Sri Padma Mahapuranam-I    Chapters   

చతుర్వింశోధ్యాయ

-: అంగారకచతుర్థీవ్రతము :-

బ్రహ్మోవాచ :- భగవన్పురుషస్యేహ స్త్రియాశ్చ వరదాయకం | శోకవ్యాధిభయం దుఃఖం న భ##వేద్యేన తద్వద || 1

శంకర ఉవాచ :- శ్రావణస్య ద్వితీయాయాం కృష్ణాయాం మధుసూదనః | క్షీరార్ణవే సపత్నీకః సదా వసతి కేశవః || 2

తస్యాం సంపూజ్య గోవిందం సర్వాన్కా మానవాప్నుయాత్‌ | గోభూహిరణ్యదానాది సప్తకల్పశతానుగమ్‌ || 3

ఆవాహనాదికాం పూజాం పూర్వవత్పరికల్పయేత్‌ | అశూన్యశయనా నామా ద్వితీయాసౌ ప్రకీర్తితా || 4

-:అంగారకచతుర్థీవ్రతము:-

బ్రహ్మయనియె :- పురుషునికి స్త్రీకి గానీ వరములిచ్చునది శోకవ్యాధి భయదుఃఖములు కలుగనీనివ్రతమాన తిమ్మన శంకరుడనియె. పాలసంద్రము లక్ష్మితో విష్ణువెప్పుడు శ్రావణ బహుళ ద్వితీయనాడు వసించునో ఆనాడు గోవిందుని బూజించిన కోరికలు ఫలించును. గోవు, భూమి, బంగారము మొదలయిన దానములు సేసిన ఫలమేడువందల కల్పముల దాక సిద్దించును. ఆవాహనాది పూజావిధానమంత మున్ను జేసినట్లే. అశూన్యశయన ద్వితీయవ్రతమని దానికి పేరు. 4

తస్యాం సంపూజయేద్విష్ణుమేభిర్మంత్రైర్విధానతః | శ్రీవత్సధారిన్‌ శ్రీకాంత శ్రీపతే శ్రీధరావ్యయ || 5

గార్హస్థ్యం మా ప్రాణాశం మే యాతు ధర్మార్థకామదం | అగ్నయో మా ప్రణశ్యంతు దేవతాః పురుషోత్తమ || 6

పితరో మా ప్రణశ్యంతు మమ దాంపత్యభేదతః | లక్ష్మ్యా వియుజ్యతే దేవో న కదాచిద్యథా హరిః || 7

తథా కలత్రసంబంధో దేవ మా మే వియుజ్యతాం | లక్ష్మ్యా న శూన్యం వరద యథా తే శయనం సదా || 8

శయ్యా మమాప్యశూన్యాస్తు తథైవ మధుసూదన | గీతవాదిత్రనిర్ఘోషాన్‌ దేవదేవస్య కారయేత్‌ || 9

ఆనాడు విష్ణువు నీచెప్పిన మంత్రముల నర్చింపవలెను. శ్రీవత్సధారిన్‌ అను నామము మొదలు పేర్కొని ''ధర్మార్థకామపురుషార్థములిచ్చు నా గృహస్థదర్మము భంగపడకుండు గాక! నా అగ్నిదేవతలు నశింపకుందురుగాక. మా దంపతులకు మధ్య భేదమువచ్చి మా పితరుల నాశము కలుగకుండుగాక. యెప్పుడుగాని విష్ణుదేవుడు లక్ష్మిని విడువక యుండునట్లు నా కలత్రసంబంధము దేవా ! ఎన్నడును విడువడకుండుగాక. ఎట్లు నీ శయనము (పాన్పు) లక్ష్మితో నెడవడదో అట్లు నాశయ్యయు నిత్య శోభనముగ నుండి అశూన్యముగుగాక'' అని ప్రార్థించి గీతవాద్యాది మంగళవాద్యాది మేళనములు సేయవలెను. 9

ఘంటా భ##వేదశక్తస్య సర్వవాద్యమహీయతః | ఏవం సంపూజ్య గోవిందమశ్నీ యాత్తై లవర్జితమ్‌ || 10

నక్తామక్షారలవణం యావత్తు స్యాచ్చతుష్టయం | తతః ప్రభాతే సంజాతే లక్ష్మీపతిసమన్వితామ్‌ || 11

దీపాన్నభాజనైర్యుక్తాం శయ్యాం దద్యాద్విలక్షణాం | పాదుకోపానహచ్ఛత్రచామరాసన సంయుతామ్‌ || 12

అభీష్టోపస్కరై యుక్తాం శుక్లపుష్పాంబరావృతాం |

అవన్ని సేయశక్తిలేనప్పుడు ఘంటవాయించిన జాలును. ఈలా గోవిందుని బూజించి నూనె లేకుండ భోజనము సేయవలెను. నాల్గు నక్తములు (నాలుగు రోజులు రాత్రి మాత్రమే) భోజనము సేయవలెను. ఉప్పుకారము విడిచి భోజనము సేసి ఆపై సూర్యోదయమందు లక్ష్మీపతితోగూడ దీపపుసెమ్మా అన్నపాత్రలతోగూడ సలక్షణమైన (చక్కని) శయ్యను దానమీయవలెను. పాదుకలు (పాదరక్షలు) (ఉపనహము) గొడుగు చామరము ఆసనము పీట లేక కుర్చీ వారుకోరిన సామాగ్రితో తెల్లని వస్త్రములు పూలమాలలతో అవ్యంగాయ= ఏ లోపములేని విష్ణుభక్తులకు బ్రాహ్మణుని కుటుంబికి వేదవిద్వంసునకు దానమీయవలెను. గొడ్రాలి మగనికి మాత్రమెన్నడు నీయరాదు. 12 1/2

అవ్యంగాయ చ విప్రాయ వైష్టవాయ కుటుంబినే || 13

దాతవ్యా వేదవిదుషే న వంధ్యాపతయే క్వచిత్‌ | తత్రోపవేశ్య దాంపత్యమలంకృత్య విధానతః || 14

పత్ర్యాస్తు భాజనం దద్యాద్భక్ష్యభోజ్యసమన్వితం | బ్రాహ్మణస్యాపి సౌవర్ణీముపస్కర సమన్వితామ్‌ || 15

ప్రతిమాం దేవదేవస్య సోదకుంభాం నివేదయేత్‌ | ఏవం యస్తు పుమాన్కుర్యాదశూన్య శయనం హరేః ||16

విత్తశాఠ్యేన రహితో నారాయణపరాయణః | నతస్య పత్న్యా విరహః కదాచిదపి జాయతే || 17

నారీ వా విధవా బ్రహ్మన్‌ యావచ్ఛంద్రర్కతారకం | న విరూపౌ న శోకాన్తౌ దంపతీ భవతః క్వచిత్‌ || 18

ఈలా అశూన్య శయనవ్రతము యథావిధి హరినుద్ధేశించి లోభపడక సేసినతనికి పత్నితో నెడబాటెన్నడు గలుగదు. స్త్రీకి భర్తృ విరహము గలుగదు. 18

న పుత్రపశురత్నాని క్షయం యాంతి పితామహ | సప్తకల్ప సహస్రాణి సప్తకల్పశతాని

చ ||19

ఆ చంద్రముఖమునందు విధవసేసిన, పుత్రులకు పశుసంపదలకు క్షయముగాదు. ఏడువేలకల్పములీఫలమందుదురు. విష్ణువునుద్దేశించి సేసిన యీ యశూన్యవ్రతముచేసిన పుణ్యులు విష్ణులోకము నందుదురు. 19

కుర్వన్నశూన్యశయనం విష్ణులోకే మహీయతే |

బ్రహ్మోవాచ :- కథమారోగ్యమైశ్వర్యం మతిర్థర్మస్థితిస్సదా || 20

అవ్యంగాథ పరే భక్తిర్విష్ణౌ చాపి భ##వేత్కథం |

ఈశ్వర ఉవాచ :- సాధుబ్రహ్మంస్త్వయా పృష్టమిదానీం కథయామి తే ||21

విరోచనస్య సంవాదం భార్గవస్య చ ధీమతః | ప్రహ్లాదస్య సుతం దృష్ట్వా ద్విరష్టపరివత్సరమ్‌ || 22

తస్య రూపమిదం బ్రహ్మన్‌ సోహసద్భృగునందనః | సాధు సాధు మహాబాహో విరోచన శివం తవ || 23

తత్తథా హసితం తస్య పప్రచ్ఛ సురసూదనః | బ్రహ్మన్కిమర్ధమేతత్తే హాస్యం వై మామకం కృతమ్‌ || 24

సాధు సాధ్వితి మామేవముక్తవాంస్త్వం పదస్వ మే | తమేవం వాదినం యుక్తమువాచ వదతాం వరః || 25

విస్మయాద్వత్రమాహాత్మ్యాద్ధాస్యమేత్కృతం మయా | పురా దక్షవినాశాయ కుపితస్య త్రిశూలినః || 26

అపతద్భీమవక్త్రస స్వేదబిందుర్లలాటజః | భిత్వా ససప్తపాతాలానదహత్సప్తసాగరాన్‌ || 27

అనేకవక్తృనయనోజ్వలనభీషణః | వీరభద్ర ఇతి ఖ్యాతః కరపాదాయుతై ర్యుతః || 28

కృత్వా స యజ్ఞమథనం పునర్భూతస్య సంప్లవః | త్రిజగద్దహనాద్భూయః శివేన వినివారితః || 29

బ్రహ్మ యనియె :- ఆరోగ్యము ఐశ్వర్యము జ్ఞానము ధర్మము పరమాత్మయందు దృడభక్తియు నెట్లు కలుగునన నీశ్వరుండనియె. మంచిప్రశ్న యడిగితివి. శుక్రునకు విరోచనునకు జరిగిన సంవాదమిది. తెల్పెద, ప్రహ్లాదుని కొడుకును విరోచనుని పదునారేండ్లవానిని జూచి సరిగ నీతని రూపమేయని పరిహసించి బాగుబాగు ! విరోచనా ! నీకెల్లప్పుడు శివమగుగాక ! యనెను. అప్పుడాబాలుడు విప్రోత్తమ ! నన్నుజూచి యిట్లేల పరిహసించెదవని యడిగెను. విరోచనుడు వ్రతప్రభావమున కాశ్చర్యపడి నవ్వితిని. మున్ను త్రిశూలి (శివుడు) దక్షుని బరిమార్పనెంచి కోపముగొన్న నంతట నాయన నుదుటనుండి చెమట చుక్కయొకటి క్రిందబడెను. అది సప్తపాతాళములను భేదించి సప్తసముద్రములను దహించి యింకింపజేసెను. ఎన్నోముఖములు కండ్లతో భయంకరుడై ముల్లోకముల దహింపబూని నంత శివుడువారించెను. 29

కృతం త్వయా వీరభద్ర దక్షయజ్ఞవినాశనం | ఇదానీమలమేతేన లోకదా హేన కర్మణా || 30

శాంతిప్రదానాత్సర్వేషాం గ్రహాణాం ప్రథమో భవ | ప్రహృష్టాభిజనాః పూజాం కరిష్యంతి కృతాత్మనః || 31

అంగారక ఇతి ఖ్యాతిం గమిష్యసి ధరాత్మజ | దేవలోకే ద్వితీయం చ తవ రూపం భవిష్యతి || 32

యే చ త్వాం పూజయిష్యంతి చదుర్ధ్వాం తు దినే నరాః | రూపమారోగ్యమైశ్వర్యం తే త్వనంతం భవిష్యతి || 33

ఏవముక్తస్తతః శాంతిమగమత్కామరూపధృత్‌ | స జాతస్తత్ష్కణాద్రాజన్‌ గ్రహత్వమగమత్పునః || 34

అందరికి శాంతి చేకూర్చువాడవగుట నన్ని గ్రహములకు నీవు మొదటివాడ వగుము. నీ వలన హర్షించిన జనులు కృతార్థులై నీ పూజ నొనరింప గలరు. భూమి బిడ్డ అంగారకుడు అను ప్రసిద్ధినందెదవు. నీ రెండవ రూపము దేవలోకమునందుండగలదు. చవితినాడు నిన్ను పూజించిన మానవులు ఆయురారోగైశ్వర్యము లనంతముగ నందుదురు. అని శివుడనినంత వీరభద్రుడు శాంతినొంది కామరూపధరుడై గ్రహరూపము నందెను. 34

స కదాచిద్భవాంస్తస్య పూజార్ధాదికముత్తమం | దృష్టవాన్‌క్రియామాణం చ శూద్రేణ త్వం వ్యతస్థితః || 35

తేన త్వం రూపవాన్‌ జాతోసురః శత్రుకులాశనిః | వివిధా చ రుచిర్జాతా యస్మాత్తవ విదూరగా || 36

విరోచన ఇతి ప్రాహుస్తస్మాత్వాం దేవదానవాః | శూద్రేణ క్రియమాణస్య వ్రతస్య తవ దర్శనాత్‌ || 37

ఈదృశీ రూపసంపత్తిరితి విస్మితవానహం | సాధు సాధ్వితి తేనోక్తమహో మాహాత్మ్యముత్తమం || 38

పశ్యతోపి భ##వేద్రూపమైశ్వర్యం కిము కుర్వతః |

యస్మాచ్చ భక్త్యా ధరణీసుతస్య వినింద్యమానేన గవాదిదానమ్‌ || 39

ఆలోకితం తేన సురారిగర్భే సంభూతిరేషా తవ దైత్యజాతా | అథ తద్వచనం శృత్వా భార్గవస్య మహాత్మనః || 40

ప్రహ్లాదనందనో వీరః పునః ప్రపచ్ఛ భార్గవమ్‌ |

విరోచన ఉవాచ :- భగవంస్తద్ర్వతం సమ్యక్‌ శ్రోతుమిచ్ఛామి తత్త్వతః | 41

ఆ చెమట చుక్క వలన జనించి గ్రహమై దీపించెను. నీ తేజస్సు సుదూరము ప్రసరించెను. ఒకప్పుడు శూద్రుడు నిన్ను బూజించి శత్రుకులము పాలిట పిడుగై యసురుడై జన్మించెను. నీ దీప్తి విదూరము (చాలాదూరము) దీపించునదగుట చేతనే విరోచనుడను పేరు నీకు సార్థకమైనది. ఈ రూప సంపద యిలాటిదని నేనాశ్చర్యపడి సాధు సాధు బాగుబాగని మెచ్చికొన్నాను. నిన్ను జూచిననే చాలు నైశ్వర్య మద్భుతముగా గలుగును. ఇక నిన్నర్చించినచో వైభవ మేమనవలెను? శూద్రుడు చేయుచున్న యీ అంగారక వ్రతమైన గవాది దానము చూచినంత మాత్రాన రాక్షసుని గర్భమున పుట్టవు వచ్చినది- అన్న శుక్రుని వాక్యము విని ప్రహ్లాదుని కుమారుడు విరోచనుడు శుక్రాచార్యుని మరల యిట్లడిగెను - భగవంతుడ ! ఈ వ్రతమునున్న దున్నట్లు వినగోరెదను. 41

దీయమానం తు యద్దానం మయా దృష్టం భవాంతరే | మాహాత్మ్యం చ విధిం తస్య యథావద్వక్తుమర్హసి || 42

ఇతి తద్వచనం శ్రుత్వా విప్రః ప్రోవాచ సాదరం | చదుర్ధ్యంగారకదినే యదా భవతి దానవ || 43

జన్మాంతరమున నా యీయబడు దానము నేనుజూచుట, ఆ వ్రత ప్రభావము, విధానము నానతిమ్మన శుక్రుడాదరముతో నిట్లు సెప్పెను. 43

మృదా స్నానం తదా కుర్యాత్‌ పద్మరాగవిభూషితః | అగ్నిర్మూర్ధా దివో మంత్రం జపేత్స్నాత ఉదజ్ముఖః || 44

మంగళవారమునాడు చతుర్థీ తిథి కలిసి వచ్చినపుడు మృత్తికా స్నానముచేసి పద్మరాగమణి నలంకరించుకొని ''అగ్నిర్మూర్థా దివః'' అన్న మంత్రము నుత్తరముగానిలిచి జపింపవలెను. 44

శూద్రస్తూష్ణీం స్మరన్భౌమమాస్తాం భోగవివర్జితః | అథాస్తమిత ఆదిత్యే గోమయేనానులేపయేత్‌ || 45

ప్రాంగణం పుష్పమాలాభిరక్షతాభిః సమంతతః | తదభ్యర్చ్యాలిఖేత్పద్మం కుంకుమేనాష్టపత్రకమ్‌ || 46

కుంకుమస్యాప్యభావేన రక్తచందనమిష్యతే | చత్వారః కరకాః కార్యాః భక్ష్యభోజ్యసమన్వితాః || 47

తండులై రక్తశాలేయైః పద్మరాగైశ్చ సంయుతాః | చతుఃకోణషు తాన్కృత్వా ఫలాని వివిధాని చ || 48

గంధమాల్యాదికం సర్వం తథైవ వినివేశ##యేత్‌ |

సువర్ణశృంగాం కపిలామధార్చ్య రౌపై#్యః ఖురైః కాంస్యదోహాం సవస్త్రామ్‌ || 49

దురంధరం రక్తఖురం చ సౌమ్యం ధాన్యాని సప్తాంబరసంయుతాని |

అంగుష్ఠమాత్రం పరుషం తథైవ సౌవర్ణమప్యాయతబాహుదండమ్‌ || 50

చతుర్భుజం హోమమయం చ తామ్రపాత్రే గుడస్యోపరి సర్పియుక్తం |

సామస్వరజ్ఞాయ జితేంద్రియాయ వాగ్రూపశీలాన్వయసంయుతాయ || 51

దాతవ్యమేతత్సకలం ద్విజాయ కుటుంబినే నైవ తు దంభయుక్తే |

శూద్రుడు మౌనముతో భోగములనుభవింపక కుజుని స్మరింపవలెను. సూర్యాస్తమము తర్వాత ఇంటిముంగిట నావుపేడతో నలికి పూల మాలలతో అక్షతలతో నర్చించి కుంకుమతో అష్టదళ పద్మమును వ్రాయవలెను. కుంకుమము లేనిచో ఎఱ్ఱచందనమైన మంచిదే. నాల్గు గిన్నెలలో భక్ష్యభోజ్యాదులతో రక్తశాపమద్ది, వరిబియ్యము వండి, నాల్గు గిన్నెలలో పద్మరాగాలు సమకూర్చి నాల్గు కోణములందు నాల్గు గిన్నెలుంచి రకరకాల పండ్లుంచి గంధమాల్యాదికమంతయు గూర్చి బంగారు తొడుగు కొమ్మలతోడి వెండి డెక్కలతోడి సాధువైన కపిల గోవును నూత్న వస్త్రముల నలకంరించి కంచు పాలచెంబుగొని కుంకుమపూసి నూతన వస్త్రములతో సప్తధాన్యములు సమకూర్చి బంగారు ముద్రగ అంగుష్టమాత్ర పురుషుని దీర్ఘ బాహువుగ చతుర్భుజుని రాగి బెల్లపు కడవపైనుంచి సామస్వరజ్ఞుడు, సామవేది, జితేంద్రియుడు, చక్కని రూపము, మాట, నడవడియు గల ద్విజునకు కుటుంబికీయవలెను. దాంభికునికి మాత్రమీయరాదు. 51 1/2

భూమిపుత్ర మహాభాగ స్వేదోద్భవ పినాకినః || 52

రూపార్ధం త్వాం ప్రపన్నోహం గృహాణార్ఘ్యం నమోస్తు తే | మంత్రేణానేన దత్వార్థం రక్తచందనవారిణా || 53

తతోర్చయేద్విప్రవరం రక్తమాల్యంబరాదిభిః | దద్యాతేనైవ మంత్రేణ భౌమం గోమిథునానన్వితమ్‌ || 54

శయ్యాం చ శక్తిమాన్దద్యాత్సర్వోపస్కరసంయుతాం | యద్యదిష్టతమం లోకే యచ్చాస్య దయితం గృహే || 55

తత్తద్గుణవతే దేయం దత్తస్యాక్షయమిచ్ఛతా |తతః ప్రదక్షిణం కృత్వా విసృజ్య ద్విజసత్తమమ్‌ || 56

నక్తం క్షీరాశనం కుర్యాదేవం చాంగారకాష్టకం | చతురో వాథ వా తస్య యత్పుణ్యం తద్వదామి తే || 57

ఆ దానము సేయునపుడు- భూమికుమార పినాకి (శివుని) చెమట నుండి పుట్టినవాడ! రూపము (అందము) కోరి నిన్ను శరణంటిని. అర్ఘ్యమిదే చేకొనుము. నీకు నమస్కారము అను అర్థముగల యీ మంత్రమును పఠించుచు రక్తచందనోదకముతో నర్ఘ్యమీయవలెను. ఆపై నా విప్రుని ఎఱ్ఱని పూల మాలలతో వస్త్రములు గంధము మొదలయిన వానితో నర్చించి అదే మంత్రముతో గోమిధునముతో బాటు భౌముని (అంగారక విగ్రహమును) యధాశక్తి తలగడలు మొదలగు సర్వపస్కరములతో సాధన శయ్యాదానము సేయవలెను. లోకమున యా ఇంటిలో నేది కావలెనని కోరునో నా వస్తువు గుణవంతుని కీయవలెను. అది యక్షయమగును. ఆపై ప్రదక్షిణము సేసి యా విప్రోత్తముని సాగనంపి పాలు మాత్రము ద్రావి నక్త వ్రతము సేయవలెను. ఈలా యెనిమిది మంగళవారములు (అంగారకాష్టము) నాలుగు వారాలైనను జేయవచ్చును. ఆ పుణ్యమిదే సెప్పెద- 57

రూపసౌభాగ్యసంపన్నః పుమాన్‌ జన్మని జన్మని | విష్ణౌ వాథ శివే భక్తః సప్తద్వీపాధిపో భ##వేత్‌ || 58

సప్తకల్పసహస్రాణి రుద్రలోకే మహీయతే | తస్మాత్త్వమపి దైత్యేంద్ర వ్రతమేతత్సమాచర || 59

ఇత్యేవముక్తో భృగునందనేన చకార సర్వం వ్రతమేవ దైతః |

త్వం చాపి రాజన్కురు సర్వమేతద్యతోక్షయం వేదవిదో వదంతి || 60

శృణోతి యశ్చైనమనన్యచేతస్తస్యాపి సర్వం భగవాన్‌ విధత్తే || 61

ఇతి శ్రీపాద్మపురాణ ప్రథమే సృష్టిఖండే అంగారకచతుర్థీవ్రతం నామ చతుర్వింశోధ్యాయః

రూపము సౌభాగ్యము జన్మ జన్మము నందును విష్ణువునందు కాని శివునందు గాని భక్తుడు సప్త ద్వీపాధిపు డగును. సప్తసహస్ర కల్పములు రుద్రలోకమందు విహరించును. అందుచే దైత్యేంద్ర నీవు నీ వ్రత మాచరింపుము అని యిట్లు శుక్రాచార్యులచే తెలుపబడినది. యా రాక్షసుడిదియెల్ల చక్కగా నొనరించెను. రాజా! నీవు నిదియెల్ల జరుపుము. అక్షయఫల మగునని వేదవిదులనిరి. వేరు మనసు లేక యిది విన్నతనికి నీ ఫలము భగవంతు డనుగ్రహించును. 61

ఇది అంగారక చతుర్థీ వ్రతమను నిరువది నాల్గవ అధ్యాయము.

Sri Padma Mahapuranam-I    Chapters