Neetikathamala-1    Chapters    Last Page

10

దైవస్తుతి

ƒ«sª«sVbP+ªy˳ØùLi ƒ«sª«s ¸R…°ª«sƒy˳ØùLi

పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యామ్‌,

నగేన్ద్రకన్యా వృషకేతనాభ్యాం

నమో నమ శ్శంకర పార్వతీభ్యామ్‌.

(ఉమామహేశ్వరస్తోత్రం)

---- ----- -----

భర్తృహరి

క్రిమిసముదాయ సంకులము కేవల నింద్యము పూతిగంధహే

యమును నిరామిషంబును ఖరాంగ భవంబగు నెమ్ముcగుక్క దా

నమలుచుc జెంతనున్న సురనాథునిcగన్గొని సిగ్గుcజెంద ద

ల్పమని నిజస్వభావముc దలంపదు నీచపుcబ్రాణి యెయ్యెడన్‌.

కుక్క పురుగులు గల్గినదియు, నిషేధింపదగినదియు, దుర్వాసనచే రోతపుట్టించునదియు, మాంసము లేనిదియు నగు గాడిద యెముకను అతిప్రీతితో కొరుకుచు తన సమీపమునకు దేవేంద్రుడు వచ్చి నిలిచినను సిగ్గుపడదు. నీచుడు తాను గ్రహించినది తుచ్ఛమా కాదా యను విషయమునుకూడ లెక్కచేయడు గదా!

* * *

శిబిచక్రవర్తి

శిబి ఉశీనరరాజనందనుడు. సర్వగుణ సంపన్నుడు. మహాదాతగా విశ్వవిఖ్యాతి పొందాడు. అతని ఆత్మత్యాగాన్ని ఆర్తత్రాణపరాయణత్వాన్నీ ఇంద్రాగ్నులు పరీక్షించారుకూడ.

ఒకనాడు ఒక విప్రశ్రేష్ఠుడు శిచిచక్రవర్తివద్దకు వెళ్ళి ''మహారాజా! నేను ఆకలితో చాల బాధపడుతున్నాను. నాకు భోజనం కావా'' లని అర్థించాడు. వెంటనే శిబి ఏయే పదార్థాలు కావాలో తెల్పవలసిందిగా కోరాడు. ఆ బ్రాహ్మణుడు ఒక ఘోరమైన నియమంతో ఆహారం సిద్ధం కావాలని కోరాడు. శిబి ఏ సంకోచము లేకుండా తమరు కోరిన విధంగా చేయడమే నాధర్మం. ఎట్టి పరిస్థితులలోనూ ఆ ధర్మం అతిక్రమింపబడదు'' అని నిశ్చయంగా చెప్పాడు. వెంటనే ఆ విప్రుడు'' ఓరాజా! ముందుగా నీ ప్రియమైన కుమారుడు బృహదర్భుని వధించి అతనికి దహనసంస్కారములు నీవు నిర్వహించినతర్వాత స్వయముగా నాకు అన్నపచనం చేసివడ్డించాలి. ఇదే నా కోరిక'' అని వెళ్ళిపోయాడు.

శిబిచక్రవర్తి తన కుమారుని పిలిచి ''నాన్నా'' అని గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు. ఆయన నేత్రములనుండి బాష్పధారలు స్రవించాయి. కుమారు డది గాంచి ''తండ్రీ! ఎందుకు దుఃఖిస్తున్నారని ప్రశ్నించాడు. శిబి ''నాయనా? నీవు అదృష్టవంతుడవు'' అని అంటూ కుమారుని వధించి అతనికి దహనసంస్కారములు నిర్వర్తించాడు. వెంటనే ఇంటికి వచ్చి ఆతురతతో అతిథికి అవసరమైన భోజన పదార్థములను స్వయంగా వచనం చేశాడు. కొంతసేపు నిరీక్షించాడు. కాని ఆ బ్రాహ్మణోత్తముడు రాలేదు. ఆ ఆహరపాత్రను తన శిరస్సుపై నిడుకొని అతిథికొరకు అన్వేషించడం ప్రారంభించాడు. అప్పు డొక వ్యక్తి శిబిని సమీపించి ''మహారాజా! మీరు అన్వేషిస్తున్న బ్రాహ్మణుడు సమీపంలోనే ఉన్నాడు. ఏకారణం చేతనో తెలియదుగాని అతడు కుపితుడై మీ నగరంలోని రాజభవనాలను, ఆయుధాగారములనూ, కోశాగారాలనూ భస్మం చేస్తున్నాడు'' అని దీనంగా పలికాడు. శిబి నిర్వికారంగా, అంచంచలంగా నగరం ప్రవేశించాడు. ఆ విప్రుని సమీపించి ''ఓ బ్రాహ్మణోత్తమా! తమకు ఆహారం నియమానుసారం సిద్దం చేశా'' నని విన్నవించాడు. ఆబ్రహ్మణుడు తనవంక చూడనూ లేదు. అతనికి ప్రతి సమాధానం ఈయనూ లేదు. నిర్లక్ష్యంగా మరోవైపు చూస్తూ నిల్చున్నాడు. ముందు భోజనం ఆరగించ మని శిబి అతనిని ప్రార్థించాడు. ఆ బ్రాహ్మణుడు మౌనంగా రెండు గడియలు ఊరుకుని- ''రాజా! ఈభోజనం నువ్వే తిను'' అన్నాడు తిరస్కారంగా. శిబి ప్రశాంత హృదయంతో బ్రాహ్మణుని ఆజ్ఞప్రకారం అతిథిని పూజించి తన శిరస్సుపై నున్న పాత్రను దింపి భోజనం చేయడానికి సంసిద్థుడైనాడు. వెంటనే ఆ విప్రుడు అతని చేయి పటుకుని -''రాజా! నీవు క్రోధాన్ని సంపూర్ణంగా జయించావు. సర్వస్వమూ బ్రాహ్మణులకు దానం చేసిన అనుపమ దానశీలుడవు నీవు. జిత క్రోధనుడవు'' అని కీర్తించెను.

శిబి కన్నులు తెరచిచూచాడు. తాను స్వయంగా వధించిన ప్రియ పుత్రుడు దివ్య వస్త్రాలంకృతుడై చిరునవ్వుతో తన యెదుటనే కన్పించాడు. తన నగరంలో భస్మీభూతమైన ఆయుధాగారాలు, రాజభవనాలు, కోశాగారాలు యథాతథంగానే ఉన్నాయి. ఆ బ్రాహ్మణుడు చతుర్భుజుడైన బ్రహ్మదేవుడుగా దివ్యదర్శన మిచ్చి అంతర్థానం చెందాడు. ఈదానం శిబి కీర్తి కోసంగాని, ఐశ్వర్యం కోసంగాని చేయలేదు. అతనికి భోగదృష్ట అసలే లేదు. అతడు ధర్మాన్నే అనుసరించాడు. అందువల్ల శాశ్వత స్వర్గస్థానాన్ని పొందాడు. సజ్జను లాచరించే మార్గాలేమనమూ అనుసరించాలి.

ప్రశ్నలు

1. శిబిచక్రవర్తి గొప్పతన మెట్టిది?

2. విప్రుడు శిబిని ఏమి కోరెను?

3. శిబిని పరీక్షించిన విప్రుడు ఎవరు?

Neetikathamala-1    Chapters    Last Page