Sanathana Dharmamu    Chapters    Last Page

II. అద్వైతము

1. మనం స్వాములమా? లేదంటే?

భగవత్పాదులవారు జీవుడూ, బ్రహ్మమూ ఒక్కటే అని ఘోషించారు. 'జీవోబ్రహ్మైవనాపరః' అనగా స్వామి అంటే వేరే ఎవరోకాదు. మనమే అని అర్థం. నేనే స్వామిని అని హిరణ్యకశిపుడూ చెప్పాడు. అందుచేత మహావిష్ణువు నరసింహావతారమెత్తి వానిని హతమార్చవలసి వచ్చింది. అట్లైతే భగవత్పాదులు చెప్పినదీ, హిరణ్యకశిపుడు చెప్పినదీ ఒకటేనా?

'స్వామినినేనే' అని హిరణ్యకశిపుడు చెప్పటం తన్ను తప్పించి వేరేస్వామి లేడని అహంకారంతో కూడిన వాగాడంబరం. భగవత్పాదులవారు చెప్పిన మాటకు అర్థం - ''స్వామిని తప్పించివేరే వస్తువు ఏదీ లేనందున మనమూ స్వాములమే'' అని. జీవుడు తన అహంకారమును సమూలంగా విడిచిపెడితే, బ్రహ్మంలో కలసి బ్రహ్మమై పోతాడని వారంటారు. మనం ఉద్ధరిణ నీళ్ళవలె అల్పశక్తితో ఉన్నాం. స్వామియో తన అఖండశక్తితో పెద్ద సముద్రంవలె, మహార్ణవం వలె ఉన్నాడు. ఈ ఉద్ధరిణ నీళ్ళు కూడా ఆ సముద్రంలోంచే వచ్చాయి. నేను అనే అహంకారాన్ని వదిలిపెడితే ఆ నిస్తరంగ మహూదధిలో మనం కలసిపోతాం.

మనం స్వామి కాకపోతే పరమాత్మకంటే భిన్నమైన వస్తువు ఒకటి వుండగలదని అర్ధం. పరమాత్మ ''ఏకంసత్‌'' అనికాక, ఎన్నో వస్తువులలో ఒక్కడై అతని సంబంధం లేకుండా అనేక వస్తువులున్నట్లు అర్థం ఏర్పడుతుంది. అట్లైతే ఆయనను స్వామి అనీ పరమాత్మ అనీ ఎట్లాచెప్పగలం? సర్వమూ తానైనవాడే కదా పరమాత్మ? అంతా ఆయనే ఐతే మనకు ప్రత్యేకమైన ఉనికి ఉండగలదా?

అందుచేత అద్వైతుల వాదం వలన స్వామి మహిమకు కొఱత ఏర్పడటం లేదు. ''జీవుడు స్వామికాదు. జీవుడు అల్పుడు. భగవంతుడు గరిష్ఠుడు. జీవుడు వేరు. భగవంతుడు వేరు'' అని అణకువతో చెప్పేవారి వాదం వారికి తెలియకుండానే, స్వామి ఉన్నతిని తగ్గిస్తున్నది. స్వామియే సకలము అని అంటే ఆ సకలంలోని మనమూ స్వాములమేకదా!

స్వామి సముద్రంవలె వున్నాడని అంటే, నదీజలమూ, కూపోదకము, పాత్రలోని నీరయూ, ఉద్ధరిణిలోని నీళ్ళు - తమ తమ శక్తి కొలది అల్ప పరిమాణం వహించినట్లు, భగవంతుడే నానావిధ జీవ జంతు స్వరూపములలో విలసిల్లుతున్నాడు. మనుష్యుడు పాపపుణ్యములను అనుభవించి కర్మక్షయము కాగానే, తానే అయ్యేటట్లు ఒక మార్గాన్ని భగవంతుడు చూపుతున్నాడు. మనస్సు వల్ల పాప పుణ్యాచరణ, తత్కర్మానుభవం ఏర్పడుతున్నది.

మనస్సు ఉన్నంతవరకు పాపపుణ్యములకు అతీతమైన స్థితీ, భగవదైక్యమూ సాధ్యము కాదు. దానికై మనం భగవంతుని ప్రార్ధించాలి. మనం జీవులం, అతడు పరమాత్మ. మనం ఉద్ధరిణిలోని నీళ్ళు, ఆయన పెద్ద సముద్రం. ఆరంభంలో ఈ భావంతోనే భగవంతుని వద్ద భక్తిని నెరపాలి.

మనకు ఈ భేదభావాన్ని కల్పించేది ఏది? స్వామి ఇచ్చిన మనస్సే. అమాంతంగా మనస్సును 'నీవు వెళ్ళిపో' అని ఆజ్ఞాపిస్తే మన మాట వినక వెంటనే ఆజ్ఞోల్లంఘనం చేస్తుంది. భగవత్పాదులు 'చపలం మమ హృదయకపి విషయద్రుచిరం' అని అంటారు. ఈ మనస్సనే కోతికి గాఢమైన దేహాభిమానం వున్నది. స్వామి దేహాన్ని, శరీరాన్ని మనకెందుకిచ్చాడు? శరీరమనే కుళ్ళిపోయిన పండుతో మనస్సనేకోతి సతమతమౌతూ ఉంది. మంచిపండునొకటి కోతికి ఇస్తే కుళ్ళిన పండును పారవేస్తుంది. మధురమైన ఫలం ఏదంటే పరమాత్మయే. అందుచేత మనస్సుకు దేహాత్మ బుద్ధి తొలిగేటట్లు మనం చూడాలి. అభ్యాసవైరాగ్యములు దేహాత్మబుద్ధి నశించడానికే. మనఃపరిపాకం ఏర్పడితే దేహాత్మ బుద్ధి పోతుంది. జీవబ్రహ్మైక్యత సిద్ధిస్తుంది. అదే అద్వైతస్థితి. ఆ స్థితిలో జీవభావం అంతరించిపోతుందని ఆచార్యులవారు బోధించారు.

2. అద్వైతం

అద్వైతం అంటే ఏమిటి? ఈ పదంలో 'ద్వై' అనే సంయుక్తాక్షరమొకటియున్నది. 'ద్వి' అంటే రెండు. ద్వైతము అంటే, రెండున్నవి అని అర్ధము. అద్వైతం అంటే రెండవది లేనిది. 'స్వామి' ఒకడున్నాడు. అతనికి వేరుగా జీవుడొకడున్నాడని మనము భావిస్తున్నాం. ఈ రెండవది లేని స్వామి-బ్రహ్మం. ఆయనే సత్యవస్తువు. అతనిని తప్పించి వేరే ఏదీ లేదు. ఆ ఒక్క సత్యవస్తువే మాయాశక్తి చేత ఇన్ని జీవరాశులుగ కనబడుతున్నది. ఇదంతా వేషమే. ఒక నటుడున్నాడు. అతడు ఎన్నో పాత్రల వేషములు ధరిస్తున్నాడు. కానీ మనిషి ఏమో ఒక్కడే. ఎన్నోజీవరాశులున్నా అంతర్యామిగ వున్న సత్యవస్తువేమో ఒక్కటే. అదే స్వామి వ్యవహారంలో మనం జీవాత్మ పరమాత్మ అని చెప్పుకొన్నా, వాస్తవికంగా ఉన్న వస్తువు ఒక్కటంటే ఒక్కటే. అదే ఆత్మ. ఈ మాయా పరిధి అంతరిస్తే నిత్యశుద్ధబుద్ధ స్వరూపమే అయిపోతాం. సూక్ష్మంగా భగవత్పాదులు అందించిన అపూర్వ అద్వైతతత్వమిదే.

ఈ అనుభవం మనకు సిద్ధిస్తే, కామం క్రోధం, భయం, దుఃఖం, ఏవీ మనలను బాధించవు. మనలను తప్పించి వేరే వస్తువో, వ్యక్తియో ఉంటేనే ద్వంద్వముల ఒత్తిడికి పాలవుతాం. సంసారమంటే ఇదే కదా? రెండో వస్తువే లేనపుడు, బంధమేది, బంధితుడెక్కడ? ఇట్లా మనం పరిశీలించి చూచామంటే, ద్వైతరాహిత్యమే మోక్షమని తెలుసుకొంటాం.

ఈ మోక్షమనేది, ఏ కైలాసంలోనో, వైకుంఠంలోనో లభిస్తుందనే భ్రమలో మనం పడరాదు. ఈ మోక్షాన్ని ఇక్కడే, ఇప్పుడే మనం అనుభవించగలము. ఈ మోక్షం క్రొత్తగా ఆకాశంనుంచి ఊడిపడడం లేదు. సత్యము నిరవధికము. బంధరహితము. సత్యమే మోక్షము. సర్వగతమైన ఆకాశమును ఘటంలో చూచినపుడు ఘటాకాశమనీ, ఘటమునకు వెలుపల ఉన్నదానిని వహాకాశమనీ నట్లా వ్యవహరిస్తున్నామో, మాయాపరిమితుడైన జీవుణ్ణి త్యజిస్తే, ఉన్నదంతా అఖండ బ్రహ్మస్వరూపమే అని మనం అనుభవంతో తెలుసుకొంటాం. ఈ అనుభవస్థితికే కర్మ, ఉపాసన మొదలైనవి ఏర్పడినాయి. ఈ ఉపాసనలను అనుష్ఠించేటపుడు కూడ, 'అన్నీఒక్కటే' అన్న ఏకభావన మనం వదలరాదు. ఈభావన ప్రత్యక్షానుభవంలోనికి రావాలి.

జాగ్రత్‌ స్వప్న సుషుప్తులని మూడు అవస్థలున్నవి. మేలుకొని ఉండటం జాగ్రదవస్థ. కలలు కనడం స్వప్నావస్థ. ఏమీ తెలియని గాఢనిద్ర సుషుప్తి. ఈ మూడు అవస్థలలోనూ ఉన్న ఆసామి ఒకడే. జాగ్రత్స్వప్నావస్థల అనుభవములకు పరస్పరసంబంధములే లేవు. కాని ఈ రెండు అవస్థలలో వున్న మనిషేమో ఒక్కడే. ఇట్లు వేరువేరుగా కనబడే జీవరాశులలో ఉన్న వస్తువూ ఒక్కటే. ఆ సత్యస్వరూపమే మనము.

మనం ఒకప్పుడు శాంతంగా ఉంటాము. మరొకప్పుడు కోపం వస్తుంది. కోపం తెచ్చుకొన్నదీ, శాంతంగా వున్నదీ ఒక్కడే. మనకు కరచరణాద్యంగములున్నవి. వీనిలో పరిణామం - శైశవ ¸°వన వార్థక్య దశలను చూస్తున్నాం. దేహం పరిణామం చెందుతున్నా దేహి ఏమో ఒక్కడే. ఇట్లు ఒకే వస్తువు జాగ్రత్స్వప్నసుషుప్త్యావస్థలలోనూ, బాల్యకౌమార¸°వనవార్ధక్యదశలలోను, వివిధానుభవములకూ, వివిధ పరిణామములకూ పాత్రమగుట మన ఎరుక లోనిదే.

3. దీర్ఘ స్వప్నమిదం జగత్‌

úxmsxmsLi¿RÁª«sVW INRP xqs*xmsõ®ªs[V. Hz¤¦¦¦NRP ÒÁ„s»R½Li ª«sW¸R…WÇÁ*LRiLi NRPÖÁöLiÀÁƒ«s xqs¬sõFy»R½LiÍØLiÉÓÁµj…. C „sxtsQ¸R…VLi ª«sVƒ«sLi úgRiz¤¦¦¦Li¿yª«sVLiÛÉÁ[ ªyxqsò„sNRPLigS @Li»y INRPäÛÉÁ[ @ƒ«sõ Çì؃«s®ªs[VLRiö²R…V»R½VLiµj…. xqs*Fyõª«sxqósÍÜ[ ª«sVƒ«sLi Fs¬sõ ª«sxqsVòª«soÌÁƒ«sW, FsLiµR…LRiV ª«sùNRPVòÌÁƒ«sW @ƒy¸R…WxqsLigS xqsXztísQxqsVòƒyõLi? ఈసృష్టించేదంతా మనమనస్సే కదా? అట్లే ఈ ప్రపంచమంతా సృష్టికర్త యొక్క మనోద్భవమైన ఒక స్వప్నమే. ఇది కాదంటే బ్రహ్మకంటే వేరైన వస్తువు ఒకటి ఉన్నదని మనం ఒప్పుకోవాల్సివస్తుంది. అట్లైతే ఈ ప్రపంచం ఎక్కడనుంచి వచ్చింది. ఎవరు చేశారు? దీని నిర్మాణసామగ్రి ఆ కర్త ఎక్కడ నుంచి తెచ్చాడు? ఆ కర్త ఎవరు? అన్న ప్రశ్నల పరంపర బయలుదేరుతుంది.

ఇప్పుడు మనం చైతన్యమున్న జీవులనూ, ఎఱుకలేని జడప్రపంచమూ మనలను సృష్టించలేదు. జడ వస్తువునకు కార్యశక్తి లేదు. అంతేకాక అచైతన్యమైన జడము చైతన్యయుక్తుడైన జీవుని ఎట్లా సృష్టిస్తుంది.

ఎఱుకలేని ఈ జడప్రపంచం అనాదినుంచి క్రమంగా వస్తున్నది. దానిని ఒక పెద్ద ఎఱుకయే సృష్టించి వుండాలి. ఆపెద్ద ఎఱుక, వేరే ఏదో ఒక వస్తువును గ్రహించి ఈ జడ ప్రపంచమును సృష్టించిందని చెప్పుకోవడానికి వీలులేదు. ఎందుకంటే, మరల ఆ వస్తువును సృష్టించినదెవరు? అన్న ప్రశ్న వస్తుంది. ఆ పెద్ద ఎఱుకయే ఇట్లు తన్ను తాను జడ ప్రపంచముగా చూపుకొనుచున్నదని మనం అనుకోవాలి.

జీవులున్నారు. ఆ జీవులు తమ్ముతామే సృష్టించుకొన్నారా? ఒక్కొక్క జీవుని గుణగణములు, స్వభావము, శరీరములోని అవయవముల పొందిక, వేర్వేరు విధములుగానున్నవి. వీరందరూ తమ్ముతాముసృష్టించుకొన్నారనుట పొసగదు. అందుచేత ఈ జీవసముదాయమునూ, ఒక పెద్ద ఎఱుకయే సృష్టించినదని ఏర్పడుతున్నది. ఈ జీవుని ఎఱుకయే ఆ సృష్టికర్తనుండియే వచ్చినదని గ్రహించవలసి వున్నది.

జీవుని ఉనికికి వలసిన ఛాయతోయములు ఆహారవస్త్రములు జడప్రపంచము సమకూరుస్తున్నది. విషయ భోగమునకు జీవునికి ఇంద్రియ వర్గ మేర్పడినది. వీనినంతా ఆ పెద్ద ఎఱుక, సృష్టికర్తయే కల్పించినాడు. జడప్రపంచమునూ, చైతన్యముగల జీవులనూ, సృష్టించినది ఒక్కవస్తువే. ఆ ఒక్కవస్తువే అనేకమైనది. ఏకాన్ని అనేకం చేసే శక్తినే మాయ అని అంటారు. బ్రహ్మయే మాయాశబలితమూ అనేకమైనదన్న తత్వమే అద్వైతం.

ఇక్కడ నానాత్వమేమీలేదు. ఉన్నది ఒక్కటే అన్న ధృడ ప్రజ్ఞ ఎవనికి అనుభవమౌతున్నదో అతడే అద్వైతి. కరచరణాద్యంగములు, మనమే అన్న భావం మనకెట్లా వున్నదో, అట్లే ఈ ప్రపంచమంతా మనమే అన్నభావమే అద్వైతం. ఈ అద్వైతభావం ఎవనికున్నదో, వాడేపండితుడు, జ్ఞాని. ఈ విషయాన్నే భగవత్పాదులు మనీషాపంచకంలో ఘంటా పధంగా 'చండాలోస్తుసతుద్విజోస్తుగురు రిత్యేషా మనీషామమ'- అట్టి అద్వైతి చండాలుడైనా సరే అతడే నాకు గురువు - అని చెప్పారు. ఇట్టి అద్వైతానుభవమే, మోక్షానందం. అది సశరీరంగా వున్నపుడే సాధ్యమయ్యే ఆనందస్థితి.

4. అదే ఇది

INRP ª«sú²R…Ligji AÌÁ¸R…VLi N][xqsLi c INRP Gƒ«sVgRiVƒ«sV ¿ÁNRPVä»R½Vƒyõ²R…V. ¿RÁW²R…ÉجsNTP @¿RÁèLi Gƒ«sVgRiVÍØlgi[ Dƒ«sõµj…. µy¬s¬s ¿RÁWÀÁƒ«s INRP @ª«sWøLiVV, ""ƒy¸R…Vƒy! µR…gæRiLRiNRPV F¡NRPV A Gƒ«sVgRiV ¬s®ƒs[õQQ\®ªsVƒy ¿Á[}qsò NRPxtísQLi'' @¬s @ƒ«sõµj…. @ª«sWøLiVV»][ »R½Liú²T… ""Bµj… NRPúLRi Gƒ«sVgRiV, µk…¬sNTP ÒÁª«sLiÛÍÁ[µR…V. Bµj… ª«sVƒ«sÌÁƒ«sV G„dsV ¿Á[¸R…VµR…V'' @ƒyõ²R…V.

ఏనుగును చూచినపుడు కర్రలేదు. కర్రగా బొమ్మను చూచినపుడు ఏనుగు మాయమైంది. ఆ అమ్మాయికి అది ఏనుగుగానే కనబడింది. తెలిసిన తండ్రికి ఏనుగుగా కాక కొయ్యగా కనపడింది. తిరుమూలర్‌ అనే గొప్ప యోగీశ్వరుడు ఈ విషయాన్ని తిరుమంత్రమన్న గ్రంధంలో ఇలా వ్రాశాడు.

మదించిన ఏనుగు మానును (చెట్టును) మరిగింపచేసింది.

మదించిన ఏనుగు (పిదప) మానులో మరిగిపోయింది.

పృధివ్యాది భూతములు పరతత్వాన్ని మరగింపచేసినవి.

పృధివ్యాది భూతములు పరతత్త్వంలో మరిగిపోయినవి''.

జీవులకు ప్రపంచం పాంచభౌతికంగా కనపడినా; జ్ఞానికి అంతా పరబ్రహ్మ స్వరూపంగా అవగతమవుతుంది.

ఐతే మీరు ఈ కధ అంతా ఎందుకు? అని అడగవచ్చు. మనకు కావలసినది లోకంలో సుఖజీవనానికి కావలసిన వసతులు. దానికి కావలసినది ధనం. పరతత్వమూ, పాంచ భౌతికములూ వాని గొడవ మనకెందులకు? అని.

అదిసరే. మనమందరూ అమాంతగా ఐశ్వర్యవంతులమై పోయామని అనుకొందాం. ఆ ఐశ్వర్యంతో మనం శాంతంగానూ నిర్భయంగా నెమ్మదిగానూ ఉండగలమా? ఈ ధనమూ దౌలతూ అందులకు ఉపయోగపడగలదా? ధనిక వర్గానికి చెందిన దేశాలలో ఎంతో అశాంతి. అందరూ ధనవంతులైనా ఒకరికి మించి ఒకరు ఉండాలనే, ఆశ, అసూయా, స్పర్ధా కల్గుతాయి. ఉన్నదానితో తృప్తి పడే గుణం మానవులకు లేదు. అందరికంటే ఉచ్ఛస్థితిలో వుండాలని, మనిషికి ఎప్పుడూ ఒక తీరని ఆకాంక్ష. అందరికంటే ముందు అన్నీ తనకే సమకూరవలెనని అతని తాపం.

ఒక ఉదాహరణ. ఈ మఠంలోనికి వచ్చే వాళ్ళకందరికీ తెలుసు. నేను అందరికీ తీర్థమిచ్చిగానీ లోనికి వెళ్ళనని. కాని ఒకరిపైన ఒకరుపడి తీర్థంకోసం ఒకటే దెబ్బ లాట. కొంచెం ఓపికగా, నెమ్మదిగా నిలుచుని ఒకరివెంట ఒకరు వచ్చి తీర్థం తీసుకోవచ్చుకదా? అట్లా ఎందుకు చేయరు? అందరూ మనమే అన్న అద్వైత జ్ఞానమే ఉంటే ఇలా చేస్తారా? ఒకరితో ఒకరు పోటీలు పడుతున్నంతవఱకు మనిషికి మనశ్శాంతి దొరకటం కష్టం.

మనలో మనకు ఉన్న స్పర్థ పోవాలంటే మనమంతా ఒక్కటే అన్న జ్ఞానం కలగాలి. అపుడే శాంతి. ఆ శాంతికొఱకు అనవరతమూ ప్రతి ఒక్కరు ఆత్మవిచారం చేయాలి. ఈ ప్రపంచాన్ని శివమయంగా చూస్తూ, ఏకత్వం భజిస్తే కాని మనకు అద్వైతనిష్ఠ కలగదు. అద్వైతజ్ఞానం కలిగేంతవరకు, లోకంలోని చీకట్లు తొలగవు. ఈ అజ్ఞానధ్వాంతంలో నుంచి బయట పడవలెనంటే జ్ఞానాన్వేషణ మనం ఏ రోజు మరవరాదు. అట్టి అనవరతాన్వేషణ మనలను జ్ఞాన గమ్యులుగ చేయగలదు.

5. ఆస్తిక్యం అద్వైతసిద్ధికే

సక్రమంగా, యధావిధిగా నడుస్తున్న ఈ ప్రపంచానికి ఒక కర్త వుండి తీరాలని ఆస్తికుల నమ్మకం. అంతేకాదు మనం చేసే కర్మలకు ఫలాన్నియిచ్ఛే ఫలానా ఈశ్వరుడని వారి విశ్వాసం. ఈశ్వరుడు ఫలదాతయని ఒక వేళ ఒప్పుకున్నా అతనిని పూజించవలసిన అవసరమేమి? అని కొందరు ఆక్షేపించవచ్చును. మనలను అడిగి అతడు మనలను సృష్టించలేదు. సృష్టించినందున మనకు కష్టములు, కొఱతలు తప్ప వేరే ఏమిలేదు కదా? అతనిని మనమెందులకు ఆరాధించాలి అని కొందరు ప్రశ్నిస్తారు.

మన కొఱతలూ, కష్టములూ తీర్చగల శక్తి ఒక్క ఈశ్వరునికే ఉన్నది. అతని ఆరాధన చేత చిక్కులన్నీ తొలగి మనం సంతోషంగా జీవించవచ్చును. అందుకోసం ప్రతి ఒక్కరూ ఈశ్వరారాధన చేయటం అనివార్యమైన కర్తవ్యం అని అస్తికులంటారు. ఐతే ఈశ్వరుడు మన ప్రార్ధనలు విన్న పిదపనే మనలను అనుగ్రహిస్తాడంటే అతని కారుణ్యానికి ఒక లోపం కలగటం లేదా? అని కొందరు అడగవచ్చును. ఒక కార్యానికి తగిన ఫలం భగవంతుడే ఇస్తాడు అని అంటే మనం చేసిన పాప కర్మకు తగిన దండన ఆయన విధిస్తే దానిని మార్చమని ఆయనను ప్రార్థించటం సముచితమా?

దీనికి సమాధానం శ్రీ నీలకంఠ దీక్షితులు వ్రాసిన ఆనంద సాగర స్తపమందున్నది. అందొక్క శ్లోకమున దీక్షితులు ఇలా వ్రాస్తారు,

''అవేద్యతా మవిధితం కిమథాప్యనుక్తం

వక్తవ్యమాంతర రుజోవశమాయనాలమ్‌

ఇత్యర్థసే కిమపిత చ్ఛ్రవణ నిధాతుం.

మాతః ప్రసీద మలయధ్వజ పాండ్యకన్యే''-

''నీకు తెలియనిది నేను చెప్పబోవుచున్నానా ఏమి? ఐతే చెప్పవలసిన సంగతి చెప్పకపోయినచో నా ఆంతర్యములో వున్న బాధ శమింపదు. అందుచేతనే నేను చెప్పేదానిని కొంత సావధానంగావిను. ఓ మీనాక్షి! నా ఎడల ప్రసన్నత వహించు''.

మనకు కష్టములు ఏవైనా వుంటే, మనయందు సానుభూతిగల సహృదయులకు చెప్పుకొంటే మనస్సుకు కొంత ఉపశమనంగా వుంటుంది. భగవంతుడు సర్వభూతములకు సహృదయులకు చెప్పుకుంటే మనస్సుకు కొంత ఉపశమనంగా వుంటుంది. భగవంతుడు సర్వభూతములకు సుహృదుడు. భగవంతుడు కర్మ ఫలదాత కనుక మన కర్మ పరిపాకమునకు తగిన దండన విధించిననూ సరే, లేదా అనుగ్రహించి మనకు సౌఖ్యము కలగ చేసినా సరే. భగవంతుని ప్రాపు జొచ్చి అతని ముందు మోఱపెట్టుకోవటమే మంచిది. అట్టి శరణాగతియే మనకు శాంతిదాయకము.

ఐతే మనం కష్టనివృత్తీకీ, సంతోషప్రాప్తికి మాత్రం ఈశ్వరారాధన చేయాలని నేను చెప్పటం లేదు. 'నారు పోసిన వాడు నీరు పోయకపోడు' అన్న సామెత ఉండనే వున్నది. మనలను పుట్టించిన వాడు మనలను రక్షించకపోడు. అది వాని ధర్మం, విధీ. దాని కొఱకై మనం భగవంతుని యందు కృతాజ్ఞతా భావం చూపవలసిన అవసరం లేదు అని కొందరు ఆక్షేపించవచ్చును.

ఈ లోకంలో పుట్టిన ప్రతిజీవికి, కష్టసుఖములున్నవి. కష్టసుఖములనేవి ముఖ్యంగా మనస్సుకు సంబంధించినవి. ఈ మనస్సు విచలితంకాక ఉండటమే ఆనందం. తక్కిన సుఖాలు అన్నీ తాత్కాలికములే. శాశ్వతములు కావు. సుషుప్తిలో జడ వస్తువువలె ఉన్న మనకు, శాంతముగా వుంటిమా, ఆనందముగా వుంటిమా అన్న ఎఱుకయే లేదు. మనస్సులో ఏ విధమైన అశాంతి వీచికలూ ఉండరాదు. మనమువేరు, పరమాత్మవేరు అన్న భేద భావము పొడసూపరాదు. ఇట్టి అభేద స్థితి మనకు కలగాలంటే మనము అమనస్కులమైపోవాలి. అప్పడే మనకు అద్వైతసిద్ధి. మనస్సు దేనిని గూర్చి ధ్యానిస్తుంటే, మనస్సున్నూ తదాకారమైపోతుంది. మనస్సు సద్వస్తువును సదా ధ్యానిస్తూంటే, మనస్సున్నూ తదాకారమై, ఏకత్వంలోనికి వెళ్ళి శాంత్యానందస్థితిని సులభంగా సంతరించుకొంటుంది.

ఈ విశాల ప్రపంచాన్ని సృష్టించి, దీని పాలనలో భగవంతుడు నిమగ్నుడై యున్ననూ ఏ మనశ్చాంచల్యమూ లేక స్థాణువు వలె వున్నాడు. స్థాణువంటే ఎండిపోయిన వృక్షం. పైకి ఎండినట్లు కనిపించినా లోపల జీవం వున్నది. ఈ స్థాణువును 'అపర్ణ' అనబడే ఒక కోమల లత - (అపర్ణ అంటే ఆకులు లేనిదని ఒక అర్థం. అంబికకు అపర్ణ అని ఒక నామమున్నది.) పెనవేసుకొని వున్నది. ఈ సజీవమైన లత, నిర్జీవంగా వున్న స్థాణువును ఆలింగనం చేసుకొన్నట్లున్నది. ఈశ్వరుడే పరతత్త్వం, అంబికయే అనపాయిని ఐన ఆ ఈశ్వరుని శక్తి. ఆ పరతత్త్వ స్వరూపుడయిన ఈశ్వరుని మనం ధ్యానం చేసే కొద్దీ, మనకు జ్ఞానమూ, ప్రశాంతీ సిద్ధిస్తాయి. ఆ ఈశ్వర స్మరణకు భక్తి అత్యవసరం.

ఈశ్వర స్మరణ మనకు వృద్ధి అయ్యేకొద్దీ కష్టసుఖములపై అనవరతమూ లగ్నమయిన మనస్సు ఈశ్వరాయత్తమై, ''ఈశ్వరేచ్ఛ ప్రకారం అన్నీ జరుగుతాయి. ఆ ఈశ్వరేచ్ఛకు మనం విధేయులుగా వుందా''మన్న మనఃస్థైర్యం ఏర్పడుతుంది. ఒక అవ్యక్తమైన ఆనందమూ శాంతీ మనలను ఆవహించి ఉంటాయి. ప్రశాంత భూమికను అధిరోహించిన సాధకుని మనస్సు అమర్త్యస్థితిని సులభంగా అందుకొంటుంది. అప్పుడు సాధకుని కోరికలు ఏ విధంగానూ బాధించవు. అతని పూర్ణ స్థితిలో భగవన్మయతను భజిస్తాడు.

ఆత్మ విచారము, యోగము ఒక విధంగా మనఃస్థైర్యానికి ఉపయోగకరంగా వుంటాయి. దానివలన ఒక నిలకడ ఏర్పడుతుంది. ఈ సాధనలను సూచించకుండా మరి భక్తిని గూర్చి నేనెందుకు చెప్పుచున్నానని మీరు అడగవచ్చును. ఏ కార్యమూ, ఏ చింతా లేకుండా-భక్తి కూడా ఒక విధంగా మానసికచింతనమే - ఉండే స్థితియే మోక్షమని భగవత్పాదులంటారు. మరి మన భక్తి ప్రాశస్త్యమును గూర్చి ఎందుకు వివరిస్తున్నాను? 'మోక్షసాధన సామగ్ర్యాం భక్తి రేవ గరీయసి' - మోక్షసాధనకుపయోగకరములైన విషయములలో భక్తి ప్రధానమైనది అని వివేక చూడామణిలో వారు ఉద్ఘాటించారు. అంతేకాదు మరొక్క నూతన లక్షణాన్ని ఆయన చెప్పారు. అది 'స్వస్వరూపాను సంధానం భక్తి రిత్యభితీయతే' - ఆత్మనుసంధానమూ భక్తి అని వారు చెప్పే ఈ భక్తి, ధ్యానము, యోగమార్గములాంటి సాధనా పధకములను సూచించుచున్నదే కానీ, లోకరీతిలో మనం అనుకొనేటట్లు ఏదో ఒక స్వామి యున్నాడనీ, అతని యందు మనం చూపే ప్రేమయే భక్తియనీ చెప్పటం లేదు.

ఈ విధంగా భక్తిని నిర్వచించిన భగవత్పాదులే మఠములను స్థాపించి, చంద్రమౌళీశ్వరుని పూజలు చేయాలని ఆజ్ఞాపించి వున్నారు. నిర్గుణతత్వమును బోధించినవారే వివిధ ఉపాసనా విధులను ఏర్పరచి షణ్మత స్థాపకులన్న బిరుదు కూడ పొందారు. వివిధ దేవతా మూర్తులపై లెక్కలేనన్ని స్తోత్రములను వ్రాశారు. అందుచేత లోకరీతిలో మనం అవలంబించే భక్తి విధానాన్ని వారు అంగీకరించినట్లే అనుకోవాలి.

ఆధ్యాత్మిక మార్గంలో కొందరికి, ధ్యానవిచార యోగమార్గములు ప్రశస్తములనీ, క్షేత్రాటన, ఆలయదర్శనం, దైవకైంకర్యములు తక్కువ జాతికి చెందినవనీ అభిప్రాయం ఉండటం కద్దు. భక్తి, కర్మ మొదలైన మూఢనమ్మకములు, ఆత్మ విచారమే శ్రేష్టమైనదని వారంటారు.

అయితే ఆత్మస్వరూపంలోనే లీనమూ ఏ కార్యమూ, ఏ చింతా లేకుండా ఉండమని బోధించిన అద్వైతాచార్యులైన శంకరభగవత్పాదులవారే, మానసికంగా చేసే భక్తినీ, కార్యరూపంగా చేసే వైదిక కర్మలనూ అన్నిటినీ అంగీకరించారు. వారిట్లా ఎందుకు చేశారు? మనం ఈ ప్రపంచంలో చిక్కుకొని వున్నాం. మన మనస్సు ఒక్క క్షణమైనా విశ్రాంతి అనేది లేక పరుగిడుతూనే వున్నది. మనం ఎంత ప్రయత్నించినా ఆ మనస్సును అదుపులో ఉంచుకోలేకుండా వున్నాం. మన ఆలోచనలు విశృంఖలములుగానే వున్నవి. మనరాగద్వేషాలు, కోపతాపాలు సుఖదుఃఖాలు ఒకటివెంట ఒకటి మనలను వెన్నాడుతూనే వున్నాయి. ఈ కార్యం చేయాలి, రేపు మరొక పని పూర్తి చేయాలి అని ప్రణాళికలు వేస్తూనే వున్నాం. మనస్సుకేమో నెమ్మది లేదు.

దీనికి కారణమేమిటి? మన పూర్వకర్మ అనే చెప్పాలి. పూర్వజన్మలలో చేసుకొన్న పాపాలన్నీ క్షీణిస్తే కాని ఆత్మానుభవం అనే పూర్ణానందస్థితిని మనమందుకోలేము. ఈ జన్మలో విస్తారమైన పుణ్యం సంపాదిస్తే కాని ఈ పాపాలు క్షీణం కావు. పూర్వజన్మలో చేసుకొన్న పాపాలను పోగొట్టుకొనుటకే ఈశ్వరుడు మనకు ఈ జన్మ నిచ్చినాడు. కాని మనం ఏం చేస్తున్నాం? చేసుకొన్న పాపాలు పోగొట్టుకోడానికి బదులు ఈ జన్మలో క్రొత్తక్రొత్త పాపాలు చేసి మనపాపకర్మను మరింత వృద్ధి చేసుకొంటున్నాం. భగవత్పాదుల వారు పాపక్షయం కోసమే, భక్తిని, కర్మానుష్ఠానాలనూ, జ్ఞానమునకు ఉపాంగములుగా ఏర్పరచి వున్నారు.

పాపములు రెండు రకములు. ఒకటి శారీరకము, రెండవది మానసికము. పాపకర్మ పోగొట్టుకొనుటకు పుణ్యకర్మ చేయాలి. పాపాలోచనలు పోగొట్టుకొనుటకు పుణ్య చింతనను వృద్థి చేయాలి.

వేద విహితములైన కర్మలే పుణ్యకర్మలు. వారి వారికి విధించిన కర్మలను తప్పులేకుండా నిర్వర్తిస్తే పుణ్యకర్మలౌతాయి. వారివారి వృత్తులననుసరించి ఆచార అనుష్టానాదులేర్పడినవి.

మనం చేసే కర్మ పాపకర్మగా ఎట్లా పరిణమిస్తుంది? ఎప్పుడైతే మనం ఒక కర్మను స్వార్థం కోసం, మంచి చెడులను చూడక, ఇతరులకు మనం చేసే పని వలన హింస కలుగుతున్నదా అన్న విచారం లేక, అభినివేశంతో మన లక్ష్యమే మనకు ముఖ్యం అని చేస్తున్నామో, అప్పుడు ఆ కర్మ పాపకర్మగా పరిణమిస్తుది. అట్లుగాక వేదవిహితములైన కర్మలను, స్వార్ధరహితంగా ఆచరించునపుడు, అందులో ద్వేషానికీ ఈర్ష్యకు, స్పర్ధకు తావుండదు. 'లోకాస్సమస్తా స్సుఖినోభవంతు' అన్న లక్ష్యము కలవి నైతికకర్మలు. అట్టి వైదిక కర్మాచరణవలన, సర్వులకూ, శ్రేయస్సు కలుగుతుంది. వైదిక కర్మలలో లగ్నమైన మనస్సునందు పాపానికి చోటులేదు. అవి చిత్తశుద్ధికీ, మనశ్శాంతికీ సోపానము లౌతవి.

సంకల్పం లేక మనం ఏ కార్యమూ చేయలేము. ఏ కార్యము లేని స్థితి కదా అద్వైతం అని మనం చేతులు కట్టుకొని కూచుంటే మనమనస్సులో లెక్కలేనన్నియోచనలు పుట్టుతవి. ఆంగ్లంలో - an idle mind is devil's workshop - అన్న ఒక సామెత ఉన్నది. 'సోమరి మనస్సు సైతాను యొక్క కర్మాగారం' అని దాని అర్ధం. చిత్తవృత్తుల నిరోధంతో జ్ఞానసిద్ధి కలగాలంటే, విహిత కర్మాచరణ దానికి మార్గం అని భగవత్పాదులవారు బోధించారు.

మనస్సును నిలిపి చిత్తైకాగ్రత సాధించాంటే మనం ఏదో ఒక వస్తువును పట్టుకోవాలి. ఆ వస్తువే స్వామి. అతని యందు మనం చూపే ప్రేమయే భక్తి. ఏకాన్ని అనుసంధానం చేస్తేనే మనం 'అనేకం' నుంచి విడిపడగలం. ఆ ఏకవస్తువులో లీనమైనపుడే ఆనందమూ, శాంతి. అపుడు ఆత్మ ఒక్కటే నిలిచిపోతుంది. అద్వైతస్థితీ అదే.

'సగుణజ్ఞాన హీనస్య నహి నిర్గుణ వేదనం

నంది దర్శనహీనస్య యథానశ్శివదర్శనం'

6. మాలిన్యం తొలిగే మార్గం

మనం నిలకడగా యోచించిచూస్తే అంతా ఆనందమే అని అనిపిస్తుంది. ఆనందానికి ఒక అంతులేదు. ఎల్లలేని అర్ణవం లాంటిది ఆనందం. జ్ఞానమునకూ ఒక ఎల్లలేదు. ఐతే నిరవధికములైన రెండు వస్తువులు ఒక్కచోట ఉండటానికి వీలులేదు. అందుచేత ఆనందమూ జ్ఞానమూ రెండూఒక్కటే అని తేలుతుంది. ఆనందమే బ్రహ్మమని ఉపనిషత్తులు చెపుతున్నవి. ఆనందము, జ్ఞానము, బ్రహ్మ, ఆత్మ, ఇవన్నీ ఒక్కటే. అవి లేనిచోటు లేదు కనుక, జ్ఞానానందములు కల జీవుడూ బ్రహ్మమే.

మనం కండ్లతో చూస్తాం. ఒక పువ్వును చూచి ఇది రోజా అని అంటాం. మరొక్క దానిని ఉమ్మెత్తపూవు అని అంటాము. జ్ఞాన దృష్టిలో చూచామంటే, రోజా లేదు, ఉమ్మెత్తపువ్వూ లేదు. అంతా ఆనందంగానే కనబడుతుంది. మనకు చిత్తశుద్ధిలేని కారణంగా, ఈ ఆనందం కలగటంలేదు. కళ్ళజోడు మురికిగా వుంటే, వస్తువులు స్ఫుటంగా కనిపించవు. మనకు అన్నీ చక్కగా కనిపించాలంటే మనోదర్పణంలోని మాలిన్యం తొలగాలి.

ఒక పిచ్చివానిని, 'ఈ కఱ్ఱను పది నిముషములు పట్టుకొని నుంచో' అని అంటే వాడు ఒక చోట స్థిరంగా నిలవలేడు. ఆ పనిని మనం సులభంగా చేస్తాము. కానీ, 'ఒక విషయాన్ని పది నిముషములు ధారణ చేయి' అని అంటే మనచేతకాదు. ఈ విషయంలో పిచ్చివానికీ మనకూ ఎంతో సామ్యమున్నది. చిత్తైకాగ్రత అంత సులభంకాదు. చిత్త మాలిన్యం తొలిగితే కాని చిత్తైకాగ్రత సాధ్యంకాదు. ఏకాగ్రత సిద్ధిస్తేకాని మనం సత్యమేమిటో తెలుసుకోలేము.

దోషములు ఎట్లా తొలుగుతాయి? ఈ దేహమే ఒక దోషభూయిష్టమైన వస్తువు. ఈ దేహం ఎట్లా వచ్చింది? పాపకర్మవల్ల. ఈ పాపాలు ఎట్లా చేశాం? కరచరణాద్యంగములతో చేశాం. పాపకర్మ పుణ్యకర్మతో తొలుగుతుంది. కరచరణాద్యంగముతోనూ మనస్సుతోనూ చేసిన పాపకర్మలను, వాటితోనే చేయబడు పుణ్యకర్మలతో తొలగించుకోవాలి. దానం, ధర్మం, కర్మానుష్ఠానం, ఈశ్వరనామోచ్ఛరణ, ఆలయదర్శనం మొదలైనవి పుణ్యకర్మలు. వీనిని ఆచరించి పాపక్షాళనం చేసుకోవాలి. దానితో మనకు జ్ఞానోదయమై ఆనందానుభూతి సిద్ధిస్తుంది.

7. ఖండము, అఖండము

ఆకాశంలో సూర్యుడొక్కడే. కాని మనం ఒక దోసెడు నీళ్ళు తీసుకొని స్నిగ్థమైన ప్రదేశంలో చల్లినామంటే, ఆ నీళ్ళు ముత్యాలవలె చెల్లాచెదరై పడతాయి. అట్లాపడిన ప్రతి నీటి బిందువులోనూ సూర్యుడు ప్రతిఫలిస్తాడు. ఒక్కొక్క బిందువూ సూర్యునికి ప్రతీకవలె ప్రకాశిస్తుంది. ఒక్క సూర్యుడు అనేకసూర్యులైనట్లుచూస్తాం. అట్లే ఈ ప్రపంచంలో జీవులందరూ ఒకే బ్రహ్మము యొక్క ప్రతిబింబములే. ఈ విషయాన్నే భగవత్పాదులవారు తమ బ్రహ్మ సూత్ర భాష్యంలో వివరించారు.

అన్నిటికీ మూలమైన ఒక అఖండశక్తి, ఖండ ఖండములుగా కనపడుతున్నది. ఆ వస్తువే వేదముల తుదిలో చెప్పబడిన తత్పదార్ధము. తత్‌ అనగా దూరములో అన్నిటికీ మీదుగా వున్నదని అర్థము. మునము ఇపుడున్న స్థితిలో అది దూరములో వున్నట్లు తోచిననూ, వాస్తవముగ దూరంగానూ దగ్గరగానూ వున్న వస్తువు అదే, అదే నీవు - తత్‌ త్వమసి - అని వేదములు చెప్పుతున్నవి.

నేను ఈ విషయం మీకు చెపుతుంటే, ఈ క్షణంలో అంతా అర్ధమైనట్లు అనిపిస్తుంది. కాని మరుక్షణంలోనే ఈ సత్యదృష్టి - ఈ వాస్తవమైన విషయం మనస్సుల నుండీ తొలగిపోతుంది. మనం అనేక విధములైన అసత్యజీవులముగానూ, కష్టజీవులముగానూ ఉన్నాము. ఎల్లకాలములోనూ మనం సత్యాన్ని గ్రహించి, సత్య వస్తువుగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. అన్ని కాలాలలోనూ సత్యవస్తువుగా వుండేది స్వామి ఒక్కడే. అఖండ స్వరూపంగా వుండేది ఆయనే. మనమేమో ఖండఖండములుగా వున్నాం. ఈ స్థితినుంచి అఖండస్థితికి, ఆనందస్ధితికి చేరుకోవాలి.

అఖండముగా వున్నది సత్యము. ఖండముగా ఉన్నదంతా కల్ల. అది ఒక భావన మాత్రమే. ఈ భావనకూ కలకూ భేదమేమీ లేదు. ఈ అఖండ భావం, అద్వైతభావం సిద్ధిస్తే భయం, దుఃఖం మొదలైనవి దూరమవుతాయి. భగవత్పాదులవారు ఉపనిషత్తులనే వృక్షం నుంచి కోసి మనికిచ్చిన మధుర ఫలం ఇదే.

ఆ ఫలాన్ని ఆస్వాదించాలంటే, క్రమక్రమంగా పూజలు పునస్కారాలు, జపతపాదులు అనుష్ఠించి, చిత్తశుద్ధి ఏర్పడిన పిదప, వేదాంతములో చెప్పబడిన తత్త్వమసీతి వాక్యములను అనుసంధానం చేసి జ్ఞాననిష్ఠులము కావాలి.

8. నిండిన ఆనందము

కృతయుగంలో భృగువు తన తండ్రియైన వరుణుని సమీపించి పూర్ణమైన వస్తువేది? దానినెట్లా పొందాలి? అని అడిగాడు. 'నీవు వెళ్ళి తపస్సు చెయ్‌. నీ అంతట నీకే తెలుస్తుంది', అని వరుణుడన్నాడు.

భృగువు కొంతకాలం తపస్సు చేయగా అతనికి ఈ శరీరమే పూర్ణవస్తువని తోచినది. అన్నిటినీ తెలుసుకొనేది ఈ శరీరమే. ఇది జ్ఞాత. జ్ఞాత జ్ఞేయము కంటే గొప్ప. వెంటనే తండ్రి వద్దకు వెళ్ళి ఈ విషయాన్ని చెప్పినాడు. ఇది వినిన తండ్రి కుమారుణ్ణి మరికొంతకాలం తపస్సు చేయమన్నాడు. ఈ విధంగా భృగువు ఐదు మారులు తపస్సు చేసి తాను గ్రహించినది తండ్రికి చెప్పినాడు. మొదట పరిపూర్ణవస్తువు దేహమనీ, అటుపిదప ప్రాణమనీ, దాని పిదప మనస్సనీ, తదుపరి విజ్ఞానమనీ, కట్టకడపట ఆనందమనీ భృగువు తెలుసుకొన్నాడు.

సాంద్రమైన ఒక చెట్టు క్రింద కూచున్నపుడు సూర్యరశ్మి ప్రసరించదు. కొంచెంగాలి వీచి ఆకులు కదిలేసరికి సూర్య కిరణములు మిలమిల ప్రకాశిస్తాయి. మళ్ళీ ఆకులు తమ చోట్లకు చేరుకోగానే సూర్యరశ్మి అంతరిస్తుంది. ఈ విధంగానే మనలో సత్త్వం వృద్ధి అయ్యేకొద్దీ, ఆనందం అధికరిస్తూ వస్తుంది. ఈ ఆనందం మహదానందమై సార్వకాలికమైతే ఆత్మానందంగా పరిణమించి అద్వైతానుభూతిగా నిలిచిపోతుంది. భృగువు ఇట్టి ఆనందానుభూతిని తపోమూలకంగా తెలుసుకొన్నాడు.

9. ఆనందం ఎక్కడ?

మనకు లెక్కలేని కోరికలు. ఎంతో శ్రమపడి ఎన్నో వస్తువులను సంపాదించి ఇవన్నీ నావి అని భ్రమలో పడుతూ వుంటాము. ఒక రోజు వీటినన్నింటినీ విడచిపెట్టి మనం వెళ్ళిపోవాల్సి వస్తుంది. వెళ్లిపోతే మాత్రమేమి? మరొకజన్మ మనకు సిద్ధంగా కాచుకొని వుంటుంది. ఇంకోజన్మ కూడదంటే మనకున్న కోరికలకంతా రాజీనామా ఇచ్చి, ఏ కోరికా లేకుండా పరమాత్మతో కలసిపోవాలి.

సృష్టిలో వున్న జీవరాశులలోకెల్లా, మనిషికి జ్ఞానమెక్కువ అని మనం గర్వపడుతూ వుంటాము. కానీ తక్కిన జీవరాశులకంటే మనమే విధంగా గొప్ప? నక్క, కుక్క, ఏనుగు, ఎలుక, చీమ, దోమ ఇవన్నీ ఆహారం కోసం ప్రయత్నంచేస్తూ ఉంటాయి. తమ సంతతిని వృద్ధిచేస్తాయి. అవీ నిద్రపోతాయి. కాలం తీరిపోతే ఒక రోజు అనే దీర్ఘ నిద్రలో కలసిపోతాయి. వీనికంటే మనం ఏ విధంగా గొప్ప? వీనితో పోల్చుకొంటే వీనికంటే విశిష్ఠమైన జ్ఞానాన్నీ, వివేకాన్నీ మనకు భగవంతుడు ఇచ్చాడు. ఆ వివేకాన్ని ఉపయోగించి, నిత్యానందానుభూతికి మనం ప్రయత్నించకపోతే అంతకంటే గర్హనీయమైనదేముంటుంది?

మనం యోచించి చూచామంటే, జ్ఞానం, ఆనందం, మనము - ఇవన్నీ ఒక్కటే. మనమెవరము? దీర్ఘంగా విచారిస్తే, మనము జ్ఞాన స్వరూపులము, చిన్మయులము, ఆనంద బ్రహ్మములని తెలుసుకొంటాం.

మనకు బాహ్యంగా వున్న వస్తువులనుంచి మనకెన్నడూ ఆనందం రాదు. ఆనందమనేది మనలోనే ఉద్భవిస్తుంది. అజ్ఞానం చేత బాహ్యవస్తువులు మనవనీ, మనమనీ భ్రమపడటంవల్ల, ఆనందం లోపిస్తున్నది. ఒక ఉదాహరణ చెపుతాను.

ఒకనికి స్వంతంగా కొంత సాగు భూమి ఉన్నది. ప్రతి సంవత్సరమూ, దానిని దున్ని పండించి సంతోషపడేవాడు. కాలక్రమేణా ఆ భూమిలోపంట తగ్గటం ప్రారంభించింది. దానిని మరొకనికి అమ్మివేసినాడు. ఆ భూమిని కొన్న క్రొత్త యజమాని సేద్యం ప్రారంభించేసరికి, ఆ భూమిలో నాలుగింతలు ధాన్యం పండసాగింది. అంతటితో ఆ భూమిని అమ్మిన పెద్దమనిషికి ఎక్కడలేని అశాంతి పుట్టుకొని వచ్చింది. ఆ భూమి తనదైనపుడు, అది పండినపుడంతా సంతోషించినవాడు, నేడు దుఃఖసముద్రంలో మునిగిపోయాడు. ఇపుడు భూమి తనది కాదు, వేరొక్కనిది. ఈ మమకారం అనేది ఎన్ని కష్టాలు తెచ్చి పెడుతుంది? మమకారం అనేది దుఃఖానికి మరొకరూపం అనాలి.

మరొక్క ఉదాహరణ. ఒక పెద్దమనిషి నా వద్దకు అప్పుడప్పుడూ వచ్చేవాడు. ద్వితీయ వివాహం చేసుకొన్నాడు. మొదటి భార్యకు ఒక పుత్రుడున్నాడు. ఆ పుత్రునికీ, సవతి తల్లికీ కలహాలు ఏర్పడినవి. మొదటిభార్య పుత్రుడు సవతి తల్లిని ఉద్దేశించి ఏవో అభిచార ప్రయోగాలు చేశాడట. ఆ ప్రయోగాలు ఎదురు తిరిగి అతనినే బాధించ సాగినవట. ఈ తండ్రికి - పరిపూర్ణంగా రెండవ భార్యపక్షంలో చేరిపోయిన పెద్దమనిషికి - ఒక్కటే ఆనందం! ఆ పిల్లవాడు తన మొదటి భార్యకు పుట్టిన స్వంత కుమారుడన్న విషయాన్ని పూర్తిగా విస్మరించాడు! ఆ పిల్లవాడు పరాయివాడైపోయాడు. అతనికి హానికలిగిందంటే ఈయన దుఃఖించడానికి బదులు సంతోషిస్తున్నాడు. ఇదీ లోకరీతి.

మాయలో చిక్కుకొన్న మనకే అపుడపుడూ ఆనందం కలుగుతూ వుందంటే, అన్నీ వదలిపెట్టి, ''నేను'' ను విస్మరిస్తే - ఎంత ఆనందం? కొంచెం చేదుగా వున్న కూరలో బెల్లం కలిపితే చేదు తగ్గి తీపి ఔతుంది. పూర్తిగా బెల్లమే ఐతే? మనం మాయ అను ఘటంలో వున్నాం. ఈ కుండను, ఈ ఘటాన్ని మనం పగలకొట్టాలి. ఈ కుండ పగిలిపోతే దానితో బాటు భేద దృష్టీ పోతుంది. ఆనందమే మిగులుతుంది.

ఆశలనే పంజరంలో మనం బంధితులమై వున్నాం. ఆ పంజరంలో నుంచి బయటపడ్డామంటే, 'మాయ' మాయమౌతుంది. మనస్సు ఉన్నంత వఱకు ఆశలు వుంటాయి. ఆశలు పోవాలంటే, మనస్సు పోవాలి. ఉన్న మనస్సుపోతే మనం జడులము కామా? అని భాధపడనవసరం లేదు. చిత్తవృత్తులు క్షీణం కానుకాను, మనస్సుకు ఏకాగ్రత సిద్ధిస్తుంది. ఏకాగ్రమైన మనస్సుకు ఎన్నో శక్తులు వస్తాయి. దీనికి ఉదాహరణం మన ఋషులే. ఋషులు నిగ్రహానుగ్రహ సమర్థులు. త్రికాల జ్ఞానసంపన్నులు. దూరదృష్టి, దూరశ్రవణంలాంటి శక్తిసంపన్నులు. అట్టి శక్తిచేతనే వారు మంత్రద్రష్టలయ్యారు. అన్ని ధర్మాలకు మూలం వేదం. వేదవిహిత కర్మలవలన, నిరీహులమై ఆత్మ సంయమన పరులమౌతాం. అట్టి రమణీయాచరణచేత ఆనందమయులమై పోగలం.

10. ఎదుర్కొని ఆహ్వానిస్తాడు

గాలి నిలచినపుడు సముద్ర తీరమునకు వెళ్ళి చూచామంటే, సముద్రం గంభీరంగానూ నిశ్చలంగానూ వుంటుంది. ఒక చిన్నగాలి వీచిందంటే ఒక చిన్న అల సముద్రంలో లేస్తుంది. ఇంకొక గాలి వీచిందంటే మరొక అల పుడుతుంది. ఒక అల మరొక అలతో ఢీకొని చెల్లాచెదరౌతుంది. 'సముద్రేతరంగా లయం యాంతిభంగా' పరమాత్మ నిశ్చలంగా వున్న మహూదధి. జీవులు మాయ అనే గాలి వలన పుట్టే తరగలు. ఈ తరగలు కడపట తాము పుట్టిన సముద్రంలోనే కలసిపోతాయి. జీవులూ చిట్టచివర, పరమాత్మలోనే లీనమైపోతారు.

సముద్రంలో నీళ్ళు ఎప్పుడూ తరగవు. సృష్ట్యాదినుంచీ సముద్రము యొక్క వాలకము ఇలాగే వుంది. సముద్రంనుంచి సూర్యతాపానికి ఆవిరిలేని మేఘాలై, ఆకాశంలో విహరిస్తూ, వర్షాకాలంలో వానకురిసి, కాలువలు, వాగులు, నదులు, చెరువులు, తటాకాదులను నీటితో నింపి, ఆ నీళ్ళు మళ్ళా మేఘాలై, మేఘాలు నీళ్ళై, గతాగతంగా ఒక ఎడతెగని నాటకంగా ఉన్నది. కానీ లోకంలో ఒకచోటక్షామం, ఒకచోట వరదలూ ఉన్నా, సృష్ట్యాదినుంచి లోకంలోని జలపరిమాణంలో ఏ విధమైన మార్పూ లేకుండా వున్నది.

పరమాత్మ ఎన్నో రూపాలు ధరిస్తున్నాడు. ఆ రూపాలు నశిస్తూన్నవి. మళ్ళా క్రొత్త క్రొత్త రూపాలు ఎత్తుతునే ఉన్నాడు. ఈ పరిణామక్రమం ఆయనలో ఏ విధమైన హెచ్చుతగ్గులనూ కలిగించటం లేదు. ఆయన ఎప్పుడూ సముద్రంవలె గాంభీర్యంగా నిశ్చలంగా, అపూర్యమాణమచల ప్రతిష్ఠంగా వెలుగొందుతూ వున్నాడు.

మనదేశంలో ఎన్నో నదులున్నాయి. ఒక్కొక్క నదికి ఒక్కొక్కపేరు. ఒక నది పేరు శోణభద్ర. దానిలోని నీళ్ళు ఎఱ్ఱగా వుంటాయి. ఆ నది ఎఱ్ఱని మట్టి గల ప్రదేశంలో ప్రవహిస్తున్నది. కనుక, గంగానది తెలుపే, కృష్ణ నలుపు. ఈ నదులు కట్టకడపట సముద్రంలో కలుస్తున్నవి. సముద్రపు రంగు ఈ నదుల రంగువలన మారటంలేదు. దానిలో హెచ్చుతక్కువలు లేవు. తెలుపు సత్త్వగుణ సూచకం. ఎరుపు రజోగుణమునూ, నలుపు తమోగుణమునూ సూచిస్తాయి. పరమాత్మ ఈ త్రిగుణములకూ ఆవలనున్నవాడు. ఎన్ని నదులు వచ్చి చేరినా, సముద్రము వానిని తిరిగిపొమ్మని చెప్పక ఎట్లా సంతోషంగా ఆహ్వానిస్తూ వున్నదో, పరమాత్మ కూడ జీవసముదాయం తనలో నుంచి పుట్టి తనలో చేరేటపుడు ఆనందంగా ఎదుర్కొని ఆహ్వానిస్తున్నాడు. ఎత్తైన పర్వతాలనుంచి నదులు పుట్టి, మైళ్ళ కొలదీ ప్రవహించి, నానా అవస్తలు పడి సముద్రమును చేరి శాంతించినట్లే జీవులూ పరమాత్మలో కలసి శాంత్యవస్థను భజిస్తారు. ఆ అవస్థ కొకహద్దు లేదు. ఆ ఆనందానికొక మేరలేదు.

11. మాయ

""@Li»y ª«sW¸R…V Gµk… xqs»R½ùª«sVV NSµR…V'' @¬s ËݵôðR…ª«sV»R½Li ¿Ázmsöƒ«s Lki¼½ @\®µ…Q*»R½Li ¿ÁxmsöÈÁLiÛÍÁ[µR…V. úxmsxmsLi¿RÁª«sVV ª«sW¸R…V¹¸…[V. NS¬ds µy¬sNTP Aµ³yLRiª«sVVgS Dƒ«sõ ú‡Áx¤¦¦¦øª«sVV xmsLRiª«sVxqs»R½ùª«sV¬s @\®µ…Q*»R½ª«sVLiÈÁVƒ«sõµj…. "úxmsxmsLi¿RÁª«sVVÍÜ[ Fsƒ¯[õ NSLRiùª«sVVÌÁV ÇÁLRiVgRiV»R½Vƒ«sõ„s. ¿RÁWxqsVòƒyõª«sVV NRPµy! µk…¬sƒ«sLi»y ª«sW¸R…V A¬s FsÉýØ Â¿ÁxmsögRiÌÁª«sVV? @¬s N]LiµR…LRiV úxmsbPõQryòLRiV.

మాయ అనగా పూర్తిగా లేదన్న వస్తువు అని అనుకొని వారు ఇలా అడుగుతున్నారు. కానీ మాయ పూర్తిగా లేని వస్తువు - అత్యంత అసత్‌ కాదు. శశవిషాణము, సంధ్యాపుత్రుడు ఇవి అత్యంత అసద్విషయములు, మాయ అట్లా కాదు. అది ఉన్నదని అనుకొంటున్నంత వఱకు ఉండేది. మాయ శశవిషాణం వలెకాక మృగమరీచికల్లాంటిది. ఎండమావులలో జలమున్నట్లు కనిపిస్తుంది. కానీ కనిపించేది జలంకాదు. ఎండమావుల నీటివలన దాహశాంతి జరుగదు. మృగమరీచికలలో జలాభావమున్నదని తెలిసి కూడ జలమున్నదను భ్రాంతి కలుగుతుంది. ఇట్లే మాయను తెలుసుకొన్న జ్ఞానులకు ప్రపంచము అనుభవమౌతూ వున్నా నిరంతర సత్యము కాదన్న విజ్ఞానం సర్వత్రా వుంటుంది.

వేదాంతంలో రజ్జుసర్పభ్రాంతి అనే ఒక న్యాయం వుంది. త్రాటిని మనం పామని భ్రమిస్తాము. ఈ త్రాటిలో పామును చూచినంత సేపూ ఆ త్రాడు పాము కలిగించే భయమునూ, ఉద్వేగాన్ని కల్గిస్తుంది. కానీ త్రాటిలో నిజంగా పాములేదు. అట్లే ప్రపంచము నిరంతర సత్యము కాకపోయిననూ, దానిని సత్యమని భావిస్తున్నంత వఱకు అన్ని కార్యములు జరుగుతూనే వుంటాయి. త్రాటిని త్రాటిగా చూడగానే పాము మరగిపోయినట్లు, ఈ ప్రపంచమూ బ్రహ్మమునకు చెందిన ఒక దృశ్యమే, దానికి ఆధారమైన బ్రహ్మ వస్తువు ఒక్కటే నిరంతర సత్యమన్న జ్ఞానము కలిగేసరికి, అన్ని కార్యములు తమంతట తాము నిలచిపోతాయి.

12. దృష్టిం జ్ఞానమయీం కృత్వాపశ్యేత్‌

బ్రహ్మమయం జగత్‌

అనగా జ్ఞానము కలిగేంత వఱకు ప్రపంచము భాసిస్తూనే వుంటుంది. మనకు స్వప్నావస్థ ఉన్నది. ఆ స్వాప్నిక జగత్తు కలకంటున్నంత సేపూ వాస్తవికంగానే కనబడుతుంది. కానీ మెలకువ రాగానే అంతరించిపోతుంది. అట్లే అజ్ఞానములో నిద్రపోతున్నంత వఱకు ప్రపంచం సత్యమనే అనిపిస్తుంది. జ్ఞానం కలిగేసరికి ప్రపంచం మాయమౌతుంది. ఇట్లు అత్యంత అసత్తుగాకాక, తాత్కాలికసత్యముగా వున్న ఈ ప్రపంచమును ప్రాతిభాసిక సత్యమని అంటారు. ముత్తెపుచిప్పలో పడిన సూర్యరశ్మి వెండివలె కనబడుతుంది. మాయా సంబంధముచేత బ్రహ్మములో ప్రపంచం ఇదే విధంగా ప్రతిభాసిస్తోంది. జ్ఞానికి మాయ శూన్యమే. ప్రపంచమంతా ఆనందమయమైన బ్రహ్మయే అని సత్యదర్శనం చేస్తుంటాడు. మనకేది పగలో అతనికి అది రాత్రి. తనకేది రాత్రియో మనకది పగలు. జ్ఞాని జ్ఞాన మయదృష్టితో జగత్తును బ్రహ్మమయంగా దర్శిస్తుంటాడు.

13. లోపల, బయట

మనిషికి పుట్టిన నాటినుండి ఎడతెగని సంసారము. బాహ్యవిషయములను చూచినపుడు వానిపై అతనికి కోరికపుడుతుంది. అ కోరికను పూర్తి చేసుకోవడానికి ముప్పతిప్పలు పడుతుంటాడు. అ కోరిక తీరగానే దాని స్థానంలో మరొకకోరిక చిగురిస్తుంది. మనిషి జీవితం ఇట్లా విషయాన్వేషణలోనే గడచిపోతున్నది. విషయములు మృగమరీచకల లాంటివని అతడు గుర్తించటంలేదు. బాహ్య విషయోపలబ్ధివలననే అతనికి ఆనందం, సంతోషం. వాటిని వెన్నాడుతుండటంచేత వానికి నిజమైన శాంతి కలగటంలేదు. బాహ్యవిషయములు మనవశంలో లేవు కనుక విషయానుభం చేత శాంతి కలుగుతుందన్నది కల్ల.

మాయలో చిక్కుకొన్న జీవుడు తానే ఆనంద స్వరూపుడనీ, ఆ ఆనందం లోపలవున్నదేకానీ, బయటలేదనీ గుర్తించలేకున్నాడు. ఆనందమే మనస్వరూపమని తెలుసుకొనేంతవరకు శాంతి మృగ్యమే. భగవత్కృప చేత, ఆత్మ విచారముచేసి వాస్తవమును తెలుసుకొన్నపుడు, అతడు విషయాన్వేషణ వదలి పెట్టి అంతర్ముఖుడై ఆత్మానందమును అన్ని కాలములలోను అనుభవిస్తాడు. అట్టి అనుభవము కల్గినవాడు ఇంద్ర పదవిని కూడ తుచ్ఛముగా చూస్తాడు.

ఎవని తృష్ణ విశాలమో, వాడు దరిద్రుడు. శాశ్వతైశ్వర్యం అంటే, ఆత్మానందమే. దానికి తరుగుదలలేదు. ఆ ఆనందం బాహిరం కాదు. ఆంతరంగికమే. ఆది విషయసంబంధంలేనిది. ఎవని యందు కామములు, సముద్రములో చేరిన నదులవలె మాయమవుతవో అతనికే శాంతి. కామములను కామించేవానికి శాంతి లేదు. ఈ భావనను మనం సార్వకాలికంగా ఉండేటట్లు ప్రయత్నంచేయాలి.

14. దుఃఖం తొలిగే త్రోవ

పరమవస్తువేదో తెలుసుకోవడానికి మనలో ప్రతి ఒక్కరూ ప్రయత్నంచేయాలి. జ్ఞానమనగా ఏమి? పరమవస్తువు తప్పించి వేరే ఏదీ ప్రపంచములో లేదు అన్న విషయమే. ఆ ఒక్క పరతత్త్వమే అనేకమై విలసిల్లుతున్నది. ఈ అనేకమే సత్యమని భ్రమించేంత వఱకు, దుఃఖం మనదాపులోనే వుంటుంది. దుఃఖములూ మనశ్చాంచల్యమూ తొలగాలంటే ఒకేదారి. ఆ పరతత్త్వ చింతనే. తదనుసంధానమే. ఆ పరతత్త్వంలో లగ్నమైన మనస్సు చంచలరహితమై నిత్మసుఖానుభూతినందగలదు. జ్ఞానమంటే ఇదే.

సుఖదుఃఖములే సంసారం. అవి బాహ్యానికి చెందినవి. అవి వస్తూ ఉంటాయి. పోతూ ఉంటాయి. వానికి నిలుకడలేదు. గొప్ప ధనికుడు పెద్ద పదవిలో వున్నవాడు, సుఖి అని మనం అనుకొంటాం. కాని వానిని మనం పరామర్శించినామంటే, అతని కష్టములు నూర్లకొలది ఏకరువు పెడతాడు. అప్పుడు మనమున్న స్థితే మేలు అని మనకనిసిస్తుంది. ధనమున్న వాడి కాలమంతా ఈ ధనాన్ని ఏ విధంగా రక్షించడమనే విచారంతోనే నిండివుంటుంది. వానికి మనశ్శాంతి ఎప్పుడూ కఱవే.

దుఃఖం మనతో పుట్టినది. ఇది పూర్వ కర్మకృతం. దీని నుంచి తప్పించుకొనడం అశక్యం. ఐతే కర్మానుసారం కలిగే కష్టాలను క్షాంతితో ఓర్చుకొని శాంతంగా వుండడానికొక మార్గమున్నది. వానికి ఆనందమూ లేదు. సుషుప్తిలో దుఃఖమూ లేదు. సుషుప్తిలో సుఖముగా వున్నామన్న ఎఱుక కూడా లేదు. జ్ఞాని ఒక్కడే సతత జాగ్రదావస్థలో శాశ్వత సౌఖ్యాన్ని అనుభవిస్తూ వుంటాడు. అతనికి దేహక్లేశమున్నప్పటికి, మనఃక్లేశముండదు. బాహిర విషయాటోపం అతన్ని ఏ విధంగానూ బాధించదు.

నీటిలో కడవ మునిగివున్నంతసేపు, మనకు దాని భారం తెలియదు. కొంత పైకి లాగగానే కడవ బరువౌతుంది. అదే విధంగా మనకు కలిగే ప్రాపంచిక కష్టముల భారం, జ్ఞానమనే జలములో ముంచితే, దుఃఖం దూరం అవుతుంది. అన్ని క్లేశములకూ మందు యోగమే.

15. దుఃఖ పరిహారం

ఒకనికి వ్యాధివస్తే ఆయుర్వేద చికిత్సకుడు ధాతువైషమ్యమని చెబుతాడు. ఇంగ్లీషు వైద్యుడు మరొక్క కారణం చెబుతాడు. ఇంకో కారణం మానసిక విజ్ఞానానికి చెందినవారు పేర్కొంటారు. మంత్రశాస్త్రజ్ఞులు దైవం ప్రతికూలంగా వుందని అంటారు. జ్యోతిష్కులు గోచారవశంగా గ్రహములు అనుకూలంగా లేవని అంటారు. ధర్మ శాస్త్రజ్ఞులు వ్యాధి, పూర్వకర్మ వలన ఏర్పడినదని చెబుతారు. వ్యాధి ఒక్కొక్కరూ ఒక్కొక్క విధంగా చెబుతుంటారు. ఇందులో ఏది నిజం? అంతా కర్మ ఫలం అంటే మనకు కలిగిన సమస్యకు పరిహారమేమిటి? మనం ఏమి చేయాలి?

దీనికంతా కారణం కర్మమే. కర్మ, కర్మ ఫలం. వైజ్ఞానికుల కార్యకారణ సంబంధం Cause and Effect ఇదే. ప్రపంచమంతా Action, Reaction అనే ద్వంద్వాలలో చిక్కుకొని వున్నది. భౌతిక శాస్త్రము (Physics) ఈ సత్యమునే వెల్లడిస్తున్నది. జడప్రపంచమూ, జీవ ప్రపంచమూ, రెండూ ఒకే మూలకారణము నుంచి వచ్చినందు వలన జగత్తుకు వున్న విధి మానవ జీవితమునకూ ఉన్నది. మన చేతలకన్నిటికీ నిశ్చయముగా ప్రతిఫలమున్నది. మనము అ జీవితములో అనుభవిస్తున్న సుఖదుఃఖములకు కారణం పూర్వ జన్మలలో చేసుకొన్న కర్మమే. మనం చేసిన పాప పుణ్యాలే కాక, ఇతరుల పాపపుణ్యాలు, పరేచ్ఛా ప్రారబ్ధములూ మనలను వెన్నాడటం కద్దు. ఒక శిశువుకు కలిగే సుఖదుఃఖాలను తలితండ్రుల కర్మ అని అంటారు. వారు శారీరకంగానూ, మానసికంగానూ పడే కష్టాన్ని చూస్తుంటే ఇది నిజమే అని అనిపిస్తుంది.

ప్రపంచములో జరుగుతున్న అ జగన్నాటకానికి సూత్రధారిణి ఆ పరాశక్తియే అంతా ఈశ్వర శాసనాన్ని అనుసరించే వర్తిస్తున్నది. ఒకదాని కొకటి సంబంధములేనట్లు కనిపించినా, అంతా ఆ సర్వేశ్వరుని మాయా తంత్రవే.

అందుచేత మనకు జరుగుతున్నవన్నీ ప్రారబ్ధ కర్మవలననే జరుగుచున్నవి. ఆ కర్మఫలమునకు ఏ కారణమైనా చెప్పవచ్చును. దానికి తగిన పరిహారమో, చికిత్సయో, గ్రహశాంతియో, దైవతుష్టియో, ఏదైనా చేయవచ్చును. ఇట్టి పరిహారములు చేస్తున్నపుడు కూడ అన్నీ ఈశ్వరార్పితమన్న భావనతో చేయాలి. ఆ ఈశ్వరుడు విధించినట్లు జరగనీ అని తూష్ణీం భావముతో వుండటం అతి శ్లాఘ్యమైనది. దానిని మించిన పరిహారమేదీ లేదు.

ప్రారబ్ధకర్మకు నిర్ణీతమైన పరిహారములు చేయుటతోబాటు, క్రొత్తకర్మలు చేయకుండా వుండేటట్లు జాగ్రత్తపడాలి. ఈశ్వర ధ్యానమునకు మించిన పరిహారమేమున్నది? అద్వైత నిష్ఠలో సుఖదుఃఖములు రెండూ లేవు. ఈ రెంటికీ ఆధారమైన సత్యము స్వయం ప్రకాశముగా సర్వకాలములలోనూ భాసిస్తూ వుంటుంది.

16. ద్వైతం, బౌద్ధం, అద్వైతం

''ఓం పూర్ణమదః పూర్ణమిదం

పూర్ణాత్‌ పూర్ణముదచ్యతే

పూర్ణస్యపూర్ణమాదాయ

పూర్ణమేవావశిష్యతే'' -

అని ఉపనిషన్మంత్ర మొకటి ఉన్నది. అదీ పూర్ణమే. ఇదీ పూర్ణమే. ఆ పూర్ణంలో నుంచీ ఈ పూర్ణం ఉదయించినది. పూర్ణంలో నుంచీ పూర్ణాన్ని తీసివేస్తే పూర్ణమే మిగులుతుంది. బ్రహ్మము పూర్ణమైన వస్తువు. ఈ లోకమూ పూర్ణమైనదే. ఆ బ్రహ్మమనే పూర్ణ వస్తువు నుంచీ ఈ లోకం ఉదయించింది. ఆ బ్రహ్మనుంచి ఈ పూర్ణమైన లోకం ఉదయించినప్పటికీ, ఆ బ్రహ్మం పూర్ణముగానే వున్నది. పూర్ణమంటే, సర్వమూ అని అర్ధం. ఎట్లు రెండు వస్తువులు పూర్ణముగా ఒకే సమయమున ఉండగలవు? పూర్ణం నుంచీ పూర్ణమును తొలగిస్తే పూర్ణమెట్లా మిగులుతుంది? అన్న ప్రశ్నలు వస్తాయి.

ఈ మంత్రమునకు వాస్తవమైన తాత్పర్యమేమి? ప్రపంచము బ్రహ్మములో నుంచి వేరుగా పుట్టిన బాహ్య వస్తువు కాదు. బ్రహ్మయే ప్రపంచముగా ప్రతీతమౌతున్నది.

బ్రహ్మము వేరే ఒక వస్తువును గ్రహించి ప్రపంచమును సృష్టించలేదు. బ్రహ్మయే ప్రపంచముగానూ మారలేదు. బ్రహ్మము ప్రపంచమువలె చూపట్టుతున్నది. అంతే.

మళ్ళా రజ్జు న్యాయమునకు వద్దాం. త్రాటిని చూచి పామని అనుకొన్నాం. ఇపుడు త్రాడే పాముగ కనపడుతున్నది. త్రాడు పాముగ మారలేదు. త్రాడు పామును సృష్టించనూలేదు. పాముగా చూచినపుడు అది పూర్ణముగా (పూర్తిగా) పామువలెనే తోచినది. త్రాడని తెలుసుకొన్నపుడు అది పూర్తిగా త్రాడుగానే యున్నది. త్రాడు అనే పూర్ణం నుంచీ, పాము అనే పూర్ణం ఎట్లా ఉదయించినదో అట్లే బ్రహ్మమనే పూర్ణమునుంచీ ప్రపంచమనే పూర్ణముదయమైనది. అనగా ఒక స్ధితిలో త్రాడే పూర్ణము, మరొక స్థితిలో పామే పూర్ణము. రెండు పూర్ణములు లేవు. ఒకే పూర్ణము, రెండు స్థితులలో రెండు పూర్ణములుగా తోచినది. ఇట్లే బ్రహ్మము నుంచి ప్రపంచమును తీసివేసినా, బ్రహ్మముతో ప్రపంచమును చేర్చినా, బ్రహ్మములోని ఏ విధమైన మార్పున్నూ, హెచ్చుతక్కువలునూ ఉండవు.

త్రాడు పాముగా ఎట్లు కనబడినది? మసక చీకటి వలన. అట్లే మాయచేత బ్రహ్మము ప్రపంచముగా కనపడుతున్నది. ఏది లేనిదో అదే మాయ. 'యామా సా మాయా'. లేని వస్తువైన మాయ, ఉన్న వస్తువైన బ్రహ్మమును, ప్రపంచముగా చూపుతున్నది. లేని వస్తువు ఇట్లు చేయగలదా అని మీరు నన్ను అడగవచ్చును. గణిత శాస్త్ర విధానంలో నేను దీనికి బదులు చెప్పెదను.

బ్రహ్మము విషయములో గణిత నియతి ననుసరించి, కూడిక తీసివేతలుగూర్చి అద్భుతాన్ని వివరించాము. ఇప్పుడు హెచ్చించుట భాగాహారముల విషయం చూద్దాం. ఒక సంఖ్యను మరొక సంఖ్యచేత మనం భాగిస్తాం. భాగించే సంఖ్య విభాజకం. భాగింపబడే సంఖ్య విభాజ్యం. ఫలము విభక్తం. మిగులు శేషం. ఒక సంఖ్యను భాగిస్తూ పోగా, విభాజ్యం క్రమక్రమంగా చిన్నదౌతూ వస్తుంది. ఇపుడు16ను 16తో భాగిస్తే, విభక్తం ఒకటి. 8తో భాగిస్తే, 2, 4తో భాగిస్తే విభక్తం 4, ఒకటితో భాగిస్తే విభాక్తం 16; విభాజకం చిన్నది కానుకాను, విభక్తం పెద్దది ఔతుంది. విభాజకం మరింత చిన్నదై సున్న ఐతే, విభాక్తం లెక్కకు అందని అనంతమౌతుంది. ఇంగ్లీషులో అనంతాన్ని Infinity అని అంటారు. ఏ సంఖ్యనైనా సున్నతో భాగిస్తే వచ్చే విభక్తం అనంతం. 1/0 అనంతం. 2/0 అనంతం. 3/0 అనంతం. కోటిని సున్నతో భాగించినా అనంతమే. విభక్తమును విభాజకముతో గుణిస్తే విభాజ్యం వస్తుంది. 16/2 = 8; 2x8 = 16. ఇది గణిత నియతి. అనంతము x0 = 1, అనంతముx0 = 2; అనంతముx0 = 3 ఇట్లు అంతంలేకుండా పోతూవుంటుంది. ఈ అనంతమూ బ్రహ్మము. లేని వస్తువే మాయ. మాయయే పూజ్యము, సున్న. అనంతము తన్ను సున్నతో పెంచుకొంటూ (గుణించుకొంటూ) అనేకముగా చూనుకొనుచున్నట్లు బ్రహ్మము మాయాశక్తిచేత నిరవధిక వస్తుజాలముతో నిండిన ప్రపంచముగా ప్రమేయమగుచున్నది. సృష్టిలో ఎంత వైవిధ్యమున్నది. మన మనస్సులూ ఎన్ని త్రోవలలో పరుగిడుతూ ఉన్నాయి? దీనికి ఒక అంతములేదు. మొదట చెప్పిన ఉపనిషన్మంత్రములో బ్రహ్మమును పూర్ణమని వ్యవహరించినపుడు, అది మారని అనంతముగనూ, ప్రపంచమును పూర్ణమని వ్యవహరించినపుడు అది పరిణామశీలమైన అనంతమనీ అర్ధం.

పరిణామశీలమైన వస్తువు సత్యమెన్నటికీ కాదు. ఒకటి, రెండు, పది, నూరు, వేయి, లక్ష అని మనం చెప్పుకొని పోయినా, వాస్తవంగా అది అసత్యమే. అట్లే బ్రహ్మమును మాయతో గుణించగా వచ్చిన ప్రపంచమూ మాయామయమైన శూన్యమే (పూర్ణము, సున్నా) అని అనాలి.

అనంతముగా వున్న బ్రహ్మమొక్కటే సత్యమని అద్వైత సిద్ధాంతము. అనంతముగా కనుపించుచున్న ప్రపంచమూ సత్యమే అని ద్వైతము చెబుతున్నది. బ్రహ్మము, ప్రపంచము అనే భేదములన్నియూ శూన్యమని బౌద్ధమంటున్నది. బ్రహ్మముxమాయ = ప్రపంచము అన్న సూత్రమును ఈ విధముగనూ చెప్పవచ్చును.

అద్వైతం x బౌద్ధం = ద్వైతము

లేదా

ద్వైతం / బౌద్ధం = అద్వైతము

17. ఆచార్యపాదుల అనుశాసనం

శ్రీ శంకరభగవత్పాదుల వారు స్థాపించిన మఠాధీశులమైన మాకు భగవత్పాదుల వారి అనుశాసనమేమిటి అంటే, మేము అన్ని కాలములలోనూ ఈశ్వర ధ్యానం చేయాలనీ, ఇతరులనూ ధ్యానాచరణకు పురికొల్పవలసినదనీ. ఈశ్వర ధ్యానమెందులకు? మన నిజస్వరూపం తెలుపుకొనేటందుకే. ఈశ్వరుడు సకల కల్యాణ గుణ నిలయుడు. అతనిని ధ్యానించేసరికి కల్యాణ గుణములు మనకు క్రమేణ అలవడి అతని అనుగ్రహం చేత ఈశ్వరత్వమూ లభిస్తుంది. అతడూ మనమూ ఒక్కటైపోయినపుడు మనకున్న గుణములన్నీ పోయి నిర్గుణత్వమును భజిస్తాము.

మనం పసి పిల్లలను బడికి పంపుతాం. వారు సరిగా చదవకపోతే బడిలోని ఉపాధ్యాయుడు సరిగా చదువు చెప్పలేదని అతనిని నిందిస్తాం. అదే విధంగా మీరు నేను చెప్పినరీతి నడచుకోకపోతే ఆ లోపం నాకు సంక్రమిస్తుంది. శైశవమాదిగా మనం పాపం చేస్తూనే ఉన్నాం. దానితోపాటు ఈశ్వర స్మరణ కూడ ఉండివుంటే, ఆ పాపాలు కొంత తగ్గి వుండేవి. జన్మసాఫల్యం అంటే ఈశ్వర ప్రణిధానం చేసి కృతకృత్యులమవటమే. ఆచార్యులు మాకిచ్చిన ఆజ్ఞ అదే. మేము ఈశ్వర స్మరణ చేయటమే కాదు, మీచేత చేయించాలి కూడా.

నీతి శాస్త్రంలో ఒక శ్లోకమున్నది;

రాజారాష్ట్రకృతం పాపం రాజపాపం పురోహితమ్‌

భర్తారం స్త్రీకృతం పాపం శిష్యపాపం గురుం వ్రజేత్‌.

రాష్ట్రంలో చేయబడిన పాపఫలం రాజుకు చెందుతుంది. రాజుచేసే పాపం అతనికి సరియైన సలహాల నివ్వవలసిన పురోహితునికి చెందుతుంది. భార్యచేసిన పాపం భర్తకు చెందుతుంది. శిష్యుడు చేసే పాపం గురువును చెందుతుంది.

ఒకడు జగద్గురువైతే అతనికెంత పాపం వచ్చి చేరుతుంది? ప్రపంచంలో వున్న పాపమంతా అతనిని చుట్టుకొంటుంది. పాపం తొలగడానికి ఒకే ఒక మార్గమున్నది. అది భగవద్ధ్యానమే. అందుచేతనే భగవత్పాదులవారు జనులకు ధ్యానావసరం చక్కగా తెలిసేటట్లు బోధించండి అని మాకు ఆజ్ఞాపించారు. వారు అలా ధ్యానం చేయకపోతే వారికోసం మీరైనా చేయండి అని ఆచార్యులవారు కట్టడి చేశారు. ఆ విధిని నేను సాధ్యమైనంత వఱకు నిర్వర్తిస్తూ వస్తున్నాను. మీరున్నూ ఎంత వఱకు ధ్యానం చేయగలరో అంత వఱకు చేస్తే నా భారాన్ని తగ్గించిన వారవుతారు.

ధ్యానానికి ఎంతకాలం వీలు ఔతుందో అంత సేపు ధ్యానమగ్నులమైనామంటే మనకు అంత మేలు. మన కలిమి లేములు ధ్యానానికి అడ్డు రారాదు. మనం చేయడమేకాక మన అభిరుచులతో ఏకీభవించే వారినికూడ మనం ధ్యానంచేయండని చెప్పాలి. వారు అట్లు చేయకపోతే వారిని కోపపడరాదు. ప్రేమతో వారి వారి విధులను మనం గుర్తుకు తేవాలి. మంచి మాటకు లొంగని మనిషి వుండడు. ప్రజల పారమార్ధిక ప్రయోజనార్ధం చేసిన ఆచార్యుల అనుశాసనం, మా విధీ మీకు తెలుపుతున్నాను.

పాపక్షాళనకు కావలసిన సుళువులన్నీ ఒక మానవ జన్మకే ఏర్పడి వున్నవి. దేహము, మనస్సు, శాస్త్రము, క్షేత్రము, తీర్ధము మొదలైనవి ఈ లోకమందే వున్నవి. మనోవాక్కాయములచేత మనము ఎన్నో పాపములను చేశాము. ఏఏ అవయవములతో మనం పాపకర్మ చేశామో, ఆయా అవయవములను పాపక్షాళనకై ఏర్పడిన పుణ్యకర్మలలో వినియోగించాలి, తెచ్చుకొన్న పాప సంచయాన్ని ఇక్కడే క్షయంచేసుకొంటే, తూనీగవలె ఎక్కడ నుంచి వచ్చామో అక్కడకే వెళ్ళిపోగలము. అపుడు నిరవధికానందమే. పాపులను కూడా పరమాత్మగ మార్చగల శక్తి మన భగవత్పాదులది. వారు కర్మ భక్తి జ్ఞానయోగాలను సోపాన రూపంగా ఏర్పరచి మన ఆత్మ లాభం కోసం అనుగ్రహించి వున్నారు.

Sanathana Dharmamu    Chapters    Last Page