Sri Padma Mahapuranam-I    Chapters   

ఏకోనవింశోధ్యాయః

-: పుష్కరతీర్థ మహాత్మ్యమ్‌ :-

భీష్మ ఉవాచ :- పుష్కరస్య చ నందాయాః శ్రుతం మహాత్మ్యముత్తమమ్‌ |

ఋషికోటిర్యదాయాతా పుష్కరే ముఖదర్శనాత్‌ || 1

సర్వైః సురూపతా లబ్దా సర్వమేతత్తయా శ్రుతమ్‌ | యజ్ఞోపవీతైర్భక్తాని యాని తాని వదస్వ మే || 2

కథం తీర్థవిభాగస్తు కుతసై#్తః సుమహాత్మభిః | ఆశ్రమే యాని తీర్ధాని కృతాన్యపి మహర్షి భిః || 3

పదన్యాసః కృతః పూర్వం విష్ణునా యజ్ఞపర్వతే | నాగైస్తత్ర పంచతీర్ధం కృతం తైస్తు మహావిషైః || 4

పిండప్రదానవాపీ చ కేన పూర్వం వినిర్మితా | ఉధఙ్ముఖీ భూమిగతా కథం గంగా సరస్వతీ || 5

బ్రహ్మాణా వేదవిద్వద్భిః కథం యాత్రా త్రిపుష్కరే | కర్తవ్యా యత్పలం తస్యా జాయతే తద్వదస్వ మే || 6

పులస్త్య ఉవాచ :- ప్రశ్నభారో మహానేష భవతా పరికల్పితః | తదేవాగ్రమనాః భూత్వా శ్రుణు తీర్థమహాఫలమ్‌ || 7

యస్య హస్తౌ చ పాదౌ చ మనశ్చైవ తు సంయుతమ్‌ | విద్యా తపశ్చ కీర్తిశ్చ స తీర్థఫలమశ్నుతే || 8

ప్రతిగ్రహాదుపావృత్తః సంతుష్టో యేన కేనచిత్‌ | అహంకారనివృత్తశ్చ స తీర్ధపలమశ్నుతే || 9

ఆక్రోధనశ్చ రాజేంద్ర సత్యశీలో దృఢవ్రతః | ఆత్మోపమశ్చ భూతేషు స తీర్థఫలమశ్నుతే || 10

ఋషీణాం పరమం గుహ్యమిదం భరతసత్తమ ! | పూర్వం యత్ర మహారాజ సత్రే పైతామహీ తథా || 11

యతీనాముగ్రతపసాం యేషాం కోటిః సమాగతా | ముఖదర్శనమాశ్రత్య స్థితాస్తే జ్యేష్ఠపుష్కరే || 12

సురూపతాం పరాం లబ్ధ్వా ప్రీతాస్తే మునిసత్తమాః | హర్షేణ మహతావిష్టా బ్రహ్మధర్శినా కాంక్షిణః || 13

యజ్ఞోపవీతై సై#్తర్భూమిమాప్య సర్వైశ్చతుర్ధిశమ్‌ | కృత్వా తీర్థవిభాగం చ స్థితా భక్తి పరాయణాః || 14

ఆసన్నశ్చ తతస్తేషాం తదా తుష్టః పితామహః | కోటి కృత్వా తదా తేషాం మానం దృష్ట్వా మనీషిణామ్‌ || 15

ఆద్య ప్రభృతి యుష్మాకం ధర్మవృద్ధిర్భవిష్యతి | ఇహాగత్య నరో యో వై యదంగం ప్రథమం జలే || 16

ప్లావయిష్యతి రూపార్థం రూపితా తీర్థకారితా| భవిష్యతి న సందేహో యోజనా యతమండలే || 17

అర్ధయోజనవిస్తారం దైర్ఘ్యం సార్ధం హి యోజనమ్‌ | ఏతత్ప్రమాణం తీర్థస్య ఋషికోటిప్రవర్తితమ్‌ || 18

గమనాదేవ రాజేంద్ర పుష్కరస్య త్వరిందమ ! | రాజసూయాశ్వమేథాభ్యాం ఫలమాప్నోతి మానవః || 19

సరస్వతీమహాపుణ్యా ప్రతిష్ఠా జేష్ఠపుష్కరే | తత్ర బ్రహ్మాదయో దేవాః ఋషయః సిద్ధచారణాః || 20

అభిగచ్ఛంతి రాజేంద్ర చైత్రశుక్లచతుర్ధశమ్‌ | తత్రాభిషేకం కుర్వీత పితృదేవార్చనే రతః || 21

గోమేధం చ తదాప్నోతి కులం చైవ సముద్ధరేత్‌ | ఏవం తీర్ధ విభాగస్తు కృతసై#్తస్తు మహార్షిభిః || 22

పితౄన్‌ దేవాంశ్చ సంతర్ప్య విష్ణులోకే మహీయతే | తత్ర స్నాత్వా భ##వేన్మర్త్యో విమలశ్యంద్రమా యథా || 23

-: పుష్కరతీర్థ ప్రశంసా :-

బ్రహ్మలోకమవాప్నోతి గతిం చ పరమాం వ్రజేత్‌ | నృలోకే దేవదేవస్య తీర్థం త్రైలోక్యవిశ్రుతమ్‌ || 24

పుష్కరం నామ విఖ్యాతం మహాపాతకనాశనమ్‌ | దశకోటిసహస్రాణి తీర్థానాం వై మహీయతే || 25

సాన్నిధ్యం పుష్కరే యేషాం త్రిసంధ్యం కులనందన | ఆదిత్యా వసవో రుద్రాస్పాధ్యాశ్చ సమరుద్గణాః || 26

గంధర్వాప్సరసశ్చైవ నిత్యసన్నిహితా విభోః | యత్ర దేవాస్తపస్తప్త్యా దైత్వా బ్రహ్మర్షయస్తథా || 27

దివ్యయోగా మహారాజ పుణ్యన మహతాన్వితాః | మనసాప్యభికామస్య పుష్కరాణి మసస్వినః || 28

పూయన్తే సర్వపాపాని నాకపృ షే స మోదతే | తస్మింస్తోయే మహారాజ నిత్యమేవ పితామహః || 29

ఉవాస పరమప్రీతో దేవదానవసమ్మతః | పుష్కరేషు మహారాజ దేవాస్సర్షి పురోగమాః || 30

సిద్ధిం పచ సమనుప్రాప్తాః పుణ్యన మహతాన్వితాః |తత్రాభిషేకం యః కుర్యాద్పితృదేవార్చనే రతః || 31

అశ్వమేధాద్ధశగుణం ప్రవదంతి మనీషిణః | అప్యేకం భోజయ్యేద్విప్రం పుష్కరారణ్యమాశ్రితః || 32

అన్నేన తేన సంప్రీతా కోటిర్భవతి పూజితా | తేనాసౌ కర్మణా భీష్మ ప్రేత్య చేహ చ మోదతే || 33

భీష్ముడిట్లనియె :- పుష్కరక్షేత్రముయొక్క నందానది యొక్క మహాత్మ్యమును విన్నాను. ఋషులు పుష్కర క్షేత్రమును సేవించి అందరును పరమ సుందరులైనట్లు వింటిని. వారచ్చట తీర్ధ విభాగమెట్లు చేసిరో, అచ్చట యజ్ఞ పర్వతమందు విష్ణువు పాదన్యాస మెట్లుచేసిరో, అచట పంచతీర్థ కల్పనమెట్లు జరిగినదో, తామనుగ్రహింప వినవలెనను కుతూహలముతో నున్నాడను. మహర్షు లేర్పరచిన తీర్థములందు శ్రీ విష్ణువు పాదమెట్లుంచెనో, తీవ్ర విషభరితులైన నాగులచట పంచతీర్థములనెట్లేర్పరచిరి. అందు మొట్టమొదట పిండప్రదానవాపి పిండములను వేయుబావి నెవరు నిర్మించిరి? గంగానది మొదట నుత్తరాభిముఖియై భూమియందవతరించినది. సరస్వతి బ్రహ్మాదులచేత త్రిపుష్కరమందు సరస్వతీనదీయాత్ర ఋషులెట్లు నిర్వహించిరి? ఆ యాత్రాఫలమేమి తెలుపుమన పులస్త్యుడిట్లనియె.

నీవడగిన ప్రశ్నభాగము చాల గొప్పది. ఏకాగ్రమనస్కుడవై వినుము. హస్తములు పాదములు, మనస్సు నియమించుకొని తీర్థ విశేషము విన్నచో విద్య, తపస్సు లభించును. అతడే తీర్థఫల మనుభవించును. చేయిచాపక నిత్య సంతుష్టుడై, అహంకారముగొనకయున్న యతడు తీర్థఫలమొందును. రాజేంద్ర! కోపము నిగ్రహించి సత్యశీలుడై, వ్రతనిష్టుడై సర్వభూతములను తనవలె జూచుతనడు తీర్థఫలమందును. ఋషుల పరమరహస్యమిది. జరిగిన కథ బ్రహ్మదేవుని సత్రయాగమందు తీవ్ర తపస్సంపన్నులు ఋషులు జ్యేష్ట పుష్కరమందు బ్రహ్మదేవుడొనరించిన సత్రయాగమున కొచ్చిరి. బ్రహ్మముఖదర్శనమైన కారణమున ఆనందభరితులై యజ్ఞోపవీతముల జేకొని తీర్థవిభాగముజేసి భక్తిపరులై నలుదెసలందు సమావేశ##మైరి. అత్తఱి పితామహుడు (బ్రహ్మ) ఆనందభరితుడై జ్ఞానసంపన్నులగు మునికోటియుం గని ఇంతటినుంచి మీకు ధర్మాభివృద్ధి కాగలదు. ఇటకువచ్చి ఈ తీర్థజలమందు స్నానము చేసినవానికి చక్కని రూపమేర్పడును. ఇక యోజనము పొడవు, అరయోజనము వెడల్పుగల ఈ తీర్థము ఋషికోటి ప్రవిర్తితము (ఋషు లేర్పరిచినది). యాత్రామాత్రమున రాజాసూయాశ్వమేధయాగములు చేసిన ఫలము నందును. జ్యేష్టపుష్కరమందిట సరస్వతీనది ప్రతిష్ఠింప బడినది. ఇటకు చైత్రశుక్ల చతుర్దశినాడు ఋషులు, సిద్దులు, చారణులు యాత్రకు వత్తురు. పితృదేవతాతృప్తికిట నానాడు అభిషేకము సేయవలెను. గోమేధయాగ పుణ్యఫలము దానివలన కలుగును. దేవ, పితృ దేవతలనిట తృప్తులంజేసిన పుణ్యుడు విష్ణులోకమందును. చంద్రునట్లు సౌందర్యవంతు డగును. బ్రహ్మలోకమంది పరమగతి నందును. మానవలోకమున విష్ణుతీర్ధమిది. పుష్కరముల పేర ప్రసిద్ధము. మహాపాతకనాశము. పదికోట్ల పుణ్యతీర్థములతో సమానము. మూడుసంధ్యలందు నిచ్చట ఆదిత్యులు, వసువులు, రుద్రులు, సాధ్యలు మరుత్తులు, గంధర్వులు, అప్సరసలు నిట సన్నిహితులౌదురు. ఇచట తపస్సు చేసి దైత్యులు, బ్రహ్మాదిదేవతలు, మహాపుణ్య సంపన్నులైరి. బ్రహ్మనిరంతర మాతీర్థమున సన్నిధానమై యుండును. అచట నభిషేకముసేసి పితృదేవతల నర్చించునతడు అశ్వమేథమునకు పదిరెట్లు పుణ్యమందును. ఇట నొక్కబ్రాహ్మణునకు భోజనము పెట్టిన మాత్రమున కోటిమంది దేవతలు పూజింపబడినట్లగుదురు. ఆ పుణ్యము చేసిన తడిహపరములం దానంద భరితుడగును. 33

శాకైర్మూలైః ఫలైర్వాపి యేన వా వర్తయేత్‌ స్వయమ్‌ | తద్వైదద్యాద్‌ బ్రాహ్మణాయ శ్రద్ధావాననసూయకః || 34

తేనైవ ప్రాప్నుయాత్‌ ప్రాజ్ఞో హయమేధఫలం నరః | బ్రాహ్మణః క్షత్రియో వైశ్యః శూద్రో వా రాజసత్తమ || 35

ఫైతామహః సరః పుణ్యం పుష్కరం నామ నామతః |వైఖానసానాం సిద్ధానాం మునీనాం పుణ్యదమ్‌ హి యత్‌ || 36

సరస్వతీ పుణ్యతమా యస్మాద్యాతా మహార్ణవమ్‌ | ఆదిదేవో మహాయోగీ యత్రాస్తే మధుసూదనః || 37

ఖ్యాత ఆదివరాహేతి నామ్నా త్రిదశపూజితః | హీనవర్ణాశ్చ యే వర్ణాస్తీర్థే పైతామహే గతాః || 38

న వియోనిం వ్రజంత్యేతే స్నాత్వా తీర్థే మహాత్మనః | కార్తిక్యాం చ విశేషేణ యోభిగచ్ఛేత్తు పుష్కరమ్‌ || 39

ఫలం తత్రాక్షయం తస్య భవతీ త్యనుశుశ్రుమ | సాయం ప్రాతః స్మరేద్యస్తు పుష్కరాణి కృతాంజలిః || 40

ఉపస్పృష్టం భ##వేత్తేన సర్వతీర్థే తు కౌరవ | జన్మప్రభృతి యత్పాపం స్త్రియో వా పురుషస్య వా || 41

పుష్కరే స్నాసమత్రేణ సర్వమేతత్ర్పణశ్యతి ! యథా సురాణాం ప్రవరః సర్వేషాం తు పితామహః || 42

తథైవ పుష్కరం తీర్థం తీర్థానామాదిరుచ్యతే | తద్దృష్ట్వా దశవర్షాణి పుష్కరే నియతః శుచిః || 43

క్రతూన్‌ సన్వనవాప్నోతి బ్రహ్మలోకం స గచ్ఛతి | యస్తు వర్షశతం పూర్ణమగ్నీహోత్రముపాసతే || 44

కార్తీకీం వా వసేదేకాం పుష్కరే సమమేవ తు ! పుష్కరే దుష్కరో హోమః సుష్కరే దుష్కరం తపః || 45

పుష్కరే దుష్కరం దానం వాసశ్చైవ సుదుష్కరః | బ్రాహ్మణో వేదవిద్వాంస్తు గత్వా వై జేష్ఠపుష్కరమ్‌ || 46

స్నానాద్భవేన్మోక్షభాగీ శ్రాద్ధేన పితృతారకమ్‌ | నామమాత్రేణ యో విప్రోగత్వా సంధ్యాముపాసతే || 47

వర్షాణి ద్వాదశైవేహ తేన సంధ్యా హ్యుపాసితా | భ##వేత్తు నాత్ర సందేహః పురాప్రోక్తం స్వయంభువా || 48

సావిత్రీకథితో దోషః కులే తస్య న జాయతే | యా పత్నీ దదతే భర్తుః సంధ్యోపాస్తిం కరిష్యతః || 49

కరకేణ తు తామ్రేణ తోయం ముక్తా దివం వ్రజేత్‌ | బ్రహ్మలోకమనుప్రాప్య తిష్ఠతి బ్రహ్మణో దినమ్‌ || 50

ఏకాకినా గతేనాపి సంధ్యా వంద్యా యథాక్రమమ్‌ | పౌష్కరేణాథ తోయేన భృంగారే నిహితేన తు || 51

తేనాపి ద్వాదశాబ్దాని సంధ్యోపాస్తా న సంశయః | భ##వేత్సమీపగా పత్నీ కుర్వతః పితృతర్పణమ్‌ || 52

దక్షిణాం దిశమాస్థాయ గాయత్ర్యా రాజసత్తమ | పితౄణాం పరమా తృప్తిః క్రియతే ద్వాదశాబ్ధికీ || 53

యుగసహస్రం పిండేన శ్రాద్ధేనానన్త్యమశ్నుతే | ఏతదర్థం హి విద్వాంసః కుర్వతే దారసంగ్రహమ్‌ || 54

తీర్థే గత్వా ప్రదాస్యామః పిండాన్వై శ్రాద్ధపూర్వకమ్‌ | తేషాం పుత్రా ధనం ధాన్యమవిచ్ఛిన్నా చ సంతతిః || 55

భ##వేద్వైనాత్ర సందేహ ఏతదాహ పితామహః ! తర్పయిత్వా పితౄన్దేవానగ్నిష్టోమఫలం లభేత్‌ || 56

-: అగస్త్య మహిమవర్ణనమ్‌ :c

ఆశ్రమానపి తే వచ్మి శృణుషై#్వకమనా నృప | అగస్త్యేన కృతశ్చాత్ర ఆశ్రమో దేవసమ్మితః || 57

సప్తర్షీణాం పురాచాత్ర ఆశ్రమో దేవసత్తమః | బ్రహ్మర్షిణాం తథా చాత్ర మనూనాం పరమస్తథా || 58

నాగానాం చ పురీ రమ్యా యజ్ఞపర్వతరోదసి | ఆగస్తస్య మహారాజ ప్రభావమమితాత్మనః || 59

కథయామి సమాసేన శృణు త్వం సుసమాహితః | పూర్వం కృతయుగే భీష్మ దానవా యుద్ధదుర్మదాః || 60

కాలేయా ఇతి విఖ్యాతా గణాః పరమదారుణాః | తే తు వృత్రం సమాశ్రిత్య దేవాన్‌ హంతుం సముద్యతాః || 61

తతో దేవాః సముద్విగ్నా బ్రహ్మాణముపతస్థిరే | కృతాంజలీంస్తు తాన్సర్వాన్‌ పరమేష్ఠీత్యువాచ హ || 62

విదితం మే సురా ! స్సర్వం యద్వః కార్యం చికీర్షితమ్‌ | తముపాయం ప్రవక్ష్యామి యధా వృత్రం వధిష్యథ ||63

దధీచిరితి విఖ్యాతో మటహానృషిరుదారతః | తం గత్వా సహితాస్సర్వే వరం చ ప్రతియాచత || 64

స వో దాస్యతి ధర్మాత్మా సుప్రీతేనాంతరాత్మనా | స వాచ్యః సహితైః స్తర్వెర్భవద్భిర్జయకాంక్షిభిః || 65

స్వాన్యస్థీని ప్రయచ్ఛస్వ త్రైలోక్యహిత కాంక్షయా | స శరీరం సముత్సృజ్య స్వాన్యస్థీని ప్రదాస్యతి || 66

తస్యాస్థిభిర్మహావీరం వజ్రం సంహియాతాం దృఢమ్‌ | మహచ్ఛత్రుహనం దివ్యం తదస్త్రమశనిః స్మృతమ్‌ || 67

తేన వజ్రేణ వై వృత్రం వధిష్యతి శత క్రతుః | ఏతద్వః సర్వమాఖ్యాతం తస్మాత్సర్వం విధీయతామ్‌ || 68

ఏవముక్తాస్తతో దేవా అనుజ్ఞాప్య పితామహమ్‌ | శతక్రతుం పురస్కృత్య దధీచేరాశ్రమం యుయుః || 69

సరస్వత్యాః పరేపారే నానాదృమలతాయుతమ్‌ | షట్పదోద్గీతనినదైరుధ్ఘుష్టం సామగై రివ || 70

పుంస్కోకిలరవోన్మిశ్రం జీపంజీవకనాదితమ్‌ | మహిషైశ్చ వరాహైశ్చ సృమరైశ్చమరైరపి || 71

తత్రానుచరితైః శార్దూలభయవర్జితైః | కరేణుభిర్వారణౖశ్చ ప్రభిన్న కరటాముఖైః || 72

స్వరోద్గారైశ్చ క్రీడద్భిః సమంతాదనునాదితమ్‌ | సింహవ్యాఘ్రైర్మహానాదం నధద్భిరనునాదితమ్‌ || 73

మయూరైశ్చాపి సంలీనైర్గుహాకందరవాసిభిః తేషు తేషు చ కుంజేషు నాదితం సుమనోరమమ్‌ || 74

త్రవిష్టపసమప్రఖ్యం దధీచ్యాశ్రమమాగమన్‌ | తత్రాపశ్యన్‌ దధీచిం తం దివాకర సమప్రభమ్‌ || 75

జాజ్వల్యమానం వవుషా యథా లక్ష్మ్యా చతుర్భుజమ్‌ | తస్య పాదౌ సురరాజన్న భివాద్య ప్రణమ్య చ || 76

అయాచంత వరం సర్వే యథోక్తం పరమేష్ఠినా ||

దుంపలు, ఆకుకూరలు, పండ్లు మాత్రముచే బ్రాహ్మణులను తృప్తిపరిచిన అశ్వమేధ ఫలమందును. బ్రహ్మ పుష్కరమను నీతీర్థము చతుర్వర్ణములవారు సేవింపవలసినది. వైఖానసులు, సిద్ధులు సేవింపదగిన సరస్వతీ పుణ్యనది ఈ తీర్థమునుండియే మహాసముద్రమున కేగినది. ఆదివరాహమూర్తి భగవంతుడిచట దేవతల పూజలందుకొనును. తక్కువ వర్ణములవారు కూడా ఈ బ్రహ్మతీర్థమును సేవించిన మరి హీనవర్ణమున పుట్టరు. కార్తికమాసమందు పుష్కరతీర్థము సేవించిన ఫలమక్షయమని విందుము. పుష్కర క్షేత్రము సాయం ప్రాతఃకాలము లందు చేతులు మొగిచి నమస్కరించిన మాత్రమున సర్వతీర్ధ సేవాఫలము కలుగును. ఆజన్మ కృతపాప క్షయమగును. ఇట్లు పలుకబడి దేవతలందరు బ్రహ్మ అనుజ్ఞ పొంది ఇంద్రుని వెంట సరస్వతీనది ఆవతలి యెడ్డుననున్న దధీచి ముని ఆశ్రమమున కేగిరి.

-: దధీచిముని ఆశ్రమ వర్ణనము :-

అచట సింహ శార్దూలాది మృగముల వలని భయము కలుగదు. వివిధ వృక్షలతా సుందరము. తుమ్మెదల ఝంకారము వినిపించును. ఏనుగులట సంచరించుచుండును. నెమళ్లు నృత్యములు సేయుచుండును. అట గుహలందు సింహ వ్యాఘ్రాదుల నాదము వినిపించును. అది కేవలము స్వర్గతుల్యము. అయ్యాశ్రమమునకు వచ్చి మహర్షులు సూర్యునట్లు ప్రకాశించు చున్న దధీచి మహర్షిని శోభ##చే సాక్షాత్‌ విష్ణవట్లున్న మహర్షిని దర్శించిరి. ఆయనకు ప్రణతులై మ్రొక్కి బ్రహ్మ సెప్పినట్లిట్లు వరమును కోరుకొనిరి.

తతో దధీచిః పరమప్రతీతః సురోత్తమాంస్తానిదమిత్యువాచ | కరోమి యద్వో హితమద్య దేవాః స్వం వాపి దేహం త్వహముత్సృజామి || 77

తానేవముక్త్వా ద్విపదాం పరిష్ఠః ప్రాణాంస్తతోసౌ సహసోత్ససర్జ | సురాస్తదస్థీని సవాసవాస్తే యథోపయోగం జగృహుః స్మ తస్య || 78

ప్రహృష్టరూపాశ్చ జయాయ దేవాస్త్వష్టారమాసాద్య తమర్థమూచుః |

త్వష్టా తు తేషాం వచనం నిశమ్య ప్రహృష్టరూపః ప్రయతః ప్రయత్నాత్‌ || 79

చకార వజ్రం భృశముగ్రవీర్యం కృత్వాచ శస్త్రం తమువాచ హృష్టః |

అనేన శస్త్రప్రవరేణ దేవ భస్మీకురుష్వాద్యసుతారిముగ్రమ్‌ | 80

తతో హతారిః సగణః సుఖం త్వం ప్రశాధి కృత్స్నం త్రిదివం దివిష్ఠః

త్వష్ట్రా తథోక్తస్తు పురందరశ్చ వజ్రం ప్రహృష్ఠః ప్రయతో హ్యగ్రహ్ణాత్‌ || 81

దధీచి మహర్షి సంప్రీతి నొంది ఓదేవతలారా ! మీ అభిమతము హితమేమి కోరుడు. నా దేహమునైన విడిచి మీ కిచ్చెదను. అని యా వెంటనే శరీరము విడిచి ఎముకలను వారి కర్పించెను. వా రానందభరితులై బ్రహ్మ సన్నిధికరిగి ఇది విన్నవించిరి. చతుర్ముఖు డానందభరితుడై వానిచే వజ్రాయుధము నిర్మించి అది అస్త్రముగా దేవతల కిచ్చి ఈ దివ్యాస్త్రముచే మహోగ్రుడగు వృత్రాసురుని భస్మము చేయుమనియె. ఆవ్వల శత్రుపీడ వదలి సర్వ స్వర్గ సామ్రాజ్యము నీవేలుము. బ్రహ్మ పలుకులు విని ఇంద్రుడు ఆ వజ్రాయుధమును నియమముతో స్వీకరించెను. 81

తతః స వజ్రేణ యుతో దైవతైరభిపూజితః | ఆససాద తతో వృత్రం స్థితమావృత్య రోదసీ ||

కాలకేయైర్మహాకాయైస్సమంతాదభిక్షితమ్‌ | సముద్యత ప్రహరణౖః సశృంగైరివ పర్వతైః || 83

తతో యుద్ధం సమభవద్దేవానాం సహ దానపైః | ముహూర్తం భరతశ్రేష్ఠ లోకత్రాసకరం మహత్‌ || 84

ఉద్యతైః ప్రతిపుష్టానాం ఖడ్గానాం వీరభాహుభిః | ఆసీత్స తుములః శబ్ధః శరీరై రభిపాటితైః || 85

శిరోభిః ప్రపతద్భిశ్చాప్యంతరిక్షాన్మహీతలమ్‌ | తాలైరివ మహీపాల వృతం తైరేవ దృశ్యతే || 86

తే హేమకవచా భూత్వా కాలేయాః పరిఘా యుతాః | త్రిదశానభ్యవర్తంత దావదగ్దా ఇవ ద్రుమాః || 87

తేషాం వేగవతాం వేగం సహితానాం ప్రధావతామ్‌ | న శేకుః సహితాః సోడుం భగ్నాస్తే ప్రాద్రవన్‌ భయాత్‌ || 88

ఇంద్రుడు వృత్రాసురునిపై దండయాత్ర సేయుట

ఇంద్రుడా వజ్రయుధముతో దేవతలచే పూజలందుకొని మింట నిలిచిన వృత్రాసురుని దరి కేగెను. కాలకేయులను నసురులు మహాశరీరులు వానికంగరక్షకులుగా నట నిల్చిరి. పర్వత శిఖరము లట్లున్న ఆ దానవులతో యుద్ధ మారంభ మయ్యెను. అది సర్వలోక భయంకరము. శరీరములు తెగి తలలు నేల బడి తాటిచెట్లట్లు కూలిన దానవులతో నా యుద్ధ భూమి భయంకరమై కనుపించెను. కాలేయులు బంగారు కవచములం బూని దావాగ్ని నలముకొనిన్న వృక్షములట్లు దేవతలపై దూకిరి. ఆ వేగమున కోపలేక దేవతలు నలుదెసలకుం బరువెత్తిరి. 88

తాన్‌ దృష్ట్వా ద్రవతో భీతాన్‌ సహస్రాక్షః పురందరః | వృత్రం వర్ధమానంతు కశ్మలం మహదావిశత్‌ || 89

తం శక్రం కశ్మలావిష్టం దృష్ట్వా విష్ణుః సనాతనః | స్వం తేజో వ్యదధాచ్ఛక్రే బలమస్య వివర్ధయన్‌ || 90

విష్ణునాప్యాయితం శక్రం దృష్ట్వా దేవగణాస్తదా | సర్వే తేజస్సమాదధ్యుస్తధా బ్రహ్మర్షయోమలాః || 91

స సమాప్యాయితః శ్రకోవిష్ణునా దేవతైః సహ | ఋషిభిశ్చ మహాభాగైర్బలవాన్‌ సమపద్యత || 92

అట్లు బెదరి పారు దేవతలం గని సహస్రాక్షుడు వృత్రాసురుని ఉద్రేకము చూచి ఎంతో క్షోభించెను వానిం జూచి విష్ణువు వాని బలము పెంపునకు తన తేజస్సును అతనియందు సంక్రమింప జేసెను. విష్ణవుచే నాప్యాయితుడైన ఇంద్రునిం గని దేవగణము తేజసంపన్నులై బ్రహ్మర్షులు కూడ తేరుకొని యందరితో మరల యుద్ధ సన్నద్ధుడయ్యెను. 92

జ్ఞాత్వా బలస్థం త్రిదశాధిహతం | ననాద వృత్రః సుమహన్నినాదమ్‌ || 93

తస్య ప్రణాదేన ధరా దిశశ్చ | ఖం ద్యౌర్ననాదాతిచచాల సర్వమ్‌ || 94

తతో మహేంద్రః పరమాభితప్తః | శ్రుత్వా రవం ఘోరతరం మహాంతమ్‌ || 95

భ##యేన మగ్న స్త్వరితం ముమోచ | వజ్రం మహాంతం ఖలు తస్య శీర్షే || 96

స శక్రవజ్రాభితహతః పపాత మహాస్యనః కాంచనమాల్యధారీ | యథా మహాశైలపరః పురస్తాత్న మందరో విష్ణుకరాత్ర్పముక్తః | 97

సురాధినాధుడు బలవంతు డగుట జూచి వృత్రాసురుడు పెద్దపెట్టున నార్చెను. ఆ యార్పుచే దశ దిశలు భూమి, ఆకాశము ప్రతిధ్వనించి ఇట్టట్టు లూగిపోయెను. ఆ ఘోరమైన అరుపు విని ఇంద్రుడు జడిసి ఇట్టటు ఒణికి వాని తలపై వజ్రాయుధమును విసరెను. ఇంద్రాయుధముచే హతుడై పెద్దపెట్టున నార్చి బంగారుకాసుల పేరు ధరించి న ఆ దానవుడు విష్ణువుచేతనుండి జారిపడిన మందరపర్వతమట్లు నేలపై పడెను. 97

తస్మిన్హతే దైత్యవరే భయార్తః శక్రః ప్రదుద్రావ సరః ప్రవేష్టుం |

వజ్రం చ మేనే స్వకరాత్ప్రముక్తం వృతం భయాచ్చైవ హతం న పశ్యతి || 98

సర్వే చ దేవాః ముదితాః ప్రహృష్టాః | సహర్షయశ్చైనమధోస్తువంతి ||

శేషాంశ్చ దైత్యాంస్త్వరితం సమేత్య | జఘ్నుః సురా వృత్రవధాభితప్తాన్‌ ||

తే వధ్యమానాస్త్రిదశైస్తదానీమ్‌ | మహాసురా వాయుసమానవేగాః ||

సముద్రమేవావివిశుర్భయార్తాః | ప్రవిశ్య చైవోదధిమప్రమేయమ్‌ ||

ఝషాకులం రత్నసమాకులం చ | తదా స్మ మంత్రం సహితాః ప్రచక్రుః ||

తత్రస్మ కేచిన్మతినిశ్చయజ్ఞా | స్తాంస్తానుపాయాన్‌ పరిచింతయంతః || 99

భయార్ధితా దేవనికాయతప్తా | సై#్త్రలోక్యనాశాయ మతిం ప్రచక్రుః ||

తేషాం తు తత్ర క్షయకాలయోగాద్ఘోరా మతి శ్చింతయతాం బభూవ || 100

ఆ దైత్యుడు హతుడైనంతట జడిసి ఇంద్రుడు సరస్సు నందు ప్రవేశించుటకు పరుగెత్తెను. వజ్రాయుధము తనచేతనుండి విడువబడినట్లెరుగునే కాని భయము వలన వృత్రాసురుడు పడిపోయినట్లు గుర్తింపలేకపోయెను. అందరు దేవతలపుడానంద భరితులైరి. ఇంద్రు నానందపరచుచు స్తుతించిరి. మిగిలివున్న దైత్యులను వృతవధకు పరితప్తులగుచున్న వారిని మరియునుం గొట్టిరి. దేవతల దెబ్బతిని మహారాక్షసులు పారిపోయి వాయువేగమున సముద్రమునందు దాగిరి. సముద్రమందట్లు ప్రవేశించి తిమి తిమింగలాది భయంకరమై రత్న సమాకూలమైన ఆ సముద్రమందరును కలసి ఇట్లు ఆలోచన చేసిరి. అచటు కొందరు దేవతలనే కాదు ముల్లోకములను నాశనము చేయగలనని ఆలోచించిరి. అవి దానవులకు నాశనకాలయోగమైనందున చాల దారుణమైన ఆలోచనలో పడిరి.

-: అసుర సమాలోచనమ్‌ - అసుర ప్రవృత్తి :-

యే సంతి విద్యా తపసోపపన్నా స్తేషాం వినాశః ప్రథమం చ కార్యః ||

లోకాశ్చ సర్వే తపసా ధ్రియంతే | తస్మాత్తరధ్వం తపసః క్షమాయ || 101

యే సంతి కేచిద్ది వసుంధరాయామ్‌ | తపస్వినో దర్శవిదశ్చ తద్‌జ్ఞాః ||

తేషాం వధశ్చ క్రియతాం హి క్షిప్రమ్‌ | తేషు ప్రణష్టేషు జగద్వినష్టమ్‌ || 102

ఏవం హి సర్వే గతబుద్ధిభావా | జగద్వినాశే పరమపృహృష్టాః ||

దుర్గం సమాశ్రిత్వ మహోర్మిమంతమ్‌ | రత్నాకరం వారుణమాలయం స్మ || 103

సముద్రం తే సమాసాద్య వారుణం త్వంభసాం నిధిమ్‌ | కాలేయాః సమపద్యంత త్రైలోక్యస్య వినాశ##నే || 104

-: దానవుల జగత్ర్పళయ చింతనము :-

విద్య, తపస్సు కలవాండ్రను నాశముచేయుటయే ఇపుడు మన మొదటి కర్తవ్యము. లోకములన్నియు తపస్సుచే ఉద్ధరింపబడుచున్నవి. కావున తపోనాశనమునకే త్వరపడుడు. వసుంధర (భూమి) యందు, ఏ కొందరు ధర్మవేత్తలు, తపశ్శాలులు, జ్ఞానులు, కలరో వారి నాశనమే వేగముగా చేయవలసినది. వారు నశించిన జగమెల్ల నశించును. ఇట్లు అసురులందరు బుద్ది తప్పి జగద్వినాశనములందు వేడుకగొని ఉత్తరంగితమై రత్నమయమైన వరుణుని నివాసమగు సముద్రములందు చొచ్చి ఆ కాలకేయులైన రాక్షసు లందరు ముల్లోకముల నాశనమునకు పూనుకొనిరి.

తే రాత్రౌ సమభిక్రుద్దాః బభక్షుస్తాసంస్తదా మునీన్‌ | ఆశ్రమేషు చ యే సంతి పుణ్యష్వాయతనేషు చ || 105

వశిష్టస్యాశ్రమే విప్రా భక్షితాసై#్త ర్ధురాత్మభిః | అశీతిః శతమష్టౌ చ వనే చాన్యే తపస్వినః || 106

చ్యవనస్యాశ్రమం గత్వా పుణ్యం ద్విజనిషేవితమ్‌ | ఫలమూలాశనానాం హి మునీనాం భక్షితం శతమ్‌ || 107

ఏవం రాత్రౌ స్మ కుర్వంతో వివిశుశ్చార్ణవం దివా | భరద్వాజాశ్రమం గత్వా నియతా బ్రహ్మచారిణః || 108

వాతాహారంబుభక్షాశ్చ వింశతిశ్చ నిఘాదితాః | ఏవం క్రమేణ భక్షార్థం మునీనాం దానవాస్తదా || 109

నిశాయాం పర్యధావంత శక్తా భుజబలాశ్రయత్‌ | కాలేన మహతా తే వై జఘ్నర్మునిగణాన్భహూన్‌ || 110

న చైతానవబుధ్యంత మనుజా మనుజాధిప | నిఃస్వాధాయవషట్కారం నష్టయజ్ఞోత్సవక్రియమ్‌ || 111

జగదాసీన్నిరుత్సాహం కాలేయభయపీడితమ్‌ | ఏవం ప్రక్షీయమాణాస్తే మానవా మనుజేశ్వర || 112

ఆత్మత్రాణపరా భీతాః ప్రాద్రవంస్తు దిశో దశ | కేచిద్గుహాం ప్రవివిశుర్వికీర్ణాశ్చ పరే ద్విజాః || 113

ఆపరే చ భయోద్విగ్నా భయాత్ర్పాణన్సమత్యజన్‌ | కేచిత్తత్ర మహేష్వాసాః శూరాః పరమదర్పితాః || 114

మార్గమాణాః పరం యత్నం దానవానాం ప్రచక్రిరే | న చైతాననుజుగ్ముఃతే సముద్రం సముపాశ్రితాన్‌ || 115

శమం న జగ్ముః పరమమాజగ్ముః క్షయమేవ చ | జగత్ర్పశమనే జాతే నష్టయజ్ఞోత్సవక్రియే || 116

ఆజగ్ముః పరమోద్విగ్నాస్త్రిదశా మనుజేశ్వర | సమేత్య స మహేంద్రాస్తు భయాన్మంత్రం ప్రచక్రిరే || 117

నారాయణం పురస్కృత్య వైకుంఠమపరాజితమ్‌ | తతో దేవాః సమేతాస్తే తదోచుర్మధుసూదనమ్‌ || 118

ఆ రాత్రియెల్ల క్రోధోద్రిక్తులై వెడలి పుణ్యాశ్రమమునకేగి ఆ యాకుటీరమునందున్న మునులను తినివేసిరి. వసిష్ఠాశ్రమందు ఎనిమిది వందల ఎనభై మందిని చ్యవన మహర్షి ఆశ్రమమునకేగి కందమూల ఫలాహారులగు ఋషులను నూరుమందిని మొత్తము తెల్లవారునప్పటికే భక్షించిరి. ఆ పై పగటి వేళకూడా భరద్వాజాశ్రమమున కేగి వ్రతనిష్ఠులు బ్రహ్మచారులు వాయువు నీరు మాత్రము భక్షించువారిని మునులను దినివేసిరి. మరల రాత్రి పరువెత్తి భుజబలముని అనేకములగు మునిగణముల నణంచి, మనుజు లెవ్వరు నది తెలిసికొనరైరి.

స్వాధ్యాయము (వేదాధ్యయనము) వషట్కారము (హోమాదికము) వినరాదయ్యెను. యజ్ఞోత్సవ క్రియలు నష్టములయ్యెను. జగమెల్ల నిరుత్సాహమయ్యెను. ఇలా మానవులు కాలేయుల భయపీడితులై క్షీణదశ నందిరి. ప్రాణము లరచేత బట్టుకొని పది దెసలకుం బారిరి. కొందరు గుహలం జొచ్చిరి. కొందరు చెల్లాచెదరైరి. మరికొందరు హడలెత్త తమంత ప్రాణములను విడిచిరి. వారిలో కొందరట మంచి విలుకాండ్రు, శూరులు, పరమ దర్పము గొని దానవుల వెదకుచు సంహరింప ప్రయత్నము జేసిరి. కాని సముద్రమందు దానవులను వెదకి కానలేక అశాంతిగొని తిరిగివచ్చి నాశనమునే పొందిరి, ఇట్లు జగన్నాశనమేర్పడి యజ్ఞోత్సవ క్రియాశూన్యమైనంతట ఇంద్రునితో కూడ నందరు సమావేశ##మై ఆలోచనలో పడి నారాయణుని సాక్షాత్‌ విష్ణువు దరికేగి దేవతలెల్లరు నమ్మధుసూదనునిం గూర్చి ఇట్లు సెప్పుకొనిరి. 118

త్వ నః స్రష్టా చ గోప్తా చ భర్తా చ జగతః ప్రభో | త్వయా సృష్టం జగత్సర్వం యచ్చేంగం యచ్చ నేంగతి || 119

త్వయా భూమిః పురా సృష్టా సముద్రాత్పుష్కరేక్షణ | వారాహం రూపమాస్థాయ జగదర్ధే సముధ్పతా || 120

ఆదిదైత్యో మహావీర్యో హిరణ్యకశిపుః పురా | నారసింహవపుః కృత్వా సూదితః పురుషోత్తమ ! || 121

ఆవధ్యః సర్వభూతానాం బలిశ్చాపి మహాసురః | వామనం వపురాస్థాయ త్రైలోక్యాద్ర్భంశితస్త్వయా || 122

అసురః సుమహేష్యాసో జంభ ఇత్యభివిశ్రుతః యజ్ఞక్షోభకరః క్రూరస్త్వమరైర్వినిపాతితః || 123

ఏవమాదీని కర్మాణి యేషాం సంఖ్యా న విద్యతే | అస్మాకం భయభీతానాం త్వం గతి ర్మధుసూదన || 124

తస్మాత్త్వాం దేవదేవశ లోకార్థం జ్ఞాపయామహే | రక్ష లోకాంశ్చ దేవాంశ్ఛ శక్రం చ మహతో భయాత్‌ || 125

భవత్పసాదా ద్వర్తంత జగత్సర్వాంశ్చతుర్విధాః | స్వస్థా భవంతి మనుజూ హవ్య కపై#్యర్ధివౌకసః || 126

ప్రభూ ! నీవు మమ్ము సృష్టించిన వాడవు. రక్షకుడవు భరించువాడవు. చైతన్య మున్నదీ లేనిదీ ఈ జగమెల్ల నీ చేతన సృష్టింపబడినది. ఓ కమలలోచనా ! నీచే నీ భూమి వరాహ రూపమున పైకెత్తబడినది. మొదటి దైత్యుడు మహావీర్యుడు హిరణ్యకశిపుడు నారశింహ రూపుడైన నీచే సంహరింప బడినాడు. సర్వ భూతములకు నవధ్యుడైన బలి వామనమూర్తి వగు నీచే నడగారినాడు. జంభుడను నసురుడు యజ్ఞక్షోభ చేసినాడు. నీ తోడ్పాటున నమరులచే కూల్పబడినాడు ఇట్లెన్నో లెక్కింపరాని పనులు నీవు నిర్వర్తించినావు. హడలిపోవు మాకు గతి నీవే. దేవదేవేశ్వరా! మా కొఱకే కాదు లోక క్షేమము జ్ఞాపకము సేయుచున్నాము. తమ అనుగ్రహముననే భూమ్యాది చతుర్లోకములు బ్రతుకు చున్నవి. స్వస్థముగా నున్నవి. మనుజులుగాని, దివిజులు గాని, పితృదేవతలు గాని హవ్య కవ్యములచే యనీ అనుగ్రహమున వర్తించుచున్నారు. 126

లోకాహ్యేవం ప్రవర్తంతే అన్యోన్యం చ సమాశ్రితాః | త్వత్ర్పభావాన్ని రుద్విగ్నాస్త్వయైవ పరిరక్షితాః || 127

ఇదం చ సమనుప్రాప్తం లోకానాం భయముత్తమమ్‌ | జానీమో న చ కేనైతే వధ్యంతే బ్రాహ్మణా నిశి || 128

బ్రాహ్మణషు చ క్షీణషు పృధివీ క్షయమేష్యతి | త్వత్ప్రసాదాన్మహాబాహో లోకాస్సర్వే జగత్పతే || 129

వినాశం నాధిగచ్ఛే యుస్త్వయా వై పరిరక్షితాః ||

విష్ణురువాచ :-

విదితం మే సుతాః సర్వం ప్రజాయాః క్షయకారణమ్‌ || 130

భవతాం చాపి వక్ష్యామి శృణుధ్వం విగతజ్వరాః కాలకేయా ఇతి ఖ్యాతా గణాః పరమదారుణాః || 131

తే వృత్రం నిహతం దృష్ట్వా సహస్రాక్షేణ ధీమతా | జీవితం పరిరక్షంతః ప్రవిష్టా పరుణాలయమ్‌ || 132

తే ప్రవిశ్యోదధం ఘోరం నానాగ్రాహసమాకులమ్‌ | ఉత్సాదనార్థం లోకస్య రాత్రౌ ఘ్నంతి మునీనిహ || 133

లోకములన్నియు నిన్నాశ్రయించి ఒకరినొకరనుసరించి నీ ప్రభావము వలన ఎట్టి ఉద్రేగము లేకుండా నీ రక్షణలో నున్నవి. ఇప్పుడు సర్వలోకములకు పెద్ద భయమేర్పడినది. చూచితివి కదా అర్ధరాత్రి బ్రాహ్మణులను వీరి నెవరు కూల్చిరో, ఎరుగలేకున్నాము. బ్రాహ్మణులు క్షీణించినంతట భూమియెల్ల క్షయించును. జగత్పతివి నీ ప్రసాదమున బ్రాహ్మణులు నాశమొందరాదు. నీ రక్షణము వారి కవసరము. అన విష్ణునాశ మొందరాదు. నీ రక్షణము వారికవసరము. అన విష్ణువిట్లనియె. ఓ దేవతలారా! ఈ ప్రజాక్షయమునకు కారణము నాకు తెలిసినదే. క్షోభింపక మీరు ఆలింపుడు. కాలకేయులను రాక్షసులు పరమదారుణముతో వృత్రాసురు డింద్రునిచే కూలుట చూచి తమ జీవితములు రక్షించుకొనుటకు వరుణాలయము (సముద్రము)ను జొచ్చిరి. తిమి తిమింగాలాది ఘోర జీవ సంకులమగు జలధిం బ్రవేశించి రాత్రివేళల లోకనాశముకోరి ఇట మునులను జంపుతున్నారు.

న తు శక్యాః క్షయం నేతుం సముద్రాంతర్హితా హి తే | సముద్రస్య క్షయే బుద్ధిర్భవద్భిః పరిచింత్యతామ్‌ || 134

ఏతచ్ఛృత్పా వచో దేవా విష్జునా సముదాహృతమ్‌ | పరిమేష్టినమాసాద్య అగస్తస్యా శ్రమం యయుః || 135

సముద్రంలో దాగినారుగదా వాండ్లను చంపవలను పడరు. కావున సముద్ర మింకిపోవు నాలోచన సేయుడనిన విష్ణువచన మాలించి బ్రహ్మదరికేగి యగస్త్యాశ్రమున కేగిరి.

తత్రాపశ్యన్మహాత్మానం వారుణిం దీప్తతేజసమ్‌ | ఉపాస్యమానమృషిభిర్ధేవైరివ పితామహమ్‌ || 136

తేభిగమ్య మహాత్మానం మైత్రావరుణిముత్తమమ్‌ | అప్రమత్తం తపోరాశిం కర్మభిః సై#్వరనుష్ఠితైః || 137

దేవా ఊచుః - నహుషేణాభితప్తానాం లోకానాం త్వం గతిః పురా | భ్రంశితశ్చ సురైశ్వర్యాల్లోకార్థం లోకకంటకః || 138

క్రోధాత్ప్రవృద్ధః స మహాన్భాస్కరస్య నగోత్తమః | వచస్తవానతిక్రమాన్వింధ్యః శైలో న వర్ధతే || 139

తమసాచ్చాదితే లోకే మృత్యునాభ్యర్ధితాః ప్రజాః | త్వామేవ నాథమాగమ్య నివృత్తిం పరమాం గతాః || 140

అస్మాకం భయభీతానాం నిత్యమేవ భవాన్గతిః | తతస్త్వద్య ప్రయాచామస్త్వాం వరం వరదోహ్యసి || 141

దేవతలచే బ్రహ్మ యట్లు - ఋషులచే నుపాసింప బడుచున్న దివ్వతేజస్విని వరుణిని కుమారుని (మైత్రావరుణిని అట దేవతలు చూచిరి. కర్మానుష్టానముచే జాగరూకుడై యున్న యా మహాత్ముని సన్నిధికేగి యిట్లనిరి. మున్ను నహుషునిచే దపించిన లోకములకు నీవు దిక్కైతివి. లోకకంటకుడయినవాడు లోకక్షేమము కొఱకు దేవైశ్వర్యము నుండి (ఇంద్ర పదవి నుండి భ్రష్టుడైనవాడు క్రోధముచే సూర్యు నడ్డు కొనుటకు పైకెగసిన వింధ్యపర్వతము నీమాట జవదాటక యాగిపోయినది. లోకమెల్ల చీకటులుగమ్మ మృత్యు బాధనిగొని ప్రజలు నిన్నే శరణంబని బ్రతికినారు. హడలిపోవు మాకు నిత్యము తమరే గతి. కావున వరదుడ వని నిన్ను వరమడిగికొనుచున్నామనిరి.

భీష్మ ఉవాచ :- కిమర్థం సహసా వింధ్యః ప్రవృద్ధః క్రోధమూర్చితః | ఏతదిచ్ఛామ్యహం శ్రోతుం విస్తరేణ మహామునే || 142

భీష్ము డనియె. వింధ్యము కోప వశ##మై యెందుల కెగసినది? మునీశ్వర : వినవలతు నది విస్తరముగ విన దలతునన పులస్త్యు డనియె : -

పులస్త్య ఉవాచ :- ఆద్రిరాజం మహాశైలం మేరుం కనకపర్వతమ్‌ |

ఉదయేస్తమయే భానుః ప్రదక్షిణమవర్తత || 143

తం దృష్ట్వా తు తదా వింధ్యః శైలః సూర్యమథాబ్రవీత్‌ | యథా హి మేరుర్భవతా నిత్యశః పరిగమ్యతే || 144

ప్రదక్షిణం చ క్రియతే మామేవం కురు భాస్కర | ఏవముక్తస్తతః సూర్యః శైలేంద్రం ప్రత్యభాషత || 145

నాహమాత్మేచ్ఛయా శైలం కరోమ్యేనం ప్రదక్షిణమ్‌ | ఏష మార్గః ప్రదిష్టో మే యేనేదం నిర్మితం జగత్‌ || 146

ఏవముక్తస్తదా క్రోధాత్ప్రవృద్ధః సహసాచలః | సూర్యచంద్రమసోర్మార్గం రోద్ధుమిచ్ఛన్‌ పరంతపః || 147

తతో హి దేవాః సహితాస్తు సర్వే సేంద్రా సమాగమ్య మహాద్రిరాజమ్‌ |

నివారయామసురధోత్పతంతం న వై స తేషాం వచనం చకార || 148

తతో హి జగ్ముర్మునిమాశ్రమస్ఖం తపస్వినాం ధర్మవతాం వరిష్టమ్‌ |

అగస్త్యమత్యద్భుతదీప్తవీర్యం తం చార్థమూచుః సహితా సురాస్తే || 149

పర్వతరాజు మేరు పర్వతము బంగారు కొండను భానుడుదయా స్తమయముల ప్రదక్షిణము దిరుగుచుండును. అతనింగని వింధ్య పర్వతము మేరువునకు ప్రదక్షిణము సేసినట్లు నామేను జేయు మన సూర్యుడు, నామే నే కోరి యీ కొండకు ప్రదక్షిణము సేయుట లేదు. సృష్టికర్త నిర్మించిన దారి యిది నా కీయబడెను అన విని వింధ్యాది పరమ తపస్వి చట్టన సూర్యచంద్రుల దారి నడ్డుకొన నెంచి మీది కెదిగెను. అంతట దేవతలందరు నింద్రునితో వచ్చి పైకెగురు వింధ్యుని వారించిరి. అవ్వల నాశ్రమమందున్న ఆగస్త్యుని తపోధర్మ నిష్ఠాగరిష్ఠున తపోఅద్భుత తేజస్వి నందరు గలిసి వచ్చిన పని తెలిపిరి. 149

దేవా ఊచుః- సూర్యచంద్రమాసో మార్గం నక్షత్రాణాం గతిం తధా !

శైలరాజా వృణోత్యేష వింధ్యః క్రోధవశానుగః || 150

తం నివారయితుం శక్తో నాన్యః కశ్చిన్మునీశ్వర | తచ్ర్ఛుత్వా వచనం విప్రః సురాణాం శైలమభ్యగాత్‌ || 151

సోభిగమ్యాబ్రవీద్వింధ్యాంసాదరం సముపస్థితమ్‌ |

మార్గమిచ్ఛామ్యహం దత్తం భవతా పర్వతోత్తమ || 152

దక్షిణామభిగంతాస్మి దిశం కార్యేణ కేనచిత్‌ | యావదాగమనం మే స్యాత్తావత్వం ప్రతిపాలయ || 153

నివృత్తే మయి శైలేంద్ర తతో వర్ధస్య కామతః |

పులస్త్య ఉవాచ ః- అద్యాపి దక్షిణాద్దేశాద్వారుణిర్న నివర్తతే ||154

ఏతత్తే సర్వమాఖ్యాతం యథా వింద్యో న వర్దతే | అగస్త్యస్య ప్రభావేణ యన్మాం త్వం పరిపృచ్ఛసి || 155

శైలరాజేంద్రుడు కినుకగొని సూర్య చంద్రులయు, నక్షత్రములయు, సంచార మడ్డుకొనుచున్నాడు. వాని నాపుము. శక్తిమంతుడింక లేడన విని విప్రుడు వింధ్యు దరి కేగి ఆదరముతో నెదురువడిన యతనింగని తామిచ్చిన దారి కావలె నని కోరుచున్నా పర్వతేంద్ర ఒక పనిమీద దక్షిణ దిశ కేగవలసి యున్నాను. నేను వచ్చుదాక నీ కిట్లు పాటింపు మేను మఱలిన మీద నీ యిష్టము వచ్చినట్లడుగు మనెను. పులస్త్యుడు :- ఇప్పుడు కలండ వారుణి దక్షిణ దిశనుండి తిరిగి రాలేదు. వింధ్యగిరి యగస్త్య ప్రభావముచే పైకెదుగకుండుటిది తెలిపితిని. 155

కాలేయాస్తు యథా రాజన్‌ సురైః సర్వైర్నిఘాదితః | అగస్త్యద్వారమాసాద్య తన్మే నిగదతః శృణు|| 156

రాజా! సర్వాసురులచే కాలేయులు అగస్త్య ద్వారమున దనిసి సంహరింపబడిరి. ఆ కథ నిక వినుము. 156

త్రిదశానాం వచః శ్రుత్వా మైత్రావరుణిరబ్రవీత్‌ | కిమర్థం సముపాయాతా వరం మత్తః కిమిచ్ఛథ || 157

ఏవముక్తాస్తదా తేన దేవాస్తం మునిమబ్రువన్‌ | ఇచ్చామ ఏకం పరమద్భుతం వయం పిబార్ణవం దేవమునే మహాత్మన్‌ || 158

ఏవం త్వయేచ్ఛేను కృతౌ మహర్షే మహార్ణవమ్‌ పీయమానం సమగ్రమ్‌ |

తతో విహన్యామ చ సానుబంధం కాలేయసంజ్ఞం సురవిద్విషాం బలమ్‌ || 159

వేల్పుల పలుకాలించి మైత్రావరుణి ఎందులకు వచ్చితిరి. నా వలన మీరేమివరము కోరుదు రన వారు వింతైన దొక్కటే వరము కోరెదము. సముద్రమును ద్రాగుము. ఇదే మా కోరిక. ఇదియైన మీదట దేవ ద్వేషులును కాలేయులను వాండ్ర సమూలము మట్టు వెట్టెద మనిరి. ముని త్రిదశుల పలు కాలించి, యట్లే యని లోకముల సుఖము గూర్చు తమకోరిక నిర్వర్తించెద మనిరి.

-: అగస్త్యేన సముద్రస్యాపోశనమ్‌ :-

త్రిదశానాం వచః శ్రుత్వా తథేతి మునిరబ్రవీత్‌| కరిష్యే భవతాం కామ లోకానం సుఖకారకమ్‌ || 160

ఏవముక్త్వా తతోగచ్చత్‌ సముద్రం నిధిమంభసామ్‌ | తపః సిద్థైశ్చ మునిభిః సార్ధం దైవైశ్చ సుప్రతీ || 161

మనుష్యోరగగంధర్వయక్షాః కింపురుషాస్తథా | అనుజగ్ముర్మహాత్మానం ద్రష్టుకామాస్తదద్భుతమ్‌ || 162

తతోభ్యపశ్యన్‌ సహితః సముద్రం భీమమనస్వనమ్‌ | నృత్యంతమివ చోర్మిభిర్వల్గంతమివ వాయునా || 163

హసంతమివ ఫేనౌఘెః స్ఖలంతం కందరేషు చ | నానాగ్రహసమాకీర్ణం నానాద్విజగణౖర్యతమ్‌ || 164

అగస్త్యసహితా దేవాః సగంధర్వమహోరగాః ఋషయశ్చ మహాభాగాః సమాసేదుర్మహోదధిమ్‌ || 165

సముద్రం స సమాసాద్య వారుణిర్భగవానృషిః ఉవాచ సహితాన్ధేవానృషీంస్తాంస్తు సమాగతాన్‌ || 166

పాతుకామః సముద్రం చ అగస్త్యఋషిసత్తమః| ఏష లోకహితార్దాయ పిబామి వరుణాలయమ్‌ || 167

భవతాం యదన్టుషేయం తచ్ఛీఘ్రం సంవిధీయతామ్‌ | ఏతావదుక్త్వావచనం మైత్రావరుణిరగ్రతః || 168

సముద్రమపిబత్ర్కుద్ధస్సర్వలోకస్య పశ్యతః | పీయమాసం సముద్రం తు దృష్ట్వా దేవాః సమాసవాః || 169

విస్మయం పరమం జగ్ముస్తుభిశ్చాప్యపూజయన్‌ | త్వం నస్త్రాతా విధాతా పచ లోకానం లోకభావనః || 170

త్వత్ర్పసాదాత్సముత్సేధముపగచ్ఛే త్సమం జగత్‌ | సంపూజ్యమానస్త్రిద శైర్మహాత్మా గంధర్వముఖ్యే నదత్సుచైవ || 171

దివ్యైశ్చ పుషై#్పరవకీర్యమాణో మహార్ణవం నిఃసలిలం చకారం | దృష్ట్వా కృతం నిఃసలిలం మహార్ణవం సురాః సమస్తాః పరమప్రహృష్టాః || 172

ప్రగృహ్య దివ్యాని వరాయుధాని తాన్ధానవాన్‌ జఘ్నరదీనసత్వాః | తే వధ్యమానాస్త్రిద శైర్మహాత్మభి ర్మహాబలై ర్వేగయు తైర్నదద్భిః || 173

న సేహిరే వేగవతాం మహాత్మనాం వేగం తదా ధారయితుం దివౌకసామ్‌ ||

తే వధ్యమానా స్త్రిదశైర్ధానవా భీమనిస్వనాః | చక్రుః సుతుములం యద్ధం ముహూర్తమివ భారత || 174

తే పూర్వతపసా దగ్థా మునిభిర్భావితాత్మభిః | పతమానాః పరం శత్తయా త్రిది శైర్వినిషూదితాః || 175

తే హేమనిష్కాభరణాః కుండలాంగదధారిణః | నిహతా బహ్వశోభంత పుష్పితా ఇవ కింశుకాః || 176

హతశిష్టాస్తతః కేచిత్కాలేయదనుజోత్తమః విదార్య వసుధాం దేవీం పాతాలతలమాశ్రితాః || 177

నిహతాన్దానవాన్‌ దృష్ట్వా త్రిదశా మునిపుంగవం | తుష్టువుర్వివిధై వాక్యైరిదం చైవాబ్రువన్‌ వచః || 178

సముద్రవంట సేసి వారుణి (అగస్త్యుడు) దేవర్రులం గని, లోక క్షేమమునకు వరుణాలయమును ద్రాగుచున్నాను. తాము సేయవలసిన యనుష్ఠానము త్వరగ చేయుడు. అని కోపము గొని యెల్ల లోకము చూచుచుండ సముద్రమును ద్రావి వేసెను. అది చూచి యింద్రాది దేవతలు వింతపడిరి. వినుతించి మునిని బూజించిరి. నీవు మా రక్షకుడవు. లోక విధాతవు. లోక భావనుడవు. నీ ప్రసాదమున జగత్తు పెంపొందగలదు అని వేల్పులచే పూజింపబడి దివ్వ పుష్పములు పై జిమ్మబడి గంధర్వులు వాద్యములు వాయింప మహార్ణవమును నిర్జలము గావించెను. సురు లది చూచి పరమానంద భరితులైరి. దేవతలాయుధములు సేకొని దానవులం గొట్టిరి. దేవతల యా వేగము నసురులోర్వ లేరైరి. అటు వధింపబడుచు నార్చుచు మునులు మును సేసిన తపస్సుచే దగ్గులై నేల గూలిరి. బంగారుకాసుల పేరులు కుండలములు భుజకీర్తులు ధరించిన దానవులు నేలగూలి పూచిన కింశుకము లట్లెంతో సొంపు గొనిరి. చావగా మిగిలిన కొందరు కాలేయులు భూదేవిం జీల్చికొని పాతాళమున జేరిరి. అది చూచి త్రిదశులు ముప్పదికోట్లు దేవత లిట్లు స్తుతించిరి.

-: దేవానామగస్త్యస్తుతిః :-

త్వత్ప్రాసాదాన్మహాభాగ లోకైః ప్రాప్తం మహత్సుఖమ్‌ | త్వత్తేజసా చ నిహతాః కాలేయా భీమవిక్రమాః || 179

పూరయస్వ మహావిప్ర సముద్రం లోకభావనమ్‌ | యత్త్వయా సలిలం పీతం తదస్మిన్‌ పునరుత్ర్సుజ || 180

ఏవముక్తః ప్రత్యువాచ భగవాన్మునిపుంగవః | జీర్ణం తద్ధి మయా తోయముపాయోన్యః ప్రచింత్యతామ్‌ || 181

పూరణార్థం సముద్రస్య భవద్భిర్యత్న మాస్థితైః | ఏవం శృత్వా తు వచనం మహర్షేర్భావితా త్మనః || 182

విస్మితాశ్చ విషణ్ణాశ్చ బభూవుః సహితాః సురాః | పరస్పరమనుజ్ఞాప్య ప్రణమ్య మునిపుంగవమ్‌ || 183

ప్రజాః సర్వా మహారాజ విప్రా జగ్ముర్యధాగతమ్‌ | త్రిదశా విష్ణునా సార్ధమనుజగ్ముః పితామహమ్‌ || 184

పూరణార్ధం సముద్రస్య మంత్రయంతః పరస్పరమ్‌ | ఊచుః ప్రాంజలయః సర్వే సాగరస్య హి పూరణమ్‌ || 185

తానువాచ సమేతాంస్తు బ్రహ్మలోకపితామహః | గచ్ఛద్వం విబుధాస్సర్వే యథాకామం యథేప్సితమ్‌ || 186

మహతా కాలయోగేన ప్రకృతిం యాస్యతేర్ణవః | జ్ఞాతీంస్తు కారణం కృత్వా మహారాజా భగీరథః || 187

గంగౌఘేన సముద్రం చ పునః సంపూరయిష్యతి | 188

ఏవం తే బ్రహ్మణా దేవాః ప్రేషితా ఋషిసత్తమాః | ఉవాచ భగవాంస్టుష్తస్త్వగస్త్యమ్‌ ఋషిసత్తమమ్‌ || 189

-: దేవతలగస్త్యుని స్తుతించుట :-

నీ యనుగ్రహముచే మహానుభావా! లోకములెంతో సుఖమొందినవి. నీ తేజస్సుచే కాలేయులు చందవిక్రములు గూలిరి. ఇంకిన సముద్రమును నింపుము. నీ త్రావిన జలమదే వదలుమన భగవానుడు నా తోయము జీర్ణమై పోయె గదా మరి యింకొకటి ఆలోచింపుడు. తాము నిండింప యత్నింపు డన విని వింత వడి దిగులువడి రందరు లసురలనుజ్ఞ గొని యొండొరులందెలియ బలికిగొని చనిరి. ప్రజలు విప్రులందరు వచ్చిన దారింజనిరి. దేవతలు విష్ణువుతో వెంబడించి బ్రహ్మదరి కేగి సముద్రముం బూరించుట కొండొరులు మంతనము సేసి యంజలి సేసి బ్రహ్మకు విన్నవించి కొనిరి. ఆదేశ సమావేశముం జూచి బ్రహ్మ విబుధులారా! మీరు యధేష్టముగా వెళ్ళుడు చాలాకాలమునకీ సముద్రము (ప్రకృతిని) స్వస్థితిని బొందును తన జ్ఞాతులనుకారణము సేసికొని భగీరథుడు మహారాజు గంగాప్రవాహముతో దిరిగి నిండించును. ఇట్లు వేల్పులు ఋషులు, బ్రహ్మచే నంపబడిరి. బ్రహ్మదేవుడు సంతుష్టుడై ఋషిసత్తమున నగస్త్యుని గూర్చి యిట్లనియే. 189

దేవకార్యం తు భవతా దానవానాం వినాశనమ్‌ | యతస్సంతారితా దేవాస్తేన తుష్టోస్మి వై మునే || 190

అభిప్రేతో వరో యస్తే యాచయస్వ దదామి తమ్‌ | ఏవముక్తస్తదాగస్త్వః ప్రణిపాతపురస్సరమ్‌ || 191

ఇహస్థేన మయా దేవ కార్యమిదం కృతమ్‌ | సర్వాశ్రమాణాం ప్రవరో భవత్యేష మమా శ్రమః || 192

త్వయా చోక్తస్తు భగవన్భవితా నాత్ర సంశయః |

బ్రహ్మోవాచః- యాత్రాం తు పుష్కరే కృత్వా ఇహాగత్య నరాస్తు యే || 193

ఇహ కుండేషు యే స్నానం తర్పణం పితృదేవయోః | అర్చనం చైవ దేవేషు సర్వమక్షయకారకమ్‌ || 194

అర్థం చోచ్చావచం గృహ్యశాష్కులంపూపకాంస్తతః | దాస్యంతి ద్విజముఖ్యేభ్యస్తేషాం వాసస్త్రివిష్టపే || 195

నీచే దేవకార్యము దానవ నాశనము జరిగినది. దేవతలు గట్టెక్కింప బడిరి. సంతోషించితిని. ఇష్టమైన వరమేదో యడుగుకొను మిత్తును. ఆసనగస్త్యుడు వ్రాలి మొక్క దేవా ! ఇటనుండి ఈ పని సేసితిని. అన్ని యాశ్రమముల కన్న ఈ నా యాశ్రమము మిన్నయగును. నీవౌ నన్న నై తీరును. ఇది సందియము లేదు. అని మునిపలుక బ్రహ్మ, పుష్కర యాత్రసేసి కొని యిట వచ్చిన ఈ కుండములందు సేసిన స్నానము దేవ, పితృ, దేవ, తర్పణము, దేవ తార్చకము సర్వమక్షయ మగును. కొంచెమో, గొప్పగనో, ధనముచే వాని జంతిక లప్పాలు ద్విజ ముఖ్యుల కిచ్చిపలయు నిటవారి కక్షయ స్వర్గ నివాస మగును. 195

శ్రాధ్దేన పితరస్తృప్తా యావదాప్లుతసంప్లవమ్‌ | కందమూలఫలైర్యాపి తర్ప యిష్యతి యో మునిం 196

సప్తర్షిస్థానమాసాధ్య మోదతే శాశ్వతీః సమాః | యజ్ఞపర్వతమారూఢో ద్రష్ట్వా గంగాం వినిర్గతామ్‌ || 197

ఉదఙ్ముఖీం దేవనదీం నిర్గతో వుష్కరం ప్రతి | అత్రాభిషేకం యః కుర్యాత్పితృదేవార్చనే రత ః || 198

ఆశ్వమేథఫలం తస్య భవత్యేవ న సంశయః |

యస్త్వేకం భోజయేద్విప్రం కోటిర్భవతి భోజితా | ఆక్షయం స్త్వన్నపానం చ ఆత్ర దత్తం మునీశ్వర || 199

ఇట శ్రాద్దమున పితరులు ప్రళయమందాక సంతృప్తులౌదురు. కందమూల ఫలాదులచేతనేని మునిని సంతృప్తి పరచినతడు సప్తర్షి స్థాన మందికొని శాశ్వతముగ నమ్మోదించును. యా యజ్ఞపర్వత మెక్కి యుత్తరాభిముఖియై పుష్కరాంశము జాలువారిన దేవనదిని గంగను దర్శించి , అట నభిషేకము నేసి దేవ పితృదేవతల నర్చించి యొకవిప్రునికేని భోజమును పెట్టిన అశ్వమేధ ఫలమందు కోటి మందికి సంతర్పణ చేసినట్లగును. మునీంద్రా! ఇట నిచ్చిన యన్నపానము లక్షయములు. 199

యో యమిచ్ఛతి కామం తు సర్వం తస్య భవిష్యతి | నవియోనిం వ్రజత్యత్ర స్నాతమాత్నే నరే భువి|| 200

స్థానానాం పరమం స్థానం తీర్ధానాం తీర్థముత్తమమ్‌ | మయా దత్తం మునిశ్రేష్ఠ భవిష్యతి స్వ సంశయః || 201

జన్మప్రభృతి యత్పాపం స్త్రియా వా పురుషస్య వా | అత్రైవ స్నాతమాత్రస్య సర్వమేత త్ర్పణశ్యతి || 202

ఏవముక్త్వా తు భగవాన్ర్బహ్మా లోకపితామహః | జగామామంత్ర్య స మునిమగస్త్యం మునిసత్తమమ్‌ || 203

అగస్త్యో పి స్థితస్తత్ర హ్యాశ్రమే స్వే పరంతప | అగస్త్య - స్యా శ్రమోత్పత్తి రేషా తే పరికీర్తితా || 204

సప్తర్షిణామాశ్రమాంశ్చ కీర్తయిష్యే కురూద్వహ| అత్రిశ్చైవ వశిష్టో థ పులస్థ్యః పులహః క్రతుః || 205

ఆంగిరా గౌతమశ్చైవ సుమతః సుముఖ స్తథా | విశ్వామిత్రః స్థూలశిరాః సంవర్తశ్చ ప్రతర్దనః || 206

రైబ్యో బృహస్పతిశ్చైవ చ్యవనః కశ్యపో భృగుః | దూర్వాసా జమదగ్నిశ్చ మార్కండేయోధ గాలవః 207

ఉశనాధ భరద్వాజో యవక్రీతస్తథా మునిః | స్థూలాక్షః సకలాక్షశ్చ కణ్వో మేధాతిథిః కృతః|| 208

నారదః పర్వత శ్చైవ స్వగంధీ చ్యవనో ద్విజః | తృణాంబు ః శబలో దౌమ్యః శతానందో కృతవ్రణః|| 209

జమదగ్నిస్తథా రామో హ్యష్టక శ్చైవమాదయః | కృష్ణద్వైపాయన శ్చైవ పుత్రా శిషై#్యః సమన్వితః|| 210

ఏతేతు పుష్కరం ప్రాప్య సప్తర్షిణామథాశ్రమే | వేష్టితా నియమైశ్చాపి దయాయుక్తా తపస్వినః || 211

ఆనృశంస్యం జయో ధైర్యం తపః సత్యం క్ష మార్జవమ్‌| దయా దానం జపశ్చైవ సర్వేషాం తత్ర్పతిష్టితమ్‌ || 212

ఇహ యత్ర్కియతే కర్మ తత్పర త్రోపభుజ్యతే | జ్ఞాత్వా దివ్యం మునయః పరమా ర్ధపరాయణాః|| 213

అతను కోరిన ప్రతి కోరిక తీరును. ఇచట స్నానమాడినంత మాత్రాన నీచ జాతిలో పట్టజాలరు. అన్ని స్థానములలో ఉత్తమ స్థానము, అన్ని తీర్తములలో ఉత్తమ తీర్థముగా నే నిచ్చుట వలన కాగలదు. ఇచట స్నానము మాత్రము వలన స్త్రీకి కాని, పురుషునికి కాని పుట్టినప్పటినుండి చేసిన పాపములన్నియు తొలగును. చతుర్ముఖబ్రహ్మ ఇట్లు చెప్పి అగస్త్య మహర్షికి చెప్పి వెళ్ళెను. తమ ఆశ్రమమున అగస్త్య మహర్షి వచ్చుటవలన దీనిని అగస్త్యాశ్రమ మని అందురు. ఇది ఆగస్త్యా శ్రమోత్పత్తి. నీకు చెప్పబడినది. ఇక ఇపుడు సప్తర్షి ఆశ్రమమును చెప్పెదను.

అత్రి, వసిష్టుడు, పులస్త్యుడు పులహుడు, క్రతువు ఆంగిరా , గౌతమ, సుమతి, సుముఖుడు, విశ్వామిత్రుడు స్థూలశిరా, సంవర్తుడు, ప్రతర్ధనుడు, రైభ్యుడు, బృహస్పతి, చ్యవనుడు, కశ్యపుడు, భృగువు, దుర్వాసుడు, జమదగ్ని, మార్కండేయుడు, గాలవుడు, శుక్రుడు, భరద్వాజుడు, యవక్రీతుడు, స్థూలాక్షుడు, సకలాక్షుడు, కణ్వుడు మేధాతిధి, నారధుడు, పర్వతుడు, స్వగంధి, చ్యవన మహర్షి, తృణాంబువు, శబలుడు, ధౌమ్యుడు, శతానందుడు, కృతవ్రణుడు, పరశురాముడు, అష్టకుడు, కృష్ణద్వైపాయనుడు మోదలగువారు పుత్రులతో, శిష్యులతో కలిసి వీరంతా పుష్కరమును చేరి సప్తర్షి ఆశ్రమమున నియమాన్వితులై, దయాయుతులైరి. వీరందరికి అనృశంస్యము (ఆశ్రయించిన వారిని కాపాడుట) జయము, ధైర్యము, తపస్సు, సత్యము, క్షమ, ఆర్జవము, దయా , దానము, జపము అందరిలో ప్రతిష్టించబడినవి. ఇచట చేసిన కర్మయే పరమున అనుభవించబడును. ఈ విషయమును తెలిసిన మునులు పరమార్థ పరాయణులైరి. 213

న తత్ర నాస్తికా యాంతి న స్తేనా నా జితేంద్రియా ః | న నృశంసా న పిశునా కృతఘ్నా న మానినః|| 214

సత్యతేజస్వినః శూరదయావంతః క్షమాపరాః | యజ్వానో యజ్ఞశీలాశ్భ నిరీహా నిరుపద్రవాః|| 215

నిర్మమా నిరహంకారా తత్ర గచ్ఛంతి పుష్కరే | న రోగో న జరా మృత్యుర్భవితా త్ర మహాత్మనామ్‌|| 216

న తత్రమూఢా విశంతి పురుషా విషయాత్మకాః | కామలోభమదద్రోహక్రోదమో హైరుపధృతాః|| 217

తుల్యమానా వమానాశ్చ నిర్ద్వంద్వాః సంయతేంద్రియాః | ధ్యానయోగపరా శ్చైవ తే తు గచ్ఛంతి పుష్కరమ్‌ || 218

అశ్రమేషు యథోక్తేషు యథోక్తం వై ద్విజాతయః | యే వర్తంతే యమం త్రాతుం తేషాం లోకమహోదయాః || 219

యే నహి సంతి భూతాని కర్మణా మనసా గిరా | అసృశంసపరాః సంతః సర్వథా చ ప్రియంవదాః|| 220

అగ్నిహోత్రరతా నిత్యం చాతిథిపూజకాః| నిత్యం స్వాధ్యాయవంతశ్చ నిత్యం స్నానపరాయణాః ||221

మాతృవత్స్వస్రువచ్చైవ తథా దుహితృవచ్చ హి | పరదారాన్ర్పపశ్యంతి సతతం విగతస్పృహాః|| 222

యేధిక్షిప్తా న కుప్యంతి స హింసంతి చ హింసితాః | సమదుఃఖసుఖాః సంతో మహాత్మానో జితేంద్రియాః|| 223

తే హి సర్వే ప్రపశ్యంతి పురా చేరుర్మహీమిమామ్‌| సమాధినా చింతయంతో బ్రహ్మలోకం సనాతనమ్‌|| 224

ఈ సప్తర్షి ఆశ్రమమున నాస్తికులు, చోరులు, ఇంద్రియ నిగ్రహము లేనివారు, నృశంసులు, లోభులు కృతఘ్నులు, దురభిమానులు వెళ్ళజాలరు. సత్యవంతులు, తేజోవంతులు, శూరులు, దయావంతులు, క్షమాపరులు, యజ్వులు, యజ్ఞశీలులు, నిష్కాములు, ఉపద్రవరహితులు, మమకారరహితులు, అహంకారరహితులు ఇచటకి వచ్చెదరు. ఈ ఆశ్రమములో మహానుభావులకు రోగము, జరామృత్యువులు సంభవించవు. ఈ ఆశ్రమమున మూఢులు, విషయలంపటులు ప్రవేశించజాలరు. కామలోభ మదద్రోహ, క్రోధమోహములు ఇచటివారికి సంక్రమించవు. మానావమానములను సమానముగా భావించువారు, శీతోష్ణాది ద్వంద్వముల ప్రభావము పడనివారు. , ఇంద్రియ నిగ్రహము కలవారు, ధ్యానయోగపరులు మాత్రమే ఈ ఆశ్రమమునకు రాగలరు. పైన చెప్పబడిన ఆశ్రమములలో బ్రాహ్మణాగ్రేసరులు పుణ్యకార్యములను చేయువారు. ఉత్తమ లోకములను చేరుదురు. త్రికరణశుధ్దిగా భూత హింసను ఆచరించనివారు అనృశంస్యములో ఉత్తములు సజ్జనులు ఎప్పుడూ ప్రియమునే (ఆచరించువారు) మాటలాడువారు నిత్యాగ్ని హోత్రులు నిత్య అతిథి పూజకులు నిత్య స్వాధ్యాయపరులు నిత్యస్నానపరాయణులు పరస్త్రీలను తల్లివలే, చెల్లివలె కూతురువలె చూచువారు విషయాసక్తి లేనివారు, నిందించిననూ కోపించనివారు, హింసించబడియూ హింసించనివారు, సుఖ దుఃఖములను సమముగా చూచువారు , సత్పురుషులు, మహాత్ములు ఇంద్రియ నిగ్రహము కలవారు, పూర్వము ఈ భూమిపై సంచరించువారు. ఈ ఆశ్రమమును చూడగలరు. సమాధిలో ధ్యానమును చేయుచు సనాతన బ్రహ్మలోకమును చేరెదరు. 224

అధా భవదనావృష్టిః కదాచిన్మహతీ తదా | కృచ్ర్చప్రాయోహ్యభూత్తత్ర సర్వలోకః క్షుధార్దితః || 225

తతో నిరన్నే లోకే స్మింశ్ఛా త్మనాం తే పరీత్సవః | మృతం కుమారమాదాయ కృచ్ఛ్ర ప్రాయాస్తదా పచన్‌ | 226

ఆథ పర్యచరత్తత్ర క్లిశ్యమానాన్‌ హితానృషీన్‌ | దృష్ట్యా రాజా విషాదార్తం ప్రోవాచేదం వచస్తదా|| 227

ఒకప్పుడు గొప్ప ఆనావృష్టి సంభవించింది. లోకమంతయూ ఆకలితో పీడించబడినది. జీవితమే కష్టభూయిష్టమైనది. అన్నము దొరకని లోకమున శరీరమున రక్షించుకొనగోరి చనిపోయిన కుమారుని తీసుకొనిపోయి వండుకొనసాగిరి. ఇట్లు కష్టపడుచున్న హితపరులైన ఋషులను సేవించుటకువచ్చిన రాజు వారిని చూచి విషాదార్తుడై ఇట్లు పలికెను. 227

రాజోవాచ| - ప్రతిగ్రహో బ్రాహ్మణానాం దృష్టా వృత్తిరనిందితా | తస్మాత్ర్పతిగ్రహాన్మత్తో గృహ్ణీధ్వం మునిసత్తమాః|| 228

వరాన్‌ గ్రామాన్‌ వ్రీహియవాన్‌ రసాన్రత్నాని కాంచనమ్‌ | గాశ్చ ధేనుశ్చ తత్సర్వం మా మాంసం పచత ద్విజాః || 229

రాజు కలికెను.

బ్రాహ్మణులకు దానము స్వీకరించుట వృత్తిగా కలవారు. కావున మునిశ్రేష్ఠులారా నానుండి స్వీకరించుడు. మంచి గ్రామములను ధాన్యములను రసములను రత్నములను బంగారమును గోవులను ధేనువులను తీసుకొనుడు. మాంసమును వండకుడు. 229

ఋషయ ఊచుః:- రాజన్ర్పత్రిహో ఘోరో మధ్వాస్వాదో విషోపమః|

తజ్జానతాం నః కస్మాత్వం కురుషే సంప్రలోభనమ్‌|| 230

దశసూనాసమశ్చక్రీ దశచక్రీసమో ధ్వజీ | దశ ధ్వజీసమా వేశ్యా దశ##వేశ్యాసమో నృపః || 231

దశసూనాసహస్రాణి యో వాహయతి శౌండికః| తేన తుల్యస్తతో రాజా ఘోరస్తస్య ప్రతిగ్రహః|| 232

యో రాజ్ఞః ప్రతిగృహ్ణాతి బ్రాహ్మణో లోభమోహితః | తామిస్రాదిషు ఘోరేషు నరకేషు స పచ్యతే || 233

తద్గచ్ఛ కుశలం తే స్తు సహదానేన పార్ధివ | అన్యేషాం దీయతామేతానీత్యుక్త్వా తే వనం యయుః|| 234

అధ రాజ్ఞః సమాదేశాత్తత్ర గత్వా ధ మంత్రిణః | ఉదుంబరాణి వ్యకిరన్‌ హేమగర్భాణి భూతలే|| 235

తతో హ్యత్ర విచిన్వంతో గృహ్ణంశ్చోదుంబరాణ్యపి | గురూణి హి విదిత్వా తున గ్రాహ్యాణ్య త్రిర బ్రవీత్‌|| 236

ఋషులు పలికిరి :

ఓ మహారాజా : దానము స్వీకరించుట మహాఘోరము. మద్యమును సేవించుట విషము వంటిది. ఈ విషయము తెలిసిన మమ్ములను ఎందుకు లోభింపచేయుచున్నావు. పదిమంది కటికవానితో సమానము మండలాధిపతి. పదిమంది మండలాధిపతులతో సమానము ధ్వజాధిపతి. పదిమంది ధ్వజాధిపతులతో సమానము వేశ్య. పదిమంది వేశ్యలతో సమానము రాజు. పదివేల కటికవారిని పోషించువాడు చక్రవర్తి. (శౌండికుడు) అతనితో సమానుడైన రాజునుండిదానము స్వీకరించుట పరమ ఘోరము. లోభమోహితుడై రాజునుండి దానము స్వీకరించువాడు తామిశ్రాది ఘోరనరకములందు బాధలను అనుభవించును. కావున వెళ్ళుము. నీకు క్షేమమగు గాక. ఇతరులకు దానము చేయుము అని పలికి వారవనములకు వెళ్ళిరి. తరువాత రాజు ఆజ్ఞ వలన మంత్రులు ఆచటవెళ్ళి బంగారమును లోపల పొదిగిన మేడిపండ్లను అచట వెదజల్లిరి. ఆహారమును వెతుకుచు అచటికి వచ్చిన ఋషులు ఆ మేడిపండ్లను స్వీకరించిరి. అంతట మేడిపండ్లు పెద్దగా ఉండుట చూచిన అత్రిమహర్షి తీసుకొనరాదు అనెను. 236

అత్రిరువాచ ః | నాస్మహే మూఢవిజ్ఞానా | నాస్మహే మందబుద్దయః|

హైమానీమాని జానీమః ప్రతిబుద్దా స్మ జ్ఞానినః | 237

ఇహైవేదం వసుప్రీత్త్యై ప్రేత్య వైకుంఠితోదయమ్‌ | తస్మాన్న గ్రాహ్యమేవై తత్పుఖమానంత్యమిచ్ఛతా | 238

శ##తేన గుణితాం నిష్కం సహస్రేణ సమన్వితమ్‌ | యశ్చాన్యతః ప్రతీచ్ఛేత్స పాపిష్ఠాం లభ##తే గతిమ్‌ || 239

యత్ర్పధివ్యాం వ్రీహియవం హిరణ్యం పశవః స్త్రీయః నూనం నైకస్య పర్యాప్తమితి మత్వా శమం వ్రజేత్‌ || 240

అత్రిమహర్షి పలికెను. :-

మనము జ్ఞానములేనివారము కాము. మందబుద్ధులమూ కాదు. ఇవి బంగారము పొదిగినవని తెలసితిమి. జ్ఞానులము కావున త్వరలో మేల్కొంటిమి. ఈ ధనమును ఇక్కడనే ఉంచవలయును. దీనిని గ్రహించినచో అభివృద్ధి కుంటుపడును. కావున మనకు ఉత్తమలోకముల కోరిక వున్నచో వీటిని గ్రహించరాదు. నూరురెట్లు బంగారముతో చేయబడిన ఆభరణమును వేయిరెట్లతో కూడినదానిని యితరులనుండి స్వీకరించినచో పాపష్టిగతిని పొందును. ఈ భూమండలమున కల సమస్త వ్రీహులు గోధుమలు, బంగారము, పశువులు, స్త్రీలు ఒక్కనికికూడా తృప్తిని కలిగించజాలవని తెలిసి శాంతించవలయును. 240

వశిష్ట ఉవాఛ : - తపసాం సంచయో యస్య ద్రవ్యాణాం యస్య సంచయః|

తపః సంచయ ఏవేహ విశిష్టో ధనసంచయాత్‌ | 241

త్యజతః సంచయాన్సర్వాన్యాన్తి నాశముపద్రవాః| న హి సంచయవాన్కశ్చిదృశ్యతే నిరుపద్రవః|| 242

యథా యథా న గృహ్ణాతి బ్రాహ్మణోసత్ర్పతి గ్రహమ్‌ | తథా తస్య హి సంతోషాద్ర్బాహ్మం తేజో వివర్దతే | 243

అకించనత్వం రాజ్యం చ తులయా సమతోలయత్‌ | అకించనత్వమధికం రాజ్యాదపి హితాత్మనః| 244

వసిష్ట మహర్షి పలికెను :-

తపస్సంచయ ధనసంచయములలో తపస్సంచయ మే విశిష్టము. అన్ని రాశులను త్యాగముచేసినవారికి ఉపద్రవములు నశించును. కూడబెట్టినవాడు ఏ ఉపద్రవములు లేకుండా ఎక్కడా కానరాడు. చెడువారినుండి దానము గ్రహించని వారికి సంతోషము బ్రహ్మతేజస్సు వృద్దిచెందును. అకించసత్వమును (ఏమీలేకుండుటను) రాజ్యమును త్రాచులోవేసి తూచినచో రాజ్యముకంటే అకించనత్వమే అధికము. 244

కశ్యప ఉవాచ:- అనర్దో బ్రాహ్మణసై#్యష యస్త్వర్ధనిచయో మహాన్‌ | 245

అర్థెశ్వర్యవిమూఢో హి శ్రేయసో భ్రశ్యతే ద్విజః | అర్ధసంపద్విమోహాయ విమోహో నరకాయ చ || 246

తస్మాదర్దమనర్ధాఖ్యం శ్రేయోర్ధీ దూరతస్త్యజేత్‌ | యస్య ధర్మార్థమర్థేహా తస్యా నీహా గరియసీ || 247

ప్రక్షాళనాద్ధి పంకస్య దూరాత్‌స్పర్శనం వరమ్‌ | యోర్ధేన సాధ్యతే ధర్మః క్షయిష్ణుస్స ప్రకీర్తితః || 248

యః పరార్థే పరిత్యాగః సో క్షయో ముక్తిలక్షణః |

కశ్యప మహర్షి పలికెను. :-

అర్థమును ప్రోగుచేయటయే బ్రాహ్మణునకు గొప్ప అనర్ధము. ధనముతో ఐశ్వర్యముతో మూఢుడైన బ్రాహ్మణుడు శ్రేయస్సునుండి భ్రష్టుడగును. ధనసంపదలు మోహమును కలిగించును. మోహము వలన నరకము సంప్రాప్తించును. కావున శ్రేయస్సును కోరువారు అనర్థమును కలిగించు అర్ధమును దూరముగా వీడవలయును. ధర్మము కొరకు అర్థము నాశించువాడు ఆశను విడుచుట వలననే మేలును పొందును. బురదనుతొక్కి కాలుకడుగుటకంటే బురదకు దూరముగా నుండుటయే మేలుకదా? అర్థముచేత సాధించు ధర్మము నశించునదిగా పేర్కొనబడినది. ఇతరుల కొరకు త్యాగముచేసినవారు అక్షయమగు ముక్తికి సూచికలు. 2481/2

భరద్వాజ ఉవాచ :- జీర్యంతి జీర్యతః కేశా దంతా జీర్యంతి జీర్యత ః || 249

ధనాశా జీవితాశా చ జీర్యతోపి న జీర్యతి | చక్షుః శ్రోత్రే చ జీర్యేతే తృష్ణైకా నిరుపద్రవా|| 250

సూచ్యా సూత్రం యథా వస్త్రే సమానయతి సూచకః | తద్వత్సంసారసూత్రం హి తృష్ణా సూచ్యోపనీయతే || 251

యథా శృంగం రురోః కాయే వర్ధమానే చ వర్థతే | అనంతపారా దుష్పూరా తృష్ణా దుఃఖశతావహా || 252

అధర్మబహులా చైవ తస్మాత్తాం పరివర్జయేత్‌ |

భరద్వాజ మహర్షి పలికెను. :-

శరీరము వృధ్దాప్యముతో జీర్ణించువానికి కేశములు జీర్ణములగును. (నెరయును) జీర్ణించువానికి దంతములు రాలిపోవును. ఎంత జీర్ణించుచున్ననూ ధనముపై ఆశ బ్రతుకుపై ఆశ మాత్రము జీర్ణము కాదు. చెవులు కన్నులు జీర్ణించును కాని ఆశకు ఏ ఉపద్రవము లేదు. కుట్టువాడు దారమును సూదితో వస్త్రములో చేర్చి చిరుగును పూరించునట్లు అట్లే సంసారమును దారమును ఆశ అను సూదితో చేర్చును. రురుమృగశరీరము పెరుగుచున్నపుడు కొమ్ము పెరుగునట్లు ఆశ పెరుగును. అంత చిక్కనిది తీరము కనపడనిది. ఆశ అనేక దుఃఖములకు ఆలవాలము. ఆధర్మమునకు అధికముగా నుండునది కావున ఆశను విడువ వలయును. 252 1/2

గౌతమ ఉవాచ :- సంతుష్టః కో న శక్నోతి ఫలైశ్చా ప్యతివర్తితుమ్‌ || 253

లుబ్దఇంద్రియలౌల్యేన సంకటాన్యవగాహాతే | సర్వత్ర సంపదస్తస్య సంతుష్టం యస్య మానసమ్‌ || 254

ఉపానద్‌ధృఢపాదస్య తస్య చర్మావృతేవ భూః | సంతోషామృతతృప్తానాం యత్సుఖం శాంతచేతసామ్‌|| 255

కుతస్తద్దనలుబ్ధానామితశ్చేతశ్చ ధావతామ్‌ | అసంతోషః పరం దుఃఖః పరమం సుఖమ్‌|| 256

సుఖార్ధీ పురుషస్తస్మాత్సంతుష్టః సంతతం భ##వేత్‌|

గౌతమ మహర్షి పలికెను: -

సంతృప్తిపొందువాడు తమనుకొన్నదానికంటె అధిక ఫలమును పొందును. లోభి ఇంద్రియచాపల్యముతో కష్టములలో మునుగును. సంతోషము నిండిన మనసుకలవానికి అంతటా సంపదలే. పాదరక్షలు గలవానికి భూమియంతము చర్మముతో కప్పబడినట్లే కదా: సంతోషామృతముతో తృప్తిపొంది శాంతచిత్తులగువారికి కలుగ సుఖము ధనలోభములో పలుదిక్కులకు పరుగిడువారికి ఎట్లు లభించును. అసంతోషము పరమదుఃఖము. సంతోషము పరమ సుఖము. కావున సుఖమును కోరువారు ఎప్పుడూ సంతోషముతో నుండవలయును. 256 1/2

విశ్వామిత్ర ఉవాచ :- కామం కామయమానస్య యది కామః సమృద్ద్యతి || 257

అధైనమపరః కామో భూయో విధ్యతి భాణవత్‌ | న జాతు కామః కామానాముపభోగేన శామ్యతి || 258

హవిషా కృష్ణవర్మేవ భూయ ఏవాభి-వర్థతే | కామానభిలషన్మోహాన్న నరః సుఖమేధతే || 259

శ##మేనాలయతరుచ్ఛాయాం వ్రజన్నివ కార్పంజలః | చతుస్సాగరపర్యంతాం యో భుంక్తే పృథీవీమిమామ్‌|| 260

తుల్యాశ్మకాఙ్చనో యశ్చ స కృతార్థో న పార్ధివః |

విశ్వామిత్ర మహర్షి పలికెను.

కోరికలను కోరువారి కోరిక నెరవేరినచో మరొక కోరిక బాణమువలె తాకును. కోరికలు అనుభవించుటతో శాంతించవు. అగ్నిహోత్రము నెయ్యితో చల్లారదుగదా! ఇంకా వృద్ది చెందును. మోహముతో కోరికలను కోరువారు సుఖమును పొందజాలరు. కపింజల పక్షి డేగ గూడు కల చెట్టు నీడను చేరినట్లగును. నాలుగు సముద్రములు పరివేష్టించియున్న భూమండలమును అనుభవించు చక్రవర్తి కన్న రాయిని బంగారమును సమానముగా భావించువాడే కృతార్థుడు. 260 1/2

జమదగ్నిరువాచ :- ప్రతిగ్రహసమర్థోపి నాదత్తేయః వ్రతిగ్రహమ్‌ || 261

యే లోకా దానశీలానాం స తానాప్నోతి శాశ్వతాన్‌| యోర్థానిచ్ఛేనృపాద్విప్రః శోచితవ్యో మహర్షిభిః || 262

న స పశ్యతి మూఢాత్మా నరకే యాతనాభయమ్‌ | ప్రతిగ్రహసమర్థోపి న ప్రసజ్యేత్ర్పతిగ్రహే|| 263

ప్రతిగ్రహేణ విప్రాణాం బ్రాహ్మ్యం తేజః ప్రశామ్యతి | ప్రతిగ్రహసమర్థానాం నివృత్తానాం ప్రతిగ్రహాత్‌ || 264

య ఏవ దదతాం లోకాస్త ఏవా ప్రతిగృహ్ణతామ్‌|

జమదగ్ని మహర్షి పలికెను.

దానమును స్వీకరించ గలిగినను దానమును పరిగ్రహించని వాడు దానముల నిచ్చువారి లోకములను పొందును. రాజు నుండి ధనమును గోరువారు మహర్షులచే చింతించదగిన వారగుదురు. దానమును గ్రహించగలుగు వాడైనను దానమునందు ఆసక్తిలేని వాడు నరకమున యాతనాభయమును చూడజాలడు. దానమును పరిగ్రహించుట వలన బ్రాహ్మణుల తేజస్సు క్షీణించును. దానమును స్వీకరించగల వారైనను స్వీకరించనిచో దానము చేయువారికి లభించు లోకములు, స్వీకరించని వారికి లభించును. 2641/2

అరుంధత్యువాచ: - బిసతంతుర్యధా నత్యమంభస్థస్సతతాం విశేత్‌|| 265

తృష్ణా చైవమనాద్యంతా తథా దేహగతా సదా | యా దు స్త్యజా దుర్మతిభిర్యా న జీర్యతి జీర్యతః || 266

యోసౌ ప్రాణాంతికో రోగస్తాం తృష్ణాం త్యజతః సుఖమ్‌|

అరుంధతి పలికెను.

నీటిలోని తామరతూటి దారము తామర నాళములో చేరి ఉండునో దేహమున గల ఆశగూడ ఆద్యంతములు లేనిదై పెరుగు చుండును. దుర్భుద్ది గలవారు వదల లేనిది జీర్ణించినను తరగనిది ప్రాణములను అంతముచేయు రోగమగు ఆశను వదలిన వాడే సుఖమును పొందగలడు. 266 1/2

చాండాల ఉవాచ :- ఉగ్రాదితో భయాద్యస్మాద్భిభ్యతీమే మహేశ్వరా|| 267

బలీయసో దుర్బలవత్తస్మాచ్చైవ బిభేమ్యహమ్‌|

చాండాలుడు పలికెను.

ఈ మహానుభావుడు ఉగ్రభయము వలన భయపడుచున్నాడు. బలవంతుని నుండి దుర్బలుడు భయపడునట్లు నేను భయపడుచున్నాను. 2671/2

పశుసఖ ఉవాచ :- యదా చరంతి విద్వాంసః సదా ధర్మాపరాయణాః|| 268

తదేవ విదుషా కార్యమాత్మనో హితమిచ్ఛతా | ఇత్యుక్తా హోమగర్భాణి త్యక్త్వా తాని ఫలాని వై|| 269

ఋషయో జగ్మురన్యత్ర సర్వ ఏవ ధృడవ్రతాః| తతస్తే విచరంతో వై మధ్యమం పుష్కరం గతాః|| 270

దదృశుః సహసా ప్రాప్తం పరివ్రాజం శునఃసఖమ్‌ | తేనేహ సహితాస్తత్ర గత్వా కించిద్వనాంతరమ్‌ | 271

సరః పరమపశ్యంత వృతం పద్మైర్జలాశయమ్‌ | నివిష్టాః సరసస్తీరే చింతయంతో గతిం శుభామ్‌|| 272

శునఃసఖో మునీన్సర్వానువాచ క్షుధితాం స్తదా | సర్వే వదంతు సహితాః కీదృశీ క్షుత్ర్పవేదనా|| 273

తమూచుః సహితాస్తే తు పరివ్రాజం శునఃసఖమ్‌|

పశుసఖుడు పలికెను.

ధర్మపరాయణులైన పండితులు ఆచరించు దానిని తన హితమును కోరువారు ఆచరించవలయును. ఇట్లు పలికి బంగారము పొదగిన మేడిపండ్లను విడచి దృఢ వ్రతముగల ఋషులు మరియెక చోటికి వెళ్లిరి. అట్లు తిరుగుచున్న ఋషులు మధ్యమ పుష్కరమును చేరిరి . అచ్చట శునక మిత్రుని పరివ్రాజక రూపుని చూచిరి. అతనిలో కలిసి వనమధ్యమునకు వెడలి పద్మములతో నిండిన ఉత్తమ జలాశయమును (సరస్సును) చూచిరి. ఉత్తమ గతిని ఆలోచించుచు ఆ సరస్తీరమున కూర్చుండిరి. శునస్సఖుడు ఆకలిగొన్న ఋషులందరితో ఇట్లు పలికెను. మీ ఆకలి బాధ ఎంత తీవ్రమయినదో వివరించుడు. అంతట ఆ ఋషులు శునస్సఖుని గూర్చి యిట్లు పలికిరి.

ఋషయ ఊచు:- శక్తిఖడ్గగదాభిశ్చ చక్రతోమరసాయనకైః|| 274

బాధితే వేదనా యాతు క్షుధయా సాపి నిర్జితా| శ్వాసకుష్టక్షయాష్టీలీజ్వరాపస్మారశూలకైః|| 275

వ్యాధిభిర్జనితా సాపి క్షుదా యా నాధికా భ##వేత్‌ | హిరణ్యాంగద కేయూరమకుటోజ్జ్వలకుణ్డలాః| 276

క్షుధాయాం న విరాజంతే తత్ర యే సంస్థితా నరాః | యధా భూమిగతం తోయం రవిరశ్మిర్వికర్షతి|| 277

తద్వచ్ఛరీర జా నాఢ్యః శోష్యంతే జఠరాగ్నినా | న శృణోతి న చాఘ్రాతి తి చక్షుషో నైవ పశ్యతి || 278

దహ్యతే క్షీయతే మూఢః శుష్యతే క్షుధయార్దిత | న పూర్వాం దక్షిణాం చాపి పశ్చిమాం నోత్తరామపి|| 279

న చాధో నైవ చోర్ధ్వం చ క్షుధావిష్టో హి విందతి | మూకత్వం బధిరత్వం చ జడత్వమథ పంగుతా || 280

భైరవత్వమమర్యాదం క్షుధాయాం సంప్రవర్ధతే | జనకం జననీం పుత్రాన్‌ భార్యాం దుహితరం తథా|| 281

భ్రాతరం స్వజనం వాపి త్యజతి క్షుధయార్దితః | న పితౄన్పూజయే త్సమ్యక్‌ దేవం చాపి గురుం తథా|| 282

ఋషీనుపగతాంశ్చాపి క్షుధావిష్ణో న విందతి | ఏవమన్న విహీనస్య భవంత్యేతాని దేహినామ్‌ || 283

తదేవం సంప్రయచ్చేత | అన్నం శ్రద్ధాసమన్వితః | బ్రహ్మభూతస్తతః సోథ బ్రహ్మణా సహా మోదతే || 284

సుసంస్కృతం చ యోప్యన్నం దద్యాదహరహర్ద్విజే | యః పఠేదన్నదానం తు శ్రాధ్దే చైవ విశేషతః || 285

ఏకాగ్రమానసో భూత్వా అమావస్యేందుసంక్షయే | భూతోపఘాతసంపూర్ధే శ్రాద్దే శ్రావయతే సదా || 286

పితరస్తస్య తుష్యంతి యావజ్జీవం న సంశయః | దేవద్విజసమీపస్థోన్నస్య దాతా విముచ్యతే|| 287

ప్రవృద్ధో వా ప్రమత్తో వా ప్రసంగాదాగతోపి వా | భక్త్యా విరహితో వాపి శృణ్వన్పాపాద్విముచ్యతే || 288

దానేన సంయుతా విప్రాః సుఖినో ధర్మభాగినః | యమీ దమో వై నియమః ప్రోక్తస్తత్వార్ధదర్శిభిః || 289

బ్రాహ్మణానాం విశేషేణ దమో ధర్మః సనాతనః | దమస్తేజో వర్దయతి పవిత్రో దమ ఉత్తమః || 290

విపాప్మా చైవ తేజస్వీ పురుషో దమతో భ##వేత్‌ | యే కాచిన్నియమా లోకే యే చ ధర్మాశ్శభా న్వయాః|| 291

సర్వయజ్ఞఫలం చాపి దమస్తేభ్యో విశిష్యతే | తపో యజ్ఞస్తథా దానం దమాదేవ ప్రవర్తతే || 292

కిమరణ్య త్వదాంతస్య దాంతస్యా పి కిమాశ్రమే | యత్ర యత్ర వసేద్దాంత స్తదరణ్యం మహాశ్రమః || 293

ఋషులు పలికిరి.

శక్తి, ఖడ్గ గదలతో చక్రముతోమరబాణములతో బాధించిన వేదనకన్న ఆకలివలన కలుగు వేదన అధికము. శ్వాస, కుష్టు, క్షయ, అష్టీలి, జ్వర, అపస్మార, శూల వ్యాధులతో కలుగు బాధ ఆకలి బాధకంటే ఎక్కువ గాదు. బంగారు ఆభరణములు అంగద, కేయూర, కిరీట కుండలాదులతో అలంకరించుకొన్నను ఆకలిగొన్నవానికి సంతోషము కలుగదు. భూమిలోని నీరును సూర్యకాంతి (గ్రహించును) ఆకర్షించినట్లు శరీరములోని నరములు జటరాగ్నితో శుష్కించిపోవును. ఆకలితో పీడింపబడిన వాడు వినజాలడు. వాసన చూడజాలడు. చూడజాలడు. దహాంచబడుచు క్షీణించును. ఆకలిగొన్నవాడు తూర్పు, దక్షిణ, పశ్చిమ, ఉత్తర దిక్కులను ఊర్ధ్వ, అధో భాగములను తెలియజాలడు. అట్లే మూగ, చెవిటి, కుంటి, ఉన్మాది, బైరవత్వము, అమర్యాద భావములు ఆకలితో పెరుగును. ఆకలితో పీడించబడిన వాడు తల్లిని, తండ్రిని, హితులను, భార్యను, కూతురును, సోదరులను, స్వజనులను కూడా విడచును. ఆకలిగొన్నవాడు. తల్లి దండ్రులను, దైవమును, గురువును పూజించజాలడు. ఆకలిగొన్నవారు వచ్చిన ఋషులను గూడ తెలియజాలదు. ఆహారము లేనివాని స్థితి యిది కావున శ్రధ్దతో అన్నము పెట్టవలయును. అట్లు పెట్టిన వాడు బ్రహ్మయగును. బ్రహ్మతో కలిసి ఆనందించును. బ్రాహ్మణునికి ప్రతిరోజు సంస్కరించబడిన అన్నమును పెట్టవలయును. శ్రాద్ధమున అన్నదాన విధిని చదివినవారు, అమావాస్యనాడు ఏకాగ్ర చిత్తముతో భూతోపఘాత సంపూర్ణమున శ్రాద్ధమున వినిపించినచో వారి పితృ దేవతలు సంతోషించెదరు. దేవద్విజ సమీపమున అన్నదానమును గావించినవారు. విముక్తిని పొందెదరు. మేల్కొనియున్ననూ, ప్రమత్తుడై యున్ననూ, సందర్భ వశమున వచ్చిన వాడైననూ , భక్తిలేని వాడైననూ అన్నదానమును వినినచో పాపముల నుండి విముక్తి పొందును. అన్నదానము చేయు విప్రులు సుఖము కలవారు. ధర్మ భాగమును పొందువారు. యమనియముదమములు కలవారగుదురు. బ్రాహ్మణులకు విశేషించి దమమే సనాతన ధర్మము. దమమే తేజమును వృధ్ది పొందించును. దమమే పవిత్రము. దమమే ఉత్తమము. దమము వలననే పాపరహితుడు తేజస్వియగును. ఈలోకమున కల నియమములు ధర్మములు సర్వయజ్ఞ పలములకన్నా దమము విశిష్టము . దమము వలననే తపోయజ్ఞ దానములు ప్రవర్తించును. దమము లేనివాడు ఆరణ్యములో నుండుట, దమము కలవాడు ఆశ్రమములో నుండుట వ్యర్ధము. దమము కలవాడు ఉన్న ప్రదేశ##మే అరణ్యము. మహాశ్రమము. 293

శీలవృత్తసమేతస్య నిగృహీతేంద్రియస్య చ | ఆర్జవే వర్తమానస్య ఆశ్రమైః కిం ప్రయోజనమ్‌ || 294

వనే పి దోషాః ప్రభవంతి రాగిణాం గృహేపి పంచేంద్రియనిగ్రహస్తపః|

అకుత్సితే కర్మణి యః ప్రవర్తతే నివృత్తరాగస్య గృహం తపోవనమ్‌ || 295

సుకర్మధర్మార్జితజీవితానాం సదాచ సంతుష్య గృహే రతనామ్‌ |

జితేంద్రియాణామతిథిప్రియాణాం గృహోపి ధర్మో నియమస్థితానామ్‌|| 296

న శబ్దశాస్త్రే నిరతస్య మోక్షో న వర్ణాసంగే నిరతస్య చైవ|

న భోజనాచ్ఛాదన తత్పరస్య న లోక వృత్త గ్రహణ రతస్య || 297

ఏకాంత శీలస్య ధృడ త్రతస్య సర్వేంద్రియ ప్రీతి నివర్తకస్య |

ఆధ్యాత్మయోగే గతమానసస్య మోక్షే ధృవం నిత మర్హిసకస్య || 298

సుఖం చ దాంతః స్వపితి సుఖేన ప్రతిబుధ్యతే | సమః సర్వేషు భూతేషు మనో యస్య ప్రబుధ్యతే | 299

న రధేన సుఖం యాతి న హయేన న దంతినా | యథాత్మనా వినతేన సుఖం యాతి మహాపథే || 300

శీలవృత్తములు కలవానికి, ఇంద్రియ నిగ్రహము కలవానికి, ఆర్జవము కలవానికి ఆశ్రమములతో ఏమి ప్రయోజనము. విషయము లందు ఆసక్తి కలవానికి అడవిలో కూడా దోషములు సంభవించును. ఇంటిలో నున్ననూ ఇంద్రియ నిగ్రహము తపమే. సత్కార్యమునందు ప్రవర్తించుచు రాగాభిలాష లేనివానికి గృహమే తపోవనము. సత్కర్మల వలన, ధర్మముల వలన జీవితమును సాగించువారికి, ఎల్లప్పుడూ సంతోషముతో గృహస్థాశ్రమమున ప్రవర్తించువారికి, ఇంద్రియ నిగ్రహము కలవారికి, అతిధి ప్రియులకు నియమముతో నుండు వారికి గృహములో కూడా ధర్మమే ప్రవర్తించును. శబ్ద శాస్త్ర నిష్ణాతుడైనంత మాత్రమున, వర్ణ సంగతిలో ప్రీతుడైన వానికి, భోజన వస్త్రాభరణములందు ప్రీతి కలవానికి, లోక వ్యవహారములందు ఆసక్తి కలవానికి మోక్షము లభించదు. ఏకాంతమునందు ఉండు స్వభావము కలవానికి, దృఢవ్రతునికి, ఇంద్రియ వ్యామోహమును తొలగించుకొనిన వానికి ఆధ్యాత్మ యోగమునందు ప్రీతి కలవానికి, అహింసా ధర్మము నవలంభించు వానికి మోక్షము తప్పక లభించును. అంతరింద్రియనిగ్రహము కలవాడు సుఖముగా నిద్రించును. సుఖముగా మేల్కొనును. మనసు నిలకడగా ఉన్నవాడు సర్వ భూతములందు సమముగా ప్రవర్తించును. రథముతో, అశ్వములతో, యేనుగులతో సుఖముగా పయనించ జాలడు. వినయశీలుడు, ఇంద్రియ నిగ్రహము కలవాడు సుఖముగా పరలోక మార్గమున వెళ్ళగలడు. 300

న తు కుర్యాద్దరిః స్పష్టః సర్వో వాప్యతిరేషితః | అరిర్వా నిత్యసంక్రుద్ధో యథాత్మా దమవర్జితః 301

న యమం యమమిత్యాహురాత్మా వై యమ ఉచ్యతే | ఆత్మా వై యమితో యేన యమస్తు విశిష్యతే || 302

యమో యమ ఇతి ప్రోక్తో వృధా తు ద్విజతేజసః | ఆత్మా వై యమితో యేన యమస్తస్య కరోతి కిమ్‌ || 304

క్రవ్యాదేభ్యశ్చ భూతేభ్యో దాన్తేభ్యశ్చ సదా భయమ్‌ | తేషాం విప్రతిషేధార్ధం దండః సృష్టః స్వయంభువా || 304

దండో రక్షతి భూతాని దండః పాలయతే ప్రజాః | నివారయతి పాపిష్టాన్దండో దుర్జయ ఏవ వా || 305

శ్యామో యువా లోహితాక్షః సర్వభూతభయావహః|

దండః శాస్తా మనుష్యాణాం యస్మిన్‌ ధర్మః ప్రతిష్టితః || 306

అథాశ్రమేషు సర్వేషు దమ ఏవోత్తమం వ్రతమ్‌ | తాని లింగాని వక్ష్యామి యైరాంత ఇతి కీర్త్యతే || 307

అకార్పణ్యమపారుష్యం సంతోషః సువిధానతా | ఆనసూయా గురోః పూజా దయా భూతేష్వపైశునమ్‌|| 308

పఙ్చభిరేష దమః ప్రోక్తః ఋషిభిః శాంతవృధ్దిభిః | దయాధీనౌ ధర్మమోక్షౌ తథా స్వర్గశ్చచ పార్థివః || 309

ఆపమానే న కుప్యేత సంమానే న ప్రహృష్యతి | సమదుఃఖసుఖో ధీరః స శాంత ఇతి కీర్త్యతే || 310

శేతే సుఖం హి శాంతస్తు సుఖం హి ప్రతిబుధ్యతే | శ్రేయస్తరమతస్తిష్ఠెదవమన్తా వినశ్యతి || 311

అపమానితస్తు న ధ్యాయేత్తస్య పాపం కదాచన | స్వధర్మమపి చావేక్ష్య పరధర్మం న దూషయేత్‌ || 312

ఆత్మానమపి జానీయాత్పరం దోషైస్తు నాక్షిపేత్‌| మంత్రైర్హీనం క్రియాభిర్వా జన్మనా ప్యధ వాపునః ||313

దమశ్ఛాదయతే సర్వం హీనమంగం పటో యథా | అథీయతే నిరర్దం తే నాభిజానంతి యే దమమ్‌ || 314

శ్రుతస్థా హి దమో మూలం దమో ధర్మః సనాతనః | యో హ్యాత్మనస్తులయతే సువర్ణం తులయా దమమ్‌ || 315

స తేన ధృతిమాన్‌ ఖ్యాతో న తు ద్రవ్యేణ మోహితః | వ్రతానామపి సర్వేషాం దమ ఏవ పరాయణమ్‌|| 316

యద్యధీతే షడంగాని వేదతత్వార్ధవిద్‌ ద్విజః | దమేన తు విహీనశ్చ పూజ్యత్వం నేహ గచ్ఛతి|| 317

ఇంద్రియ నిగ్రహము లేని ఆత్మచేయు అపకారమును పట్టుకొనిన సింహము, కోపింపచేసిన సర్పము, పగబట్టిన శత్రువు కూడా చేయజాలడు. నిగ్రహము నిగ్రహము కాజాలదు. మనసే యమమనబడును. మనసును నియమించిన వాడే యముడనబడును. యముడు యముడు అనిలోకము వృధాగా యముని చూచి కలత చెందును. మనసుని నిగ్రహించిన వానిని యముడేమి చేయగలడు? రాక్షసుల నుండి, భూతముల నుండి నిగ్రహములేని వారి నుండియే ఎప్పుడూ భయము కలుగుచుండును. వారిని తొలగించుటకే దండము సృష్టించబడినది. దండమే ప్రాణులను రక్షించుచుండును. దండమే ప్రజలను పాలించును. పాపాత్ములను దుర్జయమగు దండమే వారించును. సుందరుడు, యువకుడు, లోహితాక్షుడు, సర్వ ప్రాణులకు భయమును కలిగించు వాడు దండుడే. దండుడే మనుష్యులను శాసించువాడు. దండునిలోనే ధర్మము ప్రతిష్టంచబడి యున్నది. అన్ని ఆశ్రమములలో దమమే (ఇంద్రియ నిగ్రహమే) ఉత్తమ వ్రతము. దాంతుని (ఇంద్రియ నిగ్రహము కలవానిని) గుర్తించుటకు కావలసిన చిహ్నములను చెప్పెదను. దీనత్వము లేకపోవుట, కాఠిన్యము లేకపోవుట, సంతోషము, క్రమశిక్షణ అసూయ లేకపోవుట, గురువును పూజించుట భూతదయ, ఆలోభత్వము ఈ ఎనిమిదిటితోనే దమము అని శాంతబుద్ధులగు ఋషులు చెప్పియున్నారు. ధర్మము మోక్షము స్వర్గము దయపై ఆధారపడియుండును. అవమానముతో కొపించక సన్మానమున సంతోషించక, సుఖ దుఃఖములందు సమతను కలిగి ధీరుడుగా నుండువాడు. శాంతుడనబడును. శాంతుడు సుఖముగా నిద్రించును. సుఖముగా మేల్కొనును. శాంతునకే శ్రేయస్సు కలుగును. అవమానించువాడు నశించును అవమానించబడినవాడు అతని పాపమును ద్యానించరాదు. తమ ధర్మమును చూచుకొని పరధర్మమును నిందించరాదు. మొదట తనను చక్కగా తెలుపవలయును. పరులను దోషములను చూపి ఆక్షేపించరాదు. మంత్రములతో క్రియలతో జాతితో హీనుడైననూ అంగవైకల్యమును వస్త్రము కప్పిపుచ్చునట్లు దమము అన్నిటిని కప్పిపుచ్చును. దమము తెలియని వారి అధ్యయనము వ్యర్ధము. శాస్త్రమునకు మూలము దమమే. దమమే సనాతన ధర్మము. బంగారము దమమును త్రాచులో నుంచి తూచినచో దమాధిక్యమును తెలిసినవాడు ధృతిమంతుడగును. ద్రవ్యమోహితుడు కాజాలడు. అన్ని వ్రతములలోనికి దమమే ఉత్తమ వ్రతము వేదాంగములను వేద తత్త్వమును తెలిసిన బ్రాహ్మణుడైనను దమహీనుడైనచో పూజ్యత్వమును పొందజాలడు. 317

దమేన హీనం న పునంతి వేదా యే ప్యధీతాః సహషడ్భిరంగైః|

సాంఖ్యం చ యోగశ్చ కులం చ జన్మ తీర్థాభిషేకశ్చ నిరర్ధకాని || 318

అమృతస్యేవ తృప్యేత అపమానస్య యోగవిత్‌ | విషవచ్చ జుగుప్సేత సంమ్మానస్య సదా ద్విజః || 319

అపమానా త్తపో వృద్దిః సంమానాచ్చ తపః క్షయః| అర్చితః పూజితో విప్రో దుగ్ధా గౌరీవ గచ్ఛతి || 320

పునరాప్యాయతే ధేనుః సతృణౖః సలిలైర్యధా | ఏవం జపైశ్చ హోమైశ్చ పునరాప్యాయతే ద్విజః|| 321

దమహీనుని వేదములు పవిత్రము చేయజాలవు. వేదాంగములతో అధ్యయనము చేసిననూ వ్యర్థము. దమములేని సాంఖ్యము యోగము కులము జన్మము తీర్థాభిషేకములు నిరర్థకములు.

యోగము తెలిసినవాడు అవమానమును పొందినపుడు అమృతమును పొందినట్లు తృప్తిని చెందవలయును. సమ్మానమును పొంది విషమువలె జుగుప్సను పొందవలయును. అవమానము వలన తపస్సు వృద్ధి చెందును. సమ్మానమువలన తపస్సు క్షీణించును. గౌరవమును పూజను పొందిన బ్రాహ్మణుడు పాడి ఆవువలె వెళ్ళును. గడ్డితో జలముతో ఆవు సంతృప్తి చెందినట్లు జపముతో హోమముతో బ్రహ్మాణుడు సంతోషించును. 321

ఆక్రోశకసమో లోకే సుహృదన్యో న విద్యతే | యస్తు దష్కృతమాదాయ సుకృతం స్వం ప్రయచ్ఛతి || 322

ఆక్రోశమానాన్‌ నాక్రోశే న్మన్యుం స్వం వినివర్తయేత్‌ | సన్నియమ్య తథాత్మానమమృతేనాభిసించతి|| 323

కపాలం వృక్షమూలాని కుచేలమసహాయతా | అనపేక్షా బ్రహ్మచర్యం నయంతి పరమాం గతిమ్‌ || 324

కామక్రోధౌ వినిర్జిత్య కిమరణ్య కరిష్యతి | అభ్యాసేన తు వై శాస్త్రం కులం శీలేన ధార్యతే || 325

గుణౖర్మంత్రా విధార్యంతే క్రోధస్సత్వేన ధార్యతే | యస్తు క్రోధం సముత్పన్నం సంధారయతి చా త్మనః|| 326

అక్రోధేన జపేద్వీరః కస్తేన సదృశో భువి| యస్తు క్రోధం సముత్పన్నం సంతం సంయమ్య తిష్టతి|| 327

తం సత్సారతమమ్మన్యే నాస్మిన్సీదతి యః పుమాన్‌ | ఏష పైతామహా గుహ్యో బ్రహ్మరాశిస్సనాతనః|| 328

ధర్మస్య నియమో యో హి మయా తే కధితో భృశమ్‌ |

అన్యే యజ్వనాం లోకా అన్యే చా పి తపస్వినామ్‌|| 329

అన్యే దమవతాం లోకాస్తే వై పరమ పూజితాః | ఏకః క్షమావతాం దోషో ద్వితీయో నోపపద్యతే || 330

యదిదం క్షమయా యుక్తమశక్తమ్మన్యతే జనః | న చైష దోషో మంతవ్యః క్షమా ప్రజ్ఞావతాం బలమ్‌ || 331

ప్రశమం యోభిజానాతి ఇష్టాపూర్తం మహీయతే | యత్ర్కోధయుక్తో వపతి జుహోతి చ యదర్ఛతి 332

సర్వం క్షరతి తత్తస్య భిన్నకుంభాదివోదికమ్‌ | దమాధ్యాయమిమం పుణ్యం ప్రాతరుత్థాయ యః పఠేత్‌ || 333

స ధర్మనావమారుహ్య దుర్గాణ్యతితరిష్యతి | దమాధ్యాయమిమం పుణ్యం సతతం శ్రావయేద్విజః || 334

స బ్రహ్మలోకమాప్నోతి తస్మాన్న చ్యవతే పునః |

శ్రూయతాం ధర్మసర్వస్వం శ్రుత్వా చైతత్ర్పధార్యతామ్‌ | 335

ఆత్మనః ప్రతికూలాని పరేషాం న సమాచరేత్‌ | మాతృవత్పరదారాంశ్చ పరద్రవ్యాణి లోష్టవత్‌ || 336

ఆత్మవత్సర్వభూతాని యః పశ్యతి స పశ్యతి | పచనం వైశ్వదేవార్థే పరార్థే యచ్చ జీవితమ్‌ || 337

ఏతద్భవేచ్చ సర్వస్వం ధాతూనామివ కాంచనమ్‌ | సర్వభూతహితం రాజన్నధీత్వా మృతమశ్నుతే || 338

ఏవం వై ధర్వసర్వస్వముక్తా తే తు శునఃసఖమ్‌ | తేనైవ సహితా సర్వే నివిష్టా సరసస్తటే || 339

ఎదుటివారి మంచిని చూచి ఆక్రోశించువారి ఆక్రోశముతో సాటివచ్చు మంచిమిత్రుడు మరియొకడులేడు. ఆక్రోశించువాడు మన పాపమును తీసుకొని తన పుణ్యమునిచ్చును. ఇట్లు ఆక్రోశించువారిని చూచి మరల ఆక్రోశించరాదు. తన కోపమును మరల్చుకొనవలయును. తనను తాను నిగ్రహించుకొనువాడు అమృతాభిషేకమును చేసుకొనును. కపాలి వ్రతము, వృక్షమూలము, కుచేల వ్రతము, అసహాయత, అనభిలాష బ్రహ్మచర్యము ఉత్తమగతిని పొందించును. కామక్రోధములను గెల్చినవానికి అరణ్యముతో పనియేమిటి? అభ్యాసముతో శాస్త్రము శీలముతో కులము ధరించబడును. గుణములతో మంత్రములు సత్త్వముతో క్రోధము ధరించబడును. కలిగిన కోపమును తనలో నిగ్రహించుకొనువాడు శాంతముతో జపించినచో వానిబోలు వీరుడు మరియొకడుండడు. కలిగిన కోపమును నిగ్రహించుకొనువాడు పరమోత్తముడు. అతను ఈ సంసారమున కష్టములను పొందడు. ఇది పరమ రహస్యము. బ్రహ్మ రహస్యము, వేదరాశి. ఇట్లు నేను నీకు ధర్మ నియమమును తెలిపితిని. యజ్ఞము చేయువారి లోకములు వేరు, తపస్వి లోకములు వేరు దమము కలవారి లోకము వేరు. దమము కలవారు పరమ పూజితులు. క్షమావంతుల దోషమొకటి. రెండవది లేదు. క్షమ కల వారిని అశక్తులుగా భావించెదరు. దీనిని దోషముగా భావించరాదు. క్షమ ప్రజ్ఞావంతులకు బలము. శమమును తెలిసినవాడు ఇష్టా పూర్తములను మించును. కోపము కలవాడు చేయు జపము హోమము పూజ పగిలినకుండలోని నీరువలె క్షీణించును. ఈ దమాధ్యాయమును అధ్యయనము చేయువాడు ధర్మనావనెక్కి దుర్గములను తరించగలడు. ఈ దమాధ్యాయమును ఎపుడూ వినిపించు బ్రాహ్మణుడు బ్రహ్మలోకమును పొంది అటనుండి దిగిరాడు. ఈ ధర్మసర్వస్వమును చక్కగా వినవలయును. విని ధరించ వలయును. తనకు వ్యతిరేకమగు పనులను ఇతరులకు ఆచరించరాదు. పరస్త్రీలను తల్లివలె పరద్రవ్యములను మట్టిపెడ్డవలె అన్నిప్రాణులను తనవలె చూచువాడే చూచువాడు. వైశ్వదేవయాగము పరార్థ జీవనము లోహములలో బంగారమువలె జీవన సర్వస్వము సర్వభూత హితమును ఆచరించువాడు అమృతతత్వమును పొందును. ఇట్లు ఆ ఋషులు శునస్సఖునికి ధర్మసర్వస్వమును తెలిపి ఆ సరస్తీరమున విశ్రమించిరి. 339

సరోపశ్యన్సువిస్తీర్ణం పద్మోత్పలజలావృతమ్‌ | తత్రావతారం కృత్వా తే బిసాని చ కలాపశః || 340

నీరే నిక్షిప్య సరసశ్చక్రుః పుణ్యాంజలిక్రియామ్‌ | అధోత్తార్య జలాత్తస్మాత్తే సమేత్య పరస్పరమ్‌ || 341

బిసాన్యేతాన్యపశ్యంత ఇదం వచనమబ్రువన్‌ |

పద్మములు ఉత్పలము విపుల జలములు కల ఆ సరస్సును చూచుచు దానిలోనికి దిగి తామర తూళ్లను తీసుకొని తీరమున నుంచి జలతర్పణమును గావించిరి. తరువాత ఆ జలమునుండి పైకివచ్చి పరస్పరము సమావేశ##మై ఈ బిసములను చూడ జాలక ఇట్లు పలికిరి.

ఋషయ ఊచు:- కేన క్షుధాభితప్తానామస్మాకం పాపకర్మణామ్‌ || 342

నృశంసేనాపనీతాని బిసాన్యాహారకాంక్షిణా | తే శంక మానాస్త్వన్యోన్యం పర్యపృచ్ఛన్‌ ద్విజోత్తమాః || 343

చక్రుశ్చ నిశ్చయం సర్వే శపధం ప్రతి పార్ధివ |

కశ్యప ఉవాచ:- సర్వత్ర సర్వం హరతు న్యాసలోపం కరోతు చ || 344

కూటసాక్షిత్వమభ్యేతు బిససై#్తన్యం కరోతి యః | దంభేన ధర్మం చరతు రాజానం చోపసేవతామ్‌ || 345

మధు మాంసం సమశ్నాతు బిససై#్తన్యం కరోతి యః | అనృతం భాషతు సదా విషయాంశ్చోపసేవతు || 346

దదాతు కన్యాం శుల్కేన భిససై#్తన్యం కరోతి యః |

ఋషులు పలికిరి.

ఆకలితో అలమటించు పాపకర్ములమైన మా తామర తూండ్లను ఆహారమును కోరు ఏ పాపి అపహరించెను. వారు ఒకరినొకరు అనుమానించుకొనుచు అడుగుచుండిరి. నమ్మకమును కలిగించుటకై వారు శపథమును చేసిరి.

కశ్యప మహర్షి పలికెను.

తామరతూండ్లను దొంగిలించినవాడు అంతట అన్నిటిని హరించుగాత. న్యాస లోపమును చేయుగాత. దొంగ సాక్ష్యమును చెప్పుగాత. దంభముతో ధర్మమును ఆచరించుగాత. రాజును సేవించుగాత. మధువును మాంసమును సేవించుగాత. ఎపుడూ అబద్దమాడుగాత. విషయములను సేవించుగాత. శుల్కమును తీసుకొని కన్యాదానము చేయుగాత. 346 1/2

వశిష్ట ఉవాచ:- అనృతౌ మైధునం యాతు దివా స్వప్నం నిషేవతు || 347

అన్యోన్యాతిధితామేతు బిససై#్తన్యం కరోతి యః | ఏకకూపో వసేద్గ్రామే బ్రాహ్మణో వృషలీ పతిః || 348

తస్య సాలోక్యతాం యాతు బిససై#్తన్యం కరోతి యః |

వసిష్ట మహర్షి పలికెను.

ఋతుకాలమును తప్పి స్త్రీ సంగమము చేయుగాత. పగలు నిద్రించుగాత. తామరతూండ్లను దొంగిలించినవారు పరస్పరము ఆతిధ్యమును పొందుదురుగాత. ఒకేబావి ఉన్న గ్రామములో బ్రాహ్మణుడు శూద్రుడు నివసించుగాత. అట్టివారు పొందులోకములను పొందుగావుత. 348 1/2

భరద్వాజ ఉవాచ :- నృశంసోస్తు సర్వేషు సమృధ్వా చాప్యహంకృతః || 349

మత్సరా పిశునశ్చైవ బిససై#్తన్యం కరోతి యః | ప్రత్యక్రోశత్వవాక్రుష్ట స్తాడయత్వన్యతాడితః || 350

విక్రీణాతు రసాంశ్చైవ బిససై#్తన్యం కరోతి యః |

భరద్వాజ మహర్షి పలికెను.

బిసములను దొంగిలించినవారు అందరిలో నికృష్టుడగుగాత. సమృద్ధితో అహంకరించుగాత. మాత్సర్యము లోభత్వము కలుగుగాత. ఎపుడూ వదురుబోతు ఇతరులచే కొట్టబడి మరల కొట్టుగావుత. రసములను అమ్ముగావుత. 350 1/2

గౌతమ ఉవాచ:- అతిథిం త్వాగతం ప్రాప్య పాకభేదం కరోతు సః || 351

శూద్రాన్నం చ సదాశ్నాతు బిససై#్తన్యం కరోతి యః | దత్వా దానం కీర్తయతు పరభార్యాసు తుష్యతు || 352

ఏకాకీమిష్టమశ్నాతు బిససై#్తన్యం కరోతి యః |

గౌతమ మహర్షి పలికెను.

బిసములను దొంగిలించినవారు అతిధి వచ్చినపుడు పాక భేదమును చేయుగాత. శూద్రాన్నమును భుజింతుగాత. చేసిన దానమును చెప్పుకొనుగావుత. పర భార్యలయందు రమించుగాత. ఒంటరిగా మృష్టాన్నమును భుజించుగాత 352 1/2

విశ్వామిత్ర ఉవాచ :- నిత్యకామపరః సోస్తు దివసే చైవ మైధునీ || 353

నిత్యం తు పాతకీ చైవ బిససై#్తన్యం కరోతి యః | పరాపవాదం వదతు పరదారాంశ్చ సేవతు || 354

పరనిందారతిశ్చాస్తు బిససై#్తన్యం కరోతి యః మాతరం పితరం చైవ సోవమన్యతు దుర్మతిః || 355

స మాతర్యన్యబుద్ధిస్యాధ్బిససై#్తన్యం కరోతి యః | పరపాకం సదాశ్నాతు పరనారీం చ సేవతు || 356

వేదవిక్రయకృచ్చాస్తు బిససై#్తన్యం కరోతి యః|

విశ్వామిత్ర మహర్షి పలికెను.

బిసముల దొంగిలించినవాడు ఎపుడూ కామ పరతంత్రుడగుగాత. పగలు స్త్రీ సంగమును చేయుగావుత. నిత్యపాతకి అగుగాక. పరులపై నిందలను మోపుగాత. పరదారలను రమించుగాత. పరనిందారతుడగుగాత. తల్లిదండ్రులను అవమానించుగాత. తల్లియందు ఇతర బుద్ధి కలవాడగుగాత ఎపుడూ ఇతరుల వంటను ఇతరుల భార్యలను భజించుగాత. వేదములనమ్ము గావుత.

జమదగ్నిరువాచ :- పరస్య యాతు ప్రేష్యత్వం స తు జన్మని జన్మని || 357

సర్వధర్మక్రియాహీనో బిససై#్తన్యం కరోతి యః |

శునఃసఖ ఉవాచ:- న్యాయేన వేదానధ్యేతు గృహస్థోస్తు ప్రియాతిథిః || 358

సత్యం వదతు వాజస్రం బిససై#్తన్యం కరోతి యః | అగ్నిం జుహోతు విధివద్యజ్ఞం యజతు నిత్యశః || 359

బ్రహ్మణస్సదనం యాతు బిససై#్తన్యం కరోతి యః |

ఋషయ ఊచు:- ఇష్టమేవ ద్విజాతీనాం యదిదం శపథీకృతమ్‌ || 360

త్వయా కృతం బిససై#్తన్యం సర్వేషాం నః శునఃసఖ |

జమదగ్ని మహర్షి పలికెను.

బిససై#్తన్యమును చేయువాడు ప్రతి జన్మలోనూ ఇతరులకు సేవకుడుగా పుట్టనీ. సర్వధర్మక్రియాహీనుడగుగాత.

శునస్సఖుడు పలికెను.

బిసములను దొంగిలించినవాడు న్యాయముగా వేదాధ్యయనము చేయుగాత. గృహస్థాశ్రమమున అతిథులయందు ప్రీతి కలిగి ఉండుగాత. ఎల్లప్పుడూ సత్యమునే పలుకుగాత. యధావిధిగా అగ్నిని పూజించుగాత. యజ్ఞమును చేయుగాత. బ్రహ్మలోకమును పొందుగాత.

ఋషులు పలికిరి.

నీవు చేసిన శపథములు బ్రాహ్మణులకు ఇష్టములే. కావున మా అందరి బిసములను నీవే దొంగిలించితివి. 360 1/2

శునఃసఖ ఉవాచ:- మయా హ్యాంతర్హితాన్యాసాన్‌ బిసానీమాని వో ద్విజా || 361

ధర్మం న శ్రోతుకామేన జానీధ్వం మాం చ వాసవమ్‌ | అలోభాదక్షయా లోకా జితా వో మునిసత్తమాః || 362

విమానమధితిష్టధ్వం గచ్చామస్త్రిదశాలయమ్‌ | తతో మహర్షయస్తే తు విజ్ఞాయథ పురందరమ్‌ || 363

ఊచుః పురందరం చేదం వాక్యం వాక్యవిశారదాః | ఇహాగత్య నరో యస్తు మధ్యమం పుష్కరం విశేత్‌ || 364

త్రిరాత్రోపోషితో భూత్వా లబేదావశ్యకం ఫలమ్‌ | ద్వాదశవార్షికీ దీక్షా స్మృతా యా తు వనౌకసామ్‌ || 365

తస్యాః ఫలం సమగ్రం చ లభేదిహ న సంశయః | నాసౌ దుర్గతిమాప్నోతి స్వగణౖః సహా మోదతే || 366

విరించిస్థానమాసాద్య తిష్టద్వై బ్రహ్మణో దినమ్‌ |

శునస్సఖుడు పలికెను.

ఓ బ్రాహ్మణోత్తములారా ! ఈ బిసములను నేనే దాచి ఉంచితిని. మీనుండి ధర్మములను తెలియగోరి ఇట్లు చేసితిని నన్ను ఇంద్రునిగా తెలియుడు. మీరు లోభమును విడుచుటవలన అక్షయలోకములను గెలిచితిరి. కావున విమానమును అధిరోహించుడు. స్వర్గమునకు వెళ్ళెదము. అంతట ఆ ఋషులు అతనిని ఇంద్రునిగా తెలిసి వాక్యవిశారదులు ఇట్లు పలికిరి. ఇంటికివచ్చిన మానవుడు మధ్యమపుష్కరమున ప్రవేశించి మూడు దినములు ఉపవసించినవాడు తప్పక ఫలమును పొందవలయును. వానప్రస్థులాచరించు ద్వాదశ వార్షిక దీక్షా సమఫలమును పొందుగాత. ఇచటికి చేరినవాడు దుర్గతిని పొందజాలడు. తనవారితో కలిసి ఆనందించును. బ్రహ్మలోకమును చేరి బ్రహ్మ మానమున ఒక దినము నివసించుగాత. 366 1/2

పులస్త్య ఉవాచ:- ఇంద్రేణ సహ సంప్రీతాస్తదా జగ్ముస్త్రివిష్టపమ్‌ || 367

ఏవం విలోభ్యమానాస్తే లోభైర్బహువిధైరిహ | నైవ లోభం తథా చకృస్తేన జుగ్ముస్త్రివిష్టకమ్‌ || 368

ఇదం యః శృణుయాన్నిత్యమృషీణాం చరితం శుభమ్‌ | విముక్తః సర్వపాపేభ్యః స్వర్గలోకే మహీయతే || 369

ఇతి శ్రీపాద్మేపురాణ ప్రథమే సృష్టిఖండే

సప్తర్షి సంవాదో నామైకోనవింశోధ్యాయః.

పులస్త్య మహర్షి పలికెను.

ఇట్లు ప్రీతిచెందిన ఋషులు ఇంద్రునితో కలిసి స్వర్గమునకు వెళ్లిరి. ఇట్లు పలువిధములుగా లోభింపచేసిననూ లోభమును చెందనందున స్వర్గమును చేరిరి. ఈ ఋషుల చరితమును ప్రతిదినము వినినవారు అన్నిపాపములు తొలగి స్వర్గలోకమున సుఖింతురు.

ఇది శ్రీ పద్మ పురాణమున సృష్టిఖండమున సప్తర్షి సంవాదమను పందొమ్మిదవ అధ్యాయము ముగిసినది.

Sri Padma Mahapuranam-I    Chapters