Sri Padma Mahapuranam-I    Chapters   

షష్ఠోద్యాయః

దక్షాత్ర్పాక్‌ సంకల్ప దర్శన స్పర్శనాది జన్యా సృష్టిః

భీష్మ ఉవాచ :

దేవానాం దానవానాంచ గంధర్వోరగ రక్షసాం | ఉత్పత్తిం విస్తరే ణమాం గురో బ్రూహి యథావిధి || 1

పులస్త్య ఉవాచ :

సంకల్పా ద్దర్శనాత్‌ స్పర్శాత్‌ పూర్వేషాం సృష్టి రుచ్యతే | దక్షాత్‌ ప్రాచేతసా దూర్ధ్వం సృష్టి ర్మైథున సంభవా || 2

యథా ససర్జ చైవాసౌ తథైవశ్రుణు కౌరవ | యథాతు సృజత స్తస్య దేవర్షిగణపన్నగాన్‌ || 3

న వృద్ధి మగమ ల్లోక స్తదా మైథునయోగతః | దక్షః పుత్ర సహస్రాణి తదాసిక్న్యా మజీజనత్‌ || 4

తాంస్తు దృష్ట్వా మహాభాగాన్‌ సిసృక్షూ న్వివిధాః ప్రజాః | నారదః ప్రాహ హర్యశ్వాన్‌ దక్షపుత్రాన్‌ సమాగతాన్‌ || 5

భువః ప్రమాణం సర్వంతు జ్ఞా త్వోర్ధ్వ మథ ఏవవా | తతః సృష్టిం విశేషేణ కురుధ్వ మృషి సత్తమాః || 6

తేతు తద్వచనం శృత్వా ప్రయాతాః సర్వతో దిశమ్‌ | అద్యాపి ననివర్తంతే సముద్రాదివ సింధవః || 7

హర్యశ్వేషు ప్రణష్టేషు పున ర్దక్షః ప్రజాపతిః | వారిణ్యామేవ పుత్రాణాం సహస్ర నయజ త్ర్పభుః || 8

శబలాశ్వా నామ తేచ సమేతాః సృష్టికర్మణి | నారద్యో7నుగతాన్‌ప్రాహ పునస్తాన్‌ పూర్వవన్మునిః 9

భువః ప్రమాణం సర్వంతు జ్ఞాత్వా భ్రార్తృ నధోపునః | ఆగత్య చ పునః సృష్టిం కరిష్య%థ విశేషతః || 10

తేపి తేనైవ మార్గేణ జగ్ముర్ర్భాత్రను గాస్తదా | తతః ప్రభృతి న భ్రాతుః కనియాన్‌ మార్గ మిచ్ఛతి || 11

అన్వేష్ఠా దుఃఖమాప్నోతి తేన తత్పరివర్జయేత్‌ |

భీష్ముడనియె. ''దేవదానవగంధర్వనాగరక్షస్సుల సృష్టిని విస్తరించి యథావిధి నానతిమ్ము.'' అనవిని పులస్త్యుం డిట్లనియె. ''సంకల్పముచే దృష్టిచే తాకుటచే పూర్వుల సృష్టి జరిగినట్లు చెప్పబడుచున్నది. దక్షుని తర్వాత ప్రాచేతసుని యనంతరమైనసృష్టి మిధుననిమిత్తము. బ్రహ్మ తొలుత దేవర్షి గణములను సృజించెను. కాని యది పెరగలేదు. అప్పుడు దక్షుడు తన వేలకొలదిపుత్రులను సంకల్పాదులచే గనిన వారిని పిల్లలం గనుడని యాదేశించెను. నారదు డా దక్షపుత్రులను హర్యశ్వులను వారిందనదరి కేతెంచిన వారింగని ఋషీశ్వరులారా! భావము ప్రమాణము క్రిందు మీదు లెల్లదెలిసి యీ మీద సృష్టిని పెంపుచేయుడనియె. వారది విని నలుదెసలకు వెళ్ళిపోయిరి. సముద్రమునుండి నదులు వెనుదిఱిగి రాన ట్లింతవరకును వారు తిరిగి రారైరి. హర్యక్షులట్లు పోగా దక్షప్రజాపతి వారిణియను నామె యందు వేయిమంది పుత్రులం గనియె. శబలాశ్వులను పేర వారు వారు సృష్టిగావింప నుద్యమించిరి. నారద మహర్షి మరల వారితో ముందటివలె భూమిప్రమాణము సమగ్రముగ తెలిసికొని వచ్చి ఆమీద సృష్టిని గావింపుడని పల్కెను. వారును నన్నల దారి ననుసరించిపోయి తిరిగిరారైరి. అప్పటినుండి తమ్ము డన్నదారి వెదుకకుండుట యేర్పడినది. ఒకవేళ నతడన్నజాడ నరయబోయెనేని దుఃఖము నందును. కావున నాపని జేయరాదు. 12

తత స్తేష్యపి నష్టేషు షష్ఠిం కన్యాః ప్రజాపతిః || 12

వారిణ్యాం జనయామాస దక్షః ప్రాచేతనస్తదా | ప్రాదాత్స దశ ధర్మాయ కశ్యపాయ త్రయోదశ || 13

వింశంతిం సప్త సోమాయ తిస్రశ్చారిష్టనేమినే | ద్వేచైవ భృగు పుత్రాయ ద్వే కృశాశ్వాయ ధీమతే || 14

ద్వే చైవాంగిరసే ప్రాదా త్తాసాం నామాని విస్తరాత్‌ | శృణు త్వం దేవ మాతౄణాం ప్రజా విస్తార మాదితః || 15

వారు నటువోగా ప్రజాపతి వీరిణియం దాడుబిడ్డల నరువదిమందిం గనెను. అందు పదిమందిని ధర్మునికి పదమువ్వురను కశ్యపునికి ఇరువదియేడుగురను సోమునికి (చంద్రునికి) అరిష్టనేమికి మువ్వురను భృగకుమారి కిద్దరిని కృశాశ్వున కిద్దరిని అంగిరసుని కిద్దరిని నొసంగెను. దేవమాతలగువారి పేరులను వారి సంతాన విస్తరమును మొదటి నుండి యాలింపుము.

అరుంధతీ వసుర్జామి ర్లమ్బా భాను ర్మరుత్వతీ | సంకల్పాచ ముహూర్తాచ సాధ్యా విశ్వాచ భామినీ || 16

ధర్మపత్న్యః సమాఖ్యాతా స్తాసాం పుత్రా న్నిబోధమే | విశ్వేదేవాస్తు విశ్వాయాః స్సాధ్యా స్సాధ్యానజీజనత్‌ || 17

మరుత్వత్యాం మరుత్వంతో వసోస్తు వనవస్తధా | భానోస్తు భానవో జాతా ముహూర్తాయ ముహూర్తజాః || 18

లంబాయాం ఘెషనామానో నాగవీధీతు జామిజా | పృధివీతల సంభూత మరుంధత్యా మజాయత || 19

సంకల్పాయాస్తు సంకల్పా వసుసృష్టిం నిధారయ | జ్యోతిష్మంతశ్చ యే దేవా వ్యాపకాః సర్వతోదిశమ్‌ || 20

అరుంధతి, వసువు, జామి, లంబ, భానువు, మరుత్వతి, సంకల్ప, ముహూర్త, సాధ్య, విశ్వ అను పదిమంది ధర్ముని భార్యలు. వారి కొడుకులు విశ్వేదేవులు విశ్వకుమారులు. సాధ్యకొడుకులు సాధ్యులు. మరుత్వతి కుమారులు మరుత్వంతులు. వసుసంతతి పసువులు. భానువు పిల్లలు భానవులు. ముహూర్తజులు ముహూర్త కొడుకులు. లంబ కొడుకులు ఘోషులు. జామి కూతురు నాగవీధి. అరుంధతి యందు భూతలమందలి వారు గల్గిరి. సంకల్పకు సంకల్పులు కల్గిరి. వసు సంతానము జ్యోతిష్మంతులు. వీరు నలుదెసల వ్యాపించిరి.

వసవస్తే సమాఖ్యాతా స్తేషాం నామాని మే శృణు | అ పో ధృవశ్చ సోమశ్చ ధరశ్చై వానిలో7నలః || 21

వ్రత్యూషశ్చ ప్రభాసశ్చ వసవోషౌ ప్రకీర్తితాః | ఆవస్య పుత్రాశ్చత్వారః శ్రాంతో వేతండ ఏవచ || 22

అపిశాంతో ముని ర్ర్పభు ర్యజ్ఞరక్షాధికారిణః | ధ్రువస్య కాలః పుత్ర స్సువర్చాః సోమా దజాయత || 23

ద్రవిణో హవ్యవాహశ్చ ధరపుత్రా విమౌ న్మృతా | కల్పాంతస్థ స్తతః ప్రాణో రమణః శిశిరో7పిచ || 24

మనోహరో ధవశ్చా%థ శివో వా ధహరేః సుతాః | శివో మనోజవం పుత్ర మవిజ్ఞాతగతి ప్రదమ్‌ || 25

అవాపచానలః పుత్రా నగ్నిప్రాయగుణాం స్తతః | తత్రశాఖో విశాఖశ్చ నిగమేషు స్వయం భువః || 26

అపత్యం కృత్తికానాంచ కార్తికేయ స్తతః స్మృతః | ప్రత్యూషన్య పుత్రో మునినాయాథదేవలః || 27

విశ్వకర్మా ప్రభాసస్య పుత్రః శిల్పీ ప్రజాపతిః | ప్రాసాదభవనోద్యాన ప్రతిమాభూషణాదిషు || 28

తటాకారామ కూపేషు త్రిదశానాంచ వర్థకిః | అజైక పా ద హిర్బుధ్య్నో విరూపాక్షో7థరైవతః || 29

హరశ్చ బహురూపశ్చ త్ర్వంబకశ్చ సురేశ్వరః | వైవన్టతో జయంతశ్చ పినాకీ చాపరాజితః || 30

ఏతే రుద్రాస్సామాఖ్యాతా ఏకాదశగణశ్వరా | ఏతేషాం మానసానాంతు త్రిశూల వరధారిణామ్‌ || 31

కోట్యశ్చతురశీతి స్తు తత్పుత్రాశ్చా క్షయా మతాః | దిక్షు సర్వాసు యేరక్షాం ప్రకుర్వంతి గణశ్వరాః || 32

ఏతేషాం పుత్ర పౌత్రాశ్చ సురభీగర్భ సంభవాః

అష్టవసువులపేర్లు అపుడు ధ్రువుడు సోముడు ధరుడు అనిలుడు ఆనలుడు ప్రత్యూషుడు ప్రభాసుడు. అపుని కొడుకులు నల్గురు. శ్రాంతుడు వేతండుడు అపిశ్రాంతుడు బభ్రువు. వీరు యజ్ఞరక్షాధికారులు.

ధ్రువుని కొడుకు కాలుడు. సారీజుని కొడుకు సువర్చుడు. ధర్ముని కొడుకులు ద్రవిణుడు హవ్యవాహుడు కల్పాంతస్థుడు ప్రాణుడు రమణుడు శిశిరుడు మనోహరుడు ధవుడు శివుడు అనువారు. వాయుకుమారులు. శివుడు మనోజువుడను కుమారునింగనెను. అతని జాడ యేరివిని దెలియదు. అగ్ని కుమారుడు అగ్నియొక్క గుణములు కలవారు. అందు శాఖుడు విశాఖుడు బ్రహ్మయొక్కనిగమములందు (వేదములందు ) వినవత్తురు. కృత్తికలు (అగ్ని దైవత్యములు నక్షత్రములు) వారి కొడుకు కార్తికేయుడు (కుమారస్వామి అగ్నికుమారుడగు విశాఖుడీయనయే. ప్రత్యూషుని కొడుకులుముని, దేవలుడును. ప్రభాసుని కుమారుడు విశ్వకర్మ. ఆయన దేవశిల్పి, ప్రజాపతి. ప్రాసాదములను (దేవాలయములు, చక్రవర్తులభవనములను భవనములు, ఉద్యానములు, ప్రతిమలు, (విగ్రహములు) నగలు, తటాకములు (చెఱువులు) ఆరామములు (తోటలు, దొడ్లు) సూతులువంటి వాని నిర్మాణమం దీవిశ్వకర్మ దేవతకి వత్రంగి-

ఏకాదశరుద్రులు :- 1) అజైకపాత్తు 2) హిర్భుధ్న్యుడు 3) విరూపాక్షుడు 4) రైవతుడు 5) హరుడు 6) బహుర్థురూపుడు 7) త్ర్యంబకుడు 8) సురేశ్వరుడు 9) సావిత్రుడు (వైవశ్వతుడు) 10) జయంతుడు 11) పినాల 12) అపరాజితుడు అనువారు. గణశ్వరులనియు వీరినందురు. త్రిశూలధారులగు బ్రహ్మమానస పుత్రులునై వీరి కెనుబది నాల్గుకోట్ల మంది పుత్రులు గల్గిరి. వారు సర్వదిశల నావరించి జగద్రక్షణ సేయుచుందురు. వీరి పుత్ర పౌత్రులు సురభి (కామధేనువు) గర్భమందుదయించినవారెందరో యున్నారు.

కశ్యపవంశము

కశ్యపస్య ప్రవక్ష్యామి పుత్ర పౌత్రాదిపత్నిషు || 33

ఆదితిర్దితిర్ధనుశైవ అరిష్టాసురసాతథా | సురభి ర్వినతాచైవ తామ్రా క్రోధవశా ఇరా || 34

కద్రూః ఖసా మునిర్తద్య త్తాసు పుత్రాన్నిబోధమే | తుషితా నామ యే దేవాశ్చాక్షుషస్యాంతరే మనోః || 35

కశ్యవుని భార్యలు దితి అదితి దమవు అరిష్ట సురస సురభి వినత తామ్రా క్రోధవశా ఇరా కద్రుపు ఖసమునియును వారి కొడుకులు తుషితలను దేవతలు. వారు చాక్షుషమన్వంతరము వారు

వైవస్వ తేం7తరేచైవ ఆదిత్యా ద్వాదశ స్మృతాః | ఇద్రో ధాతా భగస్త్వష్టా మిత్రో7థ వరుణో7ర్యమా || 36

వివస్వాన్సవితా పూషా అంశుమాన్‌ విష్ణురేవచ | ఏతే సహస్రకిరణా ఆదిత్యా ద్వాదశ స్మృతాః || 37

మరీచ్యాత్‌ శ్యపా జ్ఞాతాః పుత్రాస్తే దితి నందనాః | కృశాశ్వస్య ఋషేః పుత్రా దేవప్రహరణాః స్మృతాః || 38

ఏతే దేవగణాస్తాతా ప్రతిమన్వంతరేషు చ | ఉత్పద్యంతే విలీయంతే కల్పే కల్పే తథైవచ || 39

వైవస్వతమన్వంతరమున అదితి సంతానము (ఆదిత్యులు) పండ్రెడుగురు వారు. ఇంద్రుడు ధాత భగుడు త్వష్ట మిత్రుడు వరుణుడు అర్యముడు వివస్వంతుడు సవిత పూష అంశుమంతుడు విష్ణువు. వీరందరు సహస్ర కిరణులు వేలకొలది కిరణములు గలవారు. కశ్యపునికి దితియందు దైత్యులు కృశాశ్వాఋషికుమారులు దేవప్రహరణులుగల్గిరి. ఈ దేవగణములు ప్రతిమన్వంతరము ప్రతికల్పమందు పుట్టుదురు లీనమగుదురు.

దితిః పుత్రద్వయ లేభే కశ్యపా దితి నః శ్రుతమ్‌ | హిరణ్యకశిపుంచైవ హిరణ్యాక్షం తధైవచ || 40

హిరణ్యకశిపోస్తద్వజ్జాతం పుత్రచతుష్టయం | ప్రహ్లాదశ్చాను హ్లాదశ్చ సంహ్లాదోహ్లాద ఏవచ || 41

ప్రహ్లాద పుత్రా ఆయుష్మాన్‌ ళిబి ర్బాష్కలిరేవచ | విరోచనశ్చతుర్థస్తు స బలిం పుత్ర మాప్తవాన్‌ || 42

బలేః పుత్రశతం త్వాసీ ద్బాణజ్యేష్ఠం తతో నృప | ధృతరాష్ట్ర స్తథా సూర్యో వివస్వా నంశుతాపనః || 43

నికుంబనామా గుర్వక్షః కుక్షి ర్భౌమో7థభీషణః | ఏవమన్యేతు బహవో బాణో జ్యేష్ఠో గుణాధికః || 44

కశ్యవుని వలన దితి యిద్దరం గనెనని విన్నాము. వారు హిరణ్యకశివుడు హిరణ్యాక్షుడును. హిరణ్యకశివునికి నల్గురు గల్గిరి. ప్రహ్లాదుడు అనుహ్లాదుడు సంహ్లాదుడు ఆహ్లాదుడుననువారు. ప్రహ్లాదపుత్రులు ఆయష్మంతుడు శిబి బాష్కలి విరోచనుడు ననువారు. విరోచనుడు బలింగనెను. బలి కొడుకులు నూర్గురు. అందు బాణుడు జ్యేష్ఠుడు. ధృతరాష్ట్రాదులు వారు తొంబది తొమ్మిది మంది.

బాణ న్సహస్రబాహుస్తు సర్వాస్త్రగుణసంయుతః | తవసా తోషితో యస్య పురే వసతి శూలధృత్‌ ||

మహాకాలత్వ మగమ త్ప్రార్థ్యం యస్య పినాకినః |

బాణుడు వేయిచేతులు గలవాడు. సర్వాస్త్రకుశలుడు. అతని తపస్సునకు సంతోషపడి శివుడు శూల పాణియై తత్పురమున రక్షయిచ్చుచు వసించును. ఇతడు శివుని ప్రార్థించి మహాకాలుడయ్యెను.

హిరణ్యాక్షస్య పుత్రో7భూ దంధకోనామ నామతః | 46

భూతసంతాపశ్చైవ మహానాగ స్తథ్రైవచ | ఏతేభ్యః పుత్ర పౌత్రాణాం కోటయః సప్తసప్తతిః || 47

మహాబలా మహాకాయా నానారూపా మహాజవాః | దనుః పుత్రశతం లేభే కశ్యపా ద్ధ్వరర్పితమ్‌ || 48

విప్రచిత్తిః ప్రధానో7భూ దేషాంమధ్యే మహాబలః | ద్విరష్టమూర్థా శకుని స్తథా శంకుశిరోధరః || 49

అయోముఖః శంబరశ్చ కపిలో వామన స్తథా | మరీచిర్మా మాగధశ్చైవ హరి ర్గజశిరా స్తథా || 50

నాద్రాధరశ్చ కేతుశ్చ కేతువార్యః శతక్రతుః | ఇంద్రమిత్రగ్రహశ్చైవ వజ్రనాభ స్తథైవచ || 51

ఏకవస్త్రో మహాబాహు ర్వజ్రాక్ష స్తారకస్తథా | అసిలోమా పులోమాచ వికుర్వాణో మహాసురః || 52

స్వర్రానుః ఋషపర్వాచ ఏవమార్యా దనోః సుతాః |

హిరణ్యాక్షుని కొడు కంధకుడు. భూతసంతాపనుడు మహానాగుడును హిరణ్యాక్షు కొడుకులు. వీరి మునుమలు మునుమనుమలు డెబ్భదియేడుకోట్లమంది బలశాలురు మహాకాయులు నానారూపులు తేజస్సంపన్నులు. దనువనునామె కశ్యపుని వలన నూర్గురంగనెను. వారు వారదర్పితులు. విప్రచిత్తి యిందు ప్రథానుడు. శకునియను వాడు పదునాఱు తలలవాడు (శంకుశిరోధరుడు) శంకువు వంటి మెడగలవాడు. అమోముఖుడు మొదలు వామనుడు సువర్వుడుదాక వారి పేర్లు సులభముగా నిందుగలవు.

స్వర్బానోః సుప్రభా కన్యా శచీచైవ పులోమజా || 53

ఉపదానవీ మయస్యాసీ త్తథా మన్డోదరీ కుహూః | శర్మిష్ఠా సున్దరాచైవ చండాచ వృషపర్వణః || 54

పులోమా కాలికాచైవ వైశ్వాసరసుతేఉభే | బహ్వపత్యో మహాసత్తో మారీచస్య పరిగ్రహః || 55

తయోః షష్టి సహస్రాణి దానవానాం పురాభవన్‌ | పౌలోమాన్‌ కాలఖంజాంశ్చ మరీచో7జన య త్పురా || 56

అవధ్యాయే నరాణాంవై హిరణ్యపురవాసినః | చతుర్ముఖా ల్లబ్ధవరా యే హతా విజయేనతు || 57

ఇందు స్వర్భానువు కూతురు సుప్రభ. పులోముని కూతురు శచీదేవి. మయుని కూతురు ఉపదానవి. కుహువు కుమారి మండోదరి. వృషవర్వుని కూతుండ్రు సుందరియైన శర్మిష్ఠ చండయును. వైశ్వానరుని కూతుండ్రు వ్రలోమ కాలికయును. వీరు మరీచుని భార్యలు. బహుసంతానవతులు, బహుబలాఢ్యులు. వారిసంతతి అరువదివేలమంది పౌలోములు కాలఖంజులు ననువారు మరీచునికి గల్గినారు. వారు మానవుల కవధ్యులు, హిరణ్య పురమందు వసించిరి. చతుర్ముఖుని వలన పరములం బడసినారు. విజయునిచే నిహతులైనారు.

విప్రచిత్తిః సింహికాయాం నవపుత్రా నజీజనత్‌ | హిరణ్యకశిపో ర్యే వై భాగినేయా స్త్రయోదశ || 58

కంసః శంఖశ్చ రాజేంద్ర నలో వాతాపి రేవచ | ఇల్వలో నముచి శ్చైవ ఖసృమ శ్చాంజనస్తథా || 59

నరకః కాలనాభశ్చ పరమాణు స్తధైవచ | కల్పవీర్యశ్చ విఖ్యాతా దనువంశవివర్ధనాః || 60

విప్రచిత్తి సింహిక యందు తొమ్మండ్రుంగనెను. హిరణ్యకశివునికివాండ్రు మేనల్లుండ్రు పదుముగ్గురు. వారు కంసుని మొదలు కల్పవీర్యుని దాక.

సంహ్లాదస్యతు దైత్యస్య నివాతకవచాకులే | అవధ్యాః సర్వదేవానాం గంధర్వోరగరక్షసాం || 61

యే హతా బలమాశ్రిత్య అర్జునేన రణాజిరే | షట్‌ కన్యా జనయామాస తామ్రా మరీచవీర్యతః || 62

శుకీం శ్యేనీంచ భాసీంచ సుగృధ్రాం గృధ్రికాం శుచిమ్‌ | శుకీ శుకా నులూకాంశ్చ జనయామాస ధర్మతః || 63

శ్యేనీ శ్యేనాంశ్చ భాసీంచ కురరాన ప్యజీజనత్‌ | గృధ్రీ గృధ్రా న్సుగృధ్రాచ పారావతవిహంగమాన్‌ || 64

హంససారస కారండవాదీన్‌ శుచి రజీజనత్‌ | ఏతే తామ్రాసుతాః ప్రోక్తా వినతాయా నిశామయ || 65

సంహ్లాదుని వంశంలో నివాతకవచులు దేవగంధర్వాదులకవధ్యులు జనించిరి. వారిని బలరామునా శ్రయమున నర్జునుడు హతమార్చెను. తామ్ర మరీచుని వలన నయిదుగురు కూతుండ్రంగనెను. శుకి శ్వేన భాసి సుగృధ్ర గృధ్ధ్రీక శుచి అనువారు వారు. శుచి శుకములను ఉలూకములను గనెను. (ఉలూక=గుడ్ణగూబ) శ్యేన (డేగ) భాసి కురరులను గృధ్రి గృధ్రములను (గ్రద్ధలను) పావురములను పక్షులంగనెను. శుచి హంసలు సారస=చక్ర వాకములు, కారండవ=బెగ్గురుపక్షులను గనెను. వారందరు తామ్రసంతానము.

ఇక వినతసంతతి నాలింపుము

గరుడః పతగశ్రేష్ఠో7రుణశ్చేశః పతత్రిణామ్‌ | సౌదామినీ తథా కన్యా యేయం తమసి విశ్రుతా|| 66

సంపాతిశ్చ జటాయుశ్చ అరుణస్య సుతావుభే | సంపాతిపుత్రో బభ్రుశ్చ శీఘ్రగశ్చాతి విశ్రుతః || 67

జటాయోః కర్ణికారశ్చ శతగామీచ విశ్రుతౌ | తేషామసంఖ్య మభవత్పక్షిణాం పుత్రపౌత్రకమ్‌ || 68

వినత సంతానము

గరుడుడు (పక్షిరాజు), అరుణుడును పక్షలకు రాజే. వినత కూతురు సౌదామిని (మెఱుపు) ఈమె తమసి=చీకటియందు, విశ్రుత=ప్రసిద్ధ అనగా చీకటిని చెండాడునదన్నమాట. సంపాతి జటాయువు అరుణుని కొడుకులు. సంపాతి కొడుకు బభ్రువు. చాలా వేగరి. మిక్కిలి ప్రసిద్ధుడు. జటాయువు కొడుకులు కర్ణికారి శతగామి యనువారు. వీరి పుత్ర పౌత్ర పరంపర అసంఖ్యాకమైనది.

సురసాయాం సహస్రంతు నపారామయా భవత్పురా | సహస్రశిరసాం కద్రూః సహస్రం ప్రాప సువ్రతా || 69

ప్రధానాస్తేషు విఖ్యాతా ష్షడ్వింశతిరరిందమ | శేష వాసుకి కర్కోట శంభైరావతకంబలాః || 70

ధనంజయ మహానీల పద్మాశ్వతర తక్షకాః ఏలాపత్ర మహాపద్మ ధృతరాష్ట్ర బలాహకాః || 71

శంఖపాల మహాశంఖ పుష్ప దంష్ట్ర శుఖాననాః | శంఖరోమాచనహుషోరమణః ఫణిసస్తథా || 72

కపిలో దుర్ముఖశ్చాపి పతంజలి ముఖాస్తథా | ఏషా మనంత మభవత్సర్వేషాం పుత్రపౌత్రకమ్‌ || 73

ప్రాయశో యత్పురా దగ్ధం జనమేజయ మందిరే | రక్షోగణం క్రోధవశాత్సు నామాన మజీజనత్‌ || 74

దంష్ట్రిణాం నియతం తేషాం భీమసేనా దగాతయమ్‌ | దంష్ట్రి గోమాయు కాకాదీన్‌ మహిషీర్గోవరాజ్గనాః || 75

సురభి ర్జనయా మాన కాశ్యపాత్త్రితయం పురా | ముని ర్మునీనాం చ గణం గణ మప్సరసాం తథా || 76

తథా కిన్నర గంధర్వా నరిష్టా జ్జనయద్‌ బహూన్‌ | తృణ వృక్ష లతా గుల్మ మిరా సర్వ మజీజనత్‌ || 77

సురసయందు వర్ణునికి (గరుడునికి) వేయిమంది పుట్టిరి. కద్రువు సహస్రశిరస్కులను సహస్ర సంఖ్యాకుల గనెను. ఆ కద్రుపు సంతానములో నిరువది యాఱుగురు ప్రధానులు. శేషుడు వాసుకి కర్కోటుడు శంఖుడు ఐరావతడు కంబలుడు ననువారు. వీరి మనుమలు ధనంజయుడు మొదలగు పతంజలి ప్రముఖులెందరో ఉదయించిరి. ఈ పరంపర అనంతము.

జనమేజయమందిరమందు మున్ను రక్షోగణము నాశనమైనది. విషపుకోరలుగల భీమునివలన క్షయించినది. కాశ్యపుని వలన మహిషి కోరలుగలజంతువులను నక్కలను కాకులం గనెను. సురభి గేదెలను గోవులను సుందరుల కాశ్యవునివలన గనెను. ముని యనునామె ముని గణమును ఆప్సరోగణమును కిన్నరగంధర్వాదులను బెక్కురను గనెను. ఇర గడ్డి చెట్లు తీగెలు పొదలనుం గనెను.

ఖసాతు యక్ష రక్షాంసి జనయామాస కోటిశః | ఏతే కశ్యప దాయాదాః శతశ్యో సహస్రశః || 78

ఏష మన్వంతరే భీష్మ సర్గః స్వారోచిషే స్మృతః | తతస్త్వేకోన పంచాశన్మరుతః కశ్యపాదితిః || 79

జనయామాస ధర్మజ్ఞ సర్వాసమర వల్లభాన్‌

ఇతి శ్రీపద్మపురాణ ప్రధమే సృష్టిఖండే షష్టోధ్యాయః

ఖస యనునామె యక్షులు రాక్షసులను కోట్లకొలదిగా గనెను. ఈ కశ్యపధాయాదులు (జ్ఞాతులు) వందలు వేలుగా నున్నారు. ఇది స్వారోచిషమన్వంతర సృష్టి. ధర్మజ్ఞ ఓ భీష్మా : అటుపైన నలుబది తొమ్మండుగురు మరుత్తులను దితి కశ్యపుని వలన గన్నది. వారందరు సమరవల్లభులు, దేవప్రభువులు.

ఇది సృష్టిఖండమందు సృష్టికథనమను అఱవ అధ్యాయము

Sri Padma Mahapuranam-I    Chapters