Sri Padma Mahapuranam-I    Chapters   

త్రయోవింశోధ్యాయః

-: వేశ్యావ్రత కథనం :-

భీష్మ ఉవాచః - వైష్ణవా యే తు వై ధర్మా యాన్‌ రుద్రః ప్రోక్తవానిహ |

తాన్మే కథయ విప్రేంద్ర కీదృశాస్తే ఫలం తు కిమ్‌ || 1

పులస్త్య ఉవాచ : పురా రధంతరే కల్పౌ పరిపృష్టో మహాత్మనా ||

మందరస్థో మహాదేవః పినాకీ బ్రహ్మణా స్వయమ్‌ |2

కథమారోగ్యమైశ్వర్యమనంతమమరేశ్వర | అల్పేన తపసా దేవ భ##వేన్మోక్షః సదా నృణామ్‌ || 3

కిం తజ్ఞానం మహాదేవ త్వత్ర్పసాదాదధోక్షజ | అల్పకేనాపి తపసా మహాపలమిహోచ్యతే || 4

ఇతిపృష్టస్స విశ్వాత్మా బ్రహ్మణా లోకభావనః | ఉమాపతిరువాచేదం మనసః ప్రీతికారకమ్‌ || 5

-: వేశ్యావ్రత కథనం :-

భీష్ముడనియెః విప్రేంద్ర ! వైష్ణవ ధర్మములు వాని ఫలమేమో దెల్పుమన పులస్త్యుడనియె. రథంతర కల్పమందు ముందర పర్వతమందున్న పరమ శివుని బ్రహ్మకొలది తపస్సు మాత్రముచే తఱుగని యైశ్వర్యము ఆరోగ్యము మోక్షము మానవులకుగల్గునుపాయము తెల్పుమని యడిగెను. విశ్వాత్ముడు లోకభావనుడు శంకరుడు ఉమాపతి మనః ప్రీతిగ నిట్లు పలికెను. 5

ఈశ్వర ఉవాచ: అస్మాద్రధంతరాత్కల్పాద్భూయో వింశతిమో యదా ||

వారాహో భవితా కప్పస్తదా మన్వంతరే శుభే | 6

వైవస్వతాఖ్యే సంప్రాప్తే సప్తమే సప్తలోకధృక్‌ | ద్వాపరాఖ్యం యుగం తస్మిన్సప్తవింశతిమం యదా || 7

తస్యాంతే తు మహాతేజా వాసుదేవో జనార్ధనః | భారావతరణార్ధాయ త్రిధా విష్ణుర్భవిష్యతి || 8

ద్వైపాయన ఋషిస్తత్ర రౌహిణయోథ కేశవః కంసారిః కేశిమనః కేశవః క్లేశనాశనః || 9

పురీం ద్వారవతీం నామ సాంపత్రం యా కుశస్థలీ | దివ్యానుభావసంయుక్తామధివాసాయ శార్జిణః || 10

ఈ రథంతర కల్పమున కిరువది యగు వారాహకల్పమందు వైవసృత మన్వంతరమున నిరువది యేడవ ద్వాపరము చివర వాసుదేవుడు వసుదేవుని కుమారుడుగ కృష్ణుడుగ భూభారవతరణమున కవతరించును. ఆయన నివాసమున కపుడు ద్వారకా నగరమేర్పడును. ఇప్పుడది కుశస్థలి. ఆ విష్ణు నివాసమునకు బ్రహ్మ యా ద్వారకా నిర్మాణము సేయును. విష్ణువు ద్వైపాయనుడు. (వ్యాసుడు) రోహిణయుడు (బలరాముడు) భూభారావతరణమునకు మూడు మూర్తుల నవతరించును. 10

త్వష్టా తదాజ్ఞయా బ్రహ్మన్క రిష్యతి జగత్పతేః | తస్య కదాచిదాసీనః సభాయాం సోమితద్యుతిః ||11

భార్యాభిర్వృష్ణివిద్వద్బిర్భూరిభిర్భూరిదక్షిణౖః | కురుభిర్దేవగంధర్వైరన్వితః కైటభార్ధనః || 12

ప్రవృత్తాసు పురాణాసు ధర్మ సంబంధినీషు చ | కథాసు భీమసేనేన పరిపృష్టః ప్రతాపవాన్‌ || 13

త్వయా పృష్టస్య ధర్మస్య వక్ష్యత్యస్య చ భేదదృక్‌ | భవితా స తదా బ్రహస్కర్తా చైవ వృకోదరః || 14

ఒకప్పుడా ద్వారకయందు కొలువుదీరి కూర్చుండి భార్యలతో వృష్టి వంశులగు పండితులతో దక్షిణలు సమృద్ధిగ నిచ్చుచు యజ్ఞములు జరుగుచు కురువంశ రాజులతో దేవ గంధర్వులతో కూడ కైటబారి (విష్ణువు) ధర్మసంబంధమయిన కథలు జరుగుచుండ భీమసేనునితో కొలువుదీరి నీవడిగిన ధర్మమునకు వేఱు దృష్టితో వివరణము సెప్పగలడు. అప్పుడు భీముడు కూడ యాయన నుడివిన ధర్మమును ఆచరణలో బెట్టును.14

ప్రవర్తకోస్య ధర్మస్య పాండుసూనుర్మహాబలః | యన్య తీక్షో వృకో నామ జఠరే హవ్య వాహనః || 15

సంభాష్యతే స ధర్మాత్మా తేన చాసౌ వృకోదరః | అతీవ స్వాదశీలశ్చ నాగాయుతబలో మహాన్‌ || 16

ధార్మికస్యాప్యశక్తస్య తీవ్రాగ్నిత్వాదుపోషణ | ఇదం వ్రతమశేషాణాం వ్రతానామధికం యతః || 17

కథయిష్యతి విశ్వాత్మా వాసుదేవో జగద్గురుః | అశేషయజ్ఞఫలదమశేషాఘవినాశనమ్‌ || 18

ఆశేషదుష్టశమనమ శేషసురపూజితం |

పవిత్రాణాం పవిత్రం యన్మంగలానాం చ మంగలమ్‌ | భవిష్యం చ భవిష్యాణాం పురాణానాం పురాతనమ్‌ || 19

ఈ ధర్మమునకు పాండవ కుమారుడు మహా బలుండగు బీముడు ప్రవర్తకుడగును. ఉదరమందు (జఠరమందు) వృకః=తీక్ష్న రూపుడైన యగ్ని గలవాడు గావున వృకోదరుడనబడును. అగ్నియు భీముడు యిద్దరు పరస్పరము మాట్లాడుకొందురు. భీముడు మితిమీరిన పదివేల యేనుగుల బలము గలవాడు. ధర్మనిష్ఠుడైనను నతడు తీవ్రాగ్ని సంపన్నుడు నుపవాసములు సేయలేడయ్యెను. అన్ని వ్రతముల కంటెనిదే యాతనికుత్తమవ్రతమయ్యెను. జగద్గురువు వాసుదేవుడు విశ్వరూపుడు కృష్ణుడు మాత్రమే యీ యతిభుక్తి అశేష యజ్ఞఫల మిచ్చునని, అశేష పాప నాశకమని, అశేష దుష్ట సంహారమని, పవిత్రములకెల్ల పవిత్రము, మంగళముల కెల్ల మంగళమని , కాబోవు వాని కన్నిటికి రాబోవునది అయిన వాటికన్నిటికినైన యుత్తమ ధర్మమని ద్వాపరము చివర పూర్ణావతారమూర్తి వాసుదేవుడై యీ మాట జెప్పగలడు. 19

వాసుదేవ ఉవాచ: యద్యష్టమీ చతుర్దశ్యోర్ద్వాదశీఘ చ భారత ||

అన్యేష్వపి దినర్షేషు న శక్తస్త్వముపోషితుమ్‌ 20

తతస్త్వగ్ర్యామిమాం భీమ తీర్దం పాపప్రణాశినీం | ఉపోష్య విధినానేన గచ్ఛ విష్ణోః పరం పదం || 21

మాఘమాసస్య దశమీ యదా శుక్లా భ##వేత్తదా | ఘృతేనాభ్యంజనం కృత్వా తిలైః స్నానం సమాచరేత్‌ || 22

తధైవ విష్ణుమభ్యర్చేన్నమో నారాయణాయ చ | కృష్ణాయ పాదౌ సంపూజ్య శిరః కృష్ణాత్మనేతి చ || 23

వైకుంఠాయేతి వైకంఠమురః శ్రీవత్సధారిణౌ | శంఖినే గదినే చైవ చక్రిణ వరదాయ వై || 24

సర్వం నారాయణసై#్వవం సంపూజ్యావాహనక్రమాత్‌ | దామోదరాయేత్యుదరం కటిం పంచజనాయ వై || 26

నమో దేవ్యై నమః శాంత్యై నమో లక్ష్మై నమః శ్రియై |

నమస్తుష్ట్యై నమః పుష్ట్యై ధృత్యై పుష్ట్యై నమో నమః 27

నమో విహంగనాధాయ వాయువేగాయ పక్షిణ | విషప్రమథనామేతి గరుడం చాభిపూజయేత్‌ || 28

వాసుదేవవుడనియె : అష్టమి, చతుర్ధశ ద్వాదశులందు వాటి యితర దినములందు నక్షత్రములందు నీవు ఉపవాసము సేయలేవేని భీమా ! పాప నాశని యిది. మాఘ శుక్ల దశమినాడు మాత్రము నుపవాసముండి విష్ణుపదమందుము. నేతితో తలంటుకొని తిలలతో స్నానము సేయవలెను. '' నమో నారాయణాయ'' అని విష్ణువు నర్చింప వలెను. కృష్ణాయ యని పాదము. కృష్టాత్మనే నమః అని శిరస్సు - వైకుంఠాయ యని కంఠమును - శ్రీవత్సధారిణ వక్షః స్థలము - శంభినే గదినే చక్రిణ వరదాయ అని శంఖ చక్ర గదాదులు నారాయణుని పూజించి అవాహనాది క్రమమున దామోదరాయ యని ఉదరమును పంచజనాయ అని కటిని (నడుముని) సౌభాగ్యనాధాయ యని ఊరువులు (తొడలు), భూతధారిణ అని మోకాళ్ళు, నమో నీలాయ యని పిక్కలు, విశ్వభుజేయని పాదములు నమో దేవ్యై నమః శాంత్యై నమో లక్ష్మ్యై నమః పుష్ట్యై నమో ధృత్త్యే నమో నమః నమో విహంగ నాధాయ నమః నమః వాయు వేగాయ పక్షిణ నమో విషప్రమధానాయ యని గరుడుని గూడ పూజింపవలెను. 28

ఏవం సంపూజ్య గోవిందముమాపతివినాయకౌ | గంధైర్మాల్యైస్తథా స్తథా ధూపైర్భక్ష్యైర్నానావిధైరపి || 29

గవ్యేన పయసా సిక్త్వా కృసరావథ పాయసం | సర్పిషా సహ భుక్త్వా తు గత్వా స్థానాంతరం పునః ||

నైయగ్రోధం దంతకాష్టమథవా ఖాదిరం బుధః | గృహీర్వా ధావయేద్దంతానాచాంతః ప్రాగుదజ్ముఖః || 31

బ్రూయాత్సాయంతనీం కృత్వా సంధ్యామస్తమితే రవౌ | నమో నారాయణాయేతి త్వామహం శరణం గతః || 32

ఏకాదశ్యాం నిరాహారః సమభ్యర్చ్య కేశవం | తాం రాత్రిం సకలాం స్థిత్వా శేషపర్వంకశాయినమ్‌ || 33

సర్పిషా విశ్వదహనం హత్వా బ్రాహ్మణపుంగవైః | సహైవ పుండరీకాక్షం ద్వాదశ్యాం క్షీరభోజనమ్‌ || 34

కరిష్యామి యథాత్మానం నిర్విఘ్నే నాస్తు తచ్చ మే | ఏవముక్త్వా స్వపేద్భూమావితిహాసకథాం పునః ||35

ఈలా గోవిందుని, ఉమాపతిని. వినాయకుని గంధ మాల్య ధూప దీపాదులతో భక్తితో బూజింపవలెను. ఆపు పాలతో కృసరము, పాయసము నేతితో గూడ భుజించి యటనుంచి మరొక చోటికి వెళ్లి ముద్దిపుల్లగాని బదిరగాని పూని దంతకాష్ఠముతో తూర్పుగా దంత ధావనము చేసికొనవలెను. సాయం సంధ్య వార్చి తూర్పుగానో ఉత్తరముగానో నిలిచి నమో నారాయణాయత్వాం శరణం గతః అని పలికి ఏకాదశినాడు ఉపవసించి కేశవుని బూజించి యా రాత్రి యంతయు శేషశాయి సన్నిధి నిలిచి బ్రాహ్మణోత్తములతో గూడి నేతితో విశ్వ దహనుని యందు హోమములు సేసి, ద్వాదశినాడు క్షీర భోజనము సేయుదును. అది నిర్విఘ్నమగు గాక యని రాత్రి వట్టి నేలపై ఇతిహాస కథాదులు విని పరుండవలెను. 35

శృత్వా ప్రభాతే సంజాతే నదీం గత్వా విశాం పతే | స్నానం కృత్వా ముదా తద్వత్పాషణ్డానభివర్జయేత్‌ || 36

ఉపాస్య సంధ్యాం విధివత్కృత్వా చ పితృతర్పణం | ప్రణమ్య చ హృషీకేశం శేషపర్యజ్కశాయినమ్‌ || 37

గృహస్య పురతో భక్త్యా మండపం కారయేద్భుధః | చతుర్హస్తాం శుభాం కుర్యాద్వేదీమరినిఘాదస || 38

చతుర్హస్తప్రమాణం తు విన్యసేత్తత్ర తోరణం | మధ్యే చ కలశం తత్ర మాషమాత్రేణ సంయుతమ్‌ || 39

ఛిద్రేణ జలసంపూర్ణమధః కృష్ణాజినే స్థితః | తస్య ధారాం చ శిరసా ధారయేత్సకలాం నిశామ్‌ || 40

ప్రభాతమందు (తెల్లవారగనే) నదికేగి స్నానము సేసి సంధ్యవార్చి యథావిధి పితృ తర్పణము సేసి శేషతల్ప శాయిని విష్ణువు నుపాసించి యింటి వాకిట భక్తి మండపము నేర్పరచవలెను. నాల్గు మూరల మేర వేదిక యేర్పరచి యట తోరణ మేర్పరచి మధ్య మినుములతోడి మినుపగింజంత ఛిద్రము గల కలశమునందు నీరు నింపి నిలుపవలెను. అటు క్రింద కృష్ణాజినముపై కూర్చుండి యా రంధ్రము ద్వారా ధారను తనపై నభిషేకించుకొనవలెను.

ధారాభిర్భూరిభిర్భూరి ఫలం వేదవిదో విదుః | యస్మాత్తస్మత్కురుశ్రేష్ట కారయేత్ప్రయతో ద్విజః || 41

సమృద్ధియైన జలధారలకు ఫల సమృద్ధి గలుగునని వేదవేత్తలెఱుగుదురు. కావున కురుశ్రేష్ఠ! యీలా కలశధారల నభిషేకము సేసికొనవలెను.

దక్షిణ చార్థచంద్రం తు పశ్చిమే వర్తులం తథా | అశ్వత్థపత్రాకారం చ ఉత్తరేణ తు కారయేత్‌ || 42

మధ్యే తు పద్మాకారం చ కారయేద్వైష్ణవో ద్విజః | పూర్వతో వేదికాం స్థోనస్థో యామ్యేన చ కల్పయేత్‌ || 43

పానీయధారాం శివసి ధారయేద్విష్ణుతత్పరః | ద్వితీయా వేదీ దేవస్య తత్ర పద్మం సకర్ణికమ్‌ || 44

తస్య మధ్యే స్థితం దేవం కుర్యాద్వై పురుషోత్తమమ్‌ | హస్తమాత్రం చ తత్కుండం కృత్వా తత్ర త్రిమేఖలమ్‌ || 45

దక్షిణమున అర్ధ చంద్రాకారమున, పశ్చిమమున వర్తులాకారములో, ఉత్తరమున రావి ఆకు ఆకారములో , వేదికను చేయవలెను. విష్ణు భక్తుడగు ద్విజుడు మధ్య పద్మాకారమున చేయవలెను. కోణమునగానీ, దక్షిణాన గానీ చేయరాదు. విష్ణుతత్పరుడై ఆ నీటి ధారను తలపై ధరించవలెను. రెండవ వేదిక దేవునకై ఏర్పరచి, దాని మధ్య పద్మమున పురుషోత్తముని నిలుపవలెను. కుండమును ఒక చేతి లోతున చేసి దానికి మూడు వలయాలు నేర్చరచవలెను.

యోనివక్త్రం తతస్తస్మిన్ర్బాహ్మణౖర్యవసర్పిషీ | తిలాంశ్చ విష్ణుదేవతైర్మంత్రైరేవానలే హునేత్‌ || 46

కృత్వా తు వైష్ణవం సమ్యగ్యాగం తత్ర ప్రకల్పయేత్‌ | ఆజ్యధారామధ్యమే తు కుండే దద్యాత్తు యత్నతః || 47

క్షీరధారాం దేవదేవే వారిధారాత్మనోపరి | నిష్పావార్థి ప్రమాణం వై ధారామాజ్యస్య పాలయేత్‌ || 48

స్వేచ్ఛయా క్షీర జలయోరవిచ్ఛిన్నాం చ శర్వరీం | జలకుంభాన్మహావీర్య స్థాపయిత్యా త్రయోదశ || 49

భ##క్ష్యైర్నానావిధైర్యుక్తాన్సితవసై#్త్రరలంకృతాన్‌ | ప్రతానౌదుంబరైఃపాత్రైః పంచరత్నసమన్వితైః || 50

చతుర్భిర్బహ్యృచైర్హేమః కార్యస్తత్ర ఉదజ్ఞ్ముఖైః | రుద్రజాప్యశ్చతుర్భిశ్చ యజుర్వేదపరాయణౖః || 51

వైష్ణవాని చ సామాని చదుర్భిః సామవేదిభిః | ఏవం ద్వాదశ వైవిప్రాన్వస్త్ర మాల్యానులేపనైః || 52

పూజయేదంగులీయైశ్చ కటకైర్హేమసూత్రకైః | వాసోభిః శయనీయైశ్చ విత్తశాఠ్యవివర్జితః || 53

దాని ముఖము యోనిద్వారమువలె నుండునట్లు చేసి బ్రాహ్మణులతో యవలు, నేయి, నువ్వులు విష్ణుదేవతకొరకు మంత్రములతో అగ్నిలో వ్రేల్చవలెను. వైష్ణవయాగమును చక్కగా చేయవలెను. కుండముయందు నేతిధారను, పాలధారను, నీటిధారను అర్పించవలెను. నిష్పావమున సగముండునట్లు నేతిని ధారగాపోయవలెను - (నిష్పావమనగా ధాన్యమును తూర్పు బట్టుట) స్పేచ్ఛగా పాలధార, నీటిధార అవిచ్ఛిన్నముగా పడునట్లు పదమూడుసార్లు జలకుంభముతో వేయవలెను. భక్ష్యభోజ్యములనిచ్చి శుద్దవస్త్రముల ధరించిన విప్రుల పూజించవలెను. ఐదురత్నములతో గూడిన రాగిపాత్రలతో, ఉత్తరముఖముచేసిన నలుగురు బహ్వృచులతో హోమమును చేయవలెను. యజుర్వేదపరాయణులచేతను రుద్రజాప్యము, నలుగురు సామవేద బ్రాహ్మణుల చేత విష్ణుసంబంధి సామములను చదివింపజేయవలెను. ఇట్లు పన్నెండుగురు బ్రాహ్మణులను వస్త్రమాల్యాదులేపనాల చేత, బంగారుదారములుగల అంగుళీయకాలచేత, శయ్యావస్త్రాలచేత, విత్తశాఠ్యమును విడిచి పూజించవలెను. 53

ఏవం క్షపాతివాహ్యా వై గీతమఞ్జలనిఃస్వనైః ఉపాధ్యాయస్య చ పునర్ధ్విగుణం సర్వమేవ తు || 54

తతః ప్రభాతే విమలే సముత్థాయ త్రయోదశ | గావో దేయాః కురుశ్రేష్ట సౌవర్ణశృంగసంవృతాః || 55

పయస్విన్యః శీలవత్యః కాంస్యదోహసమన్వితాః | రౌప్యఖురాః సవత్సాశ్చ చందనేనాభిభూషితాః || 56

తాస్తు తేషాం తతో దత్వా భక్ష్యభోజ్యేన తర్పితాన్‌ | కృత్వా వై భ్రాహ్మణాన్సర్వాన్‌ ఛత్రైర్నానావిధైస్తథా || 57

ఈ విధంగానే గీతమంగళధ్వనులచేత రాత్రిని గడిపి ఉపాధ్యాయునికి ద్విగుణముగా ఇదంతా ఇచ్చి పూజించవలెను. అటుపై ప్రొద్ధుననేలేచి బంగారు కొమ్ముతొడుగులతో పదమూడు ఆవులను, పాలనిచ్చువానిని, పాలుపితుకు కంచుపాత్రతో సహా ఇవ్వవలెను. ఆ ఆవుల గిట్టలకు వెండితొడుగులుండవలెను. వానికి గంధమునలిమి, దూడలతో దానమివ్వవలెను. ఆటుపై బ్రాహ్మణులకు భక్ష్యభోజ్యములనిచ్చి, నానావిధఛత్రములతో తృప్తిని కలిగించవలెను. 57

భుక్త్వా చాక్షారలవణమాత్మనా చ విసక్జయేత్‌ | అనుగమ్య పదాన్యష్టౌ పుత్రభార్యాసమన్వితః || 58

ప్రీయతామత్ర దేవేశః కేశవః క్లేశనాశనః | ఏవం గుర్వాజ్ఞయా కుంభాన్‌ గాశ్చైవ శ్యానాని చ || 59

వాసాంసి చైవ సర్వేషాం గృహాని ప్రాపయేద్బుధః | అభావే బహుశయ్యానామేకామపి సుసంస్కృతామ్‌ || 60

శయ్యాం దద్యద్గృహి భీమ సర్వోస్కరసంయుతాం | ఇతిహాసపురాణాని వాచయిత్వాతివాహయేత్‌ || 61

తద్ధినం కురుశార్ధూల ఇచ్ఛేద్విపులాం శ్రియం | తస్మాత్త్వం సత్త్వమాలంబ్య భీమసేన విమత్సరః || 62

కురు వ్రతమిదం సమ్యక్‌ స్నేహాద్గుహ్యం మయోదితః | త్వయా కృతమిదం వీర త్వన్నామ్నా చ భవిష్యతి || 63

పులుపు, ఉప్పులేని భోజనమును స్వీకరించి పుత్రభార్యసహితుడై ఎనిమిది అడుగులు వెంటనడవవలెను. ''క్లేశముల నశింపజేయు కేశవుడు ప్రీతిజెందు గాత''యని గురువు ఆజ్ఞతో కడవలను, గోవులను, శయ్యలను వస్త్రములను వారి వారి ఇళ్ళకు చేర్చవలెను. ఎక్కువ శయ్యలు దొరకనిచో, అన్ని ఉపస్కరములు గలిగి చక్కగా నున్న ఒక శయ్యనైనా దానమివ్వవలెను. కురుశ్రేష్ఠా! విపులకీర్తని కోరినవాడు దినమంతా ఇతిహాస పురాణములను వినుచూ, వినిపింపజేయుచూ గడపవలెను. కనుక ఓ భీమా ! నీవు మాత్సర్యమును విడిచి సత్త్వమునుపొంది స్నేహమువల్ల నేజెప్పిన ఈ రహస్యవ్రతమునాచరింపుము. నీచే చేయబడు ఈ వ్రతము నీ పేరనే ప్రసిద్దమగును. 63

సా భీమద్వాదశీ హ్యేషా సర్వపాపహరా శుభా | యా తు కల్యాణినీ నామ పురా కల్పేషు పఠ్యతే || 64

త్వం చాదికర్తా భవ సౌకరేస్మిన్కల్పే మహావీరవరప్రధాన | యస్యాః స్మృతేః కీర్తనతోప్యశేషం పాపం ప్రణష్టం త్రిదశాధిపస్య || 65

దృష్ట్వా చ తామస్పరసామభీష్టాం వేశ్యకృతామన్యభవాంతరేషు | జాతాథ సా వైశ్యకులోద్భవాపి పులోమకన్యా పురుహూతపత్నీ || 66

తత్రాపి తస్యాః పరిచారికేయం మమ ప్రియా సంప్రతి సత్యభామా | కృతం పురా మంగలమేతదేవ ద్విజాత్మజా వేదవతీ బభూవ | 67

అట్టి ఈ భీమద్వాదశివ్రతము పాపములన్నింటిని హరించునది. శుభమగునది కళ్యాణిని అను పేర వాసికెక్కినది. ఈ వరాహకల్పమున మొదటగా చేయువాడవు నీవే గమ్ము. ఈ వ్రతస్మరణము, కీర్తనముచేత ఇంద్రుని పాపమంతా నశించెను. అటుపై అప్సరసలలో శ్రేష్ఠురాలగుదానిని, ఇతర జన్మలలో వేశ్యగా చేయబడినదానిని చూచి, వైశ్యకులమున బుట్టినదైననూపురుహూతపత్నియగు పులోమజ జన్మించెను. ఇప్పుడు నా ప్రియురాలగు సత్యభామ ఆ పులోమజకు పరిచారిక. పూర్వము మంగళము జరిగెను. ఇట్టి బ్రాహ్మణ పుత్రి వేదవతియాయెను. 67

అస్యాం చ కల్యాణతిథౌ వివస్వాన్‌ సహస్రధారేణ సహస్రరశ్మిః |

స్నాతః పురా మండలమేత్య తద్వత్తేజోమయం ఖేటపతిర్బభూవ || 68

ఈ కల్యాణితిథియందే ఈ మండలమునకు వచ్చి సహస్రధారలతో స్నానముచేసి తేజమయుడగు ఖేటపతియాయెను. 68

ఇదమేవ కృతం మహేంద్రముఖ్యైర్బహుభిర్దేవసురారి కోటిభిశ్చ |

ఫలమస్యేహ న శక్యతే హి వక్తుం యది జిహ్వాయుతకోటయో ముఖే స్యుః ||69

దేవేంద్రుడు మొదలైన దేవతలు, అసురులు దీనినే ఆచరించారు. ముఖమున కోట్లకొలది వాలుకలున్న నూ ఫలమును చెప్పుటకు శక్యముకాదు. 69

కలికలుషవిదారిణీమనంతామపి కథయిష్యతి యాదవేంద్రసూనుః |

అథ నరకగతాన్‌ పితౄనథైషాహ్యలముద్ధర్తు మిహైవ యఃకరోతి || 70

ఇదమనఘ శృణోతి వక్తి భక్త్యా పరిపఠతీహ పరోపకారహేతోః |

ఇహ పంకజనాభ భక్తి మాన్భవేదథ శక్రస్య స పూజ్యతాముపైతి || 71

యాదవేంద్రసుతుడు కలిదోషముల హరించు దీనిని చెప్పును. ఈ లోకమున ఈ వ్రతమునాచరించువాని పితృదేవతలను నరకమునుండి ఉద్ధరించుటకు ఇది సమర్ధమైనది. పరోపకారమునకై దీనిని వినువాడు, చెప్పువాడు, భక్తితో చదువువాడు విష్ణుభక్తుడై ఇంద్రునికి కూడా పూజ్యుడగును.

కల్యాణినీ నామపురా విసర్గే యా ద్వాదశీ మాఘసితేభిపూజ్యా |

సా పాండుపుత్రేణ కృతా భవిష్యత్యనంతపుణ్యా నగభీమపూర్వా || 72

మాఘశుద్ధ ద్వాదశి పూర్వము కల్యాణినీ యని వాసికెక్కినది. ఇది అనఘభీమద్వాదశి యని అనంత పుణ్యమునిచ్చునదియై పాండుపుత్రునిచే చేయబడును.

బ్రహ్మోవాచ :- వర్ణాశ్రమాణాం ప్రభవః పురాణషు మయా శృతః ||

సదాచారశ్చ భగవాన్ధర్మశాస్త్రాంగవిస్తరైః || 73

పణ్యస్త్రీణాం సమాచారం శ్రోతుమిచ్ఛామి తత్వతః |

ఈశ్వర ఉవాచ :- తస్మిన్నేవ పురేబ్రహ్మన్సహస్రాణి తు షోడశ || 74

వాసుదేవస్య నారీణాం భవిష్యంత్యంబుజోద్భవ | తాభిర్వసంతసమయే కోకిలాలికులాకులే || 75

పుష్పితోపవనే పుల్లకల్హార సరస్తటే | నిర్భరం సహ పత్నీభిః ప్రశస్తాభిరలంకృతః || 76

రమయిష్యతి విశ్వాత్మా కృష్ణో యదుకులోద్వహః | కురంగనయనః శ్రీమాన్మాలతీకృతశేఖరః || 77

బ్రహ్మ పలికెను :- భగవాన్‌! పురాణములందు వర్ణాశ్రమముయొక్క ఉద్భవమును, ధర్మశాస్త్రాంగవిస్తరముతో సదాచారమును వింటిని. ఇక పుణ్యస్త్రీల సమాచారమును వాస్తవముగా తెలుసుకొనగోరుచున్నాను'' అన ఈశ్వరుడనెను. బ్రహ్మదేవా ! అదే పురములో వాసుదేవుని స్త్రీలు పదహారువేలమంది జన్మించగలరు. వసంత సమయములో కోకిలలు, తుమ్మెదలు, గుంపుగానుండ, పుష్పములతో నిండిన ఉపవనములో, వికసించిన కల్హారములుగల సరస్సుతీరమున యదుకులములో జన్మించిన విశ్వాత్ముడగు శ్రీకృష్ణుడు స్వేచ్ఛగా పత్నులతో అలంకరింపబడి ఆనందించును. 77

గచ్ఛన్సమీపమార్గేణ సాంబో జాంబవతీసుతః | సాక్షాత్కందర్పరూపేణ సర్వాభరణభూషితః || 78

అనంగశరతప్తాభిః సాభిలాషమవేక్షితః | ప్రబుద్ధో మన్మథస్తాసాం భవిష్యతి యదాత్మని || 79

తదవేక్ష్య జగన్నాథ స్సర్వజ్ఞో ధ్యానచక్షుషా | స్వయం ప్రభుర్వక్ష్యతి తా వో హరిష్యంతి దస్యవః || 80

సమీపమార్గమున వెళ్ళుచున్న సాంబుడను పేరుగలవాడు, జాంబవతీ పుత్రుడు అన్ని ఆభరణములచే నలంకరింప బడి సాక్షాత్తు మన్మథుడిగా నుండెను అంత, మన్మథబాణములచే తపించిన ఆ సుందర స్త్రీలు అతనిని కోరికతో చూచిరి. మన్మథుడు వారి మనస్సులో ప్రబుద్ధుడగుటజూచి సర్వజ్ఞుడగు జనార్ధనుడు ధ్యానచక్షువుతో తెలసి, దస్యులు మిమ్ము హరింతురని అనును.

ఆపరోక్షం యతస్త్వేవం స్నిగ్ధమేతద్విచింతితం | తతః ప్రసాదితో దేవ ఇదం వక్ష్యతి శార్జభృత్‌ || 81

తాభిః శాపాభితప్తాభిర్భగవాన్భూతభావనః | ఉత్తరాశ్రితదాశానాముద్ధర్తా బ్రాహ్మణప్రియః || 82

ఉపదేక్ష్యత్యనంతాత్మా భావికల్యాణకారకం | భవతీనామృషిర్దాల్భ్యో యద్ర్వతం కథయిష్యతి || 83

ఇత్యుక్త్వా తాః పరిత్యజ్య గతోంతర్థానమీశ్వరః | తతః కాలేన మహతా భారావతరణ కృతే || 84

నివృత్తే మౌసలే తద్వత్కేశ##వే దివమాగతే | శూన్యే యదుకులే సర్వే చోరైరపి జితేర్జునే || 85

హృతాసు కృష్ణపత్నీషు దాశభోగ్యాసు చార్బుదౌ | తిష్టంతీషు చ దౌర్గత్యసంతప్తాసు చతుర్ముఖ || 86

ఆగమిష్యతి యోగాత్మా దాల్భ్యో నామ మహాతపాః | తాస్తమర్ఘ్యేణ సంపూజ్య ప్రణిపత్య పునః పునః || 87

లాలప్యమానా బహుశో బాష్పపర్యాకులేక్షణాః | స్మరంత్యో వివిధాన్భోగాన్‌ దివ్యమాల్యానులేపనాన్‌ || 88

భర్తారం జగతామీశమనంతమపరాజితం | దివ్వానుభావాం చ పురీం నానారత్నమృహాణి చ || 89

ద్వారకావాసినః సర్వాన్దేవరూపాస్కుమారకాన్‌ | ప్రశ్నమేతం కరిష్యంతి మునేరభిముఖం స్థితాః || 90

ఆపరోక్షము కనుక దీర్ఘముగా ఆలోచించి జనార్దనుని ప్రసన్నుని చేసుకొనగా ఇట్లనును. శాపముచే తపించుచున్న వారు ప్రార్థించగా భవిష్యత్తులో శుభమును కలుగజేయుదానిని ఉపదేశించును. మీకు దాల్భ్యఋషి ఏవ్రతమునుపదేశించునో అదే కల్యాణకారకము.'' అని పలికి వారిని విడిచి ఈశ్వరుడంతర్ధానమందెను. చాలాకాలము గడిచిన పిదప భారమునవతరించుట (రాక్షసవథ) జరిగి, మౌసలము జరిగిన తరువాత, శ్రీకృష్ణుడు స్వర్గమును చేరగా, యదుకులము శూన్యమయి, దొంగలు అర్జునుని పరాజితుని చేసిన వేలకొలదిగా దాశభోగ్యులగు కృష్ణపత్నులు హరింపబడి, దుర్గతికి వగచుచూనుండ, యోగాత్ముడగు దాల్భ్యుడను గొప్ప తపస్సంపన్నుడు రాగలడు. అపుడు వారు అర్ఘ్యముతో పూజించి మరల మరల నమస్కరించి, కన్నీళ్ళతో మిగుల వగచెదరు. అనుభవించిన వివిధభోగములను, శ్రీకృష్ణుని, నగరములను, గొప్ప భవనములను, ద్వారకావాసులను బాలురను స్మరించుచూ మిగుల దుఃఖమునొంది మునియెదుట నిలిచి ఇట్లు ప్రశ్నించెదరు. 90

దస్యుభిర్భగవన్సర్వాః వరిభుక్తా పయం బలాత్‌ | స్వధర్మశ్చ్యావితోస్మాకమస్మిన్నః శరణం భవాన్‌ || 91

ఆదిష్టోసి పురా బ్రహ్మన్‌ కేశ##వేన చ ధీమతా | కస్మాదీశేన సంయోగం ప్రాప్య వేశ్యాత్వమాగతాః || 92

వేశ్యానామపి యో ధర్మస్తంనో బ్రూహి తపోధన | కథయిష్యే వదత్తాసాం యద్దాల్భ్యశ్చైకితాయనః || 93

'భగవాన్‌ ! దస్యులు మమ్ములనందరిని బలవంతముగా ననుభవించిరి. మా స్వధర్మమును చేజార్చుకొనిన మాకు మీరే శరణము. విజ్ఞుడగు కేశవునిచే నీవాదేశింపబడితివి. ఈశ్వరుని సంయోగము పొందియూ మేము వేశ్యలమెట్లయితిమి. వేశ్యలకు కూడా నిలిచిన ధర్మమును మాకు తెలుపుము, అనిన దాల్భ్యుడు ఇట్లు చెప్పెను. 93

దాల్భ్య ఉవాచ :- జలక్రీడావిహారేషు పురా సరసి మానసే | భవతీనాం సగర్వాణాం నారదోభ్యాశమాగతః || 94

హుతాశనసుతాః సర్వా భవత్యోప్సరసః పురా | అప్రణమ్యావలేపేన పరిపృప్టః స యోగవిత్‌ః || 95

తథా నారాయణోస్మాకం భర్తా స్యాదిత్యుపాదిశత్‌ | తస్మాద్వరప్రదానం చ శాపశ్చాయమభూత్పురా || 96

దాల్భ్యుడు చెప్పెను :- పూర్వము మానస సరస్సున మీరు జలక్రీడావిహారములో గర్వించియుండగా అతిథిగా నారదుడక్కడికి వచ్చెను. అపుడు అగ్ని పుత్రికలు, అప్సరసలగు మీరు యేగవేత్తయగు నారదునికి నమస్కరించకనే, అవమానించుచూ ఇట్లడిగిరి. '' నారాయణుడు మాకు భర్త యెట్లగునో ఉపదేశింపుము '' అట్టి వరప్రదానము శాపముగాకూడా ఆయెను. 96

శయ్యాద్వయప్రదానేన మధుమాధవమాసయోః | సువర్ణోపస్కరోత్సంగద్వాదశ్యాం శుక్లపక్షతః || 97

భర్తా నారాయాణో నూనం భవిష్యత్యన్యజన్మని | యదకృత్వా ప్రణామం మే రూపసౌభాగ్యమత్సరాత్‌ || 98

పరిపృష్టోస్మి తేనాశు వియోగో వో భవిష్యతి | చోరైరపహృతాః సర్వా వేశ్యాత్వం సమవాప్స్యథ || 99

అపుడు నారదుడు వారితో చైత్రవైశాఖమాసములలో శుక్ల పక్షద్వాదశినాడు బంగారముతో కూడిన శయ్యలను రెంటిని దానమిచ్చినచో వేరేజన్మలో మీకు నారాయణుడు భర్తకాగలడు. కానీ, నాకు ప్రణామము జేయక రూపసౌభాగ్యమత్సరముతో మీరడిగినారు కావున త్వరలో మీకు వియోగము కలుగును. చోరులచే ఎత్తుకొనిపోబడి మీరు వేశ్యలయ్యెదరు. 99

ఏవం నారదశాపేన కేశవస్య శాపతః | వేశ్యాత్వమాగతాః సర్వా భవత్యః కామమోహితాః || 100

ఇదానీమపి యద్వక్ష్యే తచ్ర్ఛుణుధ్వం వరాంగనాః | పురా దైవాసురే యుద్ధే హతేషు శతశః సురైః || 101

దానవాసురదైత్యేషు రాక్షసేషు తతస్తతః | తేషాం దారసహస్రాణి శతశోథ సహస్రశః || 102

పరిణీతాని యాని స్యుర్బలాద్భుక్తాని యాని వై | తాని సర్వాణి దేవేశః ప్రోవాచ వదతాం వరః || 103

వేశ్యాధర్మేణ వర్తధ్వమధునా నృపమందిరే | భక్తిమత్యో వరారోహస్త ధా దేవకులేషు చ || 104

రాజతః స్వామినశ్చాపీ జీవికాం చ ప్రలస్స్యధ | భవిష్యతి చ సౌభాగ్యం సర్వాసామపి శక్తితః || 105

యః కశ్చిచ్ఛుల్కమాదాయ గృహమేష్యతి వః సదా | నిశ్ఛద్మనైవోపచర్యః ప్రీతిభావైరదాంభికైః || 106

ఈ విధంగా నారదుని, విష్ణుదేవుని శాపముచేత కామమోహితులైన మీరంతా వేశ్యలయితిరి. ఇక నేనిపుడు చెప్పబోవుదానిని వినుడు. పూర్వము దైవాసురయుద్ధములో వందలకొలదిగా దానవులు, అసురులు, దేవతలచేత చావగా దానవులు, అసురులు వివాహమాడిన ఎత్తుకొనివచ్చిన స్త్రీలను దేవేంద్రుడిట్లనెను. ' మీరు రాజకులములో, దేవ కులములో భక్తి కలిగి వేశ్యాధర్మముతో చరించుడు. రాజునుండి లేదా ప్రభువునుండి మీమీ జీవికను పొందుడు. మీశక్తికొద్ది అందరికీ సౌభాగ్యమగును. శుల్కమునిచ్చి మీ గృహాలకు వచ్చువారిని మీరెల్లప్పుడూ కపటము లేకుండా ప్రీతితో సేవించవలెను. 106

దేవతానాం పితౄణాం చ పుణ్యహ్ని సముపస్థితే | గోభూహిరణ్యధాన్యాని ప్రదేయాని శ శక్తితః || 107

యద్వ్రతం చోపదేక్ష్యామి తత్కురుధ్వం చ సర్వశః | సంసారోత్తరణాయాల మేతద్వేదవిదో విదుః || 108

యదా సూర్యదినే హస్తః వుణ్యో వాధ పునర్వసుః | భ##వేత్సర్వౌషధిస్నానం సమ్యక్‌ నారీ సమాచరేత్‌ || 109

తదా పంచశరాత్మా తు హరిస్సన్నిధిమేష్యతి | అర్చయేత్పుం డరీకాక్షమనంగస్యానుకీర్తనైః || 110

కామాయ పాదౌ సంపూజ్య జంఘే వే మోహకారిణ | మేఢ్రం కందర్పనిధయే కటిం ప్రీతిమతే నమః || 111

నాభిః సౌఖ్యసముద్రాయ వామనాయ తథోదరం | హృదయం హృదయేశాయ స్తనావాహ్లాద కారిణ || 112

ఉత్కంఠాయేతి వై కంఠమాస్యమానందకారిణ | వామం సంపుష్పచాపాయ పుష్పబాణాయ దక్షిణమ్‌ || 113

మనసాయేతి వై మాలిం విలోలాయెతి మూర్ధజం | సర్వాత్ననే శిరస్తద్వద్దేవదేవస్య పూజయేత్‌ || 114

నమః శివాయ శాంతాయ పాశాంకుశధరాయ చ | గదినే పీతవస్త్రాయ శంఖచక్రధరాయ చ || 115

నమో నారాయణాయేతి కామదేవాత్మనే నమః | నమః శాంత్యై నమః ప్రీత్యై నమో రత్యై నమః శ్రియై || 116

నమః పుష్ట్యై నమః తుష్ట్యై నమః సర్వార్ధసంపదే | ఏవం సంపూజ్య గోవిందమనంగాత్మక మీశ్వరమ్‌ || 117

గంధమాల్యైస్తథా ధూపైర్నైవేద్యేన చ భామినీ | తత అహూయ ధర్మజ్ఞం బ్రహ్మాణం వేదపారగమ్‌ || 118

అవ్యంగమథ సంపూజ్య గంధపుష్పార్చనాదిభిః శాలేయతండులప్రస్థం ఘృతపాత్రేణ సంయుతమ్‌ || 119

తసై#్మ విప్రాయ వై దద్యాన్మాధవః ప్రీయతామితి | యధేష్టాహారసంభుక్త మేనం ద్విజమనుత్తమమ్‌ || 120

రత్యర్థం కామదేవోయమితి చిత్తే చ ధారయేత్‌ | యద్యదిచ్ఛతి విపేంద్రస్తత్తత్కుర్యాద్విలాసినీ || 121

దేవతల లేదా రాజుల పుణ్యదినము వచ్చిన గో, భూ, హిరణ్య ధాన్యముల యథాశక్తి దానమివ్వవలెను. నేను ఉపదేశించు వ్రతమునాచరింపుము. సంసారమును దాటుటకిదిచాలని వేదవిదులందురు. ఆదివారము, హస్త, పుష్యమి, పునర్వసు నక్షత్రాలలో ఏదైనావచ్చినపుడు నారి అన్ని ఔషధులతో స్నానము చక్కగా చేసిన హరిసన్నిధిని చేరు. మన్మథుని నామకీర్తనముతో పుండరీకాక్షుని పూజింపవలెను. (మంత్రములు నామమలు 117వ శ్లోకము వరకున్నవి ) మన్మథరూపమున నున్న గోవిందుని గంధమాల్యములతో, ధూపముతో, నైవేద్యముతో పూజింపవలెను. అటుపై ధర్మజ్ఞుడు, వేదవేత్తయగు బ్రాహ్మణుని ఆహ్వానించి గంధ పుష్పాదులతో పూజించవలెను. ''మాధవః ప్రీయతామ్‌'' అని ఘృతప్రాతముతో బియ్యము నతనికి దానమివ్వవలెను. అతనికి ఇష్టమగు ఆహారమును సమర్పించి రతికొరకితను కామదేవుడేయని మనసులో భావించవలెను. అతనికిష్టమైనదానిని ఆ స్త్రీ ఆచరించవలెను. 121

సర్వభావేన చాత్మానమర్పయే త్స్మితభాషిణీ | ఏవమాదిత్యవారేణ సర్వమేతత్సమాచరేత్‌ || 122

తండులప్రస్థదానం చ యావన్మాసాస్త్రయోదశ | తతస్త్రయోదశే మాసి సంప్రాప్తే చాస్య భామినీ || 123

విప్రస్యోఏస్కరైర్యుక్తాం శయ్యాం దద్యాద్విచక్షణా | సోపధానాం సవిన్యాసాం స్వాస్తరావరణాం శుభామ్‌ || 124

దీపికోపానమాఛ్చత్ర పాదుకాసన సంయుతాం | సపత్నీకమలంకృత్య హేమసూత్రాంగులీయకైః || 125

సూక్ష్మ వసై#్త్రః సకటకైర్ధూపమాల్యానులేపనైః | కామదేవం సపత్నీకం గుడకుంభోపరిస్థితమ్‌ || 126

తామ్రపాత్రాసనగతంహేమనేత్రపటావృతం | సుకాంస్యభాజనోపేతమిక్షుదండసమన్వితమ్‌ || 127

నవ్వుచూ భాషించుచున్న ఆ స్త్రీ సర్వభావముల తనను అర్పించుకొనవలెను. ఇట్లు ఆదిత్యవారమున దీనినంతయూ చక్కగా నాచరించవలెను. పదమూడు నెలలు బియ్యము దానమిచ్చి పదమూడోనెలరాగా ఆ స్త్రీ బ్రాహ్మణునికి అన్ని సౌకర్యములతో నున్న శయ్యను దానమివ్వవలెను. ఆశయ్య తలగడ, వస్త్రములు మొదలగు వానితో నుండవలెను. దీపము, పాదుకలు, గొడుగు: ఆసనము మొదలగునవి యుండవలెను. బ్రాహ్మణుని ఆతని భార్యతో సహా బంగారు ఆభరణములతో నలంకరించి అతనికి దానమివ్వవలెను. రతీదేవితో కామదేవుని గుడకుంథమును కలిగివుండునట్లు చేయవలెను. 127

దద్యాదనేన మంత్రేణ తథైకాంగాం పయస్వినీం | యథాంతరం న పశ్యామి కామకేశవయోః సదా || 128

తథైవ సర్వకామాప్తి రస్తు విప్ర సదా మమ | తథా చ కాంచనం దేవం ప్రతిగృహ్య ద్విజోత్తమః || 129

కోదాత్కామోదాదితి వైదికం మంత్రముదీరయేత్‌ | తతః ప్రదక్షిణీకృత్య విసృజ్య ద్విజపుంగవమ్‌ || 130

శాఠ్యాసనాదికం సర్వం బ్రాహ్మణస్య గృహం నయేత్‌ | తతః ప్రభృతి యోన్యోపి రత్యర్ధం గేహమాగతః || 131

సమ్మాన్య సూర్యవారేణ స సంపూజ్యో భ##వేత్సదా| ఏవం త్రయోదశం యావన్మాసమేకం ద్విజోత్తమమ్‌ || 132

తర్పయిత్వా యథాకామం ప్రేషయేచ్చైవ మందిరం | తదనుజ్ఞయా రూపవంతం యావదస్యాగమో భ##వేత్‌ || 133

ఆత్మనోపి యదా విఘ్నం గర్భసూతకరాజకం | దైవం వా మానుషం వా స్యాదుపరాగేణ వా తతః || 134

సా వారా నష్టపంచాశద్యథాశక్తి సమర్పయేత్‌ | ఏతద్ది కథితం సమ్యగ్భవతీనాం విశేషతః || 135

పాలిచ్చుధేనువును మంత్రముతో దానమివ్వవలెను. కామధేవునికి, విష్ణువుకు మధ్య భేదమును చూడను-ఓ విప్రనాకు ఎల్లప్పుడూ ఇష్టసిద్దియగుగాక! అనగా బ్రాహ్మణోత్తముడు ఆ బంగారు దేవప్రతిమను దానము గొనవలెను. ''కోదాత్కామోదాత్‌ '' అను వైదిక మంత్రమును చదువవలెను. అటుపై బ్రాహ్మణునికి ప్రదక్షిణముచేసి వీడ్కోలు పలుకవలెను. శయ్య, ఆసనము మొదలగువానిని బ్రాహ్మణుని ఇంటికి పంపవలెను. అటుపై రతి కోరికతో ఇంటికి వచ్చినవాడెల్లా గౌరవింపదగినవాడు అగును. ఇట్లు పదమూడుమాసాలు బ్రాహ్మణుని తృప్తిపరచి మందిరమునకు పంపవలెను. తనకునూ గర్భసూత, రాజకము వంటి విఘ్నములు దేవవశాత్తుగానీ, మనుష్యప్రేరణచేగానీ, గ్రహణమువలన గానీ జరిగినచో యథాశక్తి సమర్పించవలెను. ఇది మీకు తెలిపితిని. 135

స్వధర్మోయం యతో భావ్యో వేశ్యానామిహ సర్వదా | శయ్యా యా త్యజ్యతే దేవ న కదాచిద్యథా భవాన్‌ || 136

శయ్యా మమాప్య శూన్యేయం తథాస్తు మధుసూదన | గీతవాదిత్రనిర్ఘోషం దేవదేవస్య కారయేత్‌ || 137

ఏతద్వః కథితం సర్వం వేశ్యాధర్మమశేషతః | పురహూతేన యత్ర్పోక్తం దానవీషు పురా మయా || 138

తదిదంసాంప్రతం సర్వం భవతీష్వపి యుజ్యతే| సర్వపాపప్రశమనమనంతఫలదాయకమ్‌ || 139

కల్యాణినీనాం కథితం తదేతద్ధుశ్చరం వ్రతం | కరోతి యా శేషముదగ్నమేత్కల్యాణినీ మాధవలోకసంస్థా ||140

సా పూజితా దేవగణౖరశేషైరానందకృత్థ్సానముపైతి విష్ణోః | తపోధనః సోప్యభిదాయ చైతదనంగదాన వ్రతమంగనానామ్‌ || 141

స్వస్థానమేష్యంతి సమస్తమిత్థం వ్రతం కరిష్యంతి చ దేవయోనే ||

ఇతి శ్రీ పద్మపురాణ ప్రథమే సృష్టిఖండే వేశ్యావ్రతకథనం నామ త్రయోవింశోధ్యాయః

వేశ్యలకిది స్వధర్మము. 'దేవా! నీవలెనే మేము శయ్యను విడువము. నాశయ్య శూన్యమవకుండునట్లు చూడుము' అని గీతవాద్యాలతో దేవదేవుని పూజింపవలెను. వేశ్యాధర్మమును పూర్తిగా మీకు చెప్పితిని. పూర్వము పురుహూతుడు దానవ స్త్రీలకు చెప్పినదానిని నేను మీకు చెప్పితిని. మీకిది సరియైనది. అన్ని పాపముల పోనాడి అనంత ఫలముల నిచ్చునది. దుశ్చరమైనది. కల్యాణినులకు చెప్పబడినది. దీనినాచరించిన స్త్రీ విష్ణులోకమునొందును. దేవగణములతో పూజనొంది ఆ స్త్రీ విష్ణులోకమున ఆనందమొందునని అతను చెప్పెను. వ్రతము నాచరించువారు తన స్థానము నొందెదరు.

142

ఇది శ్రీ పాద్మపురాణమున మొదటిసృష్టిఖండములో వేశ్యావ్రతకథనమను ఇరవై మూడవ అధ్యాయము.

Sri Padma Mahapuranam-I    Chapters