Sanathana Dharmamu    Chapters    Last Page

III. వైదికమతము

1. పేరులేని మతం

మన మతాన్ని హిందూమతమని వ్యవహరిస్తాం. కాని మన మతానికి వాస్తవంగా ఈ పేరు లేదు. హిందు అంటే 'ప్రేమ' అని అర్ధం. హింసను దూషించువాడు హిందువు అని కొందరంటారు. ఇది చమత్కారముగా చెప్పేమాట. పురాతన శాస్త్రములలో హిందూమతమన్న మాట కానరాదు.

హిందువులన్న పేరు అన్య దేశీయులు మనలను వ్యవహరించే పదం. విదేశీయులు మనదేశమునకు రావలెనంటే సింధునదిని దాటి రావలసి వచ్చేది. అందుచేత సింధువును - హిందువనీ, దానికావలి ప్రదేశమును ఇండియా అనీ, దాని మతమును హిందూమతమనీ పిలువసాగారు. హిందువన్నది మనకు పూర్వకమైన పేరు కాదు. వైదికమతము, సనాతన ధర్మము అని ఒక్కొక్కపుడు చెప్పుకొన్నా అవికూడ సరియైన పేర్లు కావు. మనకు ఆధారమైన గ్రంధములలో ఏ విధమైన పేరూ కనబడదు.

మన మతము తప్ప తక్కిన మతములన్నీ ఒక ప్రవక్త నామధేయముపై ఆధారపడి యున్నవి. ఆ ప్రవక్తలకు మునుపు, ఆ ఆ మతములు లేవు బౌద్ధము, బుద్ధునిచేత స్థాపించబడినది. క్రైస్తవము క్రీస్తుచేత స్థాపించబడినది. ఇట్లు ఆయా ప్రవక్తల నామములననుసరించి ఆయా మతము లేర్పడినవి. మన మతమన్నచో, ఈ ప్రవక్తలు స్థాపించిన మతములకన్నిటికీ ముందున్నది. ఈ మతము ఒక్కటే ఒకప్పుడు విశ్వవ్యాప్తముగా వుండేది. దీనిని తప్పించి వేరే మతమేదీ లేనందున, దీనికొక పేరు లేక అనామిక ఐనది.

ఈ పేరు లేని మతమును మొదట ఎవరు స్థాపించారు? ఎంత పరిశీలించినా, ఈ మతమునకు ఆది పురుషుడెవరో తెలియకుండానే వున్నది. బ్రహ్మ సూత్రకర్త వ్యాసుడా, లేక భగవద్గీత బోధించిన కృష్ణపరమాత్మయా అని యోచిస్తే వారు కూడా తమకు ముందే ప్రచారములో వున్న వేదములను స్మరిస్తున్నారు. పోని వేదమంత్రద్రష్టలైన ఋషులు ఆది పురుషులని అందామా అంటే, వారు కూడ మేము ఈ వేదములను సృష్టించలేదు. ఇవి మా మూలముగా వచ్చినవే కానీ వీనికి మేము సృష్టికర్తలము కాము. ధ్యాననిష్టలో వున్నపుడు మాకు ఈ మంత్రములు ఆకాశమున అగపడినవి. మేము మంత్రద్రష్టలమే మంత్ర కర్తలము కాము అని అంటారు.

2. విశ్వవ్యాప్తమైన మతం

హిందూమతమని మనము ఇప్పుడు చెప్పుకొంటున్న మతం ఒకపుడు ప్రపంచమంతా వ్యాపించి వుండేది. సుమారు క్రీ.పూ.1300 ఏళ్ళక్రితం ఈజిప్టులో ఇద్దరు (రామ్సెస్‌-హిట్టిటీస్‌ మధ్య) ఒక ఒడంబడిక చేసుకొన్నారు. దానిని గూర్చి ఒక శాసనము వెలికి వచ్చినది. ఆ శాసన ప్రకారము ఆ రాజులు మిత్రావరుణుల సాక్షిగ ఆ ఒడంబడిక చేసుకొన్నట్లున్నది. మిత్రావరుణులు వైదిక దేవతలు.

దక్షిణ ఆఫ్రికా తూర్పు తీరంలో వున్న మెడగాస్కర్‌ ద్వీపంలో నూటికి 75 పాళ్ళు సంస్కృతము పేర్లే వున్నాయి. ఇవన్నీ రామ శబ్దానికి అనుకృతులే. ఒకపుడు ఎడారులూ సముద్రములుగా వుండేవి. సహారా శబ్దం సాగరపదానికి వికృతియై వుండాలనిపిస్తుంది. సహారా ఎడారి సముద్రంగా వున్నపుడు దాని తీరం జన సమ్మర్ధంగా వుండేదనీ, అచటి పేళ్ళు సంస్కృత శబ్దములనీ, రామనామ సంబంధము కలిగినవనీ చెప్పుతున్నారు. ఈ విషయం ఎన్‌సైక్లోపీడియా ఆఫ్‌ బ్రిటానికా - 23వ వాల్యూంలో వుంది.

మెక్సికో మనకు నవరాత్రిళ్ళు వచ్చేటపుడు వాళ్ళు ఒక ఉత్సవం చేసుకొంటారు. దాని పేరు రామసీత. ఆ దేశంలో త్రవ్వి తీసిన శిల్పములలో వినాయక విగ్రహములున్నవని బేరక్‌ హాం బోల్ట్‌ వ్రాసాడు. వేదప్రమాణ్యాన్ని వీరు అంగీకరించినందున వీరిని ఆస్తికులన్నారు. ఇపుడు వీరినే ఆజ్టెక్స్‌ (Aztecs) అని అంటున్నారు.

పెరూ దేశంలో సూర్యోపాసన వుండేది. వాళ్ళను 'ఇన్కాస్‌' Incas అనేవారు. సూర్యునికి ఇనుడున్న పేరున్నది మనమెరిగినది.

ఇదే విధంగా కాలిఫోర్నియాను మనం కపిలారణ్యమనీ, దాపునవున్న ద్వీపాలు - హార్స్‌ ఐలండ్‌, ఆష్‌ ఐలండు - నగర చక్రవర్తి గుర్రమును కట్టివేసిన చోటు అనీ, కపిలుని క్రోధం చేత సగరతనయులు భస్మమయిన ప్రదేశములనీ ఊహించుటకు వీలుగా ఉన్నది. సగర తనయులు వెళ్ళిన పాతాళలోకం ఈ ప్రదేశ##మై వుండవచ్చును.

జావా బోర్నియాలలో మన మతావశిష్టములు ఈనాటికీ వున్నవి. కొయొటే బోర్నియా చేరిన మూలవర్మ యజ్ఞ యాగాదులు చేసినట్లు శిలాశాసనాలున్నవి. మన మతం ఒకపుడు సర్వవ్యాపకంగా వుండేదనుటకు ఇవి సాక్ష్యములు.

3. మన మతంలోని ప్రత్యేకత

ఇతర మతములలో లేని ప్రత్యేకత మన మతానికొకటి వున్నది. అది కర్మతత్త్వం. మన మతం నుంచి పుట్టిన బౌద్ధ జైనమతములు కర్మ తత్త్వాన్ని ఒప్పుకొన్నా అన్య మతస్థులు కర్మసిద్ధాంతాన్ని అంగీకరించటంలేదు.

కర్మసిద్ధాంతమంటే ఏమి? ప్రతికార్యానికీ కార్యకారణ సంబంధమొకటి వున్నది. ఆంగ్లంలో దానిని Cause and effect అని అంటారు. Action and Reaction అనటమూ అదే. ఇవి అనివార్యములని ఫిజిక్స్‌ చెబుతుంది. భౌతికంగా చెప్పే మాటనే మన పెద్దలు జీవితంలో కర్మతత్త్వమని వ్యవహరిస్తారు. ప్రపంచంలో జడ వస్తువులున్నట్లే, చైతన్యమున్న (జ్ఞానము) జీవులూ ఉన్నారు. ఇవి ఏకమైతేనే ఐహిక జీవితం. ఒకదానికున్న నియతి, ధర్మము మరొక్క దానికీ వుండియే తీరాలి. మనిషి చేసే ఒక్కొక్క కర్మకు ఫలముండి తీరవలె ననుటయే కర్మ సిద్ధాంతము. పాపకర్మకు తగిన శిక్ష మనిషి అనుభవించవలసినదే. పుణ్యకర్మ చేస్తే తదనుసారియైన పుణ్యఫలము వస్తుంది అని మన మతం చెబుతుంది.

ఈ పాప పుణ్య కర్మ ఫలములను అనుభవించుటకే మనుష్య జన్మ ఏర్పడినదని మన మతము చెప్పుతుంది. మంచికి మంచి, చెడ్డకు చెడ్డ ఫలములున్నవని ఇతర మతములు చెప్పినా మన మతం వలె ఇంతరూఢిగా, కార్యకారణ సంబంధాన్ని అవి సిద్ధాంతీకరించటం లేదు. ఇతర మతములు పునర్జన్మ విషయమూ చెప్పటంలేదు. కర్మ ఫలానుభవమునకై ఎన్నో జన్మలు ఎత్తవలసి వస్తుందనే మన మతాభిప్రాయమును ఇతర మతస్థులు అంగీకరించుట లేదు. ''మనిషికి ఈ జన్మ తప్ప వేరే జన్మ లేదు. ఈ జన్మ ముగిసిన వెంటనే ఏదో ఒక చోట జీవుడు భగవంతుని తీర్పుకోపం (Judgement Day) కాచుకొని వుంటాడు. ఇతడు చేసిన కర్మానుసారం, భగవంతుడు నిత్యస్వర్గవాసమో, నిరంతర నరకలోక ప్రాప్తియో (Eternal dammation) విధిస్తాడు'' అని ఆ మతములంటాయి.

ఒకప్పుడు నా వద్దకొక ఆంగ్లేయుడు వచ్చాడు. ఆయన బహుగ్రంధకర్త. బైబిల్‌ బాగా చదివినవాడు. బైబిల్లో దేవుడు ప్రేమ స్వరూపి అని ఎక్కడబడితే అక్కడ చెప్పబడివున్నా, ఒక తప్పుకు, కొంచమైనా కరుణ లేక నిత్య నరకం భగవంతుడు విధిస్తాడన్న విషయం అతనికి అంతగా రుచించలేదు. ఒక క్రైస్తవ ఫాదరీ వద్ద ఈ సందేహాన్ని ఈయన వెలిబుచ్చాడట. అందులకు అయన అన్నాడట, ''నిత్య నరకము ఉండటం వాస్తవమే. కానీ అది ఎప్పుడూ ఖాళీగానే వుంటుంది''.

ఈ సిద్ధాంతాన్ని మనం ఒప్పుకోవాలంటే కొంచెం శ్రమయే. పాపినికూడా కృపచేత భగవంతుడు నరకానికి పంపలేదని అనుకొందాం. అతడెక్కడకు వెళ్తాడు? వారేమో పునర్జన్మను ఒప్పుకోవటంలేదు. అందుచేత పాపికూడ స్వర్గానికి వెళ్ళవలసి వస్తుంది. అపుడు పాపభీతి లేనందున మనము ఎన్ని పాపాలైనా చేయవచ్చును. అట్లైతే పాపకర్మాచరణపు విరమణకు ఒక కారణం లేకపోతుంది.

మనమత ప్రకారం కూడ కర్మఫలాన్ని యిచ్చేవాడు ఈశ్వరుడే. ఈశ్వరుడు కరుణామూర్తియే. అంతమాత్రాన ఆయన పాపులను మీరేమైనా చేసుకోండి అని వదలి పెట్టడంలేదు. చేసిన కర్మఫలాన్ని అనుభవించడానికి మరల ఈ లోకానికి పంపుతున్నాడు. స్వర్గసౌఖ్యమూ, నరక దుఃఖమూ రెండూ ఈ లోకంలోనే వున్నవి. పుణ్యపాపఫలములను ఈ లోకంలో అనుభవిస్తున్నాం. సాధారణంగా జనానీకం సుఖంగా వున్నట్లు కనిపించటంలేదు. కష్టపడుతున్నట్లే కనబడటంచేత, పాపకర్మనే వారు ప్రబలంగా చేసినట్లు తోస్తుంది.

''మరొక జన్మలోనైనా ఇతడు పాపక్షయం చేసుకోనీ'' అని ఈశ్వరుడు మనకు మరు జన్మ ఇస్తున్నాడు. అంతేకాదు. పాపక్షాళనానికి వలసిన సదుపాయాలు అయిన గురువు, శాస్త్రములను క్షేత్రము కల్పించి సాయపడుతున్నాడు. పాపి కుడ స్వర్గానికి పోతాడన్న ఇతర మతస్థుల నమ్మకం కంటే, మనమతంలో చెప్పిన విధానమే చక్కగా వున్నదని వివేచన చేసేవారికి విశదమౌతుంది. ఇందులో పురుషయత్నమునకు తావున్నది. ఆ పురుష యత్నమునకు వలసిన సదుపాయములు భగవంతుడు సమకూర్చటం, అతని కరుణా విశేషమని చెప్పాలి.

సైన్స్‌ ప్రకారం పునర్జన్మవుందా? అని చాలా మంది పరిశోధనలు చేయడానికి ప్రారంభించారు. ఈ శాస్త్ర విభాగాన్ని పారాసైకాలజీ అని అంటారు. వారి పరిశోధనల వల్ల తేలిందేమంటే పునర్జన్మ ఉందని, గడచిన జన్మలోని వృత్తంతాలు మరువక కొందరు ఏకరువు పెట్టగా, వారు చెప్పిన ప్రదేశాలకు వెళ్ళి పరిశోధిస్తే ఆ వృత్తాంతాలు జరిగినట్లే ఆ శాస్త్రజ్ఞులు తెలుసుకొన్నారు. ఇట్లు పూర్వజన్మ స్మృతులవారు అందరూ పోయిన జన్మలో సాధారణంగా చనిపోక, ఆకస్మిక దుర్మరణ ప్రాప్తిచేత చనిపోయారని కూడ ఆ శాస్త్రజ్ఞులు తెలుసుకొన్నారు.

4. సద్వస్తువు ఒక్కటే

xqsµR…*xqsVòª«so INRPäÛÉÁ[. A xqsµR…*xqsVò®ªs[ xqsª«sVxqsò ÒÁª«sLSaRPVÌÁVgS „sLSÑÁÌýÁV»R½Vƒ«sõµj…. C ÒÁª«s ÇÁ²R… úxmsxmsLi¿RÁª«sVVƒ«sV LRiOTPQLi¿Á[ªy²R…W A ˳ÏÁgRiª«sLi»R½V®²…[. @ÉíÓÁ CaRP*LRiV¬sNTP ÒÁª«soÌÁª«sÌÁƒ«s NRPLRiø‡ÁLiµ³R…ª«sVV ÛÍÁ[µR…V. ÒÁª«so²R…V NRPLRiøxmnsÍ؃«sV˳ÏÁª«sª«sVVƒ«s\ZNP ª«sVLRiÌÁ ª«sVLRiÌÁ xmso²R…V»R½Vƒyõ²R…V. ÒÁª«so²R…V FyxmsOSQÎÏÁƒ«s ¿Á[xqsVN][NRP, úN]»R½òNRPLRiøÌÁƒ«sV ¿Á[zqs ª«sVLjiLi»R½ µj…gRiÇØLRiV»R½Vƒyõ®²…[ @ƒ«sõ NRPLRiVßá¿Á[»R½ CaRP*LRiV²R…V ÒÁª«so¬sNTP xqs»R½ö´y¬sõ ¿RÁWxmsoÈÁNRPW, Çì؃«sËÜ[µ³R…NRPW C ÍÜ[NRPLiÍÜ[ @ª«s»R½LjixqsWò ª«soLiÉزR…V. µ³R…LRiøLRiORPQßáNRPW, µR…VxtísQbPORPQßáNRPW GLRiö²T…ƒ«s®ªs[ @ª«s»yLRi„sZaP[xtsQª«sVVÌÁV. C @ª«s»yLRi zqsµôðyLi»R½ª«sVV NRPW²y z¤¦¦¦LiµR…W ª«sV»R½ª«sVVÍÜ[ ª«soƒ«sõ úxms¾»½[ùNRP»R½¹¸…[V.

అవతరణ అంటే దిగడం. భగవంతుడు ధర్మమునకు గ్లాని ఏర్పడినపుడు అవతరిస్తాడని గీత చెబుతుంది. సర్వమూ భగవంతుడే అన్న జ్ఞానం మనకు సులభంగా కలగదు. సర్వమూ భగవంతుడైనప్పటికీ, సృష్టిలో శ్రేష్టమైన వస్తువులన్నీ భగవద్విభూతులని గీత విభూతియోగంలో విస్తారంగా వివరిచింది. ఆయన సరస్సులలో సాగరము, స్థావరములలో హిమాలయము, మాసములలో మార్గశిరము. ఋతువులలో వసంతము. శ్రీమదూర్జితములైన విభూతులు ఎక్కడ ఏవేవి వున్నాయో, అవన్నీ భగవదంశ##లే. భగవదవతరణలే. అంతేకాదు ఆయన మనకు మార్గదర్శకంగా వుండటానికి, ఆచార్యపురుషులు, మహాత్ములు, జ్ఞానులు, యోగులు, పరమభాగవతుల రూపంలోనూ దర్శనమిస్తాడు.

శైవసిద్ధాంతాన్ని పాటించేవారు అవతార తత్త్వాన్ని ఒప్పుకోవడంలేదు. ఆదిశంకరులు శివావతారం, జ్ఞాన సంబంధులు కుమారస్వామి అవతారము, అని మనం చెప్పుకొంటాం. దానిని వారు ఒప్పుకోవటంలేదు. గర్భవాసం చేయటం, మానవలోకంలో పుట్టటం, తుచ్చం, అశుద్ధం అని వారి అభిప్రాయం. అట్టి తుచ్చస్థితిని ఈశ్వరునికి అనువర్తించటం వీరికెంత మాత్రం ఇష్టంలేదు. గర్భవాసంచేసి మాంస భూయిష్టమైన దేహంతో పుట్టిన మనిషి అద్వైతుల తత్త్వంలో బ్రహ్మవస్తువే. అందుచేత వారికి ఈశ్వరావతార విషయంలో ఏదీ నిషిద్ధం కనపడలేదు. ఇతర విషయములలో ఏకీభావం లేకపోయినా, అవతార విషయంలో మాత్రం ద్వైతులకూ, అద్వైతులకూ ఏకాభిప్రాయమే. అవతారాలంటే దశావతారములే అనీ, పరమ కరుణాళువైన మహావిష్ణువు మత్స్యకూర్మాది అవతారములు దాల్చినా, అతని శ్రేష్ఠతకు ఏ విధమైన లోపం లేదనీ, ఈ అవతారములకు కూడా లేదనే వారి అభిప్రాయం.

ఆరూప వస్తువునకు ఒక రూపకల్పన చేసి వివిధ దేవతారూపములతో ఈశ్వరుడు అవతరిస్తాడని, ఆ అవతారమూర్తులను విగ్రహ రూపములో అర్చామూర్తులుగా ఉపాసించటం, మన మతంలోని మరొక ప్రత్యేకత. ఈ కారణంగా అన్యమతస్థులు మనలను, Polytheists అని (నానాదేవతోపాసకులు) అంటారు. ఇది తప్పు. ఒకే మూర్తిని మనం పలు రూపములలో పూజిస్తున్నామేకాని, ఏకేశ్వరభావంలో మనకెవరికీ సందేహమన్నది లేదు. అంతేకాదు. మనలను విగ్రహారాధకులని కూడ వారంటారు. ఇదికూడ పూర్తిగా అబద్ధమూ. మనము చేసేది భగవదారాధనే విగ్రహారాధన కాదు.

భగవంతుడు సర్వవ్యాపి. మనకు ఏకాగ్రత అలవడుటకూ అర్చనా సౌలభ్యమునకూ విగ్రహాలేర్పడినవి. అన్ని మతాలవారూ, నేదో ఒక చిహ్నమును అవలంభించి ధ్యానించడం మనం చూస్తూనే వున్నాం. హిందువులు మాత్రం విగ్రహారాధకులు అని ఈసడించటం న్యాయంకాదు.

అంతేకాదు, ఇతర మతములు, భగవత్సాయుజ్యమునకు వారి మతములే దారియనీ, ఇతర మతస్థులకు ఆ సౌలభ్యం లేదనీ అభిప్రాయపడతవి. మన మతం అలాకాదు. ఎవరెవరు ఏఏ మతాలలో జన్మించారో, ఆయా మతాలనే అనుసరించి ఇష్ట ప్రాప్తి పొందగలరని మనమతం అంటుంది. భగవత్ప్రాప్తికి మతాలను మార్చనవసరంలేదన్న భావ వైశాల్యం కలది మన మతం. ఇది మనం గర్వపడతగిన విషయం.

మన మతంలో సామాజిక వ్యవస్థనుద్దేశించి వర్ణాశ్రమ ధర్మాలేర్పడినవి. దీనితో బాటు ఆశ్రమ ధర్మమని ఒకటియున్నది. ఒక్కొక్క వయఃప్రమాణంలో ఈ విధంగా వుండాలనేది ఆశ్రమ ధర్మం. శైశవంలో బ్రహ్మచర్యమనుసరించి గురుకుల వాసం చేసి విద్యాభ్యాసం చేయటం, ¸°వనదశలో పెళ్ళి చేసుకొని ప్రజావృద్ధిచేయటం, మూడవది వయసు ముదిరిన వనములకు వెళ్ళి వాసం చేయటం, నాలుగవది సర్వకర్మ సన్యాస పూర్వకమైన సన్యాసం - బ్రహ్మచర్య, గార్హస్త్య, వానస్రస్థ సన్యాసములనేవి నాలుగు ఆశ్రమధర్మాలు.

ఈ కాలంలో వర్ణాశ్రమ ధర్మం విపరీత విమర్శకు గురి అయినది. సాధారణంగా వర్ణం అంటే జాతి అనే భ్రమలో పడుతున్నారు. నిజానికి జాతి వేరు, వర్ణంవేరు. వర్ణములు నాలుగే. కానీ జాతులనేకాలు. ఒక్కొక్క వర్ణములోనూ ఎన్నో జాతులున్నవి. పక్షపాతం లేక వర్ణాశ్రమ వ్యవస్థను పరిశీలిస్తే, ఇది సామాజిక ఉపయోగమునకే నియుక్తమైనదని మనం గ్రహించగలము.

5. ధర్మ విభాగము

సామాజిక జీవనానికి మనం ఎన్నో కార్యాలు చేస్తాం. కొన్ని కార్యాలు బుద్ధితో చేసేవి. కొన్ని శారీరక కర్మలు. వానిలో ఎన్నో దినుసులు. ఇవన్నీ అందరూ సుభిక్షంగా వుండాలనే చేసేవి. ఈ కార్యాలలో ఒకటి గొప్ప, మరొకటి తక్కువ అనడానికి వీలులేదు. అట్లా అనుకోవడం తెలివితక్కువే.

ఆహారానికి బియ్యం అవసరం. ఉప్పుకావాలి. కట్టుకోడానికి వస్త్రములు, చదువుకోడానికి పుస్తకాలు. ఇంకా ఎన్నో ఎన్నో వుంటే కానీ జీవనం గడవదు. దాని కోసం మనము ఒక్కొక్కరం, సేద్యం చేయడమూ, ఉప్పు తయారు చేయటమూ, వస్త్రాలనేతా, పుస్తకాలముద్రణా పూనుకోగలమా? వీనిని ఉత్పత్తిచేసేవాడు, తనొక్కనికోసం ఉత్పత్తి చేయటంలేదు. అందరికోసమే. సమాజ ఉపయోగానికి కొందరు వ్యాపారం చేస్తారు. కొందరు యుద్ధం చేస్తారు. అందరి ఆత్మక్షేమం కోసం ధ్యానమూ, యాగమూ, యోగమూ, శాస్త్ర రక్షణా కొందరు చేస్తారు. పరస్పర ప్రయోజనాన్ని ఉద్దేశించి ఒక్కొక్కరూ అనేక వృత్తులనవలంభించి సౌజన్యంగా వుండాలనే ధర్మశాస్త్రములు నిర్దేశించినవి.

ఈ విభాగం ఎట్లాచేయటం? వారివారి యోగ్యత అనుసరించి అని అంటే, ప్రతి ఒక్కరూ తమకు యోగ్యత అధికంగా వున్నట్లే భావిస్తారు. వారివారి మనోభావాన్ని అనుసరించి వృత్తులు ఎన్నుకోండి అంటే, అందరూ వారివారి అంతస్తులకు మించిన ఉద్యోగాలపైనే ఆశపడతారు. అట్లా ఐతే మిగిలిన కార్యాలు ఎట్లా జరుగుతవి? యోగ్యత, మనోభావం బయటినుంచి ఎట్లా నిర్ణయించడం? అందరూ ఒకరితో ఒకరు పోటి చేస్తే ఎట్లా? ఈ విభాగాన్ని ఎవరు నిర్ణయించేది? ఎట్లా నిర్ణయించేది? అందుచేతనే వృత్తులను పరంపరగా వచ్చేటట్లు వర్ణ ధర్మమని ఏర్పరచారు.

ఏ వృత్తియైనా, పరంపరగా వచ్చిన దానిని పరమేశ్వరుడు విధించిన ఆజ్ఞగా స్వీకరించి 'లోకక్షేమానికోసం ఈ వృత్తిని నేను చేస్తున్నాను' అన్న మనోభావంతో చేస్తే, అదే అతనికి ఆత్మ లాభం కలిగించగలదు. ఒక్కొక్క కార్యం చేస్తున్న జీవుని ఆత్మ లాభార్ధం ఒక్కొక్క అనుష్ఠానం ఏర్పడియున్నది. శారీక శ్రమతో పనిచేసేవానికి ఉపవాసముండవలెనంటే వీలు ఔతుందా? బుద్ధితో పనిచేసే వారికి శరీరపోషణ అంత ఆవశ్యకము కాదు. శరీరాభిమానం పోవడానికే వారికి అనుష్ఠానాలు, స్నానములు వ్రతములు ఉపవాసములు విధించబడినవి.

వారువారు, తమకు నిర్ణయించిన ధర్మములను ఆచరిస్తూ వస్తే, ఇతరులకు మార్గదర్శకంగా వుంటూ, వారి ధర్మ రక్షణకు సహాయపడిన వారవుతారు. అట్లా చేస్తే శ్లాఘనీయంగా వుంటుంది. అట్లాకాక ఏ వృత్తి వలన అధిక ధనలాభం కలుగుతుందో ఆ వృత్తిని అవలంభిస్తామంటే అదిలోక క్షేమానికి అనుకూలంగా వుండదు. సంఘసంస్కరణ అన్న పేరుతో ధర్మవ్యవస్థకు భంగం కలిగించరాదు. వారి వారి కర్మలను సకృత్తుగా ఆచరించడమే భగవత్సేవ అనే మనోభావం కలగాలి.

6. వర్ణ ధర్మం

కొన్ని ఏళ్ళముందు వంటచేయడానికి పొయ్యి అంటించాలంటే చెత్తాచెదారం ప్రోగుచేసి అగ్గిపుల్లగీసి అగ్నిని రగిల్చేవారు. ఒక్క మిణుగురు వచ్చినా చాలు. దానిని ఊది ఊది ప్రజ్వలింపచేసేవారు. వానాకాలమైతే మరీ కష్టం. కట్టెలు తడిసిపోయి సులభంగా అంటుకోవు. మనమతం ప్రస్తుతం శిధిలావస్థలో వుంది. ప్రాచీన ఆచారాలను అనుష్ఠించే వారు చాల తక్కువ. అట్లా ప్రక్షీణమైన ధర్మాన్ని నేను ఊదిఊది ప్రజ్వలింపచేయాలని చూస్తున్నాను. ఇది పేరాశ అని నాకే తెలుసు. అయినా ఇవన్నీ మీకు చెబుతున్నాను.

మిగతా మతాలలో లేని ఈ వర్ణాశ్రమ ధర్మం మనకెందుకనా ఇప్పటి సంఘసంస్కర్తలు దీనికి విడాకులు ఇద్దామని చూస్తున్నారు. ఈ ఆశ్రమ ధర్మాలు అనావశ్యకములని వారు అభిప్రాయపడుతున్నారు.

సరే మతం అంటే ఏమి? ఆత్మకు వచ్చే వ్యాధికి చికిత్స చేయడమే మతం. ఒకనికి వ్యాధి వస్తుంది. ఆ వ్యాధికి ఫలాని మందు అని వైద్యునికి తెలుసు. లోకక్షేమమే ధ్యేయంగా కల పరమ త్యాగమూర్తులైన ఋషులు నిర్తేశించిన ఔషధమే మన సనాతన ధర్మం. వైద్య శాస్త్రములు ఎన్నో రకాలు. ఒక వైద్య విధానంలో పధ్యమే ప్రదానం. ఇంకొకటి అంత తీక్షణంగా కాక లఘువుగా వుంటుంది. ఒకటి చేదు మందు, మరొకటి, తీపి. వీనినంతా ఏకం చేయాలి అని పూనుకోక ఏ విధానం ఎట్లా చెప్పిందో, ఆ తీరులో ఔషధ సేవనం చేస్తే స్వాస్థ్యం లభిస్తుంది. అన్నిటినీ ఏకం చేయటం అవివేకం.

లోకక్షేమం కోసం, అన్ని మతాలూ, కొన్ని కొన్ని ధర్మాలను నిర్దేశించినవి. వానిని మనవైదిక మతము 'సామాన్య ధర్మము' అని వ్యవహరిస్తుంది. అహింస, సత్యం, అపరిగ్రహం, దైవభక్తి, తలితండ్రుల యందు విశ్వాసం, జీవకారుణ్యం, వీనిని మన మతం సామాన్య ధర్మములుగ పేర్కొన్నవి. ఇవికాక వర్ణమనుపేరిట, సమూహ పరంపర రీతిలో ఒక్కొక్క వృత్తి ననుసరించి వివిధములైన విశేష ధర్మములు వారివారికి విధింపబడినవి.

ఈ విశేష ధర్మములను సామాన్య ధర్మములుగా చేస్తే, వాటిని ఎవ్వరూ అనుష్ఠానం చేయని పరిస్థతి ఏర్పడుతుంది. ఉదాహరణకు బౌద్ధమతములో అహింసకు ప్రాధాన్యం కాని బౌద్ధమతము నవలంభించే దేశాలలో మాంసభక్షణ విరివిగా వున్నది. మన ధర్మశాస్త్రకర్తలకూ, ఋషులకూ, మానవ స్వభావం చక్కగా తెలుసు. అందుచేత మాంస నిషేధము కొందరికి మాత్రమే విధించారు. దీనిని చూచి, మాంసభక్షణ చేసే వారుకూడ కొన్ని ముఖ్య దినములలో - వ్రతానుష్ఠానం చేసేటపుడు, పైతృక కర్మదినములలో మాంస సేవనం చేయడంలేదు.

సామాన్య ధర్మములను ఆచరించే ఒక్కొక్క దేశంలోనూ వారి పురాతన మతములు నామరూపాలు లేకుండా అడుగంటి పోయినవి. పడమర గ్రీసులో వుండిన హెల్లెనిక్‌ మతము, మధ్య ఆసియాలో వుండిన హీబ్రు మతము కాలగర్భంలో కలసిపోయినవి. షింటో మతం మాత్రం మనకు అక్కడక్కడా కొంచెం కనపడుతున్నది. వీని స్థానములో వచ్చిన క్రైస్తవం, ఇస్లాం, బౌద్ధ మతములలో పొదువుగా ఒకే ధర్మమున్నది. గానీ, దానితో బాటు ప్రత్యేకవర్ణముల కొఱకు విశేషధర్మములనే విభాగము లేదు. ఈ మతములలోనూ ఈ కాలములో కొందరికి నమ్మకము లేకపోవుచున్నది. పోగా వారి సంఖ్య రోజురోజుకూ అధికమౌతూవున్నది. కొందరు పూర్తిగా నాస్తికులుగా వున్నారు. లేదా వారి మతంతో తృప్తిపడక, మనమతంలో చెప్పిన, యోగ, జ్ఞాన, భక్తి, మార్గాలను అనుసరించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ దేశాలలో ఇపుడున్న మతాలు ఎంతకాలం వుంటవో చెప్పలేము. నేను హిందూమత ప్రతినిధిని అన్న భావనతో నేనీమాట చెప్పటంలేదు. వారువారు వారివారి మతాన్ని అనుసరించి ఆత్మలాభం పొందాలనే నా ఆశ. నా మతంలోనికి వచ్చి మీరందరూ చేరండని నేను చెప్పలేదు. అట్లా చెప్పటం మనమత లక్ష్యానికే విరోధమని నా అభిప్రాయం. లోకంలో అకారణంగా అనగా acidental గా ఏదీ జరగడంలేదు.

ఒక్కొక్క జీవియొక్క పక్వత అనుసరించే ఈశ్వరుడు జీవులను ఒక్కొక్క దేశంలోనూ, మతంలోనూ, పుట్టేట్లు చేస్తున్నాడు. వారి వారి మతాలననుసరించి వారు ఆత్మక్షేమం పొందాలనే నా నమ్మిక. ఇతర మతములలో లేని విశేషములు మనమతంలో వున్నవని నేను చెప్పటం ఆ మతములను నిందించడం కోసంకాదు. ఇతర మతస్థులు ఈ విషయాన్ని అర్ధంచేసుకోక మన మతాన్ని నిందించడంవల్లా, వారు చెప్పేవి విని మన మతస్థులు కొందరు దురభిప్రాయపడుతున్నందువల్లా, వర్ణాశ్రమ విధానం వెనుక వున్న మంచిని తెలపడానికే ఇంత వివరంగా నేను చెప్పవలసి వస్తున్నది. అన్ని మతాలకూ సామాన్యమైన ఉత్కృష్ఠమైన అంశ##మేది? భగవంతుడు అనే వాడు ఒకడున్నాడన్న అస్తిక్య భావం, అతని భజనచేత మనం శాశ్వత సౌఖ్యం పొందగలమనునదే.

ఇతర దేశాలలో మతాభినివేశం క్షీణమౌతూ వస్తుందన్న విషయం నేను కల్పించి చెప్పడంలేదు. టోయన్సీ, పాల్‌ బ్రంటన్‌, కోష్లర్‌ మొదలగు ప్రముఖులు చెప్పిన విషయాన్నే నేను మీకు చెబుతున్నాను. లోకంలో రానురాను నాస్తిక్యమే అధికమౌతూ వుందని వారభిప్రాయపడుతున్నారు.

మనదేశంలోనూ నాస్తిక్యం ప్రబలమౌతూ వున్నది. కాని ఇతర దేశాలను చూస్తే మనదేశం ఎంతో నయం. మనలో చాలమందికి ఇప్పటికి మత విశ్వాసమున్నది. పాశ్చాత్యులూ ఈ విషయం ఏకగ్రీవంగా అంగీకరిస్తున్నారు. పాశ్చాత్యులలో చాలమంది సాధనకోసం, మనశ్శాంతికి, మనదేశానికి వస్తున్నారు.

మనదేశంలో ఈ నాస్తిక్యం ప్రబలమవటం కూడా, వర్ణాశ్రమధర్మాలు అన్యాయం, అవికూడదు అని సంఘ సంస్కర్తలమని చెప్పుకొంటూ ఆ పేరిట ప్రచారం చేయడానికి ప్రారంభించిన తర్వాతనే. మరొక చిత్రమేమిటంటే, సామాన్యధర్మములను పాటించే మతాలన్నీ దాదాపు అడుగంటినా, వర్ణాశ్రమవ్యవస్థకు తగిన విశేషధర్మాలను, అంగీకరించి అనుష్ఠించే హైందవము ఈ నాటికి సజీవంగా ఉండటమే. దీనిలో ఏదో ఒక విశిష్ఠత లేకుంటే, మిగతా మతములు జీర్ణించడమేమి, ఈ సనాతనమతం, ఇంకా ఉండటమేమి? నిష్పాక్షికంగా చూస్తే నూతన సంఘసంస్కర్తలకు దోషంగా కనబడుతున్న వర్ణాశ్రమ ధర్మ పరిపాలనయే, హిందూ మతానికి ఒక జీవగఱ్ఱగా వున్నదని తెలుసుకొంటాం.

7. భిన్నత్వంలో ఏకత్వం

విమానం రాకముందు ఆకాశ గమనానికి, గాలితో నింపిన సంచులు (Gas Bags, Balloons) వాడేవారు. వానిలో ఒక చిన్న చిల్లి పడితే, దానితో ఆ విమానం అలాగే క్రిందపడి అపాయానికి గురి అయ్యేది. ఈ కారణంగా ఒక సంచిపై ఆధారపడక ఎన్నో సంచులు వాడేవారు. ఒకటి చెడినా, మిగతా సంచులు ఆధారంగా వుండి విమానాన్ని ఆకాశంలో నిలబెట్టేవి. ఈలాగే మన మతంలో భిన్నభిన్న వర్ణములు మతానికి ఆధారంగా వుంటూ, పతనం లేకుండా రక్షిస్తున్నాయి. భిన్నత్వంలో ఏకత్వం అనడం ఇదే.

మరొక్క ఉదాహరణ. మనం వంటకు వంట చెఱకు వాడతాం. వంట చెఱకును ఒక మోపుగా కట్టాలంటే పదేసి కట్టెలను ఏరి ఒక చిన్న కట్టగా బలంగా కట్టి, అట్టి చిన్న చిన్న కట్టలను ఎనిమిదో పదో, మరల ఒక పెద్ద కట్టగా కడతాం. ఈ చిన్న కట్టలు, ఆ పెద్దకట్టకు ఆధారంగా వుంటాయి. అందులోంచి చితుకులు క్రింద పడవు. చిన్న కట్టలు కొంచెం సడలినా పెద్ద మోపుకు ఏ విధమైన భంగమూ వుండదు. మన మత వ్యవస్థ కూడా ఇంతే. భిన్నభిన్నమైన జాతులు, సంస్థలుగా వుంటూ, అన్నీ చేరి ఒకే మతంగా వ్యవహరించబడుతూ, పరస్పర సహాయక సాహచర్యములతో ఐకమత్యంతో, వారి వారి జాతుల ననుసరించి జీవిత సరణులను పాటిస్తూ ఒక్క మతం పేరిట చలామణి ఔతూ వున్నవి. భిన్నభిన్న వ్యక్తిత్వములతో భిన్నభిన్న జీవన విధానములతో వున్న పెద్ద జనసముదాయాన్ని ఒకే మూసలో పోయడమనేది. కుదరని పని. అట్లే భిన్న భిన్న వృత్తులవలంభిచే వారిని ప్రత్యేకమైన జాతులుగా ఏర్పరచి వారికి వర్ణవ్యవస్థలో ఒక నిర్దేశిత స్థానమును మన మతం ఇస్తున్నది. ఆ విధానంలో న్యూనాధికతలకు తావులేదు. అన్నీ జాతులూ సమాన గౌరవము కలవియే.

ఈ జాతిలో క్రమము తప్పిన వారిని జాతి భ్రష్టులుగా చేసేవారు. ఇదొక హెచ్చరికగా వుండి ప్రతి ఒక్కరూ తమ తమ జాతి ధర్మములను పాటిస్తూ పరస్పరము స్నేహముతో అభిమానముతో మెలిగేవారు. వారిలో మంచి జాత్యభిమానముండేది. పరస్పర వైషమ్యాలు చాల తక్కువ. అట్లా అభిప్రాయబేధములేర్పడినా, అరమరిక లేక, ఆ జాతులలోని పెద్దల న్యాయ సమ్మతమైన తీర్పులకు తలయొగ్గి, శాంతి ప్రదంగా ఆయా జాతులవారు సుఖజీవనం చేసేవారు. అందరిదీ ఏకమతమే అన్న భావన కలిగి వుండేవారు.

8. వర్ణ వ్యవప్థ మనదేశానికి మాత్రమెందుకు?

మిగతా దేశాలున్నవికదా? అక్కడ మనదేశంలో వున్నట్లు వేర్వేరు జాతులు లేవు. మరి మనదేశంలో మాత్రం ఈ జాతి విధానమెందులకు? అని అడగవచ్చును. కానీ ఆ దేశాలలోనూ, జ్ఞాన గ్రంధములు, శాస్త్రములు మొదలైన వానిని వ్యాపకం చేసేవారూ, రాజ్య భారమును వహించి యుద్ధంచేసేవారూ, వ్యాపారులు, వ్యవసాయదారులూ కర్మచారులూ, వుండనే వున్నారు. ఈ విషయంలో ఆ దేశాలకూ మన దేశానికీ సామ్యమున్ననూ, మనదేశంలో వలె ఆ దేశాల్లో నాగరికత పరాకాష్ఠనందుకొన్నట్లు మనకు కనబడటంలేదు. ఈ దేశంలో ప్రతి శతాబ్థంలోనూ ఎందరో జ్ఞానులు, భక్తులు, పరోపకార పారీణులు, మహాత్ములు, సాధుపురుషులు ఉజ్వల తపోనిధులు, అవిచ్ఛిన్నంగా, అసంఖ్యాకంగా వుండినట్లు పరదేశస్థులే పరమ శ్లాఘ్య వచనములు పలుకుతున్నారు.

కావ్యాలు, సంగీతము, జ్యోతిషము, గణితము, వైద్యశాస్త్రము, మొదలైన కళలలో మనదేశానికున్నంత ప్రఖ్యాతి వేరే ఏ దేశములలోనూ లేదు. అంతేకాదు మనదేశంలో ఎన్నో భాషలున్నవి. ఒక్కొక్క భాషలోనూ భక్తి సాహిత్యము, దివ్యప్రబంధములు విస్తారంగా వెలసియున్నవి. ఈ దేశంలోని శిల్పశాస్త్రము, ఆలయ నిర్మాణము మొదలైన కళలు విదేశీయులను ఆశ్చర్య చకితులనుగా చేసినవి. వీనిని గూర్చి తెలుసుకోవడానికి వారందరూ తండోపతండములుగా వస్తున్నారు. పాశ్చాత్యులు మనదేశానికి వచ్చి మనల నందరిని విభాగం చేసి మనలోని దోషములను చాటినా, మనగ్రంధాలను చూచి ఆశ్చర్యపడి వానిని తమతమ దేశభాషలలో తర్జుమాచేసి విశేష వ్యాపకానికి కారకులైనారనుటలో ఏ విధమైన సందేహమూ లేదు.

ఇట్టి విశేష ప్రఖ్యాతికి కారణం మన వర్ణ వ్యవస్థయే. దేశంలో సామాజిక వ్యవస్థలో శాంతి భద్రతలుండియుంటేనే, ఇట్టి నాగరికత, కళావిన్యాసం, శాస్త్ర ప్రాచుర్యత, వీలయివుంటుంది. ఇతర దేశాలలో కలిగినట్లు విప్లవాలు మనదేశంలో లేవు. ఇప్పటి సంఘ సంస్కర్తలు భావించిన రీతి, వర్ణవ్యవస్థలలో న్యూనాధికతలు నిజంగా వుండి వుంటే మనదేశం కూడా ఇతర దేశాలవలె విప్లవాలకు గురి అయి వుండేది. ప్రజలకు నిజంగా భావస్వాతంత్ర్యం, సామాజిక స్వాతంత్ర్యం వుండినందువల్లనే, మనదేశంలో ఇట్టి మహోన్నతమైన, ప్రశంసనీయమైన నాగరికత ప్రబలంగా వ్యాపించింది.

ఈనాడు మనదేశం ఏ పరిస్థతిలో వుంది? ఎక్కడచూచినా, ఆందోళనలు, సమ్మెలు, జాతి మత కలహాలు, కర్ఫ్యూలు, పోట్లాటలు, హత్యలు, దొంగతనాలు, వ్యభిచారము, దౌర్జన్యము. మన రాజకీయ సామాజిక, నైతిక వ్యవస్థలలోని పతనాన్ని చెప్పతరంకాదు. దీనికంతా కారణమేమి? ప్రజలలో ఒక నియతి లేనందువలన, అసూయ, స్పర్ధలు వృద్ధి అయి, ఆత్మబలం క్షీణమయినందువలన అనే చెప్పాలి. ఇది వఱకు వర్ణవ్యవస్ధ సమాజ స్థిరతకు కారణంగా వుండేది. దానిలో శైధిల్యం ఏర్పడేసరికి, మనదేశంలోనూ, ఇతర దేశాలవలె సమస్యలు బయలుదేరినవి. వేలకొలది సంవత్సరములుగా పరమశ్రేయః ప్రదంగా వున్న వ్యవస్థ క్షీణించిన కారణంచేత ఇట్టి అగచాట్లు ఏర్పడినవని మనం గుర్తించవలసి వస్తుంది.

9. అధమ పక్ష పరిహారము

ఇప్పటి సామాజిక వ్యవస్థ మారుతుందో మారదో, దానిని మార్చడానికి వీలు ఔతుందో లేదో, వేదరక్షణయే జీవనముగా పెట్టుకొన్న ఒక వర్ణం ఎప్పటికి ఈ వేదరక్షణ చేయవలసినది ఒక అనివార్యకార్యమని మనం ఎన్నడూ మరువరాదు. ఈ వేదరక్షణ లోకక్షేమాన్ని ఉద్దేశించి చేయవలసిన కర్తవ్యం. వేద శబ్దములు అవిచ్ఛిన్నంగా వుండటానికొఱకై ఏర్పడిన జాతి వైదిక నిరతులుగా వుండటమే ప్రస్తుత మేర్పడిన సమస్యలకన్నిటికీ పరిహారం.

ఈ కాలంలో బహుశా పూర్తికాలము వేదాధ్యయనము చేయటం వీలుకాక పోవచ్చును జీవనోపాయం కోసం ఏవో పనులు చేయవలసి వుంటే అధమపక్షం రోజుకు ఒక గంట సేపయినా, తామూ, తమ సంతతీ వేదాధ్యయనమునకై వినియోగించాలి. ఇట్లా ఒక పది సంవత్సరముల కాలము పరస్పర సహకారంతో వేదాధ్యయనం చేస్తే, క్రమంగా మంత్ర భాగము కంఠస్థము కావడమేకాక, ఉపాకర్మ మొదలైన వైదిక కర్మలు పురోహితుని అవసరం లేకుండా తమకు తమే చేసుకోగల సుళువు ఏర్పడుతుంది. ఈ కాలపు తీరు చూస్తే, వైదిక కర్మలు చేసి పెట్టడానికి పురోహితులు అనే ఒక వర్గం భావికాలంలో వుంటారా అని సందేహం వన్తున్నది. అందుచేత పైన చెప్పిన విధానంలో వేదాధ్యయనమూ, వేదరక్షణా చేయడం భగవదాదేశిత కర్తవ్యంగా మనం భావించాలి.

ఈ కర్తవ్య పాలన ఇప్పటి తరం వారిని ఉద్దేశించే కాక, భావికాలంలో వచ్చే మానవాళి సదుపాయం కోసమని కూడా అని మనం గ్రహించవలె. వైదికవృత్తి ఆర్ధికంగా అంత లాభదాయకంగా వుండనందువలన బ్రాహ్మణజాతి వేదాధ్యయనమునకు స్వప్తి చెప్పి ఇతర వృత్తుల వెంట బడ్డారు. ఇది స్వార్ధపరత వల్లనే. ధనం మూలంగా అనుభవించే సుఖసౌఖ్యములు మనకు నిరంతర సౌఖ్యమిస్తున్నవా? ఆర్ధికంగా పరమావధిని చూచిన విదేశీయులూ మనశ్శాంతి లేక, మన దేశానికి వచ్చి, వేదాంతపఠనమూ, ఆత్మవిచారమూ చేయడము మనము చూన్తున్న విషయమే. లౌకిక విషయములనుభవించి, విసిగి మనస్సులో అశాంతి ఏర్పడేసరికి, మనమూ వీరివలెనే నిత్యసుఖదాయకమైన ఆధ్యాత్మిక మార్గమునకు తిరిగి రావలసినదే.

10. వేదరక్షణ ఆయుఃపర్యంతమెందుకు?

ప్రపంచములో ఉన్నదంతా జీవునిలోనూ వున్నది. బ్రహ్మాండములో వున్నదంతా పిండాండములో ఉన్నది. స్వరనిర్దుష్టములయిన మంత్రనాదము, జీవసముదాయములో నాడీ చలనము కలిగించి లోకక్షేమాన్ని ప్రసాదించగలదు. జీవునికి ఇంద్రియములున్నది. తద్వారా వెలుపలి శీతోష్ణములను, శబ్ద రూపరసగంధములను జీవుడు అనుభవిస్తున్నాడు. ఒకే వస్తువే అండముగనూ, పిండముగనూ భాసిస్తున్నది. యోగులకిది ప్రత్యక్షావగతము.

ఆకాశమునందు మనచెవులకు వినరాని శబ్థములెన్నో వున్నవి. రేడియో యంత్రము, విద్యుత్తరంగముల నుండి శబ్థతరంగములను సృష్టించునట్లు, యోగి ఆకాశము నుండి ఇతరులకు వినరాని శబ్థతరంగములు గ్రహింపగలడు. యోగశక్తిచేత అతడు తన నాడీ చలనము ద్వారా మహదాకాశము నుండి విశ్వశ్రేయకములైన శబ్థసంతతిని గ్రహించి, మంత్రములను దర్శిస్తున్నాడు. మనము అల్ప మనస్కులము. మన యుక్తియు తదనుసారిగనే యున్నది. ఇట్టి అల్పమైన యుక్తి, మనస్సుల చేత వేద రహస్యములను మనమెట్లు ఎరుగగలము? అందుచేత పెద్దలు చెప్పనదానిని మనము శ్రద్ధాభక్తులతో గ్రహించాలి. సత్యాన్వేషణయే మన ధ్యేయమైతే యోగశాస్త్ర విధులను మనము తు.చ. తప్పక పాటించవలెను. ఇట్లు మంత్రదర్శనము చేసినవారే మన ఋషులు. 'ఋషయో మంత్రదష్టారః'. వేదములు భగవన్నిశ్వసితములని మన నమ్మకము. వేద మంత్రములకు విశేషార్ధము లుండటమేకాక, అవి ఆయా శబ్థములకు నిర్థేశింపబడిన దేవతారూపములుగానూ వుండి, ఆయా దేవతా సాక్షాత్కరమునూ, అనుగ్రహమునూ మనకు కలుగచేయుచున్నవి.

వేదశబ్థములు తాముగ ఫలములను ఇచ్చుట లేదు. ఫలదాత ఈశ్వరుడే. ఒక దేశములో రాజు తన భృత్యులద్వారా ప్రజాపాలన చేసే విధముగా, ఈశ్వరుడు వివిధ దేవతారూపముల మూలమున అభ్యర్ధులకు ఫలప్రదానము చేయును. దేవతా శబ్ధ రూపములే మంత్రములు. శబ్థరూపములైన మంత్రములను శ్రద్ధా భక్తులతో అనుష్ఠించుట వలన మంత్ర సిద్ధి కలుగును. మంత్రసిద్ధిచేత సావయవ దేవతా దర్శనము సాధకునికి ప్రాప్తిస్తున్నది. అట్టి దేవతా శరీరములకు మంత్రములచే అగ్నిలో అర్పించిన ఆహుతులు ఆహారముగా పరిణమించుచున్నవి. అట్టి యజ్ఞములు విశేష ఫలదాయకములగుచున్నవి.

కొన్ని మంత్రములకు అర్థము ప్రాధాన్యంకాదు. వానికి శబ్థమే ప్రధానము. తేళ్ళ కాటుకు కొన్ని మంత్రములున్నవి. ఆ మంత్రములకు అర్థముండదు. కాని ఆ మంత్ర శబ్థమునకొక చైతన్యమున్నది. మంత్రశబ్దముచేత ఏర్పడిన స్పందనద్వారా బాధితునికి నివారణ కలుగుచున్నది. ఆయా మంత్రక్షరములకే యొకశక్తి వున్నది. ఒక్కొక్క శబ్దమునకు హాని కలిగించును. ఆ మంత్ర శబ్దములకు హాని చేయు గుణమూ, శక్తి కలవు. ఈ మంత్రములకు అక్షర శుద్ధమూ, స్వర శుద్ధమూ అత్యావశ్యకము. వానిని నిర్దుష్టముగా ఉచ్ఛరించిననే అవి ఫలవంతములగును.

ఇహ పర సుఖదాయకములైన మంత్రములే వేద మంత్రములు. మన దృష్టికి కనబడనిది, మన చెవులకు వినబడనిది, ఋషులు చూడగలరు, వినగలరు. వారికి దివ్యశక్తి యోగనిష్ఠచేత కలిగినది. అట్టి యోగులు, ఋషులు మూలకముగా మనకు వేదములు ప్రాప్తించినది. ఈ మంత్ర సాధన పరమ విశ్వాసంతో చేయాలి. కొన్ని కొన్ని సాధనలలో కొన్ని కొన్ని విధులున్నవి. సాధన విద్యుక్తముగా చేయకపోయినచో మంత్రసిద్ధి కలుగదు. వరుణ జపమున్నది. వరుణ జపముచే వర్షములు కురుస్తాయి. దీనిని మనం అనుభవంలో చూస్తున్నాం. ఒకప్పుడు వరుణ జపంచేసికూడా వర్షాలు అభావమైనవి. విచారించి చూడగా, జాపకులు అలవణ విధిని పాటించలేదని తెలిపింది. (జపకాలంలో ఉప్పును వదలి పెట్టడం) కనుక వైదికకర్మలు చేసేటప్పుడు అవి విధివిధానంగా, శాస్త్రసమ్మతంగా జరుగుతున్నవా అన్న విషయంలో ఏమరపాటు కలుగరాదు.

జంబుకేశ్వరంలో ఒక స్థల వృక్షముండేది. అది శిధిలమైంది. దానిని పునరుజ్జీవింప చేయవలెనని ఏకాదశ రుద్రాభిషేకాలు చేయించారు. దీనితో ఆ చెట్టు మరల స్వాస్థ్యం పొందినది. మంత్రమహిమ అంటే అట్టిది. మంత్రశక్తి సుసంపన్నం కావాలంటే, మంత్రస్వరం సరిగా వుండాలి. మంత్రములు పఠించడంలో స్వరిత, ఉదాత్త అనుదాత్తములు సక్రమంగా వుంటేనే మంత్ర శబ్దములు శక్తివంతములై నిర్దిష్ట ఫలానులబ్ధిని కలిగించగలవు.

వేదరక్షణకై నిర్దేశింపబడిన బ్రాహ్మణులు, పటాటోపములేక బ్రాహ్మణ్యమును పాటిస్తున్నంత వఱకు, ఇతరులు వీని వలన సమూహమునకు ప్రయోజనమున్నదని భావిస్తూ వచ్చారు. ప్రేమ, విశ్వాసము, మర్యాద బ్రాహ్మణులకు చూపుతూ వచ్చారు. వ్యాధి దుర్భిక్షమూ లేక దేశము క్షేమంగా వుండేది. దానికి కారణము వేదశబ్దమూ, యజ్ఞ యాగాది కర్మలూ అని ఇతరులు నమ్మి ప్రవర్తిస్తూ వుండెడివారు.

బ్రాహ్మణులవలన ఈ విధంగా సమూహ ప్రయోజనము కలిగేది. అంతేకాక వారి నిర్దుష్ట ఆచార వ్యవహారములు, నిరాడంబరత, శీలనైర్మల్యము, శాంతము, త్యాగము ఇతరులకు మార్గదర్శకంగా వుండేవి. బ్రాహ్మణుల అపరిగ్రహము, కర్మానుష్ఠానము, సకలజీవరాశియందు మైత్రి, అనవరత భగవత్స్మరణ, ఇతరుల ఆత్మగుణ లాభమునకు ఎంతో తోడ్పడేవి. వారును, తమ తమ వర్ణ విధులను పాటిస్తూ వీలైనంతవఱకు, అనేక నియమములనూ, వ్రతోపవాసములనూ ఆచరిస్తూ వచ్చారు. బ్రాహ్మణులు ఇతర జాతులు పురోగమనానికి అడ్డు వచ్చారనడం సరికాదు. ఇతరులు కూడ తమ వలెనే వారి వారి ధర్మములను అనుసరించి పురోగమించవలెననే బ్రాహ్మణులు భావించారు.

వేదరక్షణ ఒక జాతికి విధించిన ఆయుఃపర్యంతమైన ధర్మము. వానికి కఠిన నియమ పాలన అవసరము. ఇతర జాతులకు వేదాధ్యయనమొక్కటే నిషేధింపబడినది. కాని, వైదిక ధర్మములను పాటించుటయందు గాని, తత్వజ్ఞానమును తెలుసుకొనుటయందుగాని ఏవిధమైన విరోధమున్నూ లేదు. ఆత్మాభివృద్ధికి వలసినది ఇదొకటే. అట్లు బ్రాహ్మణులు ఇతర జాతుల జ్ఞానాభివృద్ధికి నిరోధకంగా ప్రవర్తించివుంటే, మనదేశంలో కొల్లలు కొల్లలుగా భక్తులు, జ్ఞానులు, బ్రాహ్మణతరులలో వచ్చి యుండుటకు అవకాశ##మే ఉండియుండదు.

అందుచేత ఏ జాతికి వేదరక్షణ విధించియున్నదో వారు వేదాధ్యయనము చేస్తూ వైదిక కర్మ నిష్ఠులుగా ఉండవలసినది అత్యవసరమని సూచిస్తున్నాను. దీని వలన సకల జనక్షేమమూ సిద్ధిస్తుంది. పరస్పర సాహాయకంగా వుంటూ ఆయా వర్ణముల వారు శాస్త్రములు నిర్దేశించిన కర్మలను చేస్తూ వచ్చినారంటే, స్వకీయ ప్రయోజనమునూ, సామాజిక ప్రయోజనమునూ రెంటినీ సాధించగలరు. అందుచే వేదరక్షణకై ప్రతి యొక్కరూ తమతమ శక్త్యానుసారం పాటుపడితే ధనధాన్య సమృద్ధితో సర్వలూ లాభ##క్షేమములను పొందగలరనుటలో ఏ విధమైన సందేహమూ లేదు.

11. నేటి నాగరికతకు చికిత్స

ఈ రోజుల్లో ప్రజానీకం రెండు పక్షాలమధ్య చిక్కుకొని తపిస్తున్నారు. ఒక ప్రక్క శాస్త్ర పక్షం వహించి మనజీవితం శాస్త్ర సమ్మతంగా వుండాలనేవారు. శాస్త్రాలనే మార్చి సంఘ సంస్కరణ చేయాలనేవారు రెండవ పక్షం. ఈ కాలపు చదువులవల్ల అందరికీ సంఘ సంస్కారమంటే ఒక మోజు ఏర్పడివుంది. చదువులిట్లా వున్నా, చాలమంది అనూచానంగా వస్తున్న ఆచారాలను ఇంచుమించు పాటిస్తూ వస్తున్నారనే చెప్పాలి. మనం ఇంకా పూర్తిగా శాస్త్ర వాసనలు వదులుకోలేదు. ఆ వాసనలు సమూహాల్లోనూ, మన అనుదిన చర్యలలోనూ కనబడుతూనే వున్నాయి. ఈ పురాతన ఆచారాలు ఒక వంక, ఈ కాలపు నాగరికత ఒక వంక మనుష్యులను లాగుతున్నాయి. ఈ కాలపు నాగరికత పరిపూర్ణంగా సమ్మతంగా వుందా అంటే అదీ లేదు. ఏదో ఒక అసంతృప్తి మానవాళిని వెంటాడుతూనే వుంది. పూర్వకాలంలో అనుభవించిన సుఖశాంతులు ఈ కాలంలో లేవని అందరూ ఏకగ్రీవంగా అంటున్నారు.

ఈ కాలంలో ధనం జాస్తిగానే చెలామణి ఔతున్నా దానితోబాటు దారిద్ర్యమూ పెనవేసుకొనే వున్నది. అంతా సుభిక్షంగా వున్నది. అవసరానికి మించి ధాన్యమూ పండుతున్నది. అని చెప్పుకొంటున్నా, ఎక్కడ చూచినా దిగులు మాత్రం పోవటం లేదు. ముందుండిన పూరి గుడిసెలు ఇపుడు భవనాలయినవి. ఏవో ఆ కాలంలో వుండిన ఆస్తిపాస్తులు. ఇపుడు ఎన్నో వస్తువులున్నా కానీ జీవితం సాగటంలేదు. ఇవన్నీ నాగరికత తెచ్చి పెట్టిన సంపదయే. కాని ఆనాటి శాంతి మాత్రం ఎక్కడా కనబడటంలేదు.

పాత ఆచారాల త్రోవలో సుఖంగా వుందామన్న కోరిక వుంది. కానీ నాగరికతను, సంఘ సంస్కారాన్నీ వదలుకోడానికి చాలినంత మనోదైర్యం లేదు. ఏ వంకపోదామా అని సంశయంలో నట్టాడు మనుష్యుల జీవనవిధానం 'రెంటికీ చెడ్డ రేవడ' లాగైనది.

ఒక ఉదాహరణ. అందరి ఇండ్లలోనూ దాదాపు మహాత్మాగాంధీ ఫొటో వున్నది. నా ఫొటో కూడ వున్నది. గాంధీగారు చెప్పారని, విధవా వివాహం చేసుకొనేటందుకు కావలసిన తెగింపు వారికి రావటంలేదు. నేను చెప్పిన విధంగా పోనీ 'శిఖ' పెట్టుకొన్నారా అంటే అదీ లేదు! పాపం, జనులు ఇటు పోదామా అటు పోదామా అన్న పెద్ద సంశయంలో పడ్డారు. ఒక నిశ్చయం వుండాలి. శాస్త్ర విధానాలలో విశ్వాసం, పట్టుదల ఉండాలి. అన్నిటికీ మించి ధైర్యమూ కావాలి.

శాస్త్ర విషయాలలో పట్టింపు కొంచెము కొంచెము సడలుతూ వచ్చిందంటే కడపడ, లౌకికసౌకర్యములను మాత్రం వదలిపెట్టలేని స్థితి వచ్చి తీరుతుంది, ''ధర్మశాస్త్రాలను ఋషులు ఏర్పరచారు. ఈ కాలంలో తమరు ఋషితుల్యులుగా వున్నారు. కాలానుసారము, శాస్త్రములను మీరు మార్చుకోండి'' అని కొందరు సదుద్దేశంతోనే నా వద్దకు వచ్చి చెప్పటం కద్దు. పొలంలో కలుపుతీసినట్లు, కొంత సంఘ సంస్కరణకు ఆస్కారముందని వీరందరూ భావిస్తున్నారు. ఇపుడు నేను వీరి మాట విని, కొన్ని ఆచారాలను కలుపుమొక్కఅని పీకి పారవేస్తే, కొంతకాలానికి ఏవి కలుపుమొక్కలు, ఏవి పైరు, అని తెలియని వ్యవస్థ ఏర్పడి మూలనాశనానికి దారితీయగలదు.

ఋషులు ఏర్పరచిన విధానము, వారి అభిప్రాయానుసారం కాదు. ఏ కాలానికీ మార్పులేని ఈశ్వరాజ్ఞ ననుసరించేవారు వేదవిధులను ఏర్పరచారు. అందుచేతనే మనం వీనిని అనుసరిస్తున్నాం. వానిని రక్షణచేయడమే నా బాధ్యతకాని వానిని మార్చుటకు నాకే విధమైన అధికారమూ లేదు. శాస్త్రప్రకారము ఈ కాలములో నడుచుకోవడం సాధ్యంకాదని మనం అనుకోరాదు. వ్యాపార వేగంలో వర్ధిల్లిన ఈ కాలపు నాగరికతను వదలిపెట్టి, మన అవసరాలను తగ్గించుకొంటే, మనం మూలమూలలకు ధనార్జన కోసం పరుగిడవలసిన అవసరముండదు.

ధనార్జన అనే అశాంతి తొలిగిపోతే భగవత్స్మరణకు కావలసినంత అవకాశముంటుంది. జీవితంలో నెమ్మదీ, తృప్తీ, సౌఖ్యమూ తాముగ వస్తాయి.

కర్మానుష్ఠానాలకు పెద్దగా ద్రవ్యావసరంలేదు. పూజలు ఆడంబరముగా చేయవలసిన అవసరమూ లేదు. నాలుగు తులసీదళాలు, నాలుగు బిల్వపత్రములుంటే చాలు. పూజ విధి విధానంగా జరిగిపోతుంది. మనకోసం వండుకొన్న అన్నమే నైవేద్యానికి చాలు. వివాహమూ శాస్త్రానుష్ఠానమేకదా? దానికి ఎంత విరివిగా ఖర్చు చేయాల్సి వస్తున్నదని అడగవచ్చును. కానీ ఇప్పుడు వివాహాలలో చేసే ఆడంబరాలు శాస్త్రాలు చెప్పినవి కావు. అన్నిటికీ మించిన ఖర్చు - వరదక్షిణ - ఏ శాస్త్రంలోనూ చెప్పబడలేదు. వరదక్షిణ అడగటం అశాస్త్రీయమే. శాస్త్రానుష్ఠానాలకు ద్రవ్యం అవసరమై వుంటే, శాస్త్రం ఒక్క ధనికులే అనుసరించగలరు. మన శాస్త్రకర్తల ఉద్దేశం అదికాదు. శాస్త్రానుష్ఠానాలు బీదవారు, ధనికులు అనికాక, సర్వలకు క్షేమం కలగాలనే నిర్దేశింపబడినవి.

ధర్మార్ధకామమోక్షములనేవి చతుర్విధ పురుషార్ధములు. ఈ పురుషార్ధములలో మనం కామ పురుషార్ధానికే ప్రాముఖ్యత ఇస్తున్నాం. దీనిని మనం మార్చుకొని తగినంతకాలము ధర్మ పురుషార్ధానికై వెచ్చించాలి. సామాన్య జీవనమునకు మనం అలవాటు పడితే పదార్ధ లాభంకోసం పరుగులిడనవసరంలేదు. అపుడు ధర్మాచరణ వలన కలిగే అనంత సౌఖ్యానికి మనమందరమూ భాగస్వాములగుటకు వీలౌతుంది.

ఒక విధంగా చూస్తే మన మతానికి ఇట్టి శోచనీయ స్థితి కలుగడానికి పాశ్చాత్యులు ఈ దేశంలో ప్రవేశ పెట్టిన విద్యావిధానమే కారణం అనాలి. ఇతర దేశాలలో వారి వారి విద్యా విధానానికి, వారి వారి మతాలకూ భేదాభిప్రాయాలు లేవు. మనదేశంలో అట్లుకాక, విద్యావిధానాలలో మత ప్రసక్తే లేకపోయినది. జీవనోపాయంకోసం పాశ్చాత్యులు ప్రారంభించిన విద్యా విధానమే మన ప్రజలు పాటించవలసి వచ్చింది. ఆ కారణంగా శైశవావస్థలోనే విద్యార్ధులకు తమ తమ మతాచారముల పరిజ్ఞానం కలిగే అవకాశం లేకపోయింది. శాస్త్రముల ఉద్దేశ##మేమిటో తెలియకపోవటం చేత సంఘాన్ని సంస్కరించాలన్న ఉబలాటం ఎక్కువై శాస్త్ర విధానాలను వారి వారి చిత్తానుసారం మార్చడానికి ప్రయత్నంచసాగారు.

మన ఆచారాలు, మూఢనమ్మకాలను వర్ధిల్లచేసేటట్టుగా వున్నాయన్న అభిప్రాయం బాల్యంలోనే వారికి ఏర్పడసాగింది. అస్తిక్యం లోపించింది. ఇట్టి సందర్భంలో వీరికి మన మతానుష్ఠానాలపై శ్రద్ధా గౌరవం ఎట్లా కలిగించేది? అందుచేత పెద్దలయిన వారు వారి సంతతికి చిన్నతనంలోనే అస్తిక్యం కలిగేటట్లూ, మనశాస్త్రాలలో విశ్వాసం ఉదయించేటట్లూ చేయడానికి పూనుకోవాలి. అతీంద్రియ విజ్ఞాన సంపన్నులైన మన ఋషులు, ప్రత్యక్షానుభవ పూర్వకంగా ప్రసాదించిన గ్రంధములు మన ఆత్మక్షేమార్ధం కోసం ఉద్దేశించినవన్న జ్ఞానం మనం మన పిల్లలకు కలుగజేయాలి. ఈ గ్రంధాలు ఇహలోక సౌఖ్యమూ, సామాజిక ప్రయోజనమూ, కలుగజేయగలవన్న విశ్వాసం వారిలో కలిగించాలి. అప్పుడే ప్రజలలో మత విశ్వాసం ప్రబలి సనాతన మతాన్నీ సదాచారాలనూ అనుష్ఠించగల అవకాశం ఏర్పడగలదు.

12. మూలమతం వేదమే

మన మతంలో రెండు ముఖమైన విభాగములున్నవి. ఒకటి శైవం, రెండవది వైష్ణవం. వీనిని రెండు మతములని చెప్పడమా లేక ఒకే మతమని వ్యవహరించడమా అని ఒక సందేహం వస్తుంది.

క్రైస్తవంలోనూ, క్యాథలిక్కులనీ, ప్రొటెస్టెంటులనీ రెండు విభాగాలున్నవి. అయినప్పటికి వారు ఒకే క్రైస్తవ మతమని చెప్పుకొంటారు. దీనికి కారణమేమి? ఇరు మతాలవారికి పూజనీయుడైన కర్త ఒక్కడే. ఆయన జీసస్‌ క్రైస్టు. బౌద్ధంలో హీనయానమనీ మహాయానమనీ రెండు భాగములున్నవి. ఆ రెంటికి బుద్ధుడే నాయకుడు. ఇట్లు శైవులకూ, వైష్ణవులకు ఒకే స్వామి ఉన్నాడా అంటే లేదు. సాధారణ వైష్ణవులు ఏ విధంగా వున్నా సరే, వారి ఆచార్య పురుషులు మాత్రం శివాలయాలవైపు వెళ్ళరు. వారికి విష్ణువే స్వామి. శివుడు వారికి స్వామికాడు. విష్ణుభక్తులకు శివుడు కూడ ఒక భక్తుడే, స్వామి కాడని అభిప్రాయం.

తీవ్రమైన శైవులకు విష్ణువు స్వామి కాడు. శివుడే స్వామి. విష్ణువు శివభక్తుడు మాత్రమే. ఇట్లున్నవారిని ఒకే మతస్థులని ఎట్లా చెప్పగలం?

అది పోనీ. వీరిరువురికీ ఉమ్మడిగా ఏదైన మతగ్రంధమున్నదా అని చూద్దాం. క్రైస్తవులలో భేదమున్నప్పటికీ వారి మత గ్రంధము బైబిల్‌. మహమ్మదీయులో షియా సున్నీల భేదమున్ననూ వారి మత గ్రంధము కొరాను. ఇట్లే ఈ శైవ వైష్ణవులకు ఉమ్మడిగా మత గ్రంధమేదైనా ఉన్నదా? శైవులు, తేనారము మొదలైన గ్రంధములను ప్రబంధములుగా పెట్టుకొన్నారు. వైష్ణవులు నాలాయిర దివ్యప్రబంధమును తమకు ఆధార గ్రంధముగా పేర్కొంటున్నారు. వీరికి పుస్తకములూ వేరై పోయినవి. స్వామియూ ఒక్కడు కాకపోయెను, ఇట్లున్నపుడు వీరిని ఒకే మతమునకు సంబంధించిన వారని చెప్పటం ఎట్లా పొసగుతుంది?

మనం శైవులము వైష్ణవులము అని చెప్పుకొన్నా, ఇంగ్లీషువారి పుణ్యమా అని, ఈ ఇరు శాఖల వారినీ, హిందువులనే వ్యవహరిస్తున్నారు. పాశ్చాత్యులు మనకు ఏ నామకరణమూ చేయకుండా వుండి వుంటే, మనలో వైష్ణవులు, శైవులు, శాక్తేయులు, సుబ్రహ్మణ్యభక్తులు, గాణాపత్యులు, అయ్యప్పభక్తులు, ఎల్లమ్మ ఉపాసకులు, అని వివిధ శాఖలుగా విభాగమై పోయి వుండేవాళ్ళం. తెల్లవాని పుణ్యమా అని హిందూస్థానము, పాకిస్థాన్‌ అని రెండుగ దేశం విభాగం అయినది. కానీ తెల్లదొరల ఉపకారం వలన శైవ వైష్ణవాది విభిన్న శాఖలున్నప్పటికీ హిందూమతమని ఒకే మతంగా నిలబడ్డాం. ఆ విషయంలో పాశ్చాత్యులకు మనం ఒక విధంగా కృతజ్ఞత చూపవలసినదే.

వైష్ణవుల నాలాయిర ప్రబంధములకు పూర్వమూ, వైష్ణవులున్నారు. శైవుల తేవార గ్రంధములకు పూర్వమూ శైవులున్నారు. ఈ ఇరుశాఖలూ తమతమ గ్రంధములను మూలగ్రంధములుగా పేర్కొనలేదు. మొదట వీరికి ఉన్న గ్రంధము వేదమే. ఈ ఇరుశాఖలూ వేదప్రమాణాన్ని, వేద ప్రశస్తినీ గుర్తించి వారి గ్రంధములలో వైదిక గుణగానం చేశారు. స్వామి వర్ణనలతోబాటు వేద ప్రశంస కూడా వారి కీర్తనలలో విస్తారంగా ఉన్నది.

వేదములు ఒకే తత్త్వమును వివిధ మూర్తులుగా వర్ణించియున్నది. శాక్తము, గాణాపత్యము, కౌమారము, సారము మొదలైన శాఖలన్నిటికి, ఆధారము వేదమే. అందుచేత హైందవములో వివిధ శాఖలున్నప్పటికి, అన్నిటికి మూలాధారమైనది వేదములే. శైవవైష్ణవస్మార్తసంప్రదాయక ఆచార్యపురుషులందరూ వేదాంతర్గతములైన దశోపనిషత్తులకు భాష్యములనను గ్రహించియున్నారు. ఉపనిషత్తులలో ప్రతిపాద్యమైన స్వామి బ్రహ్మయే. ఆ బ్రహ్మము కఠోపనిషత్తులో విష్ణువనీ, మాండూకోపనిషత్తులో శివుడనీ వ్యవహరించబడినది. వేద సంహితంలో పేర్కొన్న మిత్రుడు వరుణుడు, అగ్ని, ఇంద్రుడు ఇత్యాది దైవములు పరబ్రహ్మమనే సత్యవస్తువు యొక్క పలునామములని ఆ వేదములే చెప్పినవి. 'ఏకం సత్‌ విప్రా బహుధావదంతి' అందుచేత బహు శాఖాన్వితమైన మన మతం వేద మతమనీ, అన్నిటికీ మించిన దైవము పరబ్రహ్మమనీ విశదమౌతుంది.

ఇహపరములకు వేదములే గతి. అన్ని సంప్రదాయములకును, సిద్ధాంతములకునూ మూలము ఆ వేదమాతయే. ఇన్ని శాఖలూ ఆ వేదవృక్షంలోనుంచి వచ్చినవి. అన్నిటికి మూలమైన ఈ వేదరాశిని మనం అనవరతమూ రక్షించుకొందుముగాక.

13. వేదముల మూల స్వరూపము

మనదేశంలో ఎన్నో భాషలున్నవి. ఒక్కొక్కరూ తమ భాషయే శ్రేష్ఠమైనది అని గర్వపడుతుంటారు. అంతేకాదు, భాషా విషయంలో వివాదాలకు వెనుదీయరు. ఈ భాషా వైషమ్యాన్ని చూస్తుంటే మనమంతా మూగలమైపోయినా ఫరవాలేదని ఒక్కొక్కపుడు తోస్తుంది. మన అభిప్రాయాలను ఇతరులకు తెలపడమే భాషాప్రయోజనం. అన్ని ప్రదేశాలలోనూ ఒకే భాష ఉండటమనేది సాధ్యంకాదు. ఒక్కొక్కచోట ఒక్కొక్క విధమైన భాష వుంటుంది. ఈ భాషలలో ఒకటిగొప్ప, రెండవది తక్కువ అని గర్వపడటమో, లజ్జించటమో తెలివి తక్కువదనం. ఒక భాష నాకు తెలుసు, మరొకటి తెలియదు అని చెప్పవచ్చునే గానీ భాషలలో హెచ్చు తక్కువలు చూడటం సభ్యతకాదు.

వేద భాషసంస్కృతమైనందున సంస్కృతభాషారక్షణ మనకు అత్యావశ్యకము. వేదములు సంస్కృతములో ఉన్ననేమి? భాషాంతరీకరణ చేయవచ్చునే అని కొందరు చెప్పవచ్చును. భాషాంతరీకరణలో ఒక చిక్కు వున్నది. ఒక్కొక్కపుడు మూలంలోని అర్ధం భాషాంతరీకరణలో లుప్తమైపోతుంది. ఒక భాషలో ఒక విషయాన్ని చెప్పవలసినపుడు కొన్ని సుందరమైన సౌందర్యయుక్తములైన పదములు భాషాంతరములో లేకపోవచ్చును. ఒక్కొక్కపుడు నాలుగు మాటలతో చెప్పిన విషయాన్ని అనేక పదముల మూలంగా భాషాంతరములో చెప్పవలసివస్తుంది. ఇది శాఖా చంక్రమణమే. అట్టి సందర్భములలో మూలంలోని విషయ గాంభీర్యం, సౌందర్యం, భాషాంతరంలో సంతరించడానికి వీలుకాకపోతుంది.

రెండవది, అనువాదకుడు అనువాదం చేసేటపుడు తన జ్ఞానానికి, అభిప్రాయానికి తగినట్లే అనువాద చేయగలడు గానీ దానికి మించి చేయలేడు. మూలగ్రంధకర్త యొక్క మేధాసంపత్తి అనువాదకునికి వుంటేగానీ అనువాదం రాణించదు. ఇట్లు అనేక అనువాదాలు వున్నపుడు ఏది మనకు గ్రాహ్యము అన్న ప్రశ్న ఉదయిస్తే, శబ్ద సౌష్ఠవంలోనూ అర్ధ గాంభీర్యంలోనూ మూలతుల్యమైన అనువాదమే గ్రాహ్యమని చెప్పవలసి వస్తుంది. అందుచేత వేదమూలమును ఏ విధంగానూ మార్పుచేయక, ఆయా ఆచార్యులు తమ సిద్ధాంతానికి అనుగుణంగా వివరణలు వ్రాశారు. కాని తమ సిద్ధాంతానుసారము వేదానుశాసనములలోని ఏ విధమైన మార్పును వారు చేయలేదు. అందుచేత వివిధ శాఖలకు సంబంధించిన ఆచార్యులు వ్రాసిన సిద్ధాంతములన్నీ వేదమతానుసారములైనందున అవి యన్నియూ వైదిక మతములేయని భావింపబడుచున్నవి.

Sanathana Dharmamu    Chapters    Last Page