Sanathana Dharmamu    Chapters    Last Page

శ్రీ

''యం నత్వా కృత కృత్యాశు తం నమామి గజాననం''

1. వినాయకుడు

„sƒy¸R…VNRPVßñÓá »R½„sVÎÏÁ§ÌÁV "zms\ÛÎÁQþ¸R…WL`i' @¬s g_LRiª«sxqsW¿RÁNRPLigS zmsÌÁVryòLRiV. zms\ÛÎÁQþ @LiÛÉÁ[ zmsÌýÁªy²R…V. "¸R…WL`i' @®ƒs[ xmsµR…Li g_LRiªyLóRiNRPLi. »R½„sVÎÏÁ##®µ…[aRPLiÍÜ[ @²R…VgRiV|ms²T…¾»½[, @²R…VgRi²R…VNRPWä zms\ÛÎÁQþ¸R…WL`i ª«sVƒ«sNRPV µR…LRi+ƒ«s„sVryò²R…V. A¸R…Vƒ«sNRPV g][xmsoLSÌÁV, „sª«sWƒyÌÁV, ª«sVLi²R…FyÌÁV, bPÅÁLSÌÁV, G„ds @NRPäLRiÛÍÁ[µR…V. ¿ÁÈíÁVúNTPLiµR…\®ƒsƒy, ƒ«sµk…¼d½LRi\®ªsVƒy A¸R…Vƒ«s aSLi»R½LigS, xqsLi»][xtsQLigS úxmsxqsƒ«sõª«sµR…ƒ«sLi»][ A¥¦¦¦*¬sryò²R…V. ª«sVƒ«sLi A¸R…Vƒ«s @ƒ«sVúgRix¤¦¦¦Li N][xqsLi NS¿RÁVN][ƒ«sNRPäLRiÛÍÁ[µR…V. C úxmsaRPzqsò INRP »R½„sVÎÏÁ##®µ…[aS¬sZNP[.

పార్వతీపరమేశ్వరులకు రత్నాలవంటి ఇద్దరు పుత్రులు. ఒకరు పిళ్ళైయార్‌. మరొకరు 'కుమరన్‌' కుమారస్వామి. కుమారస్వామి అంటే సుబ్రహ్మణ్యుడు. సుబ్బరాయుడు. అరవలు, 'కుమరన్‌ కడవళ్‌' అని ఈయనను వ్యవహరిస్తారు; గౌరవార్థకంగా 'కుమరనార్‌' అని పిలవటంనేదు. 'కుమరన్‌' అని సుబ్రహ్మణ్యునికి ఏకవచనమే. గౌరవమంతా జ్యేష్ఠరాజైన విఘ్నేశ్వరునికే. ఆయన ఒక్కడే పిళ్ళైయార్‌ !

అన్నిటికి మొదలేది? ఓంకారము. ప్రణవము. వినాయకుడు ప్రణవస్వరూపి. ప్రణవం పుట్టిన పిదపే సమస్త ప్రపంచమూ, జీవరాసులూ ఉద్భవించాయి. వినాయకుని గజముఖమూ, వక్రతుండమూ, ప్రణవాన్ని స్ఫురింపచేసేటట్లున్నవి. ఈ దేవుడు శిశువు కదా ఇతడేమి చేయగలడు? అని మనం భ్రమలో పడరాదు. అమాంతంగా మనలను తొండంతో పైకెత్తి కైలాస శిఖరంపైన కూచోపెట్టగల శక్తి, చాతుర్యం, మనస్సూ కలిగిన బిడ్డ - గణపతి. దీనికి అవ్వైయార్‌ ఉదాహరణ ఒకటే చాలు.

అవ్వైయార్‌ గొప్ప గణపతిభక్తురాలు. ఆమె 'వినాయక అహవల్‌' అనే ఒక యోగ శాస్త్రం వ్రాసింది. పరమశివభక్తుడైన సుందరమూర్తీ, చేరరాజూ, ఒకప్పుడు కైలాసానికి వెడుతూ అవ్వైయార్‌ను కూడా తమతోరమ్మన్నారు. ఆమె గణపతి పూజలో ఉంది. ''మీరు వెళ్ళండయ్యా, నాకు ఈ కరివదనుడే కైలాసం'' అని బదులు చెప్పిందట. దానితో వారు ఆగకుండా కైలాసోన్ముఖులయ్యారు. అవ్వైయార్‌ సాంగోపాంగంగా తన పూజ పూర్తిచేసింది. ఆమె పూజతో తుష్టిచెందిన వినాయకుడు తన తుండమును చాచి ఆమెను ఒక చిటుకలో కైలాస శిఖరాగ్రానికి చేరవేశాడు. ఆమె చేరిన ఎంతోసేపటికిగానీ సుందరమూర్తీ, చేరరాజూ, కైలాసం చేరుకోలేదు!

ఈ విషయాన్ని సుబ్రహ్మణ్య భక్తుడు, అరుణగిరినాథర్‌ తన 'తిరుప్పుగళ్‌' అనే గ్రంధంలో వర్ణించాడు. పుగళ్‌ - అంటే పొగడ్త, స్తోత్రం. సుబ్రహ్మణ్యుని స్తోత్రంలో, గణపతి చేసిన అద్భుత కార్యాన్ని వర్ణించి, అన్నదమ్ములకు ఒక సంబంధం ఆ భక్తుడు కల్పించాడు.

సర్వసాధారణంగా ఎక్కడబడితే అక్కడ కనపడే వినాయకుడు ఒక అసాధారణ దైవం. ఎంత కఠినమైన కార్యమైనా ఆయన అనాయాసంగా చేయగల దిట్ట. వినాయకుడు మన కోరికలనన్నీ తీర్చే కామధేనువూ, కల్పవృక్షమూ.

నితాంతకాంత దంతకాంతిమంత కాంతకాత్మజం

అచింత్యరూప మంతహీన మంతరాయకృంతనం

హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినాం

తమేక దంతమద్భుతం విచింతయామి సంతతమ్‌

2. వినాయకతత్త్వం

వినాయకుణ్ణిధారణచేసి మనం కొంచెం యోచిస్తే, ప్రతి చిన్న విషయంలోనూ ఆయనను గూర్చి మనకొక తత్త్వం నయన పర్వంగా దీపిస్తుంది. వినాయకునికి మనం కొబ్బరికాయలు కొడతాం. ఎందుకు? ఒకప్పుడు విఘ్నేశ్వరుడు తండ్రియైన పరమశివుని చూచి, 'నాకు నీతలను బలిగా ఇవ్వు' - అని అడిగాడట. తలను ఉత్తమాంగం అని అంటారు. మనకున్న వస్తువులలో పరమశ్రేష్టమైన వస్తువును త్యాగంచేసి అర్పిస్తేకదా అది భక్తి. ఈశ్వరుడు త్రయంబకుడు-మూడుకళ్ళవాడు. తన తలకు ఈడైన వస్తువు నొకటి ఈశ్వరుడు సృష్టించాడు. ఆ వస్తువే మూడుకళ్ళుకల కొబ్బరికాయ. ''వినాయకునికి మీరు కూడ మూడు కళ్ళ కొబ్బరికాయ కొట్టండి'' అని ఈశ్వరుడు అనుగ్రహించినట్లున్నది.

తమిళనాడులో కొబ్బరికాయ జుట్టును పూర్తిగా తీసివేసి ఒక్కవ్రేటులో పగిలేటట్లు కొట్టడం ఒక అలవాటు. దానిని వాళ్ళు - సిదిర్‌ టేంగాయ్‌ - అని వ్యవహరిస్తారు. ఒకప్పుడు నేను చాతుర్మాస్యదీక్షలో నాగపట్నంలో ఉన్నాను. అక్కడ వినాయకుని ముందు విస్తారంగా కొబ్బరికాయలు కొట్టేవారు. ఆలయం ముందు ఒకటేపిల్లల సందడి. కాయను కొట్టీ కొట్టక ముందే పిల్లవాండ్రు మూగి చెదిరే కొబ్బరిముక్కలకై పోట్లాడుకొనేవారు. కొందరు పెద్దలు వారిని గద్దించారు. ''కొబ్బరి ముక్కలను ఏరుకోవద్దని గద్దించడానికి మీకెవరు అధికారం ఇచ్చారు?,'' అని పిల్లలు తిరగబడ్డారు. ఔను; ఆ చిట్టిపిల్లలే సొంతం అని నాకు అనిపించింది.

కొబ్బరికాయను పగలగొడితే అందులోని నారికేళజలం లభించినట్లు అహంకారం అణగితే ఆత్మానుభూతి కల్గుతుంది.

గణపతిది స్థూలదేహం. ఆయన నామాలలో స్థూలకాయుడు అన్నదొకటి. ఆయన పర్వతంవలె వున్నాడు. కాని అతడేమో చిన్న బిడ్డ. బిడ్డలకు పుష్టియే ఆనందం. చిక్కిపోయిన శిశువూ, బొద్దుగా వున్న సన్యాసి ఒక విరోధాభాసం. వయసుముదిరే కొద్దీ ఉపవాసం వుండి శరీరాన్ని శుష్కింపచేయడం మంచిది. చిన్న బిడ్డలు ఉపవాసముండనక్కరలేదు.

గణపతి వాహనం ఎలుక. ఈయన ఎంత స్థూలకాయుడో, అది అంత సూక్ష్మమైనదేహం కలది. ఈయనకు వాహనం వలన వచ్చే గౌరవం ఏమీలేదు. స్థూలకాయుడైనా, తన వాహనానికి ఏ విధమైన శ్రమ ఉండరాదని, ఆయన లఘిమాసిద్ధితో బెండువలె తేలికగా వుంటాడు. అదొక విశేషం.

ఒక్కొక్క ప్రాణికి, ఒక్కొక్క విషయంలో ప్రీతి. చమరీమృగానికి తోక అంటే ప్రీతి. నెమలికి దాని పింఛమే బంగారం. ఏనుగుకు దంతాలంటే ప్రాణం. కానీ మన గణపతి మహాభారత రచనా సందర్భంలో తన ప్రాణప్రదమైన దంతాన్ని ఊడబెరికి, దానిని కలంగా చేసుకొని వ్యాసులవారు గంగా స్రవంతిలా భారతాన్ని కవనం చేస్తుంటే, పద్దెనిమిది పర్వాలు చకచకా వ్రాసి ముగించి వేశాడు.

''ఆనందాద్ద్యేన ఖల్విమాని భూతాని జాయంతే''. పార్వతీ పరమేశ్వరుల ఆనందార్ణవంలో నుంచి ఉద్భవించిన వీచికలాంటివాడు మన గణపతి. శ్రీదేవి సేనలను ప్రతిఘటించడానికి భండాసురుడు ఒక విఘ్నయంత్రాన్ని రణమధ్యంలో స్థాపించాడు. ఆ సమయంలో లలితాదేవి కామేశ్వరునిచూచి ఆనందంగా ఒకచిరునవ్వు నవ్వింది. ఆ హాసచంద్రికలనుంచి ఒక దేవుడు, మదజలాక్త కుంభ స్థలంతో గజాననుడై పుట్టాడు. ఆ దేవుడు ఇరువదెనిమిది అక్షరముల మంత్రానికి అధిపతి. భండాసురుని విఘ్నయంత్రాలను క్షణంలో భగ్నంచేసి తల్లికి ఎనలేని సహాయం చేశాడు.

ఏ కార్యం తలపెట్టినా మనం విఘ్నేశ్వరుని ముందు తృప్తిపరచాలి. ఆయన అనుగ్రహం వుంటే, అన్నీ అనుకూలంగా సమాస్తమౌతాయి. అన్నిటికీ ఆదిదైవం ఆయనే. గణపతినే ప్రధానమూర్తిగా ఉపాసించేవారిని గాణాపత్యులని అంటారు.

వినాయకుని ముందు మనం గుంజిళ్ళు తీస్తాం. సంస్కృతంలో దానిని 'దోర్భిఃకర్ణమని అంటారు. దోర్భిః అంటే చేతులు. కర్ణమంటే చెవులు. దోర్భిఃకర్ణమంటే చేతులతో చెవులను పట్టుకొని గుంజిళ్ళుతీయటం. ఒకప్పుడు మహావిష్ణువు వైకుంఠం నుండి కైలాసానికి వెళ్ళారట. అక్కడ మేనల్లుడైన గణపతి కనపడి ఆయన సుదర్శన చక్రాన్ని లాక్కొని ఎంత వేడినా తిరిగి ఇవ్వలేదట. మహావిష్ణువుకు ఏమిచేయడానికీ తోచక తన రెండు చెవులనూ, నాలుగు చేతులతో పట్టుకొని గుంజిళ్ళు తీశారట. ఈ విచిత్ర చర్యకు వినాయకుడు దొర్లిదొర్లి నవ్వాడట. చిన్నబిడ్డ కదా! సుదర్శన చక్రం విషయం మఱచిపోయాడు! అంతటితో అమ్మయ్యా అని చక్రంతో బాటు విష్ణువు బయటపడ్డారట.

ఏ కార్యమైనా అవిఘ్నంగా జరగాలంటే విఘ్నేశ్వరుని అనుగ్రహం అక్షయంగా వుండాలి. అందుకే ఆయనకు 'యం నత్వాకృతకృత్యాశు తం నమామిగజాననం' అన్న ప్రశస్తి.

Sanathana Dharmamu    Chapters    Last Page