Sri Naradapuranam-I    Chapters    Last Page

ద్వాదశ్యోధ్యాయః = పన్నెండవఅధ్యాయము

ధర్మాఖ్యానమ్‌

నారద ఉవాచ :-

శ్రుతం తు గంగామాహాత్మ్యం వాంఛితం పాపనాశనమ్‌, అధునా లక్షణం బ్రూహి భ్రాతర్మే దానపత్రాయాః. 1

నారదుడు పలికెను:- ఓ భ్రాతా ! నేను కోరిన, పాపములను నశింపచేయు గంగామాహాత్మ్యమును వింటిని. ఇపుడు దాన లక్షణమును పాత్రమక్షణమును చెప్పుము.

సనక ఉవాచ:-

సర్వేషామేవ వర్ణానాం బ్రాహ్మణః పరమో గురః తసై#్మ దానాని దేయాని దత్తస్యనన్త్యమిచ్ఛతా. 2

బ్రాహ్మణః ప్రతిగృహ్ణీయాత్సర్వతో భయవర్జితః. న కదాపి క్షత్రవిశే గృహీయాతాం ప్రతిగ్రహమ్‌. 3

చండస్య పుత్రహీనస్య దంభాచారరతస్య చ, కర్మత్యాగినశ్చాపి దత్తం భవతి నిష్ఫలమ్‌. 4

పరదాతస్సాపి పరద్పవ్యాభిలాషిణః, నక్షత్రసూచకస్యాపి దత్తం భవతి నిష్ఫలమ్‌. 5

అసూయావిష్టమనపః కృతఘ్నస్య చ మాయిసః, ఆయాజ్యయాజనస్యాపి దత్తం భవతి నిష్ఫలమ్‌. 6

నిత్యం యాచ్ఞాపరస్యాపి హింసకస్య ఖలస్య చ, రసవిక్రయిణశ్చైవ దత్తం భవతి నిష్ఫలమ్‌. 7

గానేన జీవికా యస్య యస్య భార్య చ పుంశ్చలీ, పరోపతాపిశ్చాపి దత్తం భవతి నిష్పలమ్‌. 8

వేదవిక్రయిణశ్చాపి స్మృతివిక్రయిణస్తథా, ధర్మవిక్రయిణో విప్రదత్తం భవతి నిష్ఫలమ్‌. 9

అసిజీవీ మషీజీవీ దేవలో గ్రామయాజకః, ధావకో వా భ##వేత్తేషాం దత్తం భవతి నిష్ఫలమ్‌. 10

పాకకర్తుః పరస్యర్ధే కవయే గదహారిణ , అభక్ష్యస్యాపి దత్తం భవతి నిష్ఫలమ్‌. 11

శూద్రాన్నభోజినశ్చైవ శూద్రాణాం శవదాహినః, పౌంశ్చలాన్నభూజశ్చాపి దత్తం భవతి నిష్ఫలమ్‌. 12

నామవిక్రయిణో విష్ణోః సంధ్యాకర్మోజ్ఘితస్యచ, దుష్ప్రతిగ్రహాదగ్ధస్య దత్తం భవతి నిష్ఫలమ్‌. 13

దివాశయనశీలస్య తథా మైధునకారిణః సంధ్యాభోజిన ఏవాపి దత్తం భవతి నిష్ఫలమ్‌. 14

మహాపాతకయుక్తస్య త్యక్తస్య జ్ఞాతిబాంధవైః, కుండస్య చాపి గోలస్య దత్తం భవతి నిష్ఫలమ్‌. 15

పరివిత్తేః శఠస్యాపి పరివేత్తుః ప్రమాదినః, స్త్రీజితస్యాతిదుష్టస్య దత్తం భవతి నిష్ఫలమ్‌. 16

మద్యమాంసాశినశ్చాపి స్త్రీవిటస్యాతిలోభినః, చౌరస్య పిశునస్యాపి దత్తం భవతి నిష్ఫలమ్‌. 17

యే కేచిత్పాపనిరతా నిన్దితాః సుజనైః సదా, న తేభ్యః ప్రతిగృహ్ణీయాన్న చ దద్యాద్ద్విజోత్తమ, 18

సత్కర్మనిరతయాపి దేయం యత్నేన నారద.

సనక మహర్షి పలికెను:- అన్ని వర్ణములలో బ్రాహ్మణ వర్ణము ఉత్తమము. ఇచ్చిన దానము అక్షయము కావలయునని తలచువారు బ్రాహ్మణునకే ఈయవలయును. బ్రాహ్మణుడు భయములేనివాడై అందరి నుండి దానమును తీసుకొనవలయును. క్షత్రియులు వైశ్యులు ఎప్పుడూ దానమును తీసుకోరాదు. తీవ్రస్వభావము కలవానికి, పుత్రులు లేని వానికి, డాంబికా చారమును అవలంభించిన వానికి , తన కర్మలను విడిచిన వానికి ఇచ్చినది నిష్ఫలమగును. పరభార్యల యందు ఆసక్తి కలవానికి, పరద్రవ్యమును అబిలషించువానికి, జ్యోతిష్యము చూచువానికి, ఇచ్చినది నిష్ఫలమగును. అసూయ నిండిన మనసు గలవానికి, కృతఘ్నునికి, కపటికి, యాగమునకు అనర్హుడైన వానిచే యాగను చేయించువానికి, ఇచ్చినది. నిష్ఫలమగును. ఎపుడూ యాచించు వానికి, హింసకునికి, ఖలునికి, రసములను అమ్మువానికి ఇచ్చునది నిష్ఫలమగును. వలేదములను స్మృతులను అమ్ముకొను వానికి, ధర్మమును అమ్ముకొను వానికి, ఇచ్చినది నిష్ఫలమగును. గానముతో జీవించువానికి, సిరాతో జీవించువానికి, దేవాలయమున ధనమును తీసికొని అర్చించువానికి, గ్రామపురోహితునికి, గ్రామాధికారము చేయువానికి, ఇచ్చునది నిష్ఫలమగును. ఇతరులకు వంట చేయువానికి, కలికి, వైద్యునికి, తినరాని వాటిని తిను వానికి ఇచ్చినది నిష్ఫలమగును. శూద్రుల అన్నము ను తిను శూద్ర శవములను దహనము చేయువానికి, వ్యభిచారిణుల అన్నము తినువానికి, ఇచ్చునది నిష్ఫలమగును. విష్ణునామములను అమ్మువానికి , సంధ్యావందనమును చేయని వానికి, దుష్టదానములను స్వీకరించువానికి ఇచ్చునది నిష్ఫలమగును. పగలు నిద్రించు వానికి, సంభోగము చేయువానికి, సంధ్యాసమయమున తినువానికి ఇచ్చునది నిష్ఫలమగును. మహాపాతకములు కలవానికి, జ్ఞాతులు బంధువులు విడచిన వానికి విధవాపుత్రునికి, వ్యభిచారిణి పుత్రునికి ఇచ్చినది నిష్పలమగును. తన కంటె ముందు పెళ్ళి చేసుకొన్న వాని అన్నకు, అన్నకు వివాహము కాకమునుపే చేసుకొన్న వానికి స్త్రీల వశములో నున్న వానికి అతిదుష్టునికి ఇచ్చినది నిష్ఫలమగును. మద్యమాంసములను తినువానికి, స్త్రీవిటులకు అతిలోభికి తస్కరునికీ, చాడీలు చెప్పువానికి ఇచ్చినది నిష్ఫలమగును. పాపనిరతులకు ఇతరులచే నిందించబడువారికి ఈయరాదు. వారి నుండి తీసుకోరాదు. సత్కర్మనిరతునకే ప్రయత్నముచేసి ఈయవలయును. 2-18

యద్దానం శ్రద్ధయా దత్తం తథా విష్ణుసమర్పణమ్‌, యాచితం వాపి ప్రాత్రేణ భ##వేత్తద్దానముత్తమమ్‌. 19

పరలోకం సముద్దిశ్య హ్యైహికం వాపి నారద, యద్దానం దీయతే పాత్రే తత్కామ్యం మధ్యమం స్మృతమ్‌. 20

దంభేన చాపి హింసార్థం పరస్యావిధినాపి చ, క్రుద్దేనాశ్రద్ధయా పాత్రే తద్దానం మధ్యమం స్మృతమ్‌. 21

అధమం బలితోషాయ మధ్యమం స్వార్ధసిద్ధయే, ఉత్తమం హరిప్రీత్యర్ధం పారహుర్వేదవిదాం వరాః. 22

దానభోగవినాశాశ్చ రాయస్య్సుర్గతయస్త్రిధా, 23

యో దదాతి చనో భుఙ్కే తద్ధనం నాశకారణమ్‌. ధనం ధర్మఫలం విప్ర ఘర్మో మాధవతుష్టికృత్‌. 24

తరవః కిం న జీవన్తి త్వే7 పి లోకే పరార్థకాః, యత్ర మూలఫలైర్వృక్షాః పరకార్యం ప్రకుర్వతే. 25

మనుష్యా యది విప్రాగ్య్రన పరార్దాస్తదా మృతాః, పరాకార్యం న యే మర్త్యాః కాయేనాపి ధనేన వా. 26

మనసా వతసా వాపి తే జ్ఞేయాః పాపకృత్తమాః, అత్రేతిహాసం వక్ష్యామి శృణు నారద తత్త్వతః. 27

శ్రద్ధతో ఇచ్చినది, విష్ణువునకు అర్పించినది, యోగ్యుడైనవాడు అడిగినపుడు ఇచ్చినది, ఉత్తమ దానమనబడును పరలోక ఫలము కొఱకు ఇహలోకమున యోగ్యునికి ఫలాకాంక్షతో నిచ్చు దానము మధ్యమము. డాంబికము కొఱకు, హింసించుటకు, విధిరహితముగా, కోపముతో అశ్రద్ధతో అయోగ్యుడైన ఇతరునికి ఇచ్చునది మధ్యమము. అధమ దానము బలిచక్రవర్తు ప్రీతి కొఱకు, మధ్యమ దానము స్వార్థసిద్ధికి, ఉత్తమదానము హరిప్రీతికొఱకు అని వేదార్థములు తెలిసినవారు చెప్పెదరు. ధనమునకు దానము, అనుభవము, వినాశము అని మూడు గతులుండును. దానము చేయని అనుభవింతని ధనము వినాశకారణమగును. ధనము ధర్మఫలము కావలయును. ధర్మమును శ్రీహరి సంతోషము కొఱకాచరించవలయును. చెట్లు బ్రతుకుచున్నవి కదా! కాని అవికూడా పరార్థము కొఱకే జీవించని మనుజులు చనిపోయిన వారితో సమానులే. శరీరముతో, మనసుతో, మాటతో పరోపకారము చేయని మనుజులు పాపులు. ఓ నారదా! ఈ విషయమున నీ కొక కథను చెప్పెదను వినుము. 19-27

యత్ర దానాదికానాం తు లక్షణం పరికీర్తితమ్‌, గంగామాహాత్మ్యసహితం సర్వపాపప్రణాశనమ్‌. 28

భగీరథస్య ధర్మస్య సంవాదం పుణ్యకారణమ్‌, ఆసీద్భగీరథో రాజా సగరాన్యయసంభవః. 29

శశాస పృథవీమేతాం సప్తద్వీపాం ససాగరామ్‌, సర్వధర్మరతో నిత్యం సత్యసంధః ప్రతాపవాన్‌. 30

కందర్పసదృశో రూపే యాయజూకో విచక్షణః, ప్రాలేయాద్రిసమో ధైర్యే ధర్మే ధర్మసమో నృపః. 31

సర్వలక్షణసంపన్నః సర్వశాస్త్రార్థపారగః, స్రర్వసంపత్సమాయుక్తః సర్వానన్దకరో మునే. 32

అతిథ్యప్రయతో నిత్యం వాసుదేవార్చనే రతః, పరాత్రమీ గుణనిధిర్మైత్రః కారుణికస్సుధీః. 33

ఏతాదృశం తం రాజానం జ్ఞాత్వా హృష్టో భగీరథమ్‌, ధర్మరాజో ద్విజశ్రేష్ఠ! కదాచిద్ద్రష్టుమాగతః. 34

సమాగతం ధర్మరాజమర్హయామాస భూపతిః, శాస్త్రదృష్టేన విధినా ధర్మః ప్రీత ఉవాచ తమ్‌. 35

ఈ కథలో దానాదికముల లక్షణముల గంగామాహాత్మ్యము చెప్పబడినది. ఈ కధ అన్ని పాపములను నశింపచేయును. భగీరథయమధర్మరాజ సంవాదము అన్ని పుణ్యములను కలిగించును. సగరవంశమున బుట్టినవాడు భగీరథుడను పేరుగల వాడొక రాజుండెను. సప్తద్వీపములతో సప్తసాగరములతో కూడిన ఈ భూమండలమునంతయు

పరిపాలించెను. అన్ని ధర్మములందు ప్రీతి కలవాడు, సత్యవ్రతము గల వాడు, అమిత పరాక్రమము కలవాడు , రూపమున మన్మథుని బోలువాడు, యజ్ఞములను చేయువాడు, వివేకము కల వాడు, ధైర్యమున హిమాద్రిని బోలినవాడు ధర్మమున ధర్మరాజుతో సమానుడు అన్ని లక్షణములు కల వాడు, అన్ని శాస్త్రార్ధములు తెలిసినవాడు, అన్ని సంపదలు కల వాడు అందరికీ ఆనందమును కలిగించువాడు, ఎల్లప్పుడు అతిథులను పూజించుటయందే ఆసక్తి కల వాడు , శ్రీమన్నారాయణుని పూజించుటలో మనసు కలవాడు, అన్ని మంచి గుణములకు నిధి స్నేహశీలి, భూతదయ కలవాడు, మంచి బుద్ధి గల వాడు. ఇంతటి ఉత్తముడైన భగీరథ చక్రవర్తిని గూర్చి తెలుసుకొని సంతోషించిన యమధర్మరాజు ఒకప్పుడు చూచుట కొచ్చెను. భగీరథ చక్రవర్తి వచ్చిన ధర్మరాజును యథావిధిగా పూజించెను. భగీరథుని పూజలంది సంతోషించిన యమధర్మరాజు అతనితో ఇట్లు పలికెను. 28-35

ధర్మరాజు ఉవాచ:-

రాజన్ధర్మవిదాం శ్రేష్ఠ! ప్రసిద్ధో 7పి జగత్త్రయే, ధర్మరాజో7ధకీర్తిం తే శ్రుత్వా త్వాం ద్రష్టుమాగతః. 36

సన్మార్గనిరతం సత్యం సర్వభూతహితే రతమ్‌, ద్రష్టుమిచ్ఛన్తి విబుధాస్తవోత్కృష్టగుణప్రియాః. 37

కీర్తిర్నీతిశ్చ సంపత్తిర్వర్తతే యత్ర భూపతే, వసన్తి తత్ర నియతం గుణాః సన్తశ్చ దేవతాః. 38

అహో రాజన్మహాభాగ !శోభనం చరితం తవ, సర్వభూతహితత్వాది మాదృసామపి దుర్లభమ్‌. 39

ఇత్యుక్తవంతం తం ధర్మం ప్రణిపత్య భగీరధః, ప్రోవాచ వినయావిష్టః సంహృష్టః శ్లక్షయా గిరా. 40

ధర్మరాజు పలికెను:- ''ఓ రాజా! ధర్మమును తెలిసిన వారిలో శ్రేష్ఠుడవని ప్రసిద్ది చెందుతివి. ఈ మూడు లోకములలో విస్తరించిన నీ కీర్తిని విని ధర్మరాజునైన నేను నిన్ను చూచుటకు వచ్చితిని. సన్మార్గమునందు ఆసక్తుడైన వాడవు, సత్యసంధుడవు అన్ని ప్‌%ారణులకు హితమును చేయవలయునని కోరువాడవు అయిన నిన్ను నీ ఉత్తమ గుణములయందలి ప్రీతిచే దేవతలు చూడ గోరుచున్నారు ఓ రాజా! కీర్తి, నీతి, సంపద, ఉన్నచోట సద్గుణములు సత్పురుషులు దేవతలు తప్పకనుందురు. ఓ రాజా !నీ చరితము అత్యాశ్చ్రయకరము. సుందరము. అన్ని ప్రాణులకు హితము ను చేయవలయుననెడు బుద్ధి మావంటి వారికి కూడా దుర్లభ##మే''. ఇట్లు పలుకుచున్న ధర్మరాజును భగీరధ చక్రవర్తి నమస్కరించి వినయముతో సంతోషముతో మృదుమధురమైన మాటలతో ఇట్లు పలికెను. 36-40

భగీరథ ఉవాచ:-

భగవన్సర్వధర్మజ్ఞ !సమదర్శిన్‌! సురేశ్వర! కృపయా పరయా విష్ణో యత్పృచ్ఛామి వదస్వతత్‌. 41

ధర్మాః కీదృగ్విధాః ప్రోక్తాః కే లోకా ధర్మశాలినామ్‌ , కియత్యో యాతనాః ప్రోక్తాః కేషాం తాః పరికీర్తితాః. 42

త్వయా సంమాననీయా యే శాననీయాశ్చయే యథా, తత్సర్వం మే మహాభాగ! విస్తరాద్వక్తుమర్హసి. 43

అన్ని ధర్మములు తెలిసిన భగవానుడా !సమదర్శీ! సురేశ్వరా !నామీద పరమకృప కలవాడైన నేనడిగిన వాటిని చెప్పుము. ధర్మములు ఎటువంటివి? ధర్మశీలురకు లభించులోకములేవి ?నరకములెన్ని? ఆ నరకములెవరికి ప్రాప్తించును ?నీవు ప్రేమతో ఆదరించునదెవరిని ?శాసించునదెవరిని ?దీనినంతటిని నాకు విస్తరముగా తెలుపుము. 41-43

ధర్మరాజు ఉవాచ:-

సాధు! సాధు! మహాబుద్ధే! మతిస్తే విమలోర్జితా దర్మాధర్మాన్ప్రవక్ష్యామి తత్త్వతః శృణు భక్తితః. 44

ధర్మా బహువిధాః ప్రోక్తాః పుణ్యలోకప్రదాయకాః, తథైవ యాతనాః ప్రోక్తా అసంఖ్యా ఘోరదర్శనాః. 45

విస్తరాద్గదితుం నాలమపి వర్షశతాయుతైఃతస్మాత్సమాసతో వక్ష్యే ధర్మాధర్మనిద్శనమ్‌. 46

వృత్తిదానం ద్విజానాం వై మహాపుణ్యం ప్రకీర్తితమ్‌, తతైవాధ్యాత్మవిదుషో దత్తం భవతి తాక్షయమ్‌. 47

కుటుంబినం వా శాస్త్రజ్ఞం శ్రోత్రియం వా గుణాన్వితమ్‌,

యోదత్త్వా స్థాపయేద్వవృత్తిం తస్య పుణ్యఫలం శృణు. 48

మాతృతః పితృతశ్చైవ ద్విజః కోటికులాన్వితః, నిర్విశ్య విష్ణుభవనం తప్లం తత్రైవ మోదతే. 49

గణ్యనే పాంసవో భూమేః గణ్యన్తే వృష్టిబన్దవః, న గణ్యన్తే విధాత్రాపి బ్రహ్మవృత్తిఫలాని వై. 50

సమస్త దేవతారూపో బ్రాహ్మణః పరికీర్తితః జీవనం దదత్తస్య కః పుణ్యం గదితుం క్షమః. 51

యో విప్రహితకృన్నిత్యం స సర్వాన్కృతవాన్మఖాన్‌, స స్నాతః సర్వతీర్ధేషు తప్తం తేనాఖిలం తపః. 52

యో దదస్వేతి విప్రాణాం జీవనం ప్రేరయేత్పరమ్‌. సో7 పి తత్ఫలమాప్నోతి కిమన్యైర్బబుభాశితైః. 53

తటాకం కారయేద్యస్తు స్వయమేవాపరేణ వా, వక్తుం తత్పుణ్యసంఖ్యానం నాలం వర్షశతాయుషా. 54

ఏకశ్చేదధ్వగో రాజంస్తడాగస్య జలం పిబేత్‌ , తత్కర్తుస్సర్వపాపాని నశ్యన్తేవ న సంశయః. 55

ఏకాహమపి యత్కుర్యాద్భూమిస్థముదకం నరః, స ముక్తస్సర్వపారేభ్యశ్శతవర్షం వసేద్దివి. 56

కర్తుం తడాగం యో మర్త్యస్సాహ్యకశ్శక్తితో భ##వేత్‌, సో 7పి తత్ఫలమాప్నోతి తుష్టః ప్రేరక ఏవ చ. 57

మృదం సిద్ధార్ధమాత్రం వా తడాగాద్యో బహిఃక్షిపేత్‌, తిష్ఠత్యబ్దశతం స్వర్గే విముక్తః పాపకోటిభిః. 58

దేవతా యస్య తుష్యన్తి గురువో వా నృషోత్తమ, తడాగపుణ్యకృచ్చ స్యాదిత్యేషా శాశ్వతీ శ్రుతిః. 59

ధర్మరాజు పలికెను:- ''ఓ మహాబుద్ధీ !బాగు !బాగు !నీ బుద్ధి నిర్మలమైనది. ప్రసన్నమైనది. ధర్మధర్మములను గూర్చి చెప్పెదను. భక్తితో వినుము., పలువిధములుగా ధర్మములుండును. ఈ ధర్మములు పుణ్యలోకములను ప్రసాదించును. భయంకరనములైన ఆ ధర్మములు కూడా బహువిధములు. లక్షసంవత్సరముల కాలమున కూడా ధర్మాధర్మములను విస్తరముగా చెప్ప శక్యముకాదు. కావున ధర్మాధర్మ విషయములను సంగ్రహముగా చెప్పెదను. బ్రహ్మణులకు బ్రతుకు తెరువును కల్పించుట మహాపుణ్యమని చెప్పబడినది. అట్లే ఆధ్యాత్మజ్ఞానికి దానము చేసిన ఫలము తరగనిదౌను. శాస్త్రములు తెలిసిన కుటుంబిని, సద్గుమ వంతుడైన శ్రోత్రియుని బ్రతుకుతెరువు కల్పించి గ్రామమున ఉంచినచో తల్లివంశములు తండ్రి వంశములు కోటి తరములు విష్ణుభవనమున ప్రవేశించి ఒక కల్పము నివసించును. భూరేణువులను లెక్కించవచ్చును, వర్షబిందువులను లెక్కించవచ్చును. బ్రాహ్మణునికి వృత్తి కల్పించిన పుణ్యములను బ్రహ్మకూడా లెక్కించలేడు. బ్రాహ్మణుడు సమస్త దేవతా స్వరూపుడుగా చెప్పబడుచున్నాడు. అటువంటి బ్రాహ్మణునికి బ్రతుకుతెరువునిచ్చిన వాని పుణ్యమును ఎవడు చెప్పగలడు?బ్రాహ్మణులకు హితమును చేయువాడు అన్ని యజ్ఞములను చేసినవాడే. అన్ని పుణ్యతీర్థములలో స్నానము చేసినవాడు, అన్ని తపములను చేసిన వాడూ అగును. బ్రహ్మణునకు బ్రతుకుతెరువును కల్పించమని ఇతరులను ప్రోత్సహించిన వానికి కూడా అంతియే ఫలము కలుగును. ఇక వేయి మాటలేల? స్వయముగా చెరువును తవ్వించిననూ, ఇతరులచే తవ్వింప చేసిననూ అతని పుణ్యఫలమును నూరేండ్లకాలములోనైనను చెప్పలేము. ఒక్క బాటసారి అయిననూ ఆ చెరువులో నీరు త్రాగినచో చెరువును త్రవ్వించిన వాని పాపములన్నియూ నశించును. సంశయములేదు. ఒద దినమునకు సరిపోవు నీటిని చెరువులో ఉంచగల వాడు అన్ని పాపముల నుండి విముక్తుడై స్వర్గమున నూరు సంవత్సరములు నివసించును. చెరువును త్రవ్వించువానికి శక్తి కొలది సాయము చేయువాడు, ఆకార్యమును చూచి ఆనందించువాడు, చెరువును త్రవ్వించమని ప్రోత్సహించువాడు కూడా అంతియే ఫలమును పొందును. ఆవగింజంత మట్టిని చెరువునుండి తీసి బయట పడవేసినవాడు అన్ని పాపముల నుండి విముక్తుడై నూరు సంవత్సరములు స్వర్గములో నివసించును. దేవతలను గురువులను సంతోషింపచేసిన వాడు చెరువును త్రవ్వించినవాని పుణ్యమును పొందును అని శ్రుతి చెప్పుచున్నది. 44-59

ఇతిహాసం ప్రవక్ష్యామి తవాత్ర నృపసత్తమ ! యం శ్రుత్వా సర్వపాపేభ్యో ముచ్యతేనాత్ర సంశయః 60é

గౌడదేశే 7తివిఖ్యాతో రాజాసీద్వీరభద్రవః, మహాప్రతాపీ విద్యావాన్‌ దసా విప్రప్రపూజకః. 61

వేదశాస్త్రకులాచారయుక్తో మిత్రవివర్ధనః, తస్య రాజ్ఞీ మహాభాగా నామ్నా చంపకమంజరీ. 62

తస్య రాజ్ఞో మహామాత్యాః కృత్యాకృత్యవిచారణాః, ధర్మాణాం ధర్మశాస్త్రసైస్తు సదా కుర్వన్తి నిశ్చయమ్‌. 63

ప్రాయశ్చిత్తం చికిత్సాం చ జ్యోతిషే ధర్మనిర్ణయమ్‌, వినా శాస్త్రేణ యో బ్రూయాత్తమాహుః బ్రహ్మాఘాతకమ్‌. 64

ఇతి నిశ్చితయ మనసా మన్వాదీరితధర్మకాన్‌, ఆచార్యేభ్యస్సదా భూపశ్శృణోత్‌ విధిపూర్వకమ్‌. 65

న కో7 ప్యన్యయవర్తీ చ తస్య రాజ్యే వరో పి చ, ధర్మేణా పాల్యమానస్య తస్య దేశస్య భూపతేః .66

ఓ రాజా! ఇచట నీకు ఒక కథను చెప్పెదను వునుము. ఈ కథను వినినచో అన్ని పాపములు నశించును. గౌడదేశమున వీరభద్రుడను ప్రసిద్ధి చెందిన మహారాజు కలడు. మహాప్రతాపము కలవాడు, విద్యావంతుడు, ఎప్పుడూ బ్రాహ్మణులను పూజించువాడు . వేదశాస్త్రకులాచారములు కలవాడు. మిత్రులను పెంచువాడు. అతని భార్యమహానుభావురాలు చంపకమంజరి, వీరభత్రుని మంత్రులు కృత్యాకృత్యవిచారములు కలవారు. ధర్మశాస్త్రములచే ధర్మములను నిర్ణయించువారు. ప్రాయశ్చిత్తమును. చికిత్సను. జ్యోతిషశాస్త్రమును, ధర్మనిర్ణయమును, శాస్త్రము ప్రమాణముగా లేక చెప్పువాడు బ్రహ్మఘాతకుడగును. ఇట్లు మన్వాదులు చెప్పిన ధర్మములను ఎప్పుడూ గురువుల నుండి విధి పూర్వకముగా వినుచుండును. వీరభద్రుని రాజ్యమున అన్యాయముగా ప్రవర్తుంచువాడొక్కడునూ లేడు. తక్కువ వాడు కూడా రాజ్యమున లేడు. ఆ రాజు ధర్మబద్ధముగా రాజ్యపాలన చేయుచుండెను. 60-66

జాతం సమత్వం స్వర్గస్య సౌరాజ్యస్య శుభావబమ్‌. స చైకదా తు నృపతిర్మృగయాయాం మహావనే. 67

మన్త్యాదిభిః పరివృతో బభ్రామ మధ్యభాస్కరమ్‌, దైవాదాఖేటశూన్యస్య హ్యతిశ్రాన్తస్య తత్ర వై. 68

నృపరీతస్య సంజాతం సరసో దర్శనం నృప, తతః శుష్కాం తు పరసీం దృష్ట్వా తత్ర వ్యచిన్తయత్‌. 69

కిమియం సరసీ శృఙ్గే భువః కేన వినిర్మిచా, కథం జలం భ##వేదత్ర యేన జీవేదయం నృపః. 70

తతో బుద్ధిస్సమభవత్ఖాతే తస్యా నృపోత్తమ, హస్తమాత్రం తతో గర్తం ఖాత్వా తోయమవాప్తవాన్‌. 71

తేన తోయేన పీతేన రాజ్ఞస్తృపిరజాయత, మన్త్రిణశ్చాపి భూమీశ బుద్ధిసాగరసంజ్ఞినః. 72

స బుద్ధి సాగరో భూపం ప్రాహ ధర్మార్థకోవిదః, రాజన్నియం పుష్కరిణీ వర్షాజలవతీ పురా. 73

అద్యైనాం బద్ధవప్రాంచ కర్తుం జాతా మతిర్మమ, తద్భవాన్మోదతాం దేవ దత్తాదాజ్ఞాం చ మే 7నఘ. 74

ఇతి శ్రుత్వా వచస్తస్య మన్త్రిణో నృపసత్తమః ముము7దే తితిరాం భూపః స్వయం కర్తం సముద్యతః. 75

తమేవ మన్త్రిణం తత్ర యుయోజ శుభకర్మణి, తతో రాజాజ్ఞయా సో7పి బుద్ధిసాగరకో ముదా. 76

సరసీం సాగరం కర్తుముద్యతః పుణ్యకృత్తమః, ధనుషాం చైవ పంచాశత్సర్వతో విస్తృతాయతామ్‌. 77

సరసీం బద్ధసుశిలాం తకారాగాధశంబరామ్‌, తాం వినిర్మాయ సరసీం రాజ్ఞే సర్వం న్యవేదయత్‌. 78

తస్యాం తతఃప్రభృతి వై సర్వేపి వనచారిణః పాంధాః పిపాసితా భూప లభ##స్తేస్మ జలం శుభమ్‌. 79

వీపభద్రుని సౌరాజ్యము స్వర్గముతో సమానమాయోను. ఒక మారు వీరభద్రమహారాజు కలిసి వేటకు బయులదేరి మహారణ్యమున మధ్యాహ్నము వరకు తిరగెను. దైవ వశమున వేటగాడు మృగములు లభించక మిక్కిలి అలసిన మహారాజు పరివారముతో వెళ్ళి ఒ క సరస్సును చూచెను. కాని ఆ సరస్సు నీరులేక ఎండిపోయి యుండట జూచి ఈ భూమిపై ఎత్తు ప్రాంతమున ఇట్లు సరసునెవరు నిర్మించిరి ?ఈ సరస్సులో నీరెట్లు లభించును ?ఆ నీరును త్రాగి ఈ రాజు ఎట్లుబ్రతుక వలయును ?అని (మంత్రి) చింతించెను. అపుడు అతనికి ఈ సరసును త్రవ్వలయునని ఆలోచన కలిగెను. వెంటనే ఒక మూర లోతు సరస్సును త్పవ్వగా నీరు వచ్చెను. తరువాత బుద్ధిసాగరుడు రాజుతో నిట్లు పలికెను. ''ఓ మహారాజా! ఈ సరస్సు వర్షపునీటితో మాత్రమే నిండియుండును. వర్షములు లేనపుడు ఎండిపోయి యుండును. కావున ఈ సరస్సును లోతుగా త్రవ్వలయునని నాకు ఆలోచన వచ్చినది. కావున మీరు దీనిని ఆమోదించి నాకాజ్ఞనీయుడు''. ఈ మాటలను వినిన వీర భద్రమహారాజు మిక్కిలి సంతోషించి తాను కూడా అట్లు త్రవ్వించ సంకల్పించెను. అట్లు ఆ సరస్సును చక్కగా త్రవ్వించు సుభకార్యమున బుద్ధికాగరుమే నియమించెను. అపుడు రాజాజ్ఞను పొందిన పుణ్యాత్ముడైన బుద్ధిసాగరుడు సంతోషముతో ఆ సరస్సును సాగరమును చేయుట సిద్ధపడెను. అట్లు ఆ సరస్సును మూడువందల అడుగులలోతు అంతయే వెడల్పుగా త్పవ్వించి చుట్టూ రాతిగోడ కట్టించి చాలా లోతుగా సరస్సును నిర్మింపచేసెను. అట్లు సరస్సును నిర్మించి బుద్దిసాగరుడు వీరభద్రమహారాజునకు నివేదించెను. అప్పటి నుండి ఆ యరణ్యములో నుండు వారు బాటసారలు దప్పిగొనిపుడు ఆ సరస్సులోని నీరు త్రాగుచుండెడివారు. 67-79

కదాచిత్సావయుషశ్చన్తే స మన్త్రీ బుద్ధిసాగరః, ప్రమృతో గతవాంల్లోకం లోకశాస్తర్మమ ప్రభో. 80

తదర్ధం చు మయా పృష్టో ధర్మో ధర్మలిపింకరః, చిత్రగుప్తస్తు, తత్కర్మ మహ్వం సర్వం న్యవేదయత్‌. 81

ఉపదేష్టా స్వయం టాసౌ ధర్మకార్యస్య భూపతేః, తస్మాద్ధర్మవిమానం తు సమారోఢుమిహార్హతి. 82

ఇత్యుక్తే చిత్రగుప్తేన సమాజ్ఞప్తో మయా నృప! విమానం ధర్మసంజ్ఞం తు ఆరోఢుం బుద్ధిసాగరః. 83

అథ కాలాన్తరే రాజన్‌ స రాజా వీరభద్రకః మృతో గతో మమ స్థానం నమశ్చక్రే ముదాన్వితః. 84

మయా తు తత్ర తస్యాపి వృష్టం కర్మాఖిలం నృప! కథితం చిత్రగుప్తేన ధర్మం సరసి సంభవమ్‌. 85

తదా సమ్యఙ్మయా రాజా బోధితో7భూద్యథా శృణుః, అధిత్యకాయాం బూపాల సైకతస్య గిరేః పురా. 86

లావకేనామునా చంచ్వా ఖాతం ద్వ్యంగుమమ్బుని, తతః కాలాన్తరే తేన వారాహేణ నృపోత్తమ. 87

ఖానితం హస్త మాత్రం తు జలం తుండేన చాత్మనః తత్వోన్యదాముయా కాల్వా హస్తయుగ్మమితః కృతమ్‌. 88

ఖాతే జలే మహారాజ తోయం మాసద్వయం స్థితమ్‌, పీతం క్షుద్రైర్వనతరైస్సత్వైస్తృష్ణాసమాకులైః. 89

తతో వర్షత్రయాన్తే తు గజతానేన సువ్రత, హస్తత్రయమితః కాతః కృతస్తత్రాధివం జలమ్‌. 90

మాసత్రయే స్థితం తచ్చ పయో జీవైర్వనేచరైః, భవాంస్తత్ర సమాయాతో జలశోషాదనన్తరమ్‌. 91

మాసే తత్ర తు సంప్రాప్తం హస్తం ఖ్వాతా జలం నృప, తతస్తస్యోపదేశేన మంత్రిణో నృపతే త్వయా. 92

పఞ్చాశద్ధనురుత్ఖాతం జాతం తత్ర మహాజలమ్‌, పునశ్శిలాభిస్సుదృఢం బద్ధం జాతం మహత్సరః వృక్షాశ్చ రోపితాస్తత్ర సర్వలోకోపకారిణః. 93

తేన స్వస్వేన పుణ్యన పంచైతే జగతీపతే! విమానం ధర్మ్యమారూఢాస్త్వమప్యేనం సమారుహ. 94

ఇతి వాక్యం సమాకర్ణ మమ రాజా స భూమిప !ఆరురోహ విమానం తత్షష్ఠో రాజా సమాంశభాక్‌. 95

ఇతి తే సర్వమాఖ్యాతం తడాగజనితం ఫలమ్‌, శ్రుత్వైతన్ముచ్యతే పాపాదాజన్మమరణాన్తికాత్‌. 96

యో నరః శ్రద్ధయా యుక్తో వ్యాఖ్యాతం శృణుయాత్పఠేత్‌,

సో7 ప్యాప్నోత్యఖిలం పుణ్యం సరో నిర్మాణసంభవమ్‌. 97

ఇతి శ్రీబృహన్నారదీయ పురాణ పూర్వభాగే ప్రథమ పాదే

ధర్మాఖ్యానే ద్వాదశో7ధ్యాయః.

కొంతకాలమునకుప ఆయుష్యము పూర్తికాగా బుద్ధిసాగరుడు మరణించి లోకపాలకుడైన నా లోకమునకు వచ్చెను. ధర్మలిపిని వ్రాయు చిత్రగుప్తుని నేను బుద్ధిసాగరుని విషయమున అడిగితిని. అపుడు చిత్రగుప్తుడు నాతో బుద్ధిసాగరుడు చేసిన దానిని తెలిపెను. ఈ బుద్ధిసాగరుడు మహారాజునకు ధర్మకార్యమునుపదేశించెను. కావున ఇతను ధర్మవిమానము నధిరోహించుటకు యోగ్యుడు. ఇట్లు చిత్రగుప్తుడు తెలుపగా ధర్మవిమానమునధిరోహించమని నేను బుద్ధిసాగరుని ఆజ్ఞాపించితిని. మరికొంతకాలమునకు ఆ వీరభద్రమహారాజు మరణించి నాలోకమునకు వచ్చి సంతోషముతో నాకు నమస్కరించెను. నేను ఆ రాజు విషయమున కూడా చిత్రగుప్తుని అడిగితిని. అపుడు చిత్రగుప్తుడు రాజు త్రవ్వించిన సరస్సు వలన కలిగిన ధర్మమును తెలిపెను. అపుడు నేను రాజును గూర్చి ఇట్లు సరస్సు చరిత్రను తెలిపితిని'' వినుము. సైకతపర్వతశికరముపై ఈ లకుముకి పిట్ట తన ముక్కుతో నీటిలో రెండంగులములను త్రవ్వెను. తరువాత కొంతకాలమునకు ఈ వరాహము తన తుండముతో ఒక మూరలోతు త్రవ్వెను. తరువాత కొంతకాలమునకు ఈ వరాహము రెండు మూరలు త్రవ్వెను. అట్లు త్రవ్విన దానిలో నీరు రెండు నెలలుండెను. దప్పిగొనిన చిన్న జంతువులు ఆ నీరు త్రాగినవి. తరువాత మూడు సంవత్సరములకు యేనుగుల గుంపొచ్చి మూడు మూరలు త్రవ్వినవి. ఎక్కువ నీరు వచ్చినది. ఆ నీరు మూడు మాసములున్నవి. చిన్న చిన్న జంతువులు . ఆనిటిని త్రాగి బ్రతికినవి. ఆ నీరెండి పోయిన తరువాత నీ వచటికొచ్చితివి. నీవు ఒక మూరత్రవ్వి నీటిని పొందితివి. తరువాత మంత్రి ఉపదేశముతో మూడువందల అడుగుల లోతు త్రవ్వించితివి. అందులో చాలా నీరు వచ్చినది. రాతితో చక్కగా కట్టించినందున గొప్ప సరస్సాయెను. దాని తీరమున లోకులకుపకరించు చెట్లను నాటించితివి. కావున వారి వారి పుణ్యములతో ఈ అయిదు ప్రాణులు ధర్మవమానమును అధిరోహించినవి. నీవు కూడా ఈ విమానమునధిరోహించుము''. ఇట్లు చెప్పిన నా మాటలను వినిన వీరభద్రవమహారాజు ధర్మవిమానమధిరోహించి ఆరవ భాగమును స్వీకరించెను. ఇట్లు నీకు తటాకమున నిర్మించుట వలన కలుగు ఫలమునంతయు తేలిపితిని. ఈ కథను వినిన వారు పుట్టిన నాటి నుండి మరణించువరకు చేసిన పాపములనుండి విముక్తి పొందెదరు. ఈ చరితమును శ్రద్ధతో వినినవారు చదివిన వారు కూడా తటాకమును నిర్మించుట వలన కలుగు ఫలమును పొందెదరు. 80-97

ఇది శ్రీబృహన్నారదీయ పురాణమున పూర్వభాగమున ప్రథమపాదమున

ధర్మాఖ్యానమున పన్నెండవ అధ్యాయము సమాప్తము.

Sri Naradapuranam-I    Chapters    Last Page