Sri Jayendravani    Chapters    Last Page

20. దుర్గారాధన

శ్లో|| ''సర్వ స్వరూపే సర్వేశీ సర్వశక్తి సమన్వితే,

భ##యే భ్యాస్త్రాహి నో దేవి దుర్గే దేవి నమోస్తుతే ||''

ª«sVƒ«s úFyÀdÁƒ«s ª«sV»y¬sõ @ƒ«sVxqsLjiLiÀÁ xmsLRiª«sW»R½øNRPV lLiLi²R…V xqsöxtísQ\®ªsVƒ«s LRiWFyÌÁVƒyõLiVV. A¸R…V¬sõ A lLiLi²R…V LRiWFyÍýÜ[ƒ«sW ALSµ³j…Li¿RÁª«s¿RÁVè. INRPÉÓÁ xqsLRi*ªyùzmsò, ¬sLSNSLRi, ¬sLæRiVßáLRiWxmsLi, lLiLi²R…ª«sµj… xqsgRiVßá, ryNSLRi, ƒyª«sVLRiWxmsxqsz¤¦¦¦»R½ LRiWxmsLi.

సాకార రూపంలో పరమాత్ముడు శివుడు, గణశుడు, సుబ్రహ్మణ్య, కార్తికేయ, పార్వతి, కలి, విష్ణువు మొదలైన అనేక స్వరూపాల్ని స్వీకరించాడు. ఈ విధంగా ఈశ్వరునకు వివిధములైన దేవతాస్వరూపాలున్నాయి. ఇలా ఎన్ని విస్పష్టమైన ఆకృతలను దాల్చినా పరమాత్మ ఒక్కడే.

విఘ్నాలు నివృత్తి చేసికోటానికి గణశుని కొలుస్తాం. అలాగే మోక్షప్రాప్తి కొరకు శివుణ్ణి, సంపదకొరకు లక్ష్మీదేవిని, మరికొన్ని అవసరాలకు ఇతర దేవతలను ఆరాధిస్తాం. దుర్గను ఆరాధించి ఆమెకు ప్రార్థనలు సమర్పిస్తే మానవుల హృదయాల్లోని భయాలు పటాపంచలౌతాయి.

మానవుడు తాను ఏదైనా కార్యాన్ని నిర్వహించే సమయంలో అతని మనస్సులో ఏదో భయం తొణికిసలాడుతుంది. విద్యార్థి విషయంలో పరీక్షలో తప్పుతానేమోననే భయం, వ్యాపారస్థునికి నష్టం వస్తుందేమోననే భయం, ఉద్యోగికి ప్రమోషనును గురించిన భయం - ఇలా అందరూ వారి వారికి సంబంధించిన భయాల్తో వుంటారు. భయం ఏరకందైనా దుర్గామాతను ఆరాధించటంవల్ల దాన్ని నివృత్తి చేసుకోవచ్చు. ఆమె అనుగ్రహంతో భయాన్ని గురించిన ఆలోచనే మాయమౌతుంది.

కనుక మనకు స్వయంగా తల్లియైన, మనకే కాదు మొత్తం లోకానికే లోకమాతయైన, అంబికామాతను మనమందరం ఆరాధిద్దాం. తమతమ భయాల్ని దూరం చేసుకోటానికి అందరూ దుర్గను ప్రార్థించాలి.

న్యూఢిల్లీలోని రామక్రిష్ణాపురంలో వున్న కాళిబారి ఆలయం మాత కృపవల్ల గొప్ప ప్రతిష్ఠాత్మకమైన గుడిగా మారాలి. సకల శుభాలు, శ్రేయస్సులు ప్రజానీకానికి లభించుగాక !

Sri Jayendravani    Chapters    Last Page