SARA SUDHA CHINDRIK    Chapters   

ఓం తత్‌ సత్‌

శ్రీ గణశాయనమః శ్రీరామచంద్రపరబ్రహ్మణనమః

6. మాండూక్యోపనిషత్తు.

పరబ్రహ్మపరమాత్మ అ, ఉ, మ, అనుస్వార చతుష్పద ఓంకార వాచ్యుడు - స్థూల సూక్ష్మ జగత్తు భూత, భవిష్యత్‌ , వర్తమానరూపముల ఓంకార పరబ్రహ్మరూపమే. పరబ్రహ్మ పరమాత్మయొక్క సర్వజ్ఞత, సర్వధారణత, సర్వకారణత, సర్వేశ్వరత, ఆందకళ్యాణ గుణమయ పరబ్రహ్మ యొక్క ఏకైక అంశ##యే. పరమాత్మ సాకార - నిరాకార స్వరూపుడు, రూపరహితుడు, సర్వగుణరహితుడు, సర్వగుణ సంపన్నుడు. అంతయు ఆయన స్వరూపమే. కాని వాని కంటె వేరు.

2) ఈ సంపూర్ణ జగత్తు బ్రహ్మమే. బ్రహ్మకంటే వేరేదియు లేదు. ఓంకారము ఆయన యొక్క నామ విశేషము. నామీనామములు అభిన్నము, సర్వజగత్తు పరమాత్మయొక్క శరీరమైన ఓంకారము ఆయన యొక్క ఆత్మ. పరమాత్మనిరవయుడైనను ఆయనసమగ్ర రూప వ్యాఖ్య చేయుటకు ఆయన యొక్క అభివ్యక్తి కొరకు ప్రకార భేదమున నాలుగు పాదములను శృతులు కల్పన చేసెను.

3) జీవాత్మ యొక్క స్థూల, సూక్ష్మ, కారణ శరీరము పరమాత్మయొక్క మూడు పాదములు. జాగ్రదావస్థలోస్ధూల శరీరాభిమానియగు జీవాత్మ శిరస్సు నుండి పాదములువరకు గల సప్తాంగముల ద్వారా స్థూల విషయోప భోగము, పది ఇంద్రియములు, పంచప్రాణములు, అంతఃకరణచతుష్టయము వెరసి 19 ముఖములతో చేయుచుండును. ఈ స్థూల జగద్రూప శరీరముయొక్క ఆత్మ, దేవ, పితర, మనుష్య సమస్త ప్రాణుల ప్రేరకుడు, స్వామి, స్థూల జగత్తుయొక్క జ్ఞాత, భోక్త, సర్వరూప వైశ్వానరుడు. ఈ పర బ్రహ్మయొక్క మొదటి పాదము, బ్రహ్మ సూత్రములయందు 1/2/24 సూత్రమందు ఆత్మ, పరబ్రహ్మపదముల వాచక వైశ్వానర పదము పరమాత్మయే. వైశ్వాసర విద్యయందు (ఛం. 5/11/1-6) పరమాత్మయే వైశ్వానరుడు. సర్వాత్మ వైశ్వానరుడు పరబ్రహ్మ పరమాత్మయొక్క ఒకపాదము.

4) స్వప్నావస్థయందు సూక్ష్మ శరీరాభిమాని యగు జీవాత్మ సప్తాగములతో, ఇంద్రియ , ప్రాణ, అంతః కరణాదులతో జగద్రూప శరీరమందుగల ఆత్మ తేజ సరూప హిరణ్యగర్భుడు. ఆయన సమస్త జడ చేత నాత్మక సూక్ష్మ జగత్తుయొక్క సమస్త తత్వముల నియంత, జ్ఞాత, భోక్త, బ్రహ్మసూత్రములయందలి "జ్యోతి శ్చరణాభిధానాత్‌" (1-1-24) యందు వచ్చు జ్యోతి, తేజః శబ్దములు బ్రహ్మవాచకములే. చం. ఉ. 3-13-7 నందువ్చచు జ్యోతిః పదము , తైత్తరీయ బ్రహ్మణము 3/12/9/7 యందలి తేజన్‌ శబ్దములు పరమాత్మ యొక్క ఉకార వాచ్యములు.

5) సుషుప్తి అవస్థయందు మానవుడు భోగాను భవరహితుడై యుండునో అటులనే ప్రళయ కాలమున జగత్తు యొక్క కారణ అవస్థయైన అవ్యాకృత ప్రకృతియే శరీరము. సత్‌, ఆత్మ యను పేర్ల చేతనమే ముఖముగా గల, ఆనందమే భోజనముగాగల,విజ్ఞాన ఘన ఆనందమయ ప్రాజ్ఞ యే పూర్ణ బ్రహ్మయొక్క మూడవ పాదము. బ్రహ్మసూత్రములు 1/4/5 సూత్రమునను, శంకర భగవత్పాదుల భాష్యమందును, బృహదారణ్యకాని (4/3/21035) ఉపనిషత్తులయందును వర్ణింప బడిన ప్రాజ్ఞుడు పరబ్రహ్మ పరమేశ్వరుడే. ఓంకారముయొక్క మూడవ మాత్రయగు ''కారము సమస్త ప్రాణుల ఉత్పత్తి ప్రళయ స్థానమగు పరమాత్మ యొక్క మూడవ పాదము. ప్రాజ్ఞయన పరబ్రహ్మయొక్క 3వ పాదము.

6) సంపూర్ణ జగత్తుకుకారణము, సర్వప్రాణుల ఉత్పత్తి, స్థితి, లయ స్థానము, వైశ్వానర, తేజస, ప్రాజ్ఞినామములు ఓంకార వాచ్యుడగు పరమాత్మయొక్క 3 పాదములు, ప్రశ్నోపనిషత్తునందు త్రిమాత్రాయుత ఓంకార ధ్యానము ద్వారా పరమాత్మను పొంద గలరని తెలుపబడెను.

7) పరబ్రహ్మ జ్ఞానము బయయటను లేదు, లోపలను లేదు, రెండు ప్రక్కలలేదు, జ్ఞాన స్వరూపుడు, జ్ఞాత,రెడును కానివాడు, దృశ్య , శ్రవణ, చింతనకతీతుడు,అయిన శాంత కళ్యాణమయ అద్వితీయ పూర్ణ బ్రహ్మయొక్క నాల్గవపాదము, ఇచట చతుర్థ పాదము కేవలము పరమాత్మ తత్వమును తెలుసుకొనుటకు మాత్రమే కల్పింప బడినది, పరమాత్మ సగుణ, సాకార, నిర్గుణ-నిరాకార, స్థూల, సూక్ష్మ, కారణ జగత్తుల అంతర్యామి అధిష్టాత, నిర్విశేష పరమాత్మయే.

8) అ, ఉ, మకార త్రయముతోకూడి ఓంకారమే పరమాత్మ యొక్క మూడు పాదములు, ఓంకారము మాత్రలకంటె వేరుకానట్లే పరమాత్మ పాదములకంటె వేరుకాదు. పరమాతమ్‌ ఓంకారస్వరూపుడు.

9) పరబ్రహ్మ పరమాత్మయొక్క నామాత్మక ఓంకారమందలి ప్రథమ మాత్ర '' కారము, జగత్తు నందలి సర్వనామములయందు వ్యాప్తమైయున్నది. శృతి ( గ.%ారణ్యశము 2/3/6) యందు "అకారో సర్వవాక్‌" అనియు గీతయందు (10/13) అక్షరములందు'' కారమునే నేనని శ్రీకృష్ణుని చే చెప్పబడెను. అక్షరములన్నియు '' కారముతో ప్రారంభమగును. స్థూల జగద్రూపి శరీరమందు వ్యాపించిన వైశ్వానరుడు పరమాత్మయొక్క ప్రధమ పాదము. అకారము విరాట్‌ స్వరూప ప్రధమ పాదము ఒక్కటే.

10) పరబ్రహ్మ పరమాత్మయొక్క నామాత్మక ఓంకారమునందు రెండవ మాత్ర '' కారము, '' కారము కంటె ఉత్కృష్టము, '' కార '' కారముల మధ్య నుండుట చే ఉభయ స్వరూపము. అటులనే పరబ్రహ్మ యొక్క ద్వితీయ పాదమగు హిరణ్య గర్భ తైజసరూపము వైశ్వానర రూపముకంటె ఉత్కృష్టము. వైశ్వానర ప్రాజ్ఞ మధ్యనుండుటచే ఉభయ స్వరూపము. పరమేశ్వర ఆది సంకల్పము ద్వారా ఉత్పన్నమగు సూక్ష్మ సృష్టి సమస్త తత్వులు వాని తన్మాత్రల రూపమున నుండి పరమాత్మయొక్క చేతన ప్రకాశ స్వరూప హిరణ్య గర్భ పరమేశ్వర రూపమే స్థూల రూపమున పరిణతి చెందును. కారణ స్థూల జగత్తు ల మధ్య నుండుటచే ఉభయ స్వరూపము. '' కారము హిరణ్య గర్భ తైజసరూప ద్వితీయ పాదము. ఇట్లు పాసించువారు హిరణ్య గర్భ తైజ సరూప ఏకతా రహస్యము తెలిసికొందురు. జగత్తు యొక్క సూక్ష్మ తత్వజ్ఞానముచే విషమ త్వ నాశము పొంది సమభావమును పొందును.

11) పరమాత్మ స్వరూప ఓంకారము యొక్క మూడవ మాత్ర '' కారము, 'మా' ధాతువుయొక్క అర్థము కొలత, పరిమాణము, '' కారము '' కార '' కారముల తర్వాత ఉచ్చరింప బడుటచే రెండింటి కొలత, పరిమాణము ఇందు వచ్చును. మకారోచ్ఛరణ యందు నోరుమూత పడును, అకార ఉకారములు ఇందులీనమగును. సుషుప్తి స్థానీయ కారణ జగత్తు యొక్క అధిష్టాత ప్రాజ్ఞుడు. స్థూల, సూక్ష్మ, కారణ మను మూడు అవస్థల జగత్తును తెలిసిన వాడు, '' కారము ప్రాజ్ఞ రూపము. పరమేశ్వరుని ఏకత్వమును తెలుపును. ఇట్లు పరమేశ్వరుని చింతించువారు మూల సహిత సంపూర్ణ జగత్తును పూర్తిగా తెలిసి సర్వత్ర ఒకే పరబ్రహ్మ పరమేశ్వరుని చూచును.

12) ఓంకారము యొక్క మూడు మాత్రలకు మూడు పాదములతో సమానత ఉన్నట్లే ఓంకారముయొక్క నిరాకార స్వరూపము పరమాత్మయొక్క నిర్గుణ , నిరాకార, నిర్విశేష, నాల్గవ పాదము. ఇట్లు నామీ నామముల తెలిసి ఉపాసించు సాధకులు ఆత్మ చే ఆత్మయందు పరాత్పర పరబ్రహ్మయందు ప్రవిష్టులగుదురు. ఇందు స్థూల, సూక్ష్మ, కారణ సగుణ రూపములను నిర్గుణ, నిరాకార స్వరూపముతో ఏకత్వము చూపి నా మీనామముల ఏకత్వము సర్వభావ సామర్ధ్య రూపము. అచింత్య శక్తుల అభిన్నత్వము ప్రతిపాదింప బడెను.

-----

మాండుక్యోపనిషత్తు సమాప్తము.

ఓం శాంతిః శాంతిః శాంతిః

---------

SARA SUDHA CHINDRIK    Chapters