Page load depends on your network speed. Thank you for your patience.

Loading...

Brahma Suthra Vivruthi    Chapters    Last Page

బ్రహ్మసూత్ర వివృతిః

(బ్రహ్మసూత్రార్థ వివరణ సహితా)

ఉత్తరార్ధము

(తృతీయ - చతుర్థాధ్యాయములు)

తృతీయాధ్యాయే (సాధానాధ్యాయే)

--ప్రథమః పాదః--

బ్రహ్మసూత్ర వివృతిః

ద్వితీయే అధ్యాయే వేద్రాన్తైః ప్రతిపాదితే బ్రహ్మదర్శనే శ్రుతిస్మృతిన్యాయవిరోధోనూద్య పరిహృతః. సాంఖ్యాదిపరపక్షణాం న్యాయాభాసమూలత్వ మతఏ వానపేక్షత్వ మిత్యుపపాదితం - అథేదానీం సమ్యగ్‌ దర్శనాయ సాధనవిచారోస్మి న్నధ్యాయే క్రియతే - ప్రసంగాగతం కిమప్యన్య చ్చ నిరూప్యతే.

తదన్తర ప్రతిపత్త్యధి కరణమే 1

1. సూ: తదంతరప్రతిపత్తౌ రంహతి సంపరిష్వక్తః

ప్రశ్ననిరు%ూపణాభ్యాం

వివృతిః :- పూర్వాధ్యాయానేత జీవోపకరణ భూతభౌతికానాం జన్మనిరూపితం - అత్తరాధ్యాయే ప్రథమాధికరణణ తదువహితన్య జీవస్య సంసారప్రకాం వైరాగ్యార్థం నిరూపయితుం దేహాంతరారంభే భూతసూక్ష్మాసంపరిష్వక్తసై#్యవ జీవస్య వా పరలోకమనం, తత్పంపరిష్వక్తన్య వా - ఇత్యేత ద్విచార్యతే - తదంతరప్రతివత్తౌ = దేహన్తరప్రతివత్తౌ = దేహంతరగ్రహణాయ గచ్చన్‌ జీవః సంవరిష్వక్తః = దేహాబీజైస్సర్వై ర్భూతసూక్ష్మైః పరివేష్టిత ఏవ - రంహతి = గచ్ఛతి - నతుతదపరివేష్టితః -కస్మాత్‌ ప్రశ్ననిరూపణాభ్యాం = పంచాగ్నివిద్యాయాం '' వేత్థ యథా పంచమ్యా మాహుతా వాపః పురుషవసో భవన్తి'' - ఇతి ప్రశ్నః - ద్యువర్జన్య వృథివీ పురుష యోషిత్సు పంచ స్వగ్నిషు శ్రద్దాసోమ వృష్ట్యన్న రేతోరూపాః పంచాహుతీ ర్దర్శయిత్వా ''ఇతి తు పంచమ్యా మాహుతా వావః పురుషవచసో భవన్తి'' ఇతి - నిరూపవణం = ప్రతి వచనం - తాభ్యాం ప్రవాహణన రాజ్ఞా ప్రదర్శితాభ్యాం అపాం పురుషాకార పరిణామద్యోతకాభ్యాం ప్రశ్నప్రతివచనాభ్యాం తథావగమాత్‌ -

వివరణము:- ద్వితీయాధ్యాయమునందు వేదాన్త వాక్యములచే ప్రతిపాదింపబడినబ్రహ్మ (అద్వితీయాత్మ) దర్శనమునందు ద్వైతవాదులచే ఆరోపింపబడుశ్రుతిస్మృతిన్యాయవిరోధము లనువదించిపరిహరింపబడినవి. మరియు సాంఖ్యాది పరపక్షములు న్యాయసమ్మతములు కావనియు న్యాయాభాసమూలకములే అనియు కాననే అవి ముముక్షువుల కపేక్షణీయములుకావనియు ప్రతిపాదింపబడినది ఇక నీ అధ్యాయములో సమ్యగ్‌ జ్ఞానోత్పత్త్యర్థము త్త్సాధనసంబంధి విచారము చేయబడుచున్నది. ప్రసంగాగతములగు కొన్ని యితర విషయములును నిచట నిరూపింపబడుచున్నవి.

పూర్వాధ్యాయాన్తము నందు జీవోపకరణములగు భూత భౌతిక పదార్థములయొక్క ఉత్పత్తి నిరూపించబడినది. ఈ అధ్యాయమునందలి ప్రథమాధికరణమున ఆ ప్రాణాద్యుప కరణములతో గూడియున్న జీవునియొక్క సంసార ప్రకారమును వైరాగ్యోత్పాదనముకొఱకు నిరూపింపదలచి దేహాంత రారంభమునందు భూతసూక్ష్మములతో గూడి కొనియున్న జీవునకా పరలోకగమనము - లేక భూతసూక్ష్మములతో గూడికొనక యున్నవానికా అను నీయంశము విచారింపబడగలదు.

దేహాంతరమును గ్రహించుటకై ప్రయాణించుచు జీవుడు ఆ దేహమునకు బీజములైన భూతసూక్ష్మములతో పరివేష్టించబడిన వాడగుచునే (కూడుకొని యున్నవాడగుచునే) ప్రయాణించుచున్నాడు కాని ఆ భూత యనగా ప్రశ్ననిరూపవణముల వలన నని సమాధానము - నిరూపణ మన సమాధానము - పంచాగ్ని విద్వాయప్రకరణములో ''వేత్థ యథా పంచమ్యా మాహుతా వాపః పురుషవచసో భవన్తి'' అని ప్రశ్న - దానికి సమాధానముగా ద్యు - వర్జన్య - పృథివీ - పురుష - యోషిత్తులను ఐదు అగ్నులయందు శ్రద్ధా - సోమ - వృష్టి - అన్న - రేతోరూపములగు ఐదు ఆహుతలను ప్రదర్శించి యిట్లు సమాధానము చెప్పబడెను. ''ఇతి తు పంచమ్యా మాహుతా వావః పురుషవచసో భవన్తి'' అని - ఇట్లు ప్రవాహణుడను రాజుచే ప్రదర్శింపబడిన ప్రశ్న ప్రతివచనములను బట్టి ఆ విధముగా నిర్ణయము చేయబడుచున్నది.

[ద్యులోకము (స్వర్గలోకము) వర్జన్యము (మేఘము) పృథివి (భూమి) పురుషుడు, స్త్రీ యను నీ ఐదు పదార్థములను ఉపాసనకొరకు అగ్నులనుగా కల్పించి యీ పంచాగ్ని విద్యాప్రకరణములో వర్ణించుచున్నారు. దేహబీజ భూతములగు భూతసూక్షములు ''ఆపః'' అని చెప్పబడుచున్నవి. ఆ అగ్నులయందు ఇష్టాపూర్తాదిరూప పుణ్యకార్యముల నాచరించి స్వర్గమునుగూర్చి వెళ్ళుచు అచటినుండి తిరిగి భూలోకమునకు వచ్చుచునున్న పుణ్యజీవుడు ఆహుతి రూపముగా చెప్పబడుచున్నాడు. ఐదు అగ్నులయందు హోమము చేయబడినవి యగుచు ఐదవ ఆహుతి చేయబడగా ఎట్లు ఆ అప్పులు (ఉదకములు-జీవయుక్త దేహబీజభూతభూతసూక్ష్మములు) పురుషాకార పరిణామమును పొంది పురుషశబ్ద వాచ్యములగుచున్నవో నీకు తెలియునా అని ప్రశ్నవాక్యముయొక్క అర్థము.

పుణ్యకారియగు జీవు డీలోకముననుండి శ్రద్ధతో అగ్నిహోత్రమునందు దధ్యాజ్యాదిరూప ద్రవ్యములను హోమము చేయును. ఆ ద్రవ్యములు. అప్పులై యజమానుని పరివేష్టించి దేహాంతరారంభ కాలమునద్యులోకమును చేరును. ఇది శ్రద్ధా అను ద్రవ్యముతో ద్యులోకస్థానరూపాగ్నియందు అప్పులచే పరివేష్ఠింపబడిన జీవుడు ఆహుతి చేయబడినట్లు శ్రుతిలో వర్ణింపబడినది. ఇది ప్రథమాహుతి ఇట్లే ఆహుత్యంతరములను గూడ గుర్తింపవలయును. ఆ స్వర్గమును నవి సోమరూపమున (దేవతా దేహరూపమున) నుండి పుణ్యకర్మ క్షీణించగా కరిగిపోయినవియగుచు వర్జన్యమును చేరును. ఇది ద్వితీయాహుతి - అటునుండి వృష్టిరూపముగ వృథివికి చేరును. ఇది మూడవ అహుతి. పృథివియందవి అన్నరూపములై పురుషునియందు చేరును. ఇది నాల్గవ ఆహుతి. అట నవిరేతోరూపములై స్త్రీవ్యక్తిని జేరును. ఇది ఐదవ ఆహుతి. ఇచట నవిపురుషాకార పరిణామమునందు పురుషశబ్ధ వాచ్యము లగుచున్నవి. అది సమాధాన గ్రంథసారాంశము.] ఇట్టి ప్రశ్న ప్రతివచన గ్రంథములను బట్టి జీవుడు భూతసూక్ష్మ పరివేష్టితుడగుచునే దేహాంతర గ్రహణము కొరకు ప్రయాణించుచున్నాడని స్పష్టముగా నవగతమగుచున్నది.

2. సూ : త్ర్యాత్మకత్వాత్తు భూయస్త్వాత్‌

పూర్వోదాహృతశ్రుతౌ ''ఆవః పురుషవచసో భవన్తి'' ఇత్యత్రాప్‌శబ్దశ్రవణాత్‌ అద్భిః సంపరిష్వక్తో గచ్ఛతీ త్యేవావగమ్యతే - కుతఏవముచ్యతే సర్వైః భూతసూక్ష్మైర్గచ్ఛతీ త్యాకాంక్షయా ముచ్యతే - త్ర్యాత్మకత్వాత్‌ - తు = ''తాసాం త్రివృతం త్రివృత మేకైకా మకరోత్‌'' ఇత్యాది శ్రుతేః - అపాం త్ర్యాత్మకత్వాత్‌ = తేజోబన్నాత్మకత్వావగమాత్‌, ప్రశ్నప్రతివచనగతే నావ్ఛబ్దేన సర్వాణ్యపి భూతసూక్ష్మాణి గృహన్తే - భూయస్త్వాత్‌ = భూతాంతరసంయోగే సత్యపి దేహబీజే ష్వపాం బాహుళ్వాదప్శబ్దేన సర్వేషాం భూతసూక్ష్మాణాం వివక్షా న విరుద్ధా. అతస్వర్వభూతసూక్ష్మ సంపరిష్వంగో జీవస్య శుత్యుక్త ఏవేత్యవగన్తవ్యః.

వివరణము:. ''ఆవః పురుషవచసో....''అను శ్రుతిలో 'అప్‌' శబ్దము వాడబడినది. 'అప్‌' శబ్దమునకు ఉదక మను ఒక్కభూతమే అర్థమైయుండ ఆ శ్రుతినిబట్టి సర్వభూత సూక్ష్మములతో జీవుడు పరివేష్టితుడై ప్రయాణించునని చెప్పుట యెట్లు యుక్తమగును అను ఆశంక కలుగగా చెప్పుచున్నారు--''తాసాం త్రివ్యతం...మకరోత్‌'' అను శ్రుతిలో త్రివృత్కరణము చెప్పబడినది గాన 'అప్‌' శబ్దముచేత తేజోబన్నము లన్నియు చెప్పబడినవి యని గ్రహింపదగును. ఉదకములయందు తేజ ఆదిభూతాంతర సంబంధమున్నను దేహారంభక బీజములయందు అప్పులకు (ఉదకములకు) బాహుళ్యము కలదు గాన అట్టి 'అప్‌' శబ్దముచేత నిచట సమస్తములగు దేహారంభక భూతసూక్ష్మములు వర్ణింపబడుచున్నవనియు కాననే సర్వభూతసూక్ష్మ పరివేష్టితత్వము జీవునకు శ్రుతియందు వర్ణింపబడిన దనియు తెలియదగును.

3. సూ : ప్రాణగతేశ్చ

వివృతిః :- ప్రాణగతేః- చ=''త ముత్ర్కాంతంత ప్రాణోసూత్ర్కా మతి'' ఇత్యాది శ్రుత్యా జీవేనసహ ప్రాణానా మపి గతిశ్రవణాత్‌ - తతస్తదాశ్రయాణాం భూతసూక్ష్మాణాం గతి రనుమీయతే - నహి నిరాశ్రయాః ప్రాణాః క్వచిద్గచ్ఛన్తి, తిష్ఠన్తి వా-

వివరణము :- ''త ముత్ర్కామస్తం ప్రాణోసూత్ర్కామతి''అను నీ శ్రుతియందు జీవు డుత్ర్కాంతి పొందుచుండ (దేహమును విడనాడి పోవుచుండ) అతని ననుసరించి ప్రాణములును ఉత్ర్కమించును అని ప్రాణములకు గమనము వర్ణింపబడి యుండుటచేత ఆ ప్రాణముల కాశ్రయములగు భూతసూక్ష్మములకును గమనము ఊహింపబడుచున్నది. ప్రాణములు ఏదో ఒక ఆశ్రయములేక ఒకచోట నిలబడుట గాని ఒక చోటికి ప్రయాణించుట గాని సంభవించదు గదా !

4. సూ : అగ్న్యాదిగతిశ్రుతే రితి చేన్న భాక్తత్వాత్‌.

వివృతిః :- దేహాంతరప్రతివత్తౌ ఇంద్రియాణాం జీవేన సహ గమనమస్తి నవేతి విచార్యతే - అగ్న్యాదిగతిశ్రుతేః = ''యత్రాస్య పురుషస్యమృత స్యాగ్నిం వాగప్యేతి '' ఇత్యాది శ్రుతౌ మరణవేళాయాం ప్రాణానామగ్న్యాదిదేవేషు గమనస్య శ్రవణా న్న ప్రాణాః = వాగాదీంద్రియాణి జీవేన సహ గచ్ఛన్తి - ఇతి - చేత్‌ = ఇతి యద్యుచ్యేత - న = తన్నోపపద్యతే - కుతః? భాక్తత్వాత్‌ = ''అగ్నిం వాగప్యేతి'' ఇత్యేతాదృశశ్రుతే రగ్న్యాదిదేవానాం వాగాద్యుపకారకాణాం మరణకాలే తదుపకారనివృత్తి మపేక్ష్య ప్రవృత్తత్వేన ఔపచారికత్వాత్‌ = గౌణత్వాత్‌. తస్మిన్నేవ ప్రకరణ ''ఏషధీర్లో మాని - వనస్పతీన్‌ కేశాః'' ఇత్యాది శ్రుత్యాలోమకేశానాం ఓషధీ వనస్పతి గమన ప్రతిపాదనం యత్కృతం తన్యప్రత్యక్షవిరోధే నాముఖ్యత్వం=ఔపచారికత్వ మవశ్య మభ్యుపగస్తవ్యం-తత్సహపాఠా దగ్న్యాది గమన ప్రతిపాదన మపి ఔపచారిక మేవేతి గమ్యతే - తస్మా దింద్రియాణి జీవేన సహ గచ్ఛన్తీతి సిద్ధమ్‌.

వివరణము :- దేహాంతరారంభ సమయమున ఇంద్రియములకు జీవాత్మతో కలిసి గమనము కలదా? అని విచారణ చేయబడుచున్నది.-- ''యత్రాస్య....వాగ ప్యేతి'' అను నీ శ్రుతి మరణవేళయందు వాగాదీంద్రియరూప ప్రాణములు తదభిమాని దేవతలగు అగ్న్యాదులను చేరునని వర్ణింపబడియున్నది గనుక నాప్రాణములు జీవునితోకలసి వెడలుట లేదని చెప్పవలయును అని యనుట యుక్తముకాదు. ఏలయన? ఆ ''అగ్నిం వాగప్యేతి'' అగ్నిదేవుని వాగింద్రియము చేరునని యిట్లువర్ణించు శ్రుతులు మరణకాలమున అగ్న్యాదులగు దేవతలు ఇంద్రియములకు చేయుచున్న ఉపకారము నివర్తించునని చెప్పుటకే ప్రవృత్తము లగు లగుచున్నవి. కాన నవి గౌణములు - ముఖ్యార్థబోధకములు కావని తెలిసికొనవలయును. ఇదే ప్రకరణములోని పై వాక్యము లిట్లున్నవి. ''ఓషధీ ర్లోమాని''- ''వనస్పతీన్‌ కేశాః'' రోమములు ఓషధులను - కేశములు వనప్పతులను చేరునని వర్ణించు ఈశ్రుతులు గౌణములనియనకతప్పదు. కేశరోమములు ఓషధి వనస్పతుల చేరుననుట ప్రత్యక్షవిరుద్ధము కనుక. ఇట్టి శ్రుతులతో సహ పఠింపబడిన వెనుకటి ''అగ్నిం వాగప్యేతి'' శ్రుతులును ఔపచారికములే = గౌణములే యనిస్పష్టపడుచున్నది. కాన ఇంద్రియములు జీవునితో కలసి పయనించుచున్న వని యనుట యుక్తమే.

5. సూ : ప్రథమేశ్రవణాదితి చేన్న తా ఏవ హ్యుపపత్తేః

వివృతిః :- ప్రథమే = ''తస్మి న్నేతస్మి న్నగ్నౌ దేవాః శ్రద్ధాంజుహ్వతి'' ఇతి ద్యులోకాదిషు పంచ స్వగ్నిషు ప్రథమే ద్యులోకాఖ్యే శ్రద్ధాయాః హోమ్యద్రవ్యత్వ వర్ణనేన అశ్రవణాత్‌ = అపాం అశ్రవణాత్‌ (అశ్రుతత్వాత్‌) తాసా మపాం పంచమ్యా మాహుతౌ పురుషాకారత్వోక్తిరయుక్తా ఇతి- చేత్‌ = ఇత్యుచ్యతే చేత్‌ - న= న తథా వక్తుం శక్యతే- కుత ఇత్యుక్తౌ? తాః- ఏవ - హి= యస్మాత్‌ తత్రాపి శ్రద్ధాశ##బ్దేన తా ఆప ఏవోచ్యంతే- కథమేవ మవగమ్యత ఇతిచేత్‌ ఉపపత్తేః= తథాత్వాంగీకారే ఏవప్రశ్న ప్రతివచనయో రేకవాక్యత్వ స్యోపపద్యమానత్వాత్‌ - శ్రద్ధా శ##బ్దేనాత్రాపా మవివక్షితత్వే అన్యః ప్రశ్నోన్య త్త్పతివచన మితి తయో రేకవాక్యతా న సంభవతి. కించ ''శ్రద్ధావా ఆపః'' ఇతి శ్రుతౌ ఆవశ్చ శ్రద్ధా శబ్దవాచ్యా భవన్తీత్యపి జ్ఞాయతే - తస్మా చ్ఛ్రద్ధాశ##బ్దే నాప ఏవాభిప్రేతా ఇతి సిద్ధమే -

వివరణము :- పంచాగ్ని విద్యాప్రకరణములోని పంచాగ్నులలో మొదటిదియగు ద్యులోకరూప అగ్నియందు ''తస్మి న్నేతస్మి న్నగ్నౌ శ్రద్దాం జుహ్వతి'' అను వాక్యములో శ్రద్ధ హోమ్యద్రవ్యముగా వర్మింపబడియున్నదిగాని అప్పులు హోమ్యద్రవ్యముగా వర్ణింపబడియుండ లేదు. అట్లుండ ఐదవ ఆహుతియందు అప్పులు పురుషాకారమును పొందునని చెప్పుట యుక్తముకాదు. అని చెప్ప నలవికాదు. ఏలయన? ఆ స్థానమునను ''శ్రద్ధ'' అను పదముతో ఆ అప్పులే చెప్పబడుచున్నవి గనుక. అట్లు కాదన్నచో ప్రశ్న ప్రతివచనముల కేకవాక్యత సంభవించకపోవును. మరియు ''శ్రద్ధా వా ఆపః అను శ్రుతిలో శ్రద్ధాశబ్దమునకు అప్పులని యర్థము అని తెలియజేయబడుచున్నది. కాన నా వాక్యములోని శ్రద్ధాశబ్దముచేత అప్పులే వివక్షితము లగుచున్నవనియు- ఐదవ అహుతియందు అప్పులకు పురుషాకారత్వ ముపపన్నమే అనియును తెలియదగును.

6. సూ : అశ్రుతత్వా దితిచేన్నేష్టాదికారిణాం ప్రతీతేః

వివృతిః :- ప్రశ్నప్రతివచనాభ్యా మపాం భూతాంతరసంసృష్టానాంపురుషాకార ప్రతిపత్తా వవగమ్యమానాయా మపి జీవానాం తత్సంసృష్టానాం రంహణంప్రతిజ్ఞాతుం న యుక్తమిత్యాక్షిప్య సమాధత్తే అశ్రుతత్వాత్‌=ప్రశ్నప్రతివచన వాక్యసందర్భే ఆపామివ జీవానా మశ్రుతత్వాత్‌ - అద్భి స్సంపరిష్వక్తా రంహంతీ త్యేత దయుక్తం - ఇతి - చేత్‌ = ఇత్యుచ్యతే చేత్‌ న= నైవం వక్తుం యుక్తం - కస్మాత్‌ ? ఇష్టాదికారిణాం - ప్రతీతేః = ''అథయ ఇమే గ్రామ ఇష్టాపూర్తే దత్త మి త్యుపాసతే తే ధూమ మభిసంభవన్తి'' ఇత్యుపక్రమ్య ఇష్టాదికారిణాం = యాగదానహోమాది పుణ్య కర్మానుష్ఠాయినాం ధూమాదినా పితృయాణన మార్గేణ చంద్రలోకం గతానాం సోమరాజభావం కథయతి శ్రుతిః ''ఆకాశా చ్చన్ద్రమనం. ఏష సోమో రాజా'' ఇతి - త ఏవేష్టాదికారిణ ఇహాపి ప్రకృతాయాం శ్రుతౌ ప్రతీయన్తే ''తస్మిన్నేతస్మి న్నగ్నౌ దేవా శ్ర్శద్ధాం జుహ్వతి - తస్మా ఆహుతే స్సోమో రాజా సంభవతి'' ఇత్యత్ర - ద్వయో శ్ర్శుత్యో స్సోమరాజభావప్రతిపాదనరూపస్య సామ్యస్య సత్వేన ఇష్టాదికారిణాం జీవానాం శ్రద్ధాశబ్దితాభి రద్భిస్సహ గమన స్యాత్ర శ్రద్ధాహుతివాక్యే ప్రతీయమానత్వాత్‌ - తస్మాదాహుతిమయీభి రద్భి స్సంపరిష్వక్తా జీవా రంహన్తీతి యుక్త ముక్త మిత్యర్థః -

వివరణము :- ప్రశ్న ప్రతివచన గ్రంథములను బట్టి భూతాంతరములతో గూడుకొని అప్పులు = ఉదకములు పురుషాకారమును పొందుచున్నవని యంగీకరించినను ఆ అప్పులతో సంసృష్టులై జీవులు ప్రయాణించుచున్నారని ప్రతిజ్ఞచేయుట యుక్తముకాదు అని ఆక్షేపించి యిచట సమాధానము చెప్పబడుచున్నది.-- ప్రశ్న ప్రతివచనవాక్య జాతములో అప్పులకువలె జీవులయొక్క వర్ణనము కానవచ్చుటలేదు గాన అప్పులతో గూడికొని జీవులు ప్రయాణింతురనుట యుక్తముకాదు, అని యనుటకు వీలులేదు. ''ఆథ య ఇమే .... సంభవన్తి''అని యిట్లుపక్రమించి యీ శ్రుతి యాగదానహోమాది పుణ్యకర్మా నుష్ఠాతలగు జీవులకు ధూమాదికమగు పితృయానమార్గమును ప్రతిపాదించి ''ఆకాశా చ్చంద్రమసం - ఏషసోమో రాజా'' అని అట్టిజీవులకు- చంద్రలోకమును పొందినవారికి సోమరాజా భావమును ప్రతిపాదించుచున్నది. ప్రకృతమగు ''తస్మి న్నేతస్మిన్నగ్నౌ .... రాజా సంభవతి'' అను నీ శ్రుతియందును సోమరాజ భావము పుణ్యజీవులకు సంభవించునని ప్రతిపాదింపబడుచున్నది. ఇట్లు రెండు శ్రుతులయందును ఇష్టాదికారులకు = యాగాద్యనుష్ఠాతలకు సోమరాజ భావమును ప్రతిపాదించుటయను సామ్యము కలదు. కాన ఆహుతి రూపములగు ఉదకములతో కలసి ఇష్టాదికారులగు జీవులు దేహాంతరగ్రహణముకొరకు వెళ్ళుచున్నారని ర్ణించుట యుక్తమగు నని యర్థము.

7. సూ : భాక్తంవానాత్మవిత్త్వాత్తథాహి దర్శయతి

వివతిః :- భాక్తం - వా=''ఏష సోమో రాజా - తద్దేవానా మన్నం - తం దేవా భక్షయన్తి'' - ఇతి శ్రుతౌ ఇష్టాదికారిణాం యద్దేవాన్నత్వముక్తంతత్‌ - భాక్తం = గౌణం న ముఖ్యం - అన్యథా ''స్వర్గకామో యజేత'' ఇత్యాదిశ్రుతి రుపరుద్ధా స్యాత్‌ - ఇష్టపుత్రకళత్రాదయ ఇవదేవానా మిష్టాది కారిణః గుణభావ = ముపభోగ సాధనభావ ముపగతా ఇత్యేత దేవైషామన్నత్వం - నతు భక్ష్యత్వ మిత్యర్థః - అనాత్మవిత్వాత్‌ = ఆత్మజ్ఞానవిధురత్వాత్‌ - తథా - హి = తదేత తనాత్మవిదాం దేవోపభోగ్యత్వం దర్శయతి=శ్రుతిః ''అథ యోన్యాం దేవతా ముపాస్తేన్యోసా వన్యోహమస్మీతి న న వేద యథా పశురేవగ్‌ం స దేవానాం'' ఇత్యాద్యా ప్రతిపాదయతి - తస్మా దిష్టాదికారిణో జీవా స్స్వకర్మ ఫలభోగాయ భూతసూక్ష్మైస్సంపరిష్వక్తా శ్చన్ద్రమనం గచ్ఛన్తీతి సిద్ధమ్‌ -

వివరణము :- ''ఏష సోమో రాజా...భక్షయన్తి'' ఈ శ్రుతిలో సోమభావమునుపొందిన ఇష్టాదికారిజీవులలుదేవతలన్న మగుదురని చెప్పబడుచున్నది. వారకి చెప్పబడిన దేవాన్నత్వ మనునది గౌణముగాని, ముఖ్యముకాదు. అట్లుకాక అదిముఖ్యమే యగుచో ''స్వర్గకామో యజేత'' స్వర్గమును కోరువాడు యాగమును చేయవలయునను శ్రుతికి ఉపరోధము కలుగగలదు. ఇష్టాదికారులు దేవతల కన్న మగుదురనగా భక్ష్యము = భుజింపదగిన పదార్థముగా నగుదురని చెప్పుటకాదు - ఇష్టులగు పుత్రమిత్ర కళత్రాదులవలె దేవతలకు వారు భోగసాధనము కాగలరని చెప్పుటయే ఆ శ్రుతి తాత్పర్యమని గుర్తింపవలయును. ఏల యిట్లు చెప్పబడుచున్నది యనగా - ఆ ఇష్టాదికారులు ఆత్మతత్త్వజ్ఞానము లేనివారగుట వలన నని తెలియదగును. ''అథ యోన్యాం .... దేవానాం'' ఎవడు దేవతలను భేదబుద్ధితో నుపాసించునో అట్టివాడు దేవతలకు అశ్వవృషభాది పశువులవలె భోగసాధనము కాగలడు అని వర్ణించు ఈ శ్రుతి ఆత్మతత్త్వజ్ఞులు కానివారికి దేవోపభోగ్యత్వమును ప్రతిపాదించుచున్నది. కాన ఇష్టాదికారులగు జీవులు స్వస్వకర్మ ఫలానుభవముకొరకు భూతసూక్ష్మములతో పరివేష్టితులై చంద్రలోకమునుగూర్చి వెళ్ళుదు రనునది సిద్ధమగుచున్నది.

తృతీయాధ్యాయ - ప్రధమ పాదః

కృతాత్యయాధి కరణమ్‌ 2

8. సూ : కృతాత్యయేనుశయవాన్‌ దృష్టస్మృతిభ్యాం

యథేత మనేవం చ

వివృతిః :- కృతాత్యయే = జీవః కృతస్య చంద్రమండలే భోక్తవ్యతయాష్టితన్య కర్మణః ఫలోపభోగేన అత్యయే = వినాశే సతి - అనుశయవాన్‌ = అనుశేతే ఇత్యనుశయః = కర్మ - తద్వాన్‌ = ఇహలోకానుభావ్యకర్మాంతర విశిష్టస్సన్‌ చంద్రా దవరోహతి - నతు సర్వం కర్మ తత్రభుక్త్వా నిరనుశయోవరోహతి - కస్మాత్‌ - దృష్టన్మృతిభ్యాసం = శ్రుతి స్మృతిభ్యాం తథావగమాత్‌ - ''తద్య ఇహ రమణీయచరణా రమణీయాం యోని మాపద్యేరన్‌'' ఇత్యాద్యా శ్రుతిః - ''తత శ్శేషేణ జన్మప్రతిపద్యన్తే'' ఇత్యాద్యా స్మృతి ః- యథేతం - అనేవం - చ = యేనమార్గేణ చంద్రం గతస్తేన మార్గేణ కంచి దధ్వానం - మార్గాన్తరేణ కంచి దధ్వానం ప్రాప్యావరోహ న్తీత్యర్థః - ఆరోహణమార్గే సంకీర్తియో ర్ధూమాకాశయో రేవ అవరోహణమార్గేపి సంకీర్తనాత్‌ - (ధూమో రాత్రిన్తథా కృష్ణపక్షో మాసా శ్చ దక్షిణాః| లోకః పితౄణా మాకాశ శ్చంద్రారోహణ మార్గగాః - ఆఖాశవాయు ధూమాభ్ర మేఘాన్న పురుషా స్త్రియః | ఇష్టాదికారిణాం చన్ద్రా దవరోహణ మార్గగాః-)

వివరణము :- జీవుడు తానాచరించిన చంద్రమండలమున (ద్యులోకమున) ననుభవింపదగిన ఫలములకు హేతువగు కర్మ ఫలానుభవమున నశించిపోగా ఇహలోకమున ననుభవింపదగిన ఫలములకు హేతువైన కర్మతో గూడుకొనినవాడై చంద్రలోకమునుండి యవతరించును. ఆంతియేగాని నిశ్శేషముగ పుణ్యకర్మఫలమునంతను అచటనే అనుభవించి కర్మశేష విరహితుడై యవతరించడని తెలియదగును. ''తద్య ఇహ.... మాపద్యేరన్‌'' పుణ్యకర్మకలవారు రమణీయ = మనోహర = ప్రశస్తమగు జన్మను పొందుదురు - అను నిట్టి శ్రుతిని బట్టియు - ''తత శ్శేషేణజన్మ ప్రతిపద్యన్తే'' ఆద్యులోకమునుండి విశేషకర్మతో గూడినవారై అవరోహించివచ్చియీలోకమున యోగ్యమగు జన్మనుపొందుచున్నారు అని వర్ణించు ఆవస్తంబాది స్మృతులను బట్టియు నట్లు నిర్ణయింపనగును. అవరోహణముచేయునప్పుడా జీవులు చంద్రలోకారోహణ మార్గముననుసరించి కొంత భాగమును - దానికి భిన్నముగా కొంతభాగమును బ్రయాణించుచు నవరోహింతురని గుర్తింపదగును. ఏలయన ''ధూమో రాత్రి స్తధా .... చంద్రారోహణమార్గగాః'-ఇది ఆరోహణమార్గ సూచకవాక్యము- ''ఆకాశవాయు.... చంద్రాదవరోహణ మార్గగాః'' ఇదిఅవరోహణమార్గ సూచక వాక్యము. ఆరోహణ మార్గమునందు వర్ణింపబడిన ధూమము. ఆకాశము మాత్రము అవరోహణ మార్గములో వర్ణింపబడియుండుటచేతను తదితరములు ఆరోహణమార్గగతములు కానివి వర్ణింపబడి యుండుటచేతను నిట్లు నిర్ణియంపబడుచున్నది.

9. సూ : చరణాదితి చేన్నోపలక్షణార్థేతి కార్షాణజనిః

వివృతిః :- పూర్వసూత్రే అనుశయా జ్ఞన్మాపత్తి స్సూచితా - అను శయశబ్దః కర్మవాచీ - శ్రుతౌ - తు ''రమణీయచరణా రమణీయాంయోనిం....'' ఇత్యాదినా చరణాత్‌ = శీలాత్‌, జన్మేతి ప్రతిపాదితం - అనుశ యోన్య శ్చరణ మన్యత్‌ - ''అద్రోహ స్సర్వభూతేషు కర్మణామనసా గిరా| అనుగ్రహ శ్చ జ్ఞానం చ శీల మేత ద్విదు ర్బుధాః'' ఇత్యేవం రూపం శీలం- శ్రుతిస్మృతివిహితం యాగదానాదిరూపం కర్మ- ఏవమనయో ర్భేదః- ఏవంస్థితే అనుశయా జ్ఞన్మాపత్తి రితి సూత్రోక్తిః కథముపపద్యత ఇత్యాక్షేపే ఉచ్యతే- చరణాత్‌= ''రమణీయచరణా'' ఇత్యాది శ్రుతౌ చరణా- దాచారా జ్ఞన్మప్రాప్తి దర్శనాత్‌ కర్మాంతరేణ జన్మహేతునా సహావతరతీతి వక్తుం న శక్యతే - ఇతి - చేత్‌ = ఇతి యద్యుచ్యేత - న= న తదుపపద్యతే - కుతః ? శ్రుతౌ శ్రూయమాణ శ్చరణశబ్దః కర్మణా ముపలక్షక ఏవ - ఆచారస్య కర్మాంగత్వా దితి - కార్‌ష్ణాజనిః = కార్షాజని రాజార్యో మన్యతే - ఇతి -

వివరణము :- వేనుకటి సూత్రములో అనుశయము (శేషించిన ఇహలోకమునందు భోగమును కలిగించు కర్మ) వలన జన్మ లభించునని సూచింపబడినది. ''రమణీయచరణా....'' అను శ్రుతి చరణమువలన జన్మయని ప్రతిపాదించుచున్నది. చరణమనగా - ఆచారము=శీలము - అనుశయమను నది వేరు - శీలమనునది వేరు - ''అద్రోహ స్సర్వ... .... విదుర్భుధాః'' సమస్త ప్రాణులయందును ద్రోహబుద్ధి లేకుండుట - అనుగ్రహము కలిగియుండుట - సద్‌జ్ఞానము అను నిట్టిది శీలము అని స్మృతులలో చెప్పబడియున్నది. శ్రుతి స్మృతులలో కర్తవ్యముగా విధింపబడియున్న యాగ - దాన - హోమాది రూపమైనది కర్మ. ఇట్లు అనుశయ చరణములకు భేదముండ అనుశయమువలన జన్మయని సూత్రములో చెప్పబడుట ఎట్లు యుక్తమగునని ఆక్షేపమురాగా చెప్పుచున్నారు.

''రమణీయ చరణా....'' అను శ్రుతిలో ఆచారణము (శీలము) వలన జన్మయని చెప్పబడుచుండ ఇహలోక జన్మహేతువగు కర్మతో ఇష్టాదికారి జీవులు ద్యులోకమునుండి యవతరింతురని చెప్పుట కవకాశము లేదు, అని యనుట పొసగదు. ఏలయన? ఆచార మనునది కర్మాంగమే గాన నా శ్రుతియందలి చరణశబ్దమును కర్మలనే బోధించునని చెప్పవచ్చునని కార్షాజని యను ఆచార్యులు తలంచుచున్నారు. కాన సూత్రోక్తార్థమయుక్తముకాదు.

10. సూ : ఆనర్థక్య మితిచేన్న తదపేక్షత్వాత్‌

వివృతిః - ఆనర్థక్యం= కర్మణాం శుభాశుభరూపాణా మేవ జన్మహేతుత్వే ఆచార స్యానర్థక్యమేవ స్యాత్‌ - ఇతి - చేత్‌ = ఇత్యుచ్యతే చేత్‌ - న = తన్నోపపద్యతే - కతః ? తదపేక్షత్వాత్‌ = ఇష్టాది (యాగదానాది) కర్మజాతస్య ఆచారాపేక్షత్వాత్‌ - ఇష్టాదికం హి కర్మ ఆచారవతా పురుషే ణానుష్ఠిత మేవ ఫలదాయి భవతి. న త్వన్యధా-'' ఆచారహీనం న పునంతి వేదాః'' ఇత్యాది శాస్త్రాత్‌-

వివరణము:- పుణాపుణ్యకర్మలే జన్మహేతువులని చెప్పుచో ఆచార మనర్థకము గదా అని యనుట పొసగదు. యాగదానాదిరూపకర్మ జాతమంతయు ఆచారాపేక్షమే. ఆచారవంతునినిచే చేయబడినప్పుడే ఆ కర్మలు ఫలప్రదములు కాగలవు. ఆచారము లేకున్న నట్లు కానేరవు. ''ఆచారహీనం న వువంతి వేదాః'' ఆచారహీనునివేదములుగాని వేదోక్తసత్కర్మజాతముగాని పవిత్రింపచేయజాలవని శాస్త్రనిర్ణయము. కాన ఆచారమునకు ఆనర్థక్యముండదు.

11. సూ : సుకృతదుష్కృతే ఏవేతి తు బాదరిః

వివృతిః :- సుకృతదుష్కృతే - ఏవ - తు = విధినిషేధశాస్త్ర గమ్యపుణ్య పాపరూపకర్మణీ ఏవ ఇతి = చరణశ##బ్దే నాభిధీయేతే - ధర్మం చరత్యేష మహాత్మా - ఇత్యాదిషు కర్మ పరతయాపి చరతేః లోకవ్యవహారే ష్వపి ప్రయోగదర్శనా దితి - బాదరిః = బాదరి రాచార్యో మన్యతే -

వివరణము :- ''ధర్మం చరత్యేషమహాత్మా'' ఈ మహాత్ముడు ధర్మము నాచరించుచున్నాడు. అను నిట్టిలోక వ్యవహారములలో చరతిధాతువు యాగాది కర్మపముగా కూడ వాడబడుచున్నది గనుక చరణ శబ్దముచేత గూడ విధినిషేధ వాక్య ప్రతిపాద్యములైన పుణ్యపాపకర్మలు చెప్పబడగలవని బాదరియను ఆచార్యులు తలంచుచున్నారు.

అనిష్టాది ఖార్యధికరణమ్‌ 3

12. సూ : అనిష్టాదికారిణా మపి చ శ్రుతం

వివృతిః :- ఇష్టాదికారిణ ఏవ చంద్రమనం గచ్ఛన్తీ త్యేత న్నోపపద్యతే - ఇత్యాక్షిపతి - అనిష్టాదికారిణాం - అపి - చ = ఇష్టాదికర్మభ్యోవిరుద్ధాని యాని సురాపానాదీని కర్మాణి - తత్కారిణా మపి చ శ్రుతం = ''యేవైకే చాస్మాల్లోకా త్ర్పయన్తి చంద్రమన మేవ తే సర్వే గచ్ఛన్తి'' ఇతి శ్రుతౌ తే సర్వే ఇత్యవిశేషత ఉక్తేః - చంద్రమండల మేవ గన్తవ్యత్వేన అవగతం - తస్మాత్‌ పాపినోపి చంద్రం గచ్ఛన్తీతి సిద్ధమితి పూర్వఃపక్షః -

వివరణము :- ఇష్టాదికారులు మాత్రమే చంద్రలోకమును పొందురురనియనుట యుక్తము కాదని ఆక్షేపించుచున్నారు-యాగాద్యనుష్టాతలకేకాక సురాపానాది నిషిద్ధకర్మలు చేసినవారికిని ''యే వై.... ....గచ్ఛన్తి'' ఈలోకమునుండి ఉత్ర్కాంతి నొందిన వారందరును చంద్రలోకమును చేరుదురు అని వర్ణించు ఈ శ్రుతిలో ''సర్వే'' అను పదముతో పుణ్యాత్ములు పాపాత్ములు నగు వారందరికి చంద్రలోక ప్రాప్తి వర్ణింపబడినది గనుక పుణ్యాత్ములకే చంద్రలోకప్రాప్తి యనుట యుక్తము కాదని పూర్వ పక్షము -

13. సూ : సంయమనే త్వనుభూ యేతరేషా మారోహావ రోహౌ తద్గతిదర్శనాత్‌

వివృతిః :- తు= స పక్షః నోపపద్యతే - నైవ పాపిన శ్చంద్రమనం గచ్ఛన్తి - అపితు - సంయమనే=యమాలయే అనుభూయ = యాతనా అనుభూయ, తే తత ఏవావరోహన్తి - అత ఏవ - ఇతరేషాం = ఇష్టాదికారి భ్యోన్యేషాం పాపినాం ఆరోహావరోహౌ = యమాలయం ప్రత్యారోహః - తత ఏవావరోహ శ్చ భవతః - కస్మాత్‌ ? తద్గతి దర్శనాత్‌ = ''అయం లోకో నాస్తి పర ఇతి మానే పునః పునర్వశ మాపద్యతేమే'' ఇతి - ''వైవస్వతగ్‌ సంగమనం జనానాం'' ఇత్యాది శ్రుతిషు పాపినాం యమవశ్యత్వ లక్షణ తద్గతే ర్దర్శనాత్‌ -

వివరణము :- పావులు చంద్రుని పొందుదురనుట శ్రుత్యభిమతము కాదు. వారు యమలోకమునం దందలి యాతనలను = తీవ్రదుఃఖములననుభవించి యచటినుండి యీలోకమున కవతరింతురు. ''అయంలోకో.... ద్యతేమే'' ఇలోకమే కలదు. లోకాంతరములు - పుణ్యపాపములు లేని వియే అని తలచి సంచరించువారు నాకు వశులగుదురను యమవాక్యమును వర్ణించు నట్టి శ్రుతులలో పావులకు యమలోకగమనము ప్రతిపాదింపబడుచున్నది గనుక యాగాది పుణ్యకర్మకారులుగాని పాపాత్ములకు యమలోకమునుగూర్చి ఆరోహణము - అటనుండియే అవరోహణము (దిగివచ్చుట)యు నని నిశ్చయింపదగును.

14. సూ : స్మరంతి చ

వివృతిః :- స్మరన్తి - చ = మను వ్యాసప్రభృతయ శ్శిష్టాః సృతికర్తారః పాపినాం యమలోకగతిం స్మృతిషు - నాచికేతసోపాఖ్యానాదిషు చ స్మరన్తి.

వివరణము :- మరియు - మనువు వ్యాసుడు మొదలగు స్మృతి కర్తలు తమ స్మృతులలోను, నాచికేత సోపాఖ్యానాదులయందును నీ యంశమును స్పష్టపరచుచున్నారు.

15. సూ : అపి చ సప్త

వివృతిః :- అపి - చ = పౌరాణికా శ్చాపి సప్త = సప్తసంఖ్యాకాన్‌ చిత్రగుప్తాదిస్వామికాన్‌ రౌరవాదికాన్‌ పాపినా ముపభోగస్థానత్వేన పఠన్తి - తాన్‌ పాపి నః ప్రావ్నువన్తి, న చంద్రలోక మిత్యర్థః -

వివరణము :- మరియు - పౌరాణికులును చిత్రగుప్తాదులు యజమానులుగా గల రౌరవాదికములగు సప్తనరకములు గలవని, అవి పావులకు దుఃఖానుభవ స్థానములని పురాణములలో వర్ణించియుండిరి. కానను పావులు చంద్రలోకమును చేరరని నిర్ణయింపవలయును.

16. సూ : తత్రాపి చ తద్వ్యాపారా దవిరోధః

వివృతిః :- రౌరవాదిషు యమా ద్భిన్నా శ్చిత్రగుప్తాదయః అధిష్ఠాతార ఇతి స్మృతి షూపలభ్యతే - తత శ్చ పాపినాం తదాయత్తత్వ మేవవక్తవ్యం - న తు పాపినాం యమాయత్త తేతి - తేహి పాపినో యామిర్యాతనా అనుభవన్తీత్యుక్తి రయుక్తా ఇత్యత్రోచ్యతే - చ = కించ తత్ర- అపి = తేష్వపి నప్తసు రౌరవాదిషు నరకేషు తద్వ్యాపారాత్‌ = తస్యయమన్య నియంతృ వ్యాపార సద్భావా చ్చిత్రగుప్తాదీనా మపి యమాయత్తత్వా త్తేషు నరకేషు చిత్రగుప్తాది స్వామికత్వస్య సత్వేపి అవిరోధః = విరోధో నాస్తి - పాపినాం యమాయత్వత్వోక్తిర్నానుపవన్నేతి భావః-

వివరణము :- రౌరవాది నరకములయందు నియంతలు చిత్రగుప్తాదులని స్మృతులలో గలదు గాన పాపాత్ములు చిత్రగుప్తాద్యాయత్తులని చెప్పవలయును గాని పావులు యుమునికి వశులగుదురు, యమయాతనలననుభవింతురనిచెప్పుట యుక్తము కాదుఅనగా చెప్పుచున్నారు. అట్లు చెప్పుటలో విరోధ మేమియు నుండదు. రౌరవాది నరకములయందు చిత్రగుప్తాదులే నియంతలైనను వారును యమునికి వశవర్తులు గాన ఆ రౌరవాదులయందుగల పావులకును యమవశ్యత్వముండును. కాన పావులు యమాయత్తు లగుదురని చెప్పుట అనువపన్నము కానేరదు.

17. సూ : విద్యాకర్మణో రితి తు ప్రకృతత్వాత్‌

వివృతిః :- అనిష్టాదికారిణాం చంద్రలోక ప్రాప్త్యభావే హేత్వంతర ముచ్యతే - ప్రతివచననావసరే విద్యాకర్మణోః- ఇతి- తు = పంచాగ్ని విద్యాయాం ''వేత్థ యథా సౌ లోకో న సంపూర్యతే'' ఇతి ప్రశ్నస్య ''అథైతయోః పథో ర్న కతరేణ చ తానీమాని క్షుద్రాణ్యసకృదావర్తీని భూతాని భవన్తి. జాయస్వ - మ్రియ స్వే త్వేత త్తృతీయం స్థానం - తేనాసౌలోకో న సంపూర్యతే'' ఇతి శ్రూయతే - అత్ర ఏతయో రితి పదస్యవిద్యాకర్మణో రిత్యర్థో ద్రష్టవ్యః కస్మాత్‌ ? ప్రకృతత్వాత్‌ = దేవయాన పితృయాన సాధనయో ర్విద్యాకర్మణో రేవాత్ర ప్రకృతత్వాత్‌ - తతశ్చ యే తావద్విద్యయా సాధనేన దేవయానే వా, యేవా కర్మణా సాధనేన పితృయాణ వా అనధికృతా స్తేషామేవ క్షుద్రజున్తులక్షణః అసకృదావర్తీ తృతీయః వన్థా భవతి - తస్మా త్పాపిన మనిష్టాదికారిణాం చన్త్రలోకప్రాప్తి ర్న సంభవతీతి - అత్ర తు శ##బ్దేన ''చంద్రమన మేవ తే సర్వే గచ్ఛన్తి '' ఇత్యత్ర సర్వశ##బ్దేన ఇష్టాదికారిణ ఏవ గ్రాహ్యాః- నాన్యే ఇత్యర్థో గ్రాహ్య ఇతి సూచ్యతే -

వివరణము :- పాపాచరణము కలవారు చంద్రలోకమును పొందరనుటలో హేత్వంతరము చెప్పబడుచున్నది. -- ''వేత్థ యథాసౌ లోకోన సంపూర్యతే'' ఈ చంద్రలోకము ఆరోహణావరోహణముల జేయుప్రాణులతో పూరింపబడి యిరుకుగ నుండక పోవుటలో గల కారణము తెలియునా అను ప్రశ్నకు సమాధానమిచ్చు సందర్భములోని శ్రుతి యిట్లున్నది. ''అతైతయోః పథోర్న... న సంపూర్యతే'' అని. ఈ శ్రుతిలోని ''ఏతయోః'' అను పదమునకు విద్యాకర్మలని యర్థము చెప్పవలయును. దేవయాన పితృయానమార్గ సాధనములుగా నింతకు పూర్వపు గ్రంథములో నవి చెప్పబడి ప్రకృతములైయున్నవి గాన. ఏ ప్రాణులు విద్యతే (విద్య యనగా ఉపాసనము) దేవయాన మార్గమునందు గాని యాగాదిసత్కర్మానుష్ఠానము చేత పితృయానమార్గమునందుగాని అధికారములేనివారై యందురో వారికి క్షుద్రజంతు లక్షణమగు పునఃపునర్జనన మరణప్రాపకమగు అసకృదావృత్తిస్వభావముగల మూడవసూర్గము లభించునని ''అథైతయోః'' అను శ్రుతి చెప్పుచున్నది. దీనినిబట్టి పాపాచరమము కలవారికి చంద్రలోక ప్రాప్తి సంభవించదని నిశ్చయింపదగును. ఈ సూత్రములోని తు అను శబ్దము. ''చంద్రమన మేవ తే సర్వే'' అను శ్రుతిలోని సర్వశబ్దముచేత ఇష్టాది పుణ్యకర్మానుష్ఠాతలే చెప్పబడుదురుగాని యితరులు చెప్పబడరని సూచింపబడుచున్నది.

18. సూ : న తృతీయే తథోపలబ్ధేః

వివృతిః :- తృతీయే = ఏత తృతీయం స్థాన మితి ప్రాగుక్తేతృతీయే స్థానే = తృతీయమార్గే న=కృమికీటాది శరీరలాభాయ ఆహుతీనాం పంచసంఖ్యా నియమో నాస్తి - తతః పాపినాం చన్ద్రలోకప్రాప్తి ర్నసంభవతీతి సిద్ధ్యతి- కుత ఏవ మవగమ్యత ఇతి చేత్‌ ? తథా- ఉపలబ్ధేః = అన్తరేణౖవ ఆహుతిసంఖ్యానియమం జాయస్వ మ్రియస్వేత్యాది శ్రుతిషు కృమికీటాది జన్మప్రాప్తే రుపలంభాత్‌.

వివరణము :- ''ఏ తత్తృతీయం స్థానం'' అను శ్రుతిలో వర్ణింపబడిన తృతీయమార్గములో కృమికీటాది క్షుద్రజంతుశరీరమును పొందుటకు పూరోక్త ఆహుతి సంఖ్యానియమములేదు. కనుక పాపులకు చంద్రలోకప్రాప్తి సంభవించ దనుట సిద్ధించగలదు. ''జాయస్వ మ్రియస్వ'' అను నిట్టి శ్రుతులలో ఆహుతిసంఖ్యానియమము లేకయే కృమికీటాది జన్మప్రాప్తి సంభవించునవి సూచింపబడి యుండుటచే నిట్లు నిశ్చయింపబడుచున్నది.

19. సూ : స్మర్యతేపిచ లోకే

వివృతిః :- చ=కించ-లోకే-అపి=లోక్యత ఇతి లోకః=మహాభారతాది గ్రంథజాతం - తత్ర చస్మర్యతే = ద్రోణ దృష్టద్యుమ్నాదీనాం - సీతా ద్రౌపదీ ప్రభృతీనాం చాయోనిజత్వం స్మర్యతే - తత్ర ద్రోణాదీనాం యోషిదాహుతి రేకా నాస్తి - దృష్టద్యుమ్నాదీనాం యోషిత్పురుషవిషయేద్వే అప్యాహుతీ నస్తః. లోకే బలాకాపి చ వినైవ రేతస్సేకం గర్భంధత్తే ఇతి హి రూఢిః - ఇత్యేవం ఆహుతిసంఖ్యా సర్వత్ర జన్మని ననియ తేతి ప్రతీయతే - ఏవం పాపినా మపీతి ద్రష్టవ్యం -

వివరణము :- లోకమనగా మహాభారతాది గ్రంథజాతమనియు సర్థము చెప్పవచ్చును. ఆ గ్రంథములలో ద్రోణాచార్యులు - దృష్టద్యుమ్నుడు - సీతా - ద్రౌపదీ మొదలగువారు అయోనిజులని వర్ణింపబడియున్నది. ద్రోణాదులకు యోషిత్‌ (స్త్రీ) అను అగ్నియందు ఆహుతి లేకయే జన్మ లభించినది అట్లే - సీతా - ద్రౌపదీ మొదలగువారి విషయములో పురుష - యోషిత్తులను రెండు అగ్నులయందును ఆహుతిలేదు. మరియు రేతస్సేకము లేకయే బలాక (బెగ్గురు పక్షి) గర్భమును ధరించుచుండుట యను నది లోకమున ప్రసిద్ధమై యున్నది కాన సర్వత్ర జన్మవిషయములో ఆహుతి సంఖ్య నియతము కాదనియు - కాననే పాపుల జన్మ విషయములో గూడ ఆహుతి సంఖ్య అనియతమనియు తెలియదగును.

20. సూ : దర్శనా చ్చ

వివృతిః :- దర్శనాత్‌- చ = లోకే జరాయు జాండజ స్వేద జోద్భిజ్జేషు స్వేదజోద్భిజ్జయో రంతరేణౖవ యోషిత్సంబస్ధ ముత్పత్తిదర్శనాన్నాహుతిసంఖ్యా నియ తేతి జ్ఞాయతే - అత ఆహుతిసంఖ్యాయా మాదరోన కర్తవ్య ఇతి భావః -

వివరణము :- జరాయుజములు - అండజములు - స్వేదజములు - ఉద్భిజ్జములు అను నిట్టి నాల్గువిధములగు జీవరాసులలో స్వేదజములును ఉద్భిజ్జములును యోషిత్సంబంధము లేకయే ఉత్పన్నమగుచున్నవి. కానను ఆహుతిసంఖ్య నియతము కాదని తేలుచున్నది. కనుక ఆ ఆహుతి సంఖ్యయం దాదరము చేయ నవసరములేదు.

21. సూ : తృతీయశబ్దావరోధ స్సంశోకజస్య

వివృతిః :- సంశోకజస్య = స్వేదజస్య - తృతీయశబ్దావరోధః = ''త్రీణ్యవ భూతాని భవన్తి అండజం జీవజ ముద్భిజ్జం చేతి'' ఇతి శ్రుతిగత తృతీయేన శ##బ్దేన=ఉద్భిజ్జశ##బ్దేన స్వేదజ స్యాప్యవరోధః- సంగ్రహః కృతః - స్వేదజోద్భిజ్జయో ర్భూజలోద్భేదేన ప్రభవస్య సమానత్వాత్‌ - తస్మా న్నానిష్టాదికారిణ శ్చంద్రమన మారోహ న్తీతిసిద్ధమ్‌ -

వివరణము :- ''త్రీణ్యవ భూతాని .... .... ఉద్భిజ్జం చేతి'' జీవరాసులు (ప్రాణివర్గములు) మూడే అని వర్ణించు ఈ శ్రుతిలో తృతీయమైన=మూడవదియైన ఉద్భిజ్జశబ్దముచేత సంశోకజము గూడ సంగ్రహింపబడినది యని గుర్తింపదగును. (సంశోకజమనగా = స్వేదజమని యర్థము. జరాయుజములు = మానవులు - పశువులు మొదలగునవి - అండజములు= పక్షులు - సర్పములు - మొదలగునవి) ఉద్భిజ్జములు= భూమిని భేదించుకొని పుట్టుచుండునవి= వృక్షములు - లతలు వగైరాలు. స్వేదజములు = స్వేదాదిరూవ జలమును భేదించుకొని పుట్టుచుండునవి - దోమలు - పేనులు మొదలగునవి. ఈ రండు వర్గములకును భూమిని, జలమును భేదించుకొని పుట్టుచుండుట యను సాదృశ్యము కలదు. కాన ఉద్భిజ్జపదముచేత స్వేదజములు సంగ్రహింపబడుట ఉపపన్నమే యగును - (జన్మలయందు ఆహుతి సంఖ్యనియతము కాదనితేలుచున్నది కానపాపులు చంద్రలోకము నారోహింపరని నిశ్చయింపబడుచున్నది.)

సాభావ్యాధికరణమ్‌ 4

22. సూ : సాభావ్యాపత్తి రుపపత్తేః

వివృతిః :- ఇష్టాధికారిణ శ్చన్ద్రలోక మారుహ్య తస్మిన్‌ యావత్సంపాత ముషిత్వా తత స్సానుశయా అవరోహ న్తీత్యుక్తం - తదవరోహణ ప్రకారోధునా చింత్యతే - సాభావ్యావత్తిః = సాదృశ్యావాప్తిః = ఆకాశవాయ్వాదిభి స్సమానో భావః యేషాం జీవానాం తే సభావాః - తేషాం భావః = సాభావ్యం - తత్ర్పాప్తిః = సాభావ్యాపత్తిః - అవరోహణ ప్రకరణ '' అథైతమధ్వానం పునర్నివర్తన్తే యథేత మకాశ - మాకాశా ద్వాయుం - వాయు ర్భూత్వా ధూమో భవతి - ధూమో భూత్వా భ్రం భవతి - అభ్రం భూత్వా మేఘో భవతి ః మేఘో భూత్వా ప్రవర్షతి - '' ఇత్యాదినా పుణ్యకర్మిణాం శ్రూయమాణో వాయుధూమాదిభావః వాయుధూమాది సాదృశ్యప్రాప్తి రేవేతి - న సాక్షా ద్వాయ్వాది స్వరూపాపత్తి రిత్యేవ మవగన్తవ్యం - కుతః ? ఉపపత్తేః = ఉదాహృతశ్రుతౌ శ్రుతస్య తత్తత్‌స్థానా దవరోహణన్య - తథాచే దేవ ఉపపద్యమానత్వాత్‌ - సహ్యన్య స్యాన్య భావః క్వాపి ముఖ్య స్సంభవతి -

వివరణము :- ఇష్టాదికారులు చంద్రలోకము నధిరోహించియచట పుణ్య ఫలానుభవావసానము వరకు నివసించి అచటినుండి ఇహలోకాను భావ్య ఫలయుక్త కర్మయుక్తులగుచు నవరోహింతురని చెప్పబడినది. ఇప్పుడా అవరోహణ ప్రకారము వివరింపబడుచున్నది.

అవరోహణమును వర్ణించు ప్రకరణములో ''అథైతమధ్వానం........ మేఘోభూత్వా ప్రవర్షతి'' అను శ్రుతిగలదు. అందు పుణ్యకర్మఫలభోగానంతర మచటినుండి జీవుడు పూర్వము తాను తల్లోకారోహణ సమయమున నే మార్గమును స్వీకరించెనో ఆ మార్గము ననుసరించి తిరిగి వచ్చును ఆకాశమును చేరి అచటినుండి వాయువునుచేరి వాయుభావమును పొంది ఆ తరువాత ధూమముగా నగును. ధూమభావమును పొంది ఆ తరువాత అభ్రముగా నగును. అభ్రభావమునుపొంది .... అని యిట్లు పుణ్యజీవులకు వాయుధూమాదిభావము వర్ణింపబడినది. వాయుధూమాదిభావమనగా నిచట వాయుధూమాది సాదృశ్యమని యర్థముగాని వాయుధూమాది స్వరూపమును తాను పొందుట అని అర్థముకాదని తెలియదగును. ఏలయన ? ఇట్లు చెప్పుకున్నచో ఆయాస్థానములనుండి ఆ జీవులకు ఆ శ్రుతి యందు వర్ణింపదలచిన అవరోహమము ఉపపన్నము కానేరదు గనుక - ఒకనికి మరియొకనితో సాదృశ్యము సంభవించును గాని ఆతడే ఇతడగుట, ఇతడే ఆతడగుట, అను అన్యస్వరూపాపత్తి అన్యులకు లోకమున నెచటను సంభవించదు. కాన వాయ్వాదిభావమనగా వాయ్వాది సాదృశ్యమే అని గుర్తింపదగును.

నాతిచిరాధి కరణమ్‌ 5

23. సూ : నాతిచిరేణ విశేషాత్‌

వివృతిః :-న- అతిచిరేణ = కర్మిణో జీవాః వ్రీహ్యాదిభావాపత్తేః ప్రాక్‌ - అల్పకాల మేవ ఆకాశాది సదృశేన రూపే ణావస్థాయ తతో నిర్గచ్ఛన్తి - న క్వచి ద్దీర్ఘాకాల మితి - క్వచి దదీర్ఘకాల మిత్యా ద్యనియమే నేత్యవగన్తవ్యం - కుతః ? విశేషాత్‌ = వ్రీహ్యాది ప్రాప్త్యనన్తరం ''అతో వై ఖలు దుర్నిష్ర్పపతరం'' ఇతి చిరకాల నిష్ర్కమణాత్మక దుఃఖనిష్ర్కమణ రూప విశేషస్య శ్రవణాత్‌ - వ్రీహ్యాదిభ్య శ్చిరనిష్ర్కమణోక్తి రాకాశాదిభ్యః అచిరనిష్ర్కమణం ద్యోతయ తీతి -

వివరణము :- అవరోహణము చేయుచున్న జీవులు హ్రీహిభావమును పొందుటకు పూర్వము ఆకాశాది సాదృశ్యమును పొందినవారై అల్పకాలము మాత్రముండి యచటినుండి నిర్గమించుచుందురు. అతియే కాని కొన్ని స్థలములలో స్వల్పకాలము, కొన్ని స్థలములలో దీర్ఘకాలము అని యిట్లనియమితముగ నుండరని తెలియదగును. ఏలయన ? వ్రీహ్యాది భావమును పొంది తరువాత ''అతో వైఖలు దుర్మిష్ర్పపతరం'' అటనుండి నిష్ర్కమణము దుస్సాధము, చిరకాలికమును కాగలదని విశేషమును సూచించు ఈ శ్రుతివాక్యము ఆకాశాదులనుండి నిష్ర్కమణము చిరకాలికము కాదని తెలియుజేయుచున్నది గనుక -

అన్యాధిష్ఠితాధి కరణమ్‌ 6

24. సూ : అన్యాధిష్టితేషు పూర్వవదభిలాపాత్‌

వివృతిః :- చన్ద్రా దవరోహతాం జీవానా మాకాశాదిషు తత్త త్సాదృశ్యం ప్రాప్యా అచిరేణ కాలేన స్థానాంతరప్రాప్తి ర్వర్ణితా - తతః ఆకాశాదిషు జీవానాం సంశ్లేషమాత్రం సంభవ తీతి సిద్ధం - వ్రీహ్యాదౌ తు న తథా - కింతు ముఖ్యం జన్మైవ తత్ర తేషాం వక్తవ్యం - ''త ఇహవ్రీహియవా ఓషధివనస్పతయ స్తిలమాషా ఇతి జాయన్తే'' ఇతి శ్రుతౌ ''జాయన్తే'' ఇతి జన్యర్థన్య వదస్య శ్రూయమాణత్వా దిత్యత ఆవా-అన్యాధిష్ఠితేషు=అన్యైర్జీవైరధిష్ఠితేషు వ్రీహ్యాదిషు అనుశయినాం సంశ్లేషమాత్ర మేవాభిహితం పూర్వోక్తశ్రుతౌ జయన్తే ఇతి పదేన - సతుముఖ్యం తాద్రూప్యేణ జ న్మేత్యవగన్తవ్యం - కుతః? పూర్వవదభిలాపాత్‌ = యథా ఆకాశాదిషు వర్మాంతేషు కర్మ పరామర్శ మంతరేణ ప్రవేశ ఉక్తః-తథా వ్రీహ్యాదిష్వపి వినైవ కర్మ పరామర్శం ప్రవేశన్య ఉక్తత్వాత్‌ - అతః కర్మపరామర్శాభావాత్‌ న వ్రీహ్యాది ష్వనుశయినాం సుఖదుఃఖభోక్తృత్వం - యత్రతు భోక్తృత్వం వివక్షితం స్యాత్‌ తత్ర కర్మపరామర్శః ''రమణీయచరణా'' ఇత్యాదినా దృశ్యతే - అత్రతు న తథా. తస్మా జ్ఞాయన్త ఇతి పదం సంశ్లేషమాత్రాభిధాయకం - న ముఖ్యమితి-

వివరణము :- చంద్రలోకమునుండి యవతరించు జీవులు ఆకాశాదులయందు ఆయా పదార్థ సాదృశ్యమునుపొంది అచిర - అల్పకాలములోనే స్థానాంతరమును పొందుదురని వర్ణింపబడినది. అట్లు చెప్పుటతో ఆకాశాదులయందు జీవులకు సంశ్లేషమాత్రమే - అచట వానితో కలసియుండుట మాత్రమే సంభవించునని సిద్ధమగుచున్నది. వ్రీహ్యాదులయం దట్లు కాదు. అచట వారికి ముఖ్యమగు జన్మయే సంభవించు నని చెప్పవలయును. ''త ఇహ .... జాయన్తే'' అవరోహించుచున్న జీవులు నానావిధములగు ధాన్యరూపముగ జన్మను పొందుచున్నారు. అని వర్ణించు శ్రుతిలో జాయన్తే అని జన్మను ప్రతిపాదించుపదము ప్రయోగింపబడినది గనుకనని యనగా నట్లు కాదని నిరూపించుచున్నారు.

వ్రీహ్యాదులు ఆ ఉపాధులయందు కర్మఫలముల ననుభవించు జీవులచే నధిష్టింపబడి యుండును. వాటియందును అవరోహించి వచ్చుచున్న అనుశయయుక్తులగు జీవులు సంశ్లోషమును మాత్రము పొందుదురని చెప్పవలయునేగాని పైశ్రుతిలోని జాయన్తే అను పదమునుబట్టి ఆజీవులకు అచట వ్రీహ్యాదిరూపముగ ముఖ్యమగు జన్మ యేర్పడునని చెప్ప వలను పడదు. కారణ మేమియన? అవరోహణక్రమమును వర్ణించు శ్రుతిలో ఆకాశము మొదలు వర్షమువరకు నన్ని పదార్థములయందు కర్మసంబంధమును పరామర్శించకనే యెట్లు ప్రవేశము వర్ణింపబడియుండెనో అట్లే వ్రీహ్యాదులయందును ఆ అనుశయుక్తులగు జీవులకు ప్రవేశము వర్ణింపబడెను. కనుక ఎచట కర్మపరామర్శము చేయబడునో అచట ఆ కర్మఫలభోక్తృత్వము (కర్మఫలానుభవము) సిద్ధించుటకు ముఖ్యమగు జన్మయేర్పడునని తెలియదగును. ''రమణీయ చరణా...'' ఇత్యాది శ్రుతులలో కర్మపరామర్శము చేయబడినది. ఆచట జీవులకు ముఖ్యమగు జన్మ వివక్షితము. వ్రీహ్యాదులయందట్లు కర్మపరామర్శము లేదు గాన ''జాయన్తే'' అను పదము వాడబడినను అది వ్రీహ్యాదులతో జీవులకు సంశ్లేషమును మాత్రమే చెప్పగలదు గాని ముఖ్యమగు జన్మను ప్రతిపాదించదని తెలియదగును.

25. సూ : అశుద్ధ మితి చేన్న శబ్దాత్‌

వివృతిః ;- అశుద్ధం = విహిత మపి జ్యోతిష్టోమాదికం కర్మ పశుహింసాదియోగాత్‌ పాపమిశ్రం- అతస్తత్పాపాంశానుభవార్థ మనుశయినాం వ్రీహ్యాదిజన్మ ముఖ్య మేవ భవతు ఇతి - చేత్‌ =ఇత్యుక్తం చేత్‌ న = నతద్యుక్తం . కస్మాత్‌ ? శబ్దాత్‌ = ''అగ్నీషోమీయం వశు మాలభేత్‌'' ఇత్యాదినిధిశాస్త్రాత్‌ విహితానాం జ్యోతిష్టోమాదీనాం ధర్మత్వే నావగ తత్వాత్‌ - సహి ధర్మస్య స్తాదరం జన్మ ఫలం భవితు మర్హతి.

వివరణము :- జ్యోతిష్టోమాది యాగములు వేదములయందు విహితములే ఐనను వానియందు పశుహింసాదులు కలవు గాన నవి పాపమిశ్రములే అగును. కాన ననుశయ యుక్తులగు ఇష్టాదికారులకు పాపాంశముననుభవించుటకు వ్రీహ్యాదిరూప జన్మ ముఖ్యమైనదియే కావచ్చును అని యనుటయు యుక్తము కాదు. ఏలయన ? ''అగ్నిషోమీయం పశుమాలభేత'' అను నీ శాస్త్రములో యాగీయ పశువుయొక్క ఆలంభనము విహితము గాన తద్యుక్త జ్యోతిష్టోమాది యాగములు సర్వాంశమునను ధర్మరూపములే అని తెలియవచ్చుచున్నది. వ్రీహ్యాదిరూప స్థావర జన్మయనునది ధర్మమునకు ఫలము కాజాలదు గదా! కాన వ్రీహ్యాదులయందు అనుశయులకు సంశ్లేషమాత్రమే చెప్పవలయును గాని ముఖ్యజన్మ సంభవించదని నిశ్చయింపదగును.

26. సూ : రేతస్సిగ్యోగో

వివృతిః : అథ = వ్రీహ్యాదిభావానన్తరం - అనుశయినాం - రేతస్సిగ్యోగః = ''యోయో హ్యన్న మత్తి యో రేత స్సించతి, తద్భూయ ఏవ భవతి'' ఇతి వాక్యశేషేణ - రేతస్సిచా = ప్రాస్త¸°వనేన పురుషేణయోగః=సంశ్లేమాత్రం ఆమ్నాయతే - తస్మాత్తతః ప్రాగ ప్యనుశయి నాం వ్రీహ్యాదౌ సంశ్లేమాత్ర మేవోక్త మిత్యధ్యవసీయతే -

వివరణము :- అనుశయులగు జీవులకు వ్రీహ్యాదిభావము తరువాత ''యోయో... ఏవభవతి'' అను శ్రుతిలో ఆ వ్రీహ్యాదులకు సంబంధించిన అన్నమును భుజించిన ¸°వనవంతులగు పురుషులతో యోగము సంశ్లేషము మాత్రమే వర్ణింపబడియున్నది. కనుక దీనికి పూర్వము వ్రీహ్యాదుల యందును అనుశయులకు సంశ్లేషమే వర్ణింపబడినదని - ముఖ్యజన్మ వర్ణింపబడలేదని నిశ్చయింపబడుచున్నది.

27. సూ : యోనే శ్శరీరం

వివృతిః :- అనుశయినాం ముఖ్యం జన్మ క్వేత్యత ఆహ- యోవేః=యోనే రధీత్యర్థః - శరీరం = యోనౌ నిషిక్తే రేతసి పుణ్యపావఫలోపభోగసాధం శరీరం జాయత ఇతి ''తద్య ఇహరమణీయచరణా'' ఇత్యాది శాస్త్ర మభిదభాతి ః తతోనుశయినాం న వ్రీహ్యాదిజన్మ ముఖ్య మితిసిద్ధమ్‌ -

ఇతి శ్రీ గాయత్రీ పీఠాధీశ్వర శ్రీ విద్యాశంకర భారతీ యతివర విరచితాయాం బ్రహ్మసూత్ర వివృతౌ తృతీయాధ్యాయస్య-ప్రథమఃపాదః

వివరణము:- ఈ ఆవరోహించి వచ్చుచున్న అనుశయులకు ముఖ్య జన్మ యెచట ననగా చెప్పుచున్నారు.-- యోషిత్‌ క్షేత్రమునందు రేతస్సు నిషిక్తము కాగా పుణ్యపాపఫల భోగముకొరకు తత్సాధనమైన శరీరముత్పన్నమగునని ''తద్య ఇహ రమణీయ చరణా....'' అను శ్రుతి ప్రతి పాదించుచున్నది. ఆ కారణమువలన అనుశయులగువారికి వ్రీహ్యాదుల యందు ముఖ్యజన్మ సంభవించదని సిద్ధమగుచున్నది.

ఇట్లు శ్రీ గాయత్రీ పీఠాధీశ్వర శ్రీ విద్యాశంకర భారతీ యతివర

విరచితమగు బ్రహ్మసూత్రార్థ వివరణమున

తృతీయాధ్యాయమున - ప్రథమ పాదము ముగిసెను.

తృతీయాధ్యాయస్య - ద్వితీయ్య పాద్య

పూర్వపాదే పంచాగ్నివిద్యా మధికృత్య జీవన్య సంసారగతి ప్రభేదః ప్రపంచితః - ఇదానీం తసై#్యవ జీవస్య అవస్థాప్రభేదః ప్రపంచ్యతే - ఏతేన సంసారగతి ప్రభేద ప్రపంచనేన నానావిధజన్మప్రాప్తే శ్చాతిదుఃఖ హేతుత్వా ద్వైరాగ్యేణ భావ్య మిత్యుక్తం భవతి - విరక్తస్త్య తత్తత్వంపదార్థ వివేకాయ పాదోయ మారభ్యతే- తత్ర ''న స్థానతోపి-'' ఇత్యతః ప్రా క్త్వంపదార్థస్య - తతః ప్రభృతి తత్పదార్థన్య చ వివేచనంక్రియతే - అత్ర ప్రథమాధికరణ స్వప్నసృష్టే ర్మిథ్యాత్వం ప్రతిపాద్యతే-యద్యప్యారంభణాధికరణ ప్రపంచమాత్రస్య మిథ్యాత్వం ప్రతిపాదితం- అథాప్యత్ర స్వప్నస్య శుక్తిరజతాది తుల్యత్వోపపాదనా దవునరుక్తిరిత్యవగన్తవ్యం.

సంధ్యాధి కరణమ్‌ 1

1. సూ : సంధ్యే సృష్టి రాహ హి

వివృతిః :- సంధ్యే = స్వప్నస్థానే - సృష్టిః = రథగజాదివిషయా సృష్టి ర్యా సా తథ్యరూపైవ భవితు మర్హతి - కుతః ? ఆహ - హి = యస్మాత్‌ ప్రమాణభూతా శ్రుతి రేవ మాహ ''అథ రథాన్‌ రథయోగాన్‌ పథ స్సృజతే -'' ఇతి సృజత ఇతి నిర్దేశో హి లోకే సత్యానా మేవఘటాదీనా ముత్పత్త్యనుకూలే వ్యాపారే ప్రయుజ్యతే - అత స్సత్యైవతత్రత్యా సృష్టి రితి -

వివరణము:- వెనుకటిపాదమునపంచాగ్ని విద్యాప్రసంగమున జీవునియొక్క సంసారగతి విశేషము విపులీకరింపబడినది. ఈ పాదమున నా జీవుని అవస్థావిశేషము విశదీకరింపబడును. సంసారగతి విశేష ప్రతిపాదనమున నానావిధ జన్మలను జీవులు పొందుచుందురనియు - తత్తజ్జన్మప్రాప్తియనునది బహుళ దుఃఖ హేతువనియు - కాన జననమరణ ప్రవాహరూపమగు సంసారమునందు వైరాగ్యము నవలంబింపవలసి యుండుననియు సూచింపబడినది. వైరాగ్యసంపన్నుడగు నాతడు బ్రహ్మవిద్యయం దధికారికాగలడు- కాన నాతనికి బ్రహ్మాత్మతత్త్వబోధ గలుగజేయుటకు గానుతత్త్వావబోధక మహావాక్యాంతర్గత తత్‌ - త్వం పదములయొక్క అర్థమును విశదీకరించుటకు ఈ పాద మారంభింపబడుచున్నది. అందు ''న స్థానతః....'' అను గ్రంథమువరకు త్వం పదార్థముయొక్కయు - అచటినుండి తత్పదార్థముయొక్కయు వివేచనము చేయబడగలదు. ఈ ప్రథమాధి కరణమున స్వప్నసృష్టికి మిథ్యాత్వము ప్రతిపాదింపబడుచున్నది. వెనుకటి యధ్యాయములోని ఆరంభణాధికరణములో సర్వ ప్రపంచమును మిథ్యయే అని నిరూపింపబబడియున్నను నిచటస్వప్నప్రపంచమునకు శుక్తి రజతాదితుల్యత్వ ముపపాదింప బడుచున్నది గాన పౌనరుక్త్యము (చెప్పినదానినే తిరిగి చెప్పుట) అను దోషము సంభవించదని తెలిసికొనదగును.

స్వప్నమునందు గోచరించు రథగజాశ్వాది సృష్టి సత్యమైనదియే కాగలదు. కారణమేమియన ? ప్రమాణభూతమగు శ్రుతి ''అథ రథాన్‌...సృజతే''స్వప్నమునందు రథములను - రథమున వూన్చబడు అశ్వాదులను - రథసంచార మార్గములను సృజించుచున్నాడు. అని యిట్లు ప్రతిపాదించుచున్నది గనుక నని తెలియదగును. సృజతే అను పదము లోకమున సత్యములగు ఘటాది పదార్థములయొక్క సృష్టి వ్యాపారమును బోధించుటకే ప్రయోగింపబడుచున్నది. అట్టి సృజతే అనుపదము స్వప్నమును బోధించు ఆ శ్రుతిలోను ప్రయోగింపబడినది. కాన స్వప్నమందలి సృష్టి సత్యమే కాగలదు.

2. సూ : నిర్మాతారం చైకే పుత్రాదయశ్చ

వివృతిః :- చ = కించ, ఏకే=ఏకే శాఖినః కఠాః- నిర్మాతారం= ''య ఏష సుప్తేషు జాగర్తి కామంకామం పురుషో నిర్మిమాణః'' ఇతి సంధ్యే స్థానే కామానాం నిర్మాతారం = కర్తారం పరమేశ్వర మామన్తి - పుత్రాదయః - చ = కామా శ్చాత్ర పుత్రాదయ ఏవ - తథా ఉపక్రమాత్‌ - కామ్యన్త ఇతి కామా ఇతి వ్యుత్పత్త్యా కామశబ్దస్య అభిలషితార్థవిషయ కత్వస్య వక్తవ్యత్వాత్‌ - తస్మా దాకాశాదీనా మివ స్వప్నార్థానా మపి పరమేశ్వర నిర్మిత త్వేన తథ్యరూపత్వ మేవేతి పూర్వః పక్షః -

వివరణము :- మరియు కఠశాఖవారు ''య ఏష....నిర్మిమాణః'' ఎవడు ఇంద్రియములు నిద్రాగ్లానములై వ్యాపారశూన్యములై యుండ తాను జాగరూకుడై ఆయాకామములను (పదార్థములను) నిర్మాణము చేయుచు నున్నాడో ఆతడు పరమేశ్వరుడని వర్ణించు ఈ వాక్యములో స్వప్నస్థానమునందలి పదార్థములకు కర్తనుగా పరమేశ్వరుని ప్రతిపాదించుచున్నారు. కామములనగా ప్రాణులచే కోరబడుచుండెడి పుత్రాదిరూపమగు అభిలషితార్థములని యర్థము. కాన ఆకాశాదులు వలెస్వాప్నిక పదార్థములును పరమేశ్వర నిర్మితములే కాన సత్యరూపములే కాగలవు అని పూర్వపక్షము.

3. సూ : మాయామాత్రంతు కార్‌త్స్న్యే నానభివ్యక్త స్వరూపత్వాత్‌

వివృతిః :- తు = సంధ్యే సృష్టి ర్న పారమార్థికీ -కింతు మాయామాత్రం=శుక్తిరజతాదివత్‌, మిథ్యైవ కేవలం - కుతః ? కార్‌త్స్న్యే=దేశ కాల స్తుసంప త్యబాధరూప పరమార్థవస్తుధర్మేణ సర్వేణ - అనభివ్యక్తస్వరూపత్వాత్‌ = అసంసృష్టస్వరూపత్వాత్‌ - కించ ''స్వయం విహత్య స్వయం నిర్మాయ'' ఇత్యాది శ్రుత్యా స్వప్నసృష్టే ర్జీవకర్త్వకత్వశ్రవణాదపి స్వప్నసృష్టి ర్మిథ్యై వేతి సిద్ధమ్‌.

వివరణము :- స్వప్నమునందలి సృష్టి శుక్తిరజతాదులువలె కేవలము మిథ్యారూపమే కాని యథార్థము కాజాలదు. కారమమేమియన ? మిథ్యకాని పరమార్థవస్తువులకు సంబంధించి ఉచితదేశము - ఉచితకాలము - ఉచితవస్తు సంపత్తు - అబాధ - అను నిట్టి ధర్మములతో కూడుకొని యుండునది కాదు గనుక - [స్వప్నానుభవకాలమున జీవుడు నాడ్యంతర్గతుడగుచు అత్యల్పకాలములో నదీ పర్వత సముద్రాదులను దర్శించును గదా! అచట ఆ పర్వతాదులకు నరిపడు దేశము - ఆ ప్రదేశములకు సంబంధించిన గుమనాగమనములకు సరిపడు కాలము - తదితర వస్తుసంపత్తు - ఇట్టి ధర్మములు జాగ్రదవస్థయందలి యథార్థవస్తువుల కున్నట్లు ఉండవు - మరియు స్వప్నమునుండి ప్రబోధము కలుగగా స్వప్నమునందు గోచరించిన వస్తువులన్నియు యథార్థములు కాదు అను=లేనివి యనుభావము (బాధనిశ్చయము) న్నూకలుగుచున్నది. ఇట్లు జాగ్రదవస్థయందలి యథార్థవస్తువులకు సంబంధించిన అనుభవములో బాధ నిశ్చయము కలుగదు.] స్వాప్నికపదార్థములయందు ఉచితదేశ - కాల- వస్తుసంపత్త్యభావములు కానవచ్చుచున్నవి గనుక - బాధ నిశ్చయము కలుగుచున్నది గనుకను స్వప్నసృష్టి మిథ్య కాదగును. మరియు - ''స్వయం విహత్య స్వయం నిర్మాయ'' స్వయముగ నిర్మించి - స్వయముగ దానిని పరిహరించి - యని వర్ణించు ఈ శ్రుతివాక్యమున స్వప్నసృష్టి జీవకర్తృకమని సూచింపబడుచున్నది. కానను స్వప్నసృష్టి మిథ్యయే అని నిశ్చయింపదగును.

4. సూ : సూచకశ్చ హి శ్రుతే రాచక్షతే చ తద్విదః

వివృతిః :- స్వప్నమిథ్యాత్వే తత్సూచితస్య లాభాదేః సత్యత్వంన స్యాదిత్యత అహా - సూచకః - చ =స్వప్న స్సత్యార్థ సూచక ఇత్యవ గమ్యతే - కుతః? శ్రుతేః = ''యదా కర్మసు కామ్యేషు స్త్రియం స్వప్నేషు వశ్యతి- సమృద్ధిం తత్ర జానీయాత్‌'' ఇత్యాదేః- తద్విదః- చ=స్వప్నాభ్యాయవిద శ్చ-ఆచక్షతే- హి = ఏవ మేవాచక్షతే - కుంజరారోహణాదీనిధన్యాని - గర్దభయానాదీ న్యధన్యా నీత్యేవ మాదినా - సూచ్యమానస్య వస్తునోమిథ్యాత్వేపి సూచకం స్త్రీదర్శనాదికం మిథ్వైవ భవితు మర్హతి - బాధ్యమానత్వాత్‌ , జీవనిర్మితత్వాచ్చ మరుమరీచికా జలవత్‌ - ''య ఏష సుప్తేషు జాగర్తి'' ఇత్యాది శ్రుతి ర్జీవస్వరూపానువాదినీ జీవసై#్యవ స్వాప్నికార్థకర్తృత్వం గమయతి - ఏతదనురోధేన ''సృజతే'' ఇత్యేషాపి గౌణీతి వ్యాఖేయ - ఇతి-

వివరణము :- స్వప్నము మిథ్యయే యగుచో తత్సూచితమగు లాభనష్టాదులుసత్యమలు కాకపోవలసి వచ్చునని యనగా చెప్పుచున్నారు- ''యదా కర్మ ను ....జానీయాత్‌-'' కామ్య కర్మ లనుష్ఠింపబడుచుండగా స్వప్నమునందు అలంకృతయగు పుణ్యస్త్రీ దర్శనము కలిగినచో నా కర్మఫలమునందు సమృద్ధి కల్గునని వర్ణించు శ్రుతినిబట్టి స్వప్నము సత్యార్థమును సూచించునని తెలియవచ్చుచున్నది. మరియు - స్వప్నశాస్త్రవేత్తలు స్వప్నమున గజలముల నధిరోహించుట మొదలగునవి ధన్యము (శుభసూచకము)లని - గర్దభారోహణము మొదలగునవి ధన్యము (అళుభసూచకము) లనియు నిట్లు చెప్పుచున్నారు. ఇందు స్వాప్నికపదార్థ సూచితమగు లాభాలాభ శుభాశుభాదులు సత్యములైనను - తత్సూచకమగు స్త్రీ దర్శనము - గజారోహణము మొదలగు పదార్థములు ఎండమావులలోని నీరువలె మిథ్యా భూతములే యగును గాని యథార్థములు కానేరవు. ప్రబోధము కలుగగా బాధింపబడుచున్నవి గనుకనున్నూ - [ఆ స్త్రీ దర్శనాదు లసత్తులే - లేనివియే యను నిశ్చయము కలుగుచున్నది గనుక-] జీవనిర్మితములు గనుకనున్నూ అని తెలియదగును. ''య ఏష సుప్తేషు జాగర్తి'' ఇంద్రియములన్నయు వ్యాపారశూన్యములై నిద్రించుచుండనెవడు జాగరూకుడై స్వాప్నికార్థముల దర్శించుచుండునో అని చెప్పుచు జీవస్వరూపము ననువదించుచున్న ఈ శ్రుతివాక్యము స్వాప్నిక పదార్థకర్తజీవుడే అని తెలియజేయుచున్నది. ఈ శ్రుతివాక్యము ననుసరించి ''అథ రథాన్‌...సృజతే'' అను శ్రుతివాక్యములోని ''సృజతే''అను పదముచే ప్రతిపాదింపబడు సృష్టియు గౌణమేకాని ముఖ్య (యథార్థ) సృష్టికాదనియు వివరింపవలసియుండును.

5. సూ : పరాభిధ్యానాత్తు తిరోహితం తతోహ్యస్య బంధవిపర్య¸°

వివృతిః - పరసై#్యవ హ్యాత్మనోంశో జీవః - తతశ్చ జీవస్యాపి సత్యసంకల్పత్వా ద్యైశ్వర్యయోగాత్సాంకల్పికీ సప్నే రథాదిసృష్టిస్సత్యైవ భవిష్యతీ త్యత ఆహ - తిరోహితం = జీవానాం బ్రహ్మాంశ##త్వేన యత్స్వభావ సిద్ధం జ్ఞానైశ్వరయాదికం తత్తిరోహితం సత్తదేవ వునః - వరాభిధ్యానాత్‌ - తు = పరమేశ్వరోపాసనాత్‌ సిద్ధస్య కస్యచి దేవ భవతి - కుతఏవ మవగమ్యత ఇతి చేత్‌ - హి = యస్మాత్‌ తతః = పరమేశ్వరాద్దేతోః=పరమేశ్వరాపరిజ్ఞాన పరిజ్ఞానాభ్యా మేవ - బన్ధవిపర్యయో= అన్యజీవన్య సంసార మోక్షా భవత ఇతి - శ్రుతిః ''ఇత్యాద్యా దర్శయతి - ఏవం చ జీవేశ్వరయో రభేదే పై#్యశ్వర్యస్య తిరోహితత్వా న్న జీవన్య సంకల్పమాత్రేణ స్రష్టృత్వ మితి భావః-

వివరణము :- జీవుడు పరమాత్మాంశ##మే అని నిరూపింపబడినది. అట్లు కాగా పరమాత్మకు వలెనే జీవాత్మకును సత్యసంకల్పత్వా ద్యైశ్వర్యములు సంభవించును గనుక స్వప్నమునందు జీవునియొక్క సంకల్పముచే సృజింపబడిన రథాది పదార్థసృష్టి సత్యమే కాదగును. అది మిథ్యయనుట అనుచితమని ఆశంక కలుగగా చెప్పబడుచున్నది - జీవులందరు బ్రహ్మాంశములే - బ్రహ్మాస్వరూపులే - అందరకును జ్ఞానైశ్వర్యాది యోగము కలదు గాని అది తిరోహితమై యుండును. పరమేశ్వరో పాసనాపాటవమున సిద్దినొందిన ఒకానొక మహాత్మునకు మా త్రమా ఐశ్వర్యము తిరిగి సంభవించును. కాని అందరకు ఎల్లప్పుడు నది సిద్ధమై యుండదు. జీవులకు బంధవిపర్యయములు= సంసార మోక్షములు పరమేశ్వరుని నుండియే యేర్పడగలవు. అనగా తత్పరిజ్ఞాన తత్పరిజ్ఞానములనుండియే యేర్పడును అని ''జ్ఞాత్వా దేవం .... ప్రహాణిః'' పరమేశ్వర విజ్ఞానమున సర్వపాశములు = బంధములు నశించును. క్లేశములు క్షయించును. అంత జననమరణ ప్రవాహరూప సంసారమును నివర్తించును - అని యిట్లు ప్రతిపాదించుచున్న శ్రుతులు తెలియజేయుచున్నవి. ఇట్లు చెప్పుచుండుటచే జీవేశ్వరులకు భేదము లేకున్నను అవిద్యావశుడగు జీవునకు సత్యసంకల్పత్వా ద్వైశ్వర్యము తిరోహితమైయున్న కారణమున నా జీవునకు సంకల్పమాత్రమున స్వప్నపదార్థ స్రష్టృత్వము సంభవించదనియు - స్వప్నపదార్థసృష్టి సత్యము కానేరదనియు సిద్ధమగుచున్నదని భావము.

6. సూ : దేహయోగ ద్వా సో?పి

వివృతిః :- జీవ సై#్యశ్యర్య తిరోభావే హేతుః కథ్యతే- నః-అపి=జీవన్య జ్ఞానైశ్వర్యాది తిరోభావోపి - దేహయోగాత్‌ = దేహేంద్రియాది ష్వహం మమాభిమానాత్‌, అనాద్యవిద్యాకృతా దేవ భవతి - తస్మా దుపపన్నం స్వప్నార్థానాం శుక్తిరజతాదీనా మివ మిథ్వాత్వ మితి -

వివరణము :- జీవునకు తదైశ్వర్య తిరోభావము కలుగుటలో హేతువు చెప్పబడుచున్నది - జీవునకు ఆజ్ఞానైశ్వర్యాది తిరోభావమున్నూ అనాదికాల ప్రవృత్తమగు అవిద్యవలన నేర్పడుచున్న దేహాదులయందలి అహంకార మమకారములవలన నేర్పడుచున్నది. కాన స్వాప్నికార్థములు శుక్తిరజతములు వలె మిథ్యాభూతములే యని యనుట యుక్తిసహమే -

తదభా వాధికరణమ్‌ 3

7. సూ : తదభావో నాఢీషు తచ్ర్ఛుతే ర్మాతని చ

వివృతిః :- జీవన్యస్వప్నావస్థా చిన్తితా. ఇదానీం సుషుప్త్యస్థాచిస్త్యతే. తదభావః=జీవన్య స్వప్నదర్శనాభావః= సుషుప్తిః- నాడీషు -ఆత్మని - చ=నాడీషు - ఆత్మని=బ్రహ్మణి. పురీతతి చ సముచ్చయేన భవతి. (హృదయే స్థితః పుండరీకాకారో నాడీకందః పురీత దితి కథ్యతే) కుతః ? తచ్ఛ్రుతేః =తేషాం నాడ్యాదీనాం సుషుప్తి స్థానత్వస్య శ్రుతత్వాత్‌ "ఆసు తదా నాడీషు నృప్తో భవతి", - 'తాభిః ప్రత్యవసృప్య పురీతతి శేతే", "యఏషో7న్తర్హృదయ ఆకాశ స్తస్మింశ్ఛేతే" ఇత్యాద్యాసు శ్రృతిషు - తత్ర త్రయాణాం నాడ్యాదీనాం సుషుప్తిస్థానత్వే7పి బ్రహ్మైవ ముఖ్యం సుషుప్తిస్థానమితి, నాడీ పురితతౌ తు ప్రాసాదఖట్వావ దముఖ్యా వితి వివేకః.

వివరణము :- జీవునకు సంబంధించిన స్వప్నావస్థనుగూర్చి విచారించి యిపుడు సుషుప్త్యవస్థను గూర్చి విచారించుచున్నారు.- జీవాత్మకు సంబంధించిన సుషుప్తి నాడులయందు - ఆత్మని = బ్రహ్మయందు- పురీతత్‌ అను స్థానమునందును వీనియందు దన్నిటియందును నేర్పడునని తెలియదగును. {హృదయమున నుండు పద్మాకారమైన నాడీకందము పురీతత్‌ అని చెప్పబడును] ఏలయన? "ఆసు నాడీషు' .... "తాబిః....."య ఏషో...." ఈ శ్రుతులలో నాడులు - పురీతత్‌ - బ్రహ్మయను నివిసుషుప్తిస్థానములుగా నిర్ణయింపబడియున్నవి గనుక - ఈ మూడును సుషుప్తి స్థానములే ఐనను అందు బ్రహ్మయే ముఖ్యస్థానమనియు మిగిలిన రెండును అముఖ్యస్థానములనియు తెలియదగును.

8. సూ :అతఃప్రబోధో7స్మాత్‌

వివృతి: అతః =బ్రహ్మణ ఏవ ముఖ్యసుషుప్తి స్థానత్వాత్‌ - అస్మాత్‌ =బ్రహ్మణ స్సకాశా దేవ ప్రబోధః = జీవస్య ప్రబోధ ఉపదిశ్యతే - "ఏతస్మా దాత్మన స్సర్వే ప్రాణా వ్యుచ్చరన్తీతి - సత ఆగమ్య న విదు స్సత ఆగచ్ఛామహే ఇతి" ఇత్యాది శ్రుతిభ్యః. సద్రూపా ద్ర్బహ్మ ణో7న్యస్య సుషుప్తిస్థానత్వే శ్రుతివిరోధః స్యాత్‌ - అన్యత్ర సుప్త స్యాన్యస్మా త్సముత్థానాయోగాదితి భావః - తస్మాత్‌ సుషుప్తౌ మిథ్యాజ్ఞానా భావమాత్రే ణౖవ బ్రహ్మసంపత్తే స్సత్వాత్‌ మూలాజ్ఞాన నివృత్తౌ సాకల్యేన బ్రహ్మసంపత్తి రవి రుద్ధేతి - అతః జీవస్య బ్రహ్మైక మవ్యాహత మితి సిద్ధమ్‌ -

వివరణము:-బ్రహ్మయే ముఖ్యసుషుప్తి స్థానమగుటవలన ఆబ్రహ్మనుండియే ప్రబోధము కలుగుచున్నది యని "ఏ తస్మా దాత్మనః ...సత ఆగమ్య .."ఇత్యాది శ్రుతులలో నుపదేశింపబడుచున్నది. సద్రూపమగు బ్రహ్మకంటె భిన్నమైనది సుషుప్తిస్థానమగుచో శ్రుతులయందు ప్రతిపాదింపబడిన అర్థమునకు విరోధము వాటిల్లును. సుషుప్తి యొకచోటునను, ప్రబోధము (సముత్థానము) మరియొకచోటు నుండియు ననుట యుక్తము కాదని భావము . ఇట్లు చెప్పుటతో సుషుప్తియందు జీవునకు దేహాదులయందలి తాదాత్మ్యాభిమానరూపమగు మిథ్యాజ్ఞానముమాత్రము తొలగిపోగా సద్రూప బ్రహ్మసంపత్తి కలుగుననియు (సంపత్తి యనగా నేకత్వము)- బ్రహ్మాత్మతత్త్వ జ్ఞానమున మూలాజ్ఞానము నివర్తించగా సంపూర్ణముగా బ్రహ్మసంపత్తి సాక్షాత్‌ బ్రహ్మభావము లభించుననుటలో విరోధమేమియు లేదనియు- కాన జీవాత్మకు బ్రహ్మానన్యత్వ మవ్యాహతమనియు సిద్ధమగుచున్నది.

కర్మానుస్మృతిశబ్ద విధ్యధికరణమ్‌ 3

9. సూ: స ఏవ తు కర్మానుస్మృతి శబ్దవిధిభ్యః

వివృతిః :- సః- ఏవ=యఏవ సుప్తః, స్వాస్ధ్యం గతః స ఏవ జీవో నియమే నోత్తిష్ఠతి - నతు స ఏవ వా, అన్యోవా ఇత్యనియమః - కుతః ? కర్మానుస్మృతి శబ్ద విధిభ్యః = ఏతేభ్యో హేతుభ్యః- కర్మణః =సుప్తోత్థితస్య స్వావశేషిత కర్మణః అనుష్ఠానదర్శనాత్‌ - ఏవం - అనుస్మృతేః =సోహమి త్యనుస్మరణస్య దర్శనాత్‌ - శబ్దాత్‌ = "త ఇహ వ్యాఘ్రో వా సింహో వా పతంగో వాదంశో వా మశకో వా యద్యద్భవన్తి తత్త దాభవన్తి" ఇత్యాది సుషుప్తి ప్రకరణస్థ వాక్యేభ్యః =యజేత -ఉపాసీత ఇత్యాదినా కలాంతరభావి ఫలజనక కర్మోపాపనా విధాయ కేభ్యో విధిభ్యశ్చ. య స్సుప్తస్తసై#్యవ నియమేన యది న పున రుత్థానం తర్హిపూర్వోక్త హేతవో బాధ్యేరన్‌ - అతో య స్సుప్తస్స ఏవోత్తిష్ఠతి ప్రబోధ కాలే నాన్య ఇతి -

వివరణము:- ఎవ్వ డీదేహమున జాగ్రదవస్థయందు వ్యవహరించి అలసినవాడై నిద్రించి స్వాస్థ్యమును చెందెనో ఆ జీవుడే తిరిగి యచట మేల్కాంచి లేచివచ్చి వ్యవహరించునని నియమమా? లేక అట్టి నియమములేక ఆతడేగాని యన్యుడుగాని వచ్చి యచట వ్యవహరించు చుండునని చెప్పవచ్చునా అని యనగా నియతముగ నా జీవుడే మేల్కాంచి యటనుత్థితుడై వ్యవహరించు చున్నాడని చెప్పవలయును గాని యన్యధా కాదని కర్మానుస్మృతి శబ్ధవిధులను హేతువులనుబట్టి నిర్ణయింపబడుచున్నది - నిద్రనుండి మేల్కాంచినవాడు తత్పూర్వము తాను చేసిన కర్మలో (పనిలో ) మిగిలినదానిని. తాననుష్ఠించుచున్నాడు గనుక - నిద్రనొందుటకు పూర్వమున నున్న వ్యక్తిని నేనే అను అనుస్మృతి సుప్తోత్థితునకు కలుగుచున్నది గనుక - "త ఇహ...దాభవన్తి" సుషుప్తి ప్రకరమములోని వ్యాఘ్రములుగాని, సింహముగాని, పక్షిగాని, చీమగాని, దోమగాని యే ప్రాణియైనను నిద్రకు పూర్వమెవ్వరో వారే తమ తమ దేహములయందు తిరిగివచ్చి ప్రవేశించి వ్యవహరించు చుందురని ఈ శ్రుతివాక్యము స్పష్టముగ ప్రతిపాదించుచున్నది గనుక - య జేత - (యాగము చేయుము) ఉపాసీత (ఉపాసనము చేయుము) అని యిట్లు కాలాంతర భావి ఫలహేతువులగు కర్మోపాసనములను విధించు విధి వాక్యములను బట్టియు - ఎ....... నిద్రించెనో ఆతడే నియముగ నా దేహములయందు మేల్కా..... వ్యవహరించు చున్నాడని నిర్ణయింపబడుచున్నది. అట....... పూర్వోక్త హేతువు లన్నియు బాధింపబడగలవు.

అర్థస్య సుషుప్తిధర్మస్య నిస్సంజ్ఞత్వాదే - రర్థస్య మరణధర్మస్య కంపాదే స్సంపత్తి ర్యస్యాం తథావిధా- పృథగవస్థైవసా - నతు జాగ్రదాద్యవస్థా చతుష్టయాన్తర్భూతా. (జాగరితం - స్వప్నః - సుషుప్తిః - ఏతద్భిన్నా చతుర్థీ శరీరా దపసృతిః) కుతః ? పరిశేషాత్‌ = విషయదర్శనా ద్యభావేన తేష్వన్తర్భావ మప్రాప్య పృథగవస్థానా త్పృథగవసైవేతి - [మూర్ఛావస్థా - న స్వప్నజాగరితే - జ్ఞానాభావాత్‌ - నాపి మరణావస్థా - ప్రాణోష్మణో స్సత్వాత్‌ - నాపి సుషుప్తిః - భయానక వదనవత్వాది లక్షణభేదాత్‌ - కింతు పృథగవస్థైవేతి-.]

వివరణము:- అవస్థాత్రయమునుండి ఆత్మస్వరూపమును వివేచన చేసి యీ సూత్రమున మూర్ఛావస్థనుండియు వివేచనము చేయుచున్నారు - [ఆత్మ సర్వావస్థా వివర్జితమని బోధించుటకై యీ విచారములు చేయబడుచున్నవి] మూర్ఛనొందిన వ్యక్తియందు గోచరించు మూర్ఛ యనునది - తెలివిలేకుండుట యను సుషుప్త్యవస్థయందలి కొంత ధర్మమును- కంపాదిరూపమగు మరణావస్థయందలి కొంత ధర్మమును - కలిగియున్నది గాన నది జాగ్రదఫస్థ - సప్నాపస్థ - నుషుప్త్యవస్థ - ఏతద్భిన్నమగు మరణావస్థయను నీనాల్గు అవస్థలలోదేనిలోను చేరని పృథగవస్థయే అని తెలియదగును మనోవ్యాపారములు. విశేషవిజ్ఞానములు నుండవు గాన జాగ్ర...... ప్నావస్థలలో చేరదు - ప్రాణవ్యాపారములు - శరీరమున ఊష్మ ....... కలదుగాన మరణావస్థలో చేరదు. ముఖము - శ్వాసవ్యాపార ..... ములుగా లేక భయంకరముగను - విషమముగను నుండు ..... చేరదు - కాన మూర్ఛ యనునది పృథగస్థయే...........

మాపాదసమాప్తి తత్పదార్థం శోధయితుం విచారాః క్రియన్తే - తత్రాదావే తస్మి న్నధికరణ యేన బ్రహ్మణా సుషుప్త్యాదిషు జీవ ఉపాధ్యుపశమాత్సంపద్యతే తస్య బ్రహ్మణ స్తత్పదార్థభూతస్య స్వరూపం విచార్యతే- పరస్య=బ్రహ్మణః ఉభయలింగం=సాకారత్వనిరాకారన్వే న=స్వస్వరూపం న భవత - సత్యస్య వస్తునో ద్వైరూప్యం న కథమపి సంభవతి స్థానతః- అపి=ఉపాధివశా దపి బ్రహ్మణ ఉభయరూపత్వం న తాత్త్వికం భవితు మర్హతి - న హ్యగ్నిసంయోగోపాధిక మంబుగత మౌష్ణ్యమంబున స్స్వాభావికం భవతి - సర్వత్ర - హి =యస్మాత్‌ సర్వత్ర పర బ్రహ్మప్రతిపాదకేషు శ్రుతి వాక్యేషు "అశబ్ద మస్పర్శ మరూప మవ్యయం తథా7రసం నిత్యమంగధవచ్చ యత్‌" ఇత్యాది ష్వపాస్తనమస్త విశేష మేవ బ్రహ్మో పదిశ్యతే - అతో నిర్విశేషైకస్వభావం బ్రహ్మే త్యవసీ యతే.

వివరణము :- గడచిన నాల్గధికరణములలో తత్త్వమసి యను మహావాక్యములోని త్వం పదమున కర్థమైన జీవాత్మయొక్క స్వరూపమును గూర్చి సంశోధించి =విచారించి అది సర్వావస్థా వివర్జితమని స్వప్రకాశ చిన్మాత్ర స్వరూపమని - నిర్విశేష స్వభావకమని - నిరూపించియికముం దీపాదము చివరివరకు నా వాక్యములోని తత్‌ పదార్థమును శోధించి నిర్థరించుటకై విచారములు జరుపబడుచున్నది. ఇప్పుడీ అదికరణములో ఉపాధులుపశమింప సుషుప్త్యాదులయందు జీవాత్య యే బ్రహ్మవస్తువుతో నేకీభవించు చున్నాడో తత్పదార్థమైన ఆ వస్తువు యొక్క స్వరూపము విచారింపబడుచున్నది-

బ్రహ్మవస్తువు సాకారమని, నిరాకారమని రెండు స్వరూపములను వాస్తవముగ కలది కానేరదు. సత్యవస్తు వెన్నడును రెండు రూపములు కలది కాజాలదు. ఉపాధివశమున ద్విరూపత్వము సంభవించరాదాయనిననది తాత్త్వికమన =యథార్థమన చెల్లదు. అగ్ని సంయోగవశమున జలమునకు సంభవించిన ఉష్ణత్వము (వేడి) స్వాభావికము కాదగదు కదా : మరియు పరబ్రహ్మ ప్రతిపాదక శ్రుతివాక్యములలో నన్నియెడలను "అశబ్ద మస్పర్శ ...... యత్‌" అని యిట్లు శబ్ద- స్పర్శ, రూప, రసాది సర్వవిశేష వివర్జితముగనే బ్రహ్మవస్తు వుపదేశింపబడుచున్నది- కాన బ్రహ్మ నిర్విశేష చిన్మాత్ర స్వభావకమే గాని ద్విరూపము కాదని తెలియదగును.

12. సూ : నభేదా దితిచేన్న ప్రత్యేక మతద్వచనాత్‌

వివృతిః :- న=బ్రహ్మణో నిర్విశేషైకరూపత్వం న సంభవతి -కుతః ? భేదాత్‌ =ప్రతివేదాన్తం బ్రహ్మణః ఆకారభేదానాం దర్శనాత్‌ -క్వచి చ్చతుష్పా ద్ర్బహ్మేతి - క్వచిత్‌ షోడశకల మితి- క్వచి త్త్రైలోక్య శరీరం వైశ్వానరాఖ్య మితి - ఏవం భిన్నభిన్నతయా ప్రతిపాద్యమానత్వాత్‌ - ఇతి - చేత్‌=ఇత్యుచ్యతే, నిత్‌ - న =నైతద్యుక్తం - కస్మాత్‌ ? ప్రత్యేకం =ప్రత్యుపాధి భేదం అతద్వచనాత్‌ = బ్రహ్మణః అభేద ప్రతిపాదక వచనానాం సత్వాత్‌ - "యశ్చాయ మస్యాం పృథివ్యాం తేజో మయో7మృతమయః పురుషో యశ్చాధ్యాత్మం శారీర స్తేజోమయో7మృత మయః పురుషో7య మేవ సః యోయ మాత్మా" ఇత్యాది శ్రుతిషు బ్రహ్మణఃసర్వోపాదిషు పృథివీజలాది ష్వభేదప్రతిస్వపాదితత్వా దిత్యర్థః .

వివరణము:- వేదాంతము (ఉపనిషత్తు) లన్నిటిలో బ్రహ్మవస్తువు యొక్క స్వరూపము భిన్నభిన్నముగ అనగా నొకచోట బ్రహ్మ చతుచతుష్పాత్‌ =నాల్గుపాదములు కలది యని - ఒకచోట - షోడశకల (పదహారు అవయము) లు కది యని - మరియొక చోటున వైశ్వానర సంజ్ఞకలదియై ముల్లోకములును నెవ్వరికి శరీరమగునో అట్టిది యనియు నిట్లు వర్ణింపబడి యున్నది గనుక బ్రహ్మ నిర్విశేషత్వ మను ఒక్కేరూపము కలది యని యనుట పొసగదు అని యనరాదు - కారణమేమియన ? సమస్తోపాధులయందును బ్రహ్మవస్తువునకు అభేదమును ప్రతిపాదించు వచనము లనేకములు కలవు గాన. "యశ్చాయ మస్యాం....యో7య మాత్మా" ఇత్యాది శ్రుతులలో పృథివి - జలము మొదలగు సమస్తోపాధుల యందును బ్రహ్మవస్తువున కభేదము ప్రతిపాదింపబడుచున్నది గనుక - కాన బ్రహ్మ నిర్విశేషైక స్వరూపమే యని యనదగును.

13 సూ : అపిచైవ మేకే

వివృతిః :- అపి - చ - ఏకే =ఏకే శాఖినోపి ఏవం =భేదదర్శన నిందాపూర్వక మభేదమేవ బ్రహ్మణ స్సమామన్తి. " మృత్యో స్సమృత్యుమాప్నోతి య ఇహ నానేవ పశ్యతి...." "మనసైవేద మాప్తవ్యం. నేహనానాస్తి కించన" ఇత్యాదినా -

వివరణము : - మరియు కొన్ని వేదశాఖలు "మృత్యో స్స.....కించన" భేదము కలదిగ గ్రహింపబడుచున్న నీ బ్రహ్మవస్తువునందు యథార్థముగభేదముకలదనియెవడు గ్రహించునో ఆతడుమృత్యు పరంపరలనేపొందును గాని పరమపురుషార్థమును పొందజాలడు అనియు- "మన సైవేద........కించన" ఆ తత్త్వము ప్రత్యక్‌ ప్రవణమైన సంస్కృతమైన మనస్సుతో పొందదగినది, అందెట్టి భేదమును ఏ కొంచమైనను నుండదు అని - భేదమును దర్శించుట అనర్థహేతువని నిందించుచు అభేదమును స్ఫుటముగ ప్రతిపాదించుచున్నవి గనుకను బ్రహ్మ నిరిశేషైక స్వరూపమే యని యనదగును.

14. సూ : అరూపవదేవ హి తత్ర్పధానత్వాత్‌

వివృతిః :- అరూపవత్‌ - ఏవ =పరంబ్రహ్మ రూపాద్యాకార రహిత మేవ = నిర్విశేష మేవే త్యవధారణీయం - కుతః ? తత్ర్పధానత్వాత్‌ = "అస్థూల మనణు - అశబ్ద మస్పర్శ మరూపం...." ఇత్యాది శ్రుతీనాం ప్రాధాన్యేన - అపాస్త సమన్త విశేషస్వరూపం బ్రహ్మేత్యేవ మర్థపరత్వాత్‌-

వివరణము :- "అస్థూల - మనణు" ....."అశబ్దమస్పర్శ...." ఇట్టి శ్రుతి వాక్యములు సమస్తవిశేష విరహితమైన స్వరూపముకలది బ్రహ్మ వస్తువు అను నర్థమును ప్రతిపాదించుటయందే ప్రధానముగ తాత్పర్యము కలవియై యున్నవి గానను బ్రహ్మ నీ రూపమనియే = నిర్విశేషమనియే నిశ్చ యింపదగును.

15. సూ : ప్రకాశవ చావైయర్థ్యం

వివృతిః - ఆకార ప్రతిపాదకశ్రుతీ రభిలక్ష్యోచ్యతే - ప్రకాశవత్‌ - చ =యథా వ్యాపకోపి సూర్యాదిప్రకాశః అంగుళ్యా ద్యుపాధియోగా దృజువక్రాదిభావ మాపద్యతే - ఏవం బ్రహ్మా వ్యుపాధియోగా త్సవిశేష మివ=సాకార మివ భవతి - అతః - అవైయర్థ్యమ్‌ = బ్రహ్మణి తాదృశాకార విశేషోపదేశః - ఔపాధిక మాకార మాశ్రిత్య భవతి. తథోపదేశ శ్చోపాసనార్థ ఇత్యాకారప్రతిపాదక శ్రుతీనాం నాస్త్యానర్థక్యమితి.-

వివరణముః - ఆకార ప్రతిపాదక శ్రుతులనుగూర్చి చెప్పుచున్నారు- సూర్యచంద్రాదుల ప్రకాశము =కాంతి విపులముగ నాకాశ మున వ్యాపించునది యైనను వేలువంచి దానిద్వారా చూడబడుచు బుజువక్ర రేఖాకారముగ అంగుళి యను ఉపాధినిబట్టి గోచరించుచుండును గదా : అట్లే బ్రహ్మయు ఉపాధివశమున సవిశేషముగ - సాకారముగ నగుచుండును. అట్టి ఉపాధి ప్రయుక్తాకారము నవలంబించియే ఆకార విశేషములతో బ్రహ్మశ్రుతులయందు ప్రతిపాదింపబడుచుండును. ఆ ప్రతిసాదనములు ఉపాసనము కొరకు చేయబడుచున్నవి గాన నా సాకార వాక్యములకు వైయర్థ్యముండదు.

16. సూ: ఆహ చ తన్మాత్రం

వివృతిః :- తన్మాత్రం= ప్రకాశాపరపర్యాయ చైతన్య మాత్ర మేవ= చైతన్యవిలక్షణ రూపాంతర రహిత మేవ బ్రహ్మ ఇతి - ఆహ - చ= ఏవం "స యథా సైంధవఘనో7నస్తరో7బాహ్యః కృత్స్నః ప్రజ్ఞాన ఘన ఏవ - ఇత్యాద్యా శ్రుతిః ప్రతిపాదయతి -

వివరణము :- " స యథా సైంధవ.....ప్రజ్ఞానఘన ఏవ" ఉప్పు కల్లు బాహ్యాభ్యంతరముల యందంతటను లవణతర రససంబంధము లేనిదియై లవణరసముమాత్రమే యెట్లగుచున్నదియో అట్లే ఆత్మప్రజ్ఞాన ఘనము=చిన్మాత్రము అని వర్ణించు ఈ శ్రుతి వాక్యము స్పష్టముగ నాత్మ నిర్విశేషము - చిన్మాత్రము అని ప్రతిపాదించుచున్నది.

17. సూ: దర్శయతి చాథో అపి స్మర్యతే

వివృతిః :- చ=కించ అథో - దర్శయతి = "అథాత ఆదేశో నేతి నేతి" ఇత్యాదినా శ్రుతిః స్వయం సర్వప్రపంచ నిషేధముఖేన బ్రహ్మనిర్విశేష మేవేతి స్పష్టం ప్రతిపాదయతి చ - కించ - స్మర్యతే- అపి ="మాయా హ్యేషా మయా సృష్టా యన్మాం పశ్యసి నారద-సర్వభూతగుణౖర్యుక్తం మైవం మాం జ్ఞాతు మర్హసి" ఇత్యాదినా ఐతిహాసికై రపి బ్రహ్మపరమార్థతో నిర్విశేష మేవేతి స్మర్యతే చ .

వివరణము:- "అథాత ఆదేశో నేతి నేతి..." ఇత్యాది శ్రుతి "నేతి నేతి" యని దృశ్య సమస్త ప్రపంచమును నిషేధించుచు నిషేధావధిపూతమగు బ్రహ్మతత్త్వము నిర్మిశేషమే అని స్పష్టమగు ప్రతిపాదించుచున్నది. మరియు - "మాయా.....మర్హసి" శ్రీ మహావిష్ణువు నారదునితో ననుచున్నారు. నారదా: భూతగుణములగు రూపాదులతో గూడి నీ కిపుడు గోచరించుచున్న ఈ రూపము నాచే సృజింపబడిన మాయయే. నన్నిట్టి వానినిగ ఆకారాది విశేషములు కలవానినిగ మాత్రము నీవు గ్రహింపకుము అని. ఇట్టి ఐతిహాసికు లుదహరించు స్మృతినిబట్టియు పరమాత్మ వస్తుతః నిర్విశేషమనియే నిర్ణయింపదగును.

18. సూ : అతఏవ చోపమా సూర్యకాదివత్‌

వివృతిః -అతః-ఏవ-చ=బృహ్మణ స్స్వతో నిర్విశేష చిన్మాత్రత్వాత్‌ - ఉపాధికల్పితానాం విశేషాణా మపారమార్థికత్వాచ్చ హేతోః - సూర్యకాదివత్‌ = జలాశయాది ప్రతిబింబిత సూర్యాదివత్‌ బ్రహ్మప్రతిపత్తవ్య మితి బోధయితుం ఉపమా=ఏషా ఉపమా" యథాహ్యయం జ్యోతి రాత్మా వివస్వాన్‌ అపో భిన్నా బహుధైకో7నుగచ్ఛన్‌ - ఉపాధినా క్రియతే భేదరూపో దేవః క్షేత్రే ష్వేవ మజో7య మాత్మా" ఇత్యాదినా వేదాన్తే షూపాదీయతే - ఏవంచ ఏతద్దృష్టాన్తబలా దపి బ్రహ్మణో నిర్విశేషత్వం సిద్ధ్యతీత్యర్థః -

వివరణము :- బ్రహ్మ స్వయముగ నిర్విశేష చిన్మాత్రము గనుకను, రూపాదివిశేషములు ఔపాధికములు గాన పారమార్థికములు కానేరవు గనుకను - జలాశయములయందు ప్రతిబింబించిన సూర్యునివలె బ్రహ్మ గుర్తింపదగినధి యని బోధించుటకై యీ ఉపమానమును "యథాహ్యయం ....యమాత్మా"జ్యోతీరూపుడు నద్వితీయుడునగు సూర్యుడు జలాశయములయందు ప్రతిబింబించి ఆ ఉపాధుల ననుసరించి యనేక రూపుడగు గ్రహింపబడుచున్నట్లు ఈ ఆత్మయు దేహము లను క్షేత్రముల యందు గోచరించుచు నా ఉపాధులనుబట్టి నానారూపుడగ నజ్ఞులచే గ్రహింపబడుచున్నాడు అని ప్రతిపాదించు శ్రుతివాక్యము పరిగ్రహించినది. ఈ దృష్టాంతమును బట్టియు జూడ బ్రహ్మ నిర్విశేషమే అని సిద్ధించుచున్నదని యర్థము.

19. సూ: అంబువ దగ్రహణాత్తు న తథాత్వం

వివృత్తిః:- దృష్టాన్తే వైషమ్య మాశంకతే - అంబువత్‌=సూర్యాద్యుపాధే ర్జలాశయ స్యేవ - అగ్రహణాత్‌ = బ్రహ్మోపాధే రంతఃకరణస్య మూర్తత్వ- విప్రకృష్టదేశత్వయో రనుపలంభాత్‌ - తథాత్వం - తు=బ్రహ్మణః జలసూర్యకాది సదృశత్వం తు -న =నోపపద్యతే ఏవేత్యాక్షేపః-

వివరణము :-దృష్టాంతము సరికాదని యాక్షేపించుచున్నారు.- ప్రతిబింబము లేర్పడుటకు బింబము మూర్తయై యుండవలయును. ఉపాధికి దూరమున నున్నదియై యుండవలయును. ఆ ధర్మములు సూర్యాదులకు సంభవించును. కాన జలాశయముల యందు తత్ర్పతి బింబము లేర్పడవచ్చును. బ్రహ్మము మూర్తము కాదు గానను - సర్వగతమగుటచే ఉపాధియగు అంతః కరమమునకు వ్యవహిత దేశమున నున్నది కాదు గానను నాబ్రహ్మకు ప్రతిబింబము సంభవించదు కాన బ్రహ్మవిషయమున జలసూర్యకాది దృష్టాంతము సదృశము కానేరదని యాక్షేపము.

20. సూ: వృద్ధిహ్రాసభాక్త్వ మన్తర్భావా దుభయసామంజస్యా దేవం

వివృతిః - అత్రోత్తర ముచ్యతే - అంతర్భావాత్‌ =యథా సూర్యా ప్రతిబింబస్య జలాశయాద్యుపాధి ష్వన్తర్భావా త్తద్గత వృద్ధిహ్రాసభాక్త్వం ఏవం - బ్రహ్మణోవ్యుబాధ్యన్తర్భా వాదుపాధిగత వృద్ధిహ్రాసభాక్త్వ మస్తీ త్యేతావ తాంశే నైవ - ఉభయసామంజస్యాత్‌=దృష్టాన్త దార్షాంతికయో స్సారూప్యస్య సద్భావా జ్జలసూర్యకాది దృష్టాన్తోక్తి రవిరుద్ధైవ. అతః పూరోక్త ఆక్షేపో న ఘటత ఏవేతి భావః - నహిదృష్టాన్తదార్షాంతికయో స్సర్వాంశే సామ్యం సంభవతి- తథాత్వే తదుచ్ఛేద ఏవ స్యాత్‌ -

వివరణము :- ఆ ఆక్షేపమునకు సమాధాన మిచట చెప్పబడుచున్నది. సూర్యాది ప్రతిబింబములెట్లు జలాశయాద్యుపాధ్యన్తర్గతములై ఆ జలములయందలి వృద్ధి - హ్రాస - మాలిన్య - అనేకత్వాది ధర్మము లతో వృద్ధిని- హ్రాసమును- మలినత్వమును - అనేకత్వమును-ఈమొదలగు ధర్మములను పొందుచున్నవి వలె నెట్లు భాసించుచున్నవో అట్లే బ్రహ్మ వస్తువును అంతఃకరణ రూపమగు ఉపాధ్యన్తర్భావము (ఉపాధిసంబంధము) వలన తద్ధర్మములగు పృద్ధిహ్రాస విక్షేప సమాధానాది ధర్మములు కలది వలె భాసించును అను నీ యంశమును మాత్రము పురస్కరించుకొని ప్రతిపాదింపబడిన ఆ దృష్టాంత దార్షాంతిక భావము సమంజసమే యగును. కాన నా ఆక్షేపము యుక్తము కానేదని భావము. దృష్టాంత దార్షాంతికములకు సర్వాంశసామ్య మెచటను సంభవించదు. సర్వాంశ సామ్యమే యున్నచో దృష్టాంత దార్షాంతిక భావమే లుప్తము కాగలదు.

21. దర్శనా చ్చ

వివృతిః :- ఉపాధి ష్వన్తర్భావ మాశ్రిత్య దృష్టాన్త దార్షాంతికభావ ఉపపద్యత ఇత్యుక్తం - స కథం నిశ్చీయత ఇత్యత ఆహ - దర్శనాత్‌ - చ="పుర శ్చక్రే చతుష్పదః- పుర స్స పక్షీ భూత్వా పునః పురుష ఆవిశత్‌" ఇత్యాదిశ్రుతౌ బ్రహ్మణో దేహాద్యుపా ధ్యనుప్రవేశ దర్శనాచ్చ జల సూర్యకాది దృష్టాన్తోక్తి రుపపద్యత ఏవేతి-

వివరణము :- "పురశ్చక్రే.....ఆవిశత్‌" పాదద్వయోపేతమగు మానవదేహములను నిర్మించెను. చతుష్పాత్తులగు పశుదేహములను నిర్మించెను. పిమ్మట వానికి చక్షురాదు లభివ్యక్తములు కాక పూర్వమే సర్వజ్ఞుడగు పరమేశ్వరుడు లింగ (సూక్ష్మ) శరీరము నభిమానించి తద్యుక్తుడై ఆ పురములను (దేహములను) ప్రవేశించెను. అట్లు ప్రవేశించినవాడైనను ఆ పరమాత్మ పురుషుడే పరిపూర్ణుడేగాని పరిచ్ఛిన్నుడు కాదను నర్థమును ప్రతిపాదించు ఈ శ్రుతి బ్రహ్మవస్తువునకు దేహాద్యుపాధులయందు అనుప్రవేశమును వర్ణించుచున్నది గానను జలసూర్యకాది దృష్టాంత ప్రతిపాదనము యుక్తమే కాగలదు.

ప్రకృతైతా వత్త్వాధికరణమ్‌ 6

22. సూ: ప్రకృతైతావత్త్వం హి ప్రతిషేధతి తతో

బ్రవీతి చ భూయః

వివృతిః :- బ్రహ్మణో నిర్విశేష చిన్మాత్రత్వ ముక్త్వాసర్వనిషేధా వధిత్వేన సద్రూపత్వం ప్రతిపాదయితుం నేతి నేతి వాక్యార్థం విశదయతి- ప్రకృతైతావత్త్వం ="ద్వే వావ బ్రహ్మణో రూపే మూర్తం చైవామూర్తం చ" ఇతి వాక్యేన ప్రకృతం - ఏతావత్త్వం =ఇయత్తాపరిచ్ఛిన్నం మూర్తా మూర్తా లక్షణం బ్రహ్మణో రూపద్వయం యదస్తి, ప్రతిషేధతి="అథాత ఆదేశో నేతినేతి" ఇతి శ్రుతిః తదేవ ప్రతిషేధతి - నతు బ్రహ్మప్రతిషేధతి - పూర్వవాక్యే బ్రహ్మణో మూర్తా మూర్తాలక్షణం యద్బ్రహ్మణో రూపద్వయం ప్రకృతం తదేవ అత్రత్య ఇతిశబ్దః పరామృశతి - నతు బ్రహ్మ పరామృతి - బ్రహ్మణ స్తద్వాక్యే రూపద్వయ సంబంధిత్వే నైవోక్తత్వాత్‌ - చ=కించ -హి=యస్మాత్‌. తతః =ప్రపంచనిషేధానంతరం భూయః - బ్రవీతి = "న హ్యేతస్మా దితి నేత్యన్య త్పర మస్తి" ఇతి - అస్యాయ మర్థః ఏతస్మాత్‌ =నేతి నేతీ త్యాదిష్టాత్‌ బ్రహ్మణః- అన్యత్‌=వ్యతిరిక్తం - నాస్తి - బ్రహ్మైవ తు పరమస్తి ఇత్యేతన్నిర్వచన వాక్యం బ్రవీతి =నిరూపయతి - తస్మా త్సద్రూపబ్రహ్మావసానో7యం ప్రతిషేధః నాభావావసాన ఇతి సిద్ధమ్‌.

వివరణము:- బ్రహ్మ నిర్విశేష చిన్మాత్రమని నిరూపించి సర్వ దృశ్య ప్రతిషేధావధి గనుక సద్రూపమును నగు నని ప్రతిపాదించుటకై 'నేతి - నేతి'వాక్యార్థమును వివరించుచున్నారు - "ద్వే వావ..... ....... మూర్తంచ" బ్రహ్మ మూర్తామూర్త లక్షణ రూపమగు రెండు స్వరూపములు కలది యని ప్రతిపాదించు ఈ శ్రుతిలో చెప్పబడిన ప్రకృతమగు బ్రహ్మకు సంబందించిన పరిచ్ఛిన్నమగు మూర్తా మూర్తా స్వరూప ద్వయమునే "అథాత ఆదేశో నేతి నేతి" యనుశ్రుతి నేతి- నేతి యని నిషేధించుచున్నది గాని బ్రహ్మ వస్తువును నిషేధించుటలేదు. కారణ మేమియన ఈ వాక్యములోని ఇతి శబ్దములు ఆ రూపద్వయమునే పరామర్శించును కాని రూపద్వయవత్తుగ చెప్పబడిన బ్రహ్మను పరామర్శించవు. కాన '' అను శబ్దములు ఇతి శబ్దములచే పరామర్శింపబడిన రూపద్వయమునే నిషేధించును. [మూర్తా మూర్త పదములచే సర్వప్రపంచము గ్రహింపబడును - అంత నా నిషేధము సర్వప్రపంచ నిషేధ పర్యవసాయి కాగలదు] మరియు - సమస్త ప్రపంచమును నిషేధించి పిమ్మట "నహ్యేతస్మా దితి నేత్యన్య త్పరమస్తి" యని శ్రుతి ఈ నేతి- నేతి వాక్యముచే సర్వనిషేధావది భూతముగ నుపదేశింపబడిన బ్రహ్మవస్తువు కంటె నన్యమైనది యేదియును లేదు. ఆ బ్రహ్మవస్తువు ఒక్కటియే సత్‌ ఉన్న వస్తువు అని స్పష్టముగ నిరూపించుచున్నది. కాన నిషేధ వాక్యము సద్రూప బ్రహ్మవస్తు పర్యవసానము కలదియగునుగాని అభావ (శూన్య) పర్యవసానము కలది కానేరదని నిద్ధించుచున్నది.

23. సూ: తదవ్యక్తమాహ హి

వివృతి:- యద్యస్తి బ్రహ్మ తత్కుతో నోవలభ్యత ఇత్యత ఆహతత్‌ = పరంబ్రహ్మ- అవ్యక్తం =న వ్యజ్యత ఇత్యవ్యక్తం - అనింద్రియగ్రాహ్యం- తస్మాత్సదపి బ్రహ్మన గృహ్యతే - కస్మాత్‌ ? ఆహ- హి= యస్మాత్‌ - "న చక్షుషా గృహ్యతే - నాపి వాచా నాన్యై ర్దేవై స్తపసా కర్మణా వా" ఇత్యాది శ్రుతిః స్పష్ట మేవం ప్రతిపాదయతి తస్మాత్‌.

వివరణము :- బ్రహ్మ సన్మాత్రమై యున్నవస్తువగుచో నేల ఉపలభ్యమాన మగుటలేదు అనగా చెప్పుచున్నారు - ఆ బ్రహ్మ సద్వస్తువే ఐనను ఇంద్రియాదులకు గోచరించునది కాదు గాన గ్రహింపబడుటలేదు. "న చక్షుషా ... వాచా" ఈ శ్రుతి బ్రహ్మ చక్షురాది గ్రాహ్యముకాదను నంశమును స్పష్టముగ ప్రతిపాదించుచున్నది. కాన విరోధమేమియు లేదు.

24. సూ: అపి సంరాధనే ప్రత్యక్షానుమానాభ్యాం

వివృతిః :- అపి=ఇందియై రగృహ్యమాణ మపి తత్పరం బ్రహ్మ సంరాధనే=భక్తి ధ్యాన ప్రణిధానా ద్యనుష్ఠానకాలే యోగిభి ర్గృహ్యత ఏవ- కథ మేత దవగమ్యతే ? ప్రత్యక్షానుమానాభ్యాం =శ్రుతిస్మృతిభ్యాంశ్రుతిః "పరాంచి ఖాని వ్యతృణత్‌ స్వయంభూస్తస్మా త్పరాజ్‌ పశ్యతి నాంతరాత్మన్‌ -కశ్చిద్ధీరః ప్రత్యగాత్మాన మైక్ష దావృత్తచక్షు రమృతత్వ మిచ్ఛన్‌"ఇత్యాద్యా. స్మృతిః- "యం వినిద్రా జితిశ్వాసా స్సంతుష్టా స్సంయతేంద్రియాః- జ్యోతిః పశ్యన్తి యుంజానాస్తసై#్మ యోగాత్మనే నమః " ఇత్యాద్యా -తాభ్యా మవగమ్యత ఇత్యర్థః -

వివరణముః- ఆ పరబ్రహ్మ వస్తువు ఇంద్రియ గ్రాహ్యము కాకున్ననూ భక్తి - ధ్యాన - ప్రణిధానా ద్యనుష్ఠాన పాటవమున సమాధ్యవస్థ నధికగమించిన కృతార్థులగు యోగులచే గ్రహింపబడుచునే యున్నది యని శ్రుతి స్మృతులలో ప్రతిపాదింప బడుచున్నది. "పరాంచి ఖాని.... మిచ్ఛన్‌" ఇంద్రియములను పరాఙ్ముఖములుగ విధాత సృజించెను. కాన ప్రత్యగ్వస్తువగు బ్రహ్మను ఆ ఇంద్రియముల ద్వారా నెవడును గ్రహింపలేడు - కాని ఒకానొక ధీరుడు అమృతత్వమును (మోక్షమును) కోరినవాడై తన ఇంద్రియములను పరావర్తింపజేసి - ప్రత్యక్ప్రవణముగ జేసి ప్రత్యగాత్మను (బ్రహ్మను) సాక్షాత్కరింప జేసి కొనును అని శ్రుతి బోధించుచున్నది."యం వినిద్రా....నమః" నిద్రను, శ్వాసలను, (ప్రాణవృత్తులను) ఇంద్రియములను నియమింపగల్గిన సంతుష్ఠాంతరంగులైన యోగులగు మహాత్ములు జ్యోతీరూపమగు నా పరబ్రహ్మమును దర్శింతురని యీ స్మృతి సూచించుచున్నది. కాన బ్రహ్మయొక్క సత్తనుగూర్చి సంశయింప నవసరము లేదని భావము.

25. సూ : ప్రకాశాది వచ్చావైశేష్యం ప్రకాశశ్చ కర్మణ్యాభ్యాసాత్‌

వివృతి :- ఏవం జీవబ్రహ్మణోః ద్యాతృధ్యేయభావాంగీకారే తయో ర్భేదోం7గీకృత స్యాదిత్యత ఆహ - ప్రకాశాదివత్‌ - చ = యథా ప్రకాశాకాశాదికం అంగుళికరకాద్యుపాధి సంబంధా దృజువక్రాది విశిష్టతయా7వ భాసతే, వస్తుతస్తు - ఏకరస మేవ - ఏవం బ్రహ్మణో7పి. కర్మణి= ధ్యానోపయోగి బుద్ధ్యాద్యుపాధా వుత్కుర్షాపకర్షాది విశెషైరుపేతే ప్రకాశః = సంరాధకత్వాది భేదరూపే ణావభాసో న విరుద్ధ్యతే - స్వతస్తు బ్రహ్మణః అవైశేష్యం = ఏకర సత్వమేవ ఇదంచ -అభ్యాసాత్‌ ="తత్త్వమసి" ఇత్యాదినా పునః పున ర్జీవాత్మపరమాత్మనో రభిన్నత్వ ప్రతిపాదనా న్నిశ్చీయతే.

వివరణము:- జీవబ్రహ్మలకు ధ్యాతృధ్యేయభావము నంగీకరించినభేదము నంగీకరించి నట్లగును కదా అని ఆశంకరాగా చెప్పుచున్నారు. కాంతి (వెలుగు) ఆకాశము మొదలగునవి అంగుళి- ఘటాదికములు మొదలగు ఉపాధి సంబంధమువలన ఋజు వక్రాది నానాకార విశిష్టములుగా నెట్లు భాసించుచున్నవో - వస్తుతః అవి ఏకరసములే (ఏకాకారములే) అయియుండునో అట్లే బ్రహ్మయు ధ్యానోపయోగి బుద్ధ్యాద్యుపాధులయందు ఉత్కర్షాప కర్షములతో గూడికొని యున్నవానియందు ఆరాధ్య - ఆరాధక ధ్యేయ - ధ్యాతృభావాది భేదరూపములతో నవభాసించుచుండును. స్వరూపతః మాత్రము బ్రహ్మ విశేషవిరహితమే =ఏకరసమే- ఈ యంశము శ్రుతులయందు "తత్త్వమసి" యను నిట్టి వాక్యములలో పునః పునః జీవ పరాభేదము ప్రతిపాదింపబడుచుండుటచే నిట్లు నిశ్చయింపబడుచున్నది.

26 సూ : అతో7నంతేన తథాహి లింగం

వివృతిః :- అతః =యతో జీవాత్మనః పరమాత్మాభేధో వాస్తవః భేద స్త్వౌపాధికః - అతః కారణాత్‌ - అనంతేన =పరేణ బ్రహ్మణా= పరమాత్మనా జీవ ఏకాతాం గచ్ఛ త్యవిద్యానివృత్తౌ - తథా - హి =తథాత్వ ప్రతిపాదకం - లింగం = "సయో హవైతత్పరమం బ్రహ్మ వేద బ్రహ్మైవ భవతి" ఇత్యాది జీవబ్రహ్మణో రేకత్వావబోధకం శ్రుతి వచనం విద్యతే హి. అత ఏవం నిశ్చీయతే.

వివరణము:- జీవాత్మకు పరమాత్మా భేదము వాస్తము - భేదము ఔపాధికము - కాన జీవుడు, తన అవిద్య నివర్తించిపోగా తాను అనంతుడగు పరమాత్మతో నేకీభావమును పొందును. ఈ యంశము "సయో.....భవతి" ఎవడు పరమమగు బ్రహ్మతత్త్వమును తెలిసికొనునో ఆతడు బ్రహ్మయే అగుచున్నాడని యీ శ్రుతివాక్యము ప్రతిపాదించుచున్నది. కాన నిట్లు నిర్ణయింపబడుచున్నది.

27 సూ: ఉభయవ్యపదేశా దహికుండలవత్‌

వివృతిః :- భేదాభేదమత ముపన్యస్యతే - అహికుండలవత్‌ =యథా సర్పసై#్యక సై#్యవ సర్పత్వాకారే ణా భేదః - తసై#్యవ కుండలత్వావస్థాప న్నస్య ప్రాంశుత్వావస్థాపన్నా ద్భేద శ్చ పారమార్థికః - ఏవం బ్రహ్మ ణో7పి చైతన్యరూపే ణా భేదః - జీవత్వేశ్వరత్వరూపేణ తు భేద శ్చ పారమార్థిక ఏవ భవ తీత్యవగన్తవ్యం - కస్మాత్‌ ?ఉభయవ్యపదేశాత్‌ ="తతస్తు తం పశ్యతే నిష్కలం ధ్యాయమానః" ఇత్యాది శ్రుతిషు జీవేశ్వర యోర్ధ్యాతృధ్యేయ భావేన భేదస్య - 'తత్త్వమసి" ఇత్యాది నాభేదస్య చ వ్యపదిశ్యమానత్వా దితి కేచి ద్వదన్తి.

వివరణము ః- భేదభేదమత మిచట ప్రదర్శింపబడుచున్నది - ఒకే సర్పము సర్వత్వమను ధర్మముతో తానభిన్నమే యైనను కుండలత్వా వస్థను పొందిన ఆ సర్పమునకే ప్రాంశుత్వావస్థను పొందియున్న సర్పము కంటె భేదము వాస్తవముగనే యెట్లు సంభవించునో అట్లే బ్రహ్మకును చైతన్యస్వరూపముతో అభేధమును, జీవత్వ - ఈశ్వరత్వరూప ధర్మములతో భేదమును యథార్థముగనే సంభవించునని యంగీకరిపవలయును -ఏలయన ? [కుండలత్వావస్థయన -సర్పము చుట్టలు చుట్టుకొని యుండు స్థితి - ప్రాంశుత్వావస్థయన బారుగనుండు స్థితి -] "తతస్తు....ధ్యాయమానః " ఇట్టి శ్రుతులలో ధ్యాతృధ్యేయ భావముతో జీవేశ్వరులకు భేదమున్నూ- "తత్త్వమసి"ఇట్టి శ్రుతులలో అభేదమున్నూ వర్ణింపబడు చున్నది గనుక నని కొందరు చెప్పుచున్నారు.

28 సూ : ప్రకాశాశ్రయవద్వా తేజస్త్వాత్‌

వివృతిః :- వా=అథవా - అన్యే త్వేవ మాహుః తేజస్త్వాత్‌ = తేజోజాతీయత్వసామ్యాత్‌ ప్రకాశాశ్రయవత్‌ =ప్రకాశ - తదాశ్రయవ దిత్యర్థః - యథా ప్రకాశస్య, తదాశ్రయస్య ఆదిత్యస్య చ సత్యపి భేదే అభేదనిర్దేశో లోకే క్రియతే ప్రత్యక్షప్రమాణబలాత్‌. తథా జీవబ్రహ్మణో రపి స్వతస్సిద్ధభేదయో శ్చైతన్యరూపత్వసామాన్యా భేదదని ర్దేశో7పి శ్రుతిబలా త్ర్కియతే - ఇతి.

వివరణము ః- ప్రకాశము, తదాశ్రయమగు ఆదిత్యాదులకును సహజముగ భేదమున్నను వానికి తేజోజాతీయత్వ (తైజసత్వ) మను సాదృశ్యము కలదు గాన ప్రత్యక్ష ప్రమాణబలము ననుసరించి అభేద వ్యవహారము లోకమున నెట్లు చేయబడుచున్నదో అట్లే జీవబ్రహ్మలకు స్వతః భేదమున్నను చైతన్య రూపత్వ సాదృశ్యము కలదు గాన అభేద వ్యవహారమును శ్రుతివాక్య బలమునుబట్టి చేయబడుచున్నది యని మరి కొందరందురు.

29. సూ: పూర్వ వద్వా

వివృతిః :- వా=అత్ర వా శబ్దః పూర్వోక్తపక్షద్వయ వ్యావర్త నార్థః - అహికుండలన్యాయేనవా . ప్రకాశాశ్రయన్యాయేన వా - భేదా భేదోపపాదనం న సంగచ్ఛతే - తన్మతే కర్తృత్వాద్యాశ్రయస్య జీవత్వస్య పారమార్థికతయా జ్ఞాననివర్త్వత్వాయోగాత్‌ - తతో మోక్షశాస్త్రస్య వైయర్థ్య ప్రసక్తి శ్చ స్యా దతః పూర్వ వత్‌ = "ప్రకాశాదివచ్చావైశేష్యం" ఇత్యాద్యుక్తరీ త్యౌపాధికత్వ పారమార్థికత్వ రూపేణౖవ జీవేశ్వరయో ర్భేదాభేద నిర్దేశ స్సమంజసో నాన్య థేతి -

వివరణము :- ఈ సూత్రమునందలి వా శబ్దము అహికుండల న్యాయము ననుసరించిగాని - ప్రకాశ తదాశ్రయ న్యాయము ననుసరించి గాని భేదాభేదములు రెండును యథార్థములే అని చేసిన ప్రతిపాదనము సంగతము కాదని సూచించుచున్నది. ఆ మతములో కర్తృత్వాద్యాశ్రయ మగు జీవగత జీవత్వము యథార్థము గాన నది జ్ఞానమాత్రమున తొలగి పోవునది కాకపోవును. అంత తత్త్వబోధకమగు మోక్షశాస్త్రములకు వైయర్థ్యము ప్రసక్తము కాగలదు. కాన "ప్రకాశాదివ చ్చావై శేష్యం" ఇత్యాది సూత్రములలో చెప్పినవిధముగ జీవేశ్వరులకు భేదము ఔపాధికమని - అభేదము పారమార్థికమని నిర్దేశించుటయే సమంజసము గాని యన్యధా కాదని తెలియనగును.

30. సూ: ప్రతిషేధా చ్చ

వివృతిః:-=కించ - ప్రతిషేధాత్‌ = "నాన్యోతో7స్తి ద్రష్టా నాన్యోతో7స్తి శ్రోతా...." ఇత్యాదినా శాస్త్రేణ పరమాత్మ వ్యతిరిక్తస్య చేతనస్య. "నేతి నేతి" ఇత్యాదినా శాస్త్రేణ దృశ్యస్య దైతప్రపంచస్య సర్వస్యాపి ప్రతిషేధాత్‌ = నిరాకృతత్వా దపి - బ్రహ్మా7ద్వితీయ మేవేతి సిద్ధాంతః తస్మాచ్ఛ్రుతిబలా న్నిర్విశేష మేకమేవ బ్రహ్మ న తతో7న్యో జీవ ఇతి సిద్ధమ్‌.

వివరణము :- "నాన్యో7తోస్తి ద్రష్టా...." పరమాత్మకంటే నన్యుడగు ద్రష్టము - శ్రతయునై భాసించు చేతనుడగు జీవుడు మరియొకడు లేడని ప్రతిపాదించు ఇట్టి శ్రుతివాక్యముచేతను - "నేతి నేతి" సమస్త దృశ్యప్రపంచమును ప్రతిషేథించుచున్న ఇట్టి శ్రుతివాక్యము చేతను బ్రహ్మ వ్యతిరిక్తమగు సర్వమును నిరాకరింపబడినది గనుకను బ్రహ్మ అద్వితీయమను నదియే పరమసిద్ధాంతము - కాన శ్రుతివాక్యబలము ననుసరించి బ్రహ్మ నిర్విశేషమని, అద్వితీయమని జీవాత్మ తద్భిన్నుడు కాదనియు సిద్ధమగుచున్నది.

పరాధికరణమ్‌ 7

31. సూ : పర మత స్సేతూన్మానసంబన్ధ భేదవ్యపదేశేభ్యః

వివృతిః :- యదేత న్నిరస్తమస్తప్రపంచం బ్రహ్మ నిర్ధారిత మస్మా త్పరమన్యత్తత్త్వం నాస్తీతినిర్ధారయితు మిద మధికరణమారచ్యతే- అతః =ఆస్మా త్పరబ్రహ్మణోపి - వరం= అన్యత్తత్త్వమస్తి - కుత) ? సేతూన్మాన సంబన్ధ భేదవ్య పదేశేభ్యః = సేతువ్యపదేశః - ఉన్మానవ్యపదేశః- సంబంధవ్యపదేశః భేదవ్యపదేశః ఇత్యే తేభ్యో హేతుభ్యస్తథా వగమాత్‌ -" అథాయ మాత్మా స సేతుః" ఇతి బ్రహ్మణః పరప్రాపక సేతుత్వ వ్యపదేశాత్‌ = (వ్యపదేశో నామ వర్ణనం) తస్మాత్‌ - బ్రహ్మాతిక్రమ్య ప్రాప్తవ్య మన్యత్తత్త్వ మస్తీతి గమ్యతే. తథా (2) ఉన్మానవ్యపదేశః= "బ్రహ్మ చతుష్పాదష్టాశఫం". ఇతి- తస్మాత్‌ ఉన్మానం నామ పరిమాణం. యచ్చ లోకే ఇద మేతావ దితిపరిమితం= పరిచ్ఛిన్నం కార్షాపణాది - తతో7న్య దధికం వస్త్వస్తీతి ప్రసిద్ధం- ఏవం బ్రహ్మణో వ్యున్మానవర్ణనా త్తతోన్య దధికం వస్త్వస్తీతి గమ్యతే - తథైవ (3) సంబన్ధవ్యపదేశః= "సతా సోమ్య తదా సంపన్నో భవతి" ఇతి - తస్మాత్‌ - అత్ర సుషుప్తౌ జీవబ్రహ్మణో స్సంబన్ధస్య వర్ణితత్వా ద్బ్రహ్మణో7న్య జ్జీవాఖ్యం వస్త్వస్తీతి గమ్యతే - సంబన్దో హి ద్వినిష్ఠ ఇతి ప్రసిద్ధం లోకే - తథా (4) భేదవ్యపదేశః = "అథ యఏషోన్త రాదిత్యే హిరణ్మయః పురుషో దృశ్యతే" ఇత్యాదిత్యాథారంపురుష మీశ్వరం వ్యపదిశ్య = ఉపవర్ణ్య - తతో భేదేన - "అథ య ఏషో7క్షిణి పురుషో దృశ్యతే - ఇత్యక్ష్యాధారం పురుష ముపదిశతి శ్రుతిః - తస్మాత్‌=ఆదిత్య పురు షాక్షిపురుషయో ర్భేదవ్యపదేసా ద్ర్బహ్మణో7న్య దక్ష్యాధారం కించిత్తత్త్వమస్తీ త్యధ్యవసీయతే- తస్మా దద్వితీయం బ్రహ్మేత్యుక్తిర్న సంగచ్ఛతి ఇతి పూర్వః పక్షః -

వివరణము :- బ్రహ్మతత్త్వము నిరస్తసమస్త ప్రపంచమని నిర్థారణ చేయబడినది. అంతకంటె భిన్నమగు తత్త్వము మరియొకటి లేదని నిర్థారణ చేయుటకీ యధికరణము రచింపబడుచున్నది - ఈ పరబ్రహ్మ కంటె భిన్నమైన మరియొక తత్త్వము కలదని నిర్ణయింపదగును. ఏలయన ? శ్రుతులయందు బ్రహ్మకు సేతుత్వ - ఉన్మాన -సంబంధ - భేద వర్ణనములు కానవచ్చుచున్నవి గనుక - "అథా7య మాత్మా స సేతుః" అను నీశ్రుతి బ్రహ్మను సేతువుగా వర్ణించినది. (సేతువనగా జలప్రవాహములను అడ్డగించు ఆనకట్టయనియు, వంతెన యనియు అర్థము). పరప్రాపకమగు సేతువుగ బ్రహ్మ వర్ణింపబడియుండుటచే బ్రహ్మ నతిక్రమించి పొందదగిన తత్త్వము మరియొకటి కలదని తెలియవచ్చుచున్నది. "బ్రహ్మ చతుష్పాద ష్టాశఫం" అను నీ శ్రుతి బ్రహ్మకు ఉన్మానమును =పరిమాణమును వర్ణించుచున్నది లోకమున నిది యింత కొలత = పరిమాణము కలదియని కొలవబిడన వస్తువుకంటె నధికమగు వస్తువింకొకటి యుండుట ప్రసిద్ధము. అట్లే ఉన్మానవర్ణనమును బట్టి బ్రహ్మకంటె నధికమగు తత్త్వమింకొకటి కలదని తెలియవచ్చుచున్నది. "సతా సోమ్య తదా సంపన్నో భవతి" ఈ శ్రుతి సుషుప్తియందు జీవునకు సద్రూప బ్రహ్మ సంబంధమును వర్ణించుచున్నది. ఈ వర్ణనమును బట్టియు బ్రహ్మాతిరిక్త తత్త్వము మరియొకటి జీవసంజ్ఞకము కలదని తెలియవచ్చు చున్నది. సంబంధము వస్తుద్వయ సాపేక్షము కదా ! "అథయ ఏ షో7న్త రాదిత్యే....." ఈ శ్రుతిలో ఆదిత్యాధార పురుషుని పరమేశ్వరుని వర్ణించి తద్భిన్నముగ "అథ యఏషో7క్షీణి..." అని అక్ష్యాధార పురుషుని ఈ శ్రుతి వర్ణించినది. ఇట్లు ఆదిత్యపురుష - అక్షిపురుషులకు భిన్నత్వము శ్రుతులలో వర్ణింపబడినది గనుక బ్రహ్మకంటె నన్యమైన అక్ష్యాధారమగు తత్త్వము మరియొకటి కలదని నిశ్చయింపబడుచున్నది. కాన బ్రహ్మ అద్వితీయము అని యనుట సంగతము కానేరదని పూర్వపక్షము.

32 . సూ : సామాన్యాత్తు

వివృతిః :- సిద్ధాంతః ప్రతిపాద్యతే - తు=తు- ఇత్యయం శబ్దః పూర్వపక్షం వ్యావర్తయతి - నహి బ్రహ్మణో7న్య త్తత్త్వ మస్తి ప్రమాణా భావాత్‌ - సామాన్యాత్‌ =సాదృశ్యాత్‌ - సేతుత్వవ్వపదేశస్తు - లౌకిక సేతో ర్యథా జలవిధారకత్వం తథా బ్రహ్మణో నిఖిల జగన్మర్యాదావిధార కత్వ మస్తీ త్యేతావ త్సామాన్యాత్‌ = సాదృశ్యా త్కృతః .

వివరణము :- ఇక సిద్ధాంతము ప్రతిపాదింపబడుచున్నది - సూత్రములోని తు శబ్దము పూర్వోక్త పూర్వపక్షమును నిరసించుచున్నది. బ్రహ్మాతిరిక్తమగు తత్త్వ మింకొకటి లేదు అట్టి తత్త్వము కలదని బోధించు ప్రమాణము లేదు గనుగ - సేతుత్వవ్యపదేశము లౌకికమగు సేతువెట్లు జలప్రవాహముల ధరించునో అట్లే బ్రహ్మ నిఖిల జగన్మర్యాదా విధాకరమగు చున్నది యని ధారణ రూప సాదృశ్యమును పురస్కరించుకొని చేయబడినది కాని తత్త్వాంతరము కలదని బోధించుటకు కాదని తెలియదగును.

33. సూ: బుద్ధ్యర్థః పాదవత్‌

వివృతిః :- బుద్ధ్యర్థః = ఉపాసనార్థః - ఉన్మానవ్యపదేశో బ్రహ్మణ్యుపాసనార్థో భవిష్యతి. పాదవత్‌ =యథా కార్షపణ పాదవిభాగో వ్యవహారాయ తద్వత్‌ - యథా మనసి బ్రహ్మప్రతీకే వాక్‌ - ఘ్రాణ - చక్షుః -శ్రోత్రాణా ముపాసనార్థం పాదత్వేన వ్యపదేశ స్తద్వ దిహాపీతి మన్తవ్యం.

వివరణము:- బ్రహ్మయందు చేయబడిన ఉన్మానవర్ణనము ఉపాసనార్థము కాగలదు- వ్యవహారము కొరకు రూపాయి మొదలగు నాణముల యందెట్లు పాదవిభాగము చేయబడుచున్నదో అట్లు - మరియు - మనస్సును ప్రతీకమునుగా జేసికొని చేయబడు బ్రహ్మోపాసనము నుపదేశించు సందర్భములో వాక్‌ - ఘ్రాణ - చక్షుః శ్రోత్రములు పాదములుగా నెట్లు వర్ణింపబడుచున్నవో అట్లే ఇచటను గూడా నని తెలియదగును.

34. సూ : స్థానవిశేషాన్‌ ప్రకాశాదివత్‌

వివృతిః : - స్థానవిశేషాత్‌ - స్థానం =ఉపాధిః- విశేషః=భేదః -స్తస్మా దేకసై#్యవ బ్రహ్మణో బుద్ధ్యాద్యుపాధి సంబన్ధా జ్జీవేశ్వరభేదః ప్రాప్తః - సుషుప్తౌ తూపాధ్యుపశమా త్తత్ర్పయుక్త భేదోపశ##మే జాతేసతి జీవస్య ప్రాజ్ఞే నాత్మనా సంబన్ధః "సతా సోమ్య తదా సంపన్నో భవతి" ఇతి శ్రుతౌ వర్ణితః- జీవేశ్వరభేద ప్రయోజకోపాధ్యుపశమ ఏవ ప్రాజ్ఞే నాత్మనా జీవస్య సుషుప్తౌ సంబన్ధ ఇత్యుపాధ్యుపశమాపేక్ష యోపచర్యతే - అతో న ముఖ్య స్ససంబన్ధః - ఏవ మక్ష్యాదిత్యపురుషయో ర్భేదవ్యప దేశో7పి - అక్షి - ఆదిత్యరూప స్థానవిశేషాపేక్షయా భవతీతి -ఔపచారిక ఏవ న ముఖ్యః కథమితది చేత్‌ ? - ప్రకాశాదివత్‌ = యథా సౌరాలోకాదే రంగుల్యాద్యుపాధియోగా దుపజాతభేద స్యోపాద్యుపశమా దనుపహిత స్వస్వరూపేణ వృత్తౌ = అవస్థానే అయంప్రకాశ స్తేన ప్రకాశేన సంగత ఇత్యౌపచారిక స్సంబన్ధ వ్యపదేశో భవతి లోకే -తద్వ దిహాపీతి.

వివరణము:- ఒకే బ్రహ్మకు స్థానవిశేషము అనగా బుద్ధ్యాద్యుపాది సంబంధమువలన జీవేశ్వరభేదము ప్రాప్తమైనది, సుషుప్తియందు ఆ ఉపాధి సంబంధము ఉపశమింపగా తత్ప్రయుక్తమగు భేదమును ఉపశమించును. ఆంత పరమాత్మతో జీవునకు సంబంధమేర్పడును అని ''సతా....భవతి'' అను శ్రుతియందు వర్ణింపబడినది. భేదహేతువగు ఉపాధి శమించగా సహజమగు అభేద మేర్పడును- వ్యవక్తమగు- అదియే సుషుప్తియందలి జీవేశ్వర సంబంధము కాని వాస్తవము కాదు, [వస్తుభేదాపేక్షము కాదని భావము] ఇట్టిదే అక్ష్యాదిత్యపురుషుల భేదవర్ణనమును నేత్రము -ఆదిత్యుడు అను స్థానభేదమునుబట్టి ఆ భేద మేర్పడుచునక్నది గాని వస్తుభేదములను బట్టి కాదు, కాన నదియును ఔపచారికమే కాని ముఖ్యము కానేరదు-ఎట్లన? సూర్యాదిప్రకాశము అంగుల్యాద్యుపాది సంబంధము కలిగినప్పుడు భేదము కలదిగ గోచరించును. ఆ ఉపాధ్యానుబందము తొలగిపోగా స్వస్వరూపము తోడనే అది యుండును, అప్పుడు లోకులు ఆ ప్రకాశము ఈ ప్రకాశముతో కలసినది యని ఔపచారికమగు భేదమును -సంబంధమును పురస్కరించుకొని వర్ణించు చుందురు. అట్టివియే ఇచటి సంబంధ - భేదవ్యపదేశములును-వాస్తవ సంబంద- భేధప్రయుక్తములు కావని తెలియదగును.

35. సూ: ఉపపత్తేశ్చ

వివృతిః :- ఉపపత్తేః ''స్వమపీతో భవతి'' ఇతివాక్యశేషోక్తోయ స్స్వరూపసంబన్ధ స్స ఉపాధికృతః స్వరూపతిరోధాన మపేక్ష్యై వోక్తో నాన్యధేతి వర్ణనే కృతే ఏవ తస్య సంబన్ధ స్యోపపద్యమానత్వా దపి ''సతా సోమ్యత తదా సంపన్నో భవతి'' ఇత్యాది వాక్యేషూక్త స్సంబతన్ధ అభేదాత్మక ఏవన బేదఘటిత ఇతి వక్తవ్యం - చ = అపిచ -అంత రాదిత్యవాక్యాది నిర్దిష్ట భేదో7ప్యుపాధికృత ఏవ -బహుశ్రుతి ప్రతిపాది తైకేశ్వరత్వస్య- తథావర్ణనే ఏవోపపద్యమానత్వాత్‌

వివరణము :- ''సతా సోమ్య.....'' అను నిట్టి శ్రుతులలో వర్ణింపబడిన సంబంధము అభేదరూపమే (స్వస్వరూపమును పొందుటయే)అని చెప్పవలయును. ఏలయన ''స్వ మపీతో భవతి'' అను ఆ ''సతాసోమ్య....'' అను వాక్యమునకు సంబంధించిన సుషుప్తి కాలమున జీవుడు తన స్వరూపమునే పొందినవాడగుచున్నాడని వర్ణించు వాక్యమునందు స్వరూపసంబంధమేది వర్ణింపబడినదియో అది బుద్ధ్యాద్యుపాథుల యొక్క తిరోధానమును బట్టి చెప్పబడినదియే గాని ముఖ్యమగు వస్తుభేద నిబంధనమగ సంబంధము కాదని చెప్పిననే ఉపపన్నము కాగలదు కాన నట్లు చెప్పవలయునని తెలయదగును. మరియు బహుశ్రుతులయందు ప్రతిపాదింపబడిన ఈశ్వరైకత్వవర్ణనము ఉపపన్నము కావలయును గనుక అంతరాదిత్య వాక్యములయందు ప్రతిపాదింపబడిన భేదమును ఉపాధికృతమేగాని వాస్తము దనియును తెలయదగును.

36. సూ : తథాన్య ప్రతిషేధాత్‌

వివృతిః :- అన్యప్రతిషేధాత్‌ = ''యస్మా త్పరం నాపర మస్తి కించిత్‌....'' ఇత్యాది శ్రుతిషు అన్యస్య = బ్రహ్మణః వ్యతిరిక్తస్య వస్తంతరసన్య ప్రతిషేధాత్‌ = నిషేధాదపి తథా =బ్రహ్మణోన్యత్తత్వం నాస్తీతి నిశ్చీయతే-

వివరణము :- ''యస్మా త్పరం నాపరమస్తి కించిత్‌'' ఇట్టి శ్రుతు లలో బ్రహ్మ వ్యతిరిక్తమగు తత్త్వాంతరము లేదని తత్త్వాంతరము ప్రతి షేధింపబడుచున్నది గనుకను బ్రహ్మాతిరిక్త తత్త్వము లేదని నిశ్చయింపబడుచున్నది.

37. సూ : అనేన సర్వగతత్వ మాయామ శబ్దాదిభ్యః

వివృతిః :- అనేన= సేత్వాదివ్యపదేశానాం ముఖ్యత్వ నిరాకరణన వస్త్వంతరస్య ప్రతిషేధేన చ సర్వగతత్వం = బ్రహ్మణ స్సర్వగతత్వ మపి సిద్ధం భవతి- తథా ప్రతిషేధాద్యకరణ ప్రసిద్ధసేతు వద్బ్రహ్మణో7 సర్వగతత్వం -పరిచ్ఛిన్నత్వం -ప్రసజ్యేత - ఆయామశబ్దాదిభ్యః = ఆయామః= వ్యాప్తి - వ్యాప్తివాచకేభ్యః = ''యావాన్వా ఆయమాకాశస్తావానేషో7న్తర్హృదయే ఆకాశః''- ''ఆకాశవ త్సర్వగత శ్చ నిత్యః'' ఇత్యాది శ్రుతివాక్యేభ్యశ్చ బ్రహ్మణ స్సర్వగతత్వ మవగమ్యతే - తస్మా న్నిర్విశేషం బ్రహ్మైవ పరంతత్వం - న తతః పరం తత్త్వ మస్తీతిసిద్ధమ్‌-

వివరణము:- సేతువ్యపదేశ- ఉన్మానప్యపదేశాదులు ముఖ్యములు కావని నిరాకరించుట చేతను- తత్త్వాంతరము బ్రహ్మాతిరిక్తము లేదని నిరాకరించుటచేతను-బ్రహ్మ సర్వగతమని (పరిపూర్ణము -అపరిచ్ఛిన్నము అని) సిద్ధమగుచున్నది.- అట్లు ఆ వ్యపదేశముల నిరాకరింపకున్న బ్రహ్మకు పరిచ్ఛిన్నత్వము ప్రసక్తమయ్యెడది. మరియు వ్యాప్తిని - సర్వగతత్వమును భోదించు ''యావాన్వా ....ఆకాశః'' - ''ఆకాశవ త్సర్వ గతశ్చ నిత్యః'' అను నిట్టి శ్రుతివాక్యములను బట్టియు బ్రహ్మ సర్వగత మని తెలియబడుచున్నది. కాన నిర్విశేషముగు బ్రహ్మయే వరతత్త్వమనియు- అంతకంటె నధికమైన తత్త్వ మింకొకటి లేదనియు సిద్ధమగు చున్నది.

ఫలాధికరణమ్‌ 8

38. సూ: ఫలమత ఉపపత్తేః

వివృతిః :- ఇదానీం తసై#్యవ బ్రహ్మణో వ్యవహారదశాయాం ఫల దాతృత్వం ప్రతిపాద్యతే - ఫలం = యాగాదికర్మణాం స్వర్గాదిరూపం ఫలం -అతః= పరమాత్మన ఏవ భవితు మర్హతి -కుతః? ఉపపత్తేః = తస్య సర్వజ్ఞత్వ- సర్వశక్తిత్వోపేతతయా ఫలదాతృత్వో పపత్తేఃకర్మణాంతు క్షణికత్వా త్కాలాంతరభావి ఫలదాతృత్వం నోపపద్యత ఏవ -

వివరణము: ఇపుడా బ్రహ్మవస్తువే వ్యవహార దశయందు ఫలదాత యగుచున్నదని ప్రతిపాదింపబడుచున్నది. -యాగాది సత్కర్మలకు సంబంధించిన స్వర్గాదిరూపములగు ఫలములు పరమాత్మవలననే ఏర్పడుచుండును. పరమాత్మ నిత్యుడ- సర్వజ్ఞడు -సర్వశక్తి సంపన్నుడు గాన కర్మఫలదాత యాతడని చెప్పుట యక్తము . కర్మలు క్షణికములు కాన కాలాంతరభావి ఫలదాతృత్వము వానికి సంభవించు ననుట యుక్తము కాజాలదు.

39.సూ : శ్రుతత్వా చ్చ

వివృతిః :- శ్రుతత్వాత్‌ - చ= '' సవా ఏష మహా నజ ఆత్మాన్నాదో వసుదానః '' ఇత్యాది శ్రుతిషు పరమాత్మనః ఫలదాతృస్య శ్రూయమా ణత్వా దపి- ఫలమీశ్వరా దేవేత్య వగన్తవ్యం .

వివరణము :- ''సవా ఏష..... వసుదానః'' అపరమాత్మ అన్నాదః= ప్రాణులకు తత్తత్కర్మానుసారము అన్నమును సర్వతః ఇచ్చువాడు- దనముల నిచ్చువాడు అని వర్ణించు ఇట్టి శ్రుతులయందు పరమాత్మ ఫలదాతగ ప్రతిపాదింపబడుచున్నాడు గనుక ఫలదాత పరమేశ్వరుడే అని గ్రహింపవలయును.

40. సూ : ధర్మం జైమిని రతఏవ

వివృతిః :- జైమినిః =జైమిని రాచార్యః ధర్మం= అపూర్వాఖ్యం , కర్మజన్యం చిరకాలస్థాయి సంస్కారవిశేష మేవ యాగాది కర్మణాం ఫలదాతారం మన్యతే -కుతః? అతః- ఏవ= పూర్వోక్త శ్రుత్యువపత్తిరూపాద్ధేతో రేవ-'' స్వర్గకామో యజేత'' ఇత్యాద్యా శ్రుతిః -సాచవిధివిషయస్య యాగస్య స్వర్గసాధనత్వం ప్రతిపాదయతీతి, తన్నిర్వాహార్థం శ్రుతిప్రామాణ్యా దపూర్వాఖ్యో వ్యాపారః యాగ స్యోత్తరావస్ధారూపః కల్పనీయ ఇతి తథాచ తాదృశయాగాది ధర్మ ఏవ ఫలదాతేతి జైమిని రాచార్యోమన్యతే- ఈశ్వరస్య సర్వప్రాణి సాధారణత్వాత్తస్య విచిత్రఫలదాతృత్తవాగంగీకారే తస్య వైషమ్య నైర్ఘృణ్య దోషప్రసక్తిః సకర్మాపేక్ష్య ఫలం దదా తీత్యుక్తే కర్మణఏవ ఫలసాధనే కి మీశ్వరే ణాంతర్గడునా, ఇత్యాది న్తర్కః ఉపపత్తి ః తాభ్యాం(శ్రుతి-దోషప్రసక్తి రూపతర్కాభ్యాం)హి కర్మజన్యః అపూర్వాఖ్యో ధర్మ ఏవ ఫలదాతేతిజైమినే రాశయః-

వివరణము:- ఆచార్యులగు జైమిని కర్మజన్యము చిరకాలవస్థాయియు నుగ అపూర్వమనియెడి ఒకనొక సంస్కారమే కర్మఫలము లకు దాతయని తలచుచున్నారు| ఏలయన? వెనుక చెప్పినట్లు శ్రుత్యుపపత్తిరూప హేతువులను బట్టియే ఇట్లు నిర్ణయించుచున్నారు. ''స్వర్గకామోయజేత'' అను శ్రుతి -యాగమును విధించి ఆయాగమునకు స్వర్గసాధనత్వమును ప్రతిపాదించిచనది. శ్రుతిప్రమాణసిద్ధ మగు స్వర్గసాధనత్వమును యాగమునకు సమర్థించుటకుగాను అపూర్వ సంజ్ఞకమైన యాగము యొక్క ఉత్తరావస్థారూపమగు యాగజన్యమగు నొక వ్యాపార విశేషముగ కల్పించవలయుననియు జైమిన్యాచార్యులు తలంచుచున్నారు. మరియు ఈశ్వరుడు సర్వప్రాణులకు - సర్వజీవులకు సాధారణుడు గాన ఆయనకు విచిత్రఫలదాతృత్వము నంగీకరించుచో నాయనకు వైషమ్య- నైర్ఘృణ్యములను దోషములు ప్రసక్తములగును. ఆ దోషమును పరిహరించుటకు ఈశ్వరుడు జీవులకు వారి వారి కర్మ నపేక్షించి ఫలము నిచ్చునని చెప్పుచో కర్మవల్లనే ఫలము సిద్ధించుచుండ తన్మధ్యమున (కర్మ, ఫలములమధ్య) ఈశ్వరుని ఫలదాతగ నంగీకరించుట అనుపపన్నము కాగలదు. ఈ కారణముల వలన కర్మజన్యమగు అపూర్వఖ్యమగు ధర్మమే ఫలదాతయగు నని జైమిన్యాచార్యుల యాశము.

41. సూ : పూర్వంతు బాదరాయణో హేతువ్యపదేశాత్‌

వివృతిః :- సిద్ధాంతపక్షం నిర్దిశతి- బాదరాయణః తు= బాదరాయణ ఆచార్యస్తు - పూర్వం= పూర్వక్తమీశ్వర మేవ ఫలయేతు మన్యతే- కుతః ? హేతువ్యపదేశాత్‌= ''ఏష హ్యేవ సాధు కర్మకారయతి తం యమేభ్యో లోకేభ్య ఉన్నినీషతే '' ఇత్యాది శ్రుతిభి రీశ్వరసై#్యవఫలహేతుత్వనిర్దశా -త్కర్మణో జడస్య ఫలప్రద త్వాసంభవాచ్చ- ఈశ్వరస్య కర్మసాపేక్షత్వేన వైషమ్యాదిదోష ప్రసంగాభావాచ్చ-ఈశ్వర ఏవ ఫలదాతేతి సిద్ధం తదేవ మధికరణ చతుష్టయేన నిర్విశేషః, స్వప్రకాశః, నిషేధావిషయః, అద్వితీయః - శాఖాంచంద్రన్యాయేన కర్మ ఫదాతృత్వే నోపలక్షిత స్తత్పదార్థ ఇతి - తత్త్వంపదార్దౌ శోధితౌ-

ఇతి శ్రీ గాయత్రీ పీఠాధీశ్వరశ్రీ విద్యాశంకర భారతీయయతివర విరచితాయాం బ్రహ్మసూత్రవివృతౌ తృతీయాధ్యాయస్య - ద్వితీయః పాదః

వివరణము:- సిద్ధాంతమును నిర్దేశించుచున్నారు - బాదరాయణా చార్యులు ఈశ్వరుడే ఫలదాతయని తలచుచున్నారు. ''ఏష హ్యేవ..... ఉన్నినీషతే'' ఈ పరమాత్మ ఎవరని యీలోకములనుండి యుద్దరింపదలచునో అతనిచేపుణ్యకర్మలను చేయించును అని వర్ణించు ఈ శ్రుతిఈశ్వరుడే ఫలదాతయని నిర్దేశించుచున్నది గానను -జడమగు కర్మకు ఫలప్రదాతృత్యము సంభవంచదు కనుకను -ఈశ్వరుడు ప్రాణుల కర్మననుసరించియే ఫలదాత యగుచున్నాడని చెప్పుటతో వైషమ్యాది దోషములు ప్రసక్తము కానేరవు గనుకను -ఈశ్వరుడే ఫలప్రదాత యని సిద్ధమగుచున్నది.

ఈ గడిచిన నాల్గధికరణములలో ''తత్త్వమసి'' యను మహావాక్యములోని 'తత్‌' అను పదము యొక్క అర్థము నిర్విశేషమని - స్వప్రకాశ స్వభావకమని -సర్వనిషేధావధి భూతముగాని నిషేధవిషయమగునది కాదని -అద్వీతీయమని - శాఖాచంద్రన్యాయాను సారము ప్రాణి కర్మఫలదాతృత్వ ధర్మము చేనుపలక్షితమగునది గుర్తింపబడునది) యనియు నిరూపింపబడినది. ఇట్లీపాదమున మొదటి నాల్గధికరణములలో 'త్వం' పదార్థమును -తరువాత నాల్గధికరణములతో తత్‌ పదార్థమును శోధింపబడి విచారింపబడి నిర్ణయింపబడినది.

ఇట్లు శ్రీగాయత్రీ పీఠాధీశ్వర శ్రీ విద్యాశంకర భారతీ యతివర విరచితమగు బ్రహ్మ సూత్రార్థ వివరణమున తృతీయాధ్యాయమున ద్వితీయ పాదము ముగిసెను.

తృతీయాధ్యాయస్య - తృతీయఃపాదః

పూర్వస్మిన్‌ ద్వితీయపాదే తత్త్వపదార్థశోధనపూర్వక మద్వితీయ బ్రహ్మతత్త్వం వ్యాఖ్యాతం- ఇదానీం ప్రతివేదాన్తం విజ్ఞానాని భిద్యన్తే నవేతి విచార్యతే - విజ్ఞానశ##బ్దే నాత్ర సగుణబ్రహ్మోపాసనా న్యుచ్యన్తే- సగుణోపాసనాయా శ్చిత్తస్థిరీకరణద్వారా నిర్గుణవిద్యాయా ముపయోగా త్తత్ప్రసంగా ద్విద్యాంతరాణా మపి విచారోత్రక్రియతే -ఉపాసనాని చ కానిచి ద్దృష్టఫలాని - కానిచి దదృష్టఫలాని- కానిచి త్సమ్యగ్దర్శనోత్పత్తి ద్వారేణ క్రమముక్తిఫలాని చేతి వివిధాని దృశ్యన్తే- యానిచ క్రమముక్త్య ర్థాని తత్ర విచార్యతే.

సర్వవేదాన్త ప్రత్య యాధికరణమ్‌ 1

1. సూ : సర్వ వేదాన్తప్రత్యయం చోదనా ద్యవిశేషాత్‌

వివృతిః :- సర్వవేదాన్తప్రత్యయం =సర్వేషు వేదాంతేషు ప్రతీయత ఇతి సర్వవేదాన్త ప్రత్యయం = ఉపాసనం -పంచాగ్నివిద్యా -ప్రాణవిద్యాదికం -తత్‌- సర్వశాఖా స్వప్యేక మేవ -నతు భిన్నం -కుతః? చోదనాద్యవిశేషాత్‌= చోదనాదీనాం =చోదనా విధిః = సంయోగః ఫలం -రూపం= ఉపాస్యాకారః -సమాఖ్యా =నామధేయం -ఏతే షాం అవిశేషాత్‌= ఏకరూపత్వాత్‌ -తథాహి -యథా సర్వశాఖాసు ''అగ్నిహోత్రం జుహుయాత్‌ స్వర్గకామః'' ఇతి చోదనాయాః= విధేః అవిశేషాత్‌ =ఏకరూపత్వాత్‌, నిత్యాగ్నిహోత్రం ఏక మేవ భవతి తథా '' యోహవైజ్యేష్టం చ శ్రేష్టం చప్రాణం వేద'' ఇత్యాది చోదనాయా శ్చన్దోగానాం వాజసనేయినాం చావిశిష్టత్వాత్‌= ఏకరూపత్వాత్‌ ప్రాణ విద్యా, ఏకైవ సర్వేషాం శాఖినా మితి గమ్యతే -కించయః ప్రాణోపానక స్సః ''జ్యేష్ఠశ్చ శ్రేష్టశ్చ స్వానాం భవతి'' ఇతి ఫలస్యాపి సర్వత్రా విశిష్టత్వాచ్చ ప్రాణవిద్యా ఏకైవే త్యవగమ్యతే - ఏవం , ఉపాస్యస్యప్రాణస్య యత్స్వరూపం శ్రేష్ఠత్వాది గుణాన్వితత్వం -యచ్ఛప్రాణ విద్యేతి నామధేయం చ సర్వత్ర సమానం- తస్మా త్ప్రాణవిద్యాదిక ముపాసనం సర్వత్రైక మేవ-

వివరణము:- గడచిన రెండవపాదములో తత్త్వం పదార్థముల స్వరూపమును శోధించి బాగుగ విచారించి అద్వితీయమగు బ్రహ్మతత్వము వ్యాఖ్యానింపబడినది. ఈ పాదమున ఉపనిషత్తులయందు ప్రతిపాదింపబడుచున్న ఉపాసనములు ప్రతిపాదకగ్రంథ భేదముచేత (శాఖాభేదము ననుసరించి) భిన్నములగునా? కావా అనుఅంశము విచారింపబడును-ఉపాసనములు సగుణబ్రహ్మోపాసనము లని నిర్గుణ బ్రహ్మోపాసనము లని రెండు విధములు. సగుణోపాసనములు చితస్థైర్య సంపాదనద్వారా నిర్గణోపాసనోపకారములు కాగలవు. ఈపాదమున నీ ఉపాసనలు, ప్రసంగాగతములగు మరికొన్ని విద్యావిశేషములును (విద్యా -విజ్ఞానము ఇత్యాదిపదములు ఉపాసనమును భోదించును) విచారింపబడగలవు. ఉపాసనములు కొన్ని దృష్టఫలకమలు, మరికొన్ని అదృష్టఫలకములు, కొన్ని తత్వజ్ఞానోత్పాదన ద్వరా క్రమముక్తి సంపాదకమలుగ గూడ నుండును. ప్రకృతము క్రమముక్తి ఫలకోపాసనములను గూర్చి విచారము చేయబడు చున్నది.

సర్వవేదాంతములయందు ప్రతిపాదింపబడుచున్న ప్రాణవిద్య- పంచాగ్నివిద్య- ఈ మొదలగు ఉపాసనముల కేకత్వమేగాని శాఖాభేద ములచే భేదములేదు. ఏలయన? విధి= తద్విధాయక వాక్యము-తత్పలము -ఉపాస్య స్వరూపము-నామము- ఇవియన్నియు ఏకరూపముగ నున్నవి గనుక- విధి =విధాయకవాక్య మేకరూపము గనుక సర్వశాఖలవారికిని నిత్యాగ్ని హోత్రమను కర్మ యెట్లే రూపమో అట్లే ఛాందోగ్య- వాజసనేయ శాఖలయందు ప్రాణవిద్యకు సంబంధించిన విధ్యాదులేక రూపముగ నున్నవి గనుక సర్వశాఖలవారికిని ప్రాణవిద్య ఏకమే యగును గాని భిన్నము కాదు.

2. సూ : భేదా దితిచే న్నైకస్యామపి

వివృతిః :-భేదాత్‌ రూపభేదాత్‌ - పంచాగ్ని విద్యాయాం వాజసనేయి శాఖిన ష్ష్వడగ్నీ నామనన్తి - చన్దోగాస్తు పంచాగ్నయ ఇతి వదన్తి ఏవం ప్రాణవిద్యాయా మపి -సామగా ముఖ్యప్రాణాదితరాం శ్చతురఃప్రాణా నుపదిశన్తి- వాజసనేయినస్తు పంచేత్యుపదిశన్తి -తత ఏవం విధా ద్రూపవైలక్షణ్యాత్‌- న= విద్యయా ఏకత్వం న సంభవతి- ఇతి -చేత్‌= ఇత్యుక్తంచేత్‌ న= తన్నయుజ్యతే -కుతః ? ఏకస్యాం - అపి= ఏకస్యాం విద్యాయా మీదృశో రూపభేదః విద్వైకత్వ మపహ్నోతుం న ప్రభవతి- బహుతరస్య సామ్యస్య సద్భావాత్‌-

వివరణము:- పంచాగ్ని విద్యాప్రకరణములో వాజనేయి శాఖ వారు అగ్నులు ఆరు అనియు , ఛందోగులు ఐదు అనియు -ఇట్లే ప్రాణవిద్యయందు ముఖ్యప్రాణాతిరిక్త ప్రాణములు సామగులు నాల్గనియు, వాజసనేయులు ఐదనియు నుపదేశించుచున్నారు. అందువలన రూపభేదము, తద్దారా విద్యా నానాత్వమును సిద్దించుననుట యుక్తము కానేరాదు స్వల్ప భేదమున్నను సామ్యము బహుళతరముగ కలదు గాన-

3.సూ : స్వాధ్యాయస్య తథాత్వేన హి సమాచారేధి కారాచ్చ సవవచ్ఛ తన్నియమః

వివృతిః :- ముండకోపనిషది '' శిరోవ్రతం విథివ ద్యైస్తు చీర్ణం'' ఇతి శిరీవ్రతాఖ్యో దర్మః బ్రహ్మవిద్యాప్రకరణ శ్రుతో నాన్యత్రేతి సధర్మః విద్యాభేదప్రయోజకఃకుతో నస్యా దిత్యాశం కాయా ముచ్యతే - స్వాధ్యాయస్య= సధర్మః ముండకాధ్యనసై#్యవ సంబన్దీ- నతువిద్యాయాః కథమిద మవగమ్యతే? హి= యస్మాత్‌ -సమాచారే= సమాచారాఖ్యే అథర్వణశాఖీయానాం వేదవ్రతోపదేశపరే గ్రంథే తథాత్వేన= శిరోవ్రతం అధ్యనాంగత్వేన శ్రూయతే యతః తస్మాత్‌ తత్రదృష్టాంతః సవపత్‌= సప్తసౌరాది శతౌదనాంతానాం హోమానాం అధర్వణికైకాగ్ని సంబన్ధాత్‌ యథాధర్వణిక మాత్రానుష్ఠేయత్వ నియమః ఏవం- తన్నియమః= తస్య- శిరోవ్రతస్య స్వాధ్యాయాంగత్వ నియమః- అధికారాత్‌= ''నైత దచీర్ణవ్రతో ధీతే'' ఇత్యధ్యయ నాధికారా దవ గమ్యతే-

వివరణము :- అథర్వవేదమునకు సంబంధించిన ముండకోపని షత్తులోని బ్రహ్మవిద్యా ప్రకరణములో శిరోవ్రతమును ధర్మమొకటిప్రతి పాదింపబడియున్నది. అది అన్యత్ర వర్ణింపబడియుండలేదు. ఐనను నది విద్యాభేదమునకు కారణుము కాజాలదు. కారణమేమియన? అది అధ్యనాంగముకాని విద్యాంగము కానేరదగునుక అథర్వణశాఖీయులకు సంబంధించిన సమాచారమను గ్రంథమునందట్లు ప్రతిపాదింపబడి యున్నది. మరియు శ్రుతి స్వయముగ ''నైత దచీర్ణవ్రతోధీతే'' అని శిరోవ్రతమును అద్యయనాంగ ధర్మముగనే ఉపదేశించియున్నది గనుక నున్నూ, ఆ ధర్వణికుల గార్హ్యాగ్నియం దనుష్ఠింపదగిన సప్తసౌరాదిక శతౌదనాంత హోమములు - వారకి మాత్రమే అనుష్ఠేయములైన యట్లు ఈ శిరోవ్రతము కూడ తదధ్యనాంగమే అని తెలియదగును.

4. సూ : దర్శయతి చ

వివృతిః :- = చ కించ- దర్శయతి= శ్రుతిరపి విద్యైకం దర్శయతి తథా హి - ''సర్వే వేదాయత్పద మామనన్తి'' ఇతి వాక్యం నిర్గుణస్య బ్రహ్మణో వేదస్య సర్వేదాన్తే ష్వేకత్వేన తద్విద్యాయా స్సర్వత్రైకత్వం దర్శయతి - తథా - ''యసై#్యత మేవం ప్రాదేశమాత్రం '' ఇత్యాది ఛాన్దోగ్యశ్రుతి ర్వాజసనేయిభిః ప్రాదేశమాత్రత్వేన సంపాదితం సగుణం బ్రహ్మ= వైశ్వానరాత్మానం సిద్ధవ త్ప్రతిపాదయన్తీ ఛాన్దోగ్యవాజసనేయోక్తయో ర్వైశ్వానరవిద్యయో రైక్యం దర్శయతీతి-అత స్సగుణవిద్యైకత్వం ప్రాయోదర్శనన్యాయే నాపి నిశ్చేతవ్యం భవతీతి సిద్ధం-

వివరణము :- విజ్ఞేయమగు నిర్గుణబ్రహ్మ సర్వవేదాంతములయం దొక్కటియే గాన నిర్గుణబ్రహ్మవిద్య ఒక్కటియే, భిన్నము కాదని ''సర్వే వేదా యత్పద మామనన్తి'' అను శ్రుతి ప్రతిపాదించుచున్నది. ఇట్లే వాజసనేయులచే ప్రాదేశమాత్రత్వాది విశేషములతో వివరింపబడినవైశ్వానర (సగుణ బ్రహ్మ) విద్యను తానే విశేషములను వివరించి వర్ణించకయే ఛాందోగ్య శ్రుతి యనువదించుచు ఛన్దోగ్య - వాజసనేయోక్తవైశ్వానరవిద్యలు భిన్నములు కావని సూచించుచున్నది. కాన స్వల్పభేదములున్నను ప్రాయోదర్శన న్యాయము ననుసరించి సామ్యబాహుళ్య మున్నప్పుడు సగుణ బ్రహ్మవిద్యలయం దేవకత్వము నిశ్చయింపనగునని సిద్ధించుచునన్నది.

ఉపసంహా రాధికరణం 2

5. సూ : ఉపసంహారో ర్థాభేదా ద్విధిశేషవత్సమానే చ

వివృతిః :- సమానే- చ= పూర్వోక్తైర్హేతుభి రూపాసనైక్యే సిద్దేసతి ఉపసంహారః= ఏకత్రానునక్తానాం గుణానా మస్యశాఖాతః ఉపసంహారః కర్తవ్యః -కస్మాత్‌? అర్థాభేదాత్‌ సర్వేషాం గుణానాం విశిష్టవిజ్ఞానోవ కారత్వరూపస్య అర్థస్య= ప్రయోజనస్య , సర్వాసు శాఖాస్వభిన్న త్వాత్‌ - తత్ర దృష్టాన్తః విధిశేషవత్‌= యథా అగ్ని హోత్రస్య సర్వత్రైక్యే సిద్దేతచ్చేషాణాం ఉపస్థాన పరిస్తరణాదీనా ముపసంహార స్తద్వదత్రాపీతి

వివరణము:- పూర్వోక్తహేతువులచేత విద్యైక్యముసిద్దించగా ఒక శాఖలో పఠింపబడిన ధర్ములను మరియొక శాఖోక్తవిద్యలోని ఉపసంహారము చేయవచ్చును. (అనగా ఉపాసకుడు సర్వశాఖలలో వర్ణింపబడిన గుణములన్నిటిని చేర్చుకొని ఉపాసన చేయవలయునని భావము) సర్వశాఖోక్త గుణములకును తత్తద్గుణవిశిష్ట వస్తువిషయక విజ్ఞానమును కలుగజేయుటయే ముఖ్యమగు ప్రయోజనము కాన సర్వశాఖోక్త గుణోపసంహరాము యుక్తతరము-( ఉపసంహారమనగా నొకచోట ప్రతిపాదింపబడిన గుణములు- దర్మములు మొదలగావానిని మరియొకచోటికి చేర్చుకొనుట) నిత్యాగ్ని హోత్రమను కర్మయందు ఆయాశాఖలలో ప్రతిపాదింపబడిన పరిస్తరణ - ఉపస్థానాద్యంగజాతము ఉపసంగ్రహింపబడినట్లు ఇచట శాఖాంతరోక్తగుణోపసంగ్రహము =ఉపసంహారము చేయదగియున్నది.

అన్యథాత్వాధి కరణమ్‌

6. సూ : అన్యథాత్వం శబ్దాదితిచే న్నావిశేషాత్‌

వివృతిః - ఛన్దోగ్యే, వాజసేనేయినాం శాఖాయాం చ ఉద్గీథవిద్యా ఇతి కాచన విద్యా ప్రస్తుతాసీత్‌ - తయో ర్విద్యయోః అన్యథాత్వం = భేద ఏవ వక్తవ్యః సత్వైక్యం -తస్మాత్‌? శబ్దాత్‌= వాజసనేయకే- ''అథహేమ మాసన్యం ప్రాణ మూచుస్త్వం ఉద్గాయేతి- తథేతి తేభ్య ఏష ప్రాణ ఉదగాయత్‌'' ఇతి- తథా చాన్దో గ్యే'' అథ యు ఏవాయం ముఖ్యఃప్రాణ స్తముద్గీథ ముపాసాం చక్రిరే '' ఇతి-ఏకత్రపాణస్య ఉద్గీథ కర్తృత్వేన ఏకత్ర '' త ముద్గీథ ముపాసాం చక్రిరే'' ఇతి ఉద్గీథత్వేన- ప్రాణ న్యోపాననాకర్మత్వేన ప్రతిపాకస్య శబ్దస్య సత్వాత్‌ ఇతి- చేత్‌= ఇత్యుక్తం చేత్‌ న= న తద్యుజ్యతే= ఉద్గీథవిద్యానభిన్నా- కింత్వేకైవ-= కుతః? =అవిశేషాత్‌ దేవాసుర సంగ్రామోపక్రమత్వాది బహుతర సామ్యస్యోభయత్రాపి సద్భావ దేకవిద్యాత్వ సై#్యవ యుక్త త్వాత్‌ - అతో విద్యైకై వోభయత్రాపీతి పూర్వః పక్షః-

వివరణము:- ఉద్గీథ విద్యాప్రస్తావములో బృహదారణ్యక శ్రుతిముఖ్యప్రాణమును ఉద్గీథ కర్తగాను- చాన్దోగ్యశ్రుతి ఉద్గీథమునుగాను, ఉపాసనా కర్మగాను వర్ణించియుండుటచే నాశాఖలలోని ఉద్గీథ విద్యలు భిన్నములని తోచును గాన అట్లు చెప్పుటకు వీలులేదు. శాఖాద్వయము నందును దేవాసుర సంగ్రామముతో నుపక్రమించుట మొదలగు బహుతర సామ్యము కలదు గాన నా విద్య భిన్నము కాదనియు, ఏకమేననియు నిశ్చయింప దగునని పూర్వపక్షము.

7. సూ : నవా ప్రకరణభేదా త్పరోవరీయస్త్వాదివత్‌

వివృతిః :- వా= అయం వాశబ్దః పూర్వపక్షవ్యావర్తకః, న= ఛన్దోగ్యవాజసనేయకోక్తయో ర్విద్యయో రేకత్వం న సంభవతి- కుతః? ప్రకరణభేదాత్‌= ప్రక్రమస్య భిన్నత్వాత్‌- ఛాన్దోగ్యే ''ఓమిత్వే తదక్షరముద్గీథ ముపాసీత'' ఇత్యాది నోద్గీథావయవ స్యోంకారస్య ప్రాణత్వే నోపాసనం ప్రక్రాన్తం - వాజసనేయకే తు '' త్వం న ఉద్గాయ'' ఇత్యాదినా సమస్తోద్గీథకర్తుఃప్రాణత్వే నోపాసనం - ప్రక్రాన్తం -ఏవం ప్రక్రమ సై#్యవ= ప్రకరణసై#్యవ భిన్నత్వాత్‌ - న విద్యాఏకా- తత్ర దృష్టాన్తః - పరోవరీయస్త్వాదివత్‌= యథా పరోవరీయస్త్వాదిగుణ కాకాశా లంబన పరమాత్మో పాసనం - అక్ష్యాదిత్యగత హిరణ్య శ్ముశ్రుత్వాది గుణక పరమాత్మోపాసనా ద్భిన్నం తద్వ దిద మపీతి-

వివరణము :- ఆ విద్యలు భిన్నములే అని నిర్ణయము, ఏలయన? ప్రకరణభేదము కలదు గాన-ఛాందోగ్యములో ఉద్గీథావయమగు ప్రణవమును ప్రాణరూపముగ నుపాసించుట యను సంశ ముపక్రాంత మైనది. బృహదారణ్యకమున ఉద్గీత కర్తను ప్రాణరూపముగ నుపాసించుటయను నంశ ముపక్రాంతమైనది. ఇట్లు ప్రకరణ (ఉపక్రమ) భేదము కలదు గాన విద్యైక్యము సంభవించదు. పరోవరీయస్త్వాది గుణయుక్తము- ఆకాశాలంబనము నగు పరమాత్మోపాసనము - అక్ష్యాదిత్యగతమగు, హిరణ్యశ్మశ్రుత్వాదిగుణమగు పరమాత్మోపాసనములువలె ఈ ఉద్గీధోపాసనమును భిన్నమే యగును.

8. సూ : సంజ్ఞాతశ్చే త్తదుక్త మస్తితు తదపి

వివృతిః :- సంజ్ఞాతః = ఉద్గీథ విద్యేతి సంజ్ఞాయాః =సమాఖ్యాయా ఏకత్వం చేత్‌ =ఇత్యుక్తం చేత్‌- తదుక్తం =తస్మి న్నంశే- ప్రక్రమ భేదా దిద్యాభేదో న్యాయ్య ఇతి పూర్వసూత్రేసమాధాన ముక్తం - తదపి= ఉద్గీథ విద్యేతి సంజ్ఞైక్యమపి అస్తి - తు =ప్రసిద్ధభేదేషు పరోవరీయస్త్వా ద్యుపాసనేషు ఛాందోగ్య ప్రథమప్రపాఠక పరిపఠితేషు బహు ష్వసై#్వవ తథాచ తత్సంజ్ఞైక్యం విద్త్యైకత్వ మావహతీతి-

వివరణము :- ఉభయశాఖలయందలి విద్యకును ఉద్గీథ విద్య యను సంజ్ఞ ఒక్కటియే ఐనను విద్య ఏకమన వలనుపడదు. ప్రకరణ భేదమునుబట్టి భేదము నిర్ణియింపబడినది కదా! సంజ్ఞైక్య మున్నను ఛాందోగ్య ప్రథమ ప్రపాఠకోక్త విద్యలలో బహు విద్యలయందు నానా త్వము నిశ్చితమై యున్నది. కాన దోషము లేదు.

వ్యాప్త్యధి కరణమ్‌ 4

9. సూ : వ్యాప్తేశ్చ సమంజసం

వివృతిః :- ''ఛాన్దోగ్యే ఓమిత్యేత దక్షర ముద్గీథముపాసీత'' ఇతి' అత్ర ఓంకారోద్గీథ శబ్దయో ర్య త్సామానాధికరణ్యం (ఏకవిభక్తి కత్వరూపం) శ్రూయతే తత్కిం '' నామ బ్రహ్మేతి '' వదధ్యాసార్థం వా? (అబ్రహ్మణి నామ్ని బ్రహ్మత్వ మారోప్యత ఇత్యయ మతస్మిం స్తద్భుద్ధి రూపత్వాదధ్యాస ఇత్యుచ్యతే ) ఉత యద్రజతం సాశుక్తి రితి వదపవా దార్థం వా? ( అత్ర శుక్తిజ్ఞానేన రజతజ్ఞాన స్యాపోదిత్వాత్‌ బాధితత్వా దయమపవాద ఇత్యుత్యుతే) అథవా అంభోజం పద్మ మిత్యైక్య ప్రమిత్య ర్థంవా? (అత్రోభయోః వదయోః పర్యయపదత్వా దైక్యజ్ఞానార్థతా వ్యజ్యతే) అహాస్విత్‌ నీలముత్పలమితివ ద్విశేషవిశేష్యభావని బంధనంవా? ఇతి సంశ##యే ఇద ముచ్యతే - చ= చ ఇత్యయం తు శబ్దవ త్పక్షాంతరాణాం నిరాసకః - వ్యాప్తేః = ఓంకారస్య ఋగ్యజుస్సామసుత్రిష్వపి వ్యాప్తే స్సద్భావాత్‌ కః కుత్రత్య ఓంకార ఉపాస్యత్పే నాత్ర నిర్దిష్ట ఇత్యాశంకాయాం '' ఓమిత్యేత దక్షర ముద్గీథ ముపాసీతేతి" వాక్యేన ఉద్గీథావయవత్వే నోంకారో విశేష్యతే - తథాచ సమంజసం=ఉద్గీథ మిత్యోంకారస్య విశేషణ మిత్యేవ సమంజసం = నిరవద్యం- ఇతి- న తావదత్రాధ్యాసపక్షోంగీకర్తవ్యః - తథాత్వాంగీకారే తస్యోత్త రస్య విధీయమా నోపాస్త్యపేక్షయా పృథక్ఫలకల్పనా ప్రసంగాత్‌- విశేషణపక్షేస్మిన్‌ న పృథక్ఫలకల్పనాపేక్షా- అన్యతర జ్ఞానేనాన్యతర జ్ఞానస్య భాధాభావా దత్రాపవాదపక్షోపి న సంభవతి - ఓంకారోద్గీథ పదయోః పర్యాయ పదత్వాభవా దత్రైక్యపక్షోపి న సంగచ్ఛతే - అతః పరిశేషా ద్విశేషణ విశేష్య భావపక్షోత్ర యుక్తరత్వేన స్వీకార్యో భవతీతి సిద్ధమ్‌

వివరణము :- ''ఓమిత్యేత దక్షరముద్గీథముపాసీత'' అను ఛాం దోగ్య వాక్యములో '' ఓం'' అని ''ఉద్గీథం'' అని రెండు సమాన విభక్తిక పదములు గలవు. ఇట్టి స్థితికి సామానాధికరణ్యమని పేరు- ఈ సామానాధికరణ్యము అధ్యాసార్థము - అపవాదార్థము - ఐక్యవిజ్ఞానార్థము, విశేషణ విశేష్యభావ బోధనార్థమును ఉపయోగించుచుండును. ఇట్లుండ నిచటి యీ సామానదికరణ్య మెట్టిది యననిది విశేషణ విశేష్యభావ నిబంధనమని చెప్పవలయును. అట్లు చెప్పుటతో ఓంకారము ఋగజుస్సామములను మూడు వేదములలోన వ్యాపించియుండునది గాన నిచట నే వేదములోని ప్రణవమును గ్రహించవలయునను అశంక కలుగగా -ఉద్గీథపద సంబంధము కలదు గాన ఉద్గీథావయవమైన (సామవేదగత) ప్రణవమే యిచట ఉపాస్యముగా నిర్దేశింపబడిన దను నిర్ణయ మేర్పడగలదు. కాన నీపక్షము ను స్వీకరించుటయే సమంజసము.

10. సూ : సర్వభేదా దన్యత్రేమే

వివృతిః : - ఛాన్దోగ్యే - వాజనేయిశాఖాయాం చప్రాణవిద్యాప్రకరణ వాగాదీనామపి వసిష్ఠత్వాది గుణాన్వితత్వ మభిహితం - కౌషితకిశాఖాయాంత తు తే గుణా న శ్రూయన్తే- తత్రవిచార్యతే - అన్యత్ర = కౌషతకి శాఖోక్తప్రాణవిద్యాయా మపి ఇమే= అన్యత్రోక్తా వసిష్ఠత్వాదయో గుణా ఉపసంహర్తవ్యాః - కుతః ?= సర్వాసు శాఖాసు ప్రతిపాద్య మానాయాః ప్రాణవిద్యాయా అభేదాత్‌ = ఏకరూపత్వాత్‌- తదేక రూప త్వం చ ప్రాణసంవాదాది సారూప్యాత్‌ - ఉపాస్యస్వరూపస్య అభిన్నత్వా చ్ఛావగమ్యతే -ఇతి-

వివరణము :- ఛాందోగ్యమునను బృహదారణ్యకమునను ప్రాణవిద్యాప్రకరణములో వాగాదీంద్రియములకును వసిష్టత్వాది గుణములు వర్ణింపబడినవి. కౌషీతకి శాఖయందు ప్రతిపాదింపబడిన ప్రాణవిద్య యందు ఆ గుణములు వర్ణింపబడుకున్నను వానిని గూడ నిచటకి ఉపసంహరించుకొనవలయును, ఉపాస్య స్వరూపైక్యమును బట్టియు ప్రాణ సంవాదాది సాదృశ్యమును బట్టియు సర్వశాఖలయందలి ప్రాణవిద్యయు ఒక్కటియే అని తెలియవచ్చుచున్నది గనుక-

ఆనందాద్యధి కరణం 6

11. సూ : ఆనందాదయః ప్రధానస్య

వివృతిః :- నిర్గుణబ్రహ్మపరా సూపనిషత్సు- ఆనందరూపత్వం- సర్వగతత్వం - సర్వాత్మకత్వం -పూర్ణత్వం- విజ్ఞానఘనత్వం - సద్రూపత్వం - చిద్రూపత్వం - ఇత్యాదయో ధర్మాః క్వచిత్‌ క్వచిత్‌ శ్రూయన్తే - న సర్వే సర్వత్ర శ్రూయన్తే - అతోత్ర విచార్యతే- వ్రధానస్య విజ్ఞేయస్య నిర్గుణనస్య బ్రహ్మణః - స్వరూపప్రతిపత్త్యర్థాః ఆనందాదయః= ఆనందస్వరూపత్వాదయ స్తే సర్వే ధర్మాః సర్వత్ర బ్రహ్మవిద్యాప్రసంగేషు ఉపసంహర్తవ్యా ఏవ కుతః? సర్వాభేదాత్‌ = (పూర్వసూత్రాదస్య పదస్యానువృత్తిఃకార్య) సర్వా స్వప్యుపనిషత్సు విజ్ఞేయస్య బ్రహ్మణ ఏక త్వేన తద్విద్యాయా స్సర్వ త్రైక్యాత్‌-

వివరణము :- నిర్గుణ బ్రహ్మ ప్రతిపాదన పరములగు నుపనిషత్తు లలో ఆనందరూపత్వము, సర్వగతత్త్వము -సర్వాత్మకత్వము-పూర్ణత్వము- విజ్ఞానఘనత్వము- సద్రూపత్వము- చిద్రూపత్వము మొదలగు ధర్మము లచ్చటచ్చట ప్రతిపాదించబడుచున్నవి. ఈ ధర్మములన్నియు నన్నిచోటులలోను వర్ణింపబడియుండలేదు. కాన నా విషయమున చెప్పబడుచున్నది- సమస్తో పనిషత్తులయందును విజ్ఞేయమగు నిర్గుణబ్రహ్మ వస్తువు, ఒక్కటియే గాన నిర్గుణ బ్రహ్మవిద్యయు నొక్కటియే యనియు, ప్రధానమగు నాబ్రహ్మస్వరూప విజ్ఞాన సాధనములగు నా ఆనందస్వరూపత్వాది ధర్మముల నన్నిటిని పరబ్రహ్మ విద్యాప్రసంగముల యందును ఉపసంహరించుకొన వలసినదియే అనియు నిర్ణయింపదగును.

12. సూ : ప్రియశిరస్త్వా ద్యప్రాప్తి రుపచయాప చ¸° హి భేదే

వివృతిః :- ప్రియశిరస్త్వాద్యప్రాప్తి ః= ''తన్య ప్రియ మేవ శిరః - మోదో దక్షిణః పక్షః ప్రమోద ఉత్తరః పక్షః -ఆనంద ఆత్మా'' ఇత్యాదినా తైత్తిరీయకే శ్రుతానాం ప్రియశరాస్త్వాది ధర్మాణాం - అప్రాప్తిః= అన్యాసు శాఖాసు అప్రాప్తిః= అనుసంహారః - ఉపసంహారోన కర్తవ్య ఇత్యర్థః- కుతః? హి= యస్మాత్‌- ప్రియమెదాదీనాం పరస్పరాపేక్షయా-స్వాశ్రయ- భోక్త్రపేక్షయా చ - ఉపచయావచ¸° = ఉచ్చావచారకారౌ దృశ్యేతే - ఉపచితాపచితధర్మాశ్చ భేదే= బిధ్యత ఇతి భేదః= నప్రపంచత్వం - బ్రహ్మణ ఉపాస్యతయా నప్రపంచత్వే వివక్షితే సత్యువచితాప చిత ధర్మవత్త్వం స్యాత్‌

వివరణము :- తైత్తిరీయ శాఖయందు ''తస్యప్రియ మేవ...............ఆత్మా'' ఇత్యాది వాక్యములలో ప్రియశిరస్త్వాది ధర్మములు వర్ణింపబడినవి. ఆ ధర్మములకు ఇతర శాఖలయం దుపసంహారము కూడదు. అవి పరస్పరము ఉచ్చావచ స్వరూపములు కలవి. ఉచ్ఛావచ ధర్మవత్వము ఉపాస్య- నప్రపంచ -సగుణబ్రహ్మయందు సంభవించును, అవి నిర్విశేష బ్రహ్మ ప్రతిపత్తి హేతువులు కాదు గాన నిర్గుణ బ్రహ్మవిద్యలయందు వానికి ఉపసంగ్రహము కూడదని భావము.

13. సూ : ఇతరే త్వర్థసామాన్యాత్‌

వివృతిః :- ఇతరే -తు= ఉపాస్యబ్రహ్మధర్మేభ్య ఇతరే ఆనందా దయో ధర్మాః -బ్రహ్మస్వరూప ప్రతిపత్త్యార్థాః - అర్థసామాన్యాత్‌= ప్రతిపాద్యస్య బ్రహ్మణ ఏకత్త్వాత్‌ -తేసర్వే సర్వత్రబ్రహ్మవిద్యా ప్రసంగేషు ప్రతిపత్తవ్యా ఏవ -ఏవం చాంతరేణ గుణోపసంహారం యథావ ద్బ్రహ్మ స్వరూపవిషయక మహావాక్యార్థజ్ఞానస్య అవిద్యానివృత్తి ప్రయోజక స్యాసంభవా త్సర్వత్రానందాదయ ఉపసంహర్తవ్యా ఇతి సిద్ధం-

వివరణము :- బ్రహ్మస్వరూప ప్రతిపత్తి (విజ్ఞాన) సాధనములు గాన ఆనందరూపత్వాది ధర్మముల కన్నిటికిని సమస్త బ్రహ్మవిద్యా ప్రసంగములయందును ఉపసంహారము చేయవలసినదియే. ఈ గుణోపసంహార లేకున్న సర్వాజ్ఞాన నివర్తనక్షమమైన బ్రహ్మతత్త్వవిషయక మహావాక్యార్థ జ్ఞానము సంభవించదు. కాన ఆనందాది గుణోపసంగ్రహము చేయదగినది యనినిర్ణయము.

అధ్యానాధి కరణమ్‌7

14 సూ : ఆధ్యానాయ ప్రయోజనాభావాత్‌

వివృతిః :- ఆధ్యానాయ= కఠవల్లీషు '' ఇంద్రియేభ్యః పరాహ్యర్థాః'' ఇత్యాదినా అర్థాదీనాం పరత్వప్రతిపాదనం యదస్తి తత్‌ తత్తత్పరత్వ ధ్యానపూర్వకం పురుషపదార్థసాక్షాత్కారార్థ మేవ స్యాత్‌ -కస్మా దేవం నిశ్చీయత ఇతిచేత్‌ - ప్రయోజనాభావాత్‌= అర్థాదీనాం తత్తత్పరత్వప్రతి పాదనస్య పృథక్ఫలాభావా దేవం నిశ్చియతే-

వివరణము :- కఠవల్లియందు ''ఇంద్రియేభ్య....... '' ఇత్యాదివాక్యము లలో ఇంద్రియ మనో బుద్ధ్యాదులు ఒకదానికంటె నొకటి ఉత్కృష్టమైనది యని ప్రతిపాందిపబడి యున్నది. అది తత్తత్పరత్వధ్యాన పూర్వకముగ పురుషపదార్థ సాక్షాత్కరమనుఫలము కొరకు ఉపదేశింపబడినదియే గాని, తత్తత్పరత్వజ్ఞానము కొరకుకాదు. అట్లు ప్రతిపాదించుటలో పృథక్ఫలము లేదు గాన నిట్లు నిశ్చయింపబడుచున్నది.

15. సూ : ఆత్మశబ్దా చ్చ

వివృతిః :- చ= కించ- ఆత్మశబ్దాత్‌= ''ఏష సర్వేషు భూతేషు గూఢోత్మా న ప్రకాశ##తే'' ఇతి తత్ప్రకరణస్థమన్త్రే పురుషే ఆత్మశబ్దప్రయెగాత్‌- దుర్విజ్ఞానత్వోక్తే న్తత్ర్పతిపాదనసై#్యవ యుక్తత్వాచ్చ- అతో త్రత్య కృత్స్నస్య వాక్యజాత సై#్యకవాక్యత్వ మేవ -ప్రతివాద్య భేదాభావా దితి నిశ్చీయతే-

వివరణము :- మరియు నా ప్రకరణములోని '' ఏష సర్వేషు భూతేషు గూఢోత్మాన ప్రకాశ##తే'' అను మంత్రములో ప్రకృతమగు పురుషునియందు ఆత్మశబ్దము ప్రయోగింపబడినది. దుర్విజ్ఞేయత్వము గూడ వర్ణింపబడినది. ప్రమాణాంతరాగమ్యమగు నాపురుషోతత్త్వమునందు ఇచటి వాక్య జాతమంతయు సమన్వయము పొందిననే ఏకవాక్యత లభించును. కాన నీకఠవల్లి వాక్యములు పురుష ప్రతిపత్త్యర్థకములని నిశ్చయించుట యుక్తము.

ఆత్మగృహీత్యధి కరణమ్‌8

16. సూ : ఆత్మగృహీతి రితరవ దుత్తరాత్‌

వివరణము:- ఆత్మగృహీతిః ''ఆత్మా వా ఇద మేక ఏవాగ్ర ఆసీత్‌ '' ఇత్యైతరేయ వాక్యస్థ ఆత్మశ##బ్దేన పరమాత్మన ఏవ గ్రహణం కర్తవ్యం- నసూత్రాత్మనః కథం? ఇతరవత్‌ ''తస్మాద్వా ఏతస్మా దాత్మానా ఆకాశ స్సంభూత''ః ఇత్యాది సృష్టిప్రతిపాదక వాక్యాంతరే ష్వివ - కుత ఏవం నిశ్చీయతే? - ఉత్తరాత్‌ ఉత్తరత్ర శ్రూయమాణాత్‌'' ఈక్షత లోకాన్ను సృజా ఇతి'' వాక్యశేషోదీరితా దీక్షణపూర్వక స్రష్టృత్వ లక్షణా త్పరమేశ్వరసంబంధినో లింగాదేవం నిశ్చీయతే -

వివరణము :- ''తస్మాద్వా ఏతస్మా........'' ఇత్యాది తైత్తిరీయ వాక్య మునందలి ఆత్మశబ్దమువలె ''ఆత్మవా.......'' అను ఐతరేయ వాక్యమునందలి ఆత్మశబ్దమును పరమాత్మ బోధకమేగాని సూత్రాత్మను భోదించునది కాదు. ఏలయన? ఉత్తర వాక్యములలో ఈక్షణపూర్వక సృష్టికర్తృత్వము వర్ణింపబడినది. అది పరమేశ్వర సంబంధి లింగముగాని సూత్రాత్మసంబంధిలింగము కానేరదు గనుక నని తెలియదగును.

17. సూ : అన్వయా దితిచేత్స్వా దవధారణాత్‌

వివృతిః :- అన్వయాత్‌ పూర్వావాక్వాది పర్యాలోచనయా సూత్రాత్మ న్యేవ హిరణ్యగర్భే ఏవ ఐతరేయ వాక్యజాత స్యాన్వయ దర్శనా దాత్మశ##బ్దేన పరమాత్మా గృహ్యత ఇతి యదుక్తం తన్నోపపద్యతే -ఇతి -చేత్‌ ఇత్యుక్తం చేత్‌- స్యాత్‌ పరమాత్మన ఏవ గ్రహణం యుక్తం స్యాత్‌ -కుతః ? అవధారణాత్‌ ''ఆత్మా వా ఇద మేక ఏవాగ్ర ఆసీత్‌'' ఇత్యత్ర కృత సై#్యకత్వావధారణస్య పరమాత్మన్యేవ సమంజసత్వాదిత్యర్థః - నచాస్మిన్‌ వాక్యే శ్రూయమాణం లోక స్రష్టృత్వం హిరణ్యగర్భ మేవ గమయతి -అన్యథా పరమాత్మగ్రహణ మహాభూతసృష్టిః శ్రూయతేతి వాచ్యం -ఛన్దోగ్యే తేజఆది సృష్టిశ్రవ ణపి యథాకాశవాయు సృష్ట్యువసంహారస్తద్వ దత్రాపి మహాభూతసృష్టే రూపసంహారాత్‌ -తస్మా దస్మిన్‌ వాక్యే ఆత్మశ##బ్దేన పరమాత్మ గ్రహణ మేవ యుక్త మితి సిద్ధమ్‌-

వివరణము :- ఐతరేయేపనిషత్తు నందలి వాక్యజాతము పూర్వోత్తర గ్రంథసందర్భము ననుసరించి చూచిన సూత్రాత్మ (హిరణ్యగర్భుని) యందు సమన్వయము కలదియగు ననుట కవకాశములేదు. ''ఆత్మావాఇద మేక ఏవాగ్రఆసీత్‌'' అను వాక్యములో ఏకత్వము నిర్ధరింపబడినది గనుక- పరమాత్మయే అచటి ఆత్మ శబ్దముచేత గ్రహింపబడుచున్నది. యనుట యుక్తము. ఆ ఐతరేయమున భూతసృష్టి వర్ణింపబడక భౌతిక మగు లోకసృష్టి వర్ణింపబడినను ఆ సృష్టికి పూర్వము భూతములను సృష్టించి యే పరమాత్మ లోకసృష్టి గాంచెనని నిశ్చయింపవచ్చును. కాన ఐతరేయములోని ఆత్మశబ్దము పరమాత్మ భోదకమే అని యనుటలో విరోధములేదు.

కార్యాఖ్యానాధి కరణమ్‌ 9

18. సూ : కార్యాఖ్యానా దపూర్వం

వివృతిః :- ప్రాణవిద్యాప్రకరణ ఛాందోగ్యే , బృహదారణ్యకే చాభిహితయోః

'' తస్మాద్వా ఏతదశిష్యన్తః పురస్తా చ్చోవరిష్టా చ్ఛాద్భిః పరిదధతి'' - ''తద్వి ద్వాంస శ్శ్రోతియా అశిష్యన్త ఆచామన్తి'' ఇత్యాది వాక్యయోః కార్యాఖ్యానాత్‌= కార్యస్య= ''త్రిరాచామేత్‌'' --- ఆచాం తేన కర్తవ్యం'' ఇత్యాదినా శ్రుతిస్మృతిషు ప్రాయత్యార్థం కార్యతయా విహితా స్యాచమనస్య -అఖ్యానాత్‌= అనువాదాత్‌ -అపూర్వం= ప్రమాణాస్తరాప్రాప్త మాచనీయా స్వప్సు ప్రాణవాసస్త్వానుసంధాన మేవ ప్రాణ విద్యాంగ మత్ర విధీయత ఇత్యవగన్తవ్యం-

వివరణము :- ఛాందోగ్య బృహదారణ్యకములలోని ''తస్మాద్వా..... పరిదధతి ---- '' తద్విద్వాగ్‌ంస ...... ఆ చామున్తి'' అను వాక్యములలో శ్రుతి స్మృతులలో భోజన పూర్వోత్తర కాలములయందు ఆచమనము నాచరింపవలయునని విదింపబడిన ఆచమన మను కార్యము ననువదించి ఆ ఆచమనోదకములయందు ప్రాణోపాసకునిచేత ఉపాస్యమగు ప్రాణమున కివివస్త్రస్థానీయములని యనుసంధానము చేయబడవలయునని , యిచట ఒక ప్రాణవిద్యాంగము విధింపబడినది యని తెలియదగును.

సమానాధి కరణమ్‌ 10

19. సూ : సమాన ఏవం చాభేదాత్‌

వివృతిః :- వాజసనేయి శాఖాయా మగ్నిరహస్య బ్రహ్మణశాండిల్య విద్యా '' సఆత్మాన ముపాసీత మనోమయం ప్రాణశరీరం భారూపం'' ఇత్యాదినా ప్రతిపాదితా - పున స్తస్యా మేవ శాఖాయాం బృహదారణ్యకే "మనోమయోయం పురుషో భాస్సత్యః ఇత్యాదినా సైవ విద్యా ప్రస్తుతా తత్రైకశాఖాగతమో రప్యనమో ర్విద్యయో రేకవిద్యాత్వం - గుణోపసం హార శ్చాప్తి నవేతి సందేహే- ఉచ్యతే- సమానే- చ= సత్యపి శాఖైక్యే అనయో ర్విద్యయోః ఏవం= భిన్నశాఖగతమో రివ విద్యైకత్వం - గుణోపసంహార శ్చ యుక్త స్స్యాత్‌ -కుతః? అభేదాత్‌= ఉపాస్యస్య మనోమయత్వాదిగుణక స్యోభయత్రా ప్యభిన్న త్వాత్‌ - తథా చాగ్ని రహస్యే విద్యాం విదాయ బృహదారణ్యకే తదనువాదేన సర్వేశానత్వా దయో గుణావిధీయన్తే ఇతి - తత శ్చోభయ త్రైకైవ విద్యోక్తేతి చ సిద్ధమ్‌.

వివరణము :- వాజనేయి శాఖయందలి అగ్ని రహస్య బ్రహ్మణమునను బృహదారణ్యకము నందును శాండిల్య విద్యప్రతిపాదింపబడినది. ఏక శాఖాగతమే ఐనను స్థానద్వయమునను మనోమయత్వాదిగుణ విశిష్టవస్తువు ఒక్కటియే ఉపాస్యముగ ప్రతిపాదింపబడినది గనుక విద్యాభేదము లేదనియు (ఉభయత్రప్రతిపాదింపబడిన విద్య ఒక్కటియే అనియు). పరస్పర గుణోపసంహారము గూడ కలదనియు నిశ్చయింపదగును. అగ్నిరహస్యమున విద్యను విధించి బృహదారణ్యకమున నావిద్యననువదించి సర్వేశా స్వతాదిగుణము లచట విధింపబడినవనియు - కాన స్థానద్వయ ప్రతి పాదితమగు విద్య యొక్కటియే గాని, భిన్నము కాదనియు తెలియదగును.

సంబంధాధి కరణమ్‌ 11

20. సూ : సంబన్ధా దేవ మన్యత్రాపి

వివృతిః :- ఏవం= శాండిల్యవిద్యాయాం యథోపాస్యాభేదాద్గుణోప సంహారో నిర్ణీత స్థథా-అన్యత్ర -అపి బృహదారణ్యకోక్తాయాం సత్య విద్యాయ మపి తద్య త్సత్యం ఇత్యాదినా అధిదైవతమాదిత్యే అహరితి నామ- అధ్యాత్మం చక్షుపి అహమితినామ చోపదిష్టం తయోర్నామ్నో రుపసంహారో వక్తవ్య ఏవ - కస్మాత్‌ ? సంబన్ధాత్‌ ఏవవిద్యాసంభందస్య నామ్నో రుభయో స్సత్వాత్‌ ఇతిపూర్వఃపక్షః-

వివరణము : - శాండిల్య విద్యయం దుపాస్యభేధము లేదు గాన గుణోపసంహారము చేయదగునని నిర్ణయింపబడినది. అట్లే బృహదారణ్య కోక్తమగు సత్యవిద్యయందు అదిదైవతములో ఆతిత్యునియందు "అహః" అని ఆధ్యాత్మములో నేత్రమునందు "అహంః" అని నామము లుపదేశింపబడినవి. ఏకవిద్యా సంబంధముకలదు గాన నామములకును ఉపసంహారము చెప్పదగు నని పూర్వపక్షము.

21. సూ : నవా విశేషాత్‌

వివృతిః :- సిద్ధాంతం ఉచ్యతే- వా= అయం వాశబ్దః పూర్వపక్షం వ్యావర్తయతి. న= నామద్వయ స్యోభయత్రోవసంహారో కర్తవ్యంః కస్మాత్‌? విశేషాత్‌= నామద్వయస్యా స్యోపాసన స్థానసంబనధవిశేష ప్రతిపాదనాత్‌- ఆయ మత్ర సారః -ఏకస్యాపి సత్యబ్రహ్మణః స్థానవిశేషస్యోవదిష్టత్వా త్తత్తత్థ్సానే తత్తన్నామ ధ్యాతవ్య మితి వ్యవస్థైవ కార్యానోపసంహారః కర్తవ్య ఇతి-

వివరణమ:- ఈ విద్యయందు ఉపాస్యమగు సత్యబ్రహ్మకు ఉపాసనా స్థానములను భిన్నముగ నుపదేశించి ఆ స్థానములయందు విశేష నామముల నిర్దేశించుటవలన ఆయా స్థానమున నా యా నామము ధ్యానింపదగునని నిర్ణయింపదగునుగాని యిచటవానికి ఉపసంహారము చెప్పరాదని సిద్ధాంతము.

22. సూ: దర్శయతి చ

వివృతిః:-=అపిచ - దర్శయతి= విద్యాంతరే శ్రూయమాణ మాదిత్య పురుషస్య సంబన్ధి హిరణ్యశ్మశ్రుత్వాదికం రూపం "తసై#్యతస్య తదేవ రూపం యదముష్య రూపం" ఇత్యక్షిపురుషే శ్రుతి రతిదిశతి - అయ మతిదేశ ఇతరత్ర మత్యవిద్యాస్ధలే స్థానభేదా న్నోపసంహార ఇతి దర్శయతి - స్ధానభేదేపి గుణోపసంహారాంగీకారేయ మతిదేశో నిరర్ధక ఏవ స్యాత్‌ - తస్మా న్నామద్వయ స్యాత్ర వ్యవస్ధై వాంగీకార్యేతి-

వివరణము:- మరియు "తసై#్యతస్య.......... రూపం" అను శ్రుతి ఆదిత్యపురుషునికి సంబంధించిన హితణ్య శ్మశ్రుత్వము మొదలుగా గల రూపమే అక్షిపురుషునకును సంభవించునని రూపము నతిదేశించుచున్నది. ఈయతిదేశము సత్యవిద్యాది విద్యాంతరములయందు స్ధానభేదమున్నప్పుడు గుణోపసంహారము కూడదని సూచించుచున్నది. స్థానభేదమున్నను గుణోపసంహారము నంగీకరించుచో నీ యతిదేశము వ్యర్ధమేః యగును. కాన నామ ద్వయమున కిచట వ్యవస్ధయేగాని ఉపసంహారము యుక్తముకాదు.

సంభృత్యధి కరణమ్‌ 12

23. సూ: సంభృతి ద్యువ్యాప్త్యపి చాతః

రాణాయనీయశాఖాగతే "బ్రహ్మజ్యేష్టా వీర్యా సంభృతాని - బ్రహ్మాగ్రే జ్యేష్ఠం దివ మాతతాన" ఏతన్మన్త్రే వీర్యసంభృతి ద్యువ్యాప్త్యాదయో గుణా బ్రహ్మణః శ్రూయన్తే - తేషాం గుణానాం తదీయోపనిష ద్విహిత శాండిల్యాదిబ్రహ్మవిద్యా సూపసంహారః కార్యో వా? ఉత తద్గుణవిశిష్ట బ్రహ్మోపాసనం పృథగత్ర విధీయతే వా? ఇతి సంశ##యే, ఉచ్యతే - పూర్వాధికరణ సిద్ధాంతసూత్రా న్నేత్య త్రానువర్తతే - సంభృతిద్యువ్యాప్తీ - చ= సంభృతిశ్చ ద్యువ్యాప్తిశ్చ సంభృతిద్యువ్యాప్తీ - ఏతదాదయో గుణా నోపసంహర్తవ్యా ఏవ - కుతః? అతః= నామ్నో రివ వ్యవస్ధాపకవిశేష యోగా దేవ- వ్యవస్ధాపకవిశేషయోగో నామాత్ర శాండిల్యాదివిద్యాసు హృదయాయతనత్వం యథోక్తం తథోక్త్యభావ ఏవ - తస్మా త్సంభృత్యాదిగుణ విశిష్ట ముపాసనాంతర మేవాత్ర విధీయత ఇత్యవగంతవ్యం.

వివరణము:- రాణాయనీయ శాఖయందలి "బ్రహ్మ జ్యేష్ఠా.... మాతవాన" అను మంత్రములో వీర్యసంభృతి (అప్రతిహతసామర్ధ్యము) ద్యువ్యాప్తి (వ్యాపకత్వము) అను గుణములు వర్ణింపబడినవి. వానికి...... శాండిల్యాది విద్యలయందు ఉపసంహారము చెప్పరాదు. నామములకు వలె వ్యవస్ధయే చెప్పవలయును. ఈ విద్యలయందు హృదయాయతనత్వము చెప్పబడినది. ఆ విధముగ మంత్రస్థలములో హృదయాయనత్వము చెప్పబడియుండలేదు.కాన వ్యవస్ధయే చెప్పదగును.కాన నిచట సృంభృత్యాది గుణవిశిష్టమగు నొక ఉపాసనాంతరము విధింపబడినదియని తెలియదగును.

పురుషవిద్యాధి కరణమ్‌ 13

24. సూ: పురుషవిద్యాయా మివ చేత రేషా మనామ్నాత్‌

వివృతిఛ:- పురుషవిద్యాయాం - ఇవ=ఛందోగైః "పురుషోవావయజ్ఞః" ఇత్యాదినా భిహితాయాం పురుషవ్యిదాయా మివ - ఇతరేషాం - చ=తైత్తిరీయకే "తసై#్యవం విదుషో యజ్ఞస్యాత్మా" ఇత్యాది నాభిహితాయాం తేషాం పురుషవిద్యాయాం - అనామ్నానాత్‌=ఛన్దోగానాం పురుషవిద్యాయా మహిభితస్య ధర్మజాత స్యాత్రాపఠితత్వాత్‌ - అత శ్ఛాన్దోగ్యపురుష విద్యాత సై#్తత్తిరీయకపురుషవిద్యా భిన్నైవ. అతో గుణానా మన్యత్రోక్తానా మన్యత్రోపసంహారో నావశ్యక ఇతి.

వివరణము :- ఛందోగుల పురుషవిద్యలో పఠింపబడిన ధర్మములు తైత్తిరీయుల పురుషవిద్యలో పఠింపబడలేదు. తదన్యములు పఠింప బడినవి గుణసామ్యము లేదు. కాన విద్యలగు భేదము చెప్పవలయును. కనుక నిట ఉపసంహారమనావశ్యకమని తెలియదగును.

వేధాద్యధికరణమ్‌ 14

25. సూ : వేధాద్యర్థభేదాత్‌

వివృతిః :- ఉపనిషదా మారంభే క్వచిత్‌ "సర్వం ప్రవిధ్య - హృదయం ప్రవిధ్య" ఇత్యాదయో లింగా దాభిచారికే కర్మణి వినియోజ్యా మన్త్రాః పఠితాః - క్వచిత్‌ . ప్రవర్గ్యాది కర్మా ణ్యభిహితాని - క్వచిత్‌ "శంనో మిత్ర శ్శం వరుణః" ఇత్యాద్యా మన్త్రాః పఠితాః - తేషాం మన్త్రాదీనాం సర్వేషా ముపనిష దభిహితాసు విద్యా సూపసంహాకోస్తి నవేతి సందేహే.వేధాద్యర్థభేదాత్‌ =తేషాం మన్త్రాణాం శత్రుహృదయాది విదారణాదయో యో7ర్థాస్తేషాం భేదాత్‌ =ఉపనిషదభిహితవిద్యా స్వభిసంబన్ధా భావా న్నాస్త్యుపసంహార ఇతి- ఏవం కర్మణా మపీత్యవ గన్తవ్యం.

వివరణము :- ఉపనిషత్తులయొక్క ప్రారంభములలో కొన్ని చోటులయందు "సర్వం ప్రవిద్య ..." ఇత్యాది ఆభిచారిక (శత్రుసంహార హేతు) కర్మలయందు వినియోగింపదగిన మంత్రములును - కొన్ని చోటుల యందు ప్రవర్గ్యాది కర్మలును - మరికొన్ని చోటులలో శాంతిమన్త్రములును పఠింపబడియున్నవి- వాని కన్నిటికిని ఉపనిష త్ర్పతిపాదితమైన విద్యలయం దుపసంహారము కలదా ? లేదా అని సందేహమురాగా లేదని నిర్ణయింపబడుచున్నది. కారణ మేమియన?"స్వరం ప్రవిధ్య...." అను మంత్రములు శత్రుహృదయాదులను విదారణము చేయుము అను నిట్టి అర్థములను ప్రతిపాదించుచున్నవి. కాన వాని ప్రయోజనము (ఫలితాంశము) వేరు - విద్యలయొక్క ఫలితాంశములు వేరు - ఇట్లే కర్మలకును విద్యలతో ప్రయోజన భేదముకలదు. కాన నా మంత్రాదులకు విద్యలయం దుపసంహారము తగదు.

హాన్యధికరణమ్‌ 15

26. సూ: హానౌ తూపాయనశబ్ద శేషత్వా త్కుశాచ్ఛన్దస్తుత్యుపగానవ త్తదుక్తం

వివృతిః :- హాని ర్నామ త్యాగః - ఉపాయనం నామ విద్వత్ర్పియా ప్రియై స్తదీయపుణ్యాపుణ్యయోర్గ్రహణం - తాండిరహస్యే "అశ్వ ఇవ రోమాణి విధూయ పాపం" ఇత్యాదౌ వినోపాయనం హానిః శ్రుతా - ఏవమాథర్వణశ్రుతా వపి "తథా విద్వా న్పుణ్యపాపే విధూయ..."ఇత్యత్రాపి. కౌషీతకినస్తు" తత్సుకృతదుష్కృతే విధూనుతేతస్యప్రియా జ్ఞాతయస్సుకృత ముపయన్తి. అప్రియా దుష్కృతం " ఇత్యత్ర హాని ముపాయనం చ వర్ణయన్తి. తత్ర చిన్త్యతే - ఉపాయన స్యోపసంహా రోస్తి నవేతి - హానౌ - తు=తు శబ్ధస్త్వత్ర కైవల్యవాచీ - తథాచ కేవలహానౌ శ్రుతాయాం సత్యాం తత్రోపాయన స్యోపసంహారః కార్య ఏవ. కస్మాత్‌? ఉపాయనశబ్దశేషత్వాత్‌ = కౌషీతకిశ్రుత్యుక్త స్యోపాయశబ్దన్య - శేషత్వాత్‌ = హానిశబ్ద శేషత్వదర్శనాత్‌ - హానిశ##బ్దే నాపేక్షితత్యా దిత్వర్థః - అశ్వరోమ దృష్టాంతేన విధూతయోః - పరిత్యక్తయోః పుణ్యపాపయోః పరత్రావస్థా నాపేక్షత్వా త్పరై రుపాదానం - ఉపాయనం - గృహణ మావశ్యకం భవతీతి. శాఖాంతరస్థోపి విశేషశ్శాంఖాంతరే ప్యపేక్షితః - ఉపసంహారణీయ ఇత్యత్ర దృష్టాన్తా నాహ - కుశాచ్ఛన్దస్తుత్యుపగానవత్‌ = కుశావత్‌ - ఛన్దో వత్‌ - స్తుతివత్‌ - ఉపగానవత్‌ - ఇతి - "కుశా వానస్పత్యాః" ఇతి వనస్పతి ప్రభవత్వే సామాన్యతో7వగతే - విశేషనిర్ణయార్థం - "ఔదుంబర్యః కుశాః " ఇతి శాఖాంతరగతా విశేషావబోధినీ శ్రుతి ర్విశేషనిర్మయాయాశ్రీయతే - ఏవం - "ఛన్దోభి స్త్సువతే" ఇతి ఛందసాం స్తోత్రసాధనత్వే సామన్యతో7వగతే "దేవఛందాంసి పూర్వాణి" ఇతి పౌర్వాపర్యవిశేష నిర్ణయాయ పైంగిశ్రుతి రుపాదీయతే - ఏవం - షోడశిగ్రహగ్రహాణాంగ భూతా యా స్తుతి స్తస్యా ఉపక్రమకాలవిశేషే అనవగతే తద్విశేష జ్ఞానాయ "సమయావిషితే సూర్యే షోడశిన స్త్సోత్ర ముపాకరోతి" ఇత్వర్థాన్తమయకాలస్య తదుపక్రమకాలత్వావద్యోతినీ తైత్తిరీయశ్రుతిః స్వీక్రియతే "ఏవం" ఋత్విజ ఉపగాయన్తి" ఇతి సామాన్యేన సర్వర్తిజా ముపగాతృత్వే7ధిగతే "నాధ్వర్యు రుపగాయేత్‌" ఇత్యధ్వర్యువ్యతి రిర్కానా మేవర్త్విజా ముపగానకర్తృత్వం ప్రతిపాదయన్తీ తైత్తిరీయకాణాం శ్రుతి ర్విశేషనిర్ణయాయ గృహ్యతే - తద్వదేవ కేవలహాని ప్రతిపాదక వచనే నోపాయనవచన ముపసంగృహ్యతే- ఏవం శ్రుత్యంతరోదితస్య విశేషస్య శ్రుత్యంతరే ణోపసంగ్రహో యది న క్రియేత తర్హి వికల్ప ఆశ్రయణీయో భ##వేత్‌ - సచాన్యాయ్య స్సత్యాంగతౌ - తదుక్తం = పూర్వతంత్రే దశమాధ్యాయే "అపితు వాక్యశేషత్వా దితరపర్యుదాన స్స్యాత్ర్పతిషేధే వికల్పః స్యాత్‌" ఇత్యత్ర - స హ్యష్టదోషదుష్టో వికల్ప స్సత్యాం గతౌ నాశ్రయితుం యుక్త ఇతి.

వివరణము:- తాండిరహస్య - ఆథర్వణ శ్రుతులలోని వాక్యములలో బ్రహ్మతత్త్వవిదుని పుణ్యపాపములకు హాని = పరిత్యాగము మాత్రము ప్రతిపాదింపబడినది. ఉపాయనము = ఆ పుణ్యపాపములను ఎవరు గ్రహింతురో ఆ విశేషము అచట ప్రతిపాదింపబడలేదు. కౌషీతకి శాఖవారు హానిని, మరియు విద్వాంసుడు విద్యామహిమమున పుణ్యపాపములను పరిత్యజించునని - వాని పుణ్యపాపములను తన్మిత్రులు పరిగ్రహింతురని - పాపముల నాతని ద్వేషించువారు పొందుదురని యిట్లు ఉపాయనమును గూడ ప్రతిపాదించిరి. ఈ ఉపాయమునకు ఉపసంహారము కేవల హాని ప్రతిపాదక స్థలమున కలదా, లేదా అనగా- కలదని నిర్ణయించుచున్నారు. హానిని = పరిత్యాగమును వర్ణించు వాక్యమునకు ఉపాయన వాక్యాపేక్ష యుండును. ఈ పరిత్యాగమును బోధించు వాక్యములో పరిత్యక్తములైన పుణ్యపాపము లేమైనవో - ఎవరిచేత గ్రహింపబడినవో అను విశేషము వర్ణింపబడియుండలేదు గనుక ఆ విశేషములను వివరించు ఆ ఉపాయన వాక్యము హాని ప్రతిపాదక వాక్యముకను శేషము = అనుబంధి అగుచున్నది. కాన శాఖాం తరగత వాక్యోక్తమయినను ఈ ఉపాయనము కేవల పరిత్యాగసూచక ప్రసంగములయం దుపసంహరింపదగినదియే యగుచున్నది. శాఖాంతరోక్త విశేషములకు శాఖాంతరోక్త కార్యములయందు ఉపసంగ్రహణము యుక్తమగునా అని ఆశంక కలుగగా దోషము లేదు, యుక్తమగునని కుశాది దృష్టాంతములతో స్థాపించుచున్నారు. కుశలు (ఉద్గాతలు గానము చేయునప్పుడు ఋక్కుల సంఖ్యను పరిగణనము చేయుటకు వాడు కొను చిన్న చిన్న కొయ్య శలాకలు = ముక్కలకు కుశలనిపేరు) స్తోత్రసాధనము లగు ఛందస్సులు - షోడశిగ్రహ సంబధి స్తుతి= స్తోత్రవిశేషము - ఉపగానము =ఉద్గాతతో కలసి మిగిలిన ఋత్విక్కులచే చేయబడు గానము - ఈ నాలుగును దృష్టాంతములు. వీనికి సంబంధించిన విధి వాక్యములలో సామాన్యాంశములు మాత్రము ప్రతిపాదింపబడినను విశేషాంశములు ప్రతిపాదింపబడక పోవుటచే ఆ విశేషములు శాఖాంతరగత వాక్యములనుండియే గ్రహింపబడుచున్నవి. అట్లే యిచటను శాఖాంతరోక్తమగు ఉపాయనమున కుపసంహారము నంగీకరించుట దోషము కాదు. ఇట్లు పసంహారము నంగీకరింపకున్నచో వాక్యద్వయోక్తార్థములకు వికల్పము చెప్పవలసివచ్చును. వికల్పపక్షము నాశ్రయించుట యుక్తము కాదు. అది అగతికపక్షము - [వికల్పమష్ట దోషదూషితమని శాస్త్రజ్ఞుల నిర్ణయము] ఈ యంశము పూర్వమీమాంసా శాస్త్రమున దశమాధ్యాయములోని "అపితు...వికల్పః స్యాత్‌" అను సూత్రములో విశదీకరింప బడినది.

సాంపరాయాధి కరణమ్‌ 16

27. సూ : సాంపరాయే తర్తవ్యాభావా త్తథాహ్యన్యే

వివృతిః :- సాంపరాయే = సుకృతదుష్కృతయో ర్హానం యత్‌. తద్దేహా దపసరణసమయ ఏవ భవితు మర్హతి - న త్వర్థమార్గే - కస్మాత్‌ ? తర్తవ్యాభావాత్‌ = శరీరాపగమా దూర్ధ్వం పుణ్యపాపాభ్యాం తర్తవ్యస్య=ప్రాప్యస్య ఫలస్యాభావాత్‌ - అన్యే =ఛన్దోగాః శాట్యాయనిన శ్చ శాఖినః - తథా - హి = "అశ్వఇవ రోమాణి..." ఇత్యాదినా శరీరక్షయకాల ఏవసుకృతదుష్కృతప్రహాణ మామనన్తి. కౌషీతకిశ్రుతౌతు విరజానదీ తరణానంతరభావిత్వే నోపవర్ణితం పుణ్యపాపప్రహాణం. ఛన్దోగాది శ్రుత్యనుసారేణ - అర్థౌచిత్యేన చ ప్రాగేన సంగమయితవ్యం.

వివరణము :- విద్వాంసుని సుకృతదుష్కృతములయొక్క పరిత్యాగము శరీర పరిత్యాగ సమయముననే జరుగును గాని, మార్గమధ్యమున నది జరుగబోదు. ఏలయన ? దేహపరిత్యాగానంతర మాతనికి ఆపుణ్య పాపములచే పొందదగిన ఫలవిశేషము లేమియు లేవు. కాన నిట్లు నిర్ణయింపబడినది. ఇట్లే సామగులును, శాట్యాయని శాఖవారును "అశ్వ ఇవరోమాణి..." ఇత్యాది శ్రుతులలో ప్రతిపాదించుచున్నారు. కౌషీతకి శ్రుతిలో విరజానదీ తరణానంతరము పుణ్యపాప ప్రహాణము వర్ణింపబడియున్నను అర్థౌచిత్యమును బట్టియు ఛందోగాది శ్రుతుల ననుసరించియు దేహాపసరణ సమయమునకు పూర్వమే జరిగిన పుణ్యపాపప్రహాణ మాశ్రుతిలో ననువదింపబడినదని యోజనము చేసికొనవలయునని తెలియదగును.

28. సూ: ఛన్దత ఉభయావిరోధాత్‌

వివృతిః :- కించ. ఛందతః = స్వేచ్ఛయా జీవత ఏవ విదుషః కర్మక్షయహేతు విద్యానుష్ఠానసంభవాత్‌ - దేహవియోగానన్తరం తదసంభవాచ్చ దేహవియోగా త్ర్పాగేవ విదుషః కర్మక్షయో7భ్యుపగన్తవ్యః - తథాచ - ఉభయావిరోధాత్‌ = నిమిత్తనైమిత్తికయో ర్విద్యానుష్ఠానకర్మ క్షయయో రవ్యవహితకాలవర్తిత్వ స్వభావయోః - ఏవం - తాండిశాట్యా యని శ్రుత్యో శ్చ దేహపాతా త్ర్పాగేవ కర్మక్షయోపదర్శిన్యో ర్విరోధా భావా త్సాంపరాయ ఏవ కర్మక్షయ ఇతి యుక్తం స్యాదితి-

గతేరరవత్త్వాధి కరణమ్‌ 17

29. సూ: గతేరర్థవత్త్వ ముభయథాన్యథా హి విరోధః

వివృతిః :- కర్మహానిసన్నిధౌ క్వచిద్దేవయానః పన్థాః శ్రుతః - క్వచి న్న శ్రుతః - యత్ర నశ్రుత స్తత్ర దేవయానోపసంహారో7స్తి నవేతి సందేహే - ఉచ్యతే - గతేః = అర్చిరాదికస్య దేవయానస్య - అర్థవత్త్వం = ప్రయోజనవత్తా - ఉభయథా = ఉభయథావిభాగే ఏవ సంభవతి - సగుణవిద్యాయా మేవ గతి రర్థవతీ న నిర్గుణవిద్యాయా మితి - అన్యథా - హి=ఉభయత్రా ప్యవిశేషేణ గతా వభ్యుపగతాయాం (సర్వత్ర దేవయాన మార్గోపసంహారేంగీకృతే) విరోధః = "నిరంజనః పరమం దివ్యముపైతి సామ్యం" ఇతి శ్రుతే ర్విరోధ స్స్యాత్‌ - అతో నిర్గుణవిద్యా యాం న మార్గోపసంహారః -

వివరణము :- కర్మక్షయమును ప్రతిపాదించు సందర్భములో కొన్నిస్థలములలో దేవయానమార్గము వర్ణింపబడినది. కొన్ని స్థలములలో వర్ణింపబడలేదు. ఎచట మార్గము వర్ణింపబడలేదో అచటికి యీ మార్గ ముపసంహరింప బడవచ్చునా, లేదా ? అనగా చెప్పుచున్నారు. విద్యలను సగుణ నిర్గుణభేదముతో రెండుగ విభజించి సగుణ విద్యలయందే మార్గమునకు సార్థకత కలదు గాన నట దానికి ప్రసక్తియనియు, నిర్గుణ విద్యలయందు సార్థకత లేదు గాన నచట మార్గమున కుపసంహారము లేదనియు చెప్పవలయును. సర్వవిద్యలయందును మార్గముల కుపసంహారము నంగీకరించిన నిర్గుణ తత్త్వజ్ఞుడు పరమాత్మతో సామ్యమును పరిపూర్ణత్వమును పొందునని చెప్పు శ్రుతికి విరోధము సంభవించును. కాన నిర్గుణవిద్యయందు మార్గమున కుపసంగ్రహణ ముండదు.

30. సూ: ఉపపన్న స్తల్లక్షణార్థోపలబ్ధే ర్లోకవత్‌

వివృతిః :- ఉపపన్నః = సగుణ విద్యాయా మేవ గతి రర్థవతీ న నిర్గుణవిద్యాయా మిత్యయం విభాగో యుక్తః - కుతః ? తల్లక్షమార్థోపలబ్ధేః=సాగతిర్లక్షణం హేతు ర్యస్యార్థస్య సో7ర్థః - తల్లక్షణార్థః = గతి పూర్వక విశిష్టగంధరసాదిప్రాప్తి - పర్యంకారోహణాద్యర్థః - తస్య - ఉపలబ్ధేః= కౌషతకినాం పర్యంకవిద్యాయాం సమామ్నాతత్వాత్‌ - (సగుణ విద్యా స్వేవోపలంభాత్‌) తత్ర దృష్టాన్త ఉచ్యతే - లోకవత్‌ = యథా లోకే గ్రామప్రాప్తా వేవ గతి రర్థవతీ - నారోగ్యప్రాప్రౌ - తథా సగుణబ్రహ్మ ప్రాప్తా వేవ గతి రర్థవతీ - న నిర్గుణబ్రహ్మప్రాప్తా వితి.

వివరణము :- సగుణ బ్రహ్మవిదునకు సగుణ బ్రహ్మాప్రాప్తి, నిర్గుణబ్రహ్మ విదునకు తత్ర్పాప్తి ఫలమగును. అందు గ్రామప్రాప్తియందు మార్గ మపేక్షింపబడినట్లు సగుణ బ్రహ్మప్రాప్తియందును మార్గాపేక్ష యుండును. ఆ మార్గముద్వారా ఆతనికి ఉత్తమభోగప్రాప్తి పర్యంకారోహ ణాదికము సంభవించును. ఈ విశేషములు కౌషీతకి శాఖలోని పర్యంక విద్యాప్రకరణములో ప్రతిపాదింపబడి యున్నవి. ఆరోగ్యప్రాప్తియందు వలె నిర్గుణబ్రహ్మ విదునకు తత్ర్పాప్తియందు మార్గాపేక్షగాని, మార్గమునకు ప్రయోజనముగాని యుండదు. కాన సగుణ విద్యలలోనే మార్గము సార్థకము. నిర్గుమవిద్యయందట్లు కాదను విభాగము ఉపవన్నమే యగును.

అనియామాధి కరణమ్‌ 18

31. సూ : అనియమ స్సర్వేషా మవిరోధ శ్శబ్దానుమానాభ్యాం

వివృతిః :- సగుణవిద్యాసుచ క్వచి త్పంచాగ్ని విద్యాది ష్వర్చిరాది ర్మార్ఘః శ్రుతః - క్వచి ద్దహర శాండిల్య వైశ్వానరాదివిద్యాను నశ్రుతః - తత్ర మార్గోపసంహారో7స్తి నవేతి విచారో7త్ర క్రియతే - సర్వేషాం = సగుణోపాసనానాం సర్వేషాం - అనియమః = నియమాభావః = తుల్య వద్భావః - సర్వ త్రోపసంహార ఇతి యావత్‌ - అవిరోధః = ఏవ మభ్యు పగతే7పి ప్రకరణవిరోధో న భ##వేత్‌ - కుతః ? శబ్దానుమానాభ్యాం= శ్రుతిస్మృతిభ్యాం "తద్య ఇత్థం విదుః...." ఇత్యాద్యా పంచాగ్ని విద్యాప్రకరమస్థాశ్రుతిః- "శుక్ల కృష్ణే గతీ హ్యేతే...." ఇత్యాద్యా స్మృతిః - తాభ్యాం - ఉపాసక స్యావిశేషేణ మార్గప్రదర్శినీభ్యా మేవం నిశ్చీయతే -

వివరణము :- సగుణ విద్యాప్రసంగములలోను కొన్ని చోటులలో మార్గవర్ణనము లేదు. ఐనను సమస్త సగుణవిద్యలయందును సమానముగ మార్గమున కుపసంహారము నంగీకరింపవలయును. ఇట్లంగీకరించినను ప్రకరణవిరోధము సంభవించదు. "తద్య ఇత్థం...." "శుక్ల కృష్ణే...." ఇత్యాదిశ్రుతి స్మృతులు సర్వోపాసకులకును సమానముగ మార్గమున ప్రదర్శించుచున్నవి కాన నిట్లు నిశ్చయింపబడుచున్నది.

యావదధికారాధి కరణమ్‌ 19

32. సూ : యావదధికార మవస్థితి రాధికారికాణాం

వివృతిః :- అధికారికాణాం =వేదప్రవర్తనాది లోకస్థితి హేతు ష్వధికారేషు పరమేశ్వరేణ నియుక్తానాం - అపాంతరతమాః - వసిష్ఠ ః - సనత్కుమారః - ఇత్యాదీనాం బ్రహ్మ సాక్షాత్కారే సముత్పన్నే7పి - యావదధి కారం=లోకవ్యవస్థాషు స్వామిత్వప్రాపకప్రారబ్ధం యావ దనువర్తతే తావ త్తద్దే హేన వా, దేహాంతరేణ వా, అప్రతిబద్ధ బ్రహ్మాత్మైక్యాను బోధం - అవస్థితిః = అవస్థానం భవతి , ఉపక్షీణ త్వారబ్ధే విదేహకైవ ల్యం భవత్యేవ - తస్మా ద్విదుషః కైవల్యసిద్ధి ర్నియతేతి నిర్గుణ బ్రహ్మ విదో న మార్గాపేక్షేతి చ సిద్ధ్యతి -

వివరణము :- బ్రహ్మతత్త్వ సాక్షాత్కారము కలిగినను పరమేశ్వరునిచేత లోకరక్షణము , వేదప్రవర్తనము మొదలగు కార్యములయందు నియోగింపబడిన సనత్కుమార వసిష్ఠాది మహాత్ములు తదధికారాను కూలారబ్దము లున్నంతవరకును తమకుగల బ్రహ్మాత్మైక్య సాక్షాత్కారము ప్రతిబద్ధము కాకుండగనే ఆ దేహముతో గాని, దేహాంతరముతో గాని , వర్తించుచు ఆరబ్ధ ముపక్షీణము కాగా విదేహకైవల్యమును పొందగలరు. కాన తత్త్వవిదునకు కైవల్యము (ముక్తి) నియతమనియు - నాతనికి మార్గాపేక్ష యుండదనియు సిద్ధమగుచున్నది.

అక్షర ధ్యధికరణమ్‌ 20

33. సూ : అక్షరధియాం త్వవరోధ స్సామాన్య తద్భావాభ్యా మౌపసదవ త్తదుక్తం

వివృతిః :- గార్గియాజ్ఞవల్క్యసంవాదే "అస్థూల మన ణ్వహ్రస్వమదీర్ఘం" ఇత్యాది శ్రూయతే - ఏవ మాథర్వణ "అద్రేశ్య మగ్రాహ్య మగోత్ర మవర్ణ మచక్షుః " ఇత్యాది చ - ఏవం తత్ర తత్ర నిర్గుణబ్రహ్మ ప్రతిపత్త్యర్థా నిషేధాః శ్రూయన్తే - తదుపసంహారవిషయే చిన్తా క్రియతే - అక్షరధియాం . తు = అక్షరే బ్రహ్మణి ద్వైతనిషేధధియ - స్తద్ధేతవ శ్శబ్దాశ్చ - అక్షరధియః తాసాం తు - అవరోధః = బ్రహ్మవిద్యాసు సర్వత్రోపసంహారః కర్తవ్యః - కస్మాత్‌ ? సామాన్యతద్భావాభ్యాం =ద్వైత ప్రపంచనిరాసేన బ్రహ్మప్రతిపాదనస్య సర్వత్ర సమానత్వాత్‌, తస్య =బ్రహ్మణః ప్రతిపాద్యస్య ప్రధానతయా సర్వత్ర భావా దేకత్వేన ప్రత్యభిజ్ఞాయమానత్వా చ్చ - ప్రధానానుసారిత్వ మప్రధానానాం యుక్తం ప్రసిద్ధం చ - తత్రేదం నిదర్శనం - ఔపసదవత్‌ = జామదగ్న్యచతూరాత్రగత పురోడాశద్రవ్యకా సూపసత్సు ప్రధానత్వా త్పురోడాశస్య తచ్ఛేషాణాం మన్త్రాణా ముద్గాతృవేదోత్పన్నత్వే నోద్గాతృప్రయోజ్యత్వే సిద్ధే7పి ప్రధానస్య పురోడాశప్రదానరూపస్యకర్మణ ఉపసదాఖ్య స్యాధ్వర్యుప్రయోజ్య త్వాత్తదంగానాం మన్త్రాణా మప్యధ్యర్యుప్రయోజ్యత్వం సంప్రతిపన్నం -తథా అద్రేశ్యత్వాదీనా మక్షరబ్రహ్మశేషత్వా దక్షరబ్రహ్మప్రతిపాదనేషు సర్వే షూపసంహారో భవితు మర్హతి - తదుక్తం = తదేత త్పూర్వతన్త్రే ప్రతిపాదితం -"గుణముఖ్యవ్యతిక్రమే తదర్థత్వా న్ముఖ్యేన వేదసంయోగః"ఇత్యుత్ర-

వివరణము :- అక్షర (నిర్గుణ) బ్రహ్మస్వరూప బోధకములగు ద్వైత నిషేధవాక్యములు కొన్ని "అస్థూలమనణు..."ఇత్యాదులు బృహదారణ్యకములోను - మరికొన్ని "అద్రేశ్యమగ్రాహ్యం ..." ఇత్యాదులు ముండకోపనిషత్తులోను పఠింపబడినయున్నవి. వీని కన్నింటికిని ద్వైతప్రపంచ నిషేధముద్వారా బ్రహ్మతత్త్వమును ప్రతిపాదించుట యనుసాదృశ్యము కలదు కానను - వీని కన్నిటికిని సర్వత్ర ప్రధాన ప్రతిపాద్యము బ్రహ్మ ఒక్కటియే అని తెలియవచ్చుచున్నది గానను - ప్రధానమును అప్రధానములగు తదంగము లనుసరించుట యనునది జామదగ్న్య చతూరాత్ర యాగమునందలి ఉపసత్ర్పయోగములో స్వీకరింపబడియున్నది గానను - అట్లే యిచటను ప్రధాన ప్రతిపాద్యమగు బ్రహ్మ తత్త్వమునకు శేషభూతములైన తత్ర్పతిపాదకములగు అద్రేశ్యత్వాది వాక్యములకు సర్వత్ర నిర్గుణ బ్రహ్మవిద్యలయందు ఉపసంహారము చేయదగును. అంగములకు ప్రధానానుసరణము యుక్తిసమ్మతమని పూర్వమీమాంసా శాస్త్రములో "గుణవ్యతిక్రమే....సంయోగః" అను సూత్రములో విశదీకరింపబడియున్నది.

ఇయ దధికరణమ్‌ 21

34. సూ : ఇయ దామననాత్‌

వివృతిః :- " ద్వా సుపర్ణా సయుజా సఖాయ...." ఇత్యాథర్వణ- "ఋతం పిబన్తౌ సుకృతస్య లోకే....." ఇతి కాఠకే చ శ్రూయతే - ఏతన్మ స్త్రద్వయ ప్రతిపాద్యా విద్యైకోత భిన్నేతి సందేహే - ఉచ్యతే - ఇయదామన నాత్‌ = ఇయతః= ఇయత్తాపరిచ్ఛిన్నస్య ద్విత్వోపేతస్య జీవేశ్వరాత్మ కస్య వేద్య సై#్యకత్వా న్మంత్రద్వయ ప్రతిపాద్యా విద్యైకైవేతి నిర్ణయః.

వివరణము :- " ద్వాసుపర్ణా..." అని ముండకోపనిషత్తులోను, "ఋతం పిబన్తౌ...." అని కఠోపనిషత్తులోను రెండు మంత్రములు గలవు. ఈ మన్త్రద్వయమునను ద్విత్వముతో గూడుకొని ఇయత్త = పరిమాణము కల్గియున్న జీవేశ్వరులను వస్తు వొక్కటియే ప్రతిపాద్యము గాన (వేద్యైకత్వము కలదు కాన) మన్త్రద్వయప్రతిపాద్యవిద్యయు నేకమే యగునని నిర్ణయము.

అన్తరత్వాధికరణమ్‌ 22

35. సూ : అంతరా భూతగ్రామవత్స్వాత్మనః

వివృతిః : ఉషస్తి కహోళబ్రాహ్మణయోః "య ఆత్మా సర్వాన్తర స్తం మే వ్యాచక్ష్య" ఇతి ప్రశ్నే కృతే సర్వాంతరతమ ఆత్మా యాజ్ఞవల్క్యేన వివిచ్య ప్రతిపాదితః - తయో ర్బ్రాహ్మణయో ర్విద్యైకత్వం వా భిన్నవిద్యాత్వం వా ? ఇతి సంశ##యే - ఉచ్యతే - స్వాత్మనః = స్వాత్మన ఏవ అంతరా= (అత్రపూర్వసూత్రా దామననాది తిపదమనుకృష్యతే) తథాచ అంతరామననాత్‌ = (ఇతి స్యాత్‌) ఉభయ త్రావిశేషేణ సర్వాంతరత్వ కీర్తనా ద్విద్యా ఏకైవ, నతు భిన్నేత్యవగన్తవ్యం - విద్యాభేదే ఉభయో స్సర్వాంతరత్వాయోగా దేకస్య సర్వాంతరత్వం ముఖ్య మన్యస్య త్వాపే క్షికం చ స్యాత్‌ - కథం ? భూతగ్రామవత్‌ = యథా పంచభూతవికారే7స్మిన్‌ దేహే పృథివ్యపేక్షయా అపామాంతరత్వం - తదపేక్షయా తేజసః - తద్వత్‌ - నచై తద్యుక్తం భవితు మర్హతి - ఉభయో స్సమానతయా సర్వాంతరత్వస్య సమామ్నాతత్వాత్‌ - యద్వా - "ఏకో దేవ స్సర్వ భూతేషు గూఢః ...." ఇత్యస్మిన్‌ కాఠకగతే మన్త్రే దేవమనుష్యపశ్వాదిషు భూతగ్రామే ష్వేక ఏవ సర్వాంతరాత్మా యథోపవర్ణిత స్తథాత్రాపీతి. ఏవం చ వేద్యైక్యా ద్విద్యైక్య మితి సిద్ధమ్‌.

వివరణము :- ఉషస్తికహోళ బ్రాహ్మణములలోను సర్వాంతరమగు ఆత్మను నాకు వివరించి చెప్పుము అని ప్రశ్నచేయబడగా యాజ్ఞవల్క్యమహర్షి వివరించి చెప్పెను. ఏ తద్బ్రాహ్మణద్వయ ప్రతిపాద్య విద్య ఒక్కటియే గాని భిన్నముకాదు. సర్వాంతరాత్మయే ఉభయత్ర ప్రతిపాదింపబడినది గనుక- విద్యాభేదము నంగీకరించినచో వేద్యమగు అంతరాత్మలకును భేదము నంగీకరించి నట్లగును. అప్పుడు ఉభయులకు ఏకదేహమునందు ముఖ్యమగు ఆంతరత్వము సంభవించదు గాన నొకనికి ముఖ్యాంతరత్వమును మరియొకనికి ఆపేక్షికాంతరత్వమును నని చెప్పవలసివచ్చును. ఎట్లన? (భూతగ్రామవత్‌=) పాంచభౌతికమగు స్థూలదేహములో పృథివికంటె జలమునకు - అంతకంటె తేజస్సునకు ఇట్లు ఆపేక్షికాంతరత్వ మెట్లేర్పడుచున్నదో అట్లు ఇట్లు చెప్పుట యుక్తము కానేరదు. ఉభయులకును సర్వాంతరత్వము సమానముగ బ్రహ్మణము లలో ప్రతిపాదింపబడుచున్నది గనుక ఒకనికి ముఖ్యాంతరత్వమని - మరియొకనికి అట్లు కాదని చెప్పుట అనుచితమగును. భూతగ్రామవత్‌ - అను పదమునకు మరియొక విధమగు వ్యాఖ్య - "ఏకోదేవః ..." ఈ కాఠకోపనిషన్మంత్రములో దేవమనుష్య పశ్యాది సమస్తప్రాణులయందును అంతరాత్మ ఒక్కటియే అని యెట్లు ప్రతిపాదింపబడుచున్నదో అట్లే యిచట నీ బ్రాహ్మణద్వయమునను సర్వాంతరమగు ఆత్మ ఒక్కటియే ప్రతిపాద్యమని తెలియదగును. కాన నీ బ్రాహ్మణద్వయమున వేద్య వస్తువు ఒక్కటియే అనియు, కాననే ఏతత్ర్పతిపాద్య విద్య ఏకమేగాని భిన్నము కాదనియు తెలియదగును.

36. సూ : అన్యథా భేదానుపపత్తిరితిచే న్నోపదేశాంతరవత్‌

వివృతిః :- అన్యథా = విద్యాభేదే7నభ్యుపగతే - భేదానుపపత్తిః = సర్వాంతరత్వస్య ద్విరామ్నాన మనుపపన్నం స్యాత్‌, ప్రయోజనాభావాత్‌ - ఇతి - చేత్‌ = ఇత్యుక్తం చేత్‌ న = నైతద్యుక్తం - కథం ? ఉపదేశాంతరవత్‌ = ఏకస్యా మపి సద్విద్యాయాం తత్త్వ మసీత్యా ద్యుపదేశస్య యథా భేదః - అసకృదుక్తి రుపపద్యతే తద్వదితి మన్తవ్యం

వివరణము :- ఇచట విద్యాభేదము నంగీకరింపకున్న ఈ బ్రాహ్మణములలో రెండు పర్యాయములు సర్వాంతరత్వము వర్ణింపబడుట నిరర్థకము - అనుపపన్నము అని యనరాదు. ఛాందోగ్యమున ప్రతిపాదింపబడినది సద్విద్య ఒక్కటియే ఐనను "తత్త్వమసి" యని యనేక పర్యాయము లుపదేశింపబడలేదా ? అట్లే యిచటను నని తెలియదగును.

వ్యతిహారాధి కరణమ్‌ 23

37. సూ : వ్యతిహారో విశింషన్తి హీతరవత్‌

వివృతిః :- వ్యతిహారః = దహరశాండిల్యాది ష్వహంగ్రహోపాస నేషు - ఉపాన్యోపాసకయో రన్యోన్య విశేషణ విశేష్యభావరూపః "అహమేవ బ్రహ్మ - బ్రహ్మైవాహం" ఇత్యేవమాకారః - వ్యతిహారో7ను సంధేయః - కుతః ? హి = యస్మాత్‌ - ఇతరవత్‌ =సత్యకామత్వాది గుణ గణ మివ - విశింషన్తి = "త్వం వా అహమస్మి భగవో దేవతే - అహంవైత్వమసి భగవో దేవతే " ఇతి వ్యతిహార మధ్యానార్థం సమామ్నాతారో విశిష్యోపదిశన్తి - అత ఏవం నిశ్చీయతే -

వివరమము :- ఉపాసనార్థమై సర్వాత్మత్వ - సత్యతామత్వాది గుణములు విశేషముగ (తత్తాత్పర్ప్యముతో) నెట్లుపదేశింపబడుచున్నవో, అట్లే జాబాలులు వ్యతిహారమును ధ్యానార్థము విశేషముగ (తత్తాత్పర్యముతో) నుపదేశించి యుండిరి. కాన శాండిల్య - దహరాది - అహంగ్రహో పాసనములలో సర్వత్ర "అహమేబ్రహ్మ - బ్రహ్మైవాహం" అను నిట్టి వ్యతిహారముయొక్క (ఉపాన్యోపాసకులకు పరస్పర విశేషణ విశేష్యభావరూపమగు) అను సంధాన మవశ్యకర్తవ్యమని తెలియదగును.

సత్యాద్యధి కరణమ్‌ 24

38. సూ : సైవ హి సత్యాదయః

వివృతిః :- బృహదారణ్యకే "సయో హవైత న్మహ ద్యక్షం వేద సత్యం" ఇత్యాదినా సత్యవిద్యాం ప్రతిపాద్య అనన్తరం "తద్యత్తత్సత్య మేసౌ న ఆదిత్యః" ఇత్యుక్తం -అత్రోచ్యతే - సా - ఏవ = అనంతరవాక్యో దితా విద్యా న పూర్వో దీరితవిద్యాతో7న్యా సత్యవిద్యా . కింతు సైవ - కస్మాత్‌ ? హి= యస్మాత్‌ - "తద్యత్తత్‌" ఇతి త్రిభిస్సర్వనామభి ర్మహత్త్వా గుణోపేతం ప్రాగుదీరితం బ్రహ్మైవ పరామృశ్యతే. అతః - సత్యాదయః = ఉపాసై#్యక్యా ద్విద్యాయా అప్యేకత్వా త్తత్రోక్తా స్సత్యాదయో గుణా ఏకస్మిన్‌ ప్రయోగే ఉపసంహర్తవ్యా ఏవ -

వివరణము :- బృహదారణ్యకమున "సయోహవై..." అను వాక్యములోను తదనంతరపు "తద్యత్తత్‌...." అను వాక్యములోను ప్రతి పాదింపబడిన సత్యవిద్య ఒక్కటియే కాని భిన్నముకాదు. రెండవ వాక్యములోని సర్వనామములచేత పూర్వవాక్యోక్త బ్రహ్మమే పరామర్శింప బడుచున్నది. కాన ఉభయత్ర ప్రతిపాద్యము ఒక్కటియే అని సిద్ధించును. అంత విద్యయు నేకమే అని స్థిరపడుచున్నది. కాన నచట ప్రతిపాదింపబడిన సత్యాదిగుణముల కన్నిటికిని ప్రయోగమున (అనుష్ఠానమున) ఉపసంహారము చేయదగును.

తృతీయాధ్యాయ - తృతీయ పాదః

కామాద్యధి కరణమ్‌ 25

39. సూ : కామా దీతరత్ర తత్ర చాయతనాదిభ్యః

వివృతిః :- కామాది = ఛాందోగ్య దహరవిద్యాయాం ప్రతిపాదితం సత్యకామత్వాదిగుణాజాతం ఇతరత్ర= వాజసనేయోక్త హార్దవిద్యాయా ముపసంహర్తవ్యం - తత్ర = వాజనసనేయక హార్దవిద్యాయా ముదితం వశిత్వాదిగుణజాతం - ఇతరత్ర = ఛాందోగ్య దహరవిద్యాయా ముపసంహర్తవ్యం - కస్మాత్‌ ? ఆయాతనాదిభ్యః= హృదయాయతనత్వ, నిఖిల జగద్విధారణత్వాది బహుతరగుణగణ స్యోభయత్ర తుల్యత్వే నోపదిష్టత్వాత్‌ - ఆత్రాయం విశేషః - దహరవిద్యా సగుణా - హార్దవిద్యా తు నిర్గుణా - అతో విద్యయోర్భేదః - తస్మాన్న గుణోపసంహారో యుక్తోయద్యపి - అథాపి నిర్గుణవిద్యాయాం గుణానాం ధ్యేయత్వాభావాత్త్సుత్యర్థ మేవ తదుపసంహారో న ధ్యానార్థః? స్తుత్యర్థ ఉపసంహారస్తు విద్యాభేదే సత్యపి నానుపపన్న ఇతి -

వివరణము :- ఛాందోగ్యమున దహరవిద్యయందు సత్యకామత్వాది గుణగణమున్నూ - బృహదారణ్యకమున హార్దవిద్యయందు వశిత్వాదిగుణ గణమున్నూ ప్రతిపాదింపబడియున్నది. ఈ గుణసముదాయములకు విద్యాద్వయమునకు ఉపసంహారము చేయదగును. కారణమేమియన? ఉభయ విద్యలకును హృదయాయతనత్వ - నఖిల జగద్విదారకత్వాది గుణములతో సామ్యము బహుళముగా కలదు గాన -

ఈ విద్యలలో దహరవిద్య సగుణవిద్య - హార్దవిద్య నిర్గుణవిద్య - ఇట్లు విద్యలకు భేదమున్నను నిచట ఉపసంహారము నంగీకరింపవచ్చును. నిర్గుణవిద్యలయందు గుణములయొక్క ఉపసంహారము స్తుత్యర్థము కాని ధాన్యార్థముకాదు. స్తుత్యర్థోపసంహారము విద్యాభేదమున్నను యుక్తమే యగును గాని అనుపపన్నము కానేరదని తెలియదగును.

ఆదారాధి కరణమ్‌ 26

40. సూ: ఆదరా దలోపః

é వివృతిః :- అలోపః = వైశ్వానర విద్యాయాం ''తద్యద్భక్తం ప్రథమ మాగచ్ఛే త్తద్ధోమీయం'' ఇత్యాదినా విహితస్య వైశ్వానరవిద్యాంగస్య ప్రాణాగ్నిహోత్రస్య భోజనలోపేపి లోపో న కర్తవ్యః - ప్రతినిధిద్రవ్యేణాపి తదనుష్ఠానం కర్తవ్య మిత్యర్థః - కస్మాత్‌ ? ఆదరాత్‌= ''పూర్వోతిథిభ్యోశ్నీయాత్‌'' ఇతి జాబాలశ్రుతౌ వైశ్వాసరోపాసక భోజన స్యాతిథి భోజనా దపి ప్రాథమ్య ప్రతిపాదనేన ప్రాణాగ్నిహోత్రే ఆదరకరణాత్‌ - తస్మా ద్భోజనలోపే ప్యన్యేన భక్ష్యద్రవ్యే ణాద్భి ర్వా ప్రాణాగ్నిహోత్రం కర్తవ్య మితి - పూర్వః పక్షః.

వివరణము :- వైశ్వానర విద్యాంగముగా విహితమైన ప్రాణాగ్ని హోత్రము భోజనలోపము సంభవించినను మానక ప్రతినిధి ద్రవ్యముతో (భక్ష్యద్రవ్యజలాదులతో) నైనను చేయదగును. ఏలయన ? జాబాలశ్రుతిలో వైశ్వానరోపాసకుని భోజనమునకు ప్రాధాన్యమును ప్రతిపాదించుచు ప్రాణాగ్నిహోత్రము విషయములో విశేషమగు ఆదరము ప్రదర్శింపబడి యున్నది గాన నని పూర్వపక్షము.

41. సూ : ఉపస్థితేత స్తద్వచనాత్‌

వివృతిః :- ఉపస్థితే = ఉపనతే భోజనే - అతః = అస్మాదేవ భోజనద్రవ్యా త్ర్పథమ ముపనిపతితా త్ర్పాణాగ్నిహోత్రం కర్తవ్యం - న యేనకే నాపి ద్రవ్యేణ ప్రతినిధిభూతేన - కుత ఏవం నిశ్చీయతే ? తద్వచనాత్‌ = ''తద్య ద్భక్తం ప్రథమ మాగచ్ఛే త్తద్ధోమీయం'' ఇతి వాక్యే తస్య ప్రాణాగ్నిహోత్రస్య భోజనార్థద్రవ్య నిర్వర్త్యత్వవచనాత్‌ - తస్మాద్భోజనలోపే ప్రాణాగ్నిహోత్రస్య లోప ఏవేతి సిద్ధాంతః

వివరణము :- ''తద్యద్భక్తం....'' అనువాక్యములో భోజనార్థమువ నతమైన ద్రవ్యమునుండియే ప్రాణాగ్నిహోత్రము నిర్వర్తింపదగినదియని వర్ణింపబడియున్నది గాన భోజనలోప మేర్పడినప్పుడు ప్రాణాగ్నిహోత్రమునకు లోపమే అని సిద్ధాంతము.

తృతీయాధ్యాయ - తృతీయ పాదః

తన్నిర్ధారణాధి కరణమ్‌ 27

42. సూ : తన్నిర్ధారణానియమ స్తద్దృష్టేః

పృథగ్ఘ్యప్రతిబన్ధః ఫలం

వివృతిః :- సన్తి కర్మాంగే ఘాద్గీథాదిషు ప్రాణాద్యుపాసనాని - తాని పర్ణతావ త్కర్మాంగాని సన్తి నిత్యవ దనుష్ఠేయాని? అథవా గోదోహనవత్స్వతంత్రఫలసాధనా న్యనియతానీతి సంశ##యే - ఉచ్యతే - తన్నిర్ధారణానియమః = తేషాం కర్మాణా మంగభూతానా ముద్గీథాదీనాం యాని విర్ధారణాని, రసతమత్వాది గుణవిశిష్టత యోపాసనాని తేషా మనియమః- నియమో నాస్తి - పురుషార్థగోదోహన వన్నిత్యత్వం నాస్తీత్యర్థః- కస్మాత్‌? తద్దృష్టేః= ''తేనౌభౌ కురుతో యశ్చైన మేవం వేద యశ్చ న వేద'' ఇత్యత్రాంగోపాస్తిహీన స్యాపి కర్మానుష్ఠాతృత్వోక్తేః కర్మాంగోపాసనానాం కర్మానంగత్వ దర్శనాత్‌ - హి = యస్మాత్‌ - ఏతాదృశోపాసనానాం పృథక్‌ = కర్మఫలా ద్భిన్నం - అప్రతిబన్ధః = ప్రతిబన్ధాభావః- తదుపలక్షితా కర్మసమృద్ధిః- వీర్యవత్తరత్వరూపం - ఫలం= ''యదేవ విద్యయా కరోతి'' ఇత్యాదిషు ప్రతిపాద్యతే - తస్మాదపి కర్మాంగోపాసనా న్యనియతా న్యేవేతి -

వివరణము :- కర్మాంగములగు ఉద్గీథాదులకు సంబంధించిన రసతమత్వాది గుణములతో చేయదగిన అంగోపాసనములు కొన్నికలవు. అవి కర్మస్వరూప నిష్పాదకములగు కర్మాంగములు వలె నియతానుష్ఠేయములు కాజాలవు. అంగోపాసనములు లేకున్నను కర్మ పరిపూర్ణము కాగలదు గనుక - ఆ ఉపాసనములు ఫలవిశేష నిషాపదకములు. అవి కర్మఫల సమృద్ధిని- కర్మఫలమున వీర్యవత్తరత్వ మను విశేషమును కలిగించును. ఇవి గోదోహనాదులు వలె పురుషార్థములు - కాన నివి నియతా నుష్టేయములు కానేరవు.

ప్రదానాధి కరణమ్‌ 28

43. సూ : ప్రదానవదేవ తదుక్తం

వివృతిః :- ప్రదానవత్‌ - ఏవ = త్రిహవిష్కాయాం కస్యాం చ నేష్టౌ ఇంద్రరూపాయా దేవతాయా ఏకత్వేపి రాజాదిగుణయోగా త్తద్దేవతాయా భేదేన తదుద్దేశ్యకపురోడాశ ప్రదానాత్మకస్య కర్మణో యథా భేదస్తథా సంవర్గవిద్యాయా మపి ''వాయు ర్వావ సంవర్గః'' - ''ప్రాణో వావసంవర్గః'' ఇత్యత్ర వాయుప్రాణయో స్తత్వైక్యే ప్యధిదైవాధ్యాత్మాది స్థానబేదా త్తదనుచింతన మపి భిన్నమేవే త్యభ్యుపగన్తవ్యం - తదుక్తం= తదేత త్కాశకృత్స్నీయే దేవతాకాండే ''నానావా దేవతా పృథగ్జానాత్‌'' ఇత్యత్ర ప్రతిపాదితం -

వివరణము :- ఒక యాగమున నింద్రుడొక్కడే దేవతగా చెప్పబడియుండెను. ఐనను ఆ దేవతయందు వర్ణింపబడిన రాజ - అధిరాజాది గుణ సంబంధమును బట్టి తదింద్రదేవతాక పురోడాశహవిః ప్రధానరూప కర్మలు భిన్నములుగా నంగీకరింపబడినవి. అట్లే సంవర్గవిద్యలో గూడ వాయుప్రాణము లొక్కే వస్తువైనను ''వాయుర్వావ .... ప్రాణోవావ'' అను వాక్యములలో అధిదైవత అధ్యాత్మరూప స్థానభేదమును బట్టి ద్విధా ఉప దేశము చేయబడినది. కాన నిచట తదనుధ్యాన ప్రయోగమును భిన్నమైనదియే యని గ్రహింపవలయును. ఈ యంశము కాశకృత్స్నీయ దేవతాకాండములో ''నానావా దేవతా .... ....'' అను సూత్రములో విశదీకరింపబడెను.

లింగభూయస్త్వాధి కరణమ్‌ 29

44. సూ : లింగభూయస్త్వాత్తద్ధి బలీయ స్తదపి

వివృతిః :- అగ్నిరహస్యబ్రాహ్మణ సంకల్పాత్మకా మనశ్చిదాదయోగ్నయః కర్మప్రకరణ సమామ్నాతాః - అథాపి తే స్వతంత్ర విద్యామయా ఏవ - న కర్మసంగతాః - కర్మ స్వంగభావ మాపన్నా న భవన్తి - కస్మాత్‌ ? లింగభూయస్త్వాత్‌ = ఏతేషాం కేవలవిద్యాత్మక త్వోపోద్బలకానాం ''తద్య త్కించేమాని మనసా సంకల్పయన్తి'' ఇత్యాదీనాం లింగానాం బాహుళ్యే నోపలంఖాత్‌ - హి = యస్మాత్‌ - తత్‌ = లింగం - బలీయః = ప్రకరణా ద్బలవత్తరం - తత్‌ - అపి = ప్రకరణా ల్లింగస్యబలవత్తరత్వ మపి పూర్వతంత్రే ''శ్రుతి - లింగ - వాక్య - ప్రకరణ - స్థాన - సమాఖ్యానాం సమవాయే పారదౌర్బల్య మర్థవిప్రకర్షాత్‌''- ఇతి సూత్రే నిర్ధారితం -

వివరణము :- అగ్నిరహస్య బ్రాహ్మణమునందలి కర్మ ప్రకరణములో వర్ణింపబడిన సంకల్పాత్మకములగు మనశ్చిదాద్యగ్నులు కేవల విద్యారూపములేగాని కర్మాంగములు కానేరవు. తద్యత్కించేమాని...'' ఇత్యాదికములగు ప్రకరణముకంటె బలవత్తరములగు లింగములు ఆ అగ్నులకు కేవల విద్యాత్మకత్వమును సూచించుచున్నవి అనేకములు గలవు. లింగము ప్రకరణముకంటె ప్రబలమను నీ యంశము పూర్వ మీమాంసా శాస్త్రములోని ''శ్రుతిలింగ...'' అను సూత్రములో విశదీ కరింపబడినది.

45. సూ : పూర్వవికల్పః ప్రకరణా త్స్యాత్ర్కియా మానసవత్‌

వివృతిః :- పూర్వపక్షోక్తిః- పూర్వవికల్పః - పూర్వస్య = ''ఇష్టకాభిరగ్నిం చినుతే'' ఇత్యాదినా ప్రాగుక్తస్య కర్మణః - వికల్పః = ప్రకార విశేషః- సంకల్పమయత్వాఖ్యో యం మనశ్చిదాదిః - క్రియా - స్యాత్‌ = కర్మానుప్రవిష్ట ఏవ - స్యాత్‌ - న స్వతన్త్రః - కస్మాత్‌? ప్రకరణాత్‌ = క్రియామయ క్రతుప్రకరణపఠితత్వాత్‌ - సంకల్పాత్మక స్యాస్య కథం కర్మాంగత్వ మితిచేత్‌ - మానసవత్‌ = ద్వాదశాహే ఏకాదశేహని ''అనయా త్వా పాత్రేణ'' ఇత్యాదినా మానసోగ్రహో విహితః - తస్య సంకల్పరూపత్వేపి యథా కర్మాంగత్వం తథైషాం మనశ్చిదాదీనా మపి-

వివరణము :- మనశ్చిదాదులు ''ఇష్టకాభి....'' అను పూర్వవాక్యమున విహతమైన క్రతువుయొక్క సంకల్పమయ మగు నొక ప్రకార విశేషమే గాని స్వతంత్రములు కావు. అట్లగుచో వీనికి క్రతుప్రకరణ పాఠము వ్యర్థమనవలసివచ్చును. కాన సంకల్పాత్మకమగు మానస గ్రహము ద్వాదశాహ క్రత్వంగమైనట్లు ఇవియును క్రత్వంగములే అని చెప్పదగును.

46. సూ : అతిదేశాచ్చ

వివృతిః :- చ= కించ - అతిదేశాత్‌ = తేషాం మానసికాగ్నీనాంమనశ్చిదాదీనాం మధ్యే ''ఏకైక ఏవ తావాన్‌ యావా నసౌ పూర్వః'' ఇత్యాదినా పూర్వే ణష్టకాభిశ్చితే నాగ్నినా సాంపాదికాగ్నీనాం సాదృశ్యోపదేశా చ్చ తచ్ఛేషత్వం. ఏకక్రియానుపవేశాతిరిక్తస్య సాదృశ్య స్యాత్రాభావాత్‌ -

వివరణము :- ''ఏకైకఏవ....'' అను వాక్యములో మనశ్చిదాదులకు ఇష్టకాచితాగ్నితో సాదృశ్యము వర్ణింపబడినది. ఏకకర్మ సంబంధమే ఆ రెండిటియందు గల సాదృశ్యము. అన్యముకాదు. కానను అవి కర్మాంగములే గాని స్వంత్రములు కాజాలవు అని పూర్వపక్షము.

47. సూ : విద్యైవ తు నిర్ధారణాత్‌

వివృతిః :- సిద్ధాంతోక్తిః- తు= అయం శబ్దః పూర్వపక్షం వ్యావర్తయతి - విద్యా - ఏవ = పూర్వోక్తో మనశ్చిదాది ర్విద్యామయ స్స్వతంత్రఏవ - న కర్మశేషభూతః - కస్మాత్‌ ? నిర్ధారణాత్‌ = తేహైతే విద్యాచితఏవ'' ఇత్యవధారణశ్రుతే స్తేషాం విద్యామయత్వనశ్చియాత్‌- ఏవకారాత్మికయా శ్రుత్యా ప్రకరణం కర్మసంబంధి బాధ్యత ఇతి భావః-

వివరణము :- ''తేహైతే విద్యాచిత ఏవ'' అని మనశ్చిదాదులకు స్పష్టముగ విద్యామయత్వము ఏవకారశబ్దము (శ్రుతి)తో నిర్ధారణ చేయబడుచున్నది. కాన నవి విద్యామయములే గాని కర్మశేషములు కాదని సిద్ధాంతములు.

48. సూ : దర్శా చ్చ

వివృతిః :- చ= అపిచ- సదర్శనాత్‌ = మానసికాగ్నీనాం స్వాతంత్ర్యజ్ఞాపకస్య లింగస్య ''తద్యత్కిం చేమాని భూతాని మనసా సంకల్పయన్తి'' ఇత్యాది వాక్యావగతస్య దర్శనా దపి నైతే కర్మశేషభూతా ఇతి -

వివరణము :- ''తద్యత్కించేమాని'' ఇత్యాది వాక్యములలో ఆ అగ్నులకు స్వాతంత్ర్యము వర్ణింపబడినది గనుకను వీనికి కర్మాంగత్వము చెప్పరాదు.

49. సూ : శ్రుత్యాదిబలీయస్త్వాచ్చనబాధః

వివృతిః :- చ = కించ - శ్రుత్యాదిబలీయస్త్వాత్‌ = మనశ్చిదాదయః కేవలవిద్యారూపా ఏవేతి నిర్ధారణాయ ప్రదర్శితానాం శ్రుతిలింగవాక్యానాం ప్రకరణా పేక్షయా ప్రబలత్వాత్‌ - న - బాధః = తేషాం కేవలవిద్యాత్మకత్వే న బాధకం కించి దస్తి -

వివరణము :- మనశ్చిదాదులకు కేవల విద్యాత్మకత్వ నిర్ణయము కొరకు ఏవకారశ్రుతి - లింగాదులు ప్రదర్శింపబడినవి. అవి ప్రకరణము కంటె ప్రబలములు. కాన మనశ్చిదాదులు విద్యాత్మకము లనుటలో విరోధమేమియు లేదు.

50. సూ : అనుబంధాదిభ్యః ప్రజ్ఞాంతరపృథక్త్వవద్దృష్టశ్చ తదుక్తం.

వివృతిః :- అనుబంధాదిభ్యః= ''తే మనసైవాధీయన్త - మనసై వాచీయన్త - మనసైవ గ్రహా అగృహ్యన్త'' ఇత్యాదినా ఐహితం. ఆధానచయనాది క్రియావయవానాం మన ఆ దివ్యాపారేషు - (వృత్తిషు) సంపాదన మనుబంధః - ఆదిశ##బ్దేన ప్రాగుక్తశ్రుతి లింగాదయో గృహ్యన్తే. ఏతేభ్యో హేతుభ్యో మనశ్చిదాదీనాం కేవలవిద్యామయత్వ మేవాభ్యుపగన్తవ్యం - కథం ? ప్రజ్ఞాంతరవృథక్త్వవత్‌ = (ప్రజ్ఞా - విద్యా) శాండిల్యాదీనాం విద్యానాం పృథక్త్వం కర్మభ్యో విద్యాంతరేభ్య శ్చ యథాభ్యుపగమ్యతే తథైవ - తతశ్చ కర్మప్రకరణపఠితానాం తేషాం మనశ్చిదాదీనాం తత ఉత్కర్షో యుక్తః - దృష్టః - చ = దృష్ట శ్చైవ ముత్కర్షః రాజ సూయప్రకారణ పఠిత స్యావేష్టియాగస్య, తదుక్తం = పూర్వతంత్రే ఏకాదశాధ్యాయే'' క్రత్వర్థేయ మితి చేన్న వర్ణత్రయసంయోగాత్‌'' ఇత్యత్రాయ మంశ ఉపపాదితః.

వివరణము :- పూర్వో దాహృత శ్రుతి లింగాదులను బట్టియు- ''తేమనసైవాధీయన్త....'' ఇత్యాది వాక్యములలో ప్రసిద్ధాగ్ని క్రత్వంగములైన ఆధాన చయనాదికములు మన ఆది వ్యాపారములయందు (మనోవృత్తులలోననే) ననే భావనచే సంపాదింపదగినవిగ విధింపబడి యుండుటను బట్టియు- (ఒక మనోవృత్తిని ఆధానమును గాను - మరియొక మనోవృత్తిని చయనమును గాను ఇట్లు మనోవృత్తులయందు అగ్న్యంగములను భావించి ధ్యానించుట ననుబంధమందురు) శాండిల్యదహరాది విద్య లెట్లు కర్మరూపములు కానివియై యున్నవో అట్లే మనశ్చిదాదులును కేవల విద్యామయములే గాని కర్మరూపములు కాదని యంగీకరింపవలయును. కాన నీ మనశ్చిదాదులను కర్మప్రకరణమునుండి ఉత్కర్షించుట యుక్తము కాగలదు. రాజసూయ ప్రకరణమునందు పఠింపబడిన అవేష్టియాగమునకు ఆ ప్రకరణమునుండి ఉత్కర్షచేయబడియుండుట ప్రసిద్ధమగు విషయము. ఈ ఉత్కర్షను గూర్చిన విచారము పూర్వమీమాంసా శాస్త్రములో ఏకాదశాధ్యాయమునందలి ''క్రత్వర్థే....'' అను సూత్రములో చేయబడినది -

51. సూ : న సామాన్యా దప్యుపలబ్ధే ర్మృత్యువన్నహి లోకాపత్తిః

వివృతిః :- సామాన్యాత్‌ - అపి = మనశ్చిదాదీనాం మానసేన గ్రహేణ మానసికత్వరూపసామాన్యే = సాదృశ్యే సత్యపి న= న కర్మాంగత్వం కల్పనీయం - కుతః ? ఉపలిబ్ధేః= తేషాం పూర్వోక్తశ్రుతి లింగా దిభ్యో హేతుభ్యః కర్మవైలక్షశ్రణ్యన స్వతంత్ర విద్యాత్మకత్వదర్శనాత్‌ - కథం ? మృత్యువత్‌ = ''స ఏష ఏవ మృత్యు ర్య ఏష ఏతస్మిన్‌ మండలే పురుషః'' ఇతి - ''అగ్నిర్వై మృత్యుః'' ఇతి చాగ్న్యాదిత్య పురుషయో స్సమానేపి మృత్యుశబ్దప్రయోగే - న - హి = నాత్యంతం తయోస్సామ్యం కింతు పరస్పరం వైషమ్య మేవ - లోకావత్తిః = యథావా పంచాగ్ని విద్యాయాం

ద్యుపృథివ్యాదే ర్ధూమా ద్యగ్న్యవయవసంపాదనే సత్య ప్యగ్నిత్వాపత్తిః - న - హి = న సంభవతి - తద్వత్‌ - (మనశ్చిదాదీనాం మానసేన సాదృశ్యే సత్యపి వైలక్షణ్య మపి నంభవతి - కర్మశేషత్వాపత్తి శ్చ న భవతీతి భావః)

వివరణము :- ద్వాదశాహక్రత్వంగభూత మానస గ్రహముతో నీ మనశ్చిదాదులకు మానసికత్వరూప సాదృశ్యమున్నను మానస గ్రహము వలె వీనికి కర్మాంగత్వమును కల్పింపదగదు. శ్రుతి లింగాదులతో వానికి విద్యాత్మకత్వము నిర్ణయింపబడియున్నది గనుక - ''సఏష...'' - ''అగ్నిర్వావ....'' అను వాక్యములలో అగ్న్యాదిత్య పురుషులయందు మృత్యు శబ్ద ప్రయోగము సమానముగ నున్నను ఆ పురుషుల కత్యంతము సామ్యములేదు. పరస్పర వైలక్షణ్యమే యుండును. పంచాగ్ని విద్యాప్రసంగములలో ద్యులోక పృథివీలోకాదులకు అగ్నిసాదృశ్యము వర్ణింపబడినను వానికి అగ్నిభావమును సంభవించదు. అట్లే మానసగ్రహ - మనశ్చిదాదులకు మానసికత్వ సాదృశ్యమున్నను మనసగ్రహముతో వాని కత్యంత సామ్యముగాని మానసగ్రహమునకు వలె వానికి కర్మాంగభావాపత్తిగాని సంభవించనేరదు.

52. సూ : పరేణ చ శబ్దస్య తాద్విధ్యం భూయస్త్వాత్త్వనుబంధః

వివృతిః :- పరేణ = మాసికాగ్ని బ్రాహ్మణా త్పరేణ బ్రాహ్మణన చిత్యగ్నౌ పృథివీలోకదృష్టిరూప స్వతంత్రవిద్యావిధాయకేన - చ = పూర్వేణ చ బ్రాహ్మణన మండలపురుషోపాస్తిరూప స్వతంత్ర విద్యావిధాయకేన - శబ్దస్య = తన్మధ్యపతితస్య మనశ్చిదాది ప్రతిపాదక స్యాపిశబ్దస్య=బ్రాహ్మణస్య - తాద్విధ్యం = మనశ్చిదాది ప్రతిపాదక స్యాపి శబ్దన్య= బ్రాహ్మణస్య - తాద్విధ్యం = సందంశన్యాయేన తద్విధత్వం = కేవలవిద్యావిధిత్వ మవగమ్యతే - అనుబంధః - తు = మనశ్చిదాదీనాం కర్మప్రకరణసంబంధస్తు (క్రియాగ్నినా సహ పాఠస్తు) భూయస్త్వాత్‌ = మానసికాగ్ని విద్యాయాం సంపాద్యానాం కర్మాంగానాం భూయసాం సద్భావా దిత్యవగన్తవ్యం - తస్మా న్మనిశ్చిదాదయః కేవలపురుషార్థాస్స్వతంత్రా ఏవ న కర్మశేషభూతా ఇతి సిద్ధం.

వివరణము :- మానసికాగ్ని విధాయకమగు ఈ బ్రాహ్మణమునకు పూర్వోత్తర బ్రాహ్మణములు స్వతంత్ర విద్యావిధాయకములై యున్నవి. కాన తన్మధ్యపతితమగు నీబ్రాహ్మణమును సందంశన్యాయము ననుసరించి స్వతంత్ర విద్యావిధాయకమే అని చెప్పవలయును. కర్మ ప్రకరణముననివి పఠింపబడుటకు కారణము భావనచే సంపాదింపదగిన (ధ్యానింపదగిన) కార్మవయవము లీ విధ్యలో బహుళముగా కలవు గాన నని తెలియదగును. కాన మనశ్చిదాదులు కేవల పురుషార్థములు, స్వతంత్రములునునగును కాని కర్మాంగములు కావని సిద్ధించుచున్నది,

ఐకాత్మ్యాధి కరణమ్‌ 30

53. సూ : ఏక ఆత్మన శ్శరీరే భావాత్‌

వివృతిః :- ఏకే= లోకాయతికాః (అత్రోత్తరసూత్రాత్‌ - వ్యతిరేక ఇతి - న ఇతి చాపకృష్యతే.) ఆత్మనః= శరీరవ్యతిరేక ఆత్మనోన సంభవతి - న శరీరాతిరిక్తత్వమాత్మన ఇతి మన్యంతే - కస్మాత్‌ ? శరీరేభావాత్‌ = శరీరే సత్యేవ ప్రాణచేష్టా - చైతన్య - స్మృత్యాదీనా మాత్మ సంబంధితయాభిమతానాం ధర్మాణముపలంభాత్‌ - అనతి చానుపలంభాచ్చేతి పూర్వః పక్షః -

వివరణము :- ఆత్మకు సంబంధించినవిగా లోకులచే నంగీకరింపబడుచున్న ప్రాణచేష్టా - చైతన్యము - స్మృతి మొదలగు ధర్మములు శరీరమున్నప్పుడే కానవచ్చుచుండుటచేతను, శరీరము లేనప్పుడు కానవచ్చుటలేదు గానను శరీరమే ఆత్మ - శరీరవ్యతిరిక్తము మాత్రము కాదని లోకాయతికులు = చార్వాకులు తలంచుచుచున్నారు.

54. సూ : వ్యతరేక స్తద్భావాభావిత్వా న్నతూపలబ్ధివత్‌

వివృతిః :- న - తు= దేహ ఏవాత్మేత్యేతత్తు న్న యుక్తం - కింతు- వ్యతిరేకః = వైలక్షణ్యమేవ దేహాదాత్మనో వక్తవ్యం - కస్మాత్‌ ? తద్భావాభావిత్వాత్‌ = తస్య = దేహస్య - భావే = సత్వదశయామపి సమాధిమరణమూర్ఛాను చైతన్యస్య అభావిత్వాత్‌ = అనుపలభ్యమానత్వాత్‌ (చైతన్యస్యదేహధర్మత్వాభావః) కథం? ఉపలబ్ధివత్‌ = యథోపలబ్ధి ర్దేహేంద్రియ విషయాదీని విషయీకుర్వతీ విషయిత్వా త్తేభ్యో భిన్నా - ఏవ ముపలబ్యాశ్రయ ఆత్మాపి తేభ్యోభిన్న ఏవ - ఇతి సిద్ధాంతః -

వివరణము :- శరీరమున్న దశయందును సమాధి - మూర్ఛా - మరణములయందు చైతన్యము గోచరించుటలేదు గాన శరీరమే ఆత్మయని యనుట యుక్తముకాదు. ఆత్మ శరీర విలక్షణ మైనదియే. ఎట్లన? దేహేంద్రియ విషయాదులను ప్రకాశింపజేయు ఉపలబ్ధి = విజ్ఞాన మా దేహాదులకంటె యెట్లు భిన్నమో ఉపలబ్ధికి = విజ్ఞానమున కాశ్రయమగు ఆత్మయు నట్లు వానికంటె విలక్షణమైనది - భిన్నమైనదియే అని తెలియదగును.

అంగావబద్ధాధి కరణమ్‌ 31

55. సూ : అంగావబద్ధాస్తు వ శాఖాసు హి ప్రతివేదం

వివృతిః :- సన్తి కర్మాంగాశ్రితా న్యుపాసనాని - ఉద్గీథాపయవే ఓంకారే ప్రాణదృష్టిః, ఉద్గేథే పృథివీదృష్టిః పంచవిధే సామ్ని పృథివ్యగ్న్యన్తరిక్షద్యులోకదృష్టి రేవ మాదిలక్షణాని - అత్రోచ్యతే - అంగావబద్ధాః - తు = ఉద్గీథాది కర్మాంగేషు విధీయమానా ఉపాస్తయః - ప్రతివేదం - శాఖాను = ప్రతివేదం యస్యాం శాఖాయాం యా విహితాః న= తాస్తస్యామేవ శాఖాయాం వ్యవతిష్ఠన్త ఇతి న - కింతు సర్వాసు శాఖా స్వనువర్తంతే - (సత్యపి శాఖాఖేదే - స్వరాధిభేదే చ శాఖాంతరీయోద్గీథాద్యాలంబనా అపి భవన్తిత్యర్థః) హి = యస్మాత్‌ ''ఉద్గీథ ముపాసీత'' ఇత్యాదౌ ఉద్గీథాదిశ్రుతే స్సర్వత్రావిశేష స్తస్మాద్ధేతోః - (అవిశేషశ్రుతు రియం విద్యైకత్వమవగమయతి.)

వివరణము :- ఉద్గీథావయవమగు ఓంకారమునందు ప్రాణృదృష్టి- (ఆ ఓంకారమును ప్రాణరూపముగ నుపాసించుట యని భావము - ఇట్లే పై వాక్యములలోను గమనించవలయును) ఉద్గీథమునందు పృథివీదృష్టి - సామముయొక్క పంచవిధావయములయందు పృథివీ - అగ్ని - అంతరిక్షము - ఆదిత్యుడు - ద్యులోకము నను వానిదృష్టి - అను నిట్టి ఆకారములుగల కర్మాంగముల నాశ్రయించి యనుష్ఠింపబడు ఉపాసనములు వేదశాఖలలో నచ్చటచ్చట విహితములై యున్నవి. వీనికి కర్మాంగావ బద్ధోపాసనములని వ్యవహారము - ఈ ఉపాసనము లేవేదశాఖయందు విహితమైనవి ఆశాఖయందే వ్యవస్థితములై యుండునను నియమములేదు. శాఖాభేదముచే స్వరాధిభేదమున్నను నవి సర్వశాఖలయందును అనువర్తించగలవు. శాఖాంతరగతోద్గీథాదులను గూడ నవలంబింప గలవని (ఉద్గీథధర్మములకు సర్వశాఖాంతరోద్గీథోపాసనముల యందును ఉపసంహారము సమ్మతమని) భావము కారణమేమియన ? ''ఉద్గీథముపాసీత'' ఇత్యాదివిదాయక వాక్యములలో సర్వత్ర ఉద్గీథశబ్దముయొక్క శ్రవణము అవిశేషముగ = ఏకవిధముగ గోచరించుచున్నది గనుకనని తెలియదగును. (ఈ అవిశేషశ్రుతి విద్యైకత్వమును సూచించును)

56. సూ : మన్త్రాది వద్వావిరోధః

వివృతిః :- మన్త్రాదివత్‌ = యథా మన్త్రాణాం - ''కుటరుర సీ'' త్యాదీనాం - ప్రయాజాదీనాం చ కర్మణాం. శాఖాంతరవిహితానా మపి- శాఖాంతరే ఘాపసంహారో విద్యతే, ఏవ ముద్గీథాదీనా మపి శాఖాంతరే ఘాపసంహారే - అవిరోధః - వా = విరోధో నా స్త్యేవ.

వివరణము :- ''కుటరు రసి'' ఇత్యాదిమన్త్రములు. ప్రయాజాదికర్మ విశేషములును శాఖాంతర విహితములైనను సర్వశాఖలయందును వానికి ఉపసంహారము ప్రసిద్ధమైయున్నది. అట్లే అంగావబద్ధోపాసనములకును శాఖాంతరములయం దుపసంహారము కలదని యనుటలో విరోధమేమియులేదు.

భూయజ్యాయస్త్వాధి కరణమ్‌ 32

57. సూ : భూమ్నః క్రతువ జ్జ్యాయస్త్వం

తథాహి దర్శయతి

వివృతిః :- భూమ్నః = సర్వాంగసంపన్నస్య వైశ్వానరోపాసనస్య - జ్యాయస్త్వం = ప్రాధాన్యే నానుష్ఠేయత్వం - కథం ? క్రతువత్‌ = యథాదర్శపూర్ణమాసాదిషు క్రతుషు సామస్త్యేన సాంగప్రధానప్రయోగ ఏక ఏవ వివక్ష్యతే, తద్వత్‌ - హి = యస్మాత్‌ - తథా - ధర్మయతి = వైశ్వానరాత్మనో మూర్ధాద్యవయవానాం ప్రత్యేకోపాసనం వినిన్దన్తీ, సమస్తోపాసనస్య కర్తవ్యతాం ''మూర్ధా తే వ్యపతిష్య ద్యన్మాం నాగమిష్యః'' ఇత్యాద్యాశ్రుతిః ప్రతిపాదయతి - తత ఏవం నిశ్చీయతే -

వివరణము :- దర్శపూర్ణ మాసాదిక్రతు ప్రసంగములలో సర్వాంగవిశిష్ట ప్రధాన ప్రయోగమే ముఖ్యమని - ఫలప్రధాన సమర్థమని యెట్లు నిర్ణయింపబడుచున్నదో - అట్లే వైశ్యావర విద్యావిధాయక వాక్యములో మూర్ధాది సర్వావయవ సంపన్ననుగు వైశ్వానరాత్మోపాసనమే అనుష్ఠేయమని ప్రతిపాదింపబడుచున్నది గాని ప్రత్యేకావయవోపాసనమును గాదు. ఈ యంశమును వైశ్వానరాత్మావ యవములయందు ప్రత్యేకోపాసనములను నిందిచుచున్న ''మూర్ధాతే....'' అను నీ శ్రుతివాక్యము ధ్రువపరచుచున్నది.

శబ్దాది భేదాధి కరణమ్‌ 33

58. సూ : నానా శబ్దాదిభేదాత్‌

వివృతిః :- సన్తి సగుణబ్రహ్మైకవేద్యాః శాండిల్య - వైశ్వానర - దహర - ఉపకోనల - ముఖ్యప్రాణవిద్యాద్యాః - నానా = తా విద్యా భిన్నా ఏవ - కుతః ? శబ్దాదిభేదాత్‌ = వేద - ఉపాసీత - క్రతుంకుర్వీత - ఇత్యాది విధాయకశబ్దభేదాత్‌ - సత్యసంకల్పత్వ - మనోమయత్వాది గుణవిశిష్టవేద్యభేదాచ్చ.

వివరణము :- శాండిల్య - వై శ్వానర - దహరాధి విద్యలన్నిటి యందును వేద్య (ఉపాస్య) వస్తువు సగుణబ్రహ్మ ఒక్కటియే ఐనను - వేద - ఉపాసీత - క్రుతుంకుర్వీత - యనుచు తత్తద్విద్యా విధాయక శబ్దములు భిన్నభిన్నములుగ నున్నవి గనుకను - ఉపాస్యవస్తు విశేషణములుగ వర్ణింపబడిన గుణములును భిన్నములుగ నున్నవి గనుకను ఆ విద్యలును భిన్నములే అని తెలియదగును.

వికల్పధి కరణమ్‌ 34

59. సూ : వికల్పోవిశిష్ట ఫలత్వాత్‌

వివృతిః :- సిద్ధే విద్యాభేదే తాసా మనుష్టానే వ్రీహియవవ ద్వికల్పస్స్వేచ్ఛ యాంగీకర్తవ్య స్సముచ్చయో వేత్యత్రోచ్యతే - వికల్పః = వికల్ప ఏవాంగీకర్తవ్యః - నతు సముచ్చయః - కస్మాత్‌ - అవిశిష్టఫలత్వాత్‌ = ఆసాం విద్యానాం సర్వాసా ముపాస్యసాక్షాత్కార రూపస్య ఫలస్య సమానత్వాత్‌ - ఏకానుష్ఠానేనై వోపాస్యసాక్షాత్కారలక్షణ ఫలే సిద్ధే అన్యానుష్ఠానం నార్థవ ద్భవితు మర్హతీ త్యతో వికల్పఏవ విద్యాస్వితి నిర్ణయః -

వివరణము :- భిన్నములుగా నిర్ణయింపబడిన ఈ విద్యలయొక్క అనుష్ఠానము విషయములో స్వేచ్ఛానుసారము వికల్పము నాశ్రయింపవలయును గాని సముచ్చయమును స్వీకరింపరాదు. ఏలయన ? విద్యాఫలమైన ఉపాస్యవస్తు సాక్షాత్కారము ఏకవిద్యానుష్ఠానముచేతనే సిద్ధించుచుండ నన్యానుష్ఠానము వ్యర్థము కాగలదు గదా ! కాన సర్వవిద్యలయందును స్వేచ్ఛానుసారము వికల్పమునే అంగీకరింపవలయునని నిర్ణయము.

కామ్యాధి కరణమ్‌ 35

60. సూ : కామ్యాస్తు యధాకామం సముచ్చీయేరన్నవా పూర్వహేత్వభావాత్‌

వివృతిః :- కామ్యాః - తు = ఉపాస్య సాక్షాత్కారానపేక్షా స్సన్తః - అదృష్టద్వారా ఫలహేతవః పురుషవిద్యాద్యా విద్యాస్తు - యథాకామం = స్వేచ్ఛయా - సముచ్చీయరన్‌ - న - వా = సముచ్చి త్యానుష్ఠేయా వా, వికల్ప్యానుష్ఠేయా వా భవన్తి - న తత్ర నియమోస్తీత్యర్థః - కస్మాత్‌ ? పూర్వహేత్వభావాత్‌ = పూర్వస్య దహరాదివిద్యాసు వికల్పానుష్ఠాన నియామకత యోక్తస్య హేతో స్సమానఫలత్వ స్యాత్రాభావాత్‌.

వివరణము :- పురుష విద్యాదివిద్యలు కామ్యములు - అవి ఉపాస్యసాక్షాత్కారము నపేక్షింపకయే అదృష్టద్వారా ఫలసంపాదకము లగుచుండును. అవి అనుష్ఠాతృ పురుషునియొక్క ఇచ్ఛ ననుసరించి సముచ్చిత్యగాని, వికల్ప్యగాని అనుష్ఠింపబడవచ్చును. దహరాది సగుణవిద్యల కన్నిటికిని ఉపాస్యసాక్షాత్కార మనునది సమానమగు ఫలము. కాన నచట వికల్ప మంగీకరింపబడినది. ఇచట వికల్పపక్షమునకు నియామకమగు ఏకఫలత్వము అన్యానుష్ఠాన వై యర్థ్యముఅనునిట్టి సామగ్రిలేదు. కాన ఒక్కవిద్యనేగాని - రెండు మూడు విద్యలను సముచ్ఛిత్య (కలిపి) గాని యిచ్ఛానుసారము కామ్యవిద్యల ననుష్ఠించ వచ్చునని నిర్ణయము.

యాథాశ్రయ భావాధి కరణమ్‌ 36

61. సూ : అంగేషు యథాశ్రయభావః

వివృతిః :- అంగేషు = ఉద్గీథాది కర్మాంగేను విహితానా ముపాసనానాం యథాశ్రయభావః = ఆశ్రయస్వభావ మనతిక్రమ్య వృత్తి ర్భవితుమర్హతి - ఉపాసనాశ్రయాణా ముద్గీథాదీనాం (కర్మాంగభూతానాం) నముచ్చిత్యానుష్ఠాననియవ త్తదాశ్రితానా ముపాస్తీనా మపి నముచ్చిత్యానుష్ఠాననియమ ఇతి భావః -

వివరణము :- కర్మాంగములగు ఉద్గీథాదులయందు విహితములైన ఉపాసనములకు తదుపాసనాశ్రయములును, కర్మాంగ భూతములును నగు ఉద్గీథాదులకు వలెనే సముచ్చిత్యా నుష్ఠానము నియతమని చెప్పుటయుక్తము.

62. సూ : శిష్టేశ్చ

వివృతిః :- చ= అపిచ - శిష్టేః = ఉద్గీథాదికర్మంగానా మివతదాశ్రితానా ముపాసనానా మపి విహితత్వావిశేషా స్సముచ్చిత్యానుష్ఠేయత్వం యుక్తం.

వివరణము :- కర్మాంగములగు ఉద్గీథాదులు విహితములు - అట్లే తదాశ్రితములగు ఉపాసనములును విధివిహితములే కాన ఉద్గీథాదులకు వలె తదుపాసనములకును సముచ్చిత్యానుష్ఠానము యుక్తమగును.

63. సూ : సమాహారాత్‌

వివృతిః :- సమాహారాత్‌ = సమాహారః = సమతాకరణం = క్షతస్య సంధానం - తస్మాత్‌ - ''హోతృషదనా ద్ధైవాపి దురుద్గీథ మనుసమాహరతి'' ఇత్యత్ర ఋగ్వేదోక్తస్య ప్రణవస్య సామవేదోక్తోద్గీథేవైక్యం యో విజానాతి = ఉపాన్తే - తాదృశవిజ్ఞానవా నుద్గాతా స్వకర్మణ్యుద్గానే ప్రమాదాజ్ఞాతం క్షతం సమ్యగనుష్ఠితా ద్ధోతుః శంసనా త్ర్పతిసమాదధా తీత్యుక్తే రంగాశ్రితానా ముపాసనానాం సముచ్చయో నియత ఇతి గమ్యతే -

వివరణము :- ''హోతృషదనా .... మాహరతి'' అను నీ వాక్యములో ఋగ్వేదోక్త ప్రణవమునకు సామవేదోగ్దీథముతో నైక్యమును భావించి యెవ డుపాసనము చేయునో అట్టి ఉద్గాత స్వకృత్యమగు నుద్గానమునందు ప్రమాదమువలన సంభవించిన దోషమును యథాశాస్త్ర మనుష్ఠింపబడిన హోతయొక్క శస్త్రశంసనముచేత నమాధాన పరచుకొనుచున్నాడు. (తొలగించుకొనుచున్నాడు) అని చెప్పబడియుండుట వలనను కర్మాంగాశ్రితో పాసనములకు సముచ్చిత్యానుష్ఠానము నియమతమని తెలియవచ్చుచున్నది.

64. సూ : గుణసాధారణ్య శ్రుతేశ్చ

వివృతిః :- చ= అపిచ - గుణసాధారణ్య శ్రుతేః = గుణస్య = విద్యా (ఉపాసనా) శ్రయ స్య ఓంకారస్య - సాధారణ్యశ్రుతేః = ''తేనేయంత్రయీ వర్తతే'' ఇత్యాదినా వేదత్రయ సాధారణత్వ శ్రవణాత్‌ - తదాశ్రితోపాసనానామపి సాధారణ్య మస్తీతి, తేషాం సముచ్చిత్యానుష్ఠానమావశ్యకం భవతీతి పూర్వ) పక్షః-

వివరణము :- మరియు ఉపాసనకు ఆశ్రయమైన ఓంకారమునకు ''తేనేయంత్రయీ వర్తతే'' అను శ్రుతిలో ఈ ఓంకారముచేత మూడువేదములయందు ప్రతిపాదింపబడు కర్మలును ప్రవర్తించుచున్నవి యని సాధారణ్యము వర్ణింపబడియున్నది. కాన తదాశ్రితములగు ఉద్గీథాద్యుపాసనములకును సాధారణ్యము (సర్వత్ర అనుబంధము) సంభవించుచున్నది. కాన నా ఉపాసనములకు సముచ్చయానుష్ఠానము నియతమని చెప్పవలయునని పూర్వపక్షము.

65. సూ : నవా తత్సహభావా శ్రుతేః

వివృతిః :- సిద్ధాంత ఉచ్యతే - వా= వాశబ్దోయం పూర్వపక్షవ్యావర్తనార్థః-న=ఆశ్రితానా ముపాసనానామాశ్రయవ త్సముచ్చయో నాస్తి-కస్మాత్‌ ? తత్సహభావాశ్రుతేః= తేషాం = ఉపాసనానాం సహభావస్య = నముచ్చయన్య - అశ్రుతేః = అశ్రవణాత్‌ - అంగానా మివ తదుపాసనానాం సముచ్చయానుష్ఠానస్య క్వచిత ప్యశ్రుతత్వా దిత్యర్థః -

వివరణము :- సిద్ధాంతము చెప్పబడుచుప్నది. కర్మాంగాశ్రితో పాసనములకు సముచ్చయము చెప్పుట యుక్తు కాదు. కర్మాంగములకు సహభావమును-సముచ్చయమును బోధించు శ్రుతి యున్నట్లు ఉపాసనములకు సహఖావమును బోధించు శ్రుతి యెచ్చటను కాన వచ్చుటలేదు గనుక నని తెలియదగును.

66. సూ : దర్శనాచ్చ

వివృతిః :- చ= కించ - దర్శనాత్‌ = ''ఏవం విడ్ఢవై బ్రహ్మాయజ్ఞం యజమానం సర్వాంశ్చ ఋత్విజోభిరక్షతి'' ఇత్యత్ర విదుషోబ్రహ్మణ స్సర్వర్త్విక్పరిపాలకత్వ దర్శనా దంగోపాసనానాం న సహభావోస్తీతి గమ్యతే - సర్వేషామప్యర్త్విజాం విద్వత్త్వే బ్రహ్మామా పరిపాల్యత్వా సంభవాత్‌ - తస్మా దంగాశ్రితోపాసనానాం పురుషార్థత్వాద్గోదోహనాదివద్వికల్పానుష్ఠానమేవ యుక్తం - న సముచ్చిత్యానుష్ఠాన మితి -

ఇతి శ్రీ గాయత్రీ పీఠాధీశ్వర శ్రీ విద్యాశంకర భారతీ యతివరవిరచితాయాం బ్రహ్మసూత్ర వివృతౌ తృతీయాధ్యాయస్యృతృతీయః పాదః

వివరణము :- మరియు ''ఏవంవిద్దవై....రక్షతి'' యను శ్రుతిలో విద్యాయుక్తడౌ బ్రహ్మ ఋత్విక్కుల నందరను - యజ్ఞమును - యజమానుని గూడ రక్షించును అని వర్ణింపబడియున్నది. ఇట్లు విద్యాయుతుడౌ బ్రహ్మకు సర్వర్తి క్పరిపాలకత్వము వర్ణింపబడియుండుటవలన నంగోపాసనములకు సహభావము లేదని తెలియదగును. ఋత్విక్కులందరును విద్యా (ఉపాసన) యుక్తులేయగుచో శ్రుత్యుక్తమగు పరిపాలకత్వము బ్రహ్మకు గాని - తత్పరిపాల్యత్వము ఋత్విక్కులకు గాని సంభవించక పోవును. కాన నంగోపాసనములకు సముచ్చయము యుక్తము కానేరదు - మరియు కర్మాంగాశ్రితములగు ఉపాసనములు కర్మఫలములయందు ఫలవిశేష సంపాదనార్థము స్వీకరింపబడుచున్నవికాన నివి గోదోహనాదులువలె పురుషార్థములు గాని క్రత్వర్థములు కానేరవు. కానను అంగోపాసనములకు గోదోహనాదులకు వలె వికల్పానుష్ఠానమే గాని సముచ్చయానుష్టానము సమ్మతము కాదని తెలియదగును.

ఇట్లు శ్రీ గాయత్రీ పీఠాధీశ్వర శ్రీ విద్యాశంకర భారతీ యతివర

విరచితమగు బ్రహ్మసూత్రార్థ వివరణమున

తృతీయాధ్యాయమున తృతీయ పాదము ముగిసెను.

తృతీయాధ్యాయే - చతుర్థః పాదః

పురుషార్థాధి కరణమ్‌ 1

1 సూ : పురుషార్థోత శ్శబ్దా దితి బాదరాయణః

వివృతిః :- ఔపనిషద మాత్మజ్ఞానం స్వతంత్ర మేవ పురుషార్థ సాధనం భవతీతి నిరూపయితు ముపక్రమతే-అతః= వేదాన్తవిహితాత్‌ = ఔపనిషదా దాత్మజ్ఞానా త్కర్మనిర పేక్షాత్స్వతంత్రాత్‌ పురుషార్థః = పరమ పురుషార్థో మోక్ష స్సిద్ధ్యతి. ఇతి = ఇత్యేవం బాదరాయణః = బాదరాయణ ఆచార్యో మన్యతే - కస్మాత్‌? శబ్దాత్‌ = ''తరతి శోక మాత్మవిత్‌'' ''బ్రహ్మ వేద బ్రహ్మైవ భవతి'' ఇత్యాదేః కేవలాయా విద్యాయా మోక్ష హేతుత్వబోధకా చ్ఛబ్దాత్‌ - ఇతి.

వివరణము :- ఉపనిషద్వాక్యార్థ విచారజన్యమగు ఆత్మతత్త్వజ్ఞానము స్వతంత్రముగనే అనగా కర్మోపాసనాది సహాయము నపేక్షింపకయే పరమ పరుషార్థమగు మోక్షమునుగూర్చి సాధనము కాగలదని నిరూపించుటకై విచారముల నారంభించుచున్నారు.

వేదాన్త వాక్యార్థ విచార లబ్ధమగు నాత్మతత్త్వ సాక్షాత్కారము కర్మాధి సహాయము నపేక్షింపకయే పరమపురుషార్థమగు మోక్షమును సాధించగలదు, అని బాదరాయణాచార్యులవారు తలంచుచున్నారు. కారణమేమి యన? ''తరతి శోక మాత్మవిత్‌'' ఆత్మతత్త్వ విజ్ఞానము కలవాడు శోకమును (సంసారరూపమగు అనర్థమును) తరించును. ''బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి'' బ్రహ్మతత్త్వమును గుర్తించినవాడు తాను బ్రహ్మయే అగుచున్నాడు (ముక్తుడగుచున్నాడు). ఇత్యాది శ్రుతివాక్యములలో కేవల విజ్ఞానము మాత్రము వలననే మోక్షము కలుగునని ప్రతిపాదింపబడుచున్నది గనుక -

2 సూ : శేషత్వా త్పురుషార్థవాదో యథాన్యే

ష్వితి జైమినిః

వివృతిః :- (అత్ర సూత్రస్థ పురుషార్థవాద ఇతి పదా దర్థవాద ఇతి పదం విభజ్య తదావర్త్య వ్యాఖ్యా కర్తవ్యా-ః శేషత్వాత్‌ = ఆత్మనః కర్మకర్తృత్వేన కర్మ శేషత్వాత్‌ - పురుషార్థవాదః = మోక్షరూపః పురుషార్థః ''తరతి శోక మాత్మవిత్‌'' ఇత్యాదిశ్రుతిభి రాత్మజ్ఞానా త్కేవలా ద్భవతీత్యుక్తిః - అర్థవాద ఏవ - కథం? యథా - అన్యేషు = కర్మశేషభూతేషుద్రవ్య, సంస్కార, కర్మసు, వర్ణమయీ - అంజన - ప్రయాజాదిషు ''యస్య వర్ణమయీ జుహూ ర్భవతి న పాపగ్‌ం శ్లోకగ్‌ంశృణోతి'' ''యదాంకై చక్షు రేవ భాతృవ్యస్య వృంక్తే ''వర్మ వా ఏత ద్యజ్ఞాయ క్రియతే-యత్ర్పయాజానూయాజా ఇజ్యన్తే'' ఇత్యాదిశ్రుతిభిరుక్తః ఫలవాదః అర్థవాదః = అర్థవాద ఏవ - తద్వ దితి జైమినిః = జైమిని రాచార్యోమన్యతే-

వివరణము :- ఇక జైమినిమహర్షియొక్క భావము వివరింపబడుచున్నది.

ఆత్మ కర్మలను నిర్వర్తింపజేయు కర్త గాన కర్మకు శేష (అంగ) భూతుడు - అనగా కర్మోపయోగి యగు అవయవము వంటివాడు. కాన అట్టి ఆత్మతత్త్వ విజ్ఞానము మోక్షసాధనము అని ప్రతిపాదించు ''తరతి శోక మాత్మవిత్‌'' ఇత్యాదివాక్యము అర్థవాదరూపము కాగలదు. ఆత్మ జ్ఞానము ప్రశస్తమైనది యని ప్రశంసను ప్రతిపాదించు వాక్యమగును కాని ఆత్మతత్త్వ విజ్ఞాన మోక్ష పురుషార్థములకు సాధ్యసాధన (కార్యకారణ) భావమును ప్రతిపాదించునది కాదు. ఎట్లన? ''యస్యవర్ణ....'' యజ్ఞములో వాడబడు ''జుహు'' అను పాత్రమును మోదుగకర్రతో జేయవలయును. అట్లు చేసిన యజమానునకు అపకీర్తి ఉండదు అనియు - ''యదాంక్తే....'' యజ్ఞదీక్షితుడగు యజమానుని కన్నులను కాటుకతో సంస్కరించిన శత్రునేత్రములు వినష్టము కాగలవు అనియు - ''వర్మవాఏత....'' ప్రయాజానూ యాజములను యజ్ఞాంగములగు కర్మల ననుష్ఠించిన యజ్ఞమునకు సంరక్షకమగు కవచము చేయబడినది యగును అనియు - నిట్లు కర్మాంగభూతమగు ద్రవ్య - సంస్కార - కర్మములకు సంబంధించి వాక్యములలో వర్ణింపబడిన ఫలములు ఆ ద్రవ్యము - ఆ సంస్కారము - ఆ కర్మ - ప్రశశ్తమైనవి యని ప్రతిపాదించుటకై వర్ణింపబడినవియే - అర్థవాదలే కాని కార్యకారణ భావమును ముఖ్యముగ బోధించునవి కావు అని నిర్ణయింపబడియున్నవి గదా - అట్లే - అని తెలియదగునవి.

3. సూ : ఆచార దర్శనాత్‌

వివృతిః :- ఆచారదర్శనాత్‌ = ఆచారః = కర్మణా మనుష్ఠానం ''జనకో హ వైదేహో బహుదక్షిణన యజ్ఞే నేజే'' ఇత్యాదౌ బ్రహ్మవిదామపి జనకాదీనాం కర్మాచరణదర్శనా త్కేవలవిద్యా న మోక్షహేతుర్భవతీతి -

వివరణము :- ''జనకో....నేజే'' ఇత్యాది వాక్యములలో బ్రహ్మవిదులగు జనకాదులును కర్మల నాచరించుట వర్ణింపబడుచున్నది గానను కర్మాపేక్ష లేకయే కేవల తత్త్వవిజ్ఞానము (విద్య) మాత్రము ముక్తిసాధనమని యనుట యుక్తము కానేరదు.

4. సూ : తచ్ర్ఛుతేః

వివృతిః :- తచ్ర్ఛుతేః = ''యదేవ విద్యాయా కరోతి శ్రద్ధ యోపనిషదా'' ఇత్యత్ర విద్యాయాః కర్మ శేషత్వశ్రవణా దపిన కేవలం విజ్ఞానం మోక్ష హేతు ర్భవతీతి -

వివరణము :- ''యదేవ విద్యయా....'' విద్య(విజ్ఞానము)తో జేయబడిన కర్మకు ఫలాధిక్యము ఈ వాక్యమునందు వర్ణింపబడుచున్నది గానను కేవల విజ్ఞానము ముక్తిహేతువనుట యుక్తము కానేరదు.

5. సూ : సమన్వా రంభణాత్‌

వివృతిః :- సమన్వారంభణాత్‌ = ''తం విద్యాకర్మణీ సమన్వార భేతే'' ఇతి శ్రుతౌ ఫలారంభే విద్యాకర్మణో స్సాహిత్యదర్శనా దపి కేవలం విజ్ఞానం స్వాతంత్రేణ న ఫలసాధనం భవతీతి.

వివరణము :- ''తం విద్యాకర్మ....'' శరీరాంతరమును గ్రహింపబోవు జీవునితో విద్యయు, కర్మయు ననుసరించి వెళ్ళి యచట సుఖదుఃఖ రూప ఫలము నారంభించును అని చెప్పు ఈ వాక్యములో విద్యాకర్మలకు సాహీత్యము - కలసి ఫలము నూత్పాదనచేయుట వర్ణింపబడినది గనుకను కేవలవిజ్ఞానము కర్మనిరపేక్షముగ ఫలసాధనము కానేరదు.

6. సూ : తద్వతో విధానాత్‌

వివృతిః :- ''ఆచార్యకులా ద్వేద మధీత్య యథావిధానం గురోః కర్మాతిశేషే ణాభిసమావృత్య కుటుంబే శుచౌ దేశే స్వాధ్యాయ మధీయానః'' ఇత్యాదిశ్రుతౌ తద్వతః = విదిత సమస్తవేదార్థ విజ్ఞానవతఃపుంసః. విధానాత్‌ = కర్మానుష్ఠానవిధానా చ్చ - న కేవలం విజ్ఞానం స్వాతంత్ర్యేణ మోక్షఫలసాధనం భవతీతి -

వివరణము :- ''ఆచార్యకులాద్వేద....'' గురుశుశ్రూషారూపమగు కర్మ నాచరించుచు మిగిలిన కాలమున యథాశాస్త్రముగ ప్రాఙ్మఖత్వము - పవిత్రపాణిత్వము (తూర్పు ముఖముగ కూరుచుండుట - దర్భపవిత్రమును ధరించుట) మొదలగు ధర్మములను పాటించుచు వేదాధ్యయనము చేసి యటుపిమ్మట ఆచార్యగృహము = గురుకులమునుండి బయలుదేరి వచ్చి బ్రహ్మచర్యాశ్రమ ధర్మములవదలి గృహస్థాశ్రమమును స్వీకరించుటకై స్నాతకవ్రతము నాచరించి గార్హస్థ్యమున నున్నవాడై పవిత్రమగు దేశమున అధీతస్వాధ్యాయాధ్యాయనము జేయుచు తదితరములగు విధివిహిత నిత్యాధికర్మల ననుష్ఠించుచునుండు పుమ్యపురుషుడు బ్రహ్మలోకమును పొందును. అని వర్ణించు నిట్టి శ్రుతివాక్యములయందు సమస్త వేదార్థవిజ్ఞానము కలవానికి కర్మానుష్ఠానము విధింపబడుచున్నది గానను కర్మనిరపేక్షమగు కేవల విజ్ఞానము మోక్షఫలసాధనమని యనుట యుక్తముకాదు.

7. సూ : నియమాచ్చ

వివృతిః :- చ = కించ నియమాత్‌ = ''కుర్వ న్నేవేహ కర్మాణి జిజీవిషే చ్ఛతగ్‌ం సమాః-'' ఇతి శ్రూతౌ యావజ్జీవం కర్మాణ్యవశ్యకర్తవ్యా నీత్యుక్తా న్నియమా దపి న విద్యాయాః కేవలాయాః ఫలహేతుత్వమస్తీతి.

వివరణము :- ''కుర్వన్నేవేహ....'' యావజ్జీవము కర్మలవశ్య కర్తవ్యములని వర్ణించు ఈ వాక్యములో ప్రతిపాదింపబడుచున్న యావజ్జీవ కర్మానుష్ఠాన నియమమును బట్టియు కేవలవిజ్ఞానము ముక్తిసాధనమనియనుట యుక్తము కానేరదు.

8. సూ : అధికోపదేశాత్తు బాదరాయణ సై#్యవం తద్దర్శనాత్‌

వివృతిః :- ద్వితీయసూత్ర మార భ్యైతావతా గ్రంథేన పూర్వపక్షతయా జైమినీయం మత ముపవర్ణ్య స్వసిద్ధాంతం దర్శయతి - అత్ర ''శేషత్వా త్పురుషార్థవాదః'' ఇతి సూత్రోక్తం ప్రతిక్షిపతి - తు = తుశబ్దోన ఇత్యర్థే - పూర్వోక్తం జైమినీయం మతం నాభ్యువగన్తవ్యం కుతః ? అధికోపదేశాత్‌ - అధికస్య = యః కర్మకర్తా సన్‌ - కర్మాంగభూతశ్చ సన్‌ - సంసారీ భవన్‌ వర్తతే జీవః - తస్మా దధికస్య = అకర్తుః అసంసారిణః, చిన్మాత్రస్య - కర్మశేష త్వోపగమాయోగ్యస్య పరమాత్మనః. ఉపదేశాత్‌ = వేదాన్తే ఘాపదిష్టత్వాత్‌ - బాదరాయణస్య = బాదరాయణాచారస్య యదస్తి మతం కేవలా దాత్మవిజ్ఞానా త్పురుషార్థ ఇతి తత్‌ - ఏవం = ఏవ మేవ = తత్తథైవ - తత్‌ సుస్థిత మేవేత్యర్థః- కుతః? తద్దర్శనాత్‌ = ''య స్సర్వజ్ఞః సర్వవిత్‌-'' ''అసంగో హ్యయం పురుషః'' ఇత్యాదిశ్రుతిషు తస్య = సర్వజ్ఞత్వాది గుణోపేతస్య శారీరా ద్విలక్షణస్య చిన్మాత్రస్య పరమాత్మనః - దర్శనాత్‌ = ప్రతిపాదితత్వతాత్‌ - ఏవంచ తత్త్వజ్ఞానఫలశ్రుతి ర్నార్థవాద ఇతి సిద్ధం భవతీతి -

వివరణము :- రెండవసూత్రమునుండి యింతవరకును పూర్వపక్షరూపమగు జైమినిమహర్షిమతమును వర్ణించి తన్నరసన పూర్వకముగ స్వసిద్ధాంతమును ప్రదర్శించుచున్నారు. అందు ఈ సూత్రములో ''శేషత్వాత్పురుషార్థవాదః'' అను సూత్రోక్తార్థమును నిరసించుచున్నారు.

పూర్వోక్త జైమినీయమత మంగీకరింపదగినది కాదు. కారణమేమి యన? అధికోపదేశము కలదు గాన - అనగా - కర్మకర్తయగుచు కర్మఫల భోక్తయగుచు - కర్మశేషభూతుడై - కర్మపరతంత్రుడగుచు - సంసారియైన జీవాత్మకంటె అథికుడైన కర్తృత్యముగాని భోక్తృత్వముగాని లేనివాడై - అసంసారియై - కర్మసంబంధము చెప్పుట కవకాశములేని అసంగచిన్మాత్రస్వరూపుడగు పరమాత్మ వేదాంతములయం దుపదేశింపబడుచున్నాడు గాన నామత మంగీకరింపదగినది కానేరదు - కేవలాత్మ విజ్ఞానము ముక్తిసాధనమను బాదరాయణాచార్యమత మప్రతిహతము, సుస్థితము నని తెలియదగును. ఏలయన? ''యస్సర్వర్ఞ....'' ''అసంగో....'' ఇత్యాది శ్రుతులలో సర్వజ్ఞత్వాది గుణములతో నొప్పుచున్నట్టి సంసారియగు జీవాత్మకంటె విలక్షణమైన యట్టి అసంగ చిద్రూపుడైన పరమాత్మ ప్రతిపాదింప బడుచున్నాడు గాన. ఇట్లు చెప్పుటచే తత్త్వజ్ఞానము ముక్తి ఫలకమని ప్రతిపాదించు శ్రుతి ప్రశంసార్థకమగు అర్థవాదము కాదని స్పష్టపడుచున్నది.

9. సూ. తుల్యం తు దర్శనం

వివృతిః - ఆచారదర్శనాదిత్య స్యోత్తరం - యదుక్తం జనకప్రభృతీనాం కర్మానుష్ఠానదర్శనా ద్విద్యా కర్మశేషభూ తేతి. తత్ర్పత్యుచ్యతే - దర్శనం = ''ఏతద్ధస్మ వై పూర్వే విద్వగ్‌సోగ్నిహోత్రం న జుహవాంచక్రిరే.'' ఇత్యాది శ్రుతిషు బ్రహ్మవిదాం కర్మపరిత్యాగస్య దర్శనంతుల్యం = యథా జనకాదీనాం కర్మానుష్ఠానదర్శనం తత్తుల్యం విద్యత ఏవ - అతః ఆచారా ద్విద్యాయాః కర్మ శేషత్వం నిర్ణీయత ఇత్యుక్తి ర్న సమీచీనా. ఇతి.

వివరణము :- ''ఆచార దర్శనాత్‌'' అను సూత్రములో సూచింపబడిన - విద్య కర్మ శేషభూతము - బ్రహ్మవిదులగు జనకాదులకు శ్రుతులలో కర్మానుష్ఠానము వర్ణింప బడినది గనుక ననువాద మిచట నిరసింపబడుచున్నది. బ్రహ్మ విదలగు జనకాదులకు కర్మానుష్ఠానము వర్ణింప బడినట్లే ''ఏతద్ధన్మవై...'' అను మరియొక శ్రుతిలో బ్రహ్మ విదులకు కర్మ పరిత్యాగమును వర్ణింపబడి యున్నది. కాన ఆచారము = కర్మానుష్టానమును బట్టి తత్త్వ విజ్ఞానము కర్మశేషమని నిర్ణయించుట సమంజసము కాదని తెలియదగును.

10. సూ. అసార్వత్రికీ

వివృతిః :- తచ్ఛ్రుతే రిత్య స్యోత్తరం - అసార్వత్రికీ = యదేవ విద్యయా కరోతీతి శ్రుతి ర్న సర్వాసు విద్యాస్వను వర్తమానా భవతి-కింతుప్రకృతోద్గీథ విద్యామాత్ర విషయైన - తత్ర్పకరణపరిపఠితత్వాత్‌ - సాచవిద్యా కర్మాంగ మెవే త్యత్ర న వివాదః - ఆత్మవిద్యాయా స్తు న కర్మశేషత్వ మిత్యే వాస్మాభి ర్నిర్ణీయతే.

వివరణము:- ''తచ్ర్ఛుతేః'' అను సూత్రమునకు సమాధానము. ''యదేవవిద్యయా....'' అను శ్రుతి విద్య కర్మాగము అని సూచించున్నది కాని ఆ శ్రుతిలోని విద్యా శబ్దము విద్యా సామాన్యమును = ఆత్మ విద్యాది సర్వ విద్యలను బోధించునది కాదు. ఉద్గీథ ప్రకరణములోనిది గనుక ఆ వాక్యము అందలి విద్యా శబ్దము ఉద్గీథ విద్యామాత్ర బోధకము కాగలదు. అట్టి విద్య కర్మశేషమనుటతో వివాదమేమియు లేదు. ఆత్మతత్త్వ విద్యకు మాత్రము కర్మాంగత్వము సంభవించదని మేము నిర్ణయించు చున్నాము.

11. సూ. విభాగ శ్శతవత్‌

వివృతిః :- సమన్వారంభణా దిత్యస్యోత్తరం - విభాగః = ''తం విద్య కర్మణీ సమన్వారభేతే'' ఇత్యత్ర విద్యాకర్మణోః ఫలారం భే విభాగో ద్రష్టవ్యః - విద్యా కస్యచి త్ఫలమారభ##తే. కర్మ కస్యచి దితి - కధ మితి చేత్‌? శతవత్‌ = ఆభ్యాం శతం దేయ మిత్యుక్తే - ఏకస్య పంచాశ దపరస్యపంచాశ దితి యధా విభాగ స్తద్వత్‌ - అపిచ సమన్వారంభణశ్రుతేః సంసారివిషయత్వ మేవ న ముముక్షువిషయత్వ మిత్యపి ద్రష్టవ్యం. అత స్సమన్వారంభణ శ్రుతిబలా దాత్మవిద్యాయా మోక్ష హేతుత్వం నాపైతీతి భావః.

వివరణము :- ''సమన్వారంభణాత్‌'' అను సూత్రమునకు సమాధనము ''తంవిద్యాకర్మణీ....'' అను శ్రుతిలో విద్యాకర్మలకు సాహిత్యము = కలసి ఫలముల నారంభించుట వర్ణింపబడినది యనుట యుక్తముకాదు. ఫలారంభములో విద్యా కర్మలకు విభాగము కలదని తెలియదగును. విద్యయొకనికి ఫలము నుత్పాదన చేయును. కర్మ మరియొకనికి ఫలము నుత్పాదన చేయునని. ఎట్లన? ఈ యిద్దరకు శతము (నూరు) ఇవ్వవలయుననగా ఒకనికి యేబది మరియొకనికి యేబది యని యెట్లు విభాగము చేయదగునో అట్లని తెలియదగును. మరియు పూర్వోక్తమగు సమన్వారంభణ శ్రుతి సంసారి జీవ విషయకము కాని ముముక్షు విషయకము కాదనియు విభజించి తెలిసికొనదగును. కాన సమన్వారంభణ శ్రుతి సామర్థ్యమును బట్టి ఆత్మతత్త్వ విజ్ఞానమును (విద్య)కు మోక్షసాధనత్వము సంభవించదనుట అసమంజసము కాగలదు.

12. సూ. అధ్యయనమాత్రవతః

వివృతిః :- తద్వతో విధానా దిత్యస్యోత్తరం. అధ్యయనమాత్రవతః = ''ఆచార్యకులా ద్వేద మధీత్యేత్యాదౌ వేదాధ్యయనమాత్రం కృతవత ఔపనిషదాత్మజ్ఞానవిధుర సై#్యవ కర్మణోనుష్ఠేయత్వేన విహితత్వాత్‌ ఔపనిషద మాత్మజ్ఞానం న కర్మశేషభూత మిత.

వివరణము :- ''తద్వతో విధానాత్‌'' అను సూత్రమునకు సమాధానము ''ఆదార్యకులాద్వేద....'' ఇత్యాది శ్రుతులలో వేదాధ్యయనము మాత్రము చేసినవానికి ఉపనిషద్వాక్యార్థ విచార సిద్ధమగు ఆత్మతత్త్వ విజ్ఞానము కలుగక యున్నవానికి మాత్రమే కర్మ అనుష్ఠింప దగినదిగ విధింపబడి యున్నది గాని ఆత్మతత్త్వ విదునకుగాదు. కాన ఔపనిషదమగు ఆత్మ విధ్య కర్మశేష భూతము కానేరదని తెలియదగును.

13. సూ. నావిశేషాత్‌

వివృతిః :- నియమాచ్చేత్య స్యోత్తరం-న = కుర్వన్నేవేహ కర్మాణి ''ఇతి వాక్య మాత్మతత్త్వవిదః కర్మ విదధాతీతి వక్తుం న శక్యతే-కుతః ? అవిశేషాత్‌ = విశేషాభావాత్‌ ''విద్వాన్‌ కుర్వన్‌....'' ఇతి విశిష్య కథనా భావా దిత్యర్థః-అతో విద్యా న కర్మాంగతాం భజత ఇతి భావః.

వివరణము :- ''నియమాచ్చ'' అను సూత్రమునకు సమాధానము- ''కుర్వన్నేవేహకర్మాణి....'' అను నీశ్రుతి ఆత్మతత్త్వ విదునకు కర్మను విధించు చున్నది యనుట పొసగదు. కారణమేమి యన? ''విద్వాన్‌ కుర్వన్‌'' అని విశేషముగ విద్యావంతుడు కర్మచేయు చుండవలయునని ఆ వాక్యమున విధింపబడి యుండలేదు గాన నని తెలియదగును. కాన ఆత్మవిద్య యనునది కర్మాంగము కానేరదని భావము.

14. సూ. స్తుతయేనుమతిర్వా

వివృతిః :- ''కుర్వన్నేవేహ కర్మాణి'' ఇత్యత్ర అపరో విశేషఉచ్యతే - యద్యయం మన్త్రః ప్రకరణానుసారేణ విద్వద్విషయ ఏవేత్యాగ్రహ స్తర్హి స్తుతయే - వా = బ్రహ్మవిద్యాస్తుత్యర్థ మేవ అనుమతిః = తత్త్వవిద ఇదం కర్మానుజ్ఞానం కృత మిత్యవగన్తవ్యం. ఉత్తరార్థే ''న కర్మలిప్యతే నరే'' ఇతి యావజ్జీవం కర్మాణి కుర్వత్యపి పురుషే తత్త్వవిది న కర్మ లేపాయ భవతి విద్యాసామర్థ్యాదిత్యుక్తత్యాత్‌ - అతో నియమాదపి విద్యాయాః కర్మ శేషత్వం నోపపద్యత ఇతి.

వివరణము :- ''కుర్వన్నేవేహకర్మాణి....'' ఈ శ్రుతి వాక్యము విషయములో మరియొక విశేషమిచట చెప్పబడుచున్నది. ఉపనిషదన్తర్గతమగు ఈ మన్త్రము ప్రకరణమును బట్టి విద్వాంసునికే = తత్త్వ విజ్ఞానము కలవానికే కర్మలను యావజ్జీవ కర్తవ్యములుగ ప్రతి పాదించు చున్నది యని యనుచో ఆ ప్రతిపాదనము బ్రహ్మ విద్యను స్తుతించుటకై - తత్వ విజ్ఞానము కలవానిచే కర్మ చేయబడవచ్చునని అనుమతి యిచ్చుట కొరకే యగును గాని కర్మ లవశ్య కర్తవ్యములని నియమించుట కొరకు కాదని తెలియదగును. ఇట్లేల వ్యాఖ్యానము చేయవలయుననిన? ఈ మన్త్రము యొక్క ఉత్తరార్థములో ''నకర్మ లిప్యతే నరే'' అని యావజ్జీవము తత్త్వ వేత్త కర్మల నాచరించు చున్నను విద్యా సామర్థ్యమున నాతనికా కర్మలేపముండదు. (అనగా తత్త్వవేత్త యగువాడు స్వకృత కర్మలచే బంధింపబడడని భావము) అని ప్రతిపాదింప బడియున్నది గనుక నట్లు వ్యాఖ్యానింప బడినది. కాన నా ''కుర్వన్నేవేహ....'' శ్రుతి కర్మ లవశ్యకర్తవ్యములుగ నియమించు చున్నది గనుక విద్య కర్మ శేషభూతము అని యనుటయు ఉపపన్నము కానేరదు.

15. సూ. కామకారేణ చైకే

వివృతిః :- ఏకే = విద్వాంసః ప్రత్యక్షీకృతతత్త్వజ్ఞానఫలాస్సన్త స్తదవష్టంభాత్‌ కామకారేణ = స్వేచ్ఛయైవ పరోక్షఫలజనకం కర్మపరిత్యక్తవంత ఇతి శ్రూయతే. ''ఏత ద్ధస్మ వై తత్పూర్వే విద్వాంసః ప్రజాం న కామయన్తే కిం ప్రజయా కరిష్యామో యెషాం నోయ మాత్మా యం లోకః....'' ఇత్యారభ్య ''వ్యుత్థాయాథ భిక్షాచర్యం చరన్తి'' ఇత్యంతేన గ్రంథేన. అతోపి విద్యాయాః కర్మశేషత్వం నోపపద్యత ఇతి భావః

వివరణము :- ''ఏతద్ధస్మవై.... యంలోకః'' అని ఆరంభించి ''వ్యుత్థాయా....చరన్తి'' ఈ వాక్యము వరకు గల శ్రుతివాక్య సముదాయములో కొందరు మహా విద్వాంసులు తత్త్వ విజ్ఞాన ఫలమగు మోక్షరూపమగు పరబ్రహ్మ తత్త్వమును సాక్షాత్కరింప జేసికొనిన వారగుచు ఆ బ్రహ్మాత్మైక్య సాక్షాత్కారావలంబనమున (ఆ అపరోక్ష సాక్షాత్కార బలమున) ప్రజాపశుస్వర్గాది పరోక్ష ఫల హేతువగు కర్మ జాతమును బుద్ధి పూర్వకముగ పరిత్యజించుచున్నారని ప్రతిపాదింప బడుచున్నది. ఈ ప్రతిపాదనమును బట్టియు విద్య (విజ్ఞానము) కర్మశేషము కాదని తేలుచున్నది యని భావము -

16. సూ. ఉపమర్దం చ

వివృతిః :- చ = ఆపిచ - ఉపమర్దం = సమస్త స్యావిద్యాకృతస్య క్రియాకారకఫలవిభాగ స్యాత్మవిజ్ఞానే సతి విద్యాసామర్థ్యాత్‌ ఉపమర్దం = అభావం = వినాశం ''యత్ర త్వస్య సర్వ మాత్మైవాభూ త్తత్కేన కంపశ్యేత్‌'' ఇత్యాదిశ్రుతయః ప్రతిపాదయన్తి - ఆత్మైకత్వ విజ్ఞానా ద్విదుషాంకర్మ స్వధికారో వినశ్యతి - భేదజ్ఞానాశ్రయత్వా త్తేషాం కర్మణా మితి భావః - అతోపి విద్యా న కర్మశేషభూతా.

వివరణము :- మరియు ''యత్రత్వస్య....'' ఇత్యాది శ్రుతులు బ్రహ్మాత్మైక్య విషయకాపరోక్ష సాక్షాత్కారము కలుగగా అట్టి విద్యాసామర్థ్యము వలన అవిద్యా వస్థయం దేర్పడిన సమస్తమగు క్రియ యని క్రియా సాధనమని, క్రియా ఫలమని యిట్లేర్పడిన నానావిధ భేదజాతము యొక్క నాశమును ప్రతిపాదించు చున్నవి. అనగా కర్మలు కర్త, కర్మ - ధ్యాత, ధ్యానము - జ్ఞాత - జ్ఞానము - ఇత్యాది భేద జ్ఞానమున్నప్పుడే (అవిద్యా కాలముననే) యేర్పడునవి యగుటి వలన అద్వితీయాత్మ సాక్షాత్కారము కలుగగా నా విద్వాంసులకు కర్మల కాధారమగు భేదజ్ఞానము, దానికి మూలమగు అవిద్యయు నశించును గనుక వారికి కర్మల యందధికారము నశించిపోవునని భావము - కానను విజ్ఞాన మనునది కర్మకు అంగము కాదనియు, కర్మనిరపేక్షముగనే విజ్ఞానము మోక్ష ఫలమును చేకూర్చగలదనియు తెలియదగును.

17. సూ. ఊర్ధ్వేరేతస్సు చ శ##బ్దేహి

వివృతిః :- ఆత్మ విజ్ఞానం కర్మాంగం న భవతీ త్యత్ర హేత్వన్తరముచ్యతే - ఊర్ధ్వరేతస్సు - చ = యతి ష్వగ్నిహోత్రాది కర్మానుష్ఠానరహితే ష్వపి విద్యా శ్రూయతే - అత స్తత్ర విద్యాయాః కర్మాంగత్వం నాస్తీతి స్పష్టం ప్రతీయతే. ఊర్ధ్వరేతసా మాశ్రమాణాం సత్వే కిం ప్రమాణమితిచే దుచ్యతే. ఊర్ధ్వరేతనః = యతయః - హి = యస్మాత్‌ - వేదే = ఏవ ''త్రయో ధర్మస్కంధాః'' ఇతి ప్రస్తుత్య ''బ్రహ్మసంస్థోమృతత్త్వమేతి'' ఇత్యత్ర ''ఏత మేవ ప్రవ్రాజినో లోకమిచ్ఛన్తః ప్రవ్రజన్తి'' ఇత్యా దౌ చ సమ్య గుపలభ్యన్తే. తస్మా త్ర్పామాణికోయం యత్యాశ్రమ ఇతి. అత ఆత్మజ్ఞానం స్వతంత్రమేవ మోక్షసాధన మితి ప్రమాణపరిష్కృతోయం సిద్ధాంత ఇతి.

వివరణము :- ఆత్మ జ్ఞానము కర్మాంగము కానేరదనుటకు మరి యొక హేతువు నిచట చెప్పుచున్నారు. శ్రుతులలో అగ్నిహోత్రాది కర్మానుష్ఠాన రహితులగు యతులును విద్య కలవారై యున్నట్లు వర్ణనములు కానవచ్చు చున్నవి. అందువలన విద్య కర్మకు అంగము కాదు స్వతంత్రము అని స్పష్టముగ తెలియవచ్చు చున్నది. యత్యాశ్రమమనునది యొకటి కలదనుటలో ప్రమాణము కలదా లేదా అని సందేహింప నవసరము లేదు. వేదమునందే ''త్రయో ధర్మస్కంధాః'' కర్మ ప్రధానముగ గల ఆశ్రమములు మూడు అని ఆరంభించి ఆ తరువాత ''బ్రహ్మసంస్థోమృతత్వమేతి'' అను నీ వాక్యములో నాల్గవదియు బ్రహ్మ సంస్థా రూపమునగు యత్యాశ్రమము ప్రతి పాదింప బడుచున్నది. మరియు ''ఏత మేవ .....ప్రప్రజన్తి'' ఇత్యాది వాక్యములలోను ప్రవ్రజన శబ్దముతో యత్యాశ్రమము స్పష్టముగ ప్రతిపాదింప బడుచున్నది గనుకను యత్యాశ్రమము ప్రమాణికమే అని తెలియదగును. కనుక ఆత్మ జ్ఞానము స్వతంత్రముగానే కర్మాది సాపేక్షము కాకుండగనే మోక్షమును గూర్చి సాధనము కాగలదనునది ప్రమాణ సమ్మతమగు నని సిద్ధాంతము.

పరామర్శాధి కరణమ్‌ - 2

18. సూ. పరామర్శం జైమిని రచోదనా చాపవదతి హి

వివృతిః :- ఊర్ధ్వరేతసా మాశ్రమేఘ = పారివ్రాజ్యాశ్రమేఘప్రమాణ మస్తి నవేత్మస్సి న్నధికరణ విచార్యతే - తత్రప్రథమం పూర్వ పక్షతయా జైమినే ర్మతముపన్యస్యతే పరామర్శం=త్రయో ధర్మస్కంధాః'' ఇత్యాద్యా శ్రుతిః ''బ్రహ్మసంస్థోమృతత్వ మేతి'' ఇత్యత్రోక్త బ్రహ్మసంస్థతాస్తుత్యర్థ మాశ్రమాంతరాణాం బ్రహ్మచర్యగృహస్థ వానప్రస్థాఖ్యా నా మనువాదం కరోతీతి - జైమినిః = జైమిని రాజార్యో మన్యతే - కతుః? చ = (అయం హేత్వర్థే) యస్మా దియం శ్రుతిః - అచోదనా = లిఙాదివిధాయక ప్రత్యయరహితా - అతో న విధిః - కింతు బ్రహ్మసంస్థాస్తుతిపరా - ఏవం చాన్యపరయా స్తుతిప్రతిపాదన తాత్పర్యవత్యా నయా శ్రుత్యా న పారివ్రాజ్యాశ్రమసిద్ధిః - కించ-అవవదతి-హి=యస్మాత్‌ ''వీరహావా ఏషదేవానాం యోగ్ని ముద్వాసయుతే'' ఇత్యాద్యా శ్రుతిః ప్రత్యక్ష మేవ అగ్న్యుద్వాసన ప్రధానం యత్యాశ్రమం నిందతి - తస్మా దూర్ధ్వరేతనః ఆశ్రమాః=పారివ్రాజ్యశ్రమా న భవన్తీతి జైమినై ర్మతం - (పారివ్రాజ్యాశ్రమా వాంతరబేదా నాశ్రిత్య ఆశ్రమా ఇతి బహువచనం.)

వివరణము :- ఈ సూత్రములో యత్యాశ్రమము శ్రతి విహితము కాదు అనెడి జైమినిమతము చెప్పబడుచున్నది. ''త్రయో ధర్మస్కంధాః'' అను శ్రుతి బ్రహ్మసంస్థో...'' అను వాక్యములో చెప్పబడిన బ్రహ్మనిష్ఠను ప్రశంసించుటకు బ్రహ్మచర్య గృహస్థ వాన ప్రస్థములను మూడు ఆశ్రమములను అనువదించు చున్నదిగాని ఆశ్రమములను విధించుటకు ప్రవర్తించుటలేదు. ఇట్లేల నిర్ణయింప బడుచున్నది యన? ఆ వాక్యములో విధాయకములగు లిజ్‌ - లోట్‌ - తవ్య - ప్రత్యయములు లేవుగనుక నట్లు నిర్ణయింప బడుచున్నది. కాననీ ''బ్రహ్మసంస్థో....'' అను శ్రుతి పారివ్రాజ్యమును (యత్యాశ్రమమును) విధించుననుట యుక్తముకాదు. మరియు ''వీరహా వా...'' అను నీ శ్రుతి ప్రత్యక్షముగ అగ్నిహోత్రాద్య నుష్ఠానమును పరిత్యజించిన వానిని నిందించు చున్నది గాన సర్వకర్మ పరిత్యాగరూపమగు యత్యాశ్రమము ప్రమాణ సమ్మతము కానేరదని జైమినిమహర్షి యొక్క ఆశయము.

19. సూ. అనుష్ఠేయం బాదరాయణస్సామ్యశ్రుతేః

వివృతిః :- అత్ర సిద్ధాన్త ఉచ్యతే - అనుష్ఠేయం = ఊర్ధ్వరేతశ్శబ్దిత మాశ్రమాంతర ముపాదేయ మేవ ఇతి - భాదరాయణః = బాదరాయణ ఆచార్యో మన్యతే - కస్మత్‌? సామ్యశ్రుతేః = గార్హస్థ్యేనతుల్యతా శ్రవణాత్‌ - యథా గార్హస్థ్యం శ్రుత్యన్తరవిహిత మేవ ''త్రయో ధర్మస్కంధాః'' ఇతి శ్రుత్కానూద్యతే తథా ఆశ్రమాంతరం యత్యాశ్రమ మప్యనూద్యత ఇతి. తథా చ యథా గార్హస్థ్య మనుష్టేయం తథా పారివ్రాజ్య మప్యనుష్ఠేయ మేవేత్యర్ధః.

వివరణము :- సిద్ధాంత మిచట చెప్పబడుచున్నది. బాదరాయణాచార్యలవా రిట్లు తలంచుచున్నారు. ప్రారివ్రాజ్యము (యత్యాశ్రమము) అనుష్ఠింపదగినదే అని చెప్పదగును. ఏలయన? ''త్రయో ధర్మస్కంథాః'' అను శ్రుతిచేత మరియొక శ్రుతివాక్యములో విధింపబడిన గార్హస్థ్యాశ్రమ మెట్ల నువదింపబడుచున్నదో అట్లే ఆశ్రమాంతరమగు పారివ్రాజ్యమును అనువదింప బడుచున్నది. ఇట్లు శ్రుతియం దనువదింప బడుట యను సామ్యము కలదుగనుక గార్హస్ధ్యము వలెనే ప్రారివ్రాజ్యమును శ్రుతి సమ్మతమనియు కాననే అనుష్ఠింప దగినదియే అనియు తెలియదగును.

29. సూ. విధిర్వా ధారణవత్‌

వివృతిః :- వా = యద్వా. విధిః = ''త్రయో ధర్మస్కంధాః'' ఇతి శ్రుతి రాశ్రమానర్తరస్య పారివ్రాజ్యస్య విధిరేవ, న పరామర్శమాత్రం - కస్మాత్‌? ధారణవత్‌ = ''అథస్తా త్సమిథం ధారయ న్ననుద్రవే దుపరి హి దేవేభ్యో ధారయతి'' ఇత్య త్రోపరిధారణ మనువాదరూపే ఉదాహృతవాక్యే ఉపాత్తమపి యత్ర క్వాప్యప్రాప్త మితి కృత్వాత్ర విధేయ మేవే త్యంగీక్రియతే తథా ఆశ్రమాంతర స్యా ప్యత్ర విధి రంగీకార్య ఏవ ఇతి.

వివరణము :- ధర్మస్కంధ శ్రుతి పరామర్శ రూపము (అను వాదకము) మాత్రము కాదు. ఆశ్రమాంతర విధాయకమే యగును. ఎట్లన? ''అథస్తాత్స....ధారయతి'' అను వాక్యములో ఒకానొక అగ్నిహోత్రమను కర్మ విశేషమునందు హవిస్సుతో గూడిన స్రుక్కు అను పాత్రమునకు అడుగు భాగములో సమిధను ఉంచవలయు నని విధించుచు దేవతలకు సంబంధించిన అగ్నిహోత్ర కర్మలో సమిధను స్రుక్కునకు పై భాగమున ధరించ వలయునని అనువాద రూపముగ ప్రతిపాదింప బడినది. స్రుక్కుకు పై భాగమున సమిధను ధరించుట యనునది ఇతరత్ర యెచ్చటను విధింపబడి యుండలేదు. ఆ కారణమున అనువాద రూపముగ పూర్వ వాక్యములో చెప్పబడినను స్రుక్కునకు పై భాగమున సమిత్తును ధరించవలయునని ఆ వాక్యము విధించు చున్నది యని యెట్లు నిర్ణయింపబడుచున్నదో అట్లే ఆశ్రమాంతరము ఇతరత్ర యెచ్చటను విధింపబడి యుండనందున అనువాద రూపముగనున్న ధర్మస్కంధ శ్రుతి వాక్యము ఆ శ్రమాంతర విధాయకము కావచ్చును.

స్తుతిమాత్రాధి కరణమ్‌ 3

21. సూ. స్తుతిమాత్ర ముపాదానా దితి చేన్నాపూర్వత్వాత్‌

వివృతిః :- ఉద్గీథాదివిద్యవిషయక విచారోత్ర క్రియతే - స్తుతి మాత్రం = ''సవా ఏష రసానాం రసతమః పరార్థ్యోష్టమో య ఉద్గీథః'' ఇత్యాదిశ్రుతిజాతం రసతమత్వాదిగుణౖ రుద్గీథాదీనాం స్తుతిమాత్రమేవకరోతి, న తు తదుపాసనం విదధాతి. కస్మాత్‌? ఉపాదానాత్‌=అత్ర వాక్యే ఉద్గీథాదీనాం కర్మాంగానా ముపాత్తత్వాత్‌ - ఇతి - చేత్‌ = ఇత్యుచ్యతేచేత్‌ - న = న తథా వక్తుం యుక్తం అపూర్వత్వాత్‌ = ఉద్గీథాదీనాం రసతమత్యాది గుణోపేతత్వస్య, తదుపాసనస్య చ ప్రమాణాంతరై రప్రాప్తత్వాత్తస్యవిధేయత్వ ముచిత మేవేతి.

వివరణము :- ఉద్గీథాది విద్యలను గురించిన విచారమిచట చేయబడుచున్నది. ''సవాఏష....ఉద్గీథః'' ఇత్యాది శ్రుతి వాక్యములలో రసతమత్వాది గుణములతో గూడిన ఉద్గీథాద్యు పాసనములు విధింప బడినవని సిద్ధాంతము. పూర్వ పక్షవాదులు ఈ వాక్యములు కర్మకాండలోని వగు ఉద్గీథాదులను (ఉద్గీథమనగా ఉద్గాతయను ఋత్విక్కుచేత యజ్ఞములో చేయబడు సమగానములో అంగమగు ప్రణవము) ప్రశస్తము లైనవియని స్తుతించునవియే గాని తదుపాసనమును విధించునవి కాదు. ఆవాక్యములలో ఉద్గీథాది కర్మాంగములే గ్రహింపబడినవి గనుక ననియందురు. అది యుక్తము కాదు. ఉద్గీథాదులు రసతమత్వాది గుణములతో గూడుకొని యుండునను నంశము గాని, తదుపాసనము గాని మరియే ప్రమాణముచేత ను ప్రతిపాదింపబడి యుండలేదు గనుక అవి అపూర్వములు. కాన రసత మత్వాది గుణవిశిష్టమగు ఉద్గీథాద్యుపాసన మీ వాక్యములో విధింపబడినది యనుట ఉచితము కాగలదు.

22. సూ. భావశబ్దాచ్చ

వివృతిః :- చ = కించ - భావశబ్దాత్‌ = ''ఉద్గీథముపాసీత'' ''సామోపాసీత'' ఇత్యాది విస్పష్ట విధిశ్రవణా దపి రసతమత్వాది శ్రుతిర్నోద్గీథాది స్తుతిపరా - కిం తూపాసనావిధిపరా - సన్నిధి పరిపఠితరసతమత్వాదిగుణ విశిష్టత్వే నోద్గీథోపసనా కర్తవ్యత్యేవం జాతీయకార్థ బోదనపరా ఇత్యవగన్తవ్యం - (సూత్రస్ధ చశబ్దసూచితో విశేషః) ప్రతి ప్రకరణం చ విద్యానాం ఫలాని శ్రావ్యన్తే - ఏవ మంగాశ్రితా విద్యాః (ఉపాసనాని) స్వాతంత్ర్యేణ ఫలం జనయన్తీతి సిద్దే కిమువక్తవ్యం కర్మాసంగభూతా ఆత్మవిద్యా కేవలం స్వాతంత్ర్యేణ స్వఫలంజనయితు మలమితి.

వివరణము :- మరియు ''ఉద్గీథముపాసీత....'' ఇత్యాది వాక్యములు స్పష్టముగ ఉపాసనను విధించుచున్నవి. కాన రసతమత్వాది శ్రుతి వాక్యము కర్మాంగమగు ఉద్గీథమును స్తుతించుటకై ప్రవర్తించు చున్నది యనరాదు. ఉపాసనా విధిపరమే యనవలయును. అనగా నా వాక్యము స్వసన్నిధి పఠితములగు రసతమత్వాది గుణములతో గూడుకొని యున్నదిగ ఉద్గీథము ఉపాసింప దగినది యను నర్థమును బోధించుట యందు తాత్పర్యము కలది యని తెలిసికొనదగును.

సూత్రము నందలి చ శబ్దముచేత సూచింపబడు విశేషభావము - ఈ కర్మాంగావ బద్ధములగు ఉపాసనములకు ప్రతి ప్రకరణమునను ఫలములు వర్ణింప బడుచున్నవి, కర్మాంగములై అస్వతంత్రములైన ఈ ఉపాసనములకే ఫలోత్పాదకత్వసామర్థ్య మున్నదన్న అన్యాంగము కాక స్వతంత్రమగు ఆత్మ విద్య స్వతంత్రముగ ఫలము నుత్పాదన చేయగలదను సంగతి కైముతిక న్యాసిద్ధమని భావము.

పారిప్లవాధి కరణమ్‌ 4

23. సూ. పారిప్లవార్థా ఇతిచేన్న విశేషితత్వాత్‌

వివృతిః :- పారిప్లవార్థాః = అశ్వమేధే పుత్రాదిపరివృతయ రాజ్ఞేనానావిధాఖ్యాన కథనాత్మకః కశ్చిత్ప్రయోగః పారిప్లవ ఇత్యుచ్యతే-తదర్థాః తత్రోపయుజ్యన్త ఏవ వేదాన్తేషు శ్రూయమాణాః ''యాజ్ఞావల్క్యస్య ద్వేభార్యే బభూవతు ర్మైత్రేయీ చ కాత్యాయనీ చ'' ''ఇంద్రోహ వై దైవోదాసిః'' ఇత్యాద్యా ఆఖ్యాయికాః ఇతి - చేత్‌ = ఇత్యుచ్యతే చేత్‌ - న = నైత ద్యుక్తం - కుతః? విశేషతత్వాత్‌ = ''పారిప్లవ మాచక్షీత'' ఇతి పారిప్లవం విధాయ ''మను ర్వైవస్వతో రాజా....'' ఇత్యాద్యాఖ్యానానాం కేషాంచి దేవ తత్ర విశి ష్యాభిధానాత్‌.

వివరణము :- ఉపనిషత్తులలో ''యాజ్ఞవల్క్యస్య.... .....'' యాజ్ఞవల్క్య మహర్షికి మైత్రీయి యని, కాత్యాయని యని యిద్దరు భార్యలు కలరు. - ఆనిఇట్టి కొన్ని ఆఖ్యాయికలు వర్ణింపబడి యున్నవి. ఇవి యన్నియు పారి ప్లవమున నుపయోగ పడునవియే గాని ఆత్మ విద్యకు సంబంధించునవి కావని యనుట తగదు, [పారిప్లవ మనగా అశ్వమేధ యాగము ననుష్ఠించుచున్న రాజునకు పుత్రాది పరివృతునకు కథలను ఆఖ్యాయికలను వినిపించుట యను ప్రయోగము] ఏలయన? అచట చెప్పదగినవిగ విధింప బడినవి ''మను ర్వైవస్వతో రాజా'' వైవస్వ తమను చరితము మొదలగు కొన్ని ఆఖ్యాయికలు కలవు. వానిలో నీ ఉపనిషద్గతములగు ఆఖ్యాయికలు చేర్చబడలేదు గనుక.

24. సూ. తథా చైకవాక్యతో పబంధాత్‌

వివృతిః :- తథా - చ = వేదాన్తేషు పరిఠితానా మాఖ్యానానాం పూర్వోక్తయుక్త్యా పారిప్లవే వినియోగాభావే సిద్ధే సతి - సన్నిహి తాత్మతత్త్వవిద్యాస్తుత్యర్థత్వ మేవ తేషా మాఖ్యానానా మాస్థేయం, కస్మాత్‌? ఏకవాక్యతోపబన్ధాత్‌ = ''ఆత్మా వారే ద్రష్టవ్యః'' ఇత్యాదివిత్యాసు ప్రరోచనోత్పాదనద్వారా ప్రతిపత్తి సౌకర్యోపయోగిత్వేన తేషాం తాభి ర్విద్యాభిరేకవాక్యత్వాగమాత్‌. ఏవం చాఖ్యాయికా విద్యాస్తుత్యర్థా ఏవ న పారిప్లవార్థా ఇతి, విద్యాచ స్వతంత్రఫల హేతు రితి చసిద్ధమ్‌.

వివరణము :- వేదాన్తోక్తములగు ఆఖ్యాయికలు పారిప్లవమున నుపయోగపడవని చెప్పబడినవి గనుక నవి ఆ వేదాన్తములయందు ''ఆత్మా వారే ద్రష్టవ్యః'' ఇత్యాది వాక్యములో వర్ణింపబడిన ఆత్మ విద్యను ప్రశంసించుటకై, ఆత్మ విద్యయందు జనులకు రుచి నుత్పాదన చేయుటకై ప్రవర్తించుచున్న వనియే చెప్పదగును. అట్లు చెప్పుటతో ఆ ఆఖ్యాయికలకు ఆ విద్యలతో నేక వాక్యత్వము సిద్ధించ గలదు. అట్లుకాగా ఆఆఖ్యాయికలు ఆత్మ విద్యాస్తుత్యర్థములనియు, ఆత్మవిద్య స్వతంత్ర ఫలజనకమనియును సిద్ధించగలదు.

అగ్నీంధనాద్యధి కరణమ్‌ 5

25. సూ|| అతఏవ చాగ్నీంధనా ద్యనపేక్షా

వివృతిః :- అతః - ఏవ = విద్యాయాః కేవలాయాః పురుషార్థహేతుత్వా దేవ - అగ్నీంధనాద్యనపేక్షా = అగ్నీంధనాది సాధ్యాన్యాం స్వస్వాశ్రమ విహితానాం క్రమణా మపేక్షా నాస్తి. విద్యా స్వఫలసంపాదనే సహకార్యంత రాణి కానిచన నాపేక్షత ఇత్యర్థః - బంధ స్యావిద్యకత్వా ద్విద్యోదయే సతి శుక్తిజ్ఞానోదయేన, ఆవిద్యక రజతభ్రమనివృత్తి వన్నివృత్తి రవశ్యం భవతీత్యర్థః.

వివరణము :- ఆత్మ తత్త్వ విజ్ఞానము (విద్య) అన్యనిరపేక్షము గనే మోక్ష పురుషార్థమను స్వఫలము నుత్పాదన చేయగలదు. దానికి స్వఫలోత్పాదనమున అగ్నీంధనాది సాధ్యములగు ఆశ్రమ కర్మల సహాయా పేక్షయేమియు నుండదు. బంధమనునది అవిద్య వలన నేర్పడునది గాన విద్య ఉదయించినంతనే శుక్తి (ముత్యపు చిప్ప) ఇదియను జ్ఞానముకలుగగా అజ్ఞానము వలన కలిగిన రజత భ్రమ (వెండియను భ్రాంతి) ఎట్లు నివర్తించి పోవునో అట్లు నివర్తించి పోగలదు అని యర్థము.

సర్వాపేక్షాధి కరణమ్‌ 6

26. సూ సర్వాపేక్షా చ యజ్ఞాదిశ్రుతే రశ్వవత్‌

వివృతిః :- సర్వాపేక్షా - చ = బ్రహ్మవిద్యా తావ త్స్వార్థసంపాదనే కర్మాన పేక్షాపి స్వోత్పత్తౌ సర్వాపేక్షైవ = కర్మాదీ నపేక్షత ఏవ - కస్మాత్‌ యజ్ఞాదిశ్రుతేః = ''తమేతం వేదానువచనేన బ్రాహ్మణా వివిదిషన్తి యజ్ఞేనదానేన తపసానాశ##కేన'' ఇత్యాదినా యజ్ఞాదికర్మణాం వివిదిషాద్వారా జ్ఞానసాధనత్వశ్రవణాత్‌ - అశ్వవత్‌ = యథాశ్వః స్వయోగ్యతాబలాత్‌ రథచర్యాయాం విసియుజ్యతే, లాంగలాకర్షణ తు న వినియుజ్యతే - తద్వత్‌ కర్మాణాం యోగ్యతాబలాత్‌ విద్యాయా ఉత్పత్తావేవ వినియోగః, న విద్యాయాః ఫలే మోక్షే యోగ్యతాయా అభావా దితి. మోక్షస్య సిద్ధరూపత్వా దనిత్యఫలసాధకానాం కర్మణాం తత్ర యోగ్యతా నాస్తీతర్థః

వివరణము :- ఈ బ్రహ్మాత్మ విద్య తనకు ఫలమగు పరమ పురుషార్థమును సంపాదించుటలో ఇతరాపేక్ష యేమియు లేనిదియే ఐనను స్వోత్పత్తి యందు కర్మాధుల నపేక్షించుచునే యుండును. ఇట్లేల చెప్పవలయుననిన? ''తమేతం బ్రాహ్మాణా...'' అను నీశ్రుతిలో వేదాధ్యాయన, యజ్ఞ, దాన, తపః ప్రభృతి సర్వాశ్రమ కర్మలును వివిదిషను (తీవ్రజిజ్ఞానను) కలిగించుచు తద్ద్వారా జ్ఞానసాధనములు కాగలవని వర్ణింపబడియున్నది గనుకనని తెలియదగును. ఏట్లన? అశ్వమనునది తన యోగ్యత ననుసరించి రథకార్యమునందే ఉపయోగపడును గాని నాగలి దున్నుట యందుపయోగపడదు. అట్లే కర్మలును తమ యోగ్వతను బట్టి ఆత్మతత్త్వ విజ్ఞానము (విద్య) నుత్పాదన చేయుట యందే ఉపోయోగపడగలవు గాని ఆ విజ్ఞానమునకు ఫలమైన మోక్షమును గూర్చి ఉపయోగపడవు. ఆ కర్మలకచట యోగ్యత లేదు గనుక. పూర్వ సిద్ధముకాని ఫలములను-కార్యములను సాధింపగల స్వభావము కలవి కర్మలు. మోక్షమట్టిది కాదు. అది నిత్య సిద్ధము. ఇట్టి మోక్షము విషయములో అనిత్య ఫలసాధకములగు కర్మలకు యోగ్యత లేదు. కాన విద్య స్వతంత్ర ఫలజనక మనుట యుక్తమే అని భావము.

27. సూ. శమాద్యుపేతస్స్యాత్తథాపితు తద్విధే స్తదంగతయా తేషా మవశ్యానుష్ఠేయత్వాత్‌

వివృతిః:- బ్రహ్మవిద్యోత్పత్తౌ బహిరంగసాధనాని కర్మా ణ్యుక్త్వా అంతరంగసాధనా నీహోచ్యన్తే. తమేత మితి శ్రుతౌ వివిదిషన్తీతి వర్తమానవ్యపదేశః కృతః న తత్ర విధాయకానాం లిజాదీనాం శ్రవణమస్తి. అతః యజ్ఞాదీనాం వివిదిషా హేతుత్వం న సంభవతి అత స్సా శ్రుతిర్విద్యాస్తుతి పరై వేతి కేచి ద్వదన్తి - తదభ్యుపగ మ్యాత్రోచ్యతే. తథా - అపి = తథాం గీకృతేపి - శమాద్యుపేతః - స్యాత్‌ = శమాద్యుపేతేన బ్రహ్మవిద్యార్థినా ముముక్షుణావశ్యం భావ్యం. కుతః? తదంగతయా = ''తస్మాదేవంవిచ్ఛాన్తో దాంత ఉపరత స్తితిక్షు స్సమాహిత శ్ర్శద్ధావిత్తో భూత్వాత్మ న్యేవాత్మానం పశ్యేత్‌'' ఇత్యాదినా విద్యాసాధనత్వేన తధ్విధేః = తేషాం శమాదీనాం విధీయమానత్వాత్‌ - తేషాం = విహితానాం శమాదీనాం - అవశ్యానుష్ఠేయత్వాత్‌ = విహితత్వా దేవావర్జనీయతయా నుష్ఠేయత్వాచ్చ. వస్తుతస్తు- యజ్ఞాదిశ్రుతి రహి అప్రాప్తం యజ్ఞాదీనాం వివిదిషాసంయోగం ప్రతిపాదయతీ త్యపూర్వార్థత్వా ద్విధి రిత్యేవ మన్తవ్యం. అత్రాయం విశేషః ''ఏవంవిదితి'' విద్యాసంయోగా చ్ఛమాదీనామన్తరంగసాధనత్వ మితి, వివిదిషన్తీతి వివిదిషాసంయోగా ద్యజ్ఞాదీనాం బహిరంగసాధనత్వ మితి. [శమః - దమః ఉపరతిః - తితిక్షా - సమాహితత్వం - శ్రద్ధా - ఇత్యేషా శమాదిషట్కసంపత్తిః]

వివరణము :- బ్రహ్మవిద్య (బ్రహ్మాత్మైక విజ్ఞానము) ఏర్పడుటకు కర్మలు బహిరంగ సాధనములు. వానిని గూర్చి చెప్పి యిచట అంతరంగ సాధనముల చెప్పుచున్నారు.

''తమేతం....'' అను శ్రుతిలో ''వివిదిషన్తి'' యని యున్నది. ఇది విధాయక శబ్దముకాదు. విధిని బోధించు లిజాది ప్రత్యయము లచట కాన వచ్చుటలేదు గనుక. ఆ కారణమున యజ్ఞాది కర్మలు వివిదిషా హేతువులని యీ వాక్యమునుబట్టి నిర్ణయింప వలనుపడదు. కానఈశ్రుతి విద్యను ప్రశంసించుటకు ప్రవర్తించు అర్థవాదమే అని కొందరందురు, ఆ భావము నంగీకరించి చెప్పుచున్నారు.

అట్లంగీకరించినను బ్రహ్మ విద్యను కోరువారు ''తస్మా దేవంవిత్‌'' అను శ్రుతిలో శమాదిషట్క సంపత్తి బ్రహ్మవిద్యా సాధనముగ విధింపబడియున్నది గనుకను, కాననే, అవశ్యాను ష్టేయము గనుకనున్నూ శమాదిషట్క సంపత్తికలవారై యుండవలయును.

''తమేతం....'' అను నీశ్రుతి ప్రశంసను బోధించు అర్థవాద మనియనుటయు యుక్తముకాదు. యజ్ఞాదుల కన్యత్ర అప్రాప్తమైన వివిదిషా హేతుత్వ మిచట ప్రతిపాదింప బడుచున్దని గనుక నీ శ్రుతియు విధిరూపమనియే తెలియదగును.

మరియు ''తస్మాదేవంవిచ్ఛాన్తో....'' అను నీ వాక్యములో విధింపబడిన శమాదులకు ''ఏవంవిత్‌'' అని విద్యా సంబంధము వర్ణింపబడినది గాన విద్యనుగూర్చి శమాదులంతరంగ సాధనములని - ''తమేతం....'' అను నీ వాక్యములో విధింపబడిన యజ్ఞాదులకు ''వివిదిషన్తి'' అని వివిదిషా (జిజ్ఞాసా) సంబంధము వర్ణింపబడినది గాన విద్యను గూర్చి యజ్ఞాదులు బహిరంగ సాధనములనియు తెలియదగును. (శమాదిషట్కసంపత్తియనగా - శమము = అంతరింద్రియనిగ్రహము - దమము = బహిరింద్రియనిగ్రహము - ఉపరతి=బాహ్య విషయ పరాఙ్మఖత్వము-తితిక్ష=సహనము - సమాహితత్త్వము = ఏకాగ్ర (సమాహిత) మగు చిత్తము కలగియుండుట-శ్రద్ధ=శాస్త్రాచార్యోక్తుల యందతిశయిత మగు విశ్వాసమును)

సర్వాన్నానుమత్యధి కరమమ్‌ 7

28. సూ. సర్వాన్నానుమతిశ్చ ప్రాణాత్యయే తద్దర్శనాత్‌

వివృతిః :- సర్వాన్నానుమతిః - చ = ''న హ వా ఏవంవిది కించనానన్నం భవతి'' ఇతి ప్రామవిద్యాప్రకరణ ప్రాణస్య సర్వ మన్నం భవతీతి ధ్యానవతి శ్రూయమాణం సర్వాన్నభక్షణాభ్యనుజ్ఞానం ప్రాణవిద్యాప్రశంసారూపః అర్థవాత ఏవ - న శమాదివ ద్విద్యంగం భవతి - కుతః? ప్రాణ్యాతయే = చాక్రాయణోనామా ఋషిః కశ్చన కుటచీహతేషుకురుషు వసన్‌ ప్రాణాత్యయకారిణీం కష్టాం దశాం ప్రావ్తః క్షదాకులితః గజపరిచారకేణ సామిభక్షితాన్‌ కుల్మాషాన్‌ చఖాదేతి ఛాన్దోగ్యే కథాశ్రూయతే - తథాచ - ప్రాణాత్యయే = పరస్యా మాపది తద్దర్శవాత్‌ = సర్వ స్యాన్నస్యాదనీయత్వే నాభ్యనుజ్ఞానదరశనాత్‌. తస్మాత్‌ సర్వాన్నానుమతిర్విద్యాంగం న భవతీతి నిశ్చీయతే.

వివరణము :- ప్రాణవిద్యా ప్రకరణములోని ''న హ వా....'' అను వాక్యములో ప్రాణోపాసకునకు భుజింపదగని అన్నము ఉండదని సర్వాన్నభక్షణానుజ్ఞ వర్ణింప బడినది. ఆ అనుజ్ఞ ప్రాణవిద్యా ప్రాశస్త్యమును బోధించునదియే గాని శమాదులువలె బ్రహ్మ విద్యకు అంగము కాజాలదు. ఏలయన? ఉత్కృష్టమగు. గోప్పదియగు ఆపద సంభవించినప్పుడే సర్వాన్నానుజ్ఞ గాని ఆపద లేనియప్పుడు కాదని చాక్రాయణుని కథ సూచించు చున్నది. ఛాందోగ్యములో నిట్లున్నది. చాక్రాయణుడను ఋషి కురుదేశములో నివసించుచు ప్రాణాపాయకరమగు గొప్ప ఆపద ఏర్పడగా ఆకలిగొన్నవాడై మావటివాడు ఏనుగునకు దాణా పెట్టుచుతానును సగముతినిన గుగ్గిళ్లను వానిడిగి పుచ్చుకొని భక్షించెనని యున్నది. దీనిని బట్టి సర్వాన్నాను మతి ఆపత్కాలికముగాని బ్రహ్మ విద్యాంగము కాదని నిశ్చయింప బడుచున్నది.

29. సూ. అబాధా చ్చ

వివృతిః :- చ - కించ అబాధాత్‌ = ''ఆహారశుద్ధౌ సత్వపరిశుద్ధిః'' ఇత్యాది భక్షాభక్ష్యశాస్త్రస్య భాధాసంభనా దపి సర్వాన్నాను మతి ర్న విద్యాంగం.

వివరణము :- మరియు ''ఆహార శుద్ధౌ సత్వపరిశుద్ధిః'' ఆహారము శుద్ధమైనదగుచో అంతఃకరణము పరిశుద్ధము కాగలదు అనిశ్రుతి ప్రతి ప్రతిపాదించు చున్నది, కాననే భక్ష్యా భక్ష్యములను వివరించు శాస్త్రములు బయలుదేరినవి. ఆ శాస్త్రములకు విరోధము కల్పించరాదు గనుకను సర్వాన్నానుమతి బ్రహ్మవిద్యంగము కాదని నిశ్చయింపదగును.

30. సూ. అపిచ స్మర్యతే

వివృతిః :- అపి - చ = కించ స్మర్యతే = విదుషోవిదుష శ్చావిశేషేణ ప్రాణాత్యయే సర్వాన్నా నుమతిః'' జీవితాత్యయ మపన్నోయోన్నమత్తి యతస్తతః. లిప్యతే న స పాపేన పద్మపత్ర మివాంభసా'' ఇత్యాదినా స్మృతౌ ప్రతిపాద్యతే-ఏవం విదుషోవిదుష శ్చావిశేషేణ ''మద్యం నిత్యంబ్రాహ్మణః'' - ''సురాపస్య బ్రాహ్మణ స్యోష్ణా మాసించేయుః'' సురాపాః క్రుమయో భవన్త్యభక్ష్యభక్షిణః'' ఇతి చాన్నస్య వర్జన నియమం స్మృతిషు ప్రతిపాద్యతే - అతోపి సర్వాన్నానుమతి ర్న విద్యాగం.

వివరణము :- మరియు ''జీవితాత్యయ...మినాంభసా'' ఇత్యాది స్మృతులలో విద్వాంసుడు గాని ఆ విద్యాంసుడుగాని ప్రాణాపాయకరమగు అపదవచ్చినప్పు డెవరి నుండి యైనను అన్నమును స్వీకరించి భుజింపవచ్చును - పాపముండదు - అని ప్రతిపాదింప బడుచున్నది. ఇట్లే విద్వాంసుడు గాని అవిద్వాంసుడు గాని బ్రాహ్మణుడెన్నడును మద్యమును సేవించరాదనియు, మద్యపాయియగుచో బ్రాహ్మణుడు వానిచే అత్యంతము తప్తమగు సురను త్రాగించ వలయునని ప్రాయశ్చిత్తమును చెప్పబడి యునన్నది. మరియు సురను త్రాగినవారు అభక్ష్య భక్షణము చేయువారును వురుగులై పుట్టుదురనియు చెప్పబడి యున్నది. ఇట్లు నియమములు విద్యద విద్యత్సారణముగ చెప్పబడియున్నవి. కాన సర్వాన్నభోజనానుమతి విద్యాంగమని యనుట యుక్తము కానేరదు.

31. సూ. శబ్దశ్చాతోకామకారే

వివృతిః :- చ = కించ - అకామకారే = యథేష్టప్రవృత్తినిషేధే శబ్దః = కఠానాం శ్రుతౌ ''తస్మా ద్ర్బాహ్మణో న సురాం పిబేత్‌'' ఇతి వాక్య మపి శ్రూయతే - అతః = తస్మాత్‌ ''న హవా ఏవంవిది'' ఇత్యస్య సర్వాన్నభక్షణాభ్యనుజ్ఞానస్య విద్యాప్రంశసారూ పార్థవాదత్వమేవ - బ్రహ్మవిద్యాపతా యావజ్ఞీవం భక్ష్యాభ్యవిభాగశాస్త్రవశ్యేనైవ భవితవ్య మితి.

వివరణము :- మరియు యథేష్టా చరణమును నిషేధించు నిమిత్తము కఠసంహితలో ''తస్మా ద్బ్రా....'' అని ఒక వాక్యము సాక్షాత్తుగ పఠింపబడి యున్నది. కాన ప్రాణ విద్యా ప్రకరణములోని సర్వాన్నానుమతిని సూచించు ''న హ వా....'' అను వాక్యము ప్రాణ విద్యాస్తావకమగు అర్ధవాదమనియే తెలిసికొన దగును. కనుక బ్రహ్మవేత్త యగువాడు యూవజ్జీవము భక్ష్యా భక్ష్య నియనుమును పాటించువాడయియే యుండవలయును.

ఆశ్రమకర్మాధి కరణమ్‌ 8

32. సూ. విహితత్వా చ్చాశ్రమకర్మాపి

వివృతిః :- యథా ముముక్షో ర్వివిదిషోః కర్మా ణ్యవశ్య మనుష్ఠేయాని తథా అముముక్షో రపీత్యుచ్యతే - యాగదానాదికం కర్మ న వివిదిషా మాత్రస్య సాధనం. కింతు తత్‌ ఆశ్రమకర్మ - అపి = ఆశ్రమమాత్రనిష్ఠస్యాముముక్షో రప్యనుష్ఠేయ మేవ. కస్మాత్‌? విహితత్వాత్‌ = ''యావజ్జీవ మగ్నిహోత్రం జుహోతి'' ఇత్యాదినా నిత్యతయాపి విహితత్వాత్‌.

వివరణము :- వివిషాసాధనములుగ యజ్ఞదానాది కర్మలు విహితములైనవి యని నిరూపింప బడినది. ఆ కర్మలు బ్రహ్మతత్త్వ జిజ్ఞాసువులై ముముక్షువులైన వారికివలె ముముక్షువులు కాక ఆశ్రమ మాత్ర నిష్ఠులైన వారికిని అవశ్య కర్తవ్యములని తెలియదగును. అవి ''యావజ్జీవమగ్నిహోత్రం జుహోతి'' అను నిట్టి వాక్యములలో నిత్యానుష్ఠేయములుగా విధింపబడి యున్నవి గనుక.

33. సూ. సహకారిత్వేన చ

వివృతిః :- సహకారిత్వేన - చ = యాగదానాదికం కర్మ విద్యాసహకారిత్వే నాప్యనుష్ఠేయ మేవ భవతి. కస్మాత్‌? తమేత మిత్యాదినా విహతత్వా దేవ. తతశ్చ సంయోగపృథక్త్వన్యాయేన యాగదానాదికర్మణాంనిత్యత్వం కామ్యత్వం చ నవిరుద్ధ మితి సిద్ధ్యతి. కర్మణాం విద్యాసహకారిత్వం నామ చిత్తశుద్ధిసంపాదనద్వారా విద్యోత్పాదన మేవ, నతు విద్యయానహ తత్ఫలకారిత్వ మితి భావః.

వివరణము :- ''తమేతం....'' అను వాక్యములో విహితములైయున్నవి గనుక నీయజ్ఞ - దాన - తపః ప్రభృతికములైన సర్వాశ్రమకర్మలును తత్త్వ విద్యకు సహకారులని తెలియవచ్చు చున్నది - కాన నవియవశ్యానుష్ఠేయములు, యావజ్జీవాది వాక్యములో నీకర్మలు నిత్యముగను. తమేతం ఇత్యాది వాక్యములలో విద్యాసహకారులుగను రెండు విధములుగ విధింపబడుచున్నవి గనుక నివి నిత్యములును, కామ్యములును కావచ్చును. విరోధము లేదు.

[కర్మలు విద్యా సహకారులనగా చిత్త శుద్ధిని సంపాదించి తద్ద్వారా నవి విద్యను ఉత్పాదన చేయగలవని అర్థము. అంతియేకాని విద్యాతో పాటు విద్యా ఫలమగు మోక్షమును ఉత్పాదన చేయగలవని యర్థముకాదు]

34 సూ. సర్వధాపి తఏవోభవలింగాత్‌

వివృతిః :- యాని నిత్యా న్యగ్ని హోత్రాదీని కర్మాణ్యనుష్ఠేయా న్యవివిదుషో స్తాన్యేవ వివిదిషో రపి కర్తవ్యా న్యూతాన్యానీతి విచార్యతే - సర్వధా - అపి = నిత్యత్వేన - వివిధషార్థత్వేనచతే - ఏవ=యే కర్మ కాండే ప్రసిద్దా అగ్ని హోత్రాదయో ధర్మాస్త ఏవానుష్ఠేయాః, న తతో భిన్నాః. కుతః ? ఉభయలింగత్‌ =శ్రుతిలింగాత్‌ - స్మృతిలింగా చ్చ-''తమేతం వేదానువచనేన ....'' ఇత్యాది శ్రుత్యా యజ్ఞాదీనాం కర్మకాండే యద్రూపం సద్ధంస ద్వర్తతే - తదేవ స్వీకృత్య తేషాం వివిదిషాయాం వినియోగస్య దర్శితత్వాత్‌. ఏవం ''అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మకరోతి యః'' ఇత్యాదిస్మృత్యా కర్తవ్యతత్వేన విజ్ఞాతసై#్వవ ప్రసిద్ధస్య కర్మణః విద్యోత్పాదనార్థత్వస్య దర్శితత్యా చ్చ - ఏవం శ్రుతిస్మృతి రూ పోభయలింగదర్శనా న్న కర్మాణి భిన్నానీతి సిద్ధ్యతి.

వివరణము :- ''త మేతం వేదానువచనేన... '' ఇత్యాది శ్రుతులలో కర్మకండలో ప్రతిపాదింపబడిన స్వరూపములు గలిగిన అగ్నిహోత్ర యజ్ఞాదికర్మలకే వివిదిషాహేతుత్వము చెప్పబడినది. ఇట్లే ''అనాశ్రితః'' ఇత్యాది స్మృతులలోను కర్తవ్యములుగా పూర్వము ప్రసిద్ధమై తెలియబడి యున్న కర్మజాతమునకే విద్యోత్పత్తి హేతుత్వము వర్ణింపబడి యున్నది. ఇట్లు శ్రుతిస్మృతి రూపమగు ఉభయ (లింగ) ప్రమాణములను బట్టి విచారింప కర్మకాండయందు ప్రతిపాదింపబడిన ప్రసిద్ధములగు అగ్నిహోత్రాది కర్మలే నిత్యముగ గాని, వివిదిషార్థముగగాని, అనుష్ఠేయములగును గాని తద్భన్నములు మాత్రము కాదని తెలియదగును.

35. సూ. అనభిభవం చ దర్శయతి

వివృతిః :- చ= కించ అనభిభవం=బ్రహ్మచర్యాదిసాధనేన యదాత్మతత్త్వజ్ఞాన మాసాద్యతే తస్య రాగాదిభిః క్లేశైరభిభవాభావ - మవి నాశం దర్శయతి=''ఏష హ్యాత్మాన నశ్యతి యం బ్రహ్మచర్యే ణాను విందతి'' ఇత్యాద్యా శ్రుతిః ప్రతిపాదయతి. తస్మా దాశ్రమకర్మాణాం క్లేశతనూకరణన విద్యోదయే హేతుత్వావగమాత్‌ యజ్ఞాదీ న్యాశ్రమ కర్మాణి నిత్యాని యాని తాన్యేవ విద్యాసహకారీణి చ భవితు మర్హన్తీ త్యవగమ్యతే

వివరణము :- ఏష హ్యాత్మా ....'' ఇత్యాదిశ్రుతి బ్రహ్మచర్యాది సాధనములచే లబ్ధమైన ఆత్మతత్త్వజ్ఞానము రాగద్వేషాది ప్రతి బంధములచే నాశమును పొందదని ప్రతిపాదించుచున్నది. దీనిని బట్టి సర్వాశ్రమ కర్మలును అనుష్ఠాతృపురుషుల యందలి అవిద్యా - అస్మితా - రాగాది క్లేశములను క్షయింపజేయుచు విద్యోత్పాదకములు కాగలవని తెలియ వచ్చుచున్నది. కాన అధ్యయన యజ్ఞదానాదికములగు ఏనిత్య కర్మలు గలవో అవియే విద్యాసహకారులు యేర్పడుచున్నది.

విధురాధి కరణమ్‌ 9

36. సూ. అంతరాచాపితు తద్దృష్టేః

వివృతిః .- అనాశ్రమిణాం - విధురాదీనాం ద్రవ్యాదిసంపద్రహి తానాం యం కంచనాశ్రమ మప్రతిరపన్నా నాం విద్యాయా మధికారో7త్ర విచార్యతే - అంతరా - చ :- అపి - తు = ఆశ్రమాంతరాళే వర్తమానానాం విధురాదీనా మపి విద్యాయా మధికారోస్తి - కస్మాత్‌? తద్దృష్టేః = ర్వైక్వ చాక్నవీ ప్రభృతీనా మపి బ్రహ్మవిత్త్వ దర్శనాత్‌

వివరణము :- విధురులకును ద్రవ్యాది సంపత్తులేక యేఒక ఆశ్రమమును పొందనివారై ఆశ్రమముల మధ్యలో వర్తించు వారికిని బ్రహ్మవిద్య యందధికారముండునని నిర్ణయింపవచ్చును. కారణమేమియన? శ్రుతులలో అనాశ్రములు, విధురులునగు రైక్వ - చాక్నవీ ప్రభృతులు బ్రహ్మవిద్యా సంపన్నులుగ వర్ణింపబడుచున్నారు. గనుక నని తెలియదగును.

37. సూ. అపిచ స్మర్యతే

వివృతిః :- అపి - చ - స్మర్యతే = సంవర్తప్రభృతీనాం నగ్న చ ర్యాదియోగా దనపేక్షి తాశ్రమకర్మణా మపి మహాయోగిత్వ మితిహాసాదిషు యత స్స్మర్యతే తతో7వగమ్యతే విధురాదీనా మపిచ బ్రహ్మవిద్యాయా మధికార ఇతి.

వివరణము :- మరియు ఇతిహాసాది గ్రంథములలో నగ్నులై ఏ ఆశ్రమ కర్మలను అపేక్షింపక సంచరించు సంవర్తుడు మొదలగు వారును మహాయోగులుగ వర్ణింపబడి యుండిరి కానను విధురాదులకు బ్రహ్మ విద్యయం దధికారము కలదని నిర్ణయింపవచ్చును.

38. సూ. విశేషానుగ్రహశ్చ

వివృతి:- విశేషానుగ్రహః - చ = (విశేషై రనుగ్రహః = విశేషానుగ్రహః) తేషాం విధురాదీనా మపి పురుషమాత్ర సంబన్ధిభి ర్జపోపవాస దేవతారాధనాదిభి రవిరుద్ధై ర్ధర్మవిశేషై రనుగ్రహః = విద్యాయా ముపకారవిశేష స్సంభవతి. తథాచ స్మృతిః '' జప్యే నైవ తు సంసిద్ధ్యే ద్బ్రా హ్మణో నాత్ర సంశయః | కుర్యా దన్య న్నవా కుర్యా న్మైత్రో బ్రాహ్మణ ఉచ్యతే'' ఇతి [మైత్రః=దయావాన్‌] తస్మా ద్విధురాదీనా మప్యధికారో న రవిరుద్ధ్యతే.

వివరణము:- అధ్యయన - యజ్ఞ - దానాదు లాయా ఆశ్రమముల వారికి యెట్లు విద్యోపకారకములగునో అట్లే విధురాదులకును సర్వపురుష సాధారణముగ ననుష్ఠింపదగిన జపము - ఉపవాసము దేవాతారాధనము మొదలగు ధర్మ విశేషములు విద్యోపకారకములు - విద్యోత్పాదకములు కాగలవు. ''జప్యే నైవతు...ఉచ్యతే'' అను నీస్మృతి యీ అంశమును సూచించు చున్నది. కాన విధురాదులకును బ్రహ్మ విద్యయందధికారము కలదనుటలో విరోధమేమియు నుండుదు.

39. సూ. అత స్తితర జ్జ్యాయోలింగాచ్చ

వివృతిః :- అతః =అంతరాళవర్తిత్వాత్‌- ఇతరత్‌ - తు =అనాశ్రమి త్వాపేక్షయా ఇతరత్‌ =అన్యత మాశ్రమవర్తిత్త్వం జ్యాయః=శ్రేష్ఠం. సాధనోపచయా దచిరేణ విద్యా సాధనం - కస్మాత్‌? లింగాత్‌ - చ=''తేనైతి బ్రహ్మవిత్‌ పుణ్యకృత్తైజసశ్చ'' ఇతి శ్రుతౌ బ్రహ్మజ్ఞానాపేక్షిత శుద్ధిసంపాదక పుణ్యకృత్వలింగదర్శనాత్‌ - తాదృశ సమగ్రపుణ్యకర్తృత్వం చాశ్రమిణా మేవ సంపద్యతే, నాన్యేషాం - చశబ్దః ''అనాశ్రమీ న తిష్ఠేత్తు దిన మేక మపి ద్విజః'' ఇతి నిందాదర్శనా చ్చేతి సూచనాయ. అత శ్శ్రేష్ఠత్వా దవశ్య మాశ్రమిత్వ మభ్యుపగన్తవ్యం. ఆశ్రమధర్మా శ్చావశ్య మనుష్ఠేయా ఇతి భావః.

వివరణము:- అంతరాళ వర్తిత్వము ( విధురాది భావము) తో అనాశ్రమియై యుండుటకంటె ఏదియో ఒక ఆశ్రమము నాశ్రయించి తద్థర్మముల ననుష్ఠించుచు నుండుట శ్రేష్ఠము. ఏలయన? సాధన బాహుళ్యముకలదు గాన నట్టి స్థితి శీఘ్రముగ బ్రహ్మ విద్యాసాధనము కాగలదుగనుకను ''అనాశ్రమీ...'' అని అనాశ్రమిత్వము నిందింపబడియు నున్నది గనుకనున్నూ. ''తేనైతి బ్రహ్మ....'' ఈ శ్రుతి పుణ్యముల ననుష్ఠించి శుద్ధ చిత్తుడై బ్రహ్మ విద్యాసంపత్తి నందుకొని ఆ జ్ఞానమార్గమున బ్రహ్మను (బ్రహ్మ భావమును) పొందునని వర్ణించుచున్నది. సమగ్ర పుణ్యకర్తృత్వమనునది ఆశ్రమ వంతులకే సంభవించును గాని అన్యులకు సంభవించదు. కానను ఆశ్రమిత్వము శ్రేష్ఠము.శ్రేష్ఠము కాననే ఏదో ఒక ఆశ్రమము నాశ్రయింపవలయుననియు, నాశ్రమ ధర్మము లవశ్యానుష్ఠే యములనియు తెలియదగును.

తద్భూతాధి కరణమ్‌ 10.

40. సూ. తద్భూతస్యతు నాతద్భావో జైమినేరపి నియమా

తద్రూపాభావేభ్త్యః

వివృతిః :- యతేః పునర్గార్హస్థ్యం నోపగన్తవ్య మితి నిర్ణయాయ చిన్త్యతే- తద్భూతస్య తు=ప్రతిపన్నపారి వ్రాజస్యపుంసః - అతద్భావః=తస్మా త్పారివ్రాజ్యా త్ర్పచ్యుతిః సుష్ఠు పూర్మధర్మాణా మనుతిష్ఠాసయావా - రాగాదివశేన వా - న యుక్తా - కుతః? నియమా తద్రూ పాభావేభ్యః=ఏతేభ్య స్త్రిభ్యో హేతుభ్యః నియమః='' అరణ్యమియా దితి పదంతతోన పున రేయాది త్యుపనిషత్‌'' ఇతి శ్రుత్యుక్తో నియమః-అతద్రూపః=ప్రత్యవరోహ(ప్రచ్యుతి) బోధక శ్రుచ్యుతి ర్న యుక్తా - జైమినేః - అపి=ఇయంప్రచ్యుతిః ఊర్ధ్వరేతసా మాశ్రమా న సన్తీతి మన్వానస్య జైమినే రాచార్యస్యాపి స్మమతేతి. అతః ప్రాప్తపారివ్రాజ్యేన గార్హస్ధ్యం పునర్న గ్రాహ్య మితి.

వివరణము :- యత్యాశ్రమమును స్వీకరించి యున్నవారు పూర్వాశ్రమ ధర్మములను బాగుగా ననుష్ఠించ వలయునను తలంపుతోగాని, రాగాదులకు వశులైగాని తిరిగి గార్హస్థ్యమును స్వీకరించుట అనగా యత్యాశ్రమమునుండి ప్రచ్యుతిపొందుట యుక్తముకాదు. ఏలయన? నియమ - అతద్రూప - అభావములను హేతువులను బట్టి యని తెలియదగును. నియమము=''అరణ్య మియా....'' పారివ్రాజ్యమును పొదవలయును. ఇది శాస్త్ర సమ్మతమగు మార్గము. ఆ పారివ్రాజ్యమునుండి ప్రచ్యుతి నొందరాదు. ఇది శాస్త్రరహస్యము అని చెప్పు ఈ శ్రుతి శరీరమోక్షపర్యన్తము ప్రచ్యుత్యభావ నియమమును బోధించు చున్నది. అతద్రూపము=పై ఆశ్రమము నుండి క్రింది ఆశ్రమమునకు దిగుటకు ఆవరోమణ మని పేరు. అట్టి అవరోహణమును బోధించు ప్రమాణ మెచ్చటను లేదు. అభావము=ఆట్టి శిష్టాచారమునులేదు. ఈ హేతువులను బట్టి యత్యాశ్రమము నంగీకరింప నొల్లని జైమిని మహర్షికిని పారివ్రాజ్యమునుండి ప్రచ్యుతి యనునది సమ్మతము కాదు. కాన యతిచే గార్హస్థ్య మెన్నటికిని స్వీకరింపదగదు.

ఆధికారి కాధికరణమ్‌ 11

41. సూ. న చాధికారిక మపి పతనానుమానా త్తదయోగాత్‌

వివృతిః :- ఆధికారికం - అపి = నైష్ఠిక బ్రహ్మచర్యాద్యాశ్రమం ప్రాప్తస్య ప్రమాదా ద్వ్యభిచరతః పుంసః అధికారలక్షణ మీమాంసాషష్ఠాధ్యాయే ''బ్రహ్మచా ర్యవకీర్ణీ నైరృతం గర్దభ మాలభేత'' ఇతి శ్రుత్యా నిర్ణీతం ప్రాయశ్చిత్త మపి - న = న సంభవతి - కస్మాత్‌ ? పతనానుమానాత్‌ = ''ఆరూఢో నైష్ఠికం ధర్మం యస్తు ప్రచ్యవతే పునః| ప్రాయశ్చిత్తం న పశ్యామి యేన శుద్ధ్యే త్స ఆత్మహా'' ఇత్యాదినా తస్యాప్రతి సమాధేయ పతనస్మ రణాత్‌ - [అనుమానశబ్ద స్స్మృతివచనః - పతనానుమానాత్‌ = పతన ప్రతిపాదకస్మృతే రిత్యర్థః] తదయోగాత్‌= తస్య ప్రాయశ్చిత్త స్యాయో గాత్‌- అధికారాధ్యాయోక్తం ప్రాయశ్చితం తూపకుర్వాణ బ్రహ్మచారి విషయ విత్యవగన్తవ్యం- తస్మా దూర్ధ్వరేతసో భ్రష్టస్య ప్రాయశ్చిత్త మితి పూర్వః పక్షః.

వివరణము :- నైష్ఠికబ్రహ్మచర్యాశ్రమమును - యత్యాశ్రమమును పొంది ప్రమాదవశమున వ్యభిచార ప్రసక్తుడౌ పురుషునకు పూర్వమీ మాంసా శాస్త్రమునందలి షష్ఠాధ్యాయములో బ్రదర్శింపబడిన ''బ్రహ్మ చార్యవ....'' అను నీ వాక్యమునందు ప్రతిపాదింపబడిన అవకీర్ణి ప్రాయశ్చిత్తము వర్తించనేరదు. ఏలయన? ''ఆరూఢో....'' అను నీ స్మృతిలో అట్టివానికి ప్రాయశ్చిత్తానుష్ఠానముచే సమాహితముకాని తొలగింపజేయ శక్యముగాని పాపము కలుగునని వర్ణింపబడి యున్నది గనుక షష్ఠాధ్యాయోక్తమగు ఆప్రాయశ్చిత్తము ఉపకుర్వాణ బ్రహ్మచారికి సంబంధించినది మాత్రము కాగలదని తెలియదగును. కనుక బ్రహ్మచర్యనియమ భ్రష్టుడగు యతికి తత్పాపాపాప నోదకమగు ప్రాయశ్చిత్తము లేదని పూర్వపక్షము.

42. సూ. ఉపపూర్వ మపిత్వేకేభావ మశనవ త్తదుక్తం

వివృతిః :- అత్ర సిద్ధాన్త ఉచ్యతే అపి తు =యద్యపీడ మవకీర్ణిత్వం న మహాపాతకం అథాపి - ఏకే =ఏకే ఆచార్యాః గురుదారేభ్యోన్యత్ర వ్యభిచరణం - అశనవత్‌ =మధుమాంసాది భక్షణవత్‌- ఉపపూర్వం = ఉపపాతక మేవేతి మన్యన్తే - మహాపాతకే ష్వపరిగణితత్వాత్‌ - తస్మా దుపకుర్వాణవ న్నైష్ఠికస్యాపి. భావం = ప్రాయశ్చిత్త స్యాస్తిత్వ మిచ్ఛన్తి. విదదాతి చ శ్రుతి రవిశేషేణ బ్రహ్మచారిణ స్సాక్షా దేవ ప్రాయశ్చిత్తం ''బ్రహ్మచార్యవకీర్ణీ'' ఇత్యాదినా. అధాపి ''ఆరూఢో నైష్ఠికం'' ఇత్యాద్యా స్మృతిస్తు ప్రాయశ్చిత్తా భావం బోధయతి - ఏవం శ్రుతిస్మృత్యోర్విరోథే సమాపతితే శ్రుతే ర్బలీయస్త్వ మంగీకార్యం - తత్‌ - ఉక్తం = తదేత చ్ర్ఛతే ర్బలీయస్త్వం ప్రమాణాధ్యాయే పూర్వతంత్రే ''సమా విప్రతిపత్తి స్స్యాత్‌ '' ఇత్య త్రోపపాదితం - ఏతేన భిక్షువైఖానసయో రపి స్వధర్మ ప్రచ్యుతౌ ప్రాయశ్చిత్త మస్తీతి ద్రష్టవ్యం.

వివరణము :- ఇచట సిద్ధాంతము చెప్పబడుచున్నది. అవకీర్ణత్వము - వ్యభిచరణము మహాపాతకము కాకున్నను అది గురుదారాతిక్త విషయక మైనయప్పుడు మద్యపాన - మాంసభక్షణాదులువలె ఉపపాతకము కాగల దని కొందరాచార్యులు తలంచుచున్నారు. మరియు ఉపకుర్వాణ బ్రహ్మచారికి వలె నైష్ఠికునకును ప్రాయశ్చిత్తము కలదనియు నంగీకరించుచున్నారు. ''బ్రహ్మచార్యవకీర్ణీ'' అను శ్రుతియు బ్రహ్మచర్యనిష్ఠగలవారికి తన్నిష్ఠాభంగమేర్పడగా ప్రాయశ్చిత్తమును విధించుచున్నది. కాని ''ఆరూఢో నైష్ఠికం....'' అనుస్మృతి ప్రాయశ్చిత్తము లేదని బోధించు చున్నాది. ఇట్లు శ్రుతిస్మృతులకు విరోధము వచ్చినప్పుడు స్మృతికంటె శ్రుతి ప్రబలమని, కాన శ్రుత్యుక్తమేగ్రాహ్యమని పూర్వ తంత్రములో ప్రమాణాధ్యాయములోని ''సమా విప్రతిపత్తిః స్యాత్‌'' అను నిట్టి సూత్రములో ప్రతి పాదింపబడియున్నది. కాన శ్రుతి వాక్యానుసారము యతి వైఖాససాదులకును స్వధర్మచ్యుతి యేర్పడినప్పుడు ప్రాయశ్చిత్తముకలదనియే నిర్ణయింపదగును.

బహిరధి కరణమ్‌ 12

43. సూ. బహిస్తూ భయధాపి స్మృతేరాచారాచ్చ

వివృతిః :- ఉభయధా - అపి=ఊర్థ్వరేతసాం స్వాశ్రమే భ్యః ప్రచ్యవన ముపపాతకం వా మహాపాతకం వా భవతు ఉభయధాపి - తు=తే తు కృతప్రాయశ్చిత్తా అపి ప్రాయశ్చిత్తానంతర మపి బహిః =శిష్టై ర్బ హిష్కార్యా ఏవ - కస్మాత్‌ ? స్మతేః =''ఆరూఢో నైష్ఠికం ధర్మం యస్తు ప్రచ్యవతే పునః| ప్రాయశ్చిత్తం న పశ్యామి యేన శుద్ధ్యే త్స ఆత్మహా''ఇతి - ఆరూఢపతితం విప్రం మండలాచ్చ వినిస్సృతం | ఉద్బద్ధం కృమి దష్టం చ స్పృష్ట్వా చాంద్రాయణం చరేత్‌'' ఇత్యాదినా నిందా స్మరణాత్‌- ''నైష్ఠికానాం వనస్థానాం యతీనాం చావకీర్ణినాం| శుద్దానా మపి లోకేస్మిన్‌ ప్రత్యావృత్తి ర్నదృశ్యతే'' ఇత్యాదిస్మృతిదర్శనాచ్చ. ఆచారాత్‌ -చ=శిష్టానా మాచారస్య తథాదృష్టత్వాత్‌, ప్రాయశ్చిత్తకర్మణా తేషాం పరలోకా శుద్ధికర పాపాంశస్య నాశేపి, ఇహలోకాశుద్దికరపాపాంశస్య నాశాసంభవా త్కృతప్రాయశ్చత్తై రపి తైర్న శిష్టా భోజనశ్రవణాదీ న్యాచరన్తిచ

వివరణము :- యతులు మొదలుగువారు రాగాది దోషములకు వశులై స్వధర్మచ్యుతిని పొందినప్పుడు సంభవించిన పాపము ఉపపాతకమని యన్నను, మహాపాతకమని యన్నను, వారు దానికి ప్రాయశ్చిత్తము చేసి కొనినను శిష్టులచే వారు బహిష్కార్యులే అగుదురు. ''ఆరూఢో నైష్ఠికం .... .... .... ర్నదృశ్యతే'' ఇత్యాది : స్మృతులలో నట్లు ప్రతిపాదింపబడు చున్నది గనుకను, శిష్టులగు పెద్దలు ఆచారముగూడ నట్లే యున్నది గను కను నీవిధముగ నిర్ణయింప బడుచున్నది. పాపాచరణము వలన ఇహ లోకమునం దుశుద్ధిని కలగజేయు దోషమొకటియు, పరలోకమునంద శుద్ధిని కలుగజేయు దోషమొకటియును ఇట్లు రెండు దోషము లేర్పడును. యతులాచరించిన ఈ ప్రాయశ్చిత్తానుష్ఠానము వలన పరలోకాశుద్ధి కరదోషము నశించినను, ఇహలోకాశుద్ధి కరదోషము నశించదు. కాన వారు ప్రాయశ్చిత్తము ననుష్ఠించినను వారితో కలసి శిష్టులగు వారు భోజనాది వ్యవహారములను గాని, శ్రవణాది సత్కార్యములను గాని ఆచరింపరు.

స్వామ్యధికరణం 13

44 సూ: స్వామినః ఫలశ్రుతే రిత్యాత్రేయః

వివృతి:- కర్మాంగావ బద్ధోపాసనేషు కర్తా కః? ఇతి విచార్యతే- స్వామినః= ఉద్గీధాధి కర్మాంగావబద్ధో పాసనేషు కర్తృత్వం యజమానసై#్తవన ఋత్విజః - ఇతి ఆత్రేయః = ఆత్రేయ ఆచార్యో మన్యతే. కుతః? ఫల శ్రుతేః =''వర్షత్యసై#్మ య ఉపాస్తే'' ఇత్యాదినా ఫలస్య కర్తృగామిత్వ శ్రవణాత్‌. యజమాన ఏవ హి సాంగే కర్మణి కర్తా, అతో యజమాన సై#్యవ తత్ర కర్తృత్వ ముచిత మితి.

వివరణము :- ఉద్గీథాదికర్మాంగోపాలసనలలో కర్త యజమానుడే యగునుగాని ఋత్విక్కుకాదు ఏలయన? ''వర్షత్యసై#్మ'' అను ఫలవాక్యములో ఎవ్వడు పాసన చేయునో వానికే = ఆ కర్తకే ఫలము వర్ణింపబడి యున్నది గనుక. సర్వాంగ విశిష్టమగు యాగాది కర్మయందు కర్తయగు వాడు యజమానుడే గనుక ఆ ఉపాసనల యందును యజమానుడే కర్త యనుట ఉచితమని ఆత్రేయులు తలంచు చున్నారు.

45. సూ : ఆర్త్విజ్య మిత్యౌడులోమి స్తసై#్మ హి పరిక్రీయతే

వివృతిః :- ఔడులోమిః=ఔడులోమి రాచార్యస్తు కర్మాంగోపాసనం ఆర్త్విజ్యం =ఋత్త్విక్కర్తృక మేవేతి మన్యతే - కస్మాత్‌ ? హి =యస్మాత్‌ ఋత్విక్‌ - తసై#్మ= సాంగాయ కర్మణ. యజమానాయ సాంగం కర్మాను ష్ఠాతు మేవ - పరిక్రీయతే =ధనదానేన క్రీతో భవతి. తస్మా దృత్విక్కర్తృక మేవ తదుపాసన మితి, తచ్చ యజమానాయ ఫలం ప్రయచ్ఛతీతి చ విజ్ఞేయం.

వివరణము :- యజమానునకు ఫలమును సంపాదించి పెట్టుట కొరకు సర్వాంగములతో సంపన్నమగు కర్మ ననుష్ఠించుకే ధన దానము చేత ఋత్విక్కులు స్వీకరింప బడుచున్నారు. గనుక ఆ ఉపాసనములలో ఋత్విక్కులకే కర్తృత్వమును చెప్పవలయును. వారు యజమానునకా ఫలము నందింపజేయుదురని ఔడులోమి యనువారు నిర్ణయించుచున్నారు.

46. సూ : శ్రుతేశ్చ

వివృతిః :- చ=కించ శ్రుతేః - చ=''యాంవై కాంచన ఋత్విజ ఆశిష మాశాసతే యజమానాయ తా మాశాసతే'' ఇతి శ్రుత్యనుసారాచ్చ, ఋత్విజా మేవ కర్మాంగోపాసనేషు కర్తృత్వ మిత్యవసేయం.

వివరణము :- ఋత్విక్కులు యజమానునికొరకే ఆయా ఫలముల నాశంసించు చుందురు. అని ''యాం వై కాంచన'' అను శ్రుతి వర్ణించుచున్నది. దానిని బట్టియు కర్మాంగోపాసనములలో కర్తృత్వము ఋత్విక్కులకే అని నిర్ణయము.

సహకార్యంతర విధ్యధికరణమ్‌ 14

47. సూ: సహకార్యన్తరవిధిః పక్షేణ తృతీయం తద్వతో

విధ్యాదివత్‌

వివృతిః :- ''తస్మా ద్ర్బాహ్మణః పాండిత్యం నిర్విద్య బాల్యేన తిష్ఠాసేత్‌. బాల్యం పాండిత్యం చ నిర్విద్య అథ ముని:'' ఇతి శ్రుతౌ సహకార్యం తరవిధిః =అపరోక్షజ్ఞాన సాధనవిశేషస్య మౌనస్య ధ్యానాపరనానుధేయస్య విధిః=బాల్యపాండిత్యయో రివ విధి రేవాశ్రయితవ్యః - అపూర్వత్వత్‌ - న చేచం మౌనం పాండిత్య మితి శ##బ్దేన ప్రతిపాదితం. పాండిత్యశబ్దస్య శ్రవణజన్య పరోక్షజ్ఞాన వాచిత్వాత్‌. తస్మాత్‌- తృతీయం = బాల్య పాండిత్యా పేక్షయా తృతీయ మిదం మౌనం తద్వతః=ప్రకృతస్య పరోక్షజ్ఞానవత స్సన్యాసినో విధీయతే-యద్యపి సుసూక్ష్మస్య రత్నతత్త్వస్య సాక్షాత్కారే ప్రత్యయావృత్తి రూపస్య ధ్యానస్య= మౌనస్యక సాధనత్వం దృష్టం లోకే ఇతి బ్రహ్మతత్వస్యాపి సూక్ష్మస్య సాక్షాత్కారే తస్యధ్యానస్య సాధనత్వం వినాపి విధిం ప్రాప్నోతి- తథాపి ధ్యానోద్దేశే నాసనా దీనాం నియమానాం విధానా త్తత్కాల మేవ తదనుష్ఠేయ మితి న మన్తవ్యం - కింతు భిక్షాటనా దికాలే ష్వపి పరమాత్మని యథాసంభవం చిత్తం స్థాపనీయం - పరమాత్మ విషయిణీ ప్రత్యయపరంపరా సంపాదనీయేతి బోధయితుం పక్షేణ =పక్షే అప్రాప్తమర్థం నియంతుంప్రవర్తమానో భవతి యోవిధి ర్నియమాఖ్య స్తాదృశనియవిధిత్వేన సన్యాసిన మధికృ త్యాయం ధ్యానవిధిః ప్రవర్తతే. కథం? విధ్యాధివత్‌=విధేరాదిః =విధ్యాదిః - ప్రధానవిధిః - తద్వత్‌ - యథా ''దర్శపూర్ణమా సాభ్యాం స్వర్గకామో యజేత'' ఇత్యేవం జాతీయకే విధ్యాదౌ సహకారిత్వేన అన్వాధానాదిక మంగజాతం విధీయతే తథాత్ర విధిప్రధానే7స్మిన్‌ బ్రహ్మ విద్యావాక్యే మౌనం విధీయత ఇత్యర్ఠః.

వివరణము :- ''తస్మాద్ర్బాహ్మణః'' ఈశ్రుతి యందలి పాండిత్య శబ్దము శ్రవణమును =శ్రవణ జన్య పరోక్షజ్ఞానమును, బాల్యశబ్దము మననమును బోధించును. మౌన శబ్ద మపరోక్షసాక్షాత్కార సాధన విషశేమగు ధ్యానము (నిదిధ్యాసనము) ను బోధించును. ద్యానమనగా సంతతముగ నావర్తింప జేయబడు సజాతీయ మనోవృత్తి పరంపరయని యర్థము. ఆత్మతత్త్వ సాక్షాత్కారార్థ మీ వాక్యములో బాల్య పాండిత్యములు విధింప బడినట్లు మౌనము విధింప బడుచున్నాధా? లేదా?అని సందేహమురాగా చెప్పుచున్నారు. బాల్యము - పాడిత్యము కాక మూడవదియగు మౌనము పరోక్ష జ్ఞానమును మాత్రము పొందియున్నయతిని గూర్చి విధింపబడుచున్నది యని. అత్యంత సూక్ష్మమగు రత్నతత్త్వమును యొక్క సాక్షాత్కారమును పొందుటకు ఆ రత్నతత్త్వమును ధ్యానించుటయే ముఖ్యసాధనము మనునది సర్వలోక ప్రసిద్ధము. దీనిని బట్టి అత్యన్త సూక్ష్మతమమగు బ్రహ్మతత్త్వ సాక్షాత్కారమును పొందుటకును అదే విధముగ తత్తత్త్వ (బ్రహ్మ) ధ్యానమే సాధనమగునని తెలియవచ్చుచున్నది.కాన తత్తత్త్వ సాక్షాత్కారార్థము సాధనముగ ధ్యానమును విధించుటకు ఈ వాక్యము ప్రవర్తించ వలసిన అవసరము లేదు. అయినను ఒక అప్రాప్తార్థమును నియమించుటకై యీ వాక్యము ప్రవర్తించు చున్నది. ధ్యాన కాలమున ధ్యానమున కంగములుగ ఆసనము మొదలగు కొన్ని నియమములు శాస్త్రమునందు విధింపబడి యున్నవి. ఆకారణమున నవి యన్నియు సమకూరినప్పుడే ధ్యానము ననుష్ఠింప వలయునని తలంపవలదు; భిక్షాటనాది సమయముల యందునుయథా సంభవముగ పరమాత్మ యందు చిత్త స్థాపన రూపమగు ధ్యానము చేయుచుండ వలయునను నియమ విశేషమును బోధించుటకై సన్యాసుల నధికరించి యీ (నియమ) విధి ప్రవర్తించు చున్నది యని తెలియదగును. ఎట్లన? ''ధర్శపూర్ణ....'' ఇత్యాదికములగు ప్రధాన విధులయందు సహకారులగు అగ్న్యన్వాధానాదికములైన అంగము లెట్లు విధింపబడుచున్నవో అట్లే విధి ప్రధానమైన ఈ బ్రహ్మ విద్యావిద్యావాక్యము నందును మౌనము-థ్యానము విధింపబడుచున్నది యని యర్థము.

48. సూ: కృత్స్న భావాత్తు గృహిణోపసంహారః

వివృతిః :- శ్రవణాదివిశిష్టే కైవల్యాశ్రమే సిద్ధే కస్మా చ్ఛాన్దోగ్యే ''అభిసమావృత్య కుటుంబే శుచౌ దేశే స్వాధ్యాయ మధీయానః'' ఇత్యా దినా గృహస్థాశ్రమ ముపక్రమ్య ''స ఖల్వైవం పర్తయన్‌ యవదాయుషం బ్రహ్మలోక మభి సంపద్యతే స చ పునరావర్తతే'' ఇత్యత్ర గృహస్థస్య మోక్ష ముక్త్వా గృహిణా - ఉపసంహారః = గృహస్థే నోపసంహారః కృతఃతు = తథాకరణం తు - కృత్స్నభావాత్‌ = తస్య - గృహిణః సర్వేషాం విద్యాసాధనానాం యజ్ఞాదీనాం - అహిం సేంద్రియ సంయమాదీనాం చ యథా సంభవం విద్యమానత్వా దిత్యవగన్తవ్యం. నతు సన్యాసో నాస్తీ త్యభిప్రాయేణ- తస్మా ద్గృహిణోపసంహారో న విరుద్ధః.

వివరణము :- శ్రవణ మనన నిదిధ్యాసనాద్యుత్తమ బ్రహ్మవిద్యా సాధనములతో గూడిన కైవల్యాశ్రమము (పారివ్రాజ్యము) ప్రమాణ సిద్ధ మగుచో ఛాందోగ్యమున ''అభిసమావృత్య....'' ఇత్యాది వాక్యములో గృహ స్థాశ్రమమును వర్ణించుట కుపక్రమించి ''సఖ ల్వైవం...'' అను వాక్యములో యథాశాస్త్ర వర్తనము గల గృహస్థునకు మోక్షము లభించునని చెప్పుచు గృహస్థాశ్రమముతో ఉపసంహారము చేయబడినది. దాని భావమేమియనః యజ్ఞ-దానాదులు - అహింస - ఇంద్రియ నిగ్రహాదులు మొదలగు బ్రహ్మ విద్యా సాధనము లన్నియు ఆ ఆశ్రమమున సంభవించుట కవకాశము కలదు గాన న ట్లుపసంహారము చేయబడినది యని తెలియదగును. అంతి యెగాని ఆ వాక్యమునకు గృహస్థాశ్రమాతిరిక్తమగు సన్న్యాసాశ్రమము లేదనుటలో తాత్పర్యము లేదు. కాన నాగ్రంథములో గృహ స్థాశ్రమముతో నుపసంహారము చేయబడుటలో విరోధమేమియు లేదు.

49. సూ: మౌనవ దితరేషా మప్యుపదేశాత్‌

వివృతిః :- మౌనవత్‌ = సన్యాసవత్‌ - గార్హస్థ్యవచ్చ ఇతరేషాం - అపి = వానప్రస్థ బ్రహ్మచర్యాశ్రమయోః - కాణ్వాయన స్మృత్యుక్త వైఖానస గ్రాయత్రాదిభేదానా మపి - ఉవదేశాత్‌ = 'తప ఏవ ద్వితీయో బ్రహ్మచార్యాచార్యకుల వాసీ తృతీయః.'' ఇత్యాదిశ్రు త్యోపదిష్టత్వా దాశ్రమ చతుష్టయ మపి బ్రహ్మజిజ్ఞాసుభి ర్యథాయోగ్య మాదర్తవ్య మితి

వివరణము :- కాణ్వాయనస్మృత్యుక్తమగు వైఖానస గాయ త్రాద్యవాంతర భేదములతో గూడిన వాన ప్రస్థాశ్రమ బ్రహ్మచర్యాశ్రమములును సన్న్యాసాశ్రమ గృహస్థాశ్రమములు శ్రుతులలో నుపదిష్టములైనట్లే '' తప ఏవ....'' ఇత్యాది శ్రుతులలో నుపదిష్టములైనవి గాన బ్రహ్మ విద్యాభికాం క్షులగువారిచే నీ ఆశ్రమ చతుష్టయమునందును ఆదరముంచదగును. (ఇచటి మౌన శబ్దమునకు సన్న్యాసాశ్రమము అని అర్థము.)

అనావిష్కారాధి కరణం 15

50. సూ : అనావిష్కుర్వన్నన్వయాత్‌

వివృతిః :- ''బాల్యేన తిష్ఠాసే దిత్య స్యార్థో విచార్యతే - అన్వయాత్‌ = ధీశుద్ధే ర్విద్యోపకారకత్వేన సంబన్ధాత్‌ = పూర్వోత్తరవాక్యస్య తత్రైవార్థె సమనుగతత్వా త్పాండిత్యశబ్దోదితశ్రవణస్య మౌనశ బ్ధోదిత నిది ధ్యాసనస్య చ మధ్యేమనన సై#్యవానుష్ఠేయత్వాత్తత్ర రాగ ద్వేషాది రాహిత్య స్యాపెక్షిత త్వా చ్చ ధీశుద్ధేరేవా త్రాన్వయో యుక్తః - అతో బాల్యశ##బ్దేన ధీశుద్ధి ర్వివక్ష్యత ఇతి వక్తవ్యం. అనావిష్కుర్వన్‌ = ముమక్షుః జ్ఞానాధ్యయన ధార్మికత్వాదిభి రాత్మాన మప్రఖ్యాపయన్‌ దంభదర్పాదిరహితో భ##వేదితి ''బాల్యేన తిష్ఠాసే'' దిత్యస్యార్థః - నతు కామచార కామవాద కామభక్షో భ##వే దితి. ''యం న సన్తం నాచాసస్తం నాశ్రుతుం న బహుశ్రుతం. న సువృత్తం న దుర్వృత్తం వేద కశ్చి త్స బ్రాహ్మణః ఇత్యాది శాస్త్రా దితి.

వివృతిః :- ''బాల్యేన తిష్ఠాసేత్‌'' అను నీ వాక్యము యొక్క అర్థ మిచట వర్ణింప బడుచున్నది. ముముక్షువైనవాడు జ్ఞానాధ్యయన ధార్మిక త్వాది సంపద్విశేషములచేత తనను ప్రఖ్యాతునిగ - ప్రకృష్టునిగ ప్రకటించుకొను స్వభావము లేనివాడగుచు - విశుద్ధ బుద్ధి గలవాడగుచు బాలునివలె దంభ దర్పాదులు లేనివాడై వర్తించు చుండవలయునని ఆ వాక్యమునకు అర్థము. అంతియే గాని బాలుడు వలె కామచార కామవాదాదుల యందు ప్రనక్తుడు కావలయునని యర్థము కాదు. '' యం న సంతం....బ్రాహ్మణః'' తన ఉనికిని గాని - లేకపోవుటను గాని, అట్లే తన విద్వత్వమును గాని విద్యారాహిత్యమును గాని, మరియు తన సాధు వర్తనమునుగాని అసాధు వర్తనమును గాని ఎవ్వడును తెలిసికొనని యట్లు వర్తించు బ్రహ్మణుడు ఉత్తమ బ్రాహ్మణుడు అని వర్ణించు ఈ స్మృతివాక్యము పూర్వోక్తార్థమును ధ్రువపరచు చున్నది. బాల్య శబ్దమునకు ధీశుద్ధి (దంభదర్పాది రాహిత్యము) అర్థమని యేల చెప్పవలయుననగా? ఈ వాక్యమునకు పూర్వోత్తరవాక్యములలోని పాండిత్య - మౌన శబ్దములచేత చెప్పబడిన శ్రవణ నిది ధ్యానములకునడుమ అనుష్ఠేయ మైనది మననము - ఆ మననము రాగ ధ్యేషాది రహితమగు విశుద్ధ చిత్తసాధ్యము కానను, ధీశుద్ధియనునది విద్యోపకారకము గనుకను, ధీశుద్ధికే అచట అన్వయము - అనుబంధము యుక్త మగును. కాన పై వాక్యములోని బాల్య శబ్దము ధీశుద్ధినే బోధించునని చెప్పవలయును.

ఐహికాధికరణమ్‌ 16

51. సూ: ఐహిక మస్యప్రస్తుతప్రతిబంధే తద్దర్శనాత్‌

వివృతిః :-''సర్వాపేక్షాచ....'' ఇత్యారభ్య తత్త్వజ్ఞాన స్యాన్తరంగ సాధనాని బహిరంగ సాధనాని చ నిరూపితాని. ఇదానీం ఫలభూతం తత్తతజ్ఞాన మిహజన్మని వా భ##వే దుత జన్మాంతరే ఇతి చింత్యతే - అప్రస్తుతప్రతి బన్దే = ఉపక్రాంత విద్యాసాధనస్యపుంసః ఉపస్థితవి పాకేన కర్మాంతరేణ ప్రతిబంధే అసతి ఐహికం - అపి =ఇహైవ విద్యాజన్మ భవతి - ఇహజన్మ న్యెవ విద్యోత్పద్యత ఇత్యర్థః. సతితు ప్రతిబంధే జన్మాంతరే ఇతి - తద్దర్శనాత్‌ =''శ్రవణాయాపి బహుభి ర్యోన లభ్యః శృణ్వన్తోపి బహావోయం నవిద్యుః'' '' అనేక జన్మసంసిద్ధ స్తతో యాతి పరాం గతిం'' ఇత్యాది శ్రుతి స్మృత్యోః జ్ఞానోత్పత్తి ప్రతిబన్ధ సద్భావదర్శనా దేవం నిశ్చీయత ఇతి.

వివరణము :- ''సర్వపేక్షాచ'' అను సూత్రము మొదలుకొని యింత వరకు బ్రహ్మతత్త్వజ్ఞానమునకు బహిరంగ సాధనములును, అంతరంగ సాధనములను నిరూపింప బడినవి. ఇప్పుడు ఫలభూతమగు తత్త్వజ్ఞానము ఇహ జన్మముననే సంభవించునా, లేక జన్మాంతరమున సంభవించునా? అను విసయము విచారింప బడుచున్నది. తత్త్వ జిజ్ఞాన కలిగి తత్సాధనా నుష్ఠానముల యందు ప్రవర్తించుచున్న పురుషునకు ప్రారబ్ధఫలకమగు కర్మ (ప్రారబ్ధకర్మ) ప్రతి బంధకము లేకున్న తత్త్వజ్ఞాన మీ జన్మయందే కలుగును. అట్టి ప్రతి బంధమున్నచో జన్మాంతరమున కలుగునని చెప్పవలయును. ఏలయన? ''శ్రవణాయాపి....'' ''అనేక జన్మ....'' అను నిట్టిశ్రుతి స్మృతులలో తత్త్వజ్ఞానో త్పత్తిని గూర్చి ప్రతిబంధము సంభవించుటయు కలదని సూచింపబడుచున్నది.గాన నిట్లు నిశ్చయింపబడు చున్నది.

ముక్తిఫలానియమాధికరణమ్‌ 17

52. సూ: ఏవం ముక్తిఫలానియమస్తదవస్థావ ధృతేస్తదవస్థా

వధృతేః

వివృతిః :- విద్యాయా యత్ఫలం ముక్తి రూపం తత్ర విచార్యతే - ఏవం = విద్యాయా యథా ఐహిక త్వాముష్మికత్వరూప విశేషనియమ స్తద్వత్‌ ముక్తి ఫలానియమః = ముక్తిరూపే ఫలే = మోక్షే = నిరతిశయానంద బ్రహ్మాత్మకే - అనియమః = ఉత్కర్షాపకర్షరూపో వా అన్యాదృశో వా విశేషో నాస్తి. కుతః ? తదవస్థావధృతేః = తదవస్థాయాః = ముక్త్యవస్థాయాః నిర్విశేష బ్రహ్మ స్వరూపాయాః - అవధృతేః = ''స ఏష నేతి నేత్యాత్మా'' ''బ్రహ్మ వేద బ్రహ్మైవ భవతి'' ''యత్ర నాన్య త్పశ్యతి....'' ఇత్యాది శ్రుతిభి రేకరూపతయా7వధారణాత్‌ - పదాభ్యాస్కో7ధ్యాయ పరిసమాప్తిం ద్యోతయతి.

ఇతి శ్రీ గాయత్రీ పీఠాధీశ్వర శ్రీ విద్యాశంకర భారతీయతివర విరచితాయాం బ్రహ్మసూత్ర వివృతౌ - తృతీయాధ్యాయస్య చతుర్థః పాదః

(సాధనాధ్యాయశ్చ సమాప్తః)

వివరణము :- బ్రహ్మవిద్య (బ్రహ్మాత్మైక్య సాక్షాత్కారము) ప్రతి బంధము లేకున్న ఐహికమే యగునని నిరూపించి తత్ఫలమగు మోక్షము యొక్క రూపమును గూర్చి విచారణ మిచట చేయబడు చున్నది. విద్య యందు ఐహికత్వ ఆముష్మికత్వ రూప విశేష నియమము నిమిత్తభేదముచే నేర్పడినట్లు విద్యాఫలము, నిరతిశయానంద బ్రహ్మ స్వరూపమునునగు మోక్షమునందు ఉత్కృష్టము - అపకృష్టము అనునట్టి గాని, మరి యింకొ విధమైనట్టి గాని నియమములు (విశేషములు) ఏవియు నుండవు. అది సదా ఏకరూపమే అని చెప్పవలయును. ఏలయన? ''స ఏష....'' ''బ్రహ్మవేద....'' ''యత్ర నాన్యత్‌....'' ఇత్యాద్యఖిల శ్రుతులలోను నిర్విశేష బ్రహ్మ స్వరూపావస్థాన లక్షణమగు (స్వారూపమగు) ముక్త్య వస్థ ఏక రూపము గలదిగ ( ఏ విధమైన భేదములు లేని దిగ) నిశ్చియింపబడియున్నది గనుక నిట్లు నిర్ణయింప బడుచున్నది. ''తదవస్థావధృతేః'' అను నీ పదమును తిరిగి పఠించుట ఈ అధ్యాయము యొక్క పరిసమాప్తిని సూచించుచున్నది.

ఇట్లు శ్రీ గాయత్రీ పీఠాధీశ్వర శ్రీవిద్యాశంకర భారతీ యతివర

విరచితమగు బ్రహ్మసూత్రార్థ వివరణమున

తృతీయాధ్యాయ చతుర్థ పాదము ముగిసెను.

(సాదనాధ్యాయమును ముగిసెను)

Brahma Suthra Vivruthi    Chapters    Last Page