SARA SUDHA CHINDRIK    Chapters   

సుమాంజలి

వేదశిరోభూష ఉపనిషత్తులను

వ్యాఖ్యానపూర్వక బ్రహ్మసూత్రములు

ఉపనిషత్‌ బ్రహ్మసూత్ర యోగశాస్త్రాల

సారాంశభూతమగు భగవద్గీతయు

ప్రస్థానత్రయమను బ్రహ్మవిద్యావిజ్ఞానంబు

స్వాద్యాయంబున చదివి తెలిసికొనిన

సారసుధా సంగ్రహంబు సులభమగురీతిని

తెనుగున వ్రాసితి శంకరులకృపను.

ప్రస్థానత్రయ. సారసుధాచంద్రికను

కంచిపరమాచార్య చంద్రశేఖరసరస్వతి

భవ్యస్మృతికిగాను సమర్పితసుమాంజలి

దయతోడ స్వీకరింప కృతార్ధుడనగుదు.

జిజ్ఞాసువులగు మోక్షగాములకు

ఉపయోగించునని ఆశించుచుంటి

పుస్తక రూపమున వెలయించిదీని

జిజ్ఞాస భక్తుల ననుగ్రహింపవెడెదను.

భారద్యాసగోత్ర అనిపిండివంశాన

మాణిక్యాంబ సోమేశ్వరుల జ్యేష్ఠపుత్రుండీ.

జగన్నాధరావను నామధేయంబు

శంకరకామేశ్వరి సహధర్మచారిణి

కంచికామకోటి పీఠాధీశ్వరులు

జగద్గురువర్యులు జయేంద్రసరస్వతి

విజయేంద్రసరస్వతుల దివ్యానుగ్రహంబు

మాపైన గురసి మమ్ము తరించుగాక.

---------

SARA SUDHA CHINDRIK    Chapters