Sri Padma Mahapuranam-I    Chapters   

చతుర్దశాధ్యాయః

కర్ణార్జునయో ర్జన్మ వృత్తాంత కథనమ్‌ వైర కారణమ్‌

భీష్మ ఉవాచ :

కథం త్రిపురుషా జ్జాతో హ్యర్జునః పరవీరహా | కథం కర్ణస్తు కానీనః సూతజః పరికీర్త్యతే || 1

వైరం కధం తయోర్భూతం నిసర్గా దేవ తద్వద | బృహత్కౌతూహలం మహ్యం తద్భవా న్వక్తు మర్హతి || 2

పులస్త్య ఉవాచ

ఛిన్నే వక్త్రే పురా బ్రహ్మా క్రోధేన మహతా వృతః |

లలాటే స్వేదముత్పన్నం గృహీత్వా 7తాడయద్భువి ||

స్వేదతః కుండలీ జజ్ఞే స ధనుష్కో మహేషుధిః | సహస్ర కవచీ వీరః కిం కరో7మీత్యువాచ హ || 4

తమువాచ విరించిస్తు దర్శయన్‌ రుద్రమోజసా | హన్యతా మేష దుర్బుద్ధిర్జాయతే న యుధా పునః || 5

బ్రహ్మణో వచనం శ్రుత్వా ధనురుద్యమ్య పృష్ఠతః | సంప్రతస్థే మహేశస్య బాణహస్తో7తి రౌద్రదృక్‌ || 6

దృష్ట్వా పురుష మత్యుగ్రం భీత స్తస్య త్రిలోచనః | అపక్రాంత స్తతో వేగాత్‌ విష్ణోరాశ్రమ మభ్యగాత్‌ || 7

త్రాహి త్రాహీతి మాం విష్ణో నరాదస్మాచ్చ శత్రుహన్‌ |

బ్రహ్మణా నిర్మితః పాపో వ్లుెచ్ఛరూపో భయంకరః || 8

యథా హన్యా న్నమాం క్రుద్ధ స్తధా కురు జగత్పతౌ ||

హుంకారధ్వనినా విష్ణు ర్మోహయిత్వా తు తం నరమ్‌ || 9

అదృశ్యః సర్వభూతానాం యోగాత్మా విశ్వదృక్ప్రభుః |

తత్ర ప్రాప్తం విరూపాక్షం సాంత్వయా మాస కేశవః || 10

తతస్స ప్రణతో భూమౌ దృష్టో దేవేన విష్ణునా |

విష్ణురువాచ

పౌత్రోహిమే భవాన్రుద్ర ! కంతే కామం కరోమ్యహమ్‌ || 11

దృష్జ్వా నారాయణం దేవం భిక్షాం దేహీత్యువాచ హ | కపాలం దర్శయిత్వాగ్రే ప్రజ్వలం స్తేజసోత్కటమ్‌ || 12

కపాల పాణిం సంప్రేక్ష్య రుద్రం విష్ణు రచింతయత్‌ |

కో7న్యో యోగ్యో భ##వే ద్భిక్షు ర్బిక్షాదానస్య సాంవ్రతమ్‌ || 13

యోగ్యో7యమితి సంకల్ప్య దక్షిణం భుజ మర్పయత్‌ | తద్బిభేదాతి తీక్‌ష్ణేన శూలేన శశిశేఖరః || 14

ప్రావర్తత తతో ధారా శోధితస్య విభోర్భువజాత్‌ | జాంబూనద రసాకారా వహ్నిజ్వాలే వనిర్మితా || 15

నిపపాత కపాలాంత శ్శంభునా సాప్రభిక్షితా | ఋజ్వీ వేగవతీ తీవ్రా స్పృశంతీ త్వంబరం జవాత్‌ || 16

పంచాశ ద్యోజనాద్దైర్ఘ్యాత్‌ విస్తారా ద్దశయోజనా | దివ్య వర్ష సహస్రం సా సమువాహ హరేర్భుజాత్‌ || 17

ఇయం తం కాల వీశో7సౌ భిక్షాం జగ్రాహ భిక్షుకః | దత్తానారాయణనాథ కపాలే పాత్ర ఉత్తమే || 18

తతో నారాయణః ప్రాహ శంభుం పర మిదం వచః | సంపూర్ణం షా నవా పాత్రం తతో వై పరమేశ్వరః || 19

స తోయాంబుద నిర్ఘోషం శ్రుత్వా వాక్యం హరేర్హరః | శశిసూర్యాగ్ని నయనః శశిశేఖర శోభితః || 20

కపాలే దృష్టిమావేశ్య త్రిభిర్నేత్రై ర్జనార్దనం | అంగుల్యా ఘటయన్‌ ప్రాహ కపాలం పరిపూరితమ్‌ || 21

కర్ణార్జునుల జన్మ వృత్తాంతము

అర్జునుడు పురుషత్రయమునకు పుత్రుడయి జనియించెను. కర్ణుడు కన్యకు బుట్టి సూతుని కొడుకనిపించు కొన్నాడు, అ కథ యేమి ? వారిద్దరికి బద్ధవైరముగదా ! ఎందుచేత ? వినవేడుకయైనది తెల్పుమన పులస్త్యుండనియె.

బ్రహ్మ తన తల తెగినపుడు కోపమువచ్చి నుదుట జెమట పట్టినది. ఆ చుక్క చేకొని నేలపై విసరికొట్టెను, అందుంది కుండలములూని విల్లు నమ్ముల పొదియుం జేకొని సహన్రకవచములూని తను కింకరుడనుచు నొక డావిర్భవించెను. బ్రహ్మ వానితో నిడుగో యీ రుద్రుడు దుర్బుద్ధిం వీనిం జంపుమనెను. అదివిని వాడారుద్రునివెంట పరువెత్తెను. అమ్మహోగ్రునిం గని రుద్రుడు పారి విష్ణు నాశ్రమమునకుం జనెను. జగత్ప్రభూ ! వీడు నన్ను జంపకుండ రక్షింపు రక్షింపుమని మొరపెట్టుకొనెను. విష్ణువు హుంకారమొనరించి వానిని వారించి యెవ్వరికి గానరాకుండ యోగీశ్వరుండు గావున త్రిలోచనునికిమాత్రము కనిపించి యాతనిని దేర్చినంత: నతడు విష్ణువునకు నమస్కరింప హరి నీవు నా పౌత్రుడవు నీకేమి కావలెననెను. శివుడు నారాయణుని బిక్షపెట్టుమని కపాలము చూపి ప్రార్థించెనుః అది చూచి నారాయణుడింతకంటె యోగ్యుడు పాత్రుడెవడు గలడని తన కుడిచేయి యిచ్చెను. చంద్రశేఖరుడా చేతిని శూలముచే ఖండించెను. ఆ స్వామి భుజము నుండి రక్తము ధారగా వెలువడెను. బంగారు ధారయో యన్నట్లు అగ్నిజ్వాలయట్లా రక్తధారయా ఆది భిక్షువు చేతనున్న కపాలమునందు సూటిగా నాకాశమంటె. ఆ ధార పొడవేబది వది యోజనము విరివియుం గలదై వచ్చి యా కపాలమునం బడెను. వేయి దివ్యవర్షములది యట్లే వడుచుండెను. ఇంతకాలమా భిక్షుకుడా భిక్షనే యారగించెను. ఆపైని హరి నీ పాత్ర నిండెనా ? అని హరుండు సజల జలద గంభీరమైన యా మాట విని యా పుర్రెను వ్రేలు ముంచి దాకి కపాలమున జూపులు మూడుం జొనిపి కపాలము నిండినదనెను.

శ్రుత్వా శివస్య తాం వాణీం విష్ణుర్ధారాం సమాహరత్‌ | వశ్యతో7థ హరేరీశః స్వాంగుల్యా రుధీరం తదా || 22

దివ్యవర్ష సహస్రం చ దృష్టి పాతై ర్మంధ సః | మథ్వమానే తతో రక్తే కరిలం బుద్బుదం క్రమాత్‌ || 23

బభూవచ తతః పశ్చాత్‌ కిరీటీ స శరాసనః | బద్ధ తూణీరయుగలో వృషస్కంధో 7ంగుళిత్రవాన్‌|| 24

పురుషో వహ్ని సంకాశః కపాలే సంప్రదృశ్యతే | తం దృష్ట్వా భగవాన్విష్ణుః ప్రాహ రుద్ర మిదం వచః || 25

కపాలే భవ ! కో వా యం ప్రాదుర్భూతో7భవన్నరః |

వచః శ్రుత్వా హరే రీశ స్తమువాచ విభో శృణు || 26

నరనారాయణౌ చోభౌ యుగే ఖ్యాతా భవిష్యతః | సంగ్రామే దేవకార్యేషు లోకానాం పరిపాలనే || 27

ఏష నారాయణ సఖో నరస్తస్త్మా ద్భవిష్యతి | అథాసురవధే సాహ్యం తవ కర్తా మహాద్యుతిః || 28

మునిర్ఞాన వరీక్షాయాం జేతా లోకే భవిష్యతి | తేజో7ధిక మిదం దివ్యం బ్రహ్మణః పంచమం శిరః || 29

తేజసో బ్రహ్మణో దీప్తా ద్భుజస్య తవ శోణితాత్‌ | మమ దృష్టి నిపాతచ్చ త్రణి తేజాంసి యాని తం || 30

తత్సంయోగ సముత్పన్నః శత్రుం యుద్ధే విజేష్వతి | అవధ్యా యే భవిష్యంతి దుర్జయా! అపిచాపం || 31

శుక్రస్య చామరాథాం చ దేషా మేష భయంకరః | ఏవముక్త్వా స్ఠిత శ్శంభుః విస్మితశ్చ హరి స్తదా || 32

హరి వచన మాలించి యతడు సూచుచుండ నీశ్వరుడు తన వ్రేలందు జోనిపి వేయి దివ్యసంవత్సరము లా రక్తము గనుచు మథించెను. అందుండి నురుగులు బుడగలు వెలువడినవి. ఆపైని కిరీటము పెట్టుకొని చేత విల్లుని వీపున నమ్ములపొదియుంగొని యగ్నివలె దీపించు నొకడా కపాలమందు గనబడెను. భగవంతుడు వానిం జూచి వీడెవ్వడని శంకరునడుగ నతడిట్లనియె. ఈయనయందు నరనారాయణు లిద్దరు దేవకార్యముం జక్కబెట్టను లోకములం బాలింపను బ్రసిద్ధులై యవతరింతురు. ఇతడు నరుడు నారాయణుడవగు నీ మిత్రుడు అసుర సంహారమందు నీకు దోడుగాగలడు. జ్ఞానపరిశోధన చేయు ముని సర్వవిజయుండు నగును. తేజోయుతమైన బ్రహ్మము యొక్క శిరస్సిది. బ్రహ్మయొక్కయు నీ చేతినుండి కారిన రక్తముయొక్కయు నా దృష్టియొక్కయు తేజస్సులు మూడునుం గలిసి యేర్పడిన యీ మూర్తి శత్రువులం గెలువగలదు. ఇంద్రునకు దేవతలకుం గూడ జంపవశము గానివాండ్రకు నితడు భయంకరుడు గాగలడని శంభుడన హరి యాశ్చర్యపడెను.

కపాలస్థః స తత్రైవ తుష్టావ హర కేశవౌ | శిరస్యంజలి మాధాయ తదా వీర ఉదారధీః || 33

కింకరో మీతి తౌ ప్రాహ ఇత్యుక్త్వా ప్రయతః స్థితః |

తమువాచ హరః శ్రీమా న్బ్రహ్మణా స్వేన తేజసా || 34

సృష్టో నరో ధనుష్పాణి స్త్వమేనం తు నిషూదయ | ఇత్థ ముక్త్వాంజలిధరం స్తువంతం శంకరో నరమ్‌ || 35

తథైవాంజలి నంబద్ధం గృహీత్వా చ కరద్వయం | ఉద్ధృత్యాథ కపాలాత్తం పునర్వచన మబ్రవీత్‌ || 36

స ఏష పురుషో రౌద్రో యో మయావేదిత స్తవ | విష్ణు హుంకార రచిత మోహనిద్రాం ప్రవేశితః || 37

విబోధయైనం త్వరిత మిత్యుక్త్వాంత ర్దధే హరః | నారాయణస్య ప్రత్యక్షం నరేణానేన వై తదా || 38

వామపాద హతస్సో7పి సముత్తస్థౌ మహాబలః | తతో యుద్ధం సమభవ త్స్వేదరక్తజయో ర్మహత్‌ || 39

కపాలమందున్న యా వురుషుడు శిరమునందంజలిచేసి హరిహరులను స్తుతించి యేమిసేయుదు నానతిం డనెను. శ్రీహరి యతనితో నిన్ను బ్రహ్మ తన తేజస్సుచే నిన్ను సృజించినాడు. నీవు వీనిం జంపుమని పలికి బద్ధాంజలి యయి యున్న యా నరుని రెండుచేతులుం బట్టుకొని కపాలమునుండి మీదికిలేపి వెండియు నిట్లనియె. నేను నీకెరింగించిన పురుఘ డిడుగో యీతడే. విష్ణుని హుంకారముచే మోహనిద్రలో బడెను. ఇతని నీవు వేగమ మేల్కొలుపుమని శివు డంతర్థాన మొందెను. నారాయణుని కట్టెదుట ఒంటరిగాడైన నరుని యెడమకాలి తన్నుదిని యా కపాలము నుండి మీది కెగసెను. ఆ స్వేదజునకు రక్తజునకును నయ్యెడం బెను జగడమయ్యె.

విస్ఫారిత ధనుశ్శబ్దం నాదితా శేష భూతలం | కవచం స్వేదజసై#్యకం రక్తజేన త్వపాకృతమ్‌ || 40

ఏవం సమేతయోర్యుద్ధే దివ్యం వర్షద్వయం తయోః | యుధ్యతోః సమతీతం చ న్వేదర క్తజయోర్నృప || 41

రక్తజం ద్విభుజం దృష్ట్వా స్వేదజం చైవ సంగతౌ |

విచింత్య వాసుదేవో7గా ద్బ్రహ్మణః సదనం పరమ్‌ || 42

ససంభ్రమ మువాచేదం బ్రహ్మాణం మధుసూదనః | రక్తజేనాద్య భో బ్రహ్మన్‌ స్వేదజో7యం నిపాతితః || 43

శ్రుత్వైత దాకులో బ్రహ్మా బభాషే మధుసూదనం | హరే7ద్య జన్మని నరో మదీయో జీపతా దయమ్‌ || 44

తథా తుష్టో7బ్రవీత్తం చ విష్ణురేవం భవిష్యతి | గత్వా తయోరణమపి నివార్యాహ చ తావుభౌ || 45

అన్యజన్మని భవితా కలిద్వాపరయో ర్మిథః సంధౌ మహారణ జాతే తత్రాహం యోజయామి వామ్‌ || 46

విష్ణునా తు సమాహూయ గ్రహేశ్వర సురేశ్వరౌ | ఉక్తా విమౌ నరౌ భద్రౌ పాలనీ¸° మమాజ్ఞయా || 47

సహాస్రాంశో స్వేదజో7సౌ స్వకీయో7ంశో ధరాతలే |

ద్వాపరాంతే 7వతార్యో7యం దేవానాం కార్యసిద్ధయే | 48

యదూనాం తు కులే భావీరో వామ మహాబలః | తస్య కన్యా పృథా నామరూపేణా ప్రతిమా భువి || 49

ఉత్పత్స్యతి మహాభాగా దేవానాం కార్యసిద్ధయే | యదుర్వాసాస్తు వరం తసై#్య మంత్ర గ్రామంప్రదాస్యతి || 50

మంత్రేణానేన యం దేవం భక్త్యా ఆవాహయిష్యతి | దేవి తస్య వ్రసాదాత్తు తవ పుత్రో భవిష్యతి || 51

సా చ త్వా ముదయే దృష్ట్వా సాభిలాషా రజస్వలా | చింతాభి పన్నాతిష్ఠంతీ భజితవ్యా విభావసో || 52

తస్యా గర్భే త్వయం భావీ కానీనః కుంతినందనః | భవిష్యతి సుతో దేవ దేవ కార్యార్థ సిద్ధయే || 53

తథేతి చోక్త్వా ప్రోవాచ తేజోరాశి|ర్దివాకరరః | పుత్ర ముత్పాదయిష్యామి కానీనంబలగర్వితమ్‌ || 54

యస్య కర్ణేతి వై నామ లోకః సర్వో వదిష్యతి | మత్‌ ప్రసాదా దస్య విష్ణోవిప్రాణాం భావితాత్మనః || 55

అదేయం నాస్తి వై లోకే వస్తుకించిచ్చ కేశవ | ఏవం ప్రభావం చై వైనం జనయే వచనాత్తవ || 56

ఏవముక్త్వా సహస్రాంశు ర్దేవం దానవ ఘాతినం | నారాయణం మహాత్మానం తత్రైవాంతర్ధదే రవిః || 57

అదర్శనం గతేదేవే భాస్కరే వారితస్కరే | వృద్ధ శ్రవస మప్యేవ మువాచ ప్రీత మానసః || 58

సహస్ర నేత్ర రక్తోత్థో నరో7యం మదనుగ్రహాత్‌ | స్వాంశభూతో ద్వావరాంతే యోక్తవ్యో భూతలే త్వయా || 59

వారి ధనుష్టంకారిముల భూతలమెల్ల బ్రతిధ్వనించెను. రక్తజుండా స్వేదజుని కవచమును బ్రద్ధలు సేసెను. అయ్విరుపురకు నాపోరు రెండు దివ్య సంవత్సరములు జరిగెను. వాసుదేవుడా యిద్దరింగని యాలోచించి బ్రహ్మసదన మున కేగి తొట్రువడుచు రక్తజునిచే నిపుడు స్వేదజుడు గూలినాడని తెలిపెను, బ్రహ్మ వ్యాకులుడ్తె మధుసూదనునింగని యీ జన్మమందీ నావాడు నరుడు సుఖముగ జీవించుగాక ! యనియె. అన హరి సంతుష్టుడై యట్లే యగునని యా యిద్దరు పోరు యుద్ధభూమికింజని వారి పోరాపి యిట్లనియె.

ఇంకొక జన్మమందు కలి ద్వాపరయుగ సంధిలో జరుగు మహాద్ధమున మీ కొండొరులకు యుద్ధ మేర్పడును, అపుడు మిమ్ముల నేన సమావేశపరతును. అతి గ్రహేశ్వరుని (నూర్యుని) సురేశ్వరుని (ఇంద్రుని) బిలిచి విష్ణువు ; భాస్కరా ! స్వేదజుడు వీడు. ద్వావరము చివర వీని నీయంశమున దేవతల కార్యసిద్ధికై యవతరింపజేయుము. యదుకులమున మహాబలశాలి యనువాడు జనించును. అతనికి (కుంతి) పృథయను కూతురు పరమసుందరి పుట్టును. దుర్వాసుడామెకు వరమునిచ్చి మంత్రసమూహము నుపదేశించును. ఈ మంత్రముచే భక్తితో నీవే వేల్పును అహ్వానింతు వాదేవుని యనుగ్రహముచే పుత్రుడొకడు నీ కుదయించును. రజస్వలయై అమెయు నిన్ను ధ్యానించుచు నిలిచి సేవింపగలదు. ఆమె గర్భమునంతీతడు కానీనుడుగ (కన్యకుబుట్టినవాడుగ) నుదయించును. దేవకార్యసిద్ధికీపని జరుగగలదు. తేజోరాశి నూర్యభగవాను డట్ల యగుగాక. నేను కానీనునిం గొడుకుం గర్ణుడనువానిం గనియెద. విప్రు లారాధించు విష్ణువు ననుగ్రహమువలన నెవ్వరికి దానము సేయవలనుగానిదుండదో యట్టి ప్రభావసంపన్నునిం గుమారుని నేను నీమాటంబట్టి కనియెదనని భాస్కరుండు ననియె.

యదా పాండుర్మహాభాగః ప్భథాం భార్యా మవాస్స్యతి | మాద్రీం చాపి మహాభాగ తదారణ్యం గమిష్యతి || 60

తస్యాప్యరణ్య సంస్థస్య మృగః శాపం ప్రదాస్యతి | తేన చోత్పన్న వైరాగ్యః శత శృంగం గమిష్యతి || 61

పుత్రా నభీవ్సన్‌ క్షేత్రోత్థాన్‌ భార్యాం న వ్రవదిష్యతి | అనీప్సంతీ తదా కుంతీ భర్తారం సా వడిష్యతి || 62

నాహం మర్త్యస్య వై రాజన్‌ వుత్రా నిచ్చే కథంచన | దైవతేభ్యః ప్రసాదాచ్చ పుత్రా నిచ్ఛే నరాధిప || 63

ప్రార్థయంత్యై త్వయా శక్ర కుంత్యై దేయో నరస్తతః | వచసా చ మదీ యేనం ఏవం కురు శచీపతే || 64

అథాబ్రవీ త్తదా విష్ణుం దేవేశో దుఃఖితో వచః | అస్మిన్మన్వంతరే7తీతే చతుర్వింశతికే యుగే || 65

అవతీర్య రఘుకులే గృహే దశరధస్య చ | రావణ్యస వధార్థాయ శాంత్యర్థం చ దివౌకసామ్‌ | 66

రామరూపేణ భవతా సీతార్ఠ మటతా పనే | మత్పుత్రో హింసితో దేవ సూర్యపుత్ర హితార్థినా || 67

వాలినామా ప్లవంగేంద్రః సుగ్రీవార్ధే త్వయాహతః | దుఃఖేనానేన తప్తో7హం గృహ్ణామి న సుతం నరమ్‌ || 68

అవ్వల నింద్రునిం గనియు సంప్రీతితో హరి ఓ సహస్రాక్షి ! ఇడుగో నా రక్తమునుండి యావిర్బవించినాడీతడు. నా యనుగ్రహమున వీనిని స్వాంశముచే ద్వాపరాంతమున నవనిపై నీవవతరింపజేయవలయును. పాండురాజు పృథను మాద్రిని భార్యలుగా పరిగ్రహించిన యతడరణ్యమున కేగును. అక్కడ నొక లేడి యతనికి శాపమిచ్చును. దానిచే వైరాగ్య ముదయించి యాతడు శతశృంగ పర్వతమునకేగి తన క్షేత్రమందు (కళత్రమందు) పుత్రులం గందునని భార్యతో ననును. ఆసమయమున నామె యది యభిలషింపక నేనెట్లును మానవమాత్రుని పుత్రుని గోరను. దేవతల యనుగ్రహము వలననే నేను కొడుకులం గోరెద ననును. అట్లామె నిన్ను బ్రార్థింప నీవు కుంతికి నరునిం కుమారునిగ ననుగ్రహింపుము. ఓ శచీపతీ ! నా మాటగా నీ విట్లు సేయుము. నావిని దేవేశుండు దుఃఖితుడై : ఈ మన్వంతరమున నిరువది నాల్గవ యుగము గడువ నీవు రఘుకులమందు దశరధుని యింట రామ రూపమున రావణవధకు దేవతల శాంతి కొరకు నవతరించి, సీతాదేవి కొరకడవిం దిరుగుచు సూర్యుని కొడుకు సుగ్రీవు హితవుకోరి నా కొడుకును వాలి యను వానరప్రభువుం జంపితివి. ఈ దుఃఖము నన్ను వేధించుచున్నది. అందువలన నేను నీవన్నట్లు నరుని కుమారునిగా నేనుగైకొనననియె.

ఆగృహ్ణమానం దేవేంద్రం కారణాంతరవాదినం | హరిః ప్రోచే శునాసీరం భువో ఖారావతారణ || 69

అవతారం కరిష్యామి మర్త్యలోకే త్వహం ప్రభో | సూర్య పుత్రస్య నాశార్థం జయార్థ మాత్మజస్య తే ||70

సారధ్యం చ కరిషామి నాశం కురుకులస్య చ | తతో హృఎ్టో7 భవచ్ఛక్రో విష్ణువాక్యేన తేన హ || 71

ప్రతిగృహ్య నరం హృష్టః సత్యమస్తు వచస్తవ | ఏవ ముక్త్వా నరం దేవః ప్రేషయిత్వాచ్యుతః స్వయమ్‌ || 72

గత్వా తు పుండరీకాక్షో బ్రహ్మాణం ప్రాహవై పునః |

త్వయా సృష్ట మిదం సర్వం త్రైలోక్యం స చరాచరమ్‌ || 73

అవాం కార్యస్య కరణ సహాయశ్చ తవ ప్రభో | స్వయం కృత్వా పునరాంశం కర్తుం దేవ న బుధ్యతే || 74

కృతం జుగుప్సితం కర్మ శంభుమేతం జిఘాంసతా | త్వయా చ దేవదేవస్య సృష్టః కోపేన వై పుమాన్‌ || 75

శుద్ధ్యర్థమస్య పాపస్య ప్రాయశ్చిత్తం పరం కురు | గృహ్ణత్యగ్నిత్రయం దేవ అగ్నిహోత్ర ముపాహర || 76

పుణ్యతీర్థే తథా దేళే వనే వాపి పితామహా | స్వపత్న్యా సహితో యజ్ఞం కురుష్వాస్మత్పరి గ్రహాత్‌ || 77

సర్వే దేవా స్తథాదిత్యా రుద్రాశ్చాపి జగత్వతే | ఆదేశం తే కరిష్యంతి యతో 7స్మాకం భవాన్ప్రభుః || 78

ఏకోహి గార్హపతో 7గ్ని ర్దక్షిణాగ్ని ర్ద్వితీయకః | అహవనీయ స్తృతీయస్తు త్రికుండేషు ప్రకల్పయః || 79

వర్తులే త్వర్చయాత్మానం మా మథో ధనురాకృతౌ | చతుఃకోణ హరం దేవం ఋగ్యజుసామనామభిః || 80

అగ్నీనుత్పాద్య తపసా పరామృద్ధి మవాప్యచ | దివ్యం వర్షసహస్రం తు హుత్వాగ్నీన్‌ శమయిష్యసి || 81

అగ్నిహోత్రా త్పరం నాన్య త్పవిత్ర మిహ పఠ్యతే | సుకృతేనాగ్నిహో త్రేణ ప్రశుద్ధ్యంతి భువి ద్విజాః || 82

పంథానో దేవలోకస్య బ్రాహ్మణౖ ర్దర్శితాస్త్వమీ | ఏకో 7గ్నిః సర్వదా ధార్యో గృహస్థేన ద్యిజన్మనా || 83

వినాగ్ని నా ద్వీజే నేహ గార్హస్థ్యం నతు లభ్యతే |

దేవింద్రుడు కొడుకుం గుంతియందు గైకొననని యొండొక కారణమును బలుక హరి భూభారము దిగువ ప్రభూ ! నేను భూలోకమందు సూర్యపుత్రుని నాశనమునకు నీ కొడుకు జయముకొరకును నవతరింతును. మీవానికి సారథ్యముగూడ సేయుదును. కురుకుల నాశముం గావింతును. నావిని యింద్రు డానందమొందెను. నరుని గుమారునిగ గ్రహించెద. నీ మాట నిజమగుంగాక యని వరమిచ్చి హరియును సంతుష్టుడయ్యె :

ఇంద్రునంపి హరి బ్రహ్మంగని నీవీ ముల్లోకములం సృష్టించినవాడవు కార్యమేదేని జక్కబెట్ట నేను నీకుసహాయుడను. తాను నృజించి పెంచినదానిని స్వయముగ నాశమొనరించుట నా మతము గాదు. ఇట్టి యసహ్యమైన పనిజేయుట శంకరుని జంప నుద్యుక్తుడైనవాని యెడ కోపము నుంది యీ పురుషుడు సృష్టింపబడినాడు. నీవు నీ పాపమునకు బ్రాయశ్చిత్తము సేసికొనుము. అగ్నిత్రయమును గ్రహించి యగ్నిహోత్రమును ఆహరింపుము. పుణ్యతీర్థమున పుణ్యప్రదేశమందడవిలో నీ పత్నితో గూడి నామాట స్వీకరించి యజ్ఞము సేయుము. నీవు ప్రభువవుగావున సర్వదేవత లాదిత్యులు రుద్రులునుంగూడ నీ యాజ్ఞ నొనరింతురు. గార్హపత్యాగ్ని యొకటి దక్షిణాగ్ని లెండవది ఆవహనీయము తృతీయాగ్ని ఈ ముర్వురను మూడు కుండలములందేర్పరుపుము. గుండ్రనిదానం దాత్మ నర్ఛింపుము. విల్లువోలె నుండు కుండమున నన్ను చతుష్కోణముగా నుండుదాన హరు నర్చింపుము. ఋగ్యజుస్సామ మంత్రములచే నీ యర్చన సేయుము. తపముచే (నగ్ని) యావిర్భవింపజేసి పరమాభివృద్ధినంది వేయి దివ్యవర్షము లగ్నిహోత్రముకంటె మించినది పవిత్రకార్యమిక లేదు. ద్విజులగ్నిహోత్రము చక్కగా నొనరించి పరిశుద్ధులగుదురు. ఈ యగ్నులు దేవలోకమునకు మార్గములుగా బ్రాహ్మణములచే నిర్మింపబడినవి. ఉత్తమ గృహస్థు బ్రహ్మణు డొక్క యగ్ని నెల్లయెడ ధరింపవలెను. అగ్ని లేకుండ ద్విజుడు గార్హస్థ్యమును బొందడు. అనవిని భీష్ముండిట్లనియె.

భీష్మ ఉహచ

యో సౌ కపాలాదుత్పన్నో నరో నామ ధనుర్ధరః

కి మేష మాధవాజ్ఞాత ఉతాహో స్వేనకర్మణా | ఉత రుద్రేణ జనితొ హ్యథవా బుద్ధిపూర్వకమ్‌ || 85

బ్రహ్మన్‌ హిరణ్యగర్బో7 య మండజాత శ్చతుర్ముఖః |

అద్భుతం పంచమం తస్య వక్త్రం త త్కథముత్థితమ్‌ || 86

సత్వే రజో న దృశ్యేత సత్వం రజసి క్వచిత్‌ | సత్వస్థో భగవాన్బ్రహ్మా కథ ముద్రేక మాదధాత్‌ || 87

మూఢాత్మనా నరో యేన హంతుం హి ప్రహితో హరమ్‌ |

స్వామీ ! ఈ కపాలమందు ధనుర్ధారియై పుట్టిన నరు డీతడు మాధవుని వలన జనించెననిలేక తన కర్మముం బట్టి తానుదయించెనా ? లేక రుద్రుని వలనా ? లేక తన బుద్ధి ననుసరించి తాన కలిగెనా ? హిరణ్యగర్భు డీయన యండజుడు. ఆయన యైదవ ముఖ మద్భుత మెట్లు మీదికి లేచినది ? సత్త్వమందు రజస్సుగనబడదు. రజస్సునందు సత్త్వగుణ మెయ్యెడం గానరాదు. అట్టిచో బ్రహ్మ సత్త్వగుణస్థితి నున్నవా డెట్లుద్రేకమందినాడు ? మూఢుడై హరునిం జంపుమని నరుం బంపినాడన పులస్తుండనియె.

పులస్త్య ఉవాచ

మహేశ్వర హరీ చేతౌ ద్వావేవ సత్పధిస్థితౌ || 89

తయోరవిదితం నాస్తి సిద్ధాసిద్ధం మహాత్మనోః | బ్రహ్మణః పంచమం వక్త్ర మూర్ధ్వ మాసీన్మహాత్మనః | 90

తతో బ్రహ్మా7భవన్మూఢో రజసా చోపబృంహితః | తతో 7యం తేజసా సృష్టి మమన్యత మయా కృతమ్‌ || 91

మత్తో7న్యో నాస్తి వై దేవో యేన సృష్టిః ప్రవర్తితా | సహ దేవాః సగంధర్వా పశుపక్షిమృగాకులాః || 92

ఏవం మూఢః స పంచాస్యో విరించిరభవత్పునః | ప్రాగ్వక్త్రం ముఖ మేతస్య ఋగ్వేదస్య ప్రవర్తకమ్‌ || 93

ద్వితీయం వదనం తస్య యజుర్వేదవ్రవర్తకమ్‌ | తృతీయం సామవేదస్య అథర్వార్థం చతుర్థకమ్‌ || 94

సాంగోపాంగేతిహాసాంశ్చ సరహస్యాన్ససంగ్రహాన్‌ | వేదానధీతే వక్త్రేణ పంచమేనోర్థ్వచక్షుషా || 95

తస్యాసుర సురాస్సర్వే వక్త్ర స్యాద్భూత వర్చసః | తేజసానప్రకాశంతేదీపాః సూర్యోదయే యథా || 96

స్వవురేష్వపి సోద్వేగాహ్యవర్త తవిచేతసః | న కంచిద్గణయే చ్చాన్యం తేజసా క్షిపతే పరాన్‌ || 97

నాభిగంతుం న చ ద్రష్టుం పురస్తాన్నోపసర్పితుం | శేకు స్త్రస్తాః సురాస్సర్వే పద్మయోనిం మహాప్రభుమ్‌ || 98

అభిభూత మివాత్మానం హన్యమానా హతత్విషః | సర్వే తే మంత్రయామాసు ర్ధేవతాహిత మాత్మనః || 99

గచ్ఛామః శరణం శంభు నిస్తేజసో 7స్య తేజసా |

దేవా ఊచుః నమస్తే సర్వసర్వేశ! మహేశ్వర! నమోనమః || 100

జగద్యోనే! పరంబ్రహ్మ భూతానాం త్వం సనాతనః | ప్రతిష్ఠా సర్వజగతాం త్వం హేతుర్విష్ణునా సహ || 101

ఏవం సంస్తూయమానో సౌ7 దేవర్షి పితృదానవైః | అంతర్హిత ఉవాచేదం దేవాః ప్రార్థయతేప్సితమ్‌ || 102

మహేశ్వరుడు హరుడ నీ యిద్దరే సత్పధమందున్నవారు. అయినది కానిదేదియు నా మహాత్ములకు దెలియనిది లేదు. బ్రహ్మ యొక్క యైదవ ముఖము మీదికుండెను. గావున బ్రహ్మ రజోగుణపూరితుడై మూఢుడయ్యెను. అందువలన నితడు నేను నా తేజస్సుచేత జేసినదే యీ సృష్టియని యనుకొనెను. నాకంటె నింకొకడు దేవుడు సృష్టికర్త లేడు. దేవతలు గంధర్వులు పశుపక్షి మృగములతో నలముకొన్నదెల్ల నా సృష్టియే యని యా విరించి యైదు మొగములు గలవాడయ్యెను. అందు ప్రాజ్ముఖము ఋగ్వేద ప్రవర్తకము. రెండవది యుజుర్వేద ప్రవర్తకము. మూడవది సామవేదమునకు నాల్గవది అధర్వణవేదమునకు. వేదాంగోపాంగములు ఇతిహాసము సరహస్యములు నసంగ్రహములు నగు వేదములను యైదవ ముఖముచే నధ్యయనము సేసెను. ఆయన యత్యద్భుతమైన యైదవ ముఖము వర్చస్సు లెవ్వని నింకొకని లెక్కసేయవు. అందరనట్లే చిమ్మివేయును. దరిజేరుటకుగాని చూచుటకుగాని యెదురుగా నేగుటకుగాని శక్తులుగాక హడలిపోయి యందరు మహాప్రభువైన యా పద్మగర్భుని దమ్ముదామ బెండువడినట్లునుకొని యడగారి తేజమెల్లగోల్పడి, వీని తేజస్సుచే నిస్తేజస్కులైతిమని శంభుని శరణొందుదమనుకొని దేవతలేగి నమస్కారము సర్వ | సర్వేశ్వర ! మహేశ్వర నమస్కారము నమస్కారము. సర్వజగత్ప్రతిష్ఠ నీవు. విష్ణువుతో నీవు జగద్ధేతువవు అని దేవర్షి పితృదానవులచే స్తుతింపబడు వాడై చాటున యుండి మీ యిష్టముం గోరుకొనుడు దేవతలార! యనియె.

(20)

ప్రత్యక్షదర్శనం దత్వా దేహి దేవ యధేప్సితం | కృత్వా కారుణ్య మస్మాకం వరశ్చాపి ప్రదీయతామ్‌ || 103

యదస్మాకం మహద్వీర్యం తేజఓజః పరాక్రమః | తత్సర్వం బ్రహ్మణాగ్రస్తం పంచమాస్యస్య తేజసా || 104

వినేశుః సర్వతేజాంసి త్వత్వ్రసాదా త్పునః ప్రభో |

జాయంతే తు యథా పూర్వం తథా కురు మహాశ్వర || 105

తతః ప్రసన్నవదనో దేవైశ్చాపి నమస్కృతః | జగామ యత్ర బ్రహ్మాసౌ రజో7 హంకారమూఢధీః || 106

స్తువంతో దేవదేవేశం పరివార్య నమావిశన్‌ | బ్రహ్మా తథాగతం రుద్రం న జజ్ఞే రజసావృతః || 107

అప్పుడు దేవతలనిరి. దేవా ! ప్రత్యక్ష దర్శన మనుగ్రహించి యాపై మాయిష్టముం దయసేయుము. మాపై దయసూపి వరముంగూడ దయసేయుము. మా మహావీర్యము తేజస్సు ఓజస్సు పరాక్రమ దేదిగలదో యదెల్ల యైదవ ముఖము తేజస్సుచే బ్రహ్మచే గప్పుపదినది. మా అన్నివెలుగులు నశించిపోయినవి. నీ యనుగ్రహముచే తిరిగి యవి ముందటియట్ల నుండునట్లుసేయుము. అనవిని ప్రసన్నముఖుడై వేల్పులచే మరిమరి మ్రొక్కబడి రజోగుణాహంకారముచే మొద్దువారిన బుద్ధితోనున్న బ్రహ్మయున్న తావునకు జనియె. దేవదేవునాతని చుట్టుం గ్రమ్ముకొని స్తుతించుచు దేవతలు నటు సనిరి. అట్లేతెంచి రుద్రుని రజోగుణావృతుండగుట బ్రహ్మ గుర్తింపడయ్యె.

సూర్యకోటి సహస్రాణాం తేజసా రంజయన్‌ జగత్‌ |

తదా దృశ్యత విశ్వాత్మా విశ్వ సృగ్విశ్వ భావనః || 108

స పితామహ మాసీనం సకలం దేవమండలం | అభిగమ్య తతో రుద్రో బ్రహ్మాణం పరమేష్ఠినమ్‌ || 109

అహో 7తితేజసా వక్త్ర మధికం దేవ రాజతే ఏవముక్త్వాట్టహాసం తు ముమోచ శశిశేఖరః || 110

వామాంగుష్ఠ నఖాగ్రేణ బ్రహ్మణః పంచమం శిరః | చకర్త కదలీగర్భం నరః కరరుహైరివ || 111

విచ్ఛిన్నం తు శిరః పశ్చా ద్బవ హస్తే స్థితం తదా | గ్రహమండలమధ్యస్థో ద్వితీయ ఇవ చంద్రమాః || 112

కరోతిక్షప్తకపాలేన ననర్త చ మహేశ్వరః | శిఖరస్థేన సూర్యేణ కైలాస ఇవ పర్వతః || 113

భిన్నే వక్త్రే తతో దేవా దృష్టాః తం వృషభధ్వజమ్‌ | తుష్టువు ర్వివిధై స్తోత్త్రె ర్దేవ దేవం కపర్దినమ్‌ || 114

సహస్రకోటి సూర్య ప్రకాశమున జగమ్మును రంజింపజేయుచు విశ్వాత్మ విశ్వకర్త విశ్వముం భావించు నా బ్రహ్మ యట గానవచ్చెను. అట గూర్చున్న పితామహుని యా దేవమండలముం దరిసి రుద్రుడు ఆహా ! నీ ముఖము మిగుల తేజస్సుచే దీవించుచున్నదని చంద్రశేఖరుం డట్టహాసము సేసెను. (విరుగబడి నవ్వెను). ఎడమ బొటనవ్రేలి కొన గోట నాతని యైదవ తలను గోళ్ళతో నరటిదూటనట్లు త్రెంచెను. తెగిన తల యవ్వల శివుని చేతిలో గ్రహమండలము నడుమ రెండవ చంద్రుడా యన్నట్లుండెను. మహేశ్వరుడా కపాలముం జేతం బైకెత్తి తలనున్న సూర్యునితో కైలాస పర్వతమట్లు నర్తనము సేసెను. తల తెగగానె యానందమొంది దేవతలానందభరితులై (జటాజూటుని) వృషభధ్వజుని యా దేవదేవుని స్తుతించిరి.

దేవా ఊచుః

నమః కపాలినే నిత్యం మహాకాలస్య కాలినే | ఐశ్వర్య జ్ఞాన యుక్తాయ సర్వభోగప్రదాయినే || 115

నమో హర్ష విలాసాయ సర్వదేవమయాయ చ | కలే నంహారకర్తా త్వం మహాకాలః స్మృతోహ్యసి || 116

భక్తానా మార్తినాశస్త్వం దుఃఖాంత స్తేన చోచ్యతే | శంకరోస్యాశు భక్తానాం తేన త్వం శంకరః స్మృతః || 117

ఛిన్నం బ్రహ్మశిరో యస్మా త్త్యం కపాలం బిభర్షిచ |

తేన దేవ కపాలీ త్వం స్తుతో హ్యద్య ప్రసీద నః || 118

ఏవం స్తుతః ప్రసన్నాత్మా దేవన్ప్రస్థాప్య శంకరః | స్వాని ధిష్ణ్వాని భగవాం స్తత్రైవాసీన్ముదాన్వితః || 119

విజ్ఞాయ బ్రహ్మణో భావం తతో వీరస్య జన్మ చ | శిరో వీరస్య వాక్యాత్తు లోకానాం కోపశాంతయే || 120

శిరస్యంజలిమాధాయ తుష్టావాథ ప్రణమ్య తం | తేజోనిధి పరం బ్రహ్మ జ్ఞాతు మిత్థం ప్రజాపతిమ్‌ || 121

నిరుక్త సూత్రరహసై#్య ఋగ్యజుస్సామ భాషితైః |

దేవతలు సేసిన రుద్ర స్తవము

ఉ. వందన మెల్లవేళలc గపాలికి కాలుని పాలికాలికిన్‌

వందన మేరి పుణ్యముల భాగము వారి కొసంగు దాతకున్‌ |

పొందుగ నవ్విభూతి యనుభూతియునుం గొని యెల్లదేవతా

బృందము తానయై ముదము పెంపున దా విలసించు మూర్తికిన్‌ ||

కలిలోనన్‌ లయముం బొనర్చెడి మహాకాలుండ వీ వెల్ల భ

క్తుల బాధల్‌ వగపుం హరించి సుఖమున్‌ కూర్పంగలాదౌట వో

హో శంకరుcడంచు పేర్కొనిరి నిన్‌ దున్మాడి లోకేశునా

తల చేబూని కపాలివైతి మమున్‌ బ్రీతిం గటాక్షింపవే

ఇట్లు వేల్పులు నుతింప వారిని వారి గృహమ్ముల కనిచి భగవాను డానందముతో నక్కడనే యుండెను. బ్రహ్మ యభిప్రాయ మెరింగి మహావీరుడగు నర్జునుని జన్మవృత్తాంతమెరిగి శాంతికొరకు బ్రహ్మ శిరస్సు త్రుంచి చేదోయి శిరమునం గేలించి యా విథాత కెరగి నిరుక్త మంత్ర రహస్యములచేత ఋగ్యజుస్సామ సూక్తులచేత నా బ్రహ్మదేవుని స్తుతించెను.

రుద్రకృత బ్రహ్మ న్త వళి

రుద్ర ఉవాచ

అప్రమేయ ! నమస్తే 7స్తు పరమస్య పరాత్మనే ||122

అద్భుతానాం ప్రసూతి స్త్వం తేజసాం నిధి రక్షయః | విజయా ద్విశ్వభావస్తం సృష్టికర్తా మహాద్యుతే || 123

ఊర్ధ్వ వక్త్ర నమస్తే 7స్తు సత్వాత్మక ! ధర్మాత్మక ! | జలశాయి న్జలోత్పన్న జలాలయ నమో 7స్తుతే || 124

జలజోత్పుల్లపత్రాక్ష జలదేవపితామహ | త్వయా హ్యుత్వాదితః పూర్వం సృష్ట్యర్థ మహమీశ్వర || 125

యజ్ఞాహుతి సదాహారా యజ్ఞాంగేశ నమో7స్తుతే | స్వర్ణగర్భ పద్మగర్భ దేవగర్భ వ్రజాపతే || 126

త్వం యజ్ఞస్త్వం వషట్కారః స్వధా త్వం పద్మసంభవ |

వచనేన తు దేవానాం శిరశ్చిన్నం మయా ప్రభో || 127

బ్రహ్మహత్యాభిభూతో7స్మి మాం త్వం పాహి జగత్పతే | ఇత్యుక్తో దేవదేవేన బ్రహ్మా వచన మబ్రపీత్‌ ||128

రు ద్ర కృత బ్ర హ్మ స్త వ ము

ఉ. తలపుఁనకందరాని పరతత్వమ ! ఓ పరమేశ ! యెల్ల విం

తలకును మూలమీవు ; భువనమ్ముల కర్తవు ; విశ్వభావుడే

వెలమి నశేషముం గెలిచి, యింపగు వెల్లువలకెల్ల వెల్గువై

పొలుతువు ; ఊర్ధ్వవక్త్ర ! యిదె భూమి స్వరూపము నీకు మ్రొక్కెదన్‌

చ. జలములఁ చుట్టినావటన చక్క వసింతు శయింతువో

జలజ విశాల లోచన ! అజా ! జలదేవ ! జలస్వరూప ! ప్రాం

జలినయి నీకు మ్రొక్కెదను, నన్‌ నృజియించితివీవ సృష్టికై

నలువ ! సువర్ణగర్భ సుమనః కులగర్భ నమస్కరింతు నిన్‌

శా. స్వామీ ! యజ్ఞము నీవ యందలి స్వధా స్వాహా వషట్కారముల్‌

స్వామీ నీవట యజ్ఞ యజ్ఞమందలి హవిర్భాగమ్ము లాహార

వేమో కైకొని యారగింతువు విరించీ! దేవతల్‌ గోరగా

నేమో త్రుంచితి నీదు వంచమ శిర మ్మీశాన ! సైరింపుమా

ధీమాంద్యానన బ్రహ్మహత్య గురియైతిన్‌ నన్ను రక్షింపవా ?

ఆన నాలించి బ్రహ్మ యిట్లనియె.

సఖా నారయణో దేవః స త్వాం పూతం కరిష్యతి |

కీర్తనీయః త్వయాధన్యః సమే పూజ్యః స్వయం విభుః || 129

అనుధ్యాతో7 సి వై నూనం తేన దేవేన విష్ణునా | యేన తే భక్తి రుత్పన్నా స్తోత్రం మాం మతిరుత్ధితా || 130

శిరశ్చేదాత్కపాలీ త్వం సోమసిద్ధాంత కారకః | కోటిః శతం చ విప్రాణా ముద్ధర్తాసి మహాద్యుతే || 131

బ్రహ్మహత్యావ్రతం కుర్యా న్నాన్యత్కించి న్న విద్యతే |

అభాష్యా ః పాపినః క్రూరా బ్రహ్మఘ్నా ః పాపకారిణః || 132

వైతానికా వికర్మస్థా న తే భాష్యాః కథంచన | తైన్తు దుష్టై స్తథా కార్యం భాస్కరస్యావలోకనమ్‌ || 133

అంగస్పర్శే కృతే రుద్ర స చైలో జల మావిశేత్‌ | ఏవం శుద్ధి మవాప్నోతి పూర్వదృష్టాం మనీషిభిః || 134

స భవాన్బ్రహ్మ హంతాసి శుద్ధ్యర్థం వ్రతమాచర |

చర్ణే వ్రతే పునర్భూయః ప్రాప్స్యసి త్వం వరాన్బహూన్‌ || 135

ఏవముక్త్వా గతో బ్రహ్మా రుద్ర స్తం నాభిజజ్ఞివాన్‌ |

అచింతయ త్తదా విష్ణుం ధ్యానగత్యా తతః స్వయమ్‌ || 136

లక్ష్మీ సహాయం వరదం దేవదేవం సనాతనమ్‌ | అష్టాంగ ప్రణిపాతేన దేవదేవ స్త్రిలోచనః || 137

తుష్టాన ప్రణతో భూత్వా శంఖచక్రగదాధరమ్‌ |

నా చెలికాడు నారాయణుడతడు నన్ను బవిత్రునిం జేయగలడు. నీకు భక్తి యుదయించి నన్ను స్తుతింప దలపు గల్గినది. తల తెగిన నీ వీ కపాలముం జేకొని సోమసిద్ధాంతమును (జ్యోతిశ్శాస్త్రమును) రచించి కోట్లకొలది విప్రుల నుద్ధరింతువు. బ్రహ్మహత్యా ప్రాయశ్చిత్త వ్రతము నీవు సేయవలెను. మరియేమియు లేదు. బ్రహ్మఘాతుకులు పాపులు. విరుద్ధ కర్మపరులు వైతానికులు (వితానాగ్ని (విద్యుత్తును) సేవింతురు. వారితో మాటలాడరాదు. ఆ దుష్టులు పాపనివృత్తికి సూర్యునివంక జూడవలయును. ఆ పాపుల మేను దాకిన సచేల స్నానము సేయవలెను. నీవు బ్రహ్మ ఘాతుకుడై తివి శుద్ధికై వ్రతమాచరింపుము. అది సేసినమీర బెక్కు వరములం బడయుదువు. అని పలికి రుద్రుండు సనియె. బ్రహ్మ యాయన రుద్రుడని గుర్తింపడయ్యె. అవ్వల లక్ష్మిసమేతుని వరదుని ధ్యానించెను. అయన సాక్షాత్కరింప సాష్టాంగ ప్రణతుడై శంఖ చక్ర గదాధరుం దామోదరు నిట్లు స్తుత్తించెను.

రుద్ర ఉవాచ

రు ద్ర కృ త వి ష్ణు స్త వః

పరంపరాణా మమృతం పురాణం పరాత్పరం విష్ణు మనంతవీర్యం |

స్మరామి నిత్యం పురుషం వరేణ్యం నారాయణం నిష్ప్రతిమం పురాణమ్‌ || 138

పరాత్పరం పూర్వజ ముగ్రవేగం గంభీర గంభీరధియాం ప్రధానమ్‌ |

నతో7స్మి దేవం హరిమీశితారం పరాత్పరం ధామ పరం చ ధామ || 139

పరాపరం తత్పరమం చ ధామ పరాత్పరేశం పురుషం విశాలమ్‌ |

నారాయణం స్తౌమి విశుద్ధభావం పరాపరం సూక్ష్మ మిదం ససర్జ || 140

సదా స్థితత్వాత్పురుషం ప్రధానం శాంతం ప్రధానం శరణం మమాస్తు ||

నారాయణం వీతమలం పురాణం పరాత్పరం విష్ణు మపార పారమ్‌ || 141

పురాతనం నీతిమతాం ప్రధానం ధృతిక్షమా శాంతిపరం క్షితీశమ్‌ |

శుభం సదాస్తౌమి మహానుభాపం సహస్రమూర్ధాన మనేక పాదం || 142

అనంతబాహుం శశిసూర్యనేత్రం క్షరాక్షరం క్షీరసముద్ర నిద్రమ్‌ |

నారాయణం స్తౌమి పరమ్పరేశం పరాత్పరం య త్త్రిదశైరగమ్యం || 143

త్రిసర్గసంస్థం త్రి హుతాశ నేత్రం త్రితత్వలక్ష్యం త్రిలయం త్రినేత్రమ్‌ |

నమామి నారాయణ మప్రమేయం కృత సిత ద్వాపర తశ్చరక్తం || 144

కలౌ చ కృష్ణం తషుథో నమామి ససర్జ యో వక్త్ర త ఏవ విప్రాన్‌ |

భుజాంతరాత్‌ క్షత్ర మధోరు యుగ్మాద్విశః పదాగ్రాచ తదైవ శూద్రాన్‌ || 145

నమామి తం విశ్వతనుం పురాణం | పరాత్పరం పారగ మప్రమేయమ్‌|| 146

సూక్ష్మమూర్తి మహామూర్తిం విద్యామూర్తి మమూర్తికం | కవచం సర్వదేవానాం నమస్యే వారిజేక్షణమ్‌ || 147

సహన్ర శీర్షం దేవేశం సహస్త్రాక్షం మహాభుజం | జగత్సంవాప్య తిష్ఠంతం నమస్యే పరమేశ్వరమ్‌ || 148

శరణ్యం శరణం దేవం విష్ణుం జిష్ణుం సనాతనం | నీలమేఘ ప్రతీకాశం నమస్యే శార్‌జ్గపాణినమ్‌ ||149

శుద్ధం సర్వగతం నిత్యం వ్యోమరూపం సనాతనం | భావాభావ వినిర్ముక్తం నమస్యే సర్వగం హరిమ్‌ || 150

నచాత్ర కించిత్పశ్యామి వ్యతిరిక్తం తవాచ్యుత | తన్మయం చ ప్రపశ్యామి సర్వమేత చ్చరాచ్చరామ్‌ || 151

(ఏవం తు వదతస్తస్య రుద్రస్య పరమేష్ఠినః)

ఇతీరితస్తేన ననాతన స్స్వయం పరాత్పర స్తస్య బభూవ దర్శనే |

రథాంగపాణి ర్గరుడాసనో గిరిం విదీపయన్‌ భాస్కరవత్సముత్థితః | 152

ణీరం వృవష్వేతి సనాతనో7 బ్రవీద్వరస్తవాహం వరదః నమాగతః ||

రుద్ర కృత విష్ణు స్తవము

మ. పరదైవమ్ముల కెల్లనుం బరమదైవమ్మైన విష్ణుం బరా

త్పరుని న్నిత్యు ననంతవీర్యుని బరంధామున్‌ సుధామున్‌ మహా

పురుషున్‌ సుస్థిరుఁడౌట, నగ్రజు మహాపూజ్యున్‌ విశాలుం బరా

త్పరు నారాయణునిన్‌ బురాణుని పరబ్రహ్మము శాంతిక్షమా

స్ఫురణుం ధీరు సనాతనున్‌ శుభుని సూక్ష్మున్‌ స్థూలసర్గత్రయ

స్థిరు వహ్నిత్రయ నేత్రునిన్‌ ద్రిలయునిన్‌ జేమోద్చి వర్ణింతు, ను

ద్ధురమూర్తిన్‌ ద్రిదశావ్రమేయుం గృతమందున్‌ దెల్పు త్రేతా యుగాం

తర వర్ణమ్మరుణమ్ము ద్వాపరమునన్‌ రక్తంబుగాగన్‌ గలి నౌచున్‌ కలిన్‌

హరి ! కృష్ణప్రభ తేజరిల్లుదువు నీ కన్నన్నమస్కారములై

మొగమందుండి సృజించి విప్రుల, భుజమ్ముల్‌ రెంట క్షత్రమ్ము, వై

శగణమ్మూరు యుగమ్మునుండి కని పాదాగ్రములన్‌ శూద్రులన్‌

దగ వేల్వేలు శిరస్సులున్‌ గనులునుం పాదంబులుబూనియీ దానన్‌

జగముల్‌ నింది వసించు నద్భుత భుజా స్తంభున్‌ ప్రభున్‌ శంఖ చ

క్ర గదా హస్తు విశుద్ధు సర్వగతు మేఘశ్వాము నచ్చమ్ముగా

గగనమ్మట్టులు సత్తసత్తునకు భిన్నమ్మౌచు రాణించు స

ర్వగుణున్‌ మ్రొక్కెద నీవుగాని దొక స్వల్పమ్మేది గన్గోను నిన్‌

భగవంతుండని స్థాణుజంగమము విశ్వమంచు దర్శించెదన్‌

క. విష్ణున్‌ సర్వశరణ్యుం | జిష్ణున్‌ వెలిలోననున్‌ వసిష్ణున్‌ బహురో |

చిష్ణున్‌ మ్రొక్కెద నెదభ్రా | జిష్ణున్‌ వర్ధిష్ణు వంచి శీర్షము దేవా ||

అని కొనియాడ చక్రము చేబూని గరుడు నెక్కి భాస్కరుడట్లా గిరి నుద్దీపింపజేయుచు నా గిరీశు చూపులం దరిసెను. నీపాలిదర మేను వరమీయ వచ్చితి వరమడుగుమన రుద్రవరుండిట్లనియె.

ఇతీరితే రుద్రవరో జగాద మమాతి శుద్ధిర్భవితా సురేశ ! |

న చాస్య పాపస్యహరం హి చాన్యత్సందృశ్యతే 7గ్న్యఞ్ఛ ఋతే భవంతం || 154

బ్రహ్మహత్యాభిభూతస్య తనుర్మే కృష్ణతాం గతా | శవగంధశ్చ మే గాత్రే లోహస్యాభరణాని మే || 155

కథం మే న భ##వే దేవ మే తద్ద్రూపం జనార్దన | కిం కరోమి మహాదేవ యేన మే పూర్వికా తనుః || 156

త్వత్‌ ప్రసాదేన భవితా తన్మే కధయ చాచ్యుత |

సురేశ్వర ! నాకు వెంటనే శుద్ధి కావలయు. మదీయ పాపహరు హరిని నీకంటె నింకొక వరమును శ్రేష్ఠమగు పదార్థమును గానను బ్రహ్మహత్యావశుడనైన మేనిదె నల్లవడిపోయినది, ఇందు శవగంధము ఇనుప నగలు నేర్పదినవి. నాకిట్టి పాడురూపు లేకుండ పోవుటెట్లు ? మహాదేవ ! ఏమిసేయుదు ? నెద్దాన నాకు దొలుతటి శరీరము నీయనుగ్రహమున నేర్పడగల దది అచ్యుతా ! అనతిమ్ము. నావిని విష్ణువిట్లనియె.

విష్ణురువాచ

బ్రహ్మవధ్యా పరా రాచోగ్రా సర్వకష్టప్రదా పరా | 157

మనసాపి న కుర్వీత పాప స్యాస్య తు భావనాం | భవతా దేవవాక్యేన నిష్ఠా చైషా ని బోధితా || 158

ఇదానీం త్వం మహాబాహో బ్రహ్మణోక్తం సమాచర | భస్మ సర్వాణి గాత్రాణి త్రికాలం ఘర్షయేన్తనౌ || 159

శిఖాయాం కర్ణయోశ్చైవ కరే చాస్థీ ని ధారయ | ఏవం చ కుర్వతో రుద్ర కాష్టం నైవ భవిష్యతి || 160

సందిశ్యైవం స భగవాం స్తతో 7ంతర్థాన మీశ్వరః | లక్ష్మీసహాయో గతావా న్రుద్ర స్తేనాభి జజ్ఞివాన్‌ || 161

నావిని విష్ణు విట్లనియె.

బ్రహ్మహత్య మహోగ్రమైనది.

ఇంతింతన నిది కొట్టువడనీ | వెంతకొట్టుకొని తెలియు విను కా |

లాంతక! తుదకిది ప్రాణో ! ద్క్రాంతినయే దనువు విడిచి తలగదురుద్రా ||

బ్రహ్మహత్యా ప్రాయశ్చిత్తవిధి

మనసులోనైన దలపరానిదిది పోవుటకు బ్రహ్మ సెప్పిన ప్రాయశ్చిత్త మిపు డిది సేసికొనుము. ఒడలెల్ల త్రికాలము భస్మము పూసికొనుట జుట్టున చెవుల చేతులం దెముకలు గట్టుకొనుము. ఇట్లుసేసిన నేకష్టముం గలుగదు. అని భగవంతుడు సందేశమిచ్చి లక్ష్మితో విష్ణువంతర్థానమొందెను.

కపాలపాణి ర్దేవేశః పర్యట న్వసుధా మిమాం | హిమవంతం సమైనాకం మేరుణా చ సహైవతు || 162

కైలాసం సకలం వింధ్యం నీలం చైవ మహాగిరిం | కాశీం కాంచీం తామ్రలిప్తాం మగధా మావిలాం తధా || 163

వత్సగుల్మం చ గోకర్ణం తథా చై వోత్తరాన్‌ కురూన్‌ | భద్రాశ్వం కౌతుమారీంచ వర్షం హైరణ్యకం తథా || 164

కామరూపం ప్రభానం చ మహేంద్రం చైవ పర్వతమ్‌ |

బ్రహ్మహత్యాభిభూతో7సౌ భ్రమం స్త్రాణం న విందతి || 165

త్రపాన్వితః కపాలం తు పశ్యన్‌ హస్తగతం సదా | కరౌ విధున్వం బహుళో విక్షిప్తస్య ముహుర్ముహుః || 166

యదాస్య ధున్వతో హస్తౌ కపాలం వతతే న తు |

తదాస్య బుద్ధిరుత్పన్నా వ్రతం చైత త్కరో మ్యహం || 167

మదీయేనైవ మార్గేణ ద్విజా యాస్యంతి సర్వతః | ధ్యాత్యైవం సుచిరం దేవో వసుధాం విచ చార హ || 168

అటుపై శివుడు కపాలముం బట్టుకొని భూమియెల్ల దిరుగాడుచు హిమవంతము మొదలు మహేంద్ర పర్వతము దాక యిందు పేర్కొనిన తీర్థక్షేత్రములెల్ల దిరిగియు రక్షణ పొందలేడయ్యె. ఎప్పుడు తన చేతిలోని పుర్రెం జూచుచు సిగ్గువడుచు చేతులూరక దులుపుకొనును వినరుచు తిరుగాడుచుండెను. ఎంతదులిపిన నా కపాలము క్రిందబడదయ్యె. అపుడేదేని వ్రతము సేయవలెనను బుద్ధి వొడమెను. నే జేసిన ప్రాయశ్చిత్తమును మున్ముందు ద్విజులు ననుష్టింవగలరు. అని యనుకొనుచు పరమేశ్వరుడట్లనే తిరుగుచుండెను. తుదకువచ్చి పుష్కరారణ్యముం బ్రవేశించెను.

పుష్కరం తు సమాసాద్య ప్రవిష్టో7రణ్య ముత్తమం | నానాద్రుమలతాకీర్ణం నానామృగరవాకులమ్‌ || 169

ద్రుమపుష్పభరామోదవాసితం యత్సు వా | యునా బుద్ధిపూర్వమివన్యసై#్తః వుషై#్పర్భూషిత భూతలమ్‌ || 170

నానాగంధరసై రన్యైః పక్వాపక్వైః ఫలైస్తథా | వివేశ తరుబృందేన పుష్పామోదాభినందితః ||

అయత్రారాధయతో భక్త్యా బ్రహ్మ దాస్యతి మే వరం |

బ్రహ్మప్రసాదాత్సంప్రాప్తం పౌష్కరం జ్ఞానమీప్సితమ్‌ || 172

ఏవం వై ధ్యాయత న్తస్య రుద్రస్యామిత తేజసః | పాపఘ్నం దుష్టశకునం పుష్టిశ్రీబలవర్ధనమ్‌ || 173

అజగామ తతో బ్రహ్మ భక్తిప్రీతో 7థ కంజజః | ఉవాచ ప్రణతం రుద్ర ముతాప్య చ పునర్గురుః || 174

సర్వకామప్రసిద్థ్యర్థం వ్రతం యస్మాన్ని షేవితం | మనోవాక్కాయభావైశ్చ సంతుష్టే నాంతరాత్మనా || 175

కందరామి చ వైకామం వదభోస్తే యథేప్సితమ్‌ | 176

రుద్ర ఉవాచ :

ఏష ఏ వాద్య భగవన్‌ సుపర్యాప్తోమహావరః | యద్దృష్టో7సిజగద్వంద్య జగత్కర్త ర్నమో7స్తుతే || 177

మహతాయజ్ఞ సాధ్యేన బహుకాలార్జితేన చ | ప్రాణవ్యయకరేణత్వం తపసా దేవదృశ్యసే || 178

ఇమం కపాలం దేవేశ నకరాత్పతితం విభో | త్రపాకరా ఋషీణాంచ చర్యైషాకుత్సితావిభో || 179

త్వత్ప్రసాదా ద్వ్రతం చేదంకృతం కాపాలికంతుయత్‌ | సిద్ధమేతత్ప్రపన్నస్య మహావ్రత మిహోద్యతాం || 180

పుణ్యప్రదేశే యస్మింస్తుక్షిపామీదం వదస్వమే | పూతోభవామి యేనాహం మునీనాం భావితాత్మనాం || 181-182

బ్రహ్మ ఉవాచ :

అవిముక్తం భగవతః స్థానమస్తి పురాతనమ్‌ | 183

కపాలమోచనం తీర్థం తవతత్ర భవిష్యతి | అహం త్వంచ స్థితస్తత్ర విష్ణుశ్చాపి భవిష్యతి || 184

దర్శనే భవతస్తత్ర మహాపాతకినో7పియే | తే7పి భోగాన్సమశ్నంతి విశుద్ధా భవనేమమ || 185

వరణాపి అసీచాపి ద్యేనద్యౌ సురవల్లభే | అంతరాలేతయోః క్షేత్రే వధ్యానవిశతి క్వచిత్‌ || 186

తీర్థానాం ప్రవరం తీర్థం క్షేత్రాణాం ప్రవరం తప | ఆ దేవా పతనాధ్యేత్తు క్షేత్రం సేవంతిమానవాః || 187

తేమృతా హంసయానేన దివం యాంత్యమేతోభయాః | పంచక్రోశ ప్రమాణన క్షేత్రం దత్తం మయాతవ || 188

క్షేత్రమధ్యాద్యదా గంగా గమిష్యతి సరిత్సతిం | తదా సామహతీపుణ్యా పురీరుద్ర భవిష్యతి || 189

పుణ్యా చోడఙ్ముఖీ గంగాప్రాచీచాపి సరస్వతీ | ఉదన్ముఖేయోజనేద్వే గచ్ఛతే జాహ్నవీనదీ || 190

తత్రవై విబుధాః సర్వే మయాసహ సవాసవాః | ఆగతావా సమైష్యంతి కపాలం తత్రమోచయ || 191

తస్మిం స్తీర్థైతు యేగత్వా పిండదానేన వైపితౄన్‌ | శ్రాద్ధెస్తు ప్రీణయిష్యంతి తేషాం లోకో7క్షయో దివి || 192

వారాణస్యాం మహాతీర్థేనరః స్నాతోవిముచ్యతే | సప్తజన్మకృతాత్పాపాద్గమనా దేవముచ్యతే || 193

తత్తీర్థం సర్వతీర్థా నాము త్తమం ఏరికీ ర్తితం | త్యజంతితత్రయేప్రాణాన్ప్రాణినః ప్రణతాస్తవ || 194

రుద్రత్వం తే సమాసాద్య మోదంతే భవతాసహ | తత్రాపితుహి యద్దత్తం దానం రుద్రయతాత్మనా 195

స్యాన్మహచ్చఫలం తస్య భవితాభావితాత్మనః | స్వాంగస్ఫుటిత సంస్కారం తత్రకుర్వంతియేనరాః 196

తే రుద్రలోకమాసాద్య మోదంతేసుఖినస్త దా తత్ర పూజాజపోహోమః కృతోభవతి దేహినామ్‌ || 197

అనంతఫలదః స్వర్గో రుద్రభక్తి యుతాత్మనః | తత్రదీప ప్రదానేన జ్ఞాన చక్షుర్భవేన్నరః || 198

అవ్యంగం తరుణం సౌమ్యం రూపవంతంతు గోసుతం | యోంగయిత్వామోచయితి స యాతి పరమం పదమ్‌ 199

పితృభిః సహితా మోక్షం గచ్ఛంతే నాత్ర సంశయః | అథకిం బహునోక్తేన యత్తత్రక్రియతేవరైః 200

కర్మధర్మం సముద్దిశ్య తదనంతఫలం భ##వేత్‌ | సృర్గాపవర్గయోర్హేతుస్తద్ధి తీర్థం మతం భువి || 201

స్నానాజ్జపాత్తథాహోమాదనంత ఫలసాధనం | గత్వా వారాణసీ తీర్థం భక్త్యా రుద్రపరాయణాః 202

యేతత్ర పంచతాంప్రాప్తా భక్తాస్తే నాత్రసంశయః | వసవః పితరోజ్ఞేయా రుద్రాశ్చైవ పితామహాః || 203

ప్రపితామహాస్తథా దిత్యా ఇత్యేషావైదికే శ్రుతిః | త్రివిధః పిండదానాయ విధిరుక్తోమయానషు || 204

మానుషైః పిండదానంతు కార్యమత్రాగరైస్సర | పిండదానంచ తత్రైవస్వపుత్రైః కార్యమాదరాత్‌ || 205

సుపుత్రాస్తే పితౄణంతే భవంతి సుఖదాయకాః | ప్రోక్తం తీర్థంమయాతుభ్యం దర్శనాదపిముక్తిదం || 206

స్నాత్వాతుతత్రముచ్యంతే మానవాఃకర్మబంధనాత్‌ | విముక్తా బ్రహ్మహత్యాయాః స్తత్రరుద్రయథాసుఖం || 207

అవిముక్తేమయాదత్తే తిష్ఠత్వం భార్యయాసహ ||

రుద్ర ఉవాచ :

యానియానిచ తీర్థాని తేష్వహం విష్ణునా సహః | తిష్ఠామి భవతోక్తేన వరఏషవృతోమయా || 208

ఆదిదేవో మహాదేవ ఆరాద్యోభవతాసరా | వరందాస్వామితేచాహం తస్టేనాంతరాయణ || 209

విష్ణోశ్చాహంప్రదాస్వామి వరాంశ్చ మనసేప్సితాన్‌ | సురాణాంచైవ సర్వేషాం మునీనాం భావితాత్మనాం || 210

అహందాతా అహం యాచ్యోనాన్యోభావః కథంచన | 211

బ్రహ్మోవాచః :

ఏవం కరిష్యే7హం రుద్రయ త్త్వయో క్తంవచః శుభం | నారాయణశ్చ తే వాక్యం కర్తా సర్వం ససంశయః || 212

విసృజ్యైనంతదారుద్రం బ్రహ్మాచాంతరదీయిత | వారాణష్యాం మహాదేవో గవాతోతీర్థంస్యవేశయత్‌ || 213

ఇతి పాద్మేసృష్టిఖండే రుద్రయతే బ్రహ్మవధ్యానా శశ్చతుర్థశో7ధ్యాయః

నానాతరులతాయుతము నానామృగరవసంకులము చెట్లుతీగల పువ్వుల పరిమళించునది వాయువులు వీచుచుండ బుద్ధిపూర్వకముగ నెవరో యుంచినట్లున్న పూలనుండిచిమ్ముసువాసనలతో పండ్లతో నతిసుందర మీ ప్రదేశమందు జొచ్చి భక్తితోడి నాఆరాధన మందికొని అరవిందగర్భుడు (బ్రహ్మ) వరమును బ్రసాదించునది. బ్రహ్మ ప్రసాదముననే యీ పుష్కరమును గురించిన కోరిక సిద్ధించినది. పాపమునడంచి దుష్టమును వారించి పుష్టిని సంపదను బలమును బెంపొందించునది దివ్యక్షేత్రము లభించినది యని ధ్యానము సేయుచున్న మహా తేజశ్శాలి రుద్రునికెదుట భక్తిప్రీతుడై పద్మజుడు సాక్షాత్కరించి వ్రాలిన రుద్రునిపైకెత్తి గురువుగా మఱి యిట్లనియె- దివ్యమైన వ్రతోపచారమున నా దర్శనము కావలెనని నీచేనెంతో ఆరాధింపబడినాను. వ్రతనిష్ఠులు మానవులు దేవతలు నన్ను జూచెదరు. వారి కోరికతో పరమప్రవరమైన వరము నే నిత్తును. సర్వకామములు చక్కగ సిద్ధించుటకు నంతరాత్మ సంతుష్టిగ త్రికరణశుద్ధిగ వ్రతమాచరించితివి. వరమేమి నీకిత్తునది తెలుపుమన

రుద్రు డిట్లనియె :

భగవంతుడా ! ఇదే మహావరము చాలును. జగద్వంద్య ! జగత్కర్తా ! నాకు గనబడితివి. నమస్కారము. బహుపుణ్యము యజ్ఞములచే బహుకాలము సంపాదించుకొన్నది ప్రాణములొడ్డి చేసిన తపస్సుచే నీవు గననౌదువు. దేవేశా ! ఈ కపాలము నా చేతినుండి జారిపడదు. ప్రభూ ! అందరు ఋషుల కసహ్యమై తలవంపు గూర్చుచున్నది. నీ ప్రసాదముచే కాపాలికమను వ్రత మాచరించితిని. ఈ మహావ్రతము సిద్ధించెనా ? శరణందితి నానతిమ్ము, పుణ్యస్థలమునందెక్కడ దీనిని విసరివైతునది పలుకుము. ఆత్మభావనులగు ఋషులకు పవిత్రుడయ్యెదను అని రుద్రుడన

బ్రహ్మ యిట్లనియె :

భగవంతుని స్థాన మవిముక్తమనునది పురాతన మున్నది. కపాలమోచనమునకు నీకిది తీర్థముగాగలదు. నేను నీవు విష్ణువు నిట నుండుదము. ఇట నీ దర్శనమైనంత పరిశుద్ధులై నాభవనమందిట సర్వభోగములనుభవింతురు, దేవతల కెంతో ప్రియమైన వరుణ - అసి యను సదీమతల్లు లిటనున్నవి. ఆ నదుల నడుమ బ్రహ్మహత్య యెన్నడుం జొరబడదు. ఇక్కడ పోయినవారేలాటి భయములేక హంసయానమున స్వర్గమున కేగుదురు. ఐదుక్రోసుల కొలతను నేనీ క్షేత్రమును నీ కిచ్చితిని. ఈ క్షేత్రముమధ్యనుండి గంగ సముద్రమున కేగును. అప్పుడక్కడ పుణ్యమైన మొక పురమేర్పడును. పుణ్యనది గంగ ఉత్తరముగను సరస్వతి తూర్పునకు జాహ్నవి ఉత్తరముగను రెండామడలిట ప్రవర్తించును. దేవతలింద్రాదులందరు అటకు వచ్చి నాతో నుందురు. అక్కడ నీ కపాలము విడువుము.

అటకేగి పిండదానముచే పితరులను శ్రాద్ధమందు బ్రీతినందజేయువా రక్షయ పుణ్యలోకము స్వర్గ మందుదురు. వారాణసియందు మహాతీర్థమందు స్నానముచేసిన యతడు సప్తజన్మల పాపమునుండి ముక్తి నందును. ఇటకు యాత్రసేసినను జాలును. అది సర్వతీర్థోత్తమము. నీకు మ్రొక్కి ఇట ప్రాణము విడిచిన వారు రుద్రత్వమంది నీతో సమ్మోదింతురు. ఇట మనఃపూర్వకముగ నిచ్చిన దానము మహత్ఫలనిధానమగును. అది నీ ప్రభావమే. ఇట తమ శరీరము తాము చీల్చుకొని సంస్కరించుకొను వారెప్పుడు రుద్రలోకమందానందింతురు. (ఆత్మహత్యాదోష మచటలేదన్నమాట) ఒచ్చునొరములేని సాధువైన వయస్సులో నున్న యందమైన గోసుతమునిట (ఆబోతును) అచ్చోసి వదలినయతడు పరమపదమందును. పితరులతో గూడ మోక్షమందును. ఇందు సందేహములేదు. పలుమాటలేల ? అక్కడ మానవులు ధర్మోద్దేశముతో నే పని చేసినను నది యంతులేని ఫలమిచ్చును. ఆ తీర్థమవనిలో స్వర్గమునకు అపవర్గమునకు (మోక్షమును) గూడ కారణమని ఋషి సమ్మతము. స్నానము జపము హోమము దానము ననంత ఫలదము. భక్తితో రుద్రపరాయణులై వారాణసీ తీర్థమున కేగి యట పంచత్వమునందినభక్తులు పితృదేవతలు, పితామహులు, (తాతలు) వసువులు, రుద్రులు, ప్రపితామహులు (ముత్తాతలు) ఆదిత్యులు నౌదురని వేదమువలన వినికి. ఇట పిండదానవిధి మూడు విధములని నే జెప్పితిని. ఇటకు యాత్రవచ్చిన మనుజుపుత్రులు పిండదానము శ్రద్ధతో చేసి తీరవలెను. సుపుత్రులు వారే పితరులకు సుఖమిచ్చినవారు. దర్శనమాత్రమున ముక్తినిచ్చు తీర్థమును నే నీకు దెల్పితిని. అచట స్నానముచేసిన జన్మబంధమునుండి ముక్తినందును. రుద్రా ! అచ్చట యథాసుఖముగా బ్రహ్మహత్యనుండి నీవు ముక్తుడవై భార్యతో నేనిచ్చిన యీ యవిముక్తక్షీరమందు సుఖమందుము. అన శివుడు

నీ మాటంబట్టి పృధివిలో నన్ని తీర్థములందు విష్ణువుతో నీతో నేనుందును. నేనుకోరువరమిది. నేను దేవుడుగా మహాదేవ ! నీతో నెల్లప్పుడారాధ్యుడనగుదును. సంతుష్టాంతరంగుడనై యీ వరమిచ్చుచున్నాను.

విష్ణువునకును కోరిన వరములిత్తును. దేవతలకు మునుల కందర కాత్మభావనులకు నిచ్చువాడను నేనే. ఇంకొకరెట్లునుం గాకూడదన బ్రహ్మ - రుద్రా ! నీయన్న శుభవచనము నే నిట్లేచేసెదను. నారాయణుడును నీ వన్నట్లు సేయును. సందియము లేదు అని రుద్రునిం గూర్చి పలికి వెళ్ళి వారాణసియందు దివ్యతీర్థము నేర్పరచెను.

ఇది సృష్టిఖండమునందు బ్రహ్మహత్యానాశమను పదునాల్గవయధ్యాయము

Sri Padma Mahapuranam-I    Chapters