Sruthi Sourabham    Chapters    Last Page

5. యజుర్వేదంలో ఎక్కాలు

శ్రీకృష్ణ యజుర్వేదంలో అశ్వమేధ ప్రకరణంలో 7వ అష్టకంలో 2వ ప్రపాఠకంలో 11వ అనువాకం నుండి పది అనువాకాలలో సంఖ్యేయ వాచక పదాలతో హోమ మంత్రాలున్నాయి. వీటిలో విశిష్ట పద్ధతిలో గణిత శాస్త్రంలోని ఎక్కాలు కనబడతాయి. వీటిలో బేసి అంకెల మంత్రాలతో ఆజ్యహోమాలు, సరి అంకెల మంత్రాలతో అన్నహోమాలు చేయాలి. తేనె, బియ్యం, అటుకులు, పేలాలు, కరంబాలు, ధానాలు (వేపుడు బియ్యం) పేలపిండి మసూస్యాలు ప్రియఙ్గు (కొఱ్ఱలు) తండులాలు హోమం చేస్తారు.

మొదట 11వ అనువాకంలో 'ఏకసై#్మ స్వాహా ద్వాభ్యాగ్‌ం స్వాహా త్రిభ్య స్వాహా' అని వరుసగా 19 సంఖ్యేయాల వరకు చెప్పి 29, 39, 49, 59, 69, 79, 89, 99, 100 సర్వం అనే సంఖ్యేయాలు స్వాహాంతంగా పేర్కొనబడ్డాయి. (తైత్తిరీయ సంహిత - 7 అ - 2 ప్రపా - 11 అనువాకాలు). సంస్కృతంలో ఏకాన్నచత్వారింశత్‌=39, నవ చత్వారింశత్‌=49 అనే రెండు వ్యవహారాలున్నాయి. అంటే ఒకటి తక్కువ ముపై#్ఫ, ఇరవై తొమ్మిది అనే రెండు రకాలుగా వ్యవహరించవచ్చునన్నమాట. 'ఏకోన వింశతిః' వంటి రీతిలో ఇప్పుడు గూడా వ్యవహరిస్తున్నాం. ఏకాన్న వింశతిః, ఏకోన వింశతిః అనే రెండు పదాలకు అర్థం ఒకటైనా పద నిర్మాణంలో తేడా ఉంది. ఏక+ఊన వింశతి=ఏకోనవింశతిః, ఏకాత్‌+న వింశతిః=ఏకాన్నవింశతిః, ఈ అనువాకంలో సరి, బేసి సంఖ్యేయాల పదాలు పేర్కొనబడ్డాయి.

సంఖ్యా వాచకం సంఖ్యను, సంఖ్యా విశిష్టమయిన వస్తువును గూడా తెల్పుతుంది. అశ్వమేధ ప్రకరణానుగుణంగా ఏకవాచకం ప్రజాపతిని తెలుపుతుందని బ్రాహ్మణం చెబుతోంది. ''ఏకసై#్మ స్వాహేత్యాహ. ప్రజాపతి ర్వా ఏకః తమేవాప్నోతి'' ఏకరూపుడైన ప్రజాపతికి ఆ ఆహుతి సమర్పించబడిందన్నమాట. ఇలాగే రెండు మొదలయిన సంఖ్యా విశిష్ట వస్తువులు గూడా సర్మాత్ముడయిన ప్రజాపతిలో అంతర్భాగాలు కనుక వాని నుద్దేశించి 'ద్వాభ్యాగ్‌ం స్వాహా' మొదలయిన సంఖ్యేయ మంత్రాలతో హోమం చేయాలని సాయణాచార్యుల వారు తెల్పారు.

'వేదే వేదే పఞ్చకల్పా భవంతి' అని ఋషి వాక్యం. ఆ కల్పాలేవో పరిశోధించాలి. వేదంలో గణిత విద్య ఉందని శ్రీ దయానంద స్వామివారు తెలిపారు.

వేద గణితం అనే గ్రంథాన్ని జగద్గురు శ్రీ భారతీ కృష్ణతీర్థస్వామివారు వ్రాశారు. అది లండన్‌లో కూడా అధ్యాపనం చెయ్యబడుతోంది. కనుక కొన్ని వేదమంత్రాలకు గణితపరమయిన అర్థం ఉండే అవకాశం ఉంది. అంటే గణిత శాస్త్రానుగుణంగా ఈ మంత్రాలను వ్యాఖ్యానించవచ్చు. వీటిని కేవలం సంఖ్యేయ వాచకాలుగా మాత్రమే కాక సంఖ్యావాచకాలుగా గూడా పరిగణించవచ్చని 'చతుస్సంఖ్యామారభ్య చతురుత్తరాణాం సమసంఖ్యానాం సంఘమాహ' (నాల్గవ సంఖ్య మొదలుకొని ఆపైన ఉన్న సమ సంఖ్యల సంఘాన్ని చెప్పారు.) అని శ్రీ సాయణాచార్యుల వాక్యం తెలుపుతోంది. (7 కాండ. 2 ప్రపా. 15 అనువాక భాష్యం).

12 వ అనువాకంలో 'ఏకసై#్మ స్వాహా త్రిభ్య స్వాహా పఞ్చభ్య స్వాహా....' అని బేసి సంఖ్యేయాలు 19 వరకు పేర్కొని తరువాత పూర్వం లాగే 29, 39, 49, 59, 69, 79, 89, 99, 100 సర్వం అనే సంఖ్యేయాలు పేర్కొన బడ్డాయి. బేసి కాకపోయినా శతాన్ని పేర్కొనడం విశేషం.

13 వ అనువాకంలో 'ద్వాభ్యాగ్‌ం స్వాహా చతుర్భ్య స్వాహా' అని 2, 4, 6, 8, 10,12, 14, 16, 18, 20 ... 98, 100 సర్వం అనే సంఖ్యలు పేర్కొన బడ్డాయి. 2 నుండి 2 కలుపుకుంటూ లెక్కిస్తూంటే 2వ ఎక్కం యొక్క 3వ నిలువు పంక్తి వస్తుంది. ఇపుడు అడ్డం 20 పంక్తుల వరకే ఎక్కాలు వ్రాస్తున్నాం. ఈ మంత్ర భాగంలో 20 వరకు స్పష్టంగా పేర్కొని మధ్య భాగం ఇలాగే చేసుకోండనే సూచనతో 100 వరకు ఆ ఎక్కాన్ని సూచించడం విశేషం. శతం తరువాత సర్వవాచకం పేర్కొనడం వల్ల శతాది సంఖ్యలను అనంత వాచకాలుగా నిఘంటువులు పేర్కొనడం జరిగి ఉండవచ్చు.

14 వ అనువాకంలో త్రిభ్య, స్వాహా, పఞ్చభ్య స్వాహా అని మొదలుపెట్టి 3, 5, 7, 9, 11, 13, 15, 17, 19, వరకు పేర్కొని, తరువాత 29, 39, 49, 59, 69, 79, 89, 99, 100 సర్వం పేర్కొన్నారు.

15 వ అనువాకంలో'చతుర్భ్య స్స్వాహాష్టాభ్య స్వాహా' అని ప్రారంభించి 4, 8, 12, 16, 20 .... 96, 100 సర్వం అనే సంఖ్యేయాలు పేర్కొన్నారు. అంటే 4 ను కలుపుతూ 24, 28, 32 మొదలయినవి 92 వరకు ఏర్పరచుకోవాలన్నమాట. ఇవి 4వ ఎక్కానికి 3వ నిలువు పంక్తి.

16 వ అనువాకంలో 'పఞ్చభ్య స్వాహా దశభ్య స్వాహా...' అని ఆరంభించి 5, 10, 15, 20, .... 95, 100 సర్వం అనే సంఖ్యలను పేర్కొన్నారు. ఇక్కడ గూడా 20 నుండి 5 కలుపుకుంటూ 90 వరకు సంఖ్యల నేర్పరచుకోవాలన్నమాట. ఇది 5 వ ఎక్కానికి సరిగా 3వ నిలువు పంక్తి.

17 వ అనువాకంలో 'దశభ్యః స్వాహావిగ్‌ంశ##త్యై స్వాహా ....' అని ఆరంభించి 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100 సర్వం పేర్కొన్నారు. నేటి 10వ ఎక్కానికి 3 వ పంక్తి సగం వరకు దీనిలో ఇవ్వడం జరిగిందన్నమాట.

18 వ అనువాకంలో 'విగ్‌ం శ##త్యై స్వాహా... ' అని మొదలుపెట్టి 20, 40, 60, 80, 100 సర్వం పేర్కొనడం జరిగింది. ఇది 20 వ ఎక్కానికి మూడవ పంక్తి కాని 4వ వంతు మాత్రమే ఇచ్చారు.

19 వ అనువాకంలో 'పఞ్చాశ##తే స్వాహా' అని ఆరంభించి 50, 100, 200, 300, 400, 500, 600, 700, 800, 900, 1000 సర్వము పేర్కొనడం జరిగింది. దీనిలో మొదటి 50 తప్పిస్తే నూరవ ఎక్కానికి 3వ నిలువు పంక్తి సగం ఇచ్చారన్న మాట.

20 వ అనువాకంలో 'శతాయ స్వాహా, సహస్రాయ స్వాహా' అని ఆరంభించి శతం (100) సహస్రం (1000) అయుతం (10000) నియుతం (లక్ష) ప్రయుతం (10 లక్షలు) అర్బుదం (కోటి) న్యర్బుదం (10 కోట్లు) సముద్రం (100 కోట్లు) అంతం (10 వేల కోట్లు) అనే సంఖ్యలు పేర్కొనబడ్డాయి.

బ్రహ్మ ఆయువుకు పరమని జ్యోతిశ్శాస్త్ర వ్యవహారం. పరములో అర్థం=సగం పరార్ధం - అంటే పరము=2 లక్షల కోట్లు అని అర్థం వస్తుంది. సాయణాచార్యుల వారు 'పరార్ధం బ్రహ్మణః ఆయుష్యార్ధస్య ఆవృత్తానాం మానుష సంవత్సరాణాం అవధిభూతా చరమ సంఖ్యా. పరార్ధస్యద్వైగుణ్య సతి పరార్ధ ద్వయ మిత్యేవ వ్యవహరన్తి. (పరార్ధం బ్రహ్మ ఆయుర్దాయంలో సగం. ఇది ఆవృత్తిని పొందే మానవ సంఖ్యా వాచకాలకు హద్దైన చివరి సంఖ్య రెండు పదార్ధాలను పరార్ధ ద్వయమనే వ్యవహరిస్తారు.) అని చెప్పారు. (పై గ్రంథ భాష్యం)

వేదంలో ఎక్కాలలోని మూడవ నిలువు పంక్తి 20 సంఖ్య వచ్చే వరకు ఇవ్వగా వాడుకలో 20 పంక్తులు ఒక ఎక్కంగా గుర్తించారు. వేదంలో ఇరవైకి వందకు నడుమ ఉన్న సంఖ్యలను క్ల్‌ప్తి చేశారు. కాని వాడుకలో 20 పంక్తులు ఎక్కంగా నియతం చేయడం వల్ల చిన్న ఎక్కాలలో 100 లోపు సంఖ్యలు, పెద్ద ఎక్కాలలో 100 కి మించిన సంఖ్యలు గూడా వస్తాయి. ఉదా :- 4 వ ఎక్కం 80 తో సమాప్తమయితే 6 వ ఎక్కం 120 తో సమాప్తమవుతుంది. 5 వ ఎక్కం మాత్రం వేదంలో లోకంలో సమానంగా ఉంటుంది.

ఈ ఎక్కాల సంప్రదాయం ప్రాకృతంలో గూడా ఉంది.

'ఎక్కస వర్గో ఎక్కా, బియ్య సవర్గోచారి' అని ప్రాకృతంలో ఉండేదని తెలుస్తోంది. (సమగ్రాంధ్ర సాహిత్యం - 1 సం. 143 పుట) అదే వాడుకలో ఉన్నందువల్ల ప్రాచీన భారతీయుల సంస్కృతి కొంత అవగత మవుతుంది. సామాన్యులకు లక్ష కోట్ల అవసరం కాదు గదా!

అయితే తరువాత వాడుకలో ఇంకా సంఖ్యావాచకాలవసరం కావడం వల్ల కోటికి పరార్ధానికి నడుమ మఱికొన్ని సంఖ్యలు చేరాయి. దీనివల్ల సంస్కృతంలో సంఖ్యావాచక విస్తృతి చాలా అధికమయింది. శ్రీమద్రామాయణం, మహాభారతం, వాచస్పత్యం మొదలయిన నిఘంటువులు అనేక సంఖ్యావాచకాలను పేర్కొన్నాయి. శ్రీమద్రామాయణంలో అర్బుదం, న్యర్యుదం, శంఖం, మహాశంఖం, బృందం, మహాబృందం, పద్మం, మహాపద్మం, ఖర్వం, మహాఖర్వం, సముద్రం, ఓఘం, మహౌఘం అనే సంఖ్యా వాచకాలు లభిస్తాయి. 1 కి ప్రక్కన 60 సున్నలు చేరిస్తే మహౌఘ మవుతుంది. (శ్రీమద్రామాయణం - యుద్ధకాండ 28 సర్గ). ఇలా తరువాత ఏర్పడిన సంఖ్యా వాచక విస్తృతికి శ్రీ కృష్ణయజుర్వేదం దారి చూపిందని చెప్పవచ్చు.

Sruthi Sourabham    Chapters    Last Page