. 2

ఖాండిక్యుడు పలికెను :- ఓ మహానుభావా! ఈ నిమి వంశమున నీవు యోగశాస్త్రార్ధమును బాగుగా తెలిసిన వాడవు కావున నాకు యోగమును తెలియజేయుము.

కేశిధ్వజ ఉవాచ :-

యోగస్వరూపం ఖాండిక్య శ్రూయతాం గదతో మమ, యత్ర స్థితో న చ్యవతే ప్రాప్య బ్రహ్మాలయం మునిః. 3

మన ఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోః, బంధస్య విషయాసంగి ముక్తేర్నిర్విషయం తథా. 4

విషయేభ్యస్సమాహృత్య విజ్ఞానాత్మా బుధో మనః, చింతయేన్ముక్తయే తేన బ్రహ్మభూతం పరేశ్వరమ్‌. 5

ఆత్మభావం నయేత్తేన తద్బ్రహ్మ ధ్యాపనం మనః, వికార్యమాత్మనశ్శక్త్యా లోహమాకర్షకో యథా. 6

ఆత్మప్రయత్నసాపేక్షా విశిష్టా యా మనో గతిః, తస్యా బ్రహ్మణి సంయోగో యోగ ఇత్యభిధీయతే. 7

ఏవమత్యన్తవైశిష్ట్యయుక్తధర్మో పలక్షణమ్‌, యస్య యోగస్య వై యోగీ ముముక్షురభిధీయతే. 8

యోగయుక్‌ ప్రథమం యోగీ యుంజానోభిధీయతే, వినిష్పన్నసమాధిస్తు పరబ్రహ్మోపలబ్ధిమాన్‌. 9

యద్యంతరాయదోషేణ దూష్యతే నాస్య మానసమ్‌, జన్మాంతరైరభ్యసనాత్‌ ముక్తిః పూర్వస్య జాయతే10

వినిష్పన్నసమాధిస్తు ముక్తిస్తత్రైవ జన్మని, ప్రాప్నోతి యోగీ యోగాగ్నిదగ్ధకర్మచయోచిరాత్‌. 11

బ్రహ్మచర్యమహింసాం చ సత్యాస్తేయాపరిగ్రహాన్‌, సేవేత యోగీ నిష్కామో యోగితాం స్వమనో నయన్‌. 12

స్వాధ్యాయశౌచసంతోషపాంసి నియమాన్యమాన్‌, కుర్వీత బ్రహ్మణి తథా పరస్మిన్ప్రవణం మనః. 13

ఏతే యమాశ్చ నియమాః పంచ పంచ ప్రకీర్తితాం, విశిష్ట ఫలదాః కామ్యా నిష్కామానాం వియుక్తిదాః. 14

ఏవం భద్రాసనాదీనాం సమాస్ధాయ గుణౖర్యుతః, యమాఖ్యైర్నియమాఖ్యైశ్చ యుంజీత నియతో యతిః. 15

ప్రాణాఖ్యమవలంబస్థమభ్యాసాత్కురుతే తు యత్‌, ప్రాణాయామస్సవిజ్ఞేయస్సబీజో బీజ ఏవ చ. 16

పరస్పరేణాభిభవం ప్రాణాపానౌ యదానిలౌ, కురుతస్సద్విధానేన తృతీయస్సంయమాత్తయోః. 17

తస్య చాలంబనవత్‌ స్థూలం రూపం ద్విషత్పతే, ఆలంబనమనంతస్య యోగినోభ్యసతస్స్మృతమ్‌. 18

శబ్దాదిష్వనురక్తాని నిగృహ్యాక్షాణి యోగవిత్‌, కుర్యాచ్చిత్తానుకారీణి ప్రత్యాహారపరాయణః 19

వశ్యతా పరమా తేన జాయతే నిశ్చలాత్మనామ్‌, ఇంద్రియాణామశ్యైసై#్తర్నయోగీ యోగసాధకః. 20

ప్రాణాయామేన పవనైం ప్రత్యాహారేణ చేంద్రియైః, వశీకృతైస్తతః స్థిరం చేతశ్శుభాశ్రయమ్‌. 21

కేశిధ్వజుడు పలికెను :- ఓ ఖాండిక్యా! నేను యోగ స్వరూపమును చెప్పెదను వినుము. యోగమున నున్నవాడు బ్రహ్మమున లీనమగును. భ్రష్టుడు కాజాలడు. మానవుల బంధమోక్షములకు మనసే కారణము. మనసును విషయసంగమును చేసిన బంధము, నిర్విషయము చేసిన మోక్షము లభించును. విజ్ఞాన స్వరూపుడగు జీవుడు జ్ఞానముచే మనసును విషయముల నుండి మరలించి మోక్షము కొఱకు బ్రహ్మస్వరూపుడగు పరమేశ్వరుని చింతించవలయును. అట్లు బ్రహ్మను ధ్యానించుచు మనస్సును ఆత్మలో నిలుపవలయును. ఆత్మ శక్తిచే మనస్సును లోహమును అయస్కాంతముచే ఆకర్షించేయవలయును. మనోగతి విశిష్టమై ఆత్మప్రయత్నసాపేక్షమైనచో, అట్టి అపేక్షను బ్రహ్మయందు సంయోగము చేయుటయే యోగమనబడును. ఇట్లు అత్యంత వైశిష్ట్యయుక్త ధర్మోప లక్షణమగు యోగము గలవాడే యోగి ముముక్షువు అనబడును. మనసును ఆత్మలో యోగము చేయునపుడు మొదట యోగియనబడును. సమాధి నిష్పన్నమగుచో పరబ్రహ్మ లభించును. మనో యోగసమయమున అంతరాయముచే మనసు దుష్టము కానిచో జన్మాంతరాభ్యాసముచే ముక్తి లభించును. సమాధి నిష్పన్నమగుచో ఆ జన్మలోనే ముక్తి లభించును. యోగాగ్నిచే కర్మములు దగ్థములై యోగి మోక్షమును పొందును. బ్రహ్మచర్యమును, అహింసను సత్యమును, అస్తేయమును, అపరిగ్రహమును నిష్కామముతో యోగి ఆచరించవలయును. స్వాధ్యాయమును, శౌచమును, తపస్సును, నియమములను, యమములను పరబ్రహ్మయందు మనసును లగ్నము చేసి ఆచరించవలయును. ఈ నియమములు అయిదు, యమములు అయిదుగా చెప్పబడుచున్నవి. సకాములకు విశిష్ట ఫలముల నిచ్చును. నిష్కాములకు ముక్తి నొసంగును. ఇట్లు భద్రాసనాదులగు ఆసనముల నధిష్టించి గుణవంతుడై యమనియమములతో యతియై మనో యోగమును చేయవలయును. ప్రాణవాయువును ఆధారము చేసి నియమించినచో ప్రాణాయామమనబడును. ఈ ప్రాణాయామము సబీజము అబీజమని రెండు విధములు. ప్రాణాపానములు ఒకదానినొకటి సద్విధానముతో నియమించినచో మూడవ యమమగును. ఈ యమము కూడా స్థూలముగా ప్రాణాయామము వలె నుండును. వాయువునకు ఆత్మనాధారము చేసుకొనుటయే యోగాభ్యాసమనబడును. యోగవిత్తు శబ్దాది విషయములందు అనురక్తములగు ఇంద్రియములను నిగ్రహించి ప్రత్యాహార పరాయణుడై చిత్తానుకారిణులనుగా చేయవలయును. ఇట్లు చేసినచో ఉత్తమమగు ఇంద్రియవశ్యత సిద్ధించును. ఇంద్రియములను వశము చేసుకొనక యోగి యోగసాధకుడు కాజాలడు. ప్రాణాయామముచే వాయువులను, ప్రత్యాహారములచే ఇంద్రియములను వశము చేసుకొని మనసును శుభాశ్రయము చేయవలయును. 3 - 21

ఖాండిక్య ఉవాచ :-

కథ్యతాం మే మహాభాగ ! చేతసో యశ్శుభాశ్రయః, యదాధారమశేషం తు హంతి దోషసముద్భవమ్‌. 22

ఖాండిక్యుడు పలికెను :- ఓ మహానుభావా ! చిత్తమునకు శుభాశ్రయమనగానేమియో తెలుపుము. శుభాశ్రయమునాధారము చేసుకొనియే సమస్త దోషములు నశించును. 22

కేశిధ్వజ ఉవాచ :-

ఆశ్రయశ్చేతసో జ్ఞానిన్‌ ద్విధా తచ్చ స్వరూపతః, రూపం మూర్తమమూర్తం చ పరం చాపరమేవ చ. 23

త్రివిధా భావనా రూపం విశ్వమేతత్త్రిధోచ్యతే, బ్రహ్మగా కర్మసంజ్ఞా చ తథా చైవోభయాత్మికా. 24

కర్మభావాత్మికా హ్యేకా బ్రహ్మభావాత్మికాపరా, ఉభయాత్మికా తథైవాన్యా త్రివిధా భావభావనా. 25

సనకాద్యా సదా జ్ఞానిన్‌ బ్రహ్మభావనయా యుతాః, కర్మభావనయా చాన్యే దేవాద్యాస్ద్సావరాశ్చరాః. 26

హిరణ్యగర్భాదిషు చ బ్రహ్మ కర్మాత్మికా ద్విధా, అధికారబోధయుక్తేషు విద్యతే భావభావనా. 27

అక్షీణషు సమస్తేషు విశేషజ్ఞానకర్మసు, విశ్వమేతత్పరంచాన్యద్భేదభిన్నదశాం నృప ! 28

ప్రత్యస్తమితభేదం యత్సత్తామాత్రమగోచరమ్‌, వచసామాత్మసంతోద్యం తజ్‌ జ్ఞానం బ్రహ్మసంజ్ఞితమ్‌. 29

తచ్చ విష్ణోః పరం రూపమరూపస్యాజనస్య చ, విశ్వస్వ రూపం వైరూప్యలక్షణం పరమాత్మనః. 32

గంధర్వా యక్షదైత్యాశ్చ సకలా దేవయెనయం, మనుష్యాః పశవశ్శైలాసముద్రాస్సరితో ద్రుమాః. 33

భూప భూతాన్యశేషాణి భూతానాం యే చ హేతవః, ప్రధానాదివిశేషాంతాశ్చేతనాచేతనాత్మకమ్‌. 34

ఏకపాదం ద్విపాదం చ బహుపాదమపాదకమ్‌, మూర్తమేతద్ధరే రూపం భావనాత్రితయాత్మకమ్‌. 35

ఏతత్సర్వమిదం విశ్వం జగదేతచ్చరాచరమ్‌, పరబ్రహ్మస్వరూపస్య విష్ణోశ్శక్తిసమన్వితమ్‌. 36

విష్ణుశక్తిః పరా ప్రోక్తా క్షేత్రజ్ఞాఖ్యా తథాపరా, అవిద్యా కర్మసంజ్ఞాన్యా తృతీయా శక్తిరిష్యతే. 37

మేయాం క్షేత్రజ్ఞశక్తిస్సా చేష్టితా నృప కర్మజా, అసారభూతే సంసారే ప్రోక్తా తవ మహామతే. 38

సంసారతాపానఖిలానవాప్నోత్యనుసంజ్ఞితాన్‌, తయా తిరోహితత్వత్తు శక్తిః క్షేత్రజ్ఞసంజ్ఞితా. 39

సర్వభూతేషు భూపాల తారతమ్యేన లక్ష్యతే, అప్రాణవత్సుఖల్వల్పాస్ధావరేషు తతోధికా. 40

సరీసృపేషు తేభ్యోన్యాప్యతిశక్త్యా పతిత్త్రిషు, పతిత్త్రిభ్యో మృగాస్తేభ్యస్స్వశక్త్యా పశవోధికాః. 41

పశుభ్యో మనుజాశ్చాతిశక్త్యా పుంసః ప్రభావితాః, తేభ్యోపి నాగగంధర్వయక్షాద్యా దేవతా నృప. 42

శక్రస్సమస్తదేవేభ్యస్తతశ్చాపి ప్రజాపతిః, హిరణ్యగర్భోపి తతః పునశ్శక్త్యుపలక్షితః. 43

ఏతాన్యశేషరూపాణి తస్య రూపాణి పార్ధివ, యతస్తచ్ఛక్తియోగేన యుక్తాని నభసా యథా. 44

ద్వితీయం విష్ణుసంజ్ఞస్య యోగిధ్యేయం మహామతే ! అమూర్తం బ్రహ్మణో రూపం యత్సదిత్యుచ్యతే బుధైః. 45

సమస్తాశ్శక్తయశ్చైతా నృప యత్ర ప్రతిష్ఠితాః, న హి స్వరూపరూపం వైరూపమన్యద్ధరేర్మహత్‌. 46

సమస్తశక్తిరూపాణి తత్కరోతి జనేశ్వర! దేవతిర్యఙ్మనుష్యాదిచేష్టావంతి స్వలీలయా. 47

జగతాముపకారాయ తస్య కర్మనిమిత్తజా, చేష్టా తస్యాప్రమేయస్య వ్యాపిన్యవిమీతాత్మకా. 48

తద్రూపం వివ్వరూపస్య చింత్యం యోగయుజా నృప ! తస్య హ్యాత్మవిశుద్ధ్యర్ధం సర్వకిల్బిషనాశనమ్‌. 49

యథాగ్నిరుద్ధతశిఖః క్షక్షం దహతి సానిలః, తథా చిత్తస్థితో విష్ణుర్యోగినాం సర్వకిల్బిషమ్‌. 50

తస్మాత్సమస్తశక్తీనాం ఆద్యాంతే తత్ర చేతసః, కుర్వీత సంస్థితం సాధు విజ్ఞేయా శుద్ధలక్షణా. 51

శుభాశ్రయస్య చిత్తస్య సర్వగస్య తథాత్మనః, త్రిభావభావనాతీతో ముక్తయే యోగినాం నృప. 52

అన్యే తు పురుషవ్యాఘ్రచేతసో యే వ్యపాశ్రయాః, అశుద్ధాస్తే సమస్తాస్తు దేవాద్యాః కర్మయోనయః. 53

మూర్తం భగవతో రూపం సర్వాపాశ్రయనిస్పృహః, ఏషా వై ధారణా జ్ఞేయా యచ్చిత్తం తత్ర ధార్యతే. 54

తత్ర మూర్తం హరే రూపం యాదృక్‌ చింత్యం నరాధిప, తచ్ఛ్రూయతామనాధారే ధారణా నోపపద్యతే. 55

ప్రసన్నచారువదనం పద్మపత్రాయతేక్షణమ్‌, సుకపోలం సువిస్తీర్ణం లలాటఫలకోజ్జ్వలమ్‌. 56

సమకర్ణాంసవిన్యస్త చారుకర్ణోపభూషణమ్‌, కంబుగ్రీవం సువిస్తీర్ణం శ్రీ వత్సాంకితవక్షసమ్‌. 57

వలిత్రింభంగిని భుగ్నవాభివాచోదరేణ, వై, ప్రలంబాష్ట భుజం విష్ణు మథవాపి చతుర్భుజమ్‌. 58

సమస్ధితోరుజఘనం సుస్థిరాంఘ్రికరాంబుజమ్‌, చింతయేద్బ్రహ్మ భూతం తం పీతనిర్మలవాససమ్‌. 59

కిరీట చురు కేయూర కటకాది విభూషితమ్‌, శార్ణ శంఖ గదా ఖడ్గ ప్రకాశ వలయాంచితమ్‌. 60

చింతయేత్తన్మయో యోగే సమాధాయాత్మమానసమ్‌, తావద్యావద్దృఢీ భూతా తత్రైవ నృప ధారణా. 61

వదతస్తిష్ఠతో యద్వా స్వేచ్ఛయా కర్మ కుర్వతః, నాపయాతి యదా చిత్తాత్సిద్దాం మన్యేత తాం తదా. 62

కేశిధ్వజుడు పలికెను :- చిత్తమునకు ఆశ్రయము స్వరూపముతో ద్వివిధము మూర్తము, అమూర్తము, పరము అపరము అని భావన త్రివిధ రూపముగా నుండును. ఈ ప్రపంచము మూడు విధములుగా నుండును. బ్రహ్మరూపము కర్మరూపము ఉభయ రూపము అని. భావభావన కూడా కర్మభావనా, బ్రహ్మభావనా ఉభయభావన అని మూడు విధములు. ఓ జ్ఞానీ! సనకాది మహర్షులు సర్వకాలములలో బ్రహ్మ భావనతో యుందురు. దేవాదులు స్థావర జంగమములు కర్మభావనతో నుందురు. హిరణ్య గర్భాదులలో బ్రహ్మ కర్మభావన యుండును. అధికార జ్ఞానము కలవారికి భావభావన యుండును. సమస్తములైన విశేష జ్ఞానకర్మలు క్షయము నొందనపుడు భిన్నదృష్టి గలవారై ఈ ప్రపంచము వేరు పరలోకము వేరు అని భావించదరు. అన్ని భేదములు తొలగి, వాక్కులకు గోచరము కాక ఆత్మమాత్రవేద్యమై సత్తామాత్రముగా భాసించు జ్ఞానమే బ్రహ్మజ్ఞానమనబడును. రూపరహితుడు జన్మరహితుడగు విష్ణువునకదే పరరూపము . పరమాత్మకు విశ్వస్వరూపముగా వైరూప్యముగా గోచరించుటయే లక్షణము. యోగమును సాధన చేయువారు పరమాత్ముని రూపరహితునిగా చూడజాలరు. ధ్యానించ జాలరు. కావున చక్షుర్గోచరమగు శ్రీహరి యొక్క స్థూలరూపమును చింతన చేయవలయును. భగవానుడగు హిరణ్యగర్భుడు, ఇంద్రుడు, ప్రజాపతి, మరుత్తులు, వసువులు, రుద్రులు, భాస్కరులు, తారకలు, గ్రహములు, గంధర్వులు, యక్షరాక్షసులు, సకలదేవతలు, మనుష్యులు, పశువులు, పర్వతములు, సముద్రములు, నదులు, వృక్షములు, అశేషభూతములు, భూతహేతువులు. ప్రధానము మొదలకొని విశేషాంతము వరకు గల చేతనాచేతనాత్మకమగు విశ్వము. ఏకపాదము ద్విపాదము, బహుపాదము అపాదకము, భావనాత్రితయాత్మకమగు నీ ప్రపంచమంతయు శ్రీహరి స్థూలరూమే. చరాచరమగు సమస్త జగత్తు, ఈ ప్రపంచమంతయు పరబ్రహ్మా స్వరూపడగు శ్రీమహావిష్ణువు యొక్క శక్తిసమన్వితమే విష్ణుశక్తి పర అని, క్షేత్రజ్ఞుని అపర అని, అవిద్యకర్మ యనునది మూడవ శక్తి యని చెప్పెదరు. క్షేత్రజ్ఞశక్తి గలవారు కర్మలవలన చేష్టలు చేయుదురు. అది సారము లేని సంసారమున నుండును. దానివలననే సమస్త సంసారతాపములను పొందును. అశక్తిచే తిరోహితమగు శక్తియే క్షేత్రజ్ఞశక్తి యనబడును. ఈ క్షేత్రజ్ఞశక్తి అన్ని ప్రాణుల యందు తరతమభేదములచే నుండును. ప్రాణములేని వాటియందు స్వల్పముగా నుండును. స్థావరములందు మరి కొంత యధికముగా నుండును. సర్పాదులందు కొంత అధికముగా అంతకంటే ఎక్కవగా పక్షులలో, పక్షులకంటే అధికముగా మృగమలలో, మృగములకంటే పశువులలో, పశువులకంటే మనుజులలో, మనుజులలో కూడా స్త్రీల కంటే పురుషులలో, వారికంటే అధికముగా, నాగగంధర్వ యక్షదేవతాదులలో నుండును. దేవతలందరి కంటే అధికశక్తి కలవాడు ఇంద్రుడు. ఇంద్రుని కంటే ప్రజాపతి, ప్రజాపతులకంటే అధికుడు హిరణ్యగర్భుడు అధిక శక్తి కలవాడు. ఈ సమస్త రూపములు ఆ శ్రీహరి రూపమలే. ఆకాశముతో కూడియన్నట్లు ఈ రూపములన్నియూ పరమాత్మ శక్తితో కూడి యున్నవే. విష్ణువు యొక్క రెండవరూపము యోగులచే మాత్రమే ధ్యానించదగినది. దానినే అమూర్తమందురు. అమూర్తమగు విష్ణురూపమునకే సత్తని పేరు. ఈ సమస్త శక్తులు ప్రతిష్ఠించబడి యున్న శ్రీహరి స్వరూపరూపమే మూడవ మహాద్రూపము. ఆరూపమే సమస్త శక్తిరూపములనేర్పరచును. శ్రీహరిలీలచే దేవతిర్యజ్మనుష్యాదులు చేష్టలు కలవారగుదురు. శ్రీహరి చేష్ట సర్వవ్యాపిని, ఇతరనిమిత్తముగా విధించబడునది కాదు. విశ్వరూపుని ఆరూపమునే యోగసాధన చేయువారు చింతన చేయవలయును. ఆరూప చింతనమే ఆత్మశుద్ధిని కలిగించి సర్వపాపములను నశింపచేయుము. జ్వాలలచే కూడిన అగ్ని వాయువుతో కలిసి అరణ్యమును దహించునట్లు చిత్తమున నున్న శ్రీహరి యోగుల సర్వపాపములను దహించి వేయును. కావున సమస్త శక్తుల కాద్యంతములగు శ్రీహరిశక్తిని చక్కగా హృదయమున నిలుపుకొనవలయును. దానిని శుద్ద లక్షణమందురు. ఇదియే చిత్తమునకు శుభాశ్రయము. సర్వవ్యాపియగు ఆత్మకు కూడా ఇదియే శుభాశ్రయము. ఇదియే త్రిభావభావనాతీతము. యోగులముక్తికి హేతువు, కర్మ హేతువులగు దేవాదులగు సమస్తాశ్రయములు చిత్తమునకు అశుభములు అపరిశుద్ధములు కావున అశుభాశ్రయములే యుగును. అన్నిటిని ఆశ్రయించక విడిచి భగవంతుని సాకారమగు రూపమునందు చిత్తమును ధరించినచో దానిని ధారణయందురు. ఈ ధారణలో శ్రీహరి రూపమును ఎట్లు చింతించవలయనో చెప్పదను వినుము. నిరాధారముగా ధారణ కుదురదు కావున ఒకరపమును ఆధారము చేసుకొనవలయును. ప్రసన్నమగు సుందరవదనము, పద్మపత్రముల వంటి విశాలనేత్రములు చక్కని కపోలములు, విశాలమగు ఫాలభాగముచే శోభితము సమమగు కర్ణములందు ధరించిన ఆభరణములు గల దానిని, శంఖము వంటి కంఠము, విశాలము శ్రీవత్సశోభితమగు వక్షస్థలము, త్రివళులచేలోతైన నాభిచే కూడిన ఉదరము, దీర్ఘములైన అష్టభుజములు కలదిగా కాని నాలుగు భుజములు కలదిగా దాని ఎక్కువ తక్కువలు కాక సమముగా నున్న ఊరు జఘనములు, సుస్ధిరమైన కరచరణఆంబుజములు, పరిశుద్ధమైన పీతాంబరమును ధరించిన దానిని, కిరీటకేయూర కటకాది భూషణములను ధరించిన దానిని, శార్ఘశంఖగదా ఖడ్గ చక్రాద్యాయుధముల ప్రకాశములతో శోభించునది అగు శ్రీహరిరూపమును మనసున నిలిపి ఆత్మచే ధ్యానము చేయవలయును. ఇట్లు శ్రీహరిరూపమునందు దృఢమగు వరకూ ధారణను చేయవలయును మాటలాడుచున్ననూ, నిలుచున్నను, స్వేచ్ఛతో ఏపని చేయుచున్నను ధారణతొలగనిచో ధారణ సిద్ధించినదని భావించవలయును. 23 - 62

తతశ్శంఖగదాచక్రశార్ణాదిరహితం బుధః, చింతయేద్భగవద్రూపం ప్రశాంతం సాక్షసూత్రకమ్‌. 63

సా యదా ధారణా తద్వదవస్థానవతీ తతః, కిరీటకేయూరముఖై ర్భూషణౖ రహితం స్మరేత్‌ 64

తదేకావయవం చైవం చేతసా హి పునర్బుధః, కుర్యాత్తతోవయవినిప్రణిధానరో భ##వేత్‌. 65

తద్రూపప్రత్యయే చైకసన్నతిశ్చాన్యనిస్పృహా, తద్ధ్యానం ప్రధమైరంగైః షడ్బిర్నష్పాద్యతే నృప. 66

తసై#్యవం కల్పనాహీనం స్వరూపగ్రహణం హి యత్‌, మనసా ధ్యాననిష్పాద్యం సమాధిస్సోభిధీయతే. 67

విజ్ఞానం ప్రాపకం ప్రాప్యే పరేబ్రహ్మణి పార్థివ, ప్రాపణీయస్తథైవాత్మా ప్రక్షీణాశేసభావనః. 68

క్షేత్రజ్ఞకరణీజ్ఞానం కరణం తేన తస్య తత్‌, నిష్పాద్య ముక్తికార్యం వై కృతకృత్యో నివర్తతే. 69

తద్భావభావనాపన్నస్తతోసౌ పరమాత్మనః, భవత్యభేదీ భేదశ్చ తస్యాజ్ఞానకృతో భ##వేత్‌. 70

విభేదజనకే జ్ఞానే నాశమాత్యంతికం గతే, ఆత్మనో బ్రహ్మణాభేదం సమంతం కః కరిష్యతి. 71

ఇత్యుక్తస్తే మయా యోగః ఖండిక్య పరిపృచ్ఛతః సంక్షేపవిస్తరాబ్యాం తు కిమన్యత్ర్కియతాం తవ. 72

తరువాత శంఖ చక్ర గదా శార్దాది రహితంము ప్రశాంతము అక్షసూత్ర సహితమగు భనవద్రూపమును ధ్యానము చేయవలయును. ఈ ధారణ స్థిరమైన తరువాత కిరీట కేయూర కటకాది భూషణ రహితమగు రూపమును ధ్యానము చేయవలయును. తరువాత ఏకావయవరూపమును స్మరించవలయును. తరువాత అవయవిని మాత్రమే ధ్యానించవలయును. ఇట్లు అవయవియందు దృఢ ప్రత్యయము కలిగిని తరువాత ఇతర స్పృహ వీడవలయును. ఇట్లు ప్రాథమికములగు షడంగములచే ధ్యనము సిద్ధించును అపుడు కల్పనా హీనమగు స్వరూపమును గ్రహించగలుగును. కేవలము మనసుచే ధ్యానముచే నిష్పన్నమగు దానిని సమాధి యందురు. ప్రాప్యమగు పరబ్రహ్మను పొందించు విజ్ఞానముచే అశేష భావనలను క్షీణింపచేసి ఆత్మను పొందించవలయును. దీనిచే క్షేత్రజ్ఞుని చేయు జ్ఞానము సాధనమగును. ఈ సాధనముచే ధ్యానము సిద్ధించును. ఇట్లు ధ్యానసిద్ధి కలిగినచో ముక్తికార్యమును నిష్పన్నము చేసి కృతకృత్యుడగును. అపుడు అన్నిటినుండి నివర్తించును. ఇట్లు పరబ్రహ్మభావభావనను పొంది ఈ జీవుడు పరమాత్మతో ఐక్యమును పొందును. అజ్ఞానముచే భేదమును పొందును. ఇట్లు విబేదమును కలిగించు జ్ఞానము ఆత్యంతిక నాశమును పొందిన తరువాత ఆత్మకు పరమాత్మచే అభేదమును తెలియగలడు. ఓ ఖాండిక్యా! నీవడిగిన యోగమును సంగ్రహముగా విస్తరముగా సమగ్రముగా వివరించితిని. ఇంకనూ ఏమి చేయవలయునో చెప్పుము.

ఖాండిక్య ఉవాచ :-

కథితో యోగసద్భావస్సర్వమేవ కృతం మమ, తవోపదేశాత్సకలో నష్టశ్చిత్తమలో మమ. 73

మమేతి యన్మయా ప్రోక్తమసదేతన్న చాన్యథా, నరేంద్ర గదితుం శక్యమపి విజ్ఞేయవేదిభిః. 74

అహం మమేత్యవిద్యేయం వ్యవహారస్తథానయోః, పరమార్దస్త్వసంలాప్యో వచసాం గోచరో నయః. 75

తద్గచ్ఛ శ్రేయసే సర్వం మమైతద్భవతా కృతమ్‌, యద్విముక్తిపరో యోగః ప్రోక్తః కేశిధ్వజావ్యయః. 76

ఖాండిక్యుడు పలికెను :- యోగము గూర్చి చక్కగా తెలిపి నాకెంతయో హితమును చేసితివి. నీ ఉపదేశము వలన నా మనో మాలిన్యము నశిచినది. నాది అని నేను చెప్పినదంతయూ అసత్తే (లేనిదే) వేరు కాదు. జ్ఞానులు కూడా వేరుగా చెప్పజాలరు. నేను నాది అనుట అవిద్య. ఈ వ్యవహారము కూడా అవిద్యకృతమే. పరమార్థము చెప్పశక్యము కానిది. వాగ్గోచరము కానిది. కావున ! ఓ కేశిధ్వజా నీవు నా మేలునకే దీనినంతటినీ చేసితివి. అవ్యయమగు, విముక్తి పరమగు యోగమును చెప్పితిని. కావున ఇక వెళ్ళుము. 73 - 76

సనందన ఉవాచ :-

యథార్హపూజయా తేన ఖాండిక్యేన స పూజితః ఆజగామ పురం బ్రహ్మంస్తతః కేశిధ్వోజో నృపః. 77

ఖాండిక్యోపి సుతం కృత్వా రాజానం యోగసిద్ధయే, విశాలామగమత్కృష్ణే సమావేశితమానసః. 78

స తత్రైకాంతికో భూత్వా యమాదిగుణసంయుతః, విష్ణ్వాఖ్యే నిర్మలే బ్రహ్మణ్యవాప నృపతిర్లయమ్‌. 79

కేశిధ్వజోపి ముక్త్యర్ధం స్వకర్మక్షపణోన్ముఖః, బుభుజే విషయాన్కర్మ చక్రే చానభిసంధితమ్‌. 80

స కళ్యాణోపభోగైశ్చ క్షీణపాపోమలస్తతః, అవాప సిద్ధిమత్యన్తతాపక్షపణీం మునే. 81

ఏతత్తే కథితం సర్వం యన్మాం త్వం పరిపృష్టవాన్‌, తాపత్రయచికిత్సార్థం కిమన్యత్కథయామి తే. 81

ఇతి శ్రీబృహన్నారాదీయమహాపురాణ పూర్వభాగే

ద్వితీయపాదే సప్తచత్వారింశత్తమోధ్యాయః

సనందన మహర్షి పలికెను :- అపుడు ఖాండిక్యుడు తగిన విధముగా కేశిద్వజుని పూజించెను. తరువాత కేశిధ్వజుడు తన నగరమునకు వచ్చెను. ఖాండిక్యుడు కూడా తన పుత్రుని రాజుగా చేసి యోగసిద్ధి కొఱకు శ్రీహరియందు మనసునుంచి విశాలాప్రాంతమునకు వెళ్ళెను. అచట ఏకాంతికుడై యమాదిగుణయుక్తుడై విష్ణువను పేరుగల నిర్మలుడగు పరబ్రహ్మయందు లీనమాయెను. కేశిధ్వజుడు కూడా మోక్షము కొఱకు తన కర్మలను క్షీణింప చేయగోరి విషయముల ననుభవించెను. సంగరహితముగా కర్మనాచరించెను. ఇట్లు శుభానుభవములచే శుభకర్మలచే పాపములు నశించి శుద్ధుడై తాపత్రయనాశకమగు సిద్ధిని పొందెను. ఇట్లు నీవడిగిన విధముగా తాపత్రయ చికిత్సనంతటిని చెప్పితిని. ఇంకనూ ఏమి చెప్పవలయును? 77 - 82

ఇది శ్రీబృమన్నారదీయమహాపురాణమున పూర్వభాగమున

ద్వితీయ పాదమున నలుబది ఏడవసర్గ సమాప్తము.

Sri Naradapuranam-I    Chapters    Last Page